వాకిలి » లాఫింగ్ ‘గ్యాస్’

పెళ్ళి చేసి చూడు!
పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!

‘పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు’ అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు!

పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే. ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి గుండెలు మొత్తం మండే ముప్పుంది. ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. ‘మన్ కీ బాత్’ అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!

పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ ‘సపరివార సమేతంగా’ విచ్చేసి చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. ‘మాయా బజారు’ మార్కు ‘వివాహ భోజనాలు’ మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని మా గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో మా వాడికిప్పుడు బేజారు!

పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి ప్రధాని రద్దు ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే పెద్ద ‘చిల్లర’ వ్యవహారంగా మారి కూర్చుంది.

అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే పిల్ల మామగారిముందు పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు. మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!

పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం. అత్తారేవీఁ అడగనే లేదు. పిలదాని మెళ్లో నిఖార్సైన నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి వేలాడేస్తానంటూ నానుస్తున్నాడిప్పుడు పాపం! తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!

సంభావన పంతుల్నుంచి.. సన్నాయి భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే.. అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!

చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది ‘ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?’ అన్న ఆరా ఆనక తీరిగ్గా. ముందసలు ‘ఆధార్ కార్డు ఉందా.. లేదా’ అని తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక. ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో డజను జతల కాళ్లు తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!

ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!

పేపర్ వర్క్
మా చిన్నతనంలో వార్తాపత్రికల ప్రయోజనాలను గురించి రాయమన్న ప్రశ్న తరచూ మార్చి మార్చి వస్తుండేది. వార్తాపత్రికలమీద పెట్టిన దృష్టి అవి తయారయే కాగితంమీద ఎందుకు పెట్టలేదనే సందేహం ఎప్పుడూ నన్ను పీడిస్తుంటుంది.

రాతకు కాగితం తప్పని సరి. కాగితాలు అందుబాటులో ఉండబట్టే కవులు, కథకలూ మన జీవితాలతో చెలగాడమాడుతున్నది. ‘అలా కాదు.. కాగితం అంటూ ఒకటి హద్దుగా ఉండబట్టే కదా వాళ్ల ధాటికి సమాజం తట్టుకో గలుగుతున్నది?’ లేకపోతే వాళ్ల ఆశుధారాశక్తికి మానవ సంఘం ఎప్పుడో కొట్టుకు పోయుండేది.. అనే విరసలూ కద్దు. ఆ ఊసులు మనకిప్పుడు వద్దు. కాగితాలతో ఒనగూడే ఇతర ప్రయోజనాలూ బోలెడున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో! వాటిని గురించి ముచ్చటించుకుందాం… ముచ్చటగా ఉంటుంది.

మన దేశ మంత్రివర్యుడొకడు చైనా సందర్శనకు వెళ్లాడుట ఒకసారి. అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించే సందర్భంలో వంద కి.మీ పొడుగున్న ఒక వంతెనను చూపించి ఎంత పకడ్బందీగా అది కట్టబడిందో, ఆ కట్టుబడికి ఎన్ని మిలియన్లు ఖర్చు అయిందో వివరించాడు చైనా మంత్రివర్యుడు. మరో సందర్భంలో అదే మహాశయుడు ఇంకేదో టూరు సందర్భంగా ఇండియా వచ్చినప్పుడు, ఇక్కడి అభివృద్ద్జిని అతగాడికి వివరించాల్సిన బాధ్యత ఇదివరకటి మంత్రివర్యుడికే అప్పగించబడింది. ఆ నేపథ్యంలో ఒక ప్రాంతాన్ని చూపిస్తూ ‘మీ దగ్గరున్న వంద కి.మీ వంతెనకన్నా రెట్టింపుంటుందీ నిర్మాణం. కాకపోతే ఖర్చు కట్టుబకి కాస్త ఎక్కువయింది..’ అనంటూ ఏవేవో వివరాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. అసలక్కడ ఏ వంతెనా లేకపోవడంతో నోరు వెళ్ల బెట్టిన చైనా పెద్దమనిషి. అదే విషయం అడిగితే ‘అక్కడే ఉంది, మీకూ మాకూ తేడా. మీకు కాగితాల ప్రయోజనం పరిమితంగానే తెలుసు. మాకు అపరిమితంగా తెలుసు’ అనేసాడు మన ఇండియా పెద్దాసామి.

కాగితాలనగానే సాధారణంగా మన మనసుల్లో మెదిలేవి బడిపిల్లకాయలు బస్తాల్లాంటి సంచుల్లో కుక్కుకొని మోసుకుంటూ తిరిగే బుక్కులు. వార్తా పత్రికలు, కార్యాలయాల తాలూకు దస్త్రాలు… గట్రా!

రోడ్లమీద, పార్కుల్లో చెల్లా చెదరుగా పడుండే పోగులు. రచయితలు, కవులు వాడే వాటితో ఏ ఉపయోగమూ ఉండక పోవచ్చుగానీ… పాతకాగితాలను రోట్లో రుబ్బి ఆ గుజ్జుతో బుట్టలు చేసేది మా అవ్వ. కాగితాలను రకరకాలుగా కత్తిరించి రంగులద్ది ఆ ముచ్చటైన బొమ్మల్ని ఇంటి గుమ్మాలకు వేలాడదీసేది మా అత్త. కాగితాలు ఉండలుగా మార్చి పురుగూ పుట్రా లోపలికి రాకుండా తూములకు అడ్డం పెడుతుండేవాడు మా తాత. బస్తాలకి బెజ్జం పడి ధాన్యం కారిపోకుండా కాగితాలడ్డం పెట్టి మా మామయ్య.. రాసుకునే బల్ల ఎత్తుపల్లాలు సరిచేసుకునేందుకు ఉపయోగించి మా నాన్న కాగితాలు బహుళార్థ సాధకాలని నిరూపించారు. ఎదురింటి రెండు జడల సీతకి పొద్దస్తమానం మా బాబాయి పై డాబామీదనుంచి గురిచూసి విసిరేదీ కాగితాలతో చేసిన రాకెట్లనే. మా పెద్దతమ్ముడు కాగితాలతో గాలి పటాలు. చిన్న తమ్ముడు కత్తి పడవలు చేసి ఆడుకునేవాళ్లు చిన్నతనంలో.

కాగితాల్తో అన్నీ ప్రయోజనాలే అనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఊళ్ళో మనుషుల్లేకుండా పొలం పుట్రా ఉన్నవాళ్ల తాలూకు పత్రాలకి నకిలీలు సృష్టించి అమ్ముకునే మా ఊరి పుల్లారావులాంటి నమ్మకద్రోహులకి ఈ కాగితాలే ఆసరా! కొంచెం బాధాకరమే కదా! మా ఊరి కరణం ఆంజనేయులుగారు ఇలాంటి లాలూచీ వ్యవహారాల్లోనే బోల్డన్ని పచ్చకాగితాలు కళ్లచూసాడని చెప్పుకునే వాళ్ళు చుట్టుపక్కల ఊళ్లల్లో.

అన్నట్లు రూపాయి, పది రూపాయల్లాంటి వాటి ముద్రణక్కూడా కాగితాలే కదా గతి! దేశ ఆర్థికస్థితంతా బంగారంమీదుందంటారుగానీ… వట్టిదే. అదీ వట్టి కాగితాలమీదే అధారపడుంది. మన దేశంలో బంగారం నిల్వలకు తగ్గంతగా మాత్రమే కరెన్సీ చలామణిలో ఉందంటే నమ్మదగ్గ మాటేనా?

ఉత్తరాలు, ఆత్మకథలు… మంచి మంచి పుస్తకాల్లాంటి వాటికీ కాగితాలే ఆధారం. కాబట్టే ఆ పెద్దలు, మహాత్ములెవ్వరూ మన కంటి ముందుక్కిడ ఇప్పుడు లేకపోయినా వాళ్ళు బోధించిన మంచి సూక్తులు, ఆలోచనలు మన మేథస్సుల ఎదుగుదలకు అంతో ఇంతో దోహదం చేస్తున్నాయి.

గత్సంలో పెద్దలమధ్య.. దేశాలమధ్య జరిగిన ఒప్పందాలు.. రాతకోతలన్నింటికీ కాగితమే వేదిక. కాబట్టే కట్టెదుట వాళ్ళు కనిపించక పోయినా ‘conversation with the legends’ సాధ్యమవుతోంది. గాంధీ మహాత్ముడు ఈ కాగితం విషయంలో ఎంతో పీనాసితనం చూపించేవాడంటారు. తనకొచ్చిన ఉత్తరాల వెనక ఉన్న ఖాళీ జాగానికూడా ఆయన వృథా పోనిచ్చేవాడు కాదుట. మరీ వ్యక్తిగతానికి సంబంధించిన విశేషాలను మినహాయించి మిగతా సంగతులేవైనా సరే రాసుకొనేందుకు వాటిని ఉపయోగించే వాడుట. తనకొచ్చిన కవర్లను చింపి కాగితాలుగా మార్చి వాటినీ వాడిన విచిత్రమైన పొదుపరితనం బాపూజీది. మరీ ఉపయోగం లేని చెత్తకాగితాలతో ఆశ్రమానికి అవసరమైన బుట్టలు.. తట్టలు.. వగైరా తయారు చేయించేవాడని వినికిడి.

ఆడపిల్లల సంసారాలతో చెడుగుడు ఆడుకునే ఆకాశరామన్నలకూ ఈ కాగితాలే ఉత్తరాల రూపంలో సాయపట్టడం కొంత విచారకరమైన విషయం. ఇప్పుడంటే విద్యుత్ బుగ్గలు కానీ.. ఒకానొక కాలంలో మునిమాపటి చీకట్లు కమ్ముకోడానికి ఇంత సమయం ఉందనగానే నూనె దీపాలు శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు ఆడంగులు. ముందురోజు దీపం గ్లాసులకు పట్టిన మసిని తుడిచేందుకు బొగ్గు.. ఆ తరువాత ఆ బొగ్గుమరకలు పోవడానికి కాగితాలనే వాడేవాళ్ళు. కుంపటి రాజేసుకొనేందుకు కావాల్సిన మంటను అమ్మ కాగితాలు అంటించే సాధించేది. అద్దాలమీద మరకలు పోవాలన్నా.. ముందు ఏ పౌడరుతోనో శుభ్రం చేసి ఆనక కాగితంతో తుడిచేస్తే అద్దం ఆడపిల్ల చెక్కిళ్లలాగా తళ తళలాడుతుంది.

ఇన్నేసి ప్రయోజనాలున్న కాగితాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానం పక్కన పెట్టేస్తోంది. పేపర్లెస్ ఆఫీసులమీద మోజు పెంచేస్తోంది. విదేశాలలో టాయిలెట్ అవసరాలక్కూడా టిస్యూ పేపర్ వాడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్థానంలో పేపర్ బ్యాగులను ప్రోత్సహిస్తున్నారు. అయినా డిజిటల్ వర్చ్యవల్ వరల్డ్ విస్తురిస్తున్న కొద్దీ పేపరు ప్రపంచం కుచించుకుపోతోంది.

ఒక రీము పేపరు తయారవడానికి పెరట్లోని చెట్టూ చేమా ఉపయోగించాలి. పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన.

కాదనలేం కానీ.. కాగితాల కత్తిపడవలతో.. గాలిపటాలతో బాల్యానికున్న అనుబంధాన్ని అంత తొందరగా మర్చిపోలేం కదా! వేళకి జీతాలు రాని బడిపంతుళ్ల ఇళ్లల్లో పుట్టిన పిల్లలం. మావి చిన్ని బొజ్జలే అయినా వాటిని నింపేందుకూ ఆ కాలంనాటి అమ్మలను ఈ కాగితాలే ఆదుకొనేవి. పదో పన్నెండో పాత వార్తా పత్రికల పేపర్లను సీతయ్య చిల్లర దుకాణంలో మారకానికని వేస్తే వచ్చిన పప్పూ బియ్యంతోనే బిడ్డలకొక పూటైనా కడుపు నిండేది. పొట్టకోస్తే కనిపించే అక్షరం ముక్కే కాదు.. పొట్ట హరాయించుకొన్న పులుసు ముక్కలక్కూడా కాగితాలే ఆధారంగా గడిచిన ఆ కాలాన్ని అంత తొందరగా మర్చిపోగలమా?!

అలాంటి కాగితంమీదకు జాగిలంలా వచ్చిదూకుతోంది ఆధునిక సాంకేతిక విజ్ఞానం. అభివృద్ధికి కాలడ్డం లేం.. అలాగని మధుర స్మృతుల పేటికను కాలప్రవాహానికి వడ్డలేం! ఇదో విచిత్రమైన సంధి దశ చీలే రెండు సంస్కృతుల కూడలిమీద నిలబడ్డ మా తరానికి.

మాయదారి వేషాలు
‘న్యూస్ పేపరు చూస్తూకూడా ఆ నవ్వులేంట్రా? శ్రీధర్ గారి కార్టూనా?’

‘అదెలాగూ బాగుంటుందిలే బాబాయ్! నయీం బేగం నయా చాయాచిత్రం కూడా అలాగే నవ్వు తెప్పిస్తోంది! ఆ మీసాల మధ్య ముక్కుకి బులాకీ, చెవులకు బుట్ట కమ్మలు, బొట్టూ, కాటుక… చీరె కుచ్చెళ్ళు జారి పోకండా తమలపాకు వంటి పాదాల పైకి సుతారంగా ఎత్తి పట్టుకోడం…’

‘ ఆపుతావా పిచ్చి కపిత్వం! పులిలాంటి నయీం భాయీని ఇలా నారీమణి గెటప్పులో చూస్తే ‘పాపం’ అనిపించాలిగాని ఆ గేలిచేయడం అదీ… టూ బ్యాడ్!’

‘బాబాయ్! ‘పాపాల పుట్టం’టూ వారం బట్టీ లోకంమొత్తం కోడై కూస్తుంటే నీ మొహమేంటీ… అలా పులి, జాలీ… ‘ అంటూ పాలిపోయుందీ! కొంపదీసి నువ్వూ…’

‘నయం! ఉన్నమాటనుకోడానికి భయమెందుగ్గానీ… నయీంలా వేషాలు వేయడం ఇవాళే ఏమన్నా కొత్తగా పుట్టుకొచ్చిన కళా? అమృతం పంచేటప్పుడు జగన్నాథుడు వేసిందీ జగన్మోహినీ గెటప్పే గదా! గిట్టినవాళ్ళు ఏ వేషం వేసినా, ఆహాఁ… లీలలు… ఓహోఁ… మాహాత్మ్యాలంటూ ఈలలూ, చప్పట్లా? గిట్టకపోతే ఇట్లా పిల్లికూతలూ, పిచ్చి వాగుళ్ళూనా! ఉదర నిమిత్తం…’

‘… బహుత కృత వేషం- కడుపు నింపుకోడం కోసం కడు కృతక వేషాలు! తెలుసులే బాబాయ్ మాకూ సామెతలు! కానీ నువ్వే ఇలా నయీంలాంటి నయవంచకులమీదా ఉదారవాదాలెందుకు ప్రకటిస్తున్నది! విచిత్రంగా ఉంది తమరి తరహా!’

‘కృతయుగంలోనే తప్పింది కాదురా వేషాలు వేయడం! కలియుగం కాబట్టి.. కలికి కామాక్షి వేషం వేసినా .. చిలికి చిలికి ఇలా గాలివానై పోతుంది కానీ! ధర్మ సంస్థాపనార్థం ప్రతీ యుగంలోనూ అవతారమెత్తుతానని పరమాత్ముడంతటి వాడే సెలవిచ్చాడు. అవతారం అంటే మారువేషం కాదా?’

‘ధర్మసంస్థాపనకు.. అధర్మ పీడనకు.. తేడా పాడా చూడద్దనా నీ ఉద్దేశం! హత్యలు.. అత్యాచారాలు.. కుట్రలు.. కుతంత్రాలు.. బలవంతపు..’

‘ఆపాపు..’

‘అహల్యకోసం దేవేంద్రుడు చాటుగా గుడిసెలో దూరిన కోడి వేషానికి.. సీతమ్మతల్లికోసం రహస్యంగా హనుమంతుడు వేసిన బుల్లి కోతి వేషానిక్కూడా తేడా లేదనేట్లున్నావే? రావణాసురుడేసిన సన్యాసి వేషానికి నకలు బాబాయ్ తమరి నయీం భాయీసాబ్ వేసిన నయగారి ఆడంగి వేషం’

‘ప్రపంచమే ఓ నాటక రంగం’ అన్నాడ్రా పెద్దాయన షేక్స్పియర్. ఆ రంగంమీద ఎవరే వీరంగం వేసినా అవన్నీ మారువేషాల కిందే లెక్క. డార్విన్ పరిమాణ సిద్ధాంత ప్రకారం మనమంతా సురులం కానీ..అసురులం కానీ.. నరుల మేకప్పులో ఉన్న వానరులం.. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయితో సహా!’

‘పరాయి ఆడకూతుళ్ల జోలి మనకెందుగ్గానీ.. అవతలోళ్ళ మనీ గట్రా కాజేసేందుకు వేసే ‘షి’ వేషానికి.. మంచి వేషానికి మధ్య తేడానే లేదంటే మాత్రం నే చస్తే ఒప్పుకోను’

‘మనిషి’లోనే రెండొంతుల మనీ ఉంది చూసావా.. తమాషా! కాబట్టి దాని రాబట్టడంకోసం మనిషి వేసే ‘షి’ వేషాన్ని అమానుషమంటే నేనూ ఊరుకోను. పళ్ళు నూరుకోనంటే ఓ మంచి మాట చెనుతా వినుకో! ఆ తరువాత గమ్మున వెళ్ళిపో! మంచికో చెడుకో సమయ సందర్భాలను బట్టి మనిషి ఏ వేషాలైనా వేయడం తప్పని సరి! ఆ లౌక్యం వంట బట్టకే.. మానవావతారం ఎత్తినా శ్రీరామచంద్రుడు ఏ మారువేషాల జోలికీ పోకుడా రామాయణం ఆసాంతం కన్నీళ్ల పర్యంతంగా కాలం గడిపింది. తప్పు తెలుసుకొన్నాడు కాబట్టే తరువాతి కృష్టావతారంలో అడుగడుక్కీ న్నేసి రకాల మాయవేషాలేసి లీలామానుషుడనిపించుకొన్నాడు. దేవుడికే లేని పట్టింపులు మానవమాత్రులం మనకెందుకురా? ఓ నమస్కారం పారేసి ముందు నువ్విక్కణ్ణుంచి బైలుదేరు! ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుంటే ఎట్లారా నీతో?’

‘తమరి సలహాకో పెద్ద నమస్కారం!’

‘ఆ వెటకారాలే వద్దనేది. ‘షాట్ గన్ సిన్హా’ వేషమేసేస్తేగానీ పార్లమెంటు ఆవరణలోనైనా సెక్యూర్టీ చెకప్పుల్లేకుండా చెప్పులు విడవనీయరీ దేశంలో! ఒక్క అయ్యప్ప గుళ్లో ధర్మదర్శనానికి తప్ప ఆడపిల్ల ఆహార్యం అన్ని వేళలా.. మహా సౌకర్యంగా ఉంటుందబ్బీ మన దేశంలో. ఎర్రబుగ్గ కార్లకన్నా ఎర్రటి బుగ్గలున్న పిల్లకు ముందు లైన్ క్లియరవుతున్నప్పుడు.. ఎంత వెర్రినాగన్నకైనా ఎర్రటోపీల కన్ను కప్పేందుకు ముందు తోచే ఉపాయం ఆడపిల్ల వేషమే కదరా!

‘బుర్ర తిరిగిపోతోంది బాబాయిక్కడ నీ తిరుగులేని వాదానికి’

‘మరే! పరీక్షాపత్రాలు సెట్ చేసే పెద్దతలకాయలే పెద్ద పెద్ద పేపర్లీకువీరులు వేషాలేసేస్తున్నారు. పొట్టకోసినా అక్షరమ్ముక్క బైటకు రాని నిరక్షరకుక్షులేమో పెద్ద పెద్ద విశ్వవిధ్యాలయల్లోకూడా కూడబలుక్కొనైనా సరే పట్టుభద్రులకు పాఠాలు చెబుతామని పట్టుబడుతున్నారు! పాపుల మెళ్లకు పాశాలేసి ఈడ్చుకెళ్లాల్సిన యమకింకర్లు ఎలా జొరబడ్డారో ధర్మాసుపత్రుల్లోకి.. . మెళ్లల్లో స్టెతోస్కోపులూపుకుంటూ వైద్యనారాయణుల వేషాలేసేస్తున్నారు! గురజాడగారి గిరీశానిక్కూడా కళ్ళు బైర్లు మారు వేషాల్తో చెదలు.. జలగలు.. గద్దలు.. రాబందులు.. కథలు నడిపించేస్తున్నపుడు పాపం ఒక్క నయీంభాయీ ఒక్క పూటేదో ఆడవేషమేసినందుకుట్రా మీకందరికీ కుట్ర.. కుతంత్రాల్లాగా గంగవెర్రులెత్తుతోంది! వెర్రినవ్వులు తెప్పిస్తోంది!’ మారువేషమనంగానే మాయలేడి మార్కు మారీచుళ్లనేనా పెడర్థం?’

‘అలాగని కాదూ! దేశస్వాతంత్ర్యం కోసం ఎన్నో వేషాలేసి దేశాలు పట్టుకు తిరిగిన మహానుభావుడు నేతాజీ ఉన్నాడని తెలుసూ. ఎన్నికల ముందొక వేషంలో జనం మధ్య కనిపించి.. గెల్చినాక.. మరో వేషంలో చట్టసభలో కునుకే నేతాశ్రీలూ ఉన్నారని తెలుసు. ఇద్దరి వేషాల్లోనూ తేడా బొత్తిగా లేదనేటంత మొద్దునైతే కాన్లే బాబాయ్ నేను! ఆశారాం బాపూలు.. నిత్యానంద స్వాములు.. కాషాయాల గెటప్పులేసుకొని ఆడపిల్లల్తో స్టెప్పులేస్తున్నారు! అగ్రిగోల్డు పెద్దలు.. సహారా సుభ్రతోలు.. వ్యాపారస్తుల ముసుగులో అమాయకుల పర్సులు దులిపేస్తున్నారు. ఫోర్ ట్వంటీగాళ్లందర్నీనువ్వే ఇలా ట్వంటీ ఫోర్ కేరెట్ల గోల్డన్నట్లు సర్టిఫెకేట్లిస్తున్నావని బాధ!’

‘బంగి అనంతయ్య చిందువేషాలేసినప్పుడు ఒంగొంగి నమస్కారాలు చేసిందెవర్రా? పార్లమెంటు సార్లు పార్లమెంటు ముందు బుడబుక్కలోడినుంచి.. బుర్రకథ చెప్పేవోడివరకు రోజుకో పేషమేసినా విసుగేయదు? అవసరానికని ఏదో అమావాస్యకోసారి ముక్కుసూటి తిక్క పోలీసుల్నుంచి తప్పించుకోడానికని నయీంసార్ లేడీస్ కాస్మొటిక్ కిట్టు వాడితే మాత్రం కితకితలొస్తాయేం మీకు?’

‘బాబాయ్! గురజాడగారి కన్యాశుల్కంలో మహిళల్లో మాణిక్యం మధురవాణికూడా మగవాడి వేషంమీద తెగమోజు పడింది. కాకపోతే అదంతా ఓ అమాయకబాలను ముసలి పెళ్ళికొడుకునుంచి తప్పించేందుకు పన్నాగం. తమరి నయీం భాయో! సరే.. నాకెందుగ్గానీ నీ నయీం భజన నువ్వు చేసుకో.. నమస్కారం,, వెళ్ళొస్తా!’

‘అమ్మయ్య! ఎప్పుడెంత తొందరగా దయచేస్తావా అని ఎదురు చూపులిక్కడ!. విగ్గు వాడ్డానికి సిగ్గు పడే వర్గానికి ఈ వీధిలో చోటు లేదు.. వెంటనే వెళ్ళిపో!’

‘అబ్బాయ్! ఇల్లు చేరావా? ఇందాక ఆ మారువేషాలమీద నేనన్నదంతా మనసులో పెట్టుకోకబ్బీ! నీ వాగుడు కవర్ చేయడానికి నే పడ్డ తంటాలవన్నీ! నయీం పోయాడు సరే! అతగాడి అనుచరులంతా ఇంకా మా వీధి చుట్టూతానే తిరుగుతున్నార్రా! నిన్ను, నన్ను రక్షించుకొనేందుకు వేసిన మారువేషంలో భాగంరా అబ్బీ ఈ నయా నయీం భక్తి!’

‘రాత’ ముచ్చట్ల
చెన్నైనుంచి హైదరాబాదు వస్తున్నాను చెన్నై ఎక్స్ ప్రెస్సులో.

పక్క సీటులో ఒక మోస్తరు పెద్దమనిషి తగిలాడు. పరిచయాలు గట్రా అయిన తరువాత నేను ‘రాతల తాలూకు శాల్తీన’ని ఏ కారణం వల్ల ఊహించాడో! ‘ఇప్పటి వరకూ ఏమేం రాసారు సార్?’ అని తగులుకున్నాడు.

మనం రాసినవి… రాసేవన్నీ అలా బైటికి చెప్పుకుంటూ పోతే ఏం బావుంటుంది?

నెత్తికి నూనె రాస్తాను. స్నానాల గదిలో వంటికి సబ్బు రాస్తాను. కాలు కండరం పట్టినప్పుడు, తలనొప్పితో కణతలు బద్దలవుతున్నప్పుడు ఏ జండూ బామో, ఆయింటుమెంటో రాస్తుంటాను.

బైట ఊళ్ళకు ఇలా పనులమీద వచ్చినప్పుడూ నాకీ ‘రాత’ తలనొప్పులు తప్పవు. తరుచూ కాళ్ల కండరాలు పట్టేస్తుంటాయి. అందుకే ఎక్కడున్నా మా శ్రీమతిగారు సెల్లోనైనా సరే ‘అది రాసారా? ఇది రాసారా?’ అని వేపుకు తింటుంటుంది. ఆమె ప్రేమ ఆమెది. ఇప్పుడు ఆ రాత మీదే పెద్ద రచ్చ అయింది సెల్లో!

‘ఇంటి మనుషుల తోనే కాకుండా బైట కొత్తవాళ్ళ ముందు కూడా… ఆ రాసేవన్నీ వివరంగా చర్చకు పెట్టడమెందుకు!’ అనిపించి నవ్వి ఊరుకున్నాను.

ఆయనగారు పట్టువదలని విక్రమార్కుడికి వేలు విడిచిన మేనమామలాగున్నాడు. వదిలితేనా!

‘రాసేవాళ్ళెవరైనా సరే.. నాకు చాలా ఇష్టమండీ! మీర్రాసినవాటిల్లో కొన్నైనా చెప్పండి! అవన్నీ కొని మా ఆడోళ్ళచేత కూడా చదివిస్తా దొరక్కపోతే బండి దిగేలోపు నాకూ ఏదైనా రాసివ్వండి! ఎప్పుడూ ఏవోవే పిచ్చి పిచ్చివి కొంపమీదకు కొని తెస్తుంటానని ఒహటే దెప్పుతుంటుంది !’ అని ప్రాధేయపడ్డం పెంచేయడంతో పెద్ద చిక్కుల్లో పడిపోయాను.

నిజం చెప్పద్దూ! రాయడమే కాదు.. చదవడంమీదకూడా నాకాట్టే ఆసక్తి లేదు చిన్నప్పట్నుంచీ. ఆ రాతలూ కోతలూ కవులకి, ఆఫీసుల్లో క్లర్కులకీ, దస్తావేజులాఫీసుల్లో డాక్యుమెంటు రైటర్లకీ తప్పని గొడ్డు చాకిరీ అని నా అభిప్రాయం. రిటైరయిన తరువాత పెద్ద పెద్ద అధికారులూ.. రాజకీయాల్లో బాగా నలిగేవాళ్లూ రాస్తారని విన్నాగానీ, వాళ్ళు నిజంగా సొంతంగా రాస్తారా? అన్న ధర్మ సందేహం ఒహటి నన్నెప్పుడూ పీడిస్తుంటుంది. వాళ్ళ వాళ్ల వృత్తుల్లో జీవితమంతా నుజ్జు నుజ్జు చేసుకున్నాక ఇహ ఓపిక లెక్కడేడుస్తాయీ రాస్తూ కూర్చోడానికి?

‘రాసి పెట్టేందుకు మనుషుల్ని పెట్టుకుంటారంటారు. కాబట్టే కామోసు… పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా వాళ్ళ పేర్న హఠాత్తుగా అంతంత బౌండ్లు ‘ఆత్మ కథలు’ వెలువడి పోతుంటాయి!’ రాతలను గురించి సరే! వాళ్ళు ‘ఆత్మ’లను గురించి కూడా కథలు రాయడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది సుమండీ!’ అంటుంది మా శ్రీమతి.

రాజకీయాల్లో తిరిగే వాళ్ళెవరికీ ఆత్మలులాంటివి ఉండవని ఆవిడ దృఢ విశ్వాసం. ఆమెగారి ఉద్దేశంలో రాసేవాళ్లంతా ఏ యండమూరిలాగానో, మల్లాది లాగానో, యద్దనపూడి సులోచనారాణి మాదిరో మంచి ఆలోచనా పరులో, మేధావులో అయి ఉంటారని… ఉండాలని.

ఆ మాటకొస్తే ఆలోచించ గలిగే మేధావులందరికీ రాయలనే బుద్ది మాత్రమే పుట్టాలని రూలెక్కడుంది? జ్ఞానులు తమ ఆలోచనలను మరింత నిరపాయకరమైన మార్గంలోకి కూడా ఎందుకు మళ్ళించాలనుకోకూడదు? న్యూటను మహాశయుడు మంచి ఆలోచనాపరుడే కదా! ఆయన ఆపిల్ చెట్టుకింద కూర్చున్నప్పుడే పండు పడింది. అదృష్టం. అదృష్టం పండు పడ్డందుక్కాదు. ఆ పండు ఆయన తలపండుమీద పడనందుకు. ఎదురుగా ఆపిల్ పడ్డప్పుడు ‘ఆఁ!… ఏదో పడిందిలేఁ!’ అని పట్టించుకోకుండా.. ఏరుకొని కోసుకుతిని మర్చిపోకుండా ‘ఎందుకు పడిందబ్బా?!’ అని బుర్ర తెగ బద్దలు కొట్టుకోవాలనే బుద్ధి పుట్టడం కూడా మన అదృష్టమే కదా! ఆయనగారికి అలా బుర్ర బాదుకోవాలన్న ఆలోచన తట్టక పోయుంటే?! ఇవాళ్టికీ ఇంకా ‘E=mc2′ సూత్రం వెలుగులోకే వచ్చుండేది కాదు కదా! ఇవన్నీ మా ఆవిడ పెద్దబుద్ధికి తోచని చిన్నవిషయాలు.. అలా వదిలేద్దాం. ఇప్పటి ఆలోచనంతా పెద్దలు రాయించే ‘ఆత్మ కథల’ ను గురించి కదా!

రాయాలనే ఆలోచన రాజకీయ నాయకుల బుర్రల్ని తొలవడం మొదలైందంటే దానిక్కారణం… ఆ నేతాశ్రీలకి ఆలోచించే తీరిక పుష్కలంగా దొరికిందనేగా! నిత్యం ప్రజల జీవితాలతో ఆటలాడ్డానికే ఎక్కడి సమయం చాలని పెద్దమనుషుల మనసులను అలా మాటలమీదకూ మళ్ళించేందుకు కారణాలు ఏమై ఉంటాయో? ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఒక్కటే అంటే నమ్మలేం. కట్టిన డిపాజిట్లు పూర్తిగా గంగలో కొట్టుకుపోయినా రాజకీయాలమీదే ప్రాణం కొట్టుకులాడే బుద్ధి కదా ఆ పెద్దలది?… ఏదైనా బైటికి రావడం కుదరని పెద్ద నేరాల్లో ఇరుక్కొని బొక్కలో నాల్రోజులు గడపక తప్పని ఖర్మ తటస్థపడ్డప్పుడు మాత్రమే ఇలా రాతలమీదా కోతలమీదా మనసులు మళ్ళుతాయనుకుంటా.

గాంధీజీ ‘సత్యం తో నా ప్రయోగాలు’ కారాగారంలో ఉన్నప్పుడు ప్రారంభించిందే!. ఆయన అప్పట్లో చేసిన నేరం అప్పటి తెల్లదొరల చెత్త పెత్తనాన్ని నిర్ద్వంద్వంగా ధిక్కరించడం. ఇప్పటి నాయకుల నిర్వాకాలతో ఆ ధీరత్వాన్ని పోల్చేందుకు లేదులేండి. జవహర్ లాల్ నెహ్రూజీ కూడా జైలుగోడల మధ్య ఉన్నప్పుడే కన్నకూతురికోసం ఉత్తరాలు.. జాతి విజ్ఞానంకోసం ‘భారత దర్శిని’ రాశారు. నేతల కారాగార జీవిత పుస్తకాల జాబితా ఏకరువు పెట్టడం మొదలు పెడితే ఆ చిట్టాకు ఆఖరు పేజీ ఉండదు. అట్లాంటి జాబితా ఒకటి తయారు చేసినా పాలిటిక్సులో పనిచేసే నేతల చేత గిలికించాలంటే ఏదైనా బెయిలు దొరకని నేరంలో గట్టిగా ఇరికించెయ్యాల్సిందేనన్న అపోహా ఏర్పడే ప్రమాదం కద్దు. అందుచేత అటువైపు మనం వెళ్ళొద్దు.

అయినా ఈ- కాలంలో ఎంత సెల్లుల్లో కుక్కించినా నేతాశ్రీలకంత రాసేంత తీరికలు ఎక్కడేడ్చాయీ? ‘సెల్లు’ల సంపర్కం వల్ల సెల్లు సంబంధాల్లో కూడా బోల్డన్ని మార్పులొచ్చేసాయి. అంచేత నేతల జైలురాతల గొడవనలా వదిలేసేద్దాం.

నేతాగణాలకు అధికార వియోగాలు, అధికారులకు పదవీ విరమణ అనంతరం వేధించే సంపూర్ణ విరామాలు, పుస్తకాలు రాసేందుకు పురిగొల్పే మరో కొన్ని ప్రేరణలు. నానా గడ్డి కరిచి గట్టి జీవితం ఏర్పరుచుకున్న పెద్దమనుషులకు చివర్లో అలా వట్టి మనిషులుగా మిగిలి పోవడం సుతరామూ ఇష్టముండదు. కాబట్టె వివాదమేదైనా రాజేసే అంశాన్ని ఎన్నుకొని ఏ ‘ఆత్మ’నో అడ్డం పెట్టుకొని పుస్తకం తీయించి పారేస్తే.. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు పేరు నలుగురి నోళ్లలో నలిపించుకునేందుకు వీలుగా ఉంటుందన్నది అసలు పథకం అయుండవచ్చు.

పదవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకురాని ఆత్మలు, అంతరాత్మలు పదవీ వియోగాల తరువాతే ఎందుకు వెంటాడి వేధిస్తుంటాయనే కదూ ఆశ్చర్యం!

పని పడనప్పుడు పట్టించుకోక పోవడం… అవసరం పడ్డప్పుడు అమాంతం వచ్చి వాటేసుకొనే కళను సానబెట్టబట్టే కదా నాయకాగణమంతా ఇంతింతి ఎత్తులకు ఎగబాకుతున్నదీ! ఇహ ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏముంది?

అమెరికాలో కూడా ఈ మధ్య ఈ ‘అంతరాత్మ’ నాటకమే కదా నడిచిందీ! ప్రైమరీ అభ్యర్థుల వత్తాసుతో దేశాధ్యక్ష పదవి అభ్యర్థిత్వంకోసం పార్టీ తరుఫున జరిగే పోటీలో చివరి దశకు చేరుకున్నాడా ‘ట్రంప్’ మహాశయుడు! ఆ మహానేతకూ సొంత పార్టీ అంతరాత్మలనుంచి అసమ్మతి సెగలు తప్పలేదు! ఇప్పటికిప్పుడైతే ఆ నిప్పేమీ రాజుకోలేదు గానీ… విచిత్రం ఏదైనా జరిగి ప్రత్యక్ష ఎన్నికల తదనంతర దశలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు కనక దాపురిస్తే ట్రంపుగారు మాత్రం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారా? కథలు రాయడానికి తన అంతరాత్మను నిద్రనుంచి లేపకుండా ఉంటారా? ‘లేప’డని గ్యారంటీ ఏంటీ?

అమెరికా ట్రంపుల.. దువ్వూరి సుబ్బారావువంటి మాజీ ఆర్ బి ఐ పెద్దల ‘అంతరాత్మ’లు చేయాల్సిన పెద్దపనులు అతి సామాన్యుణ్ణి నేను చేయడానికి పూనుకొంటే ఏం బావుటుంది?

ఆ మాటే పక్కసీటు అభిమానికి ‘నచ్చ చెప్పడమెలాగురా దేవుడా?’ అని తన్నుకులాడుతున్నానా.. ఉరుములేని పిడుగులాగా వచ్చిపడ్డ టిక్కెట్ కలెక్టరుగారే నన్నా ఆపదనుంచి గట్టెక్కించేసారు!

పక్కసీటు పెద్దాయన పేర్న భారీ చలానా రాసి ఇచ్చి ఆ మహానుభావుడి ‘రాత’ ముచ్చట ఇంచక్కా తీర్చేసి కథ సుఖాంతం చేసేశారు

రిజర్వేషను కానీ, ఫస్టు క్లాసు గానీ, బోగీ ఏదైనా… జనరల్ కంపార్టుమెంటు రేటుకి మించి కానీ అదనంగా పెట్టి టిక్కెట్టు కొనే అలవాటు లేదుట ఆ పెద్దమనిషికి ఎంత పెద్ద దూరప్ప్రయాణాలు పెట్టుకొన్నప్పుడైనా!

అదీ మేటరు!

స్వర్గం- నరకం
ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారంరోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!

ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాలకోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.

అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ! ఆమ్ ఆద్మీలకంటే ఇలాంటి చేంతాళ్ళు అలవాటేగాని.. శనివారం తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యంలేని పెద్దాయన రాంభద్రయ్యగారిలాంటివారికి ఈ క్యూలు వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.

ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకిక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని వ్యవహారం. అక్కడికీ ఎవరూ చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.

‘ఇదేం మీ భూలోకం కాదయ్యా భద్రయ్యా! మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవిక్కడ. ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం నీళ్ళకోసం, రేషన్ కోసం, గ్యాసుబండలకోసం, ఏడుకొండలవాడి దర్శనంకోసం.. ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువులు సాగిస్తారో నీకేమైనా అవగాహన ఉందా?’ అని గదమాయించాడు దేదదూత (దేవుడు, దయ్యం కలగవలసిన అంశ దేదదూత)

‘ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా? ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!’ పాయింటు లేనప్పుడు టాపిక్కుని పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.

చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.

చరవాణిలో ఆయనగారు ఎవర్నో(దేవుణ్ణే అయుండాలి) కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు ‘ఓకే పెద్దాయనా! మీదేమో రాజకీయనేతల ఫాయిదా! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే మీకు పాతజీవితం తాలూకు పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు!’

‘నాకు స్వర్గమే కావాలయ్యా!’

‘ఆ తొందరే వద్దు. ఆసాంతం విను ముందు! ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి’

‘ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!’

‘సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం’ అని దేదదూత వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు.

అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజంమీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.

కనురెప్పపడి లేచేటంతలో రాంభద్రయ్యగారి కంటిముందు.. నరకం!

నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. శ్రీరామనవమినాటి భద్రాచలం, ఒంటిమిట్టల సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు, మరకత. మణిమాణిక్యాలతో నిర్మితమైన రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో ఆవరణమంతా గానాబజానా వాతావరణంతో మత్తెక్కిపోతోంది. అదనంగా మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తిలోత్తమాదుల్ని తలతన్నే అందగత్తెల అంగాంగ శృంగార నాట్యభంగిమలు!

పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే చాలు వెంటాడైనా సరే కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం మనుషుల ప్రాణాల్ని తృణప్రాయంగా తీసేసే పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు, సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు.. అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ, తూలుతూ, పేలుతూ యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులు కూడా చాలా ఫ్రెండ్లీగా కలగలిసిపోయి వాళ్లమధ్య.

కలయతిరుగటం! అతిథుల భుజాలమీద ఆప్యాయంగా చేతులేసి, బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. లేట్ నైట్ జోకులేస్తూ జనాలను అదే పనిగా కవ్వించడం.. నవ్వించడం! ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. పగలంతా ఎంతానందంగా గడిచిందో .. చీకటి పడ్డాక అంతకు రెట్టింపు సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. ఏకాంతంలో అతిలోకసుందరులెందరో బరితెగించి మరీ ఇచ్చిన సౌందర్య ఆతిథ్యాలు ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.

ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే ఈ నరకసుఖాలని చచ్చినా వదులుకోరాదని.

కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వన సంగీతమంటే ఏదో ఒక ఐదారు నిమిషాలు ఓకేగానీ.. మరీ రోజుల తరబడి ఆకాశవాణి సంతాపసంగీతం తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహన్జీకయినా తిరగబడాలనిపించదా! ఒక వంక కడుపులో పేగులు కరకరామంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగిమాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ బాగ్ పైపరో.. ఆఫీసర్సు చాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా బెత్త దూరంలో జిల్లుమన్నట్లుండేది! ఎంత అతి మధురామృతమైనా సరే ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం ’చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకలేస్తూ కూర్చోడం కంటే.. ‘ఛీ!’ అంతకన్నా ప్రతిపక్షంలో ఐదేళ్ళపాటు అవస్థలు పడ్డం మేలు! ఆకలి దప్పులు, నిద్ర నిప్పులు, మంచి చెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనే కాదు.

‘ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు, చీనిచీనాంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే తేలిపోయింది. వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని’.

మర్నాడు చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన లేకుండా నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.

ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన పెద్దాయనకి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.

నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న మురికివాడకు నకలుగా ఉంది. మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు!

మొన్నటి దృశ్యం- ఒబామాజీ భారతావనికి పర్యటనకు వచ్చేముందు తీర్చిదిద్దిన సుందరనగరం!

నేటి దృశ్యం- వినాయక నిమజ్జనం మర్నాటి ట్యాంకు బండు కింది హుస్సేన్ సాగరం!

పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను ఎతిపోస్తున్నది వేలాదిమంది కూలీజనం.

నిజానికి వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు నరక సందర్శనార్థం విచ్చేసినప్పుడు- పిలిచి ఆతిథ్యమిచ్చిన గేస్తులు! భూలోకం తాలూకు పురానా నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు వేళ్లాడుతున్న దుస్తులు అప్పటికిమల్లే చీని చీనాంబరాలు కాదు. చివికి, చినికి, చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దలంతా భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన గౌరవనీయులు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల వీపులమీద ఇప్పుడు కొరడా దెబ్బలు ‘ఛళ్ళు’మని పడుతున్నాయి! ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిచక్రవర్తిని, అంబరీషుణ్ణి మించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించి మైమరిపించిన యమకింకరాధములు!

నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలోకూడా ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో యమకింకరుడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేంత బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు ‘మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!’

తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు ‘ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా! నువ్వు నరకాన్ని చూసిన రోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు సాగుతున్నది. ఆ ఎలక్షన్లన్నీ అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా నిన్నిప్పుడు తరలించింది? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ భూమ్మీద జనానికి ఎన్నికలప్పుడు మీరు చేసే హామీల్లోనూ.. చూపించే రంగులకలల్లో కూడా మోసం.. దగా ఉన్నట్లే లెక్క!

రాంభద్రయ్యగారింకేదో వాదనకు దిగబోతుంటే ఆకాశంలోనుంచి వాణి వినిపించిందీసారి పరమ గంభీరంగా ’ముందే చెప్పాం గదా రాంభద్రయ్యా! భూమ్మీద మీలాంటి మహానేతలు నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ పైలోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య అని’

‘అబ్బా!’ అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కింకరుడు కొట్టిన కొరడా దెబ్బకు రాంభద్రయ్యగారి రియాక్షన్! భూలోకంలో ప్రజాస్వామ్యం వంకతో కుపరిపాలన సాగించే రాంభద్రయ్యగారి సహచర గౌరవనీయులందరికీ ఆ పెడబొబ్బలు వినిపిస్తే బాగుణ్ణు!

కందిపోటు దొంగలు
ఎదురుగా బోనులో నిలబడ్డ ఆకారాన్ని వింతగా చూస్తూ అడిగారు యమధర్మరాజు ‘ఎవర్నువ్వు?!”బేండీకూట్’

‘సమవర్తి భృకుటి ముడిపడింది ‘విధాతగారు మాకు సమాచారం లేకుండా కొత్తజీవుల సృష్టిని ఎప్పుడు ఆరంభించారు?! యెనభైనాలుగు లక్షల రకాలు. రకానికో నలభై ఎనిమిది లక్షల జీవాలు. ఏది ‘హరీ’మని ఇక్కడికొచ్చినా విచారించి పాపపుణ్యాలు బేరీజు వేయలేక మాకు చారులు కారిపోవుచున్నవి.’ శివాలెత్తుతూ శివయ్యకు ఫిర్యాదు చేయాలని చరవాణికోసం వెదుకులాట ఆరంభించారా మృత్యుదేవుడుగారు.

చిత్రగుప్తులవారికిక జోక్యం తప్పింది కాదు.

‘ప్రభూ! ‘బేండీకూట్’ కొత్తజీవి కాదు. ఆంగ్లపదం. అచ్చమైన తెలుగులో దీన్ని ‘పందికొక్కు’ అందురు. తెలుగు గడ్డమీది గాదెల్లోని కందిపప్పు తెగ మెక్కు కొక్కు ఇది. ఈ సారే ఎందుకో తిన్నది అరక్క చచ్చి ఇక్కడకు వచ్చిందిగానీ’

‘తెలుగు కందిపప్పు మెక్కిచచ్చే కొక్కుకి మరి ఆ ఆంగ్ల కొంకరభాష ఎందులకు?’ సమవర్తి చిందులు.

‘అది మెక్కి చచ్చింది ఆంగ్ల కందిపప్పు కనక మహాప్రభో!’ చిత్రగుప్తులవారి సముదాయింపు.

కాలదేవుడికి ఎక్కడో కాలింది ‘యేమీ.. పరాచికములా! యముండ! పశ్చిమాన కందిపప్పన్న ఏమి తెలియును? తుచ్చమైన రంగు, రుచి, వాసనున్న ముక్కసరుకే గదా వారికి దిక్కు! ఈ తెలుగు కలుగుజీవికి ఆ ఆంగ్ల సంకరపప్పు తిని చచ్చు గ్రహచారం ఏల కలిగినట్లు?’

‘తెలుగునాటంతా ఇప్పుడు దొరికుతున్నది ఆ నాటుసరుకే కనక మహాప్రభో!’

‘యముండ! తెలుగు నేలల గురించి మాకు తెలియని చదువులా! బహు సారవంతమైన భూములు గదా వారివి. వరుణదేవుడి కరుణ కరువైననూ.. ఏడాదికి రెండు పంటలు తీయు గండర గండళ్లుగదా తెలుగు రైతన్నలు!’

‘అమరావతి ఆహ్వానపత్రం చదివి పొరబడుతున్నట్లున్నారు ప్రభువులు. తమరు వర్ణించిన తెలుగు వైభవమంతా ప్రపంచీకరణం ముందటి కథ!’

‘తెలుగువారి పప్పులమీద జిహ్వచాపల్యంతోనే కదయ్యా మన విష్ణుమూర్తులవారు ఏడుకొండలమీద తిష్ఠ వేసింది! అహా! ఆ స్వామికి సమర్పించు వడప్రసాదాల రుచికి మా వడలూ పులకించుచున్నవి’

‘ఆ వడలు పులకించు వడలు అరక్కే నా కన్నా ముందు నా అర్థాంగి ఇక్కడకు వేంచేసింది’ కిసుక్కున నవ్వింది పందికొక్కు.

‘పందికొక్కులకునూ మాతో పరిహాసములా! యముండ!’ గుండెలు బాదుకొన్నారు యమధర్మరాజులుగారు.

‘ప్రతిదానికీ మీరలా గుండెలు మోదుకోకండి మహాప్రభో! మీరింకా ఆ క్షీరసాగరమధన కాలంనుంచి బైటపడలేకున్నారు!’

‘నిజమేనయ్యా చిత్రగుప్తయ్యా! కంది ఏదో కలికాలంనాటి శాకాహారుల మాంసాహారమని భ్రమపడుతున్నదిగాని పిచ్చిమంది.. ‘జీవహింస మహాపాపం’ అన్న భావంతో సత్యకాలంకన్నా ఎన్నో యుగాలముందే ముల్లోకాలు ఈ పప్పుదినుసుమీద ఆధారపడేవని ఎరుగదు.’

‘’నిజమే ప్రభూ! దానవులతో జరిగిన భీకరయుద్ధాల్లో ఈ పప్పు ఎప్పుడు అగాధాలలో పడిందో ఎవరికీ తెలియదని వింటిని’

‘నాటినుంచేగదయ్యా దేవతలందరికీ కడగళ్లు మొదలయినవీ!. అలవాటు పడ్డ జిహ్వలాయ!’ ‘కనకనే కదా స్వామీ.. కమ్మని ఆ కందిముద్దల రుచిని వదులుకోలేక రాక్షసాధములతో రాజీ కుదుర్చుకొని మరీ పాలసముద్రంమీద చిలుకుడు మొదలుపెట్టిందీ!’

‘లెస్సపలికితివి. కందిని అందించేదే కదా కల్పవృక్షం! ఆ పప్పులో కలిసిన రాళ్లూరప్పలను ఛేదించేది వజ్రాయుధం. ఉడికేందుకు ఉపయోగించేది అక్షయపాత్ర’,

‘తేలిగ్గా.. రుచిగా ఉడికేందుకు తోడుపాలు ఇచ్చేది కామధేనువు. కందిమూటలను సప్తలోకాలకు చేరవేసేందుకు ఐరావతం. కంది అమృతం అందరికీ అందుబాటులోఉండేందుకేగదా ధనలక్ష్మీమాత ప్రభవించిందీ!’

‘ఆ లక్ష్మీసోదరుడు చందమామ అకాశంలో మెరుస్తూ అందరినీ అలరించగలుగుతున్నాడంటే అందులకు కారణం కందిగింజ ఆకారంలో ఉండటమేగదయ్యా చిత్రగుప్తయ్యా! అహో! మన దేవతలందరికీ ఆ కంది అమృతమెంత అపురూపమైనదీ!’

‘చిత్తం చిత్తం మహాప్రభో! అమృతం ఉన్నచోటే హాలాహలమూ పుడుతుందంటారు. ఆ అమృతం వెలికి తీసేటప్పుడేగదా.. హాలాహాలం బైటపడి అంతలా కోలాహలం చెలరేగిందీ! కాలశివుడు సమయానికి అక్కడుండి ఆ కాలకూటాన్ని అలా అంగిట్లో వేసుకోబట్టి కదా సర్వలోకాలూ ఏమీ మూడకుండా బైటపడిందీ!’

‘మరి అదే ధర్మకార్యంగదా మా బేండికూటులూ నిర్వహిస్తున్నది!’ అంటూ అడ్డొచ్చింది ఇహ వినే ఓపికలేక పందికొక్కు. ధర్మరాజులవారొక్కసారిగా చిరాకు మొహం పెట్టేసారు. పట్టించుకోదలుచుకోలేదు పందికొక్కు. ‘అవును మహాప్రభో! నాటైం బావులేక ఖర్మకాలబట్టి చచ్చి ఇలా వచ్చాను. తమరు ధర్మస్వరూపులు. పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారిస్తే నా నిర్దోషిత్వం సత్వరమే తేలిపోతుందని మనవి’

‘గణాధిపతికి దీని వంశంతాలూకు చుంచెలుకలే యుగాలబట్టీ వాహనసేవలు అందిస్తున్నాయి మహాప్రభో! ఆయన నాయన శివయ్యమాదిరి కాలకూట విషాన్ని మించిన టాంజానియా కందిపప్పును ప్రాణాలకు తెగించి మరీ బొక్కుతున్నాయి ఈ పందికొక్కులు. ఆ ధర్మకకోణాన్నికూడా తమరు పరిగణలోకి తీసుకోవాల్సుంది’

చిత్రగుప్తులవారి వత్తాసుతో సమవర్తి ధర్మసంకటంలో పడటం చూసి పందికొక్కు మరింత రెచ్చిపోయింది. ‘మా లోకంలోని వ్యాపారులు మీ అంత మాలోకం కాదు మహాప్రబో! అమెరికా, చైనాలను చూసి బాగా ముదిరిన సజ్జు. పప్పుధాన్యాలు ఎక్కువ పండితే లాభాలెక్కడ తగ్గుతాయోనని దుర్భుద్ధి. సుక్షేత్రమైన భూముల్లో పప్పుకు బదులు పొగాకు, గంజాయిలవంటి మాదకాలను ప్రోత్సహించే మదపురాయుళ్లకే వారి మద్దతు. అధిక దిగుబడి ఆశ చూపెట్టి నాసిరకం పప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నదీ ఈ దేశద్రోహులే. కళ్లేలమీదే వీలైనంత సరుకు తక్కువ ధరకు రాబట్టి, గిడ్డంగుల్లో పూడ్చిపెట్టి కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు. బీదబిక్కీ పప్పులకోసం అల్లాడే స్థితికి తెస్తున్నారు. గద్దెభయం అనుక్షణం వెంటాడే ప్రభుత్వపెద్దలు ఖజానాసొమ్మే కనక, ఎవరికీ లెక్కలు చెప్పనక్కర్లేదు కనక ఆ నాసిరకం సరుకునే బజారుధరకన్నా ఎక్కువ పోసి కొంటున్నారు. అంతా కలసి జనం సొత్తును పంచుకొని భోంచేస్తున్నారు’

‘ముక్కపప్పు తిని బతికే పందికొక్కుకు ఇంత పరిజ్ఞానమా!’ నోరువెళ్లబెట్టేసారు యమధర్మజులవారు. వెంటనే ధర్మవిచారణణ బాధ్యత గుర్తుకొచ్చింది. తేరుకొని ‘పప్పు లేనిదే తెలుగువాడికి ముద్ద గొంతు దిగదు. పసిబిడ్డకు తినిపించే గోరుముద్దలనుంచి.. పితృదేవతలకు సమర్పించే పిండాల వరకు,, అన్నింటా కంది కంపల్సరీ! పెళ్ళంటే తెలుగువాడికి పప్పన్నమే. తప్పుచేసినవాడి కాలుకూడా పప్పులో వేయించే అతిమంచివాడు తెలుగువాడు. మీ కందిమల్లె యోగివేమన కందిమీద వ్యామోహం చావక ‘పప్పులేని కూర పాడు కూర’ని ఈసడించాడు. పప్పు పక్కనుంటే చాలు.. పంచభక్ష్యాలనైనా పక్కకు తోసేస్తాడు మీ తెలుగువాడు. కూర, కలగూర, పులుసు, పచ్చడి.. చివరికి పొడిచేసైనా సరే కందిని ఓ పట్టుబడితేనేగాని తృప్తితీరా త్రేన్చదు ఏ తెలుగు కడుపైనా! తెలుగువాడికి అంత ప్రాణపదమైనదని తెలుసుండీ గాదెల్లో దాచుకొన్న కంది అమృతాన్ని దొంగతనంగా మెక్కడం ఓ పందికొక్కుగా నీవు చేసిన ద్రోహం కాదా! తిన్న ఇంటివాసాలు లెక్కించే నీలాంటి విశ్వాసఘాతుకులకు శిక్షేమిటో తెలుసా! మా నరకంలో శాశ్వతనివాసం!’

చిత్రగుప్తుల వారు ఘొల్లు ఘౌల్లుమన్నారు! యమధర్మజులవారిని అసుంటా పక్కకు తీసుకు వెళ్లి చెవుల కొరుకుడు మొదలుపెట్టారు ‘భూలోకపాలకులకుమల్లే తమరూ కంగారు పడితే కొంపలంటుకొంటాయి మహాప్రబో! పందికొక్కులు చూసేందుకే చాలా అల్పజీవులు! ఇవి తెచ్చి పెట్టే ఉపద్రవాలు కల్పాంతానికైనా ఆగవు. అందినంతవరకే వాటికి గాదెలో కందులు ఆహారం. ఏవీ అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పసికందులే అహారం. కుటుంబనియంత్రణంటే బొత్తిగా గిట్టని వీటికి మన నరకలోకం వీసా దొరికితే మనగతేమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి మహాప్రభో! దీనికిప్పుడు తోడుగా ఓ ఆడజోడూ తయారుగా ఉందిక్కడన్నది మరిచిపోకండి!’

యమధర్మరాజుల వారికి అంతా అర్థమయింది.మాట మెత్తబడింది. ‘నిజమేగానీ చిత్రగుప్తా! తీర్పు తిరగరాయడం కుదురుతుందా! చచ్చి ఒకసారి ఇక్కడికొచ్చిన ఏ జీవీ తిరిగి వెనక్కి వెళ్లడం కుదరదని నీకు మాత్రం తెలీదా! ముత్తెమంత పుణ్యమైనా చేయని ఈ క్షుద్రజీవిని ఏ కారణం చూపెట్టి తిరిగి భూలోకానికి తరిమేయగలం! త్రిమూర్తులతో మాట రాదా!’

‘ముత్తెమంత పుణ్యమేం ఖర్మ మహాప్రభో! ఈ పందికొక్కులు చేస్తోన్న ధర్మకార్యంముందు మన మహాదేవుడి శిష్టరక్షణకూడా ఏ మూలకు! గాదెల్లో దాచిన టాంజానియా కందిపప్పు కాలం గడిచేకొద్దీ కాలకూటంకన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరం. అయినా ఆ విషాన్ని ప్రాణాలకు తెగించి మరీ భోంచేస్తున్నాయి ఈ పందికొక్కులు. తద్వారా ఎన్ని తెల్లకార్డుజీవుల ప్రాణాలు వల్లకాడు పాలుకాకుండా కాపాడుతున్నాయో గుర్తించవద్దా ధర్మప్రభువులు!’

‘’ తలపంకించారు యమధర్మజులవారు.

‘నిజమే కానీ.. ధర్మాసనంమీద అధిష్ఠించి ఉన్న దేవతను. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసీ గమ్మునుండిపోవడం ధర్మమా! దోషులను దండించడానికే గదయ్యా ఈ దండం నా చేతికొచ్చిందీ!’

‘చిత్తం మహాప్రభో! కందిపలుకు కిలో రెండువందలు పలుకుతోంది కిందిలోకంలో ప్రస్తుతం. ఏం కొనాలో.. ఏం తినాలో తేలక తికమక పడుతున్నది సామాన్యప్రజానీకం. ఆ కాలే కడుపులు సభల్లో చెప్పులు విసురుతున్నాయి. సచివాలయాలముందు నిరసనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని శాంపిల్సు మాత్రమే! అసలు ఎన్నికల మొసళ్ల పండుగలు చాలా ముందున్నాయి స్వామీ.. కందిపోటు దొంగలతో మిలాకత్తయే సర్కారు పెద్దలందరికీ!’

‘భళా! అర్థమయిందిలేవయ్యా! పదవి పోయి.. పరువు పోయి.. ప్ర్రాణాలు పోయి.. ఇక్కడికొస్తారుగా ఆ పెద్దమనుషులు! అప్పుడు చూపిస్తా నా దండం తడాఖా!’ కసిగా మీసాలు మెలేసుకోసుకొన్నారు అధర్మదండనాథులు.

‘కందిపోటుదొంగలు గాదెల్లో దాచిన కాలకూటవిషం ఎంత మెక్కినా నీ ప్రాణాలకింక ఏ ఢోకా ఉండదు గాక! నువ్వింక నీ లోకానికి సతీసమేతంగా సురక్షితంగా వెళ్లిపోవచ్చు! అసలు పందికొక్కుల్నిక్కడికి తొందరగా రప్పించు ధర్మకార్యంమాత్రం మర్చిపోవద్దు’ పందికొక్కు వైపు తిరిగి ప్రసన్నంగా ఆదేశించారు యమధర్మజులవారు.

‘ప్రభూ!.. తరువాతి విచారణ,,’ చిత్రగుప్తులవారింకో కొత్తదస్త్రం తీయబోతుంటే ‘బాగా డస్సిపోయానయ్యా చిత్రగుప్తయ్యా! అత్యవసరంగా రెండు కమ్మపొడి ముద్దలు వేడి వేడిగా వెన్నకాచిన నేతిలో ముంచుకొని మింగితేకానీ.. మళ్లీ విచారణకు నాకు శక్తి రాదు’ అంటూ లేచి నిలబడ్డారు యమధర్మజులవారు.

దేవుడే రక్షించాలి!
కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.

‘గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం ఆ మడుగులో మొసలితో ఎట్లా పడిందో గానీ వెయ్యేసి పాట్లు.. ఒక్క అరగంట మనమీ బస్సులో ప్రయాణం చేసేసరికే గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’

‘శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మగా గరుడ వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటట! రామావతారంనాటి కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే నయం’

‘భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్ద గగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా మనమీ భూలోక పర్యటన పెట్టుకుంది!శంఖుచక్రాలు, కిరీటాలు గట్రా పటాటోపాలుంటే జనం పట్టించుకుంటారా! పెద్ద పండుగ అయిపోయినా పగటివేషగాళ్ళింకా ఊళ్ళోనే తిరుగుతున్నారని ఎగతాళి చేయరూ! జనం మధ్యలో జనం మనుషులు మాదిరి తిరిగితేనే కదా మనకూ నిజమైన జనం కష్టనష్టాలేవిటో తెలిసొచ్చేది! రామావతారంనాటి ట్రిక్కు. పద..పోదాం! పెళ్ళినడకలొద్దు!’

‘బాగుంది సంబడం! సమయమంతా బస్సు వెయిటింగులోనే గడిచిపోయింది. నన్నంటారేమిటి మధ్యలో? చీకటి పడేలోగా మన లోకానికి వెళ్ళిపోవాలి బాబూ! పొద్దుగూకితే ఇక్కడ ఆడవాళ్లకి బొత్తిగా రక్షణ లేదని బెదరగొట్టాడు నారదుడు!’

ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదు ‘పట్టుకోండి! పట్టుకోండి!దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా!దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా రావేమయ్యా’అంటూ ఆర్తనాదాలు!

‘తమరిహ కార్యరంగంలోగ్గానీ దూక్కపోతే నా చెవులు ఇక్కడేబద్దలయేట్లున్నాయి! ముందా భక్తురాలి మొరేంటో ఆలకించండి మహాప్రభో!’ చెవులు రెండూ గట్టిగా మూసేసుకుంది మహాలక్ష్మి.

దొంగవెంటబడక తప్పలేదు పరంధాముడుకి!

అలనాడు మాయలేడి వెంటబడ్డం కన్నా మహా కష్టంగా ఉందీ తుంటరి వెంట తరుములాట. త్రేతాయుగంనాటి ఆ సంఘటన జరిగింది కాకులు దూరని కారడవుల్లో! చీమలు దూరని ఆచిట్టడవులెక్కడ, చీటికిమాటికి వాహనాలు, గోతులు, గుంతలు,మురిక్కాలవలు, హోర్డింగులు, చిన్న దుకాణాలు, పోస్టర్లను మేసే దున్నపోతులు.. అడుగడుక్కీ అడ్డొచ్చే ఈ సిటీ రోడ్లెక్కడ!

ఎవరో గల్లీ లీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డు తగలటంతో దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా!కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ. బిత్తరపోయాడు భగవంతుడు!

‘అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’

‘మన హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’

‘పోలీసును కదురా పోకిరి మానవాధమా! భగవంతుణ్ణి!’

‘అంటే దేవుడివా! మరీ మంచిదన్నా! ఎప్పట్లా నీ ముడుపు నీవు పుచ్చేసుకొని నన్ను విడిచి పుచ్చేయరాదే! నాకేం? జైలుకెళ్లైనా జబర్దస్తుగా బతికేయగలను! కరువు రోజులు. నా పెళ్లాంపిల్లలే నీ ఎదాన పడి ఆకలి చావులు చస్తారు! ఆలోచించుకో సామీ!’

‘కష్టాలు ఎవరికైనా ఒక్కటేగా? సంసార పోషణకని ఈ జీవి దొంగతనానికి పూనుకుంటే అది శిక్షించదగ్గ పాపమవుతుందా?’

దేవుడు ధర్మసంకటంలో పడిపోయాడు.

సందు చూసుకొని దొంగ సగం బంగారంతో సహా సందులోకి ఉడాయించాడు!

సగం బంగారమే చూసి ఆడమనిషి వీరంగాలు మొదలపెట్టింది. ‘దొంగలు దొరలు కుమ్మక్కవడమంటే ఇదే! సగం బంగారం నొక్కేసి పెద్ద ఆపద్భాంధవుడిలా ఆ పోజేమిటయ్యా పెద్దమనిషీ!’ అంటూ పెడబొబ్బలు! అంతకంతకూ జనం మూగిపోతున్నారు!

మొగుణ్ణి రక్షించుకోవాల్సిన పతివ్రతా ధర్మం హఠాత్తుగా గుర్తుకొచ్చింది లక్ష్మీదేవికి. వంటిమీది బంగారు గొలుసొకటి ఆడమనిషి మీదకు విసిరి దేవుడి రెక్క పుచ్చుకొని చక్కా ఉడాయించింది.. పక్కనే ఉన్న బస్తీలోకి.

‘ఈ ఆపద్భాందవుల వేషాలు ఇప్పుడంత అవసరమా అనాథరక్షకా? దొరలెవరో దొంగలెవరో పోల్చుకోడమే కష్టంగా ఉంది. దొంగలూ ‘లా’పాయింట్లు లాగేస్తుంటే ఏ నేరానికని తమరు దుశ్టశిక్షణకు పూనుకోగలరు? వచ్చిన దారినే పోదాం పదండి! మన పాలసముద్రం మీద నేను మీ కాళ్లు వత్తుతూ కూర్చుంటాను. మీరు కమ్మగా కళ్లు మూసుకుని పడుకుందురు గాని స్వామీ!’

‘మనమేమీ రాజకీయ నాయకులం కాదు.. అవసరాన్ని బట్టిజెండా, ఎజెండా మార్చుకోడం కుదరదు! భూలోకస్వర్గం సృష్టిస్తామని అభయ హస్తమిచ్చి తీరా ఇప్పుడేవో చిన్న అడ్డంకులొచ్చిపడ్డాయని చేతులెత్తేయడం ధర్మం కాదు. సర్వాంతర్యాములం! దుష్టశిక్షణ, శిష్టరక్షణ మన పర్మనెంటు మ్యానిఫెస్టో! ఇంకో రెండు మూడు కేసులన్నా చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే అమరలోకంలో మన పరువేం కాను?’ మొండిగా ముందుకే కదిలాడు ముకుందుడు!

‘నీళ్లకుళాయిల దగ్గర ఆడంగులు జుట్టు జుట్టు పట్టుకుని సినీపరిభాషలో ముచ్చట్లాడుకోవడం దేవుడి కంటబడింది.విడదీసేందుకు అడ్డు వెళ్ళిన ఆదిలక్ష్మికీ నడ్డిమీదా వడ్డింపులు తప్పలేదు. ‘నీళ్లింకారాకముందే ఈ జగడాలెందుకు తల్లుల్లారా?’ జగన్నాథుడి ఆందోళన.

‘అవెప్పుడొచ్చి చచ్చేనయ్యా? పోయినసారిట్లాగే ఎన్నికలప్పడు ఒక్క చెంబెడు పడ్డట్లు గుర్తు. మళ్లీ ఎన్నికలొచ్చాయి కాబట్టి ఇంకో చెంబో అరచెంబో వస్తాయని ఆశ! వాటి కోసమే మా మంతనాలు’ అందో మహాతల్లి చర్చల సందర్భంగా ఊడిన జుట్టుముడి సవరించుకొంటూ!

భగవానుడు చిరునవ్వుతో కుళాయి మీద ఇలా తట్టాడో లేదో.. బొళ బొళా ఇనుపగొట్టం గుండా గంగ ప్రవాహంగా కిందకురికింది. ఆడంగులెవరి మొహాల్లోనూ ఇసుమంతైనాఆశ్చర్యం లేదు. ఒక నడివయసు సుందరి మాత్రం అతితెలివి ప్రదర్శించింది. ‘బాగుంది బాబూ మేజిక్కు! ఏ పార్టీ తరఫున తమ్ముడూ తమరి ఈ గమ్మత్తు ప్రచారం?’

‘ఏ పార్టీ అయితేనేం లేవే అక్కా! వీళ్ల త్తు భారం ట్రిక్కులు ఎవరికి తెలీవనీ? పోయినసారిట్లాగే ఎన్నికలప్పుడే రోజుకో పగటేషం ఏసుకొచ్చి మాయచేసి చచ్చారు! ఏవయంది చివరికి? గెలిచి గద్దెనెక్కేక దేవుళ్లల్లే నీలుక్కుపోయారు! ప్రతీసారీ మోసపోయేందుకు మేమంత ఎతిమతంగా కనపడుతున్నామా ఏందయ్యా! అందుకోయే అప్పా.. ఆ బిందెతో ఒక్కటిచ్చుకుంటే ముఖం లొత్త పడిపోవాల!’ కొంగు బిగించిన కోమలాంగికి కోరస్ అందిస్తూ మిగతా ఆడంగులూ పూర్తిగా కార్యాచరణకు పూనుకోకముందే భర్త పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత మరోసారి మహాలక్ష్మి నెత్తిన పడింది.

స్వామిచెయ్యి పుచ్చుకొని రైతుబజారులోకి పరుగెత్తింది.

రైతుబజారులో కూరగాయలేమీ రాశులు రాశులుగా పోసి లేవు.రకానికి ఒక్కటి.. సంక్రాంతి బొమ్మలకొలువులో మాదిరి.. ఏ దుకాణంలో చూసినా ఒహటే దృశ్యం! నోరెళ్లబెట్టి చూస్తున్నారు విష్ణుదంపతులిద్దరూ! ఓ బక్కపల్చటి జీవి భుజంమీది బస్తాలోనుంచి కరెన్సీ కట్టొకటి తీసి దుకాణం మనిషి మీదకు విసిరేసాడు. కొత్తిమిర కట్టొకటి అందుకొని ముక్కుదగ్గర పెట్టుకొని.. ఓహో.. ఒహటే మురిసిపోవడం!

మూడు నిమిషాలైనా కాలేదు.. కట్టను క్రూరంగా వెనక్కు లాగేసుకుని ‘బోడి వెయ్యి రూపాయలకెంత సేపయ్యా వాసన్లు చూసేది? ఇట్లాగయితే ఇహ మేం వ్యాపారం చేసి తట్టుకొన్నట్లే. నడు.. నడు..పక్కకు’ అంటూ డబ్బుకట్ట పట్టుకు నిలబడ్డ మరో ఆడమనిషితో బేరంలో పడిపోయాడు దుకాణం మనిషి.

‘భగవంతుడి బుర్ర గిర్రున తిరిగింది. బక్కభక్తుణ్ణి పట్టుకుని విషయం కక్కిస్తేగాని కష్టం గట్టెక్కించే తోవ తోచే అవకాశం లేదు.

‘కాయగూరలు పండించే భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారి యుగాలయ్యాయయ్యా అమాయక దేవుడా! కొత్తగా కూరలు పండించే అవకాశం బొత్తిగా లేదెక్కడా ఇప్పుడు! సింథటిక్ టైప్ కాయగూరలు స్వామీ ఇవన్నీ! మీ సృష్టి కర్తలకేమీ అర్థం కావులే ఇవి! రకానికొకటి చొప్పున చైనానుంచి బోలెడంత పోసి తెప్పిస్తారీ దుకాణదారులు. మొదటి తారీఖుకదా ఇవాళ! జీతాలు వచ్చే నా బోటి అదృష్టవంతులం కొందరం ఉన్నంతలో ఇట్లా డబ్బుపోసి కాస్సేపు వాసన్లు చూసి తరించి పోతుంటాం! సుష్టుగా భోజనం చేసినట్లు అదో తుత్తి!’ బక్కజీవి వివరణ. లక్ష్మమ్మకు తిక్క రేగింది. ’నువ్వొక్కడివే వచ్చి ఇట్లా వాసన్లు చూసుకొని మురిసిపోతే సరిపోతుందా పెద్దమనిషీ? ఇంట్లో పెళ్లాం బిడ్డల సంగతేమీ ఆలోచించద్దా?’

‘హుఁ! పెళ్లామూ.. పిల్లలూ కూడానా తల్లీ ఈ కరువు రోజుల్లో!’ నుదురు బాదుకుంటున్న బక్కజీవిని చూసి భగవంతుడి కడుపు నిజంగానే తరుక్కుపోయింది.

నిజమైన కష్టనష్టాలు ఎలా ఉంటాయో కళ్లక్కట్టినట్లు కనపడుతున్నాయిప్పుడు.

‘ఇన్నేసి సొంట్లు పడుతూ ఈ భూలోకాన్నే అంటిపెట్టుకుని ఉండకపోతే కమ్మగా మోక్షం ప్రసాదిస్తాను. స్వర్గం వచ్చెయ్యరాదా బక్కభక్తా?’

‘అదీ సంగతి! ఇప్పుడర్థమయిందయ్యా మీ ఇద్దరి కత! ఏ పార్టీ తరఫున అంకుల్ ఈ నయా ప్రచారం? ఎన్నికలదాకానేగా ఈ అమిత ఔదార్యం? ఎన్ని ఎన్నికల సిరాచుక్కలు చూసింది స్వామీ ఈ చూపుడువేలు! పదివేలు పోస్తేనన్నా ముక్కు దగ్గరకు కొత్తిమిర కట్టొస్తోందిప్పుడు. మీ హామీలన్నీ నిజమేనని నమ్మి మా ఓట్లన్నీ మీకేసేస్తే! మీది ఏ మాయదారి పార్టీనో నాకు తెలియదుగానీ.. మోక్షం వంకతో మీ కాపుసారా అమృతమని చెప్పి అమ్ముకుందామనేగా మెగా ప్రణాళిక? మీ పుణ్యముంటుంది.. బాబ్బాబూ! నన్నిలా వదిలేయండి’ అంటూ మరో కూరగాయల దుకాణంలోకి దూరిపోయాడా బక్కమనిషి.. ఏ ఉల్లిపొరకనో వాసన చూసేందుకు!

పొద్దున కోఠీలో దిగింది మీరిద్దరేనా మహాశయా? దేవుళ్లకైతే మాత్రం ఎన్నికల కోడ్లు ఉండవా? పరమ అమాయకులయ్యా మా ఓటరు ప్రజానీకం! మోక్షం సాకుతో ఎవరివైపు తిప్పాలని మీ పథకాలు? కోడ్ ఉల్లంఘన కేసు బుక్కయితే బెయిలు కూడా దొరకదు కలియుగం గడిచినా.. తెలుసా?’ చిందులు తొక్కుతున్నాడు ఎదురుగా నిలబడ్డ పెద్దమనిషి.

‘రాంగ్ టైంలో వచ్చినట్లున్నాం బాబూ మేమీ భూలోకానికి! ఎంత దుష్టశిక్షణ శిష్టరక్షణకయినా ఓ సమయం సందర్భం ఉంటుందన్న ఇంగితం ఇప్పుడే మాకు వంటబట్టింది! ఏ కోడూ.. ఓడూ అడ్డులేనప్పుడే వచ్చి కాపాడుకొంటాంలే మా భక్తజనావళిని! మమ్మొదిలేయండి మొదటిసారి తప్పుకి!’ శ్రీవారి చెయ్యిపట్టుకొని ముందుకు కదలబోయింది శ్రీలక్ష్మీదేవి.

‘వచ్చినవాళ్లు ఎలాగూ వచ్చారు. మా పార్టీ అభ్యర్థికో పది ఓట్లు తరుగు పడేట్లున్నాయి. ఇద్దరూ కలిసి ఎనిమిది చేతుల్తో ముద్దర్లు గుద్దేసి పోండి స్వాములూ! మీ కష్టం ఊరికే ఉంచుకోనులే! మీ కొండ చిరునామా ఏదో చెబితే గెలిచినాక వచ్చే నిధుల్లో సగం మీ హుండీలోనే సమర్పించుకుంటా!’ అన్నాడు ఎన్నికల్లో నిలబడ్డ ఆ అభ్యర్థి!

దేవుళ్ళిద్దరూ శిలాప్రతిమల్లా చూస్తుండిపోయారు!

హా! ప్రజాస్వామ్యమా! దేవుడే ఇహ నిన్నురక్షించాలి సుమా!

దేవుడి పాలన
‘దేవుడి పాలన’.. ‘దేవుడి పాలన’ అంటూ అంతా అలా ఊదరగొట్టే సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!’

‘నీ ద్యాసీ పొద్దు దేవుడిగారిమీదకు మళ్లిందేరా! వివరాలేమన్నా తెలిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యమేదన్నా వేసేద్దామన్న దుర్భుద్ధయితే కాదుగదా!’

‘అపార్థాలొద్దు బాబాయ్! మన ప్రపంచ జనాభా ఏడొందలకోట్ల పైచిలుక్కి చేరుకుంది కదా ఇప్పటికే! అదే దామాషాలో దేవుళ్లసంఖ్యా పెరుగుతున్నదా.. లేదా.. అని నాకో ధర్మసందేహం! మనకి ముక్కోటి దేవతలున్నట్లు ఎక్కడో చదివాను. ఆ లెక్కన ఒక్కో దేవుడికి రెండువందల ముఫ్ఫైముగ్గురు భక్తులను ఆదుకోవాల్సిన బాధ్యతా భగవంతుళ్ళమీద ఉందిగదా! ఈ కరువు రోజుల్లో అదెంత బరువు! అందుకే వాళ్ళ కష్టనష్టాలేమిటోకూడా కాస్త వాకబు చేద్దామనీ,,!’

‘ఇహనేం! జనగణన మాదిరిగా దైవగణనకీ బైలుదేరూ! ఎలాగూ పనీ పాటా లేనట్లుందిగా నీకీ మధ్య!’

అబ్బాయి ముందుగా బ్రహ్మలోకంలోకి ప్రవేశించాడు.

తామరతూడులో తామరాసనుడు లేడు! అక్కడే మానససరోవరం మడుగులో కునికిపాట్లు పడే హంసవాహనం అంది ‘మీ లోకానికి సెకనుకి నాలుగు శాల్తీలయ్యా సరఫరా అవ్వాలి! ఇక్కడికి తిరిగొచ్చేవి మాత్రం ముచ్చటగా రెండంటే రెండే! ఈ లెక్కన మనుషుల్నిచేసే ముడిసరుక్కి ఎంత గిరాకీ వచ్చి పడిందో తెలుసా అబ్బాయ్! పనిభారమూ ఎక్కవపోయింది పాపం మా పెద్దాయనకి. బ్రహ్మ రాసిన నుదుటిరాతల్నీ మీరు అవేవో కంప్యూటర్లో.. పాడో.. వాటి సాయంతో తిరగరాసేసుకుంటున్నారటగా ఈ మధ్య! బోలెడన్ని ఫిర్యాదులు వచ్చిపడుతున్నయ్ బాబూ బ్రహ్మలోకానికి ప్రతీరోజూ! వీటన్నిటికీ చెక్ పెట్టేసే కొత్త సాఫ్టువేరేదన్నా దొరుకుంతేమోనని వాకబు చేసేందుకు వెళ్లారు విశ్వకర్మ దగ్గరకు విధాతగారు’

‘వాణీమాతకూడా కనిపించడం లేదే!’

‘బ్రహ్మ కష్టాలు బ్రహ్మవి. అమ్మ కష్టాలు అమ్మవి. మీ మానవుల బుర్రల్లో బుద్ధి ఎక్కువ కూరడం బుద్ధితక్కువ పనయిందనుకుంటున్నారయ్యా ఇక్కడంతా! అంత కష్టపడి ఎన్నో భాషలు కనిపెట్టి ఇంచక్కా ఎవరి పుట్టుకభాష వాళ్ళు మాట్లాడుకోమంటే.. మీరేం చేస్తున్నార్రా అబ్బాయ్! అన్నింటినీ కలగలిపేసి ఓ కొత్త సంకరభాష తయారు చేసేస్తున్నారు! ‘నా భాష గొప్పదం’టే నా భాష గొప్పద’ని దుర్భాషలలాడుకొంటున్నారు! మైకులముందు మీరు కూసే కూతలు.. పత్రికల్లో మీరు రాసే రాతలు భాషామతల్లికే ఓ పట్టాన బుర్రకెక్కి చావడం లేదు! ‘మానవా! కారుకూతలు మానవా!’ అని మీకు అర్థమయేలా అర్ధించాలన్నా శారదమ్మకూ సంకరభాషే గతయిపోయింది.. ఖర్మ! ఎవరో టీ.వీ యాంకరమ్మట! ఆ పిల్ల దగ్గర సంకర ట్యూషను పెట్టించుకొందీ మధ్య. మా పలుకంజలి. అక్కడికెళ్లింది.. ఇంకా రాలేదు’

అబ్బాయి అటునంచటే విష్ణులోకానికి పయనమయ్యాడు.

పాలకడలిమీది పాముపడగా బోసిగా ఉంది. పరమాత్ముడేమన్నా కొత్త అవతారం ఎత్తేందుకని వెళ్లాడేమో! ఆ మాటే ఆదిశేషుని అడిగితే ఇంతెత్తున బుస్సుమని లేచాడు!

‘అదొక్కటే తక్కువయ్యా ఇప్పుడు మా అవతారమూర్తికి! మీ లోకంలో ఎవరో గాలి సోదరులంటగా! నలభైమూడు కోట్లుపోసి వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటమొకటి స్వామివారి నెత్తికి తగలేసారు అప్పుడెప్పుడో! అప్పుడొచ్చిన మాడుపోటు.. ఇప్పటికీ తగ్గలేదు. మా ధన్వంతరిగారి దగ్గరి మందులేవీ పనిచేయడం లేదు. ఆయనా వల్లకాదని చేతులెత్తేస్తే మంచి వైద్యుడేమన్నా దొరుకుతాడేమోనని మీలోకానికే వచ్చారు.. ఇంకా తిరిగి రాలేదు’

‘మరి సిరి? అమ్మగారూ అయ్యగారి వెంటనే వెళ్లారా?’

‘అమ్మో! మీ లోకానికే! డబ్బుకాకలో కొట్టుమిట్టాడుతున్నారంటగా అక్కడ మీరంతా! ఎక్కడే పాపాత్ముడు కట్టిపారేస్తాడోనని స్వామివారే లక్ష్మమ్మ తల్లిని వెంట రావద్దన్నారు.

అయినా.. మీ మానవాధవులమీదే మా తల్లికి ఆదరం ఎక్కువ. అక్కడి బీదాబిక్కిని ఆదుకుందామని వస్తే ఆదిలక్ష్మనికూడా గౌరవం లేకుండా ఏంచేసారయ్యా మీ పెద్దమనుషులు! నల్లరంగు పూసేసి నేలమాళిగల్లో దాచేస్తారా! అహ్వ..!’ అంటూ జిహ్వనిండా నిప్పులు గుమ్మరించాడు ఆదిశేషుడు.

ఇంకాసేపు అక్కడే ఉంటే మాడి మసయిపోవడం ఖాయం.

అబ్బాయి అమాంతం కైలాసం జంప్!

వెండికొండా భూత్ బంగళానే తలపిస్తోంది.

తెల్లకార్డువాళ్లకి చంద్రన్నలిద్దరూ రూపాయిక్కిలో బియ్యం పంచుతున్నారు కదా ఈ మధ్య! దారిద్ర్యరేఖకు ఎల్లప్పుడూ దిగువునే ఉండే మారాజాయ ఈ ఆదిభిక్షువు! చౌకబియ్యంకోసం అటుగానీ వెళ్లాడేమో!

ఆ మాటే అడిగితే ‘కాదయ్యా!’ అంది నంది ‘ఆ ముక్కసరుక్కి కొండలెక్కి దిగాలా మా కైలాసవాసుడు! మింగి హరాయియించుకోడానికి మీ నూకలేమన్నా అలనాటి హాలాహలమా నాయనా! వ్యాహ్యాళికని వెళ్లిన అమ్మవారు వెండికొండకు ఇంకా తిరిగి రాలేదు. ‘విచారిద్దామ’ని వెళ్లారు మా విలయదేవుడు!’ అంది నంది.

దేవుళ్ళంటే ఒక్క త్రిమూర్తులే కాదుగదా!

బాపట్ల భావనారాయణ స్వామివారేమన్నా వివరాలు చెబుతారేమోనని అటుగా వెళ్లాడు అబ్బాయి. ఆ మధ్యనే ఏదో చిన్నగాలితెర వీస్తే నెత్తిమీది గాలిగోపురంకాస్తా ఠప్పుమని కూలిపోయిందట! ఆ కుములుడింకా తీరనే లేదేమో! బైటికొచ్చి మొహం చూపించేందుకే అహం అడ్డొచ్చింది భావనారాయణస్వామివారికి!

శ్రీ కాళహస్తీశ్వరుడి దగ్గరా అదే చేదు అనుభవం. దర్శనభాగ్యం కలగలేదు!

‘ఏడుకొండలవాడి ఆలయానికి బంగారు తాపడాలేమిటి? చిన్నగుళ్లమీద చిన్నచూపేమిటి? దేవుళ్లంతా సమానమే అయినప్పుడు ఒక్కోగుడికి ఒక్కోతీరు కేటాయింపులు.. అన్యాయం!ఈ అసమానత్వం నడవనివ్వం’ అంటూ కొట్లాడేందుకు చిల్లర దేవుళ్లంతా కలిసి కొత్తగా ఓ సంఘం (చి.దే.సం) పెట్టుకొనే పనిలో హడావు’డిగా ఉన్నార’న్న సమాచారం అందింది అబ్బాయికి.

మర్రిచెట్టు నీడలో కునికిపాట్లు పడుతున్న పోతురాజు దొరికాడు చివరికి అతికష్టంమీద. ‘మీరు నిజంగా ముక్కోటి దేవతలేనా! మూడురోజులబట్టీ కాలికి బలపం కట్టుకు తిరుగున్నానయ్యా భగవంతుడా! ఒక్క దేవుడైనా దర్శనమిస్తేనా మగడా!’ అంటూ గట్టిగానే నిలదీసాడు పోతురాజును పట్టుకొని ఆబ్బాయి.

‘గాలి సోదరుల్లాంటి మాఫియా దెబ్బలకు సుంకాలమ్మల్లాంటి గ్రామదేవతలకు నిలవనీడకూడా కరువైపోయింది! కరువు కాటకాలతో అల్లాడే చిన్నా చితకా జనతా.. చిన్నపిల్లలకు ఎక్కడ కాన్వెంటు బళ్లల్లో ఉచిత ప్రవేశాలు.. పెద్దాసుపత్రుల్లో సకల సౌకర్యాలు అడుగుతారోనని కలల్లోనైనా కనిపించేందుకు గడగడలాడుతున్నారయ్యా దేవుళ్లంతా!’ అని మళ్లీ నిద్రకు పడ్డాడు పోతురాజు.

ఒక్క చిన్నదేవుడితోనైనా మాట కలవకుండానే అబ్బాయి దైవగణన కార్యక్రమం అర్థాంతరంగా ముగిసింది.

‘పెట్రోలు సుంకాలు తగ్గించమని, పచారీ సామాను చవక దుకాణాల్లోనైనా చవగ్గా ఇప్పించమని, కోతల్లేని కరెంటు కంటిరెప్ప పాటైనా కనికరించమని, నలకలున్నా సరే నాలుగు నిమిషాలకు తగ్గకుండా నల్లాల్లో నీళ్లు ధారకట్టించమని.. ఇలా మనం సవాలక్ష గొంతెమ్మ కోరికలు కడుపులో దాచుకొని వెంటబడితే పాపం.. దేవుళ్లుమాత్రం ఏం చేయగలరు చెప్పు! దోమలు ‘జైకా’ వైరస్సున మోసుకుంటూ ప్రపంచమంతటా ఝామ్మని జైత్రయాత్రలు చేసే తరుణంలో దైవగణనకని బైలుదేరాను చూడు. నాదీ తప్పు! నా ‘ముక్కోటి దేవతల’ సందేహం ప్రస్తుతానికి అలాగే పెండింగులో పడింది బాబాయ్ చివరికి.. ప్చ్!’ అని నుదురుబాదుకొనే డింబకుడితో..

‘ముక్కోటి ఏం ఖర్మరా పిచ్చోడా! మూడొందల కోట్లమంది దేవతలున్నారు.. మన చూట్టూతానే! ఆ దేవుళ్ల దగ్గరికి నువ్వసలు వెళ్లనే లేదు. వెయ్యినోటు చూపిస్తే బొందితో కైలాసానికైనా తోసేస్తామని ప్రకటనలు గుప్పించే బాపతు చిల్లర దేవుళ్ళు.. ఎంత మందున్నారో నీ లెక్కలేం తేలుస్తాయ్.. అమాయకుడా! ఎన్నికల ముందు ‘దేవుడి పాలన’ అందిస్తాం.. ‘దేవుడి పాలన’ అందిస్తామని మన నేతాశ్రీలు.. ఓహో.. అదేపనిగా హామీలు కుమ్మేస్తుంటారు చూడు! ఆ దేవుళ్ళు ఈ దేవుళ్లేరా పిల్లవెధవా! ఆ చిల్లర దేవుళ్ల ఆశీర్వాదాలతోనే మనం ఓట్లేసి గెలిపించే నేతలు మనల్ని టోకున పరిపాలించి పారేస్తున్నది!’ అని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసాడు బాబాయి ఎప్పటి మాదిరిగానే.

చదివినోడికన్నా..!
‘సిగ్మా.. సిక్స్’ పేరు విన్నావురా?’

‘నగ్మా పేరు వింటున్నాం.. ఈ సిగ్మా.. నో ఐడియా బాబాయ్!”అనుకున్నాన్లేరా! సిగ్మా అనంగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అయినా గుర్తుకొచ్చుండాల్సింది! ఏం చదువులో ఏంటో!.. ప్చ్ఁ!’విషయం చెప్పు బాబాయ్.. చంపక! ఇంతకూ నీ క్లాసు పీకుడు ఇప్పుడు సిగ్మండు ఫ్రాయిడ్ని గురించా?.. నగ్మా రాజకీయాల్ని గురించా?”రెండూ కాదబ్బీ! చిన్నప్పటి మా ఊరి తిప్పడ్ని గురించి!”తిప్పడ్ని గురించి చెప్పుకోడానికి ఏముంటుందబ్బా! సరే! కానీయ్! లింకుల్లేకుండా నువ్వే డొంకా కదలించవుగా!’

‘ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీ నేషనల్ కంపెనీలెన్నో ‘ఎర్రర్ ఫ్రీ’ ఆపరేషన్స్ కోసమని బిలియన్సాఫ్ డాలర్స్ మనీ ధారపోస్తున్నాయ్! అయినా ఎక్కడో కోటికో తప్పయినా దొర్లక తప్పడం లేదు!’

‘కోటికో తప్పంటే గొప్పేకదా బాబాయ్! ఎప్పట్లా నీ దెప్పుళ్లు అక్కర్లేదనుకుంటానే!’

‘కోటికైనా.. పదికోట్లకైనా తప్పంటే తప్పేరా డిప్పకాయ్! ఒక పాయింటులో మిలియన్త్ ఫ్రాక్షన్ మిస్టేకొచ్చినందుకే గదా మొన్నా సూపర్ సానిక్ స్క్రామ్ జెట్టాపరేషన్ అట్లా ‘ఫట్’మనేసింది! మిలియన్సాఫ్ డాలర్సు గాలిలో కలిసి పోయింది! పవర్ గ్రిడ్స్ ఫెయిలయి రాష్ట్రాలకు రాష్ట్రాలు రోజుల్తరబడి అంధకారంలో అల్లాడ్తున్న చరిత్రరా మనది పిచ్చివెధవా! మిస్టేకులనేంటిలే! బ్లండర్సొచ్చి పడ్డా మనవాళ్లకి చీమకుట్టినట్టైనా ఉండదు! పర్ఫెక్షన్ కోసం పడి తపించేవాళ్లకే.. పాయింట్ జీరో జీరో జీరో జీరో ఫోర్ పర్సెంటు పొల్లు దొర్లినా పిచ్చెత్తిపోయేది! ఫరెగ్జాంపుల్.. మన సియమ్ములిద్దరి డబులు ఫింగర్స్ జీడీపీ ఫిగర్సు చూడు..!’

‘విదేశాన్నుంచొచ్చిన ఓ పెద్దమనిషీమధ్య ‘మీకు లాగా ఫిగర్సు మా దేశంలో చూపిస్తే పిచ్చాసుపత్రిలో పారేస్తారు. బెడ్లు ఖాళీలేకపోతే సెంట్రల్ జైల్లో కుమ్మేస్తార’ని స్టేట్మెంటిచ్చేసాడు బాబాయ్ మరీ ఘోరంగా!’

‘విదేశస్తులకిలాంటి విజన్లు బుర్రకెక్కవులేరా! నిజానికా విజన్లు సరైన సూపర్విజన్లో పడితే సూపర్ హిట్లవుతాయని ఇప్పటికీ మన సీయమ్లిద్దరి గాఠ్ఠి నమ్మకం. దానికోసమే పాపం వాళ్ళట్లా నిద్రాహారాలన్నీ మానేసి ఇరవైనాలుఘ్ఘంటలూ పనిచేస్తున్నారు. లెక్కల్లో ఎక్కడో తేడా కొట్టి ఆఖర్లో అన్నీ అట్లా అభాసుపాలవుతుంటే ఆ అభాగ్యులేం చేస్తార్రా పాపాత్ముడా! అధికారులది కదా ఆ జవాబుదారీదనమంతా నిజం మాట్లాడితే!’

‘నిజమే బాబాయ్! జనాభా లెక్కల్నుంచి.. గణాంక వివరాల వరకూ, నీతి ఆయోగు ఫిగర్లు మొదలు.. వార్షికాంత నివేదికల పిల్లి మొగ్గల దాకా.. ఎప్పుడూ ఏవో తప్పులు.. తికమకలు.. తిరకాసులు! జెమినీ సర్కస్ ఆటల్ను మించిపోతున్నాయీ సర్కారీ నౌకర్ల ఫీట్లు!’

‘ఈ కంప్యూటర్లొచ్చినప్పట్నుంచీ మేటర్ మరీ కాంప్లికేటెడ్ అయిపోయిందిరా అబ్బీ! ఎమ్ సెట్ పేపర్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, మార్కుల షీట్లు, మార్కెట్ రేట్లు.. గెజిట్లో డేటాఫ్ బర్తుల్లాంటి ఇంపార్టెంట్ మేటర్లో కూడా.. ఎప్పుడూ ఏవో పొరపాట్లు! జనాలకు అలవాటయింది కాబట్టి పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ.. సూపర్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్లూ.. క్రికెట్ హీరోల ట్రాక్ రికార్డులూ.. లాంటివాటిల్లో గానీ తేడాలొస్తే చూడూ! పేడముద్దల్తో చాలా గొడవలయిపోతాయిరా బాబూ రోడ్లు! ‘

‘గెజిట్లో డేటాఫ్ బర్తంటే గుర్తుకొచ్చింది బాబాయ్! మొన్నామధ్య మన సిటీలో పేద్ధ పేరున్న గవర్నమెంటు డాక్టరొకాయన మర్చిపోయి మూడేళ్ళు ముందు పుట్టేసాట్ట! రిటైర్మెంటు ముందుగానీ పాపం ఆ పొరపాటు గుర్తుపట్టలేక పోయాట్ట! పట్టుబట్టి గెజిట్లో ఇప్పుటికైనా ఆ తప్పు సరిచేయించేసుకున్నాడు గదా!అయినా మెప్పేదీ! సిన్సియారిటీకీ లోకంలో చోటేదీ! చేసిన తప్పును యాభై ఏళ్లకయితేనేం.. సరిచేసుకోడానికి ఎంత గొప్పమనసు కావాలి! డాక్టరుగారిని అభినందించాల్సింది పోయి.. అభిశంసిస్తున్నారంతా! కొంతమందైతే మరీ కన్నీరు మున్నీరయిపోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి’

‘నిజమయితే కావచ్చు గానీ.. నువ్వు మాత్రం మాటి మాటికీ నా మాటలు ట్రాకుమార్చాలని చూస్తున్నావు! నన్నెందుకలా ఏమర్చాలని చూస్తున్నావురా?’

‘సారీ బాబాయ్! సావాస దోషం! సరే! తిప్పణ్ని గురించి కదా నువ్వేదో చెప్పుకొస్తున్నావూ! చెప్పు.. చెప్పు!’

‘అక్కడికే వస్తున్నా! డైరెక్టుగా పాయింట్ కెళితే నీ బోటివాడికి మేటరు సూటిగా బోధపడదని తెలుసు. కనకనే ఇన్నేసి ఎక్జాంపుల్సు ! ఇంకొక్క ముఖ్యమైన ముక్కా చెప్పి మన తిప్పడి కథ దగ్గరికొచ్చేస్తా!’

‘అలాగే!.. కానీయ్ బాబాయ్!’

‘పేపర్లో చూసాన్రా! ముంబయిలో డబ్బావాలాలు ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా ‘సిగ్మా.. సిక్స్’ స్టాండర్డ్స్ సాధించేసార్ట!

‘సిగ్నా సిక్సా? అంటే?’

‘పది లక్షల పనులు చెస్తే అందులో కేవలం మూడుకి మించి మిస్టేకులు దొర్లకపోవడం! డబ్బావాళ్లు చేసే కోటిన్నర పన్లలో కేవలం ఒక్క పొరపాటే దొర్లుతున్నదని ఆ మధ్య ఇంటర్నేషనల్ మేగ్జైనేదో ఒకటి సర్వే చేసి మరీ సర్టిఫికేటిచ్చింది. చదువూ సంధ్యా లేనోళ్లు ఒక గుంపుగా తయారై కంప్యూర్లకన్నా కరెక్టుగా లక్షలాది భోజనం కారియర్లను వందల కిలోమీటర్ల దూరానున్న శివార్లనుండి సిటీలోకి టయానికి ఠంచనుగా చేరేస్తుంటారని విని అవాక్కయ్యాన్రా! ‘నిజంగా మనం ఇండియాలోనే ఉన్నామా!’ అంటూ ఒకటికి రెండుసార్లు గిల్లుకొనిగానీ నిర్ధారణకు రాలేకపోయానురా చిన్నా!’

‘ చదువూ సంధ్యా లేనోళ్లు.. లెక్కా డొక్కా రానోళ్లు తప్పులెలా చేస్తార్లే బాబాయ్! పోనీ.. పొరుగురాష్ట్రమేగా ఆ డబ్బావాలాలది! అలాంటి వాళ్లను కొద్దిమంది బుద్ధిమంతుల్నైనా పోగేసి తెచ్చుకొని పని నడిపించుకోవచ్చుగా! ముఖ్యమంత్రులిద్దరికో సలహా పారేయచ్చుగా!’

‘మన రాష్ట్రాల్లోకూడా అలాంటి టేలెంటు వున్నవాళ్ళు ఊరికి మినిమమ్ పదిమందుంటార్రా బాబూ! ఉదాహరణకి మా ఊరి తిప్పణ్నే తీసుకో! ఊరు మొత్తానికి వాడిదొక్కటే మైలబట్టలు ఉతికే కుటుంబం. వాడికి ఉన్నదీ ఒక్కటే గాడిద. రెండొందల గడప.. గడప గడపకీ పది శాల్తీలు! సగం గడపల్లో సగం మందైనా రోజుకొక్క జత ఉతుక్కి విసిరేసినా.. సుమారు వెయ్యిబట్టల తుక్కు తేలుతుందిరా చివరికి చిన్నోడా! వీటిలో మళ్లీ ఎన్ని వెరైటీలు! చీరలు.. ధోవతులు.. జాకెట్లు.. ప్యాంట్లు.. అంగీలు.. లుంగీలు! లోపలివి.. బైటివి! లోపాయకారీగా వాడుకొనేవి! చిరిగినవీ.. రంగులు పోయేవీ.. గుండేసి పేల్చినా డాగులు పోనివి! అన్నింటినీ ఇంటిటికీ తిరిగి మూటలు కట్టుకొని రేవులో ఉతికి .. ఆరేసి.. సాయంకాలానికల్లా మల్లెపువ్వులకు మల్లే మార్చేసి.. మళ్లీ ఎవరి తొడుగులు వాళ్లకి ఏ తేడా పాడా రాకుండా.. తడబడకుండా చేరవేస్తున్నాడు తిప్పడు! ఏళ్ల తరబడి ఏ తప్పులు లేకుండా సేవ చేస్తున్నాడు! వాస్తవానికి మా తిప్పడులాంటి వాళ్ల ‘ఆపరేషన్ వాషింగ్’ ముందర ఈ ‘సిగ్మా సిక్స్’ లెక్కలెన్నైనా బలాదూర్!’

‘నిజమే బాబాయ్! మీ తిప్పడి ‘సక్సెస్ గ్రాఫు’ వెనకున్న సీక్రెట్ ఫార్ములా ఏదో పసిగట్టి మన ముఖ్యమంత్రుల చెవుల్లో ఊదేయచ్చు కదా! రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులూ కాకిలెక్క బాపతుల్తో కుస్తీలు పడుతున్నారు పాపం!’

‘ఆ ఉద్దేశంతోనే మొన్న పెద్దపండక్కి మా ఊరెళ్లినప్పుడు తిప్పణ్ని పట్టుకున్నాన్రా గట్టిగా ఎట్లాగైనా ‘ట్రేడ్ సీక్రెట్’ కక్కించాలనీ!’

‘కక్కాడా మరి?’

‘ఆహాఁ! ‘ఇందులో నా గొప్పతనమేం లేదు బాబయ్యా! అంతా మా గాడిదగాడి గడుసుదనమే! గుడ్డలమూట వాసన చూస్తే చాలు.. గడప గుట్టంతా ఓండ్ర పెట్టేస్తుంది ముండాఖాన్! దాని తోక పట్టుకొని నెట్టుకురావడమే ఇన్నాళ్ళు మేం చేస్తున్న ఘనకార్యం’ అనేశాడ్రా!’

‘ఈ లెక్కన మన రాష్టాల్లోని గాడిదలన్నీ సర్కారోళ్లకన్నా..!’

‘ష్ష్! గట్టిగా అనబోకబ్బీ! గొడవలయిపోతాయి! రోజులసలే బావో లేవు! గవర్నమెంటు పన్లు బోలెడు గందరగోళంగా నడుస్తున్నాయి కదా ఈ మధ్య మరీను! స్పెషల్ రిక్రూట్ మెంటు స్కీంలాంటిదేదైనా లాంచ్ చేయించి తిప్పడిగాడి గాడిదల్లాంటివాటికైనా అప్పచెప్పేస్తే కొన్నైనా పన్లు సక్రమంగా సత్వరమే పూర్తవుతాయేమో.. చూడాలి! సందు చూసుకొని పెద్దోళ్ళిద్దరి చెవుల్లో వెయ్యాలి!’

సంక్రాంతి సంబరాల్లో.. శంకరం పెళ్లి
‘సంకురుమయ్య ఈ సంక్రంతికి ఏమెక్కి వచ్చాడంకుల్?’ అని అడిగాడు శంకరం.’విమానాలెక్కయితే రావట్లేదురా! ప్రధానితో పోటీ. తట్టుకోలేక పోయుంటాడు పాపం.. సంక్రాంతి పురుషుడు!’ అంటూ పంచ్ ఒహటి విసిరేసారు.. మా వారు పంచాంగం చూసుకొంటూ కూడా!

శంకరం అంటే మా ఆడపడుచుగారి పెద్దబ్బాయి. పదహారణాల తెలుగు బాలుడు. ‘ఒహ అణా తక్కువైనా ఫరవాలేదు.. వయినమయిన తెలుగు పిల్లే కావాల’న్న పీకులాట పిల్లోడికి.. వాడి తల్లికి!

‘పెద్ద పండుగయ్యే లోపల పిల్లనెతుక్కురమ్మ’ని పిల్లాడిని ఇండియామీదకు తోలింది ఆ అమెరికా తెలుగుతల్లి.

పిల్లోడి వరాన్వేషణలో ఓ మజిలీ మా ఇల్లు ఈ సారి పండక్కి!

‘సంక్రాంతి అంటే నాకు మహా ఇష్టం ఆంటీ! భోగిమంటలు, భోగిపళ్ళు, రంగవల్లులు, రంగు రంగుల గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, గుళ్ళో చెక్కర పొంగలి, గాలిపటాలు, బొమ్మల కొలువులు, కోడిపందేలు.. ఓహో.. చిన్నప్పుడు అంకుల్ వాళ్ల ఊళ్లో మా మజాగా ఉండేందంటగా.. మామ్ చెబుతుంటుంది పద్దస్తమానం!.. అ లైక్ దట్ లైఫ్.. ఐ లవ్ దట్ తెలుగుదనమ్’ అంటూ శంకరం ట్రాన్సులోకి వెళ్ళిపోయి ఊగిపోతుంటే ‘పాపం పిల్లోడు!’ అనిపించింది ఆ అమాయకత్వం చూసి!

తర్పణాల దగ్గర్నుంచీ అన్నీ చక్కంగా చెప్పుకొస్తున్నాడు! పండగంటే పిండివంటలు.. టీవీలో కొత్త సినిమాలు’ అని తప్ప ఇంకేమీ తెలీని మా సజ్జుకన్నా వెయ్యి రెట్లు నయమేగానీ.. వీడి అమ్మ వీడిని మరీ ఇంతగా చెడగొట్టాలా! పిటీ! వీడి పిల్ల ఉబలాటం ఇహ ఈ జన్మకీడేరేనా!’ అనిపించింది నాకు.

మూడు కర్రముగ్గులేద్దామంటేనే జానెడు జాగా దొరకదీ టిక్కీ అపార్టుమెంట్లలో! ఇహ గొబ్బెమ్మలంటే గోమయ మెక్కడినుండి దిగుమతవాలి!

‘సెల్లార్లోని మనవంతు నేలమీద స్టిక్కరుముగ్గు అతికించి ప్లాస్టిక్ గొబ్బెమ్మలన్నా పెడదామే పాపం బావ ముచ్చట తీర్చడానికి!’ అని తగులుకున్నాడు మా సుపుత్రుడు సుందరం. వాడివన్నీ మన ఆంధ్రా సి.యం హైటెక్ బుద్ధులే!

ఆ మాట శంకరం చెవినబడింది. ఇహ ఊరుకుంటాడా!’ మన తెలుగుముగ్గుల్లో బేసిగ్గా గ్రాఫిక్ ఎలిమెంట్సు బోలెడున్నాయత్తా!, ఈ మధ్యనే చదివానేదో పత్రికలో.. గొబ్బెమ్మల్లోని గోబర్ ఎలిమెంటు యాంటీ-వైరస్ పనిచేస్తుందంట ఎన్విరాన్మెంటుమీద! సో.. నో స్టిక్కర్ ముగ్గులు.. నో ప్లాస్టిక్ గొబ్బెమ్మలు! ఒన్లీ రియల్ ఆవుపేడతో గొబ్బెమ్మలు.. బియ్యప్పిండితో ముగ్గులు!’

‘సిటీలో దూధ్ పేడా దొరుకుతుందిగానీ.. ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది బావా.. నువ్ మరీనూ!’ అంటూ మా సుందరం మొత్తుకోలు.

పంతానికని బావమరిదిని వెంటేసుకొని కార్లో ఎర్లీఅవర్ సిటీటూరుకి బైలుదేరాడు అమెరికా తెలుగుబాలుడు శంకరం!

గోశాలయితే డిస్కరయిందికానీ.. ‘పొంగల్ సీజన్ కదా! ఔటాఫ్ స్టాక్! ఆన్లైన్ ఆర్డర్సే గండంగా ఉంది1 కౌంటర్ సేల్సుకూడానా.. పదండిహ!’ అంటూ బైటికి గెంటేశార్ట ఈ బాలకులిద్దర్నీ గోశాల పాలకులు! బికమొగాలేసుకు చక్కా వెనక్కొచ్చేశారు శూరులు!

‘పోనీ! మనకు తెలిసిన మినిష్టరున్నాడు. ఆ సోర్సేమన్నా ట్రై చేయమంటావేంట్రా! ఒహ వంద డాలర్లు మనవి కాదనుకున్నాసరే.. తట్టెడు పేడతెచ్చి గుమ్మంలో పోసి పోతారు ‘గ్రేటరు’ ఉద్యోగులు’ అంటూ మేనల్లుడి సాయానికి వెళ్లబోయారు మా శ్రీవారు. ఎంతయినా ముద్దుల చెల్లాయి ఒక్కగానొక్క కొడుక్కదా!

‘బ్రైబింగా?.. లాబీయింగా? నో వే మావయ్యా!’ అని తలడ్డంగా ఆడించేసాడు ఈ అమెరికా అల్లుడు.

మధ్యాహ్నం కాలేజీనుంచి కంగారుగా తిరిగొచ్చేసి ‘కంగ్రాట్సు రా శంకరం బావా! సోమాజిగూడ సెంటర్లో బోలెడన్ని ఆవులున్నాయ్! రోడ్డుకడ్డంగా పడుకొని పోస్టర్లు మేస్తున్నాయ్! ఆ ట్రాఫిక్ ఈదుకెళ్ళి ట్రై చేస్తే నీ కోరిక తప్పక తీరవచ్చురా! పోరా!’ అని మా కిలాడి పిల్ల కబురందించంగానే చెరో తట్టా పట్టుకొని మారథాన్ మొదలు పెట్టేసారు.. పట్టువదలని భట్టి, విక్రమార్కుల్లా బావా, బావమరుదులిద్దరు!

పోస్టర్లుతినే పశువుకి మూడెప్పుడొస్తుందో భగవంతుడికే తెలియాలి! మూడు గంటలపాటు చలి చెమటలతో వాటి వెనకాలెనకాలే పిల్లజంట వెయిటింగు! తీరా నిరీక్షణ ఫలించి తట్ట పట్టుకొనే టయానికి బస్తీదాదా ఎవడో ప్రత్యక్షమై ‘తీయరా! రౌడీ సుంకం’ అంటూ డిమాండుకు దిగేసాట్ట! వట్టి తట్టల్తో చిందులేసుకొంటూ తిరిగొచ్చి ‘పోలీస్టేషనుకెళ్ళి ఫిర్యాదిద్దా’మని పేచీక్కూర్చున్నాడు పిచ్చిశకరం, రెండువేలపదహారు!

‘సుబ్బరంగా గొబ్బెమ్మలుకూడా పెట్టుకోలేని పండక్కి ఇక్కడెందుకు.. దండగ! గ్రాండ్ మాఁ గారూళ్లో గ్రాండుగా జరుపుకొంటార్రా! అంకుల్ ఫ్యామ్లీ మొత్తాన్నీ వెంటేసుకెళ్ళు!’ అంటూ హ్యూస్టన్నుంచి వాడిమామ్ హుకుం!

అప్పటికప్పుడే అందర్నీ కార్లెక్కించేశాడు తిక్కశంకరం!’

‘నిజమేరా! మా చీరాల్లో అయితే ఇంచక్కా చక్కెర పొంగలి, దద్దోజనం దండిగా దొరుకుతుందిరా! మా రెండో చెల్లెలు రేవతి ఏటా పిల్లలచేత బొమ్మల కొలువుకూడా పెట్టిస్తుంటుది..’ అంటూ దారిపోడుగూతా మా వారి దంపుడు పాటలు!

మాటి మాటికీ శంకరం ముక్కుపుటాలు ఎగరేస్తుంటే మామగారి మాటకి ఎంకరేజ్మెంటేమన్నా ఇస్తున్నాడేమో అనుకొన్నాను. పొరపాటు. ఆయనగారు ముక్కుపొడుం పీల్చేటప్పుడూ ముక్కుపుటాలెగరేయడం మానలేదు ఈ అర్భకుడు!

‘ఎక్కడో ఏదో దుర్వాసన! మీకెవరికీ ఏమీ అనిపించడం లేదా!’ అని ఆ పిల్లాడు ఒహటే గుండెబాదుళ్ళు!

అమెరికన్ గాలి అలవాటయిన నాసిక్కి ఇక్కడిగాలిట్లాగే కంపు కొట్టడం కామన్! పొల్యూషనుమీద లెక్చర్లు దంచుడేగాని.. ప్రాక్టికల్ కాలుష్యంఘాటు బిడ్డకింకా అలవడ్డట్లు లేదు!

‘పండగలు సంస్కృతికి సంకేతాలు. మొనాటనీనుంచి మనల్ని కాపాడే టానిక్కులు.’ అంటూ పండగలమీదతగాడు థీరీ దంచుతుంటే.. పోనీలే.. ఆవిధంగానైనా ఆ బాబు ద్యాస సంప్రదాయాలమీదకు మళ్ళడం మంచిదేననిపించింది. మౌనంగా ఆ రంపపుకోతకు తలొగ్గి ఉండిపోయాం ఫ్యామిలీ అందరం.. ఒక్క మా వారు మినహా.

రంపం రెండో కొస ఆయనగారు అందిపుచ్చుకొన్నారిహ ‘అవున్రా అల్లుడూ! మా బాగా చెప్పావు కానీ పండగ పరమార్థమంతా ఇప్పుడు పూర్తిగా మారిపొయిందోయ్ శంకరం! గొబ్బెమ్మలంటే పేడముద్దలని.. గంగిరెద్దులంటే బక్క ఎద్దులని మా పిల్లదానికి చీదర.. చులకన! హరిదాసుకీ ముష్టోడికీ తేడా తెలీని తెలివితక్కువతనం మా పిల్లోడికి!..’

పిల్లల్ని కాపాడడం కన్నతల్లిగా నా కర్తవ్యం అనిపించింది. ‘పండగలకి.. ప్రస్తుతానికి రెలవెన్సేంటో చెప్పరాదా.. తెలిస్తే! విని పిల్లలు నేర్చుకోమన్నారా చెప్పాల్సొన రీతిలో చెబితే! అస్తమానం ఆ కంపుపొడి దోపుకొని ముక్కులు నులుముకోడమేగాని.. నోరు తెరిచి ఏనాడైనా ఓ మంచిముక్క చెవినేశారా!’ ఆవటా అని నేనూ నోరు చేసుకొన్నానిహ వింటూ కూర్చునే ఓపిక సంపూర్ణంగా నశించి.

‘రెలవెన్సా.. బోలెడంతుందోయ్ భామామణీ! ఉదాహరణకి ఇప్పుడీ సంక్రాంతినే తీసుకోండి. రకరకాల సోషల్ ఫోరమ్సునుంచి సైన్సు ఎగ్జిబిషన్లదాకా, వేదిక ఏదైనా సరె మన నేతలు వేసే చిందులు పండక్కి వచ్చే పగటివేషాలని మరిపిస్తున్నాయా లేవా! కోడిపుంజుల్లాగా సినిమాహీరోల అభిమానులు కొట్టుకొంటున్నారు. నీళ్లకోసం కొట్లాట, రాబోయే ఎన్నికల్లో కాబోయే సి.యం పదవికోసం కాట్లాట! పొట్టేళ్ల ఢీఢిక్కులకన్నా ఎందులో తక్కువ మన యూనివర్శిటీల కుమ్ములాటలు! పిట్టలదొరల్లా మనల్ని మాటల్తో బోల్తాకొట్టించే నేతాగణం.. పథకాల పేరుతో అశ్సరభ శరభయ్యలను మించి కనికట్టు విద్యలను ప్రదర్శించే ప్రభుత్వం.. ఇవన్నీఈ పండుగ రెలెవెన్సులేనే పిచ్చిదానా! కైట్ ఫ్లయింగని కామర్సులో ఓ తమాషా పదముంది. సరుకులేమీ లేకుండానే సొమ్ములటూ ఇటూ చేతులు మారుతుంటాయి. అదో రకం ఫోర్ట్వంటీ తతంగం. అధికారంలొ ఉన్న పెద్దలు అస్తమానం ఎగరేసేదీరకం పతంగుల్నే! ఇది రెలెవెన్సు కాదా లోలాక్షీ ! భిక్షాపాత్ర నెత్తిమీదెట్టుకొని చిడతలు కొట్టుకుంటూ ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా!’ అంటూ గడప గడపా తడివే హరిదాసుల ప్రేరణే కదా మన ముఖ్య మంత్రులిద్దరి పెటుబళ్లకోసం దేశదేశాలు చక్కర్లు! ఫండ్సన్నీ కృష్ణార్పణమైపోతున్నాయని అప్పోజిషను వాళ్ళట్లా ఆపసోపాలు పడిపోతున్నది.. గంగిరెద్దుల్లా హై కమాండు పాటలకు వంతలేస్తున్నదంతా సంక్రాంతి రెలెవెన్సు పద్దులోకే జమేసె తంతులేనే తల్లీ! అయ్యగారికో.. అమ్మగారికో దణ్నం పెట్టకపోతే పొద్దుగడవని దుస్థితి అన్ని పార్టీల్లోనూ ఉన్నది. ఇదీ పండగ రెలెవెన్సేనే పంకజాక్షీ! బొమ్మలకొలువుల్లో బారులు తీరి నిలబడ్డ బొమ్మల్లకు మల్లే.. ఎవరెవరో ఎన్నికల వేదికలమీద వరసల్లో నిలబడి చేతులూపేస్తున్నారు. ఇది పండగ రెలెవెన్సు కాదంటావా కాదంబరీ!’

మా వారి గోలలో పడి కారు ఊర్లోకి ఎప్పుడొచ్చిందో తెలీలేదు. ఏ ఇంట చూసినా ఏడుపులూ.. పెడబొబ్బలూ! పండగ పూటకూడా ఇంత విచారాలెందుకో!

‘హాయ్! హ్యాపీ పొంగల్! హ్యాపీ బైశాఖీ.. హ్యాపీ గుడిపడ్వా!’ అంటూ ఎదురొచ్చింది మా తోడికోడలు చిన్నకూతురు మంగతాయారు. సిక్స్టీన్ డాలర్స్ సెక్స్తీడాల్లా వంకర్లు పోయే ఆ కుంకనుచూసి నాకే చచ్చే సిగ్గేసింది. ఇహ ఈ శంకరం కొంకర్లు వేరే చెప్పాలా?

‘ఇంట్లో ఎవరూ లేరా.. ఏంటీ! ఊళ్లో కర్ఫ్యూనా? ఆ ఏడుపులేమిటి? పెడబొబ్బలెవరిమీద?’ అని బిక్కు బిక్కుమంటూ లోపలికి చుట్టూ చూసాడు శంకరం.

‘టీవీలో సీరియల్ నడుస్తోంది బ్రూ ఇన్ లా! ‘కాపురం నాది.. కన్నీళ్లు నీవి!’ కోటి పదకొండో ఎపిసోడు! ఆ ఏడుపులయితేగాని జనసంచారం మళ్లీ మొదలవదు మా ఊళ్లో! ఈ బోరు భరించలేకే బాబూ.. బాబరుతో కలిసి టౌన్లో షికారుకెళ్లేది. వస్తా! క్యాబ్ వాడు ఒహటే రింగులిస్తున్నాడు’ అంటూ కంగారుగా తుర్రుమందా గడుసుపిండం!

తోడికోడలొక్కతే నట్టింట్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకొంటోంది… సీరియల్ సీరియస్గా చూసేస్తూ!

‘అన్నయ్యగారేరీ?’ అనడిగితే ‘కోళ్లపందేల కెళ్లా’రంది.

‘పిల్లాడేడీ?’ అనడిగితే ‘ఇంటర్నెట్ సెంటర్లో ఉన్నా’డంది. ‘అత్తయ్యగారన్నా కనపడాలి కదా! గుడికెళ్లారా?’ అనడిగితే

‘గుడా! గుడెసా! ఈ అమెరికా మనవడు అదేదో ఐ-పాడో.. పాడో కొనిపంపించాడుగా ఆ మధ్య! పెరట్లో కూర్చుని ఎవర్తోనో చాటింగు చేస్తోంటోంది పొద్దస్తమానం’ అంది రేవతి.

ఒక్కక్కరే మెల్లిగా గూటికి చేరడం మొదలు పెట్టారు. సాయంచీకట్లు చిక్కపడ్డాయి.

తెల్లారి బారెడు పొద్దెక్కినా ఇంట్లో పండగ కళేం కనిపించలేదు. పొయ్యిలో పిల్లే కళ్లు తెరవలేదు! మా సిటీ అపార్టుమెంటుల కాపురమే బెటరు!

‘బారెడు పొద్దెక్కింది. బైట పండగ ముగ్గేమీ వెయ్యలేదేంటి ఆంటీ! గొబ్బెమ్మలుకూడా కనిపించలేదే!’ శంకరం ఒహటే గొణుకుడు!

‘రాత్రి సినిమా చూస్తూ ఆలస్యంగా పడుకుండి పోయానయ్యా! మద్యాహ్నం పనిమనిషి వస్తుందిగా! ఆ ఆవుపేడేదో తెప్పించి దానిచేతే తోచిన ముగ్గేదో గీయిస్తాలే!’ అంది బద్ధకంగా మళ్ళీ టీవీముందు చతికిలబడుతూ మా ఆడపడుచు.

‘చ! పండక్కి అమెరికాలోనే ఉండుండాల్సింది. అక్కడైతే అట్లతద్దెకూడా అట్టహాసంగా చేసుకొంటాం అందరం కలసి. మా అమ్మ మాటలు నమ్మి ఇంత దూరమొచ్చాను చూడు.. నా చెప్పుజోడుతో నా దవడ నేనే దడదడా కొట్టుకోవాలి!’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పంచులోకెళ్ళి కూర్చున్నాడు శంకరం.

‘గొబ్బెమ్మలేగా సాబ్ మీకు కావాల్సింది.. ఇంద!’ అంటూ కారు డిక్కీనుంచి ఇంత పేడకడి.. ప్లాస్టిక్ పొట్లాంలో చుట్టి ఉన్నది.. బైటికి తీసి గుమ్మంముందు పడేసాడు కారు డ్రైవరు.. సలీం!

ఆశ్చర్యంతో మాకెవరికీ నోట మాట రాలేదు.

శంకరం అయితే ఆనందోద్వేగభావాలతో కన్నీళ్ల పర్యంతమయిపోయాడు! సలీంని గట్టిగా గుండెలకి హత్తుకుంటూ ఊపేసాడు ‘ఇంత పేడ.. ఇంత కుప్ప.. ఈ పండగ సీజన్లో నీకెక్కడ దొరికింది.. మియా!’

‘దార్లో ఇంజనుకి నీళ్ళకోసం దిగినప్పుడు దొరికింది సాబ్! కొత్త సినిమాలేవో రెండు రిలీజయినట్లున్నాయ్ ఆ పలెటూళ్ళో. గోడలనిండా సినిమా పోస్టర్లు! పోస్టర్లనిండా పేడకడులు! మీరు కలవరిస్తున్నారుకదా అని కాస్త తీసి దాచుంచా’ అన్నాడు. మాకు మా పండగలెంత ముఖ్యమో.. మీకీ మీ పండగలంతే ముఖ్యం కదా!’ అన్నాడు సలీం వినయంగా.

శంకరం సెల్లో వాళ్ల మామ్ తో చెబుతున్నాడు జరిగిందంతా ఆ సాయంత్రం ఓ ఉద్వేగంతో ‘.. యెస్.. మమ్మీ! స్యూర్! అడుగుతా! లకీగా సలీంసాబ్ కి పెళ్లీడు కూతురుండాలే గానీ.. నా వరాన్వేషణకు.. ఇహ ‘శుభం’ కార్డు పడ్డట్లే..!’