వాకిలి » కథ

నారికేళపాకము
సాయంకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, పగలంతా అలిసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా నిద్రదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్లనుంచి ఇళ్లవైపుకి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తల్చుకొని బాధని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరుల నిశ్వాసతో అంటిన పాపాన్ని కడుక్కుంటున్నాడు. పాకలలో అమ్మ పాలకోసం ఎదురుచూస్తూ న్న దూడలు పెద్దవిగా చేసిన గుండ్రటి కళ్లని చూసి, అంత అందంగా అవ్వటం ఈరోజు కూడా కుదరలేదనుకుంటూ ఆకాశంలో సూర్యుడు అవమానభారంతో ఎర్రబడి కిందికి దిగుతున్నాడు.

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి. గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో ఒక కొబ్బరిచెట్టు ఉంది.

కొబ్బరి చెట్టు పొట్టిది, కాయలు చిన్నగా ఉంటవి, ఊరిలోని చెట్లతో పోలిస్తే. కానీ అది తన బ్రతుకుని భారం అనుకోదు, తనని తాను తక్కువగా అనుకుని విశ్వాసాన్ని కోల్పోయి నీలగదు. తను చిన్నప్పుడు తాగిన నీళ్లలోని చప్పదనానికి వెగటు చెంది, వాటినే తనకి ప్రాణంపోసిన వాడు కూడా తాగుతాడు కాబోలు అని అనుకుని నొచ్చుకుని, తన తలమీద ఉన్న ప్రతీ కాయ లోకీ శాశ్వతంగా తీయదనాన్ని నింపాలనే సంకల్పంతో గాలి వీచినప్పుడల్లా తనకన్నా గొప్ప చెట్లతో కలిసి కనుబొమ్మల్లా ఉన్న తన మట్టల్ని పైకీ , కిందికీ, పక్కలకీ అభినయిస్తూ , వివిధ భంగిమలు రూపందుకోగా తన నైపుణ్యానికి తానే మురిసిపోతూ తీయగా నవ్వుతుంది. ఆ నవ్వు ఎవరికీ అర్ధమవదు. తీపి మాత్రం తెలుస్తుంది.

ఆరోజు గ్రామదేవత జాతర. జనులందరూ గుంపులుగా రావడం మొదలు పెట్టారు. గరగలు తలమీద ఉంచుకుని గజ్జెలు కట్టుకున్న వాళ్ల నాట్యం అందమూ, సన్నాయి మేళము వాళ్ల వాద్యాల ధ్వని అందమూ జనాలకి ఒకేసారి ప్రత్యక్షమయి, ప్రేమలో మైమరిచిపోయిన తాచుపాముల జంటలా తమ కళ్ల ఆనందం ఏదో, చెవుల ఆనందం ఏదో విడదీయడానికి లేనంతగా పెనవేసుకుపొయ్యాయి. ఈ అనుభూతి ఒకరి నుంచి ఒకరిని ఆక్రమించింది, తెలియకుండానే. క్రమంగా గ్రామస్తులంతా గుడిదగ్గర పోగయ్యారు.అమ్మవారికి హారతులు, పూజలు మొదలయ్యాయి.

భక్తితో అందరూ మొక్కుతున్నారు. చెట్టు హాయిగా వీస్తున్న గాలికి ఊగుతూ ఉంది.

గడుసు కుర్రాళ్లు ఉత్సాహంతో రాత్రిని తామే వెలిగిస్తున్నామని విర్రవీగే నక్షత్రాలు, చంద్రుడు సిగ్గుపడేలాగ అంబరపథాన్ని మిరుమిట్లుగొల్పుతూ తారాజువ్వలు వేయటం మొదలుపెట్టారు. ఒకవైపు కోలాహలాన్ని గమనిస్తూ, మరొకవైపు జువ్వలు వెయ్యాలనే కోరికని చంపుకోలేకపోతూ ఇబ్బందులు పడుతున్నారు. వంతులు వేసుకుంటున్నారు. ఒక కుర్రాడి వంతు వచ్చింది. ప్రదర్శనవైపు కళ్లప్పగించి, జువ్వ వెలిగిస్తున్న ఒక కుర్రాడి చేతికి జువ్వతో పాటు నిప్పు తాకింది. అది జువ్వనిప్పుతో జతకట్టింది. కుర్రాడు ఉలిక్కిపడి బాధనుండి తప్పించుకోవాలని ఏం చెయ్యలేక జువ్వని పైకి వదిలేశాడు. అది సర్రుమంటూ గుడి ఎదురుగా ఉన్న కొబ్బరిచెట్టు కేంద్రస్థానాన్ని తాకి, ఆకాశంలో స్వేచ్ఛగా వదలాల్సిన తళుకులని ఆ చెట్టు తలమధ్యలో విదిల్చింది.

కుర్రాడు బిగ్గరగా అరిచాడు. చెట్టునుండి నిప్పురవ్వలు ఒక్కసారిగా ఎగిశాయి.

కొంతమంది కుర్రాడిని దూరంగా తీసుకుపోయి, మందు వ్రాశారు. చెట్టు కేసి చూసి ‘అమ్మో’ అని, ‘అయ్యో’ అని అనుకున్నారు. కొంతమంది మంట ఆర్పుదామని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. పూజ ముగిసింది. గరగనాట్యమూ అయిపోయింది. భక్తులు ప్రసాదం పుచ్చుకుని ఇళ్లదారి పట్టారు. ఊరిచివర సారాకొట్టు నుంచి తీర్థం పుచ్చుకుని, ప్రచ్ఛన్నస్వేచ్ఛాలోకాలలో విహరిస్తూ కొంతమంది తాగుబోతులు సైకిళ్లమీద మేళం శబ్దం విన్న ఉత్సాహంతో గుడిదగ్గరకి గుంపులుగా రావడం మొదలు పెట్టారు. వారి రాకతో సమాంతరంగా పక్కఊరినుంచి కొంతమంది అమ్మాయిలతో ఉన్న ఒక ట్రాక్టరు, వెనకాలే మనిషి అంత ఎత్తు ఉన్న స్పీకర్లూ, ఒక పాటగాడూ, ఒక పాటగత్తె, సినిమా పాటల టేప్ రికార్డరు సెట్టూ వచ్చినవి. గుడి పక్కనే ఆగినవి. చూసిన వాళ్లంతా బిగ్గరగా కేకలు వేశారు. పాటలు పెట్టారు.

పాటల శబ్దం పెద్దదైంది. చెట్టుమీది మంట పెద్దదైంది.

అమ్మాయిలు సినిమా పాటలకి డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు. స్పీకర్ల తాకిడికి గుడి, గుడి కి ఆనుకుని ఉన్న వీధులన్నీ కంపిస్తున్నాయి, ‘గుడి ముందు ఇదేం గోల’ అన్న సణుగుడు పైకి వినపడకుండా. వాళ్లని చూస్తూ తాగుబోతులంతా ట్రాక్టరు దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ల విన్యాసాలని మెచ్చుకుంటూ, ఈలలు వేస్తున్నారు. అరుస్తున్నారు. వాళ్లని పట్టుకుందామని పైకి ఎగురుతున్నారు. కుదరక, కిందకి దిగుతున్నారు. ఒకడు ట్రాక్టరు పైకి ఎక్కుదామని చూశాడు. ఆ ట్రూపు తో వచ్చిన వస్తాదు వాడిని పక్కకి తోసిపారేశాడు.. వాడు కిందపడి ఊగిపోతూ కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. మిగిలినవాళ్లు వాడిని పట్టించుకోలేదు. పాటలు మారుతున్నాయి.

కేకలూ, ఈలలూ ఎక్కువౌతున్నాయి. చెట్టుమీది మట్టలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి.

డాన్సు అయిపోయింది. ట్రాక్టర్లు వెళ్లిపొయ్యాయి. ఇంకా కావాలి అంటూ తాగుబోతులు కొంతసేపు అరిచినా, చేసేది లేక సైకిళ్ల మీద ఇంటిమొఖం పట్టారు. కొంతసేపటికి పెద్ద స్పీకర్ల నుండి వచ్చిన పాటల ప్రతిధ్వని కూడా అంతరించింది.మెల్లిమెల్లిగా ఆ ప్రదేశమంతా నిర్జనమైంది. శబ్దమంతా ఆగిపోయింది. నర్తించిన అమ్మాయిల మీద చల్లిన రంగు కాగితాలతో గుడిప్రాగణమంతా కొత్తరూపుగట్టింది. కాసేపటికి కరెంటు పోవడంతో వీధిదీపాలు ఆరిపొయ్యాయి.

కోలాహలం అణిగింది. చెట్టుమీద మంటా అణిగింది.

కాసేపటికి పెద్దగాలి ప్రవాహం వచ్చింది. చెట్టుమీంచి నిప్పురవ్వలు ముద్దలు ముద్దలుగా క్రిందకి ధారాపాతంగా రాలుతున్నాయి. ఆ కాంతిలో గ్రామదేవత ముక్కుపోగుపై ఉన్న తెల్లటి రాయి ఎర్రగా ప్రకాశించింది.

ప్రాతఃకాలం. ప్రకృతిలో సంధ్య పుట్టీపుట్టగానే కళ్లు తెరిచి, రాత్రంతా సొలసిపోయిన జీవజాలాన్ని గమనించి, ప్రేమగా ఉత్తేజపుదుప్పటి కప్పుదామని మెల్లిగా నేయటం మొదలుపెట్టింది. ఆ నేతలోని నైపుణ్యానికి చెట్లు, మొక్కలు ఆచ్చెరువుతో ఊగటం మానేశాయి. పొలాల గట్ల వైపుకి ఇళ్లనుంచి గంగడోలు మీదుగా వేలాడుతున్న దుండుకర్రతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఆవులు తమ దూడల ఆకలిని తీర్చిన సంతృప్తితో బరువుని మర్చిపోతూ గబగబా నడుస్తున్నాయి. వాటి కాలిగిట్టల నుండి రేగిన దుమ్ము అంటించుకొని, గాలి దేవుడు స్వార్ధపరులకి ఉచ్ఛ్వాసగా మారడం తప్పక, ఉత్సాహాన్ని నింపుకుంటున్నాడు. పాకలలో అమ్మ పాలు తాగి కళ్లుమూసికొని కునుకుతీస్తూన్న దూడలమీద ఈరోజు గెలుపునాదే అనుకుంటూ ఆకాశంలో సూర్యుడు ప్రజ్వలిస్తూ పైకి ఎక్కుతున్నాడు.

పొలాల మధ్యలో ఊరు. ఊరి మధ్యలో కూడలి. కూడలికి ఆనుకుని గ్రామదేవత గుడి.గుడికి ఎదురుగా స్థలం. స్థలంలో కొబ్బరిచెట్టు లేదు.

అతడు
తరవాత అరగంటలో పోలీసులొచ్చేరు.

వాళ్ళు మెట్లు దిగి బేస్ మెంట్ గదిలోకి వచ్చేసరికి అతను కంప్యూటరు ముందు కనిపించాడు. కూచుని ప్రశాంతంగా నిశితంగా కళ్ళజోడు లోంచి తెరమీది గళ్ళనీ, అంకెల్నీ చూస్తున్నా డతను . ఒకసారి ఆగి అతన్ని చూసాడు ఇన్ స్పెక్టరు. మధ్యలో కీబోర్డుని టైప్ చేస్తుంటే అతన్నీ కంప్యూటర్నీ  కీబోర్డు పని చేయిస్తున్నపించింది. ఇన్ స్పెక్టరు బాగా దగ్గిరికి వచ్చిన తరవాత గానీ అతను గమనించలేదు. తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడతను.

రాత్రి ఏడున్నరయింది. గది వేడిగానూ లేదు, చల్లగానూ లేదు. అతనికి ఎలాగూ అనిపించడం లేదు. చిన్న గది. పక్కగోడకి కిటికీ. చెక్క టేబిలు ముందు మూడు కుర్చీలు. ఒక చెక్క కుర్చీలో కూచున్నాడతను. రెండు కుర్చీలు అప్పుడే ఖాళీ అయ్యేయి. ఆఫీసుకొచ్చిన ఇన్ స్పెక్టరు, మరోవ్యక్తి ఇంతసేపూ అతనితో మాట్లాడి వెళ్ళేరు . అతను ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. అతని ప్రాజెక్టు రిపోర్టుల్లాగ. అడిగినవే అడిగి, అడిగినవే అడిగి న్యూసెన్సు, పైగా టైము దండగ. గడచిన పదిగంటల్లో బోలెడు పని అయి ఉండేది. కంట్లో నలక పడ్డట్టు ఈ గొడవ తెచ్చిపెట్టుకున్నాడు. టేబిలు కీబోర్డు మీద అతని వేళ్ళు కదుల్తున్నాయి. అతని ముందు తెర.  తెర లోంచి ఎవరో వచ్చి ఎదురుగా కూచున్నారు. అతని కనుబొమలు చిరాకుతో ముడిపడ్డాయి. వచ్చినతను సిగరెట్టు వెలిగించుకుని పెట్టె అతని ముందుకు తోసాడు.

‘’స్మోక్ చేస్తారా?’’

‘’చెయ్యను ….ఎప్పుడేనా’’

సిగరెట్టు వెలిగించుకున్నాడతను .

‘’కాల్చనంటున్నారు , అలవాటు లేదా ?’’

“అనిగాదు . కాలుస్తాను . ఒక్కోసారి కాలుస్తా….. కాలిస్తే కాలుస్తా . లేకపోతె లేదు.’’

పోలీసు అతనివేపు చాలా కళ్ళతో చూసాడు. అతని కళ్ళు మామూలుగా ఉన్నాయి. ప్రత్యేకించి భయం కనిపించడం లేదు. పోలీసు ఆశ్చర్యంగా అతనివేపే చూస్తున్నాడు. అతనికి పోలీసు స్టేషన్లో ఉండడం ఇష్టం లేదని మాత్రం అర్థవైంది. మాట్లాడకుండా సిగరెట్టు కాల్చుకున్నాడు. చటుక్కున అడిగేడు పోలీసు.

‘’మీకు ఎన్నాళ్ళు శిక్ష పడుద్దో తెలుసా?’’

‘’తెలీదు’’

‘’ అంటే నువ్వెంచేసేవో మర్చిపోయేవా?’’

‘’సారీ , ఎన్నేళ్ళు పడుతుందో తెలీదంటున్నాను.’’

‘’రెండ్రోజులు జైల్లో ఉంటే అన్నీ తెలిసొస్తాయి’’

అతనికి పోలీసు ఆగ్రహం ఎందుకో అర్థం కాలేదు. పొరపాటు జరిగిందని తను చెప్తూనే ఉన్నాడు గదా. ఈ వ్యంగ్యం, ఎగతాళి ఎందుకు? చిరాకనిపిచిందతనికి. మళ్ళీ వెంటనే ఆఫీసుకెళ్ళి పని మొదలు పెట్టాలనిపించింది. బెంగ పడ్డాడతను . రేపు బయటపడగలడా? ఆఖరి దమ్ము లాగి అటూ ఇటూ చూసి అన్నాడు.

‘’ ఏష్ ట్రే లేదా?’’

‘’ కొందాం. అక్కడ పారెయ్యండి.’’

‘’సాయంత్రం నాలుగ్గంటల్నించీ ఇప్పటి వరకూ మర్యాదగా అడుగుతున్నాం. పోలీసోళ్ళు  ఇంతసేపు మాటాడ్రు. మా స్టైలు మీకు తెలవదనుకుంటున్నాను. బాడీలో ఎక్కడేం జరిగిందో డాక్టర్లకి గూడా అంతుబట్టదు.’’

‘’ అంటే కొడతారా?’’

‘’ఇరగదీస్తాం.’’

‘’ఎందుకు?……. నేనబద్ధం చెప్పడం లేదు . కొట్టడం దేనికి?  నేనేం నేరస్తుణ్ణి కాదు గదా? జైలు శిక్ష అంటున్నారు . వెయ్యండి . మీ ప్రాబ్లం ఏవిటి?’’

పోలీసు టీ గ్లాసు వేపు చూసాడు. దాన్ని అలాగే గుప్పిట్లో పగలగొట్టా లనిపించింది .

‘’ఒప్పుకోడం కాదు. అసలు కథంతా కావాలి. ఏ వూరు మీది?’’

‘’ తెనాలి’’

‘’అక్కడెవరున్నారు? మీ ఇంటి ఎడ్రసూ, ఫోన్ నెంబరూ …’’

‘’అవన్నీ ఎందుకు?’’

‘’మీ ఇంటికి తెలియజెయ్యడానికి’’

‘’వాళ్ళకీ దీనికీ సంబంధం లేదు.’’

‘’అసలు నువ్వు చదువుకున్నోడివేనా? నువ్వేం మాట్లాడుతున్నావు?’’

‘’వాళ్ళని ఇందులోకి లాగడం నాకిష్టం లేదు.’’

‘’మీ ఇష్టం ఎవడిక్కావాలి? అమెరికాలో చదివేవంట గదా? ఏం లాబం ?’’

‘’అంటే నాకర్థం కావడం లేదు. యూఎస్ లో చదివేను. ఓకే.’’

‘’ఎక్కడ చదూకున్నా ఒకటేనంటావు?’’

‘’లేదు. అక్కడ మనకంటే మంచి యూనివర్సిటీలున్నాయి.’’

పోలీసు అతనివేపు ఆశ్చర్యంగా చూసాడు. చటుక్కున లేచి వెళ్తూ అన్నాడు.

‘’నీకేవేనా మెంటలా?’’

ఈసారి అతను ఆశ్చర్యపోయాడు. తనకి అంతా స్పష్టంగానే ఉంది. వీళ్ళకి ఎందుకింత చిక్కుముడిగా కనిపిస్తోందో అర్థం కావడం లేదు. స్పష్టంగా అయిదారు వాక్యాల్లో తప్పు తనదేనని చెప్తుంటే అన్ని ప్రశ్నలు అడగడం దేనికి? అతనికి విసుగనిపించింది. నిస్సహాయంగా కీబోర్డు మీద అతని వేళ్ళు కదుల్తున్నాయి.

పది అంతస్తుల ఐటి కంపెనీ.  మిగతా కాంక్రీటు, గ్లాసు గొట్టాల్లాంటి కంపెనీల్లో అది ఒకటి. ఉదయం పది దాటగానే తేనెపట్టుల్లాంటి కంపెనీల్లో కందిరీగల రొద. మొదటి రెండేళ్ళూ అతను ఐదో అంతస్తులో పనిచేసాడు. ఇంటికీ తేనెపట్టుకీ మధ్య రొదగా వచ్చి వెళ్ళడం. చెట్లు కూడా పచ్చగా శుభ్రంగా ఉండే ప్రాంతంలో ఉంటాడతను. నల్లటి రోడ్లు,  తెల్లటి గీతలు, రోడ్డు మధ్యలో పూలమొక్కలు , చల్లటి కార్లోంచి వాటిని చూస్తూ, వెళ్లి వస్తూ అయిదు నుంచి ఆరో అంతస్తూ , అక్కణ్ణించి భూమికింద చల్లటి పొట్టలో, బాగా ఎదిగిన పిండంలా ఉంటున్నా డతను. నిజాని కతనికి పైకి రావడం ఇష్టం ఉండదు. కొన్నాళ్ళు మూడో అంతస్తులో కాంటీన్ లో తిండి తినేవాడు. ఒక మూల చూసుకుని సాధ్యమైనంత త్వరగా కోడి గింజల లంచి చేసేవాడు. మాటల శబ్దం, పలకరింపులూ నాలుగైదు వాక్యాల తరవాత తల మీద వడగళ్ళ వానలా పడేవి. పారిపోడానికి కుదిరేది కాదు. ఫోను మోగింది. ‘’సర్’’  ‘’ఒకసారి వెంటనే రాగలరా?’’  అరనిముషంలో మెత్తగా జుత్తులోంచి దువ్వెనలా లిఫ్టులో పైకి వెళ్ళేడు. నీలంగదిలో తెల్లగా కూచున్నా డాయన. ఎదుటి కుర్చీలో నిశ్శబ్దంగా కూచున్నా డతను. అతనికా గదిలో చాలా సేపు కూచుని ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం ఇష్టం .

‘’okay. సోమవారం అర్జంటుగా మీరు డెన్మార్కు వెళ్ళాలి. పదిహేనురోజులు.’’

‘’ యస్ సర్ .’’ (‘’I want to hug you.’’)

‘’good’’

దరిదాపు గంటసేపు ఆయన తెరమీద ప్రాజెక్టుని ముక్కలు చేసి అంకెలు వేసి టేబిల్సులో ఇరికించి కింద నీలపు అక్షరాలలో డాలర్లని రూపాయలు చేశాడు. ప్రాజెక్టు రుచికరంగా అనిపించిం దతనికి. దువ్వెనతో కిందికి దువ్వుకున్నట్టు మెత్తగా కిందికి వెళ్ళిపోయాడతను. అప్పటికే అతను డెన్మార్కు లో ఉన్నాడు. అతనికి సంతోషంగా ఉంది. కూచుని వెంటనే కంప్యూటరు తెరిచాడు. వేళ్ళు వాటంత అవే కదులుతున్నాయి. తెరమీది అంకెలు అతనికి నీలాకాశంలో పక్షుల్లా కనిపిస్తున్నాయి. రాధిక రావడం చూడలే దతను. ఫైల్సు టేబిలు మీద పెట్టిన తరవాతగా చూశా డతను.

‘’ఏ లోకంలో వున్నారు?’’

‘’డెన్మార్కు’’

పది నిముషాలు మాట్లాడి వెళ్లిపోయిం దామె. ఆమె డియో కొంచెం విడిచి వెళ్ళింది. కొంచెం ఆమెని పీల్చుకుని ఫైలు తెరిచా డతను. ముందు పేజీలు చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఎక్కువ పేజీలు చదవడం టైము దండగ. సరిగ్గా అయిదు పేజీలు, మరో నాలుగు పేజీల అంకెలు. ఇష్టంగా పేజీలు తిప్పేడతను.

డెన్మార్కు నుంచి వచ్చీ రాగానే అక్కణ్ణించి అతని గురించి ఆఫీసుకి మంచి మెయిల్ వెంబడించి వచ్చింది. సంతోషంగా ఉందతనికి.  కేంటీన్ లో టీ తాగుతూ కూచున్నా డతను. కింద పచ్చటి పచ్చిక,రెక్కలు ముడుచుకున్న ఇనుప పక్షుల్లా రంగురంగుల కార్లు. వెరీ నైస్. అట్లా కిందికి చూస్తూండడం ఇష్టం అతనికి. ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించి వెళ్ళేరు. అంతా అవాస్తవంగా కనిపించిం దతనికి.

‘’నన్ను గూడా డెన్మార్కు తీసుకెళ్లచ్చుగా’’ ఎదురుగా కూచుంటూ అంది వసంతా బార్వే . తెర తొలగించుకుని చూశాడతను. నవ్విందామె. చెయ్యిజాపి ‘’కంగ్రాట్స్’’ అందామె. ఆమె వెచ్చటి మెత్తటి చేతిని తన చల్లటి అరచేతిలో నొక్కి అలాగే ఉంచింది వసంత. అతనలాగే ఉంచుకుని నవ్వేడు. నవ్వినా తరవాత ఏం మాట్లాడాలో తెలీలే దతనికి. ఆమె చేతులు అతనికి కొత్తగాదు. ఒకసారి సినిమా చూస్తూ అతని చెయ్యి పట్టుకుని భుజం మీద తలపెట్టుకుని కునుకు తీసిందామె. చెయ్యి తీసుకుంటూ అడిగింది.

‘’ఏం చేస్తావు రోజూ నువ్వు?’’

‘’పని’’

‘’ఊ. సాయంకాలం?’’

‘’ఇంటికెళ్ళి ఒక బీరు తాగుతాను. ఎగ్ బుర్జీ అప్పుడప్పుడు. రెస్టు తీసుకుని పని. దట్సాల్.’’

ఆమె అతని వేపు అట్లాగే చూసి చటుక్కున లేచి వెళ్ళిపోయింది. ఊపిరి పీల్చుకున్నాడతను. ఏం చేస్తాడు, సాయంత్రం, రాత్రీ?  పదకొండవుతుంది పడుకునేసరికి . హాయిగా ఒక్కడే , కాసేపు టీవీ చూసి , బుద్ది పుడితే కాసేపు సినిమా చూసి, చాటింగ్ చేసుకుని, కంప్యూటరు ముందు కూచుంటాడు. ఈ ప్రపంచం చొక్కామీది చిమ్మెటలా కాసేపుండి ఎగిరిపోతుంది. ఏవిటి చెయ్యడం సాయంకాలం? వంట అవసరం అనుకుంటే చేసుకుంటాడు. భోజనం చేసి ఒక్కోసారి కిటికీ దగ్గిర నుంచుని సిగరెట్టు వెలిగిస్తాడు. అక్కణ్ణించి వెలుగుతున్న నగరం చూడ్డానికి బావుంటుంది. కిటికీ తెర మీద రాత్రి నగరం చూస్తాడు. వెరీనైస్ . ఇంకేంటి?    ఓ… అండర్ వేర్ తీసి లుంగీతో కంప్యూటరు ముందు కూచుంటాడు. ఇదంతా మెసేజ్ చెయ్యాలి వసంతకి. కొంచెం నవ్వుకుని వాచీ చూసుకుని లేచే డతను.

అతను డెన్మార్కు వెళ్ళొచ్చి ఏడాది అయింది.

రాత్రి బెంచీ మీద పడుకున్నాడతను. మధ్యాహ్నం బెయిలు దొరకవలసింది. మూడు రోజులు వాయిదా వేశారు. అతనికి కోపం, చిరాకూ పొరపాటున నమిలిన మిరపకాయ కారంలా. అతని ఆలోచనలు మళ్ళీ మిగిలిపోయిన పని మీదికి వెళ్ళేయి. కాస్త ఊరట కలిగింది. కళ్ళు మూసుకుని చేస్తూ వదిలేసిన పని గురించి ఆలోచిస్తూ కూచున్నాడు. మంచి కాఫీ తాగాలనిపించింది. ఇక్కడ టీ కూడా పోలీసు స్టేషను వాసనేస్తోంది.        Oh… The hell…  తను పొరపాటు చేసాడు. అసలు ఎప్పుడూ తొందరపడ్డం అలవాటులేదు. నిజానికి రాధిక మంచి అమ్మాయి. తెలివైంది. ఆమెతో  పనిచెయ్యడం నిజానికి తనకిష్టం. ఆ రోజు రాధిక వేగంగా వెళ్ళిపోగానే పదిహేను నిముషాల్లో నలుగురైదుగురు సీనియర్లు లిఫ్టు లోంచి వేగంగా కిందికి పది మెట్ల మీంచి కిందికి దొర్లు కొచ్చేరు. అప్పటికే అతను బాత్రూంలోంచి వచ్చి మంచినీళ్ళు తాగి కంప్యూటరు ముందు కూచున్నాడు. పొరపాటు చేశాడు. తనట్లా చెయ్యకుండా ఉండవలసింది. తొందర పడ్డాడు తను. తనెప్పుడూ అనవసరంగా తొందర పడ్డది లేదు. షిట్. చాలా మామూలుగా ఉంటాడు. అల్లా మామూలుగా ఉండడం తన కలవాటు. అలవాటని కాదు, ఇంకోలా ఎలా ఉండగలడు? వసంతకి అదే చిరాకు. ఆమె కళ్ళలో అప్పుడప్పుడు ఎగతాళి చూశాడతను. తను గమనించలే దనుకుటుంది. ఆమె ఎగతాళి, ఆ మాటకొస్తే ఆకర్షణ, మెత్తటి అరచెయ్యి, చక్కటి పెదాలు పట్టించుకునే ఆసక్తి లేదు తనకి. ఎప్పుడేనా , ఏమో చెప్పలేం. ఆమెకేం తెలుస్తుంది?  ఏ బీరు బావుంటుందో తెలుసు.

‘’నీకే బీరు ఇష్టం?’’

‘’నాకు బీరు ఇష్టం అని చెప్పేనా?’’

‘’ఉస్. పోన్లే what is your poison?’’

‘’any beer-any drink.’’

‘’నీకు ఇష్టం ఏవంటున్నాను?’’

‘’ అదే , ఒకటని కాదు. ఆపాటికి ఏది తోస్తే అది. ఓకే. నా లంచి టైము అయిపొయింది. చాలా పనుంది. See you’’ అతను కుర్చీల్లోంచి మనుషుల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. లిఫ్టు దిగి కంపెనీ గర్భంలోకి వెళ్లి కూచున్నాడు.

వచ్చిన నలుగురూ మొదట ఏవీ అనలేదు. కళ్ళు పెద్దవిచేసి నిర్ఘాంతపోయి చూస్తూ నుంచున్నారు. ఎవరికీ నోటమాట రాలేదు. వాళ్ళలా చూస్తూ నుంచుంటే అతనికి చిరాకనిపించింది . పొడవాటి నిట్టూర్పు విడిచాడు.

‘’are you mad? రాధిక చెప్పేది నిజవేనా?’’

దరిదాపు వెంటనే తల ఊపే డతను. వాళ్లకి మళ్లీ మాట పడిపోయింది. అందులో అందరి కంటే సీనియర్ మేనేజరు మొహం ఎర్రటి బుడగలా అయిపోయి పేలడానికి సిద్ధంగా ఉంది.

‘’మీడియా రాస్కెల్సు ఒస్తారు. నీవల్ల మా పరువు పోయింది.’’ మేనేజరు చెయ్యి అసంకల్పితంగా లేచి అతని చెంప మీద పడింది. మాడిపోయింది చెంప. అతనికి కోపం రాలేదు. కొంచెం బరువు దిగినట్టనిపించింది. కాసేపు కోపం వాంతి చేసుకుని  వాళ్ళు వెళ్ళిపోయారు.

మరో అరగంట తరవాత పోలీసులొచ్చేరు.

అతనికి మళ్లీ డెన్మార్కు జ్ఞాపకం ఒచ్చింది. అక్కడే మరో ఏడాది ఉండిపోవాల్సింది. ఉదయం దిగేడు. డెన్మార్కులో కార్లో వెళ్తూ వెలిగిపోతున్న నగరాన్ని చూస్తే ఉదయమో, రాత్రో, పగలో, తెలీలే దతనికి. ఆ నగరం అంతా ఫ్రిజిడీర్లో ఉన్నట్టుంది.  తనకి ఆ చల్లదనం నచ్చింది. ఎముకల్లోంచి , కంట్లోంచి, చర్మంలోంచి చెమర్చే చలి. చర్మంలోకీ, అస్తిపంజరం లోకి కుచించుకుపోవడం సంతోషం కలిగించిం దతనికి. ఈ చలిహాయితో పాటు రోడ్లమీద , రెస్టారెంట్లలో పలకరించేవారు లేకపోవడం మరింత బాగుం దనిపించిం దతనికి. అతనెప్పుడు మాట్లాడాలనిపించినా చాటింగ్ ఇష్టపడేవాడు. ఎప్పుడంటే అప్పుడు కీ నొక్కితే గొంతు నొక్కినట్టే. తనతో ప్రాజెక్టులో పనిచేసే ఆరుగురు మాత్రం అతనితో మాట్లాడతారు. అదీ ఎక్కువ భాగం చేసే పని గురించి. పెద్ద ఊరట తనకి. అతని బృందంలో ఇద్ద రమ్మాయి లున్నారు. ఇద్దరూ అతనికి నచ్చేరు.  అందులో ఒక అమెరికన్ అమ్మాయి ఎప్పుడో ఒక హిందీ సినిమా చూసింది.(‘’nice songs.’’) రాధిక కూడా బాగా పని చేస్తుంది. అయినా వీళ్లిద్దరిలో ఏదో ప్రత్యేకమైన వాడి. లంచి టైములో ఆ అమ్మాయే ఎక్కువ మాట్లాడుతుంది.

‘’మీకు పెళ్లయిందా?’’ అందామె.

‘’లేదు’’

‘’ఇలాగే ఉంటావా?’’

‘’హాయిగా వుంది. ఇంట్లో ఒత్తిడి తెస్తూంటారు. నువ్వు?’’

‘’ప్రస్తుతం ఒంటరిని. విడిపోయాం’’

‘’ఒంటరిగా ఉండడం, పని చేసుకోడం నయం. మిగతాదంతా బరువు సామాను.’’ ఆమె నవ్వింది. క్షణం ఆగి అంది.

‘’కొంత లగేజీ అవసరం అనుకుంటాను. మనుషులం గదా?’’

‘’లగేజికీ దానికీ సంబంధం లేదు. I am happy.’’

అప్పటికి అతను ఒచ్చి అయిదు రోజులైంది. కాఫీ తాగి పైకి వెళ్ళే రిద్దరూ . ప్రాజెక్టు రూం లోకి వెళ్ళగానే ఎప్పటికప్పుడు అతనికి కొత్తగా అనిపించే చైతన్యం ఆవహించింది. కంప్యూటరు తెరలు రంగులు మారుతూ మెరుస్తున్నాయి. హీటరు గదిని వెచ్చబెడుతోంది. చిత్రమైన వెచ్చటి సంతోషం అతన్ని కమ్ముకుంది.

రాత్రి ఎనిమిది గంటలకి విస్కీ గ్లాసు ముందు పెట్టుకుని టీవీ చానెళ్ళు తిప్పుతున్నా డతను. మంచి పోర్న్(PORN) ఛానెల్ వెతుక్కుని గళాసందుకుని రెండు గుక్కలు సేవించగానే కాలింగ్ బెల్లు మోగింది. ఆశ్చర్య పడ్డా డతను. టీవీ మూసి వెళ్లి తలుపు తీసి ఆమెని చూడగానే మరింత ఆశ్చర్యం కలిగింది.

‘’ఆశ్చర్యం గా ఉందా? వచ్చినందుకా… చెప్పకుండా వచ్చినందుకా?’’ అందామె.

తేరుకుని అన్నాడతను. ‘’వెల్ కమ్, ముందా కోటు తీసివ్వు’’ ఇద్దరూ లోపలికి వచ్చేరు. సోఫాలో రెండు కాళ్ళూ పెట్టుకుని ముడుచుకుని కూచుందామె. గ్లాసులో విస్కీ పోసి అందించాడతాను . రాత్రి ఉండిపోయిందామె. వెళ్ళడానికి రాలేదని అతనికి తెలుసు. (‘’bye, see you at work’’) ఉదయం కాఫీ తాగుతూ అతని వేపు పరిశీలనగా చూసిందామె.

‘’నామొహం అంత బాగుండదు.’’

‘’రాత్రి చేసిందంతా ఇష్టం గానే చేశావా?’’

‘’ఊ’’

‘’నాకలా అనిపించలేదు’’

‘’ఏం’’

‘’చెప్పలేను, I admit you were quite skillful’’

మళ్ళీ అతని దగ్గరికి రాలే దామె. పని మామూలే.

దోమ ఒకటి నిశ్శబ్దంగా వచ్చి అతని చెవి మీద కుట్టి వెళ్ళిపోయింది. ప్చ్. అతన్ని చూస్తూ లోపలికి వచ్చేడు ఇన్ స్పెక్టరు. తెరమీద చూస్తున్నట్టు చూశాడతను. సిగరెట్టు వెలిగించి పొగ అతని మీదికి వదులుతూ అన్నాడు ఇన్ స్పెక్టరు.

‘’కొచెం కొత్తగా ఉన్నావయ్యా నువ్వు. నీకు జెయిలంటే బయం లేదా?’’

‘’జైల్లో ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు…. మా పేరెంట్స్ గురించే…’’

‘’నీ గురించి’’

‘’not much. నా పనంతా దీనివల్ల చెడిపోయింది. నా వల్ల పొరపాటు జరిగింది.’’

‘’దాన్ని  పొరపాటంటారా?

‘’ ఎలా అన్నా పొరపాటే’’

కొంచెం ఆశర్యంగా అతని వేపు చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టరు.

‘’నువ్వు కొంచెం మెంటలు కేసనుకుంటున్నాను’’

‘’ఎందుకని? నేను మామూలు మనిషిని. ఉదయం కంపెనీకి వెళ్తాను. I’m a team leader. రోజంతా పనిచేస్తాను. ఇంటి కొస్తాను. కాసేపు రెస్టు తీసుకుని కంప్యూటరు తెరిచి పని చేసుకుంటాను. ఉదయం మళ్ళీ కంపెనీ. ఇది నా రొటీను. అట్లా పని చెయ్యడం నా కిష్టం. Is that a problem?’’

‘’మీ పేరెంట్స్ ని తెచ్చుకోవచ్చుగా?’’

‘’ఎందుకు? అక్కడ వాళ్ళు బావున్నారు. అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తూంటాను. వెళ్ళినప్పుడల్లా పెళ్లి గురించి గొడవ పెడుతూంటారు. నా కిష్టం ఉండదు.

‘’కరెక్టు. ఈ ఎదవ పన్లు చేసే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా?’’

‘’రెండింటికీ సంబంధం లేదు.’’

‘’అదీ నిజవేలే. నీకు ఇంకా ఫ్యూచరుందనే అనుకుంటున్నావా?’’

అతనేం చెప్పలేదు. చటుక్కున ఆగిపోయిన కంప్యూటర్లా కూచున్నడతను. అనుకోకుండా కళ్ళు చెమర్చేయి.

‘’అసలు మావాళ్ళు చెయి చేసుకోందే ఊరుకోరు. ఎందుకో గానీ నిన్నొది లేశారు. పేపరు చూశావా?’’

అతనేవీ అనలేదు. మామూలుగానే పేపరు పూర్తిగా చదవడు. ఇప్పుడా?

‘’నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. మీ బాసుగారు నిద్దరపోయి మూడ్రోజులైంది. ఆయన్ని మీడియా గాళ్ళు నంచుకు తింటన్నారు.’’

అతని కడుపు భగ్గుమంది. ఎదురుగా పీ.పీ. తెర మీద ఇన్ స్పెక్టరు కనిపిస్తున్నాడు. తనవేపు తవ్వుతున్నట్టుగా చూస్తున్నాడు. తన మనసులో, జీవితంలో ఏదో పెద్ద రహస్యాన్ని చూపులతో వెలికి తియ్యాలనే పట్టుదలతో ఉన్నాడాయన. ఒళ్లో పెట్టుకున్న చేతులవేపు చూసుకున్నా డతను. పొడవాటి తెల్లటి వేళ్ళు చచ్చిపోయినట్టున్నాయి. ఎప్పుడూ చకచక కీ బోర్డు మీద నృత్యం చేసే వేళ్ళు నిర్జీవంగా పడి ఉన్నాయి. బాధ కలిగిం దతనికి. మృదువుగా, ఏదో ఆరిపోయిన వెచ్చదనాన్ని రగిలిస్తున్నట్టు రెండు చేతులూ రాసుకున్నాడతను. మధ్యలో ఇన్ స్పెక్టరు వేపు చూశాడు. తన వేపే పోలీసు చూపులు చూస్తున్నాడు. తను చాలా మామూలు మనిషి. మెంటల్ కేసంటా డేవిటి? అదే అయితే తప్పు చేసానని ఎందుకు ఒప్పుకుంటాడు?  చెప్తూనే ఉన్నాడు గదా, పొరపాటయిపోయిందని. చేసిన పొరపాటు వల్ల కొత్త ప్రాజెక్టు పని అంతా కొరగాకుండా పోయిందని తను ఎంత బాధ పడుతున్నాడో ఇన్ స్పెక్టరుకేం తెలుస్తుంది? ఎంతసేపటికీ తిట్టడం, కొట్టడం, జైల్లో పారెయ్యడం. ఇదీ వీళ్ళకి తెలిసింది. జైలు కెళ్ళడం తనకేదో సరదా అన్నట్టు మాట్లాడుతున్నాడు వీడు.

‘’బెయిలొస్తే ఇంటికి పోవచ్చనుకుంటున్నావా ?’’ అనసలు దాని గురించి అనుకోడం లేదు, అదే అన్నాడతను.

‘’నేను దాని గురించి ఆలోచించడం లేదు.’’

‘’నీకు ఉద్యోగం రాదు.’’

అప్రయత్నం గా అన్నాడతను. ‘’ఓ ఏడాది డెన్మార్కులో ఉన్నా బాగుండేది.’’

‘’అంటే, అక్కడీ బాద లేదా?’’

‘’నాకర్థం కావడం లేదు.’’

‘’నీకేం బాదగా లేదా? బయం లేనోడివని తెలుస్తానే ఉంది. నాల్రోజులు లోపలుంటే అదీ తెలుస్తుందనుకో.’’

‘’I am sorry. నేనేవీ చెప్పలేను.’

ఇన్ స్పెక్టరు వంగి అతని ముఖంలోకి చూస్తూ ‘’నువ్వంత వయలెంటు టైపులా కనిపించడం లేదు.’’ అన్నాడు . తెరమీది ఇన్ స్పెక్టరు ముఖం క్లోజప్ లో కనిపించింది పెద్దగా. తెరమీద పోలీసు ముఖం వెనక్కి పోయింది. అతనికి ఏవీ మాట్లాడా లనిపించడం లేదు. ఒక్కడే అలా కూచోవాలని ఉంది. ఇన్ స్పెక్టరు కి  కూడా మాట్లాడా లనిపించలేదు. మళ్లీ సిగరెట్టు వెలిగించి ఓ దమ్ము లాగి లేచి వెళ్ళిపోయాడు. తెర ఖాళీ అయిపోయింది. కళ్ళు మూసుకున్నా డతను. అస్పష్టంగా అమ్మ , నాన్న కనిపించారు. వాళ్ళకు ఈ పాటికి తెలిసి ఉండాలి. చాలా ఏడుస్తారు. దీనికంటే అదే ఎక్కువ బాధ, తలకాయ నెప్పి.

వసంత అన్నిసార్లు చెయ్యి గిల్లినా పట్టించుకోకుండా తను ఇటువంటి తెలివి తక్కువ పనిచేశాడు. రాధిక మరో అరనిముషం ఉన్నా తను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ఉండేవాడు. అంతటితో అయిపోయేది. రాధిక కూడా క్షణం ఆగి అలోచించి ఉండవలసింది. తానెప్పుడూ ఆ అమ్మాయి తెలివి తేటలని మెచ్చుకుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా తను ఎటువంటివాడో ఆమెకి తెలియదా? It was a bloody mistake. మంచివాళ్ళు కూడా పొరపాట్లు  చేస్తారు. మరి రాధికకి  ఎంత అనుభవం ఉన్నా పొరపాట్లు దొర్లినప్పుడు తను సరిదిద్దలేదా, సలహా లివ్వలేదా?

రాధిక వచ్చి పక్కన నిలబడింది. ఆమె కంటే ముందే ఆమె డియో అతన్ని చేరుకుంది. అతను వెంటనే పలకరించలేదు. అతని వేళ్ళు వేగంగా కదుల్తున్నాయి. అతని భుజం తట్టిందామె .

‘’కొన్నాళ్ళకి నా పేరు మర్చిపోతావు ‘’ అందామె. కూచోమని చెప్పి ఆమె వేపు తిరిగే డతను . ఆమె ఎప్పుడూ స్కర్టు వేసుకోదు. మోకాళ్ళ మీంచి స్కర్టు పైకి జరిగింది. నీలపు అంచు కింద ఆమె మోకాళ్ళు తెల్లగా గుండ్రంగా చక్కగా ఉన్నాయి. అతని చేతికి ఫైలు అందించింది రాధిక.

‘’ఒకసారి చెక్ చెయ్యాలి. నువ్వు చూస్తుంటే నా సందేహాలు అడుగుతాను.’’

అతను కాయితాలు మెల్లిగా తిప్పుతూ ఆమె డియో పీల్చుకుంటూ అయిదు నిముషాల తరవాత ‘’ఫైన్’’ అన్నాడు.

‘’నేనేం అడగొద్దా?’’

‘’అవసరం లేదు, గో ఎహెడ్ ‘’

అతను తల వెనక్కి వాల్చి రెండు చేతులూ పైకి ఎత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆమె వెళ్ళడానికి లేచింది.

‘’టీ తాగుదాం.’’ అందామె.

‘’ ఇప్పుడా?’’

‘’ఎప్పుడయితే ఏం?…..వస్తావా?’’

అతను లేచి నుంచుని ఆమె వేపు చూశాడు. తెరమీద రాధిక ఆకర్షణీయమైన ముఖం చిరునవ్వుతూ కనిపించింది. ఆమె కింద పెదవి చాలా బావుంటుంది.

‘’ఏంటి చూస్తున్నావు? Let us go.’’

‘’నువ్వు చాలా బావున్నావు.’’

‘’ఓకే , కమాన్.’’

చటుక్కున తెరమీద నవ్వుతున్న ఆమె ముఖాన్ని దగ్గరికి లాక్కుని ఆమె పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నా డతను . క్షణం సేపు ఆమె కేం చెయ్యాలో తోచలేదు. అతనే ఆమె పెదాల్ని వదిలి భుజం మీద చేతులు వేసి దగ్గిరికి లాక్కున్నాడు. ఆమె విదిలించుకుంది. ఆమెని పొదివి పట్టుకుని పెదాలతో ఆమె నోరు మూశాడతను. ఇద్దరూ తివాచీ మీదికి జారేరు . అతన్ని పక్కకి నెట్టడం ఆమె వల్ల కాలేదు. పది నిముషాలు  తరవాత ఆమె మీదనుంచి లేచేడతను. ఆమె లేచి స్కర్టు సద్దుకుని అతని వేపు చూసింది. రాధిక కళ్ళలో కోపం, ఆశ్చర్యం… అతన్నీ లోకంలోకి తోశాయి. నిశ్శబ్దంగా ఆమె వేపు చూస్తున్నాడతను. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగేయి. విసురుగా బయటికి వెళ్ళిపోయింది… షిట్…. మర్యాదగా అడిగి ఉండవలసింది. పొరపాటు చేశాడు తను. బాత్రూంకి వెళ్లి వచ్చి అయిదు నిముషాలు అలాగే కూచుండి పోయాడు. కంప్యూటరు మళ్ళీ తెరిచి తెరలోకి వెళ్ళిపోయా డతను.

అరగంట తరవాత పోలీసు లొచ్చేరు. ఇన్ స్పెక్టర్ని అతను బాగా దగ్గిరకి వచ్చిన తరవాత గానీ గమనించలేదు.

నాలుగొందల తొంభై ఎనిమిది
నేను పోలీస్‌ స్టేషన్‌ లోకి అడుగుపెట్టే సరికి వాడు ఓరగా వేసిన చెక్క బెంచీ మీద, అరచేతుల్లో ముఖాన్ని పాతిపెట్టి కూర్చుని ఉన్నాడు. భుజం మీద చేయి వేస్తూ ప్రక్కన కూర్చున్నాను.

వాడు ఆ స్పర్శకు చప్పున లేచి  కూర్చుంటూ నా వైపు చూసాడు.

‘వచ్చావా’

‘సారీ… ట్రాఫిక్‌ రా.. కొంచం లేటైంది’

వాడు  రుమాలు తీసి ముఖాన్ని గట్టిగా అదుముతూ తుడుచుకుంటూ ‘ఫర్లేదు’ అన్నాడు.

‘ఏమైంది రా’

‘మా ఆవిడ నా మీద కేసు పెట్టింది’

‘మీ ఆవిడా? దేనికి?’ తెల్లబోతూ అడిగాను.

‘మొన్న రాత్రి గొడవైంది. కొట్టాను. ఈ రోజు పొద్దున్నే మా అత్తా మామా వచ్చారు. తనకి కేస్ పెట్టే  ఉద్దేశమే లేదు. మా మామ దొంగ… లం… కొడుకు చేసుంటాడు అంతా’ అంటూ వాడు కళ్ళల్లో వస్తున్న ఊటను తుడుచుకోవడానికి కాస్త ఆగాడు.

‘మరి వాళ్ళేరీ’ చుట్టూ చూస్తూ అడిగాను.

‘కాసేపట్లో వస్తార్ట. ఎస్‌. ఆర్‌. నగర్‌లో డాక్టర్‌ దగ్గర కాల్‌లో ఉంటే, స్టేషన్‌ నుంచి ఫోనొచ్చింది. అక్కడ బయల్దేరుతున్నపుడే నీకు కాల్‌ చేశాను. ఇబ్బంది పెట్టానా?’

నేను లేదన్నట్లు తలూపాను. వాడు బాగా ఆందోళనగా ఉన్నాడు. బాగా పీక్కుపోయి ఉన్నాడు. నేను వాడ్ని కలిసి దాదాపు ఎనిమిది నెలవుతోంది. పూర్వ విద్యార్థుల కలయికలో చూట్టం చివరిసారి. ఫోన్ లోనే ఎక్కువ మాట్లాడుకోవటం . . ఒకే ఊరిలో ఉన్నా, రోజూనో, వారాంతాల్లోనో కలుసుకునేంత దగ్గరితనం లేదు. మా ఉద్యోగాలు వీలు కల్పించవు. వాడు నాతో పాటు పదవ తరగతి వరకు చదువుకున్నాడు. మనిషి మెతక. చిన్నప్పుడు చాలా కుదురు. నూనె రాసి పాపిట తీసిన దువ్వు, పెద్ద కళ్ళు, చిన్ని కనుబొమలు, వాటి మధ్య ఆంజనేయస్వామి సిందూరం. తెల్ల చొక్కా, నీలం నిక్కరు, స్టీలు పెట్టెలో పుస్తకాలతో బడికొచ్చేవాడు. వాడు పొట్టిగా ఉండేవాడు. వాడు మొదటి బెంచి , నేనేమో మూడో బెంచి  . ఏ పాఠం బయటకు చదవాలన్నా వాడే మొదట ఉండేవాడు. తొమ్మిదో తరగతిలో ఇద్దరం ఒకే ప్రైవేటు. డిబేట్‌ కాంపిటీషన్‌లో వాడు అనర్గళంగా మాట్లాడుతూ మధ్యలో ఒకచోట సడెన్‌గా మర్చిపోయి పైకప్పును చూస్తూ గుర్తు తెచ్చుకుని, ఆ మిడిగుడ్లతో మళ్ళీ దానిని కొనసాగించటం నాకు బాగా గుర్తు. నాది వేరే గుంపు. వీడప్పుడప్పుడూ మాతో ఆటల్లో కలిసేవాడు. వేసవి సెలవుల్లో మా వాసుగాడితో కలిసి ఉలాసపేట నుండి మా వీధికి క్రికెట్‌ కోసం వచ్చేవాడు. అదేంటో వాడ్ని ఎప్పుడు చూసినా శుభ్రంగా ఉండేవాడు. మరీ ముఖ్యంగా నొసటన ఆంజనేయస్వామి సిందూరం.

పదో తరగతి తర్వాత చాలా మంది చెల్లా చెదురయ్యాం. సంక్రాంతికి ఊరికెళితే కలిసేవాడు. పెద్దగా మాట్లాడడు కానీ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ మాతో పాటే ఉండేవాడు. ఏదైనా జోకేస్తే నవ్వేవాడు. పై రెండు పళ్ళ మధ్య ఖాళీ స్పష్టంగా కనిపించి వాడి నవ్వు తమాషాగా, అందంగా ఉండేది. తరువాత్తరువాత అందరం బిజీ.. జీవితం, బాధ్యతలు, ఉద్యోగం.. కలయికలు తగ్గాయి. వాడి పెళ్ళికి పిలిచాడు. నేను కలకత్తా ట్రైనింగ్‌లో ఉండి వెళ్ళలేక పోయాను. తర్వాత వాడికి హైద్రాబాద్‌ ట్రాన్స్ఫరయింది. ఎలా కనుక్కున్నాడో నా నంబర్ కనుక్కుని  ఫోన్‌ చేశాడు. వాడు ఆ కొస. నేను ఈ కొస. ఫోన్‌లోనే అప్పుడప్పుడూ… పొడి పొడి మాటలు. వాడు వాళ్ళింటికి ఎప్పుడూ పిలవలేదు. నాకు వాడిని  పిలవాలని అనిపించలేదు.

కానీ మొన్న అలూమినీ మీట్‌లో మాత్రం నాతోనే ఉన్నాడు. వాడిలో ఏదో మార్పు వచ్చింది. ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వారానికొకసారైనా ఫోనుండేది. ఎప్పుడూ వాడు చెయ్యటమే. నేను చేద్దామను కోవటం. ఈలోగా వాడే చేసేవాడు. ఇదిగో ఈ రోజు అలాంటి ఫోనే అనుకున్నా.. కానీ వాడి గొంతులో ఆందోళన ..గాభరా .

‘ఏరియా పేరు చెప్పి .. ఫలానా  పోలీస్‌ స్టేషన్‌కు రా రా.. నా మీద కేసు పెట్టారు. తెలిసినవాళ్లెవరూ లేర్రా ఇక్కడ. నువ్‌ పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది.. ఒకసారి రారా ప్లీజ్‌ ’ అన్నాడు.

తలా, తోకా అర్థం కాలేదు కానీ, నేనెళ్ళటం అవసరం అనిపించింది. వచ్చాను. ఇదిగో వీడిలా ఉన్నాడు. మనిషి పీక్కుపోయి, కళ్ళక్రింద ముడుతలో, మురికో తెలీని ఒక పొర  వాడి కళ్ళద్దాల్లోంచి కనిపిస్తోంది. ఆంజనేయస్వామి సిందూరం చెమటతో కలిసి చెదిరిపోయి  ఉంది. వాడు మాటిమాటికీ కళ్ళు పెద్దవి చేస్తూ, రెప్పలను టప టపలాడిస్తున్నాడు. చేతికున్న గడియారాన్ని విప్పటం తిరిగి కట్టుకోవటం అదేపనిగా చేస్తున్నాడు.

‘ఏం కాదురా.. టెన్షన్‌ పడకు’ అన్నాను.

‘ఏమైనా ఫర్లేదురా.. నేను చచ్చిపోతే బెటర్‌’

‘ఏడిశావ్‌.. ఇంత చిన్న విషయానికే చచ్చిపోతారా.. కేసేంటో కనుక్కోనీ.. నువ్వేం మర్డర్‌ చెయ్యిలేదు. కొట్టడం తప్పే.. మీ ఆవిడ రానీ.. నే మాట్లాడతా’.

అన్నానే కానీ ఏమ్మాట్లాడాలో నిజంగా నాకు తెలీదు. వాడు నావైపు చూడకుండా మళ్ళీ చేతుల్లో మొహం దాచుకుని కూర్చున్నాడు. మా బెంచ్‌కు ఎదురుగా ఉన్న రెండు కుర్చీల్లో ఒకటి ఖాళీ. రెండో దాంట్లో ఒకామె ఏదో రాస్తూ ఉంది.

నేను లేచి బయటకొచ్చాను. సిగిరెట్‌ తాగితే బావుణ్ణనిపించింది. పోలీస్‌ స్టేషన్‌ బయట కాల్చొచ్చో లేదో.. ఎందుకులే.. పోలీస్‌ స్టేషన్‌ను సినిమాల్లో చూడటమే కానీ ఎప్పుడూ వచ్చింది లేదు. ఈ స్టేషను అయితే సినిమాల్లో చూపించినట్లు అస్సల్లేదు. మహిళా స్టేషనంట. మరి మామూలు స్టేషన్లు సినిమాల్లో చూపించినట్లు ఉంటాయేమో.. . వంద గజాల జాగా ఉంటుందేమో. అందులో ఒక పాత పెచ్చులూడుతున్న గోడ కట్టడం. సగం పెంకు, సగం స్లాబు తమాషాగా.. వర్ణ సంస్కారం లేని గోడలు, పాచు పట్టిన గోడ ప్రక్కనే కిటికీ.. చుట్టూ కాస్త ఖాళీ జాగా. ఒకవైపు బళ్ళు పెట్టుకునే పార్కింగ్  ఉంది. రెండోవైపు ఒక పిచ్చి బాదం చెట్టు ఏపుగా పెరిగి ఉంది. దాని ఆకులు ఆవరణలో పరుచుకొని ఉన్నాయి. వాటి మధ్య చిన్న సిమెంటు మెట్లు గుండ్రంగా ఉండి మధ్యలో  ఇనుప గొట్టంతో జెండా స్తంభం. దానికెదురుగానే స్టేషన్‌ వాకిలి. ఒక పాత చెక్క టేబుల్‌, దానిమీద ‘మే ఐ హెల్ప్‌ యూ’ అని నీలి రంగు అక్షరాల తెల్ల బోర్డు. కుర్చీ ఉంది కానీ, ఎవరూ లేరు. అది దాటుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చాను. వాడింకా అలానే ఉన్నాడు. ప్రక్కన కూర్చున్నాను. ఇందాక గమనించలేదు కానీ లోపల ఓ రూము ఉంది. లైటు వెలుగుతోంది. అలికిడి లేదు. బహుశా ఎవరైనా లోపల ఉన్నారేమో… లేకపోవచ్చు కూడా. మొత్తం స్టేషన్‌లో నలుగురమే ఉన్నాం ఆ సమయానికి. మా ఎదురుగా రాసుకుంటున్నామె రాతపని ఆపి, శ్రద్ధగా ఒక కవర్‌లో దానిని మడతపెట్టి సొరుగులోంచి బంక బాటిల్‌ను తీసింది. బాటిల్‌లో బంక అయిపోయిందేమో.. ఆమె తంటాలు పడుతూ ఉంది. పరీక్షగా చూస్తే మా సుగుణత్తయ్యలా ఉంది. ఖాకీ బట్టలు వలన ఆమెలో చిన్న కరుకుదనం నాక్కనిపిస్తుందేమో కానీ.. ఆమె నిజంగా మా అత్తయ్యలానే ఉంది.

నేను, మావాడు, ఆమెతోపాటు ఇంకొకామె బాదం చెట్టు దగ్గర కూర్చుని ఉంది. నలుగురమే ఉండటం వల్లనేమో స్టేషన్‌ నిశ్శబ్దంగా, గూఢంగా ఉంది. టొక్కు . . టొక్కు మంటున్న సీలింగ్‌ఫ్యాన్‌ చప్పుడు తప్ప ఇంకే శబ్దం లేదు.

బాదం చెట్టు దగ్గర కూర్చున్నామె శూన్యంలోకి చూస్తూ ఉంది.

ఆమెకు ఏం కష్టమో?

నాకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. టైమ్‌ చూసాను. ఆరవుతూ ఉంది.  ఇరుకుగా, ముడుచుకు పోయినట్లుగా ఒక భావన.. ఎందుకో తెలీదు. వెళ్ళిపోవానిపిస్తోంది. టొక్కు . . టొక్కు . . టొక్కు లయబద్దంగా ఫ్యాన్‌ చప్పుడు. మెల్లగా లేచి బంకతో తంటాలు పడుతున్నామె దగ్గరకెళ్ళాను.

‘మేడమ్‌’

ఏంటన్నట్లు తలెత్తి చూసింది.

‘నా ఫ్రెండే.. వాళ్ళావిడ, అత్తా మామ కేసు పెట్టారంట.. ఏంటో తెలుసుకోవచ్చా? ఎవరితో మాట్లాడాలి?’

‘ఏం మాట్లాడతావ్‌? ఏదైనా మేడమ్‌ వస్తుంది. ఆమెతో చెప్పు. అప్పటిదాకా కూచో’ ఏకవచనంలో అంత కరుగ్గా చెప్పగానే … ఆమెను సుగుణత్తయ్యతో పోల్చటం తప్పనిపించింది.

నేను ఎర్రబడిన మొహంతో వచ్చి కూర్చున్నా. వాడు మొహం ఎత్తలేదు.  అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనుంది. నాకేం పెద్ద పనిలేదు. ఇంటిక్కూడా తొందరేం లేదు. మా ఆవిడ , పాప వేసవి సెలవులకు వైజాగ్ వెళ్లారు . లేట్‌ అయితే ఏం కాదు.

కానీ కూర్చోబుద్ధి కావట్లే. వాడు మాట్లాడితే బావుణ్ణు. అసలేమయి ఉంటుంది?

నేనే కదిపాను.

‘అసలెందుకు కొట్టావ్‌ రా? కొట్టకూడదు కదా? ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ,…… స్టేషన్ల వరకూ వచ్చింది చూడు’

వాడు చేతుల్లోంచి మొహం తీయకుండా చెప్పాడు.

‘ఎప్పుడూ చెయ్యెత్తింది లేదురా .. మొదటి సార్రా .. కంట్రోల్‌ తప్పాను.. ఇదుగో  ఇక్కడ దాకా వచ్చింది “ అన్నాడు

‘సరే. టెన్షన్ పడకు ..ఫ్రీ గా ఉండు .  మొదటిసారి కదా.. SI తో మాట్లాడదాం. ఏదో ఆవేశం అని చెప్పొచ్చు  . . నేను మాట్లాడతాను. డోంట్ వర్రీ ’ అన్నానే కానీ … నిజంగా ఏం మాట్లాడాలి?

అలికిడైంది. తల తిప్పితే ముందొక ఆడపోలీసు, వెనకాలే ఒక మగ, ఆడ ఆ వెనకా ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు చివర్లో ఇంకో ఆడపోలీసు.

లోపలికొచ్చాక.. ‘అక్కడ కూచో.. మీ వాళ్ళు, నువ్వు  బయటుండండమ్మా.. మేడం వస్తే పిలుస్తా’ అంది వచ్చిన ఆడపోలీసు ఒకామె, కాస్త దూరంగా వాటర్‌ డిస్పెన్సర్‌ దగ్గరకు నడుస్తూ, అతనికి బెంచీని చూపిస్తూ..

రెండో ఆమె టకా టకా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అతడు మా వాడి ప్రక్కనే కూర్చున్నాడు. బక్కగా, చిక్కటి వెంట్రుకలు, మాసిన గడ్డం, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అతడు కూర్చున్నప్పుడే గుప్ఫుమంది.

ఫోన్ రింగైంది . ఎత్తాను. అవతల మా ఆవిడ.

‘‘చెప్పు బుజ్జీ’’

‘‘ఎక్కడున్నారు.. ఇంకా ఆఫీసులోనేనా’’

‘‘లేదు.. చిన్న పనుంటే బయటకొచ్చాను . . సేల్స్‌ కాల్‌’‘బొంకాను.

‘‘రేపు మా పద్మక్క వాళ్ళ మరిది పెళ్ళి. అనకాపల్లి వెళ్తున్నాం.. మీ వాళ్ళకు చెప్పి కారేదైనా అరేంజవుద్దేమో చెప్తారా’’

‘‘అలాగే.. గంటలో చెప్తా. పాప ఎలా ఉంది’’

‘‘బావుంది. క్రింద పిన్ని వాళ్ళింట్లో దీపుగాడితో ఆడుకుంటోంది’’

‘‘సరే . . నేను మళ్ళీ చేస్తాను’’ పెట్టేశాను..

వాడిని చూశాను. వాడు స్తిమిత పడి కూర్చున్నట్లు కనిపించాడు. మనిషి తెరిపిగా ఉన్నాడు. ఒక చేతి వేళ్ళలో ఇంకో చేతి వేళ్ళు జొనిపి.. రెండు బొటన వేళ్ళనూ తాకిస్తూ. . మూతిని సున్నాలా చుట్టి.. కళ్ళు పెద్దవిచేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు. కంటి రెప్పలార్పడం వేగం తగ్గింది. నేనేమీ మాట్లాడలా.. ఆ ప్రక్కన కూర్చున్నోడు ఇంచుమించు

నిద్ర పోతున్నట్లుగా గోడకు చేరగిలబడి పైకప్పును చూస్తున్నాడు.

ఏం చేసి ఉంటాడు. బయట ఉన్నవాళ్ళెవరు? తాగి భార్యను హింసించి  ఉంటాడా? మావాడు చేసిందీ అదే కదా? భార్యను కొట్టాడు. ఎందుకు కొట్టి ఉంటాడు. మొదటిసారికే కేసు పెడతారా? వీళ్ళిద్దర్నీ ఒకే జైలులో, ఒకే సెల్లులో,  ఎన్నేళ్ళుంచుతారో వీడిని జైల్లో… ఏమో! కేసేంటి అసలు… కేస్‌ తెలిస్తే ఎన్నేళ్ళు పడుతుందో చెప్పటానికి నేనేమైనా లాయర్‌నా.. . ఎవర్నడగాలి? ఎస్సై ఎప్పుడొస్తుందో…

ఆలోచనల్లోంచి బయటకొచ్చాను. మళ్ళీ ఇరుగ్గా, ఇబ్బందిగా ఉంది…

మెల్లగా లేచాను. వాడింకా అదే స్థితిలో ఉన్నాడు. వంగి చెవి దగ్గర ‘ఇప్పుడే వస్తాను’ అన్నాను.

‘ఎక్కడికి’ అన్నట్లు చూశాడు వాడు.

నేనేదో చెప్పబోతుండగా లోపలికి సబ్‌ ఇనస్పెక్టర్‌ వచ్చింది. ఆమె ఎస్సై అని నాకు అర్థమైంది. ఎవరూ చెప్పలేదు. కానీ అర్థమైంది. ఎలా అంటే నాక్కూడా తెలీదు..

ఆమె దడదడా నడుస్తూ లోపలికెళ్ళింది. లోపలున్నామె బయటకు వచ్చి మా ముందు ఖాళీ ఉన్న కుర్చీలో కూలబడింది. నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. నా ఆలోచన పసిగట్టినట్లు ఆమె నావైపు చూస్తూ ‘కాసేపు కూర్చోండి. మేడమ్‌ ఇప్పుడే వచ్చారు. పిలుస్తారు.’ అంది. ఆమె ఆ మాటంటుండగా ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు వచ్చారు. ఈసారి కూడా నాకెవరూ చెప్పలేదు. కానీ వచ్చినవాళ్ళెవరో .. అర్థమయ్యింది.

మావాడి భార్య , అత్త మామలు.

వాడి భార్య బాగా ఏడ్చినట్లు తెలుస్తూ ఉంది. ఒకవైపు కన్ను వాచి ఉంది. ఎడమ చేతి వ్రేళ్ళకు ఒక తెల్లని కట్టు కొత్తగా  ఉంది. బహుశా హాస్పిటల్‌ నుంచి డ్రెస్సింగ్‌ చేయించుకుని నేరుగా వస్తున్నారేమో ? ఆమె మౌనంగా నిలబడి వాడి వైపు చూసింది.

వాడింకా అలానే ఉన్నాడు. ఏం పట్టనట్లు. గచ్చుమీద ఒక కనిపించని కేంద్రాన్ని ఏర్పరుచుకుని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. గుండె కొట్టుకున్నట్లుగా., వాడి చెవి ప్రక్కన కణత సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ ఉంది.

నేను ఆమె దగ్గరకెళ్లి ఏం మాట్లాడాలో తెలీక ‘బావున్నారా  సిస్టర్‌’ అన్నాను.

ఆమె తెల్ల మొహంతో ఎవరన్నట్లు చూసింది.

నేను చిన్న పరిచయంతో విషయం చెప్పాను. ఆమె ఏ భావమూ లేకుండా తలదించుకొని నేలను చూస్తూ ఉంది.

వాళ్ళ నాన్న చప్పున అందుకొని ‘‘ఇలా రండి మాట్లాడదాం’’ అన్నాడు.

ఆమెను, వాళ్ళమ్మను వదిలి మేమిద్దరం బాదం చెట్టు దగ్గరకొచ్చాం. మేం చెట్టు దగ్గర నిబడగానే బయట లైటు వెలిగింది.

చీకటి వెలుగు నీడల మధ్య వాడి మామను పరిశీలనగా చూసాను. అతడు అంతా బావున్నాడు కానీ ఏదో తేడాగా ఉంది..

ఏంటది? ఏంటది… ఆ.. లేకితనం… మనిషి మొహంలో ఒక లేకితనం, చిన్నపాటి కఠినత్వం ఉన్నాయి. అతడి మొహానికి అతడు పెట్టుకున్న బంగారు రంగు ఫ్రేము కళ్ళజోడు అస్సలు నప్పక కృత్రిమంగా ఉంది. . అతడు మొహాన్ని చేత్తో తుడుచుకుంటూ.. సంభాషణ ప్రారంభిస్తూ..

‘నీకెప్పటినుంచీ ఈ వెధవ తెలుసు’ అన్నాడు.

నాకు చురుక్కుమంది. ‘మామూలుగానే మాట్లాడదామండి. ఆవేశపడకండి. వాడు నా క్లాస్ మేట్‌… పదో తరగతి దాకా’ అన్నాను.

‘‘ఈ వెధవ గురించి మాటలాడటమే తప్పు.. చూశావా. ఎలాక్కొట్టాడో.. అమ్మాయి చెయ్యి మీద కుర్చీ విసిరాడు. వేలు ఫ్రాక్చరయ్యింది. చంపేసేవాడేమో.. పక్కింటోళ్ళు చూడబట్టి సమయానికి కాపాడారు.. అయినా నగలు.. నగలు అంటూ మా ప్రాణం తీస్తున్నాడు. ఎనిమిదేళ్ళుగా నరకం .. ప్రతీనెలా.. ఇదే భాగోతం.. వీడిని లోపలేసి చిప్పకూడు తినిపిస్తేగానీ అణగడు… అందుకే ‘‘ఊపిరి పీల్చుకుని ఆగాడు.

‘ఏ నగలు’

‘అవే తాకట్టులో ఉన్న నగలు. ఏం నీకు చెప్పలేదా. అయినా రేపో మాపో విడిపించేస్తాం కదా.. డబ్బు సెట్టవ్వక గానీ.. లేకపోతే వాడి మొకాన కొట్టడానికి ఎంతసేపు’

నాకు అస్పష్టంగా అర్థమైనట్లు అనిపించింది. కానీ ఏదో అర్థం కాలేదు. వాడి ఆంజనేయస్వామి బొట్టు వెనక బుర్రలో భార్యను హింసించే గది ఒకటుందని నమ్మబుద్ధి కావట్లేదు.

‘పిలుస్తున్నారు.. మిమ్మల్నే’ పోలీసామె అరుపుకూ, కేకకూ మధ్యస్థంగా ఒక గొంతుతో మమ్మల్ని పిలిచింది.

మేం లోపలికి వెళ్ళేటప్పటికి ఆ తాగుబోతాయన తప్ప బెంచీమీద ఎవరూ  లేరు. లోపలకెళ్ళాన్నది అర్థమై నడిచాం. పుస్తకాలు, కాగితాలూ ముక్కిపోయిన వాసనొకటి పెద్దదవుతూ ఉండగా ఆ రూములోకి అడుగు పెట్టాము. వాడు, ఆమె కూర్చుని ఉన్నారు. వాళ్ళకెదురుగా ఎస్సై కూర్చుని ఎవరినో ఒక బూతుమాటతో ఫోన్‌లో సంబోధిస్తూ ఉంది. గక్కురుమన్నది నాకు. వాళ్ళత్త ఏ విధమైన భయమూ లేకుండా మెడలో పుస్తెలతాడు పట్టుకుని సవరదీస్తూ ఉంది.

‘చెప్పండి. ఏం చేద్దాం.. ఫోర్నయింటీ ఎయిట్  బుక్‌ చేద్దామా’ అంది ఎస్సై ఫోన్‌ను టేబుల్‌ మీద పెడుతూ.,  వాడి మామను చూస్తూ, …

వాడు గుటక మింగుతూ ఆందోళనగా ‘ఏంటీ ’ అన్నాడు.

‘ఫోర్నయింటీ ఎయిట్  సెక్షన్  విన్నావా.. అదే.. మళ్ళీ బయటకు రావటానికి మూడేళ్ళు పడుతుంది. జీవితం నాశనమైపోద్ది. కోర్టు చుట్టూ తిరగటానికి  నీ జీవితం సగం గడిచిపోద్ది. జైల్లో నీ కొవ్వణుస్తారు. మరేంటి  కేసేడదామా “అంది ఇనస్పెక్టర్‌ గుడ్లు పెద్దవి చేస్తూ ..

వాడు ఏడవటానికి సిద్ధమౌతున్న కళ్ళను కర్చీఫ్‌తో వత్తుకుంటూ ‘అమ్మా’ అన్నాడు , వాడి నొప్పంతా ఆ పిలుపులో వినిపించేసరికి నాకు గొంతు చేదుగా అనిపించింది .  చిన్న వణుకు కనిపిస్తోంది వాడిలో.

‘498  పెట్టాల్సినంత ఏం జరగలేదు మేడమ్‌. ఏదో చిన్న గొడవ’ అన్నాన్నేను.

నువ్వెవడివిరా మధ్యలో అన్నట్లు చూసింది నావైపు. ‘నేను తన క్లాస్‌మేట్‌ను మేడమ్‌. వాడు చిన్నప్పటినుంచీ తెలుసు. భార్యాభర్తల గొడవ. చెయ్యి చేసుకోవడం తప్పే. కాని ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. ఇకమీదట జరగదు. ఏదో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నాం మేడమ్‌. కేసులూ, కోర్టులూ అంటూ తిరగలేం. పిల్లలున్నారు. మీరే కనికరం చూపాలి’’ సాధ్యమైనంత వినయాన్ని తెచ్చిపెట్టుకుని, నా నటనాకౌశలం  అంతా చూపించాను.

ఎవరేం మాట్లాడలేదు.

‘చూడండి సిస్టర్‌.. మీరే కొంచం ఆలోచించండి. తనెలాంటి వాడో మీకంటే ఎవరికి ఎక్కువగా తెల్సు? కొట్టడం తప్పే. కానీ’ వాడి భార్యతో చెప్తూ ఏం మాట్లాడాలో తెలీక ఆగిపోయాను.

‘హలో, ఇలాటివన్నీ స్టేషన్‌కు రాకముందు చూస్కోవాలి. ఇక్కడ మేమున్నాం కదా… ఇగో పెద్దాయనా… ఏం చేద్దాం.. కేసు బుక్‌ చెయ్యమంటే చేస్తా. ప్రెస్‌ వాళ్ళు కాసేపట్లో వస్తారు. ఈ న్యూస్‌ ఐటమ్‌ కూడా ఇచ్చెయ్యొచ్చు ’ అంది ఇనస్పెక్టరమ్మ.

వాడు విలవిలలాడేడు. ‘‘మేడమ్‌. అసలు సమస్య నాకూ మా ఆవిడకూ కాదు. మాకసలు ఏం గొడవ లేదు. ఇదంతా వాళ్ళ నాన్న వల్ల’’ వాడు దు:ఖంతో ఆగిపోయాడు.

నాకు లోపల్నుంచి జాలి తన్నుకొచ్చింది. పాపం ఏడవలేడు. మాట్లాడలేడు. మగవాడు గట్టిగా ఏడవకూడదేమో కదా..

వాడి  మామ అందుకున్నాడు ‘‘ఇదే మేడమ్‌.. నగలు విడిపించుకురమ్మని వేపుకు తింటున్నాడు. మాకు కష్టం అని నా బిడ్డ అడగలేదు. ఇంకంతే.. ప్రతీసారి ఆ సాకుతో మెంటల్‌ టార్చర్‌.. ఇగో ఇప్పుడు చేతులు విరగ్గొట్టేదాకా వచ్చింది, మీ ఇష్టం మేడమ్‌.. ఏమైనా చెయ్యండి. ఇంకోసారి నా బిడ్డమీద చెయ్యి పడకూడదు. నగ ఊసు రాకూడదు. అలాగంటే ఓకే. లేకపోతే ఏ కేసు పెట్టినా, ఇద్దర్నీ విడదీసినా పర్లేదు’’.

వాడి భార్య చటుక్కున తండ్రి వైపు చూసింది. ఎర్రగా ఉన్న కనుగుడ్లతో అతన్ని వారిస్తూ… ‘‘అవేం మాటలు నాన్నా’’ అంది.

‘‘అయ్యో.. నగలు సమస్యే కాదు మేడమ్‌.. నగలు అడిగింది కరెక్టే. కానీ అవి..’’ వాడు మాట్లాడుతుండగానే ఇనస్పెక్టర్‌ కస్సుమంది.

‘‘ఇగో చూడు. మొగుడూ పెళ్ళాల గొడవ, మొదటిసారి కొట్టావ్‌ అంటున్నారు కాబట్టి ఇలా ఉన్నా. లేకపోతే ఈ పాటికి నిన్ను మొలతాడు మీద కూర్చోబెట్టేదాన్ని. ఫైనల్‌గా చెప్తున్నా . ఇకమీదట ఆమె మీద చెయ్యి పడొద్దు. నగల టాపిక్‌ రావద్దు. ఇంకోసారి స్టేషన్‌కు రావద్దు. పోండి.. రైటర్‌ దగ్గరకెళ్ళండి. ఫార్మాలిటీస్‌ కంప్లీట్‌ చెయ్యండి.’‘అని వాళ్ళ మామ వైపు తిరిగి ‘‘ఓకే కదా ‘‘అంది.

వాళ్ళ మామకు ఈ తీర్పు నచ్చినట్లు లేదు. అయిష్టంగా తలూపాడు.

రైటర్‌కు ఫార్మాలిటీస్‌గా ఏడు వేలు, స్టేషన్‌ ఖర్చుకని వెయ్యి చెల్లించి అక్కడ్నుంచి బయటపడటానికి మాకందరికీ ఇంకో గంట పట్టింది. ఏవో సంతకాలు. నేనూ పెట్టాను. ఇప్పటికి గండం గడిచింది. . చాలు.. ఎంత తొందరగా ఇక్కడ్నుంచి బయటపడదామా అని ఉంది.

మామ, అత్త, వాడి భార్య ముగ్గురూ ఆటో ఎక్కారు. వీడితో కానీ నాతో కానీ మాట్లాడలేదు.

‘నేనెళ్ళనా’ అన్నాను.

‘కాసేపుండొచ్చు కదరా.. మాట్లాడదాం.. ’ అన్నాడు వాడు. జేబులోంచి కారు తాళాలు తీస్తూ..

‘ఏమైనా తిన్నావా’

నిజానికి నాకు ఆకలిగా ఉంది. చాలా సేపట్నుంచి సిగిరెట్‌ కూడా లేదు. ఈ ఆకలి మీద మంచి రవాదోశ తిని ఒక టీ తాగి, సిగిరెట్‌ ఒకటి తాగితే… చా…లా బావుంటుంది.

‘తిందాం పద’ అన్నాడు వాడు. కారెక్కాను.

తినే ప్లాను రెస్టారెంట్‌ కనపడక బార్‌ రెస్టారెంట్‌ కన్పించడంతో తాగుడు మరియు తినటం అనే ప్లాన్‌గా రూపాంతరం చెందింది. రవాదోశ కన్నా బీరుతో పెప్పర్‌ చికెన్‌ బావుంటుంది. నిస్సందేహంగా..

బార్ లో జనం పల్చగా ఉన్నారు . మూలన టేబుల్‌. కూర్చున్నాం. తాగటానికీ తినటానికీ ఆర్డరిచ్చి, సిగిరెట్‌ వెలిగించి నేనే మాటలు  మొదలెట్టాను.

‘‘చూడ్రా… గొడవ పెద్దదవ్వలేదు. సంతోషం. లేకపోతే ఈ పాటికి ఏం జరిగేదో.. క్లాస్‌లో అందరికీ నీమీద మంచోడు అనే అభిప్రాయం. మన ఫ్రెండ్సందరూ నిన్ను పప్పుగాడంటారు. ఏదో పరిస్థితులు. మీ మామ ఇస్తానన్న నగలు ఇవ్వలేదు. వాటికోసం ఇన్ని సంవత్సరాలు గొడవపట్టం ఏంటి. మీ ఆవిడ్ని కొట్టడం ఏంటి? నేనొచ్చాను కానీ నాకెవరు తెల్సు ఇక్కడ. ఏమీ చెయ్యలేను నేను. తోడుగా వచ్చాను. రెండోసారి పిలిస్తే రాగలనో.. లేదో.. నీకు తెలీంది కాదు. ప్రైవేటు ఉద్యోగాలు. . ఇక మీదట గొడవలొద్దు.. ఇద్దరూ ఏదైనా హాలిడేకు ఓ రెండ్రోజులెళ్ళండి.. నేను ప్యాకేజీ బుక్‌ చేస్తాను’’ అన్నాను.. భార్యాభర్తల గొడవ తరువాత ట్రిప్పుకెళితే గొడవలు సమసిపోతాయని, ఆహ్లాదంగా ఉంటుందని ఈ మధ్య ఎక్కడో చదివిన ఆర్టికల్‌ను గుర్తు చేసుకుంటూ..

వాడు తలెత్తి దెబ్బతిన్నట్లు చూశాడు ‘‘నీకేం తెల్సురా… అసలు విషయమేంటో  తెలుసా’’

వెయిటర్‌ సరంజామా తెచ్చి సర్దాడు. బీర్‌ను గుటకేస్తూ అడిగాను.

‘‘అంటే’’

‘‘నగలు … నగలు అని మాట్లాడుతున్నారు కదా.. అవేం నగలో తెల్సా’’

‘‘నీ పెళ్ళికి మీ అత్తవారు పెడతానన్న బాలెన్స్‌ .. అంతేగా’’..

వాడు నావైపు అసహ్యకరంగా ఓ చూపు చూసి

‘‘కాదు. నా సంపాదనతో నా భార్యకు, కొడుక్కి  నేను కొన్న  నగలు.. నాకు తెలీకుండా వాళ్ళ నాన్నకు ఆమె ఇచ్చిన నగలు.. ఆరేళ్ల క్రిందట వాడు అవి తాకట్టు పెట్టి ఇప్పటికీ విడిపించని నగలు.. ’’ గుడ  గుడా ఒక మగ్గు బీరు తాగేసి క్రింద పెట్టాడు, ఎర్రబడిన కళ్ళతో.

నేను గతుక్కుమన్నాను. కథ పూర్తిగా కొత్తగా ఉంది.

‘‘మరైతే ఆ విషయం స్టేషన్‌లో చెప్పవేం’’ అన్నాను.

‘‘ఎక్కడ చెప్పనిస్తున్నారు. ఆడది ఒక మగాడి మీద కంప్లైంట్‌ ఇస్తే చాలు. వాడో శాడిస్టు… వెధవ.. పుండాకోర్‌ గాడు.. వాడేం చెప్పినా అబద్ధం.. వాడ్నసలు మాట్లాడనిస్తున్నారా.. ఇందాక ఇనస్పెక్టర్‌ ఏమైనా అడిగిందా .. ఇలా జరిగిందట.. నిన్ను బొక్కలో తొయ్యాలా, లేక నోర్మూసుకుంటావా అని ఆప్షనిచ్చింది. మగోడికి ఆత్మ ఉండదు… మనసు ఉండదు.. వాడో రాయి.. చెత్త. ఇదేగా మనకున్న మర్యాద.. మగాడి కోసం చట్టాలే లేవు కదరా… ఒకటే చట్టం. మగాడంటే వాణ్ణి తిట్టు.. సాహిత్యంలో వాడ్ని మృగం అని రాయి.. కొత్తగా మృగాడు అనే పదం కనిపెట్టారు తెలుగు పత్రికల్లో .  సినిమాల్లో వాడ్ని ఆడదాన్ని హింసించినట్లు చూపించు, వాడు తాగుబోతు, తిరుగుబోతు, రాత్రిళ్ళు ఇంటికి లేటుగా వస్తే వాడు కులుకుతున్నట్లు, చిన్నప్పటి స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్తే వాడు బేవార్స్‌. కుటుంబాన్ని పట్టించుకోడు. ఇవే కదరా బిరుదులు . మగాళ్లలో మా మామా ఉన్నాడు.. నేనూ ఉన్నాను.. ఇద్దరినీ ఒకేలా చూస్తుంటేనే చచ్చిపోవాని అన్పిస్తుందిరా.. నేనూ.. ఊ..’’ వాడు ధారగా కారుతున్న కంటిలోని ఊటను కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు.

నేను మౌనంగా కూర్చున్నాను.. మాట్లాడటానికేం లేదు.

వాడు  కళ్ళు తుడుచుకుంటూ, తాగుతూ, కళ్ళు తుడుచుకుంటూ మరి కాసేపటికి తెరిపిన పడ్డాడు. ప్రశాంతంగా ఉన్నాడు. బీరు పనిచేస్తోందా ? ఏడ్వటం వలన దిగిపోయిన భారమా?

వెయిటర్‌ మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ‘‘రిపీటా’’ అడిగాడు. బహుశా మగవాడు ఏడవటం అన్నది అతగాడికి ప్రోగ్రాం చెయ్యబడలేదనుకుంటా.. అతనికేంటి.. జనాభాలో తొంభైశాతానికి ఏడ్చే మడాగంటే లోకువే కదా..

‘నేనింక తాగను.. ఇంటికెళ్ళాలి’ అన్నాడు వాడు..

‘సరేలే .. కూర్చో.. కానీ ఆ నగల గొడవేదో పూర్తిగా చెప్పు .. తల పగిలిపోతోంది నాకు’’ అన్నాను.

వాడు ముందుకు వంగి, టేబుల్‌ మీద మోచేతులు ఆనించి, నా కళ్ళలోకి చూస్తూ చెప్పటం మొదలెట్టాడు.

‘‘నీకు తెల్సుకదా.. మాది అరేంజ్డ్‌ మారేజ్‌.. కట్నం వద్దనుకున్నాం. పెళ్లి ఖర్చులు సగం సగం అనుకున్నాం .మా పెళ్లి బానే జరిగింది .  అప్పుడు నేను మెడికల్‌ రెప్‌ను. పెళ్ళయిన రెండేళ్ళకు ప్రమోషన్‌ వచ్చింది. ఈ మధ్యకాలంలో నాకర్ధమైందేంటంటే మా మామ ఏపనీ చెయ్యడు. ఎప్పుడో ఎనభై నాలుగులో .. చేస్తున్న మున్సబు పనిని ఎన్‌.టి.ఆర్‌. తీసేసిన తర్వాత ఏం చెయ్యట్లే… ఏవో వ్యాపారాలంటాడు, కాంట్రాక్టులంటాడు, రాజకీయాలంటాడు, ఖద్దరు చొక్కా విప్పడు, క్రాపు చెరగదు.. అవన్నీ జరగాలంటే సంపాదనుండాలి. ఇప్పటిదాకా చేసిన కాంట్రాక్టులన్నీ లాసే.. తిరుగుతూ ఉంటాడు. పేకాటొకటి.. సంపాదించినదంతా సర్వనాశనం అయింది. రొటేషన్‌ చేస్తుంటాడు.. ఊర్నిండా అప్పు. ఒక తమ్ముడున్నాడీమెకి.. చదువుతున్నాడు.

తల్లికీ, కొడుక్కీ మాట్లాడే హక్కు గానీ, ధైర్యం గానీ లేవు. ఆ అబ్బాయి ఏదో జాబ్‌ చేస్తున్నాడు. ఇల్లు గడుస్తుంది. నాకో, నా భార్యకో, నా కొడుక్కో ఏ అచ్చటా ముచ్చటా లేదు అత్తగారింటినుంచి. నాకు కంప్లైంట్స్‌ కూడా లేవు. ఎవరి బ్రతుకు వాళ్ళది. ఎప్పుడైనా మేమెళ్తాం .. లేదా ఆమె, బాబు వెళ్తారు. అప్పుడప్పుడూ వాళ్ళొస్తారు. నాలుగు పూటలు వండుకుని తింటాం. అంతే. . నీకు తెలీందేముంది. నాకు జాబ్ లో విపరీతమైన ప్రెజర్‌.. టార్గెట్స్‌.. అన్నీ తట్టుకున్నా. . సంపాదన పెరిగింది.. భూములు కొనలేను.. ఏదో ఓ ప్లాట్‌ కొన్నా నాచారంలో.. లోన్లు.. శాలరీ డిడక్షన్‌.. గుట్టుగా కాపురం చేసుకుంటున్నా.. ఈ ఏడేళ్ళలో మూడు ప్రమోషన్లు.. ఏమ్మిగిలినా బంగారం కొనటం అవాటు. బాబు పుట్టిన తర్వాత.. డాక్టర్స్‌ కాన్ఫరెన్సుకు సింగపూరెళ్ళినపుడు వస్తూ వస్తూ మూడు తులాల  హారం, తులంన్నర చెవుల్లోకి  కొన్నా.. డబ్బు చాలకపోతే తెల్సిన డాక్టర్‌ దగ్గర తీస్కుని మరీ.. నాకు చాలా ఇష్టం. ఆమె పెట్టుకుంటే చాలా బావుంటాయ్‌ రా.. బయటకెళ్ళినపుడు ఎక్కడ కొన్నారని  అందరూ అడిగేవారు.. .. నాకు చాలా హాపీగా ఉండేది.. సడెన్‌గా పెట్టుకోవడం మానేసింది.. ఎప్పుడడిగినా ఇదిగో అదిగో అనటం తప్ప విషయం చెప్పలేదు. ఒకసారి గట్టిగా అడిగితే చెప్పింది. మా మామ ఏదో కోల్‌ బిజినెస్‌కంట… కావాలనీ, నెల్లో విడిపిస్తాననీ ఇంట్లో ఉన్న బంగారంలో 18 తులాలు తీసుకెళ్ళాడు, నగలు, బాబు మెళ్ళో కొన్న చైన్‌ సహా. తండ్రీ కూతురూ గుట్టుగా ఉంచుదామనుకున్నారు. ఆ కోల్‌ బిజినెస్‌ దొబ్బింది. ఎప్పట్లాగే… ఇదిగో.. అదిగో అంటాడే తప్ప క్లారిటీ లేదు.. నాకింతలో… ’’

నా ఫోన్‌ మ్రోగింది. మా ఆవిడ… అనకాపల్లి కార్‌ కోసం.. మర్చేపోయాను. వైజాగ్‌లో మా ఏజంటుకు  కు ఫోన్‌చేసి కారునూ, డ్రైవర్‌నూ పురమాయించి మా ఆవిడకు చెప్పినప్పటికి కొంత సమయం పట్టింది .  రెండో బీర్‌ను మగ్గులో పోసుకుంటూ వాడివైపు చూసాను.. చెప్పమన్నట్లు.

వాడు కొనసాగించాడు ‘‘మా ఏరియా మేనేజరొకడు చిన్న మెడిసిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ మెదలెడదాం.. పార్టనర్‌షిప్‌కొస్తావా అన్నాడు. జెనరిక్‌ మెడిసిన్‌.. మంచి ఫ్యూచరుంటుంది. మూడు లక్షలు కావాలి. నా దగ్గర బంగారం తప్ప ఇంకేం లేదు.. ఫ్రెండ్స్‌ తక్కువ.. బంగారం ఏ ముత్తూట్‌లోనో పెడదామంటే మా మామగాడు ఉలకడు, పలకడు.. నా కళ్ళముందే మేనేజర్‌ మంచి లాభాలు చూసాడు..ఇప్పుడు సర్జికల్స్ డిస్ట్రిబ్యూషన్  కూడా మొదలెట్టాడు.   అక్కడ్నుంచీ ఎప్పుడూ ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంది. బంగారం ధర పెరుగుతూనే ఉంది. తండ్రంటే ప్రేమ.. మా ఆవిడ ఏమీ అనదు. నేను బాబు తన కుటుంబం అనుకోదు.. ఎప్పుడూ వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు.. మరి నేనెవరు? ఫ్రస్ట్రేషన్‌లో రెండు మాటలు వస్తాయ్‌ కదా.. మా మామ ఎంత తెలివైనోడంటే ఈ ఇష్యూని నేనేదో నగల కోసం వేధిస్తున్నానన్నట్లు మసి పూసి.. మా ఆవిడకు నిజంగా నేనో పిశాచిని అన్నట్లు ఒక అభిప్రాయం కల్పించాడు. బయటంటే.. ఇందాక చూశావు కదా.. స్టేషన్లో.. అలా అన్నమాట.. మొన్న రాత్రి మాటా మాటా పెరిగింది. మా ఆవిడేమందో తెల్సా ‘‘ఆ నగలు మర్చిపోండి. మా నాన్నకు కలిగినపుడు అంతకంటే మంచివి చేయిస్తారు. లేకపోతే డబ్బు మీ మొహాన కొడ్తారు’’ అంది.  అంటే నగలు మునిగిపోయి వేలంకెళ్ళినట్లే కదా.. నాకు పూనకం వచ్చింది  కంట్రోల్ తప్పిపోయాను.  మొదటిసారి  కొట్టాను. 18 తులాల్రా.. నాలాంటోడి సంపాదన.. ఎండలో.. వానలో.. ఈ ట్రాఫిక్ లో బండి ని నెట్టుకుంటూ , నీలుక్కుంటూ , డాక్టర్ల క్లినిక్కు వరండాల్లో నిలబడీ నిలబడీ, రక్తం మరగబెట్టి అవమానాలు పడి సంపాదించింది.. ఇప్పుడేమో ఇంక నేను మాట్లాడకూడదని 498 పెట్టి నా నోరు మూసేయిస్తాడన్నమాట. ఇది నా మీద జరుగుతున్న ఎమోషనల్‌ రేప్‌ కాదా?.. అన్నింటికంటే బాధేంటంటే వాడి తప్పు కప్పి పుచ్చుకోవడం కోసం, ఇంక ఆ నగలు విడిపించలేనని తెలిసీ.. నా భార్యను కూడా ఏదో మందు పెట్టినట్లు వాడికి అనుకూలంగా మార్చుకుని… ఇదిగో ఇలా కేసు పెట్టించి ’’.. గుడ్లనిండా నీళ్లతో వాడు మాట్లాడలేక ఆగిపోయాడు.

నాకు కడుపు రగిలిపోయింది వింటుంటే.. వాడి కళ్ళు చూసి కదిలిపోయాను..

‘‘ఊర్కో రా, ఏడవకు, ఏంటిది చిన్నపిల్లాడిలా ’’

వాడు సర్దుకున్నాడు . ‘‘థాంక్యూ రా.. నువ్వొచ్చావు.. నీతో చెప్పుకుంటే కొంచం ఫ్రీగా ఉందిప్పుడు.. మరేం చెయ్యమంటావ్‌ నన్ను.. ఇంక ఆ నగలు అడగొద్దా’’బేలగా అడిగాడు.

‘‘వెయిట్‌ చెయ్‌.. టైమొచ్చినపుడు అడగాలి.. ఇప్పుడు కొన్నాళ్ళు ఆ టాపిక్‌ ఎత్తకు.. బాబు డిస్ట్రబ్‌ అవుతాడు. వెళ్దామా’’

లేచాం.. వాడు నన్ను మళ్ళీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర దించాడు. ఆ మర్నాడు వాడికి ఫోన్‌ చేశాను. అంతా మాములుగా ఉందని, అత్తా మామా బయల్దేరారనీ చెప్పాడు. ఆ సాయంత్రం నేను శ్రీలంక వెళ్ళాను. నాల్రోజుల  తర్వాత వచ్చాను. వాడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తరువాత ఇంకో రెండ్రోజు తర్వాత.. స్విచ్ఛాఫ్‌.. ఇల్లు తెలీదు.. ఏమైందో తెలీదు..

ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ను  విషయం చెప్పకుండా వాకబు చేశాను.. ఫలితం లేదు.

ఆ తరువాత నాల్రోజులకు మా క్లాస్‌మేట్‌ ఫోన్‌ చేశాడు.. సారంశం ఏంటంటే వీడ్ని రిమాండ్‌లో ఉంచారు.. ప్రస్తుతం రాజమండ్రిలో జైల్లోనే ఉన్నాడు.. కేసు ఆ ఊరిలో  పెట్టారంట.. ఏవేవో చెప్పాడు. కేసు మాత్రం అదే..

గృహహింస.. మూడేళ్ళంట.. బెయిల్ కోసం వాళ్ళ నాన్న గారు ప్రయత్నిస్తున్నారు . వస్తుందో రాదో తెలీదు  .వాడి భార్యకు కాలు విరిగిందంట. బాబుతో కలిసి వాళ్ళ పుట్టింట్లో ఉంటుందంట.. వగైరా.. వగైరా.. ఫోన్‌ పెట్టేశాను.

బుర్ర మొద్దుబారిపోయింది. వెళ్ళి వాడిని కలవానిపించింది. ఈ వారం.. ఆ వారం .. అనుకుంటే కుదర్లేదు. పని, ఒత్తిడి, సీజన్‌ టార్గెట్‌లు, కుటుంబం, చికాకు, నెలలు గడిచాయి. నేను వాడిని మర్చిపోయాను దాదాపుగా. రెండేళ్లు పండక్కి ఊరెళ్ళలేదు. ఆ తర్వాత  సంవత్సరం ఊరికెళ్ళగానే వాడు గుర్తొచ్చాడు. ఒకపూట ఇంట్లో ఉండి, పలకరింపులు, భోజనాలు, ఒక గంట నిద్రయ్యాక మా ఫ్రెండ్‌తో కలిసి వాళ్ళింటికెళ్ళాను. వాళ్ళమ్మగారున్నారు. వాడు డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్  లో  ట్యూటోరియల్‌ నడుపుతున్నాడని చెప్పిందామె. ఏదో పచ్చరంగు పాంప్లెట్‌ తెచ్చిచ్చింది. పంచదార, నిమ్మకాయి కలిపిన నీళ్ళు తాగి పాంప్లెట్‌ను జేబులో పెట్టుకుని బయలుదేరాం. వాడితో ఫోన్‌లో మాట్లాడటానికి గిల్టీగా  ఉంది. నేరుగా వెళ్ళిపోతే?  బైకు తీసుకుని బయుదేరాను. ఎంత. అరవై కిలోమీటర్లు గట్టిగా పోతే గంటన్నర.

టౌను చేరుకుని, ఆ ట్యూషన్‌ సెంటర్‌ను పట్టుకోవడానికి ఇంకో పావుగంట. కొంచం పాత బిల్డింగే .. కానీ మెయిన్ రోడ్డుమీద ఉంది . ట్యూషన్‌  సెంటర్‌ మొదటి అంతస్తులో ఉంది. సాయంత్రం ఏడున్నర.. లైట్లు వెలుగుతున్నాయి. మెట్లెక్కుతుంటే ఏదో తెలీని భయమో, గుబులో, ఉద్వేగమో తెలీని ఒక ఫీలింగ్‌.. చిన్న బోర్డు మీద ‘‘విరించి ట్యూషన్స్‌’’కు దారి అని బాణం గుర్తు మెట్ల మలుపులో, దారి చూపిస్తోంది.

‘‘విరించి’’ వాడి కొడుకు పేరు కదూ..

సన్నని కారిడార్ కు ఆనుకుని అదో చిన్న హాలు. గోడ నిండా ఏవేవో పోస్టర్లున్నాయి. వివేకానందుడి కొటేషన్స్‌, గాంధీ, కలామ్‌ ఫోటోలు.. ఒక అమరిక లేకుండా.. ప్లాస్టిక్‌ కుర్చీల్లో ఒక పదిహేను మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి శ్రద్ధగా వింటూ, మధ్యలో రాసుకుంటున్నారు. వాళ్ళకెదురుగా గోడకు ఉన్న తెల్ల బోర్డు మీద మార్కర్‌తో.. కెమిస్ట్రీను ఆశువుగా పాఠం చెప్తూ… రసాయనాలను వివరిస్తూ.. వాడు…

నేను చిన్నగా దగ్గాను. అలికిడికి అందరూ నా వైపు చూశారు. చాలా ఇబ్బంది గా అనిపించింది.  వాడు గుర్తుపట్టినట్లు కళ్ళు పెద్దవి చేసి ‘‘రా రా.. ఎప్పుడొచ్చావ్‌.. సర్‌ప్రైజ్‌ ‘‘అన్నాడు.

నేను తలూపాను. ‘‘ఒక్క పదినిముషాలు కూర్చో.. అయిపోయింది. వచ్చేస్తా ‘‘అన్నాడు.

నేను బయటకొచ్చి మొదటి అంతస్తు నుంచి రోడ్డునూ, తిరుగుతున్న వాహనాలనూ, వాటి లైట్లనూ, మనుషులనూ చూస్తూ నిల్చున్నాను.. ఏం మాట్లాడాలి ?

పది నిముషాల తర్వాత వాడొచ్చాడు. రావటం తోనే గట్టిగా కౌగిలించుకున్నాడు.

‘ఎలా ఉన్నావ్‌ రా. ఎప్పుడొచ్చావ్‌’

‘ఊ .. బావున్నాను. నువ్వు’

‘నాకేం … సూపర్. పద.టీ తాగుదాం .. ’

‘‘వద్దులే, ఇక్కడే కూర్చుందాంరా’’  పిల్లల కోసం ఉన్న ప్లాస్టిక్‌ కుర్చీల్లో ఇద్దరం కూలబడ్డాం. చాలా సేపు మౌనం. ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాలి కదా..

‘‘ఏమయ్యిందిరా.. ఫోన్‌ కూడా లేదు.. ఏం జరిగిందో తెలీదు. నేనూ ఈ మధ్య  ఊరికి రాలేదు ’ ఏదో మాట్లాడాలి కాబట్టి అన్నాను.

వాడు చాలా మామూలుగా ‘ఏం చెప్పటానికి లేదు రా.. అంతా ప్లాన్డ్‌.. ఆ తర్వాత రోజు   హైద్రాబాద్‌ నుండొచ్చి వైజాగ్‌లో ఎవరో లాయర్‌ను పట్టుకున్నారు. నాకు చెప్పకుండా మా ఆవిడ బాబుతో,  వైజాగెళ్ళిపోయింది. నేనెళ్ళాను.అక్కడ కేసుపెట్టారు. లాయర్‌ను బాగా తడిపాడు. పోలీసుల్ని కూడా.. వాడికి కావల్సింది కూతురి కాపురం కాదు. ఆ నగలో, లేక దాని బదుగా డబ్బో ఇవ్వకుండా తప్పించుకోవడం. తప్పు ఒప్పుకోవడానికి ఈగో.. రొచ్చులో కూరుకు పోయాడు. ఆ రొచ్చే సుగంధం అని నమ్మించడానికి ఆత్మవంచన. 498 పెట్టారు. నాకు మూడేళ్ళు పడింది. అంతా నాశనం అయిపోయింది. విడాకులైపోయాయి. బాబు సెకండ్‌క్లాస్‌. ఎప్పుడైనా చూడానిపిస్తే వెళ్ళి వరండాలో మాట్లాడి వచ్చెయ్యటమే. ఇప్పుడు మా ఆవిడ కూడా జాబ్‌ చేస్తోంది. కొడుకు, కూతురు తెచ్చే జీతంతో అతగాడు విలాసంగా ఉన్నాడు. ఇంక దేనిమీదా ఇంట్రస్ట్‌ లేదురా.. ఏముంది చెప్పు’’ చెప్పి శుష్కంగా నవ్వాడు. ‘‘ఫ్లాట్‌ అమ్మేసి కొంత డబ్బు బాబు పేరున వేశాను. కొంత బ్యాంకే తీసుకుంది. మిగిలిన డబ్బుల్తో ఇదిగో ఇక్కడ ట్యూటోరియల్‌ మొదలు పెట్టాను. పొద్దున్న, సాయంత్రం మూడేసి గంటలు. బానే ఉంది. నాలుగు వేళ్ళు నోట్లోకెళ్ళాలి కదా.. మనూర్లో ఉండానిపించలేదురా. ఎవరికీ నా పెయిన్‌ అర్థం కాదు. నేనేదో శాడిస్టునన్నట్లు చూట్టం… అందరికీ ఎక్స్ ప్లెయిన్  చేసేంత ఓపిక లేదు. అందుకే ఇక్కడ… ఇలా.. ప్రక్కనే రెండు వీధుల  తర్వాత రూమ్‌. . అలవాటైపోయింది. అమ్మా నాన్న అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటారు. సరేలే.. ఇంకేంటి.. వదిలెయ్‌.. మీ ఫ్యామిలీ ఎలా ఉంది’’ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు.

‘‘ఊ .. బానే ఉన్నారు. పాప కూడా స్కూల్‌కెళ్తోంది’’ ముక్తసరిగా చెప్పాను.

మళ్ళీ మౌనం.

‘‘మరి బయల్దేరతాన్రా’’ వాచీ చూసుకుంటూ చెప్పాను. తొమ్మిదవుతోంది. చీకట్లో వెళ్ళాలి.

వాడు బండి వరకూ వచ్చి వీడ్కోలు చెప్పాడు. పరిశీలనగా వాడ్ని అప్పుడు చూశాను.

వాడు ముందుకంటే లావయ్యాడు. కళ్ళలో ఆ కళా కాంతీ లేవు. మామూలుగానే ఉన్నాడు. కానీ చిన్నప్పట్నుంచీ నేను చూసినట్లు లేడు. బట్టలు చాలా సాదాగా ఉన్నాయి. వాడి శరీరం పొలుసు కట్టింది. వాడు జరిగింది చెప్పేటప్పుడు మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంటాడేమో అని భయపడ్డాను. కానీ అలా జరగలేదు. బహుశా వాడు ఏడవటం మానేశాడో.. కన్నీళ్ళు ఎండిపోయాయో.. తెలీదు. ఇంకా ఏదో లోపం కన్పించింది వాడి మొహంలో.. ఏంటది? ఏంటది? కనిపెట్టాను.

వాడి కనుబొమల మధ్య, కళ్ళద్దాల ఫ్రేముకు పైన ఎప్పుడూ ఉండే ఆంజనేయస్వామి సిందూరం లేదు.

కంకాళశాల
అది కాటికాపరి విజిల్‌లా లేదు, శ్మశానంలో నక్కల ఊళలా ఉంది.

‘విశాల గదులు- సకల సదుపాయాల’ ప్రకటనల్ని వెక్కిరిస్తూ డార్మిటరీలన్నీ మంచాలతో కిక్కిరిసి ఉన్నాయి. సుడిగాలికి సురసురా లేచిన బూడిదమేఘాల్లా దుప్పట్లు లేచి అవతల పడ్డాయి.

మంచాల మీంచి అస్థిపంజరాలు నిటారుగా లేచి నిలబడ్డాయి. తెల్లటి ఎముకలతో కూడిన కాళ్లను నేల మీద తాటించి, బిలబిలమంటూ ఆ ఫ్లోర్‌లో ఒక మూలనున్న అతిపెద్ద ఫ్రీజర్‌ దగ్గరకు పరిగెత్తాయి.

క్యూలో నిలబడి, తమ వంతు రాగానే బార్‌కోడ్‌ ఆధారంగా తమ తలల్ని తగిలించుకుని, మళ్లీ గదుల వైపు పరిగెత్తాయి.

గోడకు తగిలించిన అద్దం ముందు నిలబడి, తేరిపార చూసుకుంది ఓ అస్థిపంజరం.

సందేహం లేదు, తన మొహమే! ఆరోజుకి నిర్ధారించుకున్నాడు విశ్లేష్‌.

తను అక్కడికొచ్చిన కొత్తలో బాగానే ఉండేవాడు. తల, చర్మం, సకల అవయవాలు, రక్తమాంసాలు… అన్నీ నిశ్చయంగా ఉండేవి. తనేమిటి? అందరూ అలాగే ఉండేవారు.

రెండుమూడు రోజులు గడిచాయో లేదో, కాటికాపరి తన భాషలో ఏదో చెప్పాడు. తను వినలేదు.

ప్రేతాలు చెప్పాయి; వినలేదు. భూతాలు చెప్పాయి; పట్టించుకోలేదు.

కానీ, ఒక్కో రాత్రి గడిచేకొద్దీ తలలో తుపాన్లు ఎక్కువయ్యేవి. మెదడులో అగ్నిపర్వతాలు బద్దలయ్యేవి. పిచ్చిపిచ్చి ఆలోచనలేవో చితిమంటల్లా ఎగసిపడేవి. నిద్ర పట్టేది కాదు. గబుక్కున లేచి కూచునేవాడు. చుట్టూ మంచాలు నిద్రాసనాల్లో మునకలై కనిపించేవి.

ఓ భయంకర పగటివేళ తన ఘోషను సీనియర్‌ ప్రేతేష్‌తో మొర పెట్టుకున్నాడు.

”ఒరే డింగరీ! ‘తల’నాత్మక పరిశీలనను ఈ శ్మశానాధీశులెవ్వరూ క్షమించరుగాక క్షమించరు”.

”ఒక్క ముక్క అర్థంగాలా…” బిక్కమొహం వేశాడు విశ్లేష్‌.

”తలలు తీసి మంచుపెట్టెలో పెట్టి పడుకుంటుంటే, మమ్మల్నందరినీ పిచ్చనాయాళ్లనుకుంటున్నావు కదూ” నవ్వు, కోపం కనిపించని కళాత్మక సౌందర్యంతో చెప్పాడు ప్రేతేష్‌.

అప్పట్నుంచీ తను కూడా రాత్రి పడుకోబోయే ముందు తల తీసి ఫ్రీజర్‌లో పెట్టడం అలవాటు చేసుకున్నాడు. పంచేంద్రియాల పనితనం మంచులో కప్పబడిపోవటంతో తుపాన్లు, అగ్నిపర్వతాల బెడదలేని విచిత్ర లోకంలో నిద్రపోయే అదృష్టానికి నోచుకున్నాడు.

విశ్లేష్‌ మెల్లగా మునివేళ్లపై కాళ్లు పైకి లేపాడు. అద్దంలో గొంతు కింది భాగం నుంచి తెల్లని ఎముకలు కనిపిస్తున్నాయి. చర్మపుతొడుగు లేని తల కింది భాగాన్ని చూసుకునే ధైర్యం లేక గభాల్న కాళ్లు దించేశాడు.

”మొహానికేం ఢోకా లేదు. బానే ఉందిలే. నడువ్‌ వాష్‌రూములోకి” కాటికాపరి గట్టిగా అరిచాడు.

గబగబా అక్కణ్నుంచి వాష్‌రూముల వైపు పరుగు తీశాడు విశ్లేష్‌.

వచ్చిన కొత్తలో ఓ రాత్రి గభాల్న మెలకువ వచ్చింది. బెడ్‌లైటు వెలుతుర్లో కళ్లు చిట్లించి చూశాడు. ఓ దెయ్యం తన మంచం పక్కనే నిలబడి ఉంది. కంపు కొడుతోంది. కడుపులో దేవుతోంది. ఘ్రాణనాడులు ఏ క్షణమైనా తుత్తునియలయ్యే ప్రమాదాన్ని పసిగట్టి పక్క మంచం మీద పడుకున్న ప్రేతేష్‌ను తట్టి లేపాడు.

”బడుద్ధాయ్‌! మనల్ని సెంటు వాడనివ్వరు. దీంతోనే సరిపెట్టుకోవాలి. అది దెయ్యం కాదు, వాష్‌రూముల్లోంచి వస్తున్న కంపు. పెద్ద టైమ్‌ పట్టదులే. త్వరగానే అలవాటు పడతావ్‌” తాపీగా చెప్పి, జాలీగా మళ్లీ ముసుగు తన్నాడు ప్రేతేష్‌.

మొహం తప్ప, ఎముకలేవీ రుద్దుకునే పనిలేదు కాబట్టి రెండు నిమిషాల్లో స్నానం కానిచ్చి, గదిలో తన షెల్ఫ్‌ దగ్గరకొచ్చాడు. కంకాళాన్ని ప్యాంటు, చొక్కాలతో ప్యాక్‌ చేశాడు.

నున్నగా తల దువ్వుకున్నాడు. మళ్లీ అద్దం ముందు నిలబడ్డాడు. ఇంకా మనిషి ఆనవాళ్లు మిగిలున్నందుకు మెదడులో ఏ మూలనో సంతోషం తాలూకు రసాయనిక చర్య పురుడు పోసుకుంది.

గదిలోని మరో ఏడు సహ అస్థిపంజరాలు కూడా తనలాగే తయారై అయిదు గంటలకంతా అధ్యయన శిబిరానికి చేరుకున్నాయి.

తలలన్నీ తన్మయత్వంతో తాళపత్రగ్రంథాల్లోకి దూరిపోయాయి.

ఓ యమభటుడు చేతిలో మారణాయుధంతో ఆ చివర్నుంచి ఈ చివరకు తిరుగుతున్నాడు.

‘తన్మయత్వం’ ఎక్కువై రెండు తలలు బొప్పి కట్టాయి. దిగ్గున పైకిలేచి, మాటలు పంచుకున్నాయి.

ఆ శబ్ద తరంగాలు త్వరితగతిన ప్రయాణించి, యమభటుడి కర్ణభేరీల్ని ఢీకొట్టాయి.

మారణాయుధం మహోగ్రరూపం దాల్చింది. రెండు తలలూ పచ్చడి కింద మిగిలాయి.

దాంతో మిగతా తలలన్నీ తన్మయత్వాన్ని తారస్థాయిలో సొంతం చేసుకుని, అధ్యయన బొరియలో మునిగిపోయాయి.

ఉదయం ఏడున్నర గంటలకు పళ్లేల మోతతో ఫలహారశాల దద్దరిల్లింది. కంకాళాలు కనీసం అక్కడైనా స్వేచ్ఛాగీతాన్ని ఆలపించాలని తరచూ పోరాటానికి దిగుతాయి. బుల్లి రాక్షసులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ పర్యవేక్షణలో నిమగ్నమవుతారు.

పళ్లేల జోరూ, పోరాట హోరూ కాసేపటికే చప్పున చల్లారిపోతాయి. రెండొందల నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇడ్లీలుగా మారిన ఇనపముద్దల్ని నమల్లేక, రాత్రి మిగిలిపోయిన అన్నంలో దిక్కుమాలిన దినుసులు కలిపి తయారు చేసిన కిచిడీ మింగలేక, ఉప్పు గుప్పించి వండిన ఫెవికాల్లాంటి ఉప్మా తినలేక… స్వాతంత్య్ర నినాదాలు మౌనం పాటిస్తాయి.

ఇక మధ్యాహ్నం… తుప్పు వాసన కొట్టే నీళ్లపప్పు, బొగ్గుముక్కల్లాంటి బెండకాయ వేపుడు, దుబాయ్‌ ఆయిల్లాంటి సాంబారు, పులిసిన మజ్జిగ! రాత్రి గురించి మాట్లాడుకునే ఓపిక, తీరిక ఒక్కరికీ ఉండవు.

క్రికెట్‌ బంతి లాంటి మైసూర్‌ బోండాని పరధ్యానంగా తింటూన్న విశ్లేష్‌ మెదడులో ఏవో సంభాషణలు రివైండ్‌ అవుతున్నాయి.

”భోజనం అస్సలు బాగోటం లేదు నాన్నా”

”నేనిప్పటికి నాలుగుసార్లు తిన్నా. చాలా బాగుందే”

”పేరెంట్స్‌ వచ్చేరోజు మనుషుల కోసం వండిస్తారు…” తను చెబుదామనుకునేలోపే ”అయినా, నువ్వు తింటానికొచ్చావా? చదువుకోటానికొచ్చావా?” తండ్రి ఆగ్రహజ్వాల.

”అరే విస్సూగా… నాకో పేద్ద డౌటురా. మనకిప్పుడు పొట్టలూ పేగులూ లేవుగదా! మరి మనం తిన్నది ఎక్కడికి పోతుందంటావ్‌?” పక్కనే కూచుని తింటున్న క్లాస్‌మేట్‌ భూతేష్‌ ప్రశ్న.

విశ్లేష్‌ ఏదో చెప్పబోయేలోపే అవతలి పక్క కూచున్న ప్రేతేష్‌ అందుకున్నాడు-

”పొట్ట విప్పిచూడ పురుగులుండు! అందుకే పొట్టలు తీసేశారు. పదార్థాల్ని ఎముకలు గ్రహించి, కాల్షియం ఫ్యాక్టరీల్ని స్థాపిస్తాయి”

వాడంతే. అద్భుతంగా మాట్లాడినట్లే ఉంటుంది; ఒక్క ముక్క అర్థమైచావదు.

ఉపాహార ఉదారవాదంతో లేని శక్తిని పుంజుకుని కంకాళాలన్నీ బయటికి నడుస్తున్నాయి.

”అరే, ఇవాళ ఎన్ని వికెట్లు డౌన్‌?” గుంపులోంచి ఎవరో అడిగారు.

”నాలుగు”

”ఎక్కడెక్కడ?”

”నారాయణగూడ బ్రాంచ్‌ రెండు, వైజాగ్‌ ఒకటి, కర్నూలు ఒకటి”

ఆ మాటలు వింటున్న విశ్లేష్‌కు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది.

తామంతా చర్మమాత్రులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంభాషణ నిత్యకృత్యం. తెల్లవారేపాటికి ఏయే బ్రాంచిలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఈ శాఖ విద్యార్థులకు సమాచారమందేది. టీవీ చూడనివ్వరు. ఫోన్లు వాడనివ్వరు. పేపర్లూ అంతంతమాత్రమే. అయినా పక్కా లెక్కలందేవి.

ఆత్మహత్యల కారణంగా తమకు అన్యాయంగా చెడ్డపేరు వస్తోందని యాజమాన్య దేవుళ్లు తెగ బాధపడిపోయి, చివరికి కోట్లు వెచ్చించి విదేశాల నుంచి అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేశారు. దాని సాయంతో పిల్లలందరినీ అస్థిపంజరాలుగా మార్చేశారు.

”అరే, నాకో డౌటు! స్కెలిటన్లు సూసైడ్‌ చేసుకోవటమేమిటి?” గుంపులోంచే ఎవరో అడిగారు.

”వెర్రి నాగన్నలూ… ప్రతి దానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. న్యూటనుడి మూడో సూత్రాన్ని అధ్యాపకుల కన్నా విద్యార్థులే ఎక్కువగా వంటబట్టించుకున్నారు. అప్పుడవి ఆత్మహత్యలూ… ఇప్పుడివి ప్రాయోపవేశాలూ…” ప్రేతేష్‌ మళ్లీ ప్రహేళికా భాషలో చెప్పాడు.

అస్థిపంజరాలన్నీ బుద్ధిగా తరగతి గదుల్లోకి నడిచాయి.

కొమ్ములూ కోరలూ పొడుచుకొచ్చిన వింత మానవులు బోధన మొదలెట్టారు.

ఆరోజు ఆదివారం. రెండు వారాల తర్వాత మరోసారి మనుషుల్ని చూడబోయే రోజు! అందరికీ తల నిండా సంతోషం. ఉదయపు అధ్యయన శిబిరం ముగియగానే, ఓ యమభటుడు మైకులో గొంతు చించుకున్నాడు.

”జాగ్రత్తగా వినండి. గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వెళ్లేముందు విధిగా ‘డిజిటల్‌ డిటెక్టర్‌’ లోంచే నడవాలి. మీ శరీరం మీకు వచ్చేస్తుంది. ఈ బాడీ డిజప్పియర్‌ టెక్నాలజీ (బీడీటీ) గురించి పేరెంట్స్‌కు చెప్పకండి”

అస్థిపంజరాలన్నీ అంతర్థానమై, విద్యార్థులంతా మనుషుల రూపంలో కిందికి చేరుకున్నారు.

తిరిగొచ్చిన తన రూపాన్ని మురిపెంగా చూసుకుని, పరుగున తన కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు విశ్లేష్‌. తల్లి గుండెలకు హత్తుకుని, నుదుటి మీద ముద్దు పెట్టింది. తండ్రి నవ్వాడో లేదో కనిపెట్టడం కష్టమైంది.

కుశలప్రశ్నలు క్లుప్తంగా ముగిశాయి. మార్కుల గురించి పోస్ట్‌మార్టం మొదలైంది.

విశ్లేష్‌ జేబులోంచి ఓ కాగితం తీసి తండ్రికందించాడు. దాని మీద గజిబిజిగా అల్లుకుపోయిన అంకెల్ని తండ్రి గాభరాగా విశ్లేషించుకుంటున్నాడు.

తల్లి తన వెంట తెచ్చిన స్వీట్లు అందించింది.

”పాయసమో పాలతాలికలో చేసి తీసుకురావచ్చు కదమ్మా!” అందామనుకున్నాడుగానీ, తల్లి బాధ పడుతుందని ఊరుకున్నాడు.

”హాయ్‌ విస్సూ” అంటూ వెనక నుంచి వచ్చాడు శశి. వాడికో స్వీటు అందించాడు విశ్లేష్‌. శశికి తల్లిదండ్రుల్లేరు. బోల్డంత ఆస్తి ఉంది. మేనమామ చదివిస్తున్నాడు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రేమ తప్ప అతనికి ఇంకెలాంటి మానవీయ లక్షణాలూ ఉండవని శశి తేల్చి చెబుతుంటాడు.

”వీడెవడు? లాస్ట్‌ టైమ్‌ వచ్చినప్పుడు మనీష్‌ అనేవాడు నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పావుగా?”

”వాణ్ని ఏ1 సెక్షన్‌కు ప్రమోట్‌ చేశారు నాన్నా” విశ్లేష్‌ చెప్పాడు.

”అంటే ఐఐటీ గ్యారెంటీ అన్నమాట. మనం మాత్రం ఈ సెక్షన్‌కే అంకితమైపోయి, ఐపీఈని మమ అనిపించి, ఎమ్‌సెట్లో ఏదో అఘోరించి, ఆఖరికి అధ్వానపు కాలేజీలో అమాంబాపతు ఇంజినీరింగ్‌ కోర్సులో చతికిలబడతావ్‌. అంతేగా…” మండిపడ్డాడు తండ్రి.

”అదేం కాదు అంకుల్‌” శశి ఏదో చెప్పబోతుండగా విశ్లేష్‌ కళ్లతోనే వారించాడు.

ఇద్దరికీ పులిహోర వడ్డించింది తల్లి.

తింటున్నాడన్న మాటేగానీ, విశ్లేష్‌ మనసు గతంలో గిరికీలు కొడుతోంది.

కాలేజీలో చేరడానికి వచ్చిన రోజు రోహిత్‌ పరిచయమయ్యాడు. వారం తిరక్కుండానే ప్రాణ సమానమయ్యాడు. కలిసి తినేవారు. కలిసి తిరిగేవారు. కలిసి చదువుకునేవారు. వారాంతపు పరీక్షల్లో మార్కుల సగటు ఎక్కువ ఉందని తనను ఏ1 సెక్షన్‌కు మార్చారు. రెండు నెలలు తిరక్కుండానే స్నేహం ముక్కలైంది. మెస్‌లోనో, క్యాంపస్‌లోనో ఎప్పుడో ఓసారి కలిసేవాడు. హలో అంటే హలో.

మరో నెల తిరక్కుండానే రోహిత్‌ను మరింత కింది సెక్షన్‌కు డిమోట్‌ చేశారు. లెక్చరర్లు వాణ్ని ఓ పశువులా చూసేవారు. ఈ అవమానభారమే మోయలేక సతమతమవుతుంటే, దసరా సెలవులకు ఇంటికెళ్లినప్పుడు అమ్మానాన్నలు మరింత హీనంగా చూశారు. అంతే, వాడిక మళ్లీ కాలేజీకి రాలేదు. బెడ్‌ రూములోనే ఊపిరి తీసుకున్నాడు.

సెకండియర్‌లో మనీష్‌ మంచి మిత్రుడయ్యాడు. ఇంటలిజెంట్‌ స్టూడెంట్‌. తన కన్నా మంచి మార్కులు తెచ్చుకుని, ఏ1 కు ఎగిరిపోయాడు. తన సెక్షన్‌లోని శశి స్నేహితుడయ్యాడు.

”సరెసరే, అయిందేదో అయింది. ఇకనుంచైనా బాగా చదువు. ప్రిన్సిపల్‌తో మాట్లాడాను. ఈసారి మంత్లీ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే, ఏ1కు మారుస్తానని హామీ ఇచ్చాడు” మర్యాదతో కూడిన బెదిరింపులాంటి వార్నింగ్‌ ఇచ్చాడు తండ్రి.

ఆటవిడుపు సమయం ఆవిరైంది.

తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారా అని ఆవురావురంటూ ఎదురు చూసిన చాలా మొహాల్లో ఇప్పుడు ఎందుకొచ్చారా అన్న భావన కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

డిజిటల్‌ డిటెక్టర్‌ దాటి అస్థిపంజరాలు కాళ్లీడ్చుకుంటూ మళ్లీ శ్మశానంలో అడుగు పెట్టాయి.

ఓరోజు దైనందిన శిక్షలన్నీ ముగిసిన అనంతరం, ఆ రాత్రి తన తల తీసేందుకు కారిడార్‌లోకి వచ్చాడు విశ్లేష్‌. కాకతాళీయంగా ఆకాశంలోకి చూశాడు. ఓ కాంతివలయం తమ కళాశాల భవనం మీద ఛత్రంలా విస్తరించి ఉంది. మనసేదో మేలు శంకించింది. తనవితీరా చూసి, తల తీసేసి ఫ్రీజర్‌లో పెట్టి, నిద్ర పోయాడు.

నిజంగానే ఆ కాంతివలయం కొత్త ప్రిన్సిపల్‌ శ్రీకాంత్‌ రూపంలో కిందికి దిగివచ్చింది.

ఆయన వస్తూనే విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. బీడీటీపై బ్యాన్‌ విధించాడు. దూదుల్లాంటి ఇడ్లీలు, ఊరించే ఉల్లిదోసెలు, పూరేకుల్లాంటి పూరీలు; పసందైన కూరలు, కమ్మటి చారు, గడ్డ పెరుగులతో మెస్‌ కళకళలాడింది. రెండురోజులు తిరక్కుండానే కళాశాల కళకళలాడింది. రెక్కలొచ్చిన పక్షుల్లా విద్యార్థులు ఉత్సాహంతో ఉరకలు వేశారు.

ఉదయం అసెంబ్లీ పెట్టేవారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. మీటింగ్‌ హాల్లో ఓ సాయంత్రం పూట విశ్లేష్‌ పాడిన పాటకు ఆగకుండా చప్పట్లు మోగాయి.

కాలేజీకి వంద మీటర్ల దూరంలో ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి క్లాసులు క్యాన్సిల్‌ చేసి, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఎనిమిది పరుగులిచ్చి అయిదు వికెట్లు తీసిన శశి అందరి ముందూ హీరోలా వెలిగిపోయాడు. కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌… పిల్లలంతా ఎవరిష్టం వచ్చిన క్రీడలో వాళ్లు చెమట్లతో తడిసి పునీతమయ్యారు.

”ఈయనెక్కువ కాలం ఉండడు” ఓ లెక్చరర్‌ అలా ఎందుకన్నాడో విశ్లేష్‌కు అర్థం కాలేదు.

అదే నిజమైంది. మేనేజ్‌మెంటుకు నమ్మినబంటు అయిన ఓ అధ్యాపకుడు అందించిన రహస్య సమాచారంతో రీజినల్‌ హెడ్‌ అమాంతం ఊడిపడ్డాడు. పిల్లలందరి ముందే ప్రిన్సిపల్‌పై మండిపడ్డాడు.

”అసలు ఎవడ్రా నిన్ను సెలక్ట్‌ చేసింది? ఇదేమన్నా రిహాబిలిటేషన్‌ సెంటర్‌ అనుకున్నావా? ఎగ్జామ్స్‌ పట్టుమని నాలుగు నెలలు కూడా లేవు. ర్యాంకులు రాకపోతే నష్టపోయేదెవుడు? రెప్యుటేషన్‌ దెబ్బతిని, అడ్మిషన్స్‌ అడుగంటితే అడుక్కు తినేదెవుడు?”

‘శ్రీకాంత్‌’వలయం అర్ధాంతరంగా అదృశ్యమైంది.

యముడి కజిన్‌ కొత్త ప్రిన్సిపల్‌గా వచ్చాడు. బీడీటీ మళ్లీ మొదలు. చిత్రవిచిత్ర శిక్షలు. హింస రెట్టింపు. అత్యాధునిక మారణాయుధాల కొనుగోలు.

అస్థిపంజరాల ఎముకల్లోని సున్నం వెలికితీసేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరణ!

”అరే, నాకు బతకాలని లేదు” నీరసంగా అన్నాడు శశి.

వీక్లీ టెస్టులో అతితక్కువ మార్కులు వచ్చినందుకు ఆరోజు మధ్యాహ్నం శశినీ, విశ్లేష్‌నీ లెక్చరర్‌ బండబూతులు తిట్టాడు. క్లాసులో పిల్లలందరి ఎదుటే తలలు పగలగొట్టాడు. ఆనక ప్రిన్సిపల్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన ఇద్దరికీ నరకం చూపెట్టాడు.

”నాగ్గూడా అంతేరా” చెప్పాడు విశ్లేష్‌.

”ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామా?” శశి కళ్లల్లో చిత్రమైన వెలుగు.

”ఆత్మహత్య కాదురా, ప్రాయోపవేశం అనాలి” సరిచేశాడు విశ్లేష్‌.

”ఏదో ఒకటిలేరా, మట్టిలో కలిసేదానికి ఏ పేరయితేనేం?”

”అదీ నిజమే. ఇంతకీ ఎలా పోదాం?”

శశి దీర్ఘంగా ఆలోచించి ”వద్దులేరా. బతికే సాధించాలి” అంటూ గదివైపు నడిచాడు.

తెల్లారక ముందే ఫ్లోరంతా కేకలతో ప్రతిధ్వనించింది. విశ్లేష్‌ ఉలిక్కిపడి లేచాడు.

తన పక్క మంచం మీద శశి విగతజీవిగా పడి ఉన్నాడు.

”అర్ధరాత్రి లేచి, ఫ్రీజర్‌లోంచి తల తెచ్చి తగిలించుకుని, బండరాయితో దాన్ని బద్దలు కొట్టుకున్నాడంట” మరణరహస్యాన్ని ఎవడో వర్ణిస్తున్నాడు.

”వీడు గ్రేట్‌ రా. సూసైడ్‌లో కొత్త టెక్నిక్‌ కనిపెట్టాడు” వేరెవరో మరణమృదంగాన్ని కీర్తిస్తున్నారు.

”ఫ్రీజర్‌కు డిజిటల్‌ లాక్‌ వెయ్యడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మన బుల్లి రాక్షసుడికి మరణ దండన తప్పదనుకుంటా” ఇంకెవరో శిక్షాస్మృతిని పరామర్శిస్తున్నారు.

విశ్లేష్‌కు ఆ రోజంతా ఎలా గడిచిందో తెలియదు.

రాత్రిపూట తల తీయకుండా పడుకున్నాడు. బుల్లి రాక్షసుడు-2 హెచ్చరించినా లక్ష్యపెట్టలేదు.

రాత్రి భారంగా కరుగుతోంది. విశ్లేష్‌ మెదడులో సముద్రాల ఘోష. అలల హోరు.

అర్ధరాత్రి దాటుతుండగా లేచాడు. మెల్లగా ఒక్కో అంతస్తూ దిగాడు.

గ్రౌండ్‌ఫ్లోర్‌లో వెనక భాగానికి చేరుకున్నాడు. అస్థిపంజర దేహంతోనే అంతపెద్ద గోడను ఎక్కాడు. అవతలి వైపుకు దూకడానికి మాత్రం చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓ మూలన నీటితో నిండిన తొట్టి కనిపించింది. దబ్బున అందులోకి దూకాడు.

మెల్లగా లేచి, కాళ్ల ఎముకలపై జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాడు.

వెనక భయంకర భూతాలేవో వెంబడిస్తున్నాయి.

ఫార్ములాలు, క్వశ్చన్‌ బ్యాంకులు, సింప్లికేషన్లు, ప్రతిభాత్మక మారుపేర్లు, కంపేరిజన్‌ క్యాంపెయిన్లు, వాష్‌రూమ్‌ దయ్యాలు, విద్యార్థి ముఠాలు, అధ్యాపకుల వర్గాలు, లేడీస్టాఫ్‌ ఆరోపణలు, గెస్ట్‌హౌస్‌ లొసుగులు, డబ్బుకట్టల తరలింపులూ…

అరగంట గడిచేసరికి నగరం దాటాడు. చల్లటిగాలి వీచింది.

మరో గంట నడిచాక, దట్టమైన అడవి ప్రత్యక్షమైంది.

ఎముకల కాళ్లతోనే అందులో అడుగు పెట్టాడు.

చిత్రం! కాళ్లకు చర్మం మొలిచింది.

పరుగందుకున్నాడు. నిండు వెన్నెల్లో దట్టమైన చెట్ల నడుమ పరిగెత్తుతున్నాడు.

చేతులకు చర్మమూ అందులోకి రక్తమాంసాలూ వచ్చిచేరాయి.

పిల్లకాలువలు, చెరువులు దాటి… కుందేళ్ల గుంపు మధ్యలోంచి పరిగెత్తుతున్నాడు.

నడుం నుంచి గొంతు దాకా అవయవాలన్నీ సమకూరాయి. నిగనిగలాడే చర్మం తిరిగొచ్చింది.

గుడిసెలు దాటి… గూడేలు దాటి… మైదానాలు దాటి… కొండకోనలు దాటి… వాగువంకలు దాటి… చెట్టుచేమలు దాటి…

పరిగెత్తుతూనే ఉన్నాడు… స్వేచ్ఛా ప్రపంచంలోకి!

అందరాని కొమ్మ
శ్రావణమాసం.

బెంగళూరు వర్షాల్లో తడిసి మెరిసిపోతోంది.

లేత బూడిద వర్ణపు ఆకాశం కింద పచ్చాపచ్చటి చెట్లు ఆకాశం నుంచి జలదారుల జలతారులా కురిసి ఆగిన వానలో తలారా నీళ్ళోసేసుకుని ఎర్ర తురాయి పూల చీర కట్టేసుకుని, వచ్చే పోయే వారిమీద వాననీటి జల్లులు చిలకరిస్తున్నాయి.

అప్పుడే ఆగిన బెంగళూరు నగర సారిగె సంస్థ వాహనంలోంచి దిగి చెంగున ఎగిరే జింకపిల్ల పాదాలతో తలపున మెదిలిన ఏ పాటకో తలాడిస్తూ, దానికి తనదైన పేరడీ కట్టేసుకుని పాడుకుంటూ తనలో తనే మురుస్తూ చిన్ని చిన్ని వాన చినుకుల సందడికి తన మువ్వల అలికిడి తాళం వేస్తూ భుజం మీది సంచీ సర్దుకుంటూ ఇంటి ముఖం పట్టింది మందహాసముఖి అమ్మాయి.

ఏ చినుకు నీపై కురిసి, తాను మెరిసి పోయిందో…

ఏ తళుకు నీకే అద్ది, మేను మురిసిపోయిందో…

చిలిపిగా… చెలిమిగా…

తనువునే… తడపగా…

నా మది పులకించెనో…

ఆడుకుంటూ, పేరడీలు పాడుకుంటూ ఇల్లు చేరి గేటు తెరిచీ తెరవగానే ఎదురుగా వరండాలో కుర్చీలు వేసుకుని ఎదురెదురుగా కూర్చుని కమలాఫలాలు ఒలుచుకుని తొనలు పంచుకుంటున్న అమ్మానాన్నలు, వీరి పైనుంచి చూపు నెక్కుపెట్టి చూస్తే తెరిచి ఉన్న తలుపు అవతల కొమ్మపైని జంటపూవుల్లా, గూటిలోని రెండు గువ్వల్లా కువకువలాడుతూ కబుర్లలో మునిగిన కొత్తజంట అన్నావదినలు. ఇదీ అమ్మాయి కనులబడ్డ దృశ్యం.

అమ్మాయిని చూడగానే అమ్మ ఒకసారి నవ్వి, “ఇప్పుడే అనుకుంటున్నాను, ఏదీ మా ఏడు మల్లెపూలెత్తూ అని! వచ్చావూ! దా. నీకిష్టమని ఎర్ర గోధుమనూక ఉప్మా, మాగాయ పెరుగు పచ్చడి చేశాను. పద, తిందువు గానీ” అంటూ లేచి ఇంట్లోకి నడిచింది.

నాన్న అమ్మాయిని చూసి చిరునవ్వుతోనే పలకరిస్తూ అమ్మ వెనక వెళ్ళు అన్నట్లుగా తలాడించారు, కళ్ళెగరేస్తూ.

పలకరింపులూ ఫలహారానికి పిలుపులూ అందుకుని దాటి వెళ్తూ వెళ్తూ అన్నావదినలకి “హాయ్” చెప్పి సరదాగా అమ్మ కొంగునందుకుని, అమ్మ వెనకే వెళ్ళి భోజనాల బల్ల దగ్గర కూర్చుంది అమ్మాయి.

అమ్మ ఫలహారపు పళ్ళెం తెచ్చి, “ఆయ్! చేతులు కడుక్కోకుండానే?” అనగానే అమ్మాయి కుడి చేత్తో తల మీద “అయ్యో! మళ్ళీ మర్చిపోయానే” అన్నట్టుగా తనకు తానే చిన్నగా కొట్టుకుని, లేచి వెళ్ళి పక్కనే ఉన్న సింక్ లో చేతులు కడుక్కుని వచ్చి, ఎర్రుప్మా తినడంమొదలుపెట్టింది, ఎప్పట్లాగే ఆఫీసూ, ప్రాజెక్ట్ వర్కూ అంటూ కబుర్లేవో చెప్తూ.

“అబ్బా, కబుర్లతోనే కడుపు నింపేసుకునేలా వున్నావు. ముందు తినేసి ఆ తర్వాత చెప్పు”, అమ్మ ముద్దుగా విసుక్కుంది.

అబ్బే! వాగ్ధార సాగేదే కానీ ఆగేదా? ఆపగలిగేదా?

ఆగదూ… ఆగదూ…

ఆగితే తోచదూ…

ఆగదు ఈ వాగుడు నీ కోసమూ…

ఆగితే సాగదు ఫలహారము…

ఒంటికి పట్టదు ఉప్మా-హారము…

ఖళ్… ఖళ్… ఖళ్…

దగ్గుతో సహా పాడేసింది అమ్మాయి.

“అబ్బా, నీకు వసెక్కువ పోసినట్టున్నాము చిన్నపుడు. ఇంతకీ రేపు సెలవు పెట్టావా?” అమ్మ ప్రశ్నలో అది ఆరానో- ఆరాటమో కనిపెట్టే తీరుబాటేది అమ్మాయికీ?

“ఊ …ఊ” స్పూనెడు ఉప్మా బుగ్గలో ఉంచుకుని అమ్మాయి తీసిన ఊ రాగం

“ఊ..నా? ఉ..ఊ…నా? సరిగ్గా చెప్పు” తప్పకుండా అమ్మది ఆరాటమే.

ఒక్క నిముషం అమ్మాయి నెమరువేత ఆగింది. ఏదో తలపు నెమరేసుకోవాలన్నట్టు.

ఒక్క గుటకలో ఉప్మా మింగి “ఊ…నే తల్లీ! లేకపోతె నువ్వూరుకుంటావా? మా కృష్ణన్ గారికి చెప్పే వచ్చా”

“నే చెప్పలే, నా బంగారుతల్లి! తొందరగా తినేసి లే ఇంక. వదినతో బజారెళ్ళొద్దాం”

“బజారంటే నాకు బేజారని నీకు తెలీదా మాతా? నన్ను రమ్మని అడుగవలదు. రానంటే రానని నాచేత పలికించవలదు” మాయాబజారులో శశిరేఖ పూనింది అమ్మాయిని.

“సర్లే, ఈ రోజుకి నీ మాట చెల్లించాల్సిందే. మేమిద్దరం వెళ్ళొస్తాం ” వలసిన వరమిచ్చినట్టు వదిలేసింది అమ్మ.

అమ్మావదినకి తోడు నాన్న అన్నా కూడా అడుగులోన అడుగు కలిపి వెళ్ళగానే సోఫాలో వాలింది – Wodehouse గారితో పేజీ కలుపుతూ Carry On, Jeeves! అనుకుంటూ.

రెండో రోజు మళ్ళీ ఆకాశం ముందు రోజుకన్నా ఎక్కువ కాటుక పూసుకొచ్చింది మబ్బుకన్నెలకి.

మరి కర్పూరం ఎక్కువయిందో ఏమో, మబ్బుకన్నెల కాటుక కన్నుల ఊరిన నీరు నేలకు జారి చిరుచిందుల మేలమాడింది.

నల్లమబ్బుని చూస్తూ వేడివేడి తెల్లపాలు ఊదుకుంటూ తాగుతోంది తనవారిలో తానెరుపైన అమ్మాయి.

ఇంతలోనే అమ్మొచ్చి తలకి నువ్వుల నూనె పెట్టి, అదే చేత్తో చెంపకి పసుపురాసి, నలుగుగిన్నె, శీకాయ గిన్నె రెండు చేతుల్లో పెట్టింది.

“ఏ వికటకవికి వరమివ్వడానికి నాకీ అవతారం?” అమ్మాయి బుంగమూతి పెట్టి అడిగింది, రెండు చేతులూ పైకి ఎత్తి చూపిస్తూ.

“చాల్లే నీ అల్లరి. వెళ్ళి సుబ్బరంగా నలుగు పెట్టుకుని తలంటుకు రా. గుడికెళ్ళొద్దాం” అమ్మ కసిరింది.

“గుడికా? ఏ గుడి? ఎక్కడా గుడి? ఇప్పుడెందుకా గుడి? ఇది నా ఎజెండాలో లేదే?” ప్రశ్నావళే ఈ వేళ అమ్మాయి.

“ఎజెండాలో, ఏ జెండాలో తర్వాత చెప్తాను. ముందు వెళ్ళి రా. ఈలోగా మొన్న అన్న పెళ్ళికి కొన్న నీలిపువ్వుల తెల్ల చీర తీసుంచుతాను, కట్టుకుందువుగాని. అసలే సాయంత్రం వాళ్ళొస్తున్నారు కూడాను.” అప్పటికి రాబోయే పంచ గంట ప్రణాళిక చెప్పేసింది అమ్మ.

అమ్మాయికి అర్థమయిపోయింది అమ్మ చేస్తున్న కుట్ర.

“హన్నా! ఎంత వద్దని చెప్పినా తాననుకున్నది చేసేస్తోందన్నమాట! ఇప్పుడే వాళ్ళూ వీళ్ళూ వద్దూ రావద్దూ, ఓ రెండేళ్ళాగాలందా తనూ? అయినా అమ్మకి నా మాటంటే లెక్కలేదు. చెప్తా వుండు ఈ అమ్మ పని” అని కాళ్ళ పట్టీలు ఎప్పటికన్నా ఎక్కువగా మోగిస్తూ అమ్మ చెప్పిన అభ్యంగన స్నానం కానిచ్చి నైటీ వేసుకుని వచ్చింది అమ్మాయి.

వస్తూనే తలారబెట్టుకుని జడ వేయించుకుని ఏరి కోరి బాందినీ చుక్కల మెంతి, వంగ, గులాబీ మువ్వన్నె రంగుల జెండాలాంటి చీర కట్టుకుని గదిలోంచి బయటికి రాగానే అమ్మ “అదేం చీర?” అనడగబోయి ఆగింది. “ఏదో ఒకటి చీర కట్టుకుంది అంటే చాలు. ఏ కుచ్చుల స్కర్టో వేసుకోకుండా అసలే చండిక” అనుకుని.

అమ్మ కళ్ళలో మనసు చదివిందో ఏమో, అమ్మాయి పెదవి ఒంపుల పల్లకిలో పాటని మోసేసింది.

మొండీ చండిక తలదన్నే చండీ కాళిక ఎవరీమె? కాదనగానే కయ్యము చేసే కన్నె చండికే కాబోలు…

అమ్మాయి కూనిరాగాల్లో మునుగుతూ తేలుతూ గుడికి వెళ్ళారు అమ్మ, అమ్మాయి.

ఇంకెవ్వరూ తమతో రాకుండా తామిద్దరమే గుడికి వచ్చే ఏర్పాటుతో ఏదో గూడుపుఠాని జరుగుతోందని అమ్మాయికి ఏదో inkling.

అమ్మ బయటపడదు, అమ్మాయి భయపడదు. ఇద్దరూ ఇద్దరే.

గుళ్ళో విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి అమ్మవారు నవ్వుతూ పలకరించింది. నల్లనిదేవి చల్లనిచూపులతో.

దండం పెట్టుకుని, ప్రసాదం పుచ్చుకుని చేతిలోని పువ్వును తల్లో తురుముకుంటూ ఇవతలకి వస్తూ అమ్మ ప్రశ్న, “ఏమని దండం పెట్టుకున్నావ్?” అంటూ.

“నీ సంగజ్జెప్పు ముందు” అంటూ నదురూ బెదురూ లేని అమ్మాయి దబాయింపు.

“ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అడిగిందానికి సవ్యంగా జవాబు చెప్పు” అమ్మకి అప్పటిదాకా దాచుకున్న విసుగు కొంచెంకొంచెంగా బయటికి వస్తోంది.

“సరే విను. నువ్వేం కోరుకున్నావో అదవ్వకూడదని నే కోరుకున్నాను” అమ్మాయి బిగించిన పెదవుల్లోంచి ఒక్కొక్క అక్షరం నొక్కి పలుకుతూ చెప్పిన బదులు.

“ఎందుకెందుకని ఊరుకుంటుంటే నీ వ్యవహారం శృతి మించుతోంది. మిగిలిన విషయాల్లో మీ నాన్నా, నువ్వూ ఒకటే అయినా ఈ విషయంలో నాదీ నాన్నదీ ఒకే మాట. ఏంటనుకున్నావో?!” అమ్మ బెదిరింపు.

“మాట మీది, మనువు నాదీ. నేను కాదన్నానా?” అమ్మాయి బెదురే లేని సవాలు.

“ముద్దు చేసినందుకు బానే బుద్ధి చెప్పావు. నువ్వసలూ … ” మాటలు వెతుక్కుంది అమ్మ.

“…..” చిరునవ్వే అతికింది అమ్మాయి మొహాన.

” ఆ … అదీ నువ్వసలూ… వయోముఖవిషకుంభానివి. చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ నీ పంతం నీదే”. అమ్మ మాటలు కోపంతో తడబడుతున్నాయి.

“హహ్హహ్హ” ఆపుకోలేని నవ్వు అమ్మాయికి.

“సిగ్గు లేనమ్మకి చిరునవ్వే సింగారం. ఎందుకా నవ్వు?”

“అదీ, పయోముఖవిషకుంభమమ్మా, వయోముఖ కాదు. పయః అంటే సంస్కృతంలో పాలు” పకపకా నవ్వుతూ అమ్మని సరిదిద్దింది అమ్మాయి.

“నీ తెలివితేటలన్నీ నాదగ్గరే. పద ఇంక ఇంటికి “, దారితప్పుతున్న దూడని కొమ్ముతో మందలిస్తూ దారిలో పెడుతున్న ఆవులా అమ్మ. అమ్మ కొమ్ము కందక గంతులు వేసే తువ్వాయిలా కిలకిలలాడుతూ అమ్మాయి. ఎలాగైతేనేం ఇల్లు చేరారు.

సాయంత్రం ఇంటి ముందు అప్పటిదాకా కురిసి ఆగిన వానతో పాటు ఇంటి ముందు ఆగిందో కారు. అందులోంచి దిగిన ముగ్గురికీ ఇంట్లోని నలుగురు ఎదురెళ్ళారు. పుస్తకంలో తలదూర్చి తన లోకంలో తనున్న అమ్మాయి మినహా.

Wodehouse గారి రాతకి లోపల్లోపలే నవ్వుతూ దొర్లేస్తున్నఅమ్మాయి లోపలికి వస్తున్నవాళ్ళని చూసి ఏం చేయాలో తోచక చటుక్కున లేచి నించుంది. కుడిచేతి చూపుడు వేలు చదువుతున్న పేజీ దగ్గర మడిచి పట్టుకుని.

“అరె! కూర్చో, పరాయి వాళ్ళమా ఏంటి?” అంటూ వచ్చినావిడ, వరసైన ఆవిడ, సరదాగా అమ్మాయి భుజం మీద చెయ్యేసి మెరిసే ఆ బుగ్గల నునుపుని ముచ్చటగా చూస్తున్నారు.

బిడియంగా నవ్వి అమ్మాయి “బావున్నారా?” అని పలకరించి చేయి పట్టి పొదువుకుంటున్న ఆవిడ పక్కనే సోఫాలో కూర్చుంది.

ఆవిడవెంట వచ్చిన ఆవిడ పతీ పుత్రులు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగా అన్న వాళ్ళ పక్కనే సోఫాలో, ఆ పక్కనే నాన్న, ఒక కుర్చీలో అమ్మా వదినా, వంటింటి గుమ్మానికి అటూఇటూ నించుని, అమర్చిపెట్టిన చదరంగపు బల్లలో చతురంగ బలాల్లా ఎవరి స్థానాల్లో వాళ్ళు కుదురుకున్నారు.

అమ్మాయి అందరినీ చూసి మొహమాటంగా నవ్వింది.

ఓ పదినిముషాలు మాటలగలగలలు, ఫలహారపు ప్లేట్ల మార్పిడులు, మంచినీటి గ్లాసుల గుటకలు – అన్నీ అయ్యాక “దొర్బాబూ! వీధి చివర పుస్తకాల షాపులో ఏదో కొనాలన్నావు కదా, తన కూడా వెళ్ళు. తను పుస్తాలు బా చదూతుంది. నీక్కావలిసినవి ఇట్టే వెతికి పెట్టేస్తుంది. వెళ్ళి రాకూడదూ?” వచ్చినావిడ వేసిన మొదటి ఎత్తు. అమ్మాయికి అదే ఆటకట్టు అన్నట్టు అమ్మ ముసిముసినవ్వు.

కోరగా అమ్మ కేసి చూసి లేచి వెళ్ళి sandals వేసుకుని, దొర్బాబుతో కలిసి పుస్తకాలషాపుకి నడిచింది అమ్మాయి.

వర్షపు బరువుతో మందంగా వీస్తున్న గాలి.

నడుస్తుంటే చెట్ల మీంచి ఉండుండి రాలుతున్న చినుకుల జల ధరించి జలదరిస్తున్న మేను.

చిరుచలికి భుజం చుట్టూ కొంగును కప్పుకుని అమ్మాయి. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని కొంచెం ఒంగి నడుస్తూ దొరబాబూ. రెండుగుల ఎడంతో నిశ్సబ్దంగా నడుస్తూ పుస్తకాల షాపుకి చేరుకున్నారు ఇద్దరూ.

ఇంకెప్పుడన్నా అయితే ఆ పుస్తకపు ప్రపంచంలో ఓ నవల వెతుక్కుని ఏ మూలో కూర్చుని చదువుకుంటూ తనని తాను మరిచిపోయేది అమ్మాయి.

ఈసారలా కాదు, కాలు ముందుకి పడట్లేదు. తలపు చిక్కులు విడట్లేదు. మది గందరగోళంగా వుంది. జరగబోయే అనవసర ప్రసంగాన్ని తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తోంది.

ఇంతలో పక్కన నడుస్తున్న దొరబాబు నామధేయుడు అడిగాడు, “పుస్తకం తర్వాత కొందాం. పక్కనే ఉపహారదర్శినిలో కాఫీ తాగుదామా?” అంటూ.

“నాక్కాఫీ అలవాట్లేదు” అనబోయి అనకుండానే అనుకోకుండానే తలూపి, పక్కనే వున్న ఉపహారదర్శినిలోకి గబగబా వెళ్ళి ఎదురెదురుగా కూర్చోవడానికిమాత్రమే వీలుగా వున్న ఒక రెండు కుర్చీల టేబుల్ దగ్గర కూర్చునేసింది.

ఒక్క నిమిషం అమ్మాయి కదిలిన వేగానికి ఆశ్చర్యపోయినా, అలా ఎందుకు చేసిందో అర్థమవడానికి ఆట్టే సమయం పట్టలేదు దొరబాబుకి. అల్లాంటి టేబుల్ అదొక్కటే మిగిలింది. మిగిలినవి పక్కపక్కన కూర్చునే వీలున్న booth-tables మరి.

తనకో కప్పు కాఫీ, కాఫీ వద్దన్నఅమ్మాయికో కప్పు పాలు తెమ్మని చెప్పి, ఈలోగా అమ్మాయితో మాటలు కలిపాడు దొరబాబు.

“ఏం చేస్తున్నారిప్పుడు?”

“ఫైనలియర్ ప్రాజెక్ట్”

“ఎందులో?”

“అంటే?”

“అదే, ఏ లాంగ్వేజ్ లో?”

“సి++”

“హి హి హి ”

“ఏం నవ్వుతున్నారు?”

“ఏం లేదూ, మా ఆఫీసులో నేను ఇంటర్వ్యూలు చేస్తూ వుంటాను. ఇదిగో ఇలాగే మీలాగే C ఒచ్చూ, ఇంకోటొచ్చూ అనుకుంటూ వస్తారు. తీరా ఓ రెండు ప్రశ్నల తర్వాత తెలుస్తుంది చెప్పినంత ఏదీ రాదనీ”

“నేను అలా ఉద్యోగాల కోసం వచ్చే రకం కాదు లెండి”

“అదేం? చదువుకుంటున్నారు. పైగా ప్రొఫెషనల్ కోర్స్. ఉద్యోగం చేయరా?”

“నాకు ఒకళ్ళు చెప్పే మాట వినడం అలవాటు లేదు. ఉద్యోగం నా ఒంటికి పడదు”

ఇంతలో కాఫీ కప్పు, పాలకప్పు పట్టుకుని సర్వరుగారు హాజరు.

కాఫీ తాగుతూ “అంటే, ఎవరి మాటా వినరా?”

“వినను”

“మీ మంచి కోసం చెప్పినా వినరా?”

“ఉహూ!”

“అంటే, ఇదిగో ఈ కాఫీ కప్పుంది. ఇలా టేబుల్ మీద పెడ్తాను. చేయి తగిలితే కాఫీ ఒలికిపోతుంది, జాగ్రత్త అని చెప్పాననుకోండి…” ఇంకా అతని మాట పూర్తి కానే లేదు-

చివాలున లేచి “చేయి తగిలించి పారబోసి, ఒలికిపోయిన కాఫీని తుడిచి శుభ్రం చేస్తాను” అంటూ విసవిసా నడిచిపోతున్న అమ్మాయిని చూస్తుంటే అతని మదిలో మెదిలిన పాట, అప్పుడెప్పుడో అమ్మాయే పేరడీ కట్టిన పాట-

మాట కరుకు గుమ్మ ఇదీ, మౌనమైతే మేలు అదీ

అందరాని కొమ్మ ఇదీ, అందమంటే ఒప్పదిదీ…

ఆ ఒక్క మనిషి
‘‘అర్జున్‌.. అర్జున్‌.. అర్జున్‌..’’ అని ఎవరో పిలిచినట్టనిపిస్తుంది. అర్జున్‌ లేచి కూర్చుంటాడు. తెల్లారినట్లు అనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరక్కడ. ఎవరు పిలిచారో అర్థం కాదతడికి. ఆరోజుకి తన జీవితంలో ఉన్న మనుషుల గొంతులన్నీ ఆ పిలిచిన గొంతుకి మ్యాచ్‌ చేస్తూ పోతాడు. ఏదీ మ్యాచ్‌ అవ్వన్నట్టు అర్థమవుతూ ఉంటుంది. ఎవరిదై ఉంటుంది ఆ గొంతు? గతంలోకి వెళతాడు. ఆ గొంతును మ్యాచ్‌ అయ్యే గొంతును వెతుకుతూనే ఉంటాడు. దొరుకుతుంది. ఒక్కసారిగా ఏడుస్తాడు. వెంటనే ఏదో లాగినట్టనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. మళ్లీ ఏడుస్తాడు. వెంటనే ఎవరో లాగినట్టనిపిస్తుంది. వచ్చి మళ్లీ ఇక్కడే పడిపోతాడు.

ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం..

అర్జున్‌ గట్టిగా ఏడ్చాడు. ఎంత గట్టిగా అంటే ఏడ్వడం తనకు అప్పటికే అలవాటైపోయిందన్న విషయం కూడా మర్చిపోయేంతలా!

‘‘మనం ఇప్పట్లో మళ్లీ కలవం.’’ ఆ అమ్మాయి చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నాడు.

తలెత్తి చూశాడు. ఆ అమ్మాయీ ఏడ్చింది. ‘వెళ్లొస్తా’నన్న చూపు చూసింది. అర్జున్‌ లేచి నిలబడ్డాడు. ‘వెళ్లొద్ద’న్నట్టు చూశాడు. కొన్ని సెకండ్లలో ఇద్దరూ ఆ ప్రదేశంలో లేరు.

అక్కణ్నుంచి నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్లిపోయాడు అర్జున్‌. వెనక్కి తిరిగిరావడానికి భయపడేంత దూరం అది.

కానీ భయపడలేదు. తిరిగొచ్చాడు. అర్జున్‌కు నడవమంటే బాగా ఇష్టం. నడిస్తే ఏదో బాధంతా వెళ్లిపోయినట్లు ఉంటుందంటాడు. ఇంటికెళ్లాక అమ్మ ముందు మళ్లీ మామూలుగా కనిపించొచ్చు అంటాడు. అమ్మ ముందు అలా అబద్ధంగా నిలబడ్డానికి చాలాసార్లు మైళ్లకు మైళ్లు నడిచాడు. ఈసారది ఇంకెక్కువ.

అలిసిపోయి వచ్చిన అర్జున్‌ను చూసి ‘‘ఏమైంది? అలా ఉన్నావ్‌?’’ అని అడిగింది అమ్మ. ఎప్పుడూ అలాగే అడుగుతుంది కూడా. దానికి అతని దగ్గర ఒక సమాధానం ఉంది. ఎప్పుడూ ఉంటుంది. చెప్తాడు. అదే చెప్పాడు.

ఒకటి, రెండు, మూడు.. నాలుగు.. అర్జున్‌కి ఏదీ అర్థం కావడం లేదు. రోజులు గడవడం ఒక్కటి స్పష్టంగా తెలుస్తోంది.

‘‘నాకు ఈ లైఫ్‌ ఏం అర్థం కావట్లేదు.’’ అన్నాడొకరోజు, ఫ్రెండ్‌తో.

‘‘అర్థం కాకపోవడమంటే?’’ ఫ్రెండ్‌ నుంచి తిరుగుప్రశ్న.

‘‘ఏం అర్థం కావట్లేదు. ఐ ఫీల్‌ లైక్‌ ఐ డోంట్‌ ఎక్సిస్ట్‌’’

‘‘నోబడీ ఎక్సిస్ట్స్ హియర్‌. లైఫ్‌ ఇంతే!’’

‘‘కానీ.. ఏమో.. రోజూ ట్రై చేస్తున్నా. యాక్టింగ్‌ కూడా నావల్ల కావట్లేదు.’’

‘‘ఏడుస్తున్నావా?’’

‘‘రోజూ! ఏ?’’

‘‘ఏడుస్తూనే ఉండు. హోప్‌ యూ విల్‌ ఫైండ్‌ ఎ వే’’

‘‘చనిపోవాలనిపిస్తోంది!’’

‘‘అమ్మ గుర్తుకురావట్లేదా?’’

‘‘వస్తుంది. అక్కడే ఆగిపోతున్నా’’

‘‘అది. అక్కడే ఆగిపో! ఏదన్నా ఉంటే నాతో చెప్పుకో. నేనిక్కడే ఉన్నా. నీకోసం ఇక్కడే ఉంటాగా!’’

‘‘థ్యాంక్స్‌..’’ అన్నాడు అర్జున్‌.. నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ.

‘‘థ్యాంక్స్‌ అవసరం లేదు. తిన్నావా ఇంతకీ?’’

అర్జున్‌ సమాధానం ఇచ్చాడు. ఆరోజు ఏడ్చాడు. ఆ తర్వాత రోజు.. ఆ తర్వాత రోజూ..

ఎప్పుడేడ్చినా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. బాగున్నట్టు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. జీవితం మళ్లీ అలవాటు అయిపోయింది అతడికి. ఎక్కువ ఆలోచించడం మానేశాడు. ముఖం మీద మళ్లీ చిరునవ్వు కనిపించింది. ‘‘ఏమైంది? ఇలా ఉన్నావ్‌?’’ లాంటి ప్రశ్నలు మళ్లీ అమ్మ నోటినుంచి రాలేదు. ఒకరోజు ఎందుకో మాత్రం అమ్మ ముందు గట్టిగా ఏడ్చాడు. ఆ రోజు ఆవిడా ఏమీ అడగలేదు.

ఈరోజుకి సరిగ్గా ఆరు నెలల క్రితం..

ఎప్పుడో, ఎందుకో అడగాలనుకొని అడగలేకపోయిన విషయం అడిగింది అర్జున్‌ తల్లి.

‘‘నువ్వు బానే ఉంటున్నావ్‌గా?’’ అని.

అర్జున్‌ గట్టిగా నవ్వాడు. ‘‘నువ్వున్నావ్‌! నేనెందుకు బాగుండనమ్మా!!’’ అన్నాడు, ఆ నవ్వునలా కొనసాగిస్తూనే.

‘‘నాకది చాల్రా!’’ అందావిడ.

అర్జున్‌కి అమ్మ ఇలా సడెన్‌గా ఎందుకడిగిందో అర్థం కాలేదు. అడగాలనుకున్నాడు. అడగలేదు.

‘‘నువ్వు బాగున్నావ్‌ కదమ్మా!?’’ అని మాత్రం అడిగాడు.

అమ్మ నవ్వింది.

ఆ నవ్వు మళ్లీ సరిగ్గా ఏడు రోజులకు.. మధ్యాహ్నం పూట గుర్తొచ్చింది అర్జున్‌కు. భయపడ్డాడు.

నాన్న చనిపోయిన రోజు నుంచీ అర్జున్‌ను ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూ వచ్చింది.

ఏ రోజైనా, ఏ క్షణమైనా.. ఓ ఫోన్‌ వస్తుంది. అమ్మకు బాలేదనో, ఏదో అయిందనో, లేదా వెళ్లాక తనే చూస్తాడు, అమ్మ అలా పడిపోయి ఉండటమో, ఇంకోటో!! ఈ ఆలోచన ఎప్పుడొచ్చినా అర్జున్‌కు చెమటలు పట్టేస్తాయి. చాలామందిని అడిగాడు.. ‘ఇలా ఎవరికైనా కూడా అనిపిస్తుందా?’ అని. ఆ చాలామందిలో చాలామంది తమకూ ఇలాంటి భయాలున్నాయని చెప్పారు. ఈరోజు ఆ భయం ఇంకా భయపెట్టింది అర్జున్‌ను. ముఖ్యంగా ఆ నవ్వు. ఆ నవ్వు గుర్తొచ్చి ఎక్కువ భయపడ్డాడు.

ఫోన్‌ అందుకొని, కాల్‌ లిస్ట్‌ లో ఉన్న ఫస్ట్‌ నెంబర్‌కు డయల్‌ చేశాడు. రింగ్‌ అవుతూనే ఉంది కానీ, ఎవ్వరూ ఎత్తట్లేదు. అర్జున్‌కి భయం మరింత పెరిగింది. మళ్లీ చేశాడు ఫోన్‌. అదే రెస్పాన్స్‌. మళ్లీ చేశాడు. అదే రెస్పాన్స్‌.

ఇరవై నిమిషాల్లో ఇంట్లో ఉన్నాడు. అతణ్ని బాగా భయపెట్టిన విషయమే.. అలా పడిపోయి ఉన్న అమ్మను చూశాడు. ఏడ్చాడు. ఏడ్చాడు. కొన్ని రోజులపాటు ఏడుస్తూనే ఉన్నాడు.

‘‘నేనింకా బతకడం వేస్ట్‌ ఏమో!’’ అన్నాడొక రోజు ఫ్రెండ్‌తో.

ఆ ఫ్రెండ్‌ నవ్వాడు. ఒక తెలిసిన సమాధానమే మళ్లీ చెప్పాలన్నప్పుడు మనిషి నవ్వే నవ్వది. ఆ సమాధానమే ఇచ్చేశాడు ఆ ఫ్రెండ్‌. అర్జున్‌ చిన్నగా నవ్వీ నవ్వనట్టు నవ్వాడు.

కొన్ని రోజుల్లో అర్జున్‌ మళ్లీ బతకడం అలవాటు చేసుకున్నాడు. ఏడ్చినప్పుడల్లా ఫ్రెండ్‌ని కలవడం, ఎవ్వరిముందూ ఏడ్వలేనిదైతే ఎంత దూరం అనిపిస్తే అంత దూరం నడవడం. ఇదే పని.

ఫ్రెండ్‌ వేరే ఊరికి వెళ్లిపోతానన్నరోజు అర్జున్‌ ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేడని అతడికి తెలుసు.

ఫ్రెండ్‌ వెళ్లిపోయాక బాధొస్తే నడవడం ఒక్కటే తెలిసేది. ఆ కొద్దిరోజుల్లో చాలాదూరం నడిచాడు. ఒక్కోసారి ఏ నడకా ఆపలేని బాధ తన్నుకొచ్చేది. అన్నీ ఒక్కసారే గుర్తొచ్చేవి.

అలాగే నడుస్తూ నడుస్తూ ఒక బిల్డింగ్‌ దగ్గర ఆగాడు ఒకరోజు. ఒకటి, రెండు, మూడు.. నాలుగు.. ఒక్కో ఫ్లోర్‌ ఎక్కుతూ ఉంటే ఆయాసం వస్తున్నా పట్టించుకోలేదు. పై అంతస్తుకి  చేరాక, ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని దూకేందుకు రెడీ అయ్యాడు.

‘‘హేయ్‌ అర్జున్‌!’’ అని ఓ పిలుపు వినిపించింది.

తిరిగి చూశాడు అర్జున్‌. నరేశ్‌. మూడేళ్లయిందతడు నరేశ్‌ను చూసి. ఆగిపోయాడు.

నరేశ్‌.. అర్జున్‌కి దగ్గరగా వచ్చి, ‘‘ఏమైంది? ఏం చేస్తున్నావిక్కడ?’’ అనడిగాడు.

‘‘ఏం లేదు.. ఏం లేదు..’’ భయంగా సమాధానమిచ్చాడు అర్జున్‌.

కొన్ని నిమిషాల్లో ఇద్దరూ దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌లో కూర్చున్నారు. అర్జున్‌కి నరేశ్‌తో అన్నీ చెప్పేయ్యాలనిపించింది.

నరేశ్‌కి అర్జున్‌ ప్రతీ లైఫ్‌ ఈవెంట్‌ తెలుసు. చనిపోవాలనుకున్నదీ చెప్పాక అర్జున్‌కు ఎందుకో తేలిగ్గా అనిపించింది. చుట్టూ చూసి నరేశ్‌ ఏదన్నా చెప్తాడా అన్నట్టు చూశాడు అర్జున్‌. నరేశ్‌ ఏం చెప్పేలా లేడు. ఇద్దరూ ఒకసారి ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు.

‘‘నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే బాగుంటావ్‌’’ అన్నాడు నరేశ్‌.

‘‘నువ్వు హైద్రాబాద్‌ ఎప్పుడొచ్చావ్‌?’’ అర్జున్‌ అడిగాడు.

‘‘ఇప్పటికైతే చిన్న పని మీదే వచ్చా. నెక్స్ట్ మంత్‌ మొత్తం వచ్చేస్తా ఇక్కడికే!’’

‘‘నాతోనే ఉండొచ్చు!’’ అర్జున్‌ నవ్వాడు.

‘‘తప్పకుండా..!’’ అన్నాడు నరేశ్‌.

రోజులు గడుస్తున్నాయి. అర్జున్‌ ఒక్కోరోజు బాగుంటున్నాడు. ఒక్కోరోజు అస్సలు బాగుండటం లేదు.

ఎక్కువ నడవలేడని అర్థమైన ఒకరోజు ఇంట్లోనే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. ఏడుస్తూ ఏడుస్తూ తలను గోడకేసి బలంగా గుద్దుకున్నాడు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌. చాలారోజులు లేవలేదు అర్జున్‌. స్పృహలోకి వచ్చిన రోజుకి నరేశ్‌ ఎదురుగా కనపడ్డం ఏదో ధైర్యాన్నిచ్చింది అతడికి.

‘‘ఎందుకిలా చేశావ్‌?’’ అని కోపంగానే అడిగాడు నరేశ్‌.

అర్జున్‌ అతణ్ని గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు.

నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతూంటే అర్జున్‌ ఒక్కో కారణంతో ఏడుస్తూనే ఉన్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడో అవి మారిపోతున్నాయి. ఎవరి ముందు ఏడుస్తున్నాడో వాళ్లూ మారిపోతున్నారు. మనుషులు మారిపోతున్నారు. ప్రదేశాలు మారిపోతున్నాయి. అర్జున్‌ ఏడుస్తూనే ఉన్నాడు.

‘‘నేను చెన్నై వెళ్లిపోతా!’’ అన్నాడు అర్జున్‌.

‘‘ఇప్పుడు చెన్నై ఎందుకు?’’ నరేశ్‌.

‘‘ఏమో! ఇక్కడే ఉండలేను నేను.’’

‘‘నువ్వు అక్కడ కూడా ఉండలేవు.’’

‘‘నేనుంటా!’’

‘‘కూల్‌! నీకెక్కడ బాగుంటుందనిపిస్తే అక్కడికెళ్లు..’’

‘‘నేను చెన్నై వెళ్తా!’’

‘‘నీ ఇష్టం. నువ్వు బాగుండాలి. బాగుంటే బాగుంటావ్‌!’’ అన్నాడు నరేశ్‌.

అర్జున్‌ నవ్వాడు.

‘‘చెన్నైలో భరత్‌ ఉన్నాడు. వాడితో ఉండొచ్చు..’’ కొనసాగించాడు నరేశ్‌.

‘సరే’ అన్నట్టు తలూపాడు అర్జున్‌.

ఈరోజు.. చెన్నై..

ఫ్రెండ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు అర్జున్‌. కేఫ్‌ అంతా గోలగోలగా ఉంది. అప్పటికే రెండు టీలు తాగి, భరత్‌ రావడానికి ఇంకో అరగంట పడుతుంది అంటే చుట్టూ చూశాడు. అక్కడ వినిపిస్తున్న రకరకాల అరుపుల్లో ‘‘అర్జున్‌.. అర్జున్‌..’’ అన్న అరుపొక్కటే అతడికి స్పష్టంగా వినిపిస్తోంది.

ఆ గొంతుని గతంలోకి వెళ్లి పోల్చుతూ పోతున్నాడు. అమ్మ గుర్తొచ్చింది. అమ్మాయి గుర్తొచ్చింది. మళ్లీ ఏవేవో శబ్దాలు. ‘‘అర్జున్‌..’’ అన్న పిలుపు మాత్రం ప్రతిసారీ స్పష్టంగా వినిపిస్తోంది.

ఒక్కసారే కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది అతడికి. ఆ శబ్దాలు అలా వినబడుతూనే ఉన్నాయి.

‘ఎక్కడున్నాను నేను!?’ అని చుట్టూ చూశాడు.

ఏడుస్తున్నాడెందుకు? ఏమైంది?

కాసేపు ఏడ్వకూడదు అన్నట్టు తల అడ్డంగా ఊపి నెమ్మదించాడు.

ఎదురుగా వస్తున్న మనిషిని చూస్తున్నాడు.

ఆ మనిషి ఒక్కో అడుగేస్తూంటే అర్జున్‌ కొంచెం కొంచెంగా కుర్చీలోంచి లేస్తున్నాడు.

ఆ మనిషి పూర్తిగా దగ్గరకు వచ్చేశాక, అర్జున్‌ మొత్తంగా లేచి నిలబడ్డాడు.

‘‘ఎలా ఉన్నావ్‌?’’ అంటూ ఆ మనిషి అర్జున్‌కు చెయ్యందించాడు.

అర్జున్‌ అతణ్ని హత్తుకొని, ‘‘థ్యాంక్స్‌ భరత్‌..’’ అన్నాడు.

నాకైతే అప్పుడు అర్జున్‌ ముఖం కనిపించలేదు కానీ, కచ్చితంగా ఏడ్చే ఉంటాడు.

స్కూలెల్లను!
లైన్లో పిల్లలందరి తోపాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.

శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్ స్ట్రాప్స్ లోకి వేళ్లు దూర్చి, ముందుకి వంగి అటూ ఇటూ వెతుకుతున్నాడు. నాన్న కనిపిస్తే ముఖమంతా నవ్వు. మెట్ల మీంచి గెంతి వీధి దాటబోతోంటే నాన్న ‘‘జార్తరా!’’ అని ముందుకొచ్చి ఎత్తుకొన్నాడు.

అక్కడ అమ్మలూ నాన్నలూ పిల్లల్ని ఎత్తుకొంటున్నారు. వాళ్ళ భుజానున్న బాగ్గులు తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు. తలలు చెరుపుతున్నారు. శివా, నాన్నా కూడా వాళ్ళిదరి లోకంలో వాళ్ళున్నారు. నాన్న శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు:

‘‘చిన్నిమామా… ఏం చేసేవే ఇవాళ?’’

‘‘ఆ…?’’

‘‘స్కూల్లో ఏం చేశావూ… అంటున్నా’’

‘‘ఏబీ చదుకున్నా. చదుకుంటే… స్కేలు కొట్టింది’’

‘‘టీచరు కొట్టిందా?’’

శివగాడు ఇంకోవైపు చూస్తూ అక్కడ ఎవరో ఉన్నట్టు చూపుడువేలు గాల్లో ఆడించి, ‘‘ ‘దెబ్బపడతయ్!’ చెప్పింది. మెప్పెట్టేసింది ఇక్కడా…’’ అన్నాడు భుజం చూపిస్తూ.

‘‘మరి కొట్టరా, చదూకోపోతే?’’

‘‘స్కూల్ బాలే.’’

‘‘తప్పమ్మా. ఏబీ చదుకోవాలి. ఏబీ చదూకుంటేనే డబ్బులొస్తాయి.’’

‘‘ఆ?’’

‘‘డబ్బులొస్తే ఐస్క్రీమ్, లాలీపాపా కొనుక్కోవచ్చు’’

‘‘లాలీపాప కొనేస్తావా?’’

‘‘ఇప్పుడు కాదే. స్కూలెల్లి ఏబీ చదూకొంటే ఆఫీసెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు’’

‘‘లాలీపాప కావాలి.’’

‘‘రేపు కొంటా, స్కూల్ వెళ్తావ్ కదా, అప్పుడు.’’

‘‘స్కూలెల్లను అస్సల’’

‘‘తప్పలా అనకూడదు’’

‘‘స్కూల్ బాలేదే.’’

‘‘సర్సరే… రేపు చూద్దాం. అమ్మ అప్పచ్చి చేసింది తిందాం పద.’’

‘‘…లాలిపాపా?’’

నాన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు.

అమ్మ వంటింట్లో మూకుట్లో ఏదో తిప్పుతూ వీళ్ళని చూసింది.

నాన్న శివగాడ్ని వొళ్ళో కూచోపెట్టుకొని షూ, సాక్సులు విప్పుతూ, వెనక్కి చూస్తూ చెప్పాడు, ‘‘ఇదిగో నీ కొడుకు స్కూలుకెళ్లడంట.’’

‘‘ఏంటీ అప్పుడే!’’ అంది అమ్మ.

‘‘టీచర్ కొట్టిందట.’’

అమ్మ గరిటె గట్టు మీద పెట్టి హాల్లోకి వచ్చింది. నడుం మీద చేయి వేసి నిలబడింది. స్కూల్లో చేర్చి ఇది నాలుగో రోజే. వాళ్ళ కొడుకు మీద ఇంకోళ్ళు చేయి చేసుకోవడం అంటే ఇంకా అలవాటు కాలేదు ఇద్దరికీ. ‘‘కొట్టిందా? ఏరా నాన్నా.. మిస్ కొట్టిందా?’’

శివగాడు తలూపాడు.

‘‘అదేం పొయ్యేకాలం దానికీ. నువ్వెళ్ళి అడక్కపోయావా?’’

‘‘ఏం అడుగుతామే. టీచర్లన్నాకా ఓ దెబ్బెయ్యరా? నువ్వూ నేనూ తినలేదా?’’

‘‘ఐతే మాత్రం! ఆడెంత ఉన్నాడనీ. వెళ్ళి చెప్పాల్సింది.’’

శివగాడు మధ్యలో మాట్లాడాడు, ‘‘ఏబీ రాయ్… దెబ్బపడతయ్ చెప్పి… స్కేల్ కొత్తింది.’’

అమ్మ వాడ్ని నాన్న వొళ్ళోంచి ఎత్తుకొంది. ‘‘రా నాన్న… నా తల్లే బంగారం. స్కేల్తో కొట్టిందా. ముండ. నువ్వెళ్ళి చెప్పాల్సింది ప్రిన్సిపాల్‌కి.”

‘‘ఏం చెప్తామే. మళ్ళీ చెప్పామని తెలిస్తే వీడి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టంతా,’’ అన్నాడు నాన్న.

‘‘నిజమేలే. ఓమ్ తల్లి. చిన్నిముండ. కొట్టదులే, నాన్న చెప్తాడు. గులాబ్ జామ్ చేశా తింటావా?’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

‘‘స్కూలెల్లను,’’ అన్నాడు శివగాడు.

నాన్న హాల్లో చొక్కా బొత్తాలు విప్పుకుంటూ గట్టిగా అన్నాడు, ‘‘ఆ వెళ్ళకు! ఇంట్లోనే అడుక్కోడిపెట్టలా కూర్చొనీ, గుడ్లెట్టు. మూడెళ్లి నాలుగొస్తుంది, సిగ్గులేదు మళ్ళా’’.

శివగాడ్ని నడుం మీద పెట్టుకునే అమ్మ గరిటె తిప్పుతోంది. ‘‘ఆ చదివినంతే చదువుతాడు. నువ్వు పెద్ద చదివేసేవా, నేను చదివేసేనా, ఈడిప్పుడు ఊడబొడిచెయ్టానికి. చిన్నపిల్లోణ్ణి పట్టుకుని ఊరికేని. ఏంరా.. బుజిముండా…’’

‘‘వంట తినాలా మనం…?’’

‘‘ఊ… అయిపోయింది. చల్లారేకా, గిన్నెలో పెడతాను. తిందుగానీ.’’

‘‘చాల వేడిగా ఉంతదా…’’

అమ్మ వాడి బొజ్జ మీద రుద్దింది. ‘‘ఆకలేస్తుందా చిచ్చితల్లికి,’’ అంది. వాడికి కితకితలొచ్చి నవ్వాడు.

బయట నెమ్మదిగా చీకటిపడింది. నాన్న లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ కణతలు నులుముకొంటున్నాడు, బనీన్లోంచి గుండెల మీద రాసుకుంటున్నాడు. చివరికి మోచేతిలో ముఖం పెట్టుకుని కునికాడు. కాసేపటికి వీపు వెనక ఎవరో ఆనుకున్నట్టు అనిపిస్తే మెలకువ వచ్చి చూశాడు. శివగాడు అటు తిరిగి కూర్చున్నాడు. చేతిలో కారుబొమ్మ పట్టుకొని, పైన గోడ మూలలోకి అక్కడేం లేకపోయినా చూస్తున్నాడు.

నాన్నకి వాణ్ణలా చూస్తే ముచ్చటనిపించింది. వాడెంత సేపుకీ కదలకపోతే “చింతల్లీ…” అని పిలిచాడు.

శివగాడు ‘‘ఉం’’ అని తిరిగి చూశాడు.

నాన్న వాడి చంకల్లో చేతులేసి గుండెల మీదికి లాక్కొన్నాడు. వాడు రానన్నట్టు గింజుకుంటూ బరువుగా వచ్చాడు.

‘‘ఏం చూత్తన్నావే? పిచ్చిముండ’’

శివగాడు సిగ్గుగా నవ్వి కారుబొమ్మ వేపు చూశాడు. వాడిలోపల ఏముందో అని నాన్నకి బాధగా అనిపించింది.

‘‘అమ్మేదిరా?’’ అని అడిగాడు.

శివగాడు ‘‘లాల’’ అని బాత్రూం వైపు చూపించాడు, చెంబుడు నీళ్ళు పడిన చప్పుడు వైపుకి.

‘‘బజ్జో కాసేపు’’ అని చంకల్లోకి పడుకోపెట్టుకున్నాడు నాన్న.

శివగాడు కారుబొమ్మ గుండెల మీద పెట్టుకొని నాన్న చంకలో పడుకొని ఫ్యాన్ వైపు చూస్తున్నాడు.

నాన్నకి మళ్ళీ ఆఫీసు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ఇబ్బంది ఏదో ఉండకపోతేనో అనీ, ఆ పరిస్థితిలో తను ఇంకోలా మాట్లాడివుంటేనో అనీ, మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే ‘అప్పుడు ఇలా అనాలి’ అనీ ఆలోచించుకుంటున్నాడు.

మధ్యలో ఒకసారి శివగాడు పిలిస్తే చంకలోకి చూసాడు.

శివగాడి కళ్ళు దగ్గరగా పెద్దగా కనిపించాయి. ‘‘స్కూలెల్లాలా?’’ అంటున్నాడు.

నాన్న వాడి బుగ్గలు నలిగేలా గుండెల మీదికి లాక్కొన్నాడు. ‘‘చదూకోపోతే ఎలారా మరీ,’’ అన్నాడు.

శివగాడు ఇంక ఏడుపుగొంతుతో గట్టిగా మాట్లాడాడు, ‘‘స్కూలు బాలేదే…! బాబులు బాలేదు. ఆంతీ బాలేదు. జారీ బల్ల బాలేదు. బాలేదు అసల!’’

‘‘సర్సరె. రేపటి సంగతి కదా. నేను చెప్తాన్లే టీచరుతోటి. టీచరండీ, మా శివని కొట్టద్దండీ. బంగారుతల్లీ, బాగా చదువుకుంటాడూ అని చెబుతాగా రేపు వచ్చి? చెప్పనా?’’

‘‘వొద్దు’’

‘‘మరి వెళతావా?’’

‘‘వొద్దు, బాలేదసల.’’

అమ్మ బాత్రూంలోంచి కొత్త నైటీలో వచ్చింది. ‘‘ఊరికే ఎందుకు రాపాడించేస్తన్నావు పిల్లోడ్ని పట్టుకొనీ. వెళ్ళాపోతే మానేస్తాడు. ఏది పట్టుకుంటే అదేనబ్బా మనిషికి…,’’ అంది అద్దం ముందర జుట్టు తువ్వాల్తో రుద్దుకుంటూ.

శివగాడు చప్పున నాన్న చంకలోంచి లేచివెళ్లి అమ్మ కాలిని కావలించుకున్నాడు. ‘‘అమ్మా… స్కూలెల్లనే,’’ అన్నాడు పైకి చూస్తూ.

‘‘వెళ్ళద్దు తల్లీ. నాన్న అలాగే అంటాడు బుద్ది లేదు అస్సలు.’’

‘‘స్కూలెలు ఎలు అంతున్నారు,’’ నాన్నని వేలుపెట్టి చూపించాడు.

‘‘నీకేవే, కూర్చొని ఎన్నయినా చెబుతావు. ఐదు వేలు కట్టొచ్చానక్కడ. లెక్కాపత్రం లేకుండా పోతుంది అమ్మా కొడుకులికి. యూనిఫాం అయిపోయింది వచ్చి తీసుకోండని ఆ టైలర్ గాడు రెండోసారి ఫోన్ చేసాడు. జీతం పడనియ్యరా బాబూ అని నా బాధ,’’ అన్నాడు నాన్న.

‘‘అసలు ఫీజంతా ఒకేసారి ధారబోసెయ్యమని ఎవడు చెప్పాడు నీకు. మూడు టెరంలు కట్టొచ్చు. అంతా నాకే తెలుసని బయల్దేరతావు. నోరిప్పి మాట్లాడితే కదా అసలు.’’

‘‘ఓ నెల ఉండొచ్చు, ఓ నెల వుండాపోవచ్చు. ఉన్నప్పుడే కట్టిపడేస్తే వదిలిపోతుంది కదాని.’’

‘‘ఆ… మరిప్పుడు వాడెళ్ళనంటనాడు ఏం చేస్తావు?’’

‘‘అంటాడంటాడు. వాడిష్టమూ, నీ ఇష్టమూని. ఎన్నో రోజని చేరి? ఓ రెండ్రోజులెళ్తే మూడో రోజుకి అదే అలవాటవుతుంది’’

శివగాడు అమ్మ వైపుకీ, నాన్న వైపుకీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఇంక తనే మాట్లాడాలని ముందుకొచ్చాడు. ‘‘స్కూలెల్లనసల! బాలేదు స్కూలు. స్కేలు కొత్తింది. మెప్పెస్తుంది,’’ అన్నాడు గట్టిగా.

‘‘నోర్ముయ్యరా. వేషాలు,’’ అని గొణిగి నాన్న మళ్ళీ మోచేతిలో ముఖం పెట్టుకున్నాడు.

ఈలోగా తలుపు దగ్గర్నుంచి, ‘‘పాలండీ!’’ అని వినిపించింది. అమ్మ శివగాడ్ని “ఊండునానా,” అని విడిపించుకుని గిన్నె కోసం వంటగదిలోకి వెళ్ళింది.

శివగాడు మంచం మీద కారు బొమ్మ వైపు చూశాడు. దాన్ని తీసుకోకుండా చేతులు వేలాడేసుకుని గుమ్మం వైపు నడిచి వెళ్ళాడు. పాలాయన వీడ్ని చూసి, ‘‘టిర్రిక్,’’ అని నాలికతో చప్పుడు చేశాడు.

శివగాడు నవ్వనా మాననా అన్నట్టు నవ్వాడు.

‘‘పాలు తాగుతున్నావా రోజూనీ?’’ అని అడిగాడు ఆయన వంగి.

‘‘ఆ?’’

‘‘పాలు… పాలు తాగితే బలమొస్తాది. చూడు కండలు,’’ అని చొక్కా చెయ్యి పైకి లాగాడు.

శివ కూడా చొక్కా చేయి లాగి చేతిని చూపించాడు. ‘‘బలం!’’

తాత ‘‘అబ్బో’’ అన్నాడు.

తర్వాత శివగాడు ముఖం మార్చుకుని తాత దగ్గరికి వెళ్ళి, ‘‘స్కేలు కొత్తింది,’’ అని చొక్కా చేతిని భుజం దాకా లాగి చూపించాడు.

శివ వాళ్ళమ్మ గిన్నెతో వచ్చింది. ‘‘ఇంకో రెండ్రోజు లాగాలండీ, జీతాలింకా పళ్ళేదు. మొత్తం నాలుగు నాగాలు,’’ అంది.

‘‘చూడండమ్మా… చిట్టీలున్నాయి కట్టాల్సినయి,’’ అన్నాడు పాలాయన తలగోక్కుంటూ.

శివ చొక్కా కిందికి లాక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మంచం ఎక్కి, నాన్న వీపుకి వీపు ఆనించి, కారు బొమ్మని కావిలించుకున్నాడు. చాలాసేపు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు.

ఆఫీసులో గొడవలేవో పెరిగిపెద్దవైపోయినట్టూ, ఉద్యోగం ప్రమాదంలో పడేదాకా వచ్చినట్టూ, ఏవేవో పిచ్చిపిచ్చి కలలొచ్చి నాన్నకి అర్ధరాత్రి ఎప్పుడో మెలకువొచ్చింది. ఇటు తిరిగి చెయ్యేస్తే శివగాడు తగిలాడు. మోచేతి ఊతంతో తలగడ మీద లేచి వాడి ముఖంలోకి చూశాడు. నుదురంతా చెమట చుక్కలున్నాయి. నాన్న వాడి లోకంలోకీ, కలల్లోకీ వెళ్ళాలని ప్రయత్నించాడు, వెళ్ళలేకపోయాడు. కాసేపు నిద్రపోయిన ముఖంలోకి చూశాడు. వాడ్ని మెల్లిగా తలగడ మీదకి లాగి, సందిట్లో పొదువుకొని, వాడి చిన్ని పొట్టని చేత్తో నిమురుతూ మళ్ళీ పడుకున్నాడు.

చక్రవేణు – ‘కువైట్ సావిత్రమ్మ’
కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన చక్రవేణు 1990 లో రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ అప్పట్లో ఒక సంచలనం.

పల్లెల పచ్చదనం గురించీ, పల్లెవాసుల మానవ సంబంధాల జీవన సౌందర్యం గురించీ సాహిత్యంలో కలల ప్రపంచాన్ని సృష్టించే మధ్యతరగతి మిథ్యాజీవుల రచనా ధోరణికి భిన్నంగా – ఓ కర్కశ జీవిత వాస్తవాన్ని మరింత నిర్దాక్షిణ్యంగా కథలోకి తెచ్చిన అరుదైన రచయిత చక్రవేణు.

పిల్లల పెళ్ళిళ్ళుచేయటానికి కోవేటి (కువైట్) నుంచీ తన ఊరు వచ్చింది సావిత్రమ్మ. భర్త చనిపొయాక తన మీద అత్యాచారం చేసిన సొంత మరిది చిన్నబ్బ ఆమే వ్యభిచారం చేస్తోందని ఒకప్పుడు పెట్టించిన పంచాయితీ, భర్త పోయాక ఆదుకోవాల్సిన బంధువుల ఊరిజనాల వెలివేత, ఫలితంగా ఊరొదిలి రహెమాన్ సాహెబ్ అండదండలతో కువైట్ వెళ్ళి డబ్బు సంపాదించి వచ్చాక తిరిగి వాళ్ళే నెత్తిన పెట్టుకోవటం, తమ భార్యల్నీ కూడా కువైట్కి పంపమని తరలివచ్చిన అదే మగప్రపంచం…

కథా చిత్రణలో flashback ను ప్రతిభావంతంగా వాడుకోవటం, పాఠకుడికి ఊపిరాడనంత వేగంగా కథను పరిగెత్తించిన తీరు, సూటిగా క్లుప్తంగా మామూలు మాటల్లో జీవితపు కాఠిన్యాన్ని చిత్రించటం ఈ కథలో కొట్టొచ్చినట్టు కనపడే రచనా శైలి. కడప ప్రాంతం నుంచీ బొంబాయి వెళ్ళే కిక్కిరిసిపోయిన ఆనాటి రైళ్ళూ, ఊళ్ళూ ఈ కథా నేపద్యం.

ఈ కథ గురించి “వలస అన్నది మనిషిని ఆదుకుంటూనే ఉంది. ఒక చోట తిండి దొరకకపోతే మరో చోటకి వెళ్ళి తిండి వెతుక్కుంటాడు మనిషి. ఆ మనిషి మగ వాడైతే శ్రమ దోపిడి మాత్రమే ఎదుర్కోవాలి. ఆడది ఐతే శరీర దోపిడీని కూడా భరించాలి. ఒక వైపు స్త్రీకి కట్టడి విధించే సమాజమే అదే స్త్రీని సంతలో నిలబెట్టి బానిసను చేసి అమ్మేస్తుంది.” అన్నాడట రచయిత.

1985 నుంచీ 1993 వరకూ ఏడెనిమిదేళ్ళలోపే ‘కొత్త చదువు’, ‘కసాయి కరువు’, ‘తెగిన పేగు’, ‘మృత్యుహక్కు’ వంటి గుర్తుండి పోయే కథలు రాసిన చక్రవేణు ఒక యాక్సిడెంట్లో తన మూడు పదుల వయసులోనే మరణించటం తెలుగు కథకు ఎంత నష్టమో ఈ కథ చదివితే మనకు అర్ధమవుతుంది.

- సురేష్

కువైట్ సావిత్రమ్మ

చక్రవేణు

సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు.

‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి మాట్లాడిన ఇల్లాళ్లు వున్నారు!

‘కడుపు నిండా కూడుపెట్టి లడ్డూ కారాలూ, చేసుకున్న పలారాలన్నీ కొరవ లేకుండా పెట్టించింది సాయిత్రమ్మ. పనీ పాటోళ్లను మరిసిపోకుండా చూసింది, నా తల్లి. ఈ చుట్టుపక్కల ఏ పెద్ద రైతన్నా ఇట్టా పెండ్లి కూడుపెట్టినోళ్లుండారంటమ్మే! పొద్దిట్నించీ మాయిటాల్దాకా పెండ్లింటి ముందు కూకోపెట్టి ఆకిరికి అంతా అయిపోనిచ్చి అడుగుబుడుగు ఊడిచేసింది సిలుం కూడు- చారునీళ్లు మన మొకాన పోస్తారు. ఇట్టా మన సాయిత్రమ్మలాగా ఎవురన్నా మంచి కూడుగానీ, పలారాలుగానీ పెట్టినోల్లుండారా!’ అని మాలపల్లి ఆడోళ్లు సాయిత్రమ్మను గురించి మరీ మరి పొగుడుకుంటూ చర్చించుకుంటున్నారు.

సావిత్రమ్మను అందరూ ‘కువైట్‌ సావిత్రమ్మ’ అని పిలుస్తారు. ‘కువైట్‌’ అనేది ఇంటి పేరుగా మారడానికీ, ఆమె ఆ ప్రాంతానికంతటికి మొదటిసారిగా డబ్బులు సంపాదించుకోవడానికి కువైట్‌ వెళ్లడమే కారణం. అప్పటి నుండీ ఆమెను ‘కువైట్‌ సావిత్రమ్మా!’ అని పిలవడం అలవాటయింది.

‘ఇప్పుడు గనక తన భర్త వుండి వుంటే, కొడుకూ, కూతురికీ ఇంత ఘనంగా పెండ్లి జరిగినందుకు ఎంత సంతోషపడునో… అయినా నా పిచ్చిగాని, ఆయన వుంటే నేను కువైట్‌కు ఎందుకు పోదును, కష్టమో- సుఖమో ఇక్కడే అందరితోనూ నేనూ వుండేదాన్ని కదా,’ అనుకొంటూ భర్తను గుర్తుకు తెచ్చుకొని బాధపడింది.

కొత్తగా కట్టించిన యింటిని తేరిపార చూసింది. ఊరి వాతావరణం మనసులో మెదిలింది. తన భర్తతో కలిసి జీవించిన రోజులు గుర్తుకొచ్చాయి, కన్నీళ్లు కొంగుతో ఒత్తుకుంది. భర్తలేని ఒంటరితనం, ఆయనతో కలసి వుండిన ఈ ఊరులో, ఇంటిలో ఎక్కువకాలం వుండలేననుకొంది. అందుకే తిరిగి కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకొంది. అయితే ఈసారి కొడుకు లేకుండా తాను ఒక్కతే పోవాలనుకుంది. తన దగ్గర ‘ఆజా వీసా’ వుంది కాబట్టి సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి కొడుకు కోడల్ని, కూతురు అల్లుడిని చూసుకొని వెళ్తూ వుంటే సరిపోతుంది. సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ నిట్టూర్పు విడిచింది.

కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చుకొన్నందుకు, బరువు దించుకొన్నట్లుగా ఊపిరి పీల్చుకొంది.

ఇప్పుడైతే తనను అందరూ ఎంతో మర్యాదగా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతున్నారు. తమ పిల్లలకు ‘వీసా’లు పంపమనీ, పరపతిచ్చి ఆదుకొమ్మని కొందరూ!

‘నీ రుణం వుంచుకోములే సాయిత్రమ్మా! మమ్మల్ని కూడా ఒక కంటి కనిపెట్టి చూడు, ఆదుకో పుణ్యముంటుందిలే,’ అని ప్రాధేయపడుతున్నారు.

‘వీళ్ల మాటలు, పలకరింపులు అంతా మనస్పూర్తిగానే చేస్తున్నారా, లేకుంటే నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి గౌరవిస్తున్నారా! మరి వీళ్లంతా ఒకప్పుడు నన్ను ఎంత కించిత్తుగా చూసేవాళ్లు!’

సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ వుంటే, వెనకటి రోజుల్లో, తన బతుకులో మర్చిపోలేని సంఘటన గుర్తు కొచ్చింది.

ఆ రోజు గురించి తలుచుకుంటే పీడకలలాగా అనిపిస్తుంది. అందుకే ఆ రోజును ఎప్పటికీ మర్చిపోదు సావిత్రమ్మ.

ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ అన్నాలు తినడం పూర్తయింది. రాత్రి పండుకోవడానికి సిద్ధమయ్యే సమయంలో, యింటి ముందు ఎవరో నిలబడి పిలిస్తే సావిత్రమ్మ బయటకొచ్చి చూసింది.

‘‘సాయిత్రమ్మా! పెద్దబ్బోల్లింటికాడ మద్దిచ్చ మంట నిన్ను రమ్మంటన్నారమ్మో,’’ అని ఊరి పెద్ద చాకలి వెంకటయ్య వచ్చి చెప్పినాడు.

‘‘నేనెప్పుడన్నా మద్దిచ్చాల కాడకు వచ్చినానా ఎంగటన్నా? కాదు కూడదంటే మా యింటాయన పోతా వుండె, ఇంక ఆయన చచ్చిపోయినాక ఎవరుండారు మా యింట్లో మద్దిచ్చాం కాడకు రాను?’’ సావిత్రమ్మ చెప్పింది.

‘‘మద్దిచ్చంకాడకు ఇనే దానిక్కాదు సాయిత్రమ్మ, ఆడ మీ ఓల్లే నీ మీద మద్దిచ్చం పెడతన్నారమ్మా, అందుకని గబాన పోయి పిల్చుకోని రాపోరా! అంటే వచ్చినాను తల్లీ,’’ వెంకటన్న వివరించినాడు.

‘‘నాపైన మద్దిచ్చమా…దేనికంట, నేనెవుర్నన్నా పొడిసినానా…లేకుంటే ఎవరి కొంపన్నా ముంచినానంటనా… సరేగాని ఆడెవురూరు వచ్చినారు ఎంగటన్నా,’’ సావిత్రమ్మ అడిగింది.

‘‘అంతా మీ చుట్టాలే వుండారమ్మా…పెద్దబ్బి గోరి రామయ్య వుండాడు. మీ మరిది చిన్నబ్బ వుండాడు. సావుకారి నాగయ్యను పిలిపించినారు. ఇంకా మీ ఓల్లు ఆడోల్లంతా వుండారమ్మ,’’ చాకలి వెంకటయ్య పేర్లన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఎవరు వచ్చిందీ చెప్పాడు.

ఆ మద్దిస్తం తనపైన ఎందుకు పెడుతున్నారో సావిత్రమ్మ మనసుకు అర్థమైపోయింది. అయినా పోయి తీరాలి. ఏదైతే అది అవుతుంది, వెళ్లక తప్పదు అనుకొనింది.

‘‘సరేలే నువ్వు పో ఎంగటన్నా, మా యమ్మ కోమిటోల్లింటి కాడికి వక్కల కోసం పోయింది. ఇంట్లో పిల్లోల్లంతా నిద్దరపోతున్నారు. ఆమె రాంగానే చెప్పొస్తాను నువ్వు పదా.’’

‘‘ఎందుకులే సాయిత్రమ్మా పెద్దామెను రానిచ్చే పోదాములే! బాగా పొద్ది పోయింది ఒక్కదానివే రాలేవులే అమ్మా!’’ వెంకటయ్య సౌమ్యంగా చెప్పాడు.

వెంకటయ్య మాట్లాడుతూ వుండగానే, సావిత్రమ్మ తల్లి లక్షమ్మ అంగడి నుండి వచ్చింది.

‘‘ఏం ఎంగటా ఊర్లో అన్నం పెట్టిచ్చుకునేదయిపోయిందా,’’ లక్ష్మమ్మ వెంకటయ్యను పలకరించింది.

వెంకటయ్య ఔనని తల వూపి, వచ్చిన సంగతి చెప్పాడు.

సావిత్రమ్మ మద్దిచ్చం సంగతి వినగానే దిగులుగా నిలబడిపోయింది. అప్పటికే తన భర్త మీద మద్దిస్తాలు ఎన్నోసార్లు జరిగాయి. ఈరోజు మల్లా ఏది మాట్లాడతారో, చుట్టాలు పగపట్టినట్టుండారు కదా అనుకొని బాధపడింది.

సావిత్రమ్మ తల్లికి చెప్పేసి వెంకటయ్యతో పాటు పెద్దబ్బగారింటి కాడికి బయలుదేరింది….

పెద్దబ్బగారిల్లంటె తన భర్త పుట్టి పెరిగిన ఇల్లు. తన భర్త తాతగారి పేరు. పెద్దబ్బ పెత్తనం వచ్చేటప్పటికి ఐశ్వర్యం బాగా తగ్గిపోయింది. కొడుకు రాజయ్యగానీ, కోడలు సావిత్రమ్మగానీ అతని మాటను కాదనకుండా నడుచుకున్నారు.

తండ్రి వ్యాపారం చేస్తానంటే కొడుకు రాజయ్య ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎట్లా ఇష్టముంటె, అట్లా చేయమన్నాడు. తండ్రి వ్యాపారం చేస్తూ వుంటే రాజయ్య శ్రద్ధగా వ్యవసాయం చేయడం సాగించాడు. నాలుగైదేళ్లకు బాకీలన్నీ తీరిపోతాయి కదా అనుకున్నారు. కాని అనుకున్నది తారుమారై తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అప్పుల వాళ్లంతా రాజయ్య మీదకు రావడం, విధిలేక భూములమ్మి తండ్రి చేసిన బాకీలు తీర్చడం, దాయాదుల దగ్గర తక్కువచూపుగా బతకడం ఇష్టం లేక ఇంటి జాగాతో సహా అన్నగార్లకే ఇచ్చేసి, ప్రక్కనే ఆనుకొని వున్న దిగవపల్లెలో ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. తండ్రి పోయాక సంవత్సరం కూడా తిరగకుండానే ‘రాజయ్య’ కూడా గుండెనొప్పితో హఠాత్తుగా చనిపోవడం అంతా ఒక కలలాగా జరిగిపోయింది. భర్త రాజయ్య చనిపోయాక, సావిత్రమ్మ కుటుంబానికి ఎవరి ఆదరణ లేక ఒంటరిదయింది. చివరికి ఇల్లు కూడా జరగని పరిస్థితిలో దిక్కులేనిదైపోయింది.

దిగవ పల్లెకూ- పెద్దూరికి మధ్యన చిన్న ఒంక మాత్రమే అడ్డముంది. ఒంక దాటుకొని ఊర్లోకి పోయేటప్పటికి పెద్దబ్బగారింటి కాడ వీధి కరెంటు లైటు కింద జనమంతా గుంపు కూడి, సావిత్రమ్మ కోసమే ఎదురుచూస్తున్నారు.

పెద్దబ్బగారింటి పందిరి కింద వేసిన పట్టెమంచంపై సావిత్రమ్మ బావగారు రామయ్య ఒక వైపు, షావుకారి నాగయ్య మరొక వైపు కూర్చున్నారు. వాళ్లకు ఎదురుగా వీధిలో తూర్పుదిక్కు కరెంటు స్తంభం దగ్గర రాతి బండలపైన సావిత్రమ్మ మరిది చిన్నబ్బ, ఆయనతో పాటు ఇంకా కొంతమంది మగవాళ్లు పెద్దలు కూర్చున్నారు.

వీధికి వారగా ఉత్తరం దిక్కున కొందరు, దక్షిణం దిక్కున కొందరు ఆడవాళ్లు కూర్చొని ఉత్సాహంగా చర్చించుకుంటూ గుసగుసలాడుకున్నారు. కొందరేమో ఎవరి వాకిళ్లలో వాళ్లు కూర్చొని జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నారు. సావిత్రమ్మ అక్కడికి రాగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడ్డం ఆపారు. సావిత్రమ్మ నేరుగా వెళ్లి తన తోడుకోడళ్లు కూర్చున్న చోటకు వెళ్లింది. సావిత్రమ్మ కూర్చోగానే తోడికోడళ్లు ఇద్దరూ దూరంగా జరిగిపోయారు. సావిత్రమ్మ ఒక్కతే నేరం చేసిన దానిలాగా బోనులో వున్న తీరుగా కూర్చుంది.

షావుకారు నాగయ్య సావిత్రమ్మను కళ్లద్దాల్లోంచి తేరిపార చూసి, ‘‘ఒరే చిన్నబ్బా…మరి మీ వదిన వచ్చింది,’’ అన్నాడు.

నాగయ్య మాట పూర్తిగాక ముందే చిన్నబ్బ అభ్యంతరం చెప్పాడు. ‘‘మామా ఇంకోసారి ఆ మాటనగాకు, అది నాకు వదిన కాదు! మా అన్న చచ్చిన రోజే అది నాకు వదిన కాకుండా పోయింది.’’

‘అవును నిజమేకదా! వాడన్న వుండి వుంటే నేను వదిన. అన్న చచ్చినాడు కాబట్టే, నెల కూడా తిరగక ముందే నన్ను బెదిరించి బలవంతంగా చెడిచినోడికి నేను వదిన వరస ఎట్టవుతానులే!’ సావిత్రమ్మ మనసులోనే గొనిగింది.

‘‘నువ్వు అనకున్నా, మేము అట్లా అనాల్సిందే కదరా!… సరేలే ఆమె వచ్చింది మరి…నువ్వేదో చెప్పాలంటివి కాదా చెప్పు,’’ నాగయ్య మద్దిస్తం ప్రారంభించాడు.

నాగయ్య మద్దిస్తం జరుపుతున్నాడంటే, ‘జిత్తులమారి నక్క పంచాయితీ పెట్టింది,’ అనేది ఆ  గ్రామంలో ప్రతీతి. అందుకే జనంలో నుండి, ‘‘చెప్పు నాయనా – నక్క తీర్పు చెప్పు,’’ అన్నారు.

‘‘ఏమిరా చిన్నబ్బా. కానీ మరి,’’ నాగయ్య అన్నాడు.

‘‘నన్నడిగేదేముండాది మామా! అది చేసే పని, మమ్మల్ని నలుగుర్లో తలెత్తుకోకుండా చేస్తోంది. ఊర్లో ఎవురు పట్టినా దీని మాటే చెపుతా మమ్మల్నీ, మా కుటుంబాన్నీ నవ్వులపాలు చేస్తన్నాది. ఆ సంగతి అందరికీ తెలుసుకదా!’’

చిన్నబ్బ ఆవేశంతో రొప్పుతూ అరిచాడు.

‘‘ఓరి చిన్నబ్బా అరిస్తే పొయ్యేది మన పరువేరా! దానికేమి సిగ్గూ మానం అనేది వుండేది కదా!’’ సావిత్రమ్మ బావగారు రామయ్య ఎత్తిపొడుపుగా అన్నాడు.

‘‘ఏమిరా చిన్నబ్బా, ఆయమ్మి సంగతి ఏం చెబుతావో చెప్పేసెయ్‌, ఈ పొద్దు ఏదో ఒకటి తేలాల.’’

రామయ్య గట్టిగా అరిచాడు.

‘‘నేను చెప్పాల్నా నువ్వు చెప్పకూడదా!’’ అంటూ చిన్నబ్బ, అన్ననే చెప్పమన్నాడు.

‘‘కడుపు చించుకుంటే కాళ్ల కాడ పడ్తాదని, ఆ పాడు మాటలన్నీ పెద్దోడు, దరమాత్తుడు నోటి బడీతా ఎందుకులే, నువ్వే చెప్పరా అబ్బా.’’

ముందుగానే అనుకున్న పథకాన్ని గుర్తుచేశాడు నాగయ్య.

అనుకున్న పథకం ప్రకారం ఏదో ఒకటి తొందరగా తేల్చాలి లేకుంటే మద్దిస్తం తారుమారవుతుందని చిన్నబ్బ గ్రహించి చెప్పడం ప్రారంభించాడు.

‘‘మామా, ఊర్లో యిన్ని రోజులా ఇది, ఎవురెవురితోనో వ్యభిచారం చేసింది. ఎన్నిసార్లో కొట్టినాం, తిట్టినాం. అయినా మానుకోలా. నలుగుర్లో మా పరువు తీసింది. ఇప్పుడు అక్కడెక్కడి నుంచో కువైట్‌కు పోయి ఒక నా కొడుకు వచ్చి వున్నాడు. ఈళ్లమ్మగారి వూరంట. రహిమాన్‌ అంట, ఆడితో కులకతా వుండింది. మా వంశాన్ని నాశనం చేయడానికే ఇది మా యింటికొచ్చింది.’’ చిన్నబ్బ ఆవేశంతో రొప్పుతూ అసలు విషయం బయటపెట్టాడు.

‘‘ఏమమ్మే, వాడు చిన్నబ్బ చెప్పేది నిజమేనా!’’ నాగయ్య సావిత్రమ్మను విచారించాడు.

‘‘ఏందయ్యా, దాన్నిచారించేది. అది ఈ వూళ్లో వుంటే మా పిల్లోళ్లకు పెండ్లిళ్లు కూడా కాకుండా, దాని బతుకును ఏలెత్తి చూపుతారు. ఉంటే వూర్లో అదన్నా వుండాల, లేకుంటే మేమన్నా వూరొదిలి పోవాల. అంతే ఏదో వొకటి తేల్చాలి ఈ రోజు,’’ రామయ్య తమ్ముని మాటలకు జత కలిపి అరిచాడు.

సావిత్రమ్మకు కళ్లల్లో నీళ్లు ఉబికి జలజలా రాలిపోతుంటే మౌనంగా రోదిస్తూ కూర్చుంది. జనంలో మరలా శబ్దం మొదలైంది.

‘‘ఏం సాయిత్రమ్మా తలొంచుకొని ఏడిసేదెందుకు. ఈడందరూ పతివర్తలైపోయి లోకానికి విరుద్ధంగా నువ్వు ఒక్కదానివే వ్యభిచారం చెయిలేదులే. ముసుగులో కనపడకుండా చేస్తే అందరూ పతివర్తలే, ముసుగు తీసితే అందరి గుట్టు ఎత్తిపోసినంతుంటాది. నీకేం భయంలేదు. నువ్వు చెప్పాలనుకొనేదేదో తెగేసి చెప్పేయ్‌.’’

మేమందరం నీకు మద్దతుగా వున్నాము, ఫరవాలేదన్నట్లు, చెంగవ్వ ధైర్యం చెప్పి, సావిత్రమ్మను మాట్లాడమనింది.

‘‘ఏమమ్మే! వాళ్లు చెబుతా వుండేది యినపడతా వుండాది కదా! గమ్మున మూగెద్దులాగా వుంటే ఎట్ట. ఏం చెబుతావో చెప్పు,’’ నాగయ్య గట్టిగా దబాయించినట్టు అన్నాడు.

‘‘ఏముండాదని చెప్పేదన్నా! బలమున్నోళ్లది, నోరున్నోళ్లది చెల్లుబాటవుతాది. మీరంతా వాళ్ల దిక్కు మాట్లాడేదానికి వచ్చినారేగాని, నా మాట కూడ పట్టించుకోని న్యాయం చెప్పాలనుండారా!’’

సావిత్రమ్మ ఏడుస్తూనే మాట్లాడతా వుండాది. కొద్దిసేపు అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. సావిత్రమ్మ చెప్పడం మొదలుపెట్టింది. అందరూ సావిత్రమ్మను సానుభూతితో చూస్తూ వింటున్నారు.

‘‘ఈళ్ల కందరికీ నేనేదో తల తీసేసినట్టు, లోకానికి విరుద్ధంగా నేనొక్కదాన్నే కాని పని చేస్తావున్నట్లు మాట్లాడతన్నారే. ఇన్ని రోజులూ ఈళ్లవురన్నా మమ్మల్ని ఆదుకున్నారా? మా యింటాయన పోయినాక, పాపం బిడ్డల గల్లదే అని విచారించి, ఒకపూటకు అన్నానికి సేరు గింజలుగానీ, రూపాయి డబ్బుగానీ ఇచ్చినోళ్లున్నారా? చెప్పమనండి చూద్దాం? సిగ్గు, మానం లేని బతుకంటున్నారే. అది నా పిల్లోళ్లను కాపాడుకొనేదానికే చేస్తున్నాగాని, ఒళ్లు బలిసి కొవ్వెక్కి చెయ్యలేదు. కూలికి పోయో, నాలికి పోయో నా బిడ్డలూ, నేనూ పస్తులుంటున్నామో, తింటున్నామో నా కొంపలో నేను పడున్నాను. ఎట్లనో నా బతుకు నేను బతికితే వీళ్లకేం బాధ. ఇప్పుడు ఆ కొంప కూడా లేకుండా తరిమికొట్టాలంటున్నారు. సరే అట్లనే కానీండి. నా బిడ్డలూ, నేనూ వూరొదిలి పోతాము, వాళ్లనే నా బతుకు కూడా బతికి రాజ్యమేలుకోమనండి.’’

సావిత్రమ్మ గబగబ ఆ మాటలనేసి, ఏడుస్తూనే తిరిగి వెనక్కి చూడకుండా పరుగెత్తుకొని ఇంటికొచ్చింది.

తల్లికి జరిగినదంతా చెప్పింది. అదే రోజు తెల్లవారుఝామున పాసింజరు రైలులో తల్లితోపాటు బిడ్డల్ని తీసుకొని పుట్టినూరుకు చేరుకొనింది.

పుట్టినింటి తరపున బంధువుల సహాయంతో రహిమాన్‌ సాహెబ్‌ అండదండలతో అతనితో కలసి కువైట్‌కి బయలుదేరిపోయింది. డబ్బులు బాగా సంపాదించి, ఇన్నాళ్లకు మరలా ఒక ఆస్తిపరురాలుగా భర్త వూరిలో కాలుపెట్టడం, పోయిన ప్రతిష్ట మరలా రావడం, అంతా విచిత్రంగా వుంది సావిత్రమ్మకు.

సావిత్రమ్మ మిద్దె వరండాలో మంచంపైన మేను వాల్చి గతాన్ని ఆలోచిస్తా వుంటే, అంతా ఆశ్చర్యంగానే వుంది. తనను ఈసడించి తరిమికొట్టిన బంధువులంతా ఇప్పుడు గౌరవించడం చూస్తే, వాళ్లది నటనే కానీ గౌరవం కాదని తెలుసుకొంది…ఎవరో వస్తున్నట్లు అలికిడైతే తలతిప్పి చూసింది.

మరిది చిన్నబ్బ, చిన్నబ్బ భార్య రామలక్ష్మమ్మ వచ్చి పిల్చేటప్పటికి, ఆలోచనల నుండి తేరుకొని లేచి కూర్చుంది.

‘‘భోజనానికి రమ్మని చెప్పి పంపితే రాకుండా, ఏడుస్తా కూకున్నావా! అక్కా!…అయినా ఆడబిడ్డను ఎన్ని రోజులు సాకినా అత్తగారింటికి పోయేవాళ్లేగాని, మనింట్లో వుంటారా,’’ రామలక్ష్మమ్మ అక్కకు ఓదార్పు చెబుతున్నట్టు చెప్పింది.

సావిత్రమ్మ దుఃఖించేది బిడ్డను అత్తగారింటికి సాగనంపినందుక్కాదని, సాటి బంధువులైన తనవాళ్లే తనను అవమానపరచి, వూరెళ్లగొట్టారని, గతాన్ని తల్చుకొని కళ్లల్లో నీరు కార్చిందని తోడికోడలు రామలక్ష్మమ్మ వూహించలేకపోయింది.

గతంలో వేర్లు పోకమునుపు కూడాగా వున్నప్పుడు కూడా తోడికోడలు రామలక్ష్మమ్మ తనతో వ్యతిరేకంగా వుండింది కాదు. అయితే మరిది చిన్నబ్బ చేసిన కట్టుదిట్టానికి భయపడి తనతో సన్నిహితంగా వుండేది కాదు. ఆ విషయం సావిత్రమ్మ ముందు నుంచి కూడా అర్థం చేసుకొన్నందువల్లనే, సావిత్రమ్మ; రామలక్ష్మమ్మ పట్ల అభిమానంగా వుండేది.

‘‘పోదాం పదక్కా అన్నం తినేసొద్దువు,’’ రామలక్ష్మమ్మ అక్కను బతిమాలింది.

‘‘ఎందుకులే రామలక్ష్మమ్మా నేను కూడా అన్నం చేసిపెట్టినా,’’ సావిత్రమ్మ జవాబిచ్చింది.

ఎంతసేపూ రామలక్ష్మమ్మ మాట్లాడుతుందేగాని, చిన్నబ్బ మాత్రం, సావిత్రమ్మతో ముఖాముఖి మాట్లాడలేదు. గతంలో అతని/తన ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని తల వంచుకొని నిలబడ్డాడు. సావిత్రమ్మ కూడా మరిది విషయాన్ని గమనించింది, అయినా పలకరించకుండానే వుండిపోయింది.

‘‘ఈ వారంలోనే కోవేటికి పోతన్నావన్నారు నిజమేనా అక్కా?’’

‘‘అవునమ్మే! పెళ్లికోసమని నిలబడినాగాని, లేకుంటే ఈపాటికే పోయుండాల్సింది. వచ్చే ఆదివారం జనతా ఎక్స్‌ప్రెస్‌లో బొంబాయికి పోయి, ఆడ్నించి కోవేటికి పోతాను,’’ సావిత్రమ్మ ఏమాత్రం కోపం లేకుండా మాట్లాడింది.

కొద్దిసేపు అందరి మధ్యన నిశ్శబ్దం ఏర్పడింది. వచ్చిన పని గుర్తుచేస్తూ, భార్యను అసలు విషయం మాట్లాడు అని సైగ ద్వారా చెప్పాడు చిన్నబ్బ.

‘‘మీ మరిది కూడా కోవేటికి రావాలంటున్నాడు అక్కా,’’ రామలక్ష్మమ్మ నసుగుతూ భర్త గురించి చెప్పింది.

తన దగ్గర వీసాలు ఏమన్నా వున్నాయని, వాటిని విచారించుకోవడానికే వచ్చినారని సావిత్రమ్మ గుర్తించింది.

‘‘నేను ఈసారి ఈసాలు తీసక రాలేదమ్మే, పెండ్లి విషయంలో పడి తొందరగా వచ్చేసినాను. ఒకేల రహిమాన్‌ మామ గనక తెచ్చుంటే అడిగి చెబుతాను,’’ సావిత్రమ్మ వివరించి చెప్పింది.

‘‘రహిమానన్నను అడిగితే మొగోళ్లకు తేలేదు. ఆడోళ్లకు కావాలంటే  వీసాలు తెచ్చినామని చెప్పినాడు వదినా!’’

ఎట్టకేలకు చిన్నబ్బ వదినతో మాట్లాడాడు. కాని సావిత్రమ్మ మాత్రం అతని మాటలకు జవాబివ్వకుండా వుండిపోయింది.

ఒకప్పుడు రహిమాన్‌ సాహెబ్‌ను, తనను ఇంట్లో వేసి అగ్గిపెడతానని గలాటా చేసిన చిన్నబ్బ, ఈరోజు ‘రహిమానన్న’ అని అనడం సావిత్రమ్మకు ఆశ్చర్యం అనిపించింది.

‘‘మొగోళ్లకు ఈసాలు తేలేదు కదా, అందుకని మీ మరిది నన్ను పంపించాలంటన్నాడక్కా…నువ్వు రమ్మంటే వస్తానక్కా…!’’ రామలక్ష్మమ్మ ప్రాధేయపడ్తున్నట్లుగా అడిగింది.

‘‘నాదేముండాది… రహిమాన్‌ మామ రమ్మనుంటే అట్లే రండి…కానీ అక్కడ చానా యిబ్బందులుంటాయి. వాటిని ఓర్చుకొంటామనేటుగా వుంటేనే రావాల. ఒకేల వచ్చినాక అక్కడి పనులు చేయలేమనుకుంటే మీకే నష్టం… అందుకుని ముందుగానే ఆలోచించుకోండి,’’ సావిత్రమ్మ, తోడికోడలుకే కాకుండా మరిది కూడా వినాలని గట్టిగా చెప్పింది.

‘‘నేను చేను కాడికి పోయ్యేసొస్తా,’’ చిన్నబ్బ భార్యతో అనేసి వెళ్లిపోయాడు.

సావిత్రమ్మ, రామలక్ష్మమ్మ ఇద్దరూ ఏం మాట్లాడకుండా కొద్దిసేపు వున్నారు. తర్వాత సావిత్రమ్మ మాట్లాడింది.

‘‘నేను నేరుగా బొంబాయికి పోతూనే ఎక్కువ రోజులుండకుండానే కోవేటికి పోతాను. నువ్వు నానంబడే వచ్చేదానికి వీలుపడదు రామలక్ష్మమ్మా, నీకు బొంబాయిలో డాక్టర్లు పరీచ్చలు చేసి, పాస్‌ పోటో, ఈసా తనికీ చేసేసినాక అన్నీ రెడీ అయ్యేటప్పటికి సుమారుగా ఎంత లేదన్నా రెండు, మూడునెల్లన్నా పడతాది,’’ సావిత్రమ్మ వివరించింది.

‘‘రహిమాన్‌ మామ కూడా మా యింటాయనతో అదే మాట చెప్పినాడంటక్కా!’’

‘‘సరే నీ బడీతా మీ యింటాయన్ను కూడా బొంబాయిదాకా రమ్మన్నాడా, లేకుంటే వద్దులే అన్నాడా.’’

‘‘నీకు మర్లా ఖర్చు దేనికి చిన్నబ్బా… నేను బడీతా వుండి నీ భార్యను జాగర్తగా పిల్చకపోతాను కదా, అని రహిమాన్‌ మామ చెప్పినాడంటక్కా!’’

రామలక్ష్మమ్మ అమాయకంగా చెపుతాంటే సావిత్రమ్మకు ఒక విధమైన సానుభూతి కల్గింది. రామలక్ష్మమ్మకు భర్త ఏమీ చెప్పినట్టుగా లేదనుకొనింది. రహిమాన్‌ ఉపాయం ఏమిటో కూడా ఆమెకు తెలిసినట్లుగా లేదనుకొనింది.

‘‘కాని రామలక్ష్మమ్మ నీకొక సంగతి చెప్పాలమ్మే! మర్లా ఇదిగో చూడు ఆ యక్కయినా ఒక మాటన్నా చెప్పలేదు చూడు అనుకోగాకు… బొంబాయికి పోయినాక ఎట్టలేదన్నా నీవు రెండు మూడు నెలలు అక్కడే వుండొచ్చు. ఈ రెండు నెలలు, నిన్ను తీసకపోతా వుండారే ఏజెంట్లు, వాళ్లు మర్యాదగా చూస్తారనుకోగాకు. అక్కడ వాళ్లకు కావాల్సిన మొగోళ్ల దగ్గరికల్లా నిన్ను పంపిస్తారు. నేను చెప్పేది మాత్రం అచ్చరాల నిజం. నీకు ఇష్టమున్నా లేకున్నా సరే వాళ్లు చెప్పింది చేయకుండా మాత్రం కోవేటికి పోలేవు. నీమీద నాకు దయుండాది కాబట్టే నీకు ఈ సంగతి చెబుతున్నా. ఆడోల్లు కోవేటికి పోతన్నారంటె అంత సులభంగా పోతన్నారనుకోవద్దు. అందుకని బాగా ఆలోచించుకో.’’

సావిత్రమ్మ ఏజంట్ల గుట్టునూ, దళారీతనాన్నీ పూసగుచ్చినట్టు వివరించింది.

సావిత్రమ్మ చెప్పినదంతా విన్నాక, రామలక్ష్మమ్మ బోరుమని ఏడ్చింది.

‘‘మా యింటాయనకు ఆ సంగతులన్నీ తెలిసి కూడా నన్ను పంపిస్తన్నాడక్కా…! వాళ్లు ఏమి చెప్పినా నన్ను ఒప్పుకొమ్మని చెప్పినాడు, నేను ఆ మాదిరిగా చేయను, పోనంటె నన్ను పట్టుకొని కొడతన్నాడు. ఇంక ఈ దెబ్బలతో ఇక్కడ చచ్చేదానికన్నా, ఆడికిపోయి బతకడమే మేలనిపిస్తా వుంది,’’ అంటూ రామలక్ష్మమ్మ ఏడుస్తూనే వివరించింది.

‘‘నాకు ఎందనా యిదిలేక బిడ్డల్ని పస్తులు పండుకోమని చెప్పలేక, వాళ్ల తిండి కోసమని, కానికూడని పనికి కక్కుర్తిపడితే, నీ మొగుడు పంచాయతీ పెట్టి వూరెళ్లగొట్టినాడు, ఇప్పుడు నిన్నేమో తెలిసి కూడా అతనే ఎబిచారంలోకి దింపుతున్నాడు. దీన్నేమంటారో అడగలేకపోయినావా?’’

సావిత్రమ్మ మనసులో అణచుకోలేక అడిగేసింది.

‘‘అన్నీ తెలిసినదానివి, నువ్వే నన్నడిగితే నేను ఏమి చెప్పాలి అక్కా,’’ రామలక్ష్మమ్మ జవాబిచ్చింది.

‘‘అంతేనమ్మే దండిగా డబ్బులొచ్చేట్టుగా వుంటే, వాళ్లు, పాలుడ్డ పడేది కాకుండా, పెండ్లాలను కూడా అమ్మేస్తారు, నీ మొగుడులాంటోళ్లు…’’ సావిత్రమ్మ మనసులోని కోపాన్ని బయటకు వెలిబుచ్చింది.

కొద్దిసేపటికి తన కోపాన్ని అణచుకొని మనసును ప్రశాంతతలోకి తెచ్చుకొనింది.

‘‘నేను ఆదివారం రోజు రైలుకు జనతాలో బొంబాయికి వెడతాను. నువ్వు వచ్చేటుగా వుంటే ఆ రోజుకు ముందుగానే టిక్కెట్టు తీసుకోవాలి. కనీసం బొంబాయిలో నీకు తోడుగా పదిరోజులన్నా ఉంటాను.’’

సావిత్రమ్మ అన్ని విషయాలు వివరంగా చెప్పినాక రామలక్ష్మమ్మ ఆలోచిస్తూ యింటికి వెళ్లిపోయింది.

ఆరోజు సాయంకాలం బొంబాయికి వెళ్లే జనతా ఎక్స్‌ప్రెస్‌ కోసం, కోడూరు రైల్వేస్టేషన్‌లో జనం విపరీతంగా కిక్కిరిసి వున్నారు. సావిత్రమ్మనూ, రామలక్ష్మమ్మను ట్రైన్‌ ఎక్కించి వీడ్కోలు చెప్పడం కోసం పెద్దూరు జనమంతా కదిలి స్టేషన్‌కు వచ్చారు.

వారానికి ఒకరిద్దరు తప్పకుండా, ఆ స్టేషన్‌ నుంచి కువైట్‌కు వెళ్లే ప్రయాణీకులుంటారు. ఆరోజు చాలామంది వున్నట్టు వుంది. వారి బంధువులను పట్టుకొని ఏడుస్తున్నారు. ‘పోతానే ఎట్టెట్ట చేరినావో అన్ని సంగతులూ, జాబు రాయి,’ అని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఇంతలోనే పెద్దగా ఏడ్చుకుంటూ కొందరు ప్లాట్‌ ఫారం పైకి పెద్ద గుంపుగా కదిలి రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఒక ముస్లిం అమ్మాయి, పెండ్లి కూడా కాని పదిహేడు సంవత్సరాల అమ్మాయిని వాళ్ల తల్లిదండ్రులు కువైట్‌కు పంపుతూ వుంటే, ఆ పాప దిక్కులన్నీ దద్దరిల్లేటట్లు శోకాలు తీస్తూ వుంది.

‘‘నీకేం భయం లేదులే బిడ్డా! మీ మామ వెంబడే వస్తల్లా, నీకేం దిగుల్లేకుండా అన్నీ చూసుకుంటాడులే…రెండు సంస్తరాలు గట్టిగా వుంటే సాల్‌, మల్లి వద్దు వచ్చేసెయ్‌ బాగా పెండ్లి చేస్తామ్,’’ అంటూ తల్లి బిడ్డకు నచ్చచెప్పుతూ వుంది.

‘‘పెండ్లికాని పసిబిడ్డను, కాని దేశానికి తరిమి ఆ డబ్బులూ, సంపాదన లేకుంటే ఏమి! ఛీ… దానికన్న ఇక్కడే అడుక్కోని బతికినా గౌరవమే!’’

‘‘అమ్మా, నాయిన దగ్గరుండి కసాయికి గొడ్డును తోలినట్టు తోల్తున్నారే, మనుషులేనంటయ్యా!!’’

చూస్తున్నవాళ్లు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.

రైలుబండి స్టేషన్లోకి రాగానే జనం ఒకరినొకరు తోసుకొంటూ పెట్టెల దగ్గరకు పరుగుతీశారు.

సావిత్రమ్మ పెట్టెలోకి వెళ్లి తన రిజర్వేషన్‌ సీట్లో కూర్చుని వుంది. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, బంధువులందరూ వచ్చి వీడ్కోలు చెప్పారు.

రామలక్ష్మమ్మను బంధువులందరూ పట్టుకొని ఏడుస్తున్నారు. చిన్నబ్బ భార్యను వదలలేక వదులుతున్నట్లుగా బాధపడిపోతున్నాడు. పెద్దవాళ్లు కొందరు ధైర్యం చెబుతూ వుంటే రైలు కదిలింది.

రహిమాన్‌ సాహెబ్‌ కంపార్ట్‌మెంట్‌ డోర్‌ దగ్గర నిలబడి రామలక్ష్మమ్మను పెట్టెలోకి లాగాడు. కదిలి వెళ్తున్న రైలు శబ్దం కన్నా, ప్లాట్‌ఫారంపై నిల్చొని ఏడుస్తున్న జనం అరుపులే బిగ్గరగా వినిపిస్తా వున్నాయి.

రైలు కనుమరుగయ్యేంతవరకూ ప్లాట్‌ఫారంపై జనాలు చేయూపుతూనే వున్నారు.

రామలక్ష్మమ్మ కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ వుంటే పెట్టెలోని జనమంతా సానుభూతితో ఆమె వైపే చూస్తున్నారు. ఉన్న వూరినీ, కన్నవారినీ, బంధువుల్నీ వదలాలంటే రామలక్ష్మమ్మకు సాధ్యం కావటంలేదు. అందుకని అంతగా దుఃఖిస్తూ వుంది.

సావిత్రమ్మకు ఆశ్చర్యంకానీ, పెద్దగా బాధకానీ లేదు. తనకు అది మామూలైపోయింది. కళ్లల్లో నీళ్లు వుబికి అక్కడే ఆగిపోయాయి. మనసంతా భారంగా వుంటే సీట్లో వెనక్కి వాలి కూర్చుంది.

సావిత్రమ్మకు తాను భరించిన కష్టాల జీవితానుభవం, అవి నేర్పిన పాఠాలు, బతుకుసూత్రాన్ని వడగాచి తెలుసుకున్నట్లుంది. అందుకే కొడుకూ-కోడలు, కూతురూ-అల్లుడూ, బంధువులంతా కనుమరుగవుతున్నా కళ్లల్లో కన్నీరు మాత్రం కారలేదు. మనుషులూ మాయలూ-మర్మాల్నీ చదువుతున్నట్లుగా కళ్లు మూసుకుని, విరక్తిగా నవ్వుతూ ఆలోచిస్తా వుంది సావిత్రమ్మ.

మొదటి ముద్రణ: ఆంధ్రజ్యోతి 20 జూలై 1990, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 99

అచ్చుప్రతి Credit: కథానిలయం

Illustration credit: ఆంధ్రజ్యోతి

పార్డన్ మి ప్లీజ్!
FADE IN:

EXT. శాండియేగోయూనివర్శిటీ

గ్రాడ్యుయేషన్వేడుక – ఉదయం 9:00AM

(అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియేగో యూనివర్శిటీ ప్రాంగణం.

విద్యార్థులు స్నాతకోత్సవ దుస్తులు ధరించి కుర్చీలలో కూర్చుని ఉన్నారు.

వేదిక మీద ముఖ్య అతిధులుతో పాటు యూనివర్శిటీ చాన్సెలర్, ఇంకా మరికొంతమంది ఉన్నారు.

వెనుక భాగంలో విద్యార్థుల తల్లితండ్రులూ, స్నేహితులూ నిల్చుని వీక్షిస్తున్నారు.

కొందరి చేతుల్లో వీడియో కెమేరాలూ, మామూలు కెమేరాలూ, సెల్ఫోన్ కెమేరాలతో ఆక్కడి దృశ్యాలని బంధిస్తున్నారు.

వేదిక దగ్గర నిశ్శబ్దంగా ఉన్నా, వెనుక భాగం కొలాహలంగానే ఉంది.

తదుపరి అంశంగా విద్యార్థుల ప్రసంగ వివరాలు మైకులో ప్రకటన.)

వాచకుడు

“ఇప్పుడు విద్యార్థులు వారి నాలుగేళ్ళ కాలేజీ అనుభవాలను మనతో పంచుకుంటారు.

ప్లీజ్ వెల్‌కమ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఫ్రొమ్ థర్‌గుడ్ కాలెజ్ విలియమ్ జోర్డాన్!”

(వాచకుడి నిష్క్రమణ)

DISSOLVE TO:

(విలియమ్ జోర్డాన్ బలిష్టమైన నల్లజాతి వ్యక్తి. ఆరడుగుల పొడవు. వయసు ఇరవైమూడేళ్ళు. విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య మెల్లగా నడుచుకుంటూ డయాస్ వైపుగా నడుస్తాడు. గొంతు సవరించుకొని మాట్లాడడానికి సిద్ధమవుతాడు.)

విలియమ్ జోర్డాన్

వారానికి ఏడు రోజులు.

పన్నెండు వారాలకి ఒక త్రైమాసికం.

వెరసి ఏడాదికి మూడు.

ఇలా ఇక్కడ నాలుగేళ్ళ అనుభవాలు.

కొన్ని తీపివీ. మరికొన్ని చేదువీ.

కొన్ని మామూలువీ. మరికొన్ని అద్భుతమైనవీ.

ఈ కాలేజీ ప్రాంగణంలో – ఎన్నో పరిచయాలూ, సాంగత్యాలూ, సంభాషణలూ, ఒప్పికోళ్ళూ, వాదాలూ, వివాదాలూ -  ఇవన్నీ నన్నొక కొత్త వ్యక్తిగా మార్చాయి.

ప్రెశిడెంట్ మార్టిన్, డీన్ మేథ్యూ, స్నేహితులారా, నా కుటుంబ సభ్యులారా, మీ అందరితో నా అనుభవాన్ని పంచుకోవడం ఒక అదృష్టం…

DISSOLVE TO:

(నాలుగో వరసలో ఉన్న విద్యార్థి సాగర్ వయసు ఇరవై మూడేళ్ళు. అతనూ గ్రాడ్యుయేట్ గౌను ధరించాడు. సాగర్ జేబులో నుండి సెల్ఫోన్ తీసి, వాట్సాప్ కాంటాక్ట్స్ లో వాళ్ళ అమ్మ నంబరు తీసుకొని టెక్స్ట్ మెసేజ్ పెట్టడం మొదలు పెట్టాడు.)

సాగర్: ” మామ్! నీకో నీకో షాకింగ్ న్యూస్…ఇప్పుడు స్టేజిమీద విలియమ్ మాట్లాడు తున్నాడు.”

(పది సెకన్ల తరువాత ఫోనులో విండో పాపప్ అవుతుంది. ఆవలి వైపునుండి సాగర్ తల్లి ప్రతిమ జవాబు.)

ప్రతిమ:  ” వాట్…ఏ…విలియమ్?…”

సాగర్:  “వాడే ఆ డర్టీ ఫెలో. నీ పాలిట…”

ప్రతిమ: “రియల్లీ…? వాడెందుకున్నాడు?… ”

సాగర్:   “ఐ డోంట్ నో!  మాట్లాడే వాళ్ళల్లో వాడూ ఒక స్టూడెంట్!

బైద వే – తాతకి ఎలా వుంది?”

ప్రతిమ: “సీరియస్ అన్నారు డాక్టర్లు. ఇంకా కోమాలోనే

ఉన్నాడు… నీరజ మొత్తం వీడియో తీస్తోందా…?

ఐ మిస్ యూ నాన్నా! ”

సాగర్:   “తీస్తోంది. వాడు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్‌ట…స్టేజి మీద

మాట్లాడు తూ ఇప్పుడే చెప్పాడు.. ఎనీవే  బై, ttyl! ఐ మిస్ యూ మామ్!”

ప్రతిమ:   “బై..”

DISSOLVE TO:

విలియమ్

నేనొక దౌర్భాగ్య విద్యార్థిని. ఇలా చెబితే మీరు నమ్మరు.

ఎందుకంటే కొద్ది క్షణాల్లో నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కాబోతున్నాను.

ట్రైటన్ బేస్కెట్‌బాల్ జట్టులో మన యూనివర్శిటీకి ఆడాను.  ఇవన్నీ చూసి మీరు నన్నొక గొప్ప విద్యార్థిననుకొని భ్రమ పడేరు. నేనొక మొద్దు విద్యార్థిని.

చిన్నప్పట్నుండీ నాకు చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు. మాది బీద నల్లజాతి కుటుంబం.

నేను అయిదో తరగతిలో ఉండగా మా అమ్మా, నాన్నా విడాకులు తీసుకున్నారు. ఊహ తెలిసాక మా నాన్నని చూడలేదు. మా అమ్మ వేరెవరినో పెళ్ళిచేసుకుంది.

నా అలనా, పాలనా మా అమ్మమ్మే చూసింది.

మేం ఇద్దరం ఈస్ట్ పాలో ఆల్టోలో ఉండేవాళ్ళం. అక్కడే ఎలిమెంటరీ వరకూ చదివాను.

నేను బాగా చదవాలని మా అమ్మమ్మ క్యుపర్టినో మారింది. అలా నేను కెనడీ మిడిల్ స్కూల్లో చేరాను.

ఆ స్కూలికి మంచి రాంకింగ్ ఉంది. ఆ స్కూల్లో చదువు ఒత్తిడి తట్టుకోవడం నా వల్ల కాలేదు.

నా దృష్టంతా బేస్కెట్ బాల్ ఆడటం మీదనే ఉండేది.

హోం వర్కులన్నీ మిగతా ఫ్రెండ్సు దగ్గర కాపీ కొట్టేవాణ్ణి.

ఫైనల్ పరీక్షలు సరిగా రాయలేదు. మరలా ఆరో తరగతి చదవాల్సి వస్తుందని అనుకున్నాను.

ఎలా పాస్ చేసారో నాకు తెలీదు. ఏడో తరగతిలో ప్రవేశించాను.

సరిగ్గా అప్పుడే నాకు మిస్ ప్రతిమ గుప్తా పరిచయం అయ్యింది.

ఆవిడ మా లెక్కల టీచరు. జామెట్రీ క్లాసు చెప్పేది. నాకు లెక్కలంటే చచ్చేటంత భయం.

ఆవిడ చాలా గట్టి టీచర్.  హోం వర్కులకి ఫ్రెండ్స్ సాయం పట్టేవారు. మొదటి టెస్టులో నాకు సున్నా మార్కులొచ్చాయి…

DISSOLVE TO:

(సాగర్ వాళ్ళమ్మకి  ఫోనులో Text చేస్తున్నాడు.)

సాగర్:  “అమ్మా! విలియమ్ నీ గురించి చెబుతున్నాడు.”

(ఆవలి వైపు నుండి జవాబు లేదు. నిరాశగా తలాడిస్తూ స్టేజి వైపు దృష్టి సారించాడు.)

DISSOLVE TO:

విలియమ్

….క్లాసు అయ్యాక కలవమని చెప్పింది. సరిగ్గా అప్పుడే నాకు బేస్కెట్‌బాల్ ఆడే వేళ.

మిస్ ప్రతిమని కలవలేదు. మర్నాడు క్లాసుకి వెళ్ళడానికి భయం వేసింది. ఎగ్గొట్టేసాను.

హిస్టరీ క్లాసులో ప్రిన్సిపాల్ ఆఫీసు నుండి రమ్మనమని కబురొస్తే వెళ్ళాను.

మిస్ గుప్తాతో మూడున్నరకి మీటింగ్.

బాస్కెట్ బాల్ ఆట పోతుందని మరో పక్క కోపం. భయం భయంగా వెళ్ళాను.

పరీక్ష ఎందుకు సరిగా రాయలేదని ప్రశ్న.

నాకు లెక్కలు రావని చెప్పాను.

మరి హోంవర్క్ ఎలా చేస్తున్నావు.

కాపీ కొట్టానని గట్టిగా రెట్టిస్తే చెప్పాను.

రోజూ స్కూలయ్యాక మూడింటికి తన క్లాస్ రూముకి రమ్మనమనీ, అక్కడే హోం వర్కు చెయ్యాలని చెప్పింది.

సరే నన్నాను పైకి. లోపల తెగ తిట్టుకున్నాను. చంపేయాలన్నంత కోపం వచ్చింది.

మర్నాడు క్లాసయ్యాక బేస్కెట్ బాల్ ఆటకి వెళ్ళాను. కొంతసేపయ్యాక అక్కడకి మిస్ ప్రతిమ వచ్చింది.మధ్యలో ఆపి తిట్టుకుంటూ ఆవిడ వెనుకే వెళ్ళాను…

DISSOLVE TO:

(సాగర్ నీరజకి మెసేజి చేసాడు. పద్దెనిమిదేళ్ళ నీరజ సాగర్ చెల్లెలు.)

సాగర్: “విలియం అమ్మ గురించి చెబుతున్నాడు…విన్నావా…?”

నీరజ: “చూసా.”

(సాగర్ తల్లికి మరలా మెసేజ్ చేసాడు.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM – HYDERABAD, INDIA

(కుర్చీలో తూలుతూ కునుకు తీస్తున్న  ప్రతిమ ఫోన్ మెసేజ్ రింగుకి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూసింది.

గదంతా నిశ్శబ్దంగా ఉంది. ముఖం నిండా గొట్టాలతో తండ్రి బెడ్‌మీద అచేతనంగా కనిపించాడు.

మరలా ఫోన్ మెసేజ్ కేసి చూసింది.  ఒక్కసారి ఆమెకు విలియమ్ గుర్తుకొచ్చాడు.)

CUT TO:

INT. CUPERTINO-KENNEDY MIDDLE SCHOOL ROOM NO.10:

(విలియమ్ తలదించుకొని ఉన్నాడు. ప్రతిమ కళ్ళెర్రజేస్తూ అతని వైపు చూసింది. అతను తలెత్త లేదు.)

ప్రతిమ

“నీకు బేస్కెట్ బాల్ అంటే అంత ఇష్టం కదా? బాల్ సైజు ఎంతుంటుంది? ఐ మీన్ డయామీటర్ ఎంతో తెలుసా?”

(తెలీదన్నట్లు తలాడించాడు.)

“పోనీ రింగ్ సైజయినా తెలుసా?”

(మరలా అదే జవాబు. తలదించుకున్నాడు.)

“నీ హోం వర్కు అదే. తెలుసుకురా?”

(సరేనని మెల్లగా రూము బయటకి వచ్చాడు.)

CUT TO:

(స్కూల్ బెల్ మ్రోగుతుంది. పిల్లలందరూ క్లాస్ రూము నుండి బయటకి బిలబిలా వస్తున్నారు.

విలియమ్ రూమ్ నంబరు 10 వైపుగా వెళుతున్నాడు. ఎప్పటిలాగే మధ్యాన్నం స్కూలు తరువాత క్లాస్.

లోపలకి వెళ్ళగానే ఒక కాగితమ్మీద రాసింది మిస్ ప్రతిమకిచ్చాడు.

ప్రతిమ చూసి నవ్వుకుంది.)

ప్రతిమ

“చూసావా? ఒక బాల్ తయారు చెయ్యాలంటే దాని సైజు తెలియాలి.

ఇంకా ఈ బేస్కెట్ బాల్ రిమ్ ఎంత ఎత్తుండాలీ, రింగ్ సైజు ఎంతా? ఇవన్నీ జామెట్రీ తెలిస్తే చాలా ఈజీ.

అదే కాదు, నువ్వు దూరం నుండి బేస్కెట్ వెయ్యాలంటే ఏ ఏంగిల్లో వెయ్యాలి? ఎంత లూపులో విసరాలి ఇవన్నీ లెక్కలే…”

(విలియమ్ నవ్వాడు. ప్రతిమ జామెట్రీ లెక్కలు చెబుతోంది. అవి పూర్తి చేసి వెళుతూండగా…) -

ప్రతిమ (CONT’D)

“విలియమ్!  నీకు క్రిసమస్‌కి  ఏ గిఫ్ట్ కావాలనుకుంటున్నావు?”

విలియమ్

“ఐ లైక్ కోబీ బ్రాయన్ హైపర్ డంక్ షూస్! మా అమ్మమ్మని అడిగాను. మూడొందల డాలర్లు పైనే అంది…”

ప్రతిమ

“నువ్వు లెక్కలు బాగా చెస్తే మీ అమ్మమ్మని కొనమని చెబుతాను…. బట్ టూ నీడ్ టు వర్క్ హార్డ్!”

(విలియమ్ మొహంలో చిన్నగా చిరునవ్వు…)

CUT TO:

EXT. SAN DIEGO GRADUATE CEREMONY STAGE

విలియమ్ (CONTD…)

మాకు వేరే స్కూళ్ళతో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ఉంది. జిమ్‌లో ప్రాక్టీసు చేసేవాళ్ళు. దాని కోసం స్కూలు ఎగ్గొట్టేవాణ్ణి. ఎవరూ లేకపోయినా నే ఒక్కణ్ణే ప్రాక్టీసు చేసేవాణ్ణి.

ఈ విషయం అమ్మమ్మకీ తెలీదు. ఆవిడ నన్ను స్కూల్ దగ్గర దింపగానే క్లాసుకి వెళ్ళకుండా జారుకునేవాణ్ణి.

ఓ వారం రోజులు స్కూలుకి రావటంలేదని ఇంటికి నోటీసు వచ్చింది. అది చూసి అమ్మమ్మ నన్ను నిలదీసింది.

మిస్ ప్రతిమ నన్ను లెక్కలు చెయ్యడంలేదని బెదిరిస్తోందని స్కూలంటే భయంతో వెళ్ళడం లేదనీ అబద్ధం చెప్పాను. నేనొక ఘోరమైన అబద్ధం చెప్పాను.

మా అమ్మమ్మ స్కూల్లో మిస్ ప్రతిమ మీద కంప్లైంట్ చేసింది.

అది మామూలు కంప్లైంట్ కాదు. మిస్ ప్రతిమ రేసిజం చూపిస్తోందని ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ యూనియన్‌కి ఫిర్యాదు చేసింది.

ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. మిస్ ప్రతిమ గుప్తాని స్కూల్ నుండి సస్పెండ్ చేసారు.

సరిగ్గా అప్పుడే మా అమ్మమ్మకి శాండియేగోలో కొత్త జాబ్ వచ్చి మేం బే యేరియా వదిలేసాం…

ఇదంతా ఎందుకు చెప్పానంటే – మిస్ ప్రతిమా నాకు ఎంతో మేలు చేసింది.

తలచుకున్నప్పుడల్లా గిల్టీ ఫీల్ అవుతాను. ఆ గిల్టీయే నన్నింత వాణ్ణి చేసింది.

ఎలాగైనా బాగా చదవాలన్న పట్టుదల నాకు కలిగింది.

ఆవిడ వేసిన పునాదే ఇవాళ నేను మీతో మాట్లాడేలా చేసింది. ఐ నెవర్ ఫర్గెట్ హెర్.

ప్రతీ క్రిస్మస్‌కీ మిస్ ప్రతిమా గుప్తాని తల్చచు కుంటాను.

నేను లెక్కల్లో శ్రద్ధ చూపించడం చూసి మిస్ ప్రతిమ ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. మా అమ్మమ్మకి చెప్పలేదు. కోబీ షూస్!

నా జీవితంలో ఒక ఖరీదైన బహుమతీ అదే.

మిస్ ప్రతిమా గుప్తా పరిచయం అవ్వడం నా అదృష్టం.

మీ అందరి ముందూ ఇలా చేసిన తప్పు ఒప్పుకోవడం ఇంకా పెద్ద అదృష్టం.

చివరగా -

కొంతమంది టీచర్లు పాఠం మాత్రమే చెప్పరు.

నడక నేర్పుతారు. మార్గదర్శకులవుతారు.

దానికి నేనే ప్రత్యక్ష సాక్షి.

ఇవాళ నేను అందుకోబోయే డిగ్రీ నాది కాదు.

మిస్ ప్రతిమా గుప్తాది.

We are all here because of our teachers!

థాంక్యూ!!

(విలియమ్  ప్రసంగం ముగించగానే అందరూ కుర్చీల్లోంచి లేచి నిలబడ్డారు. ఆ ప్రాంగణమంతా తప్పట్లతో మిన్నంటింది.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM

(ప్రతిమ కుర్చీలో అటూ ఇటూ అసహనంగా జరిగి, ఒక్క సారి కళ్ళు మూసుకుంది. పదే పదే ఒక సంఘటన గుర్తుకొస్తోంది.)

CUT TO:

INT. KENNEDY MIDDLE SCHOOL PRINCIPAL’S OFFICE

(ప్రిన్సిపల్ షెర్లీ డేవిడ్ ప్రతిమ కేసి చూసి అంటోంది.)

షెర్లీ డేవిడ్

“మిస్ ప్రతిమా గుప్తా!  నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు గిల్టీ కాదని.

కానీ ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ యూనియన్ వేసిన కమిటీ అలా అనుకోవడం లేదు.

నువ్వు అతన్ని నిగ్గర్ అన్నావనీ,  నీ చర్యల్లో రేసిజం చూపించావని…(కొంతసేపు మౌనం)

నీలాంటి మంచి టీచర్ కోల్పోవడం మా దురదృష్టం. రూల్స్ రూల్సే!

సారీ! ఐ కాంట్ డూ యెనీ థింగ్.

రియల్లీ సారీ ఫర్ యూ!”

(తలదించుకొని మిస్ ప్రతిమా గుప్తా బయటకి వచ్చింది. కారు డోరు తీస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. కెనెడీ మిడిల్ స్కూల్ బోర్డు చూడగానే రెండు కన్నీటి చుక్కలు జారాయి.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM

(గతం నుంచి బయటకొచ్చింది ప్రతిమ. ఆసుపత్రి గదిలో చుట్టూ చూసింది.

అప్రయత్నంగా కంటిమీద జారిన రెండు కన్నీటి చుక్కల్ని తుడుచుకుంది.)

CUT TO:

EXT. SAN DIEGO GRADUATE CEREMONY AREA

(మెళ్ళో హవాయి పూల దండా, తలమీద గ్రాడ్యుయేట్ టోపీ పెట్టుకొని సాగర్ ఫ్రెండ్స్‌తో ఫోటోలు తీస్తోంది నీరజ.

ఫోటోలు తీయడం అయ్యాక హేండ్ బ్యాగు సర్దుకుంటూ, పక్కకు తిరిగి చూస్తే – తన వైపే నడుచుకుంటూ నవ్వుతూ వస్తోంది షెర్లీ డేవిడ్.)

షెర్లీ

“హాయ్! సగార్! కంగ్రాట్యులేషన్స్! మా అమ్మాయి నటాషా కూడా ఇక్కడే గాడ్యుయేట్ అయ్యింది…”

(అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హేండ్సూ ఇచ్చుకున్నారు. మిస్ డేవిడ్‌తోనూ, ఆమె కూతురు నటాషాతో ఫొటోలు దిగారు.)

షెర్లీ (CONT’D)

“నీర్జా! మీ అమ్మ ప్రతీమ ఎక్కడ…?”

నీరజ

“అమ్మ ఇండియాలో వెళ్ళింది. మా తాతకి సీరియస్‌గా ఉంది…”

షెర్లీ

“ఐ యాం సారీ…మీ అమ్మ ఫోన్ నంబరు ఇస్తావా…? పాత ఫోన్ నంబరుకి చేస్తే వెళ్ళడం లేదు…”

(అలాగేనని తలూపుతూ ఫోను తీసి నీరజ షెర్లీకి ప్రతిమ సెల్ నంబరుకి మెసేజి ఇచ్చింది. వాళ్ళకి బై చెప్పి షెర్లీ డేవిడ్ అక్కణ్ణుంది వెళిపోయింది.)

CUT TO:

FADE IN:

DISPLAY ON THE SCREEN: “మూడు వారాల తరువాత”

INT. KITCHEN HALL IN PRATIMA’S HOME

(ప్రతిమ ఫోన్ మ్రోగుతుంటే టేబిల్ వైపు వెళ్ళి తీసుకుంది.)

ప్రతిమ

“హలో!”

షెర్లీ

“హే ప్రతీమా!. దిసీజ్ షెర్లీ…”

(ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.)

(VOICE MUTE ON SCREEN)

ప్రతిమ

“మిస్ షెర్లీ!  థాక్స్ ఫర్ ద ఆఫర్!  ఆలోచించుకొని చెబుతాను. కెనడీ వదిలేసాక టీచింగ్ వదిలేసాను…”

షెర్లీ

“ప్రతీమా! విను. చాలెంజర్ ప్రవైటు స్కూలు. పైగా నీలాంటి టీచర్ మాకు కావాలి. నీకో విషయం తెలుసా…? నీమీద ఎవరైతే నేరం మోపారో అతనే ఇప్పుడు గిల్టీ.

శాండియేగో కాన్వకేషన్‌లో కలిసాను.

హీ ఈజ్ రియల్లీ సారీ ఫర్ వాట్ హి డిడ్ టూ యూ.

నీ గురించి అడిగాడు.  నిన్ను కలుస్తానని అన్నాడు…నేను విలియంతో చాలా సేపే మాట్లాడాను. వాడు చాలా మారాడు…”

(షెర్లీ చెప్పుకుంటూ పోతోంది. ఫోన్ అక్కడ టేబిల్ మీద పెట్టి గ్యాస్ స్టౌవ్ మీద పెట్టిన పాస్తా గిన్నె మూత తీసి చూసి, స్టౌవ్ కట్టేసి వెనక్కి వెళ్ళి ఫోను అందుకుంది.)

ప్రతిమ

“షెర్లీ! అతన్ని కలవాలని నేను అనుకోవడం లేదు.

కోలుకోలేని గాయం చేసి పారిపోయాడు.

కోలుకోవడానికి రెండేళ్ళు పట్టింది.

అయినా నాకంత పెద్ద మనసు లేదు.

ఐ డోంట్ వాంట్ టూ మీట్ హిమ్ యటాల్!”

షెర్లీ

“విలియం చాలా మారాడు. ప్లీజ్ ట్రస్ట్ మి!

బై ద వే – అతనికి పెళ్ళయ్యింది…కూడా…”

ప్రతిమ

“షెర్లీ! నేను వెళ్ళాలి. చాలెంజర్ విషయం రెండు మూడ్రోజుల్లో చెబుతాను… గివ్‌మీ సమ్ టైమ్…”

(ఫోన్ పెట్టేసింది ప్రతిమ.)

FADE OUT:

(సరిగ్గా అప్పుడే సాగర్ అటు వైపుగా వచ్చాడు.)

ప్రతిమ

“చిన్నా! ఇప్పుడే కెనడీ స్కూల్ ప్రిన్సిపాల్ షెర్లీ ఫోన్ చేసింది. ఆమె ఇప్పుడు చాలెంజర్ హై స్కూల్ ప్రిన్సిపాలట. నన్ను వాళ్ళ స్కూల్లో చేరమని అడుగుతోంది…”

సాగర్

“రియల్లీ…నువ్వేమన్నావు…”

ప్రతిమ

“ఆలోచించుకొని చెబుతాను అన్నాను. ఇంకోటి కూడా చెప్పింది. విలియమ్ గురించి ప్రస్తావన తెచ్చింది. నన్ను కలవాలని ఎంతో ఆరాట పడ్డాడని చెప్పింది. విలియమ్ కి పెళ్ళయ్యి ఒక కూతరట. కూతురికి నా పేరు…”

సాగర్

“వాడొక డర్టీ డెవిల్! ఈడియట్. నిన్నూ, నీ కెరీర్ని ధ్వంసం చేసాడు… వాడి పేరు తలుచుకోడానికి సిగ్గు లేదూ?”

ప్రతిమ

“విషయం చెబుతున్నాను. అంతే…నేను వాణ్ణి ఎప్పటికీ క్షమించను…”

సాగర్

“వాణ్ణి నువ్వు క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమించలేను మామ్…ఒక విషయంలో…”

(ఏమిటన్నట్లు చూసింది ప్రతిమ.)

సాగర్ (CONT’D)

“నీకు గుర్తుందా! ఆ స్కూలు సంఘటన ముందు మనింట్లో ఒక పెద్ద రాద్ధాంతం చేసావు నువ్వు.

దాదాపు నీతో రెణ్ణెళ్ళు మాట్లాడ లేదు నేను. క్రిసమస్‌కి నాన్న నాకు కోబీ బ్రాయన్ బ్లాక్ మాంబా షూ కొంటానని ప్రామిస్ చేశారు. అంత ఖరీదు వద్దని నువ్వు బలవంతాన నాన్నని ఆపేసావు.

కానీ నువ్వు ఆ యాబ్రాసికి మూడొందలు పెట్టి మరీ కొనిచ్చావు. ఇన్నాళ్ళూ మాకు చెప్పకుండా దాచావు…

ఇదెప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో చచ్చినా నిన్ను క్షమించను గాక క్షమించను…యూ ఆర్ ఏ బిగ్ ఫ్యాట్ లయర్!”.

(అనేసి అతను విసూరుగా వెళిపోయాడు. అతను వెళ్ళిన వైపే ఆమె చూస్తూ ఉండిపోయింది.)

FADE TO BLACK.

THE END

వ్యాపకం
BB.R.Cell Point… ఆ బోర్డుని చూడగానే ప్రసాద్‌ అడుగులు నెమ్మదించాయి. నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అటువైపు నడవటం మొదలుపెట్టాడు. ఈ పూట తను తిరిగిన సెల్‌ఫోన్‌ షాపుల్లో అది పదవదో, పన్నెండవదో అయి ఉంటుంది. ఇక్కడైనా తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో తెలియదు. దొరకదు అని విచక్షణ చెబుతోంది. దొరుకుతుందేమో అన్న ఆశ, విచక్షణకి అడ్డుపడుతోంది. ప్రసాద్‌ షాప్‌ దగ్గరికి చేరుకునేసరికి ఎవరెవరో నిల్చొని ఉన్నారు. వాళ్లంతా వెళ్లిపోయేదాకా ఓపికపట్టాడు. ఈలోగా, షాపునిండా వేళ్లాడదీసి ఉన్న ఫోన్ కవర్లూ, మెమరీ కార్డులూ, సెల్‌ఫోన్‌ డొప్పలని చూస్తూ నిల్చొన్నాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? దాన్ని ఎలా అలంకరించాలి? అన్న బాదరబందీ ఎప్పుడూ ప్రసాద్‌కి లేకపోయింది. తన ఫోన్‌తో అతనికి ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు తనకి వచ్చిన సమస్యా వేరు!

“చెప్పండి!” అన్నాడు షాపతను ఒకింత చిరునవ్వుతో ప్రసాద్‌ వంక చూస్తూ.

ప్రసాద్‌, నిదానంగా తన జేబులోంచి ఒక మాసిపోయిన ఫోన్‌ని బయటకు తీశాడు, ‘ఇందులో బాల్ ఫాల్‌ అనే గేమ్ ఉంది’ అని చెబుతుండగానే షాపతను చనువుగా ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకుని అందులో ఆప్షన్లన్నీ చకచకా చూసేసి “అవును! బాగానే పనిచేస్తోందిగా,” అనేశాడు.

“అది కాదు! మొన్న ఒకసారి అనుకోకుండా రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ అన్న ఆప్షన్‌ నొక్కాను. దాంతో ఇంతవరకూ బాల్‌ ఫాల్‌ గేమ్‌లో నేను చేసిన స్కోర్లన్నీ పోయాయి,” ఆ విషయాన్ని ఎంత నిదానంగా చెబుదామన్నా అతని శ్వాస ఎగిసిపడుతోంది. కళ్లు మసకబారుతున్నాయి.

అప్పటివరకూ ఫోన్లో ఆప్షన్లన్నీ ఎడాపెడా నొక్కుతున్న షాపతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. గేమ్‌లో స్కోర్లు పోయాయని బాధపడుతున్న సదరు కస్టమరు చిన్నపిల్లవాడేం కాదు. కుర్రవాడు అంతకన్నా కాదు. నుదుటినుంచి చెంపల దాకా జుత్తు నెరిసిన యాభై ఏళ్ల పెద్దాయన. వెన్ను వంగిపోయి, భుజాలు జారిపోయిన పెద్దమనిషి. షాపతనికి అర్థమైపోయింది…వచ్చినవాడు రోజువారీ కస్టమరు కాదని! తన చిన్నపాటి జీవితంలో ఇలాంటి చిత్రమైన కస్టమర్లు అరుదుగా తగుల్తారు. ఊళ్లో పదిమందికీ చెప్పుకోవడానికీ, పదికాలాల పాటు నవ్వుకోవడానికీ తగిన సందర్భం ఇది. తనలోని కుతూహలాన్నీ, వెటకారాన్నీ బలవంతంగా అణచుకుంటూ ‘‘మీరు నొక్కిన ఆప్షన్‌ వల్ల టెంపరరీ డేటా అంతా డిలీట్‌ అయిపోయింది సర్‌! అది తిరిగి రావడం కష్టం,’’ అన్నాడు.

“అంటే నేను బాల్ ఫాల్‌లో చేసిన స్కోర్స్‌ తిరిగి కనిపించే అవకాశమే లేదంటారా?” నిరాశగా అడిగాడు ప్రసాద్‌.

“లేదు! అలా డిలీట్ అయిపోయిన డేటాని ఫోరెన్సిక్‌ ల్యాబ్లో తప్ప వేరెవరూ బయటకి తీయలేరు,” అన్నాడు షాపతను. ప్రసాద్‌ని చూడగానే అతనికి ఎందుకో జాలి మొదలైంది.

ప్రసాద్ ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడలేదు. తను ఇవాళంతా విన్న ‘కుదరదు’ అన్న జవాబే ఇక్కడా వినిపించింది. కాకపోతే ‘ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ అన్న మాటే కాస్త కొత్త విషయం. సాలోచనగా షాపతని వంక చూస్తూ “ఫోరెన్సిక్‌ ల్యాబ్లో పని జరుగుతుందన్నమాట. అదెక్కడ ఉందో కాస్త చెబుతారా,” అన్నాడు.

ఆ మాటలకి షాపతని మనసులో తెలియని భయం మొదలైంది. మనలోని అమాయకత్వం, అజ్ఞానపు స్థాయిని చేరుకున్నప్పుడు, ఎదుటివారిలో కలిగే భయం అది. దాంతో ప్రసాద్‌ని వదిలించుకోవడానికి కిందకి వంగి ఏదో సర్దుకుంటూ ఉండిపోయాడు షాపతను. ఒక్క క్షణం అతనివంక బేలగా చూసిన ప్రసాద్ బస్టాపు దగ్గరకి కాళ్లీడ్చుకుంటూ బయల్దేరాడు. ఆ సమయానికి వచ్చిన బస్సు ఖాళీగా ఉందా, సౌకర్యంగా ఉందా అని చూసుకోలేదు. వచ్చిన బస్సుని చటుక్కున ఎక్కేసి ఓ మారుమూల సీట్లో కూలబడిపోయాడు. కళ్లు మూసుకున్నాడన్న మాటే కానీ అతని రెప్పల తెర మీద రకరకాల రంగులు. రంగురంగుల బంతులు కిందకి పడుతున్నాయి. ‘బాల్ ఫాల్‌’ ఆటతో తన అనుబంధం అంతా స్ఫురణకు వస్తోంది.

పోయిన ఏడాది క్రిస్‌మస్‌నాటి రోజులివి. వరుసగా సెలవులు రావడంతో, తన భార్య బెంగళూరులో కూతురుకి సాయంగా ఉండేందుకు వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏదో రోడ్డు పక్కన తినేసి తన అపార్టుమెంటుకి చేరుకున్నాడు. శనివారం రాత్రి కావడంతో అపార్టుమెంటు పైనుంచి కోలాహలంగా నవ్వులు వినిపిస్తున్నాయి. బహుశా ఏదో మందు పార్టీ పెట్టుకుని ఉంటారు. తనకా మందు తాగే అలవాటు లేదు. అందుకని అలాంటి పార్టీలలోకి వెళ్లి నాలుగు మాటలు కలిపి నాలుగు చుక్కలు పుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయనే లేదు. ఉండుండి వినిపిస్తున్న నవ్వులకు ఉడుక్కుంటూ టీవీ ఆన్‌ చేసి కూర్చున్నాడు. 200 ఛానళ్లలో ఏ ఒక్కదానిలోనూ తనకు నచ్చిన ప్రోగ్రాం కనిపించలేదు. రిమోట్ నొక్కీ నొక్కీ చిరాకేసిపోయింది.

భార్య లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఏదో తెలియని నిస్తేజం. అలాగని భార్యతో తను ఎన్నడూ సఖ్యంగా ఉన్నది లేదు. రోజంతా సీరియల్స్‌తో గడిపే తన భార్య ప్రవర్తన ప్రసాద్‌కి నచ్చదు. ఎప్పుడూ బుద్ధావతారంలా కూలబడి ఉండే ప్రసాద్‌ నిస్సత్తువ అతని భార్యకీ సయించదు. కుటుంబం అనే బంధం కోసం ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారంతే! ఇద్దరూ ఒక ఇంట్లో కలిసి ఉండటం అలవాటుగా మారిపోయింది. ఉంటే ముభావంగా ఉండిపోవడం, లేదా వాదులాడుకోవడం…ఈ రెండు పరిస్థితులే వాళ్ల మధ్య ఉంటాయి. తమ మధ్య పుట్టిన కూతురిని కూడా అంతే నిర్లిప్తంగా పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసి పంపారు. తన కూతురు బాగా చదువుకుంటోందా, ఆమెకి మంచి సంబంధం కుదురుతోందా అని చూసుకోవడంతోనే సరిపోయింది ప్రసాద్‌కి. అల్లుడితో కలిసి ఎప్పుడన్నా కూతురు ఇంటికి వస్తే సందడిగానే ఉంటుంది. కానీ, ఆ సందడిలో సంతోషం కనిపించదు. కూతురితో పాటు వచ్చిన అల్లుడు తన హోదాని హుందాగా నిభాయిస్తుంటాడు. అతనికి ఏ లోటూ రాకూడదంటూ కూతురు క్షణక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ ప్రొటోకాల్స్‌ అంటే చిరాకెత్తిపోయిన ప్రసాద్, వాళ్లున్నప్పడు నక్కినక్కి తిరుగుతూ ఉంటాడు.

అపార్టుమెంటు పై నుంచి ఒక్కసారిగా నవ్వుల తాకిడి పెరిగింది. పార్టీ మంచి రసపట్టుకు చేరుకున్నట్లుంది. నవ్వులు అలలు అలలుగా రగులుతున్నాయి. ప్రసాద్‌ దృష్టి టీపాయ్ మీద ఉన్న ఫోన్‌ మీద పడింది. ఉబుసుపోక దాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కో బటన్‌నీ నొక్కడం మొదలుపెట్టాడు. తన దృష్టిలో అదో బేసిక్ ఫోన్‌. కూతురి మాటల్లో అదో డబ్బా ఫోన్. కాలక్షేపంగా దాన్నే పరిశీలించడం మొదలుపెట్టాడు ప్రసాద్‌. అప్పుడు కనిపించింది అతనికి ‘బాల్ ఫాల్‌’ ఆట. గేమ్‌ మొదలుపెట్టగానే రంగురంగుల బంతులు స్క్రీన్‌ మీదకి రావడం మొదలుపెట్టాయి. వాటినేం చేయాలో తెలియలేదు ప్రసాద్‌కి. అటో రెండు బటన్లూ, ఇటో రెండు బటన్లూ నొక్కాడే కానీ, ‘గేమ్ ఓవర్’ అంటూ ఆట ముగిసిపోయింది. అలా ఒకటి రెండుసార్లు జరిగిన తరువాత ఆట ఎలా ఆడాలో కాస్త ఒంటపట్టినట్లే ఉంది. స్క్రీన్‌ నుంచి కిందకి పడే బంతుల్లో ఒకే రంగు ఉన్న బంతులు ఐదింటిని సేకరించి పైకి విసరాలి. అలా ఐదైదు బంతులను పైకి విసరగానే కొన్ని పాయింట్లు వస్తాయి. ఈలోపల బంతులు కాస్తా స్క్రీన్‌ అడుగుకి వచ్చేస్తే ఆట ముగిసిపోతుంది. ఆటైతే ఎక్కువ సేపు సాగలేదు కానీ, అది ఎందుకనో తన జీవితంలోకి ప్రవేశించినట్లు అనిపించింది ప్రసాద్‌కి. ఆ రోజు ఎవరో కొత్త మిత్రుడితో పరిచయం అయినంత తృప్తి కలిగింది. ఆ రాత్రికి సోఫాలోనే గాఢంగా నిద్రపోయాడు.

మర్నాడు అందరిలాగానే తను కూడా పదిన్నర దాటాక ఆఫీసుకి చేరుకున్నాడు. ఆసరికి ఎవరికి వాళ్లు తమ క్యాబిన్లలో సర్దుకుంటున్నారు. ఇప్పుడు తన ఆఫీసులో మనిషి మనిషికీ మధ్య క్యాబిన్‌ గోడలు వెలిశాయి. ఒకో క్యాబిన్లో ఒకో మనిషీ, అతనికెదురుగా ఓ కంప్యూటరూ! ఆ కంప్యూటర్‌ అంటే ఎందుకనో తనకి మొదటినుంచీ చిరాకే. తనది కాని భాగమేదో తన శరీరానికి అతుక్కుపోయిన భావన. కానీ తప్పలేదు! ప్రస్తుతానికి కంప్యూటర్‌ లేనిదే ఆఫీసు పని నడవదు. ఆ పనికి అవసరమయ్యేంత మేరకే కంప్యూటర్‌తో కాపురం చేస్తుంటాడు. అతని అదృష్టమో దురదృష్టమో కానీ నెలకి నలభైవేలు జీతం తీసుకుంటున్నా…చేయాల్సిన పని పెద్దగా ఉండదు. కొత్తగా నేర్చుకోవలసిన విషయాలూ ఉండవు. ఎలాగోలా మరో ఎనిమిదేళ్లు గడిపేస్తే ఈ ఉద్యోగపర్వాన్ని ముగించేయవచ్చు అన్నదే అతని లక్ష్యంగా మిగిలిపోయింది.

ఏడాది చివరి రోజులు కావడంతో క్యాబిన్లన్నీ సందడిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో తెలియని ఉత్సాహం. ఏదో పార్టీ కోసమో, వీడ్కోలు కోసమో ఎదురుచూస్తున్నట్లు ఉత్సుకత. తన ఆఫీసు క్యాబిన్లలో ఇలాంటి సందడి కొత్తేమీ కాదు. పండుగలనో, పుట్టినరోజులనో…నెలలో నాలుగు రోజులు ఇలాంటి హడావిడి ఉంటుంది. కాకపోతే ప్రసాదే వీటికి కాస్త దూరంగా ఉంటాడు. ఆ మాటల ఒరవడిలో తట్టుకుని నిలబడం అతనికి చేతకాదు. తనని తాను మార్కెట్‌ చేసుకునే కళ అతనికి ఎందుకనో అబ్బలేదు. కంప్యూటర్‌ని ఆన్‌ చేసి నిస్తేజంగా కూర్చున్న ప్రసాద్‌కి ఎందుకనో ‘బాల్ ఫాల్‌’ ఆట గుర్తుకు వచ్చింది. ఇవాళ ఎలాగూ పెద్దగా పనిలేదు.  ప్యాంటు జేబులోంచి నిదానంగా తన డబ్బా ఫోన్‌ని బయటకు తీశాడు. ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటివరకూ అడ్డుగోడలుగా తోచిన క్యాబిన్లు ఎందుకో ఇప్పుడు ప్రపంచం నుంచి రక్షణగా తోచాయి!

బాల్ ఫాల్‌ నిదానంగా ప్రసాద్‌ జీవితంలో భాగమైపోయింది. మొదట్లో రెండుమూడు వందల స్కోర్లు/స్కోరు సాధించడమే గగనంగా ఉండేది. కానీ క్రమంగా అవి వేలకి చేరుకున్నాయి. అంతకుముందుకన్నా ఎక్కువ స్కోరు సాధించిన ప్రతిసారీ… ‘మీరో కొత్త రికార్డుని సృష్టించారు. అభినందనలు’ అనే సందేశం అతనికి భలే ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆట ఆడే ప్రతిసారీ ఓ కొత్త రికార్డుని సాధించాలని తెగ తపనపడిపోయేవాడు. తన గతంతో తానే పోటీపడేవాడు. మొదట్లో అతని ఖాళీ సమయాలను బాల్‌ ఫాల్ భర్తీ చేసింది. బస్సుల్లో వెళ్లేటప్పుడో, ఆఫీసులో బోర్‌ కొట్టినప్పుడో బాల్‌ ఫాల్‌ బయటకి తీసేవాడు. కానీ రాన్రానూ అది అతని జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ చొచ్చుకుపోయింది. రాత్రిపూట నిద్రపట్టకపోతే భార్యకి కనిపించకుండా అటువైపు తిరిగి ఆడేవాడు. అల్లుడు ఇంటికి వస్తే గదిలో తలుపేసుకుని ఆడేవాడు. భార్య కూతురింటికి వెళ్తే, తీరిక సమయాన్ని బాల్‌ఫాల్‌తో గడిపేసేవాడు. ఆ ఆటలో తను ఎంత నైపుణ్యాన్ని సాధించాడంటే, ఒకోసారి అతని వేగానికి ఆట మధ్యలోనే స్ట్రక్‌ అయిపోయేది. లేదా ఆటలోని రంగురంగుల బంతులు కాస్తా ఒక్కసారిగా గజిబిజి అయిపోయేవి. ఫోన్లో అలాంటి చిన్నచిన్న ఇబ్బందులు వస్తే ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ నొక్కమని ఎవరో చెప్పినట్లు గుర్తు. అందుకే ఆ పిచ్చి పని చేశాడు. దాంతో తన రికార్డులన్నీ చెదిరిపోయాయి.

బస్సు తన స్టాప్ దగ్గర ఆగింది. మనిషి ఇంటివైపు నడుస్తున్నాడన్నమాటే కానీ తల తెగ తిరిగిపోతోంది. ఒళ్లంతా వేడెక్కిపోయి ఒకటే సలపరంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతుండగానే “ఆదివారం పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు?” సోఫాలోనుంచే ప్రసాద్‌ వాళ్లావిడ అడిగింది.

‘‘ముందా టీవీ కట్టిపారేయ్‌!’’ కోపంగా అరిచాడతను. మనిషిలో ఏదో తెలియని ఉద్రేకం. ఎవరినో ఏదో చేయాలన్న ఉన్మాదం. అతని అరుపుకి నిశ్చేష్టురాలైన భార్య చేతిలోంచి రిమోట్‌ను లాక్కొని ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. ఆపై తూలుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయాడు. పడుకున్నాడన్నమాటే కానీ ఒకటే కలలు! కలల నిండా రంగురంగుల బంతులు. కొన్ని మందుబాటిళ్ల మీద పడుతున్నాయి. కొన్ని టీవీలోంచి దూసుకువస్తున్నాయి. మరికొన్ని తన క్యాబిన్లో దొర్లాడుతున్నాయి. ప్రతి కలలోనూ బంతులే…సందర్భమే మారుతోంది. ఒకోసారి మనుషుల మొహాలు కూడా బంతుల్లా మారిపోతున్నాయి. వారి శరీరాలు బంతుల్లా ఊరిపోయి దొర్లిపోతున్నాయి.

బంతులు…బంతులు…ఆ బంతుల్లో తను తలమునకలై ఉంటే, ఎవరో తనని తట్టి లేపుతున్నట్లు తోచింది. కళ్లు తెరిచి చూశాడు.  ఎదురుగా ఉన్న భార్యను పోల్చుకునేందుకు కూడా కాస్త సమయం పట్టింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. ఏదో మాట్లాడుతోంది.  కానీ అవేవీ వినిపించడం లేదు. పైపెచ్చు ఆమె చీర మీద కూడా బంతులు జీరాడుతున్నట్లు తోచి అయోమయంగా వాటి వంక చూడసాగాడు. బంతులు…రంగు బంతులు తన కళ్లని నింపేస్తున్నాయి. నేల మీద ఎగిరెగిరిపడుతున్నాయి. ఫ్యాన్‌ నుంచి రాలి పడుతున్నాయి. అన్ని బంతులని చూసి ప్రసాద్‌కి తల పగిలిపోతోంది. వగరుస్తూ మంచానికి ఓ మూలగా చేరి పడుకుండిపోయాడు. బంతుల నుంచి తప్పించుకునేందుకా అన్నట్లు కాళ్లని పొట్ట లోపలికంటూ ముడుచుకుని పడుకుండిపోయాడు.

మర్నాడు ఉదయానికల్లా కూతురూ అల్లుడూ వచ్చేసినట్లున్నారు. తను కళ్లు తెరిచి చూసేసరికి కూతురు, భార్య ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. అల్లుడి గంభీరత్వం మాత్రం ఎప్పటిలానే ఉంది.  ప్రసాద్‌కి చచ్చేంత నీరసంగా ఉంది. బయటకి మూలుగుతున్నాడేమో కూడా తెలియదు. కళ్ల ముందు బంతులు లేకపోయినా, వాటి తాలూకు రంగులు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయి. కనిపించే దృశ్యాలను అవి అస్పష్టంగా మార్చేస్తున్నాయి.

“లోకల్‌ డాక్టర్ల వల్ల లాభం లేదండీ. ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు కదా! అది జ్వరం వల్లా ఏంటన్నది తేల్చుకోవడం మంచిది,” అంటూ అల్లుడు ఏదేదో చెబుతున్నాడు.

ప్రసాద్‌కి హఠాత్తుగా తన ఫోన్‌ గుర్తుకువచ్చింది. ఓసారి దాన్ని చూసుకోవాలనిపించింది. నిదానంగా ప్యాంటు జేబులోంచి ఫోన్ బయటకి తీశాడు. ఎన్నడూ లేనిది అల్లుడు చనువుగా ముందుకు వచ్చి “ఇప్పుడది ఎందుకు మావయ్యగారూ! రెస్ట్ తీసుకోండి,” అంటూ ఆ ఫోన్‌ తీసుకోబోయాడు. అంతే! అతని చెంప ఛెళ్లుమంది. ఏం జరిగిందో అర్థం కావడానికి ప్రసాద్‌ చుట్టూ ఉన్నవారికి కాస్త సమయం పట్టింది. తనేం చేశాడో ప్రసాద్‌కి కూడా వెంటనే స్ఫురించలేదు. ఆపై వాళ్లనిక చూడలేనట్లు అవతలికి తిరిగి పడుకుండిపోయాడు. వాళ్లావిడ గట్టిగట్టిగా తిడుతోంది. తిట్టుకీ తిట్టుకీ మధ్య కూతురి ఏడుపు వినిపిస్తోంది. ప్రసాద్ కళ్లు గట్టిగా మూసుకున్నాడు. ఇంతలో ‘సర్దుకుపోవడం చేతకాదు’ అంటున్న భార్య మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. ‘నిజంగానే తను ప్రపంచంతో సర్దుకుపోలేకపోయాడా, లేక ప్రపంచమే తనని కలుపుకోకుండా ముందుకు సాగిపోతోందా! అదీ ఇదీ కాకపోతే మధ్యేమార్గంగా ఇంకేదన్నా ఉందా!’ అన్న ఆలోచన తట్టింది ప్రసాద్‌కి. ఆలోచన రావడం మొదలు, మళ్లీ రంగురంగుల బంతులు కదలాడసాగాయి.  బంతులతో పాటు ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ అన్న పదం అస్పష్టంగా కనిపించింది. తలలో ఏదో వరద పోటెత్తిన భావన. భళ్లున వాంతి చేసుకున్నాడు. కంటి ముందు ఇక బంతులు కనిపించడం మానేశాయి. తల పక్కకి వాలిపోయింది.