వాకిలి » ఈ వారం కవి

పచ్చదనం లేని దృష్టిని ఉహించుకోలేను: సత్యశ్రీనివాస్
వొక పచ్చని ఆకు చిర్నవ్వుతూ కనిపిస్తే సత్యశ్రీనివాస్! వొక మందారం సిగ్గుల్ని చెక్కుకున్నట్టు ఎర్రగా కనిపిస్తే సత్యశ్రీనివాస్! వొక మల్లియ స్వచ్ఛంగా నవ్వితే సత్య శ్రీనివాస్! వొక అడవిలోని చెట్ల మీద వెన్నెలో సూర్యుడో మెరుపై మెరిస్తే సత్యశ్రీనివాస్! వొక కవి జీవితంలో ప్రకృతి అంతగా ఎలా అల్లుకుపోయింది? ప్రకృతి నించి స్నేహితుల మధ్యకు ప్రవహిస్తున్నప్పుడు అతని భాష ఎలా మారుతుంది? అతని అక్షరాలు కొమ్మల మధ్య కోయిలలు ఎలా అవుతాయి? వినండి ఏమంటున్నాడో ఈ నడిచే పూల చెట్టు!

మీ కవిత్వంలో ప్రకృతి ఒక ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. ఎందుకు?

చిన్నప్పటి నుండి ఇంట్లో పచ్చదనంతో వుండడం,మొక్కలు పెంచడం ఒక భాగం.ఇందతా ఒక ఎత్తయితే అమ్మ జి.కమలమ్మ పాట పొద్దున మొదలైతే రాత్రి పడుకునే వరకు సాగేది. అన్ని పాటల్లోనూ అంతర్లీనంగా ప్రకృతి అంశాలుండేవి. ప్రకృతి బీజం నాటిన మొదటి గురువు అమ్మే!

ఈ నేపధ్యంలో బాల్యం ప్రభావం ఎక్కువగా వుంది. పుట్టిపెరిగింది హైద్రాబాద్. చిన్నప్పుడు కాలానుగుణంగా ఆటలు ఆడుకునే వాళ్ళం. సంక్రాంతికి పతంగులు, ఎండాకాలంలో గోలీలు,కోతికొమ్మచ్చి,దాగుడుమూతాటలు. కోతికొమ్మచ్చి వెల్ఫెర్ సెంటర్ దగ్గర చింతల తోట వుండేది.(ప్రస్తుతం యన్.యం.డి.సి. కార్యాలయం). దాగుడు మూతలు బీర్ బన్ బాగ్(ప్రస్తుతం క్యాసిల్ హిల్స్). ఇక పతంగుల కోసం విజయనగర్ కాలనీ నుంచి మల్లేపల్లి,ప్రకాష్ నగర్, నాంపల్లి,చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంతా తిరిగేవాళ్ళం. అలా బాల్యం ఆటలు పక్షులకి,జంతువులకి వుండే రేడియస్ని కల్పించింది. కొత్తమిత్రులతో పరిచయాలు, అలా తిరుగుబోతు అవ్వడానికి పునాదులు వేశాయి! ప్రకృతిని వివిధ రూపాల్లో చూడ్డం అన్నది ఇలా జరిగిందేమో!

1984 నుండి చదువుకుంటునప్పుడు మా చిన్నన్నయ్య బి.వి.సుబ్బారావ్ తో కలిసి పని చేసేవాడిని, డిజైనింగ్,ప్రింటింగ్. ఈ పనిలో భాగంగా ఆటవీశాఖ చేపట్టిన పర్యావరణ విద్యాకేంద్రాల డిజైనింగ్ లో అన్నయ్యకు సహకరించా, అలా శ్రీశైలం, మెదక్,అదిలాబాద్,మదనపల్లి అడవుల్లో తిరగడం,అడవుల జీవావరణం తెలుసుకొవడం మొదలైంది. ఇంకే ముంది, పచ్చనిగాలి సోకింది!

1989 నుండి అదే పనిలోపడ్డా, బాగా నచ్చింది. అసలు చెప్పాలంటే పచ్చదనం సోకింతర్వాత ఉద్యోగజీవితం అలవాటు కాలేదు. కొంత కాలం పర్యావరణం ప్రచారం పైన పని చేశా తర్వాత అంతా అడవులు,గిరిజనుల అంశాల దిశగా పయనం. అప్పటినుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో,ఇతరప్రాంతాల్లో తిరగని అడవీలేదు,ఊరూ లేదు, అలా నాలోని సంచారత్వం కొనసాగింది . ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చదనం లేని దృష్టిని ఉహించుకోలేను.

తాటిచెట్టు

నా తనువు

నేల మీది

మోనొలిత్

(6.6.96)

కవిత్వంలో మీ తొలిరోజులు? ఎప్పుడు ఎలాంటి వాతావరణంలో మీరు రాయడం మొదలు పెట్టారు?

నా తొలి రోజులంటే 1984. అప్పుడు డిగ్రీ చదువుతున్నా. హైద్రాబాద్లో రాజకీయలబ్దికోసం మత కల్లొలాలను సృష్టించారు. అది నన్ను చాలా కలిచివేసింది. నా హైద్రాబాద్ కాదనిపించింది. అప్పుడు మొదటి కవిత రాశా. అది హిందిలో ,బహుశా ఆ కవిత శీర్షిక కర్ఫ్యూ.హిందీ కవితలు మిత్రులకి,కొన్నిటిని నాన్న గారు గుడ్ల వలేటి రామారావు గార్కి( జర్నలిస్ట్), చెల్లెలు అరుణా(అరుణా భిక్షు) కి వినిపించేవాడ్ని మేచ్చుకునెవారు. ఖధీర్ బాబు నా హిందీ కవిత్వం గురించి రాసారు.

అసలు తెలుగులో రాస్తాననుకోలేదు. అప్పట్లో నాకు తెలుగు కంటే హిందీ పైన పట్టు ఎక్కువగా వుండేది. తెలుగులో కవిత్వ పరంగా ఆలోచించలేకపోయేవాడ్ని. ఇదంతా మిత్రుల ప్రోత్సాహంతోనే.

పతంజలి శాస్త్రి గారు, నేను కలిసి 89 నుండి 96 వరకు పనిచేశాం. అలా ప్రకృతి, సాహిత్యం ,ఎందరితోనో పరిచయాలు పెరిగాయి. 1992 నుండి నామాడి శ్రీధర్, ఒమ్మి రమెష్ బాబు, శశి, శివాజి, మధుకర్, ఎం. యస్. నాయుడు, సిద్దార్థ, అనంత్, పెద్ది రామా రావు, అఫ్సర్, వసిరా,భిక్షు తో పరిచయాలు. శ్రీధర్, ఒమ్మి రమెష్ బాబు, శశి వాళ్ళప్పుడు ‘కంజీర ‘ ద్వారాకొత్త కవులని పరిచయం చేసేవారు. వాళ్ళే నన్ను తెలుగులో రాయడానికి ప్రోద్భలించిన ముఖ్య కారకులు. తెలుగులో 1995 లో మొదలుపెట్టా. అచ్చులో వున్నవి తెలుగులొనే.టి.శివాజి గారు చాలా ప్రోత్సాహనిచ్చారు.

పని పరంగా 89-95 ఒక దశ,95-2004 ఒక తీరు. 2004 -2008 ఒక దశ. 2004 నుండి ఇప్పటి వరకు ఒక తీరు. నా కవిత్వం తీరుమారింది, 95 నుండి అడవి నాలోకి చొచ్చుకువచ్చేసింది. ప్రపంచం మారింది. ఇప్పుడు మూడు భాషల్లో రాస్తున్నా తెలుగు, హిందీ, ఆంగ్లం. అందుకే అన్నీ తొలి రొజులే.

అసలు కవిత్వమే మీ వాహిక ఎందుకు అయింది?

అది నాలోని పచ్చని మోటు బావి. బహుశా ఈ మాధ్యమం ద్వారా నన్ను నేను లోతుగా అన్వేషిస్తూ, వ్యక్త పర్చుకొగలుగతానేమో.

మీరు ఇతర భాషల కవిత్వం కూడా చదివారు కదా, ఆ ఇతర భాషల కవులు ఎవరు మీకు నచ్చారు? ఎందుకు?

నాకు సాహిత్యం తెలిసింది పాటల ద్వారా,చదవడం వల్ల. ఇంట్లో అందరికీ సంగీతం ఇష్టం. మా మూడో అన్నయ్య ఉదయ భాస్కర్ వల్ల ఉర్దూ, హిందీ పాటలు వినడం అబ్బింది. పాటలు వినడమే కాక పాడడం ఇష్టం(బాత్రూం సింగర్నండి). కనుక అందులోని సాహిత్యాన్ని రాసుకోడం ,కంఠస్తం చేయడం అలవాటైంది, అలా ఉర్దూసాహిత్యం మీద ప్రేమ,పిచ్చ ఇష్టం. నాకు గాలిబ్ చాలా ఇష్టం. ఇక లిస్ట్ పెద్దది. కొందర్ని చెప్పగల్గుతా, మజాజ్, సాహిర్, నిదాఫాసిల్, బషిర్ బద్ర్, మఖ్దూం, షెహరియార్, ఫైయాజ్ , గుల్జార్, అమ్రితాప్రీతం, నాగార్జున, బద్రినారాయణ్. ఇక సుఫి లో అమీర్ ఖుష్రో,బుల్లెషా.కబీర్. అనువాదకుల్లో, అరవింద కృష్ణ మెహరోత్రా, ఏ.కే.రామానుజం (ఈయన ఫోక్ టేల్స్ చాలా ఇష్టం). వీళ్ళవి ఒక ఆడియో విజువల్ ఇన్ సైట్స్..ఇవికాక ప్రపంచ ఫొక్ లోర్స్, హైకు, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ సాహిత్యం ఇష్టం.

సాహిత్యంతోబాటు నాకు ఇకలాజికల్ హిస్టరీ చాలా ఇష్టం , ఇది ఏర్పడ్డానికి కారణం బాల్య మిత్రుడు చింతా శ్రీనివాస రెడ్డి. సాహిత్యం, ఇకలాజికల్ హిస్టరి సైమల్టెనీయస్ గా చదువుతూ వూళ్ళు తిరుగుతున్నప్పుడు దీనిని మెకన్సి గ్రామచరిత్రల(కైఫియత్, అంటే ఉర్దూలో మనసులొని మాట.) లా చూసి అర్ధం చెసుకునే ప్రయత్నం చేస్తా. అలా నాకు అంతా సాహిత్యమే.

మీ కవిత్వ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన కొన్ని మంచి/ చేదు అనుభవాలు?

ఇందాక చెప్పిన విశేషాలే! అచ్చులోకి దింపింది నాయుడు, నా కవిత్వాన్ని మొదట విశ్లేషించింది సతీష్ చందర్ గారు. నా మొదటి పుస్తకం “ఇంకా సగం”కి మంచి స్పందన వచ్చింది, అఫ్సర్ , వసిరా గార్లు క్రిటికల్ రెవ్యూలు రాశారు. జీవితంలో చేదు అనుభవాలున్నాయి కాని ఈ విషయంలో లెవు. నేను ఒక అనానిమస్ కవి అవ్వడంవల్ల కూడా కావచ్చు. సి.వి.కృష్ణా రావు గారి నెలనెల వెన్నెల ఒక మంచి వెదికగా దోహదపడింది. ఆయనే నా పుస్తకవిష్కరణ బల్వంతాన సభ పెట్టి జయంతి మహపాత్రో గారి తొ ఆవిష్కరణ చేయించారు.అప్పటికే పుస్తకం పంచడం అయ్యింది. అలా ప్రోత్సాహకరంగానే వుంది.

నా కవిత్వానికి బ్లాగ్ రూపమిచ్చింది గాలి ఉదయ్ కుమార్, సవరించింది జ్యోతి వల్లబోజి గార్లు. నా రేండవ పుస్తకం నేలకన్ను(ఇ బుక్) కి డిజైనింగ్ చేసింది ఉదయే.

నా నేలకన్ను పుస్తకాన్ని ఆ ఇంటికి అంకితమిచ్చా.2002 నుండి వ్యక్తిగత స్తబ్తత వచ్చింది ఒక 5 ఏళ్ళు కవిత్వం అంతా ఇంటి చుట్టూ తిరిగింది. ఈ కాలంలో నాకు తోడుగా వున్నది మాధవి,శిశిర్.

కవిత్వం కాక ఇంకోటేదయినా- చిత్ర కళ, ఫోటోగ్రఫీ- మీ భావాలకు తగిన వాహిక అని మీరెప్పుడయినా అనుకున్నారా? అసలు కవిత్వమే రాయలేని స్థితి వుంటే, అది మీకెలా వుంటుంది? ఇన్ని ఆలోచనలూ అనుభూతులూ ఏమయి పోయేవి?

నేను చిత్రలేఖనం లో ముఖ్యంగా వృద్ధ మహిళల ముఖచిత్రాలు వేస్తాను, గిరిజన, గ్రామీణ వృద్ధ మహిళలవే, ఇక అమ్మలు,అమ్మమ్మలు, అదీ వాటర్ కలర్స్ లో, వీళ్ళు పంచి పెట్టే గుణానిచ్చారు, ఆ గుణం వాళ్ళు అంతరించిపోతున్నారు. వాళ్ళకు నివాళివ్వాలని.

ప్రకృతిని ఫొటొగ్రఫి ద్వారా బంధిస్తా.వీటి ద్వారా నే తిరిగే ప్రాంతాల్ని, వ్యక్తుల్ని డాక్యుమెంట్ చేస్తా. ఒక విధంగా ఆర్కైవ్స్లాంటివి.నా కవితల్లో డేట్ లైన్ వుంటుంది.ఎందుకంటే అక్కడ ఆ కవిత పుట్టింది. ఆ సృహనిచ్చిన ఆ నేలకి నేను తెలుపుకునే కృతజ్ఞత.

కవిత్వం అంటే నాకు కేవలం రాయడం కాదు, జీవితాన్ని అర్ధం చేసుకుని వ్యక్త పరుచుకునే సాధనం. మా ఇల్లుని కవితలా కట్టుకున్నా ననుకుంటా. కనుక కవిత్వం రాయకుండా వుండడమనేది లేదు. అచ్చువేస్తానా లేదా అన్నదే ప్రశ్న. హైద్రాబాదీ గా చెప్పాలంటే సవ్వాలిచ్ పైదా నహి హొతా (ప్రశ్న పుట్టదు). పోయేముందు ఒక చెట్టు నీడన నా సమాధి పలక మీద ఒక కవిత రాసి పెడతా విత్ బ్లాగ్ డీటైల్స్….(అహ,అహా….)

మీరు బలమయిన సామాజిక రంగాల్లో వున్నారు. అయినా, మీ కవిత్వంలో ఒక అంతర్ముఖీనత బలంగా కనిపిస్తుంది. ఎందు చేత?

నా విషయంలో వాస్తవం. కాని ఈ ప్రశ్న లోతైన మూలాలకి సంబంధించినది . ఎందుకంటే నాకు కవిత్వం పైన్ వృక్షాల వేర్లని వెతికే హాన్ బిల్ల్ కన్ను. ప్రపంచ వ్యాప్తంగా వున్న సిద్ధాంతాలు ప్రకృతిని ముడిసరుకుగానే జమకడతాయి. స్టేట్స్ కూడా. ఇవన్ని ట్రేడబుల్ కమాడిటిస్. రేవు దాటిన కంపెనిల ఓడ మరొక రేవుకి చేరినకాలమ్నుండి నేటి వరకు ప్రకృతిని దోచుకునే గుణం పెరుగుతూనేవుంది. అంతకుమునుపు కూడా వుంది అందుకే మూలవాసులని రాక్షసులుగా చిత్రీకరించారు. యుద్ధం అనేది మూలవాసులకి దిన చర్య. వాళ్ళు అనాదిగా వాళ్ళ అస్తిత్వంకోసం పోరాడూతూనే వున్నారు. అది ఎప్పటికీ కొనసాగుతుంది.ప్రకృతి సమతుల్యత వుండాలంటే భూ మి పైన 33% శాతం ఆడవులుండాలంటారు అంటే అక్కడ వుండే వాళ్ళు వుండకూడదా? వాళ్ళ వల్లే అడవులు నాశనం అవుతాయంటూ దుష్టప్రచారం. దేవుడికి మాన్యం కావాలి, ప్రకృతిలొ మమేకమై విగ్రహ ఆరాధనలేకుండా ప్రకృతిని పూజించే వారు తిరిగుబాటుదారులు.

ఏడుకౌండల్లో వున్న స్థానికుల జీవిత చిత్రాలు ఎంతమందికి తెలుసు. అభయారణ్యం,జాతీయ పార్కులో జీవించే వార్కి హక్కులుండవు. వున్నట్టుండి ఇల్లు,గ్రామం ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటిస్తారు (అంతటా జరిగింది). ఈ విషయాలు వాళ్ళతో చరిస్తున్నప్పుడు ఉద్రేకం తన్నుకొస్తుంది, ఏక కాలంలో పరిపరి విధాల వ్యూహాలు రచించాలి. ఇందంతా కవిత్వంలో చేప్పలెనూ కాని చెప్పాలి కవిత్వం నాకు అన్వేషించే మార్గాన్ని, వివిధ రకాలుగా వ్యక్తపరిచే తీరుని,వ్యుహ రచనల్ని నేర్పించింది. నాకు కవిత్యం నినాదం కాదు. నేను కవిత్వ ఆలోచనా రూపానికి ప్రతీకనవ్వాలన్న కాంక్ష!.’కవిత ‘ నాకు లోతైన దృష్టిని క్లుప్తంగా వ్యక్తపర్చే ఇంధనం. అది లేతాకుపచ్చని ఎరుపురంగు..

యుద్ధంలో మరో రోజు

ఈరోజూ నీది

రేపు నాది ఇకపై

రోజుకొకటి చొప్పున

ఇళ్ళల్లో

చేలల్లో

మన బొమ్మలు

మనమే నాటుకుందాం

గర్భంలోని శిశువుల్లా

నేలను దున్నుకుందాం

వాళ్ళ కళ్ళను

బోర్లించిన మట్టికుండలోని

శూన్యంగా మార్చుదాం

పుడమి చిట్లిన శబ్దం

మన

యుద్ధ సంకేతం

(కాంతి పార్వతికి,18-11-97)

ప్రకృతిని అర్ధంచేసుకోవడం చాలా అవసరం. అది కేవలం ఒక పాఠ్యాంశం కాదు. ఆడవిలో చెట్లని నాటాల్సిన అవసరంలేదు. ఒక చిరుజల్లుకి మోడువారిన కూట్లలోని పచ్చదనం మళ్ళీ చిగురిస్తుంది. ఆ చిగురించే కాలాన్ని ,వ్యవధిని ప్రకృతికి ఇవ్వాలి. మనలో అంత ఓపిక ఎక్కడ వుంది? అందుకే ఓపిక గా చెప్పడానికి వ్యాసాలని మాధ్యమంగా ప్రయోగిస్తాను. అంతేకాక క్షేత్రస్థాయి కార్యకర్తలకు రాయడంలో మెలకువలు, నైపుణ్యం పెంచే ప్రయత్నాలు చేస్తాను. ఎప్పటికైనా పచ్చదనం గిరిజనుల రాతల ద్వారా పరివ్యాప్తి చెందాలని. చివరాఖరి మాట ప్రకృతిని పర్యాటకుడిగా చూడలేను, గిరిజనుడి ధృక్కోణంతో చూడాలన్నది నా వాంఛ.

కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
ఇంటర్వ్యూ: మూలా సుబ్రహ్మణ్యం

నమ్మిన ఒక్కో విలువా కళ్ళెదుటే కూలిపోతుంటే ఆధునిక జీవితం అట్టడుగున నిరాకారంగా కనిపించే అస్తిత్వం ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ మనిషి వేదనని తెలుగు కవిత్వంలో మొదట పటుకున్నది బైరాగి. నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పదచిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే పద చిత్రాలతో సైతం ఆ వేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌. “లక్ష ఆకలి చావులకు మించి/ఒక్క ప్రేమ రహిత హృదయ హత్యోదంతం/అతి పెద్ద నీచ కావ్యం” అని ప్రకటించిన ఇక్బాల్ చంద్ గారితో ముఖాముఖి.

“వేసవి

ఎడారి ఇసకలో తలదూర్చి

తనని వెతుక్కునే ఉష్ట్రపక్షిని చూశావా?

కవీ!

దాహం తెలుసా”

అని అడగ్గలిగిన మీ కవితా దాహం, ఆ దాహం తీర్చుకునేందుకు చేసిన సాధన గురించి చెప్తారా?

మొదటి నుంచీ మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. ఉర్దూ కవి హీరాలాల్ మోర్యా గారు, దాశరథి గారు దరిదాపుగా మా ఇంటివారే. బాల్యంలో నేనూ, అఫ్సర్ మోర్యా గారింట్లోనే ఉండేవాళ్ళం. నాకు తెలిసి నా బాల్యంలో అఫ్సర్ కి పుస్తకం తప్ప మరో ప్రపంచం లేదు (బహుశా ఇప్పటికి కూడా అనుకుంటా). రోజుకి పదహారు గంటలు చదివేవాడు. నాతో మొదట కవిత్వం రాయించింది అఫ్సరే. అలాగే అఫ్సర్ గారి తండ్రి కౌముదిగారు స్వయంగా మంచి అనువాదకుడు, కవి. నాకు పేరు కూడా ఆయనే పెట్టారు. కౌముది గారి ప్రభావం ఆయన పిల్లల మీద కంటే నా మీద ఎక్కువగా ఉంది. కాబట్టి సాహిత్యం వంటబట్టడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత అఫ్సర్ రికమెండేషనుతో ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ గారింట్లో ఒక సభ్యుణ్ణైపోయాను. భుక్తికోసం నానా పాట్లు పడుతున్న రోజుల్లో సుధాకర్ గారు, హేమలత అమ్మ గారు నాకు అన్నం పెట్టడమే కాకుండా నన్ను ఒక కొడుకుగా చూసుకుంటూ నా బాధ్యత తీసుకుని రాత్రులు రాత్రులు ప్రాచీన తెలుగు ఉర్దూ సాహిత్య రహస్యాలను నాలోకి ఒంపారు. ఎలా రాయకూడదో చెప్పి, ఎలా రాయాలో నన్నే వెతుక్కోమన్నారు. సుధాకర్ గారి ద్వారా బేతవోలు రామబ్రహ్మం గారి పరిచయ భాగ్యం దక్కింది. నా ఉర్దూనోట సంస్కృతం పలుకు పలికించిన ఘనత రామబ్రహ్మం గారిదే. వాస్తవానికి యూనివర్సిటీలో ఆయన మాకు సంస్కృత పాఠాలు చెప్పాలిగానీ, సంస్కృతంతో పాటు ఎన్నో ఆధునిక సాహిత్య మర్మాలని బోధించేవారు. ఒక్కోసారి మాకు తెలీకుండానే మా ప్రశ్నలకి ఆయనలా జవాబులు చెప్తూ ఉంటే గంటలు గంటలు గడిచిపోయేవి . అలా యూనివర్సిటీలో బేతవోలు రామబ్రహ్మం, ఎండ్లూరి సుధాకర్ గార్ల పాఠాలు వినడం, రూంకి వచ్చేసి పుస్తకాలు చదువుకోవడం ఇంతే పని. ఇవాళ లైబ్రరీలో ఐదు పుస్తకాలు తెచ్చుకుంటే రేపటికి పూర్తైపోయేవి. కవిత్వం నాకు ఒక జీవనవిధానంగా మారడానికి వీళ్ళు ముగ్గురూ కారణం. అఫ్సర్ ఎండ్లూరి సుధాకర్ వీళ్ళిద్దరి కవిత్వ నిర్మాణ పద్దతినుండి బయటపడ్డానికి, నాకంటూ ఒక సొంత గొంతు వెతుక్కోడానికి ఎన్నో నిర్నిద్ర రాత్రులు గడపాల్సి వచ్చింది.

ప్రతి కవీ తనకంటూ ఒక కవిత్వ భాష (డిక్షన్) సృష్టించుకుంటాడంటారు. మీ కవిత్వం చదివితే మీకంటూ ఒక డిక్షన్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా సాధించుకున్నారు?

దానికి నా సంచార మనస్తత్వం తద్వారా రకరకాల పలుకుబళ్ళని ఆకళింపు చేసుకోవడం ఒక కారణమైతే , నా ఉర్దూ సంస్కృత సాహిత్యాల అధ్యయనం మరొ కారణం. బహుశా సంస్కృతం, ఉర్దూ కవిత్వం అధ్యయనం లోనుంచి ఈ నేర్పరితనాన్ని నేను దొంగిలించి ఉంటానేమో (నవ్వులు). ఏమైనా నా ఈ టెక్నిక్ ని చాలా మంది ప్రేమించారు. చాసో, మో, కాశీభట్ల వంటి వాళ్ళతో సహా.

ఒక భావం మీలో ఉద్భవించడానికీ, అది కవితగా బయటకి రావడానికీ మధ్య మీలో జరిగే సంఘర్షణ గురించి చెప్తారా?

ఒక భావం నాలో కలిగాక , కాగితం మీద పెట్టడానికి ముందు కొన్ని గంటలు, కొన్ని నెలలు ఒక్కోసారి కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ స్థితిలోనే ఉండిపోతాను. ఆ భావానికి ఒక రూపం వచ్చిందని అనుకున్నప్పుడు మాత్రమే కాగితం మీద పెడతాను. కాగితం మీద పెట్టాక కూడా నిర్దాక్షిణ్యంగా ఎడిట్ చేసుకుంటాను. అందుకే నావి మేక్సీ కవితలు కావు. (నవ్వులు). కవిత్వంలో క్లుప్తత లేకపోతే అది అకవిత్వమౌతుంది. ఈ రహస్యం మన చాలామంది కవులకి తెలీదు. తెలిసిన కొద్ది మందీ కూడా పాఠకులకి అర్ధం కావాలనే ఒక బలహీనతలో పడి కవిత్వాన్ని పల్చన చేస్తారు.

ఎడిటింగ్ ఆర్ట్ ఎలా నేర్చుకున్నారు?

కవిత్వంలోనైనా , జీవితంలోనైనా నచ్చనిదాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. కాబట్టి నన్ను నేను ఎడిట్ చేసుకోవడమనేది నా జీవితంలో ఒక భాగం. అలాగే నా కవిత్వం కూడా. శిలలో అనవసరమైన భాగాలు తొలగించకపోతే శిల్పం కానేరదు కదా! (నవ్వులు)

కవిత్వ పరంగా మీకు సలహాలిచ్చిన వాళ్ళున్నారా?

(పెద్ద నవ్వు).. ఆ సలహాలని తృణీకరించడమే ఇవాళ్టి వరకు నేను చేస్తున్న పని. కవిత్వంలోనైనా, జీవితంలోనైనా ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవాలని నేను నమ్ముతాను.

దేన్నైనా కవితగా మలచగల గొప్ప ప్రజ్ఞ ఉన్న మీరు ఈ మధ్య ఏమీ రాస్తున్నట్టు లేరు. కారణం?

నేను కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నా శరీరంలో ఎక్కడైనా ఒక కత్తిగాటు తగిలితే రక్తానికి బదులుగా కవిత్వం కారుతుందని నమ్ముతాను. అయితే ఇప్పటికీ నన్ను నేను ప్రొఫెషనల్ కవిగా అనుకోడం లేదు. సహజంగా నేను స్లో రైటర్ని. నా సహచర కవి మిత్రులతో పోల్చుకుంటే గత పాతిక సంవత్సరాల్లో నేను రాసింది చాలా తక్కువ. అయితే కొండంత చెత్త రాయడంకన్నా గోరంత మంచి కవిత్వం రాసుకోవడం మేలు కదా! రోజూ ఏదో ఒకటి రాయాలని పనికట్టుకుని చెత్త రాసే బదులు రాయకుండా ఉండడంలో సాహిత్యానికి ఒక మేలు ఉంది. ప్రతీ పుట్టినరోజుకీ ఒక పుస్తకం అచ్చువెయ్యాలని నాకేమీ ఆతృత లేదు. ఒక ఉర్దూ కవి ఇలా అంటాడు

“షాయరీ క్యా మజాక్ సంజే లోగ్

హం తో తీస్ బరస్ సే లహూ బహాకే కహెనేకీ తెహజీబ్ సీకీ హై”

కవిత్వం అంటే ఒక పరిహాసమనుకుంటారు ప్రజలు

నేనేమో ముప్పై సంవత్సరాలు రక్తం ధారపోసి

పలికే మర్యాదని నేర్చుకున్నాను

మీకు నచ్చిన కవులెవరు?

శిష్ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీరంగం నారాయణ బాబు, బైరాగి, వజీర్ రెహ్మాన్ , మో, నగ్నముని. ఇతర భాషా కవుల్లో బహుదూర్ షా జఫర్ , మీర్ తాకీ మీర్ , అక్తర్ షీరాణీ, బుల్లే షా, రూమీ, మహ్మద్ ఇక్బాల్ , ఫైజ్ , మజాజ్. ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో రెంటాల కల్పన రచనలు నాకు చాలా ఇష్టం. ఆమె రచనల్లో ఒక తపన ఒక వెతుకులాట ఒక ఫైర్ మనల్ని ఒక అలౌకిక స్థితికి తీసుకువెళ్తాయి. అఫ్సర్ ముమ్మాటికీ ప్రొఫెషనల్ పోయెట్. అతని స్పాంటెనిటీ నాకు చాలా ఇష్టం. ఎండ్లూరి సుధాకర్ కవిత్వంలో ఆర్ధ్రత నాకు ఇష్టం. సీతారాం ఒకప్పుడు బాగా రాసేవాడు. నామాడి శ్రీధర్, సిద్దార్థ, అనంతు, గాలినాసర రెడ్డి, ఎమ్మెస్ నాయుడు సాయికిరణ్ కుమార్, ఇంద్రాణి, ప్రసూన, సుబ్రహ్మణ్యం, ఫిక్షన్లో బహుశా రఘోత్తమ కొత్త ద్వారాలు తెరుస్తారు. ఇంకా చాలా మందే ఉన్నారు గానీ పేర్లు గుర్తుకు రావడం లేదు.

వీళ్ళందరిలో బాగా ఇష్టమైన కవి గురించి చెప్తారా?

మజాజ్ అసలు పేరు అసరుల్లా ఖాన్. గొప్ప అందగాడు. ఉర్దూ మజాజ్ , తెలుగు బైరాగి ఒక్కరే. మజాజ్ కవిత్వం ఇచ్చిన మత్తు ఈ జన్మకు వదలదేమో! అలీఘడ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అమ్మాయిలు అతని ఫొటోని పుస్తకాల్లో దాచుకుని ఆనందించేవారు. తర్వాత్తర్వాత మందుకు బానిస అయ్యాడు. మధుశాలలో మధువు తాగుతూ చిత్తుకాగితాలపై కవిత్వం రాసి ఉండలు చుట్టి విసిరేసేవాడు. అట్లా విసిరేసిన ఘజల్ పంక్తుల్ని నౌషాద్, తలత్ మహుమూద్ వంటి వాళ్ళు ఏరుకొచ్చి బాణీలు కట్టి సినిమాల్లో పాటలుగా వాడుకున్నారు. ప్రముఖ కవి జా ఇసార్ అఖ్తర్ కు స్వయానా బావ. నేటి ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ కు స్వయానా మేనమామ. ఒకరోజు రాత్రి మిత్రులు బలవంతంగా తీసుకెళ్ళి ఒక మేడపైన మధు కవితా గోష్ఠి జరిపించుకున్నాకా ఎటు వాళ్ళు అటు అంతా వెళ్ళిపోయారు. మజాజ్ ఒక్కడే అక్కడే నిద్రపోయాడు. మళ్ళీ లేవలేదు.

కవులు మన ప్రాచీన సాహిత్యం చదవడం ఎంత వరకు అవసరం?

నిజానికి నాకు తెలిసిన చాలా మంది కవులకి ప్రాచీన సాహిత్య జ్ఞానం శూన్యం. ఒక పాఠకుడికి అవసరం లేకపోవచ్చేమోగానీ ఒక కవికి తప్పనిసరిగా అధ్యయనం అవసరం. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము ఈ మూడూ కావాలని మన పూర్వీకులే అన్నారు. నేను కవిత్వం మొదలు పెట్టిన తొలినాళ్ళలో వేగుంట మోహన ప్రసాద్ గారికీ, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గార్లతో గడిపిన సందర్భంలో ఒక అర్ధరాత్రి నన్ను కూర్చోబెట్టి నేను చదవాల్సిన యాభైరెండు పుస్తకాలని ప్రిస్క్రైబ్ చేసారు. అన్నీ ప్రాచీన సాహిత్య గ్రంధాలే. ప్రబంధాలతో సహా. వాటిలో చాలావాటిని ఎండ్లూరి సుధాకర్ గారితో చెప్పించుకున్నాను. కొన్ని మేమిద్దరం కలిసి చదువుకున్నాం. మన పూర్వీకులు ఏమి రాసారో తెలియకపోతే మనం ఏమి రాసామో , ఏమి రాస్తున్నామో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతుంటాం. ఈమధ్య వస్తున్న కొందరి రాతలు చూస్తే ఈ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది.

మీ దృష్టిలో కవిత్వం ఎలా ఉండాలి?

కవిత్వం ఎలా ఉండాలో కంటే ఎలా ఉండకూడదో చెప్తాను. రాజకీయ కార్యకర్తలు గోడల మీద రాయాల్సిన నినాదాల్ని కవిత్వం పేరుపెట్టి కవిత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయాలు రసహీనమైనవి. కవిత్వం హృదయ సంబంధమైనది.

గతంలో మరి మీరు కూడా రాజకీయాల మీద కవిత్వం రాసారంటారు కదా.

అవును. సైకిల్ నేర్చుకునే క్రమంలో ఒక రెండు సార్లు కింద పడ్డాను. (నవ్వులు)

తెలుగులో ప్రస్తుత కవిత్వ పరిస్థితి ఎలా ఉంది?

నిజం చెప్పాలంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కవిత్వాన్ని పొట్టులో గింజల్ని వెతుక్కున్నట్టుగా వెతకాల్సి వస్తోంది. నిజానికి ఈ తప్పు కవులది అని చెప్పడానికి కూడా లేదు. మనకి ఈస్థటిక్స్ తెలిసిన పాఠకులు లేరు. మనవాళ్ళకి ఈస్థటిక్ సెన్స్ పూర్తిగా నశించింది. ఒక కవిత్వ విషయంలోనే కాదు, మనకి మంచి సినిమాల్లేవు, సంగీతం లేదు, ఆర్ట్ లేదు. అందుకే చాలా డ్రై గా అనిపిస్తోంది నేటి తెలుగు వాతావరణం. దానికి తోడు వాద వివాదాల రాజకీయాలు. ఎంతటి దౌర్భాగ్యమంటే కవిత్వం రాసిన కవే సాటి కవులతో ముందుమాటల ప్రశంసాపత్రాలు రాయించుకుని, తనే అచ్చేయించుకుని , తనే పంచిపెట్టుకునే ఒక దుర్మార్గ వాతావరణంలో తెలుగు సాహిత్యం కొట్టుమిట్టాడుతోంది. మిగిలిన భాషల కవిత్వాల్లో ఇంత దయనీయమైన పరిస్థితి లేదు. ఉదాహరణ చెప్తాను. కేరళలో ఒక హోటల్లో ఒక మిత్రుడితో బస చేసినప్పుడు కమలాదాస్ కవిత్వం గురించి మాట్లాడుకుంటుంటే మాకు టీ తీసుకొచ్చి ఇచ్చిన ఒక పది పన్నెండేళ్ళ కుర్రవాడు మా సంభాషణల్లో పాల్గొనడమే కాకుండా కమలాదాస్ గురించి మాకు తెలియని అనేక విషయాలు చెప్పాడు. అంతేకాక తనకు కమలాదాస్ తో పరిచయం కూడా ఉంది అని చెప్పాడు. ఇలాంటి స్థితి ఆంధ్రదేశంలో ఊహించగలమా?

దీన్నుంచి బయట పడే మార్గాలున్నాయా? తెలుగు కవిత్వానికి మంచిరోజులొస్తాయా?

మన తరం ఎలాగో రసహీనమైంది. కనీసం మన పిల్లలనైనా సౌందర్యత్మకంగా పెంచుదాం. కవిత్వాన్నీ తద్వారా వాళ్ళ తరాన్నీ వాళ్ళే రక్షించుకుంటారని ఆశిద్దాం.

అసలు మంచి కవిత్వమే రావట్లేదంటారా?

అలా అని కాదు. కానీ బహుళ ప్రచారపు అకవిత్వపు పొరల్లో దాగిన అచ్చమైన కవిత్వాన్ని వెతికి పట్టుకోవడం కష్టమౌతోంది.

మరి ముందు తరాలకి ఈ కొద్దిపాటి మంచి కవిత్వం ఎలా చేరుతుంది?

నన్నయ కాలంలో కూడా నానా రకాల చెత్త కవులు ఉండే ఉంటారు. వాళ్ళందరూ తెరమరుగయ్యారు కదా. అలాగే ఇప్పటి అకవులక్కూడా కాలం అదే గతి పట్టిస్తుంది. కవిత్వానికి నిజమైన గీటు రాయి ఎప్పుడూ కూడా కాలమే!

కవుల్లో సహజంగా ఉండే కీర్తి కాంక్ష మీద మీ అభిప్రాయమేమిటి?

కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు.

ముందు ప్రశ్న ఎందుకడిగానంటే మీరు ఒక కవితలో రాస్తారు “పఠితకు ఎదురుగా ఉన్న కవి కవిత్వానికి మొదటి శత్రువు” అని

నేనిప్పటికీ దాన్ని బలంగా నమ్ముతున్నాను. పాఠకుడికి కవి ఎవరో, కవి నేపథ్యమేమిటో తెలియాల్సిన అవసరం లేదు. కవిత్వం వలనే కవి తప్ప, కవి వల్ల కవిత్వం కాదు. పాఠకుడికి చేరాల్సింది కవిత్వం. కవి బయోడేటా కాదు.

మీ కవితల్లో మీకు నచ్చిన కవిత ఒకటి వినిపిస్తారా?

బైరాగి పాట

కొన్ని చెప్పుకోలేని చిక్కులు వుంటాయి

కనబడుతూ ఎవరూ తరమరు

కానీ ఈ దారంటే వెళిపోవాలి

చివరికి చేరాక అసలు రావల్సింది ఇక్కడకి కాదు

లోకపురుషులు

ఏమి ఆశించి మెట్లు పైకి ఎక్కుతారో

నేను దాన్ని వొదుల్చుకోడానికే

కిందకి దిగుతున్నాను

అవును- మీరు చక్కంటి సొంతదారులు

ఇహాన్నీ పరాన్నీ పొందారు -

ఆ రెండిట్నీ పోగొట్టుకున్న నేను

కనకూడని ఓ వింత స్వప్నం -

చీకట్లో రంగులతో పనేమిటి?

ఇప్పుడు చెప్పు

నేనేమైన ఆశించానా?

‘శ్రీకాంత్’ అంటూ ఎవరూ లేరు !
శ్రీకాంత్ ముఖాముఖీ – రెండో భాగం

6. స్త్రీలు…మీ కవిత్వంలో బహు పాత్రల్లో కనిపిస్తారు? ఎందుకని?

(I am assuming that you have used this word ‘స్త్రీలు’ to indicate the English equivalent Woman and not Female. And hence my reply proceeds from such presumption)

ఇలా ప్రశ్నించుకుందాం ముందుగా మనల్ని మనం ఒకసారి, మన పాత్రలతో మన పాత్రలలోంచి బహు విధాలుగా. ఎందుకంటే ఈ ప్రశ్న, స్త్రీల గురించిన ప్రశ్న, స్త్రీల ప్రశ్న (the question of women. Often more than once, Woman is a recurring question to us. For us. Who would deny it?) స్త్రీలు సమాధానం చెప్పాల్సిన, స్త్రీలు ప్రశ్నించాల్సిన ప్రశ్న ఏదైతే ఉందో, అది పలు స్థాయిలకి సంబంధించినది కనుక. పలు ప్ర’క్రియలకీ’ సంబంధించిన కనుక. కనుక, ముందుగా ఒక ప్రశ్న: స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ అని మనం అన్నప్పుడూ, లిఖించినప్పుడూ, ఉద్దేశించినప్పుడూ, సంభోదించినప్పుడూ, మనకు తెలిసింది లేదా ముందుగా తెలియాల్సినదీ ఏమిటంటే మనం బౌతికపరమైన ఒక ప్రాణి గురించి కాదు మాట్లాడుతున్నదీ అని. (When we say ‘woman’, we just don’t mean a biological being with certain organs as such. We are not just dealing with the sex of a particular species. దీనిని సూచించడానికి ఆంగ్లంలో Female అనే పదం ఉంది.) అవునా, కాదా? ఎప్పుడైతే మనం స్త్రీ అనే పదం వాడుతున్నామో, స్త్రీత్వం అనే పదం వాడుతున్నామో, మనం భౌతికమైన రూపాన్నీ, అర్థాన్నీ దాటి వాటి ‘నిర్మాణాల’ పరిధిలోకి వెడుతున్నాం. అంటే స్త్రీ అనే పదం భౌతికమైన ఒక నిష్పాక్షికమైన ‘వాస్తవాన్ని’ సూచించే పదం కాదు అనీ, ఇంకా అటువంటి పదం మనం వాడుతున్నప్పుడల్లా ఆ పదానికి చెందిన చరిత్రను గురించి కూడా మాట్లాడుతున్నామనీ ఆకళింపు చేసుకోవడం. అందుకే మనం మళ్ళా, మరొకసారి ఇల్లా ప్రశ్నించుకుందాం:

స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ పై వందల ఏళ్ళుగా తత్వశాస్త్రంలోంచీ, చరిత్రలలోంచీ, పురాణాలలోంచీ సాహిత్యాలలోంచీ ఇంకా అనేక డిస్కోర్సల వాచక కర్మాగారాలలోంచి ఉత్పత్తి అయిన రూపాలలోంచి, వివిధ ప్రతీకలలలలోంచీ వివిధ చిహ్నాలలోంచీ వివిధ ప్రతిరూపాలలోంచీ, స్త్రీకి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాలలోంచీ స్త్రీని విడదీసి స్త్రీని చూడటం ఎలా? మనకై ఒక స్త్రీని సృష్టించి చలామణి చేస్తున్న వాచక మగ్గాలలోంచి, పునరావృతం చేస్తున్న వివిధ స్వరాలలోంచి, కుటుంబాలలోంచీ, పితృస్వామిక వాంఛా మరియు వీక్షణలోంచి తప్పించి, మనం తప్పించుకుని స్త్రీని చూడటం ఎలా? When we say ‘woman’, do we have a possibility to reach women, as such? అలా చూడాలంటే ఎటువంటి పాత్రలు కావాలి మనకి? మనం ఎటువంటి పాత్రాధారులను, దారులనీ వొదిలి వేయాలి? ఎటువంటి రూపాలతో, ఎటువంటి బహుముఖాలతో చూడాలీ, దరి చేరాలి మనం? ఎటువంటి దారిని ఎన్నుకోవాలి మనం? కానీ మళ్ళా మనం మరొకసారి ఇన్సిస్ట్ చేద్దాం: స్త్రీ అంటే ఏమిటి? చరిత్రకీ, తత్వశాస్త్రానికీ, సౌందర్య‘శాస్త్రానికీ’, సాహిత్యానికీ, నీతికీ, విలువల వలువలకీ, అనువాదానికీ, ముడిపడి ఉన్న, రాయబడి ఉన్న, మళ్ళా మళ్ళా రాయబడుతూ ఉన్న స్త్రీ అంటే ఏమిటి? సాధారణంగా వివిధ డిస్కోర్స్ లలో, ఇలా కనపడుతుంది స్త్రీ మనకి:

విప్లవం: స్త్రీ అంటే పునురుత్పత్తి సాధనం. ఈ స్థాయిని ఎప్పుడైనా (తెలుగు) విప్లవం లేదా విప్లవ కథా సాహిత్యం దాటిందా? స్త్రీ అంటే విప్లవానికి ‘కొడుకులని’ ఉత్పత్తి చేసే సాధనం అనే స్థాయిని దాటిన ఒక నృత్యకారిణినినీ, తనదైన నృత్యం చేసే ఒక స్త్రీనీ, విప్లవం కానీ విప్లవం సాహిత్యం కానీ ఎన్నడైనా ఊహించాయా?

మతం/ఆధ్యాత్మికత: ముందుగా ఒక చిన్న quote. (enlightened అయిన ఒక వాక్యం:) ‘రూపమూ, (అస్తిత్వం) ఉండటమూ అనేవి (నాకు) తెలియకుండా జరిగాయి. లేకపోతే నేను తొమ్మిది నెలలకై అ అపరిశుభ్ర ప్రదేశంలోనికి ఎందుకు ప్రవేశిస్తాను?’ (Italics mine). ఏం అర్థమౌతుంది మీకు? తొమ్మిది నెలల ఆ అపరిశుభ్ర ప్రదేశం ఏమై ఉండవచ్చు? ఎవరిదై ఉండవచ్చు? గర్భం ఒక అపరిశుభ్ర ప్రదేశం, తొమ్మిది నెలలు నువ్వు గడిపిన ఆ గర్భం అపరిశుభ్ర ప్రదేశం ఎలా అయ్యింది? ఈ చిన్న ఉదాహరణ ఎందుకంటే, ‘వారసత్వంగా’ ఒక వారసత్వంలోకి మనం జన్మించిన, మనం చదివిన, మనకు చెప్పబడుతున్న మత వాచకాలూ, పురాణేతిహాసాలూ, స్త్రీ పట్ల ఇంతకన్నా బిన్నమైన భావనలని ఏవీ ఇవ్వవు కనుక. వేదాలు కానీ, రామాయణ మహా భారతాలు కానీ ఇతర మత గ్రంధాలలోని స్త్రీ పాత్రల వివరణలు కానీ, ఇంతకంటే బిన్నమైన వ్యాఖ్యానాన్ని సూచించవు కనుక. (ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటె, డిల్లీ అత్యాచార ఘటన తరువాత సోకాల్డ్ ఆధ్యాత్మిక గురువుల ప్రతిస్పందన ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి)

సాహిత్యం: ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్కసారి ఇంతవరకూ, సాహిత్యంలో మనం చదువుకున్న ‘కవిత్వం’ కానీ, కథలు కానీ, ప్రబంధాలు కానీ లేదా విజువల్ మీడియాలో చూసే స్త్రీ పాత్రలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ‘లలిత కోమలమైన వాళ్ళూ’ ‘అత్యంత సౌందర్యవతులూ, ‘త్యాగానికీ, స్వార్ధ రహిత ప్రేమకీ చిహ్నం తను ’అనీ ‘అనురాగమయి, సహనవతి, దేవతా, అప్సరస సీతా, సావిత్రీ అనీ ఇంకా blaa blaa blaa… everything in black and white. Nothing else. (ప్రస్థుతానికి నేను స్త్రీ sexuality, దానిని condition చేసే, చేస్తున్న మహా కుట్రల వైపు వెళ్ళడం లేదు). ఇటువంటి నిర్ధారణలు ఎంత ప్రమాదం అంటే, ఏళ్ళ తరబడి అవి పునరావృతమయ్యి, అయ్యీ అయ్యీ ఇక స్త్రీలు తమను తాము ఆ ప్రతిరూపాలలోంచి దాటి చూసుకోవడమే ఒక ఘర్షణగా మారుతుంది. అలా చూసుకోవడమే మహాపాపం అన్నట్టుగా కనిపిస్తుంది సమాజానికి. ఎంత సంఘర్షణ – అటువంటి clichéd images నుంచి బయట పడాలి అని అనుకునే స్త్రీలకీ, అటువంటి clichéd images నుంచి బయట పడక, స్త్రీలని మూర్ఖంగా పునరావృతం చేసే పురుష వాచకాలకీ!

ఇదంతా ఎందుకంటే, స్త్రీలను మనం చూసే పద్ధతి, మన వీక్షణా ఇంకా చాలా చాలా conservative అయిన అ/సాహితీ ప్రక్రియల, మతమూ పురాణాల ప్రతీకలని దాటి రాలేదు కనుక. ఇంకా ఇదంతా ఎందుకంటే, ఒక స్త్రీ , ఒక్క స్త్రీ అంటూ ఎవరూ లేరు కనుకా, ఇంకా స్త్రీ అంటే heterogeneous కనుకా, మూసలలో ఇమడని, ఇవ్వబడిన మూసలలో ఇమడలేక తమ శరీరాలకై తాము యుద్ధం చేస్తున్న స్త్రీలన నేను చూసాను కనుకా, అందులో కొంతమంది నాకు దగ్గరిగా తెలుసు కనుకా, వాళ్ళు నా జీవనంలో భాగం కనుకా, ఇంకా నాకు స్త్రీ అంటే రాత/లిఖితం కనుకా, స్త్రీలు బహురూపులు కనుకా, నా వాచకాలు ‘వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ కాదు కనుకా, ఇక నాకు చాలా నచ్చే ఒక వాక్యంతో ఇలా ముగిస్తాను: that which cannot be taken in by truth, is in truth feminine, అని అనుకుంటో. ఇక ఇంకా ఇంతకు మించి ఏం చెప్పగలను నేను ఈ పరమిత పరిధిలో అని కూడా చెప్పుకుంటో.

7. ముస్లిం వ్యక్తులు .మీ కవిత్వంలోకి చాలా సౌకర్యంగా దూసుకు వస్తారు. ఎందుకని?

You want to know the secret? మీకు ఆ రహస్యం తెలుసుకోవాలని ఉందా? ఇంతకు మునుపే మొదలయ్యిందానిని ఇలా అడుగుతూ మొదలు పెడతాను:

ఎందుకు ‘రాకూడదు’? ఇక్కడ కొంత aggressiveగా కూడా ఉంటాను. కొన్ని విషయాల గురించి చెప్పుకోడానికి ఇలా కూడా అడుగుతాను, మరి మీరు ‘’సౌకర్యవంతంగా’’ ఇంకా ‘‘దూసుకురావడం’’ అనే పదాల ద్వారా దేనిని సూచిస్తున్నారో నాకు తెలియనప్పటికీ:

కొంత సేపు, ఈ శరీరం, ఈ వాచకం, ఈ వాచక శరీరం పేరు శ్రీకాంత్ కాదనుకుందాం. (కానీ నిజానికి, శ్రీకాంత్ అనే పేరుని ఈ వాచకం, ఈ వాచక శరీరం, ఈ శరీర వాచకం carry చేస్తున్నాయా? Does this text, does this body, does this textual body carry the name ‘Srikanth’? If so, what are the bearings of this name, this naming?) కొంతసేపు ఈ వాచకపు శరీరం పేరు అఫ్సర్ అని అనుకుందాం. అలాగే, ఇంకా కొంతసేపు, అఫ్సర్ అని మనచే/ఇతరులచే నామ్నీకరణం చేయబడ్డ ఆ శరీరపు నేనూ ‘కవిత్వం’ రాస్తూ ఉంది అని అనుకుందాం, ఆ ‘కవిత్వం’ ‘చాలా సౌకర్యవంతంగా దూసుకు వచ్చే’ ముస్లిం వ్యక్తులతో నిండి ఉంది అని అనుకుందాం. Now, ఆ అతనిని, పైన అడిగిన ప్రశ్న/ప్రశ్నే అడుగుతారా? అడగగలుగుతారా? I doubt it. ఇది ఎందుకూ అంటే, నామం, నామ్నీకరణం ఇతరుని మనం అర్థం చేసుకునే ప్రక్రియని ఎంత వరకూ ప్రభావితం చేస్తాయో, నామం, నామ్నీకరణం అనేవి ఎలా మన presumed notions of understanding the Otherగా మారతాయో చెప్పడానికి మాత్రమే. అయినా, అదే aggressivenessతో మిమ్మల్ని మరొకటి కూడా అడుగుతాను: ‘నేను’, ముస్లింని కాదని మీకు ఎలా తెలుసు? నేను హిందువునో, క్రిస్టియన్ నో, లేదా ముస్లింనో …అవునో కాదో…మీకు ఎలా తెలుసు? నేను ముస్లిం కాదని మీరు ఎలా, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? అన్నిటి కంటే ముందుగా, ఇతరున్ని ‘అడగటం’, అడగటం అనే ఈ సంజ్ఞ, ఈ అడిగే సంజ్ఞ, ఈ రహస్యం (this asking, the act of this asking, the gesture of this asking, this asking gesture) ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ ఆధారంపై నిలబడి ఉన్నదో ఒకసారి ఆలోచించారా? ఎలా పంచుకుంటాం మనం దీనిని? ఈ సంజ్ఞని? ఈ రహస్యాన్ని? ఈ ‘సౌకర్యవంతం’గా రావడాన్ని?

ఇప్పుడు, కొంత సరళంగా ఇలా కూడా అడుగుతాను: నన్ను నిర్వచించేది ఎవరు? నేను ఏ మతానికి చెందినవాడినో (should one always belong to a religion, one religion? Should one always have a religion? What if one does not have one?) ఎలా ఉండాలో, ఉండకూడదో, నేనేం ధరించాలో ధరించకూడదో, నేనేం తినాలో తినకూదదో నిర్ణయించేది ఎవరు? అలా నిర్వచించే ‘వాళ్ళు’ ఎవరైనా ఉంటె, అలా నిర్వచించే వాచకాలు ఏవైనా ఉంటె, వాళ్ళకీ, వాటికీ, నన్ను నిర్వచించే, నిర్ణయించే అధికారం ఎవరు ఇచ్చారు? ఈ నిర్వచనాలూ, నిర్ణయాలూ వాడుకలోకి ఎలా వచ్చాయి?ఏ స్థానాలలో ఉన్నవారు, ఎటువంటి అధికారంలో ఉన్నవాళ్ళు వాటిని విరివిగా వాడుతున్నారీ? వాటిని దేనికై ఉపయోగిస్తున్నారు?మరొకరి ఈ ‘నిర్ణయాలు’, నిర్వచనాలు, వచనాలు కాకుండా నేను మన్నలేనా? What if I do not participate, in your games of identity? What if I don’t participate in your games of religious identity as such? What if I do not subscribe to religious texts? నా ఉనికి ఏమిటో నిర్ణయించే ఆ వాచక/వచన/వర్తక మత సమూహాల ఆటలలో నేను పాలుపంచుకోలేదనుకోండి, ‘పవిత్ర’ మత గ్రంధాలను నేను ఇతర వాచకాలగానే చూస్తాననుకోండి, అన్ని వాచకాలలాగానే అవి కూడా మానవ కార్యచరణాలుగానే చూసి, అన్ని మానవ వాచకాల లానే అవి కూడా వ్యాఖ్యానానికి అతీతం కావు అని నేను అన్నాను అనుకోండి (they are acts of human creation and hence are prone to interpretation), ఎలా నిర్వచిస్తారు మీరు నన్ను? ఈ శరీరాన్నీ? ఈ వాచాకాన్నీ?

ఇప్పుడు కొంత ఇలా కూడా చెబుతాను: ఏదైతే నీలో లేదో, ఏధైతో నీలో నివసించదో, ఏదైతే నీలో పలకదో, అది మాత్రమే ‘బయట’ నుంచి లోపలికి రాగలదు. ‘సౌకర్యవంతం’గా నైనా, అసౌకర్యవంతంగానైనా. ఇక ఏదైతే నీలో ఉందో, ఏదైతే నీలోనే పలుకుతుందో, దానికి ఇక ‘బయట’ నుంచి వచ్చే ఆస్కారం ఎక్కడ? అంటే, that which is not inside, that which does not reside inside , can come in. But, where is the scope to ‘come in’ for that which is always inside, for that which always recites inside, that which always resides inside, calling out your name to recognize itself? To recognize that the Other that is the self? ఇక రహస్యం గురించి ఇలా కూడా, ఇలా:

“How can another see into me, into my most secret self, without my being able to see in there myself? And without my being able to see him in me. And if my secret self, that which can be revealed only to the other, to the wholly other, to God if you wish, is a secret that I will never reflect on, that I will never know or experience or possess as my own, then what sense is there in saying that it is my secret, or in saying more generally that a secret belongs, that it is proper to or belongs to someone, or to some other who remains someone. It’s perhaps there that we find the secret of secrecy. Namely, that it is not a matter of knowing and that it is there for no one. A secret doesn’t belong, it can never be said to be at home or in its place. The question of the self: who am I not in the sense of who am I but rather who is this I that can say who? What is the- I and what becomes of responsibility once the identity of the I trembles in secret?”

— Jacques Derrida (The Gift of Death)

8. శ్రీకాంత్ కవిత్వంలో ఫలానా అని మీకు మీరుగా ఆలోచించుకుంటున్నప్పుడు ఆ శ్రీకాంత్ ఎవరు? అతన్ని గురించి మీరు ఆబ్జెక్టివ్ గా ఏం చెప్తారు?

At the risk of not being understood, at the risk of being misunderstood – as all reading is also a misreading- ముందుగా మీకొక చిన్న కథ చెబుతాను.

ఒక పదేళ్ళ క్రితం, నేను సంగీత థియేటర్ వద్ద, పక్కనే ఉన్న పాన్ షాప్ వద్ద నిలబడి, గోడకు ఆనుకుని సిగరెట్ త్రాగుతూ, నా తమ్ముడూ అతని స్నేహితురాలి కోసమూ టికెట్లు కొని ఎదురు చూస్తున్నాను. నేను నా లోకంలో మునిగి, ఆ వేసవి మధ్యాహ్నం, మరెవరినీ పట్టించుకోలేదు ఒక ప్రశ్న నన్ను ముందు నెమ్మదిగా, ఆ తరువాత ఘాడంగా తాకేదాకా. చాలా చిన్న ప్రశ్న. చాలా మామూలు ప్రశ్న: “ఎక్కడుంటావ్ నువ్వు?” అని. తల తిప్పి చూస్తే నా పక్కగా, ఈ నగర రహదారుల్లో, పలు కూడలిలలో కనిపించే – చిరిగిన కురుచ దుస్తులతో, పెరిగిన గడ్డంతో శిరోజాలతో, ఒక వింత నవ్వుతో – ఒక ద్రిమ్మరీ లేదా ‘పిచ్చివాడు’. అతను అడిగిన ప్రశ్నకి నేను ‘వనస్థలిపురం’ అని ఒక భౌగోళిక స్థానాన్నీ, నామాన్నీ చాలా యధాలాపంగా, అన్యమనస్కంగా ఉచ్చరిస్తే, తను క్షణకాలం నా వంక చూసి తిరిగి అదే మార్మికమైన నవ్వుతో, వేళ్ళ మధ్య వెలుగుతున్న పచ్చి ఆకుల బీడీ వంటి దానితో, ఆ రద్దీ వాహనాల ధాటిని ధాటి ఆవలి వైపుకు వెళ్ళిపోయాడు. నేను కొంత విస్మయంయ్యి, ఆ తరువాత కొంత తేరుకుని నన్ను నేనే తిరిగి ప్రశ్నించుకున్నాను: అవును, ఇంతకు నేను ఎక్కడ ఉంటాను? ఆంగ్లంలో రెండు పదాలు ఉన్నాయి: stay and live అని. మొదటిది బౌతికమైన స్థితిని చెబితే, రెండొవది మానసికమైన స్థితిని చెబుతుంది house and home లాగా. అతను నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అనా నన్ను అడిగినది లేక ఎక్కడ ఉంటాను నేను అనా? Where do you live అని ఎవరైనా అడిగితే సాధారణంగామనం, మనం ఉండే ప్రదేశం చెబుతాం కానీ, నిజానికి అక్కడ ఉంటామా మనం? లేక మనదైన, మనకు మాత్రమే తెలిసిన మనలో ఉన్న కొన్ని రహస్య లోకాలలోనా? ఆ ఉండటం ఎక్కడ? చూడండి, Afsar stays in United States of America, Srikanth stays in India, someone else stays at some other place, but where do we live? What is that place? Where is that place? Do you find it outside? Is it merely a physical location? నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుతుందా? Are you getting me? ఆ సరళమైన ప్రశ్న నన్ను కుదిపి వేసింది అత్యంత త్రీవతతో: నేను ఎక్కడ ఉంటానో తెలుసుకునేందుకు, ఆ కాలమూ లోకమూ ఏమిటో అవి ఎక్కడ ఉన్నాయో, ఆ గూడు ఎక్కడ ఉందో అని ఇప్పటికీ ప్రయతిస్తూనే ఉన్నాను, ఇప్పటికీ అక్కడకి చేరుకునేందుకు ప్రయాణం సాగిస్తూనే ఉన్నాను. Without exception we are all alike in such matters. Isn’t it?

మరి పైన చెప్పబడిన ఆ చిన్న ఆత్మకథా భాగం ఎందుకంటే, శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు కనుకా, శ్రీకాంత్ అంటూ ఎవరూ ఉండకూడదు కనుకా అని చెప్పటానికి. శ్రీకాంత్ ‘కవిత్వంలో ఫలానా’ అని నాకు నేను ఆలోచించుకుని, ఆ శ్రీకాంత్ ని జడ్జ్ చేసే లగ్జురీ(luxury) నాకు లేదు కనుకా. రాతలు/లిఖితాలు మన్నాలి, రచయితలు కాదు అని నేను విశ్వసిస్తాను కనుక. అపరమితమైన వేగంతో సాగే ఈ E-మీడియా లోకంలో, ఈ techno frenzy, -twittered-facebooked-bloggered కాలంలో, మనకి సరిపోయినంత megalomaniacs and egotists, రకరకాల రూపాలతో సాహిత్యాలలో, సమూహాలలో, సాహిత్య సమూహారాలలో ఉన్నారు కనుకా, మనం మన చూపుని రచయితల వైపు కాక వాచకాల వైపూ, వాటిలోని కోణాల వైపూ మరల్చుకోవాలి అని నేను నమ్ముతాను కనుకా . Let the gaze of our reading turn towards the dynamics of the text, towards reading, towards the heterogeneous act of reading and not towards the Subject in itself (which we know does not exist.).

9. మీరు సమూహాల్లో ఎక్కువగా కనిపించరు. మీదయిన వొక ఏకాంతాన్ని రచించుకుని అందులోనే వుంటారు అనిపిస్తుంది కొన్నిసార్లు? అవునా?

మీరు సమూహాలు అని దేనిని అంటారో లేదా దేనిని సూచిస్తున్నారో నాకు తెలియదు. ఒక వేళ మీరు సాహిత్య సమూహాలు అని సూచించినట్లయితే అది నిజం, ఎందుకంటే నాకున్న ‘వ్యక్తిగత’ కారణాల వల్ల, ‘సాహిత్య సమూహాల’ పట్లా, ఆ సాహిత్య సమూహాలలో ప్రబలమయ్యే ధోరణుల పట్లా నాకు విముఖత ఉంది కనుకా. I somehow do not fit into those literary groups. Anyway leave it. కానీ సమూహాలు అనే పదాన్ని మీరు విస్తృతార్థంలో వాడినట్టయితే, నేను సమూహాలను చాలా ఇష్టపడతాను. Sycophancy లేని, లేదా sycophancy అతి తక్కువుగా కనిపించే, ముసుగులు అంతగా లేని, ముసుగులు తొలిగి ముఖాలు కనిపించే సమూహాలని నేను ఇష్టపడతాను. అక్కడ నేను కనిపిస్తాను. ఈ నగరం తీసుకోండి… ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి అటువంటివి ఇక్కడ… లోకల్ బార్ల దగ్గరనుంచి, సుల్తాన్ బజార్ల నుంచి ఓల్డ్ సిటీ వీధుల నుంచీ, తేనీటి ప్రదేశాల నుంచీ, నేను ప్రీతిపాత్రంగా తినే బీఫ్ హోటళ్ళ నుంచీ, ఎన్ని ప్రదేశాలు, ఎన్నెని ప్రదేశాలు ఉన్నాయి అటువంటివి—అటువంటి ప్రదేశాలలో, అటువంటి సమూహాలు తిరుగాడే పగళ్ళలో, రాత్రుళ్ళలో, సాయంసంధ్యలలో నేను కనిపిస్తాను. నిజానికి నేను అక్కడే కనిపిస్తాను. ఇక ‘ఒక ఏకాంతాన్ని (ఏకాంతం, ఏక కాంతం, ఏ కాంతం?, ఏక అంతం, ఇలా పలు విధాలగా కూడా చదుకుంటాను కాసేపు ఆ పదాన్ని) రచించుకుని, అందులోనే ఉండటం’ అనేది నాకు తెలియదు. నాకు మటుకు నేను ఏ(ఒక)కాంతనీ, ఏ ఒక ఏకాంతాన్నీ ర/చించుకుని, రచిస్తూ అందులోనే ఉండననే అనుకుంటున్నాను. I am easily available to anyone who wants to meet me అని కూడా అనుకుంటున్నాను.

10. దిగులు పలికినంత తేలికగా మీకు సంతోషం పలకదు. అది బలహీనతా? బలమా?

ఆంధ్రేయ్ తర్కోవిస్కీ, – నేను అమితంగా ఇష్టపడే- రష్యన్ ఫిల్మ్మేకర్, ఎక్కడో ఇటువంటి ప్రశ్నకే జవాబు ఇస్తూ ఇలా అంటాడు: ‘జీవితంలో సంతోషంగా ఉండటం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి’ అని. కాస్త సరదాగా చెప్పాలంటే, నేను సంతోషం పట్ల సంతోషంగా లేను. ఇంకా ఇలా కూడా చెప్పవచ్చు: సంతోషం అని మీరు అడుగుతున్నప్పుడు, what do you mean by that? Do we all share the same happiness? A similar meaning of happiness? సరే, అలా కాకుండా ఇల్లా కూడా చెప్పుకుందాం: ఏదైతే వాచకాలలో, ప్రజలలో, లోకంలో (majorityగా) సంతోషంగా నిర్వచించబడిందో, అది నాకు తెలియదు. అది లేదా అటువంటివి నాకు సంతోషాన్ని ఇవ్వవు. అవి నాకు సంతోషం కాదు. నా మటుకు, అటువంటి సంతోషం ఎదిఅతే ఉందో, it lacks depth. It lacks intensity. Let us not confuse laughter, that laughter with good conscience – as Nietzsche would say- with happiness. ‘భారమైన’, ‘మోయలేని’ సవాలక్ష విలువలని వెక్కిరిస్తూ, స్ఖలించినంత హాయిగా, తేలికగా, స్వేచ్చగా, నిర్మొహమాటంగా ఇవ్వబడిన వాటిని subvert చేస్తూ నవ్వే నవ్వు ఉంటుంది కదా, అది నాకు ఇష్టం. ‘ణేనే ణేనే’ అని నన్ను నేను వెక్కిరించుకుంటూ, ఇతరులని వెక్కిరించే నవ్వు: అది ఇష్టం. కానీ దానిని ఎవరు గుర్తిస్తారు? In a world that takes itself too seriously, in fact, unbearably too seriously, who would recognize such a laughter? Yes, sometimes women have such laughter. Mocking laughter. వెక్కిరింతతతో కూడిన నవ్వు. వెక్కిరించే నవ్వు. మన కుహానా ప్రతిరూపాల నిర్మాణాలనీ, మన ఏకస్వర పురుష వాచకాలనీ వెక్కిరించే నవ్వు. అటువంటి నవ్వు, నిర్మాణాల డొల్లతనాన్ని అర్థం చేసుకుని, అటువంటి నిర్మాణాలు దిద్దిన ఈ లోకాన్ని చూసి ఒక మహా దిగులుతో, మన ముఖాల మీద నవ్వే నవ్వు. I prefer that. ఇక బలమా లేక బలహీనతా అనేది యుద్ధభూమిలో ఉన్నవాడికి, వాచక కేద్రంలో ఉన్నవాళ్ళకీ వేయవలసిన ప్రశ్న. వాచకాల అంచులలో తిరిగే నాలాంటి వాడికి, అంచులు లేనిదే కేంద్రం లేదు అని చెప్పే, నవ్వే నాలాంటి వాడికి, అంచులే కేంద్రాన్ని నిర్ధేశిస్తాయి అని కూడా అనే నాలాంటి వాడికి ఆ ప్రశ్నలతో ఏం సంబంధం? అందుకే ఇలా కూడా చెబుతూ ఒక ‘disclaimer’తో, మరో రెండు quotesతో ఇట్లా ‘ముగిస్తాను’:

Please – seriously – do not take me seriously. నన్ను ఉన్నది ఉన్నట్లుగానే, యధాతధంగానే తీసుకోండి. All that which you have read could be the truth. Autobiographical truth. Or the truth in autobiography, Of autobiography. Don’t you know that all poets tell the truth, in truth, except the truth?

I don’t feel it is necessary to know who I am. The main interest in life and work is to become someone else that you were not in the beginning. If you knew when you began a book what you would say in the end, do you think you would have the courage to write it? What is true for writing and for a love relationship is true also for life. The game is worthwhile insofar as we don’t know what will be the end- Michel Foucault.

నేను అడిగాను: కవిత్వం అంటే ఏమిటి?అని. అతను చెప్పాడు: తప్పు ప్రశ్న. నువ్వు అడగాల్సింది ఏమిటంటే, కొన్ని వాచకాలు ఎలా కవిత్వంగా మారతాయీ అని. ఇక నేను అడిగాను: కొన్ని వాచకాలు ఎందుకు కవిత్వం అవుతాయి? అతను అన్నాడు: ‘ఎందుకు’ అని కాదు, ‘ఎలా’ కొన్ని వాచకాలు చరిత్రలో కొన్ని సమయాలలో కవిత్వంగా చలామణి అవుతాయనీ, కవిత్వంగా మారతాయనీ. దానికి నేను అన్నానూ: మరి నేను కవిని కాదు, నువ్వో?

అప్పుడు ఒక నిట్టూర్పుతో తను ఇలా, తను ఇలాగే అడిగింది:

How to write one who has none, how to write none who has everyone? అది ఎవరో మీకేమైనా తెలుసా?

‘రాత’ నాకు ఒక గూడు: శ్రీకాంత్
కవిత్వ వాక్యానికీ వొక శరీరం వుంటుంది. సరయిన పదం దొరకనప్పుడు ఆ శరీరానికి నొప్పెడుతుంది. దాని మనసు చిన్నబోతుంది. ఆ శరీరానికంతకీ వొక వ్యక్తిత్వమేదో వుంటుంది. దాని బాధలోపలికి తొంగిచూసే కన్ను శ్రీకాంత్ కి సొంతం. ఆ శరీర భాష శ్రీకాంత్ కి అర్థమయినంతగా ఇంకెవరికయినా అర్థమయిందో లేదో అనుమానమే. అందుకే వొక్కో సారి శ్రీకాంత్ వొక enigma. అతని కవిత్వ వాక్యం వొక సుదీర్ఘమయిన pain. తను బాధపడుతూ రాసే ప్రతి పదం మనల్ని ఖాయంగా బాధపెడ్తుంది. తనలోని బాధలోకి మనం వలసపోయి, మన బాధని కాసేపు మరచిపోతాం. కవిత్వం చేయాల్సిన పనులు నిజంగా ఏమయినా వున్నాయో లేదో కానీ, వొక బాధని ముల్లు తీసినట్టుగా నిపుణంగా నిదానంగా తీయగలిగితే, ఆ బాధ తరవాతి స్థితిని చెప్పగలిగితే అది వొక  గొప్ప కవిత. ఏ బాధనీ ఎవరూ నిదానించలేరు, నిజమే! కానీ, బాధతో కనీసం మాట్లాడగలిగే సహనం మనకి వుందా అని అడుగుతుంది శ్రీకాంత్ ప్రతి కవితా…

శ్రీకాంత్ తో సంభాషణ

1. శ్రీకాంత్, మీ కవిత్వం అది కేవలం వొక సాహిత్య ప్రక్రియగా కాకుండా, వొక మానసిక ప్రక్రియగా పనిచేస్తుందని అనిపిస్తుంది? అసలు కవిత్వం ఏమిటి మీకు?

అన్ని ఇంటర్వ్యూలు పాక్షికంగానైనా ఆటోబయోగ్రాఫికల్ కనుక, అన్ని ఆత్మకథలూ ఒక కథ స్థానంలో మరొకటిని చెబుతాయి కనుక, ప్రతి ఆత్మకథా ముందుగా ఒక రహస్య ఒడంబడికతో ‘నన్ను నమ్ము.  నేను సత్యమే చెబుతున్నాను’ అని నివేదిస్తుంది కనుకా, రచయితకీ చదువరికీ ఆ ఒప్పందం లేనిదే ఆత్మకథ మన్నదు కనుకా, అది ఆత్మకధ కాదు కనుకా, ఇవన్నీ genreకు సంబంధించిన ప్రశ్నలూ, రాజకీయాలూ కనుకా, ఇక ఈ మధ్య కొందరి/అందరి మనోభావాలు, ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ గాయపడతాయో తెలియదు కనుకా, ముందుగా ఒక disclaimer:

Do not take me seriously. All that which follows could be the truth. A truth in fiction. Or it could be a fictional truth too. Don’t you know that all poets tell the truth, in truth, except the truth?

నా జీవితంలో లేదా ఇతరులు జీవితం అని దేనినైతే అంటారో, దానిలో/ దానితో నేను ఎన్నడూ సౌకర్యవంతంగా లేను. జీవితంతో కానీ, నాతో కానీ. కానీ అందులో పెద్ద వైవిధ్యభరితమైన విషయం కానీ, వింతైన విషయం కానీ ఏం ఉంది?. (మనలో చాలా మంది తమ జీవితాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. అశాంతితోనూ ఉన్నారు. (What’s the big issue about it?) Anyway, ఏమిటంటే, ఇతరులు take it for granted గా తీసుకునే కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కావు. అవి పెద్ద తాత్వికమైన విషయాలు కానక్కర లేదు. చాలా మామూలు విషయాలు. ఇతరులని తమ దైనందిన జీవితంలో అస్సలు ఇబ్బందికి గురి చేయని విషయాలు. వాటి అవసరం లేకుండా, వాటి గురించి ఆలోచించకుండా చాలా మంది తమ జీవితాన్ని నిక్షేపంగా వెళ్ళబోసే విషయాలు. ఉదాహరణకు ఎవరైనా నాతో/మీతో ‘జీవితంలో సంతోషంగా ఉండటమే అన్నిటి కన్నా ముఖ్యం’ అని అన్నారు అనుకోండి, నా సమస్య అంతా ముందుగా ఆ పదాలతో, వాటి నిర్వచానాలతో మొదలవుతుంది. జీవితం అంటే ఏమిటి? జీవితం అని ఒకరు అన్నప్పుడు తద్వారా వాళ్ళు దేనిని సూచిస్తున్నారు? సంతోషం అంటే ఏమిటి? ‘ఉండటం’ మంటే ఏమిటి? ‘అన్నీ’ అని మనం అటున్నప్పుడు, ఆ ‘అన్నీ’ లో అన్నీ ఉన్నాయా? ఈ పదాలు – జీవితం, ప్రేమ, లేదా సంతోషం లాంటివి – can they exist in themselves? Equivocally? Or they exist in relation to something else? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, భావనా సంబంధమైన కొన్ని పదాలు (conceptual terms)  కాలక్రమేణా సంస్థలుగా మారతాయి. సంస్థలుగా మారి సంస్థలుగా వ్యవహరిస్తూ కొన్ని (ప్రత్యేక) ‘విలువలని’ పరిరక్షిస్తూ అటువంటి ‘విలువలని’ వ్యాపింపజేస్తాయి. ఈ చిన్న ఉపోద్గాతం ఎందుకంటే, రాయటం అనేది నాకు మొదటిసారిగా ఇటువంటి ప్రశ్నలతోనూ – యవ్వనపు- అమాయకత్వాన్ని కనుమరుగు చేసిన  ఘటనలతోనూ ముడిపడి ఉంది కనుక. ఆ ఘటనలు అన్నీ కూడా, ఒక స్థాయిలో వ్యక్తులకు సంబంధించినవీనూ మరో స్థాయిలో రాజకీయాలకు సంబందించినవీనూ కనుక. ఆ ఘటనలన్నీ కూడా – స్వాభావికంగా, అంతర్గతంగా – ఇతరత్వానికీ జాతికీ ముడిపడి ఉన్న అంశాలు కనుక. Incidents that are connected to the questions of the Nation and the Other కనుక.

నేను ‘రాత’ వద్దకి ఒక దేహం ద్వారా వచ్చాను. నేను ‘రాత’ వద్దకు ఒక దేహం ద్వారా, ఒక ముస్లిం దేహం ద్వారా, ఒక ముస్లిం స్త్రీ దేహం ద్వారా దేహమేమిటో, దేశమేమిటో రెండిటికీ ఉన్న సంబంధమేమిటో అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకునేందుకూ దేహంతో, దేహం ద్వారా ‘రాత’ వద్దకు వచ్చాను.

అదే సమయంలో, అటువంటి దేహం, అటువంటి స్త్రీ దేహం, అటువంటి స్త్రీత్వపు దేహం – ఉన్మాద హిందుత్వ రాజకీయాలకూ, హింసలకూ, హత్యలకూ అత్యాచారాలకూ చీలికలై విలవిలలాడటం, వెడలిపోవడం నా పద్దెనిమిది ఏళ్ల వయస్సులో నేను చూసాను. జీవితంలో బాగమైనదీ, భాగమే జీవతమైనదీ ఎలా కనుమరుగు కాగలదో, కనుమరుగయ్యీ ఇంకా ఎలా నిరంతరం మిగిలిపోగలదో, అనేదానికి నేను అప్పట్లో ఒక నిస్సహాయ సాక్షిని.

నా శరీరం పట్ల నాకు స్పృహ కలిగిన వయస్సు అది.  శరీర రాజకీయాల పట్లా జీవిత రాజకీయాల పట్ల (bio and body politics) కూడా తొలిసారిగా కొంత అవగాహన కలిగిన వయస్సు అది. దేశం అనేది ఒక దేహమనీ, చరిత్రలూ సంస్కృతీ, రాజకీయాలూ శరీరాలపై లిఖించబడతాయనీ, శరీరాల ద్వారా ధ్వంసం చేయబడతాయనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవంలోకి వచ్చిన కాలమది. దేశంలో ‘ఇతరుని’ తుడిపివేయడం అనే ఒక process మొదలయ్యి బాబ్రీ మజీద్ విధ్వంసం దాకా వచ్చిన సమయమది. A continual process of erasing all that which belongs to the Other. ఈ క్రమంలో, చాలా వాటికి నేను సాక్షినే కాక, ‘ఇతరులు’ అయిన కారణానికి నేను  చాలా మందిని కోల్పోయిన లోకమది. నన్ను నేను కనుగొంటున్న కాలమూ అదే. I have lost or more precisely I have been robbed of a lot of people for reasons that are political as well as ‘religious’. So many of them… ముస్లిం అయినందుకు, అకారణంగా దాదాపు తగలబడిపోయినంత పనైన రవూఫ్ నూ, దగ్ధమైపోయిన అతని న్యూస్ పేపర్ల షాపునూ, ఇర్ఫాన్ నూ, ముస్లిం అయిన కారణాన తనతో ఎవరూ మాట్లాడరని, ఈ ప్రదేశంలో ఒక కాందిశీకుడను అయ్యానని దుగ్ధతో విలపించిన నూరల్ హసన్ నూ, అజ్మత్ నూ, జువేరియా నూ, నాహీద్ నూ… ఇంకా చాలా చాలా మందిని కాలం లేని కాలాలలోకి కోల్పోయాను. వాళ్ళతో పాటూ నన్ను నేను కూడా పోగొట్టుకున్నాను. (Still I do not have a fixed identity, and still I do not know who I am).

ఇట్లా చాలామందిని పోగొట్టుకునే ప్రక్రియలో, మూస నిర్వచనాల నుంచి తప్పించుకుననే క్రమంలో, నన్ను నేను కనుక్కునే ప్రయతంలో, ‘రాత’/writing నాకు ఒక గూడు అయ్యింది. శరనార్ధీ అయ్యింది. Or rather, I became a refugee in writing. ఇట్లాంటి క్రమంలో నేను రాసుకోవడం మొదలు పెట్టాను కనుక, రెండు ప్రశ్నలు అప్పుడు నాకు చాలా ముఖ్యంగా మారాయి: ‘దేహం’ మరియు నామ్నీకరణం. The process of naming (read also as framing), and consolidating it through the ‘body’, texts and images. ఉనికికి సంబంధించిన ప్రశ్నలతో ఎంగేజ్ అయ్యి ఉన్న వాళ్లెవరికైనా, ఇటువంటి ఎంగేజ్మెంట్ ఖచ్చితమైన సాహిత్య ప్రక్రియగా కాకుండా, మానసికమైన tussle లాగా కూడా ఉంటుంది. అనివార్యంగానే అటువంటి రాత, (లిఖితం) ఒకరు తనతో తాను ఏర్పరుచుకునే సంభాషణ లేదా తన  స్వగతం లాగానే, ఒక అంతర్గతమైన బాహిర్ మానసిక ప్రక్రియలాగానే ఉంటుంది అని నేను అనుకుంటాను. And hence I would like to say that my texts (I would like to call them texts, instead of poems/poetry) are my engagement with myself on the things that concern me through language and in language. ‘ఇక కవిత్వం (నాకు writing/లిఖితం) అంటే ఏమిటి మీకు’ అనే దానిని, కొద్దిగా మార్చి ‘ఎలా రాయాలి’ అని అనుకుంటో, Writing comes before me అని కూడా చెప్పుకుంటూ, ఇక ఇల్లా ఒక రచయిత్రి (Helene Cixous) భాషలో చెబుతాను:

“We should write as we dream; we should even try and write, we should all do it for ourselves, it’s very healthy, because it’s the only place where we never lie. At night we don’t lie. Now if we think that our whole lives are built on lying-they are strange buildings-we should try and write as our dreams teach us; shamelessly, fearlessly, and by facing what is inside very human being-sheer violence, disgust, terror, shit, invention, poetry. In our dreams we are criminals; we kill, and we kill with a lot of enjoyment. But we are also the happiest people on earth; we make love as we never make love in life.”

2. మీరు తొలినాళ్లలో రాసిన కవిత్వం నించి ఇప్పటిదాకా మీకు మీరు వొక గ్రాఫ్ లో చూసుకుంటే ఆరోహణలూ, అవరోహణలూ ఎలా అనిపిస్తున్నాయి?

నేను నా జీవితాన్ని, లేదా నా రాతలని (అవి రెండూ వేరే వేరే అయినట్టయితే) ఎన్నడూ ఆరోహణ, అవరోహణలతో చూసుకోలేదు. చూడను కూడా. For the simple reason that writing is not a career to me.  And, I like to live this life – whatever it is – with intensity. (రెండు రోజుల ‘normal’ జీవన విధానం చాలు నాకు, నాకు నేనే విసిగెత్తి పోయి నన్ను నేను ముక్కలు చేసుకునేందుకు. Perhaps, a kind of masochism. Perhaps, all writing is a form of masochism.)  నా వరకూ నాకు ముఖ్యమైనది ఏమిటంటే, ఈ జీవించడాన్ని పూర్తి సాంద్రతతో అనుభూతి చెందటం, తిరిగి అంతే సాంద్రతతో రాయాలనిపించితే రాసుకోవడం. There is nothing special about it. The only thing is that ఈ ‘జీవించడం’ అనేది ఏదైతే ఉందో అది – the understanding of this ‘living’ itself- takes a form of writing for me. Writing life, being written by life, and being written by writing itself అన్నమాట.

నేను రాయడం మొదలు పెట్టిన కొత్తలో (1992), ఉన్మాది లాగా రాసుకునే వాడిని. (Perhaps we all go mad in writing  – at least- at some point of time in our lives). నా మొదటి పుస్తకం 2000లోనూ, రెండోవ పుస్తకం 2002లోనూ వచ్చాయి. ఆ తరువాత దాదాపు ఎనిమిది ఏళ్ళు నేను ఏమీ రాసుకోలేదు. (2002-2010). అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొన్నిసార్లు విసుగు పుడుతుంది – we are bored to death and are fed up with ourselves and our writings. ఇక ఒక రచయిత/కవి నిరంతరం రాస్తూనే ఉండాలి అనే వాఖ్యను నేను అస్సలు నమ్మని వాడను కనుకా, అలా అనుకోవడం నిన్ను ఒక ప్రెజర్ లోకి నెట్టివేస్తుందనీ ఆ ప్రెజర్ ఆ కంపల్సివ్నెస్ నీ రాతని చంపివేస్తుంది అని తెలుసిన వాడిని కనుకా, ఏమీ రాసుకోలేదు.

మరొకటి కూడా ఎందుకంటే నేను  నా రక్తంతోనూ, ఎముకలతోనూ, మల మూత్రాలతోనూ, ఆకలితోనూ, ఆవేదనతోనూ, ఆర్తితోనూ, ఆత్మ పిగిలిపోయేటట్టు, దశ దశలోనూ నలుదిశలా చితాభాస్మమై నన్ను నేను వెదజల్లుకుంటూ రాసుకుంటాను కనుకా, పదిమందికీ నచ్చుతుందా లేదా, లేదా నేను రాసే దానిలో మెట్చ్యురిటీ ఉందా లేదా అని నేను తల పట్టుకోను కనుకా, నాకు తెలిసిందల్లా నాకు నచ్చినట్టుగా, నేను అనుభవించేదంతా, రక్త మాంసాలతో, కన్నీళ్ళతో, నవ్వులతో, గుండె డోక్కుపోయే పరిస్థితులతో, కాంతులతో చీకట్లతో పూలతో నక్షత్రాలతో, తనతో నిరంతరం మనలో ఉన్న ‘ఇతరుని’ గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ, అంతిమంగా ‘other’ is the self అని,భాష ముందూ, writing ముందు మోకరిల్లి చేసే ఒక మృత్యు జీవన ప్రార్ధనతో రాసుకోవడమే కనుకా, మళ్ళా ఇలా ఒకసారి చెప్పుకుంటాను.

Top of Form

Bottom of Form

Either you write with your blood, bones skin and teeth or do not write at all. I follow this: even now.

3. కవిగా, కవిత్వ పరమయిన ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ ఆలోచనల్ని ప్రభావితం చేసే విషయాలు ఏమిటి?

ముందుగా ఇది: నన్ను నేను కవిగా ఎప్పుడూ చూసుకోలేదు, అనుకోలేదు. చూసుకోను, అనుకోను కూడా: ఇప్పటికీనూ. కవి అంటే ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. Honestly, I don’t know what it means to be a poet: poetry, yes, but not a poet. కవి అని అనే పదమే నాకు చాలా వుల్గర్గా అనిపిస్తుంది. I don’t ascribe to it.  కానీ, నేను ఆలోచిస్తాను. ఆలోచించడం ఇష్టం నాకు. ‘నా’ అని ఏదైతే ఉందో, ఆ భాగం ఆలోచిస్తుంది కానీ, ఒక ‘కవి’లాగా మాత్రం కాదు.  I think. I like thinking but when I think, the ‘I’ of me thinks but not as a poet. మరొక ప్రాధమికమైన విషయం ఏమిటంటే, when one thinks, one is bound by many things: things that make up our thought process. నా ఆలోచనా విధానాన్ని ఒక deep suspicion ఎల్లప్పుడూ guide చేస్తూ ఉంటుంది. A deep suspicion of all that is given and is taken for granted. ఉదాహరణకు ‘కవిత్వం’ అనే పదమే తీసుకుందాం. ఒక కవిత ఎలా ఒక కవిత లేదా కవిత్వం అవుతుంది? What constitutes a poem? కవిత్వాన్ని ఎవరు నిర్వచిస్తారు/ నిర్వచిస్తున్నారు? అటువంటి నిర్వచనాలాలో, అటువంటి నిర్వచనాలను uphold చేసే సాహితీ విమర్శలలో ఉన్న రాజకీయాలు ఏమిటి?  Who defines poetry? What are the standards of poetry? Who defines, guides and guards these standards and for what purpose? Whose interests are being served in safeguarding certain norms and values of genre? లాంటి ప్రశ్నలు.

నా మటుకు, ఇటువంటి ఆలోచనా విధానం నాకు అవసరం. ఎందుకంటే ఇటువంటి line of thinkingలో one clearly sees the connection between genres and literary criticism that upholds these genres (the purity of genres) for certain values- (Don’t we know that genre has gender too?) ఈ లంకెలు అన్నీ ఎందుకంటే, సాహితీ రూపాలు అనేవి నిస్పక్షపాతమైనవి కావనీ, సాహితీ ప్రక్రియల, సాహితీ విమర్శల యొక్క నీతి నియమాల వెనుక రాజకీయాలు ఉన్నాయనీ, అవి finalగా certain caste, class and community యొక్క interestని serve చేస్తాయనీ తెలుస్తుంది కనుకా, సాహితీ ప్రక్రియలకీ, సాహితీ విమర్సాకీ, సమాజానికీ, సమాజ సంబంధాలకీ, ఆ సంబంధాలకి ఆపాదించబడి కాపాడబడే విలువలకీ, ఒక విడదీయలేని సంబంధం ఉందనే ప్రాధమిక అవగాహన కలుగుతుంది కనుక.

4. మీరు ఇంగ్లీషు కవిత్వం బాగా చదువుకున్నారు. కొన్ని సార్లు మీ వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాస్తారని అనిపిస్తుంది. భాష విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

Ah… ఇది అనువాదానికి సంబంధించిన ప్రశ్న. కదూ? అనువాదం అనేది విస్త్రుతార్ధంలో వాడుతున్నాను. ఎవరో అన్నట్టు, I am one language. I am more than one language. I doubt if anyone thinks in ONE language as such. ఈ పరమిత spaceలో ఈ ప్రశ్నలను theoreticalగా elaborate చేయడం కష్టం కనుక, సరళంగా ఇలా చెబుతాను. ఇలా కూడా అడుగుతాను.

What do you mean by this word ‘English’? ఒకవేళ అది పూర్వార్ధంలో, నేరుగా ఆంగ్లంలో రాయబడ్డది, (read as Britain, too) అనే అర్థంలో వాడబడ్డట్టు అయితే, దానికి జవాబు నేను ఆంగ్ల కవిత్వం కానీ, ఆంగ్ల రచనలు కానీ చదవను, ఆంగ్లంలో ఆలోచించాను. కానీ “English” అనేది దాని విస్త్రుతార్ధంలో, అంటే writings that are translated into English, అని మీరు అన్నట్టు అయితే, Yes, నేను ఆంగ్ల రచనలు బాగా చదువుతాను. I read a lot of “World Poetry” translated into English. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నేను కవిత్వం చదివేది చాలా చాలా తక్కువ. వచనం ఎక్కువ. నేను కవిత్వాన్ని సీరియస్గా చదవడం చాలా కాలం క్రితం మానివేశాను. I stopped reading poetry seriously a long time back.  గత ఎనిమిది ఏళ్లుగా నేను తరచుగా చదివేది, చదువుతున్నదీ కూడా వచనమే: ఆ వచనం ఏ రూపంలో ఉన్నదైనా కానీ.   ‘ఆంగ్ల’ వచనాలు కాదు, అనువాదంలో ‘ప్రపంచ’ వచనాలు. ఇక ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం అంటారా… అది శైలికి సంబంధించిన విషయం అని  అనుకుంటాను. సోకాల్డ్ కవిత్వం అయితే నేను ‘ఆంగ్లం’లో ఆలోచించి తెలుగులో రాయడం ఉండదు. If it is about presenting a critical thought in Telugu, I do that. ఎందుకంటే, తెలుగులో తాత్వికపరమైన కొన్ని విషయాలు మాట్లాడటానికీ, theoretical విషయాలు చర్చించదానికీ అవసరమయిన భాష నాకు అలవడలేదు కనుకా, ఇంకా అటువంటి భాష తెలుగులో విస్తృతంగా వాడుకలో లేదు కనుకా.  ఇక భాషపై నాకు చాలా నచ్చిన వాక్యం ఇది. భాష విషయంలో ఇలా ఫీల్ అవుతాను: …”Language is for the other, coming from the other, the coming of the other” అని.

5. శివారెడ్డిగారిని వొక తండ్రిగా కాకుండా వొక కవిగా మీ వ్యక్తిత్వంలో ఎంత వరకూ చూస్తారు?

తత్వశాస్త్రం నుంచి సాహిత్యం దాకా, ఇంకా మనకి ‘పితరుడే’ కదా! It is the ‘father’ that always dominates us? Isn’t it? మన ఆలోచనల్లోనూ, మన వీక్షణాలలోనూ, మన ప్రాతిపదికలలోనూ, మన రాతలలోనూ, మన శైలులలోనూ, మన అర్థాలలోనూ, మన నిర్మాణాలలోనూ, ఇంకా మనకి ‘పితరుడే’ కదా? What happens to the mother, the Other who is always with us? The M/other? Hmmm… So you want to listen to the story of my Oedipus Complex? సరే. కానీ,- ముందుగా- తండ్రీ కవీ రెండూ అయిన ఒక వ్యక్తిని విడివిడిగాచూడటం ఎలా? What comes before? And what comes after? తండ్రా? కవా? కవా? తండ్రా? తండ్రి అంటే ఏమిటి? కవి అంటే ఏమిటి? అన్నిటికంటే ముందు, వ్యక్తిత్వం అంటే ఏమిటి? ‘నా’ వ్యక్తిత్వం అంటే ఏమిటి? కొద్దిగా కష్టం. ఇది Bios(జీవితానికి)కీ, biography (life writing or writing life)కీ, biologyకీ (read as bio+logos) సంబంధించిన విషయం కాబట్టి. ఎలా జవాబు చెప్పను? జవాబు చెప్పడానికి ఎలా ప్రయత్నించను? ఎవరైనా ఎలా జవాబు చెబుతారు? ఇటువంటి సంక్లిష్టతలలోకి వెళ్ళకుండా, at the risk of sounding naïve and simplistic, ప్రస్తుతానికి ఇలా చెబుతాను:

నా ‘తరం’పై ఉన్నట్టుగానే, అతని రచనల ప్రభావం, అతని ఆలోచనల ప్రభావం నా ప్రాధమిక రచనలపపై చాలా ఉండింది. దాని కన్నా కూడా, అతనేమిటో, అతని వ్యక్తిత్వం ఏమిటో ఆ ప్రభావం కూడా నాపై చాలా ఉంది. నేను ఇంకా కొద్దిగా మోసుకు తిరిగే మనుషుల పట్ల warmth, సహనం, కొంత ఇతరులని వినే గుణం, ఇవి నాకు అతని నుంచి వస్తే, possessiveగా లేకుండా మనుషుల పట్ల ఉండటం, ఓపికగా ఇతరులని అర్థం చేసుకోవడం, కొంత నింపాదిగా జీవితాన్ని చూడటం అనేవి తల్లి నుంచి అబ్బాయి. It sounds romantic కానీ మీకు ఇది కూడా చెప్పాలి: I have been a difficult son to bear with. Very very difficult. I had been a maniac depressive; I had been a drunkard – ఉదయం ఇల్లు వదిలి వెడితే, మళ్ళీ ఏ స్థితిలో నన్ను చూస్తానో తెలియని నా తల్లితండ్రులు వాళ్ళు. నేను ఇంటికి తిరిగి రావొచ్చు, రాకపోవచ్చు, ఎక్కడో పడిపోయి ఉంటే ఎవరో ఫోన్ చేయవచ్చు లేక ఒక పోలీస్ స్టేషన్లో లాండ్ అయ్యి ఉండవచ్చు. లేక ఏ అర్థరాత్రో ఏ ఆసుపత్రి నుంచో నా గురించి తెలుపుతూ సమాచారం రావొచ్చు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఎలా నన్ను నా తల్లి తండ్రులు భరించారా, భరించగలిగారా అని. వ్యక్తిత్వం లాంటి పదాల పట్ల నాకు నమ్మకం కానీ సదభిప్రాయం కానీ లేవు కానీ, ఆఖరుగా ఇలా చెబుతాను: Whatever I was, whatever I am, and whatever that is left of me- here, in this space and time- inscribed on this body, inscribed in this body, I owe it to him. I owe it to her. Perhaps I owe it to ‘We’.

(రెండో భాగం: వచ్చే శుక్రవారం)

కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది
కవిత్వంలో నిశ్శబ్దం అనగానే మొదటగా స్ఫురించే కవి ఇస్మాయిల్ గారు. ప్రస్తుత కాలంలో ఇస్మాయిల్ గారిని తలచుకోగానే,  వెంటనే గుర్తుకొచ్చే  కవి – మూలా సుబ్రహ్మణ్యం అంటే అతిశయోక్తి కాదు. ఇస్మాయిల్ కవితలు చదివి, ఆ బాణిలో, ఆ ప్రేరణతో ఒక్క కవితైనా వ్రాయని కవి ఉన్నాడంటే నమ్మలేం. ఆ కవితల మత్తులో జోగుతూ గాలిబుడగల్లా పేలిపోయిన కవులు చాలా మందే ఉన్నారు. కవులు కాకపోయినా, ఇస్మాయిల్ కన్నా అద్భుతంగా ప్రకృతిలో మమేకమయ్యే మనుషులైనా కనీసం ఉంటారా అని ఆశ్చర్యపోవటం కూడా పరిపాటి.! ఇస్మాయిల్ తో పోలిక అవసరమో అనవసరమో తెలీదు. కానీ, ఆ స్థాయిలో అనుభూతికి కొత్త రంగులు తొడిగి, ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో మమేకమైన మరో కవి మన మూలా సుబ్రహ్మణ్యం అని చెప్పటానికి  ఎటువంటి మొహమాటాలు ఉండవు.

“లీలగా వినపడుతున్న సెలయేటి సవ్వడి / చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని రెట్టింపు చేస్తోంది”!

“పారే నది నాకు దారి చూపుతుంది / చంద్రుడు దారంతా వెలుతురు పరుస్తాడు / చిన్ని పడవలో ఒంటరిగా నేను”.

“వేణువుగా మలచొద్దు, కచేరీలసలే వద్దు / చప్పట్లు నా మౌనాన్ని భగ్నం చేస్తాయి”.

“ధ్యాన ముద్రలోని విత్తనానికి / జ్ఞాననేత్రం తెరుచుకునేలా / వానబొట్టు ఉపదేశం”.

చెప్పుకుంటూ పోతే, ఏటి ఒడ్డునే ఆద్యంతాలు లేని ఓ రసప్రవాహ ఝరిలో మనలని మనం మర్చిపోతాం. అనుభవాన్ని అనుభవంగా చెప్పటమొక్కటే కవిత్వం కాబోదు. ఆ అనుభవసారంలోని అర్థాన్ని సామాన్య పాఠకుడికి కూడా కవి చేర్చగలిగినప్పుడే అది అర్థవంతమైన కవిత్వం అవుతుంది. ఆ పరిణితి సుబ్బు కవితల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అరమరికలు లేని అనుభూతి, సరళమైన భాష, స్పష్టమైన భావాలు పాఠకుడిని చేయి పట్టి నడిపిస్తాయి.

స్వచ్ఛమైన తెలుగు కవిత్వానికి కేరాఫ్ అడ్రస్ ఏదంటే, నిస్సందేహంగా చెప్పొచ్చు – ఏటి ఒడ్డున మూలా సుబ్రహ్మణ్యం అని.  మూలా సుబ్రహ్మణ్యంతో ముఖాముఖి :

1. మీ గురించి.

మొదటి ప్రశ్నే కష్టమైన ప్రశ్న అడిగేసారు (నవ్వులు)

నా గురించి అంటే నిజంగా చెప్పడానికేమీ తోచట్లేదు. అందుకని నా బ్లాగు పరిచయంలో పెట్టుకున్న నాలుగు లైన్లే చెప్పి ఊరుకుంటాను.

ఏ సెలయేటిని చూసినా

ఆ గలగలలు

నాలోనూ వినిపించేవి

కొన్నాళ్ళకి నేను

కవిత్వం మొదలుపెట్టాను!

2. సాహిత్యపరంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు?

ప్రశ్న కొంచెం మార్చాలేమో! (నవ్వులు) సాహిత్యపరంగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలే ఉంటాయి కదా. అలా చూస్తే “అమృతం కురిసిన రాత్రి”, “రాత్రి వచ్చిన రహస్యపు వాన”, “కరుణ ముఖ్యం”,  “ఆరోవర్ణం”  ఇంకా “త్రిపుర కథలు”.

3. శ్రీశ్రీ, తిలక్, ఇస్మాయిల్, అజంతాలు కాకుండా, ముఖ్యంగా ఇప్పటి తరంలో మీరు అభిమానించే కవులు, కథకులు ఎవరు?

నచ్చే కవితలు, కథలే ఉండాలి గానీ కవులు, రచయితలు ఉండకూడదు. (నవ్వులు)

4. “నిశ్శబ్దం శబ్దాన్ని జయించిన రోజు” మొదలై “చిరుజల్లులో పూలు” పలకరించే దాకా  మీ కవితా ప్రస్థానంలో చోటు చేసుకున్న మార్పుల గురించి చెబుతారా?

నా జీవితంలో మొదటి ఇరవై యేళ్ళు కవిత్వం లేకుండానే గడిచిపోయాయి.  తెలుగు అంటే వెర్రి ప్రేమ ఉన్నప్పటికీ ఎంసెట్లు, ఇంజనీరింగుల వెల్లువలో కవిత్వం గురించి ఆలోచించే సమయం చిక్కలేదు. ఇరవైయేళ్ళప్పుడు మహాప్రస్థానం చదివాను. ఆ కవిత్వం నన్ను ఉర్రూతలూగించింది. కానీ కవిత్వం రాసేందుకు మాత్రం ప్రేరేపించలేదు. తర్వాత  M.Tech కోసం ఖరగ్ పూర్ వెళ్ళినప్పుడు, అక్కడ ఒక స్నేహితుడి దగ్గర “అమృతం కురిసిన రాత్రి” పుస్తకం చూశాను. పేరే అద్భుతంగా ఉందే అని చదివి ఇస్తానని తీసుకున్నాను. తర్వాత ఒక ఏడాది పాటు ఆ పుస్తకంతోనే గడిపాను. చదవగా చదవగా నాకూ కవిత్వం రాయాలని ఒక దుర్బుద్ధి పుట్టింది. అలా 2002లో ఖరగ్ పూరులో ఉండగానే మొదటి కవిత రాసాను. తర్వాత ఒక సంవత్సరం పాటు ఏవేవో రాసాను. నవ్వుతారనే భయంతో ఎవరికీ చూపించేవాణ్ణి కాదు. 2003 లో ఉద్యోగరీత్యా బెంగుళూరు రావడం,  2003 అక్టోబరులో ఒక అర్ధరాత్రి విసుగెత్తిన నన్ను “రాత్రి వచ్చిన రహస్యపు వాన” నిలువునా తడిపెయ్యడం, అలా ఇస్మాయిల్ కవితాఝరిలో మునిగితేలాను. ఆయన్ని కలవలేకపోవడం జీవితంలో పెద్ద లోటు. తర్వాత తెలుగులో వచ్చిన ఆధునిక కవిత్వం చాలా వరకు చదివాను.

ఇలా పదేళ్ళబట్టీ కవిత్వం నన్ను వెంటాడుతోంది. రాయాలనుకున్నట్టు రాయలేక, రాసినదాంతో సంతృప్తి చెందలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కొత్తదనం లేని కవిత కవిత కాదని నాకు ముందునుంచీ నమ్మకం. అందుకని ఏది రాసినా కొత్తగా రాయడానికి ప్రయత్నించేవాడిని. ఏ వస్తువుని చూసినా దీన్ని కొత్తగా చూడొచ్చా అని ఆలోచించేవాడిని. . ఏ కవిత ఎందుకని నాకు నచ్చుతోందో ఆలోచించేవాణ్ణి. ఇది కాక తెలుగుపీపుల్.కాం ద్వారా పరిచయమైన సాయికిరణ్ గారు, రఘు గారు, తులసి, ప్రసూన , నిషిగంధ, సీత, ఈమాట ద్వారా పరిచయమైన విన్నకోట రవిశంకర్ గారు, ముకుంద రామారావు గారు, భూషణ్ గారు , ఇంద్రాణి , పవన్ గారు, వినీల్ ఇంకా ఇక్బాల్ చంద్ గారు, కనక ప్రసాద్ గారు, పప్పు నాగరాజు గారు, స్వాతి కుమారి గారు,  వీళ్ళందరితో కవిత్వం మీద చేసిన లెక్కలేనన్ని చర్చలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.  ఇదికాక జెన్ కవిత్వం, సూఫీ కవిత్వం, కన్నడ వచనాలు ఇవి ఇష్టంగా చదువుకున్నాను. ఇవన్నీ చదవడం వల్ల నా కవిత్వంతో పాటు నా వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పు వచ్చింది. కవిత్వం నన్ను సరళంగా, నిరాడంబరంగా మార్చింది. “నా కవిత్వంలో నేను దొరుకుతాను” అన్న కవి వాక్యం అనుభవంలోకి వచ్చింది. కవిత్వం మనకో దారి చూపిస్తుందని అర్ధమైంది. తావోయిజంలో చెప్పినట్టు దారిలో ఉండడం ముఖ్యం. గమ్యం ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కవిత్వం మీద పెద్ద మమకారం లేదు. కవిత్వం వచ్చినప్పుడు రాసుకోవడం, నచ్చిన కవిత్వం చదువుకోవడం ఇంతే.

5. మీ కవితల్లో ఇస్మాయిల్ తొంగి చూస్తుంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది మీరు విమర్శగా స్వీకరిస్తారా లేక ప్రశంసగానా? అసలు, ఇస్మాయిల్ ప్రభావం మీ మీద ఎంత ఉంది?

నా మీద ఎవరి ప్రభావం ఉందో మీరే చెప్పాలి (నవ్వులు). నా మీద ఇస్మాయిల్ ప్రభావం తప్పకుండా ఉందండీ. అయితే అది కవితా నిర్మాణంలో కాదు. కవితా దృక్పథంలో.

6. ముందు ప్రశ్నకి అనుబంధంగానే ఈ ప్రశ్న కూడా ఉండబోతోంది. అందమైన జ్ఞాపకాలలోంచి మీరు మంచి కవిత్వమే వ్రాస్తారని, కానీ కష్టసుఖాలు కవితా వస్తువులుగా మీరు వ్రాస్తే చూడాలని ఆశిస్తున్నట్లు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. సూటిగా మీ జవాబు ఏమిటి?

ముందు చెప్పినట్టు నాకు కవిత్వం మీద పెద్ద మమకారం లేదండీ. అసలు కవిత్వం నేను రాస్తున్నానని కూడా నాకు అనిపించడం లేదు. కవిత్వం నన్నొక వాహికగా చేసుకుని బయటకి వస్తోందనిపిస్తుంది. అందుకని ఎలాంటి వస్తువుల మీద రాయాలనేది నా చేతిలో లేదు.

7. మనం అభిమానించే కవులు చాలామంది, కవితల్లో రాజకీయ సామాజిక కోణాలను స్పృశించారు. మీ ఉద్దేశ్యంలో కవిత్వంలో రాజకీయ, సామాజిక కోణాలు ఏమాత్రం అవసరం? అసలు అవసరమా?

నేను హృదయవాదిని. నా గుండెని తట్టే కవిత్వం కోసం నేను వెతుక్కుంటాను. రాజకీయాలు మేధోపరమైన వ్యాపారాలు. వాటికి నేను కనెక్ట్ కాలేను.

8. వాదాలకి, నినాదాలకి, ప్రాంతాలకి తెలుగు కవిత్వం పరిమితమైపోతున్నదని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. కవిత్వం జీవితానుభవాల నుంచి వచ్చేదై ఉండాలంటారు. అలాంటప్పుడు, సామాజిక, రాజకీయ, ఆర్ధిక విషయాలను జీవితానుభవంగా భావించి ఆ స్పృహతో కవిత్వం వ్రాస్తే తప్పేముంది?

తప్పేం లేదు. నిజమైన  దుఃఖంలోంచో, నిజమైన ఆనందంలోంచో కవిత పుట్టినప్పుడు ఆ కవి దుఃఖం లేదా ఆనందం మనకి అంది తీరుతుంది. ఆ కవితలో ఏ వాదం ఉంది? దాని చారిత్రక నేపథ్యం ఏమిటి? ఇవన్నీ విశ్లేషించేది విమర్శకులు. నాకు వాటి మీద ఆసక్తి లేదు.

9. ప్రస్తుతపు పోకడలు చూస్తుంటే, “అల్పాక్షరాలతో అనంతార్థం” మాటవరసకే మిగిలినట్లు అనిపిస్తుంది. కవిత్వం పేరుతో కథలు, సీరియల్సు వ్రాసేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ మీద ఉన్న మరో అపవాదు ఏమిటంటే, క్లుప్తంగా వ్రాసే ప్రయత్నంలో, భోజనం పెట్టకుండా, రుచి మాత్రం చూపించి వదిలేస్తారనీ. దీని మీద మీ వివరణ ఏమిటి? అసలు కవిత్వంలో క్లుప్తత మీద ఓ అవగాహన కల్పిస్తారా?

కవిత్వంలో క్లుప్తత ఉండి తీరాలని నాకనిపిస్తుంది. Brevity is the Soul of Wit  అన్నారు గానీ Brevity is the Soul of Poetry అని కూడా అనొచ్చేమో! అయితే క్లుప్తత అంటే కవిత నిడివి తక్కువ ఉండడం కాదు. కవితలో వ్యర్ధంగా ఒక్క అక్షరం కూడా ఉండకూడదు. తను చెబుతున్నది పాఠకుడికి చేరదేమో అన్న భయం వల్లనో, ఎక్కువ చెప్పెయ్యాలన్న ఆతృత వల్లనో కవులు కవితని ఆపాల్సిన చోట ఆపరు. దీనివల్ల కవిత అందం చెడిపోతుంది. కవిత్వానికి ఒక రూపం ఉండాలి కదా!

ఇక రుచి మాత్రం చూపించి వదిలెయ్యడం అంటారా, ఈ మధ్య రాసిన ఒక కవిత గుర్తొస్తోంది..

నేను కేవలం

ఒక తాళం చెవి

తయారు చేసి ఇస్తాను

నిధి మాత్రం

నీలోనే ఉంది!

10. కవిత్వానికి ఏది ముఖ్యం – భావం, భాష, శిల్పం. వీటి మధ్య సమన్వయాన్ని ఎలా సాధించాలి?

కూరకి ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం. అన్నీ సమపాళ్ళలో కలిస్తేనే కదా రుచిగా ఉండేది. అలాగే కవిత్వం కూడా. అన్నీ ముఖ్యమే. ఇక సమన్వయం ఎలా సాధించాలి అంటే కవిత్వం ఎలా రాయాలి అని అడగడమే. ఒకరు చెప్తే తెలుసుకునే విషయం కాదిది. రాస్తూ వెళ్తే ఎప్పటికో ఈ విషయాలు తేటపడతాయి.

11. అసలు కవిత్వం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుంది అన్న ప్రశ్నలు వేస్తే, మీ సమాధానం ఏమిటి?

“ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?”   ఎప్పుడో రాసుకున్న ఒక లైను “ఏ కవి కాగడా పటుకుని వెతుక్కుటూ తమవైపు వస్తాడో అని చీకటి గుహలో ఊహలు ఎదురుచూస్తున్నాయి”. కవిత్వానికి చావు పుట్టుకలు లేవు. కవి సమయంలో కవికీ, చదివినప్పుడు మనకి ఎరుకలోకి వస్తోందంతే.

12. కవిత్వంలో మునిగితేలుతూ ఉండే మీరు గోడలు, అమరావ్రతం, అనునాదం, తదితర కథలు వ్రాయటానికి ప్రేరణ ఏమిటి?

నేను కథలెక్కడ రాసాను. అవన్నీ పెద్ద కవితలే కదా. (నవ్వులు) నాకు కథలు రాయడం చేత కాదండీ. ప్రయత్నిస్తున్నాను. అదో అభ్యాసం. చూడాలి ఎప్పటికైనా మంచి కథ రాయగలనేమో!

13. ప్రస్తుత తెలుగు కవులపై, కవితా విమర్శకులపై మీ అంచనాలు, అభిప్రాయాలు ఏమిటి?

తెలుగులో ఎంతో వైవిధ్యమైన కవిత్వం వస్తోంది. పత్రికల్లోనే కాక బ్లాగులు, వెబ్ సైట్లలో కూడా ఎంతో మంది కవులు ఉత్సాహంగా కవిత్వం రాస్తున్నారు.  ‘వాకిలి’లో కూడా కవిత్వానికి మంచి వాతావరణం కల్పించారు.  ఇంటర్నెట్ వల్ల కవితని రాయడం, వెంటనే ప్రచురించుకోవడం, నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం, లోటు పాట్లని దిద్దుకోవడం ఈ విషయాల్లో ఇంతకు ముందు లేని వెసులుబాటు మనకి ఉంది. సరిగ్గా వాడుకోగలిగితే ఇది కవులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  తెలుగులో మంచి విమర్శకుల కొరత కనిపిస్తోంది.  అయితే కవులు కూడా విమర్శని తొందరగా తీసుకోలేకపోతున్నారనిపిస్తోంది. “నన్ను పొగిడితే నిన్ను పొగుడుతా” అనే ధోరణే కనిపిస్తోంది. మంచి కవిత్వం రావాలంటే మంచి విమర్శ ఉండి తీరాలి. కవితని విమర్శిస్తే కవిని విమర్శించినట్టు కాదు కదా.

ఈ అవగాహన ముఖ్యం.

14. కవిత్వానికి ప్రయోజనముందంటారా?

కవిత్వానికి తప్పకుండా ప్రయోజనం ఉంది. అది జీవితంలోని నిజమైన అర్థం వైపు మనల్ని నడిపించడం. కవి జాతికి సౌందర్య భిక్ష పెడతాడు. జీవితంలో సౌందర్యం చాలా ముఖ్యం. నేడు మన సమాజంలో జరుగుతున్న చాలా అరాచకాలకి కారణం ఈ సౌందర్యరాహిత్యమే అనిపిస్తుంది. అందుకే కవిత్వం, కళలు లేని సమాజం కుళ్ళిపోతుంది.

ముఖాముఖం: కొండముది సాయికిరణ్ కుమార్

రమణా, నిన్ను చేరనని మొండికేసిందీ ఉత్తరం!
పైవారమో, ఆ వచ్చే వారమో ‘ఈ వారం కవి’గా మన వాకిట్లో వుండాల్సిన కె,యెస్. రమణ ఇవాళ లేడు. యాభై ఆరేళ్ళ వయసులో అతని గుండె హటాత్తుగా ఆగిపోయింది మొన్న- 1980లలో తెలుగు కవిత్వంలో వొక తాత్విక చింతనని తీసుకు వచ్చిన ‘నిశి’కవులలో రమణ జెండా పట్టుకు తిరిగిన వాడు. ఒక వైపు రమణ మహర్షీ, ఇంకో వేపు చలం ఆవహించిన వ్యక్తిత్వం. చిన్న వుద్యోగం నించి మొదలై ప్రొఫెసర్ దాకా ఎదిగిన శ్రమజీవి. అనుదినజీవితాన్ని నిదానంగా మలచుకున్న సాధుజీవి. జీవితంలోని సున్నితత్వాన్ని చివరంటా కాపాడుకున్న చిరుదరహాసి….మంచి స్నేహితుడు…రమణ ఇక లేడు…చూస్తూండగానే అతనో జ్నాపకమయి ఎటో వెళ్లిపోయాడు. వినండి…ఇద్దరు రమణ ఆత్మీయ మిత్రుల గుండె జడి…

నువ్వూ నేనూ హెచ్చార్కే ఇంకొకరెవరో ఆ ఇరానీ హోటల్లో కూర్చొనే వున్నాం. మనకెంతో ఇష్టమయిన ఇరానీ చాయ్ ని అయిపోతుందేమో అయిపోతుందేమో అన్నట్టు చప్పరిస్తున్నాం. నువ్వు నవ్వుతున్నావు నీదయిన నవ్వుతో! నువ్వు మాట్లాడుతున్నావు నీదైన నెమ్మదితనంతో! నువ్వు కుర్చీలో కదులుతున్నావు నీదైన సున్నితమయిన కదలికతో కుర్చీకి నొప్పెడుతుందేమో అన్నట్టుగా! రమణా, ఇది కదా మనం మొదటి సారి కలుసుకున్న ఆ దృశ్యం!

నా ఇరవయ్యేళ్లు, నీ ఇరవై తొమ్మిదేళ్లు…మన మధ్య రవంత దూరాన్ని కూడా పెంచలేకపోయాయ్ అప్పటి నించీ! ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తెలుగు పుస్తకంలో నా కవితని సిలబస్ లో పెట్టాక నన్ను చూడాలనుకుని, ఆ కవిత నా గొంతులో నీ విద్యార్థులకు వినిపించాలని  నువ్వు హైదరాబాద్ దాకా నన్ను లాక్కు వెళ్లినప్పుడు నీ విద్యార్థుల ముందు నేను మౌనమే భాషగా కూర్చున్నప్పుడు ‘ఇతని గొంతు కాయితమ్మీద తప్ప పలకదు,” అంటూ నువ్వు చేసిన పరిచయాలు నిజానికి మనిద్దరికీ తొలి పరిచయాలే కదా! అప్పటికింకా నా తీరని కలల్లో వొకటి అని తెలియకుండానే ఆ రోజు నువ్వు నాకు కొనిచ్చిన ముదురాకు పచ్చ రంగు హీరో పెన్ను దాని బంగరు క్యాప్ నా కళ్ళల్లో ఇప్పటికీ మెరుస్తోంది!

ఆ తరవాత ప్రతి మూడు నెలలకో, నాలుగు నెలలకో వొక సారి ఏదో వొక వంక మీద హైదరబాద్ రావడం…ఆ ఖైరతాబాద్ సెంటర్లో అలాగే ఆ ఇరానీ కేఫ్ లోనే కలవడం..ఇంటికెళ్లడం …మంజుల గారు మనిద్దరి మీదా ఎడతెగకుండా జోకులేయడం, చిన్నారి ప్రణవ్ తో బాసింపట్లు వేసుకొని బోర్డ్ గేమ్స్ ఆడడం…ఓ మహర్షీ, ఓ మహాత్మా అని నిన్ను వొకటికి పది సార్లు వెక్కిరించడం…పొద్దుటినించీ సాయంత్రం దాకా చెరగని బట్టలతో, క్రాఫుతో, నవ్వుతో నువ్వొచ్చినప్పుడు నిన్ను ‘నువ్వు కనకసభా రమణ కాదు, కనక’శుభ్ర’ రమణ, అనో – మరీ ఆ మైసూర్ సాండల్ సబ్బు వాసనేస్తున్నప్పుడు కనక ‘సబ్బు’ రమణ అనో ఇప్పుడు ఏడ్పించలేను కదా! అసలు మృత్యువు అనే ఈగ, దోమ, నల్లి ఆ రోజుల్లో కనీసం మన వూహల్లో కూడా లేదు కదా! ఎంత పొగరుగా దాటేశాం యవ్వనాలు! వాటి నఖరాల తిల్లానాలు!

నువ్వు కవిత్వం రాసావో, కవిత్వంగా బతికావో, నువ్వు చలాన్ని చదివావో, చలంగా బతికావో, నీ నిశికవిత్వపు తమోనలంలో నిప్పు సెగవై తాకావో, నగరపు బతుకు తామరాకు మీద అంటీ ముట్టని మంచు బిందువై నెమ్మదిగా ఎటో జారిపోయావో, ఎవరు నేర్పారు నీకు ఈ అస్తిత్వ పాఠం?! ఎవరు వొంపారు నీలో ఈ నిబ్బరపు సెలయేరు? అసలు ఎవరు చెప్పారు నీకు –ఇంత సడీ చప్పుడు లేకుండా వస్తానని అయినా చెప్పకుండా  వెళ్లిపోమని!  వొక్క సారే వూపిరి తెంపుకునే నీ గుండెకి ఎందుకింత కాలంగా ఈ నిదానపు పాఠాలన్నీ నేర్పావ్?

యీ  నిర్మాణాలూ ఈ ముళ్ళ కంచెలూ

యెట్లాగూ రక్షించలేవని తెలిసాక

నాలో భయం పోయింది

అని ఏణ్ణర్థం కింద ఎంత ధీమాగా ‘లంగరె’త్తావ్ బతుకు పడవకి!

గాలిపటం దారమింకా నా వేలికి చుట్టుకునే వుంది

అని అందంగా చెప్పావ్ సరే….

సుదూరపు తార చూపేదో నా ఆత్మకి గుచ్చుకుంటోంది…

అన్నావే, ఆ సుదూరపు తార యేదో అప్పుడే ఎందుకు చెప్పలేదు?

నా పాతికల్లో నీకు ఎన్ని వుత్తరాలు రాశానో గుర్తు లేదు. అవి సరిగ్గానే పోస్ట్ చేశానని గుర్తు. ఈ వొక్క వుత్తరం మాత్రం పోస్టు చేయలేనితనంతో వుక్కిరిబిక్కిరవుతోంది.

నా ముప్పయిల్లోనో, మూడు నెలలకిందనో యెన్ని సార్లు నీ మొబైల్లోకి మాటయి ప్రవహించానో గుర్తు లేదు, ఇప్పుడు నా గొంతులో నీ ఆ పది సంఖ్యలూ 9..8…4..9..6..0..0..5..4..7… అనుకుంటూ లుంగలు చుట్టుకుపోయి ఏడుస్తున్నాయ్!

వచ్చెయ్ రమణా, ఇంకెప్పుడూ నిన్ను వెక్కిరించనుగా!

వచ్చేయ్ రమణా, ఆ చావుని ఈగలాగా అవతలికి నెట్టేసి!

వచ్చేయ్ రమణా, “వచ్చే నెల మళ్ళీ ఫోన్ చేస్తాన్లే” అని ఈ సారి హడావుడిగా ఫోన్ పెట్టేయనుగా!

-అఫ్సర్

ఒక స్పష్టమైన detachedness కనబడుతోంది
‘ఈ వారం కవి’ నారాయణస్వామి వెంకటయోగి ….తెలుగు కవిత్వంలో మూడు దశాబ్దాల కదలికలకు ప్రత్యక్ష సాక్షి. కల్లోల దశాబ్దం నించి సంక్లిష్ట దశాబ్దం దాకా, సంక్లిష్ట దశాబ్దం నించి ప్రపంచీకరణ అనంతర దశాబ్దం దాకా అనుభవాల్నీ, జ్నాపకాల్నీ  తన అక్షరాల సందుకలో పొందు పరచిన కవి. మంచి చదువరి. లోతయిన బుద్ధి జీవి.

కలల కల్లోల మేఘం నించి ఇప్పటి మీ కవిత్వం దాకా మీ ప్రయాణం గురించి ఏమంటారు?

కల్లోల కలల మేఘం 1992 లో వచ్చింది. అప్పుడు నేను విరసం లో చాలా చురుగ్గా పనిచేసే వాణ్ణి. విరసం కార్యవర్గ సభ్యుడిని. ఉద్యమమే ఉఛ్వాస నిశ్వాసాలుగా బ్రతికిన రోజులవి. కవిత్వం సాహిత్యం విప్లవోద్యమానికి ఉపయోగపడాలని, ప్రజల చేతిలో ఆయుధం కావాలని కదం తొక్కిన రోజులవి. అందుకే మీరు కల్లోల కలల మేఘం లోని దాదాపు ప్రతి కవిత లో ఆ నిబద్ధత చూస్తారు. కల్లోల కలల మేఘం లోని కవితలు 1984 – 1992 మధ్య రాసినవి. అప్పుడప్పుడే అస్తిత్వ వాదాలు తలెత్తి ఊపిరి పోసుకుంటున్న సందర్భం. విప్లవోద్యమ సందర్భానికీ, అస్తిత్వ వాదాల సందర్భానికీ స్పందించి రాసిన కవితలున్నాయందులో. కానీ మాకప్పుడు విప్లవోద్యమమే ప్రధాన దృష్టి. అందుకే ఉద్యమం లోని విభిన్న ధోరణుల వాదోపవాదాల గురించి  రాసిన కవితలు కూడా కల్లోల కలల మేఘం లో ఉన్నాయి. ఇది వస్తువుకి సంబంధించింది. ఇక రూపం విషయానికొస్తే – అనేక ప్రభావాలనుండి బయటపడుతూ సొంత గొంతుక వెదుక్కుంటున్న పరిణామం మీకందులో కనబడుతుంది. అప్పటికి, పెద్ద పెద్ద సంస్కృత సమాసాలతో, క్లిష్తమైన పద బంధాల పదచిత్రాలతో రాయడం ఒక గొప్ప విషయంగా అనుకున్న సందర్భం అది. అందుకే చాలా కవితలు ఆ ప్రభావ ఛాయల్లో కనబడతాయి.

అయితే భిన్నంగా రాయాలి,  కొత్తగా చెప్పాలి అన్న తపన, 1988 నుండీ రాసిన కవితల్లో అగపడుతుంది. కల్లోల కలల మేఘం లో కవిత్వమే లేదని కొట్టి పారేసిన వాళ్ళూ ఉన్నారు, పదునైన విమర్శతో ప్రేమతో సమర్థించిన అఫ్సర్ లాంటి వారూ ఉన్నారు – ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రకటించిన సహృదయులూ ఉన్నారు. అయితే ఇవాళ్ళ వెనక్కి చూసుకుంటే, మళ్ళీ కల్లోల కలల మేఘం ప్రచురించాల్సి వస్తే నేనే నిర్ద్వంద్వంగా కొన్ని కవితలని తీసేస్తాను (ముఖ్యంగా విప్లవోద్యమ వాదోపవాదాల మీద రాసినవి). అప్పుడప్పుడనిపిస్తుంది కూడా – ఇవి రాసింది నేనేనా అని. 1992 నుండీ 2000 వరకూ కూడా కవిత్వం రాసాను. అయితే చాలమంది లాగా నేను విపరీతంగా రాసే కవిని కాదు. పద్యం చాలా రోజులు లోలోపల తిరిగి తిరిగి,  మరిగి మరిగి నాలోంచి బయటికొస్తుంది. వస్తే ఒకే సారి వెల్లువలా కొన్ని పద్యాలొస్తాయి. రాకపోతే యేండ్ల తరబడి రాయనే రాయను. అదో మనసికావస్థ. కానీ ఎప్పుడూ దుఃఖం లోలోపల సుడులు తిరుగుతూ ఉంటుంది. ఒక సౌఖ్యానికీ, విలాసానికీ , ఉదాసీనతకీ ఎప్పుడూ లోను కాలేదు – complacency కి తావివ్వలేదు. పొరలు పొరలు గా అలలు అలలు గా పద్యాలు లోపల తిరుగుతూ ఉంటాయి. ఒకటే తపన ఎప్పుడూ – కొత్త వస్తువుని ఎట్లా పట్టుకోవడం – కొత్తగా ఎట్లా చెప్పడం – ఇదే తపన.

1992 నుండి 1997 దాకా చాలా పరిణామాలు చోటు చేసుకున్నయి. నా జీవితంలో, నేను ఊపిరిగా పీల్చిన ఉద్యమాల్లో , నేను ప్రాణంగా కన్న మిన్నగా భావించిన స్నేహ సంబంధాల్లో చాలా మార్పులొచ్చినయి. కొన్ని నేను తట్టుకోలేక పోయాను – కొత్తగా వస్తున్నఆలంబనలని బలంగా స్వీకరించి స్వంతం చేసుకోలేకపోయాను. యేదో కోల్పోయిన అనుభూతి. ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ పద్యాలు రాసాను – కానీ అవి ఎక్కడో పారేసుకున్నాను. 1998 లో కేవలం మూడే మూడు పుస్తకాలతో అమెరికా వచ్చాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం, అజంతా స్వప్నలిపి, తిలక్ అమృతం కురిసిన రాత్రి. అంతే. నా కల్లోల కలల మేఘం కూడా వెంట తెచ్చుకోలేదు. అమెరికా లో నా ప్రతి వంటరి క్షణంలోనూ  ఈ మూడు పుస్తకాలే తోడుగా నిలిచాయి. ఇక్కడికొచ్చాక, ఇక్కడ తెలంగాణ కోసం కృషి చేస్తున్న వారితో పరిచయాలు –. రచ్చబండ మీద మిత్రులతో సాహిత్య రాజకీయ సంభాషణలు – ఆయా సంభాషణల్లో నా గొంతు వినిపించాను. అడపా దడపా ఒకటో అరో పద్యాలు – నన్నట్లా సజీవంగా ఉంచినయి. అయితే 1999 మే లో మారోజు వీరన్న బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడయ్యాడన్న వార్త అశనిపాతం లా తాకింది. పెద్ద షాక్ . యెడతెగని దుఃఖం – ఇప్పటికీ – బహుశా ఎప్పుడూ పొంగి పొర్లుతూనే ఉంటుందనుకుంటా. మళ్ళీ కవిత్వం రాయాలి అన్న తపన ఎక్కువైంది. 2001 లో శివారెడ్డి నవీన్ శివశంకర్ గార్లు తానా సభ ల కొచ్చి మా యింటికొచ్చారు. నా పద్యాలు చూసి శివారెడ్డి సార్ కౌగలించుకుని ” నాన్నా నువ్వింకా బతికే ఉన్నావు” అన్నారు. “అమెరికా జీవితం గురించి రాయి”  అన్నారు. కానీ అదేమిటో,  ఇక్కడికి వచ్చి 14 యేండ్లయినా ఈ జీవితం నాది కాదనే అనిపిస్తుంది. నా ప్రాణమంతా అక్కడ నా తెలంగాణ పల్లె మీదే  తొక్కులాడుతుంది. యెప్పుడూ ఈ జీవితంతో నేను identify కాలేనేమో?

2005 లో యేడేళ్ల తర్వాత మొదటి సారి మళ్ళీ యిండియా వెళ్ళాను. అది నాకు పెద్ద జోల్ట్.  బ్రహ్మాం డమైన కుదుపు.  నేను 1998 లో వదలి వచ్చిన మన దేశం కాదది – నా హైదరాబాదు కాదది – అంతా కొత్తగా ఉంది. యేడేండ్లలోనే నేను నా మాతృభూమికి పరాయివాణ్ణయిపోయాను. గ్లోబలైజైషన్ లో సింగారించుకున్న నా హైదరాబాదు నన్ను చూసి  అంజాన్ కొట్టింది. నా వాడకట్టు అవ్వ “మల్లెప్పుడొస్తవు బిడ్డా”  అని గుడ్ల్లల్ల నీళ్ళు కుక్కుకుంది. మా యింటి వెనక నా చిన్న నాటి ప్రియ నేస్తం నా చెరువు మాయమై పోయింది. మా యింటి ముంగటి మా వెంకటక్క భివాండి కి బతుక పోయి మల్లా శవమై వాపస్ వచ్చింది. “యాడికి పోయిన్రు”  అంటూ తిరిగిరాని తమ్ముళ్ళ కోసం పొక్కిలైన వాకిళ్ళ ఇళ్ళ చెదలు పట్టిన మొగురాలకు కూలబడి యేడుస్తున్న అక్కలు కనబడ్డరు. నా సందుకలో నా తొలియవ్వనాల క్షణాల నెమలీకలు  రెపరెపలాడే కరపత్రాలై పలకరిస్తున్నాయి. నేను చేతిలో బ్రష్ పట్టుకుని రాత్రుళ్ళు జాజి రంగు అక్షరాలతో ‘విప్లవం వర్ధిల్లాలి’ అని రాసిన గోడలు ఎక్కడా కనబడలేదు – విరసం సభకు రాండ్రి  అని అపరాత్రి వేళ పోస్టర్లు అతికించిన బస్టాప్ లు, బస్సులూ కానరాలేదు – యేమయి పోయింది – నేను వత్తిలా వెలిగించిన నా యవ్వనం – యేమయిపోయినయి,   రోజుల తరబడి తిండి తిప్పలు లేక కాళ్లరిగేలా తిరిగిన ఉద్యమ ప్రయాణాలు?  వీరన్ననూ, ఇంకా అనేకమంది  నా ప్రియ నేస్తాలను,  దారితప్పిన ప్రయాణాల్లో కోల్పోయిన  నా యవ్వన గమ్యాలను – మళ్ళీ వెతుక్కోవడంలో,  nostalgia లో భవిష్యత్తు కనుక్కోవడంలో, నేనూ నా తరం  కోల్పోయిన నా అస్తిత్వం  నాకు మళ్ళీ దొరికినట్టనిపించింది . నా చుట్టూరా వినబడే వాన శబ్దం,  నాలోనే  కురుస్తున్నదనే నాకర్థమైంది.

నాదైన  భాష నాకు కొత్తగా దొరికింది. దాదాపు యేడేండ్లలో రాసినన్ని పద్యాలు యేడు నెలల్లో రాసాను. నా అంతులేని దుఃఖ ధారకు భావ, భాష, అక్షర రూపం దొరికింది. నేను పోగొట్టుకున్నాననుకున్న అస్తిత్వం కొత్త వస్తువుగా కొత్త రూపంతో కొంగ్రొత్త భాషతో పద్యాలుగా ప్రవహించింది. ఈ పద్యాలు నా ప్రియ మిత్రుడు అఫ్సర్ చూసాడు. తొలిరోజుల్లో కల్లోల కలల మేఘం ను ఆదరించిన స్వరం కన్నా ఉత్సాహంగా “ఇది కొత్తగా ఉంది ఇక ఆపకు రాయి” అన్నాడు. ఫలితమే 2006 లో “సందుక”. సందుక లో నా లాంటి వాళ్ళ – ఒకప్పుడు ఉద్యమాల్లో చాల చురుగ్గా పనిచేసి అనేక కారణాల వల్ల దూరమై మళ్ళి తమ అస్తిత్వాన్నీ ఉనికినీ వెతుక్కుంటున్నా వాళ్ళ వేదనని – తెలంగాణా పల్లె నుండి దూరమైన నాలాంటి అనేక మంది దుఃఖాన్నీ , తెలంగాణ పల్లెల దుర్భర జీవన వేదననీ పట్టుకున్నాననుకుంటున్న! సందుకలో మూడు సాధించాననుకుంటున్న – ఒకటి: ప్రధానంగా భాష – మన తెలంగాణ భాష – కల్లోల కలల మేఘం  సంస్కృత సమాస భూయిష్ట పదచిత్రాల భాషనుండి జీవితంతో తొణికిస లాడే  తెలంగాణ భాష ను పద్యాల్లో ఆవిష్కరించాను – రెండు:  వస్తువు – ప్రవాసిగా అమెరికా లో జీవిస్తున్న నేను,  సర్వం కోల్పోయిన నా తెలంగాణ వాడకట్టు పట్లా, వొకప్పుడు అమితంగా ప్రేమించిన ఉద్యమాల పట్లా నాలో లోలోపల వానగా సుడులు తిరిగే nostalgic ప్రేమను  పద్యాల్లో కురిపించాను – మూడు:  సందుకలో ఒక సంభాషణ ఉన్నది – నేను నాతోనే చేసుకునే సంభాషణ – ఉద్యమాలే ఊపిరిగా బ్రతికిన నాకూ అమెరికాకు  ‘పారిపోయి’ వచ్చిన నాకూ అనునిత్యం జరిగే ఒక నిరంతర సంభాషణ సందుకలో ఉన్నది. చిన్నప్పటి నుండీ ఒంటరి వాడినైన నేను నాతో నేను మాట్లాడుకునే అలవాటు ఇప్పటికీ మానలేకున్నాను. అదే సందుక పద్యాల్లో ప్రతిఫలించింది అనుకుంట!

ఇటీవలి మీ కవితల్లో కనిపిస్తున్న మార్పు ప్రత్యేకించి ఎప్పటి నించో చెప్పగలరా?

సందుక తర్వాత యేమిటీ అనే ప్రశ్నకు అనేక రకాలుగా సమాధానం చెప్పుకుంటున్నా.  చాలా మంది నా సందుక పద్యాలనూ, తర్వాతి పద్యాలనూ చూసి ఇవి నువ్వు రాసావంటే నమ్మలేకున్నాం – యేడి మా కల్లోల కలల మేఘం నారాయణస్వామి అని అడిగారు-ఆ intensity లేదంటూ కొంత మంది పెదవ్విరిచారు. ఇవి పద్యాలే కావన్నారు – ఈ భాషే అర్థం కాలేదన్నడో పెద్ద సాహితీ విమర్శకుడుగా పేరున్న కవి మిత్రుడు !  తెలంగాణ ఉద్యమం తీవ్రమౌతున్న సందర్భంలో కూడా ఫుట్ నోట్స్ పెట్టాలి వీటికి అన్నారు! అయితే నేను ప్రదానంగా నేర్చుకున్న విషయాలు ఇవీ – ఒకటి – పద్యం తన వస్తువు తగ్గట్టుగా ఎప్పుడూ కొత్త భాషనూ, రూపాన్నీ వెతుక్కుంటూనే ఉంటుంది. ఆ process ని సక్రమంగా, నిజాయితీగా,  కొనసాగించి నెరవేర్చగలిగితే కవి సఫలీకృతుడవుతాడు. మంచి పద్యం పుడుతుంది. అయితే కొత్త వస్తువూ, కొత్త భాషా కొత్త రూపమూ కొత్త పనిముట్లూ వగైరాల తో పాటు కవి యెంతో కొంత యేదో ఒక స్థాయిలో సందర్భంలో పద్యంలో తాత్వీకరణ చెందాలి. తాను గ్లోబల్ గా ఆలోచించి స్థానికంగా రాసినా, స్థానికంగా ఆలోచించి గ్లోబల్ స్వరం తో  రాసినా – తాత్వీకరణ చాలా important – అంటే, తన అనుభవాల్ని   కవి,  ఒక పసిపిల్లవాడి అమాయకత్వంతో అనుభవించి,   ఆ అనుభూతులని బలమైన పదచిత్రాల ద్వారా, దృశ్యాల ద్వారా పాఠకుల వూహాప్రపంచం లోకి, plane of thought లోకి తీసికొచ్చి, అక్కడ్నుండి విభిన్నంగా , ఒక విమానంలా  పైకెగసి పోవాలి.  తన అనుభూతుల తాత్విక మూలాల్ని కనుక్కొంటూ,  ఒక కొత్త దృక్కోణం నుండి పద్యాన్ని  స్థల కాలాతీతం చేసి,   తద్వారా పాఠకునికి తన అనుభూతుల్ని అపరిచయం (defamiliarize)  చేయాలి. . అందుకోసం కవి వైరుధ్యాలను సమర్థవంతంగా వాడుకోవచ్చు. వైరుధ్యాల మధ్య ఉన్న గతితార్కిక సంబంధం ప్రతిభావంతంగా పద్యంలో చెప్పగలిగితే, పద్యం విశ్వజనీన స్థాయికి  elevate అవుతుంది.  పాఠకునికి  తన అనుభూతుల ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే కవి,   తిరిగి విభిన్న స్థాయిల్లో వాటిని అపరిచయం చేయడం వల్ల పద్యానికి తాత్వికత సిద్ధిస్తుంది  -  పద్యానికి అనేక dimensions నీ , multi layered స్వభావాన్నీ  ఇస్తుంది.

ఇక పోతే దేన్ని గాఢంగా అనుభవించామా, దేనికి గుండె తీవ్రంగా స్పందించిందా అనేదాన్ని  యెట్లాగూ పద్యం తీవ్రత స్పష్టంగా పట్టిస్తుంది. సందుక తర్వాత రాస్తున్న పద్యాలలో ఇది కొంత చైతన్యయుతంగానే ప్రయత్నిస్తున్నా! అట్లే గత కొన్ని యేండ్లుగా మన జీవితాల్లో ఒక కొత్త సందర్భం ప్రవేశించింది. మన భాష electronic భాషగా మరణించి ఘనీభవించింది. మన సంబంధాలు అంతర్జాల సాలెగూళ్లలో ఇరుక్కుపోతున్నాయి. మన మధ్య ఒక కొత్త మౌనం, ఒక కొత్త ‘నిర్వీర్యతా’ , చేష్టలుడిగినతనమూ   కనబడుతోంది. వొక చిత్రమైన వొంటరి తనం. అందరూ చుట్టూ ఉన్నా యెవరూ లేనితనం. అందరూ కలుస్తున్నా యుగాలుగా ఎవరూ కలవని తనం, అందరూ యెంతో పరిచయమున్నా అంతా అపరిచితుల్లా అనిపించడం, ఎంతో తెలిసిన తోవలోనే నడుస్తున్నట్టున్నా అంతా డేజావూ లాగే  అంతా మళ్ళా తెలియనట్టే, అంతా కొత్తగానే, అంతా కాటగలిసిన కీకారణ్యం  లాగానే, తెలిసినట్టున్న ప్రయాణం లో తెలువని తోవలో దారిపొడుగునా గుచ్చుకుంటున్న పూలముళ్ళే!  యిటీవల రాస్తున్న పద్యాల్లో గతానికీ, కాలానికీ భాష్యం చెప్ప జూస్తూ ఈ స్థితి ని తాత్వికంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా! అయితే మళ్లా అదే సందిగ్ధం – ఈ కొత్త స్థితిని చెప్పడానికి మన భాష మారాలా- పద్యం రూపం మారాలా – సంప్రదాయ పాద విభజనతో రాసే వచన కవిత్వం సరిపోదేమో అనిపిస్తుంది. కొత్త రూపం రావాలేమో అనిపిస్తుంది. పదాలు, పాదాలు, వాక్యాలు, పేరాలు అన్నీ కలగలిసిపోయిన ఒక కలలోలాంటి స్థితి – ఒక అపరిచిత ఎలక్ట్రానిక్ భాషలో గడ్డకట్టుకుపోయిన శీతల  శిథిల స్థితి – దీన్ని యేది సరిగ్గ పట్టుకోగలిగితే అదే సరైన పద్య రూపం – యేది పాఠకుడికి అందితే అదే మంచి పద్యం – in other words – పద్యం  చాలా ఫ్లెక్సిబిల్ అయిపోవాలి – volatile అయిపోవాలి – స్పష్టాస్పష్ట  స్వప్నస్థితైన  మన భౌతిక,  మానసిక స్థితిని పట్టుకోవడానికి, గతమూ, భవిష్యత్తూ మాత్రమే ఉన్న మన వర్తమాన రాహిత్యాన్ని ప్రతిఫలించడానికి  పద్యం తనకు తానుగా ఒక అస్థిరమైన రూపం దాల్చాలేమో?  పద్యానికి సరైన రూపంకోసం ఈ అన్వేషణ అనంతమనుకుంటా! ప్రతి కాలంలో, ప్రతి యుగంలో కవులిట్లా దుఃఖించీ దుఃఖించీ తపించీ తపించీ పద్యాలను కొత్త రెక్కలు తగిలించిన  పక్షుల్లా ప్రపంచం మీదకు వదుల్తారనుకుంటా!

అయితే ఒకటి మాత్రం  నిజం – పాత భాషతో, పాత డిక్షన్ తో, పాత పదచిత్రాలతో ఈ కొత్త స్థితిని చెప్పలేము. నిశ్శబ్దం శబ్దంగా,  శబ్దం నిశ్శబ్దంగా నెలకొన్న ఒక ఆధునికానంతర అత్యాధునిక ప్రశాంత గందరగోళ స్థితి ని చెప్పాలంటే కాలాన్నీ స్థలాన్నీ దాటి మనకు బాగా పరిచయమున్న అపరిచిత పదచిత్రాల, పాదాల, వాక్యాల, రూపాల, సంగీతాల పద్యాలని పాడాలనుకుంటా – కాదు గుసగుసగా  చెప్పాలనుకుంట! ఇప్పుడు!

ఈ మధ్య రాస్తున్న కవుల్లో మీకు కనిపిస్తున్న పాసిటీవ్/ నెగెటివ్ అంశాలు ఏమిటి? వొక సీనియర్ కవిగా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?

ఈ మధ్య, ‘enhanced communications’   పుణ్యమా అని, బ్లాగులు, అంతర్జాల పత్రికలు, ముఖపుస్తకం లో కవిత్వ పేజీలు, కవి సంగమాలు అన్నీ కవులని ఒక చోట చేరుస్తున్నయి – వయసూ తరాలతో సంబంధం లేకుండా, స్థల కాలాలతో సంబంధం లేకుండా – చాలా మంచి పరిణామం – కవులందరూ ఉత్సాహంగా రాస్తున్నారు – పరిమాణం పెరిగింది బాగా! ప్రమాణరీత్యా కూడా విలువలు పెరిగాయి. ఇది తెలుగు కవిత్వానికి చాల మంచి పరిణామం. అయితే ఈ అంతర్జాల సాహిత్యానికి రెండు ప్రదాన మైన లక్షణాలున్నయి – ఒకటి – పద్యం రాసి ‘పోస్టు’ చేసాక ఇక అది ఆ కవిది ఇంకెంత మాత్రమూ కాదు. దాని మీద కవి అన్ని హక్కులూ అధికారాలూ కోల్పోతాడు. దాన్ని పాఠకులు, వారి వారి స్థల కాల నిర్దేశాల బట్టి యెట్లా  అనుభూతిస్తే ఆ పద్యం  అట్లా అనుభూతిలోకి వస్తుంది. యెట్లా స్పందిస్తే అట్లా జీవిస్తుంది. రెండు – ఇప్పుడు పాఠకుడు పద్యాన్ని తన స్వంతం చేసుకున్నాక దాని మీద తన ఇష్టం వచ్చినట్టు స్పందించవచ్చు. అభిప్రాయాలు రాయవచ్చు – కవికీ పాఠకునికీ మధ్య instant two way communication యేర్పడుతుంది. ఇక్కడ కవే పాఠకుడూ, పాఠకుడే కవి లా instantaneous గా మారిపోతున్న సందర్భం. ఇది గతంలో మనకు అనుభవం లో లేదు. ఈ కొత్త సందర్భానికి కవులు అనుభూతి పరంగానూ, తాత్వికంగానూ స్పందించాలి. అనుభూతి మాత్రమే ప్రదానం కాదు. కవి అనుభవిస్తున్న ప్రత్యేక స్థితిని ప్రతిఫలించే పద్యం తాత్విక స్థాయికి ఎదగాలి. అది కొరవడుతుందేమో అని నా అభిప్రాయం. పద్యం బహుముఖత్వాన్నీ,    multi layered స్వభావాన్నీ సంతరించుకోవడం లేదేమో అనిపిస్తుంది. కవి కావాల్సినంతగా పరిశీలననూ, దాన్ని enrich చేసే అధ్యయనాన్నీ చేయడం లేదేమో అనిపిస్తుంది. అట్లే పద్యం రూపం మీద కూడా కవులు తగినంత శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తుంది. దీనికి కారణం అంతర్జాలం కల్పిస్తున్న  instant communication సౌలభ్యమేనేమో!  కవికి తాను రాసిందాన్ని వెంటనే పాఠకునికి అందవేయాలన్న ఆత్రుత కన్నా మళ్ళీ మళ్ళీ తరచి చూసుకోవాలి, సరి దిద్దుకోవాలి అన్న శద్ద్గ ఎక్కువ కావాలి. ఉదాహరణకు మీకు చాలా పద్యాల్లో “ఫలానా పదమో, వాక్యమో  తీసేస్తే పద్యం ఇంకా బాగుంటుంది కదా”  అనిపిస్తుంది. అట్లే ఒక ప్రాథమిక సూచన – ఒక పద్యంలో క్రియా వాక్యాలని వీలయినంత తక్కువగా ఉపయోగిస్తే పద్యం చిక్కనౌతుంది. ఎందరో కవులు పుంఖానుపుంఖంగా ఎక్కువ సంఖ్యలో రాయడం, అది చాలా ఎక్కువ మంది పాఠకులకు అందుబాటులోకి రావడం ఎక్కువమంది participatory reading of the text లో భాగం కావడం చాలా మంచి పరిణామాలు. అయితే దానికి తగ్గట్టు కవుల పద్యాలు, కేవలం ఉన్న స్థితిని పట్టించే పదచిత్ర స్థాయినుండి ఒక ఉన్నత తాత్విక స్థాయికి ఎదగాలని నా అకాంక్ష.. ఆ దృష్ట్యా నేను ఎప్పటికీ ఓనమాలు దిద్దుకునే చిన్న పిల్లగాడినే! నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్న నిరంతర విద్యార్థినే!

ఇప్పటి తెలుగు కవిత్వం మళ్ళీ 80 ల నాటి వూపు అందుకున్నట్టు మీకు కనిపిస్తున్నాదా?

అందుకున్నది. తప్పకుండా అందుకున్నది. అందులో సందేహం లేదు. అయితే 80 ల లో పరిస్థితి వేరు. అప్పుడు తెలుగు గడ్డమీద ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నయి. ప్రజల పోరాటాలు అలలు అలలు గా  సాగుతున్నయి. అప్పుడు ఇంతగా బాహ్య ప్రపంచం తో ముఖ్యం అంతర్జాతీయ సమాజం తో సంబంధాలు ప్రత్యక్షంగా  లేవు. యేదో పాలస్తీనా పోరాటం గురించి వింటున్నామంతే! అంతర్జాతీయ సాహిత్యంతో కవిత్వంతో సంబంధం పుస్తకాలూ పత్రికలూ రూపేణా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇరాక్ ఆఫ్ఘనిస్థాన్ యుద్దాల్నీ, పాలస్తీనా పోరాటాలనీ ప్రత్యక్షంగా టెలివిజన్ లోనూ, అంతర్జాలంలోనూ చూస్తున్నాము అనుభవిస్తున్నాము – ముఖపుస్తకం లో అరబ్ వసంతోత్సవం లో పాలు పంచుకున్నాము. ఇప్పుడంతా ప్రత్యక్షమే – virtual గా ప్రత్యక్షం! మున్నెన్నడూ మనం చూడని అనుభవించని కొత్త సామాజిక దృశ్యం  – అయితే చిత్రంగా మన తెలుగు సమాజం ఎక్కువ శాతం ఈ సామాజిక దృశ్యానికి దూరంగా ఉన్నది. తెలుగు నేల మీద, భారత దేశం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు ఈ కొత్త అంతర్జాల సామాజిక దృశ్యం అనుభవం లోకి రావడం లేదు. కాబట్టి ఈ మారిన అత్యాధునిక,  ఆధునికానంతర అంతర్జాల సామాజిక దృశ్యం లో భాగమైన మధ్యతరగతి కవులు వారి వారి స్థల కాల పరిమితుల వల్ల ఎక్కువ శాతం  నిజమైన ప్రజల ఉద్యమాలకు దూరంగానే ఉంటున్నారు. యెక్కువగా మధ్య తరగతి ‘స్థిర’ జీవితానికీ కెరీర్ కీ అలవాటుపడ్డ వీళ్ళను ఆ ఉద్యమాలు  ఎక్కువగా ప్రభావితం చేయడం లేదు. ఒక  స్పష్టమైన detachedness కనబడుతోంది. Urban areas లో ఉండి సామాజిక సమస్యలకు ‘స్పందించే’ ఆధునిక తరం సంగతి వేరు. వాళ్ళది క్షణికమైన స్పందనే! వాళ్ళు ఢిల్లీ లో గాంగ్ రేప్ కూ అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటానికీ క్షణికమైన మద్దతు ని తెలుపుతారు. వీధుల్లోకొచ్చి పోరాటాలు చేస్తారు. కానీ అవి శాశ్వత పరిష్కారాల కోసమో, సామాజిక మార్పుల కోసమో చేసే పోరాటాలు కావు. వాటికా లక్ష్యం కూడా లేదు. ఈ అంతర్జాల ఆధునికానంతర తరం, ఒక  క్షణికమైన అశాశ్వత (ephemeral) జీవితాన్ని అనుభవిస్తున్నది. యేదీ శాశ్వతం కాదు. అంతా కంప్యూటర్ మానిటర్ మీద ఎలెక్ట్రానిక్ అక్షరాలున్నంతవరకే అనుభూతి!  Switch off కాగానే అంతా మాయం! ఈ క్షణికానుభూతి చెందే పాఠకులకోసం వచ్చే సాహిత్యం కూడా అంతే shallow గా ఉండే, తయారయే  ప్రమాదముంది. అది ‘ప్రేమ’ గురించి కావచ్చు, ‘మానవీయ విలువల’ గురించి కావచ్చు, స్త్రీలపై అణచివేత కావచ్చు, ఇంకా catchy గా ఉండే అనేకానేక urban జీవితాంశాలు కావచ్చు – వీటి మీద కవిత్వం వస్తోంది, క్షణికానుభూతులని కలిగించి, పాఠకుడు respond అయేట్టు చేసి – ఆ క్షణం సేపో లేదూ మహా అయితే ఆ రోజంతానో పాఠకుడు సాహిత్యసృష్టిలో భాగమయ్యేట్టు చేస్తోంది. కానీ మొత్తానికి ఆ అనుభవమే  అశాశ్వతమైనది. యెటువంటి చిరస్థాయి  సాంస్కృతానుభవాన్ని , సంస్కృతినీ నిర్మించడం లేదు. ఫలితంగా ఒక నిర్దిష్టమైన సామాజికాచరణకు, తద్వారా సామాజిక మార్పుకూ దారి తీసేట్టుగా సాహిత్యం,  ముఖ్యంగా కవిత్వం సృష్టించబడడం లేదు – పైగా అది సాహిత్యం చేసే పని అని కానీ,. అది సాహిత్యం యెజెండా లో ఉండాలని కానీ అనుకోవడం కూడా బాగా old fashion అయిపోయింది. సాహిత్యాన్ని అనుభూతించడానికి ఒక కొత్త అభిరుచి గల పాఠక సమూహాలు , అంతర్జాలంలో క్షణికమైన అశాశ్వతమైన అనుభవాన్ని ఆస్వాదించే urban elite సమూహాలు తయారవుతున్నాయేమో అని నేననుకుంటున్నాను. పోతే కవిత్వం రాసి లో ఎక్కువగా వస్తున్నపుడు సరైన నిర్దేశం జరిగినప్పుడు తప్పకుండా వాసిలో కూడా గొప్ప ఫలితాలని సాధించే అవకాశముంది – అది ప్రజల జీవితానికి దగ్గరైనప్పుడు మరింత enrich ఐ తాత్వీకరించబడుతుంది. ఆ స్థితి తెలుగు కవిత్వానికి రావాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష.

మీరు చాలా ప్రపంచ కవిత్వాన్ని కూడా అనువాదం చేశారు, చదువుకున్నారు. ప్రపంచ పటం మీద తెలుగు కవిత్వం ఎక్కడ నిలుస్తుందంటారు?

యెవరేమన్నా , ప్రపంచ పటంలో తెలుగు కవిత్వానికి చాలా గొప్ప స్థానమే ఉందనినేననుకుంట! . నేను చదివిన దేశదేశాల కవిత్వం ముందు తెలుగు కవిత్వం యే మాత్రం తీసిపోకుండా ఉన్నది. అయితే కొంత మందికి తమ తమ subjective అభిరుచులమేరకు అట్లా అనిపించకపోవచ్చు. ప్రజల ఉద్యమాలు, చైతన్యం, సామాజిక మార్పులు వుధృతంగా జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో, దేశాల్లో సాహిత్యం కవిత్వం ఆయా దేశ కాల పరిస్థితులని ప్రతిఫలిస్తూ వాటి స్థానికతని  విశ్వజనీనం చేస్తూ, తాత్వీకరిస్తూ చాలా గొప్పగా వస్తున్నది. అట్లా వస్తున్న కవిత్వమంతా గొప్పదని కాదు కానీ, గొప్ప కవిత్వానికీ, సాహిత్యానికీ సామాజిక చలనాలూ, మార్పులూ, ఉద్యమాలూ తప్పనిసరిగా చోదక శక్తులౌతాయి. ఆయా ప్రత్యేక సామాజిక సందర్భాలనుండి ఊపిరి పోసుకునే సాహిత్యం, ఆ పరిస్థితి నుండి ఎదిగి ఉన్నత తాత్విక స్థాయికి చేరితే గొప్ప సాహిత్యమౌతుంది, ఇది కవిత్వానిక్కూడా వర్తిస్తుంది. అట్లా చూస్తే, ఇవాళ్ళ లాటిన్ అమెరికాలో , మధ్య ప్రాచ్యంలో, పాలస్తీనాలో, ఇంకా అణచివేతకు గురవుతున్న అనేక దేశాలనుండి వస్తున్న కవిత్వానికి ధీటుగా  తెలుగు కవిత్వం వస్తున్నది. ఒక దురదృష్టకరమైన విషయమేమంటే, తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలనీ, ప్రత్యేక సామాజిక సందర్భాన్నీ ప్రతిఫలించే కవిత్వానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే అది English లోనికి ముమ్మరంగా  అనువాదం కావాలి. ఆ పని జరగడం లేదు. మనకు మంచి అనువాదకులు కరువయ్యారు. అనువాదం చేయగలిగే వాళ్ళు, prejudices తో ముందే ఏర్పర్చుకున్న నిశ్చితమైన ఖచ్చితాభిప్రాయాలతో , తమ subjective అభిరుచుల మేరకు యేది కవిత్వమనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేస్తున్నారు. అందు వల్ల మంచి కవిత్వం చాలావరకు బయటి ప్రపంచానికి తెలియకుండా పోతుంది. ఉదాహరణకు ఆ మధ్య ‘Language for a New Century’ అని ప్రధానంగా మధ్య ప్రాచ్య, ఆసియా లోని దేశదేశాల కవిత్వాన్ని – ముఖ్యంగా కొత్త శతాబ్దానికి కొత్త భాషలో కొత్త గొంతుకనిచ్చిన కవిత్వాన్ని ఒక చోట చేర్చిన అద్భుతమైన సంకలనం వెలువడింది. ఆ సంకలనంలో తెలుగు కవిత్వం కోసం చాలా ఆత్రంగా వెతికాను. తీరా చూస్తే ఒకే ఒక్క తెలుగు పద్యం కనబడింది. అది విశ్వనాథ గారి పద్యం. విశ్వనాథ మంచి కవే కావచ్చు. కానీ కొత్త శతాబ్దపు కవి కారు – కొత్త సామాజిక సందర్భాన్ని ప్రతిబింబించిన కొత్త భాషా కొత్త గొంతుకా అసలే కాదు. బాగా నిరుత్సాహ పడ్డా! యే యితర ప్రాంత దేశాలా కవిత్వానికి యే మాత్రమూ తీసిపోని సమకాలీన తెలుగు కవిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలియజేసే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి!