వాకిలి » గోపి గారపాటి

అనుభవం
నన్ను మోసం చేసిన వాడు

నా వెనకే ఉన్నాడు.

నేను మోసం చేయబోయేవాడు

నా పక్కనే ఉన్నాడు.

నేను సాయం చేసిన వాడి మొహం

ఇప్పుడు నాకు గుర్తు లేదు.

ఒకప్పుడు నాకు మంచి చేసిన వాడు

ఎక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలీదు.

నేను ప్రేమించిన సముద్రం

నన్ను తనలో కలుపుకోవటానికి

ముందుకొచ్చినప్పుడు

నేను భయపడి పారిపోయాను.

నన్ను ద్వేషించే మనిషితో

దెబ్బలాడి, దెబ్బలాడి

చివరికి నన్ను నేను కోల్పోయాను.

చీకట్లో దేన్నో గుద్దుకుని

పడిపోయినప్పుడు నా నెత్తి మీద

నక్షత్రాలు నవ్వుకోవటం తెలిసినా,

ఏమీ ఎరగనట్టు ముందుకెళ్ళిపోయాను.

అన్నీ అనుకోనివి జరుగుతున్నప్పుడు

కష్టపడి నన్ను నేను

తలకిందులుగా నిలబెట్టుకుంటాను.

నేను ఇదివరకటి మనిషిని

కాదన్న విషయం అప్పుడప్పుడూ

గుర్తుకొచ్చినా, పట్టించుకోవటం

ఎప్పుడో మానేశాను.

గతాన్ని ఏమార్చి,

వర్తమానాన్ని బతిమాలి,

భవిష్యత్తుని బాగు చేసుకోవటం

ఎలాగో నేర్చుకున్నాను.

నేను దాచుకుని విసిరేసిన పాత చెప్పులు,

టిక్కెట్టు తీసుకోవటం ఎగ్గొట్టిన సిటీ బస్సు,

నేను తిట్టుకునే నా పాత స్నేహితులు.

ఇప్పటికీ, అవసరమనుకున్నప్పుడు

ఒక కాలు లేదని అబధ్ధం చెప్పి

బిచ్చమెత్తుకుంటాను.

నేను చెప్పేది అబధ్ధమని

నీకు తెలుసన్న విషయం

నాకు తెలసని నీకు తెలిసిపోయాక,

ఇంక బతక నేర్చిన మనిషిలా మారిపోయాను.

ఎప్పటికప్పుడు ఎవడో ఒకడి

చొక్కా పట్టుకుని ఇక్కడిదాకా వచ్చేశాక,

ఎలాగూ వెనక్కి వెళ్ళలేను.

నేను
నేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ

ఒక గుప్పెడు నిప్పు కణికలని

గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ

ఊపిరి గాలికి రెపరెపలాడే

ధిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.

నా జ్ఞాన తృష్ణకి అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి

దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ మాంస ఖండాన్ని.

సిద్ధాంతాన్ని

సిద్ధాంతాల రాద్ధాంతాన్ని

రాద్ధాంతాల యుద్ధాన్ని

యుద్ధానికి, యుద్ధానికి మధ్య నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్దాన్ని.

మంచి, చెడుల మధ్య

పెనుగులాడే లోలకాన్ని

ఆలోచనల అల్లకల్లోలాన్ని

నాదాన్ని, నినాదాన్ని

వాదాన్ని, మౌన ప్రబోధాన్ని.

బలవంతుడి చుట్టూ తిరిగే ఉపగ్రహాన్ని.

బలహీనుడిని చుట్టూ తిప్పుకునే మరో గ్రహాన్ని.

నేను ఓంకారాన్ని

అహంకారాన్ని

అధికారాన్ని, దర్పాన్ని.

భయంతో బుసలు కొట్టే విషసర్పాన్ని.

శబ్దానికి, శబ్దానికి మధ్య నిశ్శబ్దాన్ని

నిశ్శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య వాయిద్యాన్ని.

రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని

రాజ్యాధికార వ్యతిరేక ఆయుధాన్ని

అవమానానికి పుట్టిన ఇతిహాసాన్ని.

నిత్య అసంతృప్తుడిని

అరిషడ్వర్గాలకి ఆప్తుడిని

రాగ ద్వేషాల రాక్షసుడిని

అప్పుడప్పుడూ గుండె చప్పుడుని.

నేను ధన ఇంధన, దైనందిన జీవిత చలనాన్ని.

మహా ప్రళయాన్ని

చావు తప్పదని తెలిసీ, పోరాడే సైనికుడిని.

నా పూర్వీకుల నిశ్చితాభిప్రాయాల

భారాన్ని మోయటానికి

నియమించబడ్డ జీతగాడిని.

ఆశయాన్ని, సంశయాన్ని.

వివాదాన్ని, ఉన్మాదాన్ని.

శృంఖలాన్ని, విశృంఖలత్వాన్ని.

బానిసత్వాన్ని, అశాశ్వత సత్యాన్ని.

రహస్య రంగస్థల నట విరాట్ స్వరూపాన్ని.

ఇంతా చేసి నా పవిత్రమయిన

ఆత్మని హత్య చేయటానికే ఇక్కడికొచ్చానని

తెలుసుకోలేని అల్ప జ్ఞానిని.

వచ్చిన పని మర్చిపోయి, “పిడికెడు మెతుకుల

ముందు తల వంచ”మనే శాపగ్రస్త జీవనాన్ని.

స్వల్ప కాల విస్ఫోటనాన్ని.

Art Credit: Etch-a-sketch Drawing – Abstract Postmodernist Man by Jonathan Harnisch

ఇక్కడ
ఇక్కడ, బుర్రలకి చిల్లులు పడి

నీరుగారిపోయిన మనుషులు

కిటికీ దగ్గర పావురాల్లా మూలుగుతున్నారు.

ఇక్కడ, ‘ఆత్మ విశ్వాసం’ కోసం

ఆత్మలను అమ్ముకున్న బుధ్ధిమంతులు

నడి వీధిలో ఒళ్ళు విరుచుకుని నించున్నారు.

ఇక్కడ, పగలు చేసిన పాపాలను

రాత్రి కప్పుకు పడుకుని

ఒక కన్ను తెరిచి నిద్ర పోతున్న రహస్య మానవులు

వెన్నెల రాత్రులను వ్యర్ధం చేస్తున్నారు.

నిజం నడ్డి విరిచి, ప్రపంచానికి

కుంటి నడక నేర్పిన అవకాశవాదుల స్తోత్ర పాఠాలు

ఇక్కడ, నిత్య పారాయణాలు.

లోకమే ఒక బలిపీఠం.

జీవితం, చేయక తప్పని నేరం.

ఇది యుగయుగాల నరమేధం.

అయినా ఇక్కడంతా, నిత్యనూతనం.

బాగున్నదానిని చెడగొట్టటం.

చెడిపోయిన దానిని బాగు చెయ్యటం.

ఇక్కడ, మన కాలక్షేపం.

ఇది నీకూ నాకూ

మధ్య జరుగుతున్న ఘర్షణ కాదు.

నీ ప్రపంచానికి నా ప్రపంచానికి

మధ్య జరుగుతున్న మరో ప్రపంచ యుధ్ధం.

బాధపడకు,

కాల్చే మంటల్లోనే వెలుగుంటుంది.

ప్రతి అద్దం వెనుకా ఒక నిజం ఉంటుంది.

దారులు అనంతం.

అన్నీ అర్ధం చేసుకోవాలని ప్రయత్నించకు.

భయపడకు,

ఇక్కడితోనే ఈ ప్రపంచం అంతమయిపోదు.

యుగాంతం ఎప్పటికీ రాదు.

కాలం గుండెల్లో గుచ్చుకున్న నిమిషాల ముల్లుకి మరణం లేదు.

ఇక్కడ, నువ్వున్నంత కాలం మాత్రం

తల వంచుకుని వెళ్ళిపోవద్దు.

ప్రయోగం
పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు చదివిన పుస్తకం లోని వాక్యాలు దృశ్యాల రూపంలో కలలోకి వచ్చి నా నిద్రని కలత నిద్రగా మిగిల్చిన విషయం గుర్తుకొచ్చింది. రాత్రి నేను చదివిన పుస్తకంలో కొన్ని ప్రయోగాల గురించి ఉంది. అయితే అవి సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు కాదు, మనుషుల జీవితాలకి సంబంధించిన ప్రయోగాలు. కొంత మంది తమ జీవితాలతో తాము చేసుకున్న ప్రయోగాలు. నిజానికి మహాత్మా గాంధీ తన జీవితమే సత్యంతో తాను చేసిన ఒక ప్రయోగం అని చెప్పుకున్నారు. సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు భౌతికమయిన విషయాల గురించిన నిజాలను వెలికి తీస్తాయి. జీవితానికి సంబంధించిన ప్రయోగాలు మాత్రం మన దృక్పథాన్ని మార్చగలిగిన జీవిత సత్యాలని మనకి తెలియ చేస్తాయి. నిజానికి మన జీవితాలని మన ప్రమేయం లేకుండానే కాలం తన నిరంతర ప్రయోగాలకి గురిచేస్తూ ఉంటుంది.

అలాంటి ఆటుపోట్లని ఎదుర్కోవటం వల్ల మన ప్రమేయం లేకుండానే మనం కొన్ని కొత్త కొత్త పాఠాలను కూడా నేర్చుకొంటూ ఉంటాం. ఈ రోజు నిద్ర లేవగానే నాకూ ఇప్పటికిప్పుడు ఒక వింత ఆలోచన వచ్చింది. నిన్నటి వరకూ కాలం తన ప్రయోగ వస్తువుగా నన్ను ఉపయోగించుకుంది. కానీ ఈ రోజు కాలంతో నేనే ఒక ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ ప్రయోగం నిన్నటి వరకు ఉన్న నా దైనందిన జీవితానికి కొంచెం భిన్నంగా ఉండాలని కూడా తీర్మానించుకున్నాను. అందుకే ఒక చిన్న సరికొత్త ప్రయోగానికి నన్ను నేను సిధ్ధం చేసుకున్నాను.

రోజూ లాగ కాకుండా పక్క మీద నుంచి లేచి అప్పటికి నా దగ్గర ఉన్నఒక పాత, మాసిపోయిన, కొంచెం చిరిగిన డ్రెస్ వేసుకుని అన్నపానాలు, స్నానం లేకుండానే మామూలుగా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూసే ఎప్పుడూ వేసుకునే నా ఖరీదయిన చెప్పులని అలాగే వదిలేసి, అదే నా మాసిన గడ్డంతో రోడ్డు మీదకి వచ్చి బలాదూరుగా తిరగటం మొదలు పెట్టాను. నా చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను గమనిస్తూ వెళుతున్నాను. క్రీస్తు ఉన్నప్పుడు ప్రపంచ జనాభా ముప్పై కోట్లని ఎక్కడో చదివాను. ఇప్పుడు మాత్రం ఏడు వందల కోట్లు పైనే. రద్దీలో ఈ రోడ్డు మీద ఒకరినొకరు పట్టించుకోకుండా కలియ తిరుగుతున్న ఏడు వందల కోట్ల జనాభాలో భాగమయిన ఈ మనుషులని చూస్తుంటే, ప్రతి మనిషికి మరో మనిషితో ఏదో ఒక అనిర్వచనీయమయిన కార్యకారణ సంబంధం ఖచ్చితంగా ఉండే ఉంటుందని అనిపించింది. అసలు నాకయితే మనందరం ఒక్కొక్కళ్ళం అంతు లేని చిక్కులు పడిపోయిన దారపు బంతి లోని చిక్కుముడులం అనిపిస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ జీవితంలో మొదటిసారిగా, వేషభాషలతోను వాటివల్ల వచ్చే గౌరవ మర్యాదలతోను కూడిన నా అస్తిత్వాన్ని పక్కన పెట్టి బాధ్యతా రాహిత్యంగా, అన్య మనస్కంగా, ఏ గమ్యం లేకుండా ఊరికే నా కాళ్ళు ఎక్కడికి తెసుకెళితే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

నా ప్రయోగంలో మొదటి రెండు గంటల్లోనే నా గురించి నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నానన్న ఆ ఆనందంలో మునిగి ఉండగానే, ఉన్నట్టుండి ఒక బస్సు చాలా వేగంగా నన్ను గుద్దేటంత దగ్గర వరకూ వచ్చి సరిగ్గా దాని ముందు భాగం నా మొహాన్ని తాకుతుండగా సడన్ బ్రేకు వేయటం వల్ల కీచ్ మని శబ్దం చేస్తూ ఆగిపోయింది. నేను అనుకోని ఈ పరిణామానికి ఒక్క సారిగా భయపడి అదిరిపడ్డాను. కానీ ఆ బస్సు డ్రైవర్ సహా అక్కడ ఉన్నవారెవరికీ నా పరిస్థితిని గురించిన అవగాహన గానీ, ఆందోళన గానీ లేకపోగా, అప్పటి వరకూ అక్కడ నించున్న జనం ఆ బస్సు లోకి ఎక్కటం చూసి అది ఒక బస్టాప్ అన్న విషయం మాత్రం నా భయం నుండి తేరుకున్నాక నాకు అర్థమయ్యింది. అందరితో పాటు నేను కూడా బస్సు లోపలికి ఎక్కి కూర్చున్నాను. నిజానికి నా దగ్గర బస్సు టిక్కెట్టు కి డబ్బులు కూడా లేవన్న విషయం లోపల కండక్టరుని చూశాక గానీ గుర్తు రాలేదు. టిక్కెట్టు కి డబ్బులు లేకుండా బస్సు ఎక్కటం వల్ల ఆ కండక్టరు వేసే ప్రశ్నలకి నా మానసిక స్థితి ఎలా ఉంటుందని తెలుసుకోవటానికి ఇదీ ఒక ప్రయోగమేనన్న ధైర్యంతో అలాగే కూర్చుండి పోయాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే, రద్దీగా ఉన్న ఆ బస్సులో ఒక మూల కూర్చున్న నన్ను ఆ కండక్టరు గమనించకుండానే, బస్సు తన గమ్య స్థానానికి చేరిపోయింది.

ఆ కొత్త ప్రదేశంలో దిగే సమయానికి ఉదయపు ఎండ తీవ్రత కొద్ది కొద్దిగా పెరిగింది. ఆకలి నెమ్మది నెమ్మది గా తనకు తానుగా తనని నాకు మరోసారి పరిచయం చేసుకోవటానికి ఆరాటపడుతుంది. కొంచెం నీడ కోసం, ఇంకా తెరవని ఒక మెడికల్ షాపు ముందు కూర్చున్నాను. కొంత సేపటికి ఆ దుకాణం యజమాని నన్ను పక్కకి తప్పుకోమని చెప్పి, షట్టరుకి దణ్ణం పెట్టుకుని తాళం తీసి, షట్టరు పైకెత్తి చెప్పులు బయట వదిలి, లోపలికి అడుగు పెట్టి మొట్ట మొదటిగా ఎదురుగా ఉన్న ఒక పెద్ద షిరిడీ సాయిబాబా బొమ్మకి దణ్ణం పెట్టుకుని, ఆ పక్కనే ఉన్న మిగిలిన దేవుళ్ల పటాలకి కూడా పూజ చేసి అగరొత్తులు వెలిగించి వచ్చి తన కౌంటర్ లో కూర్చున్నాడు. ఎండ తీవ్రతకి చెమటలు పట్టి నా మొహం జిడ్డు కారటం మొదలయ్యింది. దానికి తోడు దుమ్ముతో కూడిన పరిసరాల వల్ల నా వొళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది.

అప్పటి వరకు నేను నిర్లక్ష్యం చూపించటం వల్ల నా మీద కోపం తెచ్చుకున్న ఆకలి తొందరలోనే కడుపులో మంటగా మారి తన ప్రతాపం చూపించటం మొదలు పెట్టింది. నా కడుపులోని మంటకి ఈ మందుల షాపులో మందు ఏమయినా దొరుకుందేమో ఒక సారి సరదాగా అడగాలనిపించింది. “నాకు కడుపులో మంట గా ఉంది. మందు ఏమయినా ఉంటే ఇవ్వండి” అని అడిగాను దగ్గరికెళ్ళి. ఆ షాపు యజమాని నన్ను పైనుంచి కింది వరకూ ఒకసారి చూసి”తర్వాత ఇస్తాను. కాసేపు అలా పక్కన కూర్చో” అన్నాడు ఎంతో దయతో. నిజానికి ఏదో తమాషాకి అలా అడిగాను కానీ ఆకలికి మందు లేదనీ, అన్నమే మందు అనీ నాకూ తెలుసు. ఒక వేళ నిజంగా అలాంటి మందు ఈ మందుల షాపులో ఉన్నా ఇప్పటికిప్పుడు కొనడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడే ఇవ్వకుండా “కొంచెం సేపటి తర్వాత ఇస్తాను” అని షాపు యజమాని ఎందుకన్నాడో మాత్రం నాకు అర్థం కాలేదు.

ఒక అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగాను “కడుపులో మంటగా ఉంది. మందు ఇవ్వండి సార్” అని. షాపు యజమాని “ఒక్క అరగంట ఆగవయ్యా. ఇస్తాను” అని మళ్ళీ అదే మాట అన్నాడు. కొంచెం సేపటి తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి ఒక మందుల చీటీ చూపించి అన్ని మందులూ కొనుక్కుని వెళ్ళి పోయాడు. షాపు యజమాని అతని దగ్గర డబ్బులు తీసుకుని అది మొదటి బేరం కావటంతో దేవుడి పటాలకి చూపించి దణ్ణం పెట్టుకుని క్యాష్ కౌంటర్లో వేసుకున్నాక వెంటనే, మళ్ళీ ఒక ఆడ మనిషి వచ్చి మందులు కొనుక్కుని వెళ్ళిపోయింది. అలా చాలా సేపటి వరకూ ఒకళ్ళ తరవాత ఒకళ్ళుగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏవో మందులు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు.

ఆ తర్వాత ఎప్పటికో ఇంకా అక్కడే కూర్చున్న నన్ను పిలిచి “ఇలా రా. నీకు ఏ మందు కావాలన్నావ్ ?” అని అడిగాడు. నేను వెళ్ళి “కడుపులో మంటగా ఉంది. మందు ఇవ్వండి సార్” అని అడిగాను మళ్ళీ. ఈ లోపు అప్పుడే వచ్చిన అతనికి బాగా పరిచయం ఉన్న ఒక పెద్దాయనతో కాసేపు మాట్లాడుతూ ఈ నెల తాము చేయబోయే దైవ కార్యాల గురించి చర్చించుకోవటం మొదలు పెట్టారు. వాళ్ళు ఆ సంభాషణలో మునిగి ఉండగానే, అవసరం లేని నా మందు గురించి మళ్ళీ ఆ షాపు యజమానిని అడిగి విసిగించకూడదని నిర్ణయించుకుని నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేశాను. కానీ నాకు ముందుగా మందులు ఇవ్వకపోవటానికి కారణం మాత్రం నెమ్మది నెమ్మదిగా బోధపడింది.

పొద్దున్నే నా లాంటి మాసిన, చిరిగిన బట్టల్లో ఉన్నవాడికి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, నూనె జిడ్డు కారుతున్న వాడికి రోజులో మొదటి సారి తన మందులు అమ్మటం వల్ల ఈ రోజంతా తన గిరాకీ అంత బాగుండకపోవచ్చు. తనకి కీడు కలగవచ్చు. రోజులో మొదటి సారి ఇలాంటి అపశకునం మొహంతో బేరం మొదలు పెట్టటం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే నన్ను తర్వాత రమ్మని చెప్పాడు. నేను నిన్నటి నా వేషభాషలతో ఇక్కడికి వచ్చి ఉంటే నన్ను తప్పకుండా తన మొదటి వినియోగదారుడిగా అనుమతించి ఉండేవాడు.

అయితే ఇక్కడ అతను గుర్తించని చిన్న గమ్మత్తయిన విషయం ఏమిటంటే, షాపు తెరవగానే అతను మొదట దణ్ణం పెట్టుకున్న దేవుడిది కూడా జిడ్డు మొహమే. ఆ పటంలో ఉత్త కాళ్ళతో నించున్న ఆ దేవుడిది కూడా మాసిన గడ్డమే. ఆ దేవుడు వేసుకున్నది కూడా చిరిగిన చొక్కానే. కానీ ఇంత చిన్న విషయం ఆ షాపు యజమాని ఎందుకు గమనించ లేక పోయాడో నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకూ అతని జీవితంలో ఎన్నో వందల సార్లు ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుని ఉంటాడు. కానీ ఒక్క రోజు కూడా ఆ దేవుడి రూపు రేఖలని గానీ, అందులో దాగి ఉన్న అంతరార్థాన్ని గానీ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. నిజంగా అలాంటి ప్రయత్నమే కనుక చేసి ఉంటే ఈ రోజు తప్పకుండా నన్ను తన మొదటి వినియోగదారుడిగా ఏ సంకోచం లేకుండా అంగీకరించి ఉండేవాడు.

కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి దేవుడిని నమ్మటం, పూజించటం అనే తంతుని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అదే దేవుడి ఉపదేశాలలోని అసలయిన అర్థాన్ని పెడ చెవిన పెడుతూనే ఉన్నాడు. నిజానికి ఈ రోజు నేను ఈ ప్రయోగం చేయక ముందు వరకూ అతని లాగానే ప్రవర్తించాను. ఇప్పటికిప్పుడు ఈ ప్రయోగం తర్వాతే నాకూ ఈ సత్యం బోధపడింది.

ఈ నాటి నా ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. మరో కొత్త ప్రయోగం కోసం, మళ్ళీ మరో కొత్త సూర్యోదయం కోసం ఎదురుచూడటం కోసం, నేను బయలుదేరిన చోటుకే మళ్ళీ నా ప్రయాణం మొదలు పెట్టాను.

చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass
నిజ జీవితంలో నిలువుగా ఆరడుగులు పైన, అడ్డంగా నాలుగడుగులు ఉండే గుంటర్ గ్రాస్(Günter Grass) లాంటి రచయిత తను రాసిన ‘ద టిన్ డ్రం’ నవలలోని ప్రధాన పాత్ర అయిన ఆస్కార్ ని మాత్రం మూడు అడుగులు మించి ఎదగకూడని నిర్ణయించుకుని అలాగే ఉండి పోయే వాడిగా చిత్రించటం లోని ఆంతర్యం ఏమై ఉంటుంది. ఎక్కడయినా ఎవరయినా తనని తాను కావాలని కుంచించుకోవటం ఏ సందర్భంలో జరుగుతుంది.? కళ్ళ ముందు కొనసాగుతున్న దారుణమయిన పరిస్థితులను నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఎదిరించి పోరాడలేని సగటు మనిషి మానసిక దౌర్భల్యానికి బహుశా ఇది ఒక భౌతిక సంకేతం కావచ్చు. ఒక చెంప దెబ్బ కావచ్చు. ఒక మేలు కొలుపు కావచ్చు. లేదా భయానక గతానికి దాని పరిణామమయిన వర్తమానానికి కనీసం ఒక మూగ సాక్ష్యం గా అయినా మిగిలిపోవాలని తెగించి తీసుకున్న నిర్ణయానికి పరాకాష్ట కూడా కావచ్చు. 1959 లో అచ్చయిన ఈ నవల 20వ శతాబ్దపు మొదటి సగంలో, జర్మనీ చరిత్రతో పాటు రెండవ ప్రపంచ యుధ్ధ పరిణామాలను, దేశాల మధ్య జరిగిన మారణ కాండను, అమానుషత్వాలను కళ్ళకి కట్టి చూపించి, నాజీల దురాగతాలకు జర్మన్ల నైతిక భాత్యతని గుర్తు చేసింది. 1999 లో నోబెల్ బహుమతి పొందిన ఈ నవల అంతకు ముందు 1979 లో అదే పేరుతో జర్మన్ సినిమా గా విడుదలై ఆ సంవత్సరం ఉత్తమ విదేశీ భాషా చిత్రం గా ఆస్కార్ బహుమతి కూడా గెలుచుకుంది.

నవల, సినిమా కూడా కొన్ని వాస్తవ సంఘటనల యదార్ధ చిత్రీకరణల వల్ల తీవ్రమయిన విమర్శలను ఎదుర్కొన్నాయి. అందుకేనేమో చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన గ్రాస్ ‘టిన్ డ్రం’ చిత్ర ప్రదర్శన సందర్భగా ముందుగానే ప్రేక్షకులకి “ఈ సినిమాలో కొన్ని సీన్లు మీకు అతిగా, జుగుప్సాకరంగా అనిపించవచ్చు కానీ అది ఆనాటి జర్మన్ సమాజంలోని వాస్తవం. వాటిని అలాగే చూడండి. అపార్ధం చేసుకోవద్దు.” అని విన్నవించుకోవలసి వచ్చింది. గ్రాస్ తన ఆత్మ కధకి “పీలింగ్ ది ఆనియన్” అని పేరు పెట్టాడు. బహుశా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరగటానికి సూచనగా ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

నిజం మాట్లాడటం అంత సులువు కాదు. రాయటమూ అంత సులువు కాదు. రాయగలగటం ఒక శాపం. రచయితగా అవతరించటం ఒక మొక్కకి పువ్వు పూసినంత అందంగా ఏమీ సంభవించదు. అది ఒక నరుడు నరసిం హావతారంగా మారవలసినంత కష్టం. అందులోనూ ఏ ముసుగులూ లేకుండా కేవలం నిజాలు మాత్రమే రాయాలనుకోవటం ఆత్మని, శరీరాన్ని కోత పెట్టుకోగలిగినవాడు మాత్రమే తీసుకునే సాహసోపేత నిర్ణయం. బహుశా రాయటానికి తను పడే యాతన, హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చని పోయే వారు అనుభవించే చిత్రవధ కన్నా ఎక్కువ కాదన్న ఎరుక వల్ల గుంటర్ గ్రాస్ ‘ది టిన్ డ్రం’ లాంటి రచనలు చేయగలిగి ఉండాలి.

సాహిత్యంలో కొన్ని నిజాలని ఆకట్టుకునేలా చెప్పాలంటే, వాటిని మరి కొన్ని అబధ్ధాలతో కలిపి చెప్పాలి. అసలు కధలు అంటేనే అబధ్ధాలని నమ్మేలా చెయ్యటం అంటాడు గుంటర్ గ్రాస్. మనిషి మనసులోని భావాలని భాష సంపూర్ణంగా ప్రకటించలేదు. భావాల ప్రసారానికి నిజానికి భాష ఒక పెద్ద అడ్డంకి. కాని ఆ భాష ఆధారంగానే సృష్టించబడే సాహిత్యంలో సత్యాన్ని మరింత అర్ధవంతం గా మరింత తీక్షణంగా చెప్పాలంటే ఒక కొత్త ప్రక్రియ ఆసరా కావాలి. అదే ‘మ్యాజిక్ రియలిజం’. ఈ మ్యాజిక్ రియలిజం ఉపయోగించి సామాన్య విషయాలకి కల్పన జోడించినా, అసహజత్వానికి తావు లేకుండా అత్యంత ప్రభావవంత రచనలు చేశారు గ్రాస్. ఆస్కార్ గట్టిగా అరిస్తే అద్దాలు పగిలిపోవటం, తనని తాను మళ్ళీ కావాలనుకున్నంత వరకూ మూడు అడుగులు మించి పెరగకుండా నిరోధించుకోగల అతీత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండటం లాంటి విచిత్రమయిన కల్పనలు దీనికి నిదర్శనం. జర్మన్ చీకటి చరిత్రనీ, ఆ దేశ రాజకీయ, ఆర్ధిక కల్లోల పరిస్థితులను చిత్రించటానికి గుంటర్ గ్రాస్ మ్యాజిక్ రియలిజాన్ని అత్యంత సమర్ధవంతంగా తన నవలలో ఉపయోగించి ఈ ప్రక్రియలో తర్వాత చాలా మంది రచయితలకి ప్రేరణగా నిలిచాడు.

భారత దేశ చరిత్రలో కూడా దేశ విభజన సమయంలో అత్యంత అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఉత్తర భారతం లో జరిగిన ఈ ఘటనల గురించి దక్షిణ భారతీయులం అయిన మనకి తెలిసింది చాలా తక్కువ. కానీ పాకిస్తానీ ఉర్దూ రచయిత ‘సాదత్ హసన్ మంటో’ తన రచనల ద్వారా నిష్పక్షపాతం గా ఇలాంటి ఘటనల మీద వెలుగు ప్రసరింప చేశాడు. మంటొ గానీ గ్రాస్ గానీ కేవలం చెడు గురించే ఎందుకు రాయాలి.? అసలు చెడు గురించి ఎవరయినా ఎందుకు మాట్లాడుకోవాలి.? ఎందుకంటే అది అక్కడ ఉందని గ్రహించటానికీ, తద్వారా దానిని తొలగించటానికీ, ఇక ముందు పునరావృతం కాకుండా జాగ్రత్త పడటానికీ, బాధితులకు న్యాయం చెయ్యటానికీ అలా మాట్లాడుకోవటం నిజంగా చాలా అవసరం కాబట్టి.

గుంటర్ గ్రాస్ లాంటి రచయితల రచనల ద్వారా మనిషి నాగరిక ప్రపంచం లో కూడా ఎంత అనాగరికంగా ప్రవర్తించాడో అర్ధం చేసుకోవచ్చు. మనిషి నుంచి మృగం ఇంకా వేరు కాలేదన్న కఠోర సత్యం తెలుసుకోవచ్చు. మనిషి భౌతికం గా ఎలా ఉన్నా ఆలోచనల పరంగా, మానసికంగా ఇంకా నాగరిక ప్రపంచపు పొలిమేరలలో కూడా ప్రవేశించలేదన్న నిజాన్ని తల ఒంచుకుని ఒప్పుకోవచ్చు. ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇప్పటి వరకూ సాటి మనిషినే అర్ధం చెసుకోలేని మనిషి ఇంకా దైవత్వాన్ని ఎప్పటికి అర్ధం చేసుకుంటాడు? ఇలాంటి రచనలు ’ఈ భూమ్మీద ఇంకా చాలా చీకటి మిగిలే ఉంది.’ అని తెలియ చెయ్యటానికి నిదర్శనం. కానీ చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలన్న ప్రయత్నం ఉన్నంత వరకూ గుంటర్ గ్రాస్ లాంటి రచయితలూ మిగిలే ఉంటారు.