వాకిలి » స్మరణిక

పరిమళాలు మిగిల్చిన మాలతి
ఒక యుగం ముగిసిపోయింది . ఒక రచనా కురువృద్ధు రాలు తెరమరుగయిపోయారు. 84 సంవత్సరాలు సాహితీ ప్రపంచపు సామ్రాజ్ఞి చాలిక సెలవంటూ తరలిపోయారు.

బాల్యంలోనే ప్రమదావనాలు చదివి వ్యక్తిత్వాన్ని దిద్దుకున్న నేను ఆవిడ శిష్యురాలిని. నిన్నటి వరకూ కూడా ఆవిడ పాత కెరటాల్లో ఓలలాడటం, నన్ను అడగండి అంటూ చెప్పే జవాబుల్లో లోకాన్ని దర్శించటం ఇప్పుడిప్పుడు జరుగుతున్నట్టే ఉంది. ఆవిడ ప్రతి నవలా ఎన్నిసార్లో చదివి ఉంటాను .

“అమ్మాయ్ , నేర్చుకుంటూ నలుగురికీ చెప్పడమే నేను చేస్తున్న పని. నీ చుట్టున్న ప్రపంచానికి నీ రచన ఒక మార్గదర్శి కావాలి, ఒక దీపం కావాలి . ఒక చేతి కర్ర కావాలి. ఒక ఊతమవాలి” ఈ నాలుగు మాటలూ నాకు శిరోధార్యం. అవే నాకు వెలుగు బాట.

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం.. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. ఆమె బాల్యం అధికభాగం నూజివీడులోనే గడిచింది, 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.

ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూ ర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా ఆవిడకు డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. మద్రాసు కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియో లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని ఆమె దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు.. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు.. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో పరిచయం ‘పాత కెరటాలు’ శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు . 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. ఈ ఆగస్టు 21 న చెన్నైలో ఈమె క్యాన్సర్ వ్యాధి తో కన్ను మూసారు.

మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర
(గుంటూరు శేషేంద్ర శర్మ వర్థంతి సందర్భంగా)

శేషేంద్ర వచన కవితా కళను గురించి చాల తక్కువే పరిశోధన జరిగిందని చెప్పాలి. శేషేంద్ర పద్యరచనా సామర్థ్యం గురించి నేను కాదు నన్నయకన్నా ప్రాచీనుడైన విశ్వనాథ సత్యనారాయణ అంతటి ప్రాచీన కవే చెప్పాడు. శేషేంద్ర లాగా పద్యం రాయగలిగిన వాడు తెలుగు దేశంలో నలుగురైదుగురు కూడా లేరని అన్నాడు. ఆయన ఋతు ఘోష పద్య కావ్యం నాకు చాలా కాలం పారాయణ గ్రంథంలా ఉండేది. అంతటి పద్యరచనా కళను సొంత చేసుకున్న శేషేంద్ర వచన కవితలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేశాడు. అంతే కాదు నేను ఎప్పుడూ అంటుంటాను అదేమంటే మామూలు వచనాన్ని అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం అంటే విషయాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చే వచనాన్ని రాస్తూ కూడా అలాంటి వాక్యనిర్మాణాలు చేస్తూ కూడా దాన్ని అద్భుతమైన కవితగా మార్చే శక్తి ఒక రసాయనిక చర్య అని అది ఒక కళ అద్భుత కళ. ఇదే వచన కవితాకళ. అయితే అలాంటి పరిణతి ఈ కాలానికి వచ్చింది. తొలి తరం వచన కవులు చాలా మంది అంతకు ముందు పద్యాలు గేయాలు రాసిన వారే. ఆనాటి వచన కవితల్లో అర్థగేయాల లాగా కనిపించేవి చాలా ఉంటాయి. శ్రీశ్రీకూడా వచన కవితలు రాశాడు. కాని అవి ఇంకా వచన కవితలు అని చెప్పుకునే వీలు లేని దశకు సంబంధించినవి గా కనిపిస్తాయి. ఆది ప్రాసలు అంత్యప్రాసలు లేదా ఊతపదాలు. చివరిలో మిత్రమా, అని భాయీ అని నేస్తమా అని సంబోధించడాలు, వగైరా మసాలాలు అన్నీ కూర్చి రాసే వారు. నారాయణ రెడ్డిగారి తొలినాటి వచన కవితల్లో కూడా ప్రాసలమీద మోజు శబ్దాల గలగలమీద యావ పోలేదు. అన్నీ కనిపిస్తాయి. వారి తరువాతి తరంలో వారు రాసిన వచన కవితలను గురించి ఇక్కడ మాట్లాడను. తర్వాత చెబుతాను. కాని ఆతరంలోనే కలం పట్టి రాసిన కవి శేషేంద్ర. కాని శేషేంద్ర అంతటి పద్య కవికూడా వచనకవితలో చాలా చాలా ప్రయోగాలు చేశాడు. కవులు వచన కవితను రాస్తూ వాటిని పాదాలు విభజించి రాస్తారు. కాని నూటికి తొంబై తొమ్మిది మంది ఈ పాదాలను ఇలా కాకుండా ఇంకోలా విరిచినా అర్థాలు మారవు కదా ఇలా ఎందుకు విభజించావు అంటే సమాధానం చెప్పలేరు. నిజానికి అలా పాదాల విరుపును మార్చినా ఉద్దిష్ట అర్థాలు మారవు. అంటే ఇక్కడ పాదాల దైర్ఘ్యం యాదృచ్చికం అన్నమాట. అలాంటప్పుడు పాదాల విభజన ఎందుకు అని పాదాలు లేకుండా నవలలో లాగా కథలో లాగా బారుగా పంక్తులు పంక్తులుగా వచన కవితను రాస్తే తప్పేంటి అది కవిత ఎందుకు కాదు అనే ఆలోచనతో తొలిసారిగా వచన కవితను అలా ప్రచురించినవాడు (నాకు తెలిసి) శేషేంద్ర. నా దేశం నా ప్రజలు కావ్యాన్ని ఇలా ప్రచురించాడు. వచన కవితను కథలాంటి ప్రచురణతో అంటే పాదవిభజన లేకుండా ప్రచురించాడు. కాని ఇది వచనం కాదు అని కవిత అని చెప్పడానికి ప్రతి వాక్యం లేదా వాక్య శకలం అందులో సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ కావ్యం గురించి ఇంతకు ముందు పరిశోధన జరిగింది. దాన్ని గురించి చాలా వివరంగా మరొక వ్యాసంలో రాస్తాను. శేషేంద్ర వచనకవితా కళను గురించి ప్రత్యేకించి చెప్పవలసే ఉంది.

ఈరోజు శేషేంద్ర వర్థంతి దీని సందర్భంగా ఆయనకు నివాళి ఇవ్వడానికి ఆయన రాసిన ఒక కవితను ఇక్కడ వివరంగా విప్పిచెప్పాలనుకుని ఈ పనిచేస్తున్నాను. ఆ కవిత “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనేది. ఇది అందరికీ తెలిసినట్లు గా 1975లో ముత్యాల ముగ్గు సినిమాలో వచ్చింది. ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ చాలా భాగం జ్ఞాన్ భాగ్ ప్యాలెస్ అది అప్పటి శేషేంద్ర నివాసంలో జరిగింది. ఈ పాటగురించి చాలా సమాచారం ఉంది. ఇది శేషేంద్ర రాసిన ఒకే ఒక సినిమా పాట. కాని దీన్ని గురించి వేరే పెద్దలు చెప్పిందేమంటే ఇది అంతకుముందు రాసిన ఒక కవితకు పరిణామ రూపం అని. కాని శేషేంద్ర కుమారుడు సాత్యకి చెప్పడం మాత్రం వేరు. ఇది కేవలం ఆసినిమా కోసమే ఆయనతో రాయించారు. అని నూటనాలుగు డిగ్రీల జ్వరంలో పాట రాసారని. మద్రాసు సవేరా హోటల్ లో ఉండి రాసారని సాత్యకి స్వయంగా నాతో చెప్పారు.

కాని ఈ పాట, పాట లక్షణాల కన్నా వచనకవితలోని నిర్మాణ లక్షణాలను బాగా పుణికి పుచ్చుకున్నది. శేషేంద్ర వచన కవితను రాసే శైలి ఇందులో బాగా కనిపిస్తుంది.

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది.”

పాటలో నిజానికి సమతూకం ఉన్న పాదాలు అక్షర పునరావృత్తులు ఒక చోట ఎక్కడో యతి సాధారణంగా ఉంటుంటాయి. ఇందులో కొన్ని పాదాలలోనే మైత్రి కనిపిస్తుంది. మిగతా చోట్ల వచన కవిత నిర్మాణపు పోకడలు కనిపిస్తాయి.

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ఈ పాదం నిజానికి ఆరోజుల్లో కాని తర్వాతి రోజుల్లో కాని ఏ సినిమా పాటల్లోను కనిపించని తరహా వాక్యం ఇది అచ్చు వచన కవితలోనే కనిపించే లాంటి వాక్యం. ఇలాంటిది మామూలు వచనం రాస్తే 1. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి పనిమనిషి వచ్చింది. 2. ఎవరూ లేని ఇంట్లోకి ఆవు జొరబడింది. 3. గడ్డి ఏపుగా పెరిగిన తోటలోకి ఎద్దు వచ్చేసింది. ఇక్కడ చెప్పిన మూడు వాక్యాలు మామూలు వచనం అంటే వీటిలో వాచ్యార్థం తప్ప మరే అర్ధాలు లేవు. పని మనిషి వచ్చింది. ఆవు జొరబడింది, ఎద్దు వచ్చేసింది అనే క్రియా పదాలు కేవలం అక్కడ యదార్థంగా ఉన్న పనిని తెలిపే క్రియాపదాలు. కర్తలు పనిమనిషి, ఆవు, ఎద్దు ఈ మూడింటిలోను ఉన్న ఇల్లు పాసివ్ గా ఉండిపోయిన అచేతన వస్తువు. ఇది ఒక వాక్య నిర్మాణం, ఇలా మామూలు వాక్య నిర్మాణంతో ఎన్ని వాక్యాలైనా చేయవచ్చు. కాని వీటికి ఉన్నది వాచ్యార్థమే.

సరిగ్గా ఇలాంటి వాక్యాన్నే శేషేంద్ర ఇక్కడ రాసాడు. అది – నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది—- తోట నిదురించదు. కారణం నిదురించే లక్షణం ఉన్న సజీవికాదు తోటని నిర్జీవి అని చెప్పలేము కాని మనిషిలాంటి చలనశీలమైన జంతువులాంటి చలనశీలమైన జీవి కాదు. ఇలాంటి అచేతన వస్తువును ఇంగ్లీషులో చెబితే ఇనానిమేట్ ను ఒక సజీవంగా అంటే ఒక మనిషి గుణాన్ని ఆపాదించి అంటే ఏనిమేట్ లక్షణాన్ని ఆపాదించి నిదురించే తోట అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. పైన చెప్పిన వాక్యాలలో పనిమనిషి వచ్చింది, ఆవు వచ్చింది ఎద్దు వచ్చింది అనే నిర్మాణం లాంటి వాక్య శకలమే ఇది. కాని ఇక్కడ వచ్చింది అని చెప్పింది పాట. ఇది కూడా నిర్జీవం దీనికి కూడా జీవ లక్షణాన్ని ఆపాదించి వాక్యాన్ని రాశాడు. పూర్తయ్యే సరికే నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్యం పూర్తిగా వాచ్యార్థం ఏమాత్రం లేకుండా వ్యంగ్యార్థం అంటే అక్కడ లేని భిన్న ఉద్దిష్టార్థాన్ని ఇస్తుంది. ఇక్కడ నిజానికి తోటలేదు పాటా లేదు. ఒక నిర్జీవంగా ఉన్న నిరాశామయంగా ఉన్న నాయిక జీవితంలోనికి ఒక వ్యక్తి జీవితంలోనికి ఒక సంతోషకరమైన అమితానందకరమైన సంఘటన జరిగింది. ఒక అల్పుడైన కవి రచయిత రాస్తే ఇలాంటి శుష్కవచనాన్ని రాస్తాడు. కాని శేషేంద్ర వాక్యం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్య రచనలోనే మామూలు వచనాన్ని అద్భుతమైన వచన కవితగా మార్చిన ఇంద్రజాలం ఉంది. ఈ ఇంద్ర జాలం మిగతా పాటలోని వాక్యాలన్నింటిలో ఉంది.

దీని తర్వాత రెండు వాక్యాలు చూడండి —- రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ/ దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ —- ఈ రెండు పాదాల్ని మీరు గమనిస్తే ఇందులో పాట లక్షణమైన మైత్రి మీకు కనిపిస్తుంది. కాని వాక్యాలుగా పై వాక్యం వంటి వాక్యాలు కావు. వీటికి వాచ్యార్థాన్ని చెప్పవచ్చు, లక్ష్యార్థాన్ని ధ్వనినీ చెప్పవచ్చు. కాని నిదురించే తోటలోకి అనే వాక్యంలో వాచ్యార్థాన్ని చెప్పడం కుదరదు. తర్వాతి వాక్యం —శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ— ఈ వాక్యానికి వాచ్యార్థం చెప్పడం కుదరదు. నాయిక భావనాస్థితే వర్ణితం ఇక్కడ.

తర్వాతి చరణం మరింత గాఢంగా ఉంటుంది. చూడండి. విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో/ ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. —విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో— వాక్యాన్ని ఇలా చెప్పడం అద్భుతమైన వచన కవితా ప్రయోగం. కోర్కెలు అనేవి సజీవ ప్రాణులు కాదు అంటే ఇవి మనః స్థితిని చెప్పేవి. గుమ్మంలో కోర్కెలు వేలాడడం అన్నది నిర్జీవ అమూర్త విషయానికి మూర్తమైన ఒక వస్తువు లక్షణాన్ని ఆపాదించడం. మామిడి ఆకులు వేలాడాయి అంటే మాములు వచనం అవుతుంది. ఇక్కడ కోర్కెలు గుమ్మంలో వేలాడాయి అని చెప్పాడు. ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించి వచన కవితలో వాక్యాన్ని రాయడం అన్నది అద్భుతమైన టెక్నిక్. శేషేంద్ర చేసిన దీన్ని బాగా ప్రతిభావంతంగా పట్టుకున్న తర్వాతి తరపు వచన కవి అఫ్సర్. అఫ్సర్ రాసిన రక్త స్పర్శ కవితల్లో చూస్తే ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించే టెక్నిక్ కనిపిస్తుంది. సైగల్ పాటమీద రాసిన కవితలో ఈ లక్షణం ఉంది. చాలా చోట్ల ఉంది. ఈ టెక్నిక్ ని అఫ్సర్ ఇప్పటికి కూడా చాలా విరివిగా వాడుతున్నాడు. యాకూబ్ తన కవితల్లో దీన్ని ఇంకా రిఫైన్ చేయడం కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు కవులు ఈ టెక్నిక్ ని చాలా ప్రతిభావంతంగా వాడుకున్నారు. అంటే ఇక్కడి నాఉద్దేశం శేషేంద్రని అనుసరించారని చెప్పడం కాదు. ఒక వచనకవితా కళని వారు పట్టుకున్నారు. దాన్ని మరింత ప్రతిభతో మరింత గట్టిగా పాఠకులకి అందజేశారు.

ఇక పాటలో తర్వాతి వాక్యాలు పూర్తిగా ఇదో ధోరణిలో సాగుతాయి.—–కొమ్మల్లో పక్షుల్లారా!/ గగనంలో మబ్బుల్లారా! / నది దోచుకుపోతున్న నావను ఆపండీ!/ రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ—- పాటలో చివరి వాక్యం రేవు బావురు మంటూందని నావకు చెప్పండి అనేది గుండెను పిండేస్తుంది. రేవు బావురు మనడం కూడాపైన చెప్పిన కళే. నావ నదిని దోచుకు పోతుంది అని చెప్పడం శేషేంద్ర వంటి అత్యంత ప్రతిభాశాలి సృజన శీలి మాత్రమే అనగలిగే మాటఇది. నాయకుని కోల్పోయిన ఒక నాయిక మనఃస్థితిని ఇంత గాఢంగా ఇలా వర్ణించిన కవిత కాని సినిమా పాట కాని మరొకటి కనిపించదు.

నిజానికి ఈ పాట సినిమా పాట లక్షణాలతో రాయలేదు. సినిమా పాటలో లేని సాధారణంగా పనికి రాని వచన కవితా లక్షణాలతో రాసిన పాట ఇది. ఈ పాట క్లాస్ పాఠకులను కవితా ప్రియులను గాఢంగా ఆకట్టుకున్నట్లుగా మామూలు సినీమా ప్రేక్షకులను మాస్ శ్రోతలను ఆకట్టుకోలేదు. ఈ పాట బాగుందని ఏ సినిమా నిర్మాత కాని, సంగీత దర్శకుడు కాని శేషేంద్రని పాటలు రాయమని కోరలేదు. ఆలా ఊహించి కూడా శేషేంద్ర ఈ పాట రాయలేదు. కావాలంటే సినిమా మాస్ పాటని అవలీలగా రాయగలిగిన ప్రతిభావంతుడు శేషేంద్ర కాని తన కవితావ్యక్తిత్వానికి భిన్నంగా రాయలేదు. వచనంలో శేషేంద్ర చేసే ఐంద్రజాలిక చర్యకి మంచి ఉదాహరణ సినిమా పాటల్లో అనర్ఘరత్నం ఈ నిదురించే తోట పాట.

చిత్రం : Muthyala Muggu(ముత్యాలముగ్గు) (1975)

రచన : గుంటూరు శేషేంద్ర శర్మ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

Song Lyric : Nidurinche thotaloki paata okati vachindi

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ

ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ

విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా!

గగనంలో మబ్బుల్లారా!

నది దోచుకుపోతున్న నావను ఆపండీ!

రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ

బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా
‘బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న… క్షణాల మధ్య అగాథంలో స్వప్న చక్షువుల నిషా’ ను రుచి చూపించించిన కవి అజంతా.  పువ్వులు, అగ్నుల భాష కలిసిపోతే ఎలా వుంటుందో వాసన చూయించిన కవి. ‘కాంతా సమ్మితత్వా’న్ని వదులుకోకుండానే ‘అగ్నిసమ్మితమై’న కవిత అజంతాది.

తెలుగు అజంత భాష. తెలుగు పదాలు హల్లులతో కాకుండా అచ్చులతో అంతమవుతాయి. అందుకే తెలుగుకు ఇంతటి సంగీత శక్తి. తెలుగుదనాన్నే కాదు, తెలుగు సంగీతాన్ని వచన కవితలో అందించిన కవి అజంతా.

చిన్న చిన్న వాక్యాలు చుదువుకోడానికి బాగుంటాయి. వాటికి కాస్త పద మైత్రి కలిస్తే వచనం వేగంగా వెళ్లిపోతుంది. ఎక్కడున్నామో తెలిసే లోగా రైలు స్టేషన్ కు చేరుతుంది. చదవీ చదవక ముందే పద్యం అయిపోతుంది. పెద్ద వాక్యాల రూపంలోనే కవి తనదైన సంగీతం పలికించగలడనుకుంటాను. అలాగని వివరించలేదు గాని, ఒక సారి నా పద్యాలు చూసి, పెద్ద వాక్యాలుగా రాయి అని అయన ఇచ్చిన సలహా సారం అదేననుకుంటాను. అజంతాలో చిన్న వాక్యాలు చాలానే ఉంటాయి. సంగీత ఝరిని కొన్ని క్షణాలు ఆపడడమే, వచనానికి అలల రూపం ఇవ్వడమే వాటి పని. కాస్త ఆగి మళ్లీ మొదలవుతుంది వడిగా సాగే నది. మరీ ఎక్కువగా చిన్న వాక్యాలున్న చోట, కింద పేరు తీసేస్తే, అది అజంతా పద్యమని అనుకో బుద్ధి కాదు.

(పెనుమర్తి విశ్వనాథశాస్త్రి – అజంత)

తన భావవోద్విగ్నాలే కాదు, వాటిని మన కంటికి అందించే అక్షరాలు కూడా కలల్లోనివే అంటాడాయన. అందుకే, తన వ్రాతను ‘స్వప్నలిపి’ అన్నాడు. ఈ ‘లిపి’కి వేరే ప్రిఫిక్స్ లు చేర్చి, ఇతర కవులు తమ ప్రకటనలు తాము చేసుకున్నారు, శ్రీ శ్రీ తరువాత ఎందరో ‘ఫలానా శ్రీ’లు పుట్టినట్టు. అజంతాను ఒక తరం ఎంత ఇష్టంగా చదువుకుందో చెప్పడానికి ఈ ఉదాహరణ. వాళ్లు అజంతాను అనుకరించారని కాదు. నేర్చుకున్నారు. ప్రేమగా నమస్కరించారు.

అజంతా నాకు చాల చాల ఇష్టం. ఈ మధ్య కొత్తగా మితృడయన ఒక చదువరి సాయంత్రపు నడకలో ఎదురై ‘మిమ్మల్ని చదివితే అజంతా గుర్తుకొస్తాడ’ని అన్నాడు. అది నిజం కాదు గాని, ఆ మాటను గొప్ప మెచ్చికోలుగా తీసుకుంటాను. అంతిష్టం నాకు అజంతా అంటే. దేర్ఫోర్, ఈ చిన్ని రచన అబిమాన కలుషితమని మధ్యంతర హెచ్చరిక.

ఈ అభిమానం మొదట్నించీ ఉన్నది కాదు. చాల ఆలస్యమయ్యింది అజంతాను తెలుసుకోడానికి. గుడిహాళం రఘునాథం అనే కవి లేకపోయి వుంటే, ఆనాటి నన్ను తను అంతగా ప్రేమించకపోయి వుంటే, విభేదాల్ని నంజుకుంటూ నా ఖాళీ గ్లాసుతో తన గ్లాసు తాటించి ఛీర్లు కొట్టకపోయి వుంటే, నేను అజంతాను తెలుసుకోడం ఇంకా చాల ఆలస్యమయ్యేది. రఘు ఇప్పుడు లేడు. అజంతా కూడా లేరు. లేరూ? ఉన్నారనే అనుకుంటున్నా. ఇప్పుడు పేర్లు చెప్పను గాని, అజంతా నుంచి ఉప్పందుకుని రాస్తున్న కవికుమారులు ఎందరో ఉన్నారు. ఊరికే రాయడం కాదు, చాల గొప్పగా రాస్తున్నారు.

మాకు తెలీకుండానే ఒక సాయంత్రం రాత్రయిపోయిన అద్భుత వేళ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ క్యాంటీన్ దగ్గర ఆరుబయట అజంతా సంగతి వచ్చింది. గుర్తున్నంత వరకు అక్కడ సునారె, అసురా, గుడిహాళం, నేనూ ఉన్నాం. ‘అజంతా అర్థం కాడు, అర్థం కాని కవిత్వాలెందుకు?’ అనేశాను అప్పటి నా జ్ఙాన, నిబద్దతలను సమపాళ్లలో రంగరించి. ‘మాకు అర్థమయ్యాడు, నీకెందుకు అర్థం కాడ’ని రఘు సవాలు. సవాళ్లను సవాళ్లుగా మాత్రమే తీసుకునే ఒక సద్గుణం నన్నెన్నో సార్లు కాపాడింది. వాటిలో ఇదొకటి.

ఆ రాత్రి నల్లకుంట లోని మా ఇల్లు నాబడు ఒక ఇరుకు సింగిల్ రూం చేరి, అప్పుడే అచ్చయిన అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు” (1981 జులై ఇరవై నాలుగు ‘ఆంద్రజ్యోతి’) పద్యాన్ని ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. తెల్లారిన సంగతి గమనించ లేదు. ‘ఇక నిద్రపోరా నాయ్నా పొద్దున్నే ప్రెస్సులో ‘విమోచన’ పత్రిక పనుంద’ని నాకు నేను చెప్పుకోబోయి, అప్పుడే మా జయమ్మ లేచి ఏదో పని మీద బయటికి వెళ్లడానికి సిద్ధమవుతుంటే చూసి, చిన్న నవ్వు నవ్వేసి, అలాగే ఆ సిరిచాప మీదే కూర్చుని అజంతాతో విబేధిస్తో, ఆయన మీద అమిత ప్రేమతో రాసిన ‘కంట్రోల్ ది కంప్యూటర్’ సృజనలో అచ్చయి, మొదట సారి ప్రేమలేఖ రాసి, దానికి జవాబు వచ్చినా రాకున్నా ఆ అమ్మాయిని మరిచిపోని అబ్బాయిలా అజంతా ప్రేమలో పడిపోయాన్నేను.

అజంతా గొప్ప స్నేహశీలి. రుజు స్వభావి. చాల తక్కువ మాట్లాడతారని అంటారు. అది నా అనుభవం కాదు. మనకు ఏది/ఎవరు ఇష్టమో అది/వారు ఆయనకూ ఇష్టమైతే, ఎట్టా మాట్లాడుతారంటే, ఆయన దగ్గర్నించి వచ్చాక చాల చాల రోజులు అక్కడ కూర్చుని ఉన్నట్టే, ఆయన మాటలు వింటున్నట్టే మత్తు మత్తుగా ఉంటుంది.

బెల్లంకొండ రామదాసు కవిత్వం భలే ఇష్టం నాకు. ‘నయాగరా’ అనే పుస్తకంలో మొదట కుందుర్తి, చివర ఏల్చూరి సుబ్రహ్మణ్యం (‘ఏసూ ఏసుకో ఒక గళాసు’ అనే శ్రీశ్రీ పద-చమత్కారం లోని  ఏ.సు.), ఆ యిద్దరి మద్యలో బెల్లంకొండ రామదాసు వుంటారు. రామదాసు పద్యంలో ఒక చోట ‘తిరగలి రాళ్ల మధ్య గింజ’ అని వున్న ఇమేజ్ ని గుర్తు చేసి, ఆ ఇద్దరి మధ్య రామదాసు గారు తిరగలిరాళ్ల మధ్య గింజలాగే వున్నారని అనేశాను తెగించి. అనేసి అజంతా ఏమంటారోనని ముఖం మరో వైపు తిప్పుకున్నాను. అజంతా పరవా లేదన్నట్లు కళ్లతోనే భుజం తట్టి, ఇక తనూ, రామదాసు మద్రాసు (చెన్నై) లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పిన కబుర్లతో ఆ చీకటి రాత్రి భళ్లున వెన్నెల కురిసింది.

ఆ మాటల్లో నాకు బాగా ఇష్టమయినది: తమ చిరు/నిరుద్యోగపు రోజులవి. ‘నిరుద్యోగి వెంకట్రావు’లు దారి పొడుగునా ‘చెట్లై కూలుతున్న’ రోజులవి. ఇద్దరూ జేబులో డబ్బుల్లేకుంఢా హోటల్లో భోంచేసి వెళ్తున్నప్పుడు, రామదాసు గారు ‘రేపు’ అంటో ఒక మాటను కౌంటరు మీదికి విసిరే వారట. ఇది నన్నెంతగా హాంట్ చేసిందంటే, చాల రోజుల తరువాత ఒక కథలో దాన్ని ఉపయోగించుకుంటే గాని మనసు ఊరుకోలేదు.

అజంతా భయపడిన వాడని అంటారు. కాదని నా అభిప్రాయం. భయపడిన ప్రపంచాన్ని వ్యక్తం చేసిన వాడు. రోడ్ల మీద మనషుషుల భయాన్ని తన భయం చేసుకున్న వాడు. కవిగా ఉన్నత ప్రమాణాలు పెట్టుకుని జీవించిన మనిషి. ఆయన భయపడింది ‘మీడియోక్రిటీ’కి మాత్రమే. అలాగని ఆ సంగతి బయటికి చెప్పలేని మొహమాటస్తుడు. ‘మీడియోక్రిటీ’కి నిజమైన విరుగుడు శ్రమ, శ్రద్ధ.

పలువురు గొప్ప కవుల్ని, అప్పటికి అచ్చు కాని (వాళ్ల) పద్యాలతో పరిచయం చేస్తూ అబ్బూరి వరద రాజేశ్వర రావు గారు రాసిన ‘కవన కుతూహలం’ పుస్తకానికి అజంతా రాసిన ముందు మాట చదివారా? అది ఎట్టాగూ చదివి తీరాల్సిన పుస్తకమే. ఇప్పటికి చదవకపోతే తప్పక చదవండి. ముందుమాటలో అజంతా దాదాపు ఇదే మాట చెబుతూ; పని నుంచి ఇంటికి వచ్చాక శుబ్రంగా స్నానం చేసి, మాసిన బట్టలు మార్చుకుని, శ్రద్ధగా కూర్చుని ఈ పుస్తకం తెరవండని అంటారు. (నిజమైన) భక్తుడు పూజకు కూర్చున్నంత శ్రద్ధ పుడుతుంది పుస్తకం చదవక ముందే మనకు. ఆ తరువాత ఏ మంచి పుస్తకం పట్టుకున్నా కాస్త మనస్సును శుభ్రం చేసుకుని, శ్రద్ధగా కూర్చోవాలనిపిస్తుంది. ఎట్టా రాయాలో కాదు, ఎట్టా చదవాలో కూడా తెలుసుకోవచ్చు అజంతా నుంచి.

(అజంత – స్కెచ్ వేసింది రామశాస్త్రి)

‘మీడియోక్రిటీ’కి సంబంధించి ఆయన మాటలు ఎంత పదునుగా ఉండేవంటే, ఆయన ఎవరి గురించి ఆ మాట చెబుతారో వాళ్ల మీద మనకు చాల జాలి వేస్తుంది. ఎంత జాలి అంటే, ఆ ఫలానా మనిషి స్థానంలో మనల్ని మనం ఊహించుకుని వణికి పోతాం. ఎప్పటికీ అతడిలా కాకుండా వుండాలని నిశ్శబ్దంగా ఒక సంకల్పం చెప్పుకుంటాం.

కనిపించినపుడంతా అతి వినయం ప్రదర్శించే ఒక కవి గురించి, ‘తల పైకెత్తితే ఎక్కడ  తెగిపోతుందో అన్నట్టుంటాడు’ అన్నారు అజంతా. నాకు పలు మార్లు గుర్తొచ్చే వాటిలో ఈ దృశ్య-వాక్యం ఒకటి. మరీ ఎక్కువగా గుర్తు  పెట్టుకున్నానో ఏమో దీన్ని. ఏదో పని వడి ఎవరినైనా మనసులో లేని మెచ్చికోలుతో ప్లీజ్ చెయ్యబోతే అజంతా వాక్యం తల లోంచి మెరుపులా దూసుకుపోతుంది.

అట్టాంటి వాళ్లుండాలి. వాళ్ల మాటలు వినాలి. వినగలగడం ఒక అదృష్టం. ఆ అదృష్టం పట్టిన వారిలో నాది చివరి పంక్తి అని తెలుసు. అది చాలు. వినడమంటే ఒప్పేసుకోవడమని కాదు. శ్రద్ధగా వినడమని, విని, మనకు మనం నిర్ణయానికి రావడమని అర్థం. కవిగా శ్రీశ్రీ పద్ధతి కూడ అదే అనుకుంటాను. శ్రీశ్రీ చనిపోయినప్పుడు, శ్రీశ్రీకి ‘ముందూ తరువాతా చీకటి’ అని అజంతా అనడానికి అదీ ఒక కారణం కావచ్చు. తను స్వయంగా అంతటి నిర్భయుడు కాకపోయి వుంటే, అజంతా ఇప్పుడు వుండే వారు కాదు, ‘తలెత్తితే తల తెగిపోతుందని భయమా’ అంటో మన తలల్లో మెరుపై దూసుకుపోవడానికి.

తెల్లని చీకటిలో నల్లని మెరుపు అజంతా. ‘రోడ్లు నమస్కరించాల్సి’న కవి అజంతా. వీథి మానిసిని కావ్య నాయకున్ని చేసుకుని అతడికి నేనున్నానని బాసట పాట పాడిన గాయకుడు అజంతా.

అజంతాతో సంవాదం ఎప్పటికీ అయిపోదు. అయన శైలి కూడా సంవాదాత్మకమే. ‘స్వప్న లిపి’లో ఆయన పద్యాలన్నీ ఉన్నాయో లేవో. ఇవి నా పద్యాలని ఆయన అనుకున్నవన్నీ ఉన్నాయి. దాదాపు అన్నిటిలో అయన నేరుగా మనతో మాట్లాడుతారు, ఊరించి, ఊగించి, కూకటి వేర్లు కదిలించి.

ఒకసారి రాయడంతో, అచ్చేయడంతో పద్యం ఆగిపోదని, నిత్యం వృద్ధి చెందుతుంటుందని అంటారు అజంతా. ఏ పద్యం అచ్చయిన రూపంలో ఆఖరుది కాదని అయన భావించారు. కవిగా తన పని అయిపోయిందని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తానింకా ‘లిట్మస్ టెస్టు’ దాటలేదనే భావించారు. దాటడానికి, కవనమే జీవనమై తపించారు. ఆ కాసిన్ని పద్యాలతో ఒకటి రెండు తరాల్ని ఊపేసి, ప్రభావితం చేసినా తన గురించి తాను అనుకున్న ఈ మాటల్లో నటన ఏమాత్రం లేదు. అవి ఆయన నిజంగా అనుకున్నవే. ఇది కూడా మనకు పాఠమే.

సమ్మోహన మీ మోహన గీతం..
కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగు నాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో  ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, ‘మో’ ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

ఇతని కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి – “చితి-చింత”.

కవితా వస్తువు కవిత్వంలో ప్రాథమికంగా నిలబడని ప్రతిచోటా, కవి గొంతు, కవి భావం బలంగా వినపడతాయని విశ్వసించిన వ్యక్తి మో. ఆ భావమే వస్తువుగా మారి కవిత్వాన్ని నిలబెట్టగలదని నమ్మాడాయన. నిరూపించాడు కూడా! కానీ, మో రచనలు చదివే వారిలో అత్యధికులు ఇక్కడే అయోమయానికి లోనవుతారు. వస్తువును వెదుక్కునే అలవాటు నుండి బయటపడలేక – అతి ప్రాచీనమైన తమ తప్పుడు తూనికరాళ్ళతో, మో కవిత్వాన్ని తూచే విఫల యత్నం చేసి, నిరాశ పొందుతారు.

(మో)

“నా కోసం మంచు రాల్చిన ఆకాశమా

చివరికి నువ్వే రూక్ష వీక్షణాల్తో నను శిక్షిస్తే నికోలస్ రోరిక్ వేసిన “సోర్స్ ఆఫ్ గాంజెస్”

హిమాలయ చిత్రాల మంచు సోనల నీడల్లో దాక్కుంటాను అక్కడొక్కచోటే మనిషి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది.

మాటిమాటికీ

బ్రతుకు దుఃఖాలకి ఆడపిల్లలా కన్నీళ్ళు నింపుకునే నగ్ననేత్రం చీకిపోయి నీళ్ళోడి చివరికి అక్కడొక్కచోటే జ్ఞానదీపం వేడిగా కాలుతుంది” (చితి-చింత : ఆలస్యం కవిత నుండి) బాహ్య ప్రపంచానికి దూరంగా, ఒకానొక ఏకాంతాన్ని వెదుక్కుంటున్న మనిషికి ఆ కాస్త అదృష్టమూ చిక్కిందా, అన్ని బంధాలూ తెంచుకుపోతాయి. తనలోలోపలికి చేసే ప్రయాణం ఫలించిందా, ఎన్నాళ్ళుగానో తపిస్తున్న వెలుగు కనపడి తీరుతుంది.

“బ్రతుకు దుఃఖాలకు ఆడపిల్లలా ‘కన్నీళ్ళు’ నింపుకునే నగ్ననేత్రం చీకిపోయి నీళ్ళొడితే ‘జ్ఞానదీపం’ ‘వేడిగా’ వెలగడం”  – మో ముద్ర!

వచన కవిత్వమంటే అప్పుడూ ఇప్పుడూ కూడా చాలా మందికి ఒక చిన్నచూపు. “వచనం వ్రాసి కవిత్వమని అమ్ముకుంటున్నా”రంటారు. కవులు అమ్ముతారు సరే, పఠితలకు తెలియదూ? కాలపు పరీక్షలకు ఎదురొడ్డి నిశ్చలంగా నిలబడి, చదివిన ప్రతిసారీ కొత్త మెలికలు తిరుగుతున్న నదిలానూ, కొత్త మొలకలు తొడుగుతున్న లేలేత మొక్కలానూ కనపడుతూ- మానసాన్ని స్పృశిస్తూ  చర్చించబడేది వఠ్ఠి వచనమెలా అవుతుంది ?

మో కవిత్వంలో అంతర్లీనంగా ఒక లయ ఉంటుంది, చూసేందుకు పదాలను ఇష్టానుసారం ముక్కలుగా విడగొట్టి రాసేడన్న భ్రమ కలిగించినా, కవిత చదివేటప్పుడు ఆ లయ పాఠకులకు విస్పష్టంగా తెలిసిపోతుంది. ఆ కళ అతని కవిత్వానికి కొత్త సొబగులేవో అదుతుంది.

“ఆనందపూర్ణ సరస్సులో ఎర్రకల్వల్లో ఆశ్చర్య సజల నేత్రాల్లో నిమ్మచెట్టు మీంచి రాలిపడిన వానచుక్కలో ఎక్కడా నీ బొమ్మేనా రివ్వుమని చిమ్మే దానిమ్మపండు అరుణారుణ ప్రేమలో ఇంకా ఈ ప్రపంచం చూడని శిశువు ఆత్మలోంచే ఆకల్తో కేకవేస్తే వక్షంలో పాలతో జలపాతంతో ప్రతీక్షించే అమ్మలో ఎల్లెడెలా నువ్వేనా ఒక్క నువ్వేనా నీ హఠాత్ ప్రేమతో నా భూతభవిష్యత్ జన్మల్ని నరికితే

ఈ నా రూపం కరిగిపోదా నీ వెలుగు మెరుపులోకి! “              (అతీతం కవిత నుండి)

“నాకుగాదులు లేవు, ఉషస్సులు లేవు” అని కృష్ణశాస్త్రిగారన్న మాటలను జ్ఞప్తికి తెస్తూ, మో కూడా “నాకు కార్తీక పూర్ణిమా స్నానములు ళేవు కృశాంగిత నిజాకృతికి వెన్నెల వస్త్రములూ లేవు” అంటూ నైరాశ్యాన్ని గుమ్మరిస్తారు.

అన్ని మాటలన్నా,

“ఎటూ ఈ శరీరపు రేఖలు వెలిసిపోయేవేగదాని

ఎండకూ వానకూ చివరకు వహ్నిశిఖలకూనని

అనావర్తపు ఆత్మకు రూపురేఖలు దిద్దుతున్నవాణ్ణి” అని ఒకసారీ,

“నువ్వు వెయ్యి చెప్పు

చివరికి మనందరం చింతాక్రాంతులమయ్యే ఉంటాం

ఓరబ్బాయ్

ఇదంతా రామదాసు చెరసాల. ఎండావానా నర్తనశాల.” అంటూ ఇంకొక్కసారీ,

“సత్యం హఠాదర్శన మివ్వదు

శాంతి మీట నొక్కితే వెలగదు

అంతరంగాన్ని ముగ్గుపొడి పెట్టి తుడవాలి

దయాస్పర్శతో తడపాలి

అందాకా ఆనందపు తడినంటిన వెలుగుచుక్క మెరవదు. ”

అని మరోసారీ చెప్పిన మోలోని కవినీ తాత్వికుడినీ విడదీసి చూడగలమనుకోవడమొక తప్పిదమే అవుతుంది.

వాన చుక్క నింగిని విడిచి నేలకు జారుతుంటే నిబిడాశ్చర్యంలో మునిగి మనం గమనించేది అందులోని పవిత్రతనూ, నిసర్గ సౌందర్యాన్ని. మో లోని కవికి మాత్రమే, ఆకాశం అంతరంగంలోని దయ కనపడుతుంది,

“వృథా వర్షమని శపింపకు

ఎంతో దయ లేకపోతేకానీ ఎవరూ

అధోముఖంగా ఈ పృథ్విపై పడరు” అనడంలో ఇన్నాళ్ళూ మనకు తోచని అసామాన్యమైన భావమేదో తడుతుంది.

మో కవిత్వం అర్థం చేసుకోదగినది కాదనీ, ఆంగ్ల పదాల విచ్చలవిడి వాడకంతో తెలుగు కవిత్వమే కాకుండా పోయిందనీ ఘాటైన విమర్శలే ఉన్నాయి. మో ఆంగ్ల వాడకం పట్ల పరిమితులు పెట్టుకున్నట్లు ఎక్కడా తోచదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఫలానా ఆంగ్ల పదమే పడాలని అనిపిస్తే, అది నిస్సందేహంగా వాడే ధోరణే  “మో”లో మొదటి నుండీ చివరి దాకా కనపడుతుంది.

కె.వి రమణారెడ్డి గారు తన స్వాగత వచనాల్లో వాటికి బదులుగా అననే అంటారు – ” అర్థమ్ముగాని తత్వగీతమ్ములివి” అని ఆక్షేపించడం కంటే సులువైన పని విమర్శకుడికి మరొకటి ఉండదు. గహనంలోనైనా సుగమమైన మార్గాన్ని తీయడం అతని ధర్మమైనప్పుడు, తత్వ కవిత్వాన్ని చూసీచూడక ముందే చేతులెత్తి దణ్ణం పెట్టి తన బాధ్యతను వదులుకోవడం, అతగాడూ సామాన్య పాఠక స్థాయికి పడిపోయి కూడా విమర్శక బిరుదాన్ని తలదాలుస్తూండడమే” -అని.

ఏకాంతంలో చుట్టుముట్టిన అంతుపట్టని విషాదానికి ప్రతీకలుగా కన్నీటి బొట్లు జలజల రాలి పడినట్లూ, ముప్పిరిగొన్న మోహంతో ఒక చుక్క మకరందం కోసం ఝుంఝుమ్మంటూ వేల తుమ్మెదలు ఒక్కసారి వాలినట్లూ, మనమెన్నటికీ కనిపెట్టలేని మరో ప్రపంచపు రహస్యాలేవో మోసుకొస్తూ అర్థరాత్రి ఆకాశం నుండి నక్షత్రలేవో తూలిపోతునట్లూ – ఎన్నెన్ని భావనలో కలిగించే కవిత్వం “మో” సొంతం.

అర్థమవడానికి ముందే అనుభూతులేవో రగిలించి, విషాదవియోగాల అంచుల్లో నిలబెడుతూనే అర్థమవనక్కర్లేని శాంతిని పాఠకులు రుచి చూపించి, తెలుగు వచన కవిత్వంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన “మో” కవిత్వం, ఆ మహాకవి మరణం తరువాతే మరింతగా ప్రజలకు చేరడం, మన సాహిత్యానికి మహావిషాదం.

నవనవోల్లాసంతో ఎగసిపడ్డ కవిత్వమేదైనా  మానసికంగా మరుగుజ్జులైన వాళ్ళు అడ్డునిలిస్తే ఆగిపోదనీ, స్థలకాలాలకతీతంగా జనం నాల్కలపైన నాట్యమాడే మధురమోహన  గీతమై మిగిలిపోతుందనీ నిరూపించిన మో – కవితా ప్రపంచంలో అమరుడనడం అతిశయోక్తి కాదు.