వాకిలి » కొల్లూరి సోమ శంకర్

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”
తెలుగు కథది దాదాపు నూట అయిదేళ్ళ వయస్సు. ఎంతోమంది గొప్ప కథకులు అద్భుతమైన కథల్ని రచించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.

“కథానిక పాఠకుల హృదయానికి సన్నిహితమైన వర్తమాన సాహితీ ప్రక్రియ” అంటూ – అలనాటి మేటి కథకులను ప్రతి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో, వారి కథాకాంతులను ఎల్లవేళలా ప్రసరింపజేయడానికి పూనుకుంది గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం. ఈ క్రమంలో “ఈతరం కోసం కథాస్రవంతి” పేరిట సుప్రసిద్ధ కథకుల గొప్పకథలను పుస్తక రూపంలో తెచ్చారు అరసం వారు. అభినందనీయం వీరి కృషి.

ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన “చాగంటి సోమయాజులు కథలు“. చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. రాశి కన్నా వాసి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.

“చాసో కథ ప్రారంభం నుంచి చివరిదాక ఒకే ఊపుతో నడుస్తుంది. ఎక్కడా బెసగదు, పట్టు సడలదు.” అంటారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన ఆయన కుమార్తె, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చాగంటి తులసి. “చాసో కథలు ఎక్కువగా బుద్ధిని తాకుతాయి. హృదయంలోకి చొచ్చుకుపోవడం తక్కువే అయినా కొన్ని చోట్ల కథ హృదయదఘ్నంగానే ఉంటుంది.” అని అంటారావిడ.

ఈ పుస్తకంలో పదహారు కథలున్నాయి. వాటిని పరిచయం చేసుకుందాం.

కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా విశ్వసించే పేరక్క తోటివారందిరికీ నీతులు చెబుతుంది. పురాణ ప్రవచనాల వైపు తోటి స్త్రీలని లాగడానికి ప్రయత్నిస్తుంటూంది. శాస్త్రం పేరు చెప్పి వారి అమాయకత్వం మీద భయప్రయోగం చేస్తుంది. తిన్న విస్తరి పారేయడానికి వెళ్ళి ఓ పంది పిల్ల చావుకు కారణమవుతుంది పుల్లమ్మ. ఆమె విపరీతంగా భయపడిపోయి నిద్రలో కలవరింతలు పెడుతుంది. తెలిసి చేసిన తెలియక జేసినా పాపకర్మం అనుభవించక తప్పదని కొడుకుతో అంటుంది. బదులుగా ఆ కొడుకు – “ఈ ప్రపంచంలో పాపం చేసినవాడికి భగవంతుడు శిక్ష వెయ్యడం లేదు. ఖూనీలు చేసిన వాళ్ళు, కొంపలు కూల్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. దేముడు శిక్ష వేస్తున్నది, అమాయకత్వాన్ని, తెలివితక్కువతనాన్ని.” అని అంటాడు. ఎంతో నచ్చజెప్పిన మీదట పుల్లమ్మ తెరిపిన పడుతుంది. “కర్మ సిద్ధాంతం” అనే ఈ కథ 1942లో ప్రచురితమైంది.

పేదరికం చిన్నారుల బాల్యాన్ని ఎలా చిదిమేస్తుందో చెప్పిన కథ “కుంకుడాకు“. తల్లీ తండ్రీ పొయ్యిమీదకి తేగలిగినా, తేలేకపోయినా గవిరి పొయ్యి లోకి తెచ్చితీరాలి. పొయ్యి వెలగాలంటే చెత్త కావాలి. చెత్త ఏరుకొచ్చే బాధ్యత ఎనిమిదేళ్ళ గవిరిది. ఆ కుటుంబంలో కూతురు గవిరి తెచ్చి పెట్టే చెత్తకి ఆర్ధికంగా ఎంతయినా విలువ ఉంది. తోటి పిల్లలు బడిలో ఎక్కాలు వల్లె వేస్తుంటే, గవిరి మాత్రం కామందు చేతితో తన్నులు తింటూ చెత్త మోసుకుంటూ ఇంటికి నడుస్తుంది. ఈ కథ 1943లో ప్రచురితమైంది.

ఓ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని రాత్రి వేళలో చూడాలని బయల్దేరిన మిత్రబృందానికి ఏమయింది? భయం ఆవహించింది! ఎలా ఉంటుందా భయం? శరీరం నిండా వేలకొద్ది టన్నుల బరువుతో ఆవహించింది. “భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు. సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకొట్టుంది. ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయపిశాచిని గెంటేస్తుంది. పిచికని పట్టుకుని పావుగంట సేపు చేతుల్లో ఉంచి చూడండి. అది చచ్చి ఊరుకుంటుంది. దాని గుండెలు భయంచేత ఆగిపోతాయి. భయం అంటే అదీ. అదీ నన్ను ఆవహించింది.” అంటాడు గిరిరావు అనే పాత్ర. ఈ మిత్రబృందాన్ని అంతగా భయపెట్టినదేదో తెలుసుకోవాంటే “దుమ్ములగొండె” కథ చదవాలి. ఈ కథ జూలై 1943లో ‘భారతి’లో ప్రచురితమైంది.

లేమి ఎంతటివాళ్ళలోనైనా మానవత్వాన్ని చంపి, అమానుషత్వాన్ని పెంచుతుంది అంటుంది “బొండు మల్లెలు” కథ. మన సంబంధ బాంధవ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయో ఈ కథ చెబుతుంది. “సారంవతమైన గంజిని కాలువపాలు చేసి, పిప్పిని ‘అన్నం’ అనుకొని నాగరీకులం తింటాం” అంటాడు ప్రధానపాత్ర. తాను చేసేది న్యాయమైన దోపిడీ అని మొదట భావించిన అతను – తాను కూడా ఓ అసహాయుడిని దోపీడీ చేశానని గ్రహిస్తాడు. ఈ కథ సెప్టెంబరు 1943లో ‘ప్రజాశక్తి’లో ప్రచురితమైంది.

పేదరికం కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి కృష్ణుడిది. అటెండెన్స్ రిజిస్టర్‌లో తన పేరు కొట్టేసి ‘డిస్‌కంటిన్యూడ్’ అని వ్రాస్తారేమోనన్న భయం వాడిది. తండ్రి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చి పంపితే, బడిలో ఓ స్తంభాన్ని ఆనుకుని నిలబడి, దుఃఖంలోకి జారుకుంటాడు కృష్ణుడు. కొడుకు రాలేదని తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. బడి వరండాలో పిల్లాణ్ణి చూసి ఇంటికి వెడదాం రమ్మంటాడు. “బడి నాది, నే న్రాను” అంటూ గట్టిగా దుఃఖంతో కేకపెడతాడు కృష్ణుడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడుతుంది. ఓ నిశ్చయానికొస్తాడు. కనీసం ఒక్క పుస్తకమైనా కొనిపెట్టమన్న కొడుకుని “చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా, పారేశావా?” అని అడుగుతాడు. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు. చాసో కథల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ “ఎందుకు పారేస్తాను నాన్నా?” అనే కథ మే 1944లో ‘భారతి’లో ప్రచురితమైంది.

అనేక విషయాలలో సమాధానాలు పడుతూంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుందని చెబుతుంది “లేడీ కరుణాకరం” కథ. ఈ కథ మార్చి 1945లో ‘ఢంకా’లో ప్రచురితమైంది. నిండా వ్యంగ్యం నిండిన కథ ఇది.

“చిట్టికింకా పెళ్ళికాకపోవడం, జీర్ణించిపోయి, నాలో దురుద్దేశాలని రేపుతున్నది. చిట్టికింకా పెళ్ళికాకపోవడం తెనుగు యువకుల రసజ్ఞతా దారిద్ర్యాన్ని వెల్లడిస్తున్నాది.” అంటాడు ‘ఊహా ఊర్వశి‘ కథలోని ప్రధానపాత్ర. “కోర్కెలు అణచివేస్తే మనోవికారాల కింద తేలుతాయి. కోర్కెలు సాఫల్యం చెయ్యడమో లేక జయించడమో మనం చేస్తూ వుండాలి.” అంటాడు. మనిషిలోని దిగజారుడుతనాన్ని కళ్ళకు కడుతుందీ కథ. ఈ కథ మార్చి 1945లో ‘భారతి’లో ప్రచురితమైంది.

భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభతో అనేక భావాలని సూక్ష్మంగా ఓ నవ్వు వ్యక్తపరుస్తుంది. అయితే ఆ నవ్వు అతనిలో పొరపాటు అభిప్రాయం కలిగించిది. ఆ నవ్వుకు కారణం ఏమిటో, అది ‘ఓ వర్గజీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపిన’ కథకి ఎలా కారణమైందో “బూర్జువా కుక్క” కథ చెబుతుంది. సాహితీ భజనపరులపై విసిరిన వ్యంగ బాణం ఈ కథ. ఇది ఏప్రిల్ 1945లో ‘ఢంకా’లో ప్రచురితమైంది.

కుంటిబిచ్చగాడికి, గుడ్ది బిచ్చగాడికీ తేడాలు చెబుతూ ఓ తండ్రి తన కూతుర్ని గుడ్ది బిచ్చగాడినే పెళ్ళిచేసుకోమంటాడు. సమాజంలోని ఏ స్థాయి వ్యక్తులకయినా ముందు తమ అవసరాలే ముఖ్యమని “ఎంపు” కథ మరోసారి చాటుతుంది. ఈ కథ సెప్టెంబరు 1945లో ‘అరసం ప్రత్యేక సంచిక’లో ప్రచురితమైంది.

ధనం ఆశజూపి నిస్సహాయ స్త్రీలను కబళించడం అనాదిగా జరుగుతున్నదే. బ్రతుకుతెరువు కోసం రంగూన్ వెళ్ళిన అల్లుడు ఇక తిరిగిరాడని చెప్పి తన కూతురిని పరపురుషుడికి అప్పగిస్తోందో తల్లి. వాడిచ్చే డబ్బులతో అప్పులు తీరుస్తానంటూ కూతుర్ని బ్రతిమాలుతుంది. తప్పక, లొంగిపోతుంది కూతురు. ఉన్నట్టుండి ఓ రోజు రంగూన్ నుంచి తిరిగొస్తాడు అల్లుడు దాలిగోడు. ఏడుస్తున్న భార్యని ఓదారుస్తాడు. సమాజంలోని నైచ్యానికి అద్దం పట్టిన కథ “ఆఁవెఁత“. ఈ కథ రచనాకాలం 1951.

జీవితంలో సంగీతం ఎంత ప్రయోజనకరమో తెలిపే కథ “వాయులీనం“. పాడలేకపోయినా, అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది. వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయంటుందీ కథ. “పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి. స్వభావసిద్ధంగా సంగీతం సమ్మోహనపరుస్తుంది. చిన్న వయస్సునుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతువు అవుతుంది” అని చెబుతుంది. సంసార బాధ్యతలలో పడి, సంగీతానికి దూరమైనందుకు విలపిస్తోందో గృహిణి. ఈ కథ 1952లో ‘భారతి’లో ప్రచురితమైంది.

తన కొడుకు చెమటోడ్చి గడించుకున్న డబ్బుతో బియ్యం కొనుక్కుని రైల్లో వస్తున్న ఓ ముసలమ్మని రైల్వే ఉద్యోగి అటకాయిస్తాడు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మడానికి తీసుకువెడుతోందని వాదిస్తాడు. రైలు అన్నవరం స్టేషనులోంచి పోతుంటే ముసలామే, ఉద్యోగి ఇద్దరూ సత్యనారాయణ స్వామిని చూడడానికి ప్రయత్నిస్తే, ఉద్యోగికి ఆలయం కనిపిస్తుంది, ముసలామెకి ముళ్ళచెట్లు మాత్రమే కనబడతాయి. చివరికి మరో స్టేషన్‌లో నలుగురు అధికారులు ఎక్కుతారు. ముసలామెని గుర్తు పట్టి తర్వాతి స్టేషన్‍లో దింపి కేసు పెట్టేందుకు తీసుకుపోతారు. గోదావరి మండలం సరిహద్దు దాటించి, ప్రభుత్వపు శాసనాన్ని ధిక్కరించి, హద్దు తప్పి, ఐదేసి కుంచాలు చొప్పున బియ్యం తరచు తరలించుకుపోతున్న ముద్దాయి పట్టుబడింది. “కుక్కుటేశ్వరము” కథ 1952లో ‘భారతి’లో ప్రచురితమైంది.

కొండని బ్లాస్ట్ చేసే పని చేస్తుండగా ఓ పెద్ద బండరాయి వచ్చి రామిగాడి తలమీద పడుతుంది. అక్కడికక్కడే చచ్చిపోతాడు. తోటి కూలీలందరూ కాంట్రాక్టర్ చేత నష్టపరిహారం ఇప్పించాల్సిందేనని పట్టుబడతారు. మేస్త్రీ సత్యం మూడు వందల రూపాయలు తెచ్చి రామిగాడి పెళ్ళాం పార్వతికి ఇస్తాడు. కోడలికి డబ్బు ముట్టిందని తెలియగానే రామిగాడి తల్లి వాటా కోసం వస్తుంది. మేస్త్రీని న్యాయమడుగుతుంది. అప్పుడు మేస్త్రీ సత్యం అసలయిన న్యాయమేమిటో చెబుతాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలనేనని ఆనాడే చెప్పిన కథ “బండపాటు“. ఈ కథ 1968లో ‘జ్యోతి – దీపావళి సంచిక’లో ప్రచురితమైంది.

పరమేశ్వరుడి నిర్ణయాలు పామరులకు బోధపడవని చెప్పే కథ “వజ్రహస్తం“. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ అధికారి తిరుమలకి వెళ్ళి భగవంతుని క్షమాపణ కోరుకుంటాడు. తనని కాకుండా తన మిత్రుడిని కాపాడమని కూరుకుంటాడు. ఈ కథ 1974లో ‘ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక’లో ప్రచురితం.

అందమైన బతుకే అందరికీ కావాలని చెప్పే కథ “గుడిసె – దీర్ఘరోగి“. ఓ చిత్రకారుడు తను చిత్రించలచిన దీర్ఘరోగి చిత్రం కోసం ఓ ముసలమ్మని మోడల్‌గా ఉండమంటాడు. డబ్బిస్తానంటే ఒప్పుకుంటుందామె. నీడలు, ఎండ వెలుగులూ పడి ఆమె మొహంలో ఎనభై ఏళ్ళ జీవితపు బాధ, మరణ వేదన దేదీప్యమానంగా దివ్యజ్యోతులై వెలుగుతూ కనబడతాయి చిత్రకారుడికి. ‘దివ్యత్వం అన్నిటా ఉంది, వేదనలోనే చూశా!‘ – అనుకుంటాడతను. ఈ కథ 1975లో ‘ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక’లో ప్రచురితం.

వర్షాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసే కుటుంబం కథ “వఱపు“. ‘దిక్కుమాలిన ఆకాశాన్ని నమ్ముకుని తరతరాలు బతుక్కొస్తున్నాము‘ అంటుందో పాత్ర ఈ కథలో. సకాలంలో వానల కోసం రైతులు ఎంతగా ఎదురుచూస్తారో, ఎంతగా ఆశపడతారో; అకాలంలో కురిసే వానయినా కాస్తోకూస్తో మేలు చేస్తుందని వాపోతుందా పాత్ర. ఈ కథ 22.1.1988 నాటి ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ప్రచురితం.

ఆయా కథలు ప్రచురితమైన కాలాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. ఈ కాలక్రమంలో తెలుగునేలలో వచ్చిన మార్పులు, సామాజిక సంబంధాలు చెదరడం, అవినీతి రాజ్యమేలడం, వ్యక్తి నైతికత పతనమవడం మొదలైనవాటినన్నీ ఈ కథలు రికార్డు చేశాయి.

ఇవి ఏ ఒక్క కాలానికో, ప్రాంతానికో మాత్రమే పరిమితం కాక, విశ్వజనీనమైన కథలు. వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నిస్తూ వ్యవస్థ మారాలి, మారడానికి వీలుగా వ్యక్తి ఆలోచన సాగాలి, వృద్ధి చెందాలని కళాత్మకంగా చెప్పిన కథలివి. మాండలీకాన్ని కథలలో చొప్పించిన రచయిత చాసో.

కాలాన్నీ, మనుషుల్నీ, సమాజాన్ని సన్నిహితంగా పరిశీలిస్తూ వ్రాసిన కథలివి. ఈ కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఏది రాయాలో ఏది రాయకూడదో అర్థమవుతుంది. కొత్త, ఔత్సాహిక రచయితలకు స్ఫూర్తినిచ్చే రచనావిధానం ఇది.

105 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 50/- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ వారి అన్ని కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది. http://www.anandbooks.com నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.

మసకబారిన జ్ఞాపకాలు
పదేళ్ళ వయసున్న మా అబ్బాయిని తీసుకుని రామాపురం బస్టాండులో బస్సు దిగేసరికి నేను ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఇరవై ఏళ్ళ తర్వాత రామాపురం వస్తున్నాను. కొన్ని మార్పులుంటాయనుకున్నాను కాని ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం ఊహించలేదు. నేను చివరిసారి చూసినప్పుడు ఈ బస్టాండు పొలాల మధ్య మట్టి రోడ్డుతో ఒకే ఒక షెల్టర్‌తో ఉండేది. ఇప్పుడు.. ఇటుకలు, సిమెంటుతో నిర్మించిన విశామైన భవనాల మధ్య ఠీవిగా ఉంది. బైకులు, కార్లు, జీపులు, బస్సుల వంటి వాహనాల రణగొణ ధ్వనులతో వాతావరణం గందరగోళంగా ఉంది. నా చిన్నతనంలో చదువుకునే రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పట్లో రోడ్డు మీద చాలా తక్కువ వాహనాలు ఉండేవి. ప్రభుత్వం వారి పాత, దుర్బలమైన బస్సులు ఉండేవి. ప్రయాణీకుల కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తూ ఆ బస్సులు రోడ్డు మీద పడిగాపులు కాసేవి. పొగ వదులుతూ బస్సులు బయల్దేరగానే బస్టాండు నిర్మానుష్యమైపోయేది.

“ఇది చిన్న ఊరని చెప్పావు?” అన్నాడు మా అబ్బాయి.

“మన నగరాలతోనూ, పట్టణాలతో పోలిస్తే ఇది ఇప్పటికి చిన్న ఊరే. ఇరవై ఏళ్ళ క్రితం నేను వచ్చేసిన తర్వాత బాగా పెరిగింది.”

“ఈ ఇరవై ఏళ్ళలో నువ్వు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదా?”

“లేదు”

“ఎందుకు?”

“ఎందుకంటే….” నేను మాటలు తడుముకున్నాను.

“ఎందుకు నాన్నా, నువ్విక్కడికి రాలేదు?”

నేను జవాబు చెబితే గాని మావాడు ఊరుకునేలా లేడు.

“ఈ ఊర్లోనే పెరిగావనీ, ఇక్కడే చదువుకున్నావని, స్నేహితులున్నారనీ చెప్పావుగా నాన్నా! వాళ్ళని కలవాలని ఎప్పుడూ అనుకోలేదా?”

నిజమే. నేను రామాపురంలోనే పెరిగాను. నాకిక్కడ మిత్రులుండేవారు. నా కౌమార దశ ఇక్కడే గడిచింది. నగరానికి వచ్చిన కొత్తల్లో వాళ్ళని బాగా తలచుకునేవాడిని. కొందరి ముఖాలు నా మనసులో ముద్రపడిపోయాయి. కాని హైస్కూల్ చదువు పూర్తి చేసి ఇక్కడ్నించి వెళ్ళిపోయాకా నేను మళ్ళీ రామాపురం రాలేదు. చిన్న ఊర్లలో పెరిగి… ఊర్లు మరింత చిన్నవయ్యాకా లేదా తమ కలలు పెద్దవయ్యాకా… పెద్ద ఊర్లకి, ఉన్నత గమ్యాల వైపుకి పరిగెత్తేవాళ్ళలో నేనూ ఒకడిని. నేనో పెద్ద నగరంలో స్థిరపడ్డాను. నా కుటుంబం, నా ఉద్యోగం, కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు… అన్నీ నగరంతోనే. ఇప్పుడు ఇక్కడ రామాపురంలో నా పాఠశాల మిత్రుడు ఎవరైనా ఎదురుపడినా… బహుశా మేము ఒకరినొకరం గుర్తు పట్టలేకపోవచ్చు. ఇరవై ఏళ్ళంటే సుదీర్ఘమయిన కాలం. అప్పటి మా అమాయకమైన ముఖాలని… జీవితపు కర్కశత్వం వయసనే పైపొర కింద దాచేసింది. ఒకవేళ మేము ఒకరినొకరం గుర్తు పట్టినా… చిన్ననాటి స్నేహం తాలుకు ఆనందం ఓ మెరుపులా మెరిసి క్షణంలో మాయమైపోతుంది, మా మధ్య ఎక్కువ మాటలేవీ ఉండవు. అపరిచితులమైపోతాం. పెద్దరికం వేషాల్లో మా సమక్షం కూడా ఒకరికొకరికి ఇబ్బందిగానే ఉంటుంది. చిన్ననాటి స్మృతులు గతం యొక్క వికారమైన ఉదంతాలుగా మిగిలిపోతాయి.

జ్ఞాపకాలు చాల అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అవి మనల్ని వెంటాడుతాయి. అవి గత కాలపు నాటివనీ, ఎప్పుడో విడిచిపెట్టబడినవనీ బాగా తెలిసినా కూడా మనం వాటిని మన లోలోపల లోతుల్లో భద్రపరుచుకుంటాం. అవి అసౌకర్యం కలిగిస్తాయని తెలిసినా, తరచూ వచ్చే తలనొప్పిని భరించినట్లు… వాటి నసని తట్టుకుంటాం. ఆ నసే ఇప్పుడు రామాపురానికి లాక్కొచ్చింది. గత ఇరవై ఏళ్ళుగా ఈ ఊరినే మర్చిపోయాను. నా కొడుకు పెరిగి పెద్దవుతుంటే.. వాటి ఆటపాటల్లో, కుతూహలంలో నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది, నేను ఎదిగిన రోజులు జ్ఞాపకమొచ్చాయి. నాలోని చిన్న రామాపురం పెరగసాగింది. ఓ రోజు ఈ నస మరీ ఎక్కువై బాధగా మారింది. నా భార్యని, స్నేహితులని ఆశ్చర్యానికి గురిచేస్తూ, మా అబ్బాయిని తీసుకుని మా పూర్వీకుల గ్రామానికి… రామాపురానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి బయల్దేరాను.

నేనొక్కడినే వచ్చి ఉన్నా సరిపోయేది. కాని వాడి వయసులో ఉండగా నేను పెరిగిన ప్రాంతాలను నా కొడుక్కి చూపించాలనుకున్నాను. ఈ ప్రాంతాన్ని వాడి స్మృతులలో ఓ భాగంగా… కనీసం ఓ సూక్షమైన భాగంగానైనా చేయాలనుకున్నాను. అయితే రామాపురంలో చోటు చేసుకున్న మార్పులు చూసాకా నాకు నోట మాట రాలేదు, మతి కూడా పోయినట్లయింది. ఇక్కడ నేను ఏం వెతకాలి? నా కొడుకుకి ఏం చూపించాలి, దేని గురించి చెప్పాలి? ఇక్కడి మార్పుల గురించి నాకే ఏమీ తెలియదు, ఇవేవీ నా స్మృతులలో లేనే లేవు. ఇప్పుడు ఇక్కడ లేని వాటి గురించి మావాడికి చెప్పాల్సివస్తే… అదేదో నగరంలోనే… మా ఇంట్లోనే చెప్పేవాడిని కదా!

“నాన్నా, ఈ ఊరి గురించి చెప్పు. నాకు బోల్డు సంగతులు చెప్తానని అన్నావ్..”. తల్లిదండ్రులు చేసిన బాసలని బాగా గుర్తుంచుకునే నవతరం కుర్రాడు మా అబ్బాయి.

“కంగారు పడకు. బోలెడు విషయాలుంటాయి చెప్పుకోడానికి…” అని చెప్పి కదిలాను. రద్దీని దాటుకుంటూ వీధులలో నడవడానికి సన్నద్ధమయ్యాము.

మూడు వైపుల నుంచి మూసి ఉన్న బస్టాండు నుంచి అన్ని వైపులకి ఇరుకు సందులు ఉన్నాయి. ఈ సందులన్నీ రకరకాల వాహనాలతో రద్దీగా ఉన్నాయి. వాటి శబ్దాలతో అక్కడి వాతావరణం గోలగోలగా ఉంది. మావాడి ప్రశ్నలని కాసేపు అదుపులో ఉంచడానికి వాడికి స్థానికంగా ప్రఖ్యాతిగాంచిన మిఠాయిలు కొనిపెట్టాను. తాత్కాలికంగా వాడి దృష్టి మళ్ళించాను.

రామాపురం ఇంత త్వరగా, ఇంత అనూహ్యంగా మారిపోతుందని నేను అసలే మాత్రం అనుకోలేదు. అయితే బుద్ధ బజార్ మాత్రం అలాగే ఉండి ఉంటుందని భావించాను. గుండ్రని రాళ్ళు పరిచిన ఇరుకు సందులలో ఉండే బుద్ధ బజార్ రామాపురంలోకెల్లా అతి పురాతన బజారు. వీధికిరువైపులా ఉండే ఇళ్ళకి చెక్కలతో చేసిన బాల్కనీలు ఉండేవి. ఇళ్ళ క్రింది భాగాలలో కొట్లు ఉంటే, పై భాగాలలో వ్యాపారులు నివాసం ఉండేవారు. ఈ బజారు ఎన్నో ఉత్థానపతనాలను చూసింది, ఎన్నో దశాబ్దాలు గడిచిపోవడానికి సాక్షిగా నిలిచింది. దీని ప్రభ వెలిగిపోతున్న రోజులలో, రామాపురంలో తారు రోడ్లు రాని ఆ రోజుల్లో, ఊరవతల ఉన్న పర్వత ప్రాంతంలోని దేవాలయానికి వచ్చి పోయే యాత్రికులు రాత్రిళ్ళు బస చేయడానికి బుద్ధ బజారే తగిన స్థలంగా ఉందేది. అవెంతో గొప్ప రోజులు. నేల మీద పరిచిన గుండ్రని రాళ్ళ మీద గుర్రాల గిట్టల చప్పుడు; కఠినమైన పర్వత మార్గాల నుంచి క్షేమంగా తిరొగిచ్చిన యాత్రికుల కబుర్లు; లాభాలని ఆశించే వ్యాపారుల స్నేహపూర్వక స్వభావం – బుద్ధ బజారుని ఓ గొప్ప తేజస్సుతో నింపేసేవి.

నేను బడికి వెళ్ళడం ప్రారంభించేనాటికి బుద్ధ బజారు ప్రాభవం క్షీణించడం మొదలైంది. యాత్రాకేంద్రాన్ని ఇతర పట్టణాలతో నేరుగా కలిపేందుకు బస్సులను వేసారు. రామాపురం తన ప్రాధాన్యతని కోల్పోయింది, యాత్రికులు రాత్రి బస చేసే ముఖ్యమైన ఊరు స్థాయి నుంచి ఓ చిన్న వర్తకపు ఊరిగా మారిపోయింది. బస్సులు యాత్రికులను నేరుగా యాత్రాకేంద్రానికి చేరుస్తుండడాన్ని వర్తకులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. బుద్ధ బజారు క్రమంగా తన వైభవాన్ని పోగొట్టుకుంది.

ఏమైనా, ఆ రోజుల్లో చుట్టు పక్కల గ్రామాలన్నింటికి అదే ముఖ్యమైన వాణిజ్య కూడలి. చిన్న ఊరి మార్కెట్లకి ఉండే అన్ని ఆకర్షణలను కలిగి ఉన్న ఊరు. ఇక్కడ నా చిన్నతనంలో కొన్ని రోజులు మిత్రులతో కలసి టీ కొట్లలో గడిపిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. బుద్ధ బజారులో కొట్ల దగ్గర గంటల గంటలు కాలం గడపడంలో పెద్ద విశేషం ఏదీ లేదు గాని ఈ ప్రాంతంలో ఉబుసుపోని ఊసులతో సోమరిగా సమయం గడిపామన్న ఓ జ్ఞాపకం నా మదిలో నిలిచిపోయింది. ఈ వృథా కాలక్షేపమే నా స్మృతులలో బలంగా ఉండిపోయింది.

“అసలైన మార్కెట్‌కి వెడదాం పద, ఆ ప్రాంతమంతా నాకు బాగా తెలుసు” అంటూ బుద్ధ బజారు వైపు నడిచాను. బస్టాండుకు యాభై మీటర్ల దూరంలోనే ఉంది బుద్ధ బజారు. వీధి మొదట్లో కాపలా ఉంటునట్లుండే ఆ పురాతన మఱ్ఱి చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది. అయితే, కొత్తగా వచ్చిన ఇళ్ళకి చోటు ఇవ్వడానికి, దాని విశాలమైన కొమ్మలని చాలా చోట్ల కొట్టేశారు. ఆ వీధిలోకి అడుగుపెట్టగానే, గుండ్రటి రాళ్ళు పరిచిన నేలపై నడుస్తున్నందున్న మా బూట్ల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పటి, పురాతన సోమరితనం నన్ను మళ్ళీ ఆవరించింది… ఈసారి బాధతో. రామాపురంలోని కొత్త ప్రాంతాల వలె కాకుండా ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. మార్కెట్లో అతి తక్కువమంది కనపడ్డారు. చాలా కొట్లు ఖాళీగా ఉన్నాయి లేదా అతి తక్కువ సామాన్లు కలిగి ఉన్నాయి. ఇళ్ళు కూడా పాతవై, శిధిలమైనాయి. వర్ణ శోభని కోల్పోయి బోసిగా కనబడుతున్నాయి.

నాలో పెరిగితున్న రామాపురం యొక్క బుద్ధ బజారు నన్నిక్కడికి లాక్కొచ్చింది… ఇరవై ఏళ్ళ తర్వాత. మరిప్పుడు.. మా అబ్బాయికి చెప్పడానికి ఇక్కడేముంది? నా స్మృతులలో వేటిని మా అబ్బాయితో పంచుకోవాలి?

“విసుగ్గా ఉంది నాన్నా… ఇక్కడ ఏదీ ఆసక్తిగా లేదు.” అని చెబుతూ, “మీ చిన్నప్పుడు ఇక్కడ మీరేం చేసేవారు?” అడిగాడు మావాడు – అక్కడి ఉదాసీనత, శిధిలాల పట్ల అనాకర్షణకి లోనవుతూ.

“బుద్ధ బజారులో ఏదో ఉండాలి… ఏదో విశేషం ఉండాలి…” చెప్పాను నేను వివరాల కోసం తడుముకుంటూ.

“ఇక్కడైతే ఏమీ లేవు. కూలడానికి సిద్ధంగా ఉన్న కొట్లు తప్ప! నాన్నా, మనం మొదట చూసిన ప్రాంతంలోని మార్కెట్టే బావుంది. అక్కడంతా సందడిగా ఉంది. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళెవరూ ఉన్నట్లు లేరు…. తెలిసిన మొహం ఒక్కటీ కనబడడం లేదు…”

ఓ చోట మెట్లెక్కాము. నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కొడుకుతో పంచుకోవాలనుకోవడం ఎంతటి మూర్ఖపు ఆలోచనో నాకర్థం అవుతోంది. ఇంతలో ఓ కొట్టు ముందున్న – “రామ్‌లాల్ టైలర్స్” బోర్డు నాకు హఠాత్తుగా కనపడింది. అంతే! ఒక్కసారిగా నేను మా బడి రోజులకి వెళ్ళిపోయాను.

ఆ రోజుల్లో రామాపురం మొత్తంలో రామ్‌లాల్ ఉత్తమమైన దర్జీ. ఫ్యాషన్ ప్రపంచంలోని కొత్త ఒరవడులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు రామ్‌లాల్. ఊర్లో ఇంకొంతమంది దర్జీలు ఉన్నా, రామ్‌లాల్ దగ్గర బట్టలు కుట్టించుకోడమంటే అదో గొప్ప హోదా! ఉత్తమమైన దర్జీ అని పేరు లభించడంతో, రామ్‌లాల్ కాస్త నియంతలా ఉండేవాడు… ముఖ్యంగా బడి పిల్లల విషయంలో. అప్పట్లో బెల్-బాటమ్ పాంట్లు చాలా ప్రసిద్ధం. మేము కూడా మా పాంట్లు కాలి చీలమండల దగ్గర విశాలంగా ఉండాలని కోరుకునేవాళ్ళం. అయితే రామ్‌లాల్ మాటే నెగ్గేది. “కుదరదు. నలభై అంగుళాల వెడల్పు ఆడపిల్లల గౌనులకి… మగపిల్లల పాంట్లకి కాదు” అని స్థిరంగా చెప్పేవాడు. చాలా సేపు బ్రతిమలాడి చివరికి కన్నీళ్ళు పెట్టుకునే సమయానికి 32 అంగుళాలు ఉంచడానికి ఒప్పుకునేవాడు. ఈ ధోరణి వల్ల మేము రామ్‌లాల్‌ని అసహ్యించుకునేవాళ్ళం. అయినా మా బట్టలు కుట్టించుకోడానికి అతని కొట్టుకే వెళ్ళేవాళ్ళం. చుట్టూ సహాయకులతో, రామ్‌లాల్ కొట్టు హడావుడిగా ఉండేది. “రామ్‌లాల్ టైలర్స్” అనే బోర్డు ఎప్పటికప్పుడు తాజాగా రంగులేసి ఉండేది.

కాని ఈ రోజు ఆ బోర్డు చూస్తే… రంగు వెలసిపోయి, తుప్పు పట్టి, అడ్డదిడ్డంగా వేలాడుతూ కనబడింది. కొట్టు కూడా ఖాళీగా కనపడింది. షో కేసులు బోసిగా ఉన్నాయి. అక్కడక్కడా అద్దాలు పగిలి ఉన్నాయి. ఓ పాత కుర్చీలో నల్లటి మెత్తపైన, ఓ పాత కుట్టు మిషన్ ముందు కూర్చుని ఉన్న ఓ ముసలి ఆకారం కనబడింది. చూడగానే అతనే రామ్‌లాల్ అని గ్రహించాను. ముసలాడయిపోయాడు, దుర్బలంగా ఉన్నాడు.

“అతను నాకు తెలుసు.. నాకు తెలుసు” అని మా అబ్బాయితో చెప్పాను. ఉన్నట్లుండి నాలో ఏదో ఉత్సాహం. నా చిన్ననాటి జ్ఞాపకాలేవో ఆ కొట్లోంచి నన్ను పిలుస్తున్నట్లనిపించింది. అయితే మా అబ్బాయికిదేం నచ్చలేదు. కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వచ్చాడు.

మమ్మల్ని చూస్తునే, శక్తి కూడదీసుకుని పైకి లేచాడు రామ్‌లాల్. ఆయనలో పెద్ద ఉత్సాహమేమీ లేదు.

“రండి బాబుగారు… రండి” అని ఆహ్వానించాడు. ఆ గొంతు చాలా బలహీనంగా ఉంది. మునుపటి కాఠిన్యం లేదు.

“రామ్‌లాల్ గారూ.. నేను…” అంటూ నా గురించి చెప్పాను. ఆయన గుర్తు చేయడానికి ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అయితే రామాపురంలో నన్ను గుర్తు పట్టేవాళ్ళెవరు లేరని మరోసారి వ్యాఖ్యానించడానికి మా అబ్బాయికి అవకాశం ఇవ్వదలచలేదు. అందుకే వెంటనే… “గుర్తొచ్చానా.. మీరు నాకో కోటు కుట్టారు…” అని చెబుతూ మా నాన్న పేరు, మా గ్రామం పేరు చెప్పాను. ఆయనకి గుర్తొచ్చినట్లుంది.

“అవునవును…” అన్నాడు. ఆయన మొహంలో వెలుగు. “కానీ మీరు చాలా ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదుగా. ఈ మధ్య కాలంలో అన్నీ మారిపోయాయి…” అంటూ గట్టిగా నిట్టూర్చాడు.

బడిలో ఆఖరి సంవత్సరం చదువుతున్న రోజులవి. కోటు కుట్టించడం కోసం మా నాన్న ఓ చక్కని గుడ్డ ముక్క కొన్నాడు. అదెంతో మెత్తగా, వెచ్చగా ఉంది. నాకు కావలసిన సైజు కన్నా ఆ గుడ్డ ముక్క కొలతలు ఎక్కువగా ఉన్నాయి. మా అమ్మేమో కోటుని బాగా వదులుగా, వచ్చే ఏడాదికి కూడా సరిపోయేలా కుట్టుంచుకోమని గట్టిగా చెప్పింది. రామ్‌లాల్ కుట్టిన కొత్త కోటు వేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చాను. అమ్మ కోపం పట్టలేకపోయింది. “ఆ రామ్‌లాల్ మోసం చేశాడు. గుడ్డ ముక్క మిగుల్చుకున్నాడు” అంటూ మండిపడింది. మాములు గుడ్డ ముక్క అయితే అమ్మ అంతగా పట్టించుకోకపోయేదేమో… ఆ గుడ్డ ముక్క ఖరీదైనది కావడం వల్లా, కోటు ప్రస్తుతానికి నాకు సరిగ్గా సరిపోవడం వల్లా… అమ్మ ఆ గుడ్డ ముక్క సంగతి తేల్చాలని నిర్ణయించుకుంది.

మర్నాడు నాతో కలసి రామాపురం వచ్చింది. బుద్ధ బజార్ లోని గుండ్రటి రాళ్ళు పరిచిన నేల మీద విసురుగా నడుస్తూ రామ్‌లాల్ కొట్లోకి ప్రవేశించాం. అక్కడ రామ్‌లాల్ తన ఐదేళ్ళ కొడుకుతో కులాసాగా కబుర్లు చెబుతున్నాడు. ఆ పిల్లాడి వంటి మీద నా కోటు గుడ్డ ముక్కతో కుట్టిన కోటు ఉంది. అంతే.. అక్కడ కల్లోలం రేగింది. అమ్మకి ఇంతకంటే మరో సాక్ష్యం అక్కర్లేక పోయింది. వివరణ అవసరం లేకపోయింది. రామ్‌లాల్‌పై తిట్లు లంకించుకుంది. రామ్‌లాల్ కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. అందరి మొహాల కేసి చూస్తూండిపోయాడు. తిట్టీ తిట్టీ అలసిపోయాక చివరికి శాంతించింది అమ్మ. రామ్‌లాల్ చేసిన మోసానికి శిక్షగా… ఈ కోటు కుట్టినందుకు ఇవ్వాల్సిన కుట్టుకూలీ ఇవ్వడం లేదని ప్రకటించింది. రామ్‌లాల్ అంగీకారంగా, మౌనంగా తలవంచుకుని నిలబడిపోయాడు. ఎవరి నియంతృత్వాన్ని మేము భరించలేకపోయేవాళ్ళమో ఆ రామ్‌లాల్… దయనీయంగా కనపడ్డాడప్పుడు.

అదే దయనీయత మళ్ళీ ఇప్పుడు రామ్‌లాల్ వదనంలో గోచరిస్తోంది. అయితే ఆ దౌర్బల్యానికి కారణం వృద్ధాప్యం మాత్రమే కాదు. ఏం మాట్లాడాలో తెలియక మేము కాసేపు మౌనంగా ఉండిపోయాం.

“రామ్‌లాల్ గారూ, మీ అబ్బాయి సంగతులేంటి? పెళ్ళయిందా?” అని అడిగాను.

నాకేసి కొన్ని క్షణాలు తేరిపార చూసాడాయన. తన కొడుకు రామాపురంలో ఉండడంలేదని చెప్పాడు.

“ఇప్పుడన్నీ మారిపోయాయి. జనాలు ఇప్పుడు మేము కుట్టిన బట్టలు వేసుకోవడం లేదు. రామాపురంలోని కొత్త ప్రాంతాలలోని పెద్ద పెద్ద కొట్లు… బట్టల ఫాక్టరీల నుంచి నేరుగా కొనేసి రెడీమేడ్ దుస్తులను అమ్ముతున్నారు. జనాలు వాటినే వేసుకుంటున్నారు…”

ఆయన కొడుకు ఈ కొట్టుని కొన్నాళ్ళపాటు నడిపించి చూసాడట. చివరికి విసిగి వేసారి ఉద్యోగం కోసం దగ్గర్లోని నగరానికి వలస పోయాడట. కొన్నేళ్ళ తర్వాత తిరిగొచ్చి అతని భార్యని, పిల్లల్నీ కూడా తీసుకువెళ్ళిపోయాడట. ఈమధ్య కాలంలో వాళ్ళ రాకపోకలు బాగా తగ్గిపోయాయట. ఏడాదికో రెండేళ్ళకో వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుపుతూ, నగరంలో పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తూ ఓ ఉత్తరం వస్తుందట. తన కొడుకుతో ప్రస్తుతానికి రామ్‌లాల్‌కి ఉన్న సంబంధం ఉత్తరాల ద్వారానే.

మా మధ్య మళ్ళీ మౌనం. మా అబ్బాయి చిరాకు పడసాగాడు.

“మీరు ఇప్పటికీ బట్టలు కుట్టగలరా రామ్‌లాల్? మా అబ్బాయికి ఓ కోటు కుట్టిస్తారా?” ఉన్నట్టుండి అడిగాను.

నాకేసి ఆశ్చర్యంగా చూసాడాయన. బోసి నోటిపై చిన్న నవ్వు వెలసింది.

“బాబుకి కోటు కుట్టివ్వడమంటే నాకెంతో సంతోషం. కాని… నాకు వయసైపోయింది. మాలాంటి పాత తరం దర్జీలు కుట్టిన కోటు మీ వాడికి నచ్చుతుందో లేదో…” అన్నాడు సంశయంగా.

“అదేం లేదు రామ్‌లాల్ గారు. బావుంటుంది. నేను గుడ్డ ముక్క కొనుక్కుని వస్తాను. మీరెలా కుట్టినా మావాడు వేసుకుంటే బావుంటుంది..” అన్నాను బ్రతిమాలుతున్నట్లుగా.

మేము బయటకి నడిచాం. మా అబ్బాయి నాకేసి చూసి, “ఆయన కుట్టిన కోటు నేను వేసుకోను…” అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా.

“నాకు తెలుసు.. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు. నువ్వు వేసుకున్నా, వేసుకోక పోయినా… నీ కోసం ఆయన కోటు కుట్టాల్సిందే…” అంటూ మా అబ్బాయి చెయ్యి పట్టుకుని బుద్ధ బజారు నుంచి బయటకు వచ్చాను.

ఆంగ్ల మూలం: తులసి చరణ్ బిస్త్

తెలుగు: కొల్లూరి సోమ శంకర్

అంగ్లమూలం ‘Reminiscences’ అనే శీర్షికతో మ్యూజ్ ఇండియా.కామ్ అనే సాహిత్య వెబ్‌సైట్‍లో మే 2013 సంచికలో ప్రచురితం. మూల కథని ఈ లింక్ లో చదవవచ్చు:

http://www.museindia.com/regularcontent.asp?issid=49&id=4211

పలక కావాలి
కవిత తమ డాబా మీద కూర్చుని గచ్చు మీద చాక్‌పీసులతో ఏదేదో గీస్తోంది. బడిలో వాడి పాడేసిన చాక్‌పీస్‌లను ఏరుకుని జాగ్రత్తగా రుమాలులో చుట్టుకుని ఇంటికి తెచ్చుకుంటుంది కవిత. రెండు పిలకలున్న ఓ పాప బొమ్మ గీయడం ఇప్పుడే పూర్తి చేసింది. ఈ బొమ్మ తల మీద కూడా, సగటు భారతీయ విద్యార్థుల బుర్రల్లో తిరిగే అంకెలు, అక్షరాలు గుండ్రంగా తిరుగుతున్నాయి.

మావయ్య తమ ఇంటికి రావడం ఉన్నట్లుండి గమనించింది కవిత. చప్పట్లు కొడుతూ, గెంతడం ప్రారంభించింది. కవితా వాళ్ళదీ, మావయ్యదీ ఒకే ప్రహరీ గోడలో ఉండే రెండు వేర్వేరు ఇళ్ళు. కవితకీ, అక్కలకీ మావయ్య శాంతాక్లాజ్ వంటివాడు. ఎప్పుడూ ఏవో బహుమతులు, ఊహించని కానుకలు తెచ్చి ఆశ్చర్యపరుస్తుంటాడు. ఊరెళ్ళిన తమ శాంతాక్లాజ్ తిరిగొచ్చేసాడని అందరికి చెప్పడానికి గబగబా కిందకి పరిగెత్తింది కవిత.

ఆ సాయంత్రం కవిత టీ లో నంచుకుని బ్రెడ్ తింటూంటే మావయ్య కవిత వాళ్ళింటికి వచ్చాడు. హడావుడిగా బ్రెడ్‌ని టీ లో ముంచడంతో, అదేదో సైన్సు సంఘటనలా, టీ బల్ల మీద, కవిత గౌను మీద విరచిమ్మింది. బంకగా ఉన్న చేతులతోనూ, మరకలైన నోటితో అలాగే వెళ్ళి మావయ్య కాళ్ళకి నమస్కరించింది. మావయ్య పెద్దగా నవ్వేసి, కవిత భుజం తట్టాడు.

నలుగురు అక్కచెల్లెళ్ళు వరుసగా నిలబడి మావయ్య ఇచ్చే కానుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నట్లుండి కవిత దృష్టి మావయ్య సంచిలోని ఓ వస్తువుపై పడింది.. అంతే అక్కడ్నించి చూపు మరల్చుకోలేకపోయింది. తన కానుకల సంచీలో ఓ చక్కని నల్లని పలక తెచ్చాడు మావయ్య. దాన్ని ఎలాగైనా పొందాలని అనుకుంది కవిత. ఎప్పుడు రంగురంగుల గాజుల కోసం లేదా చెప్పుల కోసం పట్టుబట్టే కవితకి ఆ నల్ల పలకతో పోలిస్తే, అవెందుకు పనికిరావనిపించింది. ఆ పలకని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అని ఆలోచిస్తోంది.

ముందుగా పలక మీద అమ్మ పేరు రాసి, అమ్మకి చూపించాలనుకుంది. అమ్మకి చదువురాదు, ఎంత ఆనందిస్తుందో అనుకుంది. కాని ఇంతలోనే ఆ ఆలోచనను విరమించుకుంది. ఎందుకంటే, అమ్మ పేరు రాస్తే నాన్నకి అసూయ కలగొచ్చు, అందుకని ఆ ఆలోచనని విరమించుకుంది. తన పేరు రాసుకుని, తన పడుకునే మంచం పక్కన ఆ పలకని తగిలించుకోవాలనుకుంది. ఎన్నెన్నో ఆలోచనలు కవితని స్థిమితంగా ఉండనీయలేదు. చివరికి కుటుంబంలోని ఆరుగురు పేర్లూ రాసి, ఆ పలకని ఇంటి గడపకి తగిలిద్దాం అనుకుంది.

ఇలా కవిత ఊహల్లో తేలిపోతుండగా, మావయ్య తను తెచ్చిన కానుకలు పంచడం మొదలెట్టాడు. “మావయ్య పలకని పెద్ద అక్కకి ఇచ్చేస్తే…? అయినా అక్కకి నేనంటే ఎంతో ఇష్టం.. నేను వాడుకుంటానంటే కాదనదు…” అనుకుంది కవిత. “అమ్మో…అప్పుడు నేను అక్క చెప్పినట్లు వినాలి… రోజూ పొద్దున్నే లేవాలి… శుభ్రంగా ఉండాలి… అమ్మో చాలా షరతులు పెడుతుందక్క…” అనుకుంది. కానీ మావయ్య ఓ ఆకుపచ్చని, చమ్కీల చున్నీ తీసి కవిత పెద్దక్క చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి మురిసిపోయింది. మిగతా వాళ్ళిద్దరూ అసూయపడ్డారు… కవిత మాత్రం ఎంతో సంతోషించింది.

ఇక రెండో అక్క వంతు. ఈ అక్క అంటే కవితకి పడదు. ఇద్దరికీ ఎప్పుడూ గొడవలే.. నిన్న రాత్రి కూడా ఇద్దరికీ తగవయితే, కవిత అక్కని గోళ్ళతో రక్కింది. ఈ అక్కతో సామరస్యం సమస్యే లేదు. పలకని కవితకి ఇవ్వనే ఇవ్వదు. పైగా వెక్కిరిస్తుంది కూడా. కవిత దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏం చేసైనా సరే, ఆ పలకని సొంతం చేసుకోవాలనుకుంది కవిత. అయితే మావయ్య రెండో అక్క చేతిలో రంగురంగుల గాజుల సెట్‌ని ఉంచడంతో కవిత ఊహల్లోంచి బయటపడింది. కవితకి గాజులంటే ఇష్టమని తెలిసిన రెండో అక్క, కవితకేసి గర్వంగా చూసింది. అయితే కవిత కళ్ళలోని మెరుపు ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.

ఇంకొక్క అడ్డంకి మిగిలి ఉంది అంతే… మూడో అక్క కూడా కవిత తరగతే. ఇద్దరికీ పలక అవసరం ఉంది. తన ఆలోచనలను రాసుకోడానికి అవకాశాలు తక్కువే అయినా, కవితకీ పలక కావాలి… హృదయం రాజీ పడలేకపోతోంది. సీతాకోకచిలుక బొమ్మలున్న చెప్పుల జతని మావయ్య మూడో అక్క చేతిలో పెడుతుండడం చూసిన కవిత మనసు గాల్లో తేలిపోయింది. పెదాలపై చిరునవ్వు వెలిసింది. ‘ఇక పలక నాదే, ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు’ అనుకుంది. ‘పగలంతా ఇంటికి నామఫలకంలా ఉంటుంది, రాత్రి నా పలకగా మారిపోతుంది… లెక్కలు చేస్తాను, బొమ్మలేస్తాను, ఏమైనా చేసుకుంటాను…’ అనుకుంది. ‘దాన్ని ఎవరితోనూ పంచుకోను. తడిగుడ్డతో జాగ్రత్తగా తుడుస్తూంటాను…’ అనుకుంది.

కానీ కవిత అంచనా దారుణంగా తప్పిపోయింది. మావయ్య కవితకి రిబ్బన్ల సెట్ ఇచ్చాడు. అందులో రంగురంగుల రిబ్బన్లు పన్నెండున్నాయి. వేసుకున్న గౌను రంగుల్ని బట్టి దానికి నప్పే రిబ్బన్లు జడకి పెట్టుకోవచ్చు. అక్కలెవరికీ అన్ని రిబ్బన్లు లేనేలేవు. సంతోషించడానికి ఎన్నో ఉన్నాయి, కాని కవిత ఆనందంగా లేదు. కలవరపడింది. పలక ఇంకా మావయ్య సంచీలోనే ఉంది, మావయ్య ఇప్పుడు శాంతాక్లాజ్‌లా అనిపించడం లేదు. కవిత వాళ్ళమ్మ ఇచ్చిన టీ ఆఖరి గుక్క తాగుతూ, “అక్కా, చూసావా, ఈ పలకని నేను మా అమ్మాయి కోసం తెచ్చాను. కాని రాత్రి ఇవ్వడం మరిచిపోయాను. అడగాలని దానికీ తోచలేదు… అయినా ఈ కాలం పిల్లలకి ఆటవస్తువులిస్తే ఎంతో సంతోషిస్తారు… పలక, పుస్తకాలు, పెన్నుల వంటి వాటి విలువ తెలుసుకోలేరు…” అన్నాడు.

కవిత వాళ్ళమ్మ తలూపి, తమ్ముడికి వీడ్కోలు పలికింది. మావయ్య వెళ్ళిపోయడు. కవిత కన్నీరుమున్నీరయింది. ఓ నీటి చుక్క కవిత కంటి నుండి జారి నేలరాలింది. వెక్కిళ్ళు పెడుతూ, గబగబా మేడ మీదకి పరిగెత్తి, అంతకు ముందు తాను గీసిన రెండు పిలకల పాప బొమ్మ కళ్ళనుండి కారుతున్నట్లుగా నీటి బొట్లని గీసింది కవిత.

ఆంగ్లం: శతాక్షి ఆనంద్

తెలుగు: కొల్లూరి సోమ శంకర్

మూలకథ “Black and Dull Slate” అనే పేరుతో ఇండస్ ఉమన్ రైటింగ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ లో ప్రచురితమయ్యింది.

మూలకథని ఈ లింక్‌లో చదవవచ్చు. http://www.induswomanwriting.com/black-and-dull-slate.html

తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువ. – సోమ శంకర్
అనువాదం చేయడమంటే చేతిలో కర్రకు బదులు మూల కథను ఒకచేతిలో అనువాద కథను మరో చేతిలో పట్టుకుని తీగమీద నడవడం. విభిన్న శైలులతో ఉండే కధలను ఆయా మూలకథల ఆత్మ ఏమాత్రం ధ్వంసం కాకుండా తెలుగు భాషలోకి అనువదించటం నిజంగా కత్తిమీద నడవడం లాంటిదే! అలాంటి అనువాదాలు ఒక్కటి కాదు రెండు కాదు.. పూర్తిగా నూరు కథలను తెలుగులోకి అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ వాకిలి ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ:

1. సోమ శంకర్ గారు, ముందుగా మీకు వంద కథల అనువాదం పూర్తయిన సందర్భంగా అభినందనలు!

థాంక్యూ. నమస్కారం. ముందుగా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నా వందో అనువాద కథను ప్రచురిస్తున్నందుకు వాకిలి బృందానికి ధన్యవాదాలు.

2. ఏ భాష నుండి ఎక్కువ కథలు అనువదించారు. ఎందువల్ల?

ఇంగ్లీషు నుంచి 75 కథలు, హిందీ నుంచి 21 కథలు అనువదించాను. ఇంగ్లీషు నుంచి అనువదించిన కథల్లో ఇతర భారతీయ భాషలవీ, విదేశీ భాషలవీ కూడా ఉన్నాయి. తెలుగు నుంచి హిందీలోకి 4 కథలని అనువదించాను.

ఇంగ్లీషు నుంచే ఎక్కువగా ఎందుకు అంటే.. ఇంటర్‌నెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నవి ఆంగ్ల సాహిత్యపు వెబ్‌జైన్లే. ఇంటర్‌నెట్ కూడా ఎక్కువగా ఆంగ్ల మాధ్యమం ద్వారా ఉపయోగించబడుతుండడంతో, తమ రచనలను వెబ్‌లో ప్రచురించుకోడం కోసం ఆంగ్లంలో రాస్తున్నారు. భారతీయ భాషా రచయితలు కూడా తమ కథలని ఇంగ్లీషులో రాయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా అంటే యూనికోడ్ అభివృద్ధి చెందిన తర్వాత భారతీయ భాషలలోనూ అనేక వెబ్‌జైన్లు వస్తున్నా… ఆయా భారతీయ భాషలలో రాసిన కథలు.. ఆ భాష తెలిసిన వాళ్ళకే పరిమితం అవుతాయి. అదే ఇంగ్లీష్ అయితే ఏ ప్రాంతపు లేదా విదేశీ కథలనైనా చదువుకోగలం.

3. అసలెలా కలిగింది ఈ ఆసక్తి. ఎప్పటినుండి? మొదటి అనువాద కథ గురించి అప్పటి ఇబ్బందులు, అనుభవాల గురించి?

చిన్నప్పటి నుంచి బాగా చదివే అలవాటు.. బాల్యంలో చందమామ, బాలమిత్రల నుంచి… కాలేజీ రోజులలో వారపత్రికలు, నవలలు చదవడం వరకు ఆ అలవాటు పోలేదు.

1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం. అనువాదాల కన్నా ముందుగా, సెప్టెంబర్ 1998 నుంచి ఫిబ్రవరి 1999 వరకు Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్‌నెస్” అనే శీర్షిక నిర్వహించాను. ఈ ఫీచర్ అచ్చవడంతో నా మీద నాకు ధైర్యం ఏర్పడింది. నా మొదటి అనువాద కథ కన్నా ముందే నేను రాసిన సొంత కథలు రెండు ప్రచురితమయ్యాయి. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది. దీనికి మూలం “ది లెర్నింగ్ స్టాంప్” అనే అమెరికన్ కథ. ఆ కథలో ప్రస్తావించిన Mustang కారుని నేను పొరపాటుగా ముస్తాంగ్ అని రాసాను. కాని దాన్ని మస్టాంగ్ అనాలని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ కథలో ఓ కుర్రాడు తనకి బాగా ఇష్టమైన ఓ పాతకారుని బాగు చేయించుకోవాలనుకుంటాడు. దాని రిపేర్‌కి అయ్యే డబ్బులు అతని దగ్గర ఉండవు. ఆ గారేజ్ లోనే పార్ట్ టైం పని చేసి, కారుని బాగు చేయించుకుంటాడు. మనిషిని బాహ్యంగా అంచనా వేసేకన్నా, అతడి ప్రవర్తన, నడవడి ద్వారా అతడిని గురించి తెలుసుకోవాలని, అలా అర్థం చేసుకుంటూ, ఎదుటివారికి మనమూ సాయం చేసి, మానవత్వపు పరిమళాన్ని మనమూ కాస్త అంటిచ్చుకోవచ్చని ఈ కథ చెబుతుంది. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించడం కాదు, చేసే ఏ పనైనా నిజాయితీగా చేసి సక్రమ పద్దతిలో డబ్బు సంపాదించాలని ఈ కథ చెబుతుంది. పనిచేసే చోట తమ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించకుండా, పనిని ఏకాగ్రతతో చేయాలని ఈ కథ సూచిస్తుంది.

అయితే నేను మనసులో భావించినంత స్పష్టంగా ఈ కథని అనువదించలేకపోయాను. బహుశా అమెరికా పని సంస్కృతితో అప్పటివరకూ పరిచయం లేకపోవడం, సరైన పరిశోధన చేయకపోవడం కారణం కావచ్చు. నాకు నచ్చిన కథని, తొందరగా తోటి పాఠకులతో పంచేసుకోవాలన్న తపన, అచ్చులో నా పేరు చూసుకోవాలన్న ఆతృత… ఇవన్నీ ఆ కథలో కొంత అస్పష్టతకి తావిచ్చాయి. ఒక కథని చదవగానే బాగుందనిపిస్తుంది. వెంటనే అనువాదానికి పూనుకోకుండా, రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చదివితే, ఇంకో కోణంలో అర్థమవుతుందా కథ. నా మొదటి రెండు మూడు అనువాదాలలో ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదు.

4. అనువదించేటప్పుడు బాగ సులభంగా అయిపోయే పని, చాల కష్టంగా అయ్యే పనీ ఏంటి. అసలెలా చేస్తారు? అంటే ప్రతీ వాక్యాన్ని తిరగరాయడం, లేక సారాంశం రాసుకుని స్వేచ్ఛగా అనువదించడం.

అనువదించేడప్పుడు బాగా సులువుగా అయిపోయేది తెలుగులో రాయడమే. కథని చదువుతున్నప్పుడే, అది తెలుగులో ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తాను. అలా చదువుకోడమే నాకు మొదట్నించి అలవాటు. అనువదించాలని నిర్ణయించుకుని, రచయిత అనుమతి తీసుకునే నాటికి ఆ కథని ఎలా రాయాలన్నదానిపై ఒక స్పష్టత వచ్చేస్తుంది. కష్టంగా అయ్యేదీ అంటే… ఆ కథలో ఏదైనా అంతరార్థం ఉందా? పాత్రలు ఏవైనా అవ్యక్తంగా చెబుతున్నాయా? జాగ్రత్తగా చదివితే గాని స్ఫురించని విశేషాలు!

వీలైనంత వరకూ మూలాన్ని యథాతథంగానే రాస్తాను. ప్రతీ వ్యాక్యాన్ని తిరగరాస్తాను, అవసరమైన చోట్ల స్వేచ్ఛగా అనువదిస్తాను. తెలుగులో చదివితే, అనువాదం అనిపించేలా కాకుండా, తెలుగు కథనే చదువుతున్న అనుభూతి కలిగేలా వీలైనంత వరకూ జాగ్రత్తపడతాను.

5. ఏ భాష కథనైనా ఇంగ్లీష్ నుండే తీసుకుంటారా? నేరుగా చదివి అర్థం చేసుకోగల భాషలేంటి? అలా నేరుగా చదవగల ఇతర భాషలుంటే వాటి సాహిత్యంలో మీకు రుచించే ప్రత్యేకతలేంటి? (భాషాపరంగా, అభివ్యక్తి పరంగా)

తెలుగు కాకుండా నాకు చదవడం రాయడం వచ్చినవి హిందీ, ఇంగ్లీషు మాత్రమే. కాబట్టి ఆ రెండు భాషల నుంచే అనువాదాలకి తీసుకుంటాను. హిందీలో భాషా ప్రవీణ పాసయ్యాను. హిందీ పేరుకి ఒకటే భాష అయినా, ఒక్కో ఉత్తరాది రాష్ట్రానిదీ ఒక్కో మాండలీకం. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అవధీ, బ్రజ్, కన్నౌజీ, బగేలీ.. ఇలా పలురకాల హిందీ ఉంది.

భాషాపరంగా, అభివ్యక్తి పరంగా ఆయా సాహిత్యాలలోని ప్రత్యేకతలను విశేషంగా చెప్పలేను. తెలుగులో వస్తున్నట్లే, హిందీలోనూ జండర్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్.. లాంటి వస్తువులతో కథలొస్తున్నాయి. మీరడిగిన కోణంలోకి వస్తుందో రాదో కాని, నేను బాగా గమనించిన విషయం ఒకటుంది – హిందీలో నగరం/పట్టణాల నేపథ్యం కంటే గ్రామీణ నేపథ్యం కథలు ఎక్కువగా ఉన్నాయి.

నా అనువాదాలకి నేను అనుభూతి ప్రధానమైన కథలను ఎన్నుకున్నాను, మనసుకి తాకే ఇతివృత్తాలను ఎంచుకున్నాను.

6. పదాల అర్థాలకి డిక్షనరీలుంటాయి. కానీ కొన్ని ప్రాంతాలకి మాత్రమే తెలిసే ప్రత్యేకమైన వాడుకలు, నుడికారాలు, జాతీయాలను గమనించడం వాటికి సరైన తెలుగు భావం తీసుకురావడం గురించి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా?

నిఘంటువులు చెప్పని అర్థాలున్న వాడుకలు/ప్రయోగాలు/నుడికారాలు/జాతీయతల గురించి తెలుసుకోడానికి ఇంటర్‌నెట్‌నే ఎక్కువగా ఆశ్రయించేవాడిని. ఇంటర్‌నెట్‌లో సమాచారం దొరకనప్పుడు నా హిందీ స్నేహితులని సంప్రదించేవాడిని, మరీ అవసరమైతే మూల రచయితనీ అడిగేవాడిని. ఆయా వాడుకలు/ప్రయోగాలు/నుడికారాలు/జాతీయతలకు ఒక్కోసారి సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతూంటాయి. కాబట్టి మూల కథలో ఏ సెన్స్‌తో ఉపయోగించారో తెలుగులో కూడా అదే విధంగా ప్రయోగించాలి. అటువంటి అర్థమిచ్చే తెలుగు నుడికారాలు, పలుకుబడులు ఉంటే అవే ఉపయోగిస్తాను. లేదా ఆ సందర్భానికి తగినట్లుగా ఆ వాక్యలను సమ్మరైజ్ చేయడమో లేదా అర్థం స్ఫురించేడట్లు తెలుగులో రాయడమో చేసేవాడిని.

ఇటీవలే అనువదించిన ఓ హిందీ కథలో ఉర్దూ సామెత ఒకటి ఉపయోగించారు రచయిత్రి. ना खुदा ही मिला ना विसाले सनम ना इधर के रहे ना.. అనే ఆ ప్రయోగం సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. “I found neither faith, nor union with my lover/And now I belong neither there nor here” అని సాధారణ అర్థం. కొంతమంది సనమ్ అనే పదానికి ప్రియురాలు/దేవీప్రతిమ అనే అర్థాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కథలో అవేవీ సరైనవి కావనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా “పరమూ పోయిందీ, ఇహమూ పోయింది. అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను” అని రాసాను.

అలాగే, నేను అనువదించిన ఓ విదేశీకథలో (“ఏడు గంటల వార్తలు”, ఈమాట జూలై 2009) వేరే దేశంలో పర్యటిస్తున్న నెరేటర్ కుటుంబం వెడుతున్న కారుని వెతకడానికి సైనికులు ఆపుతారు. ఓ సైనికుడు అంటాడు “I’ll need to look in the boot.” అని. దీన్ని నేను పొరపాటుగా అర్థం చేసుకుని కాలికి ధరించే బూట్లుని వెతకాలి అన్నట్లు రాసాను. అయితే, ఎడిటర్ గారు నాకు మెయిల్ చేసారు, బూట్ అంటే కారు డిక్కీ అనే informal meaning ఉందనీ, ఆ సందర్భంలో వాడాల్సిన పదం అదేనని. వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అనుభవం దృష్ట్యా, ఇలాంటి ప్రయోగాలు కథానుగుణంగా వచ్చినప్పుడు వాటికున్న అన్ని రకలా అర్థాలు తెలుసుకుని, సరైన అర్థం ఉపయోగించడం నేర్చుకున్నాను.

ఇటువంటి సమస్యే నాకు తెలుగులో కన్నా, హిందీలో బాగా ఎక్కువగా ఎదురైంది. శ్రీ కె.వి. నరేందర్ గారి కథ “చీపురు”ని నేను హిందీలోకి అనువదించేడప్పుడు.. కొన్ని వాక్యాలను హిందీలో యథాతథంగా రాయలేకపోయాను. ముఖ్యంగా “తల్లిలేని కోడిపిల్లలు వడ్ల గింజల కోసం దుమ్ము లేపుతున్నట్లు….” ఈ వాక్యం హిందీలోకి తర్జుమా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఈ అర్థం రావడానికి చాలా పెద్ద వాక్యం రాయల్సొచ్చింది.

7. ఏ రచయిత కథల మీద ఎక్కువ పని చేశారు? ఎందుకు?

మలయాళ రచయిత శ్రీ ఎం.కె. చాంద్‌రాజ్ గారి ఆరు కథలను తెలుగులోకి అనువదించాను. అలాగే హిందీ నుంచి శ్రీ జైనందన్ కుమార్. వీరివి మూడు కథలు అనువదించాను. మా భావాలు బాగా కలిసాయి. వీరు ఎంచుకునే కథాంశాలు నాకు బాగా నచ్చుతాయి. ఈ కథలన్ని నా ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నవే. నేను నా సొంతంగా రాస్తే ఎలాంటి కథ రాస్తానో, అలాంటి కథలనే వీళ్ళూ రాసారు. వ్యక్తిగత సమస్యలూ, సామాజికాంశాలను మిళితం చేస్తూ, కథా రూపంలో చెప్పడం వీరి ప్రత్యేకత. వీళ్ళ కథలని చదువుతున్నప్పడు అవి ఏదో పరాయి భాష కథల్లా అనిపించవు. మన కథలనే, మరో భాషలో చెబుతున్నారనిపిస్తుంది.

రాజారాం బాలాజీ అని తమిళనాడుకి చెందిన రచయిత ఆంగ్లకథలని అయిదు అనువదించాను. ఈయన కథల్లో అంతర్లీనంగా వ్యంగ్యం ఉంటుంది, మధ్య తరగతి మనుషులని ప్రభావితం చేస్తున్న మార్కెట్ మాయాజాలంపై అధిక్షేప ధోరణిలో చెణుకులు వేస్తారు.

8. కథల అనుమతుల కోసం, సందేహ నివృత్తి కోసం మూల రచయితలతో మాట్లాడ్దం వల్ల కథ కంటే ఎక్కువ విషయాలు తెలిసినవి, బాగా గుర్తున్నవీ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

నేను ఎక్కువగా సమకాలీన రచయిత కథలు అనువదిస్తాను కాబట్టి, రచయితలతో ఈ-మెయిల్‌లో సంప్రదిస్తూంటాను. ఒక్కోసారి కథకన్నా, ఆ కథకి నేపథ్యం తెలుసుకోడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగులో అమృతవర్షిణి అనే పేరుతో నేను అనువదించిన కథకి సంబంధించిన నేపథ్యం గురించి, రచయిత శ్రీ ఎం.కె. చాంద్‌రాజ్ గారిని సంప్రదించడం వల్ల కొన్ని విషయాలు తెలిసాయి. కేరళలో ఎండోసల్ఫాన్‌ని విచక్షణా రహితంగా వాడడం వల్ల పిల్లలు జన్యులోపాలతో పుట్టడం, ఎదిగిన పిల్లలు హఠాత్తుగా పక్షవాతానికి లోనవడం వంటి సంఘటనల గురించి తెలుసుకున్నాను. కథకి ప్రత్యక్ష్యంగా సంబంధంలేకపోయినా, ఆయన కొన్ని స్టాటిస్టిక్స్ పంపించారు. వాటిని పరిశీలిస్తే, ప్రమాదకరమైన రసాయనాలను నిషేధించడంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో అర్థమైంది. అలాగే ఆయన రాసినదే మరో కథ చదివినప్పుడు… (ఈ కథని తెలుగులోకి అనువదించలేదనుకోండి.. అది వేరే విషయం), ఆ కథకి సంబంధించిన నేపథ్య సమాచారం సాప్ట్ డ్రింక్స్ తయారీలో మంచి నీటి వాడకం గురించి, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం గురించి తెలిసింది. ఈ సమాచారాన్ని నా సొంత కథలో కాస్త ఉపయోగించాను.

9. ఇతర భారతీయ భాషలు మాత్రమేనా, విదేశీ కథలు కూడా చేశారా? ఈ రెండిటి మధ్యా ఇతివృత్తాల పరంగా, వ్యక్తీకరణ, శైలి పరంగా మీకనిపించిన తేడాలేంటి?

ఇందాక చెప్పినట్లు, నా మొదటి అనువాద కథే విదేశీ కథ. మొత్తం 12 విదేశీ కథలను అనువదించాను. ఇందులో 4 కథలు యుద్ధం/తీవ్రవాదం నేపథ్యంలో ఉంటాయి. 2 కథలు మానవత్వంపై; గాంధీ గారి గురించి ఒక కథ; అమెరికన్ సివిల్ వార్ గురించి ఓ కథ; అమెరికాలోని వర్ణవివక్షపై ఓ కథ; వాన దొంగ, విషవలయం కథలు మానసిక విశ్లేషణలపైన ఉన్నాయి. విదేశీ కథల ఇతివృత్తాలూ, మన ఇతివృత్తాలకీ మూలం ఆయా దేశాలలోని సామాజిక, వ్యక్తిగత సమస్యలే అయినా, మన కథలకి భౌగోళిక పరిమితులుంటే… విదేశీ కథలకి ఆ పరిమితి ఉన్నట్లు అనిపించదు. విదేశీ కథలలో, మన కథలతో పోలిస్తే, నాటకీయత తక్కువగా ఉంటుంది.

10. సమకాలీన కథల్నే ఎక్కువగా ఎంచుకుంటారు కదా? గత పదిపదిహేనేళ్లలో తెలుగు కథలకి ఇతర భాషా కథలకి మీరు గమనించిన తేడాలేంటి?

నేను అకడమిక్ దృష్టితో పరిశీలించకపోయినా, అనువాదాల కోసం కథలు ఎక్కువగానే చదువుతాను. నేను గమనించినదేంటంటే.. తెలుగులో వస్తున్నట్లే, ఇతర భాషలలోనూ జండర్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్.. లాంటి వస్తువులతో కథలొస్తున్నాయి. గత అయిదారేళ్ళుగా తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల్లోనూ ఈ ధోరణి ఉన్నా, తెలుగులో చాలా ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే కథల్లో స్థానికత చోటు చేసుకోడం తెలుగులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతుంది. హిందీ కథల్లో వ్యంగ్యానికి మంచి ఆదరణ ఉంది, వ్యంగ్య రచనలు బాగా ప్రచురితమవుతాయి. మన దగ్గర వ్యంగ్య కథలకి ఆదరణ తక్కువేమో అనిపిస్తుంది. వ్యంగ్యం ఉన్నా అది రాజకీయాలకు, సినిమాలకే పరిమితమైపోయింది.

11. నవల్లేవీ అనువదించలేదా? అలా చెయ్యాలనిపించిన నవల్లేమైనా ఉన్నాయా?

అనువదించాను. 1999లో “The Adventures of Pinocchio” అనే పిల్లల నవలని చదివిన తర్వాత, ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. ఆ పుస్తకం ప్రచురణకర్తలను సంప్రదిస్తే, అది కాపీరైట్ పరిధిలో లేదని, తెలుగులోకి అనువదించుకోవచ్చని తెలిపారు. ఆ పిల్లల నవలని. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.

వర్ధమాన రచయిత శ్రీ వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన Warp and Weft అనే నవలని తెలుగులోకి “నారాయణీయం” అనే పేరుతో అనువదించాను. ఈ నవల కినిగెలో లభిస్తుంది. తెలుగు అనువాదానికి రాసిన ముందుమాటలో “అనువాదకుడి గురిచి చెప్పకుండా ముగిస్తే అది అతడికి అన్యాయం చెయ్యటమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే: చెప్తే తప్ప ఇది అనువాదం అని తెలీదు. అంత బాగా వ్రాసాడు.” అన్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అభిమాన రచయిత నుంచి ఓ చిరు ప్రశంస అందుకోడం మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ అనువాదంలో రచయితకి సహకరిస్తున్నాను.

చేతన్ భగత్ నవల “ఫైవ్ పాయింట్ సమ్‌ఒన్” చదివినప్పుడు దాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుందనిపించింది. కాని నేను రచయితని సంప్రదించేసరికే తెలుగు అనువాదం సిద్ధమైపోయిందని తెలిసింది.

12. మీ సొంత కథల గురించి చెప్పండి?

చాలా తక్కువే రాసాను. పిల్లల కథలతో కలుపుకుంటే సుమారుగా నలభై ఉంటాయోమే. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను. అది నా బలహీనత.

13. అనువాదం మొదలెట్టి చెయ్యలేక వదిలేసినవి ఉన్నాయా? ఎందుకు ఆగిపోయాయి?

లేవు. కమర్షియల్ పబ్లిషర్ల కోసం అనువాదాలు చేయడం మొదలుపెట్టినప్పుడు – నాకొచ్చిన మొదటి పుస్తకమే చాలా కష్టమైన పుస్తకం. అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నా, ఆపేయలేదు. అలాగే అమర్త్యసేన్ గారి “The Idea of Justice”ని ఎమెస్కో బుక్స్ కోసం అనువదించినప్పుడు కూడా కొంత ఇబ్బందిపడ్డాను. కానీ పూర్తి చేయగలిగాను. కాకపోతే, అనివార్య కారణాల వల్ల ఈ అనువాదం ఇంకా ప్రచురితమవలేదు.

దాని తర్వాత ఇంకో నాలుగు నాన్ ఫిక్షన్ అనువాదాలు చేసాను.

14. ముందు ముందు రాయలనుకున్నవి, అనువదించాలనుకున్నవి ఏమైనా ఉన్నాయా?

ప్రస్తుతానిని ఏమీ అనుకోవడం లేదు. అయినా వంద కథల అనువాదాలు పూర్తయ్యాక, నా సొంత నవల ఒకటి రాద్దామని ఆలోచన. నవలకి కావల్సిన బాక్‌గ్రౌండ్ సమాచారం సేకరించాను. పాత్రల స్వభావ చిత్రణ కూడా సిద్ధం చేసుకున్నాను.

15. మీరు రాసిన అనువదించిన కథల్లో మీకు బాగా ఇష్టమైనది? బెస్ట్ అనిపించేది ఏది?

నేను అనువదించిన కథల్లో నాకు బాగా నచ్చినది – “ఓ మనిషీ, ఎందుకిలా?” అనే కథ. తర్వాతి రెండు స్థానాల్లో “అమ్రికావాలా”, ” బొమ్మ” కథలు.

నా సొంత కథల్లో ” దేవుడికి సాయం”, “ముసుగు వేయద్దు మనసు మీద” కథలు నాకు నచ్చుతాయి.

ఓ అనువాదకుడిగా ఇతరుల కథలను అనువాదం చేయడం నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తే, నా కథలను వేరే రచయితలు అనువాదానికి ఎంచుకోడం గొప్ప అనుభూతి. నా కథ “పాపులర్ సుబ్బారావ్”ని అదే పేరుతో కన్నడంలోకి అనువదించారు సుప్రసిద్ధ కన్నడ మాసపత్రిక “ఉత్థాన” సంపాదకులు. నేను ఆంగ్లానువాదం ద్వారా తెలుగులోకి “బొమ్మ” పేరిట అనువదించిన తమిళ కథ “టెడ్డీబేర్”ని, నా తెలుగు అనువాదం ఆధారంగా “టెడ్డీబేర్” పేరుతో కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.

సాహితీయాత్రలో ఓ చిన్న మైలురాయిని దాటిన ఈ సందర్భంగా, తమ కథలను తెలుగులోకి అనువదించేందుకు అనుమతించిన మూల రచయిత/త్రులకు, ఆయా కథలను ప్రచురించిన పత్రికలకు, వాటిని చదివి ప్రోత్సహించిన పాఠకులకు, సాహితీ మిత్రులకు నా కృతజ్ఞతలు.

ఆదానప్రదానాలు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయని విశ్వసిస్తూ…. సెలవు తీసుకుంటున్నాను.

సోమ శంకర్ గారి నూరవ అనువాద కథ “పలక కావాలి” ఈ నెల వాకిలిలో చదవండి!