వాకిలి » కబుర్లు

రైటర్స్ మీట్ 2017
2017 సంవత్సరం నవంబరు 18, 19 తేదీలలో హైదరాబాదులో రచయితల సమావేశం జరిగింది. అంతకన్న రెండు వారాల ముందు ఖదీర్ బాబు ఫోన్ చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించాడు. నేను సరే అన్నాను, అలాంటి సమావేశాల్లో ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో, ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశం ఉంటుందనే ఆశతో.

మొదటి సెషన్ లో ఖదీర్ అక్కడకు చేరుకున్న 30-35 మంది రచయతలను సవివరంగా పరిచయం చేసినప్పుడు నాకో సందేహం కలిగింది– వాళ్లందర్నీ సంధించే సూత్రం ఏమయ్యుంటుందా అని. సుమారుగా సగంమంది పేర్లు గతంలో నేను విన్నవే – వారి రచనలు కొన్ని చదివి ఉన్నాను కూడా. తొలి పరిచయంలో మాత్రం ఆ సమూహం వివిధ అస్తిత్వవాదాల, రాజకీయ, సైద్ధాంతికధోరణుల కలగూరగంపలా అనిపించింది. దానికితోడు ఒక నిర్దిష్టమైన ఎజెండా అంటూ లేకపోవడం కూడా విస్మయం కలిగించింది. మన టీవీ డిబేట్లలో మాదిరిగా ధ్వనికాలుష్యం మరీ తీవ్రస్థాయికి చేరుకుంటేగనక సాయింత్రానికల్లా జారుకుందామని నిర్ణయించుకున్నాను. అయితే రెండురోజుల సమావేశం పూర్తయ్యేదాకా ఉండి సంతోషంగా, ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అదెలా సాధ్యపడింది? ఆ రెండ్రోజుల్లో ఏం నేర్చుకున్నాను? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

అక్కడకు వచ్చినవారంతా బాగా చెయ్యితిరిగిన, అనుభవజ్ఞులైన రచయితలు; లేదాఇటీవలే రాయడం మొదలుపెట్టిన యువ రచయితలు. ఒక నిర్దిష్ట ఎజెండా అంటూ లేకుండా వారందరితో – ఒక్కొక్కరుగా లేదా చిన్నచిన్న సమూహాలలో – ఇష్టాగోష్ఠిగా సంభాషించినప్పుడు కొన్నిసాధారణ లక్షణాలు గోచరించాయి. అందరిలోనూ ఒక అణకువ, నమ్రత, తెలుసుకోవాలనే తపన కనిపించాయి. తమని తాము మరీ సీరియస్ గా తీసుకోకుండా, తామే ప్రపంచపుభారాన్ని మోస్తున్నామనే భావన కలిగించకుండా నవ్వుకోగలిగిన మనుషులు వాళ్లంతా. అదే సమయంలో, వారిలోఎక్కువమంది తెలుగు సాహిత్యంతోనే కాకుండా దేశీయ, విదేశీ సాహిత్యాలతో లోతైన బాంధవ్యం కలిగిన వ్యక్తులని విశదమైంది. ఈ కారణాల మూలంగా ఆరుబయటి సంభాషణలు అర్థవంతంగా, ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జరిగాయి. సమావేశస్థలిలో మరింత ఫార్మల్ గా జరిగిన చర్చల్లో వక్తలందరూ తమ వాదాలను బలంగా, నిర్మొహమాటంగా వినిపించారు. కొన్నిసార్లు వాతావరణం వేడెక్కింది; అలాగని ఎవరూ మండిపడలేదు.

మాట్లాడిన వారందర్నీ, అన్ని విశేషాలనూ పేర్కొనడం సాధ్యంకాదు గానీ, నా మట్టుకు నేను కొత్తగా, లేదా మరింత స్పష్టంగా తెలుసుకున్న కొన్ని ప్రధానమైన విషయాలు– కొండగుర్తులుగా రాసుకున్న పొడివాక్యాల్లోంచి:

• ఉద్యమాల ఉత్తేజం, ప్రేరణ అవి ఏర్పరచిన ప్రాపంచిక దృక్పథం – ముఖ్యంగా తెలంగాణా సాహిత్యంలో–నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవి. (అల్లం రాజయ్య, డాక్టర్ పసునూరి రవీందర్ ల ప్రసంగాలు, ప్రమేయాలు ఇందుకు అద్దం పట్టాయి).

• అస్తిత్వవాదం ఏదైనప్పటికీ వాటి మూలాల్లో ఉండేది మానవీయత, ఆవేదన (అన్వర్, కుప్పిలి పద్మ).

• ముఖ్యంగా దళితవాదంలోనూ, తరువాత స్త్రీవాద, ప్రాంతీయ వాదాలలోనూ వస్తున్న ఇటీవలి రచనలలో బాధితుల స్వరాలను పలికించడంతో ఆగిపోకుండా ప్రత్యామ్నాయ సాధికారతను ప్రకటించుకొనే ధిక్కారం స్పష్టంగా వినబడుతున్నది. ఇదొక మంచి పరిణామం (రవీందర్, కృష్ణజ్యోతి, అపర్ణ తోట).

• రాబోయే కాలంలో మన రచనలకూ, సృజనాత్మకతకూ అడ్డుకట్టలు వేయడం ఎవరికీ సాధ్యంకాదు (అపర్ణ తోట).

• యువరచయితల రచనావ్యాసంగం తెలుగు సాహిత్యానికి ఆశాజనకంగా ఉన్నది. వారు ఎంచుకుంటున్న ఇతివృత్తాలలోని వైవిధ్యం అద్భుతం. గ్రామీణ పునాదుల నోస్టాల్జియాను అధిగమించి, ‘గడచిన దినాల తలపోతల బరువు’ నుండి విముక్తులై, ఆధునిక నగరజీవన సంక్లిష్టతను ఒడుపుగా పట్టుకున్న మొదటితరం రచయితలు వీళ్లంతా (ఖదీర్,రిషి శ్రీనివాస్,అపర్ణ తోట, చైతన్య పింగళి, మనోజ్ కనుమూరి, మహి బెజవాడ, కాశీరాజు, విజయ్, ఇంకా ఇతరులు).

• నిత్య సంఘర్షణ, విస్తృత జీవితానుభవసారమే రచనావ్యాసాంగానికి ముడిపదార్థం. మనమధ్య ఇంకా శారదలుండడం ఏకకాలంలో మనఅదృష్టం, దురదృష్టం.(భూతం ముత్యాలు, కరుణాకర్).

• తాత్వికచింతన కలిగిఉండే కథలు విరివిగా రాకపోవచ్చుగాని సదా వాటికొక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదొక తపన, ధ్యానం, అంతర్ముఖ అన్వేషణ, సూచనప్రాయమైన వ్యక్తీకరణ.(పూడూరి రాజిరెడ్డి, భగవంతం, అజయ్ ప్రసాద్).

• ఇవాళ్టి పరిస్థితుల్లో రాజ్యాంగానికీ, అంబేద్కర్ రచనలకూ విస్తృత ప్రచారం కల్పించడం కళాకారుల, బుద్ధిజీవుల కర్తవ్యం (మహేష్ కత్తి, ఇంకా ఇతరులు).

• తెలుగులో వస్తున్న ప్రతీ కథనీ (సంవత్సరంలో సుమారు మూడువేలని తెలిసింది!) ఓపిగ్గా చదివి, మంచిచెడులను విశ్లేషించే విమర్శకులు ఉండడం మన అదృష్టం. అంతటితో ఆగకుండా అమెరికాలో ప్రచురింపబడుతున్న కథలనుకూడా చదివి, వాటిని మన దృష్టికి తీసుకొచ్చిన రమణమూర్తిగారికి అభినందనలు.

• దక్షిణ అమెరికా సాహిత్యపు లోతులలోని కళాతత్వసౌందర్యం భిన్నమైనది, విలక్షణమైనదీను. అక్కడి ధోరణులను గనుక పరిశీలిస్తే మనం తెలుసుకోవలసినవి చాలానే మనల్ని చుట్టుముడుతాయి.(కె. సురేష్).

• తెలుగు కథల ప్రాచుర్యానికి ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలోకి వచ్చే, రాగల అనువాదాలే సజీవవారధులు. (ఆదిత్య).

• తెలుగు రచయతలు తమ పుస్తకాలను తామే ప్రచురించుకొని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. అయినప్పటికీ కొన్ని మెళకువలు పాటిస్తే ఈ పనిని సమర్థంగా నిర్వహించవచ్చు (ఖదీర్ బాబు). ప్రత్యామ్నాయం? ఈ-ప్రచురణ.(అనిల్ అట్లూరి).

ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. ప్రధాననిర్వాహకులైన ఖదీర్, సురేష్ లు సమయపాలనను సమర్థవంతంగా పాటింపజేశారు. వారి అంకితభావానికీ, సామర్థ్యానికీ అభినందనలు. రెండు రోజులపాటు అంతమంది రచయతలతో, సాహితీమిత్రులతో గడపడం నాకు కలిగిన ఒక గొప్ప అవకాశం. నిర్వాహకులకు ధన్యవాదాలు.

ఎందుచేతనోగాని, ‘కొత్తగా రాస్తున్న యువరచయిత’గా నన్ను నేను పరిచయంచేసుకోగానే అక్కడున్నవాళ్లంతా గొల్లుమని నవ్వారు– నిష్కల్మషంగానే. అది నాకు ఉల్లాసం కలిగించింది; అలాగే, ఆనాటి హేమంత శుభోదయపు అరుణవర్ణం సాయింత్రానికల్లా ఊదారంగులోకి మారినప్పుడు నీలిదుస్తుల రచయితల గుంపులో నన్ను నేను విలీనం చేసుకోవడం కూడా.

- ఉణుదుర్తి సుధాకర్

మద్రాసులో అనేక సినిమాలు తీసి డెబ్బయ్యేళ్ళ వయసులో ఇప్పుడు నవల రాయాలనీ, నవలా రహస్యాలు ఏమైనా తెలుసుకోవచ్చనీ ఫ్లైటెక్కి వచ్చిన అప్పటి ప్రముఖ నిర్మాతా, అదే నగరంలో ఇంకోమూల రోడ్డుపక్క హోటల్లో కట్టెల పొయ్యి ముందు కళ్ళు మండుతూ కాళ్ళు బొబ్బలెక్కుతున్నా సాంబారు కాసి అనేక ఢక్కామొక్కీలు తిని టూరిస్ట్ కంపెనీ ఓనరయ్యి కథా రచయిత కూడా అయిన ఇంకో వంట మాస్టరూ, కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం తర్వాత మూడొందలకు పైగా సభల్లో ప్రసంగించి రాయటానికి టైం దొరకని తెలంగాణా దళిత కథా రచయిత, చిట్టగాంగ్ కొండ కోనల్లో రెండేళ్ళకు పైగా తిరిగి శోధించి రాసినందుకు అదే అవార్డ్ సాధించిన ఓ మహిళా యాక్టివిస్టూ – తను కథా రచయిత్రి కూడా, ఒకే ఒక కథ రాసిన ఓ కొత్త రచయిత పక్కనే నలభై ఏళ్ళుగా కథలూ, నవలలూ, వ్యాసాలూ రాస్తున్న తెలంగాణా సీనియర్ మోస్ట్ ఇంకొకరూ, హైదరాబాద్లో కేన్సర్ రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్ సాహిత్యాభిమానం, అతి తక్కువమంది మాత్రమే చేయగలిగే భాషా సౌందర్య శాస్త్ర పరిశోధన మీద ఢిల్లీ యూనివర్సిటీ నుంచీ యువ విమర్శకుడొకరు, ముప్పయ్యేళ్ళ తర్వాత మళ్ళీ కథా రచన మొదలెట్టి కొత్త రచయిత అయిన ఓ ముంబై మెరైన్ ఇంజనీర్, రెండు నవలలూ కథాసంకలనాలూ కవిత్వం తెచ్చి మెప్పించిన ఒకప్పటి హైదరాబాద్ రిక్షావాలా, పాతికేళ్ళలో పది కథలే రాయగలిగిన ఓ అనామక రచయిత, రెండేళ్ళలో ఇరవైరెండు కథలు రాసిన మారుమూల ప్రముఖ రచయిత్రీ, కథ, సినిమా సంగీతం లాంటి అనేక రంగాలలో అనేక రకాలుగా చెయ్యి తిరిగిన ఇంటింటి కథా రచయిత పక్కనే రాసిన రెండు వైవిధ్య కథలకే చెయ్యి విరిగిన మరో కథా విరాగీ, ఏడాదికి మూడువేలకు పైగా కథలు చదువుతూ కథకు శిలువ వేసుకొన్న నిరంతరాధ్యయనశీలి ఒకవైపు, తన కథలు తప్ప మరొకరివి చదవని ఇంకొకరూ, ఆరు పుస్తకాలు అచ్చయ్యాక కూడా తగిన టైటిల్ దొరక్క రెండేళ్ళుగా తరువాతి పుస్తక ప్రచురణ ఆపిన సీనియర్ రచయిత్రీ, నాలుగైదు కథలకే సంచలన టైటిల్ దక్కించుకొన్న యువ రచయిత్రి ఒకరూ, ఇప్పుడు తన పూర్తి పేరుతో రాయటానికే సంకోచించాల్సిన పరిస్థితి వచ్చిన మైనారిటీ రచయిత్రి ఆందోళన ఒకవైపూ, ఫేస్బుక్లో ముప్పై వేల ఫాలోయర్లను గెలుచుకొన్న బిగ్బాస్… ఇంకా అనేకానేక రంగాల నేపథ్యాల వాదాల వివాదాల అస్తిత్వాల…

అందరూ ఊరికి దూరంగా ఒక చోట చేరి నవంబర్ 18, 19 మొత్తం రెండు రోజులూ ఒకరినొకరు ఆహ్వానిస్తూ, చర్చిస్తూ, విభేదిస్తూ, సహిస్తూ…

“నా కథలు ఎవరూ చదవట్లేదు. అసలెందుకు రాయాలి?”

“మా దళితుల మీద రాస్తుంటే ఎప్పుడూ ఒకటే రాస్తున్నాడు అని ఒక విమర్శకుడు బాధ. అవే ఎందుకు రాయకూడదు?”

“రచయిత డబ్బు సంపాదించాక రాయలేడంటారు. నిజమేనా?”

“తన బాల్యం మీదా, ఊరుమీదా ఒకే ధోరణిలో అనేక మంచి కథలు రాసిన ఒక రచయిత, ఇప్పుడు వేరే రకం కథలు రాయటం మొదలెట్టాడు. అలా చేయొచ్చా?”

“ఫలానా రచయిత కారు కొన్నాడు. ఆయన పని అయిపోయినట్టేనా?”

“ఒకే ధోరణిలో రాయటం మంచిదా, లేక అనేక విషయాల మీదా రాయొచ్చా…?

“ప్రయోగాత్మక కథలు నేటివిటీ లేకపోవటం వల్ల ఫెయిలవుతున్నాయి. కాదా?”

“నేను లేని కథల్ని నేను రాయను”

“నేనంటే నా పుట్టుకతో వచ్చే అస్తిత్వమొక్కటే కాదు. నాకు ఇంటా బయటా అనేక అనుభవాలుంటాయి. అవన్నీ రాయాలి. అంతే కానీ నువ్వు ఫలానా స్త్రీవి, ఫలానా మైనారిటీవి. అవి మాత్రమే రాయాలంటే అదొక్కటే నా జీవితం కాదు. రాయను.

“పెద్ద కథలు వేసే పత్రికల్లేవు. చిన్న కథలే రాయాలా?”

“కథలో నెగెటివ్ ప్రోటగొనిస్ట్ ని పెడితే అది నేనే అనుకొంటారేమో నా గుడ్ విల్ పోతుందేమో అని భయం వేస్తోంది”

“రాసేప్పుడు ఫలానా వాళ్ళేమనుకొంటారేమో అన్న భయం…”

“రాసి అచ్చేసుకొని చేతులు దులుపు కోవటం కాదు. దాన్ని పాఠకుల దగ్గరకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఇప్పుడు రచయితదే”

“తెలుగులో తక్షణ సమస్యల మీద వచ్చినట్టు తాత్విక వివేచన మీద కథలు రావటం లేదు. లేదా మన వాళ్ళకు రాయటం రాదా?”

“ఈ తరం రచయితలకు తాత్విక భూమిక లేదు, అంతా పైపై వ్యవహారమే. అసలు మనిషి లోతుల్లోకి వెళ్ళి…”

“ఇప్పుడు మనం మనమీద పని చేసే సెన్సార్ షిప్ గురించి మాట్లాడు కోవాలి. అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక ఫలానా నెగెటివ్ పాత్ర మా కమ్యూనిటీదే. ఈ రచయిత మాకు వ్యతిరేకం అంటున్నారు. ఇదో కొత్తరకం సెన్సార్షిప్”

“స్త్రీ విముక్తి సరే. మగవాడి నలుగు బాటు సంగతేమిటి. ఎవరూ రాయరా? రాయకూడదా?”

“గతంలో వచ్చిన అభ్యుదయ విప్లవ సాహిత్యాల్లో మా జీవితాల్లేవు. అందుకే మావి మేము రాసుకొంటున్నాం”

“అసలు కథ చెప్పే వాడు నెరేటర్. రచయితకూ నెరేటర్కీ వాడి దృక్పథానికీ మధ్య సంబంధం లేదు. ఈ సంగతి పాఠకులకు తెలియటం అటుంచి అసలు రచయితలకన్నా తెలుసా? అందుకే ఈ భయాందోళనలు”

“మీక్ బాల్ రాసిన నెరేటాలజీ తప్పక చదవాల్సిన పుస్తకం. అసలు డెరీడా, ఫూకో, లకాన్ లేకుండా …”

” వెస్టర్న్, రష్యన్, లాటిన్ అమెరికన్ సాహిత్యం సరే, మన పక్క రాష్ట్రాల్లో వస్తున్న అద్భుతమయిన సాహిత్యం మనం చదువుతున్నామా? తమిళ, కన్నడ , మళయాళీ భాషలు నేర్చుకోవటం అంత కష్టం కాదు ”

“తెలుగులో మనం రాసే కథలు సినిమాలుగా మారటం కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయింది. గమనించారా? ఇతర భారతీయ భాషల్లో అలా కాదు. అక్కడ మంచి కథల్ని సక్సెస్ఫుల్ సినిమాలుగా తీస్తున్నారు. అక్కడి సినిమా రచయితలు కూడా అద్భుతమయిన కథలు రాస్తున్నారు. తెలుగులో కథకీ సినిమాకీ మధ్య లింక్ తెగిపోయింది”

“కొత్త తరం పాఠకులకి మనం రాసేది అవసరం లేదు. మన సాహిత్యం…it is going to die, obviously”

“తెలుగులో పాఠకుల్లేరు, రచయితలు తప్ప”

“కథ సరే, అసలు నవలెందుకు రాయరు? రాసే శక్తి లేదా? లేక మనలో విషయం లేదా? లేక కథ రాస్తే వచ్చే పేరు ఆదరణ నవలా రచయితలకు లేదని …”

“హాస్య వ్యంగ్య కథలు రావటలేదు. అన్నీ సీరియస్ విషయాలే…”

“ఇతర భారతీయ భాషల్లో తెలుగునేల మీద ఉన్న అన్ని వాదాలూ వివాదాలూ ఉన్నాయి, కానీ వాళ్ళు తక్షణ స్పందనని మించినదింకేదో పట్టుకొని, కంపెల్లింగ్గా, ఏ ఇన్హిబిషన్స్ లేకుండా వైవిధ్యంగా రాస్తున్నారు”

“రచయిత ఇంటలెక్చువల్ అయ్యక ఎమోషన్స్ ఆగిపోతాయి, ఇక కల్పనా సాహిత్యం రాయటం సాధ్యమా?”

“ఇంటలెక్చువాలిటీకీ ఎమోషన్స్ కీ మధ్య సంబంధం లేదని తమిళ, కన్నడ , మళయాళీ రచయితలు నిరూపించారు”.

“ఇక్కడ సాధారణ రచయితల్ని చెకోవ్ లాంటి వాళ్ళతో పోల్చి చూడటం దారుణం. పోల్చాలంటే ఇక్కడి ఉత్తమ రచయితల్నీ, అక్కడి మంచి రచయితలతో పోల్చండి. అంతే కానీ ప్రపంచ కథ ముందు తెలుగు కథ తీసిపోయినట్టు మాట్లాడటం సరి కాదు”

“అమెరికన్ కథల పరిస్థితి కూడా మనకంటే గొప్పగా ఏం లేదు. మనకి ఏడాదికి సుమారుగా 2500 కథలు వస్తున్నాయి. అందులో 8 శాతం మంచి కథలు అని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ఎక్కువ. 12 శాతం. కాకపోతే వాళ్ళు చిన్న చిన్న అంశాల్ని కూడా గొప్పగా మలుస్తుంటారు రేమాండ్ కార్వర్ లాగా”

“గత రెండు దశాబ్దాలుగా, ముఖ్యంగా కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు బందయ్యాక ఓ కొత్త రైటిస్ట్ తరం వచ్చింది. అసలు ప్రమాదమేమంటే, భినాభిప్రాయం సహించలేని వీళ్ళు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కీలక పదవుల్లో నిర్ణయాత్మక శక్తులుగా తయారయ్యారు. సాహిత్యంతో పరిచయం అటుంచి, అసలు ప్రజాస్వామిక విలువలకే వాళ్ళు అపరిచితులు. ఇక తరువాతి తరం సంగతి అలోచిస్తుంటేనే భయమేస్తోంది”

ఇలా ఎన్నో ప్రశ్నలూ కొన్నే సమాధానాలు…

సమావేశానికొచ్చిన కొందరి అభిప్రాయాలు క్రింద:

రైటర్స్ మీట్ కోసం నేను మానసికంగా ఎప్పుడో ఆ సమూహం మీద వాలిపోయాను. స్థిరంగా రాస్తున్న వాళ్ళని, అప్పుడప్పుడు రాస్తున్న వాళ్ళని, కొత్తగా రాస్తున్నవాళ్ళని ఒక దగ్గర సమావేశపరచడమే పెద్ద సాహసం. అన్ని భావజాలాల ప్రతినిధులనూ పిలిచి వారి అనుభవాలను, వారి దృక్పథాలను, ఇంతకాలంగా రాస్తూఎదుర్కుకున్న ఇబ్బందులు, అధిగమించిన అవరోధాలు, తట్టుకున్న సవాళ్లు, విస్తృతం చేసిన భావజాలం, రాయకుండా ఉండలేని స్థితి, రాశాక ఏర్పడ్డ వాద వివాదాలు, ఎంత రాసినా రాయకుండా మిగిలిపోయిన జీవితాలు, సంఘటనలు, సందర్భాలు, అసంతృప్తులను, రాశాక ఎదుర్కుకున్న పరిస్థితులు, ఎదిరింపులు …

కథ గురించి, రాసే విధానం, టెక్నిక్, శిల్పం, తాత్వికత, సార్వ జనీనత, తమదైన కథాకథనం .. ఖుల్లంఖుల్లాగా స్పష్టంగా, ప్రామాణికంగా , అర్థవంతంగా , ఉద్విగ్నం గా, ఉత్తేజంగా, మనసులో ఉన్నదున్నట్టుగా చెప్పారు. గట్టిగా చర్చించుకోవడం జరిగింది.

ఈ పదేళ్లలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయకుండా, కనీసం పక్కన వున్న ఇతర రచయితలతో కూడా మాట్లాడుకోకుండా, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు .. కూర్చోవడం నాకైతే మొదటిసారే.

మీటింగ్ లా లేదు. సమావేశంలా లేదు. మాట్లాడిన ప్రతి ఒక్కరి మాట అందరూ విన్నరు. చర్చల్లో పాల్గొన్నరు. ఎవరికి వారు బయట ప్రత్యేక సమావేశం పెట్టుకోలేదు. చాలా ఏండ్ల తర్వాత ఎంతో ఇష్టంగా ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు కుదురుగా కూర్చున్నం.

గొప్ప కథలాగే గడిచిపోయాయి 2 రోజులు.

- అన్వర్ వరంగల్

ఈ రైటర్స్ మీట్ 2017 లో చాల మంది యువ రచయతలు పాలు పంచుకున్నారు. అది తెలుగుసాహిత్య లోకానికి ఒక ప్రోత్సాహకర పరిణామం అనిపించింది.

ఇది ఒక చక్కటి అనుభవం. నిజానికి నాకు తెలియని ఎన్నో కోణాలు ,మరెన్నో విషయాల గురించి తెలుసుకున్నాను.

- మణి వడ్లమాని

రాసే కుతూహలం ఉన్న నాలాంటి వాళ్లకు ఇక్కడ రెండ్రోజుల గ్లూకోస్ ఎక్కించబడింది . ఇప్పటికే బాగా రాసి, ఇంకా రాస్తున్న వాళ్లకు కొత్త వాళ్ళను కలిసి ఆలోచనలు పంచుకునే ఆటవిడుపు లాంటివి ఈ రెండురోజులు .

దైనందిన జీవితం లో ఉండే పీడన , నలుగుబాటు , భయాలు , ఆందోళనలు… వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి కుదురుగా కూర్చుని రాయాలంటే … ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి . కలుస్తూ ఉండాలి.

- కరుణ కుమార్

ఇవీ నవంబర్ 18, 19 రెండు రోజులూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన రైటర్స్ మీట్ 2017 కబుర్లు.

2001 నుంచీ ఇప్పటి దాకా ఖదీర్ బాబు, సురేష్ లు నిర్వహిస్తున్న కథకుల సమావేశాల్లో ఇది పదకొండవది.

గత ఏడాది సూర్యలంకలో జరిగిన రైటర్స్ మీట్ రచయితల నుంచీ ‘కొత్త కథ – 2017′ వెలువడటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

ఇక ‘కొత్త కథ – 2018′ కోసం ఎదురు చూద్దాం.

- సురేష్

అమ్మల కొలువు
సత్య శ్రీనివాస్ తెలుగు కవిత్వ లోకానికి కవిగా సుపరిచితుడు. వర్షంలో తడిసి, ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పుకున్న అడవి మార్మిక సౌందర్య పరిమళమేదో తన కవిత్వంలో పరుచుకుని వుంటుంది. అతడు కలె తిరిగిన అడవిలాగే అతడి కవిత్వం కూడా సరళ గంభీరంగా వుంటుంది. అడవి నుండి బలవంతంగా వేరు చేయబడుతోన్న ఒక పురా మానవుడి దుఃఖం ఏదో అతడి కవిత్వ ప్రవాహం పైన తడి తళుకు వలె గోచరిస్తుంది.

ప్రకృతినీ, అడవుల్నీ ఆలింగనం చేసుకుని, వాటి తరాల గాథల్ని ప్రేమగా ఆలకించి, కవిత్వమై పలవరించిన కవి కాబట్టే, అమ్మలనూ, అమ్మమ్మలనూ పట్టించుకున్నాడు సత్య.

కేవలం తన అమ్మను మాత్రమే కాదు. తనకు తారసపడిన తన స్నేహితుల తల్లులనూ, తనకు ఏమీ కాని తల్లులనూ పట్టించుకున్నాడు. ఆ తల్లులలో ఆంధ్ర, రాయలసీమ తల్లులున్నారు – తెలంగాణ తల్లులున్నారు. పట్టణ ప్రాంత తల్లులున్నారు, పల్లె తల్లులున్నారు. అట్లాగే హిందూ, ముస్లిం తల్లులూ వున్నారు.

ఈ తారతమ్యాలు తెలియని సత్య శ్రీనివాస్ కు వాళ్ళంతా ప్రేమను పంచిన తల్లులే! బహుశా, అందుకే, గొప్ప స్త్రీ మూర్తులను దర్శించిన తన అనుభవాలను మనతో పంచుకోవడానికి ఏ కాగితం పైనో ఒలికే నాలుగు అక్షరాలు సరిపోవని భావించి, తాను దర్శించిన ఆ ప్రేమమయ మాతృ మూర్తులను మనకు సజీవంగా పరిచయం చేసేందుకు నీటి రంగులతో వేసిన వర్ణ చిత్రాలను ఎంచుకున్నాడు. ఆ వర్ణ చిత్రాలను ఒక ప్రదర్శన రూపంలో మన ముందుకు తెచ్చేందుకు 14 ఏళ్ళ సుదీర్ఘ కాలం శ్రమించాడు.

14 ఏళ్ళ క్రితం సత్య ఈ కలను తాను పెరిగిన బంజారా హిల్స్ లోని తొలి జర్నలిస్టు కాలనీలోని నెంబర్ 20 లో వున్న తన ఇంటిలో కన్నాడు. ఇప్పుడా ఇల్లు లేదు. సత్య వాళ్ళు ఆ ఇంటిని అమ్మి వేసి వెళ్లి పోయిన తరువాత ఒక పెద్ద బిల్డరు ఆ స్థలంలో పెద్ద భవంతిని కట్టి జర్మను వాళ్ళ గోథె సాంస్కృతిక కేంద్రానికి అద్దెకిచ్చారు. ఇవేవీ తెలియని మన సత్య హైదరాబాద్ నగర శివారుల్లో ఒక కుటీరం లాంటి ఇల్లు కట్టుకుని బతికేస్తున్నాడు.

ఇక్కడే బాలచందర్ సినిమాలలో కనిపించే కొన్ని సంఘటనలు అతడి జీవితంలో చోటు చేసుకున్నాయి.

14 ఏళ్ళుగా మోసుకుంటూ వొస్తోన్న తన కల – అమ్మల నీటి రంగుల చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలని అనుకుంటూ వున్న సమయంలో ఈ గోథె సెంటర్ గురించి చదివాడు. ఆ సెంటర్ వున్న చిరునామా – ‘ ప్లాట్ నెంబర్ 20 ; బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3’ చూసి, పరమానంద భరితుడయ్యాడు. ఒకప్పుడు, వాళ్ళ అమ్మ సంగీతంతో, తోడబుట్టిన వాళ్ళ కళలతో, ఇంటికి తరచుగా వచ్చీపోయే కవులు, రచయితల సంభాషణలతో కళకళలాడిన ఇల్లు ఇవాళ జర్మన్ సాంస్కృతిక కేంద్రం అయినందుకు చాలా సంతోషించాడు. అక్కడే, ఆ చోటులోనే తాను సృజించిన అమ్మల వర్ణ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని తపన పడ్డాడు!

ఏదైతేనేం… కవి యాకూబ్ లాంటి మిత్రుల సాయంతో తాను పెరిగిన, తన జ్ఞాపకాలు ఇంకా అల్లుకుని వున్న ఆ ప్లాట్ నెంబర్ 20 చిరునామాలో ’20 మెమోయిర్స్ ‘పేర ప్రదర్శన నిర్వహించాడు. అక్కడ తన వర్ణ చిత్రాల ప్రదర్శన నిర్వహించుకోగలిగినందుకు సత్య మాత్రమె కాదు, ఒక అరుదైన ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం దక్కినందుకు గోథె సెంటర్ భవన ఓనర్, గోథె సెంటర్ నిర్వాకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంకా ఆ కాలనీలోనే వుంటున్న వాళ్ళు, సత్య ఇంటితో, మరీ ముఖ్యంగా సత్య వాళ్ళ అమ్మతో అనుబంధం వున్న అనంత్, కందుకూరి రమేష్, సాంబశివ రావు, సిద్దార్థ, అక్బర్, ఖదీర్, ఎమ్మెస్ నాయుడు, కుప్పిలి పద్మ, మోహన్, శంకర్, ఏలే లక్ష్మణ్ లాంటి ఎందరో కవులు, రచయితలు, చిత్రకారులు ఆ ప్రదర్శనకు వచ్చి, తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆ జ్ఞాపకాల తలపోతల కోసమే ప్రత్యేకంగా ‘down the memory lane’ పేర ఒక రోజు ఏర్పాటు చేసాడు సత్య!

ప్రేమ మూర్తులైన అంతమంది అమ్మలు, అమ్మమ్మలు కొలువైన ప్రదర్శనలో, సత్య గీసిన వాళ్ళ నాన్న గారి చిత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ.

నాన్నలు తమ స్నేహితులు కొందరిని పోగేసి, కొన్ని డబ్బులు పోగేసి ఒక స్థలాన్ని సంపాదించి ఇళ్లనైతే కట్టగలరు గానీ, ఆ కట్టిన ఇళ్ళలో ఇంత జీవం నింపి, ఆ ఇళ్ళ సముదాయాన్ని మనుషులు తిరుగాడే అందమైన కాలనీలుగా మార్చేది అమ్మలే.

బహుశా, అందుకే ఈ అమ్మల కొలువుని తమ ఊళ్ళో కూడా ప్రదర్శించమని సత్యను వైజాగ్, విజయవాడ మిత్రులు కోరుతున్నారు.

జ్ఞాపకాలకు అంతం వుండదు – ముఖ్యంగా అమ్మలతో, అమ్మమ్మలతో ముడిపడి వున్న జ్ఞాపకాలకు.

‘నువ్వు లేవు, నీ పాట ఉంది’ – తిలక్ జ్ఞాపకాలు
“నేను ఒంటరిగా ఉన్న ఒక సామాన్య స్త్రీని. ఉద్యోగస్తురాలిని. దుర్భరమైన నా మనోవ్యథల్ని ఎదుర్కొనలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఫ్రెండు సుచిత్ర ‘చదువు, బాగుటుం’దని టేబులు మీద పెట్టిన మీ ‘అమృతం కురిసిన రాత్రి’ పేపరు కటింగు చూసి, కవితల మీద నాకున్న అభిలాషతో చదివాను. నన్నది నిజంగా బతికించింది. బతుకు మీద ఒక ఆశని పెంచింది. నాలో బతకాలనే ఉత్సాహాన్ని పెంచింది. నా నిరాశని తరిమింది. మీకు కృతజ్ఞతలు. మీ అడ్రసు మా ఫ్రెండు దగ్గర తీసుకున్నాను. ఈ ఉత్తరం మీకు చేరుతుందని ఆశిస్తున్నాను.”

“సుబ్బరాయ శాస్త్రీ, ఈ ఉత్తరం ఒక మధ్యాహ్నం పోస్టులో వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూశావా! నా కవిత ఒక ప్రాణాన్ని కాపాడటం. అక్షర రూప సాహిత్యంలో ఎంత మహత్తర శక్తి దాగి ఉందో, అది మనుషుల అంతరంగాన్ని ఎలా మేలుకొల్పగలదో” అన్నారు సాలోచనగా. అప్పటికే సాహిత్యరంగంలో తిలక్ సుప్రసిధ్ధ కవీ, కథకుడు. సాహిత్యరంగానికి బాగా తెలిసిన మా నాన్నగారి (ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి) ద్వారా ఆయన రచనల గురించి అప్పటికే బాగా విన్నాను. భారతిలో ఆయన కొన్ని రచనలు చదివి ఎంతో ఆనందించాను.

ఆ కాలంలో నేను ప.గో.జిల్లా తణుకులో పనిచేసేవాడిని. అక్కడి Z.P స్కూలులో శ్రీ ఏలూరిపాటి అనంతం గారు తెలుగు పండితులుగా పనిచేసేవారు. ఆయన కవి, మంచి వక్త. అంతే కాకుండా, ఆయన మా నాన్నగారి సాహిత్య మిత్రులు, మాకు కుటుంబ మిత్రులు కూడా. అనంతం గారి ఇంటికి దగ్గరలోనే తిలక్ గారి ఇల్లు. నా కోరిక మీద అనంతం తనకు కూడా మంచి మిత్రులయిన తిలక్ గారిని ఓ రోజు నాకు పరిచయం చేశారు. నా పేరూ, నాన్నగారి పేరూ విని, సంతోషంగా మా నాన్నగారు గోదావరి మీద రాసిన ఒక పద్యం వినిపించారు. “ఇది నాకు బాగా ఇష్టం. మీ నాన్నగారి రచనలన్నా నాకు అభిమానమేనయ్యా.” అన్నారు. పత్రికల్లో వచ్చే రచనల గురించి ముచ్చటించుకున్నాం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయనది విశాల దృక్పధం. ఆయన ఏ వాదాలకు, ఇజాలకు పరిమితం కాని రచయిత. దేశ, విదేశాలలో వస్తున్న మార్పులను, సహజ పరిణామాలను జాగ్రత్తగా గమనించే వ్యక్తి అనిపించింది. ఆయన అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి.

మాటల మధ్య అనంతం గారితో- “ఇవాళ పత్రికలో ఒక MLC విద్యావిధానం, అభిరుచుల మీద చాలా హాస్యాస్పదంగా ప్రసంగించారు. విద్యా విషయంలో, అభిరుచిని పెంచే విషయంలో తగిన వాళ్ళతో చర్చించకుండా, అవగాహన లేకుండా మాట్లాడారు. ఇది చూసి భరించ లేక, నేనే MLCగా నిలబడాలని ఉంది. సరైన విద్యకీ, అభిరుచికీ ఎంత దూరమై పొతున్నామో ఈ అనవసర రాజకీయ జోక్యం వల్ల. నేను MLC నై, వీరి అజ్ఞానం తెస్తున్న ప్రమాదాలను తెలియజేస్తాను. ఏమంటారు?” అన్నారు నవ్వుతూ, కుతూహలంగా. అనంతం గారు ఆయన ఉత్సాహాన్ని గుర్తించి, చిరునవ్వుతో “తిలక్ గారూ! ఇది మన కంఠశోషగానే మిగిలిపోతుంది. ఆ దారి వేరు, ఆ తీరు వేరు. అది మీ దారి కాదు. మీ బాధ నాకు తెలుసు. మీరు మీ రసప్రపంచం నుంచి దారి తప్పటం మాకిష్టం లేదండీ.” అన్నారు. దానికి తిలక్ “అంతేనంటారా” అంటూ నవ్వేశారు. అలా నవ్వుకొని లేస్తుండగా, “శాస్త్రీ, మనం తరుచు కలుస్తూ ఉండాలి. ఇక్కడే ఉన్నావు గదా. ఇలా సాహిత్య మిత్రులం కలుస్తూ ఉంటే, చాలా బాగుంటుంది సుమా!” అన్నారు.

తిలక్ స్వయంగా తన కవితల్ని చక్కగా చదివి వినిపించేవారు. కవితతోపాటు ఆయన రాసే సమయంలో ఆయన పొందిన హృదయస్పందన, ఉద్విగ్నత, కళ్ళారా చూడగలిగేవాణ్ణి. అది అపూర్వ అవకాశంగా నేను భావిస్తాను. ఆ కవితలుగాని, అందులోని పంక్తులనుగాని ఇక్కడ ఉదహరించటం లేదు. అవి సాహిత్య పాఠకులకు బాగా తెలిసినవే. ఈ జ్ఞాపకాలు రాయటంలో నా లక్ష్యం వ్యక్తిగా తిలక్ స్నేహాన్ని, హృదయానుభూతులను మీతో పంచుకోవటం మాత్రమే.

ఒక రాత్రి హోటల్‌లో భోజనానంతరం ఆయన ఇంటికి వెళ్ళాను. టైము తొమ్మిదవుతోంది. నన్ను దూరం నుంచి చూసి, ఆయన శ్రీమతి ఇందిర గారు “అదిగో, మీ ప్రియ మిత్రుడు సుబ్బరాయ శాస్త్రి వస్తున్నాడు” అన్నారు నవ్వుతూ. “శాస్త్రీ, వచ్చావా, బాగుంది. మనం కలిసి వారం అయిందనుకుంటాను. నా కార్డు అందిందా? నువ్వు నాకు బాగా దగ్గరివాడవయ్యావు. అందుకే చూడాలనిపించి కార్డు రాసి, వేశాను.” అన్నారు. దానికి నేను “ప్రైవేటు ఉద్యోగం గదా. రావాలన్నా వీలు కాలేదు. ఈ సాహిత్య జీవులకు ఇటువంటి ఉద్యోగం పంజరమేగాని, మధ్యతరగతి అవసరాలకు ఇది తప్పదు గదా” అన్నాను. “నిజం, నిజం” అని నవ్వుతూ, “అందుకే ఉత్సాహానికీ, ఉల్లాసానికీ నిన్ను నా దగ్గరకి రమ్మనమంటాను, రప్పిస్తాను” అన్నారు అభిమానంగా.

ఆయన గదిలో కిటికీలు తెరిచి వున్నాయి. వీధిలో సందడి. గదిలో నిశ్శబ్దం. ఇంట్లోని చెట్ల మీద నుంచి వచ్చే చల్లని గాలి నైట్ క్వీన్ పూల పరిమళాల్ని మోసుకువస్తోంది. అప్రయత్నంగా నా మనస్సులో తిలక్ కవితలోని ఒక వాక్యం మెదిలింది – “ఈ గది స్వప్నాలతో నిండిపోయింది.” ఎప్పుడు ఎక్కడ చదివానో గుర్తులేదు. ఆ సమయంలో ఆయన పుస్తకాల రేక్ నుంచి ఒక ఫైలు తీసి, నాకు దగ్గరగా తన వాలు కుర్చీ జరుపుకుని, “శాస్త్రీ, ఈ కవిత శీర్షిక ‘నువ్వు లేవు, నీ పాట ఉందీ. ఇది నువ్వు వినాలి” అని రసరమ్యంగా చదివి వినిపించారు. “చాలా బాగుంది. ఈ కవితలో ఆమె లేకపోయినా, ఆమె పాట ఉందన్నారు. ఈ కవిత విన్నాక, మీ గుండెలోతుల్ని తాకిన ఆమె గురించి వినాలని ఉంది. మీ దగ్గర ఉన్న స్వతంత్రం వల్ల ఇలా అడుగుతున్నాను. అభ్యంతరం లేకపోతే చెప్పండి” అన్నాను.

దానికాయన, “ఆ అమ్మాయి మాకు తెలుసు. దీపం లాంటి రూపం. చక్కని కంఠస్వరం. నేనన్నా, నా మాటలన్నా చాలా అభిమానం. తనకి పాటలంటే ప్రాణం. నాకు ఆ అమ్మాయి పాట వినటం గొప్ప అనుభవం. ఏ పాట పాడినా ఆ పాటలోని భావం, స్వరమాధుర్యం హృదయాన్ని కదిలించేది. కవిని గనుక, నా మనస్సు సుందర స్వప్నాల్ని ఆవిష్కరించేది. పరిమళ భరితమైన పూల వాసనలు హృదయాన్ని ఆవరించుకుని అనిర్వచనీయమైన హాయిని అందించేవి. మంచి యౌవనదశలో ఆమె హఠాత్తుగా పోయింది. మేము చాలా బాధపడ్డాము. నాలోని భావప్రపంచం ఒక్కసారి చలించిపోయింది. ఆ ఉద్విగ్న మనస్థితి నుంచి ఈ కవిత వచ్చింది.” అన్నారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు ఆ కవితలో ఒక తీవ్ర వేదనా, సాంత్వనా రెండూ కనిపించాయి.

తిలక్ తన సంభాషణలలో ప్రాచీన సాహిత్యంలో పాండురంగ మహత్మ్యం, పోతన భాగవతం, పింగళి సూరన కళా పూర్ణోదయం ఇవన్నీ తన కిష్టమైన పుస్తకాలని చెప్పేవారు. “తెనాలి రామకృష్ణుని శైలి, ఊహా వైభవం, కథా కథన శిల్పం నాకు నచ్చాయి. పోతనగారి శైలిలోని ప్రసన్నత, ఆర్ద్రమైన భక్తి నాకు నచ్చుతాయి. అలాగే, పింగళి సూరన కొత్త కథా వస్తువుని ఎన్నుకుని ప్రబంధ రచన సాగించాడు. ఆ చొరవ బాగుందనిపిస్తుంది.” అని చెప్పేవారు.

ఆంగ్ల సాహిత్యానికి వస్తే, కవిత్వంలో షెల్లీ, కీట్సు, కథల్లో వర్జీనియా ఉల్ఫు, సోమర్‌సెట్ మాం, మపాసా, నాటకాలలో బెర్నార్డు షా, ఇప్సెన్, ఆస్కార్ వైల్డు మొదలైన ప్రముఖ కవులూ, రచయితల గురించి, వారి ప్రత్యేకతల గురించి, ప్రతిభ గురించి చాలా ఆసక్తికరంగా చెప్పేవారు. ఆంగ్లంలో కొన్ని ప్రసిధ్ధ రచనలు నాకిచ్చి చదవమని చెప్పేవారు. నా రచనలు వినిపిస్తే, విని ఆనందించేవారు. మంచి సూచనలు చేసేవారు.

సాహిత్య వ్యాసంగంలో ఉన్న వ్యక్తికి చక్కని లోక పరిశీలన, అవగాహన, ఉత్తమ సాహిత్య అధ్యయనం, స్వీయ దృక్పధం, సంస్కారంతో కూడిన విశాల బుధ్ధి ఎంతో అవసరం. సాహిత్య వేత్తల సహవాసం, సాహిత్య గోష్ఠులు కూడా రచయిత ఎదగటానికి దోహదం చేస్తాయని అనేవారు. ఆ రోజుల్లో వచ్చే మంచి రచనలన్నిటినీ శ్రధ్ధగా చదివేవారు.

తెలుగు భాష మీద, భాగవతం మీద ఆసక్తి, అభిమానం వారి అమ్మగారివల్ల ఏర్పడిందని చెప్పారు. తిలక్ తండ్రిగారు ఆస్తిపరులు. ఆయన ఆ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండేవారు. కాని, తిలక్ సాహిత్య వ్యాసంగం మీద ఆయనకు ఆదరం, అభిమానం ఉండేవట. ఒకసారి తిలక్ పనిమీద బాంబే వెళ్ళినప్పుడు, చాలా మంచి పుస్తకాలెన్నిటినో ఒక బుక్ షాపులో ఆర్డరు చేసి, ఇంటి అడ్రసుకి పంపమని చెప్పి వచ్చేశారు. ఇంటికి అది పెద్ద పార్సెలుగా వచ్చింది. వారిది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు ఏమంటారోనని భయపడ్డారటగాని, ఆయన సంతోషంగా దానిని విడిపించి ఇచ్చారట. “ఈ విషయంలో ఆయన్ని బాగా తలుచుకుంటాను.” అని చెప్పారు. ఈ విషయం నేను మా తమ్ముడు శ్రీకాంత శర్మ ద్వారా విన్నాను.

ఒక ఆదివారం ఉదయం పది గంటల వేళ ఆయనని కలవటానికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ముందు గదిలో కూర్చుని పేపరు చూస్తున్నారు. “ఎలా ఉన్నారు? ఏమిటి విశేషాలు?” అంటూ ప్రవేశించాను. “రా, రా, సంతోషం” అంటూ కుశల ప్రశ్నలు వేసి కూర్చోమన్నారు. “నువ్వు విశేషాలు చెప్పమన్నావు గదా, నిజంగానే జరిగిన ఒక విశేషం చెబుతున్నాను, విను” అంటూ మొదలు పెట్టారు. “ఈ మధ్యనే ఒక సాహిత్య సభకి నన్ను ఉపన్యాసానికి పిలిచారు. అక్కడ నా ఉపన్యాసం బాగుందని సభ్యులూ, ఆక్కడి సాహిత్య మిత్రులూ సంతోషించారు. వేదిక దిగి, నా దగ్గర ఉన్న మిత్రులతో మామూలుగా మాట్లడుతున్నాను. నాకు కొంచెం దూరంలో, సామాన్యమైన దుస్తులలో ఒకాయన నించుని నాకేసి చూస్తున్నాడు. మాట్లాడాలని కాబోలు, రావటానికి సందేహిస్తున్నాడు. ముఖం మాత్రం చాలా హుందాగా, సంస్కారవంతంగా ఉంది. మిత్రులకి చెప్పి, నేనే వెళ్ళి ఆ మధ్య వయస్కుణ్ణి “ఎవరండీ మీరు?” అని స్నేహపూర్వకంగా పకరించాను. ఆయన సంతోషించి, “నా పేరు మూర్తి అంటారు. మీ ఉపన్యాసంలో చెప్పిన ‘జీవితం’ అనే కథ నేను చదివానండీ, పత్రికలో. మీరే ఆ బాలగంగాధర తిలక్ అని ఈ సభకు వచ్చిన నా స్నేహితుని ద్వారా తెలుసుకున్నాను. అక్షరాలా అలాగే నా జీవితంలో జరిగింది. నేను పత్రికలలో వచ్చే కథలు చదువుతూ ఉంటాను. కథలంటే ఇష్టం. మీ ఉపన్యాసంలో ఈ కథ గురించి విని, ఈ విషయం చెప్పాలనిపించి ఇక్కడ నించున్నాను. నమస్కారం. ఉంటాను.” అని చెప్పి వెళ్ళిపోయాడు. శాస్త్రీ, ఆ అపరిచితుడు మూర్తి కళ్ళలో ఎంత కృతజ్ఞతని, అభినందనని చూసాను! నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. కథా రచనలో కొంత జీవితంలోని యదార్థం, కథకుని కల్పనా, అతని అవగాహనా ఉండటం మంచి కథకు సహజం. అక్షరాలా అలాగే జీవితంలో సంభవించటం, ఆ వ్యక్తి తనను కలిసి ఆ సంగతి చెప్పటం, ఎంత కదిలిస్తుందో ఆ రచయితని. ఇంతకు మించిన విశేషం ఉందా” అని నాకేసి చూశారు ఎంతో సంతోషంగా, తృప్తిగా.

సంభాషణల్లో భాగంగా తిలక్ ఒకసారి తన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఇలా చెప్పారు.

“నేను సుదీర్ఘమైన అనారోగ్యం వల్ల మంచం మీద ఏళ్ళ తరబడి ఉండటం, సాహిత్య వ్యాసంగంలోనే గడపటం జరిగింది. నాకూ అందరిలా నాకు సరిపడే ఉద్యోగం చెయ్యాలని చాలా కోరిక ఉండేది. AIRలో ఒకసారి ప్రకటన చూసి, అప్లై చేసి, ఇంటర్వ్యూకి పిలిస్తే, హైదరాబాద్ టిప్‌టాప్‌గా తయారయి వెళ్ళాను. ఆప్పుడు హైదరాబాద్ AIRలో కృష్ణశాస్త్రి గారు పనిచేస్తున్నారు. నాకూ, ఆయనకూ మంచి స్నేహం ఉండేది. ఇంటర్వ్యూకి ఇంకా కొంచెం టైం ఉండటంతో, కృష్ణశాస్త్రి గారిని ఆయన ఆఫీసు రూములో కలిశాను. ఆయన నన్ను చూసి సంతోషించి, కొంచెం పరకాయించి చూస్తూ, “ఏమిటి విశేషం, నువ్వు ఇక్కడ?” అన్నారు. ఆయనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాక, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాను. ఆయన పకాలున నవ్వి, “నిన్ను చూస్తే ఉద్యోగానికి వచ్చావనుకోరు, నువ్వే ఉద్యోగం ఇవ్వగలవన్నంత దర్జాగా వచ్చావు. శెభాష్!” అని హాస్యమాడారు. ఆ ఉద్యోగం నిజంగానే రాలేదు. అంతటితో ఆ ఉద్యోగ ప్రయత్నమూ ముగిసిందనుకో. అదీ నా ఉద్యోగం ముచ్చట.” అది విని నేనూ నవ్వాను అప్రయత్నంగా.

తిలక్ గారి స్నేహం తలుచుకోగానే మనసులో ఎన్నో జ్ఞాపకాలు మెదులుతాయి. వాటిలో కొన్నిటిని మీతో పంచుకోగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

ఆకుపాట
నా  ’ఆకుపాట’ కవితా సంపుటి లోంచి  - ప్రముఖుల ఆత్మీయ వాక్యాలు:

అఫ్సర్:

వున్నచోటనే మడికట్టుకోకుండా తను వెళ్ళిన చోట కూడా వొక గుడి కట్టుకోగల మనస్థైర్యం వున్న కవికి భాష అడ్దంకి కాదు, తనలోపలితనాన్ని కవితలా తెరవడానికి అతను కొత్త భాషలోకి హాయిగా వెళ్ళిపోతాడు. వాసు కవిత్వ వాక్యాల్లో తెలుగు, ఇంగ్లీషు, తెలిగింగ్లీషూ స్నేహంగా వొదిగిపోతాయి. ఆ రెండు భిన్న ప్రపంచాల సాహిత్య సాన్నిహిత్యాన్ని వొద్దికగా తనలో ఇముడ్చుకొని, వొకే వాక్యపు గూటిలో దీపంలాగా వెలిగిస్తాడు వాసు. ఆ వెలుగు ఎంత అందంగా వుంటుందో అంత కొత్తగానూ వుంటుంది. ఎంత కొత్తగా వుంటుందో అంత దగ్గిరగా అలవాటయినట్టుగానూ వుంటుంది.

జీవితాన్ని మొత్తంగా చూడాలా, శకలాలుగా చూడాలా అన్న సందిగ్ధంలోంచి ఇంకా తేరుకోకుండానే, ఆధునిక జీవన శకలాల విశ్వరూపం చూపిస్తున్న కవి వాసుదేవ్. ఎదో వొక రకంగా సరిహద్దుల్ని చెరిపేసుకుంటూ వెళ్తే తప్ప ఇప్పటి జీవితం శకలాలుగా ఎలా మారుతున్నదో అర్థం కాదన్నది నిజం. ఆ నిజం అర్థమయ్యాక రాసే కవిత్వం ప్రతివాక్యంలోనూ కొత్త అర్థాన్ని చూపిస్తుంది. ఈ సంపుటిలో వాసుదేవ్ కవితల్ని వరసగానో, వరస తప్పించో చదువుతున్నప్పుడు వెంటనే ఈ multiplicity వినిపిస్తుంది. మనఃకల్లోలం నుంచి సాధ్యమైనంత వరకూ స్థిర స్థితిలోకి తీసుకువెళ్ళే లయని వాసు వెతుక్కుంటూ ఉంటాడు. వాసుతో పాటు మనం కూడా! ప్రతి కవీ తనతోపాటు వొక ఆశ్చర్యాన్ని తీసుకువస్తాడు. తనని చదివే చదువరికే కాకుండా, తన పంక్తిలో నిలబడే తోటి కవులకి కూడా ఆ ఆశ్చర్యం కలిగిస్తాడు. దాన్ని “ఆహా” క్షణం అనుకుంటాం. అలా ‘ఆహా’ అనిపించే అనేక క్షణాల చిగురాకుల మెరుపులివి.

హెచ్చార్కె:

‘మాటకు మరణం లేదు/ ఏ వాక్యమూ నశించిపోదు’. బహుశా కవికి తప్ప మరెవరికీ ఉండదు ఇంత నమ్మకం పదం మీదా, వాక్యం మీద. మాటలు కేవలం అక్షరాల కలయికలు కావు. మనసు నుంచి మనసుకు బదిలీ అయ్యే బొమ్మలు. ఈ సంగతి తెలిసిన మొదటి సారి పొందిన సంభ్రమాశ్చర్యాల నుంచి ఎప్పటికీ బయటపడ లేక, ప్రాక్టికల్ ప్రపంచంతో సామరస్యం కుదరక తపిస్తాడు కవి. తన తపన లోంచి తనదైన భాషను, వ్యాకరణాన్ని, వ్యక్తీకరణ సంప్రదాయాలను సృష్టిస్తాడు.

తనదయిన ఒక ‘ఆకాశాన్ని కోసుకుంటూ’ రాలిన కన్నీటి చుక్కలను లోకంతో పంచుకుంటున్న కవి కుమారుడు శ్రీనివాస్ వాసుదేవ్. ‘ఆకలి సమ్మేళనాల, వెతల వెక్కిళ్ల’ జ్ఞాపకాల’ను ఒక్కొక్క తొనగా వొలిచి అందిస్తున్నాడు. ఒక మెత్తని కొత్త గొంతు; సనాతన, అత్యాధునిక వేదన. నేనొక చిన్ని పాపాయినై ఈ సుకుమార గళం చుట్టూ చేతులు వేసి, ఈ భుజం మీద చెక్కిలి ఆన్చి కాసేపు సేద దీరాను. మనసు నుంచి చాచిన చేతులతో ఆహ్వానం మరొక మంచి తెలుగు స్వరానికి….

బతుకురంగుల కోరస్ ‘ఆకుపాట’

కవి యాకూబ్:

ఇతడో నిలువెత్తు కవి. నిలువెల్లా కవి.

తనలోంచి తనలోకి, మనలోంచి తనలోకి అటూ ఇటూ గెంతుతూ, జీవితాన్ని కవిత్వంగా పలవరిస్తున్న కవి .

అబ్బురంలాంటి కవి. అబ్బురపరిచే కవి.

అమృతం తాగి జరామరణాల్ని జయించినట్లు, కవిత్వం తాగి శాశ్వతమైపోతున్న కవి .

తానే ఒక మార్గంగా ‘మనసుపై తడిఅరని ఓ సంతకం’లా మారిపోతున్న కవి.

సమస్తాన్నీ అక్షరాలకు అప్పగించి అంతర్జాతీయస్వరమై ఎదిగి ,ఒదిగిఉన్న కవి.

తడి తడి పదాల్తో తడిచిముద్దయిపోతున్న కవి.

పత్రహరితపు గుణమేదో ఒంటపట్టించుకుని

సతత హరితాక్షర అరణ్యంలా ఆకుపచ్చని పాటల్ని పాడుకుంటున్న కవి.

ఇతడేనేమో ఆ అల్లల్లాడుతున్న కొమ్మ !

ఇతడేనేమో ఆ అంతరాంతర జ్యోతిసీమలు రూపుకట్ట్టిన కవిత్వం !

లోపలి సెగ పదాలకంటితే ఇతని కవిత్వం .

కన్నీరింకే సమయాలల్లో కరుగుతున్న చెమ్మ ఇతని కవిత్వం.

రాత్రి తన తనాన్ని మరిచి ,కలలోకి జారుకుంటున్నట్లు

ఒక పురాస్మృతిలా ఇతని కవిత్వం మరో ఆకాశంలోకి తెరుచుకుంటుంది.

ఉరికే మబ్బుల్ని అందుకునే సముద్రం తనతో తాను

సంభాషించుకునే సన్నివేశంలా ఉంటుంది ఇతని కవిత్వం.

కవిత్వంఎదుట వినమ్రంగా మోకరిల్లిన బాలుడు

పలుకుతున్న స్వచ్చమైన మాటల్లా ఉంటుంది ఇతని కవిత్వం .

కొన్ని పిడికిళ్ళు,కొంత ప్రేమ,మరికొన్ని బతుకుకొమ్మకు పూసిన పూలు

దోసిట్లోకి తీసుకున్నట్లుగా ఉంటుంది ఇతని కవిత్వం.

మెలకువలోంచి మెలకువలోకి

జీవితంలోంచి జీవితంలోకి

ఇవాళ్టినుంచి రేపటిలోకి

మంద్రంగా సాగుతూ,వినిపిస్తున్న నిసర్గ తంత్రీనాదంలా ఉంటుంది ఇతని కవిత్వం.

నిజమే !

ఇతడు కవిత్వాన్ని సహజకవచంగా ధరించాడు.

కాలాన్ని కవిత్వవస్త్రంగా కప్పుకున్నాడు.

ఇతని కవిత్వం బతుకుపలవరింతకు నిఘంటువు ;

అక్షరాన్ని పలుమార్లు దిద్దుకునే పలక పరవశం.

ఇప్పుడిక యితడు వొంటరి కానేకాడు

‘ఆకుపాట’ ఇతడి వెంటే నడుస్తుంది.

భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు
ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి తో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటి నుండి తప్పించుకోలేక పోతున్నారు.

అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. అంటే సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్ధం ఇందులో ధ్యనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ విధంగా స్త్రీల వ్యక్తిగత మరియు సామాజిక స్వాతంత్ర్యాలను, సంస్కృతీ పరిరక్షణ పేరుతో వీరు తిరస్కరిస్తారు.

ప్రగతి కాముకులు అత్యాచారాలకు కారణాలను వస్త్రధారణలో కాకుండా వ్యవస్థలో చూడాలని కోరుతారు. సమాజంలో వస్త్రధారణ ప్రత్యేకమైన విడి అస్తిత్వం కలిగి ఉండే విషయం కాదని, వ్యవస్థను నడిపే ఆర్ధిక పునాదులు సంస్కృతిని శాసిస్తాయనీ, అలాంటి సంస్కృతిలో ఒకానొక భాగమే వస్త్రధారణ అని వారి వివరణ. వీరు కూడ సాంస్కృతిక పరాయీకరణ జరుగుతోందని అంగీకరిస్తూ దేశ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదన, సంస్కృతుల ఆధిపత్యాన్ని తిరస్కరించే ధోరణి తో ఉంటుంది.

ప్రగతి కాముకులు వస్త్రధారణను, అత్యాచారాలకు కారణంగా అంగీకరించరు. ఎందుకంటే, అనేక సందర్భాలలో అత్యాచారం; అధికారం, ఆధిపత్యాలకు వ్యక్తీకరణగా ఉంటుంది. పశ్చిమ దేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడ కంటే విషసంస్కృతి విసృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ. భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న పితృసామ్యం, కరడు కట్టిన పురుషాధిక్యత ఈ అత్యాచారాలకు ప్రధాన కారకాలని వీరు అంటారు.

సంప్రదాయ వాదుల్లోనూ, ప్రగతి కాముకుల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం సాంస్కృతిక పరాయీకరణ పట్ల వ్యతిరేకత. కానీ వారికి ఉన్న కారణాలు వేరు వేరు. సంప్రదాయవాదులు తెలిసి చేసినా, తెలియక చేసినా నశించి పోతున్న, నశించవలసిన పాత విలువలను పట్టుకుని వేళ్ళాడుతూ అందులో భాగంగా సాంప్రదాయక వస్త్రధారణను కాపాడుకోవాలని భావిస్తారు. ఇందులో మనదైనది అంతా గొప్పే అనీ, పరాయిది అంతా చెడ్డదేననే ఒక తప్పుడు అవగాహన వ్యక్తం అవుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం, పశ్చిమ దేశాల పౌరసత్వాల కోసం, ఫారెన్ అల్లుళ్ళ కోసం పరితపించే వారే సంస్కృతి పరాయీకరణ పట్ల గుండెలు బాదుకోవడం తరచుగా కనిపిస్తుంది. వీరికి డాలర్లు కావాలి, కానీ డాలర్ల వెంట వచ్చే సంస్కృతీ విలువలు వద్దు.

ఈ విషయం లోతు ‘సంస్కృతి ‘ అనే పదాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది. సంస్కృతులు అనేవి యధాతధంగా వాటి స్థానంలో అవి ఉన్నపుడు ఒకటి గొప్పా కాదు, మరొకటి చెడ్డా కాదు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. ప్రజల సర్వతోముఖ అభివృద్ధితో ముడిపడి ఉన్నంతవరకు ఏ సంస్కృతి అయినా గొప్పదే. కానీ వచ్చిన చిక్కంతా చరిత్ర ఎక్కడి సంస్కృతిని అక్కడే ఉంచలేదు. వ్యాపార వాణిజ్యాలతో పాటు, పాత వలస పాలన, ఆధునిక సామ్రాజ్యవాద దోపిడి లాంటి ఆర్ధిక ఆధిపత్య కార్యకలాపాలు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవటానికి, సంభాషించుకోవటానికి, సమ్మిళితం కావడానికి దారి తీసింది. అంతే కాక సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి దారి తీసింది.

వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాలు గతంలో పాటించేవారు. దుస్తులు చలి, వేడిల నుండి శరీరాన్ని కాపాడటానికి అనే ప్రాచీనయుగాల నుండి, నాగరికత అభివృద్ధిలో భాగంగా అనేక రూపాలు తీసుకొంటూ ఒక దశలో పరిణితి రూపం తీసుకొంది. అన్ని వర్గాల పిల్లలను ఒకటిగా కలపగల ‘యూనిఫామ్ ‘ కల్చర్ లాగా, అన్ని రకాల శరీరాకృతి గలిగిన మనుషుల పొడవు, లావు, కండలు, ఎముకలు కప్పిపెట్టే ఒక విశ్వజనీన సాధనంగా దుస్తులు ఒకప్పుడు ఉండేవి. మళ్ళీ స్త్రీ, పురుషులకు వాళ్ళ అవసరాల రీత్య వేరు వేరు వస్త్రధారణ ఉండేది. ఇందులో ఆనాటి వ్యవస్థల ప్రభావం కూడ ఉండేది. కాల క్రమేణ సాంస్కృతిక సామ్యాజ్యవాద ప్రభావంతో భారతదేశంలో అత్యధిక శాతం పురుషుల దుస్తులు పాశ్చాత్స ప్రభావానికి గురయ్యాయి. అయితే స్త్రీల దుస్తులు 80 శాతం ఇంకా స్థానికతను కోల్పోలేదు. కాలక్రమేణ స్త్రీల క్రియాశీలక పాత్ర అన్ని రంగాలలో పెరగటం వారి వస్త్రధారణలో మార్పులకు దారి తీసింది.

ఆరడుగుల చీరల నుండి కురచ తక్కువ చీరలలోకి, తరువాత దక్షిణ భారతదేశ స్త్రీలు ఉత్తర భారతదేశ దుస్తులైన పంజాబీ డ్రెస్, చూడీదార్, షల్వార్ కమీజ్ వగైరాలలోకి మారిపోయారు. ఇందులో ఫాషన్ తో బాటు, సౌకర్యం కూడ పని చేసింది. ఇప్పుడు దక్షిణ భారతంలో కూలీ కెళ్ళే మహిళలు కూడ పంజాబీడ్రెస్ లోకి మారటం గమనించగలము. నగర ప్రాంత మహిళలు పాంటు, షర్ట్ లలోకి మారారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో సేల్స్ గర్ల్స్ కూడ జీన్స్ పాంటులు ధరిస్తారు.

వేషధారణలో ఈ మధ్య వచ్చిన ఫాషన్ లో అంతర్లీనంగా కనిపించేది, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి ఆకర్షణ కోసం తమను తాము వ్యక్తీకరించుకునే చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వ్యక్తిత్వ సౌందర్యంతో కాకుండా శారీరక సౌందర్యంతో ఆకర్షించుకునే ప్రయత్నం ఏ దేశంలోనైనా సహజమే అయినా పశ్చిమ దేశాల్లో అది విపరీత పోకడలకు పోయింది. పోర్న్ మాఫియా అభివృద్ది చెంది, వివిధ ఆర్ధిక కార్యకలాపాల్లో పై చేయి సాధించటానికి అదొక సాధనంగా అక్కడ అవతరించడం దానికొక కారణం కావచ్చు. ఇది స్త్రీ, పురుషుల ఆకర్షణకు సంబంధించిన డైనమిక్స్ పైన తీవ్ర ప్రభావం పడేసినట్లు కనిపిస్తోంది.

శారీరక సౌందర్య ఆకర్షణలో భాగంగా శరీర భాగాలను కూడా బహిర్గతపరుస్తూ ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించడమ్ పశ్చిమ దేశాల్లోనూ, కొన్ని లాటిన్ దేశాల్లోనూ ఒక ధోరణిగా ముందుకొచ్చింది. దుస్తులను రకరకాల షేపుల్లో కుట్టి ధరిస్తే అదొక ఫ్యాషన్ కావచ్చు. ఒకటికి రెండు, మూడు, లేదా ఐదారు దుస్తులు ఒకదానిపైన ఒకటి వేసుకొని లోచొక్కాలను బైటికి కనిపించేలా పై దుస్తులను కురచవి చేసుకొంటే అదొక ఫ్యాషన్ కావచ్చు. జుత్తుని రకరకాల షేపుల్లో కత్తిరించి ప్రదర్శించుకొంటే, పాతదైనా, లేటెస్టైనా, అదొక ఫ్యాషన్ కావచ్చు. కానీ శరీర భాగాల్ని చూపడం ఏమి ఫ్యాషన్? ఇక మనిషి దుస్తులను కనిపెట్టి ధరిస్తున్నదెందుకు? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు.

స్త్రీ, పురుషల మధ్య ఆకర్షణలో భాగంగా వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు పాశ్చాత్య దేశాల్లో ప్రముఖ ధోరణి అయ్యింది. సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో భాగంగా అది మన దేశానికి వచ్చింది. శాటిలైట్ల పుణ్యమాని విదేశి టి.వి., మ్యూజిక్ లు దేశాన్ని ముంచెత్తితే, అంతర్జాలం పుణ్యమాని పోర్నోగ్రఫీకి గట్లు తెగి మారుమూల గ్రామీణ యువకుడి జేబులోకి సైతం జొరబడింది. ధనిక వర్గాలు అలవర్చుకొన్న పాశ్చాత్య సంస్కృతి, ‘పాలకుల భావాలే, పాలితుల భావాలు’ కనుక కింది వర్గాల మీదికి దూకింది. ఇందులో భాగంగా స్త్రీ, పురుష బేధం లేకుండా సకల వర్గాలు పబ్ సంస్కృతులకు, శరీర భాగాలు చూపుకొనే రకం ఫ్యాషన్లకు లోనవుతున్నారు. దుస్తులు తయారుచేసే పరిశ్రమలు కూడ ఈ రకం దుస్తులను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడ ఒక పెట్టుబడిదారుడు కాబట్టి ఈ దుస్తుల కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి ఈ వస్త్ర సంస్కృతిని మనకు అంట కడుతున్నారు.

వాణిజ్య వ్యాపారాలు ప్రపంచానికి అవసరమే; కాని వ్యాపారం పేరుతో వచ్చే వలస పాలన, సామ్రాజ్యవాద దోపిడి అవసరం లేదు. సంస్కృతుల సంగమం అవసరమే; కానీ సాంస్కృతిక ఆధిపత్యం అవసరం లేదు.

పాత కొత్తల మధ్య సంఘర్షణ ఎప్పుడూ తప్పదు. సంఘర్షణ జరిగితేనే మెరుగైన అంశం బైటికి వచ్చి అభివృద్ది వైపుకి సమాజాన్నినడిపిస్తుంది. అలాగే ప్రపంచీకరణ యుగంలో స్థానికం, పరాయిల మధ్య సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణలోంచి పుట్టే మెరుగైన అంశాలను, అవి ఏవైపు నుండి వచ్చినా, స్వీకరించాల్సిందే.

డాలర్ వెంట వచ్చే సంస్కృతి మొత్తంగా చెడ్డది కాదు. ప్రతి సంస్కృతిలోనూ పాత, కొత్తలు; గొప్పలు, లోపాలు ఉంటాయి. వాటిలో మెరుగైన అంశాన్ని, ఆధునిక అంశాన్ని స్వీకరించి ప్రగతి నిరోధక చెడ్డ అంశాలను తిరస్కరించాలి. ఐతే: ఏది మంచిది, మెరుగైనది అనేది అలాగే ఏది ప్రగతి నిరోధకమైనదీ, చెడ్డదైనదీ అనేది ఎలా నిర్ణయించాలి అంటే ఒక్కటే దారి. ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావాలకు ఏది విలువ ఇస్తుందో అదే గొప్పది, అదే మెరుగైనది, అదే ఆధునికమైనది. కొత్తకు పునాది పాతే కనుక రెండింటిలోనూ ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావనలకు విలువ ఇచ్చేవి ఉంటాయి. వాటిని కాపాడుకుని ఆ విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించటమే నేటి మనిషి కర్తవ్యం. ఆ మాటకొస్తే ఏ కాలంలోనైనా, సంస్కృతి రీత్యా, మనిషికి కర్తవ్యం ఇదే. పాతలోంచి ‘మంచి ‘ని నిలుపుకొని కొత్తలోని అభివృద్ధిని ఆహ్వానించాలి.

భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఆధిపత్య వర్గాలకు విదేశీ డబ్బు కావాలి. కానీ దానితో వచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోకూడదు. ఆ ఆధిపత్యం అన్నీ రంగాల్లో కనబడుతుంది. పురుషులకైతే స్త్రీలు ఒద్దికగా ఉండాలి తప్ప కొత్త ఆర్ధిక వెసులుబాటు తెచ్చిన స్వేచ్చా స్వాతంత్రాలను వారు కోరుకోకూడదు. ధనికులకైతే పేదలు అణగిమణిగి ఉండాలి తప్ప సోకులు కోరుకోకూడదు. అగ్ర కులాలకైతే చిన్న కులాలు కష్టం చేసుకొని తొంగోవాలి తప్ప తన కష్టాన్ని నచ్చిన రీతిలో ఖర్చుచేసుకోగూడదు.

ఇందులో భాగమే స్త్రీల వస్త్రధారణపై ఆంక్షలు.

సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది ఆర్ధిక సామ్రాజ్యవాదం యొక్క అనివార్య ఫలితం. ఇందులో సామ్రాజ్య వాద దేశాల సంస్కృతి గొప్పదిగా చెప్పబడుతుంది. పశ్చిమ దేశాలే ఇప్పటి ఆధిపత్య సామ్రాజ్య వాద దేశాలు కనుక అక్కడి సంస్కృతి, ప్రజల వేష భాషలు, ఆ దేశాల్లోని వివిధ సామాజిక పాత్రల మధ్య ఉండే సామాజిక సంభందాలు… ఇవన్నీ గొప్పవిగా చెలామణిలో ఉన్నాయి. ఆర్ధిక, సాంస్కృతిక దురాక్రమణలో ఉన్న దేశాలలోని సంస్కృతులు తక్కువ రకం; ఇవి వెనకబడి ఉన్నాయి; ఇక్కడి కుటుంబ సంబంధాలు ప్రాచీనమైనవి; బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల మధ్య ఉండే సంబంధాలు ఇంకా అభివృద్ది చెందలేదు… ఇలాంటి వాదనలు, భావాలు- రూపాన్ని నెత్తికెత్తుకొని సారాన్ని తృణీకరించేవి. దీనిని దేశంలోని ధనిక వర్గాలు ఆనందంగా స్వీకరిస్తాయి, ఆచరిస్తాయి. పాలకుల భావాలే పాలితుల భావాలుగా చెలామణి అవుతాయి గనుక కింది వర్గాలు కూడ వారిని అనుకరిస్తాయి. ఆ విధంగా దేశీయ సంస్కృతిని, దిగుమతి చేసుకొన్న పాశ్చాత్య సంస్కృతి ఆక్రమిస్తుంది.

అయితే, ఆధిపత్య వర్గాలకు దేశీయ సంస్కృతి కూడా కావాలి. దేశీయ సంస్కృతిలో కింది వర్గాలను -స్త్రిలు, కార్మికులు, రైతులు, కింది కులాలు మొ.- కట్టి పడేసే సాధనాలుగా ఉన్నాయి. కనుక అవి వారికి కావాలి. కానీ దేశీయ సంస్కృతిలోని ప్రగతి కాముకమైనవి, స్థానిక అస్థిత్వాన్ని కాపాడేవి మాత్రం వారికి వద్దు, అవి కింద వర్గాలను ఐక్యం చేస్తాయి కనుక.

అంటే తాగి తందనాలాడి లిక్కర్ మాఫియాను పోషించేందుకు పబ్ లు కావాలి. కానీ అందులోకి స్త్రీలు రాకూడదు. రేసు గుర్రాలు, వాటిపై కాసే పందేలు కావాలి. కాని సంక్రాంతి పండగలో భాగమైన కోడి పుంజు పోటీలు నేరం. ఫ్యాంటు, షర్టు; సూటు, బూటు; షార్ట్ లు, జీన్స్ కావాలి. వాటితో బాటు వచ్చే మిడ్డీలు, చడ్డీలు, లేడి జీన్స్, లేడీ టీషర్ట్ లు వద్దు. ఇది వివక్ష తప్ప మరొకటి కాదు.

దేశీయ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి వీలుగా పాశ్చాత్య సంస్కృతుల్లోని అవాంఛనీయ ధోరణులను అడ్డుకోవాలంటే మొదటి దేనిని అడ్డుకోవాలి? ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్యవాదాన్ని మొదట అడ్డుకోవాలి. దేశ వనరులు దేశ ప్రజలకు దక్కేలా కాపాడుకోవాలి. దేశ వనరుల నుండి పుట్టిన వస్తువులు, డబ్బులు దేశ ప్రజల పరం కావాలి. ఆ విధంగా ధన, వస్తు సంపదలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ అయినపుడు వాటిని అంటిపెట్టుకొని ఉండే సాంస్కృతిక, సామాజిక భావాలు, అలవాట్లు కూడా ప్రజాసామ్య పద్దతులకు లోబడి తమదైన స్వంత అభివృద్ధి బాటపైన పరుగులు పెడతాయి. అది జరిగినపుడు స్త్రీ, పురుష వస్త్రధారణ, దాని పరిణామం ఏ పరిమితుల్లో ఉండాలో ఆ పరిమితుల్లోనే ఉంటుంది. ప్రజాస్వామిక వాతావరణం ఉన్నపుడు సంస్కృతీ పరిరక్షణ భారం ఒక్క స్త్రీలపై మోపడమే విచిత్రంగా, అవాంఛనీయంగా మారుతుంది.

సినిమాల గురించి కొన్ని పిల్ల ఆలోచనలు
(త్వరలో రాబోతున్న ‘పలక పెన్సిల్’ పుస్తకం నుంచి.)

ఒక పిల్లవాడి ఊహా శక్తి ఎలా ఉంటుంది! బహుశా, నాకు నేనే విడివడి గమనించుకుంటే, ఇలా ఆలోచిస్తారా పిల్లలు అనిపిస్తుంది.

కొత్తగా అక్షరాలు నేర్చుకునేటప్పుడు, కనబడే ప్రతి కాగితమూ చదువుతాం. సినిమా పోస్టర్ల లో కింద నిర్మాత, దర్శకుల పేర్లు విధిగా చదువుతుండే వాణ్ణి. అయితే, పైన బొమ్మలో ఉన్న మనుషుల పేర్లే కింద వేస్తారనుకునేవాణ్ణి. . అయితే,. ఈ తర్కాన్ని రెండు పోస్టర్లు దెబ్బ కొట్టాయి.

‘కిరాతకుడు’ టైటిల్ కింద ఎ. కోదండ రామి రెడ్డి అని ఉంది.. అయితే, అప్పటికి నాకు తెలిసిన ఏకైక హీరో చిరంజీవి. మరి పేరు ఇలా ఎందుకుంది.? ఓహో, ఈ సినిమాలో చిరంజీవి పేరు కోదండ రామిరెడ్డి కావచ్చు. అని సర్ది చెప్పుకున్నా.

ఇక రెండో పోస్టరు ‘తెలియదు’, అందులో పైన మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి. కింద రెండు పేర్లే ఉన్నాయి. ఈయన రామోజీరావు. ‘ఈమె’ మౌళి. మరి ఈ మూడో మనిషి ఎవరు?

అంటే, నేను ఆలోచిస్తున్న దాంట్లో ఏదో తేడా ఉంది. పేర్లు ఇలా వేయట్లేదు. దీనికి ఇంకో పద్దతి ఏదో ఉందని నిశ్చయమైంది. (చాలా ఏళ్ళు ఈ రెండో పోస్టరు ప్రతి ఘటన అనుకున్నా. కానీ దీనికి దర్శకుడు టి. కృష్ణ. నేను చదివిందేమో మౌళి. అంటే నా జ్ఞాపకాలు కలగా పులగం అయిపోయాయి.)

సినిమా పాటలు ఇక అయిపోతాయేమో, అనే ఒక వినూత్న అందోళన ఉండేది నాకు. అదేదో కొండ కరిగిపోతుందన్నట్టుగా బాధపడే వాణ్ణి. సినిమాకు ఆరు పాటలుండటం సమంజసం. ఎవరైనా మా సినిమాలో ఎనిమిది పాటలున్నా యంటే, నాకు కోపమొచ్చేది. అనవసరంగా రెండు పాటలు వృధా చేస్తున్నారనుకునే వాణ్ణి.

అన్నీ యాక్టర్ల కే తెలుసు కదా, మరి డైరెక్టరెందుకు అనుకునేవాణ్ణి. వాళ్ళే అటూ ఇటూ నడుస్తారు. డైలాగ్లు చెబుతారు. అన్నీ వాళ్లకు వాళ్ళు నిర్ణయించు కుంటారు. అలాంటప్పుడు ఈ దర్శకుని పాత్ర ఏమిటో ఎంతకీ అంతు పట్టేది కాదు.

ఎన్ని డబ్బులున్నా, ఒకే డ్రెస్సు వేసుకోవడం, ఒకే వాచీ పెట్టుకోవడం ఏంటీ అనిపించేది. రెండున్నర దశాబ్దాల క్రితం మా ఊరి మర్రి చెట్టే ఒక్కోసారి సినిమా హాల్ మాకు. ఆ ఓపెన్ థియేటర్లో సినిమా ప్రారంభం కాక ముందు, ఏదో ‘అవార్డు ఫంక్షన్’ తాలూకు క్లిప్పింగ్ వేసారు. ఇందులో నాకు గుర్తున్న ఒకే ఒక్క దృశ్యం, అర్జున్ వైట్ షర్టు, బ్లూ జీన్స్ (అది జీన్సు అని నాకు అప్పటికే ఎలా తెలుసో!) వేసుకుని, ఏదో అందుకున్నాడు. అరె, సినిమా నటులంటే ఇలాగే ఉంటారా? ఇన్ని డబ్బులున్న వాళ్ళు ఒకే ప్యాంటు వేసుకోవాల్సిందేనా? అని ఆలోచించాను. ఒక దాని మీద ఒకటి రెండు మూడు ప్యాంట్లు, రెండు మూడు అంగీలు, రెండు చేతులకూ మోచేయి దాకా వచ్చేన్ని వాచీలు, నాలుగైదు గొలుసులు….ఇలా ఉంటారనుకున్న/ఉండాలనుకున్న నా ఊహేదో చెదిరి పోయింది.

హీరో హీరోయిన్లు నిజంగా ఒకరినొకరు తాకరట. మధ్యలో అడ్డు లుంటాయట., వాళ్ళను వేరే , వీళ్ళను వేరే షూటింగ్ తీసి, దగ్గరగా ఉన్నట్టు కలుపుతారట. అని ఒకటే వాదనలు జరిగేవి. ఒకవేళ తాకే పరిస్థితే వస్తే, హీరోలకు ఉద్రేకం కలగకుండా దానికి ఇంజెక్షన్ వేస్తారుట అని చెప్పుకునే వాళ్ల్లం. ఉద్రేకం స్థానం లో తేలికైన చక్కటి తెలుగు మాటను వాడేవాళ్ళం. దాన్నిక్కడ రాయలేకపోతున్నా, ఖర్మ.

నేను ఆరో క్లాసుకి మామయ్య వాళ్ళింటికి మేడ్చల్ రావడం వల్ల, అప్పుడే కొత్త కొత్తగా టీవీ తెలుసు. ఎదురుగా ఉండే సలీం వాళ్ళింట్లో టివి ఉండేది. ‘చిత్రలహరి’కి వాళ్ళింటికి వెళ్ళడానికి మామయ్య అనుమతించే వాడు. అయితే, నాకో పెద్ద ధర్ సందేహం ఉండేది. ఎవరో ఆ సమయానికి చిరంజీవిలాగానో, ఇంకెవరిలాగానో వేషం వేసుకొచ్చి టీవీ లో డ్యాన్స్ చేసి వెళ్లి పోతారనుకునే వాణ్ణి. ఇంత సరిగ్గా, వాళ్ళ లాగే వేరే మనుషులు ఎలా చేస్తారబ్బా అనుకునే వాణ్ని.

ఎనిమిది, తొమ్మిది క్లాసుల్లో, హైదరాబాద్, సికింద్రాబాద్ లోని థియేటర్స్ లో చాలా సినిమాలు 1.50 టికెట్ కు చూసాను. పైసలు కొన్ని మిగుల్చుకుందామని కొంతా, మన దగ్గర ఉండేవి అంతకే రావడం కొంతా… దీనికి కారణాలు. అయితే, నేల క్లాసు వాళ్లకు ఎప్పుడూ ముందు టికెట్స్ ఇవ్వరు. బాల్కనీ, డీలక్స్ అన్నీ అయిపోయాక, ఇక సినిమా స్టార్ట్ అవుతోందనగా మొదలు పెట్టేవాళ్ళు. నాకు తాపీగా వెళ్లి , న్యూస్ రీల్ నుంచి చూస్తే తప్ప సినిమా చూసినట్టుండదు. నేనే గనక భవిష్యత్ లో ధియేటర్ కడితే, బుకింగ్ రివర్స్ ఆర్డర్ లో ఇప్పిస్తాను, అనుకునేవాణ్ణి.

అనుపమ్ ఖేర్ నన్ను ఎన్ని చీకటి రాత్రులు భయపెట్టాడో! ‘నిగాహే’ ఎఫెక్ట్! నేను చూసిన మొట్టమొదటి హిందీ సినిమా. దెయ్యాలూ, ఈవిల్ డెడ్లూ, ఇంకా ఇటీవలి ఎర్ర గులాబీలు మీనాక్షమ్మలు కూడా అప్పుడప్పుడూ కిటికీ లోంచి నా కోసం చేయి సాచుతూనే ఉంటాయి.

హిందీ మాట్లాడే వాళ్ళంతా ముస్లింలేనేమో అనుకునేవాణ్ణి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని హిందీలో మాట్లాడే ఆడవాళ్ళను చూసినప్పుడు, ‘అరె, వీళ్ళు ఇల్లా ఉన్నారేమిటి? ఇలా మాట్లాడుతున్నారేమిటి?’ అనుకునేవాణ్ణి.

సినిమాకు సంబంధించి నా బాల్యంలో ఎక్కువ వాటా ఆక్రమించింది చిరంజీవి. ఐదో క్లాసులో మా కుటుంబం అంతా వేములవాడ గుడికి వెళ్ళాం. అమ్మ, బాపు, చెల్లి, తమ్ముడు, మా అక్క, అక్కంటే పెద్దమ్మ కూతురు. అంతా అయ్యాక, సినిమా చూద్దామా ? ఫోటో దిగుదామా? అని ధర్మసందేహంలో పెట్టాడు బాపు. ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. వేములవాడలో ఉన్న మూడు థియేటర్స్ లో, ‘శివరామకృష్ణ’లో అనుకుంటా, మగధీరుడు ఆడుతోంది. నేనూ, తమ్ముడూ ఉత్సాహంగా సినిమా అన్నాం. అమ్మాయిలిద్దరూ ఫోటో దిగుదామన్నారు. చూడండి. వాళ్ళది ఎంత ప్రణాలిళికా బద్దమైన, కాలానికి నిలబడగలిగే ఆలోచన! అయితే, ఆ రోజు అటు ఫోటో దిగామూ, ఇటు సినిమా కూడా చూసామూ. నా (మా) చిన్నతనం లో దిగిన మొదటి, ఏకైక ఫోటో అదే. మేం పిల్లలం నలుగురం ఉంటాం అందులో. ఆ ఫోటో చూస్తే, మగధీరుడు గుర్తొస్తుంది. చిరంజీవి గుర్తొస్తాడు.

చిరంజీవి మీద పీక్ అభిమానం ఎప్పుడంటే, ముగ్గురు మొనగాళ్ళు స్టేజ్ లో. ఆ సినిమా ఇంకా విడుదల కావట్లేదేంటబ్బా, ఒకవేళ ఇంటర్వెల్ వరకు గనక షూటింగ్ అయివుంటే, అంతవరకు విడుదల చేసేస్తే అయిపోతుంది కదా! అనుకునే వాణ్ని. ఇప్పుడు ఆ అభిమానాలన్నీ ఎక్కడ కరిగి, ఎలా అవిరైపోయయో!

అప్పటి అభిమానం సత్యమా? ఇప్పటి తటస్థత సత్యమా?

చనిపోవడమంటే?
నా గతం తో ముడిపడిన విషయాల్లో చావు కూడా ముఖ్య పాత్ర వహించింది..

నా చిన్నప్పుడు అందరిల్లలో ఎప్పుడో ఒకసారైన శుభకార్యానికి సన్నాయి మేళం మొగుతుండేది. కాని మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పే.. మా బాపుని మా బాపమ్మ తాతయ్య దత్తత తీసుకున్నారు మా తాత వాళ్ళ అన్న దగ్గరినుండి.

ఆ రకంగా మా బాపు తరపున నాకు ఇద్దరు తాతయ్యలు ఇద్దరు బాపమ్మలు ఎం జరిగిందో ఏమో నాకు ఊహ వచ్చే సరికి మేము బాపు పుట్టిన ఇంట్లో ఉన్నాం..

ఇక మా బాపమ్మకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమంటే డబ్బా నిండా కిరోసిన ఒంటి పై పోసి కాల్చే అంత.. బిక్కు బిక్కు మంటూ గుడ్లు తెలేయడం తప్ప ఏమి చేయలేను. అమ్మ నన్ను తన వెనకాల దాచుకునేది. అన్నయ అక్కయ స్కూల్ కి వెళ్ళే వారు. బాపు పొద్దున్నే పనికి బోయేటోడు. ఇక బాపమ్మ కి అమ్మంటే ఎందుకంత కసియో నాకు తెలీదు. పొయ్యి దగ్గర ఏడుస్తూ వంట చేయడం తప్ప ఎప్పుడు ఎదురు మాట్లాడినట్టు నేను ఎరగను.. తన తీరు తెన్నులు దినదినాబివ్రుద్ది చెందుతూ రోజుకోరకమైన హింస పెట్టేది. ఇవన్ని భరించడమే తప్ప ఏ రోజు బాపుకి కాని వేరే ఎవ్వరికి గాని చెప్పేది కాదు..

రోజు అవుతున్న గొడవలు చూడలేక ఆ గల్లిలో ఉండే ఓ తాత ఆయన్ని మా బాపు చిన్న నాయన అని పిలిచెటోడు. ఓ రోజు అర్ధ రాత్రి పనికిబోయి వస్తుంటే ఇంట్లోకి పిలిపించి. ఏరా మొగిలి ఇక్కడెందుకుంటున్నావ్ రా నిన్ను దత్తత తీసుకున్న అవ్వ అయ్యలు ఎం పాపం చేసారురా ఇల్లు లేదా ముంగిలి లేదా నీ కన్నోల్లని చూసుకోడానికి మీ అన్న గాడు లేడా!! వాల్లనెవరు చూసుకుంటారు రా.. పాపం ఆ పొల్లని సూస్తే సయిస్తలేదు రోజు రోజుకి దానికి నరకం జూపిస్తాంది మీ అవ్వ ఇయ్యాల గ్యాసు నూనె ఒంటి మీద బోసింది దబ్బున మేము అందుకునే సరికి సరిపోయింది కాని ఇయ్యాల ఆ పొల్ల పాణం పోయేటిదే.. ఆ పొల్ల కి ఏమన్నైతే నీ పిల్లల గతేంది. నువ్వా తాగుబోతు గానివి.. ఇగోరా నీ మంచి కోరి జెప్తున్న. సక్కగా ఆ ఇంటికి బో.. అని..

ఆ రోజు నాకింకా గుర్తు పొద్దున్న పుట్టిన భయం ధాటికి నిద్ర నా దగ్గరికి రావట్లేదు. రోజు లాగే అమ్మ బాపుకు అన్నం పెట్టి పక్కన కూచుంది. ఏమైంది గట్లున్నావ్ అని అడిగాడు. నాకేమైంది మంచిగనే ఉన్న అంటూ కొంగు బుజం మీద కప్పుకుంది. రేపు మనం ఆ ఇంటికి పోతున్నాం పిలగాండ్లని స్కూల్ కు పంపకు. ఇక ఆన్నే ఉందాం.. అని చెప్తున్న బాపు కళ్ళలోని నీటి తెర దీపం వెలుగులో ఇంకా కనపడుతూనే ఉంది.

తెల్లగా తెలవారింది. నేను లేచే సరికి బాపు పనికి బోలె, అన్నయ అక్కయ కూడా స్కూల్ కి బోలె.. అందరు కలిసి సామాను మూట గడుతున్నారు. అన్నయ్య నులక మంచం ఎత్తి సిద్ధమయ్యాడు. అక్కయ కట్టెల సంచిలో కొన్ని బోళ్ళు పెట్టి పట్టుకుంది. బాపు పెద్ద సైకిల్ కి పెద్ద మూట కట్టుకున్నాడు. అప్పుడే లేచిన నేను ఒంటి మీద పడ్డ నిమ్మ పూతని దులుపుకొని ఓ సారి నిమ్మ చెట్టుకేసి చూసా.. ఆ చెట్టు లాగే అమ్మకి సహనం ఎక్కువ. అన్ని సర్దుకొని బయటికొస్తుంటే బాపుని పట్టుకొని వెల్లకని బాపమ్మ ఏడుస్తోంది. నేనేడికి బోతున్ననే ఆ ఇంటికేగా.. అదేమో దూరం ఉన్నట్టు చేస్తున్నావ్ పది ఇండ్ల దూరమే గాధవ్వా.. అనుకుంటూ బయల్దేరాం నిజమే కరక్టుగా లెక్క బెడితే ఐదిండ్లు దాటంగానే వచ్చింది ఆ ఇల్లు.. ముందుగానే మా అన్న చెప్పినట్టున్నాడు ఆ బాపమ్మ కి ఇంటి బయటనే నిల్చొని చూస్తోంది. అల చేరుకున్నామో లేదో.. మా బాపుని దగ్గరికి తీసుకొని ఇంత కాలానికి ఈ అవ్వ గుర్తోచ్చిందారా అంటూ దగ్గరికి తీసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. లోపలికి అడుగుపెడుతుండగా..నన్ను తన చంకనెత్తుకుంది. నాకు ఊహ మోదలైంది అప్పటి నుండే కావచ్చు తనని మొదటి సారి చూస్తున్నట్టుగా అనిపించింది. అంతకు ముందు మేము ఈ ఇంట్లోనే ఉండే వాళ్ళమంటా నాకెంతకి గుర్తు రాలేదు. ఏవి గుర్తు రాకపోవడం గురించి ఆలోచిస్తుంటే బహుశా నా బాల్యం ఆ క్షణం నుండే మొదలయ్యిందేమో.. ఈ బాపమ్మ మా అమ్మని ముద్దుగా సరోజనవ్వ అని పిలిచేది.

ఈ ఇంటికి మారాక అమ్మకి కాస్త ఊరట లబించింది. నన్ను కూడా స్కూల్ కి పంపడం మొదలు పెట్టింది. నేను రెండో తరగతి లో ఉన్నాననుకుంటా మా పెద్ద బాపమ్మ ఇంటికొచ్చింది ఏ మాత్రం కోపం గాని ఎలాంటి అసహనం ప్రదర్శించ కుండానే ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేసింది మా అమ్మా.. మా అన్న మాత్రం గట్టిగానే తిట్టాడు ఎందుకోచ్చినావ్ అని. అమ్మ కల్పించుకొని తప్పు అలా మాట్లాడొద్దని అన్నయ్యని బెదిరించింది. ఇద్దరు బాపమ్మలు కాసేపు మాట్లాడుకొని పోయ్యోస్తవ్వా.. అనుకుంటూ వెళ్తూ వెళ్తూ నా చేతిల ఆటాన బిళ్ళ పెట్టి వెళ్ళింది.

చీకటి పడింది అమ్మ బుజంపై తలపెట్టి కడుపు మీద చెయ్యేసి పడుకున్న. అమ్మ నను దగ్గరికని తీసుకొని అట్ట తో విసురుతోంది.”అమ్మ.. ఆ బాపమ్మ ని ఎందుకు తిట్టలేదు నువ్వు” అని అడిగా. తప్పొప్పులు లెక్క లేస్తూ పైన దేవుడు రాసుకుంటూ ఉంటాడు. పాపం జేసినోల్లందరు ఏదో ఓ రోజు ఆళ్ళ పాపం తెలుసుకుంటారు. ఆల్లు తప్పు చేసారని మనం తప్పు చేస్తే ఇగ దేవునికేం పనుంటది. అమ్మ చెప్తోందంటే నిజమే అయ్యుంటది నిజంగానే దేవుడు అందరు లెక్కలు చూస్తున్నాడేమో.

కాలం తన పని తాను చేసుకుంటూ దొర్లుకుంటూ పోతున్న రోజుల్లో మా పెద్ద బాపమ్మ మళ్లీ వచ్చింది. మా అన్నయ నులక మంచం వేసాడు దాని మీద అమ్మ చేద్దరేసి కూచో అత్తా అని కుచోబెట్టింది అమ్మ కింద కుచున్నది బాపమ్మ పక్కన మంచం మీద నన్ను కూచోబెట్టుకున్నది. అన్నయ్య అక్కయ్య అటు పక్కన కూర్చున్నారు. నన్ను ముద్దు చేస్తూ మా చిన్న నాయన కూడా బడికి బోతాండ మా నాయనే.. అంటూ అప్పుడప్పుడే వచ్చిన కొత్త ఆటాన బిళ్ళ ఒకటి చేతిలో బెట్టింది. మంచిగ సదుకొవాలా.. పిల్లల్ని మంచిగా జూసుకో అవ్వ అంటూ మా అమ్మకి చెప్తూ ఉన్న పలానా మంచం లో వెనక్కి వాలింది. నవ్వుతూ మా అమ్మతో బిడ్డ నేను పురుగుల మందు దాగిన ఇగ సచ్చిపోతా కొడుకుని బిడ్డల్ని జాగ్రత్త గ జూసుకో అని చెప్తుండగా నోట్లో నుండి నురగలు వస్తున్నాయి బాపమ్మ కొద్ది సేపు కడుపును ఒత్తుకొని ఒత్తుకొని ఆగి పోయింది. మా అమ్మ బయటికొచ్చి అరుస్తూ అరుస్తూ ఇంటి చుట్టూ పక్కలోల్ల అందరిని పిలిచింది. మా ఇంట్లో ఎప్పుడు చూడనంత మంది గుమి గూడారు రిక్షాలో గాంధీ ధవఖనకి తీసుకెళ్ళారు. గ్యాసు మొద్దు పెట్టి ముక్కులకి పైపులు తొడిగి ఏమో చేసిండ్లు లాబం లేదు చచ్చిపోయింది ఇగ ఇంటికి తీసుకుబొమ్మన్నారు.

మా బాపుకు మా బాపుకన్న ముందు ఇంకో ఇద్దరక్కలు ఒక అన్న ఉన్నారు. మా బాపు వాళ్ళ అన్నకి నా ఐదో తరగతిలో అయ్యింది పెళ్లి. నాకు పాతికేల్లోచ్చిన కూడా తానేంటో ఇంకా అర్ధం కాలేదు. నా దగ్గర ఒక్క రూపాయి లేదు అది చస్తే నాకేంది అని మాట్లాడాడు..

మళ్ళీ మా బాపుకి బుద్ది చెప్పిన ఆ తాతే పైసలిస్తే శవాన్ని సాగనంపే పనులు మొదలైనయ్.. ఎన్నడు చూడని జనాలు మా ఇంట్లో మా ఇంటి చుట్టూ గుమి గూడారు. బాపమ్మని పాడే మీద పడుకోబెట్టారు. చావు డప్పు మోగడం మొదలయ్యింది ఆ శబ్దానికి నా గుండె భయం భయంతో వణికింది. చుట్టూ ఒకటే ఏడుపులు ఒక్కసారిగా మూకుమ్మడిగా నన్ను మధ్యలో కూర్చోబెట్టి నా చుట్టూ అందరు కావాలని చేరి బయపెడుతున్నట్టుగా అనిపించింది ఆ వాతావరణం. చావంటే ఇదేనెమో శవం ముందు గుడంబా తాగి మైకంతో పిచ్చిగా ఎగురుతున్నారు.. నా చేయిని ఎవరో దొరక బుచ్చుకొని ఆ గుంపులో నడిపించుకు పోతున్నారు. ఎంత తలెత్తి చూసిన మోసుకేల్తున్న శవం నాకు కనిపించట్లేదు నా ముందు వెనకా నా చుట్టూ అంత జనం వీధి అంత కిక్కిరుసుకుంది కొద్ది సేపటి తరువాత అందరు ఆగిపోయారు నేను అమ్మ బాపు అన్నయ అక్కయ కోసం వెతుకుతూ జనాలను తోసుకుంటూ ముందుకు నడిచా అక్కయ కనిపించింది మా చిన్నమ్మను పట్టుకొని. బాపు పొగలు కక్కుతున్న కుండ ని పట్టుకొని మెడలో దండ వేసుకొని ఉన్నాడు. బాపు పక్కనే అన్నయ్య. నాలుగు పక్కల పట్టుకున్న వారు నెమ్మదిగా మూడు బాటల కాడ దింపారు. ముందు బాపు వెళ్లి పాడే మీద పడుకున్న బాపమ్మ చెవిలో ఏదో మాట్లాడి వచ్చాడు. వరుసగా ఒకరి తరువాత ఒకరు వెళ్లి వస్తున్నారు. నా చూపులు మాత్రం అమ్మని వెతుకుతున్నాయి అమ్మ మా ఇంకో బాపమ్మ తో ఉంది. చాల సేపటినుండి ఎడుస్తున్నట్టుంది కావచ్చు మొహమంత పూర్తిగా వాలిపోయింది. అమ్మ కూడా వెళ్లి చాల సేపు చెవిలో ఏదో చెప్తూ ఏడ్చుకుంటూ తనని పట్టుకుంది. అందరు దూరం జరిపి పాడే ఎత్తారు. స్మశానం లో కట్టెల మీద పడుకోబెట్టారు కొద్ది కొద్దిగా అంటుకొని కాసేపటికి పెద్ద మంటలో తానేక్కడ ఉందో కనపడలేనంతగా కలిసిపోయింది.

చనిపోవడమంటే ఇదేనెమో అనుకుంటూ అందరం కలిసి బద్రకాలి చెరువుకి వెళ్లాం అక్కడే స్నానాలు కానిచ్చి ఇంటికి చేరుకున్నాం.. ఓ మూలకి కూర్చున్న ఆశ్చర్యంగా పోయిన బాపమ్మ జ్ఞాపకమై ఇంకా పిడికిల్లో బంది అయి ఉంది కొత్త ఆటానా రూపంలో.

ఇక అక్కడినుండి మొదలు, ఇద్దరు తాతలు, మా ఇంకో బాపమ్మ, మా అమ్మ వాళ్ళ నాయన అందరు అందరు చివరి రోజుల్లో మా అమ్మ సేవని అందుకున్న వాళ్ళే ఒక్కొక్కరుగా కాలం చెల్లుతుంటే చావంటే ఇదేనేమో అని అనుకోవడం ఇక అలవాటయ్యింది.. అందరు ఏడుస్తున్న కూడా నాకు మాత్రం ఏడుపు రాకపోయేది ఎందుకో తెలిదు..

చావు ను గురించిన ప్రశ్న చాల కాలం చాల మందిని అడిగాను. ఒక్కొక్కరు వారికి తోచినట్టు చెప్పారు.

అదొక ఘడ నిద్ర అని, దేవుడు దగ్గరికి వెళ్లిపోయారని, వారు వేరే దేహం లోకి వెళ్ళారని, మళ్ళీ ఎక్కడో పుట్టారని రక రకాలుగా ఎవ్వరికి తోచిన సమాధానం వారిచ్చేవారు. చిత్రంగా నేను తిరిగి ప్రశించేవాన్ని నువ్వు చెప్పేది ఎంత వరకు నిజం నువ్వేమైన ఇంతకు ముందు చచ్చిపోయి తెలుసుకున్నవా అని..

కవిత్వమంటే?!
కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచాకా దాదాపు ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో తేల్చుకుందామని కాచుక్కూచుంటే..ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లాలో నుంచి తొంగిచూసే ముగ్ధ వధువు లాగా మిసమిసలాడుతూ ప్రఫుల్ల నేత్రాంచలాలను రెపరెపలాడిస్తాయి. సృజన జన్మరహస్యం మాత్రం అంతుబట్టదు!

దారిన పోతొంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు. అపురూప సౌందర్యరాసి సందర్సన సౌభాగ్యమూ దక్కవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే కాని సమన్వయించే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయ శక్తికి పాదు ఎక్కడో తెలియదు!

పట్టుబట్టి ఎప్పుడో కలం కాయితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం తప్ప ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు ఓ మాటల కుప్పను పోగేసినా కవిత్వమనిపించుకోదు. శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త శ్రీమదాంధ్ర మహాభాగవతాన్నీ మహానుభావుడు బమ్మెర పోతనామాత్య్డుడు ఒక్క ఉదుటనే పద్యాలబండిలా తోలుకెళ్ళాడన్నా నమ్మలేం. కావ్యాలేమన్నా శాసనాలా? కాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకా సాక్షాత్తా శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా సరే .. ఒక్క బిగినే ‘ఇతిసమాప్తః’ అవడం అసంభవం. ఒక వాక్యం ఒక్క సారే అతకదు. ఒక అర్థం ఒకసారే పొదగదు. ఒక భావం ఒకే సారి పొసగదు. సృజన-భావాత్మక స్థాయీభేదమా? దానికదే ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉచ్చారణ మొదలు భావాంత పర్యంతమూ సర్వ జీవశక్తులూ విభావాదుల్లా వివిదౌపచారికాలు నిర్వహిస్తేనే కదా ఏరసభావానికైనా ఓ అంతిమ స్థాయి! అంతిమం సరే..రసం అసలు ఆది కొసేదో అంతుబట్టదు!

ఒక కొబ్బరి చెట్టు. దానికి వంపుగా సొంపుగా వాలి నట్లున్న శాఖకు వరసగా తోరణాలు కట్టినట్లు ఆకులు. వాటి మీద ఉదయభానుడి లేత కిరణాలు పడి కోమల మలయ సమీరానికి ఒకటొకటే క్రమంగా కదులుతోంటే ‘తరుణాంగుళీచ్చాయ దంతపు సరికట్టు లింగిలీకపు వింత రంగులీనింద’న్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ! శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి వేణుదండం మీద గర్భకేతకీ దళం వంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్న సమ్మోహన ఊహ మనసు నూయల లూగిస్తుంది . అక్కడితో ఆగితే మంచిదే! అవ్యక్తంగా ఆ వేణు స్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో గుండెలకు రెక్కలు తొడిగి ఏ గంధర్వ లోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువు కోన భోగమంటపాన కనిపించి లోకాలకు దారే తోచనీయకుండా మీది మీది కొచ్చేయచ్చు. మళ్ళీ కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించే వరకూ..సాగే ఆ భావాంబర వీరవిహారం పేరేమిటో? నింగిని వదిలి నింగికి దిగిందాకా మనసున సాగే ఊహా విహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే ఆ పాకం పండేదే ఎలా? ఆ అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో తెలిసిందే పుంభాసరస్వతికో?

చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా ఓ అందమైన సాయంకాలం పూట మిత్రబృందమంతా కలసి. ప్రేషించబడ్డ నాగసంతానమంతా సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే ఉరికురికొచ్చే అలల సందోహం! అవే తరంగాలు మరో మిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం ఉరకలెత్తే చురుకు కురంగాలనిపించొచ్చు. ఇంకో నేస్తానికి దోస్తులంతా కలసి చేసే ఈత వినోదంలా తోచవచ్చు. నాచన సోమన-’హరివంశం’ సత్యభామ హరికంటికొక రకంగా..అరి కంటికింకో తీరుగా తోపించినట్లు.. ఒక్కవస్తు సందర్శనంలోనే ఎన్ని భావలోకాలో! కవైన వాడికైతే గుండెల్లో బొండుమల్లెల చెండు వాసనలు గుబాళించవూ! చేతిలో రాతసాధనం లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగ ప్రవాహం భంగపడుతుందా? మదిలో ‘మా నిషాద’ శ్లోకభావం కదలాడినప్పుడు వాల్మీకి కవి హస్తాన ఏ గంటముందంట? ‘మాణిక్య వీణా ముపులాలయంతీ’ అంటో కాళిదాసు గళానలా ఆశుకవితాజల సెలయేరులా గలగలా పారినవేళా లేఖినేదీ దాపునున్న దాఖలాల్లేవే! పైసాపైసా కూడబెట్టే లుబ్ధుడికి మల్లే రసలుబ్ధుడైన కవీ రసాదికాలకు ఆది మూలమైన భావ దినుసులను ఏ హృదయపేటికలో భద్రపరుస్తాడో? ప్రయోగించే సందర్బరహస్యాన్నెలా పసిగట్ట గలుగుతాడో?

అలాగని ప్రతీ మనిషీ ఇలా కనిపించిన ప్రతీ దానిలోనల్లా కవితామతల్లినేదో కల్పించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా అల్లుకుని పోతానంటే ‘అనంతా వై వేదాః’ అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిల కట్టల్తో నిండి ఏడు సముద్రాలూ పూడిపోయుండేవి కావా! ‘ఆ దస్తరాల్లో చిక్కడి పోయే దుస్తరం తప్పింది.ఆనందమేనం’టారా? మరి మిణుగురు పురుగులా తటాల్మని తట్టే సీతాకోకచిలుక మల్లే మనోభావం చటుక్కుమనెటో ఎగిరిపోతేనో? గుప్పెట పట్టి గూట్లో పెట్టే సాధనమంటూ ఏదో ఒకటుండటమూ ఉత్తమం కదా? గాలీబ్ మహాశయుడికేదైనా ఓ అందమైన భావం మదిలో కదులాడటం మొదలవంగానే పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో ఉన్న ఏ దస్తీతోనో..ఆఖరికే అంగీ అంచుల పోగుతోనైనా సరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు. తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళనలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కంగా పద్యాలు చెక్కి వుండక పోతే మనకీ రోజు ఇన్నేసి చక్కని కైతల పాతర్లు దక్కుండేవా?

చింతచెట్టు చిగురు కంటబడంగానే ‘చిన్నదాని పొగరు’ పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి సామ్యమేమిటో? నల్లటి బుర్రమీసాలాసా మెవరన్నా ముదురుపెదాల మరుగునుంచీ బలిష్టమైన లంకపొగాకు చుట్టపీకొకటి లంకించుకుని గుప్పుగుప్పుమని పొగొదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు మీదకొచ్చినట్లనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికందకుండా అగరు ధూపంలా అనుభవించి వదిలేసే ఊహావల్లరులనలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్ని భావమణుల వెలుగుజిలుగుల వెనకున్న రహస్యమేమిటో? తెర వెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆదృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు కొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు మెరుస్తుంటాయే! ఎందుకనలా?

కుసుమశరుడి లాగా భావసుందరీ మనసిజ. ఒక్క రుద్రుడికే మన్మథుడు దద్దరిల్లాడు కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొస కదలదు. ఏ బంగారిమామ బెంగ పడ్డా, ఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో చింపిరి తలా చిరుగు వలువల్తోనడవలేక నడుస్తూ వీధి వాకిట్లో నిలబడ్డా, మరకతాలు పరిచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ గట్ల మీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావం వల్ల వాలు మొహాలు వేసిన వరినారును చూసి కళ్ళు చెమర్చిన అన్నదాత.. నురుగులు కక్కే దేహంతో కష్టాల కావిళ్ళు మోసే కూలన్నమెలిబడ్డ నొసటి రేఖ కంటబడ్డా, దూరంగా ఎక్కడొ ప్రేయసి చూపులో చూపుంచి వినిపించే అతి సుందర నిశ్శబ్ద మందర కాకలీ స్వరం చెవిన బడ్డా.. తళుక్కుమని మెరుస్తుందే.. మానసాంబర వీధిన భావతారా తోరణం.. ఏ సూత్రమాధారమో ఈ వింత పాలపుంత ధారకు?

కవిత్వమంటే ఇన్నిసాధక బాధకాలా? మబ్బుకు దివిటీ పట్టే మెరుపు విద్యంటారే విజ్ఞులు! చూసిన చిత్రం..చేసిన భావం మాటల్లోనో..మనసుల్లోనో భద్రం చేసి సమయం చూసి సూటిగా లక్ష్యాన్నిచేదించటమంటే మరి మాటలా? కలానికి కాలానికి కట్టుబడెలా ఉంటుందీ తత్వం? అలుగులు పారే సజీవకళతో ఉరకలు ఎత్తే నిత్యచైతన్య ప్రవాహోత్శి కదా కవిత్వం! ‘నదీనాం సాగరో గతిః’ చందంగా పొర్లుకొచ్చే భావవాహినికి ఆనకట్టలు కట్టి పంటకాలువలు తీసి పూలూ పండ్లూ పెంచి లోకానికా జీవప్రసాదం పంచే వనమాలి కదూ కవి! ఉచ్చృంబలంగా సాగే జీవప్రవాహం ఏ కొండో బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్ళటమో..ఉబికుబికి ముందుకు ఉరకటమో..ఏ లోయో సంప్రాప్తమైతే హడిలి అంతెత్తు పైనుంచీ మోతలు పెట్టుకుంటో పాటుగా దూకి పడి ముందుకు సాగటమో..ఏ వంపులో, ముంపులో తగిలినప్పుడు తల ప్రాణం తోకకొచ్చినట్లు సుళ్ళు తిరిగి ఊగటమో!కవిత్వ తత్వమూ అదేనేమో! కవి జీవన యానంలో అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతి లోకెళ్ళి పోయినా.. మనసడుగుపొరల్లోనే ఎక్కడ పడుకుని ఉంటాయో.. వాస్తవ జీవితం ఏ కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో సిద్దమైన క్షణాన.. పునరుజ్జీవం పొంది తెర ముందు కురికొచ్చేస్తుంటాయి.అలా రావడమే అసలు సిసలు కవిత్వతత్వ రహస్యమేమో! మరి రససిద్ధులైన పెద్దలేమంటారో..ఏమో!

పోయిన ఉగాదికి…
నేను పుట్టక ముందే మా పాలోల్లాయన కొత్త కుండని సైకిల్ మీద పట్టుకొస్తుంటే దేనికో తగిలి పగిలిందంట. కుండ పగలటంలో సోధ్యం ఏముంది. అని ఎవ్వలైన అనుకుంటారు కాని గక్కడ్నే మొదలయింది ముచ్చటంత. ఆ కుండ పగలడం సంగతి జూషినోల్లు చెవులు కోరుక్కోవడంతో నిమిషంలో గల్లి గల్లంత పాకింది.

ఒక్కో ముసలోడు ఒక్కో మాట అన్నాడు. అమ్మమ్మలు, అమ్మలక్కలంత అయ్యో అయ్యో అన్నారు. గిదంత కాదు గాని పంతులు దగ్గరికి పోతేనే ఏం జేయాల్నో ఎర్కైతది అనుకొని కుల పెద్దలంత కలిసి పంతులు గార్ని కలిసి జరిగిన ముచ్చటంత అప్పజెప్పిండ్లు. నొసలు చిట్లించి ఏవో బొక్కులు ముందేసుకొని తిరిగేసి తిరిగేసి ఒక్క ఇషయం తెగేసి సెప్పిండు. ఇంగ మీ మందాటోల్లు ఉగాది పచ్చడి చేసుకునేడిదే లేదు. ఎవ్వలైన సేసుకుంటే అందరికి అరిష్టం అని చెప్పిండు. ఇది జరిగిన శాన ఏండ్లకి నేను బుట్టిన కాబట్టి ఇది నా చేతిల లేని సంగతైంది. నాకు అర్ధం కాదు గాని కుండ అనక పగలదా? పగలగొట్టినోడు అందరికి తెలిసేలా ఎందుకు పగలగొట్టిండు? పగిలితే పగిలింది గాని గీ పచ్చడ బంధు వెట్టడం ఏందో నాకైతే అస్సలు సమజ్ గాలే… అందరింట్లో ఏందో గాని ఉగాది పండగొస్తుందంటే గీ పచ్చడి గురించి కనీసం ఒక్క సారైనా మా అమ్మతో లొల్లి బెట్టుకునేటోన్ని.

తెల్లారగట్లల్ల లేచినవెంటనే గదే గా రాఘవేంద్ర రావు సినిమాలో లాగ పడుకున్న మా పక్కల నిండ, ఇంక నా మీద వేప పువ్వు రాలేది. ఎంతగా రాలేదంటే నేనే వేప పువ్వు పరుపులో పడుకున్నట్టుగా అనిపించేటిది. ఎంతైనా ఎండా కాలం, ఇంట్లో కరెంటే లేంది పంక యాడికెల్లివొస్తది? గందుకే ఎండాకాలం అంత ఇంటెనకాల వేపసెట్టు కిందే మా పక్కలు. వేప పువ్వు రాలుతుందంటే పండగ దగ్గర పడ్డట్టే..

గింతంత గాలి తగుల్తే సాలు గుప్పెడు పువ్వు రాలేది. రంబులో, గోలెంలో, బకిట్లో ఆడ ఈడ అని తేడా లేకుండా యాడ బడ్తే ఆడ ఒకటే పడుడు. మా అమ్మకి వాకిలి ఊడ్వలేక యాష్టకోచ్చేది గాని నాకు మాత్రం మస్తు సంబరంమయ్యేది. రేడియోలో మౌనమేలనోయి అనే పాట వస్తుంటే చెట్టు కేసి మౌనంగా సూస్తుండేవాన్ని. చెట్టు నుండి పువ్వు విడిపోవడమే ఆలిస్యం నేల మీద పడకుండా అందుకోవా ల్నని ఎంత ఆరాట పడేవాన్నో..

పొద్దున్నే లేచి వేపాకు కలిపిన గోరెచ్చని నీళ్ళు తల మీద నుండి పడుతుంటే ఆ హాయి మాటలకు అస్సలు అందదు. రెండు నిండు బకీట్లు ఐపోయినంక కూడా కోరిక తీరక పోయేటిది. అమ్మ చూసిందంటే ఇక అంతే జ్వరం వస్తదని బలవంతంగా ఆపేసి తల తుడిచేది. పండగ గద తెల్లారగట్లే లేచి మా అమ్మ, అక్కయ ఇంటి పనుల్లో పడేటోల్లు. మా బాపు పొద్దున్నే వరంగల్ కి పోయేటోడు కొత్త సంవత్సరం కదా ఆల్లు పనిచేసే దుకానాలకి వెళ్లి మావిడాకు పెట్టి పూజలు చేసుకొని పొద్దునే మళ్ళీ ఏడెనిమిది గంట్లకి వచ్చేటోడు. వస్తు వస్తు తెల్లని సంచినిండా మావిడాకు కుక్కుకొని తెచ్చేటోడు.

ఇగ నేను, మా అన్న ఆగకుండా మా అన్న నా కన్నా కొంచెం పొడుగు కాబట్టి నిల్చొని దర్వాజకు ఆ మూలనుండి ఈ మూల వరకు చిక్కగా మావిడాకు పెడ్తుంటే. నేనేమో ఇంకో ధర్వాజకి కుర్చేసుకొని పెట్టెటోన్ని. మా బాపు గోడెక్కి వేప కొమ్మ మీద నిల్చొని లేత మండల్ని పువ్వు రాలకుండా జాగర్తగా సుంచి కిందకు వేస్తుంటే మా ఇంటి సుట్టు పక్కనున్నోల్లందరు మా ఇంటెనకాల లైను కట్టేటోల్లు. దగ్గర దగ్గర పది పదిహేనిండ్లోల్లందరు వేప పువ్వు వేపాకు మండలు పట్టుకుపోయేటోల్లు. మావిడాకు పెట్టడం పూర్తయ్యాక ప్రతి ధర్వాజకు రెండు దిక్కుల వేప మండలను చక్కగా చిక్కియ్యడం తో ఇగ మా పని అయిపోయేడిది.

మాకెట్లాగో పచ్చడి బాగ్యం లేదు. ఆ సంగతి నా కన్నా ఎక్కువ మా ఇంటి సుట్టు పక్క ఉన్నోల్లందరికీ ఏర్కైన సంగతే. ఇగ ఆల్లందరు చెంబుల కొద్ది పచ్చడి తెచ్చి ఇచ్చేటోల్లు. మా హన్మకొండలో ఉగాది పచ్చడి పచ్చి పులుసు లాగ, చారు లాగ చేసేటోల్లు. ఒక్కో ఇంటిది ఒక్కో రుచి మా ఇంట్లో పచ్చడికి ఇక లోటే లేనంతగా అందరు తెచ్చిన పచ్చడి సగం అడ్డ నిండేడిది. మనమసలె జిహ్వ ప్రియులం. పెద్ద గిలాస నిండుగా దగ్గర దగ్గరగా ఓ పది గిలాసులు పైనే తాగేటోన్ని. ఏంటో తాగినప్పుడల్లా ఆరు రుచుల్లో ఏదో ఓ రుచి జివ్వుమనిపించేది.

అమ్మ అక్కయ ఉడికించిన శనగ పప్పు, బెల్లం రోట్లో కచ్చ పచ్చిగా దంచి సన్నటి రొట్టెలు చేసి ఒక రొట్టె మధ్యలో రోట్లో దంచిన పప్పు బెల్లం ముద్దని పెట్టి దానిపై ఇంకో రొట్టెతో అతికించి సన్నటి బచ్చప్పాలు చేసి డాల్డా తో పెనం మీద కాల్చుతుంటే ఎక్కడో కూసున్న మా బాపు మా అన్న నేను దిగ్గ దిగ్గ అడుగులేసుకుంటు పొయ్యి దగ్గరకొచ్చి కూచొని ఎప్పుడెప్పుడు రికాబులో వేసి ఇస్తుందా అని అవురావురని చూస్తూ కూసునే వాళ్ళం.

ఇక నా కోసం రికాబులో రెండు బచ్చాలు పెట్టి, గ్లాసు నిండా పచ్చడి పోసి ఇస్తే నెమ్మదిగా ఇంటెనక వేప చెట్టు కింద సంచి పరుచుకొని కూసోని ఒక ముక్క బచ్చప్ప ఒక గుటిక పచ్చడి అలా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంటే అబ్బ ఆ మాజా అనుభవించినోడికే తెలుస్తది. ఆ మజా నుండి బయటపడనీకి ఆ ఉగాది ఒక్కరోజు అస్సలు సాలదు.

పొట్ట ఫుల్లుగా నిండిన తరువాత కాయిదంలో ఓ పది బచ్చాలు దాక చక్కగా పొట్లం కట్టిస్తే. అది పట్టుకొని నెమ్మదిగా కొత్త అంగి కొత్త ప్యాంటు వేసుకొని నున్నగా దువ్వుకొని కొత్త ప్యారగాన్ చెప్పులు వేసుకొని టప్పు టప్పు అని శబ్దం చేసుకుంటూ.. టప్పు టప్పు అని శబ్దం చెయడానికి వెనక ఓ రహస్యం ఉంది. ఎందుకంటే ఆ సౌండుకు అందరి చూపు నా కాళ్ళ మీదే పడి నేను కొత్త చెప్పులేసుకున్నానని తెలుస్తుందని. గప్పట్ల మా దోస్తానలో ఆళ్ళ అడుగులు సౌండు విని ఎవరోస్తున్నారో గుర్తు పట్టేటోల్లం.

అడుగులో అడుగేసుకుంటు గల్లీకి అటు పక్కన ఇటు పక్కన అందరిండ్ల ధర్వాజలను మావిడాకు తోరణాలను ముగ్గులను చూసుకుంటూ చూసుకుంటూ ఆరిఫ్ గానింటికి చేరుకుంటోన్ని. ఆల్లమ్మ చేతిలో బచ్చాలు పెట్టి ఆడు నేను ఫిలిప్స్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ లో సజ్జద్ అలీ, అత్తవుల్లః ఖాన్ పాటలు ఆస్వాదిస్తూ ఆళ్ళ తెల్ల నవారు మంచం లో వెల్లికల పడుకొని కాలుమీద కాలేసుకొని ముచ్చట పెట్టుకుంటు గడిపేటోల్లం.

ఏ పండగకైన మా చిన్నమ్మ వాళ్ళింటికి పోతే మాత్రం మా చిన్నమ్మ మమ్మల్ని సూసుకునే తీరు పండగ జరుపుకునే విధానం నాకు మస్తు ఇష్టం. ముల్కనూరు నుండి కొత్తకొండ చేరుకొని, అక్కడినుండి ధర్మారం. గ్రామం లోపలికి చేరుకోవాల్నంటే మూడు కిలోమీటర్ల నడక ప్రయాణం.

ఆ గ్రామం మొత్తం కూడా చాల పద్దతిగా ఒక వైపును పూర్తిగా కొండలు ఆక్రమించుకొని, ఆ కొండలపై బారులు తీరిన ఊడలతో కూడిన పెద్ద పెద్ద వృక్షాలు కమ్ముకొని చిక్కటి అడవిలా తోస్తే. ఆ ఆడవి మొత్తం మాదే అన్నట్టు రక రకాల జంతు పశు పక్ష్యాదుల రాజ్యం. మరో వైపంత పచ్చని పంట పొలాలు, అక్కడక్కడ నీటి తూములు, చిన్న చెరువు, ఇవన్ని కాదన్నట్టు పెద్ద పెద్ద బోరు బావులు. ప్రతి పొలం గట్టుకు ఆనుకొని చిన్న పాక. పాక పక్కన దూలంకు కట్టేసి పెట్టిన ఆవులు, ఎడ్లు, గేదెలు, పొలం గట్లకు కొండకు మధ్యన చిన్న మట్టి బాట. బాటకు ఇరువైపులా జామాయిల్, మామిడి, వేప, తుమ్మ, తాడి, మర్రి, శివశింతకాయ, చెప్పుకుంటూ పోతే తెగలేనన్ని పేర్లతో ఉన్న చెట్లు.

ఆ పల్లె మొత్తం మీద గట్టిగ లెక్క పెడితే యాబై ఇండ్లు ఉంటె ఎక్కువ. రేపు పండగ అనంగా మేము గియ్యాల్నే పోయేటోల్లం. తెల్లార గట్ల కోడి కూయక మునుపే మా చిన్నమ్మ లేచేది. ఇల్లు ఇంటి చుట్టూ పక్కన ఊడ్చి అలుకు చల్లల్నంటే రెండు మూడు గంటల పైమాటే ఇంకా ముగ్గుల సంగతి చెప్పేడిది ఏముంది.

నేను మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు తమ్ములని వేసుకొని పొలం గట్లని ఏలడానికి పోయేటోల్లం. చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందే రెండెకరాల శెలక అందులో ఒక్కోసారి ఒక్కో పంట. పత్తి, కంది, బబ్బెర, పొద్దు తిరుగుడు పోయినప్పుడల్లా ఏదో ఒక పంట గాలికి వయ్యారంగా ఊగేటిది. పొద్దు తిరుగుడు పంట గనక ఉంటె ఇగ సూసుకో పొద్దంతా ఆ పొలంలోనే.. ఆ గ్రామంలోని పంట పొలాల్లో, పండ్ల తోటల్లో మనసుకు అందని ఏదో వింత మర్మం దాగి ఉండేది. దానిని చేధించేందుకు యోగిలా సాగేది నా పరిశోధన. ఒక్కో సెకను ఒక్కో ఆకు మీద. లతలా పెనవేసుకున్న తీగల అందం ఓ లయలా నన్ను అల్లుకునేవి. విచ్చుకునే ప్రతిపువ్వు రంగులు నాపై చిలికిన భావం. వర్షం పడితే పాదాలు పరుగులు తీసేవి బంగారు రంగు బురద తూములోకి. పోటా పోటిగా అందరు కలిసి అమాంతం గాల్లోకి లేపి చాతి వరకు మునిగేటి ఆ బురద తూములోకి విసరడం. వీస్తున్న ఈదురు గాలులు విసురుతున్న వర్షం. అల్లరిగా సాగే బురద ఆటలు. ముక్కు పుటలను అదరగొట్టే పచ్చి వాసనకు బుక్కల కొద్ది మింగేయ్యాలన్నంత రుచి బురద మట్టికి చేరేది. ఎలాగో తినలేను కాబట్టే చీల్చుకుంటూ చీల్చుకుంటూ మునుగుతూ తేలుతూ బురదని ఆస్వాధించెవొన్ని.

తల పైకెత్తి పడుతున్న వర్షపు బాణాలు జివ్వు మని గుచ్చుతున్న కళ్ళు తెరిచి నీటితో మునిగిన ఆ నీలాకాశాన్ని తనివి తీర చూడాలని ఎంత తాపత్రయమో. ఒక్కోసారి తూఫాను వేగాన్ని సైతం చేతులు చాచి అక్కున వాటేసుకునే టోన్ని. ఆకాశం నేల నిండా మునిగి పచ్చని సముద్రపు అల నను అమాంతం ముంచేస్తున్న తలపు.

ఏంటో అనుభవిస్తున్నప్పుడు ఆ క్షణమే శాశ్వతం ఎందుకో ఎప్పటికి ఆ క్షణం లోనే ఉండిపోవాలని పిచ్చిగా కోరుకునేవాన్ని..

చిన్నమ్మ వాళ్ళింటి వెనకాల మధ్యలో పెద్ద చింత చెట్టు. దాని మొదట్లో కట్టెల పొయ్యి. ఆ చెట్టు చుట్టూ విశాలమైన వాకిలి. ఆ వాకిలికి ఆనుకొని లెక్క లేనన్ని ఆకు కూరలు కాయగూరలు పూల చెట్లు, పది పన్నెండు కోళ్ళు, ఒక కుక్క దాని పేరు మల్లేశం. దానికి తోడు రెండు పిల్లులు. ఇవ్వన్ని కుటుంబ సభ్యులు. ఇవేనా కాదు మెరిగలు వేసి పిలిస్తే లెక్కలేనన్ని పిచ్చుకలు పక్కకొచ్చి వాలి ముచ్చట పెట్టుకునేటివి.

ఆ గ్రామంలో ప్రతి ఇంటి ముందు రెండు లేక మూడు నీటి గోలాల్లో ఎప్పుడు నీళ్ళు నింపి పెట్టె వాళ్ళు. నాకు ఊహ తెలిసాక తెలిసిన విషయం ఏంటంటే ఆ గ్రామంలో లెక్కలేనన్ని ఎలుగుబంట్లు. ఒకటో రెండో చిరుతలుండేవి. ఎండాకాలంలో అవి నీళ్ళకోసం ఇళ్ళలోకి వచ్చేవని. కొండెంగ కోతులు మాత్రం నన్నెప్పుడు భయపెట్టేవి. ఇవేనా ఇప్పుడు జూ పార్కు లో చూస్తున్న రకరకాల జంతువలన్ని కూడా స్వేచ్చగా మా ముందే బారులు తీరి కేరింతలేసేవి.

బాబాయి కొత్త కుండ, పచ్చడి సామాను పట్టుకొస్తే చిన్నమ్మ పచ్చడి చేసే పనిలో పడితే అమ్మనేమో బచ్చప్పాల పనిలో పడేది. బాపు, బాబాయి ఓ పక్కన మంచం ఏసుకొని ముచ్చట పెట్టుకుంటుంటే, అమ్మ చిన్నమ్మ, నేను, అక్కయ్య, తమ్ముళ్ళు అందరం బచ్చప్పాలు తినుకుంటూ మస్తు బిజీగా ఉంటుండే. మా అన్న మా బాపమ్మ పక్కన కూసోని ఊరు కథలన్నీ మంచిగా ఇనేటోడు..

ఏంటో పాయలు పాయలుగా ఆలోచనలన్నీ సుదూర తీరాలన్నీ చుట్టేసింది.గతించిన అనుభూతుల జ్ఞాపకాల మూటను మరో సారి విప్పడానికైనా… కనీసం నెమరు వేసుకున్నకొద్ది తీగలా అల్లుకుపోయే తెగలేనన్ని ఆనందాల గుర్తులను గుర్తు తెచ్చుకోడానికైనా… ఇలాంటి పండగలు అవసరమే. పండగ చరిత్ర దేవుడెరుగు ఆ పండగ రోజుల్లో ముడిపడిన విషయాలే నాకు తెలిసిన చరిత్ర.

పట్నం ఏలడానికొచ్చిన ఇన్నాళ్ళకి, ఇప్పటికి కూడా నాకు ఉగాదంటే ఇష్టమే ప్రతి పండగకి ఏదో ఒక ఫేస్ బుక్ ఫ్రెండ్ ఇంట్లో హాజరు పడాల్సిందే.. కొత్త ఆనందాలకు నాంది పలకాల్సిందే.. గడిపిన రోజు మరో యుగానికి చరిత్రగా మిగాలాల్సిందే… ఇగో గిదే నేను అనుభవించి, అనుభవిస్తున్న పండగ ముచ్చట.

మధురాంతకం రాజారాం అవార్డుల విజేతలు
ప్రసిద్ధ  రచయిత మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా  ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు. ఈ సారి హోసూరులో ఈ సదస్సు పెద్ద యెత్తున నిర్వహించే సన్నాహాలు చేస్తున్నామని నరేంద్ర చెప్పారు.

ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.

స. వే. రమేశ్, అఫ్సర్ ఇద్దరూ వాకిలి పాఠకులకు తెలిసిన వారే. సరిహద్దు భాషలో తెలుగు కథాపటానికి సరికొత్త హద్దులు గీస్తున్న కథకుడు రమేశ్. ‘ఆనవాలు’ శీర్షిక ద్వారా వాకిలిలో అఫ్సర్ పరిచితులే. అఫ్సర్ గారికి ఈ అవార్డు కథ సాహిత్య విమర్శకి లభించడం ఈ సారి విశేషం. 2010 లో ‘కథ-స్థానికత’ శీర్షికన కథాసాహిత్యం మీద ఆయన రాసిన వ్యాసాలు పుస్తకంగా వచ్చాయి.

దర్గామిట్ట కథల రచయితగా ఖదీర్ బాబు ఎందరికో ఆత్మీయుడు. కథాకథనంలో కొత్తదనం ఖదీర్ ప్రత్యేకత. వి.చంద్రశేఖర రావు గారు కూడా కథారచయితగా ప్రసిద్ధులు. 2012 కథా వార్షికకి ఆయన సింహావలోకనం రాశారు.