వాకిలి » ఫస్ట్ పర్సన్

కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి: నల్లూరి రుక్మిణి
నల్లూరి రుక్మిణి గారు కథా, నవలా రచయిత్రిగా అందరికీ సుపరిచుతులే. విరసం అధ్యక్షులుగా పనిచేసిన సి.ఎస్.ఆర్.ప్రసాద్ గారి సహచరిగా తానూ విరసం సభ్యురాలిగా వుంటూ తమ నలభై ఏళ్ళ సాహచర్యంలో ఇప్పటికీ గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలలో జరిగే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలలో మమేకమవుతూ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఎంతో మంది పేదలు, మహిళలకు, కార్మికులకు సాయపడుతూ ఉద్యమాచరణతో, సాహిత్య కృషితో సాగుతున్న క్రమాన్ని మనతో ఇలా పంచుకున్నారు.. రుక్మిణి గారు ‘నర్రెంక సెట్టుకింద’ నవల, నెగడు పేరుతో కథా సంకలనం వెలువరించారు.

ఇప్పటి దినచర్య: ప్రాధమికంగా చదువుకోవడం, రాయాలనిపించినప్పుడు రాయడం, వృత్తి రీత్యా లాయర్ నికానీ అది కాలక్షేపానికే.

ఇప్పటి కాలక్షేపం: Physical activities, field acitivites, స్త్రీలపై జరిగే దాడులుపై  fact finding teams తో పాలుపంచుకోవడం. ఇటీవల గుంటూరులో ఓ కార్పొరేట్ కాలేజీలో విదార్థిని మరణిస్తే అది ఆత్మహత్యగా మార్చడానికి చూస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అది ఆత్మ హత్య కాదని తమ ఆవేదనను చెబితే దానిపై ప్రజా సంఘాలతో నిజ నిర్థారణ కమిటీ వేసి వారికి మధ్ధతుగా నిలిచాం. ఇలా స్త్రీలపై జరిగే దాడులపై  నా దృష్టికి వచ్చిన వాటిపై స్పందిస్తుంటా. ప్రజా సంఘాల ధర్నాలులో పాల్గొనడం. ఇలా నలబై ఏళ్ళుగా ఇదే కార్యాచరణలో వున్నాం. యిప్పటికీ ఇలానే వున్నాం.

రచన నేపథ్యం: నెగడు కథ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై రాసింది. పోలవరం ప్రాజెక్టు అక్కడి ఆదివాసీ జీవితాలలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో చెప్పడానికి ప్రయత్నించా. అలాగే సెజ్ మీద రాసిన కథ సామాన్యుల జీవితాలలో ఎటువంటి మార్పులు, వాటి వలన కలుగుతున్న సామాజిక మార్పులు గురించి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక దాడిని కథలలో చెప్పే ప్రయత్నం చేస్తున్న.అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకుని వచ్చే మార్పు రావాలి. కానీ ఇది పైనుంచి రుద్ద బడుతున్న మార్పు. ఇలా సామాన్యుల జీవితాలలో జరుగుతున్న అవాంచిత మార్పులను పుట్టు కురుపు కథ రాసాను.  సివారు బతుకులు చాలా చిన్న కథ. beautification పేరుతో నగరంలోని పేదవారందరినీ స్వర్ణభారతి కాలనీలోకి నెట్టారు. ఇక్కడ రెండు రకాల జీవితాలు. ముందు పొద్దున్న పనికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి వెళ్ళే వారు. ఇలా కాకుండా నగరానికి దూరంగా వీరంతా ఉండడంతో ఉదయం బయల్దేరి సాయంత్రం వస్తారు. పెద్ద పిల్లలు చదువుకు దూరం కావడం. లంపెన్ వాతావరణం అలముకుంది. పదో తరగతి పిల్లాడు తనకంటే చిన్నదైన అమ్మాయిని రేప్ చేసాడు. ఎందుకంటే తల్లి దండ్రుల సంరక్షణకు దూరం కావడంతో ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తూ పిల్లలు రక రకాల ప్రభావాలకు లోనవుతున్నారు. కానరాని హింస సివారు జీవితాలలో వుంటోంది. ఈ నేపథ్యాలలోంచి కథలు రాసాను. మధ్య తరగతి జీవితాలను గూర్చి చాలా చెప్పవచ్చు. కానీ నిర్వాసితులు, అణగారిన వర్గాల జీవితాలలోని హింసను రాస్తున్నాను. మధ్యతరగతి జీవితాల గురించి కొ.కు. వేల కథలు రాసారు. నేను పల్లెటూరి జీవితం నుంచి రావడం వలన, నలభై ఏళ్ళుగా upper middle class జీవితం అనుభవిస్తున్నా నాకు అణగారిన వర్గాల గురించి, వారి జీవితాలలో అనుభవిస్తున్న హింసను గురించి రాయడమే ఇష్టం.

ఇప్పటి కథల గురించి: కళ కళ కోసమే అన్నట్టు రాస్తున్న వాళ్ళు నేడు ఎక్కువగా కనిపిస్తున్నారు.  వస్తు వైవిధ్యంతో వున్నాయనిపిస్తున్న కథలు కూడా చాలా వరకు పాత కథలే. బ్రహ్మాండంగా వున్నట్టు అనిపిస్తున్నా అవన్నీ వ్యవస్థతో రాజీపడుతూ వున్న వ్యవస్థను కాపాడడానికి రాస్తున్న కథలేనని నా అభిప్రాయం. ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటున్న. దండకారణ్యంలో నేడు జనతన సర్కార్ ద్వారా వారి జీవితాలలో వస్తున్న సాంస్కృతిక సామాజిక మార్పులను నేడు అజ్నాతంలో వున్న రచయితలు చాలా వైవిధ్యంతో రాస్తున్నారు. ఇటీవల అరుణతారలో వచ్చిన ‘టీ గ్లాసు’ కథ ఉదాహరణ. బయటి వాళ్ళు మన కథలను అంగీకరించక పోవడానికి కారణం ఇప్పుడున్న వ్యవస్థను మార్చాలన్న దానికి అంగీకరించకపోవడమే. సామాన్య కథలు చదవడానికి బాగున్నట్టనిపించినా ముగింపు ఏ మార్పును ఆశించదు. కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి. చదివాక కథ మనల్ని వెంటాడాలి. ఇటీవల ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఉమామహేశ్వర రావు కథ Technology ని గురించి రాసింది. అది మనబోటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కానీ సామాన్యులకు కాదు. గోర్కీ అమ్మ చదివితే అమ్మలా పనిచేయాలనిపిస్తుంది. అలా కథ కానీ నవల కానీ మనల్ని కార్యాచరణ వైపు పురికొల్పాలి.  రచన పరమార్థం ఇది కావాలి.

స్త్రీవాదం గురించి: స్త్రీ వాదానికి పరిమితులున్నాయి. పురుషాధిపత్యం ఈ సమాజంలో అంతర్భాగం. ఇది వర్గ సంబంధాలలో కలిసే వుండే భాగం. దీనిని స్త్రీవాదులు accept చేయాలి. స్త్రీవాదం స్త్రీల దృక్కోణాన్ని ప్రపంచానికి తెలియ చేయడానికి ఉపకరించింది. కమ్యూనిస్టు పార్టీలు సమాజ మార్పును కోరుకున్నా మనల్ని మనం మార్చుకుంటూ సమాజాన్ని మార్చాలన్న క్రమాన్ని చాలా ఏళ్ళు తమ ఆచరణలో లేకపోవడాన్ని స్త్రీ దళిత వాదాలు బయటికి తీసుకు వచ్చి ప్రశ్నించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ చాలా వరకు స్త్రీ వాద గ్రూపులు తమను తాము మార్చుకుంటూ సమాజాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో వచ్చినవి కావు. పురుషాధిపత్య nature  స్తీ వాద గ్రూపులలో వ్యక్తులలో egoistic గా వుండడం శోచనీయం. వీళ్ళలో anti Maoist approach తో పనిచేస్తు వున్న గ్రూపులున్నాయి. సమాజంతో రాజీ పడి బతుకుతూ బతకడం కోసమే మేము బయటికి వచ్చాం అన్నవి.  సమాజంలో వస్తున్న మార్పును కనీసం చూడకుండా దాడే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. గ్లోబలైజేషన్ నేపధ్యం కమ్యూనిస్ట్ నేపధ్యం నుండి వస్తున్న వాళ్ళమీద కూడా వుంటోంది.

ఇటీవల రచనలు: 2011లో ఒక చేయి 2012లో ఒక చేయి ఆర్నెల్లపాటు విరిగి బాధపడ్డా. అందుకే 2012లో రెండే కథలు రాసాను. చర్ల నిజనిర్థారణ తరువాత ప్రవాహం తిరోగమించదు అన్న కథ రాసాను. కిషన్జీ చనిపోయిన నేపథ్యంలో ముంజేతులు ఖండించినా అన్న కథ రాసాను. 2012 డిసెంబరులో ‘కంపెనీ తిరునాళ్ళు’  అన్న కథ రాసాను. ఇది ప్రపంచ తెలుగు మహాసభల ముందు వచ్చి వుంటే బాగుణ్ణు. ఆంధ్రజ్యోతికి పంపించా. కానీ వారికి ఇలాంటి కథ వేసే ఉద్దేశ్యం లేదన్నది అర్థమయింది. అరుణతారకు పంపా. కార్పొరేట్ సెక్షన్ చేస్తున్న సాహిత్య సమావేశాలుపై రాసింది. ఆటా, తానా వంటి NRI సంస్థలు, రాంకీ వంటి కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో అన్నది సబ్జెక్టు. మునుపు నాలుగైదు గ్రామాలు కలిసి జాతరలానో తిరునాళ్ళలోనో నిర్వహించి అనేక సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించేవి. అవి చాణ్ణాళ్ళపాటు నెమరు వేసుకునేవిగా వుండేవి. ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ కళారూపాలను మొక్కుబడిగ నిర్వహిస్తూ తామేదో తెలుగు సాంస్కృతిక రంగానికి సేవ చేస్తున్నట్టు నటిస్తున్నాయి. సంస్కృతిని ఆకళింపు చేసుకోకపోతే culture ఎలా వుంటుందన్నది ఈ కథ, అరుణతారలో త్వరలో రావచ్చు.

ఇంటర్వ్యూ: కెక్యూబ్ వర్మ

వర్గసమాజాన్ని గుర్తించాలి
విరసం వ్యవస్థాపక సభ్యురాలు  క్రిష్ణాబాయిగారు  ప్రస్తుతం విశాఖలో వుంటున్నారు. క్రిష్ణక్కగా అందరికి సుపరిచితం.  చిన్న నాటి నుండే వామ పక్ష ఉద్యమాలతో కుటుంభానికి వున్న అనుబందంతో విప్లవ రాజకీయాల పట్ల అవగాహనతో ఆత్మీయంగా కలసి పనిచేస్తున్నారు. విరసం ఏర్పడిన నాటి నుండి సభ్యురాలుగా వుంటు కార్యదర్శిగా కూడా పని చేసారు. విరసంను నిషేధించిన కాలంలో ఆమె కార్యదర్శిగా వున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోను తను భాగస్వాములవుతూ ఇప్పటికీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విరసం తీసుకు వచ్చిన కొడవటిగంటి సంపుటాలు సమగ్రంగా రావడానికి వీరి కృషి కూడా ప్రధాన కారణం. సాహిత్యం, ఉద్యమం రెండు రంగాలలోను తన పాత్ర ఆదర్శనీయం.

కృష్ణక్క ఈ నెల మన ‘ఫస్ట్ పర్సన్.’

ఇప్పటి దినచర్య:

ఇంట్లో రిటైర్డ్ లైఫ్. అంటే వంటపని లాంటివి లేకుండా పేపర్లు చదవడం, సాహిత్యం చదవడం, వచ్చిన మిత్రులతో చర్చా గోష్టి.

ఇప్పటి కాలక్షేపం:

ఇంటికి వచ్చిన మిత్రులతో చర్చా గోష్టి. ఇటీవల స్త్రీలపై జరుగుతున్న దాడుల గురించి, వాటి పట్ల సమాజం స్పందించే తీరును చర్చించడం. సమాజం వీటిని ఎదుర్కునే పరిస్థితులపై చర్చ.

ఇటీవల స్త్రీలపై పెరిగిన దాడుల పట్ల మీ స్పందన:

ఇతర దేశాలలో ఇంతలా స్త్రీలపై ఇటువంటి దాడులు లేవు కదా. భారతదేశం స్రీని గుర్తించింది, పూజించింది, కీర్తించింది అని చెప్పుకుంటాం. కానీ మన దేశంలోనే ఈ దారుణాలు అధికంగా జరగడం తీవ్రంగా కలచి వేస్తోంది. ఆకలికన్నా కామ దాహం ఎక్కువయింది. ఢిల్లీ సంఘటనపై హరగోపాల్ గారు ఒక మాటన్నారు ” ఆ అమ్మాయి మెడికల్ విద్యార్థిని కాబట్టే ఇంత స్పందన వచ్చిందని “. కానీ అది నాకు సమ్మతం కాదు. ఈ దారుణంలో ఆ అమ్మాయి తీవ్రంగా దాడి చేయబడడం,  తన మానంపై రాక్షసంగా జరిగిన దాడి, ఆ తరువాత నేరస్థులు ప్రవర్తించిన తీరు పట్ల తప్పక ఇంతకంటే ఎక్కువ స్పందనే అవసరం. ఇటీవల నేను ఆంధ్రజ్యోతిలో చెప్పినట్లు బెజవాడ-విజయవాడగా మారిన పరిస్థితి గురించి ఓ మాట, అప్పట్లో మేము సైకిల్ పై కాలేజీకి వెళ్తుండగా బెజవాడలో సీతారామ భక్త సమాజం వాళ్ళు వెంటపడి అల్లరి చేస్తే నేను అప్పట్లో కమ్యూనిస్ట్  పార్టీ వారి కోలనీ ప్రజాశక్తి నగర్ లోని విద్యార్థి సంఘ కార్యాలయంలో రిపోర్టు చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి దేహ శుద్ధి చేసి బుద్ధి చెప్పారు. ఇప్పుడు విజయవాడగా మారిన తరువాత ఆయేషాపై అలాగే ఇంకా అనేక దారుణాలు స్త్రీలపైనా, విద్యార్హ్తినులపైనా జరుగుతున్నా స్పందించే వారు కరువవడం బాధగా వుంది.

సాహిత్యంలో స్త్రీ:

గురజాడ ఆధునిక స్త్రీని కలగన్నాడు. ఆధునిక స్త్రీ అంటే ఏమిటి, ఎలా వుండాలన్నది తన రచనల ద్వారా తెలియ చెప్పాడు  నా చిన్నప్పుడు నా చేతిలో చలం పుస్తకం చూసిన చండ్ర రాజేశ్వర రావుగారు ఆయన బూతు రాస్తాడు తీసి అవతల పారేయి అని అన్నారు. ఇది కమ్యూనిస్టులు అప్పట్లో చేసిన తప్పే. జ్నానం తెలిసిన తరువాత ఎంత పొరపాటు చేసామో తెలిసింది. ఇప్పటికీ నాకే కాదు నేటి సమాజానికి కూడా చలం స్త్రీ,. మ్యూజింగ్స్, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ ఆరాధ్య గ్రంధాలు. చలం స్త్రీ లిబరేషన్ గురించి బాగా చెప్పాడు. ఆయన తరువాత ఆయన శిష్యులు, అనుచరులు ఫాలో కాలేదు, తెలుసుకోలేదు. ఇది అన్ని చోట్లా వుంది.

ఇతర దేశాలలో అక్కడి స్త్రీల జీవనాన్ని నిశితంగా పరిశీలించిన ఉప్పల లక్ష్మణ రావు గారి అతడు ఆమె నవల నాకు చాలా ఇష్టం. ఇది డైరీ ఫార్మాట్ లో రాసింది. ఒకే సంఘటన పట్ల ఇద్దరి స్పందన ఎలా వుందనేది చెప్పారు. ఇది ఎందుకో కారా మాస్టారికి నచ్చలేదు.  అరసంలో కవిత్వం వచ్చినంతగా కథా, నవలలు రాలేదు. విరసంలో వర్గ సమాజంలో స్త్రీ ఎట్లా వుందనేది మాత్రమే వస్తోంది. అలాగే అమ్మ – విప్లవయుగం అని గద్దె లింగయ్య గారు రాసిన నవల  నాపై చాలా ప్రభావం వేసింది. ఇది ఉద్యమాలలోని స్త్రీలపై రాసింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీపై నిషేదం వచ్చినప్పుడు మా అమ్మ ఇవి రెండుపుస్తకాలు గడ్డి వాములో దాచి పెట్టారు.  ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా స్త్రీ పాత్ర తక్కువగా వుండేది. కుటుంబానికే పరిమితమయ్యేది. మాపై అప్పటి ప్రజా నాట్యమండలి వారి బుర్రకథలు చాలా ప్రభావం వేసాయి. ఆ వాతావరణం ఇప్పటి సమాజంలో లేకపోవడం విషాదం.

అస్తిత్వ వాదాల పట్ల అభిప్రాయం:

అస్తిత్వ వాదాలు నాకు నచ్చవు. దళిత వాదం తీసుకు వచ్చిన ఆత్మ గౌరవ పోరాటాలు కావాల్సినవే. స్త్రీవాదం అనేది పురుషుడు స్త్రీ అనే వర్గ వైరుధ్యం కరెక్ట్ కాదు. వర్గ సమాజాన్ని గుర్తించకుండా ఎవరికి వారు చేసే వాద ప్రతివాదాలు, ఉద్యమాల ప్రభావం సమాజం మార్పుకు దారి తీయదు. విరసంపై వాటి ప్రభావం అంతంత మాత్రమే.

ఇటీవల నచ్చిన కథ:

ఈ మధ్య రాస్తున్న సామాన్య కథలంటే ఇష్టం. బాగా రాస్తోంది. గొప్పగా వచ్చాయని చెప్పుకునే కథలేవి లేవన్నదే నా అభిప్రాయం. ఇటీవల కాశ్మీర్ వెళ్ళినపుడు అక్కడ కలిసిన బష్రత్ పీర్ అనే జర్నలిస్ట్ (న్యూయార్క్ లో పనిచేస్తున్నాడు) రాసిన గాయపడిన సౌందర్యం బాగా నచ్చిన నవల. రాజకీయపరంగా కూడా.

సమాజంపై ముఖ్యంగా రేప్ వంటి నేరాలపై చట్టాల ప్రభావం:

నేరం చేసిన వాళ్ళని ఆలశ్యానికి ఆస్కారం లేకుండా కఠినంగా శిక్షిస్తే కొంత భయం వస్తుంది. ఆ పరిస్థితులలో కఠిన చట్టాలు అవసరమే. న్యాయవ్యస్థ త్వరితంగా స్పందించాలనేది నా అభిప్రాయం.

స్త్రీలపై దాడుల పట్ల సమాజం ఎట్లా స్పందించాలనుకుంటున్నారు?

పిల్లలకు చిన్నప్పటినుండే ఆడ పిల్లలపట్ల ప్రేమగా ఆత్మీయంగా మైత్రీభావం కలిగేట్టు కుటుంబ పెంపకం వుండాలి. అప్పట్లో Moral lessons వుండేవి. అవి ఇప్పటి పాఠ్యాంశాలలో లేవు. కార్పొరేట్ చదువులు రేంకులకే పరిమితం కావడం, విద్యావ్యవస్ఠ విలువలను బోధించక పోవడం సమాజంపై తీవ్ర ప్రభావం వేస్తోంది. విద్యావ్యవస్థ మంచిగా లేదు. వ్యాపార ధోరణిలో మునిగిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా వుంటున్నాయి. మనుషుల పట్ల అప్యాయత, ప్రేమ తక్కువై ఆర్థిక విషయాల పట్ల మోజు పెరిగిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థి ఉద్యమాలు తగ్గిపోవడం నేటి పరిస్థితికి కారణం. కావున సమాజంలో విద్యార్థి దశనుండే స్త్రీ పురుషుల పట్ల మంచి అవగాహన కలిగి వుండే వాతావరణం కల్పించే విధంగా కుటుంబ వాతావరణంలో కూడా మార్పు రావాల్సిన అవసరమెంతైనా వుంది. నేటి ఆధునిక నెట్ ప్రపంచం సెన్సార్ లేని విధానం వలన, సినిమాలలో వస్తున్న అశ్లీల ధోరణి సమాజంపై అధిక ప్రభావాన్ని చూపుతున్నాయి. సెన్సార్ బోర్డు వారికే వీటి పట్ల అవగాహన లేక పోవడం దారుణం. వ్యాపార ధోరణి నుండి మార్పు రావాల్సిన అవసరముంది. విద్యార్థి యువజన సంఘాలు బాగా పని చేయాల్సిన అవసరముంది. సమాజం బాధ్యత తీసుకోవాలి.

చదువొక్కటే నా కాలక్షేపం
కారా మాస్టారుగా చిరపరిచితులు కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథకి పెద్ద దిక్కు. శారీరకంగా అలసిపోతున్న వయసులో కూడా పుస్తకం చదవకుండా/ కథ గురించి ఆలోచించకుండా ఇప్పటికీ వొక్క రోజు గడవదు ఆయనకి- ‘వాకిలి’ ఫస్ట్ పర్సన్ శీర్షిక కోసం మేం అడిగే అయిదారు రోజువారీ ప్రశ్నలకు ఆయన సమాధానాలివి. కారామాస్టారు మాట్లాడ్డమే పొదుపుగా, ఎడిట్ చేసినట్టుగా మాట్లాడతారు. క్లుప్తంగా ఇవీ ఆయన మాటలు.

కారా మాస్టారు గారితో ఫోన్ లో అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు:

ఇప్పటి దినచర్య: కథానిలయంనుండి దూరంగా చోడవరంలో వుంటున్నాను. వయసు 89. అందుచేత వెనకటి ఓపిక లేదు. ఒక కన్ను ఒక చేయి పని చేయదు. అయినా చదువుతున్నాను. కథానిలయం పనుల వత్తిడి వలన చాలా పుస్తకాలను చదవాలనుకున్నవి చదవలేక పోయా. ఆ పని ఇప్పుడు చేస్తున్న. మహా భారతం పూర్తయింది.

ఇప్పటి చదువు: మహాభారతం చదువుతున్నా పత్రికలలో వచ్చిన కథలు రెగ్యులర్ గా చదువుతున్నాను. అభిమానులు, కథా రచయితలు పంపిన కథా సంపుటాలు చవుతున్నాను. ఈ మధ్య చదివిన వాటిలో కన్నెగంటి చంద్ర కథల సంపుటి “మూడో ముద్రణ” impress చేసింది.

(కాళీపట్నం రామారావు)

ఇప్పటి కాలక్షేపం: చదువొక్కటే నా కాలక్షేపం. అలాగే నా దగ్గరకు వచ్చిన కథా రచయితలు అమ్మిపెట్టమన్న సంపుటాలు నన్ను చూడ వచ్చిన అభిమానులకు ఇస్తూ వుండడం.

కథ గూర్చి ఇప్పుడేమనుకుంటున్నారు.: తెలుగు కథ చాలా అభివృద్ధి చెందింది. కథకుల సంఖ్య బాగా పెరిగింది. బాగా రాస్తున్నారు. సంతృప్తికరంగా వుంది.

ఇటీవల వచ్చిన వాటిలో నచ్చిన కథ: ఒక కథంటూ చెప్పలేను, జ్నాపకశక్తి వుండడం లేదు. రెండు మూడేళ్ళలో వచ్చినవి గుర్తులేవు. ఈ మధ్యవి చెప్పగలను హైదరాబాదునుండి దళితుల సమస్యలపై రాస్తున్నఆయనా దళితుడే అనుకుంటా సతీష్ చందర్ కథలు నచ్చుతున్నాయి. కథ 2011 లో ఆయన తప్పు కథ వుంది.