వాకిలి » అమ్జద్

ఆ ఒక్క నిమిషం
హాల్ లో ఉన్న గోడగడియారం పదిగంటలైన సూచన ఇచ్చింది. అప్పుడే టెలిఫోన్ కూడా గొంతు చించుకోవడం మొదలెట్టింది. ఏవేవో ఆలోచనలలో ఉన్న నేను ఉలిక్కి పడ్డాను.  చేయి చాపి రిసీవర్ తీసుకున్నాను.

“హెలో….”

” మిసెస్ ఫ్లెచర్ ? ” రెండవ వైపు నుంచి ఓ అపరిచితుడి స్వరం.

” యస్ మాట్లాడుతున్నాను.”

” నేను వైటన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను .ప్లీజ్ ఓ నిమిషం హాల్డ్ చేయండి. నేనిప్పుడే ….”  రెండవ వైపు లైన్ లో నిర్జీవమైన నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

నా మనసులో అవ్యక్తమైన భయం పుట్టింది . గుండె లో గుబులు మొదలైంది. ఈ సమయంలో ఓ పోలీస్ స్టేషనుంచి ఫోనొచ్చిందంటే  కారణమేమై ఉంటుంది. ఒకే కారణం స్ఫురిస్తూంది . యాక్సిడెంట్! ఓమైగాడ్!! మేలర్ కు యాక్సిడెంట్ అయిందా? ఆ దుర్ఘటనలో మరణించాడా? ఓ ….. నో….నో… ఇది నిజం కాదు. తప్పుడు సమాచారం.  ఇలా కాకూడదు. నా బుర్ర పని చెయ్యట్లేడు. శరీరం చెమటలతోతడిసిపోయింది. వెన్నెముక లో భయం విద్యుత్తులా ప్రవహించింది. నిర్జీవమైన చేతుల్లో రిసీవర్ పట్టుకోని రాబోయే విపత్తు గురించి ఆలోచిస్తూ వణకసాగాను.

ఈ రోజుదయం మేలర్ మహ కోపంతో ఇంట్లోంచి వెళ్ళాడు. కళ్లలో నుంచి నిప్పురవ్వలు రాలుస్తూ, పెద్దగా చప్పుడు చేస్తూ గట్టిగా తలుపు మూసి వెళ్ళాడు.   తర్వాత  పోర్టికోలో నుంచి అతడు ఏ విధంగాకోపంతో కారును రివర్స్ గేర్ లో తీశాడో…  ఆ శబ్దాన్ని వింటే అతని మనుసు ఎంత కకవికాలమైందో అర్ధమవుతుంది.  టైర్ల కీచు శబ్ధం తారురోడ్డును చీల్చుతూ, ఓ మలుపు తీసుకోని వేగంగా పారుతున్న ట్రాఫిక్ లోజొరబడి, ప్రవాహంలోపడి అగమ్యం వైపు కు  కొట్టుకుపొతున్నాడా అనిపించింది నాకు. ఇదంతా నా కళ్ళారా కి టికీ లోనుంచి చూడసాగాను. ఆ సమయంలో మా ఇద్దరి కళ్ళు ఒకసారి కూడా కలుసుకోలేదు.

అతడి ఓవర్ స్పీడే అతని ప్రాణాలు తీసి ఉంటుంది.  అందుకే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్… నా మతిమండి పోను… అతడి స్నేహితుల కోసం భోజనం తయారు చెయ్యమన్నప్పుడు నేను బిజీగా ఉన్నాననేవంకతో నిరాకరించకపోతే అతడికి కోపం వచ్చేది కాదు, ఈ దుర్ఘటన జరిగేది కాదు.

ఇది మా మొదటి జగడం కాదు.  చిన్న చిన్న విషయాల పై వాదులాటలు జరుగుతూనే ఉంటాయి.  ఇలా మా  పాప పుట్టినప్పట్నుంచి మొదలైంది.  జెని పుట్టక ముందు మన ప్రేమలో ఏలాంటి లోపమురాదని నమ్మించే దాన్ని. కాని జెని పుట్టాక నా వాగ్దానాలు బూడిదలో పూసిన పన్నీరులా అయ్యాయి.  నా సమయమంతా ఆమెకే కేటాయించాను.  నా శ్రద్దంతా జెని వైపుకే వెళ్ళేది.  ఆమె బాగోగులు చూడటం లోనేరేయింబగళ్ళు గడిచిపోయేవి. చూడటానికి చాలా ముద్దుగా బోసి నవ్వులతో చూడముచ్చటగా, ఉన్న మాస్వీట్ బేబిగర్ల్ నాగుండెలయలా ఉంది.  ఓ క్షణం కూడా ఆమెను వదలి ఉండలేను.  అంచేత మేలర్, నేనూరాత్రిభోజనం మాత్రమే కలసి చేసేవాళ్ళం. మేలర్ తో సరిగా మాట్లాడే తీరిక కూడా ఉండేది కాదు.  జెని పై నా ఆసక్తి అతన్ని నాకు దూరం చేయసాగింది.  అతడికి తగిన సమయం ఇవ్వలేకపోయాను.  పాప మీద ప్రేమనన్ను పిచ్చి దాన్ని చేసింది.  ఆమె ఏడుపుకు నేను అదిరిపోయేదానిని.  నా గుండెలకు హత్తుకొని  సముదాయించే దానిని. ఇలాంటి గారాబం చేయడం వల్లనే మేలరుకు దూరమవుతు ఉన్నాను. రిసీవర్ పై పట్టువల్లనా చేతి వ్రేళ్ళు  తెల్ల బడ్డాయి.  ఈ వ్యక్తి నన్ను లైన్ లో పెట్టి ఎటు మాయమై పోయాడో దేవుడెరుగు ! ఈ కొన్ని క్షణాలు కొన్ని యుగాల్లా ఉన్నాయి నాకు !

నా ధ్యాస మేలర్ అమ్మ వైపు,  మా అత్తగారి వైపు కెళ్ళింది.  తన కొడుకు మరణ వార్త వినగలిగే ధైర్యం ఆమెకుందా! ఆది కూడా ఏకైక పుత్రరత్నం మరణ వార్త!  ఆమె ఈ వార్తను భరించలేకపోతుంది. నేనంటేనే ఆమెకసలు ఇష్టం లేదు.  పైగా తన కొడుకు మరణానికి కారణం నేనే అనుకుంటుంది. జెని పుట్టాక ఆమె దగ్గర నా అర్హత, ప్రేమ, వాత్సల్యం, గౌరవం కోల్పోయాను.  నేనెప్పుడూ ఆమె ఇంటికి జెనిని నాతోతీసుకవెళ్ళలేదు.  పాపని ఇంటిలోనే వదిలేసి మేలర్ తో వెళ్ళేదానిని. వృద్దురాలి రోగం జెనికి తగుల్తుందేమోననే భయం.  నా అత్తగారు రోగాల పుట్ట.  ఆమెకు లేని రోగం అంటూ లేదు.

“మనం ఈ సారి జెనిని వెంట తీసుకెళదాం అమ్మ దగ్గరికి. మనమరాలిని చూడలేదని ఆమె చాలా బాధపడుతుంది. అమ్మ ద్వారా జెనికి ఏలాంటి రోగం తగలదు. ఇదంతా  నీ భ్రమ. రోగాలు  వృద్దాప్యానికీసూచన మాత్రమే, అవి అంటు  రోగాలు కావు !” అని క్రితం వారం మేలర్ నాకు నచ్చజెప్పాడు.

కానీ నేను ఒప్పుకోలేదు.  దీని వల్ల కూడా మేలర్ నాపై కోపంగా ఉన్నాడు.  కాని నాకు గత్యంతరంలేదు. జెనిని అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు.

పెంళ్ళయిన మా మొదటి సంవత్సరం హాయిగా,  ఆనందంగా గడిచింది.  మాపాప మా ఇద్దర్ని మరీ దగ్గరిగా చేస్తుందనుకున్నాను.  కాని జెని మా ఇద్దరి మధ్య ఓ పెద్ద అగాధంలా మారింది.  మా భార్య భర్తలమ ధ్య  అడ్డు గోడగా  తయారైంది.  నాకు పిల్లలంటే చాలా ఇష్టంగా ఉండేది. కాని ఇప్పుడది మూర్ఖత్వంలా అనిపిస్తుంది. మొదట్లో నేనే మేలర్ ను వాళ్ళ అమ్మ నుంచి విడదీసి వేరుగా కాపురం పెట్టాను.  నా ప్రేమలోపడి ఒప్పుకొన్నాడు.

కాని జెని రాకతో నా ప్రమాణాలు నీటి మూటలే అయ్యాయి. నా ఆసక్తి  అంతా ఆమె వైపే. మేలర్ మీద నేను చూపిన ఆశ్రద్ద ఏలాంటిదో నాకిప్పుడు అర్ధం అవుతుంది. కాని ఇప్పుడు లాభం ఏమిటి? చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లయింది.

లోపలి గదిలో నుంచి వినిపిస్తున్న జెని ఏడుపు నన్ను కుదిపింది.  ప్రస్తుతం నా ఆలోచనలు, హాస్పిటల్ శవదహన క్రియల వైపు సుడిగుండం లా తిరిగసాగాయి.  జెని ఏడుపు స్థాయి పెరిగింది.  కాని దాన్నినేను పట్టించుకోకుండా మరోసారి  ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతున్నాను. ఇప్పుడు నేను అతని తల్లి ముందు అపరాధిగా నిలబడి ఉన్నాను.  అతడు లేకుంటే నేనెవరిపై ఆధారపడి బ్రతకాలి ! ఇంటినిఅమ్మేసి  లేదా ఉద్యోగం చేసి మిగతా జీవి తాన్ని గడపాల్సుంటుంది. ఇలాంటి స్థితిలో జెని గురించి ఎవరు పట్టించు కొంటారు ?  జెని… నా ప్రాణం.  నేను అపాదమస్తకం కంపించి పోయాను.

ఓ గాడ్ ! నేనెక్కడ చిక్కుకున్నాను ! ఈ వ్యక్తి ఎక్కడ చచ్చి పోయాడు… లైన్ లో ఉండమన్నాడు… నేను కోపంతో ఊగుతూ రిసీవర్ నా రెండవ చేతికి కొట్టుకొంటు… నే..ను ఎప్పుడు కూడా మేలర్ తో గొడవపడను అతని పట్ల అశ్రద్ద చేయను. దేవుడు అతడిని సురక్షితంగా ఉంచుగాక.  భగవంతుడా నాకు సహాయపడు అని మనసులో బడబడలాడసాగాను.

రెండవ వైపు రిసీవర్ లో కటకట శబ్ధం వినబడగానే నాగుండె వేగం పెరిగిపోయింది. భయంకరమైన విషాద వార్తను అందుకోడానికి నన్ను నేను సంబాళించుకోన్నాను.  రెండవ వైపు రిపీవర్ లో నుంచి ఆ వ్యక్తిగొంతు వినిపించింది.

“వెరీ సారి మిసెస్ ఫ్లేచర్… మీకు కష్టం కలిగించినందుకు కాని…. “మరో సారి గాఢమైన నిశ్సబ్దం అలుముకుంది!? ఆ వ్యక్తి  మొహన్ని నా చేతి గోళ్లతో పిచ్చిపిచ్చిగా గీకాలనిపించింది.  నాకెందుకిలాఎదురుచూసేలా చేస్తున్నాడు ? ఎదురు చూస్తున్న క్షణాలు నా ఆదీనం లో  నుం చి తప్పి పోతున్నాయి.

హమ్మయ్య ! చిట్ట చివరికి అవతలి వైపు నుంచి సమాచారం అందింది, ” చూడండి మిసెస్ ఫ్లేచర్ ! బహుశ మీకు గుర్తే ఉంటుంది… మూడు నెలల క్రితం మీకో బంగారపు ఉంగరం దొరికింది,  దానిని మాకందజేశారు. దీని గురించి హక్కు దారులెవరు కూడా ఏలాంటి రిపోర్టు ఇవ్వలేదు.  ఇది తమదేనని ఎవరు చెప్పలేదు కాబట్టి న్యాయపరంగా మీరే ఈ ఉంగరానికి హక్కుదారులు.  మీరు దీన్ని మా పోలీసు స్టేషన్ కొచ్చి తీసుకోగలరు.ఓ. కె గుడ్ బై !“ అంటు రిసీవర్ పెట్టేశాడు.

గట్టిగా ఓ శ్వాస పీల్చాను.  రిసీవర్ చేతిలో నుంచి క్రింద పడి పెండ్యులమ్ లా ప్రేలాడసాగింది.  కాళ్ళు చేతుల్లో  సత్తువ లేక ప్రక్కనే ఉన్న సోఫాసెట్ లో కూలబడ్డాను.  కొన్ని వందల మైళ్ళ దూరం నుంచిపరుగెత్తుకొంటూ వచ్చినట్టనిపించింది.  చూపు నా చేతిగడియారం వైపు పడింది.  నా నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది.  గడియారం పది గంటల ఒక్క నిమిషం చూపుతుంది. అంటే ఈ ఫోన్ కాల్ ఒక్క నిమిషందా ?  ఈఆటంతా ఓ నిమిషంలో ముగిసింది.  కాని ఈ నిమిషం నాకు ఓ యుగం కంటె పెద్దగా అనిపించింది.

మరోసారి తృప్తిగా ఊపిరి తీసుకొన్నాను.  జెని అరుపులు,  ఏడుపులు నా చెవుల్లో మోగసాగాయి.  సోఫాలో నుంచి తటాలున లేచి జెని ఏడుస్తున్న గది వైపు బయల్దేరాను.  కాని కొన్ని అడుగులు ముందుకువేశానో లేదో ఏదో అవ్యక్తమైన శక్తి నన్ను ముందుకు కదలనీయలేదు.

గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “…. నో డియర్… నేనింకా చాలా అత్యవసరమైన పనులు చేయాల్సున్నాయి….నువ్వింకాస్తా ఏడ్వడమే  మంచిది !” అని నాలో నేనే చెప్పుకున్నాను.

నేను మారిపోయాను !

నా హృదయం ఆనందం తో నాట్యం  చేస్తుంది.  ఇల్లంతా తిరిగి,  పరుగెత్తుతు చిన్న పిల్లలా సంతోషంతో గట్టిగా కేరింతలు పెట్టాలని మనసు తహతహలాడసాగింది.

నేను సంతృప్తిగా తలాడించి, గొంతెత్తి అన్నాను, ” మీ నాన్నగారికి ఫోన్ చేయబోతున్నాను.  అతడు వాళ్లమ్మ దగ్గరే ఉండి ఉంటాడు.  అతనితో  చాలా ముఖ్యమైన విషయాల గురించి  మాట్లాడాలి.  ఇంకో నిముషం కూడా ఆగలేను.”

సంతోషంగా టెలిఫోన్ సెట్ వైపు వెళ్ళసాగాను మేలర్ కు ఈ విషయం చెప్పి తేలిక పడటానికి.

మూలం: English: ONE MINUTE OF ETERNITY (Anonymous)

అనువాదం: అమ్జద్

సెకండ్ హ్యండ్
“వద్దురా, అల్లా! నాకు సిగ్గుగా ఉంది?”

“అయ్యో గిందులో సిగ్గేంటే, నేను ఇప్పుకో లేదా నా బట్టల్ని?”

“ఉయ్!” సిగ్గు పడింది చమ్కి.

“ఇప్పుతావా లేదా? అనాబికి చెప్పనా?” శహజాది పాషా గట్టిగా అరిచి౦ది. . ఆమెకు నరనరానా ఆజ్ఞాపించే అలవాటుంది.

చమ్కి కొద్దిగా తడబడుతూ, మరికొద్దిగా సిగ్గు పడుతూ, తన చిన్నారి చేతులతో మొదట కుర్తా విప్పింది. తర్వత పైజామా . ఆ తర్వాత శహజాది ఆజ్ఞ ప్రకారం సబ్బు నురుగలతో నిండిన నీటి టబ్బులో ఆమెతో పాటు దిగి౦ది.

ఇద్దరు స్నానించాక , చిన్నగా నవ్వుతూ “ఇంగ చెప్పు. నువ్వు ఏం బట్టలు తొడుక్కు౦టావు ? “శహజాది పాషా గొంతులో పొగరు, అధికారం.

“బట్టలా?” చమ్కి అమాయకంగా అంది, “గివే! నా నీలం రంగు పైజామా , కుర్త గిట్ల!”

శహజాది పాషా విస్తూబోతూ, ముక్కెగరేస్తు, “ఛీ! ఇంత పాడు వాసన కొడ్తున్నవేనా! మరి స్నానం చేసి లాభమేమిటి?” అని అడిగింది

చమ్కి జవాబుకు బదులు ఓ ప్రశ్న వేసింది, “మరి మీరే౦ వేసుకు౦టున్నారు పాషా?”

“నేనా!” శహజాది పాషా, గర్వంగా అంది, “నేనైతే నా బిస్మిల్లా రోజున మా తాతమ్మ కుట్టించిన చమ్కీ చమ్కీల బట్టలు …అవే తొడుక్కొంటాను. అయినా నా బట్టల విషయం నేకె౦దుకు?”

చమ్కి ఓ క్షణం ఆలోచనలో పడింది. మళ్లీ అంది నవ్వుతూ , “ఆలోచిస్తున్నాను…!”

“ఏమిటో?” శహజాది పాషా కుతూహలంగా అడిగింది.

ఇంతలో, బయట అనాబి గొంతు చించుకోవడం వినిపించింది.

“అయ్యో పాషా! నన్ను హమామ్ నుంచి బయటి కెళ్ల గొట్టి గీ పోరితో ఏం గప్పాలు కొట్టుకు౦ట కూర్చున్నావు? తొందరగా తెమలండి. లేకుంటే బీ పాషాకు గిప్పుడే పోయి జెప్తా.”

చమ్కి తన మనసు లో మాట చెప్పింది నెమ్మదిగా, “పాషా… మీరు నేను పైట మార్చుకోవడం వల్ల అక్క చెల్లెళ్ళయినాంగా. మరి మీ బట్టల్ని నేనేసుకోవచ్చుగా?”

“నా బట్టలా” అంటే ఆ బట్టలన్నీ…పెట్టెలో నిండి ఉన్నాయి…గవన్నియా?”

జంకుతూ ‘అవు’నన్నట్లు తలూపింది. శహజాది పాషా కడుపుబ్బ నవ్వింది.

“అయ్యో ఎంత పిచ్చి పొల్లవి. నువ్వైతే పనిదానివి. నువ్వు నేను తొడిగి విడిచిన బట్టలేసుకు౦టావు. నువ్వు బ్రతికున్నంత వరకు నా విడిచిన బట్టలే తొడుగుతుంటావ్.”

అహంకారం, పొగరు మేళవింపు ఎక్కువ గాను, ప్రేమ వాత్సల్యం తక్కువగాను ప్రదర్శిస్తూ, ఇంతకు క్రితమే స్నానానికి ముందు విప్పేసిన బట్టల్ని ఆమె మొహం వైపుకు గిరాటు వేసి, “ఇగ్గో విప్పిన నా బట్టలు వేసుకో. నా దగ్గరైతే చాలా బట్టలున్నాయి.” అంది శహజాది పాషా.

చమ్కి కి కోపం వచ్చింది.

“నేనెందుకు తొడుక్కొవాలి అవి ! మీరే తొడుక్కొండి!!” అని అంది చమ్కి, శహజాది పాషా వదలిన బట్టల వైపు చూపుతూ. ఆమె మండి పడింది. కోపంగా, “అనాబి..అనాబి” అని కేకేసింది.

అనాబి గట్టిగా తలుపులు బాదింది. తలుపులు అరగా మూసి ఉన్నాయి. వెంటనే పూర్తిగా తెరచుకున్నాయి.

“అయ్యో…ఇంకా మీరిద్దరు బరిబతలుగానే నిలబడి ఉన్నారా!?” అంటూ చోద్యంగా వారిద్దరి వైపు చూస్తూ, ముక్కు పై వేలేసుకుని అంది.

శహజాది పాషా వెంటనే స్టాండ్ పై ఉన్న మెత్తని గులాబి రంగు టవల్ లాగి తన శరీరానికి చుట్టుకు౦ది. చమ్కి అలాగే నగ్నంగా నిలబడి ఉంది. అనాబి తన కూతురు వైపు కోపంగా చూసి అంది, ” గీ పాషా వాండ్ల హమాముల తానం చేయడాని కెందుకొచ్చినావ్?”

“గీ శహజాది పాషే జెప్పింది నాతో తానం చెయ్ మని!”

అనాబి బెదురుతూ నలు వైపులా చూసింది ఎవరైనా వినడం లేదు కదా అని.

బాత్ రూం లోనుంచి చమ్కిని బయటికి లాగి, “జల్దీ పో నౌకర్ ఖాన (పరిచారికుల గది) లో నా బట్టలేసుకో. లేకుంటే నీకు సర్ధిగిర్ధి గిట్ల పట్టుకొంటే పాణం పోతది. ” అని అంది. కొద్దిగా సిగ్గు పడుతు అనాబి. తిరిగి తనే మళ్లీ అంది, ” మాసి మట్టి మట్టి గున్నవి తొడగబాకు. మొన్న శహజాది పాషా ఇచ్చిన ఎర్ర పట్టి కుర్తా పైజామా లేసుకో!”

అక్కడే నగ్నంగా నిలబడిన ఆ ఏడేండ్ల అమాయక ప్రాణి గాఢాలోచనలో కెళ్లి… నెమ్మది నెమ్మదిగా అంది, “అమ్మా! నేను మరి గీ శహజాది పాషా బరాబర్ (సమవయస్కులు) గదా …మరి నేనొదిలేసిన బట్టలెందుకేసుకోదు అది ?’

“ఉండు! నేను అమ్మతో చెప్తాను, చమ్కి ఇలా చెప్పిందని.” శహజాది పాషా

అనాబి భయపడి ఆమెను తన ఒడిలో తీసుకొని, గుండెలకు హత్తుకు౦ది.

“పాషామ్మ గీ పోరి పిచ్చి ముండ! దీని మాటల్నెందుకు అమ్మగారికి చెప్పుతవ్. దీంతో ఆడబాకండి. మాటలాడబాకండి. దీని పేరుమీద చెప్పుతో గొట్టండి” అని అంది అనాబి ఆమెను బుజ్జగిస్తూ.

శహజాది పాషాకు బట్టలు తొడిగించి, దువ్వెనతో తల దువ్వి తన చేతులతో అన్నం తినిపించి, పనులన్నీ చేసి తన గదిలోకిళ్లింది అనాబి. చమ్కిఇంకా అలాగే నగ్న౦గా చెట్టులా నిలబడి ఉన్నది గదిలో. మారు మాట్లాడకుండా చమ్కిని చూడగానే రెండు చేతులతో దబదబా బాదసాగింది, “తిన్న పళ్లెం లోనే బొక్కలు కొడ్తవే బజారు ముండ. పెద్దొర ఇంట్లోంచి యెల్లగొడ్తె ఎక్కడికి పోతావే? నీకెన్ని నఖరాలు!” అంటూ.

అనాబి శహజా పాషాకు తన పాలిచ్చి౦ది . అందుకోసమే ఆమె నియమించబడింది. ఫలితంగా తిండి బట్టలకు ఎలాంటి కొదువలేదు అనాబికు. తన కూతురు చమ్కి కి కూడా ఖరీదైన శహజాది పాషా తొడిగి వదిలేసిన బట్టలన్నీ ఇస్తారు. అంతేగాకుండా వెండి నగలు,ఆటవస్తువులు కూడా వాడినవి ఇచ్చారు.

కాలం గడుస్తున్న కొద్ది చమ్కి పసితనం వెనక్కి, అలోచనలు ముందుకు వెళ్లసాగాయి. ఫలితంగా శహజాది పాషా విడిచినవి తనెందుకు తొడగాలనే పట్టు ఆమెలో తలెత్తసాగింది. అప్పుడప్పుడు తను అద్దంలో మొహం చూస్తుకొంటూ, “అమ్మా ! నేనైతే పాషా కన్నా అందంగా ఉన్నాను కదా! మరి ఆమె నేను విప్పినవి తొడగాలిగా!” అని అనుకొంటుండేది.

అనాబి తన కూతురుకు నచ్చజెప్పేది—‘గొప్పోళ్ళు గొప్పోళ్ళే! మనం వారికి సాటి కాదు. ఎవ్వరైనా వింటే ముక్కు-చెవులు కోసి, గుండు గీయించి బయటికి గెంటేస్తారు’ అని!

అనాబి పాషా కు పాలివ్వడం మానేసి కొన్నేళ్లు గడచిపోయాయి. ఓ సారి దేవడీలో, కోఠీలో పనికి కుదిరిన వాళ్లను చచ్చాకనే వదులుతారు-అంటూ చమ్కి చెవులు మెలితిప్పి నచ్చజెప్పేది అప్పుడప్పుడు.

“ఇంకేమి చెప్పక నోర్మూసుకుని పడి ఉండు. చచ్చే వరకు నువ్వు శహజాది పాషా విడిచిన బట్టలే తొడుగుతూ ఉ౦డాలి! సమజై౦దా లేదా గాడిద పిల్లా!”

గాడిద పిల్ల ఆ సమయంలో నోరైతే మెదుపలేదు కాని ఆమె మనసులో లావా మాత్రం ఉబికొచ్చింది.

పదమూడేళ్లొచ్చాక మొదటిసారి శహజాది పాషా నమాజ్ తప్పింది. ఎనిమిదవ రోజు పూలమాలలతో ఆమెను ఆలంకరించారు. కనులు మిరుమిట్లు గొలిపే దుస్తులు ఆమెకు తొడిగించారు. ఆమె కుర్తాలో అక్కడక్కడ చిన్న చిన్న బంగారపు గజ్జెలు పొదుగబడి ఉన్నాయి. నడుస్తూంటే ఛన్ ఛన్ మనే చప్పుడు వినిపించేది. కోఠీ మర్యాదల ప్రకారం ఖరీదైన ఆ బట్టల జత కూడా దిగదుడుపు లో ఇవ్వబడింది. అనాబి సంతోషాలకు పట్టపగ్గాల్లేవు. వాటిని తీసుకొని తన గదిలోకి రాగా వయసుకన్న ఎక్కువ తెలివి, స్వాభిమానం గల చమ్కి దుఃఖ పడుతూ అంది, “అమ్మా …గత్యంతరం లేక తీసుకోవడం వేరే సంగతి. కాని నువ్వు గీలాంటివి తీసుకొని పెద్దగా ఖుషీ పడకు!”

“ఓయ్ బిడ్డా! ఈ జత బట్టల్ని అమ్మినా రెండొందల రూపాయలు ఎక్కడికీ పోవు! మనం అదృష్టవంతులం బిడ్డా! గీ లాంటి కోఠిలో పడ్డాం.” అనాబి నచ్చజెప్పే ధోరణిలో అంది.

“అమ్మా! ఎప్పుడైనా నా వదిలిన బట్టలను శహజాది పాషా కు తొడగడానికివ్వలని నాకు కోరికగా ఉంది!” అంది.

అనాబి తన రెండు చేతులతో తల పట్టుకు౦ది.

“నువ్వు కూడా పెద్ద మనిషై పోయినావ్! కొంచమన్న తెలివిగా మాట్లాడు. ఇలాంటి దివానే…దివానే మాటలు ఎవరి చెవుల పడ్డా మన గతే౦ గాను? జర ఆలోచించు బిడ్డా?” అని అంది అనాబి. ఆమె మెహం పాలి పోయింది. చిన్నగా అనాబి ఏడుపు అందుకోగా చమ్కి నోరు మూసుకుంది.

మౌల్వి సాహెబ్ ఇద్దరమ్మాయిలకు ఒకేసారి ఖురాన్ మరియు ఉర్దూ ఓనమాలు నేర్పించడం ప్రారంభించారు. వీరిద్దరు ఖురాన్ పఠనం పూర్తి చేశాక భారీ బట్టలు శహజాది పాషాకు, మామూలు బట్టలు చమ్కికు కూడా కుట్టించారు, బేగం సాహెబ్ గారు. ఆ తర్వాత పాషా భారీ బట్టలు కూడా చమ్కీ కి దిగదుడుపు బట్టల క్రింద అందాయి. కాని ఆమెకు ఆ కొత్త బట్టలే చాలా నచ్చాయి. వాటిని తన ప్రాణంలా చూసుకునేది చమ్కి.

లేత నారింజ రంగు డ్రెస్ అది. ఎంతో ఖరీదైన భారీ బట్టల కన్న మిన్నగా అనిపించింది చమ్కీకి.

శహజాది పాషా బాగా చదువుకుంది. యుక్త వయసులో కొచ్చింది. పెండ్లి ఆర్భాటం మొదలైంది.

పెండ్లిలో తను ఈ నారింజ రంగుబట్టలే తొడగాలని నిశ్చయించుకొంది. ఇవి ఎవరి దిగదుడుపు బట్టలు కావు. ఉత్రన్ కాదు!

శహజాది పాషా అమ్మగారు బేగం సాహెబా గారు ఎంతో దయాహృదయురాలు. ఆమె ఎల్లప్పుడు పరిచారకులను తన సంతానంలాగే చూసుకునేది. అందుకే తన కూతురు శహజాది పాషాతో పాటు చమ్కి పెండ్లి కోసం కూడా సంబంధాలు చూడసాగింది. చివరికి నవాబు సాహెబు తో చర్చించి చమ్కీ పెండ్లి కూడా ఓ తగిన అబ్బాయితో నిశ్చయం చేసింది. శహజాది పెండ్లికాగానే ఈ పెండ్లి సంబరాలలోనే చమ్కీ ‘అగ్త్ ‘ (పెండ్లి) కూడా చదివించాలని నిర్ణయించింది.

శహజాది పాషా అగ్త్ కు ఓ రోజు ముందు నుంచే కోఠి (మహల్) బంధు మిత్రుల రాక పోకలతో నిండిపోయింది. అమ్మాయిల మిడతల దండు మహల్ ను అల్లకల్లోలం చేసి౦ది.. తన స్నేహితురాళ్ళ గుంపులో కూర్చొని కాళ్లు-చేతులకు గోరింటాకు పెట్టించుకుంటూ శహజాది పాషా, “నువ్వు అత్తవారింటికెళ్లితే నీ కాళ్లకు గోరింటాకు నేనే పెడ్తాను.” అంది చమ్కితో.

“అయ్యో!ఎంత మాట.” ప్రేమ పూర్వకంగా అంది అనాబి.

“దాని కాళ్లకు మీ శత్రువులు తాకుగాక! మీరింత చెప్పిందే పది వేలు! మీ వరుడి లాగే దీని మొగుడు కూడా ఉండాలని మీరు ప్రార్ధన చేయండి.” అని అంది అనాబి.

“కాని ఈమె ‘నిఖా ’ ఎప్పుడు?” అంటూ ఓ పోకిరి అమ్మాయి అడిగింది.

శహజాది పాషా అదే చిన్ననాటి అహంకారపు నవ్వుతో అంది, ” నేను వదిలేసే దిగదుడుపు తో దీని కట్న కానుకలు తయారై

పోయాయి!

దిగదుడుపు ..మురికి…మాలిన్యం…అశుచి…వాడిన…విడిచిన…ఉత్రన్’ లాంటి పదాలు వినీ వినీ చమ్కీ చెవులు వాచిపోయాయి. ఈ పదాలు వందల వేల సంఖ్యలో సూదుల్లా గుండెలను చిల్లులు పొడిచాయి. ఛిద్రపరిచాయి. చమ్కీ మనసు చివుక్కుమంది. కళ్ళలో ఉబికొచ్చిన కన్నీళ్ళను దిగమ్రింగుకు౦టూ, తన గదిలో కొచ్చి పడింది చమ్కీ.

నెమ్మదిగా చీకటి పడుతు౦డగానే అమ్మాయిలు బాజభజంత్రీల తో పాటు పాటల కచేరీ మొదలైంది. అమ్మాయిలు గొంతెత్తి మధుర స్వరంతో పాడే శృంగార గీతాల తొ కోఠీ మారుమ్రోగింది. లయబద్దంగా డోలు కూడా మ్రోగ సాగింది.

క్రితం రాత్రి జాగరణ అయింది. ఈ రోజు కూడా కానున్నది. కోఠీ పెరటి వైపు వంటకాల కోసం ఎన్నో పొయ్యిలు అమర్చబడినాయి. వంట వాళ్ళు తీరిక లేకుండా వంటల తయారీ లో నిమగ్నులై ఉన్నారు. కోఠీ లో రేయి పగలు లా ఉంది!

చమ్కీ అందం నారింజ రంగు బట్టల లో ద్విగుణీకృతమైంది. ఈ బట్టలు ఎవరూ వాడి వదిలేసినవి కాదు. కొత్త బట్టతో కుట్టి౦చినవి. తను తొడుక్కోవడానికి అదృష్టం కొద్ది అందినవి.. ఇంతవరకు శహజాది పాషా వాడిన బట్టల్నే వేసుకునేది. నా పెండ్లికిచ్చే కట్నం కానుకలు వగైర వగైరాలు కూడా సెకండ్ హ్యండ్ వే! ఇలా నా జీవితం వాడిన వస్తువులతోనే గడుస్తో౦ది. కాని పాషా…ఓ ఉన్నత కుటుంబీకురాలు. ఎంత కాలం ? నువ్వూ తెలుసుకో! నువ్వు ఎన్నోపాత వస్తువులు నా కోసం ఇచ్చావ్ కదూ… ఇప్పుడు చూడు అను కు౦టూ మలిద (పరాటాలను, తేనే , పంచదార, నెయ్యిలతో చేసిన ఓ తీపి తినుభండారం) ట్రేను ఎత్తుకొని పెండ్లి కొడుకున్న మహల్ కెళ్ళింది చమ్కీ.

నలువైపులా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు. ఇక్కడా అదే గందరగోళం! తెల్లార్తే అగ్త్. విశాలమైన ఈ మహల్ లో నలువైపులా సందడి, హంగామాలలో ఎవరూ చమ్కీని పట్టించుకోలేదు.వారిని, వీరిని అడుగుతూ నేరుగా పెండ్లి కొడుకు గదిలో కెళ్ళింది చమ్కి.

గోరింటాకు, పసుపు చందనం రీతి-రివాజులతో అలసి సొలసి పోయిన పెండ్లి కొడుకు మంచంమీద బడలిక తీర్చుకొంటున్నాడు. గది కర్టెన్ కదలడం తో అటువైపుకు పడింది అతని చూపు. అలాగే కళ్ళప్పగించి చూడసాగాడు.

మోకాళ్ళ వరకు పొడవైన అప్రానీ కుర్తా. బిగుతుగా ఉన్న పిక్కల పై బిగుతుగా ఉన్న చూడీదార్. చేతి పనితో అల్లిన చె౦గావి రంగు పైట. పొట్టి చేతుల కుర్తా లో నుంచి తొంగి చూస్తూన్న అందమైన బాహువులు., వెడల్పైన బెదురు కళ్ళు. జడలో మల్లెల దండలు. రసగుళికల్లాంటి పెదవుల పై హత్య చేసే చిరు నవ్వు.

శోభనం రాత్రికి ము౦దు రాత్రి పెండ్లి కొడుకుకు ప్రమాదకారి . ఎంత మంచి వాడైనా, ఆ రాత్రి ఇలాంటి స్థితిలో పాపపు విందును కవ్విస్తుంది. ఒంటరితనం నేరానికి నాంది పలుకుతుంది. చమ్కీ తన కంటి కొసల్లోంచి చూసిన చూపుకు అతడి శరీరం విస్పోటం చెంది శకలాలుగా మారింది. చమ్కీ కావాలనే తన మొహం పక్కకు త్రిప్పి నిలబడింది. అతడు వ్యాకుల౦గా లేచి వచ్చి అమె కెదురుగా నిలబడ్డాడు. కనుకొసల నుంచి చూసిన ఆమె చూపు పెళ్లి కొడుకు లో తుఫాన్ రేపింది.

“నీ పేరేమిటి?” గాలి పిల్చే బదులు నీళ్ళు నములుతూ అడిగాడు.

“చమ్కీ ”

ఆమె కిల కిల నవ్వు అతన్ని కవ్వించసాగింది. ఆమె అందమైన మొహం చంద్రునిలా ఉంది.

“నిజంగా…నీలో ఉన్న ఆకర్షణ, కాంతికి …నీ పేరు సరిగ్గా సరిపోయి౦ది!” అంటూ బెదురుతూనే అమె భుజం పై తన చేయి వేసాడు . తర్వాత అమె చేతులను పట్టుకు౦టూ అడిగాడు, “ఈ ట్రే లో ఏముంది?” అని.

చమ్కి అతడికి ధైర్యాన్నిఇస్తూ , “మీ కోసం మలీద తీసుకొచ్చాను. రాత్రి జాగరణ అయింది కదా…మీ నోరు తీపి చెయ్యడానికి!” అంది మందస్మితమై, కత్తి-కటారుల్లేకుండానే అతడిని గాయపరిచింది.

“మేము మలీద గిలీద తో నోరును తీపి చేయం! “మేమైతే…” అంటూ తేనే లాంటి చమ్కి పెదవులపై తన నోరు తీపి చెయ్యడానికి పెదవులను ప్రేరేపించాడు. చమ్కీ అతని బాహువుల్లో ఒరిగిపోయింది. అతడి పవిత్రతను దోచుకోవడానికి…తను దోచుకోబడడానికి.

దేవడీ సంప్రదాయం ప్రకారం శోభనం రాత్రి గడిచాక, రెండవ రోజు ఉదయం శహజాది పాషా తను వాడిన పెండ్లి బట్టల జత, పెండ్లి నగలు చమ్కి కి అందించడానికి వెళ్ళింది.

చమ్కీ నవ్వుతూ “పాషా ఇప్పటివరకు నేను మీ వాడిన వస్తువులను వాడుతూ వచ్చాను. కానిప్పుడు మీరు కూడా…!?” అంటూ పిచ్చిదానిలా గట్టిగా నవ్వసాగింది. తిరిగి “నేను వాడిన వస్తువును మీరు కూడా ఇప్పుడు జీవితాంతం …” అని అంది నవ్వుల మధ్య. ఆమె నవ్వు ఆగనే లేదు.

చుట్టు ప్రక్కల ఉన్న అమ్మలక్కలు, ” పాపం! బాల్య స్నేహితురాళ్ళు ఆడుతూ-పాడుతూ కాలం గడిపారు. ఇప్పుడీ జంట విడి పోతున్నందుకు చమ్కీ దుఃఖం భరించ లేక పిచ్చిదానిలా ప్రవర్తిస్తో౦ది! “అని అన్నారు.

మూలం: వాజిద తబస్సుం (ఉర్దూకథ)

తెలుగు అనువాదం: అమ్జద్

జాహెద
జావెద్ నా ప్రాణ స్నేహితుడు. మా మధ్య ఏలాంటి దాపరికాలు లేవు. ఇద్దరం గంటల తరబడి పిచ్చాపాటి మాట్లడుకునేవాళ్లం. అతడికి దగ్గరి బంధువులతో పడేది కాదు. కొన్నాళ్ళనుంచి గంటల తరబడి ఏకాంతంగా ఉండేవాడు. పలకరిస్తేనే మాట్లాడేవాడు కాదు. వాడిలో ఉన్న చలాకితనం మాయమవుతున్నట్లు గ్రహించి, ఓ రోజు ” ఏంట్రా…ఏమిటి సంగతి? ఆకాశం లో ఏముందని అలా గంటల తరబడి చూస్తుంటావు?  ఇలాగే ఉంటే ఓ రోజు పిచ్చివాడివైపోగలవు” అని అన్నాను.

గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “ అలాగే అనుకో…!?” అని జవాబు ఇచ్చాడు.

“ఫర్ ద గాడ్ సేక్ జావెద్ అసలు సంగతేమిటో చెప్పు. నా దగ్గర నీకు సీక్రేట్స్ ఏమి లేవుగా…” ప్రాధేయపడ్డాను వాడి అవస్థ చూడలేక.

చావు కబురు చల్లగా చెప్పినట్లు “నేను ప్రేమలో పడ్డానోయి!” అని అన్నాడు. నాకు  ఆశ్చర్యం  కలిగింది. సిగ్గు మొహం, అడవాళ్ళంటే ఓ విధం గా బిడియం పడే ఈ వెధవ ప్రేమలో పడ్డాడా అని ఓ వైపు   ఆశ్చర్యం కలిగిన మరో వైపు నమ్మకం కలగ లేదు. వాడు అమ్మాయిల కన్న ఎక్కువగా సిగ్గు పడుతుంటాడు. సందేహం నివృత్తి చేసుకొందామని కూపి లాగాను.  వాడు జోక్ కొడ్తున్నాడనుకొన్నాను.

“ఏ అమ్మాయిని ప్రేమించావ్?”

“ఓ అమ్మాయి ఉంది. పేరు జాహెద.  పొరుగింటి  అమ్మాయి.ఆమె తో ప్రేమలో పడ్డాను. ఇరవై యేండ్లుంటాయి. చాలా  అందంగా ఉంటుంది.ఎన్నోసార్లు మేము కలుసుకున్నాం. అమె నా ప్రేమను స్వీకరించింది. “తడుముకోకుండా జవాబిచ్చాడు.

“మరి నువ్వు ఇలా దిగులుగా ఉంటున్నావెందుకు?” అని అడిగాను.

అతడు నవ్వుతు అన్నాడు,” సాదత్ నువ్వెప్పుడైన ప్రేమలో పడితే తెలిసేది…ప్రేమ ఉదాసీనతకే మరో పేరు. మనిషెప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతుంటాడు. అతడి  మనసులో,మెదడులో ప్రేయసియే ఆవరించుకొని ఉంటుంది….ఆమె తో నీ గురించి చెప్పాను. నీ తర్వాత నాకు విలువైనవాడు సాదత్ అని చెప్పాను.”

“అలా అని ఎందుకు చెప్పావ్?”

“అంతే చెప్పేశాను. ఆమె నిన్ను కలవడానికి ఉత్సహంగా కూడా ఉంది. వస్తావుకదా నీ వదినతో కలవడానికి. ” అని అడిగాడు నన్ను.

నేనేం చెప్పాలో అర్థం కాలేదు.

“నాకు జవాబు ఇవ్వలేదు నువ్వు!” అడిగాడు జావెద్.

“ఆ…వెళ్దాం…తప్పకుండా వెళ్దాం. కాని ఎక్కడికి?”

“ఆమె ఏదో ఓ వంకన సాయంత్రం ఐదు గంటలకు లారెన్స్ గార్డెన్ లోకి వస్తానని చెప్పింది. నిన్ను తప్పకుండ అక్కడికి తీసుకొని రమ్మంది. కాబట్టి నువ్వు రేపు ఐదు గంటలకు తయారుగా ఉండు. లేదా నువ్వే నేరుగా ఐదు గంటలకన్న ముందే అక్కడికి చేరుకో.  మేము నీ కోసం జింఖానా క్లబ్ కు ఇటు వైపున్న లాన్ పై నీ కోసం ఎదురు చూస్తుంటాం. “ అని క్లుప్తంగా చెప్పాడు

నేను నిరాకరించ లేదు. కారణం జావెద్ నాకు ప్రాణ స్నేహితుడు. తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. నాకెందుకో అతని మీద సానుభూతి కలగసాగింది.

“అమ్మాయి గుణవంతురాలు. మంచి ప్రవర్తన గలిగిందే కదా?” అని అడిగాను.

జావెద్ మోహం కోపం తో కందగడ్డలా అయింది.

“జాహెద గురించి ఇలాంటివి నేను ఆలో చించలేను. విన లేను. ఆమె తో నువ్వు కలవాలను కొంటే సరిగ్గా ఐదు గంటలకు  లారెన్స్ గార్డెన్ లో కొచ్చేయి. గుడ్ బై.” అంటూ కోపంగా  అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు జావెద్.

అతడు కోపంగా అక్కడణుంచి లేచి వెళ్లి పోయాక ఆలోచించసాగాను. నేనలా అడగ కుండాల్సింది. అతడిని బహుశ నా ప్రశ్న నొప్పించిందేమో. ఎంతకైనా వాడు ఆమెను ప్రేమిస్తున్నాడు. ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడితే ఆమె చరిత్రహీనురాలు కానవసరం లేదు. జావెద్ తనను ప్రాణా స్నేహితుడనుకొంటున్నాడు. ఆ కారణం చేతనే కోపంగా ఉన్న కూడా సాయంత్రం లారెన్స్ గార్డెన్ కు రమ్మని మరీ చెప్పి వెళ్లాడు.

జాహెద తో కలసి ఏం మాట్లాడాలో ఆలోచించ సాగాను.

ఎన్నో ఆలోచనలు నా మస్తిష్కం లో కొచ్చాయి. కాని అవి ఓ మంచి మిత్రుడి ప్రియురాలితో మాట్లాడవలసిన అడగాల్సినవి కావు. నా గురించి ఆమెతో ఏమేమి చెప్పాడో దేవుడెరుగు. నా గురించి బాగా పొగిడే ఉంటాడు. ఆమెకు నేనంటే ఈర్ష్య కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే ప్రియురాళ్లు తమ ప్రేమను ఇతరులతో   పంచుకోనివ్వరు. బహుశ  నన్ను ఎగతాళి చేయడానికే జావెద్ తో చెప్పి నన్ను పిలిపిస్తున్నదేమో! తన ప్రియుని ప్రియ మిత్రుడితో తప్పకుండ పరిచయం  చేయించమందోమో. ఏది ఏమైన నేను నా ప్రియమైన స్నేహితుడి ప్రియురాలిని కలవాల్సుంది. ఈ సందర్భం లో ఏదైన ఓ మంచి గిఫ్ట్ తీసుకోవాలను కున్నాను. రాత్రంతా ఆలోచించాను. బంగారపు టాప్స్ తీసుకోవాలని నిర్ణయించుకొన్నాను. అనార్కలికి వెళ్లగా షాపులు బంద్ ఉన్నాయి. ఆదివారం సెలవు. నా అదృష్టం కొద్ది  ఒకే ఒక దుకాణం తెరిచి ఉంది. అక్కణ్నుంచి టాప్స్ కొనుక్కొని ఇంటికి తిరిగొచ్చాను. నాలుగు గంటల వరకు వెళ్లాలా మానాలా అనే సందిగ్ధావస్థ లో ఉండిపోయాను. నాకెందుకో సిగ్గుగా అనిపించసాగింది. అమ్మాయిలతో నేనెప్పుడు మాట్లాడింది లేదు…అందుకనేమో?

మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్ది సేపు  బడలిక తీర్చుకుందామని  పక్క పై వాలాను. కాని నిద్ర పట్ట లేదు. బోర్లాడసాగాను.  నా తలగడక్రింద ఉన్న టాప్స్ రెండు నిప్పు రవ్వల్లాగా   అనిపించాయి. లేచి, స్నానించి, షేవ్ చేసి, బట్టలు మార్చుకొంటూండగా గోడ గడియారంచేసిన టింగ్ ..టింగ్..టింగ్ అన్న శబ్దాలను విన్నాను.  మూడు  గంటలైంది. వార్తా పత్రిక అందుకున్నాను కాని నిలకడగా ఏమి చదవలేక పోయాను. మనసెలాగో  ఉంది.  ప్రేమలో పడ్డవాడు నా మిత్రుడు! పిచ్చెక్కుతోంది నాకు!!

ఖరీదైన సూట్ వేసుకున్నాను. కొత్త చేతి రూమాల్, కొత్త షూస్…ఇవన్నీ ఆ జావెద్గాడి కోసం. బహుశ నా గురించి జాహెద ముందు నా గురించి గొప్పగా చెప్పి ఉంటాడని. వాడి ఇంప్రెషన్ కోసం నా అలంకరణ ఇదంతా.

నాలుగున్నరకు బయలు దేరాను. ఓ మంచి సైకిలు తీసుకొని నెమ్మదిగా వెళ్లసాగాను.

జింఖాన క్లబ్ కు ఆవలి వైపున లాన్ పై ఒంటరిగా  కూర్చున్న జావెద్ కనిపించాడు నాకు. నన్ను చూసి గట్టిగా ఓ కేక వేశాడు. నేను సైకిల్ పై నుంచి దిగగానే పరుగెత్తుకొంటూ వచ్చి  నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు.

“నువ్వు తొందరగానే వచ్చేశావ్. గుడ్.  జాహెద దారిలోనే  ఉన్నదేమో. నా కార్ పంపిస్తానని చెప్పాను ఆమెతో. కాని ఒప్పుకో లేదు.  టాంగా లో వస్తానంది.” అని ఒక గుక్కలో చెప్పేశాడు సంబరపడుతూ.

జావెద్ నాన్నగారిదగ్గర ఓ కార్ ఉంది. బేబి ఆస్టీన్. ఓల్డ్ మోడల్. జావెదే దీన్ని ఎక్కువగా నడుపుతూండే వాడు.  జావెద్ తన కార్లో వచ్చాడు. నన్ను కార్ లో కూర్చొమని బలవంతం చేయసాగాడు. నేనొప్పుకోకపోవడం వల్ల, “అయితే…నువ్వో పని చెయ్…నవ్వు గార్డెన్ బయట గేట్ దగ్గర వేట్ చేయ్. ఓ టాంగా వస్తూంది. అందులో బక్కగా ఉన్న అమ్మాయి నల్లని బుర్ఖా వేసుకొని ఉంటుంది. టాంగా వాడిని ఆపి ’నేను జావెద్ స్నేహితుడిని. నా పేరు సాదత్…మీ స్వాగతానికోసం వచ్చాను’ అని చెప్పు “.

“నేనలా చేయలేను జావెద్” అని చెప్పాను.

“ఓరీ పిచ్చి నాయన…నువ్వు పేరు చెప్పగానే ఆమె నోరు కూడా మెదుపదు. ఒరేయ్…జీవితంలో కొన్ని తీపి గుర్తులుండాలి… జ్ఞాపకం చేసుకోవడానికి.  జాహెదతో నా పెండ్లయ్యాక ఈనాటి సంగతులను  చెప్పుకొంటూ నవ్వుకోవడానికి  బాగుంటాయి. వెళ్లురా బాబు. ఆమె వస్తూనే ఉంటుంది.”  అని అన్నాడు నవ్వుతు.

నేను జావెద్ మాటను ఎలా కాదనను!  గత్యంతరం   లేక నా సైకిల్ ను అక్కడే దగ్గర్లో  ఉన్న సైకిల్ స్టాండ్ లో పెట్టి,  గేట్ కు కొద్ది దూరంలో నిలబడి టాంగా కోసం నిరీక్షించ  సాగాను, నల్ల బుర్ఖా లో వచ్చే  జాహెద కోసం.

అర గంట తర్వాత ఒక టాంగా ప్రవేశించింది. అందులో నల్లని పట్టు బుర్ఖాలో ఉన్న ఓ అమ్మాయి టాంగా కనిపించింది.  ఆమె వెనుక సీట్లో కాళ్ళు చాపి  కూర్చుని ఉంది.

జంకుతు, బెదురుతూ ముందుకెళ్ళి టాంగా వాడిని ఆపాను. అతడు వెంటనే తన టాంగాను ఆపాడు.

“ఈ సవారీ ఎక్కణ్నుంచి వచ్చింది?” అని అడిగాను.

“నీకెందుకు. నువ్వెళ్ళి నీ పని చూసుకో!” అని కఠినంగా  జవాబిచ్చాడు.

ఆ అమ్మాయి నెమ్మదిగా ఆ టాంగా వాణ్ణి కోప్పడింది ” నీకు సంస్కారం గల వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదా?” అని.

నా వైపు తిరిగి అంది, “ మీరు టాంగాను ఎందుకు ఆపారండి?”  అని.

నేను నసుగుతూ అన్నాను, “ జావెద్ …జావెద్…నేను జావెద్ ఫ్రెండ్ ను. నా పేరు సాదత్. మీ పేరు జాహెద కదా!”

ఆమె మృదువుగా జవాబిచ్చింది,  ” అవును…మీ గురించి వారితో చాలా విన్నాను.

“మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నాక మీరేవిధంగా నాతో ప్రవరిస్తారో చూడమని చెప్పాడు జావెద్. అతడు జింఖాన క్లబ్ దగ్గర ఉన్న పచ్చిక మీద కూర్చొని మీ కోసం ఎదురు చూస్తున్నాడు.”

ఆమె తన ముసుగు తొలగించింది. అందంగానే ఉంది.

“మీరు ముందు సీట్లో కూర్చొండి…నాకో అర్జెంట్ పని ఉంది. కొన్ని నిమిషాలలో తిరిగి వద్దాం. మీ ఫ్రెండ్  కు గడ్డి మీద చాలా సేపువరకు  కూర్చునే అవసరం ఉండదు.” అంటు చిరు నవ్వుతో అంది.

నేనామె మాటను కాదనలేదు. ముందుకెళ్లి ముందు సీట్లో టాంగావాడి ప్రక్కన కూర్చున్నాను. టాంగా కదిలింది.  అసెంబ్లీ హాల్ దాటుతూండగా అతని తో అన్నాను, “ఇక్కడ దగ్గరలో సిగరెట్లు దొరికితే తీసుకోవాలి. నా దగ్గర సిగరెట్లు అయిపోయాయి.”

కొన్ని నిమిషాల తర్వాత టాంగాను ఓ చోట ఆపాడు వాడు.  నేను టాంగా దిగుతూండగా జాహెద అంది, “ మీరెందుకు శ్రమ తీసుకొంటారు. టాంగ వాడు తీసుకొని వస్తాడు.”

“ఇందులో శ్రమ ఏముంది.” అని పాన్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ పెట్టె, ఓ మ్యాచిస్, రెండు కిళ్ళీలు తీసుకొని డబ్బులు చెల్లించి తిరుగుతూండగా టాంగావాడు నా వెనుకాలే నిలబడి ఉన్నాడు.

“సార్, ఈ అమ్మాయితో జాగ్రతగా ఉండండి.”  నెమ్మదిగా చెప్పాడు నాతో. నేను చాలా ఆశ్చర్యపోయాను.

“ఆమె వేశ్య … ఆమె పనే ఇది. వయసులో ఉన్న మంచి  కుటుంబాలకి చెందిన కుర్రాళ్లను తన బుట్టలో వేసుకొంటుంది. నా టాంగాలో తరచుగా కూర్చుంటుంది.”

ఇది విన్నాక నా కాళ్ల క్రింది నుంచి నేల జారిపోయినట్లైంది.

“నువ్వు ఆమెను ఎక్కణ్నుంచైతే తీసుకొచ్చావో అక్కడే వదిలేసేయ్. ప్లీజ్! నేనామెతో రాలేనని చెప్పేయ్. నా ఫ్రెండ్ నా కోసం గార్డెన్ లో ఎదురుచూస్తున్నాడు”  అని ప్రాధేయ పడుతు చెప్పాను ఆ టాంగా వాడితో.

టాంగా వాడు వెళ్ళిపోయాడు. ఆమెతో ఏం చెప్పాడో తెలియదు.  నేను మరో టాంగా తీసుకొని లారెన్స్ గార్డెన్ చేరుకొన్నాను.

జావెద్ ఓ అందమైన అమ్మాయితో కబుర్లాడడం  చూసాను. ఆమె సిగ్గుపడుతూ ఉన్న మంచి అమ్మాయిలా అనిపించింది దూరం నుంచి.  నేను దగ్గరికెళ్లగానే తన మొహం పై వెంటనే ముసుగు వేసుకుంది.

నన్ను చూడగానే కోపం నటిస్తూ, “ఎక్కడ చచ్చావోయ్! నీ వదిన ఎప్పుడో వచ్చి కూర్చుంది. నీ కోసం ఎదురు చూస్తుంది.”

నేనేం చెప్పాలో అర్థం కాలేదు.  తత్తరపాటు లో, “ మరామె ఎవరు? నాకు టాంగాలో కనిపించిన వారు!” అని  అన్నాను.

జావెద్ నవ్వాడు. జోకులెయ్యకురా…కూర్చొ. నీ వదినతో మాట్లాడు. నిన్ను కలవాలని ఆమెకు చాల ఉబలాటంగా ఉంది.

నేను కుర్చున్నాను. కాని ఆమెతో సరిగ్గా  మాట్లాడలేక పోయాను.

నా మనసులో, నా మస్తిష్కంలో ఆ అమ్మాయి… స్త్రీ యే ఆవరించుకొని ఉంది.

ఆమె గురించి ఆ టాంగా వాడు ఎంతో వినయంగా, “ ఆమె వేశ్య!”  అని చెప్పాడే!?

మూలం: Sadat Hasaan Muto (ఉర్దూ)

తెలుగు అనువాదం: అమ్జద్

కుటుంబ గౌరవం!?
“మేడం గారు, మీకు నిద్ర రావట్లేదా! టీ తీసుకురానా?”

“ఒరై అబ్దుల్! ఈ సమయానికి నువ్విక్కడా! నీక్కూడా నిద్ర రావట్లేదా?”

“మీరు టెర్రెస్ పై పచార్లు చేస్తూంటే నా గదిలోంచి చూసి వచ్చాను. మీకేమైనా…?”

“సరే. రా ఇలా కూర్చో…”

“నేనా…హి…హి…”

“పర్లేదు. నాకు బోర్ కొట్టుతూంది. నీతో బాతాఖానీలు కొట్టైన నా బోర్ను దూరం చేద్దామనుకొంటున్నాను”

“అలాగేనండీ!”

“అరే…రే …నేల పై కూర్చుటున్నావెందుకు?”

“మరే…మేడం గారు?”

“ఇక్కడ ఈ కుర్చీ మీద కూర్చో.”

“సారు చూస్తే…?”

“భయపడకు. మీ సారు లేచేది తెల్లారకనే”

“సరే. మీరు కూర్చోమంటే కుర్చుంటాను.”

“ఊరుకున్నావేమిటి? ఏదైన మాట్లడవయ్యా.”

“ఏం మాట్లాడనండి?”

“ఏదైనా…”

“ఏదైనా అంటే ఏమిటండి?”

“సరే…నేను నీకెలా కనిపిస్తున్నాను?”

“మీరాండి…చాలా బాగుణ్ణారండి.”

“నేనైతే బాగున్నాను. కాని నీకెలా అనిపిస్తున్నాను?”

“నాక్కూడా…అండి.”

“అరే నువ్వు అమ్మాయిల్లా సిగ్గుపడుతావేమిటీ?”

“నేనానండి…మిమ్మల్ని తరచుగా టి.వి.లో చూసేవాడిని. అప్పుడు కూడా నాకు బాగా అనిపించే వారు”

“మరిప్పుడో?”

“ఇప్పుడైతే…ఇంకా బాగున్నారు.”

“ఎందుకు అలా?”

“ఎందుకంటే…మీరున్నారే అలా!”

“నేనే గాకా వేరే అమ్మాయిళ్లు కూడా వస్తుంటారు కదా?”

“అవునండి. వస్తూంటారు.”

“వాళ్లు కూడా బాగుంటారేమో?”

“వాళ్లు మీ లాగా నాతో మాట్లాడరండి. ఎంత సేపుంటారో అప్పటివరకు నాపై రువాబు కొడ్తుంటారు.”

“అల్లాగా!”

“మేడం గారు. మీతో విషయం అడగాలనుకొంటున్నాను…”

“ఒ.కె. అడుగు.”

“అదేమిటంటే…మీరైతే కోప్పడరుగా?”

“కోప్పడను.”

“మేడం గారు మీరు…చూడండి మీరు సారు తో షికాయతైతే చేయరుగా?”

“అరే చేయనయ్యా…సంగతేమిటో చెప్పు!

“చూడండి. మీరిక్కడికి వస్తూంటారు. అలాగే మరోచోటికి కూడ వెళ్లుతుంటారేమో?”

“అవును.”

“మా సారు లాంటి మరో సార్ లు కూడా ఉన్నారేమో?”

“అవును. చాలా మంది ఉన్నారు.”

“ఇక్కడికొచ్చే అమ్మాయిలు కూడా వేరే చోట్లకు వెళ్లుతూంటుంటారేమో?”

“అవును. వెళ్లుతుంటారు. కాని నువ్వివ్వన్నీ అడుగుతున్నావెందుకు?”

“వాళ్లందరితో ఇంతే డబ్బు తీసుకొంటారేమో?”

“ఆ…కొందరితో ఎక్కువ…కొందరితో కొంచం తక్కువ…గిరాకి బట్టి ఉంటుంది. సార్ లా మూడ్ బట్టి కూడా ఉంటుంది.”

“మరి మేడం మిమ్మల్ని ఇంటికి పిలిపించి… మందుకొట్టి పడుకొంటారు?”

“అవును. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కాని ఇన్ని ప్రశ్నలు ఎందుకడుగుతున్నావ్? ”

“అదే…మీతో చెప్పాను కదా ఓ విషయం అడగాలని.”

“అయితే ఆ విషయం నువ్వింకా అడగనే లేదా? మరింకెప్పుడడుగుతావ్? ”

“ఆ విషయం ఏమిటంటే…నాకో ఫ్రెండ్…”

“ఏమైంది నీ ఫ్రెండ్ కు?”

“వాడు కూడా నా లాగే ఓ సార్ దగ్గర పని చేస్తూన్నాడు.”

“అంటే ఈ లాంటి సారేనా?”

“ఆ…అవునండి…మేడంగారు.నా ఫ్రెండ్ పెండ్లైన వాడు.”

“మరి, అతని సార్ కూడా…”

“కాదండి. మీరు అప్పార్ధం చేసుకుంటున్నారు. వాడు కూడా నాలాగే అమ్మాయిలు రావడం సార్ వాళ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టడం చూస్తూంటాడు.”

“ఓ …అలాగ…అయితే…”

“అయితే…మేడం గారు. వాడి పెండ్లం చాలా అందంగా ఉంటుంది. ఫిల్మ్ ఆక్ట్రెస్ లా.”

“మరి అతని భార్యకేమైంది?”

“ఆమెకైతే ఏమి కాలేదండి. ఆమె రోజల్లా క్వార్టెర్ లోనే ఉండేది. అయింది వాడికే.”

“ఏమైందతనికి? ”

“పేరాశ!”

“నాకర్ధం కాలా!”

“అదేనండి. వాడు ఇంటికొచ్చే ప్రతి ఆడదానితో తన పెండ్లాన్ని తూచే వాడు. వాడికి తన పెండ్లం ఉన్న పళ్ళెమే భారిగా అనిపించేది.”

“మరి…?”

“ఆ పేరాశే వాడిని పెనుభూతంలా పట్టుకుంది. ఇలా డబ్బు సంపాదించడం చాలా తేలిక అనిపించింది.”

“ఆ… నేను వింటున్నాను. ఆ తర్వాత.”

“వాడు ఛాన్స్ కోసం ఎదురు చూడడం మొదలెట్టాడు. కాని…”

“కాని!…అంటే…?”

“వాడి భార్య సహకరించడం లేదు.”

“ఎందుకు?”

“అవే…బీదోళ్ళ సమస్యలు. వాళ్ళకుండే మానం, గౌరవం, లజ్జా…”

“మరి నీ ఫ్రెండ్ ఆ సమస్యలను ఎలా నివారించాడు. ఉపాయం ఏం చేశాడు.”

“మొదట్లో వాడు తన పెండ్లాన్ని మాటలతో నచ్చ జెప్పడానికి ప్రయత్నించాడు. ఈ మాటల గారడీలో ఏమి లేదని. ఓ సారి తన దగ్గర డబ్బు వచ్చిందంటే ఎవ్వడు పట్టించుకోడు ఎక్కణుంచి వచ్చిందని, ఎలా సంపాదించావని.”

“మరి ఆమె ఒప్పుకుందా?”

“లేదు. కాని ఆమె ఒప్పుకునే ముందే ఓ ఛాన్స్ దొరికింది.”

“అదేలా?”

“నా ఫ్రెండ్ సార్ వాడిని ఓసారి ఒక చోటికి పంపించి…ఇంతకు క్రితం మొదటి సారి వచ్చిన అమ్మాయిని తీసుకురమ్మని పంపించాడు.”

“ఓ.కే. వింటూన్నాను.”

“నా ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకురావడానికి దగ్గరికి వెళ్లగా ఆమె తనకు ఒంట్లో బాగులేనందుకు రాలేనని చెప్పిందట. కాని అసలు సంగతి అది కాదని వాడికి తెలిసిపోయింది.”

“అసలు సంగతేమిటి?”

“అసలు సంగతేమిటంతే వాడి సార్ కన్న గొప్ప సార్ ఆమె ఇంట్లో ఉన్నాడు. ఆతడి కార్ బయట ఉంది.”

“మరి వాడు ఉత్త చేతులతో వచ్చాడా?”

“అంతే గదా! ఉత్త చేతులతోనే వచ్చాడు. కాని ఇంటికి వచ్చాక ఓ ఐడియా వచ్చిందతనికి.”

“అదేమిటి?”

” నా ఫ్రెండ్ సార్ తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి బాగ తాగి, బోర్ల పడిపోయాడు.”

“ఇందులో మరి నీ ఫ్రెండ్ ఐడియ ప్రసక్తెక్కడ?”

“నా ఫ్రెండ్ ఆలోచించాడు. సార్ బాగా తాగి మైకంలో తెలివి తప్పి పడి ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒకరిని గుర్తించే తెలివెక్కడ ఉంటుంది. అతడు తన పెండ్లాం దగ్గరికి వెళ్లాడు. కాని ఆమె ఒప్పుకో లేదు.”

“మంచి అవకాశం చేయి జారిపోయింది.”

“లేదు. ఆమె ఈ అత్యాశకు ఒప్పుకోకపోతే, బలవంతంగా ఆమెను లాక్కుంటూ తీసుకువెళ్లి తన సార్ గదిలో తోసోచ్చేశాడు.”

“మరి అతడు పోల్చుకోలేదా?”

“లేదు. కాని అతనికి ఉదయం తెలివొచ్చాక…ఇద్దరిని ఇంట్లోనుంచి గెంటేశాడు.”

“ఎందుకు?”

“ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఇవ్వాలి మేడం!”

“జావాబు నీకెందుకు? బహుశ ఇది నీ కథేనేమో!”

“మీరు చాలా తెలివైన వారు.నిజంగా…ఆమె నా పెండ్లామే…”

“సరే. నువ్వే చెప్పు. నేనామెకంటే అందంగా ఉన్నానా”

” లేరు.”

“కాని…నేనిక్కడికి రావడానికి పదివేల రూపాయలు తీసుకున్నాను.”

“అలాగా!”

“నేనొచ్చిన అరగంట తర్వాత మీ సార్ కు నిద్రొచ్చేసింది.”

“అలాగా! మరి ఆ పది వేల….”

“మీ సార్ ఇచ్చిన ఆ పది వేలకు కారణం…రేపుదయం నాతో రాత్రంతా గడిపారని తన ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పుకోవాడానికే. అర్ధమైందా?”

“కాలేదు.”

“అతను ఇచ్చిన ఈ ఖరీదు నా కోసం కాదు. నా గ్లామర్ నటన కోసం. ఇప్పుడైన అర్ధమైందా?”

“అర్ధమైంది. కాని ఆమె బహుశా నా కంటే ముందుగానే అర్ధం చేసుకుంది.”

“ఆమె అంటే ఎవరు?”

“ఎవరినైతే ఇంటిలో నుంచి బయటికి పంపించేశాడో.”

“ఆమెకెలా అర్ధమైంది?”

“ఆమే ఈ రోజుల్లో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా వస్తూంది.”

“మరి నువ్వు ఆమెను కలుసుకో లేదా?”

“స్టూడియోలో నన్నెవ్వరు లోనికి రానివ్వనే లేదు.”

“అలాగైతే ఇంటికెందుకు వెళ్లలేదు?”

“అసలు సంగతేమిటంటే…”

“ఆమె నిన్ను గుర్తుపట్ట లేదేమో”

“గుర్తు పట్టింది. కాని ఇక్కడ ఉండదలుచుకుంటే నా అన్నగా ఉండాలి. ఎందుకంటే నేనింకా అవివాహితను అని అందరికీ చెప్పానంది.”

“అలాగే చేయలేక పోయావ మరి…!”

“లేదండి. అలా కుదరదు.”

“ఎందుకు?”

“ఈ మాట నాకు అవమానంగా ఉంటుంది. నా మనసు ఒప్పుకోదు.”

“మరి నీ భార్యను నువ్వు బలవంతం చేసినప్పుడు ఈ మాటెక్కడికి పోయింది?”

“అప్పుడు ఎవరికి తెలిసేదని…కొన్ని డబ్బులు కూడా చేతికి అందేవి. నలుగురిలో గౌరం, మర్యాదలు కూడా ఉండేవి.

“మరిప్పుడేం చేస్తావ్?”

“ఆమె మొహం పై ఆసిడ్ పోసి…ఆమె మొహాన్ని అందవికారం చేస్తాను.”

“దానితో నీకొచ్చే లాభం ఏమిటి?”

“మీరే చూడండి…మా వంశంలో లో నా ధైర్యానికెలాంటి వహ్వాలొస్తాయో…అబ్దుల్ కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడాడోనని.”

మూలం: గులాం ఖాదర్ (ఉర్దూ). అనువాదం: అమ్జద్

గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ
అదేమి కాకతాళీయమో గాని నేను గళ్ళ లుంగీ వేసుకుని మా డాబా మీద పచార్లు చేస్తున్నప్పుడల్లా మా ఎదురింటి ఆవిడ గళ్ళ మేక్సీ వేసుకుని తన డాబా మీద తిరుగుతుంటుంది. చూసేవాళ్ళు తను పిచ్చిగా తిరుగుతుందని అనుకోకూడదని కొన్నిసార్లు బట్టలు ఆరేయడం కోసం, కొన్ని సార్లు బట్టలను తీసుకోవడం కోసం, మరికొన్ని సార్లేమో చీపురును ఇవ్వడం కోసం అన్నట్టు పనిమనిషిని వెంట తీసుకుని పైకి రావడం, వచ్చినప్పుడు నన్ను కన్నార్పకుండా చూడడం చేస్తుందని మా ఆవిడ దగ్గర చెప్పుకోవడానికి దమ్ముల్లేక నేను లోలోన సంతోషించిన సందర్భాలెన్నో ఉన్నాయి! అయినా భార్య దగ్గర ఇలాంటి విషయాలు చెప్పడం మర్యాదగా ఉంటుందా అని మనసులోనే అనుకునే వాడిని. పైగా నేను మొగుడిని కదా. పరాయి ఆడవాళ్ళు నాకు సైట్ కొట్టడం గురించి మా ఆవిడకు చెప్పడం ఏమంత గొప్పగా ఉంటుంది? గొప్ప కోసం చెప్పుకుంటే ఎప్పుడో ఓసారి రివర్స్ కిక్ వచ్చినా రావచ్చు. అందుకేరా అబ్బాయీ, నువ్వు గప్ చిప్ గా ఎదురింటి ఆవిడకు సైట్ కొడుతూ ఉండు, అని నా మనసుకు ధైర్యం చెప్పాను. నా సాయంత్రాలు అలా గడుస్తున్నాయి.

ఎందుకో గాని కొందరి మొహాలను చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలా చేయడంతో సాధించేదేమీ ఉండదు. కాని, మనసుకు అదో ఆనందం కదా అనిపిస్తుంది నాకు.

మా ఎదురింటావిడ చాలా అందంగా, నాజూకుగా ఉంటుంది. శరీరావయవాలు చెప్పుకోదగ్గట్టుగా, ఎత్తుపల్లాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఈ విషయంలో మా ఆవిడకంటె ఎదురింటావిడ బాగుంటుంది. అయినా ఏం లాభం? అందని ద్రాక్షపండ్లు పుల్లన కదా!

మా డాబా పైనుంచి ఆమెతో కనీసం కండ్లైనా కలుపుదామని ప్రయత్నించి చాలాసార్లు ఓడిపోయాను. కాని, ఆమె నన్ను చూడకుండా ఉండదని నా గాఢ విశ్వాసం. నేను ఆమెవైపు చూడనప్పుడల్లా ఆమె నన్ను చూస్తూ ఉంటుందని ఓ ఆశ.

మా ఎదురింటావిడ ఎంత వరకు చదువుకుందో కాని, గౌరవమర్యాదలు గల కుటుంబానికి చెంది ఉంటుందని నా అభిప్రాయం. ఆమె భర్త ఏదో ఆఫీసులో అధికారి అని మా ఆవిడ ద్వారా చూచాయగా తెలిసింది. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఉబలాటపడ్డాను కాని, మా ఆవిడ ఎక్కడ లేనిపోని అర్థాలు తీస్తుందోనని గాబరా పడి నోర్మూసుకుని, నా చెవులు మాత్రం ఏంటెన్నాలలా నిక్కబొడుచుకుని ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను! చచ్చిపోతున్న వాడు ఊపిరి ఆడుతున్నంత వరకు తను బ్రతికిపోతానని నమ్మినట్టు, ఏ ఘడియలోనైనా మా ఆవిడ నోటిలోంచి ఎదురింటావిడ గురించిన ప్రస్తావన రాకపోతుందా అని పేరాశలో ఉండేవాడిని. ముఖ్యంగా సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక నేను టిఫిన్ తింటున్నప్పుడు, టీ తాగుతున్నప్పుడు మా ఆవిడ నాకెదురుగా కూర్చుని తను కూడా నాతో పాటు టిఫిన్ తింటూ టీ తాగుతూ, ఇరుగుపొరుగు ఇండ్లలో జరిగిన సంఘటనల వివరాలను నాకు చెప్పుతుంది. నేను ఊఁ కొట్టుతూ నాకు కావలసిన విషయం గురించి వినాలనే ఆత్రుతతో ఉంటాను. టిఫిన్ ఎలా ఉందని అడిగితే ఒకవేళ ఎదురింటావిడ గురించి ఒక్క మాట కూడా వినకుంటే రుచిగా లేదనీ, కనీసం ఓ రెండు విషయాలను వింటే బాగుందనీ చెప్పుతుంటాను. మా ఆవిడ నా జవాబును ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు. ఒకరోజు ఆమె ఆ ప్రశ్నను వేయడం నేను జవాబివ్వడం అయింతర్వాత, “వంటింటి పని పూర్తి చేసుకుని డాబా మీదికి వచ్చెయ్” అని యథాలాపంగా ఓ పత్రికను పట్టుకెళ్ళి డాబా మీద కుర్చీలో కూలబడ్డాను, నా రోజువారీ కార్యక్రమాన్ని ఆనందించడానికి.

కొన్ని రోజుల్నుంచి మా ఆవిడలో ఎదురింట్లోకి కొత్తగా వచ్చినవాళ్ళ గురించి స్వయంగా తెలుసుకోవాలనే ఉబలాటం ప్రబలుతోందని గ్రహించాను.

ఒకనాడు ‘ఏమండీ, ఎదురింటివాళ్ళ దగ్గరికి వెళ్దామా?’ అనో ‘కొత్తగా వచ్చిన వాళ్ళింటికి వెళ్ళి పరిచయం చేసుకుందామండీ’ అనో మా ఆవిడ ఏ క్షణంలోనైనా అంటుందని క్షణాలను లెక్క పెట్టుకోసాగాను. సోఫాలో కూలబడి ఓ ఇంగ్లీషు మ్యాగజైన్ పేజీలను తిప్పుతూ, వంటింట్లో ఉన్న మా ఆవిడ వైపు చూసి, ఆమె టీ టిఫిన్లను ఎప్పుడు పట్టుకొస్తుందా అని ఎదురు చూశాను. ఆఫీసునుంచి వచ్చాక అలా కొద్దిసేపు బడలిక తీర్చుకోవడం నాకు అలవాటు. నా శ్రీమతి ఆరోజు ఇరుగుపొరుగు ఇండ్లలో జరిగిన సంభాషణలను ఉపోద్ఘాతం రూపంలో తెలుపుతూ తను కూడా నాతో కలిసి టిఫిన్ తిని టీ తాగింది. అంతకన్న ఎక్కువ ఏం జరగలేదు.

కాని, ఓ ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక నా శ్రీమతి తీరిక చేసుకుని ముసిముసి నవ్వులతో వంటగది లోంచి డ్రాయింగ్ రూంలోంచి నా చేతిలోంచి మాసపత్రికను లాక్కుంటూ “సెలవు రోజు ఇదేమిటండీ! ఓ ముద్దూ లేదు, ముచ్చటా లేదు” అన్నది. తర్వాత నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.

“ముద్దులు రాత్రే అయిపోయాయిగా. ఇక ముచ్చట్ల సంగతంటావా? ఏ విషయం గురించి, లేక ఎవరి గురించి ముచ్చట పెట్టాలో చెప్పు” అన్నాను ఆమె మనసులోని మాటను బయటికి లాగాలని.

ఆమె సిగ్గు పడుతూ, చిరునవ్వు నవ్వుతూ “నా మాటలకు మీరు బాగానే వ్యాఖ్యలు చేస్తారు లెండి. నేనంటున్నది ఎదురింట్లోకి ఓ రెండు వారాల క్రితం వచ్చి చేరినవాళ్ళ గురించి. మంచి ఫ్యామిలీలా ఉన్నారు. వాళ్ళకు మన కాలనీ కొత్త కదా. అందుకే వెళ్ళి, వాళ్ళకేమైనా కావాలా తెలుసుకుందామా?” అంది.

“అహఁ, ఇంతకూ వాళ్ళది ఏ ఊరట?” అని అడిగాను.

“ఊరుకాదండీ. సిటీ. బెంగుళూరు” అంది కండ్లెగరేస్తూ.

ఇంకా ఏదో చెప్పబోతుండగా “ఓహో, వాళ్ళు బెంగుళూర్ వాళ్ళని ఎలా తెలుసు? మంగుళూరువాళ్లు కాకూడదా?” అన్నాను సంభాషణను పొడగిచాలని.

“మంగుళూరు ఆమె పుట్టినిల్లటండీ”

“ఓహో, అలాగా? మరి ఆమె మెట్టినిల్లు?”

“బెంగుళూర్”

“బాగుంది. మరి పిల్లలు బృందావనంలో ఉన్నారా?”

“పోనిద్దురూ. మీరు మరీను. వాళ్ళకు పిల్లలు లేరట. పెండ్లై పదేండ్లైందట. వైద్య పరీక్షలన్నీ చేయించుకున్నారట. ఇద్దరిలో ఎవరికీ లోపం లేదట. అయినా సంతాన భాగ్యం అన్నది భగవంతుని లీల కదండీ”

“బాగానే రాబట్టావే లోగుట్టు విషయాలు” అన్నాను ఆమెను మెచ్చుకుంటూ, నాలో నేనే సంతోషపడుతూ.

“అది కాదండీ. మన పక్కింటి పిన్ని మొన్న వాళ్ళింటికి ఆవకాయ పట్టుకెళ్ళి అలా వాళ్ళ విషయాలను కొన్నింటిని ఆరా తీసుకొచ్చింది”

“బాగుంది. మరి నువ్వు బెండకాయ వేపుడు పట్టుకెళ్ళి గొలుసుకథ లోని మిగతా భాగాన్ని తీసుకొచ్చెయ్”

“అబ్బా. మీరు నా ప్రతి మాటను జోకుకింద లెక్క కట్టుతారు” అని నవ్వింది మా ఆవిడ నిండుగా.

?ఏం చెయ్యను? మీ నాన్న నిన్ను ఓ చార్టర్డ్ అకౌంటెంటుకు కట్టబెట్టాడుగా మరి, ఆఫీసు పని అయిపోయాక నీతో కలిసి ఇంటిలెక్కలు సరి చూసుకోమని?” అన్నాను నాటక ఫక్కీలో.

“చాల్లెండి మీ వరస” అన్నది ఆమె, కోపం నిండిన మొహంతో.

విషయం మించకముందే సంభాషణను మారుస్తూ “మన పిల్లలేం చేస్తున్నారు? అని అడిగాను.

“బాబుగాడు నాన్న నాన్న అంటూ మీ నామ మంత్రాన్ని జపిస్తున్నాడు. నిద్రనుండి లేవగానే వాడు మిమ్మల్ని చూడాలిగా? వాడిని బాత్ రూంలోనికి పంపించి వచ్చాను”

“మరి చాలా సేపైందే వాడు బాత్ రూంలోకి వెళ్ళి” అని అడిగాను ఆశ్చర్యంతో.

“డోంట్ వరీ. వాడు మీకుమల్లే బాత్ రూంలో చాలా సమయం తీసుకుంటాడు. టవల్ కోసం వాడు బాత్ రూంలోంచి గొంతు చించుకుని అరుస్తున్నప్పుడు వెళ్తాన్లెండి” అన్నది నవ్వుతూ.

“మన చిట్టి చిన్నమ్మ ఏం చేస్తుందీ?”

“ఏం చేస్తుంది? మీ లాగే కంప్యూటర్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటోంది. దానికి రేపు ఏదో కంప్యూటర్ పరీక్ష ఉన్నదట”

“టవల్ ప్లీజ్” బాత్ రూంలోంచి వచ్చిన కేక డ్రాయింగ్ రూం వరకు వినబడింది.

మా ఆవిడ “శ్రీరాం, వస్తున్నా” అంటూ గబగబా వెళ్తూ గడప దాటుతున్నప్పుడు “నేనడిగిన విషయాన్ని దాటేశారు” అంది.

నిక్కచ్చిగా చెప్పాలంటే నాకు మా ఎదురింటివాళ్ళతో పరిచయం చేసుకోవాలనే ఉంది. మా ఎదురింటామె ముందు కూర్చుని ఆమెను మనసారా చూడాలనే ఉంది. ఆమెతో ముచ్చట్లు పెట్టాలని ఉబలాటంగా కూడా ఉంది. కాని ఎందుకో త్వరగా వెళ్ళాలనిపించట్లేదు. ఆమె అందాన్ని, శరీరపు ఎత్తుపల్లాలను దూరంనుండే చూపులతో ఆస్వాదించాలని ఉంది. ఇలా అనుకుంటూనే దూరపు కొండలు నునుపు కాకూడదని కూడా ఆశ పడ్డాను. ఆమెను అలా చూడాలనే కోరిక నాకు అత్యాశలా అనిపించింది. కొన్ని మనకు దొరకవని, వాటిని సాధించలేమని తెలిసి కూడా వాటికోసం అర్రులు చాచడం నా లాంటి వాళ్ళ ప్రవృత్తా? ఇలా ఆలోచిస్తే మస్తిష్కం వేడెక్కి అనవసరంగా వ్యాకోచిస్తుందని భయపడి, స్కూటర్ ను బయటికి తీసి స్టార్ట్ చేస్తూ “నేనలా వెళ్ళి ఇప్పుడే వస్తానోయ్” అని శ్రీమతినుద్దేశించి ఓ నోటీసులాంటి కేక వేసి, ఓ స్నేహితుని ఇంటివైపు వెళ్ళాను.

నా మిత్రడైన రఘురాంతో ఓ రెండు గంటల సేపు బాతాఖానీ కొట్టుకుంటూ కూర్చున్నాను. వాడేమో తన పక్కవాటాలో ఉన్న అందాల రాణి సౌందర్యాన్ని ఆనందిస్తూ ఆమె ప్రేమలో చిక్కుకున్న సంగతి చల్లగా చెప్పాడు. వాడు కట్నం ఆశలో చిక్కుకుని రెండేళ్ళ క్రితం ఓ పెద్దింటి అమ్మాయిని పెండ్లి చేసుకున్నాక, వాడి శ్రీమతి మొదటి కాన్పులోనే కవలపాపలను కన్నది. వాడితో నాకు బాగా చనువు ఉండడంతో “బేటా, ఇక ఇప్పట్నుంచే కట్నం కోసం డబ్బులు కూడబెట్టు” అని ఆట పట్టించాను.

వీడి గొడవ నా కోతిమనసు కంటే సీరియస్ గా ఉందనుకుంటూ వాడినుండి వీడ్కోలు తీసుకుంటుండగా “ఆమె నాతో లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పిందిరా. ఆమె దగ్గర నగానట్రా బాగానే ఉన్నాయట. వాళ్ళ నాన్న ఆమె పేరున బ్యాంకులో పది లక్షలకు పైనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడట. ఏం చెయ్యమంటావ్ నన్ను?” అని అడిగాడు నా రెండు చేతులూ పట్టుకుని.

“మీ వదినను అడిగి చెప్తాను. తెలుసులే ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్ అని. నాకు కొద్దిగా సమయం ఇవ్వు. ఏం చెయ్యాలో చెప్తాను” అని అక్కడినుంచి మా ఇంటిదారి పట్టాను.

నేనే ఓ చవటననుకుంటే రఘురాం గాడు చవట క్యూబ్ గా తేలాడు అనుకున్నాను. పరాయి పురుషుల పెళ్ళాల మీద మోజు పడడం సబబేనా? అలా మోజు పడడానికి కారణమేంటి? ఇది సైకలాజికల్ డిజార్డరా? భర్తల్ని ప్రేమించే భార్యలుండగా వైస్ వర్సా ఇదేమి రోగమో?

ఎందుకో గాని మా ఎదురింటావిడ నామెదడులో తళుక్కున మెరిసింది. ఆ దంపతులు వైద్యపరీక్షలు చేయించుకున్నారట. కాని ఏమీ తేలలేదట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

మకాంను ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి మార్చమని ఎవరో చెప్పారట. ముప్ఫై ఏళ్ళు ఉండి ఉంటాయి ఆమెకు. తన చదువు పూర్తి కాకముందు తన మేనమామ కొడుకుతో ఆమెకు పెళ్ళైందట. కాపురానికొచ్చి పదేళ్ళయిందని పాతబస్తీలో వాళ్ళ పొరుగింటి నుండి వచ్చినామె తెచ్చి కాకికబురు. పెండ్లి అయి రెండేళ్ళే అయింది కనుక ఇప్పుడే పిల్లలు వద్దని ఆ దంపతులు భీష్మించుకుని కూర్చున్నారన్నది ఆ ఇంటిలో కొత్తగా పనికి కుదిరిన మంగమ్మ వాంగ్మూలం.

ఇటువంటి విషయాల్లో అనుభవజ్ఞుడినైన నా అంచనా ప్రకారం పాతబస్తీ నుండి వచ్చి కబురే సబబుగా ఉందనిపించింది. అయినా మా ఆవిడ తరచుగా వాడే ‘ఆ పాడు గొడవలన్నీ మనకెందుకు’ అన్న ఊతపదంను మనసులోనే అనుకున్నాను. కాని, అన్ని విషయాల్లోనూ తల దూర్చే నా మనసు ఎందుకో గాని మా ఎదురింటాయన మీద అసూయతో సలసల మరగడం మొదలు పెట్టింది. ఆ జంటను చూస్తే ఆమె కాకి ముక్కుకు దొండపండులా ఉన్నదనిపించింది. పెండ్లిళ్ళు అన్నీ స్వర్గంలోనే నిర్ణయించబడతాయనే లోకోక్తి మీద నాకు నమ్మకముంది. అయినా మనకెందుకులే ఈ లేనిపోని గొడవ అనుకుంటుండగానే స్పీడ్ బ్రేకర్ నా ఆలోచనలకు బ్రేక్ వేయడంతో స్కూటర్ ఆగిపోయింది. మళ్ళీ కిక్ కొట్టి స్కూటర్ ను స్టార్ట్ చేసి, కొన్ని నిమిషాల్లోనే మా ఇంట్లో అడుగు పెట్టాను. స్కూటర్ స్టాండ్ వేస్తుంటే పిల్లలిద్దరూ పెద్ద ఫిర్యాదుతో ముంగిలి లోకి వచ్చారు. వాళ్ళ వెనుక కొంగుతో చేతులు తుడుచుకుంటూ, కొంటెగా చిరునవ్వులు వెదజల్లుతూ నాశ్రీమతి.

ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని అర్థమైంది.

మధ్యాహ్న భోజనాల తర్వాత నా పడకగది లోకి వెళ్ళి బడలిక తీర్చుకున్నాను. సాయంత్రం కండ్ల బడలికను తీర్చుకునేందుకు డాబా పైకి వెళ్ళాను!

యథావిధిగా నా కండ్లు ఎదురింటావిడ రాక కోసం నిరీక్షించడం మొదలెట్టాయి. ఏదో వంకతో ఆమె డాబా మీదికి వస్తుంటుంది. నేను ఆమె కండ్లలో కండ్లు పెట్టి చూస్తుంటాను. ఆమె తన పెదవులపై చిరునవ్వును చిందిస్తూ ఉంటుంది. నా మనసుకు అది ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఆవిడ పైకి వచ్చే లోగా ఆమె వెళ్తూ టాటా ఉన్నట్టు చేతులతో సైగ చేసింది.

మంగమ్మ వచ్చి మేడపైన బట్టలు ఆరేసి వెళ్ళింది. కొన్ని నిమిషాలు అలా గడిచిపోయాయి. రోదసిలో వేలాడుతున్నట్టనిపించింది నాకు. జీవంలేని నాకండ్లు జీవం కోసం తహతహలాడుతున్నాయి. కాని ఆమె ఆచూకీయే లేదు. మా ఆవిడ మేడ మీదికి రాకముందే ఎదురింటావిడ ఓ సారి కనిపించి వెళ్తే మహా ఆనందంగా ఉండేదనిపించింది.

చంద్రోదయమైంది.

“ఏమండీ, బోర్ కొడుతోందా?” అంటూ మెట్లెక్కుతూ ఉదయించింది నా చంద్రమతి, సౌభాగ్య లక్ష్మి, అర్ధాంగి, పెండ్లైన కొత్తలో నా హృదయరాణి, తర్వా ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నా శ్రీమతి.

“న్యాచురల్లీ” ఏడ్వలేక నవ్వానన్నట్టు అబద్ధం చెప్పాను, నాకెదురుగా ఉన్న ప్లాస్టిక్ కుర్చీని లాగుతూ.

“ఈ రోజు వాతావరణం బాగుందండీ” అంది మా ఆవిడ.

నాకు సరైన పదాలు దొరక్క ఊఁ కొట్టాను అయిష్టంగానే.

ఆమె రఘురాం గురించి ఆరా తీసింది.

వాడు తన పక్కింటావిడతో జరుపుతున్న శృంగార లీలల గురించి క్లుప్తంగా చెప్పి, అలాంటి పరిస్థితిలో వాడేం చేయాలి, అని చంద్రమతి సలహా అడిగాను.

ఆమె ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని ఒక్క ముక్కలో ఇలా చెప్పింది “గప్ చిప్ గా సతీసమేతంగా ఏ అర్ధరాత్రో ఇల్లు ఖాళీ చేసి, రహస్య స్థలానికి వెళ్ళమని చెప్పండి”

ఈ ఆడవాళ్ళ బుర్రలు మామూలు బుర్రలు కావనుకున్నాను. ఆమె తీర్పు నాకు న్యాయబద్ధంగానే తోచింది.

వెంటనే రఘురాంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాను. వాడు మా ఆవిడ చెప్పిన విధంగా చేయడానికి ఒప్పుకున్నాడు. నాకెందుకో హాయిగానే అనిపించింది.

“నాకు థాంక్స్ చెప్పాడు వెధవ” అన్నాను చంద్రమతితో. ఆమె నవ్వింది, నిండు వెన్నెలను వెదజల్లే చంద్రునిలా.

చుక్కలు చక్కగా కనిపిస్తున్నాయి విశాలమైన ఆకాశంలో. కాని మా ఇంటికెదురుగా ఉన్న చిన్న మేడ మీదనా కండ్లకు కావలసిన ఆకారం కనపడలేదు. ఆ ఒక్క విషయాన్ని మినహాయిస్తే చంద్రమతి చెప్పినట్టు వాతావరణం నిజంగానే సహజంగా హాయిగా ఉంది, ఏదో ఆహ్లాదకరమైన కథను చదివినట్టు, లేక హుషారును కలిగించే ఒక నవలను చదవడం పూర్తి చేసినట్టు.

ఉషోదయమైంది.

మనసులో, గండెలో, చెవుల్లో పక్షుల కిలకిలా రావాలు కదలాడినట్టు ఓ అనుభవం.. కటిక చీకటి నిండిన రాత్రిలో అమావాస్య లాంటి వాతావరణం.. మస్తిష్కం చుట్టూ వల వేసినట్టు, అందులో అనుమానాల మిణుగురు పురుగులు దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు ఓ ఫీలింగ్.

ఆమె రాకతో అన్నీ చెల్లాచెదరయ్యాయి, హుష్ కాకి అయ్యాయి.

మా ఎదురింటి ఆమె డాబా పైకి రాగానే మా వైపు చూస్తూ “ఎట్లా ఉన్నారు అక్కయ్య గారూ! బాగున్నారా?” అని పలకరించింది మా ఆవిడను. చంద్రమతిని అక్కయ్య అని సంబోధించినందుకు మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వదిన గారూ అని పిలవనందుకు సంతోషించాను.

“ఉషా! బావగారెక్కడ?” అని మా ఆవిడ ఎదురింటావిడను అడిగింది.

ఓహో, ఆమె పేరు ఉష అన్న మాట. మాటవరుసకైనా చంద్రమతి నాకు ఆమె పేరు చెప్పలేదు. ఎంతైనా ఆడది కదా. అసూయో లేక మరేదో అయిఉంటుందని నన్నునేను సముదాయించుకున్నాను.

“వస్తున్నారు, కుర్చీలతో” అని నవ్వింది ఆవిడ.

అంతలోనే రానే వచ్చాడు ఆమె మొగుడు చక్కని చుక్కకు తోకలా, తోకచుక్కలా డాంబరు మొహంతో.

కొన్ని క్షణాల ముందు ఎంతో ఆనందంగా ఉన్న నా మనసు వాడిని చూడగానే పూర్తిగా వ్యతిరేక స్థితికి మారింది.

నా చూపులు వాడు వేసుకున్న గళ్ళ లుంగీ మీద పడ్డాయి. అది కొత్త లుంగీలా లేదు. ఇక మా ఆవిడ కూడా గళ్ళ మాక్సీయే వేసుకుంది.

ఓర్నీ, ఇదేమి యాదృచ్ఛికం?!

నేను వాడి పెళ్ళాన్ని సాయంత్రాల్లో చూస్తున్నట్టు వాడు నా పెళ్ళాన్ని ఉదయాలలో… అలాంటివి ఎన్ని ఉదదయాలో?!

నేను ఏడు గంటలకే ఆఫీసుకు వెళ్ళిపోతాను. వాడేమో పది గంటలకు వెళతాడట. నేను ఆఫీసునుంచి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి చేరుకుంటాను. వాడేమో రాత్రి ఆలస్యంగా వస్తాడట.

ఎంతైనా నేను మగ పురుగును కదా. మరి ఆడవాళ్ళలో సహజ సంపదల్లా ఉండే ఈర్ష్యాద్వేషాలు, అనుమానాలు నాలోనూ ఎందుకు ఉండకూడదు? పైగా నేను మిస్టర్ మొగుడిని! నా అందాల పెళ్ళానికి స్మార్ట్ హజ్బెండ్ ను.

‘ఛఛ. నన్ను మనసారా ప్రేమించే నా అర్ధాంగినే శంకిస్తున్నాను. గళ్ళ మేక్సీ గళ్ళ లుంగీ వేసుకోవడం కాకతాళీయం కావచ్చుగా?’ అనుకున్నాను మనసులో.

సలహా!
అదురుతున్న తన పైపెదవిని పండ్ల మధ్య అదిమి పట్టుకుంది చంప. హృదయపు లోతుల్లోంచి అవ్యక్తమైన దుఃఖం పొంగుకొస్తుంటే ఆమె దాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఓ బాధ ఆమె నరనరాల్లో ప్రాకసాగింది. ఆ వేదనకు కారణం సొంత జీవితం గురించి తను చేస్తున్న నిశితమైన దీర్ఘాలోచన కావచ్చుననుకుంది ఆమె. సమాజంలో తన స్థానమేమిటి? ఒంటరితనమే తనకు తోడయిందెందుకు? ఇలాంటి ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కింది.

తను మొదట్నుంచి బ్రాహ్మణులూ నిమ్నకులాల వాళ్ళూ జీవించే వాడకు దగ్గర్లోనే, తక్కువ జాతికి చెందిన బీదవాళ్ళుండే బస్తీలోనే ఉంటోంది. ఈ బస్తీలోని ఆడవాళ్ళు ఒకప్పుడు వేశ్యలుగా ఎంచబడేవాళ్ళు. కాని వాళ్ళు ఆ వృత్తిని విడిచి ఎన్నో ఏళ్ళైంది. అయినా వాళ్ళు బ్రాహ్మణుల ఇండ్లలో ఇప్పటికీ పనిమనుషులుగా పని చేస్తూ కూలి పనులకు కూడా వెళ్తున్నారు. అయినప్పటికీ సమాజంలో వారికి ఎలాంటి గుర్తింపూ లేదు. ఇక ఆ ఉన్నత కులాలవారి మస్తిష్కాల్లో ఇంకా పాత ఆలోచనా విధానమే నెలకొని ఉంది.

దళిత జాతులకు చెందిన స్త్రీలు ఇప్పుడు బజారులో అమ్ముడుపోయే వస్తువులుగా లేకపోయినా ఉన్నత కులాల్లోని పురుషులు గుడిసెలలోని అందమైన బీద అమ్మాయిలను తమ పడకగదుల్లోకి రప్పించుకుని, రహస్యంగా కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. అయినా ఆ స్త్రీలకు తమ దీనావస్థల పట్ల అంతగా దుఃఖం లేదు. సమాజం తమకు ఇచ్చిన యోగ్యత ఎలాంటిదైనా ఓర్పుతో తృప్తితో జీవితాలను గడుపుతున్నారు. అటువంటి జీవితం తమకు ఎప్పుడు ఎలా ఏ క్రమంలో మొదలైంది అన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. పైగా దాని గురించి ఆలోచించాలని వాళ్ళకు గుర్తు కూడా రాలేదు. తన అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, ముత్తాతమ్మల కన్న ముందు నుంచే తమ కుటుంబాల్లో వ్యభిచారం నడుస్తూ వస్తున్నదేమో అనుకున్నది చంప. లేదా తేనెటీగలు రాణి తేనెటీగ కోసం తేనె ప్రోగు చేయడం మొదలైనప్పట్నుంచి ఈ ఆచారం ఉందేమో అనుకుంది.

రఘునాథ్ తో చంపకు ఉన్న పరిచయం నిన్నమొన్నటిది కాదు. చిన్నప్పట్నుంచే వాళ్ళిద్దరు కలిసి పెరిగారు. వాళ్లు కలిసి తిరిగేవారు, కలిసి ఆటలు ఆడేవారు, కలిసి పాటలు పాడేవారు. ఆ విధంగా వాళ్ళు యుక్త వయస్సులోకి వచ్చారు. చంప మర్యాదస్తులైన స్త్రీలు నివసించే ఇంటిలో ఉండేది. రఘునాథ్ గొప్పింటి బిడ్డ. పైగా ఏకైక పుత్రరత్నం, వంశోద్ధారకుడు.

రఘునాథ్ నాన్న చంప తల్లితో శృంగార కలాపాల్లో మునిగి తేలుతున్న సమయాల్లో చంప, రఘునాథ్ ఇద్దరూ కలిసి తోటలో ఆడుకుంటూ రంగురంగుల పూలను కోసుకుంటుండే వారు.

రఘునాథ్ పైచదువుల కోసం పట్టణం వెళ్ళిపోయాడు. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. చంప దేనికోసమైతే ఎదురు చూస్తోందో దాని సమయం ఇంకా రాలేదు. కాని రఘు తన చదువును పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినప్పట్నుంచి తన మనసులో గిలిబిలి మొదలైంది. రఘునాథ్ చంప పట్ల తన ప్రేమను వెల్లడించాడు. చంపకు అతడప్పుడు మెరుస్తున్న భానుడిలా కనిపించాడు. తను ఆకాశాన్ని చుంబించే కలలు కన్నది. అతడు జీవితాంతం తన ఒడిలో సంతోషాన్ని నింపుతాడనీ, తన బతుకు సాఫీగా హాయిగా సాగిపోతుందనీ ఆశించింది. కాని కొన్ని నెలల నుంచి తన మనసులో వ్యాకులత, భయం చోటు చేసుకున్నాయి. జవాబులు లేని కొన్ని ప్రశ్నలు చెదపురుగుల్లాగా మెదడును తొలచడం మొదలెట్టాయి. క్రితంలోలా ఇప్పుడు తనలో ఆనందం లేదు. తన ఇంటి పెరట్లోని మామిడిచెట్టు కొమ్మకు వీపును ఆనించి ఇలా ఆలోచిస్తూ వాపోతుండగా ఎవరో వెనుకనుంచి భుజాన్ని చేయితో తట్టారు. చంప గబుక్కున వెనుదిరిగి చూసి “రఘూ, నువ్వా?” అంది. రఘు కొన్ని నెలలుగా పట్నం నుండి రావడం లేదు. అతడిని చూడగానే చంపలోని బాధ, విషాదం దూరమైపోయాయి. ఆమెలోని అణువణువు పులకరించింది.

రఘునాథ్ “అవును, నేనొచ్చేశాను” అని చిరునవ్వుతో మళ్ళీ ఇలా అన్నాడు. “నా సూట్ కేసూ వగైరా ఇంట్లో పెట్టి నేరుగా నీ దగ్గరికే వచ్చాను”. తర్వాత ఏదో గుర్తొచ్చినవాడిలా మళ్ళీ “మీ అమ్మగారు పోయారని తెలిసి నాకు ఎంతో దుఃఖం కలిగింది” అన్నాడు. చంప కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆమె మొహం తిప్పేసుకుంది. “నా వైపు చూడు. అలా ఏడ్వకు” అన్నాడు రఘు. ఆమెను తనవైపు తిప్పుకుని, రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ప్రేమతో “చూడు, ఇప్పుడు నీవు ఏడ్చే అవసరం లేదు. నేనొచ్చేశానుగా” అంటూ ఆమెను నఖశిఖ పర్యంతం చూశాడు.

“నువ్వు మునుపటికన్న ఎక్కువ ఒళ్ళు చేశావు. చూడడానికి బాగున్నావు” అని ఆమెను పొగిడాడు. చంప తన దుఃఖాన్నీ అనుమానాలనూ మరిచిపోయి, అతడిని తన బాహువుల్లో బంధించి, అతని చెవిలో ఓ సంతోషకరమైన వార్తను చెప్పింది. దాన్ని వినగానే రఘు మొహం పాలిపోయింది.

“నిజమా? నువ్వు చెబుతున్నది నిజమేనా?” తడబడుతున్న పదాలు అతని గొంతులోంచి అతి కష్టంగా బయటికి వచ్చాయి.

స్త్రీలకు ఉండే సహజమైన సిగ్గుతో ఆమె తల దించుకుంది. బుగ్గలు కెంపులయ్యాయి. చంప చిన్నగా ఇలా అన్నది. “ఇందులో అబద్ధమేముంది? మనం ఎన్నో రోజుల్నుంచి ఇలా…” సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది.

“లేదు చంపా, లేదు. ఇదంతా అబద్ధమని చెప్పు. నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పకు” అన్నాడు రఘు, భయకంపిత స్వరంతో.

“అంతగా భయపడుతున్నావెందుకు రఘూ? ఈ కబురును విన్నాక నీకు సంతోషం కలుగలేదా?” చంప తల పైకెత్తి అడిగింది.

“సంతోషమా? ఎలాంటి సంతోషం?” రఘులో భయం పెరిగింది.

“నన్ను పెండ్లి చేసుకుంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. ఇప్పడు పెండ్లి చేసుకునే సమయం వచ్చింది” అని చంప అతని వాగ్దానాన్ని గుర్తు చేసింది.

“పెండ్లా? నీతోనా> ఎలా జరుగుతుందది? వీలు కాదు” రఘు తనలో తానే గొణుక్కున్నాడు.

“ఎందుకు వీలు కాదు?” నీళ్ళలో మునుగుతున్న వ్యక్తి మరో వ్యక్తి చేయిని గట్టిగా పట్టుకున్నట్టు అడిగింది చంప. ఆమె కండ్లలో కన్నీళ్ళు సుడిగుండంలా తిరిగాయి.

రఘు ఇచ్చిన జవాబు ఓ పదునైన కత్తిలాంటి నిజం అనుకున్నది చంప. అది తన గుండెను కోసేసింది. చంప గట్టిగా ఏడుస్తూ “వాస్తవంలో నేనెంత అమాయకురాలిని, మూర్ఖురాలిని! నేను ఓ వేశ్య కూతురును అనే వాస్తవాన్ని మరచిపోయాను. కాని నేను నిన్ను తప్ప మరెవ్వరినీ దగ్గరికి రానీయలేదు. నువ్వు ఈ రోజు నా నుదుటిపైన వేసిన కళంకం ఏనాటికీ చెరిగిపోదు” అని అరిచింది.

ఆమె వెక్కివెక్కి ఏడ్వసాగింది. రఘు తన చేయిని విదిలించి అక్కడినుండి నిష్క్రమించాడు.

తనకోసం కాకపోయినా పుట్టబోయే తన కొడుకు కోసమైనా రఘు తిరిగొస్తాడని చంప ఆశించి నిరీక్షించింది. కాని ఆమె నిరీక్షణ ఫలించలేదు. అతడు రాలేదు.

ఆ రోజు ఉదయం నుంచే తనకు పురిటి నొప్పులు వస్తున్నట్టనిపించింది చంపకు. శిశువు ఈ లోకంలోనికి రావడానికి బహుశా ఆరాటం చెందుతున్నాడేమో! అతని రాక కోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదు! బెడ్ పైన ఉన్న చంప శారీరకంగా, నైతికంగా బాధ పడసాగింది. అంతలోనే రఘునాథ్ నాన్న ప్రభునాథ్ ఆ గదిలోకి ప్రవేశించి చంప పక్కన కూర్చున్నాడు. అతనిలో విచారం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.

“ఏమిటి పెదనాన్న గారూ?” చంప బలహీన స్వరంతో అడిగింది.

ముసలివాడైన రఘునాథ్ తండ్రి తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. భయం కారణంగా అతని నుదురు పైన చెమటలు పట్టాయి. దయను ఆశిస్తున్న వాడిలా “చంపా, నేను సర్వనాశనమై పోయాను. నా కూతురు నా వంశపు ముఖం మీద మసి పూసింది” అన్నాడు.

“రూపకేమైంది పెదనాన్న గారూ? ఆమె అంత పెద్ద తప్పేం చేసింది?” అని చంప అమాయకంగా అడిగింది.

ప్రభునాథ్ ఏడుపును ఆపుకుంటూ “బహుశా మా అదృష్టానికి శని పట్టి ఉంటుంది. మూడు నెలల తర్వాత రూపకు పెండ్లి కాబోతున్నది. తారీఖు కూడా నిశ్చయమైపోయింది. ఇంటికి రమ్మని కొన్ని నెలల క్రితమే దానికి ఉత్తరం రాశాను” అన్నాడు. తర్వాత మళ్ళీ “రూప పట్నంలో హాస్టల్లో ఉంటూ చదువుతోంది. కాని ఆమె రాలేదు. నేనే స్వయంగా ఆమెను వెంట తీసుకురావడానికి వెళ్ళాను. అప్పటికే ఆమె నిండు గర్భిణి” అని వెక్కిళ్ళ మధ్య చెప్తూ ప్రభునాథ్ కుర్చీ చేతులను గట్టిగా పట్టుకున్నాడు.

“ఏమిటీ? రూప గర్భవతి అయిందా?” చంప నమ్మలేక పోయింది.

“అవును. ఆరు నెలల నుంచి ఆమె కాలేజీకి వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని నాకు ఎవ్వరూ చెప్పలేదు. అసలు విషయం నాకు ముందుగా తెలిసి ఉంటే బాగుండేది” రూప తండ్రి గొంతులో కోపం ధ్వనించింది.

“నిన్న అర్ధరాత్రి వేళలో రూపను దుప్పట్లో చుట్టి ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పడామెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పెండ్లికి మూడు నెలల సమయం మాత్రమే ఉంది. వరుడి తరఫువాళ్ళకు ఈ విషయం తెలిస్తే నాకు మొహం చెల్లదు. ఆత్మహత్యే నాకు శరణ్యం” అన్నాడు ప్రభునాథ్. అతని మొహం పాలిపోయింది.

“కాని పెదనాన్న గారూ. ఈ విషయంలో నేనేం చేయగలను? ఇదంతా నాకెందుకు చెబుతున్నారు?” చంప విస్తుపోతూ అడిగింది.

“నా బిడ్డ విషయం చూస్తే నా మర్యాద గంగలో కలవబోతున్నదని అనిపిస్తోంది. నువ్వే నాకు సహాయ పడగలవు” అన్నాడు ప్రభునాథ్. అతని గొంతులో లక్ష వేడుకోళ్ళు వినిపిస్తున్నాయి.

“నే… నేనా? నేనెలా మీకు సహాయ పడగలను?” ఆమెలోని ఆశ్చర్యం రెండింతలైంది.

“రూప పెండ్లికి ఇంకా మూడు నెలల సమయముంది. ఆమె అన్న అయిన రఘుకు కూడా పెండ్లి కాబోతోంది. ఒకవేళ రూప సంగతి బయట పడితే ఈ రెండు పెండ్లిళ్ళు జరగవు. కాబట్టి నువ్వు రూప బిడ్డను నీ బిడ్డగా స్వీకరిస్తే ఈ గండంనుంచి మేం బయట పడగలుగుతాం” అన్నాడు రఘునాథ్. అతనికి ముచ్చెమటలు పట్టాయి.

“మీరు చూడడం లేదా? నేనే తల్లిని కాబోతున్నాను” చంప తన కోపాన్ని అణచుకుంటూనే చిన్నగా అరిచింది.

“కవల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉన్నది కదా నీకు?” కవల పిల్లలు పుట్టినట్టు మేము ప్రచారం చేయగలం. చంపా, నా బిడ్డ గౌరవాన్నీ, నా గౌరవ మర్యాదలనూ నిలబెట్టు” అంటూ రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్న ప్రభునాథ్ కండ్లలోంచి కన్నీటి చుక్కలు రాలాయి. అతడు ఇదంతా ముందే ఆలోచించుకుని వచ్చాడులా ఉంది.

చంప కొన్ని క్షణాలదాకా ఛీత్కరింపు నిండిన చూపులతో అతడిని చూడసాగింది. తల పూర్తిగా నెరిసిన ప్రభునాథ్ చంప కాళ్ళను పట్టుకున్నాడు. ఒప్పుకోమని వేడుకున్నాడు. ప్రార్థించాడు. చంప చివరికి మెత్తబడి ఓడిపోయిన స్వరంతో ఇలా అన్నది. “సరే, నేను కవల పిల్లల తల్లినవుతాను. మీ గౌరవ మర్యాదలకు నష్టం కలగడం ఈ పనితో ఆగిపోతే మంచిదే. అలాగే మరి” ప్రభునాథ్ ఊపిరి పీల్చుకుని ఆమె కాళ్ళను వదిలేసి, అత్యంత ప్రేమతో ఆమె చేయిన తన చేతులలోకి తీసుకుని “నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు మామూలు మనిషివి కావు. నా బిడ్డవు. ఓ అవతారానివి, దేవతవు” అన్నాడు. ఇంకా ఏదో అనబోతుండగా “పెదనాన్న గారూ! నేను ఏ దేవతనూ కాను. అవతారాన్నీ కాను. నన్ను అంత ఎత్తైన పీఠం మీద కూర్చోబెట్టకండి. నేను కేవలం ఓ వేశ్య కూతురును. వేశ్యను. ఎవరి బిడ్డనూ కాను” అన్నది చంప.

దాదాపు నాలుగు నెలల తర్వాత వసంత రుతువులో ఓ అందమైన సాయంత్రం వేళ ఊరి బయటి స్వచ్ఛమైన గాలిని పీల్చడం కోసం రఘువాథ్ తన భార్యతో నడవసాగాడు. అతని వెంట అతని చెల్లెలు రూప, ఆమె భర్త కూడా ఉన్నారు. వాళ్ళు తోటనానుకుని ఉన్న రోడ్డు వెంట నడుస్తున్నారు. రఘు భార్య రోడ్డుకు అవతలి వైపున ఉన్న ఒక స్త్రీని తన చూపుడువేలుతో చూపిస్తూ “ఓ స్త్రీ ఒకేలా ఉన్న ఇద్దరు పసిపిల్లలతో ఎలా నిలబడి ఉందో చూశారా?” అంది.

రఘు ఆ స్త్రీని చూడగానే ఆందోళన చెందుతూ తన చూపును మరల్చుకున్నాడు. ఇద్దరు పసిపాపలను తన గుండెలకు హత్తుకుని నిలుచున్న ఆ స్త్రీ చంప. ఆమె నలిగిపోయిన చీర, అక్కడక్కడ చిరిగిపోయిన రవిక, చెదరిన జుట్టుతో ఉంది. కళావిహీనంగా ఉన్న ఆమె కండ్లలో నిరాశా నిస్పృహలు నిండి ఉన్నాయి.

“పిల్లలు ముద్దుగా ఉన్నారు” అని రూప భర్త వ్యాఖ్యానించాడు. రూప అతడిని తన ముంజేయితో తట్టి నేలవైపు చూస్తూ చిన్నగా ఇలా గొణిగింది. “పోనీయండి. అటువైపు చూడకండి. ఆమె ఓ వేశ్య కూతురు”

(భారతీయాంగ్ల కథ)

మూలం: ఎన్. సుందర్

తెలుగు అనువాదం: అమ్జద్