వాకిలి » అరిపిరాల సత్యప్రసాద్

వెన్నెల రేయి
పాస్టర్ మారిగ్నాన్ అన్న పేరులో మొదటి భాగం మాత్రమే సరిగ్గా సరిపోతుందతనికి. పొడుగ్గా వుంటాడు. మూఢ భక్తి, చిరచిర లాడే గుణం వున్నా నీతి బద్ధంగా వుండే మనిషి. దేవుడి మీద అతని నమ్మకం స్థిరమైనది. దేవుడి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తనకి అర్థంమౌతాయని అతని విశ్వాసం

తన ఇంటి దగ్గర తోటలో, అప్పుడప్పుడు వడివడిగా అడుగులేసుకుంటూ నడుస్తూ తనలో తను చర్చించుకుంటాడు – “దేవుడు ఇదంతా ఎందుకు చేసినట్లు?” అని.

అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించి, దేవుడి స్థానంలో తననే వుంచుకోని చివరికెలాగో సమాధానం తెలుసుకుంటాడు. ఏనాడు అతను భక్తితో, వినయంతో “దేవా నీ అద్భుతాలు అర్థం కావు కదా” అనడం జరగలేదు.

“దేవుడి సేవకుణ్ణి నేను. దేవుడు చేసే పనులు నాకు తెలియకుండా ఎలా వుంటాయి. తెలియకపోయినా ఊహించగలను కదా” అని తనకి తాను చెప్పుకుంటాడు.

సృష్టిలో వున్న ప్రతిదీ ఒక నిర్దిష్టమైన అవసరం కోసం ఆలోచించి చేయబడ్డదే అని నమ్ముతాడు. “ఎందుకు” అన్న ప్రశ్నకు “ఎందుకంటే” అన్న సమాధానం వుంటుందని నమ్ముతాడు. సూర్యోదయం ప్రశాంతంగా ఎందుకుంటుంది? మనం మేల్కొనగానే ఆనందించేందుకు. అలాగే పగలు ఎండ కాయల్ని పండ్లుగా పండించడానికీ, వాన వాటిలో తేమ నింపడానికి, సాయంత్రాలు నిద్రకు సిద్ధమవడానికి, చీకటి రాత్రులు నిద్రపోవడానికి సృష్టించబడ్డాయని అంటాడు.

నాలుగు కాలాలు సరిగ్గా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వుంటాయి అని నమ్ముతాడు. అసలు ప్రకృతి ఒక ఉద్దేశ్యాన్ని అనుసరించి ఎలా పని చేస్తుంది? ప్రపంచంలో ఏదైనా ప్రకృతికి నియమాలకు లోబడి వుండాలి కదా? కానీ అలాంటి అలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.

ఆడవాళ్ళంటే పడదతనికి. అసహ్యించుకునే వాడు. వాళ్ళని దూరంగానే వుంచేవాడు. క్రీస్తు చెప్పిన మాటలు – “అమ్మా, నాతో మీకేమి పని?” అంటుంటాడు. పైగా – “బహుశా దేవుడికి అతని సృష్టిలో నచ్చనిది ఆడదేనేమో” అంటాడు. మొగవాణ్ణి తప్పుదోవ పట్టించే మోసగత్తెలు మగువలేననీ, అలా దారి మళ్ళించాక ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తూ వుంటారని అతని నమ్మకం. చూడటానికి సుకుమారంగా కనిపించే అత్యంత ప్రమాదకారులనీ అనుకుంటాడు. పాపానికి దోహదంచేసే వాళ్ళ శరీరాలకన్నా ప్రేమకు కారణమయ్యే వాళ్ళ హృదయాలని ఎక్కువగా ద్వేషించేవాడు.

స్త్రీల మృదుస్వభావం చాలాసార్లు ఆయన అనుభవంలోకి వచ్చేది. అతనెప్పుడూ వాటికి లొంగిపోలేదు. పైగా అలాంటి అనుభవాలు, ప్రకంపనకు గురి చేసే ప్రేమలాంటి అనుభూతులు అతనిలో కోపాన్ని పెంచేవి.

మొగవాణ్ణి మభ్యపెట్టి, పరీక్షలకు లోను చేసేందుకే దేవుడు ఆడదాన్ని సృష్టించాడని అతని నమ్మకం. మగవాడు తనని తాను సంరక్షించుకోడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా, ఆడవారిని బంధించే ఉచ్చు లాంటిదేదీ లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళనేకూడదంటాడు. అసలు ఆడదంటేనే ఒక ఉచ్చు. చేతులు చాపి, పెదవులను ఎరగా వేసి బంధించే ఉచ్చు. ఇదీ అతని అభిప్రాయం.

ఆయనతో పాటు వుండే సన్యాసినులైన నన్స్ తో తప్ప వేరే ఏ స్త్రీలతోనూ ఆయనకు చనువు లేదు. వాళ్ళంతా చేసిన ప్రతిజ్ఞల కారణంగా నిరపాయకరంగా వుండే వాళ్ళు. అయినా కూడా వాళ్ళతో చాలా తీవ్రంగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే నిర్బంధంగా బ్రతికే వాళ్ళ జాలి గుండెల్లో కూడా ఏదో ఒక మాయ చేసే మృదుత్వం వుంటుందని. అది ఫాదర్ గా వున్న తన మీద కూడా ప్రదర్శిస్తారేమో అన్న అనుమానం ఆయనకి వుంది.

అలాంటి మాయ చేసే మృదుత్వాన్ని ఆయన తరచుగా గుర్తించేవాడు. వాళ్ళ విధేయతలోనూ, ఆయనతో మాట్లాడేటప్పుడు మంద్రంగా పలికే వాళ్ళ గొంతులోనూ, కిందకు దించిన కళ్ళలోనూ, ఆయన చీవాట్లు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టే కన్నీళ్లలోనూ ఆ మాయ చేసే మృదుత్వాన్ని చూడగలడాయన. అలాంటి సందర్భంలో ఆయన తన నల్లటి గౌనుని విదిలించుకుంటూ, పెద్ద పెద్ద అంగలువేసుకుంటూ ఆ మఠం బయటికి ఏదో ప్రమాదం నుంచి పారిపోతున్నట్లు పరిగెత్తేవాడు.

ఆయనకి ఒక మేనకోడలు వుంది. ఆమె వాళ్ళమ్మతో కలిసి దగ్గర్లోనే వుంటుంది. ఆమెను ఎలాగైనా సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో సన్యాసినిగా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

ఆ అమ్మాయి చక్కగానే వుంటుంది కానీ ఆమెకు కాస్త తిక్క వుంది. పాస్టర్ ప్రసంగాలలో ఆమె నవ్వుతుంటుంది. ఆయన కోప్పడితే గట్టిగా హత్తుకుంటుంది. అలాంటప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అతనిలో ఎక్కడో దాగి వున్న వాత్సల్యం ఆ అమ్మాయి పట్ల పొంగుకొచ్చేది.

ఎప్పుడైనా ఆ ఊరి వీధుల్లో ఆమెతో కలిసి నడిచేటప్పుడు ఆమెతో దేవుడి గురించి మాట్లాడేవాడు. తన దేవుడి గురించి. ఆమె ఎప్పుడూ అతను చెప్పేది వినేది కాదు. ఆకాశం వైపు చూసేది, గడ్డి వంక, పూల వంక చూసేది. గమనిస్తే ఆమె కళ్ళ మెరుపులో జీవితపు ఆనందం అంతా కనిపించించేది. ఒకోసారి గాల్లో ఎగురుతున్న ఏ కీటకాన్నో అందుకోవాలని ముందుకి ఉరికేది. దాన్ని పట్టుకోని తిరిగి వచ్చేటప్పుడు – “చూడు మామయ్యా ఎంత ముద్దుగా వుందో ఇది. చూస్తే గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తోంది” అనేది.

ఇలా పురుగుల్ని ముద్దు పెట్టుకోవడం, విరబూసిన పూలని హత్తుకోవడం అతనికి చికాకుని, కోపాన్ని తెప్పించేవి. అలాంటి చర్యలలో కూడా ఒక ఆడపిల్ల మనసులో వుండే ఆ మృదుత్వాన్ని గుర్తించేవాడు.

ఒకరోజు చర్చిలో శవాల పనిచేసే అతని భార్య వచ్చి ఫాదర్ తో, భయపడుతూనే ఒక విషయం చెప్పింది. ఆయన మేనకోడలు ఎవర్నో ప్రేమిస్తోందని.

ఆ వార్త అతనిలో రగిల్చిన ఒత్తిడి, భయం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనప్పుడు షేవింగ్ చేసుకునేందుకు ముఖానికి సోప్ రాసుకున్నాడు. అది అలా వదిలేసి శిలలా నిలబడిపోయాడు.

కాస్సేపటికి తేరుకున్నాక ఆలోచన, మాట రెండూ వచ్చాయి. “పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు మెలైన్” అంటూ అరిచాడు.

కానీ ఆమె మాత్రం తన చేతిని గుండె మీద వేసుకోని చెప్పింది – “అయ్యగారూ, నేను గానీ అబద్దం చెప్తే ఆ ప్రభువే నన్ను దండిస్తాడు. చెప్తున్నా వినండి. రోజూ రాత్రిపూట మీ చెల్లెలు పడుకోగానే ఈమె గారు వెళ్తున్నారు. నది ఒడ్డున కలుస్తారు ఇద్దరూ. మధ్యరాత్రి పదిపన్నెండు గంటలకు వెళ్ళి చూడండి కావాలంటే”.

గడ్డం చేసుకోవడం సంగతి మర్చిపోయాడతను. మెట్లపైకీ కిందకీ వడివడిగా తిరిగాడు. బాగా ఆలోచించేటప్పుడు అలాగే చేస్తాడతను. తిరిగివచ్చి గడ్డం చేసుకుంటూ ముక్కు నుంచి చెవి దాకా మొత్తం మూడుసార్లు గాట్లు పెట్టుకున్నాడు.

రోజంతా మౌనంగా వుండిపోయాడు. కోపం. అపనమ్మకం. ఆయనకు మొదటి నుంచి ప్రేమలంటే వున్న కోపం కారణంగా తన పెంపకం విఫలమైందన్న భావన మరింత తీవ్రమైంది. తండ్రి లాంటి వాడిగా, పెంచిన వాడిగా, ఒక చర్చి ఫాదర్ గా ఆ పిల్ల చేత మోసగించబడ్డాడన్న భావన కలిగింది. ఎవరైన తల్లిదండ్రులకు తమ కూతురు తమ ప్రమేయం లేకుండానే భర్తని ఎంచుకుంటే కలిగే భావనే అతనికి కూడా కలిగింది.

రాత్రి భోజనం అయిపోయిన తరువాత ఏదైనా చదువుదామని అనుకున్నాడు కానీ కోపం అంతకంతకూ పెరుగుతుండటంతో ఏమీ చదవలేకపోయాడు. రాత్రి పది గంటలు అవుతూనే తనకి బాగా అలవాటైన చేతికర్రని అందుకున్నాడు. రోగగ్రస్థులు వుండే ఇంట్లో ప్రార్థనలు చెయ్యడానికి రాత్రిళ్లు వెళ్ళాల్సివస్తే ఆ టేకు కర్ర తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. దృఢంగా వున్న ఆ కర్ర వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తన పిడికిలితో బలంగా పట్టుకున్నాడు. ఉన్నట్టుండి దాన్ని పైకెత్తి పళ్లు కొరుకుతూ కుర్చీని కొట్టాడు. ఆ దెబ్బకి ఆ పాత కుర్చీ వెనుక భాగం విరిగి నేల మీద పడింది.

వాకిలి తలుపులు తెరిచి బయటికి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అద్భుతమైన వెన్నెల. అతనికి ఎప్పుడో అరుదుగా తప్ప ఆ సౌందర్యాన్ని చూసే అవకాశం రాదు కదా!

కవులకు వున్నట్లే ఆయనకి కూడా అలాంటివి చూసి స్పందించే గుణం వుంది. అందుకే ఆ చర్చి ఫాదర్ మనసు అద్భుతమైన, ప్రశాంతమైన ఆ దృశ్యం వైపు కాస్సేపు మళ్ళింది.

ఆయన తోట మొత్తం సన్నని వెన్నెల వెలుగులో స్నానం చేస్తున్నట్లు వుంది. పండ్లచెట్లు తమ పొడుగాటి నీడలని నేల పైన పరుస్తున్నాయి. వాటికి వున్న కొమ్మలు, ఆ కొమ్మలకు పల్చగా వున్న ఆకులు కలిసి వెలుగు నీడల బొమ్మలు గీస్తున్నాయి. గోడమీదకి పాకిన పూల తీగ తీయటి వాసనలని వెదజల్లుతూ ఆ వెన్నెల వెలుగుకి అత్తరు సొబగులు అద్దుతోంది.

ఆయన గట్టిగా గాలి పీల్చడం మొదలుపెట్టాడు. ఒక తాగుబోతు వైన్ తాగినట్లు ఆ గాలిని ఆయన తాగడం మొదలుపెట్టాడు. నడక సాగించాడు. నెమ్మదిగా, ఆశ్చర్యపోతూ, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ – దాదాపుగా తన మేనకోడలిని మర్చిపోయినట్లుగా నడవసాగాడు.

తోట బయటకు వచ్చి చూస్తే నిర్మలమైన రాత్రిలో వెన్నెలతో అభిషిక్తమౌతున్న నేల కనిపించింది. కనుచూపుమేరలో వున్న భూమంతా వెలుగుతో సరసాలాడుతూ, రమణీయమైన ఆ కాంతిలో లీనమైనట్లు కనిపించింది. కీచురాళ్ళ శబ్దం ఒక నిర్దుష్టమైన నాదంతో పలికినట్లు ఆగి ఆగి వినిపిస్తోంది. దూరంగా ఎక్కడో చకోర పక్షి తన సంగీత జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. అదంతా కలిసి ఒక మధురమైన కచేరిలా వుంది. కలల్లోకి జార్చగలిగిన సంగీతం. చంద్రుడి వెన్నెలనే మరులుగొల్పగలిగిన సుమధుర గానం.

పాస్టర్ ముందుకే నడిచాడు. అతని హృదయంలో అలజడి ఎందుకు కలుగుతోందో అతనికే తెలియలేదు. ఉన్నట్టుండి నీరసించిపోయాడు. శరీరంలో శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. ఎక్కడైనా కూర్చోని, కాస్త సేదతీరి భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచం గురించి ఆలోచించాలని అనిపించింది.

అక్కడికి కాస్త దూరంలో నది వెంబడే నిలబడి వున్నాయి బూరుగు చెట్లు. సన్నటి మంచు తెల్లటి పరదా కప్పుతుంటే అందులో నుంచి ప్రసరిస్తున్న చంద్ర కాంతి ఆ మంచుని వెండి రెంగులోకి వెలిగిస్తోంది. దూరంగా వున్న పర్వతాలను, వాటి పైనెక్కడో మొదలైన నది కిందకి జారే కఠినమైన మార్గాన్ని, పల్చటి పత్తి కప్పినట్లుగా, తెల్లటి కాంతి కమ్మేసింది.

పాస్టరు మళ్ళీ ఆగిపోయాడు. అతని అంతరాంతరాలలో క్రమంగా ఒకలాంటి మృదుత్వం అనివార్యంగా విస్తరిస్తోంది.

ఒక అనుమానం, అర్థం కాని కలవరం అతనిని ఆక్రమించింది. అతను తరచుగా ప్రశ్నించుకునే విషయం మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది.

“దేవుడు ఇదంతా ఎందుకు సృష్టించాడు? రాత్రి వున్నది నిద్రకోసమే కదా? స్పృహ లేకుండా, ప్రపంచాన్ని విస్మరించి విశ్రమించడానికే కదా? మరి రాత్రిని పగటికన్నా మనోహరంగా ఎందుకు చేశాడు? సంధ్యాసమయాల కన్నా ఆహ్లాదకరంగా ఎందుకు కూర్చాడు? సొగసుగా వుంటూనే నిగూఢమైన ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికే కదా సూర్యుడు వున్నాడు? ఎంత టక్కరిదీ భూమి? వెలుగుని కాదని పారదర్శకంగా వున్న ఈ నిశీథిసుందరిని ఎందుకు ప్రేమించింది?

రెక్కలున్న అద్భుత గాయకుడు అందరిలా ఎందుకు నిద్రపోవటంలేదు? ఎందుకు తన కుహుకుహు రవాల గళాన్ని నిగూఢ నిశీధిలోకి వొంపుతున్నాడు?

“ప్రపంచం పైన ఈ మేలి ముసుగు ఎందుకు? హృదయం ఇలా కంపించడం ఎందుకు? ఆత్మకు భావుకత ఎక్కడిది? శరీరానికి ఎందుకు ఈ దౌర్భల్యం కలుగుతోంది? అందరూ నిద్రలో జోగుతూ కనీసం వీటి వైపు చూడనైనా చూడలేని సమయంలో ఇంత ఇంద్రజాలం ఎందుకు జరుగుతోంది? ఈ మనోహరమైన అద్భుతం, ఈ అద్వితీయమైన కవితాఝరి ఎవరికోసం దివి నుంచి ఇలకు జాలువారుతోంది?”

ఆయన అర్థం చేసుకోలేకపోయాడు.

అదిగో, అక్కడ చూడు. ఆ పచ్చిక నేల చివర, చెట్లు చిత్రంగా కల్పించిన పైకప్పు కింద, మెరుస్తున్న మంచులో తడుస్తూ ఎవరో ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు.

అతను ఆమె కన్నా పొడగరి. తన ప్రియురాలి మెడ చుట్టూ చేతిని వేసి పదే పదే ఆమె కనుబొమ్మల మధ్య ముద్దు పెడుతున్నాడు. ఐహికమైన జీవితంలో నుంచి వారిద్దరినీ మాయం చేసి కళాకృతిలా కనిపిస్తున్న ఆ దృశ్యంలోకి ఏ దైవ హస్తమో చేర్చినట్లుగా అనిపిస్తోంది. వారిద్దరూ ఇద్దరిలా కాక ఒకే ఆత్మలా కనిపిస్తున్నారు. ఆ ఆత్మ కోసమే ఈ ప్రశాంతమైన, నిశబ్దమైన రాత్రి సృష్టించబడిందా అన్న భావన కలుగుతోంది. ఇద్దరూ పాస్టరు వైపుగా వస్తుంటే, ఆయన ప్రశ్నలకు భగవంతుడు పంపిన సమాధానంలా వున్నారు.

ఆయన స్థాణువులా వుండిపోయాడు. గుండె వేగం హెచ్చింది. కంగారుగా అనిపించింది. కళ్ళ ముందు బైబిల్ నుంచి బోయజు రూతులు వచ్చి నిలబడ్డట్లు అనిపించింది. పవిత్ర గ్రంథాలలో భగవంతుడి ఇచ్ఛ ప్రకారం జరిగే అద్భుతకథలన్నీ గుర్తుకువచ్చాయి. సాల్మన్ గీతం అతని చెవులలో ప్రతిధ్వనించింది. ఆ గీతంలో వున్న సౌకుమార్యమంతా అతని గుండెల్లో మృదువుగా వ్యాపించింది.

“బహుశా ఇలాంటి ప్రేమికుల ప్రేమను అజరామరం చేసేందుకే దేవుడు ఇలాంటి రాత్రులను సృష్టించాడేమో” అనుకున్నాడాయన.

ఆ జంట జత కలిసిన చేతులతో ముందుకు వస్తుంటే తనకు తానుగా వైదొలిగాడు. ఆమె అతని మేనకోడలే. కానీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరించాలా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. దేవుడి అంగీకారమే లేకపోతే ఈ ప్రేమ చుట్టూ ఇంతటి అద్భుతాన్ని ఎందుకు వ్యాపింపచేస్తాడు?

తనకు అనుమతిలేని ఒక మందిరంలోకి చొరబడినందుకు అపరాధ భావన కలుగుతుండగా వెనక్కి మళ్ళాడాయన.

మూలం: ‘Moonlight, or In the Moonlight’, by ‘Guy de Maupassant’, French

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

తెల్లతాచు
ఎర్రపంచె గుర్తుకొచ్చింది విశ్వనాథానికి.

“ఎందుకు కట్టుకోవు నాన్నా” అంటాడుశేఖరం. పన్నెండేళ్ళు లేని పిల్లవాడికి తను ఎందుకు కట్టుకోకూడదో చెప్పినా అర్థం కాదు. “అవును నాన్నా. కట్టుకో. ఆచార్లుగారు కట్టుకుంటే ఎంత బాగుంటుందో” అంటుంది వాడి అక్క ప్రియంవద.

ఆయనతో తనకి వంతేమిటి? మంత్రం నోరు తిరిగినవాడు. చక్రాలేసి జాతకం చెప్పే నేర్పు వున్నవాడు. మరి తనో?

అరటిఆకు దొన్నెలోకి గుచ్చిన దర్భపుల్ల వేలికి గుచ్చుకోని విరిగింది.

“మడి బట్ట ఆరేశారుట. స్నానం చేసి సిద్ధమైతే మొదలుపెడదాం. రావుగారు కూడా వస్తున్నానని ఫోన్ చేశారు” గోపాలకృష్ణ పిలుపుతో తేరుకోని దొన్నెలు, పవిత్రాలు లెక్క చూసుకోని లేచాడు.

కడుపులో వికారంగా వుంది. అప్పటికే మూడు కాఫీలు పడ్డాయి. అయినా ప్రాణం నిలబడటం లేదు. ఇంకో కాఫీ అడిగే ధైర్యం లేదు. వంటగదిలో నుంచి వస్తున్న వంటల వాసనకి మరింత చిరాకుగా వుంది.

“అట్లా లఖంణాలు చెయ్యకోపోతే ఉదయాన్నే రెండిడ్డెనలు తినేసి రావచ్చు కదా” అంటాడు గోపాలకృష్ణ. తద్దినం పెట్టిస్తున్న యజమానిని మోసం చెయ్యడానికి మనస్కరించదు విశ్వనాథానికి.

నీళ్ళు కుమ్మరించుకోని ఆరేసిన పంచె అందుకున్నాడు. బాగా పాతబడిన పంచె. అంచు రంగు అరచేతి పొడవు పైకి పాకింది. చిన్న చిరుగు కూడా కనిపించింది. తప్పేదేముంది? ఇచ్చింది కట్టుకోవాలి అనుకుంటూ సిద్ధమయ్యాడు.

పన్నెండున్నర దాటింది. రావుగారింట్లో ఎప్పుడూ ఆలస్యమే. తద్దినానికి కూడా శెలవు పెట్టడాయన. ఉదయం ఆఫీసుకి వెళ్ళినట్లే వెళ్ళి లంచ్ టైమ్ లో వస్తాడు. వచ్చిన దగ్గర్నుంచి “త్వరగా త్వరగా” అంటూ ఒకటే హడావిడి. “సాయంత్రం మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి” అంటాడు.

మొదటి భోక్తగా ఎవరో కొత్తాయన. గోపాలకృష్ణగారి తాలూకేమో, ఆయనతో తప్ప మాట్లాడట్లేదు. మనిషి పల్చగా వున్నాడు. రంగు అదీ బాగానే వున్నాడు. మంచి అంచు వున్న కొత్త పంచె కట్టుకున్నాడు. ఈ పనికి అలా వుంటే చెల్లదని ఇంకా తెలియనట్లుంది.

ఒకప్పుడు విశ్వనాథం కూడా అలాగే వుండేవాడు. తద్దినాలు, మాసికాలు, శ్రాద్ధకర్మలు, శని దానాలు ఒకటేమిటి, అన్ని అశుభాలలో నిలబడ్డాడు. దాని ప్రభావం ఒంటి మీద, ఇంటి మీద కూడా వుందని స్పష్టంగా తెలుసతనికి.

“ఇప్పుడనేముందిలే. ఎన్ని సంవత్సరాల నుంచో నాన్న కూడా ఇదే పని చేశాడాయే” అనుకున్నాడు.

తండ్రి శివయ్య జ్ఞాపకం వచ్చాడు. ఆయనకూడా ఇలాగే తద్దినం భోజనాలు చేసి ఇబ్బంది పడేవాడు. రాత్రంతా పొట్ట పట్టుకోని కూర్చునేవాడు. కనీసం ఆయనకు మంత్రం చెప్పడం అన్నా వచ్చు. అపరకర్మల తద్దినాలకు మాత్రమే వెళ్ళేవాడు. పెళ్ళిమంత్రాలు సహా నేర్చుకున్నాడు కానీ, ఆంబోతుకి అచ్చేసినట్లు ఆయనకి తద్దినం బ్రాహ్మడని పేరు తగిలించారు. ఇక ఆ పనులకు తప్ప వేరే పనులకు పిలిచేవారు కాదు. కుటుంబం చాలా కష్టాలు పడింది. మొదట్లో రాజమండ్రిలో వుండేవాళ్ళు. రోజూ గోదావరి స్టేషన్ కు వెళ్ళి ట్రైన్ వచ్చీరాగానే పెట్టె పెట్టె మధ్య పరిగెడుతూ – “అపరకర్మలు చేయించాలా బాబూ” అంటూ అరుస్తూ తిరిగేవాడు. ప్లాట్ ఫారం మీద శెనక్కాయలమ్మే వాడి అరుపులకీ, ఆయన అరుపులకీ మధ్య పెద్ద తేడా కనపడేది కాదు.

ఓ సారి శివయ్య తోటి విశ్వనాథం కూడా వెళ్ళాడు. పది పన్నెండు ఏళ్ళు వుంటాయేమో అప్పుడు. తండ్రి ప్లాట్ఫారమ్ మీద మొత్తం ఆశగా పరిగెత్తడం చూసి సాయం చేయాలనిపించింది.

“బాబూ, పిండప్రదానం చేయిస్తారా? అపరకర్మలు చేయిస్తారా?” అని అరుస్తూ తనూ పరిగెట్టాడు. ఆమడ దూరంలో అటూ ఇటూ పరుగెడుతున్న శివయ్య ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. పరుగులు పెడుతూ వచ్చి విశ్వనాథం గూబ అదిరేలా ఒక్కటి కొట్టాడు.

“వెధవకానా… ఫో ఇంటికొఫో… దరిద్రప్పీనుగా” అంటూ అరిచాడు. ముందు బిత్తరపోయి, ఆ తరువాత నొప్పి తెలిసి ఏడుస్తూ ఇంటికి పరుగెత్తాడు. తరువాత ఆలోచిస్తే అర్థం అయ్యింది. తాను నడిచిన నిప్పుల గుండంలోకి విశ్వనాథం రాకూడదని ఆయన తపన. ఎవరు ఎలా తలచినా విధి ఇంకోలా నడిపించింది.

అదే వారసత్వం విశ్వనాథానికి కూడా వచ్చింది. అయితే తండ్రి శివయ్య ఎంత చెప్పినా మంత్రం మాత్రం పట్టుబడలేదు. దాంతో శివయ్యగారి శిష్యుడు గోపాలకృష్ణ దగ్గరే పనివాడుగా చేరాడు. ఎక్కడ అశుభం జరిగినా ముందు గోపాలకృష్ణకే తెలుస్తుంది. మంత్రం ఆయనే చెప్తాడు. ఫోన్ చేస్తే భోక్తగానో, వాహకుడిగానో వెళ్ళాలి. ఇప్పుడు ఈ తద్దినం సంగతి కూడా అతనే చెప్పాడు.

“ఏమయ్యా విశ్వనాథం, అలా కూర్చోనే కలలు కంటుంటావా ఏం? పాదప్రక్షాళన చెయ్యాలి. పెరట్లోకి నడువ్” గోపాలకృష్ణ అరిచినంత పని చెయ్యడంతో తేరుకోని రెండో పవిత్రం, నువ్వులు అందుకోని యజమాని రావుగారి వెంటే నడిచాడు.

ఈ మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ ఆలోచించడం ఎక్కువైపోయింది. ఎప్పుడూ అదే ఎర్రపంచె కనిపిస్తుంటుంది. పడుకుంటే తెల్ల తాఛు కల ఒకటి. రాత్రి కూడా వచ్చింది. పొట్ట మీద ఎక్కి ఎడమ భుజం మీదుగా వీపు మీదకు జారే తెల్లతాచు కల. అది కాటు వేస్తుందేమోనన్న భయంతో కదలకుండా వుంటాడు. అది అలా నడుము చుట్టూ తిరిగి మళ్ళీ పొట్ట మీదుగా భుజం మీదకు పాకుతుంది. మెలకువ వచ్చేదాకా అలాగే జారుతూ వుంటుంది.

“పిలుస్తున్నారు” వీపు మీద తట్టి చెప్పాడు మొదటి భోక్త. బోర్లించిన దొన్నె పక్క నుంచి తప్పుకోని లోపలికి నడిచాడు.

ఎర్రపంచె నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడో పిల్ల సమర్తాడినప్పుడు బావమరిది పెట్టాడు. ఖరీదు ఎక్కువే వుంటుంది. వాడికి అంత తాహతెక్కడిది? వాడి సంపాదనంతా కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, వక్కలు, ఆకులు. ఇంటి నిండా అవే. వాడికి కూడా గుళ్ళో ఎవరో పెట్టి వుంటారు. అది తెచ్చి నా ముఖాన కొట్టాడు.

అది కడితే ఆ రోజుతో తన సంపాదనంతా తగలబడిపోయినట్లే. చేజేతులా నోటికి అందుతున్న కూడుని కాలదన్నినట్లే.

నెత్తిన నువ్వులు పడ్డాయి. ఇప్పుడు విశ్వనాథం విశ్వనాథం కాదు. రావు గారి తల్లి, ఆమె అత్తగారు, ఆమె అత్తగారి అత్తగారు. వసు రుద్ర ఆదిత్య రూపాలలో. శారదమ్మ, పద్మావతమ్మ, సుబ్బాయమ్మ. ఆ ముగ్గురూ ఏ లోకంలో వున్నా అతను తినే భోజనం తోనే వాళ్ళ కడుపు నిండుతుంది. తద్దినం భోజనానికి కూర్చున్న ప్రతిసారీ అనుకుంటాడు – ఆ ముగ్గురు పార్వతి, ప్రియంవద, శేఖరం అయితే ఎంత బాగుంటుందని. తాను ఒక్కడు భోజనం చేస్తే ఇంట్లో వాళ్ళ కడుపు కూడా నిండే విధానం వుంటే బాగుండేది.

వడ్డన పూర్తైంది. రావుగారు నిలబడి నమస్కరించి ఆలస్యమైంది, భోజనం చెయ్యండంటూ ప్రకటించాడు. మూడు దాటిందని అప్పుడే గుర్తించాడు విశ్వనాథం.

పిండాలు పెట్టారు. మూడింటి మీదా పసుపు కుంకుమ పూలు చల్లారు.

“ముగ్గురూ అదృష్టవంతులే. పసుపు కుంకుమలతో పోయారు” అనుకున్నాడు విశ్వనాథం. తన తల్లి తద్దినంలో నల్లటి నువ్వులు తప్ప ఏ రంగూ వుండని తెల్లటి పిండాలు పెట్టడం గుర్తుకొచ్చింది. తల్లి గుర్తుకొచ్చింది. చాలా కష్టాలు పడిందామె. ఆమెని ఏముందిలే, ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఆడమనిషి కష్టాలు పడాల్సిందే. మగవాళ్ళు తద్దినమనో, కర్మలనో ఎక్కడో ఒక చోట కడుపుకి ఇంత అన్నం తినేవాళ్ళు. తెచ్చిన కాస్త డబ్బు, దానాలు పట్టిన పప్పు ఉప్పులతో సర్దుకు బతికేది ఆడవాళ్ళు.

తండ్రి తడిగుడ్డలతో మడి కట్టి కట్టి న్యుమోనియా వచ్చి పోయాడు. అప్పటికి విశ్వనాథానికి పదిహేనేళ్ళు కూడా లేవు. అక్కడ వుండలేక మహలక్ష్మమ్మ పిల్లాణ్ణి తీసుకోని గుంటూరు చేరింది. బ్రాడీపేట శివాలయంలో ఆమె అక్క భర్త పూజారి. ఆయన్ను బతిమిలాడుకుంటే వంటలు చేయడానికి కుదిర్చిపెట్టేవాడు.

నెత్తిన జుట్టు వున్న విధవరాలు తద్దినం వంటకి పనికిరాదని తన భర్త పోయిన మూడేళ్ళకు శిరోముండనం చేయించుకుందామె. సంప్రదాయం అంటే ఆమెకి కూడా గౌరవమే. కాకపోతే సంప్రదాయం కోసం కాకుండా పొట్టకూటికోసం అలా చేయాల్సిరావడం ఆమెను అతలాకుతలం చేసేసింది. విశ్వనాథం తల్లిని అలా చూడలేక ఎన్నో రాత్రులు భోరుభోరున ఏడ్చాడు. ఎలాగైనా సంపాదించాలన్న ఆలోచన ఆ దుఃఖంలో నుంచే పుట్టింది. శనిదానాలతో అతని సంపాదన ప్రారంభం అయ్యింది. మొదటిసారి నువ్వులు మోసుకొచ్చినందుకు మహలక్ష్మమ్మ అతన్ని చావగొట్టింది. ఆ దెబ్బలూ, ఆ రోజు గోదావరి స్టేషన్లో తండ్రి కొట్టిన దెబ్బలు ఒకేలా అనిపించాయి విశ్వనాథానికి. కుటుంబ అవసరాలకి సరిపోయేంతలా ఏనాడు సంపాదించలేకపోయాడు. మహలక్ష్మమ్మ చివరి రోజు వరకూ వంటలు చేస్తూనే పోయింది.

పిండాలకు అందరూ దండాలు పెట్టారు.

రావుగారి హడావిడి మరీ ఎక్కువైంది. ఆఫీసుకి టైమ్ అయ్యింది వడ్డించమంటూ అరుస్తున్నాడు. గోపాలకృష్ణ తను చదువుతున్న అభిశ్రవణ మంత్రాలను ఆపాడు. “చిన్న తంతు మిగిలింది వుండండి రావుగారు. భోక్తలు తృప్తిగా తిన్నామని ప్రకటించిన తరువాత, ఇంకా పదార్థాలు మిగిలిపోయాయి కాబట్టి వీటిని ఏం చెయ్యమంటారు అని వాళ్ళని మీరు అడగాలి. మీరు, మీ బంధువులు కలిసి భుజించమని వారు చెప్తే కానీ మీరు తినకూడదు” అంటూ మంత్రోక్తంగా ఆ పని మొదలుపెట్టాడు.

మిగిలింది మాకివ్వండి తీసుకెళ్తాం అంటే ఏం చేస్తాడో? నాలుగు గారెలు తీసుకెళ్తే పిల్ల, పిల్లాడన్నా తింటారు కదా!

“ఇదిగో మాలోకం విశ్వనాథం. తృప్తాస్మా అనవయ్యా…”

“తృప్తాస్మా”

ఇంటికి వెళ్ళబుద్దెయ్యలేదు విశ్వనాథానికి. శివాలయం చేరి నాగేంద్రుడి చెట్టు పక్క వేపచెట్టు నీడలో కూర్చున్నాడు. ఓ గంట గంటన్నరకి శంకరశాస్త్రి వచ్చి కూర్చున్నాడు. తెల్ల తాచు కల గురించి చెప్పాడతనికి.

“ఇంకేముంది, ఆ నాగేంద్రుడే దర్శనమిస్తున్నాడు. ఆయనకి కాస్త పాలు పోసి నూగుచిమ్మిడి పెట్టవయ్యా. నేను శాంతి జరిపిస్తాను” అన్నాడు. విశ్వనాథం నవ్వి ఊరుకున్నాడు.

“ఏమిటయ్యా అలా నవ్వుతావు? నీ కూతురికి జాతకంలో కుజదోషం వుందా? నీ జాతకంలో కాలసర్ప దోషం సరే సరి. ఇంకా ఏం కావాలేం. అందుకు కాదూ నీ బతుకు ఇట్టా ఏడ్చింది. నా మాట విని సర్పశాంతి జరిపించవయ్యా”

“అంతేనంటావా శాస్త్రులూ” అడిగాడు సగం నమ్మకం కుదిరాక. మిగిలిన సగం నమ్మకం కలిగిలించడం పెద్ద కష్టం కాలేదు శంకరశాస్త్రికి. తద్దినం భోక్తగా చేతికందిన సంభావన అతని చేతిలో పోశాడు విశ్వనాథం.

శంకరశాస్త్రి లేచి “రేపు వచ్చే చవితి రోజు పెట్టకుందాం కార్యక్రమం. పిల్లల్ని, మీ ఆవిడని తీసుకోని రా” అంటూగుళ్ళోకి వెళ్ళిపోయి తన కార్యక్రమాలు మొదలుపెట్టాడు.

విశ్వనాథం అక్కడే కూర్చున్నాడు. అప్పటిదాకా పంచె దోపుకున్న చోట ఎత్తుగా తగిలిన ఆరొందలు లేకపోవటంతో ఏదో వెలితిగా అనిపించింది. అయినా తప్పదు. ఈ శాంతితో పిల్లకు పెళ్ళికి, పిల్లాడి చదువుకి ఇబ్బంది లేకుండా పోతే అదే పదివేలు. కనీసం వాడన్నా ఈ శ్రాద్ధకర్మలకు దూరంగా వుంటే ఈ జన్మకి ఇంక కోరుకునేది ఏమీ లేదు. నాగేంద్రుడి పుట్టవైపు నమస్కారం చేశాడు.

చీకట్లు ముసురుకోని గుళ్ళో వున్న నాలుగు దీపాలు వెలిగాక కూడా ఇంటికి వెళ్ళ బుద్దెయ్యలేదు. వచ్చేపోయే వాళ్ళను గమనిస్తూ వుండిపోయాడు. ఎర్రచీర కట్టుకోని వచ్చినావిడని చూశాక మళ్ళీ ఎర్రపంచె గుర్తుకొచ్చింది. అది కట్టుకునే యోగం తనకు ఎలాగూ లేదు. నేను చస్తే కూడా తెల్ల చిరుగుల పంచే కడతారు. అనుకున్నాడు. తల విదిలించి ఇంటి దారి పట్టాడు.

“మన సత్యం పెళ్ళట. మీకేమన్నా తెలిసిందా?” అడిగింది పార్వతి ఆయన ఇంట్లోకి అడుపెడుతుండగానే.

విశ్వనాథం తల ఊపి ఊరుకున్నాడు. జాగ్రత్తగా వెతికితే భార్య అన్న మాటల్లో వ్యంగ్యంమో వెటకారమో కనపడుతుందని అతనికి తెలిసినా ఆ ప్రయత్నం అనవసరం అనుకున్నాడు.

“మనం ఏమన్నా కానివాళ్ళమా? స్వయానా మీ పెదనాన్నగారి మనవడే కదా కనీసం మీకు చెప్పాలని కూడా అనిపించలేదా మీ అన్నయ్యగారికి?” అంది నిష్టూరం ధ్వనించాలన్న ప్రయత్నం ప్రత్యేకంగా చేస్తూ.

“ఎవరు చెప్పారు?” అన్నాడు విశ్వనాథం భుజానికి వున్న కండువాని గోడకి కొట్టిన మేకుకి తగిలిస్తూ. ఆ మేకుకి తగిలించిన రెండు సంవత్సరాల క్రితం కేలండర్ మీద వున్న లక్ష్మీదేవి అభయహస్తాన్ని ఎప్పటిలాగే ఆ కండువా కప్పేసింది.

“మన సరోజనమ్మ లేదూ… ఆవిడని మాట్లాడుకున్నారట వ్రతం రోజు వంటకి. వచ్చేవారమే పెళ్ళి”, చెప్పిందామె అతని సమాధానం ఎదురుచూస్తున్నట్లుగా.

“కార్డు వేసే వుంటారులేవే. రేపోమాపో వస్తుందిలే” అన్నాడు అతను. అది నిజం అన్న భావన కన్నా నిజం అయితే బాగుండు అన్న ధ్వని వుంది అతని సమాధానంలో.

“మీవాళ్ళ మీద ఎంత నమ్మకమో! ఒక్క మాట పడనీరు కదా” అంది అస్త్రసన్యాసం చేస్తూ.

“నిన్నెవరు ఆపారు. అనదల్చుకుంటే ఒక్క మాటేమీ వంద మాటలను. వద్దన్నానా?” విశ్వనాథం గొంతులో కాస్త చిరాకు కనపడేసరికి వదిలేసిన అస్త్రాలని మళ్ళీ అందుకుంది పార్వతి.

“మరేం… మాట అనడానికి మీ సంపాదనేమన్నా ఖర్చైపోతోందా. పెదనాన్న కొడుకైనా, ఆ రాఘవేంద్ర చుట్టూ అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగితిరి. ఆఖరుకి మనమ్మాయి సమర్తాడినప్పుడు కూడా ఇంటికి పొయ్యి మరీ పిలిచొచ్చామే.. కనీసం ఆపాటి ఆలోచన వుండద్దు ఆయనగారికి? డబ్బులేకపోయే సరికి కనీసం కళ్ళకి కూడా ఆనట్లేదు మనం” ఈసారి తీవ్రత ఎక్కువవడంతో విశ్వనాథం సమాధానం చెప్పక తప్పలేదు.

“తెలుసుగా ఆ సంగతి? మళ్ళీ అడుగుతావే?నేను చేసే పనులు తెలియదా నీకు? శవాలు, తద్దినాలు, శనిదానాలు… మన సంగతి తెలిసీ మనల్ని పిలుస్తారని ఎలా అనుకుంటున్నావు” అన్నాడు.

ఆ సమాధానం ఆమెకు తెలిసిందే. అయినా అతను అంత సూటిగా చెప్తాడనీ, ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటాడనీ ఆమె ఊహించలేదు. ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని అర్థం అయ్యింది.

“బియ్యం పడేద్దునా?” అంది.

“వద్దు. రావుగారింట్లో తద్దినం ఆలస్యం అయ్యింది. భోజనాలయ్యేసరికి నాలుగు. ఆకలి లేదు” అన్నాడు.

“మీకు షుగర్ వుంది. అంత ఆలస్యంగా భోజనం చేస్తే ఎలా?” అందామె.

“మన చేతుల్లో వుందట్నే? భోక్తగా వెళ్ళాక తప్పుతుందా?” అన్నాడు మంచం మీద నడుం వాలుస్తూ. ఆమె సమధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.

షుగర్ సంగతిని ఆమె జ్ఞాపకం చేయడంతో ఆ రోజు తను తిన్న తీపి పదార్థాలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. రవ్వలడ్డు అంటే రావుగారి తల్లిగారికి చాలా ఇష్టమేమో, ఒకటికి నాలుగుసార్లు వడ్డించారు. చివరగా అరటిపండు ఒకటి.

“ఇదిగో, ఆ షుగర్ మాత్తర్లు రెండు తీసుకురా, ఆ చేత్తోనే మంచి నీళ్ళు కూడా” అన్నాడు విశ్వనాథం.

“ఏమిటి? మళ్ళీ స్వీట్లుగానీ తిన్నారా?” అంది మందులు నీళ్ళు అందిస్తూ.

“తప్పలేదే… తద్దినంలో భోక్తగా కూచున్నాక బాగా తినకపోతే వాళ్ళకి తృప్తి వుండదు. మళ్ళీ పిలిచి చావరు” అన్నాడు సంజాయిషీగా. రెండు మాత్రలు వేసుకోని నీళ్ళు తాగి చెంబు ఆమె చేతిలో పెట్టాడు.

“ఆరోగ్యం జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకోని ఇక్కడో రెండు బతుకులు వున్నాయి. మర్చిపోకండి” అంటూ వంటింట్లోకి నడిచిందామె.

“ఏమౌతుంది. ఇవాళ చస్తే రేపటికి రెండు” అన్నాడతను మళ్ళీ మంచం మీదకు ఒరుగుతూ.

“ఛ.. ఆపండా పాడు మాటలు. అసురసంధ్య వేళ…” ఆమె ఇంకేదో అనబోతుంటే విశ్వనాథం సెల్ ఫోన్ మోగింది.

ఫోన్ తీసి చూశాడు. ఫోన్ పైన అద్దం పగిలిపోయి వుండటంతో ఎవరో తెలియలేదు. అరిగిపోయిన బటన్ ని బలంగా నొక్కి “హలో” అన్నాడు. ఓ నిమిషం మాట్లాడి పెట్టేశాడు.

“రేపటికి వాహకుడి అవతారం. గాంధీనగర్ లో ఎవరో పోయార్ట” అన్నాడు క్లుప్తంగా.

ఆమె ఆయన వైపు ఓ క్షణం చూసి వెళ్ళిపోయింది. ఆ చూపులోనే కాస్త నిరసన, ఇంకాస్త నిరాశ వున్నాయన్న సంగతి విశ్వనాథానికి అర్థం అయ్యింది. అయినా మారు చెప్పలేదు. మంచం మీద మళ్ళీ పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. కడుపులో ఏదో వికారంగా వుంది. వేళకాని వేళ భోజనం. అది కూడా మామూలుగా తినేదానికన్నా ఎక్కువ తినడం. నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లు, గారెలు, రవ్వలడ్డు – ఒకప్పుడు మూడు వాయల గారెలు తినేవాడు. భోక్త అంటే ఇలా తినాలని చెప్పుకునేవారు. అలా తింటాడన్న కారణంతోనే ఇప్పటికీ పిలుస్తుంటారు. అందుకే అంతలా తినడం తప్పడంలేదు. వయసు మీద పడుతుండటంతో కొంచెం కష్టంగా వుంటోంది. కళ్ళు మూసుకోని పడుకున్నాడు. మళ్ళీ తెల్లతాచు కల వస్తుందేమోనని భయం భయంగా వున్నాడు.

పక్కనే గడప దగ్గర చాప పరుచుకోని పార్వతి పడుకుందన్న సంగతి విశ్వనాథానికి అర్థం అవుతూనే వుంది. ఆమె ఏమీ తినలేదని కూడా తెలుసు. ఒక పూట మానేస్తే ఇంకో పూటకు వుంటుందని ఆమె అనుకుంటోందనీ తెలుసు. అడిగితే పక్కింట్లో సరోజనమ్మ ఎక్కడో వంట చేసి వస్తూ గారెలు, భక్ష్యాలు తెస్తే తిన్నాని చెప్తుందనీ తెలుసు. అన్నీ తెలిసి అడగటం ఎందుకని నిద్ర నటిస్తూ ఊరుకున్నాడు విశ్వానాథం. ఆయన నిద్ర నిజం కాదనీ, అతని మనసులో ఆలోచనలు తిరుగుతుంటాయనీ ఆమెకు తెలుసు. అందుకే ఆమె మాట్లాడదు.

“అమ్మా ఆకలేస్తోందే” శేఖరం వాళ్ళమ్మతో అనడం వినపడింది.

“ష్..! ఈ రోజు నాన్నగారు లేస్తారు సంభావన తెచ్చుంటారు. రేపు పొంగలి చేసిపెడతా. సరేనా” పార్వతి మాటలు వినపడుతుండగా విశ్వనాథం కల్లోని తెల్లతాచు అతని మీద నుంచి జారి కిందపడింది.

“లక్ష్మీగారింట్లో నందికేశుల నోముకి వెళ్తానంటే వద్దన్నావు. ఆ ఉండ్రాళ్లైనా తిని వచ్చేవాణ్ణి”

తెల్లతాచు శేఖరం వైపు పాకడం తెలిసినా కదలలేక వుండిపోయాడు విశ్వనాథం. భుజం మీద తెల్లతాచు కాటు వేసిన చోట నుంచి రక్తం స్రవిస్తోంది.

మొదటి ముద్రణ: తానా తెలుగు పలుకు 2017

పాతకోటు
డైరెక్టర్ క్యూ పాడిపంటల బ్యూరో డైరెక్టర్ గా రిటైరై వెళ్ళిపోతున్న రోజు అతని కొలీగ్స్ చాలా బాధపడ్డారు. కొంతమంది అధికారులైతే ఆయన వెళ్ళిపోడాన్ని చూడలేమంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయనకున్న పేరు అలాంటిది. తన పనేదో తను చేసుకునే రకం. నిజాయితీపరుడు, అజాతశత్రువు, మర్యాదస్థుడు అని అందరూ ఆయన గురించి అనేవారు. పైగా అతను డైరెక్టరుగా పని చేసినంత కాలం బ్యూరోలో అవినీతి జరగలేదనే పేరుండటంతో అందరూ ఆయన్ని చాలా గౌరవంగా చూసేవారు.

డెప్యూటీ ఛీఫ్ గా మొదలై డైరెక్టరు అయ్యేదాకా అన్ని దశాబ్దాల సర్వీసులో ఆయనకు అంత మంచి పేరు రావడానికి, ఆయన వేసుకునే దుస్తులు ఒక ముఖ్యమైన కారణం. బాగా మురికిపట్టి, మరకలు పడిన బట్టలు వేసుకునేవాడు. ఎప్పుడో విప్లవం కాలం నాటి షూస్, పైన ఆర్మీ వాళ్ళు వేసుకునే తరహా పాత కాటన్ కోటు వేసుకునేవాడు. ఆ కోటు మీద పడ్డ చిరుగులును కుట్టగా ఏర్పడ్డ దారాలు ఒక మ్యాప్ లా కనిపించేవి. ఆయన వాడుతూ వుండిన సైకిల్ ఒక శతాబ్దం కిందటి దానిలాగా కనిపించేది.

డిపార్ట్మెంట్ లో పెద్దపెద్ద వాళ్ళు, మరో డైరెక్టర్ ఫెంగ్, డెప్యూటీ డైరెక్టర్లు అందరూ కలిసి ఆయనకు ఒక వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఫెంగ్ ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చి చెప్పాడు – “డైరెక్టర్ క్యూ, నీతో పనిచేసే డైరెక్టర్లమంతా కలిసి నీ కోసం ఒక సూట్, ఒక జత లెదర్ షూస్, టై కొనుక్కొచ్చాము. రేపట్ననుంచి ఆ మురికి బట్టలు వేసుకోడానికి వీల్లేదంతే! మనం బతుకుతున్నది ఇరవై ఒకటో శతాబ్దంలో. ఇంకా కూలీ వెధవల్లాగా బట్టలు వేసుకుంటానంటే ఎలా చెప్పు?” అన్నాడు.

డైరెక్టర్ క్యూ బలవంతంగా నవ్వాడు.

“ఇవి విప్లవం కాలం నాటి బట్టలు. కొన్ని దశాబ్దాలుగా విప్లవందుస్తులనే ధరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మార్చుకోవాలంటేనే ఏదో ఇదిగా వుంది” అన్నాడు.

“భలేవాడివే క్యూ, నువ్వు ఇంత కాలం కష్టపడి పని చేశావు. ఇన్నేళ్లుగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ వచ్చావు. మనస్ఫూర్తిగా ప్రజలకి సేవ చేశావు. ఇప్పుడెలాగూ రిటైర్ అవుతున్నావు కాబట్టి, ఇకనైనా నీ ఇమేజ్ మార్చుకోవాలి” అంటూనే కంట్రీ డెప్యూటీ డైరెక్టర్ డింగ్ –

“అన్నట్లు నువ్వు వాడే సైకిల్ వుందే, అది మ్యూజియంలో వుండాల్సింది. అందుకే కొత్త సైకిల్ కూడా కొన్నాం” అన్నాడు.

“ఇవన్నీ మార్చేస్తే నేను నేనే కాకుండా పోతానేమో” అని ఖంగారు పడ్డాడు క్యూ.

మర్నాడు మరో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీ నిర్వహించింది పాడిపంటల బ్యూరో డెప్యూటీ డైరెక్టర్. అతను ఉద్యోగంలో చేరిన కొత్తలో డైరెక్టర్ క్యూ నుండే ట్రైనింగ్ ను పొందాడు. ఆ పార్టీ కోసమని డైరెక్టర్ క్యూ తాను ఎప్పుడూ వేసుకునే వెలిసిపోయిన బట్టలు, మాసికలు పడ్డ కాటన్ కోట్ వదిలేసి, ముందు రోజు డైరెక్టర్లు బహుమతిగా ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు. సహజంగానే ఒక కొత్త కళ వచ్చింది. చూడటానికి కొత్త మనిషిలా వున్నాడు. ఆయన స్థానంలోకి రాబోతున్న డైరెక్టర్ గుయ్, క్యూను చూసి ఆశ్చర్యపోయాడు.

“మీ కింద పని చేసిన వాళ్ళంతా కలిసి మీకు బహుమతిగా ఇవ్వాలని కొత్త కోట్ కొన్నారు. మీరు ఈ పార్టీ కోసం మీ పురాతనమైన కోటుని వదిలేస్తారని మేము అసలు ఊహించలేకపోయాము” అన్నాడాయన.

“నా అంతట నేనే మార్చుకున్నానని అనుకుంటున్నారా? నాతో పని చేసిన డైరెక్టర్లందరూ కలిసి నాకు ఈ బట్టలిచ్చారు. ఇన్నేళ్ళుగా విప్లవంతో అనుబంధం వున్న వాణ్ణి. అందుకే అవే బట్టలు ప్రతిరోజూ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడింక రిటైర్ అవుతున్నాను కాబట్టి అలాగే వుండటానికి వీల్లేదట. నా భార్య కూడా ఇదే మాట అంది. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళగానే నా బట్టలు తీసి పడేసింది. ఈ కొత్త బట్టలనే కట్టుకోమని ఇచ్చింది” అన్నాడు క్యూ కొంత బాధ ధ్వనిస్తున్న గొంతుతో.

“ఇక ఆ పాత జాకెట్, బట్టలు తీసి అవతల పారేయాలి మీరు. ఏదో ఒకరోజు ఏదైనా మ్యూజియం వాళ్ళు విప్లవం గురించి బోధించాలనుకున్నప్పుడు వాటిని తీసుకోని పురావస్తు ప్రదర్శనలో పెడతార్లెండి. ఆదర్శవంతుడైన పార్టీమెంబరుగా, మచ్చలేని బ్యూరో డైరెక్టర్ గా మీ ఖ్యాతిని  ముందుతరాలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా వుంది మరి” అన్నాడు డెప్యూటీ డైరెక్టర్ హువా వెటకారంగా.

“ఏమిటో రాత్రికి రాత్రే మొత్తం మారిపోయింది. రేపు నేను చనిపోయి పై లోకాలలో వున్న మార్క్స్ నో ఛైర్మెన్ మావోనో కలిస్తే ఏమని సమాధానం చెప్పాలో ఏమిటో” అంటూ బాధపడ్డాడు డైరెక్టర్ క్యూ.

ఆనవాయితీ ప్రకారం క్యూ గౌరవార్థం అతని సబార్డినేట్స్ అందరూ  ఆయనకు శుభకామనలు చెప్పి మందు తాగారు. ఇల్లు చేరేసరికి మత్తులో జోగుతూ వున్నాడు క్యూ. అతను కాస్త కుదుటపడతాడని అతని భార్య టీ చేసి ఇచ్చింది. ఇంకో జత బట్టలు కూడా వచ్చాయని తెలుసుకోని చాలా సంతోషించింది. కాస్త తేరుకున్నాక చుట్టూ చూశాడు డైరెక్టర్ క్యూ. ఇల్లంతా చక్కగా సర్ది అమర్చిపెట్టి వుంది. పాత బట్టలు, షూస్ ఎక్కడా వున్న జాడ లేదు.

“నా పాత బట్టలు, పుస్తకాలు కనపడటంలేదు. ఏమయ్యాయి?” అంటూ అరిచాడు.

“రిటైర్ అయ్యారు కదా. ఇంకా ఆ చింకి బట్టలు ఎందుకు చెప్పండి. మనకేమన్నా డబ్బులకు కొదవా? కొనుక్కోలేమా? అందుకే మీరు మధ్యాహ్నం అటు వెళ్ళగానే పాత వస్తువులన్నీ అమ్మేశాను. ఇరవై యెన్లు వచ్చాయి తెలుసా?” అంది ఆ అమాయకురాలు. ఆ దెబ్బకి క్యూ మత్తు మొత్తం ఎగిరిపోయింది.

“ఏమిటీ? ఆ పాత కోట్ కూడా అమ్మేశావా?” అడిగాడతను వణుకుతున్న గొంతుతో.

“అవును. ఇంకా ఆ పాత గుడ్డలు ఏం చేసుకుంటాం చెప్పండి? ఖంగారు పడకండి. మీ సర్టిఫికెట్లు, అవార్డులు మాత్రం తీసిపెట్టాన్లెండి” అంటూ సమాధానం ఇచ్చింది ఆవిడ.

“సర్వనాశనం అయిపోయిందే…” అని అరుస్తూ కింద కూలబడ్డాడు డైరెక్టర్ క్యూ. “లక్షల యెన్లు ఇంతలోనే మాయమైపోయాయా” అంటూ అరవసాగాడు.

“లక్షల యెన్లేమిటండీ?” ఆమెకు అర్థం కాలేదు.

“ఆ కాటన్ జాకెట్లో రెండు లక్షలకి తక్కువ కాకుండా డబ్బు వుందే” నీరసంగా పలికాడతను.

“రెండు లక్షల యెన్లా? మీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నెల నెలా జీతం మొత్తం నా చేతికే ఇస్తున్నారు కదా. మీకు మందు ఎక్కువైనట్లుంది. అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు” నమ్మకం లేదన్న విషయాన్ని నవ్వుతూ ప్రకటించిందామె.

“నాకేం ఎక్కువ కాలేదు. మొత్తం దిగిపోయింది. ఆ కోట్లో నా పై సంపాదన అంతా దాచుకున్నాను. ఎవరైనా ఇచ్చినవి, తప్పు లెక్కలు వేసి నేను మిగుల్చుకున్నది. అంతా కలిపి రెండు లక్షలకు పైనే. ఇంటి దగ్గర పెడదామంటే దొంగల భయం. బ్యాంకులో వేద్దామంటే అదేం సక్రమమైన సంపాదన కాదు కదా!” బలహీనంగా అన్నాడు.

“నయాపైసా లంచం తీసుకోరని మీకు పేరుంది కదా. రెండు లక్షలు ఎవరిస్తారు? అసలు ఎందుకిస్తారు?” అడిగిందామె అనుమానంగా.

“ఓసి మొద్దు. గుర్రాలు వంకరగా పరుగెత్తినా బండి ముందుకే పోతుంది. పాడుపడిన పాత గుళ్ళో వుండే స్వామీజీనే ఎక్కువ సంపాదిస్తాడు. నీకు ఇంకా అర్థమవలేదా?” అతని గొంతులో బాధ, కోపం కలగలిసి వినిపిస్తున్నాయి. “నా ముతక బట్టలు నేను నిజాయితీపరుడిననీ, విధేయుడైన గవర్నమెంట్ ఉద్యోగినని నమ్మించడానికే. ఇంత చేస్తే చివరికి ఒకే దెబ్బలో అంతా పోయింది. నాతో ఒక్క మాట చెప్పి వుండచ్చు కదా” అంటూ భోరుమన్నాడు.

ఆమె కూడా గుండెలు బాదుకోని, కాళ్ళని నేల మీద కొడుతూ – “ఇన్నేళ్ళు ఇన్ని తెలివితేటలు ప్రదర్శించి, ఈ ఒక్కసారి మీ బుద్ది ఎందుకు గడ్డి తిన్నది?” అంటూ ఏడవసాగింది.

చైనా మూలం: జెంగ్ రెన్కువాన్

తెలుగు అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

మిట్టూరు టు మెట్రో: ఐదు కథల మీదుగా
“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

ఐదుగురు రచయితలను ప్రేమ కథ రాయమని అడిగారు. ఎవరు ఎలా రాస్తారో అని ఒక చిన్న ఊహ. ఒకరకంగా సాహిత్య మిమిక్రీ…

లవ్ యిన్ లివ్ యిన్

కుప్పిలి పద్మ

వర్షం మెల్లగా కురుస్తోంది. వో పక్క మార్గశిరమాసపు చల్లని శీతలగాలులు నైట్ క్వీన్ పరిమళాలను కలుపుకోని లోపలికి మత్తుని మోసుకొస్తుంటే మరో పక్కనుంచి వినిపిస్తున్న రఫీ పాటలు ఆ మత్తుని మధురంగా మారుస్తున్నాయి. మహి మనసు మాత్రం ఆ వాతావరణానికి వ్యతిరేకంగా వుంది. వొకప్పుడు ఆ నిలువెత్తు కిటికీ దగ్గర నిల్చుంటే ఆమెకు పన్నెండతస్తుల యెత్తు నుంచి పరుచుకోని కనిపించే మెట్రో చీకటి, ఆ చీకటి పైన నిలువుగా అడ్డంగా మెరుస్తూ తిరిగే కార్ల హెడలైట్లు భలే నచ్చేవి. యిప్పుడామె మనసంతా అలజడిగా వుంది. సడన్ గా ఆమె చూపు స్పోర్టీ రెడ్ కలర్ డస్టర్ మీద పడింది. అది అభిరణ్ కారేమో అనిపించింది.

ఆమెకి ఆ కార్ అంటే చాలా ఇష్టం. లోపల బ్లాక్ లెదర్ ఇంటీరియర్ తో హార్మోనియస్ గా వుంటుంది. అభిరణ్ కార్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చోవడం ఆమెకు ఇంకా ఇష్టం. ఫ్రెండ్స్ అందరితో కలిసి యెప్పుడైనా పబ్ కి వెళ్ళేటప్పుడు ఆ ముందు సీట్లో వేరే యెవరైనా కూర్చుంటే ఆమెకు వళ్ళుమంట. వొకసారి అలాగే జరిగితే వాళ్ళతో గొడవపెట్టేసుకుంది.

“యెలానోలా యెడ్జస్ట్ అవ్వాలి. యట్ లీస్ట్ ఫ్రండ్స్ దగ్గర” అన్నాడు అభిరణ్. యెడ్జస్ట్ అవడం కుదరదు అని చెప్పాలనిపించింది. అప్పుడే ఆమెకు అర్థం అయ్యింది వాళ్ళిద్దరి మధ్య వున్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదని.

మొదటిసారి అతన్ని కలిసినప్పుడు బంతిపువ్వు రంగు కాటన్ వరల్డ్ స్లిమ్ ఫిట్ కుర్తా వేసుకోని వున్నాడు. కింద ఆక్వా బ్లూ ఫేడెడ్ లివైస్ జీన్స్. భలే సిల్కీగా మెరుస్తూ, లేయర్స్ లేయర్స్ గా పెరిగిన వొత్తైన జుట్టు. వైశాఖమాసం వెన్నెలంత చల్లగా చూసే కళ్ళు. అతని ఆలోచనలు, పలకరింపులు గమ్మత్తుగా వుంటాయి. కాకపోతే అతనెందుకో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ స్టైల్ కి భిన్నంగా వుంటాడు. శాంతినికేతన్ లో చదవటం వల్లో లేకపోతే హంపీలో గడిచిన అతని బాల్యం వల్లో. లివ్ ఇన్ అని డిసైడ్ అయినప్పుడు అభిరణ్ పెట్టిన కండీషన్స్ గుర్తుకొచ్చాయి.

“మనం కలిసి హాలిడేకి వెళ్ళం. నీతో కలిసి నేను షాపింగ్ కి రాను. సినిమాలు చూడను”.

తెల్లబోయింది. అందుకే యీ భయం.

ఫోన్ తీసుకోని వాళ్ళమ్మకి ఫోన్ చేసింది.

“మీరు యీ కాలంలో పుట్టిన పిల్లలమ్మా. అందుకే కాలానికి భిన్నంగా వుండటానికి యిష్టపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి వేదన తప్పదమ్మా. నీకు జీవితానుభవం లేదమ్మా. అందుకే యిలాంటివి గుర్తుపట్టలేకపోతున్నావు. నిర్ణయం ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను. కానీ నువ్వు మనసుతోనే సాధన చెయ్యాలి. ప్రేమ నీకు దుఃఖాన్ని ఇచ్చినా ఆ ప్రేమనే వద్దనుకునేంత నిరాశావాదివి కాకూడదనే నేను కోరుకుంటాను. చూద్దాం ఈ ప్రయాణంలో యెలాంటి కొత్త ఆవిష్కరణలు జరుగుతాయో” అన్నదామె.

ఫోన్ పెట్టేసి అభిరణ్ కి కాల్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యకముందే ఆమె కళ్ళు సీతాకోకచిలకల రెక్కల్లా రెపరెపలాడాయి.

చంగయ్య మకరాజు అంజిలి మకరాణి

నామిని

నిద్ర లేచిన అల్మేలు తలకాయ నెప్పి అని జెప్పి కాపీ బెట్టుకోని వూదుకొని సగించినట్టు తాగతా వుండింది. అప్పుడే మూతి మూరడు పొడుగు పెట్టుకోని, ముక్కుల గుండా కోపంతో సందిట్లావు గసను విడిస్తా వచ్చింది యెంగటమ్మ

“ఒసే దరిద్రప నా సవితి! ఎనుమును కొట్టంలో కట్టేసుకునేది తెలవదా? దాని మాదిగోళ్ళు దాన్ని కోసుకొని తిననానీ. నా కొట్టంలో కుడితి నీళ్ళను సగం తాగేసింది. దాని దొమ్మ రోగం వచ్చి దాన్ని ఎత్తుకు పోనానీ” అనింది యెంగటమ్మ

“నా ఎనుము యాడా లేనట్టి నీ కుడితే ఎందుకు తాగతదిమే! ఏదో మానస్తురాల్ని గాబట్టి ఊరుకుంటున్నా. మనలో మనకెందుకు జగడాలు” అనింది అల్మేలు.

“పరగడుపున్నే బొంకొద్దు. ఇట్టా కానీ గానీ మాటలు మాట్లాడినావంటే నీ ఇద్దురు బిడ్డలు నీ మొకాన వుండరు!” అని శాపం పెట్టింది ఎంగటమ్మ.

ఇంటి ముందు ఈ గంగ జాతర జరగతా వుంటే ఇంట్లో పండుకోనున్న చంగయ్య మేలుకున్నాడు. “పరగడుపున్నే ఇదేం రచ్చ?” అని కసుకున్నాడు. అల్మేలు అక్క కొడుకే చంగయ్య. తిరప్తి దేవస్తానంలో గార్డనులో నీళ్ళుబోసే ఎన్నెమ్మార్ పని. నెలకు జీతం తొమ్మిది నూర్లు. చేరి మూడు నెలలైంది. పిన్నమ్మని చూసేదానికి మిట్టూరొచ్చినాడు. ఈ రచ్చ ఇట్టా జరగతావుంటే తలగీరుకుంటా బయటికి వచ్చాడు చంగయ్య.

ఆ పక్కన యంగటమ్మ కూతురు అంజిలి చెంబులో పాలు పిండడం మొదలు బెట్టేసింది. లింగులింగుమని సైకిలు బెల్లు మొగించుకుంటా పాలాయన సహదేవరెడ్డి వచ్చి ఇంటి ముందు ఆగినాడు. “యెంగటేస్పర సామి స్నానమాడే పాలు. తేడారాకూడదు మే” అన్నాడు వస్తానే.

“ఏందన్నా! పాలల్లో ఏదన్నా మిస్టీకు గాన వుంటే, నీ ఎడం కాలి చెప్పుతో నా పాపిడి దీసి పదారు యేట్లు కొట్టు” అని బెట్టుగా మాట్లాడతా పాలు పోసింది అంజిలి. పక్కన ఇంట్లో జరుగుతున్న రచ్చ చూసి అక్కడికి ఎలబారింది.

వస్తానే ఇద్దరి మద్దెలోకి పోయి “ఏందమ్మా ఇది. పొద్దున్నే రచ్చ. పక్కపక్కనుండేటోళ్ళం. ఇందమ్మా తియ్యగూర అంటే ఇందమ్మా పుల్లగూర అనుకోవాలిగాని ఇట్టా రచ్చ చేసుకుంటే చుట్టూ పక్కా నువ్వులాడుకోరూ. ఇంగ గమ్మునుండండి” అని జెప్పింది. ఇదంతా చూశాడు చంగయ్య. ఆ యమ్మి మనేద చూసి బిత్తరపోయాడు. ఉత్తరందిక్కుకు మళ్ళుకోని తిరప్తి కొండకి దణ్ణంబెట్టి “ఇట్టాటి పిల్లే నాకు పెళ్ళాం కావాలని” అన్నాడు

ఆ తరువాత రెండు రోజులకు అల్మేలు కయ్యలో ఎండలో వొంటిగా పనిచేస్తా కుశాల మింద వుండినప్పుడు చంగయ్య ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఆమెను లొంగేసుకుని “పిన్నమ్మా! నేను ఆ అంజిలిని ప్రేమిస్తన్నామా” అని ముదిగారంగా చెప్పాడు.

మెట్రో పబ్

మొహమ్మద్ ఖదీర్‌బాబు

పబ్ అంతటి మీదా ఆమె పేరే రాసి ఉందా అని అనిపించింది. అందరూ చూస్తున్నారు. సిగ్గుగా అనిపించింది. గుండెలో దడగా కూడా.

అతను చెయ్యందించేదాకా లేవాలని అనిపించలేదు. చూసింది. ఫుల్ హ్యాండ్స్ ఇన్ చేసుకుని షూ వేసుకొని ఉన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడు. అందించిన చెయ్యి వద్దనుకోని లేచి నిలబడింది. నవ్వుతున్నాడు.

వెధవ. జెడ్డి వెధవ. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియదు. అతను కిందపడిన హ్యాండ్ బ్యాగ్ అందిస్తే విసురుగా లాక్కోని గబగబా తన ఫ్రెండ్స్ వున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. వాళ్ళంతా వస్తున్న నవ్వుని ఆపుకున్నట్లు ఉన్నారు.

వాటర్ బాటిల్ అందుకుంది. యాభై రూపాలు ఖరీదు చేసే నీళ్లు. ఇల్లు గుర్తొచ్చింది.

బావి ఉండేది. నీళ్ళు తియ్యగా ఉండేవి. కొబ్బరి చెట్లు ఉండేవి. తాగేన్ని నీళ్లు ఇచ్చేవి. అలాంటి నీళ్లు కొనుక్కుంటే తప్ప తాగలేని పరిస్థితి.

అతని వైపు చూసింది. నవ్వుతూనే వున్నాడు. అందరూ నవ్వుతున్నారు. ఎందుకో అందరి అటెన్షన్ ఆమె మీదే వున్నట్లు అనిపించింది. అన్నింటికీ అటెన్షన్. తాగితే అటెన్షన్. తాగకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా ఆటెన్షన్. తూలి పడితే… గుండె దడ ఇంకా తగ్గలేదు. ఆ భయం ఈ రాత్రికి దిగదు.

డ్రింక్ అండ్ డ్రైవ్ కి దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరాలి అనుకుంది.

తాగిన తరువాత డాన్స్ చెయ్యకుండా వుండాల్సింది. అలవాటు లేని హై హీల్స్. పడిపోవడం గుర్తొచ్చి నవ్వుకుంది. మళ్ళీ అతని వైపు చూస్తే నవ్వుతూనే వున్నాడు. కన్నుకొట్టి ధమ్స్ అప్ చెప్పాడు.

అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసింది.

షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే మళ్ళీ గుర్తొచ్చాడు. స్నానం ముగించి నైటీ జార్చుకోని బయటకు వచ్చింది. ఎదురుగా బెడ్. సిక్స్ ఇంటూ సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై వేలు పెట్టి కొన్నది. బాంటియాలో సింగిల్ పేమెంట్ తో ఇంటికి తెచ్చుకుంది.

ఫేస్ బుక్ లో పొద్దున పెట్టిన ఫోటోకి లైక్స్ ఏమైనా ఉన్నాయోమో చూద్దామని హ్యాండ్ బ్యాగ్ లో మొబైల్ తీయబోతుంటే విజిటింగ్ కార్డ్ కనపడింది. పబ్ లో బ్యాగ్ చేతికి ఇస్తూ కార్డ్ డ్రాప్ చేసినట్లున్నాడు.

కణతల దగ్గర నొప్పి. మెల్లగా మొదలై పెద్దగా అవుతూ.

కాల్ చేసి థాంక్స్ చెప్పాలా? వద్దా? పోనీ వాట్సప్ లో మెసేజ్ పెడితే.

నిర్ణయం తీసుకున్న తరువాత రిలీఫ్ గా అనిపించింది.

కాని ఒక్క నిమిషమే. మళ్ళీ భయం వేసింది.

పిడికిట్లో సెల్ నలుపుతూ కూచుని ఉంది.

డాక్టర్రాజుగారు

వంశీ

పొద్దుటే లేచిపోయే అలవాటున్న డాక్టర్రాజు ఆ రోజు కూడా అలాగే లేచి పొయ్యి దగ్గరకెళ్లి వెలుబూడిద కచ్చికా, తాటాకూ, చెంబుడు నీళ్లి పట్టుకొని లంకని ఆనుకున్న గట్టేంటా ముందుకెళ్ళాడు.

ఆ తరువాతెప్పటికో టీ తాగుదామనిపించి గోదారి గట్టుకి కుడిపక్కననున్న వంతెన దగ్గర్లో వుండే ఆవుల సాంబమూర్తి హోటల్ కి వెళ్ళి టీ చెప్పాడు. అక్కడికి కొంచెం అవతల మూడడుగులు మాత్రం పెరిగిన చిన్ని తాడిచెట్టు మొదలు నరికి మొవ్వుని తీస్తున్నాడు పాలికాపు చీకట్ల మందయ్య. ఓ గూటిపడవ లంక ఒడ్డుకొచ్చి ఆగింది. దాంట్లోంచి దిగిన పెన్మత్స చినవెంకట్రాజు గారి రెండో భార్య మొదటి కూతురు దేవిని చూసి నోటమాట లేని డాక్టర్రాజుగారు నిలబడుండిపోయాడలా.

ఆకుల సాంబమూర్తికి టీ డబ్బులు ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయి అదే టీ గ్లాసు చేతిలో పట్టుకోనే దేవి వెనకే నడుచుకుంటా ముందుకెళ్ళిపోయాడా మనిషి. రాజుగారి పాత మేడ దాటి వందేళ్ళ చరిత్రగల జనార్థనస్వామి గుడి మీదుగా వెళ్ళిందామ్మాయి. ఆ తరువాత మళ్ళీ కనిపించలేదు.

ఆయన అసలుపేరు సాగి సూర్యనారాయణరాజైనా ఊర్లో వాళ్ళంతా డాక్టర్రాజనే అంటారు. ద్వారపూడి బట్టలసంతలో కొనుక్కున్న గళ్ళ లుంగి, ఖద్దరు చొక్కా వేస్తాడు. ఎప్పుడన్నా మల్లవరం వెళ్ళినప్పుడో కోటిపల్లెకెళ్ళినప్పుడు ఒక బ్రాందీ సీసా తెచ్చుకోని కొంచెం కొంచెం పుచ్చుకునేవాడు. ఆయనతో పాటు రుద్రరాజు సుబ్బరాజుగారి మనవడు రుద్రరాజు శ్రీనివాస్ రాజు కట్టించిన తెల్ల గోడల టూరింగ్ టాకీస్ లో ఆపరేటర్ గా పనిచేసే తిప్పిరెడ్డి వెంకట్రేడ్డి కూడా కూర్చోని రెండు పెగ్గులు వేసుకుంటాడు. అంతకన్నా పెద్దగా చెడు అలవాట్లేం లేవా మనిషికి.

డాక్టరుగా మాత్రం చాలా పేరు. అటు రధం వీధిలో వాళ్ళు, సుంకరవారి వీధి, కొడిశెట్టివారి వీధి నుంచి కూడా చాలామంది వచ్చి చూపించుకుంటారు. అట్లాంటి డాక్టరు దేవి వెనకాలే వెళ్ళడం ఊర్లో అందరూ చూశారు.

“ఆ పిల్లే అట్టాటిదిలే. అట్టాంటి నవ్వుని నే పుట్టాక చూళ్ళే”దన్నాడు సాంబమూర్తి మందయ్యతో మాట్లాడుతూ.

మర్నాడు పొద్దుట్నుంచి పట్టుకుంది ముసురు. అప్పుడే కాస్త తగ్గి తుంపర్లు పడుతూ వుంది. ఇంక పేషెంట్లెవరు వస్తార్లే అని డాక్టర్రాజు తలుపు వేసెయ్యబోతుంటే అప్పుడే వచ్చిందా అమ్మాయి. అదే ఆ దేవి.

డాక్టర్రాజుగారి దగ్గరగా చేరి “కాస్త పులపరంగా వున్నట్టుందండీ” అంది.

ఆ మనిషి నెవరగంత మీద చెయ్యేసి చూసి, “అట్లపెణంలా కాలిపోతుంటే పులపరం అంటావేంటి” అన్నాడు.

“సందకాడ బానే వుందండీ” అంది

బయట అప్పుడే పెరిగిన వర్షం ఇక కురుస్తానే వుంది. ఏం చెయ్యాలో తెలియని డాక్టర్రాజుగారు కాలక్షేపంగా వుంటుందని రేడియో పెడితే అప్పడే తెలిసింది తుఫాను మొదలైందని. తప్పేది లేక ఆ అమ్మాయికి షోలాపూర్ దుప్పటి ఒకటి ఇచ్చి, హర్యానా రగ్గు తను కప్పుకున్నాడు. ఆ అమ్మాయి దుప్పటి కప్పుకుంటుంటే చేతిమీద గీతలు చూసి అంతటి డాక్టరు కూడా ఖంగారు పడిపోయాడు.

“ఏంటయ్యి?” అన్నాడు.

“ఇయ్యాండీ నిన్న మీరు నా వెనకే వస్తంటే భయం వేసి గుడి పక్కన గుబురు చెట్లలో దాక్కున్నానండీ. అప్పుడు గీరుకున్నాయండీ ఇయ్యి” అంది. డాక్టర్రాజుగారికి ఏమనాలో తెలియక కాటన్లో టించర్ వేసి ఊదుతా అద్దుతా వుండిపోయాడు. “మిమ్మల్నోటడగనాండీ? ఎందుకండీ నా వెనకాలే వచ్చారు?” అడిగింది దేవి.

డాక్టర్రాజు నవ్వాడు తప్ప సమాధానం చెప్పలేదు.

కరెంట్ తీగపైన కాకి

కాశీభట్ల వేణుగోపాల్

రిచర్డ్ సీతాపతి…!

రిచర్డ్ బాస్టర్డ్… బాస్టర్డ్ రిచర్డ్ సీతాపతి..!

తల్లి ఏ ముండల ఖానాలో కనిందో అదే ముండల ఖానా వెనుక రొచ్చు మోరి పక్కన ఇల్లు తీసుకోని…

కుంటి రిచర్డ్ సీతాపతి… వేలాడే కుడికాలుని నిలబడ్డెడంకాలుతో ఈడుస్తూ నడిచే రిచర్డ్ గాడు.

ప్రేమతో మాట్లాడేవాళ్ళు కానీ కామంతో ఆట్లాడేవాళ్ళు కానీ లేక… అలాంటి వాళ్ళు దొరకక… కోరికని కాకిని చేసి ఎగరేసుకున్న డిప్రైవ్డ్ సోల్..!

కామకరువులో ఏకాకి కుంటి బాస్టర్డ్…!

రొచ్చుమోరీ పక్కన పగలు పందులు దొర్లాడే చోటుకి దగ్గర్లో రాత్రి పూట పెట్టే పానీపూరీ బండి దగ్గరకు వెళ్ళాడు. దుర్గ బండి సిద్ధం చేసుకుంటున్నాడు. స్టౌకి పంపు కొడుతున్నాడు.

పం..పు.. కొడుతున్నాడు.

కాకి వచ్చి కరెంట్తీగ మీద వాలింది.

సిగరెట్ పెట్టిలో ఆఖరి సిగరెట్ తీసాడు. ప్రేమతో ఆరాధనతో పెదవులకి తగిలించి నాలుకతో తడిమి అంటించాడు. అప్పటిదాకా తాగిన రమ్ము వాసనతో కలిసి సిగరెట్లో వున్న గంజాయి వాసన.

అనసూయ

రాబోయే రాత్రికి మొగుడి వేషం ఎవరు కడ్తారో అన్చూస్తున్న అనసూయ.

తల్తిప్పిందామె….

చీకటి అలల్లాంటి కన్రెప్పల్తో…

లావా లాంటి ఎర్రటి పెదిమెల్తో…

పైకీ కిందకీ చూసాడు…

కావ్.. కావ్.. హుష్.. హు… హు.. ష్..!

చీకటి రోగాల రొచ్చు ముంగిట్లో పాశవిక లిప్స…!

పశుకామం…!

షిట్…!

నన్ను ఒప్పుకుంటుందా? ఈ రిచర్డ్ సీతాపతిని….!

బాస్టర్డ్ సీతాపతిని… అవిటి సీతాపతిని..? నన్ను?

నేనంటే? ఈ చర్మమా….? మాంసమా? రెండువందలారు ఎముకలా…? మరి ఆత్మ సౌందర్యమనేడుస్తారే…?

ఆత్మ సౌందర్మమున్న కుంటినాకొడుకుని ఓ ఆడది కౌగిలించుకుని తీయగా ముద్దు పెడ్తుందా…?

ఫక్..! అంతా మోసం. దగా. కుట్ర.

అబద్దం..!

వున్నదల్లా విశృంఖల తమో కామ ఖేలాహేలమే…!

అయినా కాకి ఎగరదే…!

తెగిపడని కోరిక నరాలకి తగులుకుని వేలాడ్తూనే వుంది… గబ్బిలం లాగా…!!

అనసూయ శరత్నర్సింగ్ హోమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే… కరెంట్ తీగ మీద కాకి ఎగిరిపోయింది.

ఇష్ట కామ్యం
నన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యమ్మా! డ్యూప్లెక్స్ ఇల్లు, ఎస్ యూ వీ కావాలి. – విక్రాంత్

పిల్లలు మంచి పొజిషన్ కి రావాలి. IAS, IPS అవ్వాలి. – మహదేవ్

ఎమ్ సెట్ లో వందలోపు రాంక్ రావాలమ్మా – వైదేహి

నాకు డిస్నీ లాండ్ టికెట్స్ కావాలి. ఒక బైనాకులర్స్ కూడా – సుస్వర. ఇంకోటి ప్లీజ్. బార్బీ డాల్ కూడా!

మేం ఇద్దరం భార్యాభర్తలుగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చూడు తల్లీ – విహాన్, ఫాతిమా.

“ఇది చూశావా! విహాన్, ఫాతిమా అంట! పెళ్ళైందో లేదో” నవ్వేస్తున్నాడు శివరామ్.

“ఇంకా ఎంతసేపు ఉండాలో లైన్లో” శైలజ నిట్టూర్చింది.

“టైమ్ పడుతుంది. అందుకే కదా ఈ గోడల మీద రాసినవి చదువుతున్నాను. భలే టైమ్ పాస్. ఇదిగో ఇది చూడు – “ఆమె చాలా మంచిది.

ఆమెకి ఏమీ కాకూడదు” – ఎవరో ఆ పేరు చెప్పుకోలేని ’ఆమె’” మళ్ళీ నవ్వాడు.

“ఊర్కోండి. మీ ఇంటర్పెటేషన్ ఏమీ అఖ్ఖర్లేదిక్కడ. వంద రూపాయల క్యూలో వెళ్తే అరగంటలో అయిపోయేది దర్శనం. అనవసరంగా ఐదొందలు పెట్టి టికెట్ కొన్నారు. ఈ క్యూనే పెద్దగా వున్నట్లుంది. డబ్బులు పోయే టైమూ వేస్టు”

“నాకేం తెలుసు. అందరూ ఐదొందల టికెటే కొంటున్నారని కొన్నా. అది సర్లే ఇది చూడు –“

డబ్బులు కావాలి. బాగా సంపాదించాలి. గుడి కట్టిస్తాను అమ్మా – భరత్ రెడ్డి

“ఎర వేశాడు… హ్హా హ్హ!”

“మనం కూడా రాద్దామా?”

“ఏంటది! డైరెక్ట్ గా అమ్మవార్ని చూసినప్పుడు అనుకో! ఈ రాయడం అంతా బూటకం. ఎవరో పని లేక మొదలుపెట్టి వుంటారు. ఇప్పుడు చూడు గుడి గోడలు మొత్తం నింపేశారు”

“మీరు కూడా రాశానన్నారు”

“అదెప్పుడో చిన్నప్పుడు. నాన్నగారితో వచ్చినప్పుడు. నలభై ఏళ్ళ క్రితం. ఆయన ఎవరికీ ఇవ్వని పెన్ ఇచ్చి రాయించాడు మా నాన్న.

అప్పుడు ఇంత గుడి ఎక్కడుంది. గర్భగుడి గోడల మీదే రాశాను. ఇప్పుడు చూడు, ఈ మంటపాలేంటి, ఈ గుడేంటి? చాలా పెద్దదైపోయింది.”

జీవిత ఎలాగైనా నాకు పడేలా చూడు – నీ భక్తుడు.

“అనానిమస్ రిక్వెస్ట్. పడాలంట పడాలి! చూడు చూడు”

“ముందుకు పదండి”

డైరెక్టర్ అయ్యేలా చూడమ్మా. పెద్ద డైరెక్టర్ అవ్వాలి. పూరి కన్నా పెద్ద డైరెక్టర్ అయ్యే….

“నీలాగే ఎవరో తోసేసుంటారు. పాపం అతని కోరిక రాయాలన్నా కోరికే తీరలేదు.”

యూఎస్ జాబ్ కావాలి. సొంత కంపెనీ పెట్టాలి. మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా – ప్రతాప్

యమ్ సెట్ లో ప్రణవి కన్నా మంచి ర్యాంక్ రావాలి – సుహాసిని

బాబు పుట్టాలి తల్లీ. ఎలాగైనా సరే అబ్బాయి పుట్టేలాచూడమ్మా. – రాజారావ్

నాకు బాగా చదువు రావాలి. స్టేట్ ఫస్ట్ రావాలి – మల్లేశ్వర్రావ్

నాన్న ఒప్పుకునేలా చెయ్యవా! కిరణ్ అంటే నాకు ఇష్టం – రమ్య

స్మిత సూపర్ సింగర్ విన్నర్ అవ్వాలి. మంచి సింగర్ అవ్వాలి. గిరిజ ఆరోగ్యం బాగుండాలి. అప్పులన్నీ తీరిపోవాలి.

“ఎందుకలా ఆగిపోతారు. పదండి ముందుకి”

ఎగ్జామ్స్ బాగా రాయాలి. 550 దాటాలి – విజయవర్ధన్

ఎట్టాగైనా చిన్న ఇల్లు కట్టుకునేలా చెయ్యమ్మా – నర్సిమ్మ, కమల

మంచి ఉద్యోగం రావాలి. అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి – అన్నారావు

శిరీషకి పెళ్ళి కావాలమ్మా. ఇంకేమీ వద్దు. చెల్లి పెళ్ళి అయిపోతే చాలు. – సుశాంత్

బ్యాంక్ ఉద్యోగం రావాలి. మోహనతో పెళ్ళి అవ్వాలి. మామయ్యని ఒప్పించు తల్లీ. – రాఘవ

అమ్మ ఆరోగ్యం బాగయ్యేలా చూడమ్మా –రజిత

ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యకుండా కాపాడమ్మా. నన్ను క్షమించు అమ్మా. – వినోద్

“అబ్బా… వీడికొస్తుందే పుణ్యం. చూడు! నిజంగా పశ్చాత్తాపం! కానీ ఏం తప్పు చేశాడో…”

“మనకెందుకండీ. మన గోలేదో మనం చూసుకుందాం పదండి.”

“అది సరే నిన్ను రాయమంటే ఏం రాస్తావ్?”

“రాయద్దన్నారుగా?”

“ఒకవేళ రాస్తే”

“ముందు పదండి.”

సప్లిమెంటరీ అయినా పాసయ్యేట్లు చెయ్యి అమ్మా – ప్రతాప్

ప్రమోషన్ ఇప్పించమ్మా. నా పిల్లల్ని కాపాడమ్మా. శ్రీలతని కాపాడమ్మా. మా కుటుంబాన్ని కాపాడమ్మా. – అశోక్

నాకు బాగా చదువు రావాలి. టెంత్ క్లాస్ లో ఫస్ట్ రావాలి. మంచి చదువులు చదవాలి – శ్రీనివాస్

నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాన్న కనపడేలా చెయ్యమ్మా. అమ్మ కోసం. – పావని

బాబాయ్ నాన్న కలిసి వుండేలా దీవించమ్మా. మేం అందరం కలిసే వుంటాం. నేను భానక్క, శివుడు, ప్రసాద్, చిట్టి ఎప్పుడూ కలిసే వుండాలా చూడమ్మా. – ఆదిలక్ష్మి

నవల రాయాలి – కోనేటిపాలెం గోపాలమాధవ్

“హ్హ హ్హ..”

“ఏంటది”

“నవల రాయాలట. యద్దనపూడి, యండమూరి కాలం అయ్యుంటుంది. పేరు చూడు ఎలా పెట్టుకున్నాడో – కోనేటిపాలెం గోపాలమాధవ్ – హహ”

“హబ్బా.. పదమంటుంటే”

పంటలు బాగా పండేట్టుగా చెయ్యి అమ్మా – వెంకట్రెడ్డి

సుబ్బన్న కాలు బాగయ్యేలా చూడమ్మా – మహలక్ష్మి

అందరూ చల్లగుండాలి తల్లి – అప్పారావు

నన్ను, నా కుటుంబాన్ని కాపాడు మాతా – సీతాపతి

పిల్లలు బాగా చదువుకునేట్లు చూడమ్మా – సరోజ

లోకమంతా సుఖసంతోషాలతో వుండేలా దీవించు తల్లీ– జ్యోస్యులు

అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ….

“ఎవరో పద్యం రాసేశారు”

“అదిగో గర్భగుడి. వచ్చేశాం”

“ఇంతకీ నువ్వేం రాస్తావో చెప్పలేదు”

“ఇంకా ఏముందని కోరుకోవాలి?”

“ఫర్లేదులే చెప్పవోయ్”

“ఇదిగో ఇదే రాస్తాను” గోడ మీద చూపించింది.

నాకు మంచేదో చెడేదో తెలుకునే జ్ఞానాన్ని ఇవ్వమ్మా. – శివరామ్

“అరే! ఇది నేను రాసిందే. నలభై ఏళ్ళ క్రితం”

“సర్లే పదండి”

యంత్ర
“Ladies and gentlemen, now we request your full attention as the flight attendants demonstrate the safety features of this aircraft.”

సీట్ బెల్ట్, ఆక్సిజన్ మాస్క్, లైఫ్ వెస్ట్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, ఇన్ ఫ్లైట్ మాగజైన్. అన్నీ వున్నాయి. ఇప్పుడు నవ్వు ముఖం వేసుకోని మొదలుపెట్టాలి. నవ్వు రాదేంటి? కమాన్ శ్రీలతా! ఓహ్ సారీ. ఫ్లైట్ లోపల మన పేరు సిరి కదూ?

“When the seat belt sign is on, please fasten your seat belt.

అబ్బ! మొదటి వాక్యం వినగానే, ఆటోమాటిగ్గా ముఖం మీదకి స్మైల్ వచ్చేస్తుంది. అలా అలవాటైపోయింది. ట్రైనింగ్ లో నేహా బిస్వాల్ చెప్పేది. కనెక్ట్ సమ్ థింగ్ ఫన్నీ టు ద ఏక్టివిటీస్ దట్ యూ డూ అని. అప్పుడే ముఖం మీద చిరునవ్వు వుంటుందట. అన్నీ దొంగనవ్వులే.

To fasten your seat belt, insert the metal fittings one into the other, and tighten by pulling…

జాస్మిన్ ఈ పార్ట్ విని ఎంత నవ్వుతుంది? ఏం కనెక్ట్ చేసుకుంటుందో! నాక్కూడా నవ్వొచ్చేస్తోంది. 14Cలో కూర్చున్న బట్టతల తదేకంగా చూస్తున్నాడు. వాడేం కనెక్ట్ చేసుకున్నాడో. 10 A,B,C లో కూడా ఏదో గుసగుసలు నవ్వులు. రో మరీ పక్కనే వుంది. కళ్ళు ఎంత తిప్పినా చూపు చేరట్లేదు. కళ్ళు అలా తిప్పడం కూడా నచ్చినట్లుంది బట్టతలకి. చూపు తిప్పట్లేదసలు.

There are eight emergency exits on this aircraft two forward, two rear and two over each wing.

అస్సలు పని చెయ్యాలని లేదు. చిరాగ్గా వుంది. అవునూ ఈ రోజు డేట్ ఎంత? ట్వెంటీ ఎయిట్? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం మర్చిపొయా. ఈ రోజే లాస్ట్ డే. ఫ్లై ట్ లాండ్ అవగానే – లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎచ్.డీ.ఎఫ్.సీ ఏటీయం వుందా? ఛ! లాస్ట్ టైమ్ కూడా ఇంతే… ఆక్సిజన్ మాస్క్!! ఇక్కడే పెట్టానే. యాహ్.. రెడీ

When the cabin pressure falls, an oxygen mask will automatically drop from the over- head panel

ఇప్పుడు కనిపిస్తున్నారు 10 A,B,C. ఆక్సిజన్ మాస్క్ పానల్ కి తాకించి పుల్ చేస్తుంటే ముగ్గురూ ఏదో చెప్పుకోని నవ్వుకుంటున్నారు. కాంట్ హెల్ప్! అందుకే వేరే ఏదైనా ఆలోచించాలి. ఇందాకేదో.. ఆ కార్డ్ పేమెంట్! లాస్ట్ టైమ్ కూడా లాస్ట్ డేనే కట్టాను. ముంబైలో. లే ఆఫ్ ఆరోజు. నాకేమో థర్డ్ డే. ఒకటే బ్లీడింగ్… షిట్! ఈ నెల ఇంకా ఎందుకు అవలేదు! సింప్టమ్స్ కూడా లేవు. ఓహ్ షిట్!

Secure your mask before assisting others

నా ఫేవరెట్ వర్డ్స్. పక్కనోడికి ఫేవర్ చేసే ముందు నీ సంగతి చూసుకో! అలా ఎందుకు పెట్టారో కానీ కరెక్ట్ గానే పెట్టారు.

A life vest is located in a pouch under your seat .When instructed to do so, open the plastic pouch…

లైఫ్ వెస్ట్ ఏదీ. మాగజైన్ కింద పడింది. జాగ్రత్తగా వుండాలి అనుకుంటూనే వుంటాను కానీ ప్రతిసారి ఏదో ఒకటి పడిపోతోంది.

జాగ్రత్త అని చెప్తూనే వున్నా. సేఫ్టీ వుంచుకోరా అని. నివాస్! నివాస్! ఎంత పని చేశావురా! నువ్వూ నీ లెక్కలు. పదమూడు పధ్నాలుగు పదిహేను అనుకుంటూ! రేపు ఉదయాన్నే టెస్ట్ చేసుకుంటే? ఇప్పుడే తెలియదేమో. ఓ పదిహేను రోజులు టెన్షన్ తప్పదు.

…Use the whistle and light to attract attention.

ఇంక అందరికీ చెప్పేయడమే మంచిది. పెళ్ళి చేసేసుకుంటే? మరి జాబ్? మనదేం ఎయిర్ ఇండియా కాదు కదా – ఆంటీలని పెట్టుకోడానికి. పెళ్ళైందని తెలిస్తే కనీసం క్రూ క్రూరమైన చూపులు తప్పించుకోవచ్చేమో. ఫస్ట్ అసిస్టెంట్ సుశాంత్ సాహూ. వాడూ వాడి ఒడియా యాస. కంపరం వాణ్ణి చూస్తే. ఏదో రకంగా చెయ్యి వెయ్యకుండా వుండలేడు… వాణ్ణీ… బూతులొస్తున్నాయ్! మన ఒరిజినల్ బ్యాక్ డ్రాప్ అలాంటిది మరి. ఏదో ఎయిర్ హోస్టెస్ జాబ్ లో గ్లామర్ చూసి వచ్చాను కానీ…

You are not allowed to use any electronic devices during the flight. Please switch off your mobile phones or keep them in airplane mode

మనకీ వుంది ఒక ఎయిర్ ప్లేన్ మోడ్. మా వూర్లో నన్ను నా ఒరిజినల్ మోడ్ లో చూస్తే తెలుస్తుంది. ఊరంటే గుర్తొచ్చింది. అమ్మ ఏమంటుందో. అసలు ఇలా స్కిప్ అయిన సంగతి తెలిస్తే? చంపేస్తుందేమో. స్మోక్ చేస్తానని అనుమానం వచ్చినందుకే చావ కొట్టేసింది.

We remind you that this is a non-smoking flight. All the wash rooms are equipped with smoke detectors.

స్మోక్ చెయ్యాలనిపిస్తోంది. లక్నోలో స్మోకింగ్ జోన్ లేదు. బయటికి వెళ్ళాలి. తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. క్యాబిన్ క్రూ లో ఎవరున్నారు?. నతాషా వుంది కానీ అది తాగేది ఫ్లేవర్డ్ సిగరెట్. డెక్ లో వదేరా వున్నాడు కదా! ఇస్తాడు కానీ సణుగుతాడు. ’తెచ్చుకోవాలి బేబీ’ అంటాడు. వాడి ఊతపదం – బేబి. ’యు ఓ మీ వన్ బేబీ’ అంటాడు. సాధు జంతువే కాబట్టి వేరే అర్థం ఏం లేదనే అనుకోవాలి. అడుగుదాం.

You will find this and all the other safety information in the card located in the seat pocket in front of you

బట్ వై షుడ్ ఐ స్మోక్ ఎటాల్. మానేద్దాం అనుకున్నా కదా. మానెయ్యాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నించి. యస్ అక్టోబర్ ఫస్ట్ డెడ్ లైన్. నో. నో. ఈ రోజే లాస్ట్. నో. నో. అక్టోబర్ సెవంత్ రేవంత్ బర్త్ డే పార్టీ తరువాత. ఆ రోజు నో లిమిట్. ఫుల్ డ్రింక్స్, ఫుల్ స్మోక్.

అప్పుడే రన్వే మీదకు పంపించారు. పోన్లే కరెక్ట్ టైమ్ కి టేకాఫ్ చెయ్యచ్చు.

Now let us introduce our in-flight magazine, ’Up in the air’. If you would like to order any food, please turn to page 26…

చిరాకొచ్చేస్తోంది. ఎయిర్ హోస్టెస్ గ్లామర్ లేదు. అసలు ఎయిర్ హోస్టెసే కాదు. ఫ్లైట్ అటెండెంట్. థ్రిల్ కూడా చచ్చిపోయింది. సంపాదించడానికి అలవాటుపడ్డాను కాబట్టి తప్పదు. ఫుడ్ అమ్మడం. డొనేషన్ అడగటం. ఇదేం జాబ్ అసలు. సర్వీసా? సేల్సా? కంఫర్టబుల్ సీట్లు, విండో సీట్లకి కూడా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. రేపు పొద్దున నిద్రపోతే కూడా ఛార్జెస్ అంటారేమో. To sleep during the whole flying time, the bill would be Rs. 549, and if you want our staff to wake you up Rs. 849. చేసినా చెస్తారు.

Flight attendants, prepare for take-off please.

To take off, we would dim the lights –

ఎవరైనా వింటున్నారా అసలు. అసలు నా వైపు చూస్తున్నారా? ఆ బట్టతలోడు తప్ప? మే బీ రో 10లో ముగ్గురు. లేదు లేదు. వాళ్ళలో కూడా ఒకడు బయటకి చూస్తున్నాడు. మిగిలిన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే చిన్న పిల్లతో వున్న ఆ ఫ్యామిలీ వినట్లేదు.రో సిక్స్టీన్ లో అమ్మాయి ఎందుకో ఏడుస్తోంది. డెత్ కాల్ విని ఆఖరి చూపు కొసం ఫ్లైట్ ఎక్కేవాళ్ళు వారంలో ఒకరైనా వుంటారు. మే బీ ఆ అమ్మాయి కూడా? సరిగ్గా నా వయసుకూడా అంతే మా నాన్న చనిపోయినప్పుడు. ఫ్లైట్ ఎక్కే స్తోమత లేదప్పుడు. ఇప్పుడు కూడా… ఐ మీన్..!

దట్స్ ఓకే. మిగిలిన వాళ్ళకి ఏమైంది? సేఫ్టీ గురించి వినకపోతే ఎలా? ఒక వేళ ఏదైనా టెర్రరిస్ట్ ఎటాక్ జరిగితే? హైజాక్? ఆ బట్టతలోడే టెర్రరిస్ట్ అయితే? మే బీ నాకు మంచి ఆపర్చునుటీ కావచ్చు. నీరజా భానోత్ లాగా! అశోక చక్ర!! టెర్రరిస్ట్ ఎటాక్ అయితే క్యాబిన్ లోనే వుంటారా? కాక్ పిట్ దాకా వెళ్తారా? ఎంత మంది వుంటారు? ఇద్దరైతే ఫైట్ చెయ్యచ్చు. వెపన్స్ వుంటాయేమో! కాల్చేస్తే. నీరజా భానోత్ లాగే! నెక్స్ట్ డే న్యూస్ లో – ధైర్య సాహాసాలు ప్రదర్శించిన సిరి. కాల్పులలో మరణం. మన తెలుగు తేజం శ్రీలత. ఆమె ప్రెగ్నెంట్ అని నిర్ధారించిన డాక్టర్లు.

షిట్..!! అదేంటో కన్ఫర్మ్ చేసుకోవాలి. నివాస్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి… వాడికసలు పెళ్ళి చేసుకునే వుద్దేశ్యం వుందో లేదో!

Cabin crew; please take your seats for take-off

బట్టతల టెర్రరిస్ట్ చొంగ కార్చుకుంటూ చూడటమే కానీ ఇంత సేపు చెప్పింది కూడా విన్నట్టు లేదు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీట్ కూడా వెనక్కి వాలిపోయి..

“Sir, please fasten your seat belt and keep your seat upright”

“తెలుగొచ్చా అమ్మాయి? నిన్ను చూస్తుంటే తెలుగమ్మాయిలాగే వున్నావు. నాకు నువ్వు చెప్పిందేమి అర్థం కాలేదు”

జాలేసింది. అందుకా అంతలా చూశాడు? భయపడిపోతున్నాడు.

ఊరికే తొందర అన్నింటికి. టెర్రరిస్ట్ అదీ అనుకుంటూ ఊరికే ఊహించుకోవడాలు. పేపర్లో ఫోటో వచ్చేసినట్లు, ప్రెసిడెంట్ అవార్డ్ వచ్చేసినట్లు…

“వచ్చు బాబాయ్! ఈ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సీటు ఇలా… మీకేమైనా అవసరమైతే ఈ బటన్ నొక్కండి. నేను వస్తాను”

నా సీట్లో కూర్చుంటుంటే నటాషా చిత్రంగా చూసింది.

“What is that smile about Siri?”

“Nothing Natasha”

“That isn’t your smile”

“This IS”

నేను చెప్పనీ కథ
నేను ఈ కథ చెప్పను.

చెప్పకూడదు.

చెప్పట్లేదు కూడా. మీరు కూడా వినకండి. చదవకండి.

అయినా చెప్పేడానికేముంది? ఇలాంటివి మీరు ఎన్నో చూసుంటారు. మీ చుట్టుపక్కలే జరుగుతుండచ్చు కూడా. మీకే జరుగుతుండచ్చు. కాకపోతే నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను. నోరు కట్టేసుకోవాలని అనుకున్నా నా వల్ల కావటం లేదు.

అయినా చెప్పకూడదు. చెప్పాలని వుంది కాని చెప్పను. మీరు కూడా చదవకండి. ప్లీజ్.

నేను వద్దన్నా చదువుతున్నారు మీరు. నేను కూడా చెప్పకూడదని అనుకుంటూనే చెప్పేస్తున్నాను. వద్దండి. ఒకళ్ళ సంగతి మనకెందుకు చెప్పండి. ఇక ఇక్కడి నుంచి చదవటం ఆపేయండి. సరేనా?

వినరన్నమాట. సరే. ఎలాగూ చదువుతున్నారు కాబట్టి చెప్తాను వినండి. నేను ఊహించినదాంట్లో తప్పే ఉ౦దో ఒప్పే ఉ౦దో మీకే తెలుస్తుంది.

ఆ పాప పేరు.. వద్దులెండి పేరెందుకు. పాప అనే అనుకోండి. చిన్నదే – యల్కేజి. నాకు అప్పటికింకా ప్రమోషన్ రాలేదు. నర్సరీ పిల్లలకి టీచర్ గా వున్నాను. మొదటిసారి ఆ పాపని చూసినప్పుడు భలే అనిపించింది. అసలు చిన్నపిల్లలా బిహేవ్ చేసేదే కాదు. ఏం పద్ధతి! ఏం శుభ్రత! మాటల్లో కూడా ఎంతో స్పష్టత? భలే ఆశ్చర్యం వేసింది. మొదట్లో నేను ఇంటికి వచ్చాక మా ఆయనకి పిల్లలకి ప్రతి రోజూ చెప్పేదాన్ని. మా పిల్లల సంగతే చెప్పాలి ఇక. ఇంటి నిండా బొమ్మలు పడేయటం. అటూ ఇటూ పరుగులు. అరిచినట్లు మాట్లాడటం. అయినదానికి కానిదానికి అలకలు, చాక్లెట్ లంచాలు. చచ్చిపోతుంటాను. ఆ పాప అలా కాదు. అసలు ఆ లక్షణమే లేదు. అమ్మో ఎంత పద్ధతోనండి.

స్కూల్ కి వస్తుందా. బ్యాగ్ నీట్ గా టేబుల్ మీద పెడుతుంది. పుస్తకాలు తీస్తే మొదటి రోజు కొత్తగా అట్టలేస్తే ఎలా వున్నాయో అలాగే వుంటాయి. చెక్కు చెదరకుండా. నెక్స్ట్ పిరియడ్ ఏ క్లాస్ వుంటే ఆ క్లాస్ పుస్తకాలు తీసి పెట్టుకుంటుంది. పక్కన పెన్సిల్ ఇరేజర్ సెట్ చేసినట్లు పెడుతుంది. క్లాసుల మధ్యలో లేవటం, మిగతా పిల్లల్లాగా కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకి చూడటం, బోర్డ్ మీద ఏదో రాయటం ఇలాంటివేవి వుండవు. అసలు మిగతావాళ్ళతో ఆడుకోవటం కూడా చూడలేదు నేను. ఎక్కువగా మాట్లాడటం కూడా చూడలేదు. నిజం చెప్పాలంటే ఎవరో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల యూకేజిలో కూర్చున్నట్లుగా వుండేది బిహేవియర్. ఏదో అంటారు… యా… మెచ్యూరిటీ. చాలా ఎక్కువ ఆ పిల్లకి.

ఏదో చెప్దామని మొదలుపెట్టి ఏదేదో వాగేస్తున్నాను. అందుకే చెప్పనన్నాను. మీరు కూడా ఇక్కడిదాకా చదివేసారు. ఇంక చాలు. నన్నేమీ అడక్కండి. మీరు ఇంకేమీ చదవకండి. ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. నిజం.

ఇంకేం లేదన్నాను కదా? ఇంకా ఎందుకు చదువుతున్నారు.

సరే. మీ మొండిపట్టు మీదే. కానివ్వండి.

ఆ పిల్ల… అదే ఆ యల్కేజి పిల్ల ఏడవడం కూడా చూళ్ళేదు నేను. అహ! కాదు కాదు ఒకసారి ఏడ్చింది లెండి. తరువాత సంవత్సరం. పాప క్లాస్ కి నేనే క్లాస్ టీచర్ని అయ్యాను. ఒక మూడు నెలల తరువాత పేరెంట్ టీచర్ మీటింగ్ ఆ రోజు. శనివారం. మధ్యాహ్నం పిల్లల స్కూల్ మూడున్నరకి అయిపోతుందని ఆ టైమ్ కి మీటింగ్ అని చెప్పాం. సాయంత్రం నాలుగున్నర దాకా వెయిట్ చేశా. అందరి పేరెంట్స్ వచ్చారు కానీ ఈ పాప పేరెంట్స్ రాలేదు.

“మీ పేరెంట్స్ వస్తారా? నువ్వు చెప్పావా ఈ రోజు పీటీయే అని” అని అడిగాను. పాప చెప్పానని తలాడించింది.

“డాడీ వస్తారా?” అంటే తల అడ్డంగా ఊపి తల దించుకుంది.

“మమ్మీ?” – “వస్తుంది” అని వెళ్ళి బెంచి మీద కూర్చోని ముందుకు వంగి డెస్క్ మీద చేతులు చుట్టుకోని వాటి మీద తల పెట్టుకుంది.

దగ్గరగా వెళ్తే కానీ ఆ పాప ఏడుస్తోందని తెలియలేదు నాకు. ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. అందరి పిల్లల పేరంట్స్ వచ్చారు కానీ తన పేరెంట్స్ ఇంకా రాలేదని ఫీల్ అయ్యిందేమో. పిల్లలన్న తరువాత మిగతా పిల్లలతో కంపేర్ చేసుకోవడం మామూలే కదండి. పైగా ఆ రోజు సెకండ్ సాటర్డే కావటం వల్లేమో దాదాపు అందరి పిల్లల ఫాదర్ మదర్ ఇద్దరూ వచ్చారు. చాలా మంది పిల్లలు పీటీయే తరువాత ఇటు నుంచి ఇటే సినిమాకి వెళ్తాం అనీ, మెక్ డీ కి వెళ్తామని చెప్పుకోవడం కూడా విన్నాను నేను. ఇవన్నీ విని కంపేర్ చేసుకుందేమో. పాపం. సముదాయించే సరికి కాస్త తేరుకుంది. చెప్పానుగా చాలా మెచ్యూర్డ్ బిహేవియర్.

వాళ్ళ అమ్మ వచ్చింది. పాప చాలా ఫార్మల్ గా నిలబడి గుడ్ ఈవినింగ్ మమ్మీ అంది తప్ప మిగతా పిల్లల్లా పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసుకోలేదు. చాలా డిసిప్లిన్డ్. అదీ పదం. ఇందాకట్నుంచి చెప్పాలనుకున్నది అదే. ఎంత డిసిప్లిన్డ్ గా వుంటుందో ఆ పిల్ల.

డిసిప్లిన్డ్ అంటే గుర్తొచ్చింది. వాళ్ళమ్మ కూడా అలాగే వుంటుంది. ఏ రోజూ డైరీలో సైన్ చెయ్యడం మర్చిపోదు. పాపని టైమ్ కి దించేస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా అంతే. టైమ్ అంటే టైమ్. ఊరికే వచ్చి టీచర్లతో మాట్లాడటం కానీ, మిగతా పేరెంట్స్ తో కబుర్లు చెప్పడం కానీ చెయ్యదు. తల్లి పోలికే అయ్యింటుంది అనుకున్నాను. మరి అంత డిసిప్లిన్డ్ గా ఉ౦డే ఆమె ఆ రోజు పీటియేకి లేటుగా రావటమేంటి?

“లేటైనట్లుంది మేడం” అన్నాను నేను ఆమె రాగానే.

“సారీ అండీ, నిద్రపోయాను. టైమ్ తెలియలేదు” అందామె నా ఎదురుగా కూర్చుంటూ. ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతోంది. జుట్టంతా రేగిపోయి. కళ్ళంతా ఉబ్బిపోయి. నాలుగైదు గంటలు నిద్రన్నాపోయి వుండాలి, నాలుగైదు గంటలు ఏడ్చన్నా వుండాలి. ఏదీ కళ్ళలోకి చూడనిస్తే కదా తెలిసేది. తల దించుకొనే వుంది.

గబగబా టేబుల్ మీద వున్న ప్రోగ్రస్ రిపోర్ట్ తీసుకోని చూసింది. నా చేతిలో వున్న పెన్ను “ప్లీజ్” అంటూ లాగేసుకుని బరబరా సంతకం పెట్టేసి తిరిగి ఇచ్చేసింది.

“మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు మేడం. మండే పంపించండి” అన్నాను నేను అప్పటికీ.

“అవసరం లేదు లెండి. చూశానుగా” అంటూ లేవబోయింది. అప్పుడు గమనించాను ఆమె చేతి మీద కాలిన గాయం కనపడుతోంది.

“మేడమ్ చేతికి ఇంజూరీ వున్నట్లుంది” అన్నాను నేను.

“యా. పొద్దున కుకింగ్ చేస్తుంటే… ఆయిల్.. యు నో… హాట్ ఆయిల్” అంటూ చున్నీ కిందకి చేతిని పోనిచ్చింది. ఆమె ఆ మాటలు చెప్తుంటే చూశాను ఆమె ముఖంలోకి. ఆమె నవ్వింది. నవ్వాలని ప్రయత్నించింది. నవ్వలేకపోయింది. అంత వరకే నాకు అర్థం అయ్యింది.

పాప పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మ పక్కన నిలబడింది. చున్నిలో నుంచి చేతి వైపు చూసి తల ఎత్తి వాళ్ళ అమ్మ ముఖంలొకి చూసింది. పాప కంట్లో నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఆమె లేచి పాప చేతిని గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళిపోయింది. వెళ్తుంటే ఆమె వీపు మీద చూశాను.

ఎర్రగా…

ఓహ్ మై గాడ్! మీరు ఇంకా చదువుతున్నారా?

ఎందుకు చదువుతున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? వద్దు వద్దు అని చెప్పానా? ఎందుకు నాతో ఈ విషయం మాట్లాడించారు అసలు. తల్చుకుంటే ఏడుపు తన్నుకొస్తుంది నాకు. ప్లీజ్. నేను చెప్పింది ఎక్కడా చెప్పకండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే నేను చెప్పను, చెప్పను అన్నాను. చెప్పకుండా వుండలేక చెప్పాను. నా మాట వినండి. ఎందుకు అని అడక్కండి. ఈ విషయం ఎవరి దగ్గరా అనకండి. అసలు నేను ఈ సంగతి మీకు చెప్పానని తెలిస్తే ఇంకేమన్నా వుందా? తల్చుకుంటేనే భయం వేస్తోంది.

అద్భుతం
“ఇప్పుడు నీకు దేవుడి కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అడిగాడు ఆయన. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు.

“చివర్రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడిగురించి మాట్లాడటమేమిటి? పడుకోండి” అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీసా మూత పెట్టిందామె.

“ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏం అడుగుతావనే కదా అడిగాను” తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలని నేరుగా పెట్టింది ఆమె. “ఎప్పుడూ ఆ సీలింగ్ నే చూడమంటే ఎలాగ పద్దూ. వుండే నాలుగు రోజులు నీ ముఖం చూడనీ” అన్నాడాయన మళ్ళీ ముఖం ఆమె వైపు తిప్పి.

ఆమె కిసుక్కున నవ్వింది. పద్దు ఆమె పేరు కాదు. పెళ్ళైన కొత్తల్లో పిలిచేవాడలా. ప్రతి ఖర్చుకీ లెక్కలు రాస్తోందని.

“ఆ పేరు గుర్తొచ్చిందే?”

“జ్ఞాపకాన్ని మించిన ఆనందం ఏముటుంది ఈ వయసులో? సరే విషయం దారిమళ్లుతోంది. దేవుణ్ణి ఏం కోరుకుంటావ్?”

ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టీ చివర కూర్చుంది.

“ఏం కోరుకుంటాను. మా ఆయన ఆరోగ్యం బాగుపడీ..” మురిపెంగా తల మీద చెయ్యి వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు.

“వీటినే గొంతెమ్మ కోరికలంటారే గొంతెమ్మా… డాక్టర్ చెప్పలేదూ? వారమేనని. అందులో మూడు రోజులు అయిపోయాయి… ఇంకో నాలుగో అయిదో..”

“చాల్లే ఆపండి. ఏం కాదు. వాళ్ళకు తెలిసి ఏడ్చి…”

“వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుస్తోంది కదా… నీకు మాత్రం తెలియట్లేదూ?”

“కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా…”

“ఆ తరువాత? వాడి పెళ్ళి. మునిమనవడు. వాడి బారసాల… అంతం వుందంటావా?” గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడాయన.

“జరిగేదేదో జరుగుతుంది. మీరు మాట్లాడకుండా పడుకోండి. ఆ భగవంతుడు తల్చుకుంటే ఏ అద్భుతమైనా జరగచ్చు”

“పిచ్చిదానా, నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలేమైనా వున్నాయంటే అవి రెండే – పుట్టుక, మరణం. నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతోంది.” ఆమె అతని పెదవుల మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది.

అతను కళ్ళు మూసుకుని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు. అంతలోనే కళ్ళు గట్టిగా బిగించేసి బిగుసుకుపోయి నిద్రపోయినట్లు నటించాడు.

ఆమె నవ్వుకుంది. “అన్నీ దొంగ వేషాలే” అనుకుంది మనసులో. బయట వర్షం మొదలైంది.

“నిద్రపోతున్నావా? లే… వర్షం చూద్దువుగాని లే…” పెళ్ళైన కొత్తలో ఓ సాయంత్రం నిద్రలేపుతూ అతనన్న మాటలు గుర్తుకొచ్చాయామెకి.

“పడుకోనివ్వండి. అయినా వర్షాన్ని చూసేదేంటి?”

“చూసేదేంటి అంటే ఏంచెప్పేది? చూస్తే తెలుస్తుంది”

“వర్షం అంటేగుర్తొచ్చింది. బట్టలు ఆరేసాను..” గబగబా లేచి పరుగెత్తిందామె.

“వర్షం అంటే గుర్తుకొచ్చేది ఆరేసిన బట్టలా? బాల్యం గుర్తుకు రావాలి. కాగితప్పడవలు గుర్తుకు రావాలి.” కిటికీ దగ్గర స్టూల్ వేసుకుని కూర్చున్నాడతను. దండెం మీద బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తోంది. తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా వేసుకుంటూవుందామె.

“అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి నాలుగు బట్టలు అందుకోవచ్చు కదా…”

“నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో. నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా వుంటుంది” నవ్వాడతను.

లోపలికి వచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని ఫెళఫెళలాడించింది.

“నానా చాకిరీ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి. ఒక్క పనికి సాయం లేదు కదా” అంది.

“నేను చూస్తోంది నీ అందం కాదు దేవీ. నువ్వు నన్నూ, మన సంసారాన్ని బాధ్యతగా తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను.” ఆమె పేరు దేవి కూడా కాదు. అదో నాటకీయ ఫక్కీ.

“బద్ధకానికి పది రకాల అబద్ధాలు” నవ్వేసి వచ్చి అతని పక్కనే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఆయన మాటలతో మళ్ళీ ఈరోజులోకి వచ్చిపడింది.

“ఏం చేస్తున్నావు కిటికీ పక్కన?” తల మళ్ళీ తిప్పాడాయన.

“నిద్ర పొమ్మన్నానా?”

“ఒకేసారి పోతాలే. నిన్ను కాస్సేపు చూద్దామనిపించింది” చిలిపి నవ్వు కళ్ళలో కనిపించింది.

ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను కదలడానికి ఇబ్బందిపడుతూ కొద్దిగా తిరిగాడు.

“పిల్లలకి విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా” ముఖం రాయిలా పెట్టి అన్నది.

“చెప్తావు. రమ్మంటావామ్మా అంటారు. వీకెండ్ కి వస్తాం అంటారు. నా ఎండ్ వీక్ లోనో వీకెండ్ లోనో తెలియదు కదా?”

“చాల్లెండి. పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కారు”

“కాదులే. ఇప్పటి పిల్లల్తో పోలిస్తే మనవాళ్ళు కాస్త నయమే అనిపిస్తుంది. అయినా నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికెట్లు ఇచ్చేయకు. జాగ్రత్త”

అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు. అయినా భవిష్యత్తుకు లోటు లేకుండా చూశాడాయన. కొడుకు కోడళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు.

“పిల్లలు వస్తే ఈ ప్రైవసీ కూడా వుండదు” అన్నాడు.

నిజమే. పెళ్ళైన దగ్గర్నుంచి ఇద్దరూ కలిసి ఏకాంతంగా వున్న రోజులు చాలా తక్కువ. పెళ్ళయ్యేసరికే ఇంటి నిండా జనం. మామగారు, అత్తగారు, ఆడపడుచులు. వీళ్ళు కాక చదువుకోడానికని వచ్చిన మామగారి తరఫు బంధువుల పిల్లలు ఇద్దరు. ఆ పిల్లల చదువులు అయిపోయి, ఆడపడుచుల పెళ్ళిళ్లైపోయి, మామగారు కాలం చేసే సరికి తనకే ఇద్దరు పిల్లలు. మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు. అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లలు చదువులు పూర్తై పెళ్ళిళ్ళు అయ్యి హమ్మయ్య అనుకునేసరికి అరవైల్లో పడ్డారు. ఈ మధ్యే కాస్తంత ఏకాంతం. ఎంత అపురూపమో ఆయనకి ఆ ఏకాంతమంటే.

“మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఏం గుర్తుకొచ్చింది?” చిలిపిగా కన్నుకొట్టాడతను.

“మీరేం అనుకుంటున్నారు?”

“మన మొదటి రాత్రి ఏమైనా గుర్తుకొచ్చిందేమో అని” నవ్వబోయి గట్టిగా దగ్గి “అమ్మా” అన్నాడు బాధగా.

“చాల్లేండి సంబడం. ఆ రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు”

“ఏం? నేను అంత భయంకరంగా వున్నానా?”

“ఊహూ. మీరు చాలా బాగున్నారు. పంచె కట్టుకుని. మీ కట్టు చాలా బాగుంటుంది.”

“ఎప్పుడూ చెప్పనేలేదు? నేను ఎన్నిసార్లు నీ చీర కట్టుని మెచ్చుకోలేదు”

“ఏమిటి చెప్పేది. మీరు ఒకటి ఒప్పుకున్నారా. పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే లేడని కదా గొడవ”

“దణ్ణం పెట్టుకున్నానుగా చివరికి. గుళ్ళకి గోపురాలకి కూడా వచ్చాను”

“ఎందుకొచ్చారు? వదిలేయాల్సింది.”

“దేవుడి భక్తి అని కాదులే. నీకు నేను అలా వుంటే ఇష్టం అని వచ్చాను. పూజలు వ్రతాలంటావా? నిన్ను ఎప్పుడైనా కాదన్నానా? నీకు నీ దేవుడికి మధ్యలో నేనెప్పుడూ రాలేదమ్మా సోమిదేవమ్మా” మళ్ళీ మరో పేరు కలిపాడు.

“సర్లే, ఇంక పడుకోండి. మాట్లాడితే అలిసిపోతున్నారు మీరు.” మంచం పక్కనే బొంత పరుస్తూ చెప్పిందామె. ఆయన అలాగే చూస్తూ వుండిపోయాడు. ఆమె దిండుకి బదులు పాత దుప్పటి పెట్టుకుని పక్కకి తిరిగి పడుకుని కళ్ళు మూసుకుంది.

“ఏమైనా కావాలంటే నాకు చెప్పండి” అంది కళ్ళు మూసుకునే.

“చెప్పనా?” కళ్ళు మెరిసాయి.

“ఏమిటి” కళ్ళు తెరవలేదు.

“చెప్తే నిజంగా చేస్తావా?” ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిందతని వైపు. “నాకు పంచె కట్టగలవా?”

“ఇప్పుడా? ఈ పరిస్థితిలో…”

“ఏం ఫర్లేదు. నేను లేస్తానుగా. కడతావా?”

“ఏమిటీ చాదస్తం? మళ్ళీ పెళ్ళికొడుకు అవదామనా?” అనటానికి అంటూనే వుంది కాని లేచి నిలబడింది.

“ఏం తప్పేంటి?” అని ఆయన అనే లోగా ఆమె బీరువా తెరిచి పంచె తీసింది. దగ్గరగా వచ్చి ఆయన వీపు మీద చెయ్యి వేసి, పెదాలను బిగపట్టి పైకి లేపింది. ఆయన బరువుకి ఆమె అలిసిపోయింది. ఆ కాస్త శ్రమకి ఆయన కూడా అలిసిపోయాడు. ఆమె రొప్పుతుంటే ఎగిరిపడుతున్న గుండె మీద ఆయన తెలపెట్టి రొప్పుతున్నాడు. అరనిమిషం తరువాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆమె కంటితో సైగ చేసి, రెండు చేతులతో భుజాలను పట్టుకోని “హుప్” అంటూ నిలబెట్టింది. ఆమెని కౌగిలించుకుని బరువును ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను.

పంచె తీసిందామె. బెత్తెడు అంచు వున్న తెల్లటి పంచె. ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ తన చేతులతోనే ఉతికేది. గంజి పెట్టి మరీ. మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది. ముందు కుచ్చిళ్ళు పెట్టి బెత్తెడంచూ కనపడేలా దోపింది. ఆమెనే చూస్తూ వున్నాడతను.

ఆమె నవ్వుతూ అతని వెనక్కి వెళ్ళి గోచీ తీసి దానికి కుచ్చిళ్ళు పెట్టింది. పెడుతున్నంత సేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ వుండిపోయింది. మంచానపడ్డ తరువాత వీపంతా కురుపులు లేచాయి. ఆమెకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి కానీ రెప్పలని దాటలేదు. గోచీ దోపి ముందుకొచ్చి, ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్ళు జారతాయని పంచె వంకే చూస్తూ “బాగానే కుదిరిందండీ” అంది.

ఆయన ఆమె తలను పైకెత్తాడు. ఆయన నవ్వుతున్నాడు. ఆమె నవ్వినట్లే వుంది కానీ కన్నీళ్ళు కారాయి.

మంచం మీద కూర్చోపెట్టింది. నెమ్మదిగా ఒరిగి, చిన్నగా సర్దుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. ఆమె మళ్ళీ బొంత మీదకు వెళ్ళబోయింది. చెయ్యి పట్టుకుని లాగాడు. రెండో చేతితో తన గుండెమీద కొట్టి చూపించాడు.

“వద్దండి” అందామె ఆయన పరిస్థితి గమనించి. ఒప్పుకోలేదతను. మంచం చివర కూర్చుని బరువు ఎక్కువ పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది. గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది. గాలి ఆడటంలో వున్న ఇబ్బంది గుర్రుమంటూ వినపడుతోంది.

“ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఈయన వెళ్ళిపోతే బాగుండు” అనుకుంది ఆమె. ఆమె నమ్ముకున్న దేవుడో, ఆయన నమ్మని దేవుడో ఆమె మాట విన్నాడు. అద్భుతం జరిగిపోయింది.

ఆఫీసుకెళ్ళే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకుని “వస్తాను” అని చెప్పకుండా వెళ్ళిన రోజు లేదు. ఒకసారి శ్రావణ శుక్రవారం. ఆమె హడావిడిలో ఆమె వుంది. ఆఫీసులో ఆడిట్ అంటూ ఆయన హడావిడి ఆయనది. వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళాడే అని ఆమెకి గిలిగా అనిపించింది. అరగంటలో నాలుగుసార్లు గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది. అరగంట తరువాత వచ్చాడాయన.

“హడావిడిలో మర్చిపోయాను” అంటూ హత్తుకున్నాడు. “వస్తాను” అని వెళ్ళబోతూ “ఇంకెప్పుడూ మర్చిపోను” అన్నాడు. ఆయన కంట్లో నీటి పొర.

ఇదంతా గుర్తుకు వచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద కట్టలు తెంచుకుంది.

అద్భుతాల్రావు వాచి
మొదటిసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కనిపించాడతను.

నీ కోసం ఒక ఉద్యోగం వుంది చేస్తావా? అనడిగాడు. ఏం వుద్యోగం అంటే సంబరంగా చెప్పాడు – నక్షత్రాలు వెదజల్లే ఉద్యోగమని.

నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నాడు నాన్న. రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్. ఊరూ పేరూ లేని ఓ కాలేజిలో. అలాంటి ఉద్యోగం ఒకటి వుందంటే నేను నమ్మను. నువ్వూ నమ్మకు అన్జెప్పాడు.

అప్పట్నించి నేను చెక్ పోస్ట్ తప్పించుకోని మెహదీపట్నం మీదుగా పోతున్నా.

ఒకసారి రోడ్ నెంబర్ టెన్ దగ్గర కూడా కనిపించాడు. వస్తానంటే చెప్పు. నిన్ను ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసేశారు. అంటూ నా బైక్ కి అడ్డంగా నిలబడ్డాడు. నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ సంచిలో నుంచి ఒక వాచి తీసి ఇచ్చాడు. అద్భుతాల్రావు చేశాడిది అన్నాడు నా చేతికి తొడుగుతూ.

ఆఫీసులో అందరూ అడగటమే. ఎక్కడిదీ వాచి? ఎక్కడి నుంచి వచ్చింది?

అద్బుతాల రావు. చెప్పాను నేను. ఆ రావుగారిని మాకు కూడా పరిచయం చెయ్యమని ఒకటే గొడవ.

అంతకన్నా పెద్ద గొడవ పోస్ట్ లంచ్ మొదలైంది. చాలామంది కూర్చుంటున్న కుర్చీలు తీయించి చెక్కబల్లలు వేయించారు. నాకు కూడా ఒక బల్ల వేశారు. అవి వేసిన మొదట్లో బాగానే వుండేవి కానీ తర్వాతర్వాత తెలిసింది. అవి చెదలు పట్టేసి వున్నాయని. చేతికి వున్న వాచ్ లో టైమ్ చూసుకున్నా. బ్యాడ్ టైమ్.

నాన్నా! బాల్కనీ బయట గబ్బిలాలు తిరుగుతున్నాయి నాన్నా అన్నాడు చిన్నాడు. కర్టన్లు వేసేశాను. కానీ ఏదో భయం. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా?

మరో వారం అతని కోసం వెతికాను. కనపడలేదు. ఫిలిమ్ నగర్ లో కూడా వెతికా. అందరూ నటీనటులే తప్ప అతను మాత్రం కనపడలేదు. వెతుకుతూనే వున్నా.

ఈ లోపల నాకు ఒక ఆర్డర్ వచ్చింది. మూడువందల నలభై రెండు గులాబిరంగు కాగితాలు ఇండెంట్ చెయ్యమని. వెండర్ ఎవరు? పర్ కాగితం ఎంతౌతుంది? కాగితం చేతికి ఇస్తే ఇంపాక్ట్ ఏంటి? ఇళ్ళకి కొరియర్ చేస్తే ఇంపాక్ట్ ఏమిటి? బోర్డ్ రూమ్ లో, మీటింగ్ రూముల్లో ఆఖరికి ట్రైనింగ్ రూమ్ లో కూడా మీటింగులే మీటింగులు.

వాచి వైపు చూసుకున్నా. అది పని చెయ్యడం మానేస్తానని ముద్దుగా చెప్పింది. గిరగిరా తిప్పాను. హ్యాంగోవర్ వదిలేట్టు టపటపా రెండుసార్లు కొట్టాను. ముందు కుయ్యో ముయ్యో అంది కానీ నడవటం మొదలుపెట్టింది.

అలా నడుచుకుంటూ నా ఎక్స్ బాస్ దగ్గరకు వెళ్ళింది. జరిగింది జరుగుతున్నది జరగబోయేది. మూడుకాలాలలో వాచి నడిచింది. అయ్యో అన్నాడతను. సీవీ పంపించు అన్నాడు. ఆ తరువాత కాలేజ్ క్లాస్ మేట్స్. అందరికీ కలిపి ఒకేసారి మూకుమ్ముడిగా వాట్సప్ లో – గైస్, నీడ్ హెల్ప్ అంటూ ప్రకటించింది.

పోనీ నేను మా కాలేజీలో ఎవరితోనైనా మాట్లాడనా అని నాన్న ఏదో చెప్పబోతుంటే ఒప్పుకోలేదు. సరే నీ ఇష్టం అన్నాడాయన. అవును నా ఇష్టం అనుకున్నాను నేను.

వాచీ కొంచెం ఫాస్ట్ గా నడవటం మొదలుపెట్టింది. క్రమంగా ఊపందుకుంటోంది. గులాబిరంగు గుబాళింపులు మొదలైయ్యాయి.

తార్నాక దగ్గర ఒక ఇరానీ కేఫ్ లో మళ్ళీ కలిశాడతను అనుకోకుండా.

జేడీ వుందా?

జేడీ వుందా కాదు. జేడీ వున్నాడా అని అడగాలి. నేనే జేడి. జీవన్ ధరమ్.

అదికాదు బాసూ. డిజిగ్నేషన్ ఏంటి? ఏం ఉద్యోగం? పని ఏం చెయ్యాలి? ఇవన్నీ.

డిజిగ్నేషన్ స్టార్ వెదజల్లర్. రిపోర్టింగ్ టు యువర్ సెల్ఫ్. ఇంక పని అంటే చాలా వుంది. నా కన్నా మా దోస్త్ అద్భుతాల్రావు బాగా చెప్తాడు. కాకపోతే ఆయనిప్పుడు మబ్బుల మీద వున్నాడు. లాతూర్ లో వర్షం కురిపించాలని వెళ్ళాడు.

అయితే స్కైప్ ఇంటర్వ్యూ చేస్తారా? అని అడిగితే మా దగ్గర స్కైప్ లేదు. స్కై వుంది అని నవ్వాడు. ఆ తరువాత చాలాసేపు మాట్లాడలేదు. కప్పులో వున్న టీ రెండు సిప్పుల్లో లాగేసి – నేనే చెప్తాను విను అన్నాడు.

సాయంత్రం అవగానే పని మొదలౌతుంది. సంచి నిండా నక్షత్రాలను ఇస్తారు నీకు – ఎవ్రీ డే. వెలుతురు తగ్గిపోతుండగా బయల్దేరాలి. చీకటి పడనీకుండా ఆపాలి. నక్షత్రాలను తీసి ఆకాశం మొత్తం చల్లాలి. అంటే మరీ పిచ్చి పిచ్చిగా చల్లడం కాదు. కాస్త ఆర్టిస్టిగ్గా కొంచెం కొంచెంగా పేర్చాలి. అయినా చీకటి పడే లోపల అయిపోవాలి. కొన్ని పాత నక్షత్రాలు ఆకాశానికి అతుక్కోమని మొరాయిస్తాయి. వాటిని వదిలేయాలి. జుయ్ మంటూ రాలిపోతూ వుంటాయి. రాలిపోయే వాటిని చూసుకోడానికి ఇంకొకళ్ళు వుంటార్లే. అతను నీకే రిపోర్టింగ్. ఇంతే పని.

ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరి గ్రోత్ ప్రాస్పెక్ట్స్? అడిగాను నసుగుతూ.

మా దగ్గర చాలా పోస్ట్ లు వున్నాయి. అన్నీ పర్మనెంట్ జాబ్సే. మూన్ రైజర్, సన్ పుల్లర్, క్లౌడ్ బ్లోయర్. ప్రమోషన్ వస్తే వీటిల్లో ఏ పోస్ట్ కైనా వెళ్ళచ్చు. అన్నింటికన్నా పెద్ద డిపార్ట్మెంట్ ఒకటుంది. రెయిన్ బో అరెంజ్మెంట్ గ్రూప్. సెవన్ సెవన్స్ ఫార్టీనైన్ ప్లస్ ఒక హెడ్. యాభై మంది పనిచేస్తున్నారు అక్కడ. అక్కడికి కూడా వెళ్ళచ్చు. వేకెన్సీ వస్తే.

నేను ఏ సమాధానం చెప్పలేదు. అతను నా వైపే చూస్తూ వుండిపోయాడు. ఒక్క ఫోన్ చేసుకుంటానని ఇంటికి ఫోన్ చేశాను. ఏదో ఒకటిలేరా అన్నాడు నాన్న. పగటిపూట షాపింగ్ బాగానే వుంటుందని కూతురంది. జీతం కనుక్కోవటం మర్చిపోవద్దని గుర్తుచేసింది బెటర్ హాఫ్.

ఈ జాబ్ నచ్చిందా లేదా చెప్పు. అయినా చూడు – ప్రజల జీవితాలలో వెలుగులు నింపే ఉద్యోగం. రోజూ రాత్రి డాబా మీద పడుకునేవాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఉద్యోగం. దారి కనపడని వారికి తోడుగా వుండే వుద్యోగం. భూమి మీద కాదు. ఆకాశంలో ఉద్యోగం. చెప్పు చేస్తావా?

నేను నా చేతికి వున్న వాచ్ వైపు చూసుకున్నాను. గుడ్ టైమ్.

సంతకం పెట్టాను.

కానీ ఆ వాచ్ ఆయనిచ్చిందే అని మర్చిపోయాను. అన్నట్టు మా ఆవిడేదో అడగమంది. మర్చిపోయా.

మాటల మధ్య ఖాళీలు
“ఎలక్ట్రీషియన్ మేడమ్. సాబ్ చెప్పారు” ఇంటర్ కామ్ లో వినపడింది.

“పైకిరా. సెవన్నాటూ”

జీవన్ ఈరోజు కూడా మర్చిపోతాడనుకున్నాను. ఫర్లేదు మూడు రోజుల తరువాతైనా గుర్తు పెట్టుకోని పంపించాడు.

ఏం చేస్తోందో మేడమ్. బెల్ కొట్టినా తీయట్లేదు. ఫోన్లో రమ్మనమని అందిగా!

తలుపు ధడాల్న తెరుచుకొని – “మేడమ్ నేను ఎలక్ట్రీషి…” మాటలు రావటం ఆగిపోయింది. ఆమే కదా! ఆమే. నన్ను గుర్తుపట్టిందా?

తలుపు తెరవగానే ఎదురుగా – వినయ్ కదూ అతను? గుర్తుకువచ్చిన ఒక్క క్షణంలోనే సంతోషం, ఉలికిపాటు.

“లోపలికిరా వినయ్” ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడన్నమాట. అయినా వినయే దొరికాడా జీవన్ కి.

పేరు పెట్టి పిలిచిందంటే గుర్తుపట్టిందనేగా అర్థం. పాత విషయాలు మాట్లాడాలా వద్దా? “గీజర్ రిపేర్ అని చెప్పారు”

“అవును. మాస్టర్ బెడ్ రూమ్ లో” వెనక్కి తిరిగి మాస్టర్ బెడ్ రూమ్ వైపు నడుస్తుంటే పదిహేడేళ్ళ క్రితం ఇలాగే తన వెనుకే అతను కూడా నడుచుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చిన జ్ఞాపకం. వెనక నుంచి ఏం చూస్తున్నాడో.

పక్కకి జరిగి అతన్నే ముందు పంపిస్తే?

ఇల్లు పెద్దదే. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అందరూ బాగా ఉన్నవాళ్ళేగా. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఆఖరుసారి కలిసిన మధ్యతరగతి అమ్మాయి కాదన్నమాట. వాళ్ళాయన బాగానే సంపాదిస్తున్నట్లున్నాడు.

ఇల్లంతా చూస్తాడేమిటి? పోనీలే. ఇప్పుడు నా హోదా అర్థం అయితే పాత విషయాలను దూరంగా పెడతాడు. ఇప్పుడు పలకరించచ్చు. “ఎలా వున్నావు వినయ్? ఎలక్ట్రీషియన్ అయ్యావన్నమాట”

“అవును భావనా. మీరు బాగున్నారా?” మీరు అని ఎందుకు అన్నాను? అప్పటి చనువు ఏమైందో. అయినా ఆమె గొంతులో నా పని పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్లు లేదు. అందుకేనేమో మీరు అన్నాను.

“నాకేం. చూస్తున్నావుగా. ఆయనకి రెండు కంపెనీలు వున్నాయి” వీడికి తెలియాలిలే. ఇంకా ఏం మాటలు మాట్లాడతాడో. “రిపేర్ సంగతి చూస్తావా?”

“పదండి” బెడ్ చూస్తుంటే ఆ రోజే గుర్తుకు వస్తోంది. అందమైన ఆహ్వానం. మొదటిసారి. తెలియనితనం. తెలుసుకోవాలన్న తొందరతనం.

తెలియనితనం అనుకోడానికి లేదులే. తెలిసే! కావాలనే! ఛీ ఛీ అవన్నీ ఇప్పుడెందుకులే. నేను బెడ్ రూమ్ లో పెళ్ళి ఫోటో పెట్టడం వెనుక ఆ సంఘటన తాలూక గిల్ట్ వుందా? ఏమోలే!

ఆమెకు గుర్తుందా? మర్చిపోయే విషయమేమీ కాదుగా. బాల్యం గోడ దూకి యవ్వనం రోడ్డు పైన అలుపు, అలసట తెలియకుండా పెట్టిన పరుగు. గుర్తుందా ఆమెకు?

“కవిత్వం ఇంకా రాస్తున్నావా?” బాగానే రాసేవాడు. అంత గొప్ప ఏం కాదులే కానీ వాటికే పడిపోయాను అప్పట్లో.

“రాయడానికి టైమ్ ఎక్కడ భావనా?” మోటివేషన్ కూడా లేదు. పదహారేళ్ళ వయసులో ఒక మిట్టమధ్యాహ్నం నా కవిత్వమంతా సొమ్మసిల్లి మూసుకున్న ఓ అమ్మాయి కళ్ళలో బందీ అయిపోయింది. ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు మళ్ళీ అలాంటి వాక్యాలు వస్తున్నాయేమిటో.

అతన్ని చూడగానే నాకు గుర్తొచ్చినట్లు అతనికి కూడా అదే గుర్తుకువచ్చుంటుందా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియక… తాను చెప్తే వాడు నవ్వుతూ – ’దారి చూపిన దేవత’ అంటూ పాడుతూ! ఛీ ఛీ! పాడు! కానీ మొదటి అనుభవం కదా! ఓహ్! ఆ విషయం గురించి ఇప్పుడు వాడు మాట్లాడితే? ఎందుకు అలా నిలబడి వాణ్ణే చూస్తున్నాను? చూస్తే ఏమైందిలే?

“కాయిల్ కాలిపోయింది. ఆరొందలౌతుంది.”

“సరే” నిజం చెప్పు. వాడితో ఆ అనుభవం వర్సెస్ జీవన్ తో…! వాట్ ద హెల్. ఏమిటీ పాడు ఆలోచన? మళ్ళీ అవకాశం ఇస్తే వాడుకుంటాడా? ఎలక్ట్రీషియన్ వినయ్. అప్పుడు? అందరూ యూనిఫార్మ్ లో కనిపించే రోజుల్లో అందరిలోకి అందగాడు. ఎట్ లీస్ట్ నా కళ్ళకు.

ఏమిటలా బెడ్ మీద కూర్చోని నా వైపే చూస్తోంది. ఏం ఆలోచిస్తోందో. చూసీ చూడనట్లు నేను చూస్తున్న విషయం గమనిస్తోందా? ఏమనుకుంటోందో? పాత పుస్తకంలో నెమలీక అనుకుంటోందా, పగుళ్ళిచ్చిన సమాధిలో నుంచి మొలిచిన పిచ్చి మొక్క అనుకుంటోందా? ఫర్లేదు కవిత్వం మళ్ళీ మొదలుపెట్టచ్చు. మళ్ళీ కనపడిందిగా మరి.

“ఏంటి వినయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?” మొదటిసారి చేసిన తప్పులు మళ్ళీ గుర్తొచ్చాయా? మళ్ళీ తప్పు చెయ్యాలని అనిపించిందా? అసలు చేసిన పని తప్పు అని నీకెప్పుడైనా అనిపించిందా అని అడగాలని వుంది. నేను మొదట భయపడ్డాను. తరువాత మర్చిపోవాలని ప్రయత్నించాను. గుర్తుకొచ్చిన ప్రతిసారి నీ లాగే నవ్వుకున్నాను.

“ఏం లేదులే. కాయిల్ తెమ్మంటావా?”

ఎప్పుడూ పని మీదే ధ్యాస. పనే మారింది అప్పుడు ఇప్పుడు. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఏమిటి దగ్గరగా వస్తున్నాడు. కొంపదీసి?

“ఏంటి?”

“ఏంటి?”

“కాయిల్ తెమ్మంటావా?”

“వద్దులే. ఎండాకాలమేగా. వర్షాలు పడ్డాక చూద్దాం” ఇంక వెళ్ళిపొమ్మని చెప్పాలా? చెప్పాలని అనిపించట్లేదు.

“వస్తాను మరి. నా నెంబర్ తీసుకో. ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి.” నేను చెప్పిన మాటలో వేరే అర్థం అర్థం చేసుకుంటుందేమో.

“ఊ.. చెప్పు” ఫోన్ మోగింది. జీవన్. “హా జీవన్. వచ్చాడు. ఏదో కాయిల్ పోయిందట. ఆరొందలౌతుందంటే…” వెళ్ళిపోతున్నాడు. ఏమనుకున్నాడో. వెళ్ళడమే మంచిదిలే. లేనిపోని గొడవ.

నీతో ఒకటే చెప్పాలనుకున్నాను. ఆ రోజు మొదట భలే ఎంజాయ్ చేశాను. తరువాత అవకాశమున్నప్పుడల్లా నెమరు వేసుకోని మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ప్రయత్నం చేశాను. గుర్తుకొచ్చిన ప్రతిసారి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను.

“వెళ్ళిపోయాడులే. వాడికి పెద్దగా పని వచ్చినట్లు లేదు. ఇంకెవరైనా వుంటే చూడు జీవన్”

మళ్ళీ కవిత్వం మొదలుపెట్టగలనా?