వాకిలి » యెల్లో రిబ్బన్…

ఇట్లు మీ… (12)
కార్తీకమాసమంతా శీతలవుదయాల  ప్రభాత రశ్మిని అదే పనిగా చూడటం భలే సంతోషాన్నిస్తుంది. దైనందిన జీవితంలో కొన్ని క్షణాలని మనం మన కోసం మాత్రమే అట్టి పెట్టుకుంటాం. మన కోసం జీవిస్తాం. ఆ రశ్మి తనువులోని ప్రతి అణువుని స్పర్శిస్తుంటే, అప్పుడే పుట్టిన తన బిడ్డ వొళ్లంతా తడిమి తోటి మానవుల స్పర్శని తల్లి ఆ పసిప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు, ఆదిత్యుడు మరలమరల లేత వెచ్చదనంతో మనకి  జీవధాతువుని పరిచయం చేస్తున్నట్టు వుంటుంది. అస్సలు విసుగు పుట్టని ఆ సంతోషానుభవపు తీగకి పూసిన చిరునవ్వుల కాంతుల్లో నిశ్చింతగా రోజువారి పనులు మొదలు పెడతాను. నువ్విక్కడుంటే వో ముద్దుని నీ కుడి అరచేతిపై పూయించి స్టాట్ట్యు అని చెప్పి పనికి వెళ్ళిపొతే నువ్వు యిక రోజంతా మరేం పని చెయ్యకుండా ఆ చేతినే చూస్తుండేవాడివి కదా తిరిగి నేను పని నుండి వచ్చే వరకు.

కిక్కిరిసిన రోడ్స్ పై నుంచి కడుతున్న మెట్రో పనుల పక్కగా ఆ ట్రాఫిక్కే వొత్తైన పూలవనాలు అనుకొంటూ కార్ లోని యేసీనే వూటీ చల్లదనంగా భావిస్తూ ఆఫీస్ కి వచ్చేసాను.  అప్పాయింట్మెంట్స్ యేమున్నాయో  పి. యెస్. చెపుతుంటే ఆమె ఫోన్ మోగింది.  సైలెంట్ లో పెడతారు యెప్పుడు. పెట్టటం మరచిపోయారో లేదా ముఖ్యమైన కాల్ మిస్ కాకూడదని  అలానే వుంచిందో కాని ఆ కాల్ ని చూడగానే ఆమె కళ్ళల్లో కదిలిన తళక్కు తుళ్ళింత నా చూపులని దాటిపోలేదు. ఆ కాల్ ఆమెకి ముఖ్యమైనదని నాకు స్ఫురించేక ఆమె ఆ కాల్ మాటాడటానికి వీలుని కలిపిస్తూ మళ్ళి పిలుస్తాను యిక తను వెల్లొచ్చు అని చెప్పాను.  ఆమె ఫోన్ బటన్ మీద ప్రెస్ చేస్తూనే చటుక్కున బయటకి వెళ్ళింది. మాటాడుతోంది.

నా గది ట్రాన్స్పెరెంట్ గాజు అద్దాల్లోంచి ఆమె హావభావాలు స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి. ప్రేమలు వ్యక్తపరచటానికైనా అందుకోటానికైనా టైం అండ్ స్పేస్ చాల ముఖ్యం కదా. వయ్యస్సుతో నిమిత్తం లేకుండా యెవరి మనస్సుల్లో నైనా నిరంతరం దుమికే నయాగరా జలపాతం ప్రేమ కదా! లేచి నా రూమ్ విండో దగ్గరకి వచ్చి బయటకి చూస్తుంటే కనుచూపు మేరంతా ట్రాఫిక్.  యిప్పుడే వెంటనే నిన్ను చూడాలనిపించింది. వొక తుంటరి పిల్లవాని యీలపాటలా యిష్టపడిన వారి నుంచి వచ్చే పలకరింపు బిజీబిజీగా వున్నప్పుడు వస్తుందనుకొంటాను. స్కైప్ లో నిన్ను చూడాలి అనుకున్నాను. నువ్వేమో బిజీ . అలాంటప్పుడు యీపని యీ ప్రోడక్టివిటి అంతా నిరర్ధకం అనిపిస్తుంది. వొక తలపు మనల్ని తొలుస్తున్నప్పుడు మొత్తం సమయమంతా ఆ వొక్క భావనకే వుండాలనిపిస్తుంది. ఆ వొక్క మనిషే ప్రపంచం అనిపిస్తుంది. జీవన సార్ధకత అక్కడే వుందనిపిస్తుంది.

నాకు అప్పుడప్పుడు సిటీల్లో అమ్మాయిలు అబ్బాయిలు యెక్కడ మాటాడుకొంటారు అనే సందేహం వస్తుంటుంది. వుదయం లేచిన దగ్గర నుంచి  అనేక పరుగుల జీవితంలో కాసింత సమయం చిక్కించుకొని పార్క్స్ లో, షాపింగ్ మాల్స్ లో, మల్టీప్లెక్స్ ల్లో, రెస్టారెంట్స్ లో, గుడి దగ్గరో, యిరుకు సందుల్లో, రద్దీ కూడల్లో నిలబడో, ఐస్ క్రీమ్ తింటునో, కాఫీ తాగుతునో, సినిమా చూస్తూనో కాసిన్ని మాటలు చూపులు కలబోసుకుంటూ అనేక స్వప్నాల్ని నిజం చేసుకొనే రోజు కోసం చూస్తుంటారు. ఆ సమయంలో వారిని అనేక కళ్ళు నిశ్శబ్ధంగా గమనిస్తుంటాయి. యీ అమ్మాయిలు అబ్బాయిలపై వారివారి మానసిక స్థితిగతులకు అనుగుణంగా వారివారి మనస్సుల్లో అభిప్రాయాలని యేర్పర్చుకుంటారు. అవకాశం కల్పించుకొని యెక్కడో చోట  కాలమెలా మారిపోయిందోనని  వ్యాఖానిస్తారు కూడా.  యెవరికి తోచింది వారు మాటాడేసుకుంటారు. పట్టించుకోదు అనుకుంటారు కానీ నగరపు యిరుగుపొరుగు తమతమ పొరుగువారిని చాల పట్టించుకొంటుంది.  మనుష్యులు తెలియని నగరప్రవాహంలో యీదుకొంటూ వెళుతున్నప్పుడు సహసమాజం చూపు పక్క వాళ్ళపై వుంటుంది కాని యిక్కడ ముఖం పైనే వ్యాఖ్యానించరు యెవరో తెలియనితనం వల్ల. అదే చిన్ని వూర్లలో అయితే యెవరుయెవరి పిల్లలో తెలియటంతో వెంటనే మాటాడతారు. రకరకాలుగా  యీ అమ్మాయిల అబ్బాయిల ప్రేమ గురించి మాటాడుకొంటారు.  యిలా కలుసుకొనే స్థలాలు చాల తక్కువ వుంటాయి.

రవ్వంత తీరిక కాసింత యేకాంతం మాత్రమే సరిపోదు మన ప్రేమలు పంచుకోడానికి. టెక్నాలజి చాల ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. యెక్కడికైనా వెళ్ళగానే వైఫై వుందా లేదా అన్నది ముందు చూసుకుంటున్నాం కదా.  ఫోన్ కి నిరంతరం ఫుడ్ పెడుతునే వుంటున్నాం. స్మార్ట్ ఫోన్, అనేక రకాల యాప్స్ లేకపోతే మన ప్రేమల వ్యక్తీకరణ భలే చిన్నబోతోంది. మొత్తానికి ప్రేమ మొగలిరేకుల్లో పొదిగే అక్షరాల సుగంధం మాత్రమే కాదు యింటర్నెట్ కనెక్టివిటి విన్యాసం కూడా.

యెన్ని సాధనాలు వున్నా, యెంత రద్దీ రోడ్లే కానీ, లేదా తామిద్దరే వున్న పూలతోటే కాని, వొకరినొకరు చూడగానే  యిద్దరి కళ్ళలో వొక్కసారే చమక్కుమనే మెరుపుని చూడటంలో వున్న మ్యాజిక్కే వేరు. ఆ కిక్కే వేరు

ఇట్లు మీ… (11)
వో నా చిన్నా, చిన్నచలి. రాత్రంతా కురిసిన చిరుమంచుని కప్పుకొన్న పున్నాగల చల్లని సౌగంధం వుదయపు నడకలో నాతోపాటు. యింకా తెల్లవారని రాత్రి. నడిరాత్రి శుభ్ర పరచిన రోడ్స్. తెరచిన టీ స్టాల్స్ లోంచి మరుగుతోన్న టీ వేడి సువాసనలని లెక్కపెట్టగలిగేంతమంది రుచి చూస్తూ. గొలుసుల చేతివాటంవారికి చిక్కకూడదని మెడల్లో యేం లేకుండా జాగ్రత్త పడి యిళ్ళల్లో పనులకి వెళుతున్న స్త్రీలు, పాల పాకెట్స్ , న్యూస్ పేపర్స్ తో నిండిన టూ వీలర్స్, సైకిల్స్. రోడ్ కి అటూయిటూ యిడ్లి, దోస బళ్ళు. పార్క్ ముందు కొన్ని వూదా రంగు పావురాలు గింజలు తింటూ, పోలీస్ వ్యాను పోలీసులతో గన్స్ పట్టుకొని. సిసి కెమేరాలు, తుపాకుల రక్షణ ప్రతి చోట తప్పని పరిస్థితి. సెక్యూరిటి చెక్ అయ్యాక పార్క్ లోపలకి అడుగు పెట్టగానే ఆకుపచ్చని సొగసు, పరాగపు తేమ పలకరిస్తాయి. గేట్ బయట పరిస్థితికి లోపలకి భలే తేడా వుంటుందిలే.రాత్రంతా మంచుపొంగు రంగులని కప్పుకొన్న నెమళ్ళు సోమరిగా కదుల్తుంటే, చిన్నిచిన్ని పిట్టల రాగాలు వింటూ, పచ్చికపై మంచు బిందువులని చూస్తూ, మెల్లగా కదుల్తూ పలకరించే రెల్లుగడ్డిపై చేతివేళ్ళతో చిటికేస్తూ, నీటి చెలమల్లో తామర పువ్వుల లేత మెరుపు కలల రంగుల చిలకరింపు జల్లుకొంటూ యేర్పర్చిచిన దారులని చూస్తుంటే నీ చేతుల్లో చేతులేసి నీ చేతివేళ్ళ వెచ్చదానాన్ని శ్వాసిస్తూ నడుస్తున్నట్టే వుంది.

నడక పూర్తి చేసి బయటకి రాగానే, గోరువెచ్చని నీటిలో తేనే, తులసి, కొద్దిగా అల్లం కలిపిన జ్యూస్. నిమ్మకాయ రసంతో బాగుంటుందంటారు. కాని నాకు సిట్రస్ యేలర్జీ కదా. ఆ పేమెంట్ మీద అటునుంచియిటు బోలెడన్ని కాయకూరలు, పళ్ళు, పువ్వులు, మొలకెత్తిన గింజలు, న్యూస్ పేపర్స్ తో భలే సందడిగా వుంటుంది. వొక్కర్తినే ఆ పేమెంట్ మీద నడుస్తు యింటి దారి పట్టాను. మంచుతెరలని సుతారంగా దాటుకొంటూ మళ్ళీమళ్ళీ పలకరించే నారింజరంగు పరిమళపు రశ్మిని దోసిలి నిండుగా నింపుకొంటూ యింటికి నే వచ్చేసరికి నువ్వుంటే ఆ రశ్మిని నీ పెదవులకి అద్దేదాన్ని. దాదాపు ప్రతి రోజు యిలానే వుదయాలు యింత అందంగా నాజుగ్గా మొదలవుతాయి. ప్రతి రోజు ఆశ్చర్యపు యెదురు చూపు యేమిటంటే యే రోజు యే పూలపరిమళాన్ని చల్లని గాలిని వేకువ కానుగ్గా యిస్తుందాని.యింటికి వెళ్ళీవెళ్ళగానే మనిద్దరికి యిష్టమైన వరండా చిన్నిగట్టుమీద కూర్చుని ఆరెంజ్ కలర్ పెద్ద మగ్గు నిండా చిక్కని సౌత్ యిండియన్ ఫిల్టర్ కాఫీ తాగటానికి కూర్చుంటే నువ్వు యిలా కూర్చున్న ప్రతిసారి నా కప్ లో కాఫీని మధ్యమధ్య రుచి చూస్తూ నా బుగ్గలపై పెట్టే చిన్నిచిన్ని దొంగ ముద్దులు వచ్చి వాలాయి. విచ్చుకొన్నయెర్రని మందారాలని చూస్తుంటే. యింతలో నల్లని రెక్కల పై యింకు బ్లూ, లేవెండర్ చుక్కల సీతాకోక చిలుక తులసి పువ్వుల చుట్టూ తిరుగుతూ కనిపించింది. భలే కాంబినేషన్. కుంచేతో రంగులు చిలకరించాలనే ఆసక్తి వున్నవాళ్ళకి యెంబ్రైడ్రి చెయ్యాలనే యిష్టం వున్న వారికి సీతకోకచిలుకలు యెన్నెన్ని రంగుల కలయకని యిస్తాయో కదా. అవును లేవండర్ చుక్కలు అంటే గుర్తొచ్చింది. నీకు బట్టల సెలక్షన్ తెలీదంటావు… నువ్వు పంపిన గులాబీ లేవండర్ కాంబినేషన్ తో వున్న చీర యెంత అందంగా వుందో. షాపింగ్ అంటే బద్ధకం కదా నీకు… దొంగా షాపింగ్ తప్పించుకోటానికి కదా.   సరే డియర్… కాఫీ అయింది. యిక హడావడి చుట్టుకుంటుంది. రెడీ కావాలి ఆఫీసుకి.

బయలుదేరాను. యీ టైములో రోడ్స్ అన్నీ రకరకాల వాహనాలతో నిండుగా వుంటాయి. వాహనాల్లో వున్న వాళ్ళు, డ్రైవింగ్ చేస్తున్న వారితో సహా అందరి పెదవుల పై మాటలు తేల్తుంతుంటాయి. కళ్ళల్లో నవ్వు, సీరియస్నెస్, కోపం, ఆదుర్ధా యిలా అన్ని భావాలు కనిపిస్తుంటాయి. సెల్ ఫోన్ రోడ్లని మాటలమయం చేసేసిందనుకో. నడుస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా, టివీ చూస్తున్న , ధియటర్ ల్లలో, గుడిలో, మార్కెట్లో వొక్క చోటని కాదు ప్రతిచోట చూపులు నిరంతరం ఫోన్ కే అతుక్కుపోతే వేరే విషయాలు ఆలోచించడానికి తీరిక యెక్కడుంటుందో. అందుకే యోగ, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రం పూర్తిగా ఆ సమయం తనది అంటుంది నా కొలీగ్. మొత్తానికి దేశం మాటల వరదలో వుందనుకో.

యీ ట్రాఫిక్ వొక పట్టాన కదలదు. రోడ్ మధ్యలో మెట్రో పనులు. యీ రోడ్ పై నడవటానికి తమ రెండు పాదాలు మోపే చోటు కోసం వెతుక్కొంటున్నారు నడిచేవాళ్ళు. యెన్నో సార్లు రోడ్స్ ని వెడల్పు చేస్తుంటారు కాని నడిచేవారి కోసం ఫుట్ పాత్ లుండవ్. పొరపాటున యెక్కడైనా వున్నా వాటి మీదా టూ వీలర్స్ ని నడిపెస్తుంటారు. యేం చేస్తారు… జీవితం అంత తొందరగా పరిగెత్తమంటుంది. నగరంలో నడిచేవారికి చోటివ్వాలి కదా.

ఆఫీస్ కి వచ్చాక అది వొక రంగురంగుల లోకం. సినిమాలు తీసేవారు, తీయ్యాలనుకొనేవారు, తీసిన వాటికి మార్కెట్ కోసం వెతుక్కునేవారు, కలక్షన్స్ బాగున్నవారి సంతోషం, హీరో కి కథ వినడానికి టైం యిచ్చినందుకు పార్టీ మూడ్ తో వొకరో యిద్దరో – వొక ఆకాంక్ష అనేక భావోద్వేగాల నిలయం మా వర్క్ ప్లేస్.

పార్టీ అంటే గుర్తొచ్చింది. నువ్వు నాకు పార్టీ బాకీ. యెప్పుడిస్తావ్. యెక్కడిస్తావ్. యీ నగరపు దీపాలన్నీ మిలమిల మెరుస్తూ కనిపించే వో యెత్తైన ప్రదేశంలో వెన్నెల కాంతి నీపై నుంచి నా చూపులని మరల్చే చోటకి డిన్నర్ కి తీసుకు వెళ్ళతావా.

భలే, అసలు యీ నగరం చుట్టూ కొండ భలే ఆకర్షణీయంగా వుంటుంది. యీ నగరం బోలెడన్ని గుట్టలపై వుంటుంది. యింటికి యెవరొచ్చిన గుట్టలని యెక్కిస్తుంటాను సరదాగా. అక్కడ నుంచి చూస్తే సిటీ ఆ సమయంలో యెలా వుందో తెలుస్తుంది. కాని అన్ని వేళలా యెలా కనిపిస్తుందో తెలీదు. కొంతమందికి కొన్ని సమయాల్లో నగరం యెలా వుందో కనపడుతుంటుంది. మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు నాకు యెలా కనిపిస్తుందో చెప్పానుగా. అలానే కొంతమందికి మిట్టమధ్యానం యెలా వుంటుందో తెలుస్తుంటుంది. అయితే నాకు లేదా మరొకరికి కనిపించినట్టే నగరంలో మిగిలిన ప్రదేశాలు వుండకపోవచ్చు. కొన్నివిషయాలు కనపడినప్పుడు కొంతమంది సిటీ యెలా వుండాలి, యెలా మార్చుకోవాలి అన్నదాని గురించి చెప్పగలుగుతారు. నేను పేవ్మెంట్స్ విషయం చెప్పినట్టు. మరొకరు బస్సులు యే రూట్ లో లేవో చెప్పొచ్చు. అలా చెప్పేవాళ్ళు అసలు సిటీ అంతా యేం జరుగుతుందో తెలుసుకోలేక వోవర్ వ్యూ వుంటే బాగుందనుకొంటారు. వోవర్ వ్యూ కావాలనుకొన్నప్పుడు అసలు రోడ్ మీద జరుగుతుందేమిటో, అసలు యేమైనా జరుగుతుందో లేదో తెలీదు. యిక్కడ రోజువారి జీవితం వురకల పరుగులతో వుంటుంది. అసలు యింత గందరగోళం యెందుకంటే రోజువారి అనుభవానికి వోవర్ వ్యూకి మధ్యన అనుసంధానం చేసుకొనే శక్తి, జ్ఞాపకశక్తి కూడా పోయింది. పరిస్థితి యెలా వుందంటే నరహరిని చెట్టుచిటారుకొమ్మకి యెక్కమన్న చెంచులక్ష్మి చెట్టు యెక్కదు కాబట్టి చుట్టూ యేం వుందో చెంచులక్ష్మికి తెలీదు. కాని అడుగు తీసి అడుగు వేస్తే యేం జరుగుతుందో చెంచులక్ష్మికి తెలుస్తుంటుంది. యీ యిద్దరూ కలిస్తే కానీ ప్రయాణం చెయ్యలేరు.

అదబ్బాయీ, అసలు విషయం…:) చిక్కని గులాబి రంగు లేవేండర్ చీర నీతో వచ్చే పార్టీ కోసం యెదురు చూస్తుంది.

ఇట్లు మీ… (10)
గత కొద్ది రోజులుగా యిక్కడ వానలు. ప్రేమలో మన మనసులు తడిసి ముద్దైనట్టు ఆకులు పువ్వులు తడిసి ముద్దయ్యాయి. వొత్తైన జిల్లుమనే చల్లదనం పియానో మోహపు రాగంలా అల్లరి చేస్తుంటే సముద్రతీరాన వున్న యిసుక రేణువులని లెక్కపెట్టలేనట్టు లెక్కలేనన్ని సార్లు నిన్ను తలచుకొన్నాను. యెదైన కొత్త ప్రాజెక్ట్ చెయ్యబోయే ముందు ఆలోచిస్తూ అటూ యిటూ పచార్లు చేస్తుండే నువ్వు, నీకు నచ్చిన పాటలు ఆన్ లైన్ లో కొనుక్కుని యెంత పనిలో వున్నా సరే ముందు ఆ పాటలు చూడమని నీ నోట్ బుక్ దగ్గరకి లాక్కొచ్చే నువ్వు, కంపోజ్ చేసుకొంటూనో, లేదా చదువుతూనో కాఫీని చల్లార పెట్టే నీకు కాఫీ తాగమని గుర్తు చేస్తున్నా అలానే పనిచేసుకొంటున్న నువ్వు, రాత్రి 10 తరువాత వాక్ కి వెళుతూ, వాన రాగానే లాంగ్ డ్రైవ్ కి తీసుకు వెళ్ళే నువ్వు యిప్పుడు డ్రైవ్ కి వెళుతున్నావా – యిలా అనేక రకాలుగా గుర్తుకొచ్చే నువ్వు యిప్పుడు యేం చేస్తుంటావా అని వూహిస్తున్నాను.

చాలా రోజులుగా వూర్లు పట్టుకొని తిరుగుతూ యీ సముద్ర తీరానికి వచ్చాను. యీ రాత్రికి యిక్కడే వుంటాను. తిరిగి వుదయమే బయలుదేరాలి. యీ హోటల్ రూం యెదురుగా యెప్పటిలా సముద్రం. సముద్రంపై వాన పడుతుంటే యెంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా.. పోయినసారి యిలానే వొక ఫ్రెంచ్ విండో నుంచి వాన కురుస్తున్న సముద్రాన్ని నువ్వు చూస్తుంటే వెనక్కే వచ్చి నీ కళ్ళు మూస్తే నువ్వు అన్నావు ‘నదీ’ అని.

అదేంటి సముద్రం అంటావ్ అనుకున్నాను అంటే ‘యెప్పటికి అంతు తెలియని లోతు, యీదటానికి శక్తి చాలని విశాలత్వం నన్ను భయ పెడతాయి. నువ్వెప్పుడూ నన్ను భయపెట్టవ్. అందుకే నువ్వు యెప్పటికి సముద్రానివి కాలేవ్. నువ్వెప్పుడు జీవనదివే నా వరకు నాకు’ అన్నావ్. ఆ నీ ప్రశంస నా మనసులోకి యింకి శరీరపు నిత్య పరిమళంలా నన్ను సంతోష పెడుతూనే వుంది. నిన్ను హత్తుకొనే ప్రతి సారి వీస్తున్న ఆ సౌగంధం అదే. గుర్తు పట్టావా లేదా?! జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించకు… ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకునేది అపురూపమైన జ్ఞాపకం కాదు కదా.

అంత అందమైన కితాబు అందుకొనేక యింక నేను నీతో కొంచెమైన చెడ్డగా వుండలేనుగా.

స్త్రీ ని దేవత అంటే నిజమనుకొని సహనంగా వున్న మా ముందుతరాలు తెలుసు కదా. వొద్దులే dissection.

యేమైనా సరే కాంప్లిమెంట్స్ భలే మూడ్ బూస్టర్స్ అనుకో. ఫేస్ బుక్ లో పిక్చర్స్ పోస్ట్ చేస్తే మనం మన స్నేహితులని బోలెడంత మెచ్చుకుంటాం. ఆ ప్రశంస confidence ని, సంతోషాన్ని యిస్తుంది కదా. అందరిని యీ ఫేస్ బుక్ లోకి తీసుకొచ్చే యిష్టాన్ని భలే కనిపెట్టారులే మార్క్ జూకర్ బర్గ్. యిప్పుడే ఫేస్ బుక్ ఆఫీస్ లో మార్క్ మోదీతో మాటాడుతోన్న లైవ్ వస్తుంది. చూసాక మళ్లీ యీ వుత్తరం కొనసాగిస్తాను.

యీ వుదయమే యానం వచ్చాను. యిక్కడ నేను ఆత్మీయంగా డాడీ అని పిలిచే దాట్ల దేవదానం రాజు గారు, అమ్మ ఉదయిని గారి దగ్గరకి వెళ్లాను. కబుర్లే కబుర్లు. వాళ్ళిద్దరూ మనుష్యులని ప్రేమించడానికే పుట్టినట్టుంటారనుకో. అక్కడ గోదావరి పై కట్టిన బ్రిడ్జి స్థంభానికి స్థంబానికి మధ్య వుండే సిమ్మెంట్ పలక మీద ‘హ్యాపీ బర్త్ డే తులసి’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన పెయింటింగ్ ని చూపించారు. సంవత్సరం క్రితం రాత్రికి రాత్రి ఆ బ్యానర్ వెలిసిందంట. యెవరు అక్కడ దానిని అంత యెత్తులో పెయింట్ చేసారో యెవ్వరికి తెలియదంట. యీ యేడాది ఆ రాసిన వాళ్ళు యెవరో అక్కడికి వస్తారేమోనని అనుకున్నారంట. యెవ్వరు కనబడ లేదంట. భలే ముచ్చటేసింది సునాయాసంగా చెరిపి పారెయ్యడానికి వీలులేని చోట వొక ఆనవాలుని చిత్రించటం. మరోచరిత్ర సినిమాలో బాలు స్వప్నా అని రాసి వున్న ఆ పేర్లని చూడటానికి రౌండ్ బంగ్లా కి చాల మంది వచ్చేవారంట ఆ సినిమా వచ్చినప్పుడు. మనం చాల చోట్ల యిలా పేర్లు రాసుకోవటం చూస్తాం కదా. అందరికి తెలిసేలా, కనిపించేలా. మనం మన జ్ఞాపకాలని అనేక రకాలుగా పదిలపర్చుకొంటాం.

సెప్టెంబర్ అనగానే నాకు వొక విషయం జ్ఞాపకం వస్తుంటుంది.

1908 సెప్టెంబర్ లో మూసీకి వరదలు వచ్చినప్పుడు మెహబూబ్ ఆలి ఖాన్ మూసి నదికి హారతి యిచ్చారని, అప్పుడు వరదలు ఆగిపోయాయని చెపుతారు. హారతి వల్ల ఆగాయన్నది వొక నమ్మకం. నమ్మకాలు, గుర్తులు మనం యెర్పరుచుకొనేవి. అక్కడ వున్న చింతచెట్టు పైకి యెక్కి చాల మంది ప్రాణాలు కాపాడుకున్నారంట. కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడిన ఆ చెట్టు యిప్పటికి అక్కడ అలానే వుంది. అప్పటి నుంచి ప్రతి యేడాది సెప్టెంబర్ 28న ఆ చెట్టుని దర్శించుకోడానికి అక్కడికి చాల మంది వస్తారు. ప్రాణప్రదాతగా ఆ చెట్టుని గుర్తు చేసుకొంటారు. అక్కడున్నది వొక గుర్తు. అక్కడ ఆ చెట్టు యిప్పటికి వుండటంతో ఆ విషయాన్ని గుర్తుచేసుకోడానికి వొక ఆనవాలు వుంది. ఆ చెట్టే లేకపోతే యెలా జ్ఞాపకం చేసుకొంటారు!!! ఫేస్ బుక్ కూడా మన జ్ఞాపకాలని యెప్పటికప్పుడు అందిస్తుంటే మనం చాలా సార్లు అవును కదా ఆ రోజు యిలా అని అనుకొంటూ సంతోషంతో తిరిగి వాటిల్లో కొన్నింటిని తిరిగి అప్పటి స్నేహితులతోనూ, కొత్తగా వచ్చిన నేస్తాలతోనూ పంచుకొంటున్నాం. యెంతటి సంతోషానికైనా, బాధకైన వొక ఆనవాలు తప్పని సరి కదా. చెట్లు, పుట్టలు, వూళ్ళు, స్థలాలు, బిల్డింగ్స్ మనం దానిని యెలా గుర్తు పెట్టుకోవాలి అని యెవరి లెక్కలు వాళ్ళు వేసుకొంటారు. చెట్టు, రాయి, రప్పా యేదైనా కావొచ్చు. ప్రతి రోజు మరిచిపోతోన్న మన నగరంలో జ్ఞాపకాల ఆనవాళ్ళు కోరుకోవటం యెండమావే కదా!

మనం రేడియో వింటున్నప్పుడు అనుకోకుండా వొక పాట మన చెవిని గిల్లుతుంది. ఆ పాట వొకానొక సమయాన మన పసితనాన్నో, బాల్యంలోనో, టీనేజ్ లోనో మన పెదవులపై అలవోకగా తిరిగాడుండొచ్చు. వొక పుస్తకం, బెల్లం వండుతోన్న వాసన, కొన్ని జ్ఞాపకాలు కుందేలు పిల్లల్లా పక్కకొదిగి కొత్త జ్ఞాపకాలకి దారినిస్తాయి. వాన పిట్టల సందోహంలా కొన్ని జ్ఞాపకాలు చిలిపిగా నవ్వుతాయి. కొన్ని జ్ఞాపకాలు లేడి పిల్లల్లా చేతిని వదల్లేక కన్నీళ్ళ పర్యంతమవుతాయి. అప్పుడు మనం గతంలోకి వెళతాం. భవిష్యత్తులోకి తొంగిచూస్తాం. జ్ఞాపకాలు చుట్టిముట్టే వేళ ఆలోచించాల్సింది నడిచి వచ్చిన దారుల్లో మన కోసం, అలానే మనకి యెదురైన వారిలో, మనం స్నేహితులమో ఆప్తులమో అనుకునేవారిలో యెన్నెన్ని పిల్లల నవ్వుల్లాంటి, రంగురంగు గులాబీ పువ్వుల్లాంటి, శరత్ వెన్నెల్లాంటి జ్ఞాపకాలని జల్లాం.

యెర్ర జూకా మల్లెల్లా వొక ఆధారాన్ని పెనవేసుకొన్నంత సొగసైన జ్ఞాపకాలని మనిద్దరం యెప్పటికప్పుడు ప్రతి మలుపులోనూ యిచ్చుకుందామనే హామీ పత్రం రాసుకొంటే… అయ్యో … హామీ పత్రం అనుకోవటం బాగులేదు కాని ముద్దొచ్చే ప్రామిస్ చేసుకొందామా మరోసారి వో నా వుదయపు కాఫీ పరిమళపు అబ్బాయి.

సరే, పనికి వెళ్ళాలి. మళ్ళీ మాటాడుకొందాం. అప్పటి వరకు చిన్ని ముద్దు కుడివైపు కాలర్ బోన్ మీద…

ఇట్లు మీ… (9)
యెవ్వరు చూడకుండా అప్పుడప్పుడు నీ బుగ్గపై ముద్దుపెట్టుకొన్నట్టు రాత్రంతా కోనసీమ గాలి నన్ను అలా ముద్దుపెట్టుకొంటూనే వుంది. భలే అల్లరి గిలిగింత. నీకు అలానే వుంటుందా నా ముద్దు. చూడు యిలా అడగాలి నిన్ను… నువ్వపుడు చెప్పావ్ కదా. అఫ్ కోర్స్ నీ కళ్ళు చెపుతాయనుకో. యీ గాలిలోని వొక మోహ పారవశ్యపు పచ్చి సుగంధంలా వొళ్ళంతా కమ్ముకొంటుంటే నువ్వు నాతో యిక్కడకి వచ్చి వుంటే ఆ గాఢత మరింత రెట్టింపు అయేది కదా. కాని నువ్వు Thames నది జీవన సౌందర్యాన్ని డాక్యు మెంట్ చెయ్యడానికి వెళ్ళావు. భలే కదా మనిద్దరం రెండు నదుల జీవనాన్ని చూస్తున్నాం.

వుదయమే పెసరట్టు వుప్మా పెట్టారు. అల్లం పచ్చడితో. యిక్కడ రోడ్ పక్కన పెసరట్టులని వేస్తారు. చిన్నిచిన్ని ముక్కలుగా తరిగిన అల్లం, వుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఆ అట్టు మీద జల్లుతారు. యేమి రుచిగా వుంటాయో. జీడిపప్పు, క్యారెట్ యిలా కనిపించినవన్నీ వేస్తారు కొన్ని సిటీస్ లోని హోటల్స్ లో. జీడిపప్పు, క్యారెట్ లాంటివి పెసరట్టుకి సూట్ కావనిపిస్తుంది నా టేస్ట్ బడ్స్ కి. కాంబినేషన్స్ రుచిని పెంచాలి. జీవనపుతోడైనా జీవితపు ఆరోగ్యమైనా. పెసరట్టు వుప్మా కలిపి తిన్నాక యింక లంచ్ కూడా వద్దనిపిస్తుంది. అంత హెవీగా వుంటుంది. లేజీగా హాయిగా ఆ గోదావరి ప్రవాహాన్ని కళ్ళంతా నింపుకోవాలనుంది.

యీ వూరొచ్చి రెండు రోజులు అయింది. షూటింగ్. అన్నాచెల్లెళ్ళ అనుబంధంపై పాట. యీ మధ్య యిలాంటి సందర్భాలపై పాటలు లేవు. యీ అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గర బాగుంటుందంటే వచ్చాం. గుడిలో, తోటల్లో యిలా సాగుతుంది. యెక్కడినుండో తాటి పండు గారెలు వండుతోన్న తీపి వాసన. అంతే మా యూనిట్ వాళ్ళంతా ఆ సువాసనకి వశమైపోయి అవి తింటే తప్పా పని చెయ్యలేం అంటూ తీయని పని విరామం ప్రకటించేసారు. యీసారి యీ షూటింగ్ అంతా మూడు పెసరెట్లు, ఆరు గారెల్లా వుందనుకో.

మాకు యిక్కడ ఆతిధ్యం యిస్తున్న వాళ్ళ యింటి కోడలు ఆషాడంలో వొకే గడపలో వుండకూడదని పుట్టింటికి వెళ్ళిన ఆ కొత్తకోడలు తిరిగి అత్తగారింటికి వచ్చింది. యెడమ చెయ్యంతా పండిన గోరింటాకు. కాళ్ళకి పసుపు. తలస్నానం చేసిన ఆ తడి జుట్టుని చిక్కు తీసుకొంటూ పలకరింపుగా నవ్వింది. జుట్టు చిక్కుతీసుకోవటమంటే భలే సరదా నాకు. కాని నా జుట్టు చిక్కుపడదు నీకు తెలుసుకదా. చిక్కుతీసుకొంటుంటే ఆలోచనల చిక్కుముడులేవో విప్పుకొంటున్నట్టుంటుంది.

సాయంత్రం పేరంటం వుందంటా. రమ్మని పిలిచిందా అమ్మాయి. అంతా కొత్తగా వుండే ఆ కొత్త కోడలికి తన యిరుగుపొరుగు పరిచయం అవ్వటం, వాళ్ళ ల్లోంచే కొత్త స్నేహితులు యేర్పడతారు ఆమెకి. సోషల్ మీడియా లేని రోజుల్లో యిలాంటి పేరంటాలే కదా స్నేహవారధులు. యిప్పుడు ఆ పూజలు, పేరంటాలు పేస్ బుక్ నిండా కనిపిస్తుంటాయి. రాఖీపౌర్ణమి రోజు అన్నాచెల్లెళ్ళ పిక్చర్స్ యిలా యెప్పుడూ వొక పండగ జరుపుకొంటున్న సంతోషపు పిక్చర్స్ చూస్తుంటాం.

రుతువు యేదైనా సోషలైజ్ అవ్వటానికి మనకున్నన్ని పండగలు మరెక్కడా లేవు కదా ప్రపంచంలో. ప్రధానంగా మనది వ్యవసాయక దేశం కాబట్టి మబ్బు కమ్ముకున్నా, తేలిపోయినా, సూరీడు వెలిగినా మసకేసినా మనకి పండగే. వొక్కో పండగకి రకరకాల తీయని వంటకాలు.

కానీ శ్రావణ శుక్రవారాలంటే తిరగమోత పెట్టిన శెనగలు యెప్పుడెప్పుడిస్తారనే యెదురుచూపు పిల్లలందరిలో. నానపెట్టిన కొమ్ముశెనగలని వొక తెల్లనినూలు బట్టలో చుట్టి వుంచితే అవి మొలకలెయ్యటం చిన్ననాటి లేత ఆశ్చర్యం. అసలు శ్రావణం అంటేనే కోలాహలం. కురవాలా వద్దా అనే కరిమబ్బుల వూరింపు. అంతలోనే తెల్లని తేమ నిండిన ఆకాశం. పనిలో వున్న అమ్మకళ్ళు కప్పి తొట్టెలోని నీళ్ళని నేల మీదకి చిలకరించే పాపాయిలా నాలుగు జల్లులు జల్లుతుంది శ్రావణ మేఘం. ఆ జల్లు చూసి హడావిడిగా ఆరేసిన బట్టల కోసం బయటకి పరిగెత్తారో లేదో అమ్మ పాదాల అలికిడి వింటూనే నవ్వుని పిడత నోటిలోనే నొక్కేసుకొంటూ పారిపోయే పాపాయిలా మేఘమాలికలు తమ జల్లుల చిలకరింత ఆపేసి యెక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ లా నవ్వుని వెండిఅంచుల చూపుల్లో దాచేసుకుంటాయి. మనందరికీ రోజువారి జీవితంలో యెదురయ్యే చిన్నిచిన్ని చికాకులు మనస్పర్ధలు, నిరాశలు అచ్చు యీ శ్రావణ మేఘాల్లాంటివే. మనిషికెంత భరోసానో కదా, యివన్నీ తాత్కాలికమే అనే వో లలితమైన ఆనవాలుండటం.

అటు సముద్రం. యిటు గోదావరి. వేటి నీళ్ళ రంగు వాటిదే. అసలా సంగమమే అపురూపం. అద్భుతాల్లోకెల్లా అద్భుతం. యెక్కడెక్కడ నుంచో ప్రవహించే యీ గోదావరి ప్రవాహం యెన్నెన్ని ప్రేమ కథలని విందో. యిక్కడ గాలిలో ఆ ప్రేమసుగంధం తేలుతోంది. ప్రేమని యెలాగైనా సొంతం చేసుకోవాలనుకొనే వాళ్ళని యిక్కడకి తీసుకొస్తే, యీ గాలిని పీల్చితే సొంతమనే భావనని వూఫ్ మని వూదేస్తుంది. విముక్త హృదయపు కవాటాలు వొక సుప్రేమని శ్వాసించటం మొదలుపెట్టొచ్చు.

వానకాలపు తూనీగల్లా అనేకానేక జ్ఞాపకాలు, ఆలోచనలు రివ్వురివ్వు మంటున్నాయి. గోదావరిసాగర సంగమం పొడుగునా మిలమిలలాడుతోంది శ్రావణపౌర్ణమి. దోసిట్లోకి తీసుకొన్నసంగమనీటిలో వెన్నెల తళుకు పువ్వులుపువ్వులుగా. అద్దుడు కాగితం యింకుని పీల్చుకొన్నట్టుగా యీ వెన్నెల నన్ను లాక్కుంటుంది… మనసంతా నువ్వే ప్రేమోద్వేగంతో.

ఇట్లు మీ… (8)
ముద్దపప్పు, జీడిపప్పు, నూపప్పు… యిలా యీ రోజుకి నీకు యే పేరు పెడదామాని ఆలోచిస్తున్నాను యీ గోదావరి వొడ్డున కూర్చుని.

వో పెద్ద వుత్సాహపు కిక్కిరిసిపోయిన సుసంభరం తిలకించిన ప్రేక్షకులు వాళ్ళవాళ్ళ గమ్యాలకి వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా వున్నయీ ఆవరణలో కూర్చుని వున్నాను. నిజానికి అంతా బోసి పోయినట్టు కనిపించాలి. కాని అలా లేదు. యెదురుగా వున్న గోదావరి తనని చూడటానికి అంతమంది వచ్చారు. యిప్పుడు యీ రోజు వేళ్ళమీద లెక్కపెట్టగలిగేంత మంది మనుష్యులు మాత్రమే వున్నారిక్కడ… అయినా ఆ ప్రవాహపు మిలమిలలో తేడా యేమిలేదు.

గత కొద్ది రోజులుగా యెటు చూసినా మనుష్యులే. గుంపులుగుంపులుగా. వొక్కసారే అంతమంది చూడటం భలే అనుభవం. కలిసిమెలిసి వుత్సాహంగా వొక వేడుకగా నవ్వుతూ తుళ్ళుతూ వొడ్డువొడ్డంతా నీట మునుగుతూ చెవులూ ముక్కు వొకేసారి మూసుకొని బుడుంగని నీటమునిగి పైకి లేచి కేరింతలు కొడుతూ అప్పుడప్పుడు యిలా నదిని సమిష్టిగా పలకరించే విభ్రమ సమయాలని బంధించాలని కెమేరా కన్నులో కన్ను వుంచి గోదావరి వైపు చూస్తుంటే యెన్నెన్ని విషయాలు ఫ్లాష్ బ్యాక్ లా తిరిగాయో.

యీ నది వొడ్డున బంక మన్నుతో బొమ్మలు చేసి ఆడుకోవటం. యీత కొట్టటం. లంకల్లోకి పడవ యెక్కి వెళ్ళటం. వచ్చేపోయే రైళ్ళకి టాటా చెప్పటం. రావిచెట్టు కింద గోదావరిమాత దగ్గర చెప్పుకొన్న కవిత్వం, వనవాసిని చదుకోవటం, యెప్పటికప్పుడు అదే మొదటిసారన్నట్టు వర్షంలో, వెన్నెల్లో గోదావరిని చూడాలని వెళ్ళటం, వరద గోదారి మట్టిరంగుని కళ్ళనిండుగా నింపుకోవటానికి పరిగెత్తటం, గాలితెరల్లో కార్తీకం బుగ్గపై చిటికలు వేసివేయ్యగానే అరటిదొన్నెల్లో దీపపు మిలమిల చూపులంతా పరుచుకొంటుంటే గోదారొడ్డుకి నిదానంగా వెళ్ళటం… వొకటారెండా… వొకప్పుడు గోదావరి నిత్యానుభవం.

కుతూహలం, ఆశల, ఆకాంక్షల వుగ్గుగిన్నె తీసుకొని ప్రపంచ అన్వేషకురాలిగా బయలుదేరానో అప్పటి నుంచి యీ నది జ్ఞాపకంగా మారిపోతూ వచ్చింది. గోదావరి వొక జ్ఞాపకంగా స్థిరపడుతుందనుకోలేదెప్పుడు. నిత్యం చూస్తూనే వుంటాననుకొన్నాను. యిప్పుడీ గోదావరి వో నెలవంక నా రోజువారి జీవితంలో.

యెప్పుడు నిదానంగానే వుంటుంది. కాని అక్కడెక్కడో జోరున వాన కురిస్తే నదినదంతా వరద గోదారవుతుంది. గోదారొచ్చింది గోదారొచ్చింది అంటూ యింట్లో సామానంతా అటక యెక్కించి యే బడిలోనో, గుడిలోనో తలదాచుకొంటూ, తిరిగి వరద పొంగు తగ్గగానే వొడ్డునున్న ప్రజలు అటక మీద సామాను దింపుకొంటూ కూడా చెప్పుకొనే ముచ్చట్లు, కార్తీక హేమంతుల్లో నదిలో కార్తీకదీపాలు వదుల్తూ పాడుకొనే పాటలని పల్చని మంచుతెరలు కప్పేసుకొని ఆలకిస్తూ … అంతే అలానే వుంటుంది గోదావరి. రుతువు యేదైనా గోదావరి మనసెప్పుడూ స్థిమితమే. గోదావరి స్థితప్రజ్ఞ. తనని చూస్తూ అసూయ, ద్వేషం, అహంకారం యిలా అనేకానేక మానసిక రుగ్మతలు వదిలించుకోవచ్చనిపిస్తుంటుంది. వొడ్డున కూర్చుని చిన్నిచిన్ని గులక రాళ్ళని నీళ్ళల్లోకి విసిరిన్నట్టు మనసులోకి రకరకాల ఆలోచనలని విసురుతోంది గోదావరి.

ఆ రావి చెట్టు అలానే వుంది. ఆ కొత్త ఆకుల గాలికి మేం కొత్త కవులం. ఆ కొమ్మలు మాత్రం మమ్మల్ని యెప్పటిలా గుర్తుపట్టాయి. యీ వూరి వీధులు, యీ వూరి రోడ్స్ అన్నీ విస్తరించటం చూస్తూనే వున్నాను. చిన్నప్పుడే మనలో మొలకెత్తే అన్వేషణ నిరంతరం పూత పూస్తూనే వుంటుంది మనలో. కడియం పంటకాలువ వెంట నడిచి పొతే వేమగిరి రావటం చూసి వాస్కోడిగామలా ఫీల్ అయిపోయి యిష్టమైన వాళ్లకి చెప్పాను. కనిపెట్టిన విషయం వదిలేసి ‘అంత దూరం నడిచావా,యెందుకు ‘ అని ఆశ్చర్యపోతూ ‘గుర్రబండి యెక్కొచ్చుగా’ అన్నారు. అప్పటికే ఆ దారులన్నీ కనిపెట్టేసారని తెలిసి కూడా నేనేం నిరాశపడలేదు. అప్పటికే వేసిన దారిలో ప్రవహిస్తున్న ఆ గోదారి కాలువ వెంట కొంత దూరం నడవటం, యేదోవొకటి తెలుసుకోవటం అప్పట్లో నా బుజ్జి మనసుకి నేనే వాస్కోడిగామాని. యెన్నెన్ని జ్ఞాపకాలని చుక్కానిగా తుళ్ళింత గోదారి సజీవ జీవశక్తిగా అందిస్తుందో ప్రతి మలుపులో అపారమైన జీవితేచ్ఛని.

యిప్పటికీ యీ రోజుకి నీకేం ముద్దుపేరు పెట్టాలో తెలియటం లేదు. యిక్కడికి రా. నీకు గోదారి ప్రతి మలుపుని చూపిస్తా మరొక్కసారి. యెన్నిసార్లు చూసినా వో కొత్త వుద్వేగం వొక పసిపాప తొలి గుక్క పెట్టిన స్వరంలా. పైన ఆకాశంలో చంద్రుడు. నీటి తళతళ. లంగరేసిన గూటిపడవలోంచి సన్నని కూనిరాగం. మన చుట్టూ వొక ముద్దు గిరికీలు కొడుతోంది. పదేపదే నిన్ను రమ్మని చెపుతోంది.

అమ్మో… యింక యిక్కడ కూర్చోవటం కష్టం. దోమలు. నువ్వు వచ్చినప్పుడు వోడమాస్ స్ప్రే మర్చిపోకుండా తెచ్చుకో మై డియర్!

ఇట్లు మీ… (7)
యెండ హోరు తగ్గిందో లేదో వానలు మృదువుగా కురవటం మర్చిపోయాయా అన్నంత వర్షం. చిన్న జల్లుకే యేరుల్ని తలపించే నగరాలు. అటువంటిది పది రోజుల్లో కురవాల్సిన వర్షం వొక్క రోజులో కురిస్తే యీ ముంబాయి మహా నగరం పొంగి పొరులుతోన్న అరబిక్ నదిలా వుంది. జన జీవనం స్తంభించటం అంటే యేమిటో మళ్ళీ యిప్పుడు మరొక్క సారి చూస్తున్నాను. ప్రతి యేడాది వానాకాలంలో యిలా జలమయం అవుతోన్న నగరాలని చూస్తూ కూడా వాటిని మెరుగు పరిచేవారెవ్వరూ వాటి మీద అవి అలా కాకుండా చూడటం పట్ల యేమంత శ్రద్ధ కూడా పెట్టరు.

సో … పనులన్నీ పోస్ట్ పోన్. నా రూమ్ లో నేను. యెదురుగా కడలి. యేది వానో యేది సముద్రమో తెలియట్లేదు. దట్టమైన నీల వర్ణపు జల ధారపై వుండుండి వో వూదా రంగు కాసింత కోరా రంగు సమ్మిళితమై విరగకురుస్తోన్న చినుకుల విశ్రుంఖల సౌందర్యాన్ని చూపుల విప్పార్చుకొని చూస్తోం టే తబ్బిబ్బవుతోంది మనసు. యే జీవన రహస్యాలని అందివ్వాలని యీ ఆకాశం సముద్రం ధారాపాతం గా యేకమయాయో … వుక్కిరి బిక్కిరిగా ఆలోచనలు.

కాఫీ కలుపుకొన్నాను. యే అరోమా లేదు. కాని మొన్నటి నుంచి అసలు యిలాంటి కాఫీ నే. కాని నీ దగ్గరకి వెళ్ళమని వో యెర్రని పరిమళం మారాం చేస్తోంది. అవును యెలాంటి చేతుల్ని నువ్వు నీ రెండు చేతుల్లోకి తీసుకొని నీ లాలిత్యపు ముఖానికి అద్దుకుంటావో, నీ అమాయకమైన పెదవులతో బుజ్జి ముద్దు పెడతావో , నీ వుచ్వాసనిస్వాసల చిరు వెచ్చదనపు గిలిగింతని అద్దుతావో అదే సౌరభం యీ ఆషాడం వచ్చిందంటే చాలు అప్రయత్నంగా గోరింటాకు సుగంధం హృదయాన్ని లేలేతగా యెరుపెక్కిస్తుంది. యీ సారింకా గోరింటాకు పెట్టుకోలేదు. యింటికి వెళ్ళాక ఆ చెట్టుని వెతుక్కుంటూ వెళ్ళాలి. అసలు ముందు తుప్పలు వెతకాలి. రోజూ కొత్త కట్టడాల కోసం చెట్టుపుట్టా కంపా రాయి రప్పా సమస్తాన్ని చదును చేసేస్తున్నారు కదా. సో… ముందు ఆ చిన్నిచిన్ని ఆకుపచ్చని చెట్టు కోసం తిరగాలి. చందమామని చుక్కలని అరచేతుల్లో పూయించటం భలే గర్వంగా వుంటుందనుకో. గోరింట సౌగంధానికి యెంత ముగ్దురాలినవుతానో ఆ పరిమళానికి నువ్వు కురిపించే మోహపు జల్లుకి యెంతో బానిసని. యెలాంటి ప్రేమని పండిస్తుందీ గోరింట. మన జీవనమెంత ఫలప్రదం…

అబ్బా వొక నవొల్లాసం కిలకిల్లాడుతోంది. యిప్పటికిప్పుడు యిక్కడ నుంచి యెగరాలని వుంది. కాని యెలా… విమానాలు చక్కగా నేల మీదే ముడుచుకు కూచున్నాయి. యెప్పుడు హాయిగా యెగురుతూండే వాటిని అలా వొదిగి వుండమంటే వాటికెంత బోర్.

గోరింటా గోరింటా అంటుంటే కృష్ణశాస్త్రి గారి పాట ‘ గోరింటా పూసింది’ అప్రయత్నంగా హం చేస్తుంది మనసు. యిలా మన జీవితాలని రాగభరితం చేసే కృషశాస్త్రి గారిని చదువుకోకపొతే ఆకులు కాస్త రంగు తక్కువగా కనిపించేవి కదా. అలానే తిలక్ గారు మాకెంత సంతోషాన్ని యిచ్చారో కదా అతని అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు అనటంతో. శ్రీశ్రీ గారి ‘వేలవేల వత్సరాల కాంతిలో మానవుడు వుదయించిన’ అని మెదలగానే పుట్టిన రోజులా అనిపిస్తుంది. ‘పిడికిటి తలంబ్రాల పెళ్ళికూతురు’ అని అన్నమయ స్వరనాడిలో కదిలారనుకో పెళ్ళికూతురై పోతుంది జడ పూలజడై. ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా’ పాట కూనిరాగం తీస్తుంటే నువ్వు నాకు పంపిన పాట విన్నాను. యెప్పటి పాట. అప్పుడెప్పుడో మొదటిసారి విన్నప్పుడు భలే వుంది అనుకున్నాను. కానీ యిప్పుడు వింటుంటే యెంతో మూవ్ అయ్యాను.

యీ ప్రపంచం అంతా కనికట్టు ప్రపంచంలా మారిపోయి చాలా కాలమే అయింది. అయితే ఆ మార్పు మరింత intensify అయింది. చుట్టూ గారడీ, కనికట్టు, మోసంతో నిండి వున్నప్పుడు అందులో ఆత్మవిశ్వాసంతో బతకాలంటే నిన్ను నమ్మేవాళ్ళు నిన్ను నమ్మగలిగే వాళ్ళు వొకరుండాలి. అలాంటి వొక్క మనిషిని పట్టుకోవటం కష్టం అవుతోంది అంటున్న ఆ పాట యెప్పటి పాట… 1933 లో Harold Arlen రాసినప్పటి నుంచి యెంతో మంది పాడుతునే వున్నారు. నేనూ పాడటం ప్రాక్టీస్ చేస్తున్నాను.

కాగితపు చంద్రుడు

అట్ట ముక్క సముద్రం మీద

తేల్తుంటావ్

చుట్టూ వున్న ప్రపంచం

అంతా నాటకమే అంటావ్

నిజమైనవి యేం వుండదు

కానీ నువ్వు నన్ను నమ్మితే

యిదంతా నిజమైపోతుంది… యెటువంటి పాట.

ప్రపంచంలో మనమన essential being మనకి దొరకటం అన్నది యెప్పుడు కష్టంగానే వున్నట్టుంది. యిప్పుడైతే మరీ కొరత వుందనుకొంటాను. టైం, స్పేస్ యిలా చాల సమస్యలు చుట్టుముడుతున్నట్టున్నాయి.

మనకి యిష్టమైనవన్నీ వొక్కరి నుంచే దొరకటం కూడా కష్టమే కదా … యివ్వటం కూడా … హో హో … నీ కళ్ళల్లో ఆ అనుమానపు పిల్లమేఘాలు మెదుల్తున్నా యేంటి…   వో నా సప్త వర్ణ ప్రపంచమా, యిదంతా వొత్తి మాయే కానీ నువ్వు నన్ను నమ్మితే కాగితపు చంద్రుడిలోనే నాకు సంతోషం వుంటుంది.

చూడు బయటంతా అదే వర్షం ఆకాసమూ సముద్రమూ యేకమైనట్టు. యెప్పటికి సూర్యధూళి చెలరేగుతుందో తెలీదు. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా సూర్యుని కాంతి పుప్పొడి యీ అరబిక్ కడలిని అభిషేకిస్తుందనే నమ్మకం నాకుంది. నేను వచ్చే సరికి వీలైతే వొక గోరింట చెట్టుని వెతుకు.

వెంటనే మోహపు అరిచేతులని కాన్క చేస్తాను నీకు.

ఇట్లు మీ… (6)
వో నా జీవనసుగంధమా, యేం చేస్తున్నావ్‌…

యిప్పుడు యిక్కడ రాత్రి మూడవుతోంది. ‘తనూ వెడ్స్‌ మనూ రిటన్స్‌’ సెకెండ్‌ షో చూసొచ్చాను. నీతో కలసి సినిమాలు చూడటంలో వున్న సరదా వేరనుకో. రెండు గంటల వేళ సినిమా నుంచి వస్తూ కూడా కారులో ఎ.సి. తీసేసి రాత్రిగాలిని పలకరించటానికి లేదు. యీ నడిఝాము దారుల్లో కూడా చిరుగాలి వీచనని మోరాయిస్తోందనుకో. రోహిణీకార్తె. యెండలు ఝుమ్మంటున్నాయి. వొకప్పుడు బెజవాడ, గుంటూరు యెండలకి చెమటలూ పారేవి నిరంతరం అనేవారు. యిప్పుడు యే వూరు చూసినా యే సిటీ చూసినా వొక్కలానే వున్నాయి. సినిమా నుంచి వచ్చాక కూడా కంగనా గుర్తొస్తునే సంతోషం. యేమీ జీవిస్తుందా పాత్రల్లో. అసలు త… , వొక్క నిమిషం…పెరట్లో పిట్టల కువకువా… యెందుకో యేమయిందో చూసొస్తాను.

వూఁ చూసొచ్చాను. యీ ఝాముకి కూడా చల్లపడని వేడిగాలులు. ఆ వేడికి మెలకువ వచ్చేస్తున్నట్టుంది పెరట్లోని చెట్ల గుబుర్లోని గూటిలోని తేనెపిట్టలకి. కిచాకిచామని మాటాడుకొంటున్నాయి. ఆ సవ్వడులని మన మాటల్లోకి తర్జుమా చేద్దామనుకొంటుంటాను. అలా చేస్తే ‘కాంక్రీట్‌ జంగిల్‌ … చల్లబడని వూరు… వాళ్ళంతా యేసిల చల్లదనంతో సేద తీర్తున్నట్టు మనకి కూడా బుజ్జి యేసీలు వుంటే బాగుండును, వాటిని తమకి అందించే దాతలు, సంస్ధలు వుండాలనుకొంటున్నాయా… లేదా ప్రభుత్వాలే తమ సంక్షేమం కోసం పని చెయ్యాలనుకొంటున్నాయా. అసలు మనకి మన చుట్టూ వున్న చెట్లపై, చెరువులపై, కొండలపై , అసలు యీ భూమిపై యేమాత్రం గౌరవం లేదు. ప్రేమా లేదు. నిజంగా వుండి వుంటే మనం ప్రకృతితో యింత యెబ్యూస్‌గా ప్రవర్తించేవాళ్ళమా. చాలా మిస్‌ బిహేవ్‌ చేసేసి యిప్పుడు రిపేర్‌ అంటే యెలా సాధ్యమో. యీ పెరట్లో వాటి చుట్టూ వీలైనంత చల్లదనం వుండేట్టు చూస్తున్నా. కానీ చుట్టూ వున్న వేడిని యెలా బయటకి పంపుతాను. యేమో…

అలా తలుపులు తీసుకొని బయటకి వెళ్ళితే పరిమళ భరితమైన మల్లెల పరిమళం నీ నవ్వులా కమ్ముకొంది. ఆ తేనె పిట్టలు యీ తీయని సువాసన నిండిన వెచ్చని గాలుల గురించి వూసులాడుకొంటున్నాయంటావా… యిలా ఆలోచిస్తూ యేమో అసలు అవి యేం మాటాడుకొంటున్నాయో… కాని మన చికాకులు, సరదాలు వాటికి అనువదించేస్తే యెలా… మనకి తెలీయకుండానే కొన్ని సార్లు యెదుటివారి జీవితాల్లోకి యిలానే తొంగి చూస్తుంటామా… పిట్టకైనా పువ్వుకైనా మనకైనా ప్రైవసీ ప్రైవసీ నే కదా… సారీ…

వుదయమంతా యెండలో కాగీ కాగీ యెంత పరిమళభరితంగా వికసిస్తాయో యీ మల్లెపువ్వులు. కొత్తగా మళ్ళీమళ్ళీ రాబోతోన్న వర్షరుతువు కోసమే యీ గాలులు యింత వేడి వీస్తున్నాయేమో. యింతగా వుక్కపోత లేకపోతే ఆ తొలకరి భూసుగంధం, ఆ చల్లని వేపకొమ్మల తీయని గాలులు, ఆ కొత్త రంగులాకాశపు మాధుర్యాన్ని మనం ఆస్వాదించమేమోననే యింత వేడనుకొంటాను. వానాకాలపు ఆగమనానికి ఆకాశం కొత్తగా రంగులు అద్దుకొంటున్నట్టు నేను వస్తున్నాని యిల్లంతా అలంకరించావ్‌. నాకోసం కాసిన్ని కొత్త పూల మొక్కలు తెప్పించావ్‌. నాకు చూపించాలని కొన్ని కొత్త ఆకర్షణీయమైన కొండవాలుల్ని కనిపెట్టావ్‌. ఆకుపచ్చ, ఆరంజ్‌ రంగులతో వరండాన్ని పేయింట్‌ చేసావ్‌. నువ్వు అస్సాం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వెదురుతో తయ్యారు చేసిన మోడాలని ఆ వరండాలో వేసావ్‌. బుద్దుని యెదురుగా బంకమట్టితో చేసిన కొలనులో రంగురంగుపువ్వుల నడుమ వెలిగే ఫ్లోటింగ్‌ కేండిల్స్‌ల పరిమళకాంతులని చూస్తూ వుదయమూ సాయంకాలమూ మనిద్దరం అక్కడ కూర్చుని కమ్మని కాఫీని తాగుతూంటే వాటి ప్రెజెన్స్‌ మనలోకి యెంతగానో యింకేది. ఆకురాలిన సవ్వడిని కూడా మన హృదయం పసిగట్టటం తెలిసి మన మనస్సులో చిత్రమొకటి తయ్యారవ్వటం మొదలు పెట్టగానే తక్కిన ఆలోచనలన్నీ ఆగిపోయేవి. వొకేవొక్క యిమోషన్‌… శాంతి.

అసలు నేను ‘మన కోసం వస్తున్నాను నీ దగ్గరకి’ అని చెప్పిన ప్రతి సారీ ప్రతీది కొత్తగా మార్చేస్తావ్‌ నువ్వు. కొత్త పుస్తకాలు. సినిమాలు. పాటలు. వంటలు. వొక్కటనేంటి ముద్దు కూడా కొత్తగానే పెడతావ్‌. కానీ యెప్పుడు మారనిది నీ మ్యాజిక్‌. మరింత కొత్తగా మరింత మోహంగా. మరింత బలంగా.

నీ దగ్గరకి వస్తున్నప్పుడు నేను కనిపించగానే నువ్వు యేమని పలకరిస్తావ్‌, చూడగానే ముద్దు పెట్టుకుంటావా, హగ్‌ చేసుకొంటావా, షేక్‌హ్యాండ్‌ యిస్తావా యిలా దారిదారంతా రకరకాలుగా వూహించుకొంటాను. కానీ యెప్పుడూ నువ్వు యేదో వొక పనిలో వుంటావ్‌. యీ సారి నేను వచ్చేసరికి అటూయిటూ తిరుగుతూ సెల్‌ఫోన్‌లో మాటాడుతున్నావ్‌. నీ ముఖం చూస్తునే అఫీషియల్‌ కాల్‌ అని తెలిసిపోయింది. కనిపించగానే నీ సంభాషణని సాగిస్తునే చేత్తో హాయి చెప్పావ్‌. చాలాసార్లు యేదో వొక ముఖ్యమైన అఫీషియల్‌ పనిలోనే వుంటావ్‌. పర్‌ ఫెక్ష్‌నిస్ట్‌వి కదా. పనిలో నిమగ్నమైన నిన్ను చూడటం చాలిష్టం. అటువంటప్పుడు నీ స్వరంలోని హెచ్చుతగ్గులూ, ముఖంలోని సీరియస్‌నెస్‌ అంతలోనే చిరునవ్వు యిలా రకరకాలుగా చూడటం నాకు భలే సరదా. నిన్ను యిమిటేట్‌ చెయ్యటం కూడా.

ప్రేమోన్మత తుమ్మెదనై వేసవి తీరిక వేళ వచ్చాను వూరికే తిరగటానికి నీ దగ్గరకి. నువ్వు పాడుతున్నప్పుడు వింటుంటే పాటొక్కటే చాలు అనిపిస్తుంది. పాడుతూపాడుతూ చటుక్కున నా బుగ్గపైనో, నా జుట్టులోని మల్లెలపైనో చిన్ని ముద్దు నువ్వు పెట్టగానే పరాగ సౌగంధం అద్దుకొన్న స్పర్శ. అప్పుడు ముద్దొక్కటే చాలు అనిపిస్తుంది. అయినా సరే పాటే అని మనసు అంటుటే ‘కాసేపు నీ ముద్దులకి లంగర్‌ వేద్దామా, ఆ టైమ్‌లో కూడా పాటలే పాడు’ అని అడిగితే, యెంతో తీరిగ్గా ‘ముద్దంటే యేమిటి’ అని అడిగావ్‌. భరతన్‌ ‘ వైశాలీ’లో యువమునిలా. ‘వైశాలీ’ యెన్ని సార్లు చూసినా గీతగారి అందం అస్సలు బోర్‌ కొట్టని చంద్రబింబమే. అవునూ, ‘తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌’ చూసొచ్చానని చెప్పాను కదా. కంగనా అంటూ యింకేవో గుర్తు వచ్చి చాలా రాసేసాను. భలే వుంది సినిమా.

అసలు బాలివుడ్ లో స్త్రీలు ప్రధాన కేరెక్ట్‌ర్స్‌గా తీసినలో ‘ Dum Lage ke Haisha’ లో వొబేసిటినీ, ‘యెన్‌హెచ్‌ 10’ లో యిన్‌టాలరెంట్‌ హాఁస్టాయిల్‌ సొసైటీనీ, ‘తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌’ లో మారిటల్‌ యిన్‌కంపేటిబులిటీనీ, ‘ పికు’ లో పేరెంటల్‌ కేర్‌ లాంటి నాలుగు పార్వ్శాలని డీల్‌ చేసిన యీ నాలుగు సినిమాలు హిట్‌ అవ్వటంతో వుమెన్‌ పవర్‌ అని భలే మెచ్చుకొంటున్నారు.

వొకప్పుడు వుమెన్‌ సెంట్రిక్‌ అనే సినిమాలని కేవలం బ్రాడ్‌ స్ట్రోక్స్‌లో చిత్రీకరించేవాళ్ళు. యిప్పుడు మా స్త్రీల వాయిస్‌కి ప్రామినెన్స్‌ పెరుగుతుండటంతో సొసైటీలో మా ఫైనాషియల్‌ యిండిపెండ్‌న్సెని, యింటలెక్చువల్‌ యిండిపెండ్‌న్సెని, అన్నిరకాలుగా మాకు ఆ ఫ్రీడమ్‌, ఆ పవర్‌ అన్నీ వస్తున్నప్పుడు వాటిని యెకనాల్డ్‌జ్‌ చేస్తున్నారు. అందుకే మార్కెట్‌ ఫోర్స్‌స్‌ కూడా మాకున్న సమస్యలని డీప్‌గా యిన్‌డెప్త్‌ యెక్సామిన్‌ చేస్తున్నాయి కదా. మాకుండే రకరకాల సమస్యలని రకరకాల కోణాల్లో విశ్లేషించి వాటిని మనముందు ప్రెజెంట్‌ చేస్తున్నారు. యిప్పుడు వైవిధ్యమున్న కధాంశాలతో తీస్తున్న యీ సినిమాలు యెంతో బాగుండటమే కాక అవి పెద్ద కమర్షిల్‌ హిట్స్‌ కూడా. విద్యాబాలన్‌ డర్డీస్టోరీ, కహానియాలతో తన పవర్‌ యేమిటో యెప్పుడో చెప్పేసారు. కంగనా క్వీనే, ‘తనూ’ అయినా క్వీనైనా కంగనా ప్రేక్షకహృదయాల క్వీనే. ‘తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌’ చూడు. నీకూ నచ్చుతుందనే అనుకొంటున్నాను.

గాలి కాస్త చల్లబడింది. తేనె పిట్టలు గూళ్ళల్లోంచి బయటకి చూస్తున్నాయి. ఆదిత్యుడు మేల్కొనే వేళ వరకు కబుర్లు చెపుతునే వున్నాను. నీతో వున్నప్పుడూ యిలానే చెపుతోంటే, మల్లెపూలతేనెవానలా అల్లుకొన్నావో కమ్ముకొన్నావో కానీ నా హృదయమొక తీయని వాగైయింది. గుసగుసలాడుతోన్నాయి నీ అల్లరితలపులు. విల్లు యెక్కుపెట్టిన వేటగత్తెలా గురి తప్పకుండా నీ కింది పెదవి కిందనున్న వంపులో ముద్దు పెడుతున్నాను.

ఇట్లు మీ… (5)
చుట్టూ కాగితాలు. యెదుట లాప్ టాప్. మరో పక్క లాగేస్తోన్న మల్లె పూలవనం. లోపల అల్లరి పెడుతోన్న పాటలెన్నో.

యేకకాలంలో యెన్నెన్ని భావాలో. మనకి పరిచయం అయిన ఆ తొలి వసంత కాలంలో మనిద్దరం కడియం మల్లెపువ్వుల తోటల్ని చూడటానికి వెళ్లాం. ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి, కొంచెం పెద్దవి, బాగ పెద్దవి మల్లెలు. పందిరి మొగ్గలు. ఆ మొగ్గలని బుట్టల్లోకి చకచక కోయటం చూసి నువ్వెంతగానో ఆ స్కిల్ ని మెచ్చుకున్నావ్.

యెన్నిన్ని కాంబినేషన్స్ తో మాలలు అల్లేవారో కదా! మల్లె దవనం. మల్లె మరువం. మల్లెలు కనకాంబరాలు. మల్లెలు మరువం కనకాంబరాలు… ఆ కలబోత మాలలు యెంత అందంగానో వుండేవి. వాటి పరిమళాలు సుమధురం. వదులు జుట్టుని అల్లుకొంటే యెంచక్కగా పువ్వులు పెట్టుకోవచ్చు కదా అనేవారు ఆ వూరిలో పరిచయం అయిన బామ్మ గారు. తిరిగి ఆమె నవ్వుతూ యిప్పుడు పువ్వులు యెవ్వరూ పెట్టుకోవటం లేదు అనేవారు. ఆమెతో వొక రోజు మల్లెపూల జడ అల్లించుకొంటే బరువే తెలియనివ్వ లేదు ఆ పూలపరిమళం.

పూల జడ అల్లటం వో కళ. వరుస తప్పకుండా అల్లాలి. యెన్ని మల్లెల వరసల తరువాత యే రంగు పువ్వులు పూలజడ సొగసుని మరింత ఎన్హాన్స్ చేస్తాయోననే రంగులచూపు వుండాలి.

ఆ అనేక తీపి సువాసనలు మనలని చుట్టుకొంటుంటే ఆ జడపై పై నుంచి కిందనున్న జడ గంటల వరకు యెన్ని ముద్దులు వస్తాయోనని లెక్క పెడుతూ, మధ్యలో లెక్క తప్పిందని ఆగి, మొదటి నుంచి ముద్దులు పెట్టాలని, తిరిగి లెక్క పెట్టాలని నువ్వు మళ్లీమళ్లీ లెక్క పెట్టే పని చేస్తుంటే, నువ్వు కావాలనే చేస్తున్నావని గుర్తు పట్టి కూడా గుర్తుపట్టనట్టే వున్నాను. ఆ నీ పూల ముద్దులు యేమో కాని నా మెడ పై నుంచి వీపు పైకి జారుతోన్న నీ లేత వెచ్చని వూపిరి పూయించే గిలిగింత కావాలనిపించేది. మళ్లీ మళ్లీ నువ్వు యెన్ని సార్లు యెన్నెన్నో ముద్దులు పెట్టినా ఆ గిలిగింత యిప్పటికి పచ్చని పులకరింతే.

తప్పదు యిక్కడ ఆగాలి. పనుంది. చాల రాయాలి యింకా… పంచుకోవలసినవి చాలున్నాయి.

హమ్మయ! సమయం చిక్కపట్టుకొని వచ్చేసాను నీకు రాయాలని.

నీదెంత సునిశితమైన సున్నితమైన మనసు. ఆ ఆఫ్ఫీషియల్ మీటింగ్ మధ్యలో టీ బ్రేక్ లో చిటికేసిన మోహాన్ని నీకు మెసేజెస్ పంపించినప్పుడు పని వొత్తిడిలోనే ఆ మెసేజ్ ని పంపానని నీకు భలే తెలిసిపోయింది. అవును అలాంటప్పుడే ఆ మెసేజ్ ని పంపాను. నువ్వన్నట్టు పనొక్కటే కాదు మనసులో కూడా అనేక ప్రశ్నలున్నాయి.

యిప్పటి వరకు యెర్రని యెండ. యెండ ఛాయే. యెండ చుర్రుమంటుంది. వేసవి వచ్చింది అనుకొన్నానో లేదో చూస్తుండగానే అర్ధరాత్రిలా మిట్ట మధ్యాహ్నం నల్లని మబ్బులు దట్టంగా. అంత తొందరగా కమ్ముకొన్న చీకట్లని చూసి గూడు చేరుకొనే వేళ యింత తొందరగా అయిందేమిటి అనుకున్నాయేమో తేనె పిట్టలు గూళ్ళకి వచ్చేసాయి త్వరత్వరగా.

వడగళ్ళ వాన.

వడగళ్ళు అంటే నాకు స్నో వైట్ కథ గుర్తొస్తుంది. స్నో వైట్ గుర్తొస్తే వడగళ్ళు కురుస్తాయి కళ్ళ ముందు. వొకప్పుడు వడగళ్ళ వాన చాల అరుదుగా కురిసేదట. ఆ వాన వొక మంచి ముచ్చట. ఆ వాన కోసం యెదురు చూసేవాళ్ళం. యిప్పుడు తరచు వడగళ్ళ వానే. అదీ మాములుగా కాదు. పంటంతా ధ్వంసం చేస్తూ. మళ్లీ కాసేపటికి వాన కురిసిన ఆనవాలే లేని యెండ. తిరిగి వాన. పగలు రాత్రి యిదే వరస.

ప్రభాత వేళ విచ్చుకొనే పువ్వులని దాదాపు ప్రతి వుదయం చూస్తాను. అదే మెరుపు. అదే రంగు. అదే సుగంధం. యెన్నెన్నో రంగులని సువాసనలని వెదజల్లే స్థాయికి రావడానికి తను యెన్నెన్ని వడగాలుల్ని మంచు రాత్రులని చూసి వుంటాయో కదా పూల తోటలు. అడ్డదిడ్డంగా పెనవేసుకొంటు సరసరా పాకే తీగలు అనేక రంగుల పువ్వులతో మనలని పలకరిస్తుంటాయి, యెన్నెన్నో అవరోధాల నడుమ. వాటిని చూసినప్పుడు కొందరు మనుష్యులు సాటి మనుష్యుల మీద చిమ్మే చేదుని పెద్దగా పట్టించుకోకుండా యెంతటి వ్యతిరేక పరిస్థితుల్లోనైన స్నేహం ప్రేమలాంటి మానవీయపుష్పాలపై మరింత విశ్వాసాన్ని పెంచుకొంటూ ఆ సుపరిమళాన్ని మనం శ్వాసిస్తూ మన చుట్టూ వున్న వాళ్ళు శ్వాసించేట్టు మన మనసులు విరబూయాలి రుతువు యేదైనా …

ఇట్లు మీ… (4)
యీ వుదయం వూరెళ్ళాలని యెయిర్ పోర్ట్ కి బయలుదేరుతోంటే నువ్వు కాల్ చేసావ్. వొట్టి నీ సెల్ ఫోన్ ముద్దుకే మురిసిపోయాను. పక్కనే నిలబడి ముద్దు పెట్టినంత యెఫెక్ట్ తో యెలా పెట్టగలవ్! యె న్నెన్ని గాలి ముద్దులో కదా…   మనం మాటాడుకొంటున్నప్పుడు మన మాటల మధ్యన నిశ్శబ్ధంలో నీ పెదవులపై కనీకనిపించని నీ పసిఅల్లరి నవ్వువి వినడానికి చెవి వొగ్గానా, సరిగ్గా అప్పుడే వినిపించింది కోయిల పలకరింపు. వాకిట్లోని మామిడి చెట్టు మీద నుంచి. యీ వసంతానికి తొలిసారిగా యీ వూరి కో యిల పలకరింపు నీకు వినిపించింది కదా. మనిద్దరం వొకే సారి వినటం తరువాత రికార్డ్ చేసి ఆ ఫైల్ అటాచ్ చేసాను. మళ్ళీ విను.

యిప్పుడే వచ్చిన తనతో అలా కొంచెం సేపు మాత్రమే మాటాడి తనని వదిలి పని మీద వెళుతోన్నందుకు దిగులేసింది. రెండ్రోజుల్లో వచ్చేస్తానుగా అప్పుడు తీరిగ్గా వూసులు చెప్పుకోవచ్చని చెప్పాను.

యీ యేడాదికి తొలిసారిగా కోయిల పాట మంగళూర్ లో నేత్రావతి తీరాన విన్నానని చెప్పానుగా. ప్రతి యేడాది యీ మామిడి చెట్టు మీదకి రావాలని కోయిల యెంత బాగా గుర్తు పెట్టుకొంటుందో కదా. వీధిలోని చెట్ల పైకి వచ్చేసాయి కోయిలలు, దారి పొడుగుతా మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ‘పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు’ … యిప్పటికి మార్నింగ్ వాక్ సిట్యుయేషన్ కి యింతకు మించిన పాట లేదనిపిస్తుంది. వుదయమే గుర్తొచ్చిన పాట … బాప్ రే! యింక యీ రోజంతా యీ పాట ముసురులా నన్ను వదలదుగా!

వచ్చేసాను. వోకే చిన్నా, చెకిన్ చేసాక తిరిగి…

వుదయం చెకిన్ చేసినప్పట్నుంచి నీకు రాయటానికే వీలుచిక్క లేదు. సారీ.

హోటల్లో నా గదికి వచ్చాను. కాఫీ కలుపుకొంటూ టీవీ ఆన్ చేసాను. మరి కొన్ని స్వరాలూ గదిలోకి వచ్చాయి. గుడ్. ఫ్లైయింగ్ కిస్ లోని స్పర్శలా యింస్టెంట్ కాఫీలో అరోమా యేముంటుంది కిక్ యివ్వటానికి! కానీ అసలు కిక్ అంతా నా గదికి యెదురుగా వున్న సముద్రం. తెల్లని పల్చని గాజు కిటికీలోంచి చప్పుడు లేకుండా యెగిసే కెరటాలని చూస్తుంటే వొక్కో సారి అద్దాల కిటికీ కూడా సౌందర్యానికి శక్తివంతమైన బ్యాన్లా తోచింది. మెల్లగా తలుపు తీసాను. సముద్రపు సవ్వడితో వెచ్చనిగాలి వొత్తుగా ముఖమంతా కమ్ముకొంటోంది, అప్పుడప్పుడు నీలోని చిలిపితనంలా. నీకు గుర్తుందా… ఆ కేరళా సముద్ర తీరాన నీ వెనగ్గా నిలబడి నీ మెడ చుట్టూ చేతులేసి గాలితో ఆడిన దాగుడుమూతలు. యిప్పుడు నువ్వు నా పక్కన వుంటే నీ వెనగ్గా దాక్కొని నీ భుజాల మీద నా ముఖాన్ని ఆన్చి యీ గాలితో ఆటలాడేద్దునుగా! భలే మక్కువ నాకు నీ సమక్షంలో గాలితో మంచుతో వానతో ఆడుకోవటం.

టీవీలో న్యూస్ వినిపిస్తోంది. ఆసక్తిగా అనిపించి చూసాను. వావ్… కంగనాకి నేషనల్ అవార్డు. క్వీన్ కి. అపురూపం కదా. చాలా మంది అడుగుతుంటారు క్వీన్ ఎందుకంత యిష్ట మని. నీతో కాసింత పంచుకోవాలనిపిస్తోంది. చెప్పనా?

నాకేమనిపిస్తుందంటే…

‘యెవరూ కేక విని రాకపోయినా

వొక్కడవే పదవోయి

వొక్కడివే పదవోయి’ అని ఠాగోర్ గారి యీ పాటని అమ్మాయిలు అబ్బాయిలు అందరం చాలా యిష్టంగా పాడుకొంటాం. ఆ పాట అమ్మాయిలకి సంబంధించిందా, అబ్బాయిలకి సంబంధించిందా అంటే మనుష్యులకి సంబంధించిన పాట అది. కాని అందులో ‘వొక్కడివే’ అని వుంటుంది. ‘వొక్కర్తివే’ అని వుండదు. కాని ఆ పాటని మనదే అనుకుంటాం అందరం.

అమ్మాయి వొక్కతి ప్రయాణం చెయ్యటం అదీ గమ్యం తెలీకుండా చెయ్యటం అన్న వూహే రాదు యెవ్వరికి. అలా ప్రయాణం చెయ్యటం అబ్బాయిలకి మాత్రమే చెల్లుబాటు అనుకుంటారు. సహజం అని కూడా అనుకుంటారు.

అమ్మాయిలు చేసే ప్రయాణాలు అంటే పుట్టింటికి ,అత్తింటికి వెళ్ళటం. గత కొన్నాళ్ళుగా యింటర్వ్యు కో , చదువుకోడానికో యిలా వొక ఆమోదిత చట్రంలో ప్రయాణాలు వుండాలి. కచ్చితమైన పని, గమ్యం వున్న ప్రయాణమై వుండాలి.

అమ్మాయిలు చేసే ప్రయాణాలకి రోజువారి జీవితంలో, భాషలో, వూహా ప్రపంచంలో కట్టుబాట్లు వుంటాయి. వొక సిద్ధార్దుడిలా మనం యిల్లు విడిచి వెళ్ళటం అన్నది వూహలో కూడా పుట్టదు. నా కథల్లో అమ్మాయిలు గమ్యం లేకుండా కొన్ని సార్లు, కొన్ని సార్లు అడివిని, దీవులని యిలా ప్రపంచాన్ని చూడాలని బయలుదేరి వెళతారు.

మన రోజువారి జీవితంలో కారణం లేకుండా మనం బయటకి వెళ్ళటం అన్నది అన్ని రకాల ఆధిపత్యాలని ఛాలెంజ్ చేస్తుంది కదా. క్వీన్ సినిమా ఆ అన్ని రకాల ఆధిపత్యాలని పటాపంచలు చేసింది.

కంగనాని అనుపమాచోప్రా చేసిన యింటర్వ్యూ చూస్తే వొక నటి లేదా నటునికి యిన్నర్ జర్ని అన్నది వుంటే, పాత్ర యేదైనా సరే యెంత బిలీవబుల్ గా అందులో వొదిగిపోతారో మనకి మరొక్క సారి తెలుస్తుంది. క్వీన్ లో పెళ్ళి కాన్సిల్ అని తెలిసిన ఆ వొక్క సన్నివేశంలో కంగనా నటనకి వొక అవార్డ్ , మిగిలిన చిత్రమంతా ఆమె అభినయానికి వొక అవార్డ్ యివ్వవచ్చు. అంత అద్భుతం ఆ క్వీన్.

మన జీవితంలో మనం అనేకానేక ప్రయాణాలు చేస్తాం. అనేక పాత్రల్లో ప్రయాణిస్తాం. కాని మన అంతరంగంలోని ప్రయాణం అదే యిన్నర్ జర్ని యెవరికి వాళ్ళం చేస్తాం. నువ్వూ నేను వొకరికివొకరం అత్యంత చేరువ. అయినా సరే మన అంతరంగిక ప్రపంచపు ప్రయాణం యెంత చేరువో అంతే యిండిపెండెంట్. ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు క్లోజ్అప్ టూత్ పేస్ట్ మమేకాలుంటాయనుకో.

క్వీన్ సినిమా ముంబాయి లో చూసిన వొక మిత్రుడు ‘ నువ్వూ, నీ కథలో అమ్మాయిలు గుర్తొచ్చారు’ అని ఫోన్లో చెప్పారు. యేదైనా వూరు వెళ్ళటం అంటే చిన్నప్పటి నుంచి భలే సరదా . యెవరు వూరు బయలుదేరినా వాళ్ళ వెంట వెళుతుండేదాన్ని. నీకూ తెలుసుగా కథలంటే యిష్టమని. చందమామ కధల్లో రామయ్యో పుల్లయో పొరుగూరికి వెళ్ళటం అని వుంటే ఆ కథలని మళ్ళిమళ్ళి చదివేదాన్ని. ఆ యా కథల్లోని పాత్రలని అమ్మాయిల్లా మార్చి తిరిగి కథలు చెపుతోండేదాన్ని.ఆ వూర్లు వెళ్ళిపోతుండేదానిని వూహల్లో. పేదరాసి పెద్దమ్మ , పూటకూళ్ళమ్మ కధల్లో యెప్పుడూ ఆమె యింట్లో రాజులు, షావుకార్లు , వివిధ పనులపై తిరిగే బాటసారులు బస చేస్తారు కదా. అమ్మాయిలు యెందుకు బస చెయ్యరోననిపించేది. ఆ కథల్లో అమ్మాయిలు బస చెయ్యక పొతే నన్ను నేను ఆ పాత్రల్లో యెలా వూహించుకోవటం అనేది నా చిన్ని బుర్రలో తేలక, చివరికి వొక రాణి, తప్పిపోయిన తన జింక పిల్లని వెతుకుతూ బయలుదేరుతుంది. చీకటి పడే వేళకి వో పూటకూళ్ళామె యింట్లో బస చేస్తుంది. అక్కడ కనిపించిన వో రుషికి ఆమె నమస్కరించి విషయం చెపుతుంది. అతను తూర్పు దిక్కుగా వెళితే వొక నది వస్తుంది. ఆ నదికి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తే యాలకుల తోట కనిపిస్తుంది. ఆ తోటలో జింక వుందని చెపుతారు. ఆమె ఆ దిక్కుగా బయలుదేరుతుంది. ఆ కథ అలా సాగుతుంది.

అయితే ఆ కథ విన్న మా తాతగారు జింక కోసం రాజు గారు వెళ్ళారని, జింకని తీసుకొచ్చి రాణి గారికి యిచ్చారని చెప్పమన్నారు. యెందుకు అని అడిగితే రాణులు అలా వెతుక్కుంటూ వెళ్ళరు అన్నారు. అమ్మాయిలు బస చెయ్యటం లేదని తెలిసేది కాని యెందుకు వెళ్లరని ప్రశ్నలు వెయ్యాలని తెలియని వయస్సు కదా . కాని నేను నా కథని మార్చకుండా అలానే చెపుతోండేదాన్ని.

చిన్నప్పచిన్నప్పట్నుంచే ప్రయాణాలపై ఆసక్తి వుండే నాకు కొద్దికొద్దిగా పెద్ద అవుతోన్న కొద్ది వొంటరి ప్రయాణాలపై కుతూహలం పెరిగింది. ముంబాయిని వొంటరిగా చూడాలని వెళ్ళాను. ఆ మహానగరంలో చర్చి గేట్ దగ్గర వో సాయంకాలం నిలబడినప్పుడు కెరటాల్లా వచ్చే ఆ జనప్రవాహాన్ని చూస్తుంటే రెండు సముద్రాలు వున్నాయనిపించింది. ఆ ప్రయాణం నాకు మరొక యెరుకని కూడా యిచ్చింది. వొంటరి ప్రయాణం అన్నది వొట్టి మిత్. మనకి తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్థుల నుంచి కాస్త ముందుకు వెళితే యెక్కడికక్కడే ఆత్మీయులు, స్నేహితులు దొరుకుతారు. వాళ్ళు ఆ వొక్క ఆ ప్రయాణంలో ఆ వొక్క ప్రదేశానికి పరిమితం కావొచ్చు లేదా కొద్ది సేపే కావొచ్చు. లేదా మన జీవితంలో ప్రవహించే స్నేహంగాను వుండిపోవచ్చు. ప్రకృతితో అమితంగా మమేకమయ్యే నాకు మనుష్యులు లేని ప్రదేశం యేమంత అందంగా కనిపించదు. అత్యంత ఆసక్తి మనుష్యులని కలుసుకోవటం. అప్పటి నుంచి మనుష్యులని ,పువ్వులని, మంచుని, వానని చూడటానికి చేసే నా ప్రయాణాలన్నిటా ఆ యెరుక నాకెంతో ధైర్యాన్ని యిచ్చింది. చేసిన, చేస్తున్న ప్రయాణాలు మనసులని భలే శుభ్ర పరుస్తున్నాయి. విశాలం చేస్తుంటాయి.

కంగనా అత్యంత అద్భుతంగా నటించిన క్వీన్ కి అవార్డ్ రావటమంటే మనందరికీ రావటమే కదా. యేర్పరచిన, నడిచిన దారుల్లోంచే కాకుండా మనకై మనం ఆవిష్కరించే దారుల్లో రాణుల్లా మనం మరింత శక్తివంతంగా మెరుస్తుంటామనిపిస్తుంది. అదబ్బాయి విషయం. యేమంటావ్… వో… చాల రాసేసాను.

అప్పుడే పన్నెండయింది. నువ్వు బజ్జునే టైం. బజ్జోవాలి అనిపించగానే మనసంతా నీ ముద్దుల జోలపాట గుసగుస. పో! అలా నిద్ర కళ్ళతో నవ్వకు. నిద్రకి వశమవుతోన్న నీ కనురెప్పల పై నేనిప్పుడు ముద్దు పెడితే, సీతాకోక చిలుకల రెక్కల్లా అనేకానేక రంగులజల్లులై పూర్తిగా విప్పారతాయిగా! నాకు తెలుసు అప్పుడిక నేనీ అవనిపై యింద్రధనస్సునే!

ఇట్లు మీ… (3)
నీ బాహువుల్లోంచి వుదయోత్సవం చూడటం యెంత అపురూపం వో నా గోరువెచ్చని సూరీడా… మృదు వెచ్చని నీ భుజం మీద మోహాతీతపు నా లాలన ముద్దు నీకెంత భరోసాని యిస్తుందో నువ్వు పాట పాడి విన్పించినప్పడు నీ గొంతులో విప్పారిన స్నేహం నన్ను అనేక సార్లు సుశక్తిమంతురాలిని చేస్తుంటుంది.

ప్రతి సూర్యోదయం మనం కలసి చూస్తే యెంత బాగుంటుంది. యేమోలే రోజు వొక్కలానే ప్రతీది కలసి చూడటం వినటం పని చెయ్యటం కూడా వొక్కోసారి బోర్ కదా. కొంతమందికి అలా ప్రతి క్షణం కలసి వుండటం యిష్టంగా వుంటుంది. జీవనాన్ని ఆస్వాదించడాన్ని ప్రతి మనసు వొక్కోలా కోరుకుంటుంది. మనసేం యెస్కలేటర్ కాదు కదా. వెళ్ళిన దారిలో కనీసం వెనక్కి కూడా దాని మీద నుంచే రాలేం కదా. మనం యెంచుకొన్న పని యిద్దరం సర్వ కాలాల్లో సర్వ సమయాల్లో కలసి వుండలేం. అందుకని కూడా మనం పంచుకోడానికి యెక్కువ సంగతులు వుంటాయనుకుంటాను. అందుకే మన స్పర్శ యెంతటి కాంక్షాభరితమో యెంతటి మోహలావణ్యమో అంతటి పసిమోహనం కూడా.

యిప్పుడు యీ వుదయం యీ నదీ తీరంలో వుదయించే విభాతుని కోసం యెదురు చూస్తు నీకు రాస్తున్నాను. పసి అలల రెక్కల్లోంచి విరిగే నీలివర్ణపు తుంపర నా జుట్టులో తీయని పన్నీరులా చిందుతోంది. జాలరులు వలల్ని అల్లుకొంటూ, కుట్టుకొంటున్నారు. లంగరేసిన పడవల దగ్గర వూసులాడుకొంటున్నారు కొందరు. కొంతమంది అప్పుడే చేపల వేటకి నదిలోకి వెళ్ళారు. యెంత శారీరకశ్రమ. యెంత సాహసం.

లంకల్లోకి వెళ్ళబోతున్న పడవతను లంకలోకి వస్తారాని అడిగాడు. ఆ పడవ కెపాసిటి యెంతో తెలీదు కాని వూరు వూరంతా యెక్కినా లంకలోకి తీసుకు పోతాననేట్టు వున్నాడతను. నీటి మీద ప్రయాణాలకి సంబంధించిన సేఫ్టీ స్పృహ మన దేశంలో చాల తక్కువ అని నాకనిపిస్తుంది. వుదయమే లంకలోకి వెళ్ళటం భలే వుత్సాహంగా అనిపించింది. యెక్కేసాను.

నీకు గుర్తుందా మనం పరిచయం అయిన కొత్తలో లంకలోకి వెళదామని పుట్టే యెక్కమంటే ‘నువ్వు నడుపుతావా’ అని నువ్వెంత కంగారు పడ్డావ్. అప్పటికి ఆ కుర్రాడు నేను యెంత బాగా నడపగలనో చెపుతున్నా నువ్వు మాత్రం నమ్మలేదు. అదే కారు అయితే నీకు యెలాంటి సందేహం వుండదు. యెందుకంటె అమ్మాయిలకి సంబధించినంత వరకు అది అలవాటైన యిమేజ్. భలే నవ్వొచ్చింది ఆ రోజు. మనకి స్టీరియో టైప్ యిమేజస్ ని బ్రేక్ చెయ్యటం భలే కష్టం. మొదట్లో లేడి పైలెట్స్ ని చూసి కంగారు పడి ఫ్లైట్ దిగిపోదాం అనుకొన్న పెద్దమనుషుల గురించి విన్నప్పుడు యెంతగా స్త్రీలు చేసే పనులు మనస్సులో స్థిరంగా ముద్ర వేసుకున్నాయాని. యిప్పుడు అన్ని యిమేజెస్ బ్రేక్ అయిపోయాయి. యిప్పుడు నీకు యే సంకోచం లేదనుకుంటా నేను తెప్పని నడిపితే యెక్కటానికి:)

సరే యిప్పుడే యీ పడవ కదిలింది. పడవ నిండుగా మనుష్యులు. తట్టలు. బుట్టలు. ముగ్గురు ఆడ పిల్లలతో వొక తల్లి తండ్రి. లంకలో పుల్లలు యేరుకు రావడానికి. వంట చెరకు వాళ్ళకి. పిల్లలు లంకలో తాగబోయే కొబ్బరి బొండాల గురించి ముచ్చటించుకొంటున్నారు.

మెల్లగా సూర్యుడు వస్తున్నాడు. వుదయించే సూర్యునికి నమస్కరించాను. నీకు తెలుసుగా ప్రకృతికి నమస్కరించటం నాకు యిష్టమని. అలానే నదికి అరణ్యానికి చంద్రునికి నిండుగా ఫలవంతమైన మామిడి చెట్టుకి బంగారు కాంతితో వికసించిన వరిచేలుకి దిగంతాలకి పుష్పించిన రంగురంగు పుష్పాలకి, చంద్రరశ్మికి యిలా ప్రకృతిలోని ప్రతి అణువుకి నమస్కరించాలని వుంటుంది. నమస్కరిస్తాను కూడా. అప్పుడే పుట్టిన బిడ్డని ప్రతి వొక్కరు చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ హృదయానికి హత్తుకున్నప్పుడు ఆ పసిప్రాణంకి యీ ప్రపంచంలో నన్ను ప్రేమించే వాళ్ళు బోలెడంత మంది వున్నారనే నమ్మకాన్ని యిస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే మనం ప్రేమించటానికి పసితనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలానే ప్రకృతి కూడా పసితనంతో చిగురిస్తున్నప్పుడు ముద్దాడాలనిపిస్తుంది. పెద్దరికంతో యెదురైనప్పుడు నమస్కరించాలనిపిస్తుంది.

సూర్యకిరణాలు చురుక్కుచురుక్కుమంటున్నాయి కొన్ని సమయాల్లోని నీ చూపుల్లా. నదిలో నీళ్ళు తళతళలాడుతున్నాయి నీ పాటలోని పదాల్లా. కాస్త దూరంలో లంక కనిపిస్తోంది పచ్చగా.

లంకలోకి వెళ్ళాక మళ్ళి రాస్తాను.

I am back…:)

ముదురాకుపచ్చని లంక. నిలువెత్తూ కొబ్బరాకుల పందిరిలా వుంది. పూల పొత్తిళ్ళల్లోంచి లంకతుమ్మెదలు పలకరించాయి. మరో పక్క ఆకులు రాల్తున్నాయి. నది మీద నుంచి వీసే చల్లని గాలి పల్చని యెండతో మిళితమై రాలిన ఆకులు, పూస్తున్న పువ్వుల పరిమళంతో సమ్మిళితమైన వొక విధమైన తీపివగరు కలబోసిన పరిమళం. వంట చెరకు కోసం పుల్లలు కట్టెలు యేరుకొంటున్నారు చాలా మంది కబుర్లు చెప్పుకొంటూ. యెన్నెన్ని నవ్వులనుకున్నావ్. అంత వేడిగా అనిపించిందా పడవలో. యిక్కడ యెంత చల్లగా వుందో. లంకంతా తిరిగితిరిగి కొబ్బరి బోండం నీళ్ళు తాగి యిదిగో యిక్కడ వో మామిడిచెట్టుకి ఆనుకొని నీడలో కూర్చుని నీకు తిరిగి రాస్తున్నాను.

నాకు యిలాంటి పచ్చదనం చూసినప్పుడంతా విభూతిభూషణ్ గారి ‘వనవాసి’ గుర్తువస్తోంది. మహా లిఖారూప పర్వతం దిగువున వున్న ఆ వేల యెకరాల అరణ్యంలో గుర్రమెక్కి సత్యాచరణ్ వెన్నెల్లో మనలని తనతోపాటు అరణ్యమంతా తిప్పటం గుర్తువచ్చింది. గుర్రం మీద అరణ్యమంతా తిప్పుతానంటే వస్తావా … వద్దులే అలా భయంగా చూడకు:) నీకెప్పుడు తెలియని దారుల్లోకి నాతోపాటు తిరగమంటానని వొక్కోసారి నీకు భలే భయంగా వుంటుందని చెప్పావ్ కదా. అప్పుడు నువ్వు యెంత ముద్దేసావో. చాల సార్లు మనం మన భయాలని సంశయాలని చెప్పుకోం. మనిద్దరం అరటి పువ్వు పొరలుపొరలుగా విచ్చుకొన్నట్టు మనం మన మనసులోని అన్ని యిమోషన్స్ ని విప్పుకొంటుంటాం అప్పుడప్పుడు.

సరే… ఆ విషయాలని మళ్ళి మాటాడుకొందాం.

నాకైతే యీ లంకలో మనిద్దరం చేతుల్లో చేతులు పెనవేసుకొని ప్రతి ఆకుని పువ్వుని పిట్టని పలకరించాలి. వుండుండి గాలి వీచగానే మనం పెనవేసుకొని యేది మా యిద్దరి మధ్య నుంచి వెళ్ళగలవాని అప్పుడెప్పుడో ఆ కొండవాగు వాలులో గాలిని ఆట పట్టించినట్టు యిప్పుడు యీ చల్లని తీపి వగరుల గాలిని ఆటపట్టించాలనిపిస్తోంది నీతో చేరి. నీ మనసుకి రెక్కలు కట్టుకొని యిక్కడికి యెగిరొచ్చెయ్. యీ చెట్ల మధ్యలో మనిద్దరం కలసి పాటలు పాడుకోవాలి.

చుట్టూ నది. యెదురుగా నువ్వు నీ పాట… యింకేం కావాలి నేనొక మోహనావ కావటానికి.