వాకిలి » లోపలి మాట

రోజు వారీ భాషకి దూరమవుతున్నామా?
లోపలి మాట రాయాలనుకున్నప్పుడు అది నెగటి”వ్‌ షేడ్‌ లోనే వుండాలా? చెత్త కవితనే ఎన్నుకోవాలా? అట్లా కాకుండా ఒక మంచి కవితను తీసుకొని, అది అంతకంటె మంచిగ వుండే అవకాశాల్ని చూడొచ్చా? అనేది ఒక సందేహం. తెలుగు సాహిత్యంలో ఇప్పటికే విమర్శని అంగీకరించని వాతావరణం రాజ్యమేలుతున్న సందర్భంలో అది ఎట్లాంటి సంబంధాలకు దారితీస్తుంది. లబ్దప్రతిస్టులైన, అతి దగ్గరి వ్యక్తిగత సంబంధాలు గల వాళ్ళ రచనల పట్ల నా నిజమైన లోపలి మాటను బయటపెట్టడంలో నాకు ఒకింత అసౌకర్యం వుంది.అనుభవజ్ఞులు ఇప్పటికే ,నన్ను విమర్శా రంగంలోకి వెళ్ళవద్దనే సలహా ఇచ్చియున్నరు. ”ఇరువాలు” దున్నడం అలవాటైన వాన్ని కనుక ఇష్టమైన కవిత మీద ‘లోపలి మాట’ రాయడానికి సిద్దపడ్డాను. ఎందుకంటే ఇష్టం లేని దాన్ని దేన్నీ నేను చదవలేను.ఇక రాయడమన్నది ఊహాతీతమే.

గత ఇరవై ఐదు ఏండ్లుగా నాకు అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా నాకు సాహిత్య గురువు లాంటి వాడు, లబ్ధప్రతిష్టు

డు, ఉద్యమాల చాళ్ళల్ల నడిచిన వాడు అయిన ఒక కవి కవితను ఎన్నుకున్న. అతనన్నా, అతని రచనలన్నా నాకు అత్యంత ప్రీతిపాత్రము.అనేక సందర్భాల్లో కలిసి నడిచిన వాళ్ళం. ఉద్యమమే ఊపిరిగా ‘భూమి స్వప్నా’న్ని శ్వాసిస్తూ, ‘ప్రాణహిత’లో ఈదులాడుతూ, ‘నది పుట్టువడి ‘గురించి ఎరుక చెప్పుతూ, ‘ఒక్క బాధ కాద’ంటూ తెలంగాణ దు:ఖాన్ని నాగేటి చాళ్ళల్ల గానం చేస్తూ ‘మొగులైంద’న్న ‘ఇగురం’ చెప్తున్న నిరంతర సాహితీ పథికుడతడు. ‘మరసం’ ద్వారా మంచి రచయితలను,కవులను వెలుగులోకి తెచ్చినవాడు.నా ‘జలపాత శబ్దం’ ప్రపంచానికి వినిపించి, ‘ఎన్నాద్రి’ ని ఒడిసిపట్టుకొని,’అందని చందమామ’ కోసం నేను పడుతున్న తాపత్రయాన్ని అభినందిస్తూ నాకు కవిత్వపు మెలుకువలు నేర్పిన సిధారెడ్డితో ‘తెలంగాణ రచయితల వేదిక’కు పురుడు పోసినప్పుడు వెంట నడిచాను.’జరసం’ ఆవిర్భావ సదస్సులో తన భాగస్వామ్యముంది. జరసం కవిత్వం ‘అలుగు’ దుంకినప్పుడు తను పాదాలు తడుపుకున్నవాడే.

అట్లాంటి ఒక తెలంగాణ ఉద్యమ కవి, పుట్టుకతోనే హేతువాద భావజాలాన్ని, సమసమాజ స్థాపన అవసరాన్ని గుర్తించిన

వాతావరణంలో పెరిగిన వాడు, నిరంతరం కమ్యూనిష్టు ఉద్యమాలతో వున్న నర్ర బాలసిద్దారెడ్డి కొడుకు. దేవిప్రియ అన్నట్టు బందారం లో విరిసిన మందారం. ఈ మద్యనే కాలం చేసిన తండ్రి యాది భావోద్వేగం కావచ్చు, నందిని సిధారెడ్డి ‘పిట్టకు పెట్టి’ అనే కవిత రాశాడు(25 మార్చి 2013 అంధ్రజ్యోతి దినపత్రిక, ‘వివిధ’).

“పొద్దుకు తొందరెక్కువ

పొయ్యి దిగక ముందే ఉరుకొస్తది

ఎండయితే పిట్టలుండవు

తువ్వాల్లో ఇష్టరుచులు మలిచి పట్టుకొని

దు:ఖం ఒలకకుండా నడువు”

అంటూ ఒక సార్వజనీన దృశ్యాన్ని కవి కళ్ళముందు పరుస్తడు.’దు:ఖం ఒలకకుండా నడువు’ అన్నప్పుడు కవిత్వభాస పరాకాష్టకు చేరింది. పిట్టకు పెట్టడానికి అన్నంతో పాటు చెంబులోనో,ముంతలోనే మంచి నీళ్ళు కూడ తీసుకెళ్తరు. ఆ నీళ్ళు ఒలకకుండా నడువాలె. ఆప్తుల పోగొట్టుకున్న బాధకు కండ్లల్ల నీళ్లు తిరుగుతయి. అది పట్టుకెళ్ళే ఇంటి యజమాని అధైర్యపడి ఏడ్వొద్దు.తద్వారా ఇంటిల్లిపాది మనోధైరాన్ని దెబ్బతీయవద్దు. ఇట్లాంటి తెలంగాణ నుడికారాన్ని ,మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని విశదపరుస్తడు.

పిట్టముట్టడం కోసం కొడుకులు, కోడండ్లు, భార్య అందరమూ కలిసుంటమని చెప్తూ, అందర్నీ మనస్ఫూర్తిగా మొక్కమని చెపుతడు. ఎందరు ఎన్ని తీర్ల మొక్కినా, ఎన్ని బాధలువడ్డా పిట్ట రాని వైనాన్ని గుర్తిస్తడు.

“ఎందరు మొక్కినా

విస్తరి ఎటుజరిపినా

పిట్ట ముట్టది

చుట్టు చూసినా చెట్టు ఊగినా

పిట్ట రాదు”

అంటూ అసలు సమస్యను వివరిస్తడు. ఇప్పటిదాకా గంభీరంగా,సాంద్రంగా నడిచిన కవిత ‘పిట్ట ముట్టక పోవుడే సమస్య’ అనే అనవసర వాచ్యంతో తేలిపోతది. పిట్ట ముట్టకపోవడమే కవిత ఇతివృత్తం. అది బంధుగణం చేసిన బాసలు చనిపోయిన వ్యక్తి ఆత్మను తృప్తి పరచకపోవడం వల్లనా, మరే ఇతర కారణం వల్లనా అనేది అప్పటికి చెప్పడు కాని పిట్ట ముట్టక పోవడమే అసలు సమస్య అనేది కవిత పొడుగూతా తెలుస్తనే వుంటది. అట్లాంటి పరిస్థితిలో ‘పిట్ట ముట్టకపోవుడే సమస్య’ అనే పూర్తి వాచ్యాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు.

‘ఆత్మ తొక్కులాడుతంది. ఆయన తృప్తిపడలేదు’ అందుకే పిట్ట ముడుతలేదు. ఎందుకు తొక్కులాడుతంది ఆత్మ? ఎందుకంటే

“ఎంత ఆరాటపడ్డా కుటుంబం కుటుంబం వలె లేదు

ఎంత సేవ చేసినా ఊరు ఊరు వలె లేదు”

బాగానేవుంది. కాని, అప్పటిదాకా చక్కటి తెలంగాణ భాషా సొగసుతో నడుస్తున్న కవిత, ప్రామాణిక భాషగా చెప్పబడుతున్న తరగతి గది భాషలోకి వెళ్ళిపోతది. నిజానికి ఇది ఈ ఒక్క కవిత సమస్యే కాదు. ఈ ఒక్క కవి సమస్యే కాదు. ఇవ్వాళ్ళ తెలంగాణలో అద్బుత కవిత్వం రాస్తున్న అనేక మంది కవుల సమస్య కూడ. మాట్లాడే దైనందిన భాషకు, తరగతి గదిలో చదువుకునే భాషకు మధ్య విపరీతమైన అంతరం వుండడం వల్ల తలెత్తుతున్న సమస్య ఇది. అయితే, ప్రయత్నపూర్వకంగా,మనల్ని మనం తిరిగి తిరిగి ఎడిట్‌ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

‘…………..కుటుంబం కుటుంబమోలె లేదు

……………ఊరు ఊరోలె లేదు’ అంటే సరిపోయేది.

పిట్ట ముట్టకపోవడం అసలు సమస్య అయితే, దానికి కారణం పిట్టలు లేకపోవడమేనని కవిత చివరన చెపుతడు.

“సుతులు ఆందోళన పడ్డా ఒక్క పిట్టరాదు

పిట్ట ముట్టలేదు

రావడానికైనా ముట్టటానికైనా

పిట్టలంటే కదా!”

ఇక్కడ అందరికీ తెలిసిన విషయాన్నే గుప్పిట పట్టి ప్రదర్శించిన భావన కలుగుతుంది. పిట్టలు నశించిపోవడం, దానికి కారణమైన మితిమీరిన యాంత్రికీకరణ,దానికి దారితీసిన ప్రపంచీకరణ ఇక్కడ వస్తువు. చనిపోయిన వ్యక్తి ఆత్మను తృప్తి పరచడానికి పిట్టకు పెట్టడం ఇతివృత్తం. ‘పిట్టలుంటే కదా’ అన్నప్పుడు గంభీర గమనం కాలుజారి పడ్డట్టు వుంది.అట్లా కాకుండా,

‘రావటానికైనా ముట్టటానికైనా

పిట్టలుండాలె కదా’ అంటే ఆ గంభీరం కొనసాగేది అనిపిస్న్నుది.అందరికి తెలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నట్టు ఉండేది.

నిర్మాణ పరంగానే కాకుండా వస్తువు పట్ల కూడ నాకు ఒకింత అసంతృప్తి వుంది. జీవితకాలమంతా హేతువాదంతోను, మార్క్సిస్టు భావజాలంతోను బతికిన నర్ర బాలసిద్ధారెడ్డి కి(నిజంగా ఆ సందర్భంలో రాసిందే అయితే) వీడ్కోలు హిందూ మత ధర్మానికి చెందిన కర్మకాండలతో చేసినట్టు రాయొచ్చా? మార్క్సిస్టు రచయితగా, ఉద్యమకారుడిగా పేరున్న సిధారెడ్డి వస్తువు చుట్టూ హిందూ మతానికి చెందిన ఇతివృత్తాన్ని అల్లడాన్ని అంగీకరించ వచ్చా? ప్రముఖ కెనడా రచయిత గుస్తావో ఎస్తెవా అన్నట్టు ”ప్రపంచీకరణకు విరుగుడు స్థానికీకరణే”.

దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు. అంతమాత్రాన స్థానికీకరణ పేరిట మూఢనమ్మకాలను, బానిస భావజాలాన్ని ఎత్తిపడుతామా?

మతఛాందసవాదాన్ని దెబ్బకొట్టకుండా ప్రజా సమూహాల్ని నూతన సమాజ నిర్మాణానికి సిద్ధం చేయగలమా? కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే, ‘మతం సమాజంలో బడుగు జీవుల నిట్టూర్పు. హృదయరహిత ప్రపంచంలో హృదయం.అనాత్మ లోకంలో ఆత్మ. మతం ప్రజల పాలిట మత్తుమందు’-కారల్‌ మార్క్స్‌.

నిజానికి ఈ విషయాలు కవితో నేను చర్చించినవే. అయితే ఎప్పుడైనా కవి నిరంకుశుడే.తనఅక్షరాలకు తనే అధిపతి.ఒక సీనియర్‌ కవిగా తను నాతో అంగీకరించక పోవచ్చు. ఒక పాఠకుడిగా ఒక మంచి కవిత చదివిన తృప్తిని అనుభవిస్తూనే, విభేదిస్తున్న విషయాలను కవితోను,మీతోను పంచుకుంటున్నాను. అయితే, నేనిక్కడ తీర్పరిని కాదని మనవి చేస్తున్నాను.

కవిత పూర్తిగా,

పొద్దుకు తొందరెక్కువ

పోయ్యిదిగకముందే ఉరుకొస్తది

ఎండయితే పిట్టలుండవు

తువ్వాల్లో ఇష్టరుచులు మలిచిపట్టుకొని

ద:ఖం ఒలకకుండా నడువు

అయినవాళ్ళు అనుభవం పండినవాళ్ళు

ఆఖరి ఆనవాళ్లు వెంబడిస్తుంటే

తలపులు తల్లడిల్లకుండా నడువు

విస్తరి విప్పి

పదార్థాలు పరిచి

కనీళ్ళు సాకబెట్టి

కడసారి ప్రార్థించు

పిట్ట ముట్టాలె కదా

కొడుకులు మనస్ఫూర్తిగ మొక్కాలె

భార్యాబిడ్డా నిండుగ మొక్కాలె

అందరం కలిసుంటం

అమ్మను మంచిగ చూసుకుంటం

కోడండ్లూ మనుమండ్లూ అందరు మొక్కుండ్రి

ఎందరు మొక్కినా

విస్తరి ఎటుజరిపినా

పిట్ట ముట్టది

చుట్టు చూసినా చెట్టు ఊగినా

పిట్ట రాదు

పిట్ట ముట్టకపోవుడే సమస్య

అనుమానమేదో గాని

ఆత్మ తొక్కులాడుతంది

ఆయన తృప్తి పడలేదు

ఎంత ఆరాట పడ్డా కుటుంబం కుటుంబం వలె లేదు

ఎంత సేవ చేసినా ఊరు ఊరు వలె లేదు

ఎంత పోరాడినా కలగన్న సమాజం రాదు

చూసి పోదామంటే ఆఖరుకు తెలంగాణ రాలేదు

అందరసొంటి ఆత్మ కాదది

జీవితమంతా మనిషి కోసం తండ్లాడిన ఆత్మ

ఎట్ల తృప్తి పడుతది

ఎట్ల శాంతిస్తది

సూర్యుడు నెత్తిమీదికి చేరినా

చుట్టాలు చెట్టుకిందికి చేరినా

పుతులు ఆందోళన పడ్డా ఒక్క పిట్ట రాదు

పిట్ట ముట్టలేదు

రావటానికైనా ముట్టటానికైనా

పిట్టలుంటే కదా

-నందిని సిధారెడ్డి

వేదన పలచ బడిన గీతం
కవిత్వానికి”లోపలి మాట” ను చెప్పడమంటే ఒక విధంగా చాలా కష్ట సాధ్యమే. కవిత ఎంపిక దగ్గర్నించి కవిత్వపు సారాంశం నమిలి మింగే వరకూ.

అసలు ఏ కవితని ఎలా ఎంచుకోవాలి? చదివిన ప్రతి కవితలోనూ కొన్ని లోపాలు, కొన్ని అద్భుతాలూ కనిపిస్తూంటే-ఒకోసారి అయ్యో మనిమిలా రాయలేకపోయామే అని దిగులు, ఆశ్చర్యం! ఎంత బాగా రాసారన్న ఆనందం! కవితలు చదూకుంటూ పోతూ, కవిత్వమే నిబిడాంధకారాన్ని తొలగించే రాత్రి చేతి దీపమై నడచుకుంటూ పోతూంటే ఎక్కడో ఒక ముల్లు కాలికి గుచ్చుకున్నట్లు ఒక కవిత వ్యధ పెడితే అది నిన్ను వదలకుండా వేధిస్తే అది నిజంగా ఒక కవిత-

అయినా కొన్ని కవితలు విసిగిస్తే ఆ కవితకున్న పేరు ప్రఖ్యాతులు మన్ని భయపెడితే లోపలి మాటని అక్కడే గొంతు నులిమేస్తే ఇక నిజమనేదేముంది! బయటి మాటే లోపలి మాట నిజంగా అయ్యే ధైర్యం లేనివాడికీ పాట్లెందుకో!!

అసలు ఎలా చదవాలి కవిత్వాన్ని? ఏ తూనిక రాళ్లతో తూచాలి?

ఒక వేడి కన్నీటి బొట్టు…, తాదాత్మ్యం అంత కాకపోయినా స్పందించిన హృదయం, కలిగిన ఆర్ద్రత, మళ్లొక్కసారి చదవాలన్ని కుతూహలం ….ఇవేనా అర్హతలు!!

ఎలా పట్టుకోవాలి కవిత్వ”అంతర్రహస్యాన్ని” “అంతస్సూత్రాన్ని”!!

కవి పేరుని బట్టి కవిత్వం కానిదల్లా కవిత్వమని మెచ్చుకునే తీరే లోక సహజపు విమర్శ చేయాలా! అలాగని పేరున్న వారి పేరు కావాలని తీసి గంగలో కలపాలా!

ఖచ్చితంగా ఇవన్నీ అవసరం లేదు- అయితే మొహమాటమెందుకు! ఇన్ని గోలలెందుకు?

కవితకి పేరు తీసి చదివితే పోలా! చివరి వరకూ పేరుని దాచిపెడితే వచ్చే అనుభవమేదో చెపితే పోలా! అసలది కవిత్వం కాదనీ, పోనీ అందులో ఎక్కడో ఏదో లోపించిందని అనిపిస్తే చాలదూ! నాలుగు మాటలు చెప్పడానికి- హమ్మయ్య ఒక కొలిక్కి వచ్చింది సమస్య-

అవును అదే ప్రయత్నంలో కవిత్వం చదవడం మొదలు పెట్టిన తర్వాత ముందు కవిత చదివి, ఆ తర్వాత పేరు చూసేక కలిగిన బోల్డు ఆశ్చర్యాలెన్నో-

విచిత్రంగా,అత్యంత ఆశ్చర్య కరంగా …కవిత్వం లో పసలేని జాబితాలో మొదటివి “పేరున్న” కవులవి.

పేరు ప్రఖ్యాతులున్నాయి కదా రాసిందల్లా కవిత్వమే అనుకునే ఒక నిర్లక్ష్యమో, లేదా ప్రతి కవికీ ఉండే అత్యవసరత్వపు,బలవంతపు కవిత్వాల్లో అదీ ఒకటి కావడం వల్లనో, సంవత్సరాల తరబడి కవిత్వం చదవకుండా, కవిత్వం లో ఉన్న ఆర్ద్రతను ఆదిలోనే మర్చిపోయి, నే రాసిందే కవిత్వం అనుకునేతనం వల్లనో-

ఇక ఈ కవితను చూడండి-

“కుప్పం కాబ్లర్“ వేదనా గీతం. వెనక్కి తిరిగి చూడని వేదనా గీతం. కవితలో ప్రాసల పాట్లని వదిలించుకోలేని తనాన్ని పక్కన పెడితే వేదన పలచ బడిన గీతం.

నిజానికీ కవిత సామాజిక వస్తువులే కవిత్వం, ప్రేమగా హృదయం స్పందించింది కవిత్వం కాదు అనుకునే వాళ్లు రాయాల్సింది కాదు. కన్నీటికి భేదం ఉండదు, అది నీ కంట్లోనైనా, ఎదుటి వాడి కంట్లోనైనా రుచి ఒక్కటే, వెనుక వ్యధ పడే హృదయం ఒక్కటే.

కవిత పేరుతోనే ప్రాస కోసం పడ్డ బాధ ప్రారంభమవుతుంది. ఇక కవిత నడక లో కవిత్వం కంటే వచనం పాలు ఎక్కువ. అయితే ఒక విధంగా ఈ కవిత లోని కాబ్లర్ అదృష్ట వంతుడు.ఒకప్పటిలా “నీ చావు నువ్వు చావు, నా చావు నేను ఛస్తాను” అని అస్పష్ట ప్రేలాపనగా కాకుండా కవిత సాగినందుకు.

కవిత ఎత్తుగడ చూడండి ఎంత సాదా సీదాగా ఉందో-

“ఈచెట్టు కిందే

మాతాతగూటం పాతాడు

దీనినీడలోనే మా అయ్య నడిచాడు

నేనూఇక్కడే పాతుకు పోయాను పాతికేళ్ళుగా”

అని చెప్పులు కుట్టే పెద్దమనిషి స్వగతం ప్రారంభమవుతుంది-

పొట్టపోసుకోవడానికే వృత్తి ప్రారంభించిన వ్యక్తికి

తన దగ్గరికి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ల మీద విపరీతమైనకసి ఉంటుంది తర్వాతి వాక్యాల్లో-

“అరిగినచెప్పుల్ని చదవగలను నేను

తెగినఉంగటాలు చూసి చెప్పగలను

మీరెలాంటివాళ్ళో

మీ బూట్లకి పాలిష్ చేస్తున్నప్పుడు వినగలను

మీ పాదాల వంకర నడకలను

వాటికిఅడుగులు వేస్తున్నప్పుడు చూడగలను

మీ నడతలోని తప్పు ఒప్పుల్ని

మీరునాకిస్తున్న రూపాయనూ

ఇవ్వడానికిచాచిన చేతులనూ

దర్శించిచెప్పగలను మీ వ్యక్తిత్వాలను”

తెగినచెప్పులు, పాలిష్ చేసే బూట్ల వెనుకఉన్న వ్యక్తిత్వ విశ్లేషణలో ఏదో అతణ్ణి అందరూ చిన్నచూపు చూస్తున్నారన్న భావనా ఈ వాక్యాల్లో కనిపిస్తుంది-

పోనీ అదే నిజమనుకుంటే- అక్కడి దాకా కొంత వరకుఒక పద్ధతిలో నడిచిన కవితలో ఏం రాయాలో తెలీకరాసినట్లు వచ్చే తర్వాతి వాక్యాలుచూడండి-

మళ్లీప్రాస కోసం పాట్లు-

“ఎందుకేసుకుంటారయ్యామీరు చెప్పులు?

మరెందుకుతొడుగుతారయ్య బూట్లు?”

“నన్నుచూడండి

దసలకుండామెసలకుండా ఇక్కడే కూర్చుంటాను

నేనుమీలా ఏ హాజరుపట్టికల్లో సంతకంపెట్టను

అసలుస్వేచ్ఛంటే నాది

ఇష్టమైతేఈ చెట్టు కిందకొస్తాను”

చెప్పులువేసుకుని ఊరంతా తిరిగే వాడికిలేని(?) ఇంగిత జ్ఞానం తనకుందనిచెబ్తూ “నన్ను చూడండి ” అంటూ” దసలకుండా మెసలకుండా” కూర్చుంటాను.

హాజరుపట్టికల్లో సంతకాలు పెట్టను అంటాడు.

ఇక్కడకవి స్వగతం లోకి “కాబ్లర్” జొరబడతాడు.

కదలకుండాకూర్చోవడం అతని కేదో ఇష్టమైనపని అన్నట్టు,

“స్వేచ్ఛగా నచ్చితేవస్తాను, లేకపోతే లేదు” అనే స్టేట్ మెంటులో ఆకలి తో ఉన్నచెప్పుల వాడి ఆక్రోశం ఏకోశానా కనబడదు.

అసలు”ఓ చెప్పుల మనస్తత్వ శాస్త్రవేత్త ఆత్మవెత “ అని చెప్పుకున్నకవి నిజంగా అతని మనస్తత్వాన్ని ఎంత నిశితంగా చదవాలి? అదెక్కడా కవితలో కనబడదు. అతను వేళకి రాకపోవడానికి కారణాంతరాలు ఎన్నెన్ని ఉన్నాయో- అతని జీవితం లోకితొంగిచూస్తే ఏమేమి కారణాలు ఉండిఉండేవో- అదేమీ లేకుండా స్వేచ్ఛగాఉండాలనుకోవడం మాత్రమే కారణమని ఊహించడం అసంబద్ధం. ఒకవేళ అదే నిజమైతేఆ సదరు వ్యక్తి వచ్చినకాస్తో కూస్తో ఆదాయాన్ని సాయంత్రానికి పీకెల దాకా తాగి(తాగడానికి ఎన్ని గొప్ప కారణాలోఉంటాయి మళ్లీ సానుభూతి దారులకి)పొద్దెక్కిన వరకూ లేవని వట్టిసగటు మనిషి అయి ఉంటాడు.అప్పుడూ వాడి వెనక కుటుంబంపడే బాధ ఒకటి ఉంటుంది.

హాజరుపట్టికల్లో సంతకం పెట్టే వాడిజీవితం తో చెప్పులుకుట్టే వాడి స్వేచ్ఛను పోల్చాల్సిన అవసరం కవితలో ఎక్కడా కనిపించదు.

అలాంటివే కవితలో నిర్లక్ష్యాలకు తార్కాణాలుగా కనిపిస్తాయి-

ఇక కవి ఒకడు “దాపురించిన”బాధ, తన మీద కవితగట్టే వాడి కవిత్వానికి పాడెగడతానని అతని చేత చెప్పించడంకవితలో మళ్ళీ అసందర్భాలు-

కవితమొదటిలో ఉన్న స్వగతమూ పోగా,కవిత మధ్యలోని మనుషులపైని ఆక్రోశమూ పోగా కవిత కవిమీదకు మళ్లుతుంది.

“ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు

నన్నుగమనించే వాడంటే నాకు పడదు

నన్నుపరికించే వాడంటే నాగ్గిట్టదు

కవితగడతానంటాడు వాడు నా మీద

పాడెగడతానంటానువాడి కవిత్వానికి నేను”

అసలుకవిత అప్పుడు మొదలవుతుంది-

“నన్నురాయటానికేముంది?

అరిగినబతుకులేసుకుని తిరుగుతారు మీరు

నాతోబేరాలాడతారు మీరు

రేపిక్కడేటాటావాడు మీకు స్వాగతం చెపుతాడు

రిలయెన్సోడుబూటు క్లినిక్‌ తెరుస్తాడు

నాకొడకల్లారా!

ఇక తిరగండి వాడి చుట్టూ

ఎందుకుబతుకుతార్రా

నన్నుబతికించుకోకుండా?

ఎట్లాబ్రతుకుతార్రా

నా నీడను సైతం చంపి”

నన్నురాయటానికి ఏముంది?

అరిగినబతుకులేసుకుని తిరిగే వాళ్లైన అందరూ అంటూ

టాటాలు,రిలయన్సులు… పేరున్న గొప్ప గొప్ప షూమార్టులు

మామూలుచెప్పులు కుట్టుకునే వాడి జీవితాన్ని ఎలాఛిద్రం చేసాయో

పెద్ద షాపుల్లో బేరమాడలేని జనం చెప్పులు కుట్టే వాడి దగ్గర ఎలా బేరమాడతారో అతనికి వచ్చే ఆదాయమెంత ని ఎలా ఆలోచించుకోరో చెపుతూ,

చేతి వృత్తులు,చిన్న చిన్న పనుల్తో పొట్ట పోసుకునే వాళ్ల బతుకులు ఎలా నాశన మవుతున్నాయో అతని ఆక్రోశం లోనే చెప్పడం తో కవిత పూర్తవుతుంది.

కవితని మొత్తం చదివాక ఇంత కంటే బాగా చెప్పగలిగితే, చివర్లో ఉన్న కవితాత్మ మొదట్నించీ కనిపించి ఉంటే ఎంత బావుణ్ణు! అని అనిపించక మానదు- కవితలో ప్రపంచీకరణ పై పళ్లునూరుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత అతని జీవితం వెనుక కన్నీటి పై కూడా ఉండి ఉంటే మంచి కవిత అయి ఉండేదేమో!

ఒక కొత్త కవి ఏదైనా రాస్తే కవితకి తీసుకున్న”బలమైన వస్తువుని” సరిగా చెప్పడం రాలేదని అంటాం. లేదా దీన్ని కవిత్వం చేసే పని మళ్లీ చెయ్యమని పురమాయిస్తాం.

మరి ఈ కవితకి ఏమని చెప్పాలో!

కుప్పంకాబ్లర్‌

ఈ చెట్టు కిందే

మాతాత గూటం పాతాడు

దీని నీడలోనే మా అయ్య నడిచాడు

నేనూ ఇక్కడే పాతుకు పోయాను పాతికేళ్ళుగా

అరిగినచెప్పుల్ని చదవగలను నేను

తెగిన ఉంగటాలు చూసి చెప్పగలను

మీరెలాంటి వాళ్ళో

మీ బూట్లకి పాలిష్‌ చేస్తున్నప్పుడు వినగలను

మీ పాదాల వంకర నడకలను

వాటికి అడుగులు వేస్తున్నప్పుడు చూడగలను

మీ నడతలోని తప్పు ఒప్పుల్ని

మీరు నాకిస్తున్న రూపాయనూ

ఇవ్వడానికి చాచిన చేతులనూ

దర్శించి చెప్పగలను మీ వ్యక్తిత్వాలను

ఎందుకేసుకుంటారయ్యా మీరు చెప్పులు?

మరెందుకు తొడుగుతారయ్య బూట్లు?

నన్ను చూడండి

దసలకుండా మెసలకుండా ఇక్కడే కూర్చుంటాను

నేను మీలా ఏ హాజరుపట్టికల్లోసంతకం పెట్టను

అసలు స్వేచ్ఛంటే నాది

ఇష్టమైతే ఈ చెట్టు కిందకొస్తాను

ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడునాకు

నన్ను గమనించే వాడంటే నాకు పడదు

నన్ను పరికించే వాడంటే నాగ్గిట్టదు

కవిత గడతానంటాడు వాడు నా మీద

పాడెగడతానంటాను వాడి కవిత్వానికి నేను

నన్ను రాయటానికేముంది?

అరిగిన బతుకులేసుకుని తిరుగుతారు మీరు

నాతో బేరాలాడతారు మీరు

రేపిక్కడే టాటావాడు మీకు స్వాగతం చెపుతాడు

రిలయెన్సోడు బూటు క్లినిక్‌ తెరుస్తాడు

నాకొడకల్లారా!

ఇక తిరగండి వాడి చుట్టూ

ఎందుకు బతుకుతార్రా

నన్ను బతికించుకోకుండా?

ఎట్లా బ్రతుకుతార్రా

నా నీడను సైతం చంపి

- సీతారాం

(ఓ చెప్పుల మనస్తత్వ శాస్త్రవేత్త ఆత్మవెత)

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!
“లోపలి మాట” కొత్త శీర్షిక ప్రారంభం

కవిత్వం నిరంతర సాధన ఫలం. ప్రతి కవికీ తనదయిన వాక్యసాధన కోసం అహోరాత్రాలు తపించాల్సి వుంటుంది. కేవలం పొగడ్తలే ఈ సాధనలో పనికి రావు. వాక్య రహస్యం చెప్పే విమర్శ కవిని ముందుకు నడిపిస్తుంది. ఇంకా పదునయిన కవిత దిశగా నడిపిస్తుంది. అలాంటి దారిదీపం ఈ ‘లోపలి మాట’ శీర్షిక. ఒక కవిత తీసుకుని అందులోని లోటుపాట్లని వివరించే శీర్షిక. ప్రతి రెండో శుక్రవారం మీ కోసం!

భావుకత్వపు పందిరి కింద ప్రేమ, ప్రకృతి, జ్ఞాపకాలు, వియోగం అనే నాలుగు స్తంభాలాటలో తమ అనుభూతులను కవిత్వంతో దాగుడుమూతలాడించిడం చాలామంది కవుల్లాగే మానసకూ ఇష్టమైన ఆటలా అనిపిస్తుంది. ఈ కవితను ’చిలకలు వాలే చెట్టు’గా పిలుచుకొని పచ్చగా నవ్వుకోవడం లోనే ఆమె కవిత్వపు తాలూకూ ఒక ఆహ్లాదభరితమైన కువకువ మనకు వినిపిస్తుంది.

మొదటి పంక్తుల్లో- జీవిత గమనంతో, కాలపు వేగంతో పాటు అనివార్యంగా పెట్టే పరుగు విసుగెత్తినప్పుడు, ఒక ఆశయమంటూ లేక అలసిపోవడం కోసమే పరుగులు పెట్టిన బాల్యపు గుర్తుల్ని స్మరిస్తూ సముద్రపు అలలమీది నురగలాంటి తేలికపాటి విరామంలోకి జారుకుంటుంది సందర్భం. అక్కడ తీరం గురించిన దిగుల్లేదు. కావల్సిందల్లా మరో ఆలోచన ఒత్తిడి చెయ్యలేనంతగా చుట్టు ముట్టే సంతోషపు సముద్రమే.

ఐతే ఈలోగా సంతసపు సముద్రం కాస్తా కల్లోలపు కడలి అయిపోతుంది. ఆ కల్లోలానికి కారణం “నా స్వార్థ చింతనకు లోబడ్డ  నిర్ణయాలేవో” అని చెప్పుకోవడం లో తరువాతి పంక్తుల్లో ఉధృతమవ్వబోయే ఆత్మనింద గురించిన తీగ దొరికేస్తుంది. “కల్లోల కడలిలో మార్గం తప్పిన సుమనస్సునై, ఆసరా ఇవ్వగల పట్టుకొమ్మకై అన్వేషిస్తూ” కడలిలో మార్గం తప్పినప్పుడు కావల్సింది దారిచూపే చుక్కాని కానీ మునిగిపోకుండా, జారిపడకుండా ఆసరా చేసుకునే పట్టుకొమ్మ కాదుగా అని అనుమానమేస్తుంది. అదీ కాక ’సుమనస్సు’ అనే చెప్పుకోవడం వల్ల కావల్సింది చెడునుంచి మళ్ళింపు మాత్రమే అని కూడా తోస్తుంది. పైగా మొదటి రెండు ఖండికల్లోనే ’మానసాన్ని, సుమనస్సునై’ అని కనపడ్దప్పుడు ఆ పదాల వాడకంలో కాస్త అత్యుత్సాహం గోచరించే ప్రమాదం కూడా ఉంది.

“సరిగ్గా అలాంటప్పుడే గుర్తొస్తుంది -అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు” అని తర్వాతి వాక్యాల్లో చెప్పేవరకూ ఇది సముద్రాన్ని ప్రతీకగా తీసుకుని ఆసాంతం సాగబోయే కవిత ఏమోనని అప్పటివరకూ ఉన్న ఒక అంచనాను తల్లకిందులు చేసి ఉన్నట్టుండి బాల్యపు జ్ఞాపకాల చెట్టెక్కి కూచుంటుంది. అప్పటివరకూ ఉన్న సముద్రమూ, జీవన తరంగాలతో  సంబంధమూ, కొనసాగింపూ లేకుండా అసలు ఇక్కడనుంచి మరో కొత్తరకం ప్రారంభం, దాని కొనసాగింపూ జరుగుతాయి. ఆ కొనసాగింపులో బాల్యమూ, స్నేహమూ, యవ్వనమూ వంటి దశలన్నిటిలో ఆ చెట్టు పాత్ర ఉన్న సన్నివేశాలను జాగ్రత్తగా మాలికగా అల్లుతూ ఒక వరసను తీసుకువచ్చారు. ఐతే చిక్కంతా ఆ చెట్టుకి కవి దూరమవ్వడం తో వచ్చింది. అప్పటివరకూ జ్ఞాపకాల దొంతరగా, అనుభూతి ప్రధానంగా, లాలిత్యం నేపథ్యంగా సాగిన ధార ఉన్నట్టుండి స్వగతపు ధోరణిలోకి, ఇందాకనే హెచ్చరించినట్టు తీవ్రమైన ఆత్మనిందలోకీ దిగుతుంది.

“తల్లీ తండ్రీ అన్నీ తానై పెంచిన అమ్మను అద్దె కొంపకు పొమ్మంటూ వెళ్ళగొట్టినప్పుడే,” అన్న వాక్యాల దగ్గరే ఈ కవిత ఊహించని మరో దోవలోకి దిగిపోయింది. అప్పటిదాకా చంగనాలు, నిప్పచ్చరాలు అంటూ అనుభూతి ప్రధానంగా సాగిన నడక అక్కడితో మొదలుకొని ఏసీలు, కంప్యూటర్, గేమ్స్, మూడంతస్తుల మేడలు అంటూ చిలకలకీ, చెట్టుకీ, అనుభూతికీ చెందని వాస్తవిక జీవన చిత్రణలోని వస్తు సంచయాన్ని వరసగా హడావిడిగా పేర్చేస్తుంది. ఉన్నట్టుండి సామాజిక పరిణామాల, హరిత విప్లవాల సందేశాల ఊపులో పడిపోయి పాఠకుణ్ణి పట్టించుకోవడం మానేస్తుంది. “వినతిపత్రాన్నెగురవేస్తూ నిష్క్రమిస్తాను. “ అంటూ చివరికి ఉపన్యాస ధోరణిలో ముగుస్తుంది.

ఎంచుకున్న “జామ చెట్టు” అన్న ఒక్క వస్తువుని కేంద్రంగా చేసుకుని బహుముఖాల జివితానుభవాల్ని చూపించే ప్రయత్నం బావున్నప్పటికీ,  వ్యక్తీకరణలో సమన్వయ లోపం వల్ల కాస్త అయోమయానికి గురయిన కవిత ఇది. భాషా పరంగా ఉల్లాసంగా సాగుతూ మధ్యల్లో సతతమూ, ఆలింగనాభిలాషి వంటి పదాలతో అక్కడక్కడా బరువెక్కింది. ఒకచోట “విషాదపు సుళ్ళు తిరుగుతున్నాయి.” అన్న సందర్భంలో స్నేహితులతో వచ్చిన దూరం సమయానుగుణంగా వచ్చిన సహజమైన దూరమే కాబట్టి అది దిగులుగానో, బెంగగానో మారుతుంది తప్ప ’విషాదం’ గా భావించడం అక్కడ ఒదగలేదనిపిస్తుంది. మరోచోట శుద్ధ వ్యావారికంలో సాగుతున్న మాటల మధ్య “అబ్బెసము” వంటి పొసగని ప్రయోగమూ , “ఆకులొచ్చాయనీ, పిందె  కాసిందనీ” వంటి చోట్ల వర్ణన కన్నా వివరణ ఎక్కువై కాస్త సాగతీతగానూ, అసౌకర్యంగానూ అనిపిస్తుంది.

చిలుకలు వాలే చెట్టు

పరుగాపి నిలబడ్డ ప్రతిసారీ

పసితనం పసందైన జ్ఞాపకాలతో

మానసాన్ని పెనవేసుకుపోతుంది

అప్పుడు సంతసపు సంద్రములో

తీరం గురించి తపన లేని వాడిలా,

హాయి కెరటాల తేలిపోతుంటాను.

ఇంకొన్ని సార్లు ఏమీ తోచని ఏకాంతంలో

నా స్వార్థ చింతనకు లోబడ్డ నిర్ణయాలేవో

స్వాంత సరోజాన్ని రేకులుగా విడదీస్తుంటే

కల్లోల కడలిలో మార్గం తప్పిన సుమనస్సునై

ఆసరా ఇవ్వగల పట్టుకొమ్మకై అన్వేషిస్తూ

ఆర్తిగా నిరీక్షిస్తుంటాను.

సరిగ్గా అలాంటప్పుడే గుర్తొస్తుంది -

అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు

పెరిగి బాల్యమంతా పరచుకున్న

చిలుకలు వాలే జాంచెట్టు

అది చిన్ననాటి చెదురని స్మృతుల్లో

చంపక వృక్షం చెంగట ఠీవిగా

సతతము పచ్చగా, పదిలంగా

ఆలింగనాభిలాషిగా నిలబడ్డ గుర్తు!

చిట్టి పొట్టి చేతులతో నీళ్ళు పోసి,

మొక్క మొదట్లో మన్ను మార్చి,

ఆకు లొచ్చాయనీ, పిందె కాసిందనీ

మెరుస్తోన్న కళ్ళతో విరుస్తోన్న నవ్వుల్తో

చాటింపేసిన నాటి చెంగనాలు గుర్తొస్తుంటే

గుబులు ఊబిలోకి గుండె పరుగులిడుతుంది.

ధృఢంగా నిలబడ్డ కొమ్మలకు

అట్లతద్ది నాడు ఉయ్యాలలేసి

ఆకాశం వైపుకి ఈడ్చి విసిరేస్తే

పసిపాపల్లే మారిన అమ్మ

కేరింతలు తుళ్ళింతలు

సెలయేరు గలగలల్లో కలగలసిన

అలనాటి మా నవ్వులు

దిగంతాల తేలి వచ్చే దివ్యగానంలా

అప్పుడప్పుడూ తాకిపోతుంటాయి.

నడి వేసవి రోజుల్లో నేస్తాలను వెంటతెచ్చి

వేళ కాని వేళల్లో పంతంగా చెట్టు దులపరించి

పచ్చి జాంపళ్ళ వగరు రుచికి వెరసి

వాటన్నింటినీ వంతులేసుకు విసిరేసి

చెరువులో వలయాలు చూసి

విరగబడి నవ్విన రోజుల తలపోస్తే

ఈ క్షణాన హృదయ తటాకాన

విషాదపు సుళ్ళు తిరుగుతున్నాయి.

పసితనం దొర్లిపోయి యుక్తవయసు

ఉరకలేస్తూ వద్దకొచ్చాక

ఓ నిశ్శబ్దపు శారద రాతిరి

ప్రేయసిని బిడియంగా పిలిచి

అక్కడే, ఆ చెట్టు క్రిందే,

విరబూసిన వెండి వెన్నెల కౌగిట్లోనే

దోరపండు కాకెంగిలి చేసుకుంటూ

ఆ అచ్చరకు మనసిచ్చిన స్మృతులు

తాకీ తాకని తనువుల స్పర్శకి మేం

తడబడి ఒణికిన క్షణాల గుర్తులు

వర్తమానంలోని నిప్పచ్చరాన్ని

నిర్దయగా చూపెడుతున్నాయి..!

కాలం కొలిమిలో కలలూ క్షణాలూ కరిగాయి

నేను పెద్దవాడినవుతూనే పేదవాణ్ణయ్యాను

తల్లీ తండ్రీ అన్నీ తానై పెంచిన అమ్మను

అద్దె కొంపకు పొమ్మంటూ వెళ్ళగొట్టినప్పుడే,

ఇల్లు కూలగొట్టి మేడలు కట్టాలన్న దురాశతో

పొదరింటిని చేజేతులా పోగొట్టుకున్నప్పుడే

నేను నిరుపేదనయ్యాను.

పసితనపు తొలి సంతకాన్నీ

తొలివలపు తీపి గురుతునీ

మళ్ళీ దొరకని అమ్మ ప్రేమనీ,

అమృతాన్విత తరువునీ

అన్నింటినీ కోల్పోయిన

అభాగ్యుడనయ్యాను.

చెరువొడ్డున చల్లగాలికి ఆటలాడిన గతం

ఈ ఎ.సి గాలుల్లోని కృత్రిమత్వానికి

ఉక్కపోతకి గురై ఉక్కిరిబిక్కిరవుతోంది

మలయమారుతం కలలోలా స్పృశిస్తుంటే

మనసంతా స్పష్టాస్పష్ట భావాల హేలతో

సతమతమైపోతోంది.

చెట్లెక్కి పుట్టలెక్కి ఆటలాడి అలసిన బాల్యం

అడుగు మేర కూడా మట్టి లేని ఇంటిలో

కంప్యూటర్ల ముందు కళ్ళద్దాలతో కూర్చుని

తోడక్కర్లేని క్రీడలాడుతున్నమనవళ్ళను చూసి

మాటలు మరచిన మర మనుష్యులను చూసి

బెంగగా నిట్టూరుస్తోంది

వెర్రి ఆటలాడుతూ, యంత్రాలతో పోటీలు పడుతున్న

పసికూనలను చూసిన ప్రతిసారీ బరువెక్కిపోయే గుండె,

చెరువు మీదకి నిండా వంగిన చిట్టచివరి కొమ్మనెక్కి

పళ్ళూ కాయలూ కోయడానికి కావలసిన అబ్బెసమూ

పట్టు తప్పి పడితే,తడిసిన మనసు ఆరదన్న సత్యమూ

తెలియజెప్పాలని తపన పడుతోంది!

కానీ ఎలా..

ఇప్పుడా చెట్టు లేదుగా..

నే కట్టిన మూడంతస్థుల మేడ తప్ప!

ఆ చెరువూ కనరాదిక,

తప్పు కప్పేందుకు మేం పోసిన

మూడు లారీల మట్టి తప్ప!

అందుకే ఈ ఆఖరు మజిలీలో,

నా జీవితపు చివరి రోజుల్లో..

ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది

ఎవ్వరైనా, నడవలేని నవ్వలేని

ఈ ముసలివాడికి

తప్పుల తలచి

కన్నీళ్ళ కరిగే

పశ్చాత్తాపానికి

ఒక్క విత్తివ్వండి…

కాంక్రీటు కట్టడాల వికృత లోకపు నడుమన

అణువణువూ యంత్రాలు కుతంత్రాలు నిండిన

నాగరిక ప్రపంచాన ఎక్కడైనా..ఏ మూలైనా..

గుండె ఉన్న మనుష్యులారా…

గుప్పెడు మన్నున్న చోటుంటే కాస్త చూపెట్టండి.

విత్తులు విచ్చుకు విరిసే బృందావనాల నూహిస్తూ..

పూప్రదక్షిణాల అలసే తుంటరి ఎలతేంట్లను తలపోస్తూ..

జగాన పచ్చందనాల సిరులు కురవాలని

ఆపై నేనిక కొమ్మల మసలే చిలుకనవ్వాలని

వినతిపత్రాన్నెగురవేస్తూ నిష్క్రమిస్తాను.

http://www.madhumanasam.in/2012/09/blog-post_9.html