వాకిలి » కరచాలనం

కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్థవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ. ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్థం కాలేదు. స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!

చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని… చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ… ఇలా… సరిగ్గా ఇదే వరుసలో!!

చదువుతున్న కొద్దీ మనసులో మంచీ చెడ్డా బేరీజులూ, ఆలోచనల అలజడులూ ఎక్కువవుతూ ఉంటాయి. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా గాఢమైన అనుభవంతో ముఖాముఖీ అవ్వగానే ఎవరితో అయినా పంచుకోవడం కోసం కాదు మన కోసం మనమే ఆ అనుభవాన్ని అక్షరాల్లోకి పెట్టాలనిపిస్తుంది.. అలా అనుభవాలూ, ఆలోచనలూ అనేక మలుపులూ తిరుగుతూ, కూడలులు దాటుకుని అక్షరాల రూపంలో బయటకొస్తాయి.. ఇహ అది ఏ స్థాయి కి చెందిన సాహిత్యం అనేది తర్వాత ప్రశ్న!

నా చిన్నప్పటి రోజుల్లో, అంటే వయసు ఖచ్చితంగా ఇదని ఇప్పుడు చెప్పలేను కానీ మనసూ, మమతా, వెన్నెలా, వేదనా లాంటి పదాలు అర్థమవుతున్న రోజుల్లో సినిమా పాటలూ, కవిత్వం కవల పిల్లలు.. మంచి ట్యూన్ వస్తే అది పాటవుతుంది లేదంటే అది పుస్తకాల్లో అచ్చవుతుంది అనేది నా అవగాహన!! అందుకే కవిత్వం అంటే ఖచ్చితంగా ప్రాస ఉండాలీ అనుకునేదాన్ని.. ఉదాహరణకి-

కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ

వలచి.. ఈ వేళ పిలిచి… దూరాన నిలిచి

అదే ఇన్స్పిరేషన్ తో స్కూల్లో పోటీల్లో అమ్మ, స్నేహం, దేశం ఇలాంటి అంశాల మీద ఎక్కడా ప్రాస చెదరకుండా నాలుగైదు పేజీల కవితలు రాయడం మొదలుపెట్టాను.

బాగా మనసులో నిలిచిపోయిన సందర్భం- ఐదో తరగతిలో అనుకుంటాను ఒకసారి నా బంగారు భవిష్యత్తుని నిర్ణయించే పరీక్షలేవో జరుగుతున్నాయని మా అమ్మానాన్నా నన్ను చదువుకోమని పక్కింట్లో మా అమ్మమ్మ దగ్గర వదిలేసి, తమ్ముడ్ని మాత్రం తీసుకుని సినిమాకి వెళ్ళినప్పుడు అర్థరాత్రి వరకూ మేలుకుని ‘ఒంటరి నక్షత్రం’ అనే కవిత రాసి, ఆ కాగితాన్ని రోజూ పొద్దున్న హోమ్ వర్క్ చెక్ చేసే మా అమ్మకి కనబడేలా పుస్తకంలో పెట్టాను. అది చదివి అమ్మకి సినిమాకి వెళ్ళలేని నా క్షోభ అర్థమై, చాటుగా కళ్ళు తుడుచుకుని, ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళననే శపథం చేసుకుంటుందని నా పసి కళాత్మక హృదయం ఆశించింది.

మర్నాడు పొద్దున్నే మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకాగ్రతతో మజ్జిగ కవ్వం తిరగేసి కొట్టింది కూడాను! అంతకు ముందు సంవత్సరం స్కూల్లో నేను రాసిన నాలుగు పేజీల ‘అమ్మ ‘ కవితకి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమన్లేదు ఎందుకో!? పైగా ‘మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినట్టు కనబడితే బడి మాన్పించి నాలుగిళ్లల్లో పాచిపనికి కుదురుస్తాను, జాగ్రత్త!’ అని బెదిరింపులు!

ఈ సంఘటన తల్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది, నేను మిలినియల్ కిడ్ అయితే ఎంత బావుండేది అని. ఎందుకంటే అమ్మ ఫేస్‌బుక్ లో ఉండేది, నా కవితని ఆనందంగా ‘A philosophical poem by my 10yr old daughter’ అని షేర్ చేసుకునేది, వందలకొద్దీ లైక్‌లు తెచ్చుకునేది. ఆ ఆనందంతో నన్ను poetry workshop classes లో జాయిన్ చేసేది!!

ఇక ఊహ నించి బయటకొస్తే, నాకు సాహిత్యమంటే నాన్నే! చందమామ, బాలమిత్రలను ఏడో తరగతిలోనే శరత్ నీ, జిడ్డు కృష్ణమూర్తినీ చేతిలో పెట్టి ఏది నచ్చితే అది చదువుకో అన్నారు. పేరుకి అర్థం కూడా తెలీకుండా ‘బడదీదీ’ చదివాను అప్పుడు. ఆ తర్వాత ‘సంస్కరణ ‘ (ఎవరు రాశారో అస్సలు గుర్తు లేదు!) అనే నవల ఇచ్చారు.. అలా అని కావ్యాలూ, క్లాసిక్సూ లాంటివేవీ చదవలేదు! కానీ చదవడం అనే అనుభవాన్ని పరిచయం చేశారు.

కవిత్వం మీద ఆసక్తి, ఇష్టం మొదలైంది మాత్రం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, ఆకులో ఆకునై, మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, లాంటి పద ప్రయోగాలు సినిమా పాటల్లో వినడం, ఆయా రచయితల ఇతర రచనలు అని వెదుక్కుంటూ పద్యాలూ, కావ్యాలూ కాకుండా కవిత్వం అనే ఒక ప్రక్రియ, దాని తీరుతెన్నులూ అనుకుంటూ అన్వేషించడం మొదలు పెట్టిన రోజుల్లోనే! శేషేంద్రశర్మ, రవీ‌ద్రుడూ, కృష్ణశాస్త్రీ, గాలి దుమారంలా అలజడి సృష్టించిన శ్రీ శ్రీ.. వీళ్ళే తొలినాళ్ళలో ఆరాధ్యదైవాలు. ఇవ్వాళ్టి రోజున, కొన్ని వందలసార్లు వినేసిన తర్వాత, తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు ‘ అన్న భావం మామూలై పోయి ఉండొచ్చుగానీ అది మొట్టమొదటిసారి విన్న క్షణంలో నా మనసు లోనైన భావావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను!

స్వదేశంలో ఎక్కువగా రాయలేదు. రాసే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే తొంభైల్లో ఆంధ్రదేశం లో ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఇంటింటికో ఇంజనీరూ, డాక్టర్‌ని తయారుచేసే ఉద్యమం. అందులో అమ్మానాన్నలు చాలా చురుకుగా పాల్గొనడం వల్ల చదువు తప్ప ఇతరత్రా వేటినీ దగ్గరికి రానీయలేదు!

చదువులు ముగిసి జీవితం తిప్పిన మలుపులో భాగంగా దేశాన్ని వదిలి రావాల్సి వచ్చింది! అమెరికా జీవితంలో, ఇంటర్నెట్ జీవితంలొ ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టాక, మూలాల కోసం వెదుక్కోవడంలో భాగంగా తెలుగు గ్రూపుల్లో చురుకుగా పాల్గొనడం ఎక్కువయింది. అలా ఆ గ్రూపుల్లో లైక్ మైండెడ్ వ్యక్తులు తారసపడటంతో కవిత్వం మీద మళ్ళీ ఆసక్తి మొదలైంది. ఎంతోమంది వర్ధమాన కవులూ, కవయిత్రుల పరిచయాలూ.. కవిత్వంమీద చర్చలతో తెలీకుండానే కవిత్వం జీవితంలో ఎప్పుడు ముఖ్యభాగం అయిందో గమనించనే లేదు! అలా తెలీకుండానే ఒకటీ రెండూ అంటూ మొదలిపెట్టి తెలుగుజ్యోతి, పొద్దు, కౌముది, వాకిలి, సారంగ వంటి అంతర్జాల పత్రికలకు కవితలు పంపడమూ, అప్పుడప్పుడు పోటీలలో బహుమతులు తెచ్చుకోవడంతో కవిత్వం అస్తిత్వమై నాలో నిండిపోయింది. నా అక్షరాలు నన్ను దాటి నలుగురినీ చేరుకుని అమోదం పొందడంతో పాటు విలువైన సలహాలు నిరంతరం పొందడం కూడా ఒక ముఖ్య విషయం!

అమోదమూ, సలహాలూ అంటే ఇక్కడ ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్పాలి.

అంతర్జాలంలో కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో పరిచయమైన కొత్త కవిత్వ తత్వం, ఇస్మాయిల్ గారి నిశ్శబ్ద కవిత్వం! ఆ తత్వాన్ని ఆస్వాదించడం మొదలుపెడుతూనే తారసపడిన వర్ధమాన కవి యదుకుల భూషణ్ గారు. ఇస్మాయిల్ గారి శిష్యులు, అభిమాని! భావాన్ని వ్యక్తపరచడంలో ఎటువంటి దీర్ఘాన్నీ, ఆడంబరాన్నీ ఇష్టపడని కవి. ఆయన కవిత ఒకటి నన్ను ఎంతో ఆకట్టుకుంది.

గతం

నల్లని రాతిమెట్లు

అల్లుకున్నవి లతలు పూలు

చతికిలబడటానికే తప్ప నిన్నెటూ తీసికెళ్ళలేవు!

గతాన్ని రాతిమెట్లుతో పోల్చడం, అది కాసేపు సేద తీరడానికే తప్ప ముందుకి తీసుకెళ్ళడానికి పనికిరాదని చెప్పడం అద్భుతం! అలా భూషణ్ గారి కవిత్వాన్ని, ఆయన ఇతర వర్ధమాన కవుల కవిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థం ఏంటంటే మాలాంటి ఒకటీ అరా రాస్తున్న వారికి ఆయన ఏదైనా కవితని మెచ్చుకోవడం అంటే ఐఐటీ ఎంట్రెన్స్‌లో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావడం వంటిది!

ఆ తర్వాత నన్ను ప్రభావితం చేసినవారు అఫ్సర్ గారు, నా గురువుగారు! ఆయన వర్ధమాన కవులందరికీ డొక్కా సీతమ్మ లాంటి వారు. అంటే, ఆవిడ ఏ సమయంలో వచ్చినా అతిథులకి అన్నం పెట్టేవారు. ఈయన ఎవరికైనా రెండు మూడు ముక్కలు రాయడం వచ్చు అని తెలిస్తే చాలు ఆయన బడిలో చేర్చేసుకుని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారు! ఆయన నాకు ఇచ్చిన అమూల్యమైన సలహా, “కొన్ని పదాలూ చిత్రాలూ కలిస్తేనే కవిత్వమైపోదు. వాటి మధ్య ఇంకేదో వినిపించాలి కనీసం వొక కూనిరాగం లాంటి గుండెచప్పుడు. వినిపించాక, అది నిస్సహాయపు మూలుగు కావచ్చు, చీకటి చివరి వెలుగు అయినా కావచ్చు. ఎదో వొకటి మాత్రం నువ్వే వినిపించగలిగిన శబ్దాలు కొన్ని వున్నాయి. అవి వినిపించకుండా వెళ్ళిపోకు.”

స్వతహాగా హిందీ భాష మీద ఇష్టం ఉండటంతో పాటలూ, కవిత్వమూ చదువుతూనే ఉన్నా కానీ అనువాదాలు చేయడానికి ముఖ్య కారణం ఒకరోజు రేడియోలో విన్న ఒక కథ!

ఒక రోజు మధ్యాహ్నం డాక్టర్స్ ఆఫీస్‌కి ఆగమేఘాల మీద వెళ్తూ, కార్లో రేడియో చానెల్స్ మారుస్తుంటే ఉన్నట్టుండి ఒకమ్మాయి గొంతు వినిపించింది, ఏదో చదువుతున్నట్టు. ఖచ్చితంగా న్యూస్ మాత్రం కాదని రెండు సెకన్లకే అర్థమైపోయింది. తన గొంతు తప్ప ఇంకేమీ వినబడని స్వచ్ఛమైన వైట్ నాయిస్ అది!

“…I don’t watch telenovelas. I hate drama. That’s why I live in Doral. (In Doral, the most dramatic thing that happens is golf.) But. When my mother calls to tell me about the filming, I say, “I’m coming!”

అది ఒకమ్మాయి — తన పేరెంట్స్ ఉండే నెయిబర్‌హుడ్‌లో జరుగుతున్న ఒక టివిసీరియల్ షూటింగ్ గురించీ, అక్కడ నివసించే మనుషుల గురించీ, ఆ సమయంలోనే కొడుకుని ఆల్మోస్ట్ నీళ్ళల్లో ముంచేసి చంపేయబోయిన ఒక అబ్యూసివ్ తండ్రి గురించీ, దాని గురించి పెద్దగా పట్టించుకోని పోలీసుల గురించీ… చెప్తున్న కథ!

“… I know the camera only sees what it wants. But, I keep trying to look outside the frame, to catch sight of the crowd watching from across the street. I want to see myself, living outside the drama.

But I can’t…”

ఇలా ముగిసేవరకూ నేను రియలైజ్ అవనే లేదు, నేను డాక్టర్స్ ఆఫీస్‌కి వచ్చేసి, పార్క్ కూడా చేసేసి, కదలకుండా ఆ కథ వింటున్నానని, అందులో పూర్తిగా మునిగిపోయానని! ఆ కథల్లో వాళ్ళ హృదయం ఉంది, నిజాయితీ ఉంది! ఒక భాషలోని భావాల్నీ ఆ వ్యక్తుల అనుభవాల్నీ యథాతథంగా వేరే భాషలో చెప్పగలగడం వల్ల ఎంతమంది భిన్న వ్యక్తులని ఏకం చేస్తుందో కదా అనిపించింది!

అప్పుడే అనిపించింది, నాకు తెలిసిన హిందీ భాషలోని మంచి కవితలని తెలుగులోకి ఎందుకు అనువాదం చేయకూడదని. మెల్లగా బ్లాగులో గుల్జార్ కవితలు రెండు మూడూ అనువాదం చేశాను.. అఫ్సర్ గారి ప్రోత్సాహం వల్ల సారంగలో గుల్జార్ అనువాదాల మీద ఒక సిరీస్ లాంటిది రాయగలిగాను.

చిన్న ఉదాహరణ-

Sketch

Yaad Hai Ik Din?

Mere Maze Par Baithe Baithe

Cigartte Ki Dibiya Par Tumne

Chhote Se Ek Paudhe Ka

Ek Sketch Banaya Tha

Aakar Dekho,

Us Paudhe Par Phool Aaya Hai!

చిత్రం

గుర్తుందా ఒకరోజు?

నా బల్ల మీద కూర్చున్నప్పుడు

సిగరెట్ డబ్బా మీద నువ్వు

చిన్న మొక్కలాంటి

ఒక చిత్రాన్ని గీశావు

వచ్చి చూడు,

ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!

గుల్జార్‌ కవితలతో పాటు ఇప్పుడు అమృతా ప్రీతం (ఈమె ఇప్పటి పాకిస్తాన్ లో పుట్టిన పంజాబీ కవయిత్రి) కవితలని అనువాదం చేయాలని ఆలోచన. వీలైనంత వరకూ వీలు చేసుకుని కవిత్వంతో సమయం గడపాలని ఉంది.

వచనం చదవడం ఇష్టం. కవిత్వం రాయడం ఇష్టం. కవిత్వంతో అయితే చాలా చెప్తూనే ఏవీ చెప్పలేదన్న లేక అసలేం చెప్తున్నామోననే సందేహావస్థ కలిగే భావన తెప్పించవచ్చు. నాకు అది చాలా ఇష్టం! వచనంతో అలా కుదరదు. మనసులో కార్నర్స్ ని ఫ్లడ్‌లైట్ వెలుతురులో పెట్టి చూపిస్తున్నట్టనిపిస్తుంది.కానీ ఏ బద్దకపు మధ్యాహ్నమో, ముసురుపట్టి కాలు బయటపెట్టనివ్వని ఉదయాలలో ఏమన్నా చదవాలనిపిస్తే ఖచ్చితంగా అది వచనమే అయి ఉంటుంది.

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే? సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడg అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!

ఎంతకాలం ఎన్ని రాయగలనో తెలీదు కానీ రాసిన, రాయబోయే నా నాలుగక్షరాలు మాత్రం తిలక్ తాలూకు వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లల కాలి మువ్వలుగానో, జడలో తురుముకున్న జాజులుగానో మిగిలిపోవాలని నా ఆకాంక్ష!!

(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)

నా ఉద్విగ్న మానస సంభాషణ
నాకు భాషమీద, భాషకున్న పరిమితులమీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలు చుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. నా మిత్రులు ,కుటుంబ సభ్యులు చాలా మంది తరచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు.

అదేమంటే ‘నువ్వు కవిత్వమెందుకు రాస్తావ’ని. బహుశా ఇదే ప్రశ్న కొన్నిసార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడ చెప్పుకుంటూ వుంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనమెందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరపున నియమించుకున్న లాయర్‌ నా కవిత్వం.

“సహజ మానవునికి, సమిష్టి మానవునికి మధ్య వైరుధ్యమే కవిత్వం ఆవశ్యకత, మన ఆర్థిక కార్యాచరణే కవిత్వం అంటాడు క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌. వెంటనే మీరు మరో ప్రశ్న వేయవచ్చు. ఈ వాదన వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి?” అని. అవును మనం ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. కవులు అనధికారిక శాసనకర్తలు (unacknoeledged legislators)-P.B.shelly. “only the poet can look beyond the details and see the whole picture” అంటూ సమాజంలో కవుల ప్రాధాన్యతను అనేక రకాలుగా చెప్పారు. సామాజిక భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే కళాకారుడు రచయిత. మనిషి అంతరంగంతో సంభాషించి మానవత్వపు పరిమళాన్ని వెదజల్లేవాడు రచయిత. ప్రపంచంలో అనేక గొప్ప మార్పులు సాహిత్యం వల్లనే సాధ్యపడ్డాయి.

ఒక భూస్వామ్యసమాజంలో రెవెన్యూ అధికారిగావుండి ,వ్యసనపరుడై అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పేద ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదుకదా! సాహిత్యం చదవడం అనే ఒకే ఒక మంచి వ్యసనం వల్ల అతను జనరల్‌ ఛూటేగా మారి జనచైనా జనం గుండె చప్పుడయ్యాడు. భగత్‌సింగ్‌ వీలునామాలో జైలుజీవితానికి ముందు తాను ఒక పుస్తకం చదివివుంటే కనుక అసెంబ్లీలో బాంబులు వేసే ఉగ్రవాద చర్యకు పాల్పడి ఉండేవాడిని కాదని అంటాడు. ఆ పుస్తకం లెనిన్‌ రాసిన ‘స్టేట్‌ అండ్‌ రివల్యూషన్‌’. బహుశా అదే జరిగివుంటే భారత దేశ చరిత్రగతి ఇంకో రకంగా ఉండేదేమో! ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. నన్ను నేను మానవీయ విలువలతో నిలబెట్టుకోవడానికి సాహత్యం చదువుతాను.

మానవుని ఆవేశాలను పోగుచేసి, సహజాతాలను సిద్ధం చేసి సమిష్టి కార్యాచరణకు పురిగొల్పే గుంపు పండగల్లో కవిత్వం పుట్టింది. వర్గవిభజన లేని సమాజంలో శ్రమ సమిష్టి శ్రమగా ఉండేది. కవిత్వం సమిష్టి భావనగా మనుగడ సాగించేది. వర్గ సమాజంలో సంపదని, అధికారాన్ని కైవశం చేసుకున్న వర్గం శ్రమనుంచి కవిత్వాన్ని దూరంచేసింది. అంత:పుర బందీని చేసింది. తెలుగు కవిత్వం పరిణామక్రమంలో అంత:పుర బందిఖానాల్లోంచి తప్పించుకొని, రాజప్రసాదాల్లో సాగిలబడ్డ స్థితిని దాటుకొని , వ్యాకరణాల సంకెళ్ళని, ఛందోసర్పపరిస్వంగాలని విడిపించుకుని ఆధునిక కవిత్వమై నిలబడ్డది. ఆధునిక కవిత్వం ఒక స్పష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథంతో నడుస్తున్నది. నేనెక్కువగా రాజకీయాలు మాట్లాడుతుంటానని నా మిత్రులు నా మీద ఆరోపణలు చేస్తుంటారు. ఒక విలేఖరి ఇదే మాట అంటే, నోబల్‌బహుమతి గ్రహీత, కొలంబియా మేటి రచయిత గేబ్రియల్‌ గార్సియా మార్క్వెజ్‌-’ఈ సందిగ్ధకాలంలో నేను కొలంబియాలో జీవిస్తున్నాను కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడాల్సి వుంటుంది’ అన్నాడు.

ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మాన్ని సమూలంగా నిర్మూలించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడానికి పురిగొల్పే క్రియలో ఉత్ప్రేరకాలుగా రచయితలు ఉండాలి కదా! ఈ నాటి పరిస్థితులల్లో సామ్రాజ్యవాదాన్ని, ఆర్థిక ప్రపంచీకరణని, సాంస్కృతిక ప్రపంచీకరణని ఎదుర్కొనే ఉద్యమాలలో సూదిలో దారంలాగా రచయితలు ఉండాలి కదా! సామ్రాజ్యవాదుల ఆయుధ సంపత్తి పౌరసమాజాన్ని నోరెత్తకుండా చేస్తే, డబ్లుటివో,వరల్డ్‌బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలను కొల్లగొడుతున్నాయి. ప్రసారసాధనాలు, నాన్‌ సీరియస్‌ సాహిత్యం పలాయనవాద వ్యక్తిత్వాన్ని సమకూర్చుకొమ్మని ఉద్భోదిస్తున్నాయి. వ్యక్తివాదం,వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిచేతన అనేవి సమిష్టిభావ సంస్కృతిని నాశనం చేస్తున్నాయి.

ఈ విషయాల్ని కొద్దిసేపు ప్రక్కనపెట్టి నా వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావిస్తాను. అరవై ఎనిమిది ఎకరాల పట్టేదారు, ముప్పై ఎకరాల ఆసామి కొట్టనంపు రామయ్య పటేలు, సత్తెవ్వల కడగొట్టు సంతానంగా నల్లగొండ జిల్లా బొందుగుల గ్రామంలో 1966(?)లో జననం. ఆర్థికమాంద్యం, అత్యవసర పరిస్థితి కలిసి బాల్యం మీద చేసిన దారిద్య్రపు గాయాల మచ్చలింకా మానలేదు. పచ్చజొన్న పిసికిళ్ళు ప్రాణాలు కాపాడుతున్న కాలంలో చెలరేగిన కరువుకు ఒక్కొక్క ఆవు తోకలు పట్టి లేవట్టించుకుంటూ దొడ్డి ఖాలీ చేసి వెళ్ళిపోతున్న దౌర్భాగ్యం. ఇంటికెదురుగావున్న మేనమామ కూతుళ్ళు అందంగా, ఆరోగ్యంగా,ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళతో పోల్చుకుంటూ అక్క కన్నీళ్ళు పెట్టుకుంటున్న దృశ్యం ఇంకా చెరిగిపోలేదు. అమ్మ,బాపుల నిరంతర చాకిరికి గుండె చెదిరి అప్పుడప్పుడూ పశువులకాపరిగా, మోటగొట్టే మోతుబరిగా, మోకాలు లోతు బురదలో నాగలిదున్నే ఆసామిగా నా బాల్యం ఇంకాపచ్చి పచ్చిగానేవుంది. తండ్రి ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడు కాబట్టి ఆ వచ్చే నెలవారీ జీతంవల్ల నా సహాధ్యాయిని, మేనమామ కూతురు సుఖంగా, ఏలోటూ లేకుండా చదువుకోగలుగుతందని గ్రహించి కసిగా చదువును ‘ఇరువాలు’ దున్నిన సాహసం. ఆ కసే ఏడవ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిపింది. అప్పుడు నా ఉపాధ్యాయుడు చూపిన దారి,తెలంగాణలోని ఒకేఒక్క గవర్నమెంటు రెసిడెన్సియల్‌ స్కూలైన సర్వేల్‌లో స్థానం కల్పించింది. అది నాకు విశాల ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇతర రచయితల అంతరంగాల్ని ఇదిగా నేనెప్పుడూ చదవలేదు. నా రిదీదీలిజీ ఖీళిరిబీలి ని నేనెప్పుడూ తొక్కి పెట్టలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక విశాలమైన లైబ్రరీని చూసి, నాకు అనుభవంలేని జీవితాన్ని అక్కడి నవలల్లో చదువుతున్నప్పుడు నాకు ఆ కొత్తలోకం బాగా నచ్చేది. అట్లా సాహిత్యం పట్ల కలిగిన ప్రేమ సామాజిక అసమానతల పునాదిని పరిచయం చేసింది. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో వింటున్న పాటల పరిచయం వల్ల లయాత్మక కవిత్వం నన్ను అమితంగా ఆకర్షించింది. అట్లా నాదే అయిన లోకాన్ని నేను సృష్టించుకున్న. స్నేహాలు, సినిమాలు, తిరుగుళ్ళు నా జీవితంలో చాలా తక్కువ. సాహిత్యాన్ని ఆలంబన చేసుకొని ఎదుగుతూ వచ్చాను. కవిత్వం లాంటదేదో రాయడం పదవతరగతి నుంచే ఆరంభమైంది.అప్పుడు నేను వాడుతున్న లక్సు సబ్బు వాళ్ళింట్లో కుక్కలకు మాత్రమే వాడుతారన్న మిత్రుడి మాటలు చేసిన గాయం ఇంకా మానలేదు. తరగతి గది సంతృప్తినివ్వలేదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిన అద్భుతమైన గ్రంధాలయం నాకు ఆప్తమైంది. గబన్‌,దేవదాసు,బలిపీఠం,ఈ దేశం నాకేమిచ్చింది?, నీ బాంచెన్‌ కాల్మొక్త ఇట్లా ఎన్నని చెప్పను? దాదాపుగా మొత్తం గ్రంధాలయాన్ని చదివేశాను. తరగతిగదిలో తెలుగువాచకంలో దాచుకొని ‘పెంకుటిల్లు’ చదువుతున్నప్పుడు శ్రీధర్‌ సారు కొట్టిన దెబ్బ చెంపమీద మిగిలేవుంది. దాదాపు ఇదే సమయంలో మహాప్రస్థానం, భారమితి, మండేసూర్యుడు, నాదేశం నాప్రజలు,ఆగమగీతి,మైదానం,ప్రేమలేఖలు, కాలాతీత వ్యక్తులు, మరీచిక, రాజు-మహిషి, శిలాలోలిత లాంటి మంచి సాహిత్యాన్ని నాకు పరిచయం చేసిన మా చిన్నన్న కాసుల ప్రతాప్‌రెడ్డి నా రచనా వ్యాసాంగానికి మొదటి గురువు. ఆనాటికే పుష్పవిలాపం,కుంతీవిలాపం, మహాప్రస్థానం చలం పీఠికతో సహా కంఠతా చెప్పగలిగిన స్థాయి నాది.

నాగార్జునసాగర్‌లో ఇంటర్మీడియట్‌ చదివిన రెండు సంవత్సరాల కాలంలో రుద్రవీణ,తిమిరంతో సమరం, చరమరాత్రి కథలు, శృంగార నైషధం,పోతన మహాభాగవతం, భారతి పత్రికలతో సహవాసం. ఒక అమూర్త సమసమాజ ఆకాంక్షల ప్రతినిధిగా మిత్రుల గర్తింపు, పరాచికాలు. నెహ్రూ, దీపావళి, ఉగాదిల మీద ఛందోబద్ధ కవిత్వం, సామాజికాంశాల మీద వచనకవిత్వం, పట్టు సడలిన విక్రమార్కుడు కథలోలె కొన్ని ప్రిమిటివ్‌ రచనలు. అది ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో చేరేనాటికి ఒక స్పష్టతని సంతరించుకున్నది. కవిత్వం జీవితంలో విడదీయరాని భాగమైంది. కాని, వైద్య విద్యార్థులకు ఇట్లాంటి వ్యాపకాలకు సమయం దొరకదు. అనాటమీ చదవాలా, అనాటమీలో ఫెయిలైన కేశవరెడ్డి అంతరంగం(సిటీ బ్యూటిఫుల్‌) చదవాలా అన్న మీమాంస. వ్యక్తి ఎదుగుదలకు స్వేచ్ఛనివ్వని వ్యవస్థలో జీవిత ఆకాంక్షలకి, బ్రతుకుదెరువుకీ మధ్యవున్న వైరుధ్యాన్ని పరిష్కరించుకోలేక వైద్యవృత్తిని స్వీకరించి, పిల్లల వైద్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసి పీకలలోతు కారిరిజంలో మునిగిపోయిన కాలంలో నా వెన్నుతట్టి 1997లో నా మొదటి కవితాసంకలనం ‘జలపాతశబ్దంలోకి’ ని వెలుగులోకి తెచ్చిన చిన్నన్న ఇప్పటికీ నాకు ప్రేరణ. ఈ మెత్తం కవిత్వం నేను అంతకుముందు హైదరాబాద్‌లోఉస్మానియా మెడికల్‌ కాలేజిలో చదువుతున్నప్పుడు రాసింది. ఆ కాలంలో కె.శివారెడ్డి, వి.వి.నారాయణ స్వామి, విమలల సాంగత్యం నాకు వచన కవిత్వం మీద పట్టును పెంచింది. విద్యార్థి ఉద్యమాలతో సాన్నిహిత్యం స్పష్టమైన సామాజిక,రాజకీయ దృక్పథాన్నిచ్చింది. విస్తృతంగా చదువుకునే అవకాశాన్ని, ఆవశ్యకతనీ కల్పించింది.

1994 నుండి జనగామలో పిల్లల వైద్యంలో మునిగి కాలంతో పోటీపడుతూ, వృత్తికీ-ప్రవృత్తికీ మధ్య ఎండనీడల ఆటాడుతూ నన్ను సంపూర్ణంగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా నా రెండో కవితా సంకలనం ‘ఎన్నాద్రి’ 1997 లో వచ్చింది. నూతన ఆర్థిక విధానాలు కొనసాగుతున్న ఈ కాలంలో విప్లవ సాహిత్యానికి ఒక నమూనాగా ఎన్నాద్రి నిలబడిందని విమర్శకులు కొనియాడిన సంకలనం అది. ‘రోగాల్ని నయం చేయడంకాదు ఇప్పుడు కావాల్సింది, రోగాల్ని సృష్టిస్తున్న ఈ వ్యవస్థని మార్చడం’ అన్న డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌, డాక్టర్‌ కోట్నీస్‌లు నా ఆదర్శం. కళ కళకోసం కాదు, కళ సామాజిక ప్రయోజనం కోసమని నినదించి దారులు తొక్కతూ తెలుగు సాహిత్యానికి మార్గనిర్దేశత్వం వహించిన మహాకవి శ్రీశ్రీ నాకు ఆదర్శం. ఈ ఆదర్శాల వెలుగుల్లో నన్ను నేను మైక్రోస్కోపు కింద పెట్టుకుంటే ‘Health for all by 2000A.D.’  విఫలమై ప్రజారోగ్యం గాలిలో దీపమైన చందం నా ‘అందని చందమామ’ అయింది. ఈ దీర్ఘ కావ్యం 1998 లో విడుదల అయ్యింది. ఒక ఇన్‌సైడర్‌గా వైద్య వ్యవస్థ మీద ఇది తొలి కావ్యం.

మెదడు పొరలకంటిన ‘రక్తాశ్రువులు’, కోట్నీస్‌ అమర్‌ కహానీ నన్ను ఏదో ఒక దానికి పరిమితం కానివ్వలేదు. రాయాలనెప్పుడూ నేను కవిత్వం రాయలేదు. నా ఉద్వేగాల్ని, దుఃఖాల్ని, ఒంటరితనాన్ని ప్రకటించడానికి కవిత్వం రాశాను. అసమ సమాజంలోని దుర్మార్గాన్ని, అహేతుకతను సహించలేనప్పుడు రాశాను. దాదాపు రెండేండ్లు ఒక్క కవిత కూడా రాయకుండా ఉన్న నేను మా బాపు చనిపోయినప్పుడు మళ్ళీ రాశాను. రెండేండ్ల నా కొడుకును కాన్వెంట్‌ చదువుల నిమిత్తం నాకు దూరంగా హైదరాబాద్‌లో ఉంచాల్సివచ్చినప్పుడు రాశాను. క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ అన్నట్టు అదంతా నా ‘ఉద్విగ్న మానస సంభాషణే’. ఇంటర్మీడియట్‌ తర్వాత తెలుగు వచనం రాయడం మర్చిపోయిన నాకు తెలుగు కథకులను, నవలకారులను చూసినప్పుడో, విమర్శకులను చూసినప్పుడో అబ్బురమనిపించేది. ఇంత పగడ్బందీగా అక్షరాల్ని ఎట్లా పేరుస్తారా అని ఆశ్చర్యం వేసేది. academic గా తెలుగు సాహిత్యాన్ని చదువుకోలేదన్న ఒక complex నాలో వుండేది. అట్లాంటి సమయంలో శ్రీరామకవచం సాగర్‌ కొంత ఒత్తిడి చేసి రెండు పుస్తకాల మీద సమీక్షలు రాయించి ‘ప్రకృతి సాహితి’లో వేసుకున్నడు. బాగా రాశానని complaints పొందుతున్న సందర్భంలో ఒక లబ్ధప్రతిష్ఠుడైన కవి యొక్క కవితాసంపుటిని సమీక్ష చేయమన్నడు. బలహీనమైన కవిత్వముందని చెప్పాల్సి వచ్చి, అదే రాశాను. అది ఇప్పటికీ వెలుగు చూల్లేదు. తెలుగు సాహితీకారులకు విమర్శని అంగీకరించే ప్రజాస్వామిక దృక్పథం లేదని అర్థమయ్యింది. చాలా కాలందాక మళ్ళీ విమర్శ తెరువు పోలేదు.

మా అన్న కాసుల ప్రతాపరెడ్డి ‘గుక్క’ కవితాసంపుటిలో మా ఇద్దరి ఉమ్మడి అనుభవాలు కొన్ని వ్యక్తమైనవి. చాలా కాలం తర్వాత భిన్నమైన కవిత్వాన్ని చదివినట్టనిపించింది. నా అభిప్రాయాల్ని వ్యక్తం చేయాలనిపించి, రాసి ‘చినుకు’కు పంపాను. వైద్యవృత్తి నిత్యం అశాస్త్రీయ ఆలోచనతోటి, మూఢ నమ్మకాలతోటి ప్రజలు ఎట్లా ఇబ్బందుల పాలౌతున్నారో చూసే అవకాశం కల్పించింది. ‘తెలుగు నవల-వ్యాపారధోరిణి’ లో యండమూరి కక్షుద్ర సాహిత్యంమీద విరుచుకు పడ్డ ప్రతాపన్న ‘ఎల్లమ్మ’ కథలో చూపిన ముగింపు, దానిమీద అంపశయ్య నవీన్‌, దార్ల వెంకటేశ్వర్‌ రావు చేసిన వ్యాఖ్యానాలు చూసినంక ఖచ్చితంగా నా అభిప్రాయాల్ని చెప్పాలనిపించింది. బహుశ, కాసుల ప్రతాపరెడ్డితో నాకు సంబంధం లేకుంటే రాసేవాడిని కాదు కావచ్చు. తర్వాత మళ్ళీ 2011 దాకా నేను వచనం తెరువు పోలేదు.

వచనం రాయడానికి కావాల్సిన ఎడతెరిపి నా వృత్తి నాకు కల్పించలేదు. అదే సమయంలో కవిత్వం మీద తప్ప నాకు వచనం మీద ఆసక్తి కలుగలేదు. సుంకిరెడ్డితో వున్న సాన్నిహిత్యం వల్ల, అతని కోరిక కాదనలేక ‘తెలంగాణ చరిత్ర’ ను సమీక్షించాను. అది చూసిన ‘కందెన’ వెంకట్‌ రెడ్డి కోరిక మేరకు ఒకట్రెండు రాజకీయ వ్యాసాలు రాసిన. శ్రీశ్రీ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన కవి శివసాగర్‌ చనిపోతే రాసిన. నిజానికి అంతకు మందే ‘జనగామ రచయితల సంఘం’ సభ్యుల అవగాహన కోసం శివసాగర్‌ మీద రాయాలనే ఆలోచనతో వుంటి. సాహిత్య సమావేశాల్లోను, సాహిత్య పత్రికల్లోను అకవిత్వం పాలు ఎక్కువైనప్పుడు, కవుల్లో భావదారిద్య్రం చూసినప్పుడు ‘ఆధునిక వచనకవిత్వంలో వస్తు,శిల్పాలు’ రాయాలనిపించింది.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో వచ్చిన మంచి సంకలనాలను(తెలంగాణ కవిత, మునుం,జులూస్‌) పరిచయం చేయాలనిపించి కొంత, సంపాదకుల కోరిక మేరకు కొంత సమీక్షలు రాయడానికి కారణమైనవి.కథలు రాయాలనిపించినా కవిత్వానికే పరివితమౌదామనే, గత పదేండ్లుగా నా అనుభవాల్ని కథలకు ప్లాట్‌గా వాడుకొమ్మని ప్రతాపన్నకు చెపుతుండే వాన్ని. నేను చెప్పినదేదీ తను రాయలేదు. ఇప్పటికి (2012) వచనం రాయగలననే నమ్మకం కుదిరింది. పెండింగ్‌ ప్లాట్స్‌ను కథలుగా మలుస్తున్నా. నేను రాసిన మొదటి కథ ‘ముసుగు’ ముంబైవన్‌ పత్రిక నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ‘ప్రయాణం’ ‘సాంకేతిక దోపిడి’ కథలు విమర్శకుల ప్రశంసలు పొందినవి.

వివిధ వేదికలమీద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల విశ్లేషణలతో ప్రసంగాలు చేయడం జీవితంలో ఒక భాగమైంది. సాహిత్య తపనతో జనగామలో ‘జనగామ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి, గౌరవ అధ్యకక్షుడిగా కొనసాగుతున్నాను. మనుషుల్ని, సమాజాన్ని మార్చేది సాహిత్యమేనని నా ప్రగాఢ విశ్వాసం.

సాహిత్యకారులతో సజీవ సంబంధాలంటే ఇష్టం. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో మిత్రులతో కలిపి నెలకొల్పిన 100 పడకల అధునాతన ‘APEX HOSPITALS’ MANAGING DIRECTOR గా తీరిక లేని కాలాన్ని గడుపుతున్నాను.

“మనిషి దూడను స్టేటస్‌ కొయ్యకు కట్టేసి

బతుకు పొదుగునుంచి డబ్బుల్ని పితుకుతన్నప్పుడు

విలువల ఎన్నాద్రై గుండె ఆకలి తీర్చిన

కవిత్వానికి దండంపెడతా-

ఎడారి బతుకులో

ఆశల నారుమడి ఎండి నెర్రెబారుతున్నప్పుడు

గుండె చెరువు నిండి

కన్నీటి అలుగుదుంకిన

కవిత్వానికి దండంపెడతా.” (ఎన్నాద్రి)

(2013 సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు అందుకుంటున్న సందర్బంగా)

తెంపులేని దేవులాటే నా సాహిత్య విమర్శ: కాసుల ప్రతాపరెడ్డి
కాసుల ప్రతాప్ రెడ్డి నిక్కచ్చిగా మాట్లాడే సమకాలీన సాహిత్య విమర్శకుడు. ఎట్టి స్థితిలోనూ నీళ్ళు నమలడం అతని వల్ల కాదు. మొహమాటంగా మాట్లాడడం అంటే ఏమిటో తెలీదు. చాలా నిర్మొహమాటంగా నిష్టగా తన అభిప్రాయాల్ని పంచుకోవడం ప్రతాప్ విమర్శ మార్గం. ఈ ఏడాది అతని విమర్శ కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీ విమర్శ పురస్కారం లభించడం సమకాలీన సాహిత్య విమర్శకే గౌరవం ! ప్రతాప్ నేపధ్యం వినండి.

నిజానికి, నా బాల్యంలో నా చుట్టూ ఏ విధమైన సాహిత్య వాతావరణం లేదు. పాఠ్యపుస్తకాల్లోని గొప్ప వ్యక్తుల గురించి, వారి జీవితాల గురించి మబ్బు జామున మోట కొడుతూ ఆలోచిస్తూ ఉండేవాడిని. నా ఆలోచనలు అబ్రహం లింకన్ నుంచి గాంధీ వంటి ఉదాత్త పురుషుల చుట్టూ తిరుగుతూ ఉండేవి. మోట కొడుతూ వెనక్కీ ముందుకూ నడుస్తున్నప్పుడల్లా ఆలోచనా తరంగాలు పడి లేస్తూ ఉండేవి. వాస్తవానికి తొలి జాములో పాటలు అందుకోవాలి. కానీ, నా గొంతు పాటను పలికేది కాదు. అదే నన్ను సృజనాత్మకత వైపు తీసుకుని వెళ్లి ఉంటుందేమో తెలియదు.

మోట విడిచి బురద పొలంలో నాగలి నొగను పట్టి చిన్ని చిన్ని చేతులతో, నా కన్నా ఎత్తున్న కోడెలను, ఎద్దులను అదిలిస్తూ ఉంటే నన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉండేవారు. బడికి వెళ్తూ వ్యవసాయం పనులు చేస్తూ బాల్యమంతా గడిచిపోతున్న క్రమంలోనే కవిత్వం రాయాలని ఉత్సాహపడుతూ ఉండేవాడిని. కానీ, దానికేమైనా ఛందస్సు ఉంటుందేమో తెలియదు. పాఠాల్లో వచన కవితలు కూడా ఉండేవి. వాటికి మీటర్ ఉంటుందేమో అనేది అనుమానం. నేను చిన్నప్పటి నుంచి సిగ్గరిని. అందువల్ల నా సందేహాన్ని తీర్చుకోవడానికి మా తెలుగు టీచర్‌ను కూడా పదో తరగతి పూర్తయిన తర్వాతనే కాదు, ఇంటర్మీడియట్‌లో కూడా అడగలేకపోయాను.

మా ఊళ్లో హైస్కూల్లో మాది రెండో బ్యాచ్. వేసవి సెలవుల్లో, ఇతర సెలవుల్లో నేను మా స్వగ్రామం బొందుగుల నుంచి ఆలేరు వస్తుండేవాడిని. ఆలేరు చిన్నపాటి పట్టణం. పైగా, రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మా చిన్నమ్మ ఇంట్లో ఉండేవాడిని. మా చిన్న బాపు టీచర్, పెయింటర్ కూడా. ఆ రోజుల్లో అంటే 1970 చివరి దశకంలో ఆలేరు నిండా మా చిన్నబాపు రాజమల్లారెడ్డి రాసిన సైన్ బోర్డులే ఉండేవి. నిజానికి, జీవితానికి సంబంధించిన కటిక వాస్తవాలను మా అమ్మ సత్తెమ్మ చూపిస్తే, బయటి ప్రపంచాన్ని చూడడానికి మా చిన్నమ్మ ప్రేమ సహకరించింది. మా చిన్నమ్మకు ఇద్దరు కొడుకులు. వాళ్లిద్దరు కూడా నా కన్నా పై తరగతుల్లో ఉండేవారు. అక్కడో లైబ్రరీ ఉండేది. మా చిన్నమ్మ చిన్న కొడుకు రాజమహేంద్రా రెడ్డి (ఇప్పుడు సాక్షి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు) దానికి తీసుకుని వెళ్లి చదవాల్సిన పుస్తకాలు తీసి ఇస్తుండేవాడు. అలా నేను బాకు అనే నవల చదివాను. అందులో నేలమాళిగ అనే పదమేమిటో నాకు అర్థం కాలేదు. పుస్తకం మాత్రం చాలా బాగుంది.

అదే కాలంలో మా ఊళ్లో నా కన్నా ఓ తరగతి పైన ఉండే ఓ అమ్మాయి వాళ్ల ఇంటికి ఆంధ్రజ్యోతివంటి వారపత్రికలు వస్తుండేవి. వాటిలో వచ్చే సీరియల్స్‌ను ఆ అమ్మాయివాళ్లు చించి, కుట్టేవారు. వాటిని తెచ్చుకుని చదువుతుండేవాడిని. అలాంటి సందర్భంలోనే రావిశాస్త్రి రాసిన గోవులొస్తున్నాయి జాగ్రత్త నవల చదివాను. ఆ నవలలోని చాలా పదాలు నాకు అర్థం కాలేదు. కానీ, నవల మాత్రం బాగా రుచించింది. బాకు నవలలోని నేలమాళిగ గురించి గానీ రావిశాస్త్రి నవలలోని పదాల గురించి గానీ అడిగి సందేహాలు తీర్చుకోవడానికి నేను ప్రయత్నించలేదు.

ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్లీ రాజమహేంద్ర రెడ్డితోనూ, ఆయన అన్న రాజ నరేందర్ రెడ్డితోనూ సహవాసం చేసే అవకాశం లభించింది. పైగా, నేనూ మహేందర్ ఒక్కటే కాలేజీ. ఆ సమయంలోనే హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ మాకు ప్రధాన కేంద్రంగా మారింది. కోఠీ ఫుట్‌పాత్‌ను ప్రతి ఆదివారం చూస్తుండేవాడిని. ఏ కవిత్వ పుస్తకం కనిపించినా కొనేసి చదువుతూ ఉండేవాడిని. ఆ సమయంలో రాజనరేందర్ రెడ్డి మిత్రులు సురేష్, ప్రకాశ్, ఇంకా కొంత మంది ఉండేవారు. వారికి సాహిత్యాభిరుచి మెండుగా ఉంది. వారి ద్వారా తెలుగులోని మంచి కవిత్వం, మంచి కథలు, నవలలు పరిచమయ్యాయి. సురేష్ మొదట్లో ఈనాడులో పనిచేసేవాడు. ఆ తర్వాత పిటిఐలో పనిచేసి, ఇప్పుడు ఏదో ఆంగ్లపత్రికకు పనిచేస్తున్నాడు. మంచి కవులూ రచయితలూ సురేష్ ద్వారా నాకు అందేవి. అటువంటి సందర్భంలోనే విడుదలై కాగానే త్రిపుర కథల పుస్తకం నా చేతికి వచ్చింది. ఇంటర్మీడియట్ అయిపోయేసరికే కోస్తాంధ్ర కథ, నవలా సాహిత్యాన్ని, కవిత్వాన్ని చదివేశాను. మా అన్న బుచ్చిరెడ్డి మా గదికి సినీ పత్రికలు, ఆంధ్రభూమి వార పత్రిక తెప్పించేవాడు. వాటిని అక్షరం పొల్లు పోకుండా చదవేవాడిని. నాకు చదువులో మార్గం చూపించింది, బాల్యంలో బాహ్య ప్రపంచం  నుంచి రక్షించింది ఆయనే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం పూర్తిగా బలహీనుడిని చేసేశాడు.

అదలా ఉంచితే, ఇంటర్మీడియట్‌లో ఆలియా కాలేజీ మ్యాగజైన్‌కు ఓ కవిత రాశా. అది అచ్చయింది. ఆ తర్వాత సికింద్రాబాదులోని ఎస్పీ కాలేజీలో బిఎస్సీ బిజడ్‌సి ఇంగ్లీషు మీడియంలో చేరా. అక్కడే నాకు రాజకీయాలు తెలిసి రావడం ప్రారంభమైంది. మా గురువు తిరుమల శ్రీనివాసాచార్య సాహచర్యంలో కవిత్వం, సాహిత్య విమర్శ పరిచయం ఏర్పడింది. సాహిత్య విమర్శకు అక్కడే నాకు పాదులు పడ్డాయి. డిగ్రీలో మొదటి సంవత్సరం కాలేజీ మ్యాగజైన్‌కు అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఆ తర్వాత రెండేళ్లు ఎడిటర్‌గా పనిచేశా. రచనల ఎంపిక బాధ్యతను, సంపాదక బాధ్యతలను ఆచరణలో తిరుమల శ్రీనివాసాచార్య ఈ మూడేళ్లూ నాకే వదిలేశారు. సంపాదకీయంలో మార్పులు చేర్పులు కూడా చేయలేదు ఆయన. అంత స్వేచ్ఛను నాకు ఇచ్చారు.

ఇకపోతే, డిగ్రీ అయిపోయిన తర్వాత పట్టుబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఎ తెలుగు సాహిత్యంలో చేరా. ఇది నాకు సాహిత్య విమర్శను అధ్యయనం చేయడానికి మరింత అవకాశం ఇచ్చింది. సాహిత్య విమర్శలో కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలు ఎలా చేయాలో నాకు వేల్చేరు నారాయణరావు సిద్ధాంత గ్రంథం నేర్పింది. అప్పటికే కోస్తా కవిత్వాన్ని, వచన సాహిత్యాన్ని ఔపోషన పట్టిన నాకు తెలుగు ఎంఎ చాలా సులభమైంది, ఒక గ్రామర్ తప్ప.

ఎంఎలో ఉండగానే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా భాషల మీద పత్రికలకు వ్యాసాలు రాశాను. నాయని కృష్ణకుమారి, ఎస్వీ రామారావు, ఎలూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర వంటి టీచర్ల సాహచర్యంలో విమర్శనా పద్ధతులు అలవడ్డాయి. వెలుదండ నిత్యానంద రావు, లలితావాణి, కెయన్ చారి వంటి తరగతి సహచరులు ప్రాచీన సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్య విమర్సనా పద్ధతులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. నిజానికి, సి నారాయణ రెడ్డి శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలను విశ్లేషిస్తూ మాకు చెప్పిన పాఠం ఆధునిక కవిత్వ విమర్శనా విధానంలోని లోతులను తెలియజేసింది. తరగతి గదిలో మాకే సినారె చివరిగా పాఠం చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వామపక్ష రాజకీయాలు, సాహిత్యాధ్యయనం జోడు గుర్రాల మాదిరిగా సాగుతుండేవి. ఓ ఏడాది ఆర్ట్ర్ కళాశాల మ్యాగజైన్‌కు సంపాదకుడిగా పనిచేశా. రెండో ఏడాది ఇష్టం లేక దాని జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే కొన్ని కథలు రాశాను. కవిత్వం మాత్రం డిగ్రీ నుంచి పుంఖానుపుంఖంగా రాశాను. కానీ, వాటిని నోటు పుస్తకాల్లో భద్రంగా దాచి పెట్టాను. కొన్ని వచనమై తేలిపోయినట్లు, మరికొన్ని అనుకరణలు అయినట్లూ అనిపించాయి. అందుకే, వాటిని ఏనాడు బయటకు తీయడానికి ఇష్టపడలేదు.

అదలా వుంచితే, సాహిత్య విమర్శలో కూడా కొత్త ఒరవడిని పెట్టాలనే ఉద్దేశం ఓవైపు, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన రచయితల నవలూ కథల్లో పఠనయోగ్యతను సంతరించుకోవడం లేదనే విమర్శలు మరో వైపు, నన్ను పాపులర్ సాహిత్యంపై ఎంఫిల్ చేయించడానికి ప్రేరేపించాయి. తెలుగులోని పాపులర్ నవలలపై నేను తెలుగు నవల- వ్యాపారధోరణి అనే ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. అది పుస్తకంగా కూడా వచ్చింది. దాంట్లోని కొన్ని అధ్యాయాలు ఉదయం దినపత్రికలో సీరియల్‌గా వచ్చాయి. అప్పుడది తెలుగు సాహిత్య విమర్శనారంగంలో ఓ సంచలనం.

ఉదయం దినపత్రికలో చేరిన తర్వాత పరిధి విస్తరించింది. అవసరం కొద్దీ సాహిత్య వ్యాసాలు రాయాల్సి వచ్చేది, సమీక్షలు చేయాల్సి వచ్చేది. అలా ఎప్పటికప్పుడు నా విమర్శనా రీతులను మెరుగులు పెట్టుకుంటూ పని చేస్తూ వెళ్లాను. సాహిత్య విమర్శలో నేను చేసిన కొత్త ప్రతిపాదనలను నాకు చాలా మంది ఉద్ధండ కవి పండితులను శత్రువులను చేశాయనే విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించాను. నాలో పిల్లవాడి మనస్తత్వమే ఉండేది. నేను రాస్తే సీరియస్‌గా ఎవరు తీసుకుంటారులే అనే కొంత నిర్లక్ష్య భావం కూడా ఉండేది. అలాంటి సందర్భంలోనే అలా కూర్చుండిపోయి ఉదయం వారపత్రిక ఉగాది స్పెషల్‌కు రక్తం చేత రాగాలాపన అనే వ్యాసం రాశాను. దానివల్ల ఇబ్బంది పడ్డవారు ఇప్పటికీ నాపై లోలోన మండిపోతూనే ఉన్నారు.

విమర్శనా సాహిత్యాన్ని సామాజిక పరిణామ క్రమాన్ని ఆధారం చేసుకుని నేను రాస్తూ వెళ్లాను. ఈ క్రమంలో వచ్చిన కొత్త ప్రతిపాదనలు తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. వాటికి కొనసాగింపులు మాత్రం లేకుండా పోయాయి. ప్రతిపాదనలు, విమర్శలోని కొత్త రీతులే చాలా మందికి మింగుడు పడని స్థితిలో వాటి కొనసాగింపులు ఎంతటి తీవ్రతకు దారి తీస్తాయో కూడా నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒళ్లు చీరుకుపోయి, గుండె ఛిద్రమయ్యే స్థితికి కూడా తీసుకుని వెళ్లింది. దానికి నో రిగ్రెట్స్.  సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలను, ధోరణలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కాల్పనిక సాహిత్యంపై నా అభిప్రాయం మారుతూ వచ్చింది. దానివల్లనే సైద్దాంతిక వాస్తవికత – కాల్పనిక వాస్తవికత అనే వ్యాసం వచ్చింది. ఇది కూడా నాపై దాడికి కారణమైన వ్యాసం.

అయితే, పఠన యోగ్యత సామాజిక ప్రయోజనం సాధించే రచనల్లో ఎలా సాధించవచ్చునో నా అనుభవంలోకి తెచ్చుకోవడానికి నేను కథా రచన ప్రారంభించాను. అలా కథా రచయితగా కూడా నాకో గుర్తింపు వచ్చింది. ఎల్లమ్మ ఇతర కథలు అనే కథా సంకలనానికి సురమౌళి అవార్డు లభించింది. చాలా కథలు వివాదాస్పదమయ్యాయి కూడా. మిగతా తెలుగు రచయితలంతా తమకన్నా సామాజిక హోదాలో, ఆర్థిక స్థితిగతుల్లో కింద ఉన్నవారిని చైతన్య పరచడానికి రచనలు చేస్తుంటే నేను, నా చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని వైరుధ్యాలను, అసంబద్ధతను చెప్పడానికి నేను కథారచనను ఎన్నుకున్నాను. ఏదో ఒక్కవాదానికి కట్టుబడి రాయకుండా ఏ కథకా కథ ప్రత్యేకమైందిగా ఉండేలా రాశాను. అందుకే ఎక్కువగా కథలు రాయలేకపోయాను. తొలుత చలం ప్రభావంతో రాసిన రెండు మూడు కథలను సూట్‌కేసులో పడేసి తాళం వేశాను. వాటిని ఇప్పటికీ తీయడం ఇష్టం లేదు.

ఇక, కవిత్వానికి వస్తే, ఉదయం దినపత్రికలో పనిచేసిన కాలంలో కొన్ని కవితలు రాశాను. అవి అచ్చు కూడా అయ్యాయి. ఉదయం పత్రికలో వచ్చిన ఓ కవితను చదివిన శివారెడ్డి నన్ను కోఠీ ఫుట్‌పాత్ మీద కౌగిలించుకున్నారు. కె. శివారెడ్డితో అదే నాకు తొలి పరిచయం. ఆ తర్వాత శివారెడ్డి మెచ్చుకున్న భూమిస్పప్నం కవితను ఎక్కడో పోగొట్టుకున్నాను. ఆ ధోరణిని కూడా వదిలేశాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనే భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, వాటిని కథల్లో పొందు పరచలేక కవిత్వం రాశాను. అలా వెలువడిందే గుక్క దీర్ఘ కవిత, ఇతర కవితలు. అవన్నీ తెలంగాణ కవిత్వానికి ఒరవడి దిద్దాయనే అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్యంపై విరివిగా వ్యాసాలు రాశాను.

తెలంగాణ తోవలు అనే గ్రంథానికి వ్యాసాలు రాయించి, సంపాదకత్వం నెరిపిన క్రమంలోనే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యాన్నే కాదు, పాత తెలంగాణ రచనలను ఎలా అధ్యయనం చేయాలనే విషయం నేర్చుకున్నాను. తీవ్ర ఆలోచనలు, అన్వేషణ, మీమాంస మధ్య తెలంగాణ సాహిత్యాన్ని విమర్శించే ధోరణులను పట్టుకున్నాను. ఇంత వరకు ఎవరూ తొక్కని మార్గంలో వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలు భౌగోళిక సందర్భం పేరుతో పుస్తకంగా వచ్చింది. అది తెలంగాణ సాహిత్యాధ్యయనానికి దారులు వేసింది. తెలంగాణ సాహిత్యాన్ని వెలికి తీసే పని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సుజాతా రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి వాళ్లు చేస్తుంటే, తెలంగాణ సాహిత్య విశ్లేషణ, విమర్శ, పరిశీలన వంటివాటికి నేను ప్రాధాన్యం ఇచ్చాను. అంతకు ముందు కొత్త ప్రతిపాదనలు చేసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలతో కొలుపు పుస్తకం, ఆ తర్వాత తెలంగాణ సాహిత్యంపై కొత్త విశ్లేషణలు, ప్రతిపాదనలు చేసిన వ్యాసాలతో ఇరుసు పుస్తకం వచ్చాయి. తెలంగాణ కోణంలో రాజకీయాలను విశ్లేషించిన కొన్ని వ్యాసాలతో తెలంగాణ సందర్భాలు అనే పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాలన్నీ కాపీ మిగలకుండా, నాకు కూడా దక్కకుండా పాఠకులకు చేరాయి.

ఈ క్రమంలోనే నన్ను బహిరంగంగా నా ప్రతిపాదనలపై, వాదనలపై చర్చ పెట్టడం ఇష్టం లేనివారు నాకు బలమైన శత్రువులుగా మారుతూ వచ్చారు, అదే స్థాయిలో నన్ను ప్రేమించేవాళ్లూ పెరుగుతూ వచ్చారు. నేను చెప్పదలుచుకున్నదేమంటే తెలుగులో సాహిత్య విమర్శ చేయడమంటే శత్రుత్వాన్ని పెంచుకోవడమేనని. అది పగ తీర్చుకునే దశకు వెళ్లడాన్ని కూడా నేను అనుభవించాను. నేను ప్రచారం కోసం, పేరు కోసమే వాదనలు ముందుకు తీసుకుని వస్తున్నానని చాపకింద నీరులా నాపై దుష్ప్రచారం సాగించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో దొడ్డిదారిన నాపై దాడికి దిగారు. అందువల్ల నేను చాలా మంది యువ సాహిత్యకారులకు తెలుగులో సాహిత్య విమర్శ జోలికి వెళ్లవద్దని సలహా ఇస్తుంటాను. మా తమ్ముడు కాసుల లింగారెడ్డికి కూడా నేను అదే సలహా ఇచ్చాను. మంచికవిగా ముందుకు వచ్చిన స్థితిలో విమర్సనా వ్యాసాలు రాయడం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరించాను.

నిశ్చిత నిశ్చితాలను బద్దలుకొట్టే పని నేను చేశాను. శాశ్వత సత్యం ఏదీ ఉండదని నమ్మి సాహిత్య విమర్శ చేశాను. సత్యం కూడా కాలాన్ని, ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని బట్టి మారుతూ ఉంటుందని చెప్పాను. ఆ క్రమంలోనే అన్ని అస్తిత్వ ఉద్యమాలను సమర్థిస్తూ వ్యాసాలు రాశాను. పేరు ప్రఖ్యాతులు పెందిన కవులను, రచయితలను కాకుండా వాటికి నోచుకోనివారి ఉత్తమ రచలను తీసుకుని విశ్లేషించాను. అయితే, నా దేవులాట తెంపు లేకుండా సాగుతూనే ఉన్నది. ఆ తెంపులేని దేవులాటనే నా సాహిత్య విమర్శగా, సామాజిక విశ్లేషణగా ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, నా కథలూ కవిత్వంతోనే కాదు, సాహిత్య విమర్శతోనూ ఎవరినీ ఏకీభవించాలని నేను అడుగను. నాలోని ఆలోచలను పది మందితో పంచుకోవడానికి మాత్రమే రాశా. నాలాగే ఆలోచించేవారికి అవి నచ్చాయి. నాకు అది చాలు…

ఇంకా వందలాది సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశీలనలు పత్రికల పేజీల్లో ఉండిపోయాయి. వాటిని ఓ పుస్తకంగా తెస్తే నేను ఏ ప్రచారం ఆశించకుండా చేసిన కృషిని కొద్దిమందైనా గుర్తిస్తారనే ఆశ ఉంది. ఇప్పటికి గుర్తించినవారున్నారు. వారికి మరింత మంది తోడైతే నా నిష్కామకర్మ ఫలించినట్లే…

అయితే, నా కోరిక ఏమిటంటే – బాకు నవల సంపాదించి మళ్లీ ఓసారి చదవాలని… నేను ఇప్పటికే మొదలు పెట్టిన ఓ నవల రాయాలని…

(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అబ్బూరి రామకృష్ణారావు – అబ్బూరి వరదరాజేశ్వర రావు కీర్తి పురస్కారం అందుకున్న సందర్భంగా..)

- కాసుల ప్రతాపరెడ్డి, ఎడిటర్ వన్ ఇండియా తెలుగు

మనుషుల కంటే అక్షరాలే ఎంతో ఇష్టం: కృష్ణుడు
ఒక కృష్ణుడు పొద్దున్నే లేచి రాత్రి దాకా వార్తల వేటలో రాజధానిని గాలిస్తూ వుంటాడు. ఇంకో కృష్ణుడు ఆ వార్తల కింద నలిగిపోతున్న పీడితుల గుండె చప్పుళ్లని అక్షరాల్లోకి తర్జుమా చేసి తన గుండె తడిని వాటికి అద్దుతూ వుంటాడు. ఆ మొదటి కృష్ణుడూ ఈ రెండో కృష్ణుడూ ఇద్దరూ ఇద్దరే! రెండు భిన్నమయిన రంగస్థలాల్లో నిలబడి రెండు చేతులా లోకాన్ని ఆవాహన చేసుకొని, నిండు గుండెలు పట్టేటంతగా ఆ లోకాన్ని ప్రేమిస్తూ, అప్పుడప్పుడూ కాస్త కోప్పడ్తూ…! కొప్పడేటప్పుడు ఎంత ప్రేమించామో చెబ్తూ, ప్రేమించేటప్పుడు ఎంత కోప్పడ్డామో చెప్తూ…ఈ లోకం లయ తప్పకూడదని తపన పడుతూ…! కృష్ణుడు కవిత్వంలాగా కబుర్లు చెప్తాడు, కబుర్లలాగా కవిత్వం చెప్తాడు. ఆ రెండీటిలోనూ తన మనసు పొట్లం కట్టి మనకందిస్తాడు…అందుకే ఈ కరచాలనం విలువయింది. వెల లేనిది…మన వాకిట్లో కాసేపు వొక మనసు అలికిడి…కవిత్వంలో ఆలూరి బైరాగి పురస్కారం అందుకున్న సందర్భంగా…

అక్షరమంటే నా కెంతో ప్రేమో?

మనుషుల కంటే నాకు అక్షరాలే ఎంతో ఇష్టం. ఎందుకంటే మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అక్షరాలు కనపడితే వారితో మాటల మధ్యే నా కళ్లు అక్షరాలను హత్తుకుంటాయి.

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేను పుట్టానని మా అమ్మ చెప్పింది. మా తాత అప్పరసు లక్ష్మీ నరసింహారావు గోలకొండ కవుల్లో ఒకరు. ఆయన తండ్రి ( మా ముత్తాత) ఒకప్పటి కర్ణాటకలో భాగమైన గద్వాల సంస్థానంలో మంత్రిగా ఉండేవారట. మా ఇంటిపేరులోని అరసు కర్ణాటక మూలాల గురించి నా పరిశోధన ఇంకా సాగుతోంది. అగణిత భోగభాగ్యముల ఆసవహింపగలేదు కాని అని మా తాత తన వీర రాఘవ శతకంలో రాసిన పద్యం ఇప్పటికీ నా చెవుల్లో నిత్యం ప్రకంపిస్తూ ఉంటుంది. అవును.. అక్షరం ముందు భోగభాగ్యాలెంత?

మేము అయిదుగురు అన్నదమ్ములము. అయితే మా తాతకు మా పెద్దన్న అయిన విజయరామారావు, మూడోవాడైన నామీద ఎక్కువ ప్రేమ అని చెప్పేవారు. ఆయన వద్ద ఎక్కువకాలం పెరిగినందువల్ల మా పెద్దన్న సంస్క­ృత పండితుడైనాడు. నాతో చిన్నప్పుడు అమరకోశం, భారత, భాగవతాలు, అన్నిసూక్తాలు చదివించేవారు. యస్యజ్ఞాన దయాసింధో అని చదివి, వెంటనే గోడ దూకితే అదే సందో…అని జోకులు వేసుకుని నవ్వుకునేవారం. రెండేళ్ల వయస్సులో భాగవతంలో భక్తి ఘట్టాలు చదువుతుంటే నా కళ్లలోంచి నీరు కారుతుంటే మా నాన్నమ్న అది భక్తి పారవశ్యమని భావించి నాకు మొక్కిన విషయం ఇంకా గుర్తుంది. బహుశా అది కళ్లు మండి కారిన నీరు కావచ్చు.

చదువు పట్ల నా ఆకాంక్ష గమనించి మూడేళ్ల వయస్సులోనే నాకు అయిదేళ్లని రాయించి మహబూబ్‌నగర్‌లోని బేసిక్ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో చదివించారు. ఇక్కడ తెలుగుమాస్టారు ఆచార్య సార్ నాకింకా గుర్తు. చక్కగా, తప్పుల్లేకుండా, గుండ్రంగా రాస్తే సంతకంలో ఒక బొమ్మ గీసేవారు. ఈ బొమ్మ సంతకం కోసం ఎంత కష్టపడేవాడినో.ఈవయస్సులోనే ప్రక్కనే ఉన్న కలెక్టరాఫీసుకు వెళ్లి నేను, నా స్నేహితులు ఎవర్నీ అడక్కుండా టేబుల్‌పై ఉన్న కాగితాలను వెనుకవైపు రాసుకునేందుకు తెచ్చుకునేవాళ్లం. ఒకరోజు మా స్కూలు ముందు జీపు అగి పోలీసులు, అధికారులు దిగారు. మా బ్యాగుల్ని వెతికి వారి ఆఫీసు కాగితాలను తీసుకువెళ్లి హెడ్‌మాస్టర్‌ని తిట్టి వెళ్లారు. మా వీపులపై విమానాలు మోగాయి. ఇదే స్కూలులో ఆరోతరగతి వరకు చదివాక కుటుంబం హైదరాబాద్ పాతబస్తీ తరలి వెళ్లింది. అప్పుడదే సిటీ. ఆరోతరగతిలో కూడా ప్రేమలుంటాయని, ఆడ, మగ దొంగచూపులు చూసుకుంటారని నాకు అప్పుడే తేలిసింది. అప్పటి మా క్లాసులో ఉన్న వకుళ అనే అమ్మాయి నాకింకా గుర్తుంది.

నాకు మొదటి సన్మానం గుడిలో జరిగింది. అయిదారేళ్ల వయస్సులో పాతబస్తీలోని ఫూల్‌బాగ్ లోని వెంకటేశ్వరుడి గుడిలో అయ్యగారు(పూజారి) పురుషసూక్తం చదువుతుంటే నేనుకూడా చదవడం ప్రారంభించాను. ఆయన నన్ను గర్భగుడిలోకి పిలిచి మొత్తం నాతో చదివించి, చివరకు దేవుడి మెడలోంచి పూలదండ తీసి నా మెడలో వేసి సన్మానించారు. గర్వంతో ఉప్పొంగిపోయి ఆ పూలదండ తీయకుండా దోస్తులతో ఊరేగింపుగా అల్యాబాద్‌లో ఉన్న మా యాదగిరి రావు తాత (మా అమ్మ వాళ్ల నాన్న) ఇంటికి వెళ్లాను. అంతా సంతోషించినప్పటికీ ఊరేగింపుగా వచ్చిన వైనం విని నవ్వుకున్నారు.

పెద్దగా వివరించకుండా చెప్పాల్సిన విషయం ఏమంటే నా బాల్యమంతా పేదరికంలోనేగడిచింది. సహకార శాఖలో పనిచేస్తున్న మానాన్నకు రెండు, మూడునెలలకోసారి జీతం వచ్చేది. వచ్చిన పదిరోజుల్లోనే జీతం అయిపోయేది. మిగతా కాలం అప్పులతోనేగడిచేది. అప్పు దొరకని రోజు పస్తులే. కాళ్లకు చెప్పులు లేకుండా పదోతరగతి వరకు స్కూలుకు వెళ్లాను. బీద విద్యార్థులకు ఇచ్చే పూర్ ఫండ్ నుంచి పుస్తకాలు తెచ్చుకునేవాడిని. లాగులు చిరిగితే వెనుక గుడ్డ వేసి కుట్టి మా అమ్మ స్కూలుకు పంపించేది. ఈపరిస్థితుల్లో కూడా మా ఇంటికి ఏదో రకంగా ఆంధ్రప్రభ, చందమామ వచ్చేవి. వాటికోసం అన్నదమ్ములం కొట్లాడుకునేవారం. ఊళ్లో లైబ్రరీని వెతుక్కుంటూ మైళ్లకు మైళ్లు నడవడం మాకు అలవాటు. పుస్తకాలు చదివే అలవాటు, ఏదో ఒకటిరాయాలన్న తపన, సున్నితత్వం, అదే సమయంలో అన్యాయాన్నిసహించలేని ప్రతిఘటనా తత్వం, చేయి చాచి ఎవర్నీ ఏదీ అడగలేని అహం, పిరికితనం బ్రద్దలైన ధైర్యం, విశ్లేషణా శక్తి, మేధావితనం మొదలైన అనేక లక్షణాలు వీటన్నిటి వెనుక కేవలం కుటుంబంలో పెంపకం మాత్రమే కారణం కాకపోవచ్చు. దాని వెనుక పారంపర చరిత్ర కూడా ఉంటుందని నా అనుమానం.

ఏడో తరగతి నుంచే కొద్దిగా సాహిత్యం పట్ల అభిరుచి ప్రారంభమైంది. పాతబస్తీలోని కాల్వగడ్డ స్కూలుసమీపంలోని చమన్ (పూలతోట)లో ఉన్న ఒక గ్రంథాలయం ఈ అభిరుచికి బీజం వేసింది. పుస్తకాలు ఇంటికి ఇవ్వమంటే లైబ్రరీయన్ నాతో లైబ్రరీ పనిచేయించేవాడు. వంద లేబుల్స్ అంటిస్తే ఒక పుస్తకం ఇంటికి ఇచ్చేవాడు. ఒకసారి ఒక పుస్తకాన్ని కడుపులో పెట్టుకుని తస్కరించా. రాత్రంతా నన్ను పోలీసులు అరెస్టు చేశారని, అంతా నన్ను దొంగాదొంగాఅన్నారని భయపడుతూ నిద్రలో కలవరించానట. పొద్దున్నే వెళ్లి ఆ పుస్తకాన్ని మళ్లీ లైబ్రరీలో ఉంచాను. మా పెద్దన్న మూలంగా సంస్క­ృతం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆర్యసమాజ్ నిర్వహించే సంస్క­ృత క్లాసులకువెళ్లాను దండి నరసింహ అనే ఆయన అద్భుతంగా పాఠాలు చెప్పేవాడు. పెద్దన్న ప్రభావం వల్లే ఏకపాత్రాభినయం కూడా చేసేవాడిని. గౌలీపురాలోని మేతర్‌వాడి (పాకీ వాళ్లుండే వాడ)లో ఉన్న సుల్తాన్ షాహీస్కూలులో 8వ తరగతి చదువుతుండగా ఏకపాత్రాభినయం చేస్తే ఒక ముస్లిం సార్ ఇంటికి తీసుకువెళ్లాడు. వాళ్ల భార్యా పిల్లలు బురఖాలు కప్పుకుని కూర్చుని ఉండగా వారి ముందు నాతో దుర్యోధన ఏకపాత్రాభినయం చేయించాడు. నా అనర్గళ వాక్ప్రవాహం వారికి అర్థం కాకపోయినా ఆ ధాటికి ముగ్ఘులై కరతాళ ధ్వనులుచేశారు. ఆ సార్ నాకు చారానా (25 పైసలు) ఇచ్చాడు. ఇది నాకు రెండో సన్మానం. ఇంటికి రాగానే మా అన్నయ్య వేళాకోళంగా వాళ్లు చదవమంటే చదివి చారానా అడుక్కుంటావా అని అపహాస్యం చేశాడు దీనితో చారానా విసిరికొట్టాను. తర్వాత ఎంత వెతికినా దొరక లేదు. పాతబస్తీలో వినాయకచవితి సందర్భంగా నా ఏకపాత్రాభినయం అందరికీ ఆకర్షణ. మా మాతామహుడు యాదగిరిరావు స్నేహితుడైన వేదగిరి రావు నన్ను ఇతర పిల్లలతో కలిసి రేడియో బాలానందం కార్యక్రమాలకు కూడా తీసుకువెళ్లేవారు.

ఆ రోజుల్లో మా పెద్దన్న, గౌతంబాబు లాంటి పాతబస్తీ సాహితీ మిత్రులు నిర్వహించిన అభినవ కళా సాహితి, ఎస్వీరామారావు లాంటి వారు నడిపిన హైపారసం(హైదరాబాద్ పాతబస్తీ రచయితల సంఘం), ప్రబంధ కావ్యాలపై మా పెద్దన్న వరుసగా ఇచ్చిన ఉపన్యాసాలు, దండినరసింహ నిర్వహించిన సంస్క­ృత పాఠాలు, గౌలీపురాలో ఉన్న భారత గుణవర్ధక సంస్థ లో ఉన్న పాత పుస్తకాలు, ఫూల్‌బాగ్ గుడిలో దివాకర్ల వెంకటావధాని ప్రభృతుల సాహిత్యకార్యక్రమాలు, కందికల్ మెట్‌గుడిలో పండితులు చెప్పే ప్రవచనాలు, మేకలబండలోని చిరు గ్రంథాలయంలో ఆర్యసమాజ్ మందిరంలో భగవద్గీత పాఠాలు నా పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. మా అన్నదమ్ములం పద్యాలు పోటీపడి చదివేవారం. నాకు వేయి పద్యాలు వచ్చని ఒకరంటే నేను రెండువేలు చదువుతా.. అని మరొకరం అనుకునేవారం. భారత, భాగవత పద్యాలే కాదు, అల్లసాని పెద్దన పూతమెరుంగులుం, అన్న 15 లైన్ల ఉత్పల మాల మాకు కంఠతా వచ్చేవి. వాటితో పాటు శ్రీశ్రీ, గురజాడ కవితలనుకూడా మేము పోటీపడిచదివేవారం. అనుకోకుండానే మేము తెలుగు సాహిత్యాన్ని ఒక సిలబస్‌గా చదివేవారం. కవిత్రయం, ప్రబంధాలు సరేసరి.. వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, శ్రీశ్రీ,ఉన్నవ, దేవులపల్లి, రాయప్రోలు, మొక్కపాటి, విశ్వనాథ, శ్రీపాద, రావిశాస్త్రి, కుటుంబరావు, దిగంబర కవిత్వం.. ఇలా చదవడం అనేది యుక్తవయస్సులోనే అలవాటైంది. వరుసకు మా మేనమామ అయిన కోవూరుగోపాల కిషన్‌రావు రచించిన తెలుగుపై ఉర్దూపారిశీకాల ప్రభావం అన్న పుస్తకం మాకుచిన్నప్పుడు ఆటవస్తువు. అందులో ఛీఛీ ఒరే పాతుకా, ఘాతుకా.. బేకుఫ్, బేమానీ. లుచ్చా.. హరంకోరు బచ్చా.. అన్న తిట్ల దండకం మాకు ఒకరిపై మరొకరు ప్రయోగించడానికి ఉపయోగపడేది. మా నాన్న మేనమామ మడుపు కులశేఖర్ రావు అప్పుడప్పుడూ రావడం, ఆయన రచించిన తెలుగు సాహిత్య చరిత్ర, మరో మేనమాన మడుపు శేషారావు రచించిన భక్తిపద్యాలు చదవడం కూడా ఒక అనుభవం. మా పెద్దన్న, ఆర్వీరామారావు ఇద్దరూ కలిసి సంస్క­ృతంలో ఎంఏ చేస్తూ కలిసి అధ్యయనం చేసేవారు. నిజానికి మా పెద్దన్న లైబ్రరీయే మాకు ప్రథమ పాఠశాల.

ఇదంతా ఒక ఎత్తు. మా నాన్న నా పై చూపిన ప్రభావం మరో ఎత్తు. నా ఊహ తెలిసిన తర్వాత ఆయన తన విద్యార్థి కాలంలో కమ్యూనిస్టు ఉద్యమకారుడని అర్థమైంది. ఖమ్మంలో ఉద్యమకారుల సమావేశంపై పోలీసులు దాడి చేసినప్పుడు తాను ఇళ్ల కప్పులపైనుంచి పరిగెత్తి ఎలా పారిపోయారో ఆయన చెప్పేవారు. ఆయన ప్రముఖ విప్లవకారుడు, కవి మఖ్దూం మొహియుద్దీన్ సహచరుడుగా పనిచేసేవారు. మఖ్దూం నిర్వహించిన సాహిత్య పాఠశాలలు, తమకు ఇచ్చే మొట్టికాయల గురించి చెప్పేవారు. మఖ్దూం ఇళ్లలో పాలమ్ముతూ రహస్య ప్రచారం చేసేవారని, తాను ఆయనకు కొరియర్‌గా పనిచేసేవారని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఎంటిఖాన్ అనే ప్రముఖ విప్లవ రచయిత మా ఇంటికి వచ్చి మా నాన్నను చూసి ఆశ్చర్యపోయారు. మా నాన్న పరిస్థితీ అంతే . ఇరువురూ గట్టిగా కౌగలించుకున్నారు. వారిద్దరూ కొరియర్లుగా పనిచేసేవారని చెప్పారు. మా నాన్న ఒక లైటు స్తంభం వద్ద చీటీ ఉంచితే కొద్దిసేపు తర్వాత ఖాన్ వచ్చి దాన్ని తీసుకువెళ్లేవారు. ఇరువురూ ఎదురుపడినా మాట్లాడుకోకుండా తప్పుకునేవారట. మా ఇంటికి ఎవరెవరో వచ్చేవారు. వారిలో ఎక్కువగా ముస్లింలు. మా నాన్న సహచరుడైన రహీం సాబ్ ,హమీద్ అలీ నాకింకా గుర్తున్నారు. యాకుత్‌పురాలో వాళ్ల ఇళ్లకు వెళ్లాను. మానాన్న తన స్నేహితులతో మాట్లాడే మాటల్లో కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, సాహిత్యం దొర్లేవి. అవన్నీ నాకు అర్థమయ్యేవి కావు. మా నాన్న ఉర్దూలో కవితలు రాసేవారని, సియాసత్ అన్న ఉర్దూ దినపత్రికలో కొంతకాలం పనిచేశారని కూడా నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. మా నాన్న కాలక్షేపంగా జాసూసీదునియా లాంటి ఉర్దూ పత్రికలేకాదు, వేయిపడగలు, పురాణ వైర గ్రంథమాల మొదలైన విశ్వనాథ రచనలు కూడా చదివేవారు. మా పెదనాన్న శ్యామసుందర్ రావు (తర్వాతి కాలంలో ఎమ్మెల్సీ) వేరే స్కూలలో హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. ఆయన కూడా కమ్యూనిస్టు పార్టీసభ్యుడే. ఇంగ్లీషు పై ఆయనకు పట్టు ఉండేది. మా నాన్న, పెదనాన్న ఇద్దరూ పిల్లలతో దోస్తుల్లా ఉండేవారు. మా నాన్న అయితే నేను ఏదైనా వాదిస్తే దానికి వ్యతిరేకంగా వాదించి నా నోరు మూయించేవారు. ఈపద్దతి వల్ల నాకు తార్కిక శక్తితో పాటు రెండుకోణాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని నాకు అర్థమైంది.

వీటన్నిటి ప్రభావం నా పై పడిందని చెప్పక తప్పదు. చుట్టుప్రక్క ఇళ్లనుంచి పాత పుస్తకాలు తీసుకువచ్చి మేకల్‌బండలోని మా ఇంటి డాబాపై సాయంకాల గ్రంథాలయం నడిపాను. రిపబ్లిక్ డే, స్వాతంత్య్రదినోత్సవం రోజు స్నేహితులతో జెండా ఎగురేసేవాళ్లం. ఆ రోజుల్లో ఒక హైలైట్- బాలభాను పేరిట ఒక పిల్లల లిఖిత పత్రికను ప్రారంభించి పాతబస్తీలోని చమన్ లైబ్రరీలో ప్రతినెలా ఉంచేవాడిని. అప్పుడు నాకు పన్నెండేళ్లు కావచ్చు. నేనుసంపాదకుడినికాగా, మా తమ్ముడు శ్రీనివాసరావు(ఇప్పుడు హైదరాబాద్‌లో ఇండియాటుడే గ్రూప్‌లో పొలిటికల్ ఎడిటర్), మా చిన్నాన్న వాళ్ల అబ్బాయి ఉపేందర్ రావు (కొంతకాలం సినిమాలతోచేయి కాల్చుకుని సాక్షిలో చిరుద్యోగం చేస్తున్న మేధావి),ఒకరిద్దరు మిత్రులం ఈ లిఖిత పత్రికను నిర్వహించేవాళ్లం. లైబ్రరీలో వేరే పుస్తకంచదువుతున్నా, మా పత్రిక ఎవరైనా చదువుతుంటే మా ఆనందమే వేరు.

నా తొలికవిత కలువ పూవుపై. సుల్తాన్‌షాహి స్కూల్‌లో ఎనిమిదో తరగతిలో మా తెలుగుసార్ కవితల ప్రత్యేకత గురించి చెబుతున్నప్పుడు ప్రేరేపితుడినై కలువపూవుపై కవిత రాశాను. కటికచీకటిలోన కలువమా,కాంతి చెందెందవేలచెపుమా, నిశీథిలో అసురుడివలె ఎసరేక ఎల పెరిగెదవో.. అన్న కవిత రాశాను. చీకటిలో ప్రవర్ధమానమయ్యే కలువ పూవు జీవితం నన్ను ఆశ్చర్యపరిచింది. అదేసమయంలో ఘంటసాలచనిపోవడం నాకు బాధ కలిగించింది. గానశేఖరా,ఘంటసాలా,ఘన గాయక వెంకటేశ్వరా..నీ ప్రాణ దీపం ఆరినా, ఆరలేదు నీ గాన కాంతి.. అంటూ ఏదోదో రాసినా పిల్లవాడిని కాబట్టి అందరూ మెచ్చుకుని ప్రోత్సహించారు.

పదోతరగతి పూర్తయ్యాక మా నాన్న ఉద్యోగ రీత్యా వరంగల్‌రావడం నా జీవితంలో జరిగిన కీలక మార్పు. వరంగల్‌లో ఇంటర్ లాల్‌బహదూర్ కళాశాల, డిగ్రీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో చదివాను. ఎల్‌బికాలేజీలో అనుమాండ్లభూమయ్య,కిషన్ రావుతెలుగు చెప్పేవారు. సాహిత్యం పట్ల ప్రేమతో సుప్రసన్నాచార్య, సంపత్‌కుమార్ ఇళ్లకు కూడా వెళ్లేవాడిని. వాళ్లు నేనెవరన్నది ప్రశ్నించకుండా ఆదరంగా పిలిచి సాహిత్యం గురించి మాట్లాడేవాళ్లు. ఆధునిక, ప్రగతిశీల భావాలు ఒకవైపు, ప్రాచీన సాహిత్యం ముద్ర మరో వైపు నన్ను అప్పటికీ ఇప్పటికీ అటూ ఇటూ లాగుతూనేఉంటాయి. రామాయణ కల్పవృక్షాన్ని ఎంత అభిమానించేవాడినో, రామాయణ విషవృక్షం చదివి కూడా అంతే ఆనందించేవాడిని. అలనన్నయ్యకు లేదు అన్న పద్యం ఎంత అలరించేదో, శ్రీశ్రీ పదవిన్యాసం అంత నచ్చేది. . మనుచరిత్రను ప్రవరాఖ్యోపాఖ్యానం పేరిట పద్యాల్లో రాశాను. ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ మ్యాగజైన్‌లో వాణివి, వీణాపాణివి, సకల కళా రాణివి.. అని సరస్వతీదేవిపై కవిత రాశాను. అప్పుడు వరంగల్ నుంచి వెలువడుతున్న జన ధర్మలో ప్రాచీన సంప్రదాయం ప్రాముఖ్యతను తెలిపే ధర్మవస్త్రం.. అనే కవిత రాశాను. అనుమాండ్ల భూమయ్య నాయనిసుబ్బారావు పై ఎంఫిల్ చేస్తున్నప్పుడు ఆయనకు తోడుగా ఉండేవాడిని. ఈ ఎంఫిల్ పరిశోధన పుస్తకంగావచ్చినప్పుడు ఆయన నా పేరును కూడా ముందుమాటలో ప్రస్తావించారు. భూమయ్య పుణ్యమా అని నేను అనేక సాహితీ గ్రంథాలు, నవలలు చదివాను. ఇంటర్‌లో ఉండగా కూడా నేను దుర్యోధన ఏకపాత్రాభినయం, పలు నాటకాల్లో నటించడం, వక్త­ృత్వ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం చేశాను. ఫస్టియర్‌లో పన్నెండు,సెకండియర్‌లో పన్నెండు ప్రైజులువచ్చాయి.చదరంగం కూడా అప్పుడే ఆడడం ప్రారంభించాను. క్రమంగా ఈ ఆటలో కూడా పట్టువచ్చి బహుమతులు గెలుచుకున్నాను. శ్రీపాద రాసిన వడ్లగింజలు చదవడం నేను చెస్ నేర్చుకోవడానికి ప్రోద్బలం కలిగించింది. నేను కూడా తంగిరాల శంకరప్ప కావాలనుకున్నాను. వరంగల్‌లోకిషన్ పురలో ఉన్న మా ఇంటికి సమీపంలో ఒక ఇస్త్రీ షాపులో కొందరు చెస్ ఆడేవారు. నేను వారితో చేరేవాడిని. చాలా కాలం పాటు అదొక ఉన్మాదంలా సాగింది.

ఇంటర్‌లో ఉండగాసాంస్క­ృతీ సమాఖ్య నిర్వహించిన మినీకవితల పోటీలో పాల్గొన్నాను.వాళ్లురాష్ట్రస్థా<wbr>యిలో బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి తీసుకునేందుకు కష్టపడి విజయవాడ వెళ్లాను. అక్కడినుంచి వచ్చాక నాకు శిరీష్ కుమార్ (నున్న) నుంచి లేఖవచ్చింది. వరంగల్‌లో తాము నిర్వహిస్తున్న సాహితీ సమావేశంలో తెలుగుసాహిత్యంపై మార్క్సిజం ప్రభావంపై నేను మాట్లాడాలని ఆ లే ఖ సారాంశం. గతుక్కుమని అనుమాండ్ల భూమయ్య వద్దకు వెళ్లాను. ఆయన వెరీగుడ్ అని కుమారపల్లిలో వరవరరావు అనే సార్ ఉంటారు. ఆయన వద్దకు వెళితే చెబుతారు.. అని అన్నారు. ఒకరోజు పొద్దున్నే వరవరావు ఇంటికి వెళ్లాను.ఆయన అప్పుడు సికెఎం కాలేజీలో పాఠాలు చెప్పేవారు. ఆయన క్లాసుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోయేవారని అనేవారు. నేను వెళ్లేసరికి నీటుగాతెల్లదుస్తుల్లో ఆయన కాలేజీకి వెళుతున్నారు. రేపు రండి.. అని చెప్పారు. పట్టువదలకుండా మర్నాడు వెళ్లాను. ఆ తర్వాత ఆయన రమ్మన్నప్పుడల్లా వెళ్లాను. ఆయన ఇచ్చిన పుస్తకాలన్నీ చదివాను. లైబ్రరీకి వెళ్లి ఇంకా అధ్యయనంచేశాను. చివరకు సాంస్క­ృతీ సమాఖ్య వేదికపై సుప్రసన్న అధ్యక్షతన జరిగినసభలో నేను చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. సభకు వరవరరావు హాజరయ్యారని నాకుతెలియదు. ఆయన దగ్గరికి వచ్చి అభినందించేసరికి నేను ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆ తర్వాత నేను ఆయన ఇంటికి తరుచూ వెళ్లడం, ఆయన నన్ను సృజనలో రచనలు నిర్ణయించే సాహితీ మిత్రుల్లో చేర్చడం, నాకు తెలియకుండానే నేను విప్లవరచయితలసంఘంలో చేరిపోవడం యాదృచ్చికంగా జరిగింది. వర వరరావు ఇంట్లోనే రాత్రింబగళ్లు జరిగిన సాహితీ సమావేశాల్లో పాల్గొనేవాడిని. ఒక ప్రజాస్వామిక వాతావరణం అంటే ఎలా ఉంటుందో, చిన్నా, పెద్దా, కులమత భేదాలు ఎలా చెరిపివేయవచ్చో అక్కడే నాకు అర్థం అయింది. ఎన్‌కె, రామ్మోహన రాజు, గంగాధర్, జగన్మోహనాచారి, అల్లం రాజయ్య, ఎన్. వే ణుగోపాల్, సి.వి. సుబ్బారావు (సురా)మొదలైన వాళ్లంతా నాకు అక్కడే సన్నిహితులయ్యారు. రామ్మోహనరాజు వసంత మేఘం, ఎన్‌కె లాల్‌బనో గులామీ చోఢో గొంతెత్తి చదవడం నా జ్ఞాపకాలపొరల్నిఇంకా ప్రకంపింప చేస్తున్నాయి. సురా ఢిల్లీ నుంచి వచ్చారంటే అదో సందడి. ఆయన ఈశాన్యం, ఢిల్లీ రాజకీయాలు, పోరాటాల గురించి వివరించేవారు. సాహితీ మిత్రులతో బాలగోపాల్ పరిచయం నా సమక్షంలోనే జరిగింది. ఆయన అప్పుడే ఢిల్లీనుంచి కాకతీయ యూనివర్సిటీలో పనిచేసేందుకు వచ్చారు. శేషేంద్ర శర్మ కవిత్వంపై ఆయన సృజనలో తొలివ్యాసం రాశారు. బాలగోపాల్‌తో పరిచయం అనుబంధంగా మారింది. ఆయన డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి రకరకాల పుస్తకాలపై చర్చించేవాడిని. జగన్మోహనాచారి(జేసి) మూలంగా నాకు జార్జిథామ్సన్, క్రిస్టఫర్ కాడ్వెల్ పరిచయం . ఆయన కాలేజీలో మాకు ఇంగ్లీషు లెక్చెరర్ అయినప్పటికీ బస్‌స్టాప్‌లో నన్ను చూడగానే రిక్షా ఎక్కించుకుని సాహిత్యం గురించి మాట్లాడుతూ కాలేజీకి తీసుకువెళ్లేవారు. మిగతా విద్యార్థులను చూసి నేను గర్వంగా పోజుకొట్టేవాడిని. వచనకవిత్వంపై నా తొలి సాహితీ వ్యాసం 80లోనే సృజనలో వచ్చింది. ఆ తర్వాత వరంగల్ నిర్బంధాన్ని చిత్రిస్తూ రాసిన నగరం కవిత కూడా సృజనలోనే వచ్చింది. మరెన్నో కవితలు ఆ తర్వాత వివిధ సాహితీ పత్రికల్లో వచ్చాయి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇస్మాయిల్ కవిత సీతాకోక చిలుకకు పోటీగా మరోకవిత రాశాను.</wbr>

డిగ్రీలో నా సాహిత్య వ్యాపకం మరింత పదునెక్కింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాత్యాయనీ విద్మహే మా లెక్చెరర్. అయితే ఆమె తండ్రి అయిన కేతవరపు రామకోటి శాస్త్రి, వరవరరావు దగ్గర నన్ను చూసినందువల్ల ఆమె ఎంతో గౌరవంగా ఉండేవారు. కాలేజీలో ఒకఏడాది సాహిత్య పత్రికకు సంపాదకుడిని నేనే. విరసం ప్రభావంలో ఉన్నప్పటికీ నేను కేవలం విప్లవసాహిత్యం మాత్రమే కాకుండా అన్ని రకాల కవితలను, రచనలను ప్రచురించాను.. త్రిపురనేని మధుసూధనరావు, గతితార్కిక భౌతిక వాదంపై విశ్లేషణను ప్రచురించాను. నేను బికామ్‌లో ఉంటే ఎన్‌వేణుగోపాల్ బిఏలో ఉండేవారు. త్రిపురనేని, అద్దేపల్లి, మందలపర్తి కిషోర్ మొదలైన అనేకమందితో నిరంతరం ఉత్తరాలతో సాహిత్య, సైద్దాంతిక చ ర్చ చేసేవాడిని.

ఆర్థిక పరిస్థితుల రీత్యా డిగ్రీతర్వాత ఉద్యోగంచేయక తప్పలేదు. లాకాలేజీలోను, ఎంకామ్‌లోనూ సీట్లు వచ్చినా చదివే స్థితిలో లేను. ఆ తర్వాతి కాలంలోనే ఉద్యోగంలో చేరాక ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్‌గా పూర్తిచేశాను. కొద్ది కాలం సిర్పూర్ పేపర్‌మిల్లులో పనిచేశాక. 83లో మా చిన్నాన్న పిలుపుపై ఆయన ప్రారంభించిన బ్రిస్టల్ ఫార్మస్యుటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నాను. వరవరరావు కుమార్తెలే నా అవస్త గమనించి వరంగల్‌లో ఇన్‌స్టాల్ మెంట్ పద్దతిపై సైకిల్ ఇప్పించారు. దాన్ని వరంగల్‌లో బస్ ఎక్కించి హైదరాబాద్ తీసుకువచ్చాను. రోజూ మాదన్నపేట నుంచి హిమాయత్‌నగర్‌లోని మా చిన్నాన్న ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లేవాడిని. విరసం సిటీయూనిట్ సమావేశాల్లో పాల్గొనేవాడిని. సిటీయూనిట్‌లో ఆర్‌కె, హెచ్చార్కె, జయ,అమర్, సుధ, విమల,సివి సుబ్బారావు, వేణు, నారాయణ స్వామి, సుధాకర్ ఇలా ఎందరో ప్రతిభావంతులైన సాహితీ మిత్రులతో పరిచయం. సారస్వత పరిషత్ హాలులో సమావేశాలు జరిగినప్పుడల్లా సాహిత్య పుస్తకాలు అమ్మేవాడిని. సాహితీ సమావేశాల్లో ప్రసంగించడం కూడా మొదలైంది. ఒక సమావేశంలో త్రిపురనేని శ్రీశ్రీ మీద మాట్లాడాల్సి ఉండగా, నేను ఆ సభకు అధ్యక్షత వహించి నేనే చాలా సేపు శ్రీశ్రీమీద ప్రసంగించాను. మాట్లాడడానికి నాకింకేం మిగిల్చావు.. అని త్రిపురనేని అన్నారు. బహిరంగ సభల్లో, మేడే మీటింగ్‌లలో, విద్యార్థి సమావేశాల్లో కూడా క్రమంగా మాట్లాడేందుకు నన్ను ప్రోత్సహించేవారు. గద్దర్‌తో కలిసి కూడా సభల్లో మాట్లాడాను. త్రిపురనేని శ్రీనివాస్, సౌదా కవిత్వం పరంగా నాకు సన్నిహితులయ్యారు. పౌరహక్కుల సంఘం సమావేశాలకు కూడా వెళ్లేవాడిని. 83లో ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో సాహితీ చౌరస్తా అనే కాలమ్ రాసేవాడిని. వీధుల్లోకవిత్వంపేరిట ఫాబ్లో నెరుడా గురించితొలుత విస్త­ృతంగా రాసింది నేనే. జర్నలిజంకు సంబంధించి రోడ్డుప్రక్కన పనికోసం నిలుచునే రోడ్డుకూలీల పై ఆంధ్రభూమిలో రాసిన వార్తావ్యాసమే తొలి రచన.

మా చిన్నాన్న కంపెనీలో నేను పడే ఇబ్బందులు గమనించిన వసంత లక్ష్మి, అమర్ ఉదయంలో చేరమని సలహాఇచ్చి ఎబికె, వాసుదేవరావులకు పరిచయంచేశారు. వాళ్లు పెట్టిన పరీక్షలో సులభంగానే నెగ్గాను. ఉదయంలో సబ్ఎడిటర్‌గాచేరాక నా సాహిత్య గాఢతమరింత పెరిగింది. పతంజలి, దాట్ల, శివాజీ, సురేందర్ రాజు, కె. శ్రీనివాస్, హెచ్చార్కె, నామిని, దేవీప్రియ లాంటి వారితో కలిసి ఉంటే ఏం జరుగుతుందో అదే జరిగింది. మరో వైపు ద్వారకలో శివారెడ్డి, నందినీ సిద్దారెడ్డి బృందంతో ముషాయిరాలు. నిజానికి ఏ కవితా నా స్వంత పేరుతో రాయలేదు. జిజ్ఞాసి, కృష్ణ,,కృష్ణుడు ఇలారకరకాల పేర్లు పెట్టుకున్నాను. కవితలు రాస్తూనే సాహిత్య విమర్శపై దృష్టి పెట్టాను. అప్పటివరకూ సాహిత్య విమర్శ ఒక సాంప్రదాయ పద్దతిలో సాగేది. సినారె ఆధునాకాంధ్ర కవిత్వంపై రాసిన పిహెచ్‌డి గ్రంథమే చాలామందికి ప్రమాణం. అప్పుడప్పుడే వెల్చేరు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. నేను కవిత్వాన్ని, ఇతర రచనలను అప్పటి సామాజిక వాతావరణంతో బేరీజు వేసి సమాజం, వ్యక్తిలోనిసంక్షోభాన్ని, ఒకోసారి రచయిత నిజస్వరూపాన్ని కూడా అంచనా వేసేప్రయత్నం చేసేవాడిని. దీని వల్ల నా వ్యాసాల్లో విమర్శ తీవ్రత, కొత్త విశ్లేషణలు కనిపించేవి. మంచి పుస్తకం పరిచయం కావాలంటే కృష్ణుడితో సమీక్షింప చేయాలి.. అన్న అభిప్రాయం వచ్చేది. పతంజలి నాతో ఖాకీవనం, అప్పన్న సర్దార్, పెంపుడు జంతువులు, వీరబొబ్బిలి పుస్తకాలు సమీక్షింపచేశారు. అంతేకాదు, రావిశాస్త్రి, గుంటూరుశేషేంద్ర శర్మ, వరవరరావు, వెల్చేరు, శివారెడ్డి, సిధారెడ్డి, అఫ్సర్,సీతారామారావు, ప్రసేన్ మొదలైన హేమాహేమీలపుస్తకాలు సమీక్షించాను. వీరేశలింగం తో ప్రారంభమైన సాహితీ ప్రక్రియలను విశ్లేషించాను. పఠాభి లాంటి వారిని ఇంటర్య్యూచేశాను. తెలుగుసాహితీ విమర్శకు ఒక అయిదారేళ్లు ఒరవడిగా నిలిచాను.

తెలుగు కవితా రంగంలో అఫ్సర్ ప్రవేశాన్ని ,ఆయన బృందంలో ఆయన ప్రత్యేకతను కనిపెట్టి ఎత్తి చూపింది నేనే. అఫ్సర్ బృందానికి అఫ్సరీకులు అని పేరు పెట్టాను. నిజానికి ఉదయం దినపత్రికలో కొత్తకవుల గురించి నేను రాసిన చాలా రోజులకు చేకూరి రామారావు ఆంధ్రజ్యోతిలో చేరాతలు ప్రారంభించి కొత్త గొంతుకల ప్రత్యేకతను తెలిపారు. అయితే ఆయనది కేవలం కవిత్వ పరామర్శ. గ ణ విభజనల స్పర్శ. అయితే నేను కవిత్వం గాఢతను ఎత్తి చూపుతూనే సామాజిక దృక్కోణాన్ని వివరించే ప్రయత్నం చేశాను. మరల ఇదేల చేరాతలన్నచో.. అని ఆయన సాహితీ విమర్శలోని లేని అంశాల్ని నేను వివరిస్తూ ఉదయం లో రాసిన వ్యాసానికి ఆయన ప్రతిస్పందించారు. ఒకటి రెండువారాలు మా ఇద్దరి మధ్యా ఉదయంలో లేఖాగ్వివాదం జరిగింది.

1983 నుంచి 1992లో నేను ఢిల్లీ వచ్చేవరకూ ఎన్ని వ్యాసాలు, కవితలు రాశానో, ఏ పేరుతో, ఏ పత్రికలో రాశానో నాకే గుర్తు లేదు. ఈ 9 సంవత్సరాల్లో సాహిత్య, సామాజిక వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కుప్పకూలాయి. సోవియట్ యూనియన్ ఛిన్నాభిన్నమైంది. జర్మనీ విలీనమైంది. చైనా, పోలెండ్, లాటిన్ అమెరికా, పాకిస్తాన్ తదితర దేశాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత దేశంలో సంస్కరణలు ప్రారంభం కావడానిక ముందు భూమిక ఇది. ఈ భూమికలో భాగంగాఉద్యమాల అణిచివేత, సంక్షోభం, స్తబ్ధత తీవ్రతరమైంది. ఎన్నోతీవ్ర సంఘటనలు జరిగాయి. గుడిహాళం రఘునాథం, ఏసుపాదం తదితరులు అప్పటి తీరును ప్రశ్నిస్తూ విపశ్యన అనే కవితా సంకలనం రాశారు. మార్పుపై ఇంకా ఆశ కోల్పోని నేను, రామ్మోహనరాజు కలిసి దీనికి జవాబుగా సిస్టోలీ డయాస్టోలీ అనే కవితాసంకలనాన్ని వెలువరించాం. కానిపేర్లు పెట్టుకోలేదు.

కాని జరుగుతున్న పరిణామాలను అంగీకరించకుండా మనం నిలుచున్నచోట నిలుచుని, మన కలలే వాస్తవాలని అనుకుంటే ఎక్కువకాలం సాగదు. ముఖ్యంగా నాలాంటి ప్రవాహ శీలుర విషయంలో అది జరగదు. నా కాళ్ల క్రింద ప్రవహించిన నెత్తుటి చల్లదనాన్ని నేనుగుర్తించాను. ఒకసారి డిప్యూటేషన్‌పై విజయవాడ వెళ్లినప్పుడు నేను, నా యువమిత్రులంతా నేను బస చేసిన అధికార్ హోటల్లో చేరాం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మా ఆవేదనను చిత్రించి స్తబ్ధతను బ్రద్దలుచేయాలనుకున్నాం. నేను, అఫ్సర్, త్రిపురనేని శ్రీనివాస్, ప్రసేన్, నీలిమాగోపీచంద్,నరసింహాచారి కలిసి క్రితం తర్వాత అనే గొలుసు కవిత రాశాం. త్రిపురనేనిప్రారంభించిన కవిత్వంప్రచురణలులో ఇది తొలిపుస్తకం. విరసం సిద్దాంతానికి వ్యతిరేకంగా ఈ కవితాసంకలనంఉన్నదని భావించిన ఆ సంస్థ పెద్దలు నన్ను సంజాయిషీ అడిగారు. అందులో ఉన్నవి నాఅభిప్రాయాలేనని, వాటితో ఏకీభవించకపోతే నన్ను విరసం సభ్యుడుగా భావించకూడదని తిరిగి లేఖ రాశాను. అంతటితో విరసంతో నా భౌతిక అనుబంధం తెగిపోయింది. సికిందరాబాద్ కుట్రకేసులో రచయితలతో కలిసి అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్లి అరెస్టై విడుదల కావడం, తోటి జర్నలిస్టు గులాంరసూల్ హత్యకు నిరసనగా జర్నలిస్టులతో కలిసి ధర్నా నిర్వహించడం లాంటివి తప్ప అజ్ఞాత ఉద్యమ కార్యక్రమాలేవీ చేయలేదు. ఒక చేతిలో పెన్ను, మరో చేతుల్లో గన్ను నినాదంపై నాకు ఏకాభిప్రాయం లేదు. పెన్ను పెన్నే, గన్ను గన్నే..అనేది నా అభిప్రాయం. బహుశా ఈ విషయంలో కొన్ని పరిణామాలు జీర్ణించుకోలేనందువల్లే అప్రయత్నంగా విరసం నుంచి బయటకు వచ్చానేమో. అయిన్పటికీ శ్రీకాకుళం, గుంటూరు,హైదరాబాద్ మొదలైన అనేక ప్రాంతాల్లో జరిగిన విరసం మహాసభల్లో నాకు అపూర్వ అనుభవాలున్నాయి. నా చైతన్యాన్ని రగిల్చిన సందర్భాలున్నాయి. కాని అవన్నీ విరసంకూ చరిత్ర.. నాకూ చరిత్ర. వివరించి చెప్పడం అసందర్భం. బహుశా నా నేపథ్యం,మనస్తత్వం, ఇతర పరిణామాలు విరసంతో నా అధ్యాయాన్ని ముగించాయేమో.. ఆ తర్వాత కొద్ది రోజులకు నా వివాహం, తర్వాత ఢిల్లీరావడం జరిగాయి.

ఢిల్లీ వచ్చాక నా ఆలోచనా ధోరణి మారిపోయింది. ప్రాపంచిక దృక్పథం మరింత విస్త­ృతమైంది. బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్ అల్లర్లు చూశాను. సంస్కరణల యుగం కళ్లముందే మారిపోయింది. ఒకప్పటి వాదనలకు, మనుషులకు కాలం చెల్లడం గమనించాను. గ్లోబలైజేషన్ పేరిట జరుగుతున్న దుర్మార్గాల్ని గమనించాను. విదేశాంగ నీతి అటుంచి, అంతర్గత విషయాల్లో కూడా మన ప్రభుత్వాల పాత్ర తగ్గిపోవడం గమనించాను. సంస్థల స్వేచ్చ అటుంచి ముందు వ్యక్తి ఆలోచించడానికి స్వేచ్చ లభించడమే మహా ప్రసాదం అనుకున్నాను. అందువల్లే పూర్తిగా వృత్తి జీవిని కానీ, కుటుంబ జీవి కానీ కాలేకపోయాను. ఒక సామాజిక జీవిగా మారే క్రమంలో చరిత్రను రికార్డు చేస్తూ చరిత్రలో భాగస్వామి కాక తప్పదని గ్రహించాను. రచనల సంఖ్య తగ్గినప్పటికీ ఆలోచనల తీవ్రత పెరిగింది. యాంత్రికంగా రాయలేను కనుక గుండె కొట్టుకున్నప్పుడల్లా రచించకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాను. ప్రవాహంపై సూర్యకాంతి పడుతున్నప్పుడు వెలుగే ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. నా రచనలు ఈ వెలుగులా ప్రవాహాన్ని మెరిపిస్తుంటాయి. కాని ప్రవాహంలో వెలుగు శాశ్వతం కాదని నాకు తెలుసు.

పల్లె జీవితమే నా జీవరాగం :కె.వరలక్ష్మి
నవల,వ్యాసం, పొయెట్రీ  రాసినా కూడా సాహిత్య ప్రక్రియల్లో నాకు ఇష్టమైంది కథ.

రచనలు నా జీవితానికొక అర్థాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. అంత వరకూ నాలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాయి.

రవీంద్రుడి గీతాంజలి నాకు ఇష్టమైన పుస్తకం. శరత్ సాహిత్యం ప్రభావంతో పత్రికల్లో ఏదైనా మంచి కథలు చదివినప్పుడు నేను కూడా రాస్తే బావుణ్నని అనిపించేది. ముఖ్యంగా రంగనాయకమ్మ, కాళీపట్నం రామారావు గారి కథలు చదివినప్పుడు పట్టి కుదిపి వేసి రాయకుండా ఉండలేకపోయాను. హైస్కూల్ లో చదువుతున్న రోజుల్లో రంగనాయకమ్మ గారి బలిపీఠం సీరియల్ గా వస్తూ ఉండేది. ఆ కథా వస్తువు,రచనా శైలి చాలా నచ్చి నేను అలా రాయడానికి ప్రయత్నించాను.

ప్రచురింపబడిన మొదటి కథ జ్యోతి మంత్లీ లో వచ్చిన ‘రిక్షా’ . నా చుట్టూ ఉన్న చిన్న వాతావరణం లోంచి పుట్టిన కథ అది. అది స్వీయానుభవం కూడా. ఆ కథలో రిక్షా వాలా టీచర్ ని డబ్బు విషయం లో మోసం చెయ్యడం ఇతివృత్తం. ఆ కథ ప్రచురింపబడినప్పుడు చదివితే, తర్వాత రిక్షా వాలా జీవితం గమనిస్తేను ఆ కథ అలా చెప్పి ఉండకూడదనిపించింది. అతని జీవితంలో ఆర్థిక కారణాలు అతడలా ప్రవర్తించడానికి దోహదపడ్డాయి.  అది అర్థం అయ్యాక ఇంకెప్పుడూ నేనలాంటి కథ రాయలేదు.రచయితగా నేనెవరి తరఫున నిలబడాలో అప్పుడే నిర్ణయించుకున్నాను.

నేను పుట్టి పెరిగిన పల్లె వాతవరణం లోనే తర్వాత నివసించడం వల్ల  చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెల్సుకోవడం కష్టం కాలేదు.  వాళ్ల అనుభూతుల్తో నేనూ సులభంగా మమేకం కాగలిగాను.

ఒక స్ర్తీగా ఆర్థిక ఇబ్బందులు స్వయంగా తట్టుకోవలసి రావడం, దానిని భరించలేని తనం నించి నా కథలు పుట్టుకొచ్చాయి. నా కథల్లో పాత్రలు నా గురించి గానీ, నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి గానీ అయ్యి ఉండేవి.

కథల్లోని పాత్రలు సజీవంగా కళ్ల ముందు కదలాలని నేను అనుకుంటాను. నా చుట్టూ ఉన్న జీవితాలన్నీ బడుగుల బాథా తప్త జీవితాలే కాబట్టి నేను హాస్య కథల్లాంటివి రాయలేకపోయాను.  అలాంటి నేపథ్యం నుంచి వచ్చినవే మొదట్లో రాసిన  ” గాజు పళ్లెం” , “పిండి బొమ్మలు”వంటివి.

“ఖాళీ సంచులు ” కథలోని ముఖ్య పాత్ర దుర్గ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ కథని నేను ఆమెకి చదివి వినిపించిన తర్వాత గాలిలో నిరాధారంగా ఉన్న జీవితానికి ఒక బలమైన మార్గాన్ని ఏర్పరుచుకున్నానని నాతో చెప్పింది. “క్షతగాత్ర” కథ చదివిన తర్వాత బాగా చదువుకున్న డాక్టర్ల వంటి స్త్రీలు కూడా  ఆ కథ లోని సంఘటనలతో తమ జీవితాల్ని పోల్చుకుని”చదువుతుంటే తమకు కన్నీళ్లు ఆగలేదని” ఫోన్లు చేసారు.  ఇలాంటి సంఘటనలెన్నో! ఇటువంటివి  జరిగినప్పుడు నా కథా రచనకొక సార్థకత  ఏర్పడిందని నేననుకుంటాను.

పల్లెటూళ్లో చుట్టూ ఉన్న వ్యక్తులందరూ నన్ను ఇన్ స్పెయిర్ చేసిన వాళ్లే.  వాళ్ల నడవడికల ప్రభావం నా కథ మీద చాలా ఉంటుంది. మా ఇంటి పక్కనే ఊరి గ్రంధాలయం ఉండడం వల్ల గొప్ప గొప్ప కవులు, రచయితల రచనలు చదవడం వల్ల మొదట్లో బాగా ఇన్స్ స్పెయిర్ అయ్యాను. నన్ను బాగా ప్రభావితం చేసిన జీవితం మాత్రం ఈ పల్లె జీవితం. అలాంటి నేపధ్యంతో వచ్చినవే నా కథల సంపుటులు 1996 లో వచ్చిన “జీవరాగం”, 2002 లో “మట్టి- బంగారం “, 2007 లోని “అతడు- నేను”, ఇంకా ఇప్పుడు కొత్తగా రాబోతున్న మరో సంపుటం.

కథలు85 లో ప్రారంభించినా తొంభైవ దశకం ప్రారంభం వరకూ నేనెప్పుడూ ఏ సభలకూ వెళ్లలేదు. .  ముఖ్యం గా అప్పట్లో బొమ్మూరు తెలుగు యూనివర్శిటీ సభలు,  రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో జరిగే సభలు,కంజిర, సంతకాలు సభలు , సాహిత్య వాతావరణాన్ని కలిగించేవి. ఎప్పుడూ నాకు నేనుగా ఈ పల్లెటూళ్లో కూర్చుని రాసుకోవడమే నాకు ఇష్టమైన విషయం. అందుకే సమావేశాలకు వెళ్లడం  ఒక మార్పు కోసమే గానీ వాటి నుంచి నేను ప్రభావితమయ్యింది చాలా తక్కువ.

పల్లెటూళ్లలో జరుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపుతూ చాలా కథలు రాసేను.  ముఖ్యంగా స్త్రీలు ఎంతటి అణచివేతకి గురవుతున్నారో,దౌష్ట్యానికి బలైన స్త్రీలు ఎందుకు తిరగబడలేకపోతున్నారో చెప్పడానికి ప్రయత్నించేను.వెనక బడిన కులాల్లో స్త్రీలు కుటుంబ హింసతో బాటూ సామాజిక హింసని కూడా ఓర్చుకోవలసి రావడం నన్ను బాగా బాధించేది. విచిత్రంగా చాలా మందికి తాము హింసకు గురవుతున్నామని తెలీదు కూడా.దానిని ఎదిరించొచ్చని, బైట పడే మార్గాలు అన్వేషించొచ్చని తెలీదు. అయినా పల్లెటూళ్లలో స్త్రీలు దేనికైనా తిరుగుబాటు ధోరణి అవలంబించినా అది వెంటనే అణచివేయబడుతుందని తర్వాత అర్థమైంది నాకు. ఆ బాధ కూడా నా కథల్లో కనిపిస్తుంది.

అలాగే ఆర్థిక పరమైన వెనుకబాటు తనం వల్ల ప్రభావితమయ్యే సంఘటనలు నన్ను బాగా ఆలోచింపజేసేవి. నా కథల్లో ప్రతిబింబించేవి.

జీవితాన్ని ఏదో ఒక ఇజానికి సంబంధించిన పరిధిలోంచి చూడడం రచయిత తనకి తాను పరిధులు విధించుకోవడమేనని నేననుకుంటాను. కథని బట్టి పాత్రలకి సహజంగా నడుచుకునే స్వేచ్ఛనివ్వాలి. నిరంతర చైతన్యవంతమైన మనిషి జీవితంలో ప్రతి సంఘటనా ఒక కథా వస్తువే. ఆర్థిక, సాంఘిక అసమానతల్ని, వాటి మూలాల్ని,గ్లోబలైజేషన్ ప్రవాహంలో అన్నీ కొట్టుపోయేలా రాజకీయం చేస్తున్న ప్రభుత్వాల  విధానాల్ని పరిశీలించి రాయడం రచయిత బాధ్యత.

పల్లెటూళ్లో చెరువుకెళ్లి చిన్న బిందెతో మంచినీళ్లు తెచ్చుకునే ఒక అమ్మాయి  ఈ లోకంలో కథా రచయితగా నిలదొక్కుకునేలా చేసిన సాహిత్యానికి నేనెప్పుడూ తల వంచి నమస్కరిస్తాను.

ఈ తరం కథల్లో ఆర్ద్రత తగ్గింది
పెద్ది భొట్ల సుబ్బ  రామయ్య……

ఈ  పేరు వినగానే దిగులు మేఘపు  చాటు గుబులు జాబిలీ గుండెలను పిండి వేస్తుంది. మనసు కరుణ రసప్లావితమై  కరిగి నీరయ్  పారిపోతుంది ఒక దుఖపు తెర  మనసు మీద అలా పర్చుకుంటుంది. రవ్వంత జాలి, గోరంత సానుభూతి కొండంత కరుణ జమిలి గా ఒక దాని మీద మరొకటి ఆవరించుకొని ఏ  భావోద్వేగానికీ  అందని దృశ్యం ఏదో మనో యవనిక మీద అల  లాగా తారాడుతుంది. మనం మనంగా ఉండలేము. మన లోపల సున్నితమైన  కరుణ అనే సూత్రం ఒకటి హృదయాన్నీ బుద్దినీ ఏకం  చేస్తుంది. కరుణ ఆయన కధాత్మ . కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమి ఈ సంవత్సరం ఆయనను తన వార్షిక పురస్కారానికి ఎన్నిక చేసింది. ఆ సందర్భం గా ‘వాకిలి’ కోసం ప్రముఖ కథకుడు, కవి వంశీ కృష్ణ ప్రత్యేక ముఖాముఖి.

మీ కధా  రచనకి నేపధ్యం ఏమిటి ?

నా కదా రచనకు ఆ మాట కొస్తే ఏ  రచయత సృజనకి అయినా నేపధ్యం జీవితమే. జీవితమే నా కధా  రచనకి ముడి సరుకు. అయతే అన్నిటి కంటే ముందు ఒక విషయం చెప్పాలి. నా  ఐదో  సంవత్సరం లో లంకల కోడేరు లో నన్ను మొదటి సారి  స్కూల్  కి పంపిస్తూ  మా నాన్ని ఒక మాట చెప్పారు మా గురువు గారికి. ” వీడి కి మీరు చదువు సంధ్య చెప్పకండి. భయ భక్తులు నేర్పండి చాలు ” అని. ఆయన  మా నాన్న చెప్పినట్టుగానే నాకు చదువు చెప్పలేదు కానీ భయ భక్తులు పుష్కలం గా నేర్పాడు. తరువాత భారతుల మార్కండేయ శర్మ గారనే మా తెలుగు మాస్టారు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని “చదవటం” అనే క్రియను అలవాటు చేసారు.

పుస్తకాలు చదవటానికి ఒక పద్ధతి వుంది. పసి పిల్లలకు చిన్నప్పుడు ఫారెక్స్  పెట్టినట్టు గా తేలికగా అర్ధం అయ్యే చందమామ , బాల మిత్ర లాంటి పుస్తకాలు అలవాటు చెయ్యాలి. క్రమేపీ స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. నా సాహిత్య చదువు కూడా అలాగే జరిగింది. చందమామ , బాల మిత్రలతో మొదలు పెట్టి కొవ్వలి, జంపన ల మీదుగా సాగింది. కొవ్వలి జంపన వాళ్ళు రాసిన సాహిత్యం చదవడం వలన నాకు చదవడం లో వున్న  ఆనందం ఏమిటో తెలిసింది. ఈజీ రీడింగ్ అయితే ఆవ వచ్చు కానీ అలా విపరీతం గా చదవడం వలన భాష స్వరూపం , పద రహస్యం అవగతమైంది.     ఇంటర్ వచ్చేసరికి విశ్వనాధ, అడవి బాపి రాజు నా సాహిత్య ఆవరణం లోకి వచ్చి చేరారు. నేను మొదటి సారి వేయి పడగలు చదివినప్పుడు వర్ణనలు వదిలివేసి, కదా మాత్రం చదువుకుంటూ వెళ్ళాను. ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతా మళ్ళీ వేయి పడగలను కధ  వదిలివేసి వర్ణనలు మాత్రమె చదివాను. ఇలా విపరీతం గా చదువుతున్నప్పుడే ఎప్పుడో, ఎక్కడో, ఏదో మూల ఒక బీజం పది వుంటుంది. అలా మొదటి కధ “చక్ర నేమి” ఆంధ్ర ప్రభ లో రాసాను .

సాహిత్యం చదివితే  భాషా స్వరూపం తెలుస్తుందా? పద నిర్మాణం, పద సంయోజనం  ఇవన్నీ భాషా శాస్త్ర విషయాలు కదా?

సాహిత్యం చదివితే పద స్వరూపం భాషా స్వరూపం ఖచ్చితం గా తెలుస్తుంది. ప్రతి భాష నేర్చుకోవడానికి దానిదైన  ఒక సంప్రదాయం వుంటుంది. ఆ సంప్రదాయాన్ని కాదు అనుకుంటే భాష దానికి అదే మరణిస్తుంది. తెలుగు లో 56 అక్షరాలు  వున్నాయి. తెలుగు భాష నేర్చుకోనాలంటే ముందు 56 అక్షరాలూ నేర్చుకోవలసిందే. అక్షరాలు , తర్వాతా గుణింతాలు ఇలా నడిచిన దారిని  మనం మరవకూడదు. ఇంగ్లిష్ వాళ్ళను చూడండి. వాళ్ళకు 26 అక్షరాలు  వున్నాయి. ఏ  అక్షరాన్ని వద్దు అనుకోలేదు. OFTEN అనే పదం రాయాలి అంటే T సైలెంట్ కదా అని , అది ఉచ్చారణలో పలకటం లేదు కదా అని OFEN అని రాయరు. ఇంతెందుకు పక్కనే వున్న తమిళం  వాళ్ళు కూడా ఒక్క అక్షరాన్ని కూడా వాదులు కో లేదు. కానీ మన తెలుగు లో మనం చూస్తువుండగానే ఎన్ని అక్షరాలు  అంతర్దానమై పోయాయి . చ చ ఛ  ల లో చ . జ జ  ఝ  ల లో జ  అంతర్దానమై  పోయాయి. ఱ  అసలు కనిపించనే కనిపించదు. ఎన్ని అక్షరాలూ వదులుకుంటే, ఆ మేరకు భాష పేదది అవుతుంది. ఇవాళ  చందమామ ని చన్దమామ్  అని పలికే తరం వచ్చింది. పదాలతో భాష నేర్పడం తో వత్తులు ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూదదో తెలియని స్థితి వచ్చింది. నీరు  అని రాస్తే నీళ్ళు అని అర్ధం . నీ పక్కన ఱ  రాసి దానికి కొమ్ము ఇస్తే బూడిద అని అర్ధం. భాష లో నుండి ఱ  తొలగిస్తే ఏం  జరుగుతుంది?

నిప్పున నీరయ్యెన్  అని దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు రాస్తే  నిప్పులో కలిస్తే బూడిద కావాలి కదా నీరు కావడం ఏమిటి అని పెద్ద చర్చ లేవదీసారు. నిజానికి నీరు  అంటే బూడిద అనే అర్ధం వుందని నీ పక్కన ఱ  రాసి కొమ్ము ఇస్తే బూడిద అవుతుందని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా సాహిత్యం చదివితేనే తెలుస్తుంది. అయితే భాష బాగా తెలిసిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితేనే ఇవన్నీ అర్ధం అవుతాయి. మీరు శ్రుతి ఎలా రాస్తారు. శ్రుతి అని రాస్తేనే సరిగా రాసినట్టు. శృతి  అని రాస్తే తప్పు. ఈ స్వరూప స్వభావాలు అన్నీ నిఘంటువుల లో వుండవు. కొన్ని వందల సార్లు చదవటం వలన ఆ పదం ఆ రూపం తో మనసు లో  ముద్రించుకుంటుంది .

భాష  సంగతి కాస్త పక్కన పెడదాం మీరు వుధృతం గా కధలు రాసిన 1960-1970  దందహ్యమాన  దశాబ్దానికి 90 ల తర్వాతి ఉదార ఆర్ధిక వాద సంస్కరణల దశాబ్దానికి మధ్య వున్నా తేడా ని కదారచయత గా ఎలా గుర్తిస్తారు?

నా వరకు నేను 80 ల తర్వాత రాసిన కధలలో ఆర్డ్రత  తగ్గింది. మనం ఎప్పుడైతే  stupidity, sex, violence లను ఆనందించటం మొదలు పెట్టామో  అప్పుడే మనం stupid గా violent గా తయారు అయ్యాము. సెక్స్ perverted గా మారి పోయాము. ఒకప్పుడు సినిమా లో ” అమ్మ గారు స్నానం చేస్తున్నారు ” అన్న డైలాగ్  ఉంటేనే B N రెడ్డి గారు వప్పుకోలేదు. స్నానం చేస్తున్నారు అన్న మాట వినగానే ప్రేక్షకుడి మనో ఫలకం మీద స్నానం చేస్తున్న ఒక స్త్రీ నగ్న దేహం కదలాడుతుందని ఆయన వద్దు అన్నారు. ఈనాడు స్త్రీ లంటే కేవలం మాంస ఖండాలే . నా లోను ఆర్ద్రత తగ్గి పోవడం వలననే “మరో వీధి పాప” లాంటి కధ రాసానేమో| సున్నితత్వం తెగి పోయింది. విలువలు లుప్తమయినాయి.

సుబ్బ  రామయ్య పాత్రలు అయితే చనిపోతాయి. లేకపోతే మరణిస్తాయి అన్న వ్యాఖ్య  పైన మీరేమంటారు? అసలు చావు లేకుండా  మీరు కధ రాయరా?

ఆ మాట అన్నది కప్పగంతుల మల్లికార్జున రావు . లతా, తెన్నేటి హేమ లత కూడా సరదాగా నావి ఏడుపు  గొట్టు కధలు అనేది. “రాజశేఖరం రమాదేవి ప్రేమిచుకున్నారు. ఇద్దరూ కలిసి సరదా గా నడుచుకుంటూ వెళుతున్నారు. వెనుక నుండి వేగం గా వచ్చిన లారీ  రాజసేఖరాన్ని గుద్దేసింది. రాజశేఖరం చనిపోయాడు. సుబ్బ రామయ్య కధ అయిపొయింది. అనేది. అయితే కొన్ని వృత్తాలకి చావు తోనే సంపూర్ణత్వం లభిస్తుంది. లేదు కొన్నింటికి చావు ఒక పరిష్కారం అవుతుంది. “నీళ్ళు” కధ లో జోగినాధం మరణించక పోతే కదేమి లేదు. అలాగే  “WAGES OF FEAR”  అన్న సినిమా లో కూడా కధానాయకుడు అంత క్లిష్టమైన పనిని సాధించి కూడా ట్రక్కు లోయ లో పది చనిపోక పోతే ఆ సినిమా కు అర్ధము , విలువ వుండవు. అయినా మృత్యువు మన చివరి అతిధి.

జీవితానికి అర్ధం వెతకడం ఇంగువ గురించి తెలుసుకోవడం ఒకటేనా?

మనకు ఎంతో  తెలుసునని మనం అనుకుంటూ ఉంటాము. అనవసర సమాచారాన్ని అనంతం గా పోగేసి నాలెడ్జ్ సొసైటి అనుకుంటాము. కానీ చాలా అత్యల్పమైన విషయాలు కూడా మనకు తెలియవు. వాటిని తెలుసుకోకుండానే ఒక్కొక్కసారి జీవితం ముగిసిపోతుంది. మనిషి జీవితం ఒక పెపీలికం . అన్నీ తెలుసు అని అనుకుంటాడు కానీ ఏదీ తెలియదు. కనీసం ఇంగువ కూడా

ప్రశ్న6 : ఇంతకూ ఇంగువ అంటే ఏమిటో ఆ కధలో మీరు చెప్పలేదు. చదువరిని ఆ అసంతృప్తి వేటాడుతూనే వుంటుంది. ” కధ లో ఇంగువ గురించి చెప్తే ఆయన విశ్వనాధ సత్యనారాయణ అయ్యేవాడు. చెప్పలేదు కాబట్టి సుబ్బరామయ్య అయ్యాడు ” అని కదా పావని శాస్త్రి అన్నది.

విశ్వనాధ తో మీ అనుబంధం?

విశ్వనాధ తో నాకు చెప్పలేనంత అనుబంధం వుంది. ఆయన తో గంటల తరబడి గడిపాను. చివాట్లు తిన్నాను. రెండు, మూడు సార్లు దెబ్బలు కూడా తిన్నాను. B.A  స్పెషల్ తెలుగు లో ముగ్గురమే వుండే వాళ్ళం. విశ్వనాధ సరిగా క్లాసు తీసుకునేవాడు కాదు. ఇవ్వాళ అన్నం తిని రాలేదు. నీరసం  గా వుంది , ఇంటికి రా అనే వాడు. మరొక రోజు ఇవ్వాళ అన్నం తిని వచ్చాను. ఆయాసం గా వుంది. ఇంటికి రా అనేవాడు. ఇంటికి వెళితే వాలు కుర్చీ లో కూర్చుని సమయం తెలీకుండా ఏడెనిమిది గంటలకి పైగా చెప్పేవాడు. ఆయన పెట్టిన భిక్షే  ఇది. ” వసంత ఋ తు వర్ణన ” అని పద్యాలు రాసుకుని తీసుకెళితే యతి, ప్రాసలు అన్నీ బాగానే వున్నాయి కానీ నువ్వు కవిత్వానికి పనికి రావు అని తేల్చేశాడు . ఆ తరువాత నేను కవిత్వం జోలికి వెళ్ళ  లేదు.

“కరుణ మీ కధాత్మ” కరుణ పాసివ్  గా వున్నట్టు కనిపిస్తుంది కానీ చాలా అగ్రెసివ్. దానిని మీరు ఎలా నిర్వచిస్తారు. ?

కరుణ రస సూత్రం తెగిపోతే మానవుడు మానవుడు కాదు. జంతువు . నిజానికి కరుణ లో గొప్ప డైనమిజం  వుంది. అది మన మనో మాలిన్యాలని తొలగిస్తుంది. మనసుని స్వచ్ఛ , శుభ్ర , స్ఫటికం  లాగా చేస్తుంది. అది దైవిక గుణం. అది మనిషిని మంచితనం వైపు నడిపిస్తుంది. సమస్త చరాచర జీవ రాశి  నుండి మనిషిని వేరు చేసేది ఒక్క “కరుణ” మాత్రమె. కరుణ ముఖ్యం.

“పూర్ణాహుతి” లో బీద బ్రాహ్మణుడు , కోదండం గారి కల  లో నిప్పుకోడి , లేదా చింపిరిగాడు .. వృద్దాప్యం , బాల్యం, ఆ రెండు మనస్తత్వాలని  ఎలా ఔపోశన  పట్టారు.?

మన చుట్టూ  వున్నా వాళ్ళే మనకు ఏదో ఒకటి ఇస్తారు. ఈ బెజవాడ మహానగర రైల్వే స్టేషన్ లో రైళ్ళు సమయానికి వస్తూ, పోతూ , వుంటాయి . ఒక రైలు సకాలం లో ప్లాట్ఫారం మీదకి రావాలి అంటే ఎన్ని మానవ హస్తాల శ్రమ వుంటుందో మనం, ఎప్పుడైనా గమనించామా ? నలుగురు పిల్లలు రైలు కదిలే ముందు రైల్లోకి ఎక్కి రైలు పెట్టె అంతా శుభ్రం గా తుడిచి తృణమో, ఫణమో, ఇవ్వమని చెయ్యి చాపు తాడు. వాళ్ళ గురించి నాలుగు కధ లు రాసాను. ఇక బీద బ్రాహ్మణులు అంటారా? ఇప్పటికీ వాళ్ళు కనిపిస్తారు, నాతొ రండి, మీకూ చూపిస్తాను. అంతా సమాజం నుండి తీసుకున్నదే. నేను ప్రత్యేకం గా ఔపోశన  పట్టిందేమి లేదు.

ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని మధ్యతరగతి పూర్తిగా లుప్తమై పోయింది. ఒక నియో రిచ్ , లంపెన్ వర్గం తెలుగు సమాజం లో ఊపిరి  పోసుకున్న విషాద దృశ్యం గురించి కద రచయత గా మీ వ్యాఖ్య?

మధ్య తరగతి పూర్తిగా లుప్తమైన్దిఅని  అనుకోను. కానీ నియో రిచ్ వర్గం ఒకటి ఖచ్చితం గా మొదలయింది. వీళ్ళు మొదట రాజకీయాలని . తరువాత సాహిత్యాన్ని, తరువాత అన్ని రంగాలని ఆక్రమించుకున్నారు. దాని దుష్ఫలితాలని మనం ఇప్పుడు చూస్తూనే వున్నాము. ఒకప్పుడు సత్యనారాయణ పురం లో “సత్య హరిశ్చంద్ర” నాటకం వేస్తే  తెల్లవారుజామున మూడు గంటల దాకా మేలుకుని వుండి  నాటకం చూసే వాళ్ళం. సత్యం పలకడం కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవాలని స్థిర నిశ్చయం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు నాటకం చూపిస్తే ” సత్యం చెపితే ఇన్ని కష్టాలు వస్తాయి కనుక సత్యం చస్తే చెప్పకూడదు” అనే నిర్ణయం  తీసుకుంటున్నారు. నియో రిచ్ వర్గం సమాజం లోని అన్ని విలువలని ధ్వంసం చేసింది . ఒక్క డబ్బు సంపాదించడం అనే కల ని తప్ప. ఎలాగైనా డబ్బు సంపాదించు. అదే ఇప్పటి నినాదం.

జీవితం లో అసంతృప్తి మీద ఇన్ని కధలు రాసారు కదా మీకు జీవితం లో అసంతృప్తి ఉందా ?

లేదు. నాకు జీవితం లో అసంతృప్తి లేదు. విశ్వనాధ తో శిష్యరికం దగ్గర నుండి, లయోలా కళాశాలలో  అధ్యాపక జీవితం మీద గా ఇప్పటి వరకు నాకు జీవితం లో ఎలాంటి అసంతృప్తీ లేదు, నా సహచరులు నన్ను ప్రేమించారు. నా విద్యార్ధులు నన్ను గౌరవించారు. నా రీడర్స్ నన్ను అభిమానించారు. జీవితం లో కొన్ని కష్టాలు, నష్టాలు వుంటాయి. అవి తప్పని సరి విషాదాలు. వాటిని యదా తదం గా తీసుకున్నాను. కనుక నాకు ఎలాంటి అసంతృప్తీ లేదు.

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!
నీరు పల్లమెరుగు,నిజము దేవుడెరుగు-అన్నది సామెత. మానవ జీవన మనే ప్రవాహం ఏ గతిలో సాగుతున్నదో  తెలుసుకోవాలనుకుంటాడు రచయిత. ప్రవాహదశలోని ఒక దశను -ఒక చిన్న మార్పును -ఆ మార్పు చెందుతున్న క్షణాన్ని తన రచన ద్వారా పట్టుకోడానికి పోరాటం చేస్తాడు. రచయితగా తనకుండే సాహిత్య సాధనాల్తో మార్పు చెందుతున్న క్ష ణాన్ని  సాహసంతో పట్టుకుంటాడు.

అయితే ఈపని జరుగుతున్న స్వల్పకాలంలోనే మానవ జీవితవాహిని మలుపుకు తిరిగేసి , మరో దిశకు మారి, ఇప్పుడేమంటావంటూ రచయితను సవాలు చేస్తుంది.మళ్ళీ రచయిత అప్పుడు తయారైన మార్పును అర్థం చెసుకునే పనికి సమాయత్తం అవుతాడు.ఇలా సాహిత్యానికీ,మానవజీవితానికీ మధ్యలో నిరంతరంగా జరుగుతున్న ఈ పోటీలో , వ్యక్తిగా జీవితపరిణామాలకు మారుతూ, రచయితగా ఆ పరిణామాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఇంత దూరం సాగి వచ్చాక ,ఈరెండు ప్రపంచాలనుంచీ వేర్పడి, రెండిటి మధ్య ఉండే గట్టు పైన (ఊహా మాత్రంగానైనా) నిలబడి, వెనుదిరిగి, తన రచనానేపధ్యాన్ని పునరాలోచించుకోవడం గూడా ఒక తమాషా క్రీడలాగే కనిపిస్తోంది నాకిప్పుడు.

జీవితంలో నడివయస్సును చేరుకున్నాక , ఇప్పుడు తిరిగిచూస్తే నా జీవితాన్నంతా పూర్తిగా సాహిత్యమే ఆవరించినట్టుగా తెలుస్తోంది నాకు.యెప్పుడో చిన్నతనంలో మానాన్న చేయి పట్టుకుని సాహిత్యలోకంలోకి అడుగు పెట్టిన వాణ్ణి నేను.ఆయన కొద్ది రోజుల్లోనే నాదైన నడకను నేను నేర్చుకునే అవకాశాన్ని కల్పించి,ప్రేక్షకుడిగా నిల్చుని , నాకేసి ముచ్చటగా చూస్తూవుండేవారు. కాలం ఆయనను నానుంచీ దూరం చేసినా ఆయన సాన్నిధ్యం మాత్రం మానసికంగా నాతోనే ఉంటూ,నన్నలాగే గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.అయితే జీవనయానం నన్ను యెన్నో మలుపులు తిప్పనే తిప్పింది.

మామూలు బడిపంతులు కొడుకునే అయినా పదిహేనేళ్ళ క్రితం వరకూ దుఃఖమన్నదే సుఖంగా-ఓ రకం బుద్దుడి జీవితంలా-గడచింది. తొలిసారిగా జీవిత వాస్తవం గురించిన పాఠం నేర్పిన వాడు మా తమ్ముడు. వాడు అర్ధాంతరంగా జీవితంలొంచీ విరమించి ,మానవ జీవితమెంతటి క్షణికమో , అది యెంత అర్ధరహితంగా తయారవగలదో , పిడుగు పడి శరీరాన్నీ మనస్సునూ రెండుగా చీల్చి  పారేసినంత నిర్దయగా నా అనుభవ పరిధిలోకి తీసుకొచ్చాడు. అప్పటినుంచీ నా చూపూ,నా అంతరంగమూ నా జీవనయానమూ పూర్తిగా మారిపోయాయి. గతాన్నీ, ఆగతాన్నీ పట్టించుకోకుండా ,ప్రస్తుతంలోనే బతకమన్న జిడ్డు కృష్ణమూర్తి మాట మాత్రమే అప్పుడు నన్ను ఓదార్చి సత్యాన్ని చూపెట్టింది. సరిగ్గా అదే సమయంలో భారతదేశపు సామాజిక చిత్రపటంలో పెనుమార్పులు వచ్చాయి.

1991 లో రష్యాలో కమూనిస్టు ప్రభుత్వం పతనం గావడంతో భారతదేశంలోని ప్రభుత్వాలు సామ్యవాదం నుంచీ దూరమవుతూ వచ్చి ,ఆ శతాభ్దపు ఆఖరికల్లా ధనస్వామ్యనికి చేరి ప్రపంచీకరణకు జేజేలు పలకసాగింది. అప్పటి వరకూ కొంతవరకైనా చలామణిలో వుండిన మానవీయ దృక్పదమూ , విధానాలూ క్రమంగా మృగ్యమై మళ్ళీ ఒక ఆటవిక సమాజం చొచ్చుకొచ్చేసింది. చిత్రమేమిటంటే అప్పటికైనా భారతదేశపు ఆలోచనాపరులు కమ్యూనిజమనే గొప్ప రాజకీయ విధానపు అవసరాన్ని గుర్తించలేక పోయారు . తిరిగీ కమ్యూనిజాన్ని బలంగా తయారు చేసుకోలేక పోయారు.ఒక గొప్ప ఆదర్శం వైపుకు నడుస్తోన్న భారతదేశపు ప్రయాణం అర్ధాంతంలో ఆగిపోయి తిరోగమనం పాలవడం ఒక పెద్ద ట్రాజెడీ. ఆ నిరాశా నిశృహలు అప్పతి నా రచనలకు నేపధ్యమయినట్టుగా ఇప్పుడు నాకు తోస్తోంది. ఆ అలజడే నాకు సార్వజననీయమైన సత్యమన్నదేదీ ఉండదనీ,ప్రతి సత్యానికీ లెక్కలేనన్ని పార్శ్వాలుంటాయనీ బోధ పరచింది. ఆ సమ్యంలో నేను సత్యానికుండే అన్ని పార్శ్వాలనూ పట్టుకొవదం కోసం -ఒక ఇంక్లూసివ్ అకౌంటును ఆవిష్కరించడం కోసం -అన్ని కోణాలనూ తనలో ఆవిష్కరించగల జీవిత శకలాల్ని పట్టుకొవడం కోసం ప్రయత్నం చేసాను.

క్రమంగా మానవీయ ఆదర్శాలు అంతరించిపోవడం నన్ను దిగులుకు గురి చేసింది. అస్తిత్వాల అన్వేషణలో తమ సుఖశాంతుల్ని కోల్పోతున్న మనుషులు జాలిగా కనిపించారు. ఒకే విషయానికి భిన్న రీతుల్లొ స్పందించే జీవితాలున్న వ్యక్తుల మద్య ఘర్షణలు పెరగ సాగాయి. మతమన్నది లేకుండా మనిషి జీవించలేడని తెలిసిపొయిన తర్వాతనైనా , మానవత్వమే భూమికగా ఒక ఆధునిక మతాన్ని తయారు చేసుకోలేకపోతున్న మానవజాతి యాతన వికృత రూపంలో తాండవం చేస్తూ అన్నిచోట్లా యెదురయ్యింది. భిన్న వైరుధ్ధ్యాల మధ్య నిత్యమూ డోలనం చేస్తున్న ప్రపంచాన్ని చూస్తుంటే బయమూ, విరక్తీ కలగసాగింది.నిన్నటికీ,రేపటికీ మధ్య , ఆ రెండిటికీ భూమికగా ఈనాటిని గుర్తించి ,దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలన్న అవగాహన కరువైన లోకరీతి పైన కోపమొచ్చింది. ఇన్ని అలజడుల మధ్యలో , భౌతిక శ్రమతో జీవించే సదా సీదా బడుగుజీవుల్లో నాకు గొప్ప మానవీయ లక్షణాలు కనిపించాయి.వాళ్ళ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న శక్తుల్లో నాకు సార్వజననీయమైన జీవన చలనసూత్రాలు స్పష్టంగా కనిపించాయి.

రోజంతా శరీరమనే పనిముట్టుతో పనిచేసి,బౌతికశ్రమతో అలసిపోయి, కలోగంజో తాగి,రేపంటే దిగుల్లేకుండా, ఒళ్ళు మరచి నిద్రపోయే శ్రామికజనంపైన గౌరవమూ ,ఆరాధనా పెరిగింది.సులభంగా వచ్చే మార్గాల్లో ధన్నన్ని దోచుకుని,అవినీతి సామ్రాజ్యాలో ఇరుక్కుపోయిన దుర్మార్గులు పోగొట్టుకుంటున్నదెమిటో ఆ కస్టజీవుల్ని చూసాకే నాకు అర్ధమయ్యింది. వడ్రంగులు, చాకలివాళ్ళు, మంగళ్ళు, హరిజనులు,ఇంకామిగిలిన చేతివృత్తులవాళ్ళు తమతమ ఆశానిరాశలతో బాటుగా నా రచనల్లొకి రావడంతో నా సాహితీజీవితంలోకి గొప్ప వెలుతురులు తరలివచ్చయని నేను నమ్ముతున్నాను. వారి కష్ట నష్టాల్నీ , యోగాయోగాల్ని పట్టుకోవడం మానసికంగా యాతనే అయినా , ఆపని ముగిసాక తెరుచుకునే వెలుతురు ద్వారాలు నన్ను అక్కున చేర్చుకుంటున్నాయి. రచన ముగిసాక నాలో వెలిగె దీప్తులే అంతకుముందు పడవలసిన యాతనలకు నన్ను సమాయిత్త పరుస్తున్నాయి. ఈ సాహితీయానాన్ని మరింతగా కొనసాగించడానికి కావల్సిన స్ఫూర్తిని కలిగిస్తున్నయి.

నన్ను కదిలించిన మనుషులే నా కథలు!
సామాన్య… .చాలా అరుదైన పేరు. అంతకన్నా అరుదైనవి ఆమె రచనలు.ఆదునిక తెలుగు కథానిక సరికొత్త మలుపు తిరగటం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో సామాన్య తనదైన స్వంత శైలి తో సాహిత్య రంగం మీదికి అడుగు పెట్టారు.జీవితంలో కనిపించకుండా మిగిలి పోయిన ఖాళీలను   సామాన్య  తన   కథానికల ద్వారా పూరిస్తూ వస్తున్నారు.ఈమె రాస్తున్న కథలు కొత్తవి.కథనాలు కొత్తవి.శిల్ప సంవిధానం కొత్తది. మారుతున్న కాలంలో మారుతున్న మనవ సంబందాలు ఈమె కథా  వస్తువులు సామన్యమైనవిగా కనిపించే అసామాన్యమైన అంశాలు ఈమె కథలకు ముడి సరుకులు. పాత్రల ద్వారా ఆకారాలను సంతరించుకొన్న అనుభవ విశేషాలే ఈమె కథలు. నిరాడంబరమైన శైలిలో నిశ్చలమైన సాంద్రత.సరళమైన శైలిలో విశాదాశ్రు తుశారాల తేమ నిండిన అక్షరాలూ.   బావోద్విగ్న సందర్బాలలో సైతం సంయమనాన్ని పాటించే పరిపక్వ మనస్తత్వం. విలువల తాజాదనాన్ని బాషగా అనువదించగల ప్రతిభా సామర్ద్యం. బాష మర్మం ఎరిగిన కథా శిల్పి. సాహితీ ప్రక్రియల సరిహద్దులు చెరిగి పోతున్న దశలో తెలుగు కథకు తనదైన ఒక సాంద్రతను సమకూర్చ గలగటం ఈమె ప్రత్యేకత. ఎంతటి క్లిష్టతరమైన వస్తువునైనా మైనం ముద్దగా మార్చి అతి సులభ గ్రాహ్యమైన రీతిలో కథానికా శిల్పంగా మలచ గలగటం ఈమె స్వంతం చేసుకొన్న  విశిష్టత. ఉత్తర ఆధునిక పరి బాషలో చెప్పాలంటే తెలుగు కథానికా సాహిత్యం లో ప్రస్పుటం కానున్న ఒక పారడిం షిఫ్ట్ (paradigm shift) కుసామాన్య ఒక ప్రతీక.

(సామాన్యకి స్మైల్ అవార్డు కమిటీ ఇచ్చిన యోగ్యతా పత్రం నించి…)

ఇది సామాన్య నేపధ్యం!

మా అమ్మా వాళ్ళు అయిదుగురు అక్కా చెల్లెళ్ళు .అందరూ అవీ ఇవీ పుస్తకాలు చదివే వారనుకుంటాను ,మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి .అట్లా నా ఏడో  తరగతిలోనే  నేను శరత్ ”శ్రీకాంత్ ”ని చదివాను .శ్రీకాంత్ ని ఇప్పటికీ పూర్తిగా అందుకోలేదు .అది వేరే విషయం .అట్లా శరత్ ,టాగోర్ ,చండీ దాస్,కొ . కు  వంటి  గొప్ప రచయితల రాతల్ని నా పదో తరగతి లోపున చదివేసాను .స్కూల్ రోజుల్లో నాకో స్నేహితురాలుండేది శారద అని తను,నేనూ చిత్తూరు’ ప్రేమళ’  టాకీస్ సందులో వున్న పుస్తకాల బంకుల్లో పాకెట్ పుస్తకాలు కొనే వాళ్ళం .అట్లా సింద్బాద్ ,గలివర్ యాత్రలు వంటివి చదివాను .చదవడం అంటే ఏ స్థాయి పిచ్చి అంటే దారిలో దొరికిన పిచ్చి కాగితాన్ని కూడా వదలకుండా కళ్ళ దారుల నుండీ ,మెదడు లోకీ ,అక్కడ నుండీ వడ పోసి హృదయానికీ భట్వాడా చేసేసేవాళ్ళం నేనూ నా తమ్ముడు ఉదయ చైతన్య .అవును ఈ చదువు ప్రయాణం లో నాకు నా తమ్ముడు తోడు,ఏది చదివినా జంటగా చదివే వాళ్ళం  . ఎక్కడెక్కడి లైబ్రరీలు కనిపెట్టేవాళ్ళం .రంగ నాయకమ్మ రచనలని విపరీతంగా ఇష్టపడే వాళ్ళం .రామాయణ   విష వృక్షాన్ని చదివి ఇద్దరం దొల్లి దొల్లి నవ్వుకోవడం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది.”మ్రుచ్చ కటికం” నేను నా హై స్కూల్ లోపే చదివాను .మా పెద్ద పెదమ్మ భర్త బాగా పుస్తకాలు చదివే వారు .చలం ని నేను ఆయన వద్దే చదివాను .నాకు గుర్తున్నంత వరకూ నేను చదివిన చలం గారి మొదటి రచన ”విడాకులు” నాటకం .అర్థం  కావడం, కాక పోవడం తో మాకు సంబంధం వుండేది కాదు.మా చదువుని చూసి మా అమ్మమ్మ  తిడుతుండేది అట్లా చదివితే  పెద్దయ్యేసరికి కళ్ళు పనికి రాకుండా పోతాయని .కానీ నన్ను పెంచిన  మా నాన పుస్తకం చేతిలో లేకుండా కనిపిస్తే కోప్పడే వారు.

ఇంటర్ మీడియట్ కి  వచ్చేసరికి నా తమ్ముడు నాగార్జున సాగర్ ఎపీఆర్ జేసీ కి వెళిపోయాడు. పుస్తకాల చర్చలు కాస్తా కుంటు పడ్డాయి.అప్పుడే బైపీసీ తో ఇంటర్ పూర్తి చేసి  ఎంసెట్ లో చేరాను .మా అమ్మా వాళ్లకి నన్ను డాక్టర్ ని చేయాలని కోరిక .నా చెడ్డ కలల్లో కూడా నన్ను నేను రోగుల మధ్య ఊహించుకోలేక పోయేదాన్ని .ఒకటే కల యవ్వనం తో మిల మిలమనే సీతా కోకల్లాంటి పిల్లలకి తెలుగు సాహిత్యం భోధించాలని .ఇంట్లో చెప్పే ధైర్యం లేదు.చివరికి ఎలాగయితేనేం అదృష్టం అనుకూలించి డిగ్రీలో చేరాను . కాకపోతే అక్కడ పొలిటికల్ సైన్స్ వంటివి చదవాల్సి వచ్చింది .అప్పుడు గ్రాడ్యుయేషన్ లో జాషువా గారి మనవరాలు శ్రీ .శోభా దేవి గారు మాకు తెలుగు లెక్చరర్ గా వచ్చారు .ఆ ఏడాది ప్రీ ఫైనల్ లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను .సామాన్య అంటే ఎవరూ అని వారు అడగటం, నేను లేచి నిలబడటం …అట్లా వారితో నా పరిచయం మొదలయింది .వారు నాకు  ఆధునిక తెలుగు సాహిత్యాన్ని  పరిచయం చేసారు .మేడం వాళ్లకి  పెద్ద లైబ్రరీ వుండేది.నాకు రక రకాల పుస్తకాలు కాలేజ్ కి తెచ్చి ఇచ్చేవారు మేడం  .స్టాఫ్ రూం ముందు నిలబడి సుదీర్గంగా చర్చించే వారు .వారి పరిచయం నిజంగా నా అదృష్టం .అట్లా స్త్రీ వాద ,దళిత సాహిత్యాలని వచ్చింది వచ్చినట్లు నమిలి నీళ్ళు తాగేదాన్ని .  అప్పట్లో  అదొక పిచ్చి .అప్పుడే   త్రిపురనేని శ్రీనివాస్ చనిపోయారు.ఎంత బాధ పడ్డానో ,అప్పుడో కవిత రాసుకున్నాను కూడా .వారి మరణానంతరపు  ”హో” ని మేడం నాకు ఇచ్చ్చారు.”హో” లోని కొన్నివాక్యాలు ఇప్పటికీ నా నిత్య జీవితంలో కోట్ చేసి  వాడేస్తూ వుంటాను.కవిత్వం నాకు అట్లా డిగ్రీలో పరిచయమైంది. మద్దూరి ,అఫ్సర్,ఎండ్లూరి ,దాము ,విమల ,జయ ప్రభ ,రజని,నిర్మల ,అటు వేపు ఓల్గా , పి .సత్యవతి….. – వీళ్ళందరూ అప్పటి నా భగవద్గీతలు .

పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాను . శ్రీ కె.కె.రంగానాథా  చార్యులు గారు క్లాస్ ని పరిచయం చేసుకుంటూ ఎవరెవరు ఏమేం పుస్తకాలు చదివారో చెప్పమని అడిగారు .లాస్ట్ బెంచ్ నుండీ అడుగుతూ ఫస్ట్ బెంచ్  లో వున్న నా దగ్గరికి వచ్చేసరికి  నిన్ను అడగక్కర లేదులే అనేసారు.అంతే కాదు ఎం . ఏ అయిన దాదాపు ఆరేళ్ళ  తరువాత ఒక రిఫ్రేషర్  కోర్సులో నన్ను చూసి అప్పుడు అక్కడ వున్న ఒంద  మంది ఎదుట ఈ అమ్మాయి ఆధునిక తెలుగు సాహిత్యం మొత్తం చదువుకుని తెలుగు ఎం . ఏ చదవడానికి వచ్చిందని అన్నారు .ఆ మాటని నేను  పదిలంగా ఒక బంగారు పెట్టెలో దాచుకున్నాను. ఇవాల్టి ఏమీ చదవలేని నైరాశ్యంలో నన్ను నేను పునరుత్తేజ పరుచుకునెందుకు  ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వుంటాను .యూనివర్సిటీలో తెలుగు అధ్యయనం వల్ల  నేనేం నేర్చుకున్నానో తెలీదు కానీ ఆ లైబ్రరీలో మార్క్సిజానికి సంబంధించిన బోలెడు పుస్తకాలు చదివాను .అంకుల్ టామ్స్ కేబిన్,రూట్స్,వార్ అండ్ పీస్ ,గోర్కీ అమ్మ వంటివి కూడా అక్కడ చదివినవే .

ఎం . ఏ లో వుండగా నాకు నా సహచరుడు కిరణ్ పరిచయమయ్యాడు .తను స్త్రీ వాదినని చెప్పడమే కాదు ,మనిషిగా మాత్రమె అతను నాకు కనిపించడం,తనకున్న మరో ప్రపంచపు కలలు   మా సహజీవనానికి పునాది ..మా ఇద్దరి పరిచయం పెరియార్,బీ ఎస్ రాములు పుస్తకాలు ఇచ్చి పుచ్చుక్కోవడం తో ప్రారంభమయింది.కిరణ్ బాగా చదివే వాడు .అప్పట్లో మేమిద్దరం సమంగా ప్రేమించి ,చదివి,ఆశ్చర్య పడ్డ పుస్తకం ”హో” మా ఇద్దరి మధ్య అప్పటి నుండీ ఇప్పటి వరకూ వచ్చే అన్ని ఘర్షణలూ పుస్తకాలకి సంబంధించినవే .కులం పునాదనో  ,కాదనో ,అలాటిదే మరో చర్చతోనో మేమిద్దరం   ఘర్షించు కుంటూనే వుంటాం .మా ఇంట్లో ఆధునికత అత్యాదునికతల మధ్య నిరంతర యుద్ధం జరుగుతూ వుంటుంది .

ఇట్లా పుస్తకాల ప్రయాణం లోనే  పాపాయి పుట్టింది .పాపాయి నా సమస్త ప్రపంచాన్ని చెత్త పుస్తకం లా నలిపి  మూలకి  పడేసి తనోక్కటే నా ప్రపంచమై పోయింది .అప్పటి నుండీ ఇవాల్టి వరకూ పోస్ట్ నాటల్ కి సంబంధించిన పుస్తకాల్లూ ,చైల్డ్ సైకాలజీ ,నీల్ ,రమణ మహర్షి,జిడ్డు కృష్ణ మూర్తీ ఓషో వంటి వారిని తప్ప   నేను సీరియస్ గా చదివిన ఒక్క సాహిత్య పుస్తకమూ లేదు.ఏం చదివావని నను ఎవరైనా వివరము అడిగితే సమాధానం నా తెల్ల ముఖమే .ఈ అజ్ఞాత వాసం వయసు ఏడేళ్ళ ఐదు నెలలు .

నా రాత సంగతి కి వస్తే ,ఇన్నేళ్ళ నా జీవితం లో అత్యంత అయిష్టంగా నేను చేస్తున్న పని   రాయడమే .స్కూల్లో ,కాలేజ్ లో చదివేప్పుడు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యాస సరచనలో ప్రధమ ద్వితీయ బహుమతులు పొందినా అది నేను రాయగలననటానికి సూచన అని నాకు తెలీదు .నాకు రాయాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు .కానీ చిన్నప్పటి నుండీ ఏదైనా బాధ కలిగితే కవిత్వం రాసే దాన్ని .2005 లో ఎండ్లూరి గారి ప్రోత్సాహంతో ఒక కవిత ఆంద్ర జ్యోతి కి పంపాను కూడా .అట్లా  ఏడాదికో ,రెండేళ్ళకో  ఒక సారి   ఒకటో ఆరో కవితలు రాసాను కానీ ,అవి రాయడం కోసం రాసినవి కాదు.అనుకోకుండా అక్షరాలయిన నా అంతర్ స్పందనలు మాత్రమె .

కథల విషయానికి వస్తే అదొక ఏక్సిడెంట్ .నేను కోరుకున్నట్టు లెక్చరర్ ని అయినా ఆ పనిని నా కూతురు  కారణం గా కొనసాగించలేక పోయాను.కిరణ్ వెస్ట్ బెంగాల్ లో ,నేను ఆంద్ర ప్రదేశ్ లో వుండి  వుద్యోగం చేయడం ఎలాగో నెట్టు కు రాగలిగినా పాపాయి చదువు ,పాపాయి కి అమ్మా నాన్న ఇద్దరూ అవసరం కావడం వంటి విషయాలు నన్ను ఉద్యోగాన్ని వదిలేట్టు చేసాయి .అది నా జీవితం లో పెద్ద దుక్కం .పున్నమి సంద్శ్రం లాటి సామాన్య నాలుగు గోడల మధ్య అనైచ్చిక బందీగా మారింది .ఏం ఏ గోల్డ్ మెడలూ ,ఇతరేతర ప్రతిభలూ  పెట్టెల్లో బజ్జున్నాయి .ఎంత బాదేసేదో .అప్పుడే ,సుదీర్గంగా ఎనిమిదేళ్ళు పాటూ చేసిన పీ హెచ్ డీ సబ్మిషన్ కి యూనివర్సిటీ కి వెళ్ళినపుడు, రూం మేట్ గా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ’కల్పన ”పరిచయమయింది.నా విషయం లో  అంతా అర్థమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయుత  కిరణ్ ది  .కల్పనాదింకొ బాధ .ఎంత చదువుకున్నా మగవాడి అణిచివేతకి కల్పన బాధితురాలు తను ఎదురుకుంటున్న ఆణిచివేతని అందంగా నవ్వుతూ హాస్యం చేసి చెప్పేది కల్పన.నాకేమో దిగులేసి పోయేది .మనదేమో  పురుషులకోసమే సృస్తించిన సమాజం .స్త్రీ సునిసితత్వం మన రాజ్యాంగానికి ,ప్రభుత్వాలకీ ,చట్టాలకీ దేనికీ లేదు .తనతో మాట్లాడినపుడల్లా ఇవంతా ఆలోచనకొచ్చి నిస్సహాయంగా అనిపించేది .ఆ బాధ నుండి నేను రాసుకున్న కథ ”కల్పన”

కిరణ్ ,నేనూ ఇద్దరం చదువు లో ఒకే లాటి ప్రయాణాన్ని చేసినా వివాహం ,సంతానం నా చదువుని కుంటు  పరిచాయి .నేను పీ హెచ్ డీ చేయలేక సతమవుతున్న సందర్భంలో తను ఐ ఏ ఎస్ లాటి అత్యున్నత సర్వీస్ లోకి వెళ్లి పోయాడు .పాపని చూసేందుకు మనుషులు వున్నా బిడ్డని వదిలి తను వుండగలిగినట్లు నేనెందుకు ఉండలేక పోతున్నానో అర్థమయ్యేది కాదు .ఆ ఉక్రోషం లో నుండి ఒక కథ రాసాను .కిరణ్ వసంత లక్ష్మి గారికి పంపాడు  .వసంత గారు ఆ కథను  తిప్పి పంపడమే కాదు ఆ భావజాలం తో తీవ్రంగా విభేదించారు కూడా .ఆరేళ్ళ క్రితం ఆ కథలో ఏం రాసానో ఇప్పుడు జ్ఞాపకం లేదు .ఆ తరువాత రాసిన కల్పన ని కూడా కిరణే  ”ఇది ఇవాళ అత్యవసరమైన కథ ”అంటూ వసంత గారికి పంపాడు.వారు అది చదివి కిరణ్ అభిప్రాయం తో ఏకీభవించారు .అది అచ్చయింది .ఆ కథకి విపరీతమయిన స్పందన వచ్చింది .ఆ కథతో నేనో ఆరు నెలలు కౌన్సిలర్ గా మారాలసి  .ఎన్ని ఫోన్ కాల్ లో చెప్పలేను .అందులో ఒక అమ్మాయి ఏడుస్తో ,తన భర్త నిరాదరణని మేల్ ఛావనిసాన్ని చెప్తూ అన్న మాట నా హృదయానికి బాగా హత్తుకుంది.”ఇవాళ  నా చదువు నాకు మాత్రమె గొప్ప .కాకుంటే నా చెల్లికి ,మా అమ్మకి మాత్రమె గొప్ప ఇంకెవరికీ గొప్ప కాదు ”అని .సాహిత్యం మనుషులపై అంత ప్రభావాన్ని కలిగిస్తుందా అని నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన కథ అది .

దాని తరువాత నేను అత్యంతగా  స్పందించి ,పరిశోదించీ రాసిన కథ ”దొంగల సంత” .ఈ కథ మటుకూ నేను ,రాయాలి అని రాసాను .నా భాద్యత అనుకుని రాసాను .అటువంటి విషయాలయితే నా సమస్త శక్తులూ వెచ్చించి తప్పనిసరిగా రాస్తాను.ఆ కథ తరువాత రాయాలి కదా అని నేను ఏ కథా  రాయలేదు .రాయడం మీద నాకు ఇష్టం కూడా లేదు .నన్ను నేను ఒక మంచి ప్రొఫెసర్ గానో ,సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమన్ గానో చూసుకోడానికి ఇష్టపడతాను .ఒక రైటర్ గా మాత్రం కాదు .దాని పట్ల నాకే మాత్రం ఆకర్షణ  లేదు.రచయితల పట్ల విపరీతమైన గౌరవం,ఆకర్షణ వున్నా నన్ను నేను అట్లా చూసుకోవడాన్ని ఇష్టపడను .అది ఎందుకో ,ఆ వైరుధ్యమేమిటో నాక్కూడా తెలీదు .కాకపోతే ప్రస్తుతం వేరే పనేమీ లేదు కనుక నన్ను కదిలించిన మనుషుల గురించీ ,సంఘటనల గురించీ  రాస్తున్నాను.ఈ రాయడమనే ఆసక్తి ఎన్నాళ్ళు నాలో వుంటుందో కూడా తెలీదు .కానీ చదువుతూ మాత్రం వుంటాను జీవిత చివరి క్షణం వరకూ …

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది.
నా కవిత్వం నేను నా పాఠకుడితో జరిపే ఉదాత్త సంభాషణ. జీవితం ప్రసాదించే దు:ఖాన్ని స్వీకరించి, నేను నా పాఠకుడి సమక్షంలో – జీవితాన్ని ప్రేమించటంలోకీ, జీవితం లోలోతుల్లోని విలువల్లోకీ చేసే ప్రయాణం. కఠినమైన శిలలాంటి నిద్రనుండి, పూవులా కోమలమైన మెలకువలోకి నడుస్తూ, పాఠకుని నడవమని మృదువుగా చేయందివ్వటం. అయితే, ఈ కవిత్వం వెనుక ఉన్న జీవితానుభవం ఏమంత అందమైనదీ, ఆసక్తికరమైనదీ కాదనుకొంటాను. ఈ క్షణానకూడా, నేపధ్యమెందుకు, నా కవిత్వం చదివి చూడండని చెప్పాలని బలంగా అనిపిస్తూ వున్నా, పాఠకుడికి కవి నేపధ్యంపై ఉండే సహజమైన ఆసక్తిని కాదనలేక, నా సంక్షిప్త చిత్రాన్ని పరిచయం చేస్తున్నాను.

సాహిత్యం పట్ల ఒకరికి  ఆసక్తి ఎందుకు కలుగుతుంది. బహుశా వెలుపలి జీవితం తన లోలోపలి జీవనాసక్తికి తృప్తి కలిగించనప్పుడు లేదా వెలుపలి జీవితాన్ని తెలుసుకోవడానికి తన శక్తి చాలనప్పుడు ఆ తృప్తికోసం, శక్తి కోసం సాహిత్యంలోకి తొంగిచూస్తామేమో. ఇప్పుడు వెనుతిరిగి చూసుకొంటే, ఇతర కారణాలెలా వున్నా ఇవి రెండూ నన్ను పుస్తకాలవైపు కదిలించి వుంటాయనుకొంటాను. మా నాన్నగారు తను చదువుకొనే రోజులలో సాహిత్యం పట్ల కొద్దిపాటి అభిరుచి కలిగివుండటం మినహా, నాకు సాహిత్య నేపధ్యం కాని, వాతావరణం కాని లేవు. నన్ను సాహిత్యజీవిని చేసిన మరొక కారణం అసాధారణ సున్నితత్వం. నేను జీవించాలని ఆశించే ఉదాత్తమైన, సున్నితమైన ప్రపంచాన్ని పుస్తకాలలోనే వెదుకుకొనేవాడిని.

నేను మొదట పాఠకుడిని. బాల్యంలో చందమామ వంటి పుస్తకాలు నా మొదటి స్నేహితులు. తరువాత జీవితంలో ఆయా వయస్సులలో కలిగే ఉద్వేగస్థితులని బట్టి డిటెక్టివ్, పాపులర్ నవలలు పాఠకుడిగా నా మలి దశ. అయితే అవి నాలోపలి పాఠకుడి ఊహా, ఆలోచనా శక్తులకి తృప్తి కలిగించకపొవటం వలన క్రమంగా సీరియస్ సాహిత్యం నా దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో  మా ఊరి లైబ్రరీలో దొరికిన చాలామంది రచయితలని సీరియల్‌గా చదవటం గుర్తుంది. సీరియల్‌గా అంటే ఉదాహరణకు, విశ్వనాధ సత్యనారాయణను మొదలుపెడితే ఆయన పుస్తకాలన్నీ దొరికిన మేరకు వరుసపెట్టి చదివేయటం. ఈ అలవాటు చాలాకాలం అలానే వుండేది. ఆ రోజుల్లో గుర్తున్నంతవరకూ, శరత్, ప్రేంచంద్ మొదలైన చాలామంది రచనలు చదువుకొన్నాను.

నేను ప్రధానంగా నవలాసాహిత్యాన్ని ఇష్టపడేవాడిని. కానీ, ఇంటర్ చదువుతున్నపుడు, కొన్ని భావాలో, ఆలోచనలో తోసుకువస్తుంటే కవిత్వం రాయటం ద్వారా కవిత్వంతో నా అనుబంధం మొదలైంది. స్వభావరీత్యా చొరవ తక్కువ మనిషిని కావటం వలన, మనుషుల్లొకీ, సందర్భాలలోకీ చొచ్చుకుపోయే తత్వం లేకపోవటం వలన కూడా బహుశా నా అనుభూతుల్ని కవిత్వంలోకి అనువదించుకోవటం మొదలుపెట్టివుంటాను.

అప్పటి లెక్చరర్లు నాకవిత్వాన్ని ఇష్టపడి, నువ్వు కవిత్వం చదువు, అప్పుడు మరింత బాగా రాయగలుగుతావు అన్నపుడు మొదటిసారి మహాప్రస్థానం చదివాను. అది చదివాను అనటం కన్నా బట్టీ పట్టాను అనటం సరైనదనుకొంటాను. శ్రీశ్రీ శబ్దశక్తి, ఊహావరణాల్ని కదిలించే భావజాలం చాలాకాలం ఉత్తేజం కలిగించాయి. ఏపని చేసినా దానిలో లీనమైపోయే స్వభావం వలన, శ్రీశ్రీని చదివిన రోజుల్లో అదే వేగంతో చదివిన కమ్యూనిష్టు సాహిత్యమూ, తాపీ ధర్మారావూ, గురజాడా, రాహుల్ సాంకృత్యాయన్ వగైరాల ప్రభావంతో సమసమాజం రావాలనీ, ఒక్కొక్కసారి  ఉద్యమంలో కలిసిపోవాలనీ కూడా అనిపించేది.

శ్రీశ్రీని పరిచయం చేస్తూ, తనని పరిచయం చేసుకొన్న చలం రాసిన వ్యాసాలు సమాజంలోని అనేక చీకట్ల మీద తీవ్ర ధిక్కార స్వభావాన్ని నింపేవి. అయితే లోలోపల ఒక వెలితి సదా వెంటాడుతూ ఉండేది. ఆ వెలితి నాలోని ఉద్వేగాలకన్నా, అభిప్రాయలకన్నా ఇంకా చాలా లోతున ఉన్నది. దానిని అర్థం చేసుకొనే దారి కోసం వెదుకుతూ జిడ్డు కృష్ణమూర్తిని చదివినప్పుడు, ఈయన నాకు కావలసిన ముఖ్యమైన విషయమేదో చెబుతున్నారని అనిపించేది. అయితే నేను కేవలం తెలుగు మీడియం విద్యార్థిని కావటం వలన, నా చుట్టూ నన్ను నడిపించే ఎలాంటి ఆసరా లేకపోవటం వలన, అప్పటికి కృష్ణమూర్తివి తెలుగులో వచ్చిన ఒకటి రెండు పుస్తకాలు మినహా మరేవీ చదివే అవకాశం రాలేదు.

ఈ ఉపరితల ఉద్వేగాల నుండి మరింత లోతుకి వెళుతున్నపుడు, క్రమంగా ఇతర రచయితలకంటే చలం అత్యంత సన్నిహితుడిగా కనిపించేవారు. ముఖ్యం ఆయన నిజాయితీ, సున్నితమైన సంవేదనలు, లోతైన ఆలోచనలు, అంతంలేని సత్యాన్వేషణ ఇవన్నీ నన్ను పూర్తిగా ఆవరించేవి. చిన్నపుడు ఒక కథకుడిగా పరిచయమైన టాగోర్, చలం వలన మళ్ళీ కవిగా పరిచయమయ్యారు. చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకోవటం నాలోని ఉపరితల ఉద్వేగాలనుండి శాంతి వైపుగా, సత్యాన్వేషణ వైపుగా నడిచేలా చేసింది.

కొన్ని సందిగ్ధతలు, కొన్ని సమాధానాలు, వెంటాడుతున్న లోలోపలి వెలితి. ఈ దశలో, బలీయమైన హేతుదృక్పధం వలన, సాంప్రదాయిక ఆధ్యాత్మిక విశ్వాసాలూ, పద్ధతులూ అంతగా ఆకర్షించకపోవటం వలన నిజంగా నాకు సమాధానం దొరికేదెక్కడ అనుకొంటూ వుండగా, మళ్ళీ చలమే రాసిన, భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు అనే రెండు పుస్తకాలని సమీపించాను. మొదటిది చలం శ్రీ రమణమహర్షి గురించి ఆయన భక్తుల నుండి సేకరించిన అనుభవాలు. రెండవది, ముఖ్యంగా జెన్, భారతీయ మిస్టిక్స్ జీవితాలలోని సంఘటనలను చెప్పే కథానికలు. ఈ రెండు పుస్తకాలలో అత్యంత సరళమైన, ప్రేమాస్పదమైన జీవితాన్ని చూసినప్పుడు, అవి సత్యాన్ని గొప్ప సిద్ధాంతచర్చలనుండి, మత విశ్వాసాలనుండి విముక్తం చేసి కరతలామలకంగా చూపినపుడు వీటి గురించి కదా ఇన్నాళ్ళూ వెదుకుకొన్నాను అనిపించింది. శ్రీ రమణమహర్షి, జెన్ సాధువులు పరిచయమైన ఆ రోజులు సాహిత్యాన్ని ఆశ్రయించి బ్రతికిన నాకు, సాహిత్యం ఇచ్చిన గొప్ప కానుకలుగా ఈనాటికీ అనిపిస్తూ వుంటుంది.

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది. సత్యాన్వేషణ వెలుపలి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. ఆ సత్యమేదో తెలియాలి. అది మినహా, మిగతావన్నీ ఏమంత విలువలేనివి. ఆ క్రమంలో నేనెక్కడున్నానో, సత్యమెక్కడవుందో, మధ్యలో ఈ దు:ఖమేమిటో అర్థం చేసుకొంటూనే ఇంకా నడుస్తూవున్నాను. నిజానికి అక్కడితో నా సాహిత్య ప్రయాణం పాఠకుడిగా చివరికి వచ్చి, కవిగా ప్రారంభమయింది. చలం చెప్పినట్టు నాకూ, ప్రపంచానికీ మధ్య బహిరంతర యుద్ధారావం మొదలైంది. తరువాత కూడా సాహిత్యం చదువుకొన్నా బాగా ఎంపిక చేసిన రచనలు మాత్రమే చదివేవాడిని. క్రమంగా సాహిత్యం వెనుకపడి, సత్యాన్వేషణకు సహాయం చేసే రచనలు చదవటం ప్రధానమయింది. ఇదంతా నా ఇరవైలలోని ప్రయాణం.

అప్పుడు, నాలోపలి ప్రయాణాన్ని రికార్డు చెయ్యాలని శ్రీ భగవాన్ని   ఉద్దేశించి రాసిన కవితలూ, ఇతర భావాల నుండి ఎంపిక చేసిన వాటితో ఆరాధన సంపుటి ప్రచురించాను. తరువాత జీవన స్థితిగతుల వలన, ఆరాధన సాహిత్యలోకాన్ని చేరకపోవటం వలన చాలాకాలం ఏమీ రాయలేదు. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు పరిచయం కావటం తో, ఒక సందర్భంలో నేను రాసిన హైకూలని ఆయనకు చూపించటం, ఈ ప్రక్రియ నాకు తగినదిలా అనిపించి, వరుసగా మూడు హైకూ సంపుటులు ముద్రించటం జరిగింది. ఆ రోజుల్లోనే కొప్పర్తిగారు తణుకు బదిలీ అయి రావటం వలన, ఆయన ఆసరా కవిగా నన్ను నేను అంచనా వేసుకోవటానికీ, సరిదిద్దుకోవటానికీ ఉపకరించింది. మొదటి హైకూసంపుటి నాటికి నాకు హైకూ గురించి అంతగా తెలియదు. అప్పటికే ఉన్న తాత్వికనేపధ్యం వలన  హైకూ ఒక నిశ్శబ్దానుభవాన్నివ్వాలని మాత్రం అనిపించింది. తరువాత అలంకారరహితంగా, ఆలోచనారహితంగా నిర్మలమైన హైకూ అనుభూతిని ఇవ్వటం కోసం సాధన చేస్తూ మూడవసంపుటి నాటికి దానిని సంపూర్ణంగా సాధించగలిగానని అనిపించింది.

కానీ, ఎప్పటికప్పుడు నిరుత్సాహం కమ్ముకొంటూనే వుండేది. గొప్పకీర్తి రావాలనీ, పురస్కారాలు రావాలనీ ఏనాడూ ప్రబలంగా కోరుకోలేదు. అవి రానందుకు బాధపడలేదు. కానీ, ఇది గొప్ప కవిత్వం అని గ్రహించినవాళ్ళు కూడా దానిని పదిమందికీ చేర్చేందుకు తమకు చాతనయిన ప్రయత్నం చేయకపోవటం, ఫలితంగా ఇలాంటి సాహిత్యానికి ఎదురుచూసే పాఠకులకి ఇలాంటి కవిత్వం ఒకటి వుందని కూడా తెలియకపోవటం మాత్రం తరచూ బాధ కలిగించేవి. అదే నిరుత్సాహంతోనూ, వెలుపలి జీవితంలో ఉండే సహజమైన వత్తిడులతోనూ మళ్ళీ కవిత్వానికి దూరమయ్యాను. మధ్యలో, హైకూలు రాస్తున్నపుడు రాసిన వచన కవితలతో 2004లో నేనే ఈ క్షణం ముద్రించటం మినహా, పది సంవత్సరాలు కవిత్వరచనను విడిచిపెట్టాను.

మళ్ళీ క్రితం సంవత్సరం, 2011లో, సాహిత్యమిత్రుల పలకరింపులతో పాటు, నేను మాట్లాడితీరవలసిన విషయాలున్నాయని నాకు కూడా గట్టిగా అనిపిస్తూ వుండటంతో, ఒకటిరెండు కవితలతో నెమ్మదిగా మొదలై సుమారు నాలుగు నెలలలో ఒక ఉధృతిలో వందకుపైగా కవితలు రాసాను. వాటిని కొంత ఎడిట్ చేసి, పదేళ్ళలో అప్పుడపుడు రాసిన కొన్ని కవితలు చేర్చి ఆకాశం సంపుటి ముద్రించాను. సాహిత్యప్రపంచం నుండి యధాప్రకారం ఉదాసీన ప్రతిస్పందన. సాహిత్యాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పేవారు తెలుగునాట జరుపుతున్న సాహిత్యవిలువల పతనాన్ని ఇరవైయేళ్ళకుపైగా చూస్తున్నవాడిని గనుక, ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. కాని, పాఠకులలో మానవవిలువలు వికసించేందుకు ఉపకరించని, వారు తమ  జీవితాన్ని మరింత ప్రేమించేలా చేయని సాహిత్యం వారికి దూరమవుతుందని మన సాహిత్యవేత్తలు చాలామంది గ్రహించకపోవటం మాత్రం విచారాన్ని కలిగిస్తుంది.

ఇన్నాళ్ళకి రెండుమూడు అవార్డులు వచ్చి ప్రసాద్ కవిత్వాన్ని చదవమని పాఠకులకి రెకమెండ్ చేస్తున్నందుకు ఒక విషాదభరితమైన సంతోషంతో ఇప్పుడు ఈ మాటలన్నీ మీతో పంచుకొంటున్నాను. అయితే అవార్డులూ, కీర్తీ రావటంకన్నా నా అక్షరాలు, నేను ఆశించినట్టు, పాఠకుల హృదయాలను నిర్మలమైన కన్నీటితో, గాఢమైన శాంతితో, మెలకువలాంటి మౌనంతో నింపాయని తెలిసినపుడల్లా మాత్రం నా కవిత్వసాధన వృధాకాలేదని సంతోషం కలుగుతూ వుంది. ఆకాశం వలన ఇలాంటి అరుదైన స్పందనలని ఇటీవల చాలామంది పాఠకులనుండి వింటూవున్నాను.

గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!
మనసుతో మొదలైన నా సాహిత్య యాత్రగురించి నేనెంత వరకు మాటల్లో న్యాయంచేకూర్చగలనో నాకూ సవాలుగానే వుంది.కవిత్వం పైన ఆసక్తి ఎందుకుఅనేదానికి సమాధానం నా దగ్గర లేదు.

కానీ డిగ్రీ చదివేరోజులనుండి మొదలయింది అన్నట్టుగా గుర్తు. ఆంధ్రజ్యోతి,ఆంధ్ర భూమి ఇతరత్రా వారపత్రికలు తీసుకొచ్చేవారు మా నాన్నగారు. అందులోకవిత / కలం / ఓ కోయిలా(పేర్లు ఖచ్చితంగా గుర్తులేవు) అని ఒక పేజీవుండేది కవితలతో. పత్రికలు ఇంటికి రాగానే, మొట్టమొదటిగా కవితలు చదివాక గాని, మిగతా పేజీలకువెళ్ళేదాన్ని కాదు.

చదువుతున్నప్పుడు ఒక మంచి అనుభూతి మిగిలేదినాకు అర్ధమైనంత వరకు. అసలు కవిత్వమెలారాస్తారో అనేది నాకు అప్పట్లోఅతి పెద్ద ప్రశ్న.అలాకవిత్వంతో పరిచయం మొదలయింది. వేరే కవిత్వ పుస్తకాలేమీ చదవలేదు, తెచ్చుకుని చదవాలి అనే ఆలోచన లేదు. బెజవాడ అంటేనే సాహిత్యకేంద్రం, కానీ రచయితల్ని కలిసే అవకాశం, అంత ఆసక్తి అప్పుడే ఏర్పడలేదు నాకు. స్నేహితులతో ఎప్పుడూ సరదాగా వుండటమే గానీ, కవిత్వం పైన చర్చలు జరిపేంత విషయజ్ఞానం మాలో ఎవ్వరికీ  లేదు. ఇప్పటికీ నేనెవ్వరితోను కవిత్వం గురించి చర్చల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. కవిత్వమన్నది మనలో మనకే తెలీని ఒక కోణం. నామీద నాకో అపనమ్మకం అనుకోవచ్చు. కవిత్వం రాయగలను, కానీ దాని పూర్వాపరాలు చర్చించలేను. ఎందుకో ఒక్కోసారి ఆ చర్చలో ఆ కవిత అందాన్ని కోల్పోతుంది అనే భావన కావొచ్చు.

ఇక అన్నిటికంటే కవిత్వం వ్రాయడానికి బాగా అనుకూలించిన అంశం’అమెరికా లో జీవనం’. కావల్సినంతనిశ్శబ్ధం, కోరుకున్న దాన్ని మించి ఏకాంతం. నామొట్టమొదటి కవిత 2001 లో ‘H4′ (dependent VISA) మీద రాసాను.

ఇక తర్వాత అన్నీప్రేమ – ప్రకృతి మీద రాసినవే. అప్పట్లోకవిత్వమంటే ఆ రెండు అంశాలేఅనుకునేదాన్ని. 2004లో నాకు తెలుగుపీపుల్.కాం అనే వెబ్సైటు పరిచయమయింది. అది నిజంగా నాకవిత్వపయనంలో ఒక మైలు రాయి అని చెప్పుకుంటాను. నిజంగా మంచి ఆసక్తి వున్నఎంతోమంది కవులు అక్కడ ‘కవిత్వమంటే ఏంటి ‘ అనే విషయం మీద పలురకాలుగా చర్చలు జరిపేవారు. నాలాంటి ఎంతోమంది కి పండగే, ఎంతో నేర్చుకునేవాళ్ళం. ఇక అప్పటి నుండి,జీవితంలో జరిగే అనుభవాలకు, అనుభూతులకు మాటలు కట్టి, ప్రకృతి పరమైన ఊహలు జోడించితే పెల్లుబికిన పదాల కనికట్టు – మనసులోనిభావానికి సమానంగా సరితూగగల్గితే, అది ఖచ్చితంగా కవితవుతుంది అని తెల్సుకోగలిగాను.అప్పుడు కలిగే ఎనలేని తృప్తినిమాత్రం తిరిగి కవితలోకెక్కించలేనిదని, ఇది స్వానుభవంలో నేర్చుకున్నదే. కవిత్వమంటే నిజం. కవిత్వంలోకి అబద్ధాన్నిఏకోశానా జొప్పించలేము, ఎందుకంటే అది అక్కడ అతకదు. అందుకే ఇక్కడ కేవలం ఊహాశక్తిఒక్కటే సరిపోదు. స్పందనతో కూడిన సృజనాశక్తితోనే కవిత్వంఫలిస్తుంది. కవిత్వం గురించి ఎంత తెలుసుకున్నా, మునుపెన్నిసార్లురాసినా, కవిత రాసిన ప్రతిసారీ ఒకే భావన ‘ప్రతి కవితామొదటి కవితే. అదే బాధ, అదే ఒత్తిడి.’

నేను రాసిన “వానకు తడిసిన రాత్రి” అనే కవితకు తెలుగుపీపుల్.కాం లో (2006) అవార్డు ప్రకటించారు. ఆ అవార్డులో భాగంగా నాకు కొన్ని మంచి పుస్తకాలు పంపించారు. అవే మొట్టమొదటిసారిగా నా దగ్గర కవిత్వ పుస్తకాలు చేరడం. అందులో నేను ఇష్టంగా మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో చదివినవి మహెజబీన్ గారి “ఆకురాలు కాలం” , విన్నకోట రవిశంకర్ గారి “వేసవి వాన”. అద్భుతమైన కవితలు – జీవితానికి దగ్గరగా తీసుకెళ్తూనే, మనల్ని ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళే కవితలు. మనసుని నొక్కిపెట్టి, నిజమనిపించే భావదృశ్యాలు. పేజీ తిప్పాలంటే కాస్త భయం – మళ్ళీ ఏమి చదవాలో, ఆ అనుభూతిని ఎలా పట్టి ఆపాలో అని. నిజమైన కవిత రాయడమే కాదు, చదివి తట్టుకోవడం కూడా ఒక కళ – ఒక అనుభవం.

ఇవి నా మొట్టమొదటి హైకూలు:

ఎన్నివేలమైళ్ళ పయనమో

పూరేకుపై మత్తుగా పడుకుంది

మంచుబిందువు

ఆకాశానికి,నా గదికి

రాత్రికి రాత్రే  రోడ్డు

తలుపుసందులోంచి సూర్యరశ్మి

సూర్యుడు మా ఇంటి గుమ్మం నుండి

పెరట్లోకెళ్ళడానికి

పగలంతా ప్రయాసపడతాడు

” ఒక్కోసారి కళ్ళ ముందు కాస్తున్న ఎండను, గాలి మోసుకొచ్చే పరిమళాలను ఇదివరకెప్పుడో అనుభవించినట్టుగా అనిపిస్తుంది. వెంటనే మనసు ఒంటరిదవుతుంది.” , ” ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు గతంలోను, వర్తమానంలోను నిశ్శబ్ధాన్ని నింపడానికి. అయినా నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకి, సందడి తోసుకెళ్ళలేదెందుకో.” ఇవి నేను రాసుకున్న మరికొన్ని లైనులు – నిజమే మరి. బాధలోంచి వచ్చిన కవిత్వం నిజంగాను, స్వచ్చమైన ప్రవాహంలాను వుంటుంది. ఆ క్షణాల్లో ఆ పదాలే ఓదార్పు కూడాను. నాకెప్పుడూ అనిపిస్తుంది కవిత్వమెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించదని, అంత గొప్పగా పలికించలేదనిను. గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి.

నన్నెప్పుడూ ఆకట్టుకునే పదం’జీవితం’. నావరకు అదొక సంభ్రమం, అదొక ఆశ. ఎందుకంటే నేనకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగలేదు – అందుకే నాకు జీవితమంటే ఆసక్తి, ఏంటిది అనే ఒక ఉత్సుకత. అందుకే నేను రాసిన కవితల్లో ఎక్కువ భాగం ఈ అంశం చుట్టూరానే అల్లుకున్నాయి.  నే రాసుకున్న వాటిలో, నాకు తృప్తినిచ్చిన కొన్ని లైనులు…

ఒంటరిగా వున్నప్పుడు

వర్షం చప్పుడు విన్నావా!?

వర్తమానం అదుపు తప్పుతుంది

విరహమో! వైరాగ్యమో!

ఓ వైవిధ్యమైన భావమో!

బాల్యం గుర్తొస్తుంది

బంధం గుర్తొస్తుంది

బాధ గుర్తొస్తుంది

ప్రతి చినుకూ

వంద ఆలోచన్లగా చిందుతుంది.

ఒక సంఘటనకి ఎన్ని సంఘర్షణలు!

సందేహాలు…సమాధానాలు

వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి

సంతృప్తి నీడల్లోనూ

ఏదోక అలజడి శబ్ధం

మిగిలిపోతూనే వుంటుంది

బహుశా అదేగాబోలు

పగటికీ, రాత్రికీ తేడా చూపేది.

ఇక ఈ యాత్రలో తీపి/చేదు అనుభవాలుఅంటే, రెండిటి సమాధానం కవిత్వం రాయడమే. రాసిన కవిత మనసుకినచ్చితే తీపి అనుభవం, నచ్చక ఇంకా ఏదో అందకుండా మిగిలిపోయింది అని చతికిలపడినప్పుడు చేదు అనుభవం. చక్కనిప్రవాహంతో ముస్తాబయిన కవితని చూస్తే తీపి అనుభవం, రాసేటప్పుడుమాత్రం ప్రాణం తీస్తుందే…అప్పుడు ఖచ్చితంగా చేదు అనుభవం. కొన్నిసమయాలుంటాయి మొత్తం కవిత్వమయమనిపించేలా. తరువాత కాలాలు మారుతాయి, అసలు మనమేనా ఇన్ని కవితలు రాసింది అనిపించేలా.

నాకు 2012 సంవత్సరానికిగాను ఉత్తమకవిత్వానికి గుర్తింపుగా ఇస్మాయిల్ అవార్డు రావడం చాలా సంతోషంగావుంది. కాకపోతే అవార్డెప్పుడు కవిత్వానికి (ఏ కళకైనా) కొలమానంకాదు కాబట్టి సంతోషానికన్నాను, నా కవిత్వంపైన నాకునమ్మకాన్ని పెంచడానికి దోహదపడిందని అనుకుంటాను.