వాకిలి » చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు

ఆట
నంబూరి సూర్యనారాయణరాజుగారు ఆస్థిపరుడే కాదు, మంచి చదరంగం ఆటగాడు కూడా. ఇప్పటిదాకా ఆయనతో చదరంగం ఆడి గెలిచినోళ్ళు, మా చుట్టుపక్కల పదూళ్ళలో ఎవరూ లేరు. ఊళ్ళో వాళ్ళంతా సూర్యనారాయణరాజు గారిని మేకల సూర్రాజు అంటారు.

ఆ యీడు రాజులకుండే… చుట్ట, బీడి, సిగరెట్టు, మద్యం, నస్యం, పేకాటా లాటి అలవాట్లు సూర్రాజు గారికి లేవు. అంతెందుకు? కాఫీ, టీలకి కూడా ఆయన ఆమడ దూరం. పరగడుపునే ఓ శేరు పొదుగుకాడి మేకపాలు పుచ్చుకుంటారాయన. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని మేకలని కూడా మేపుతుంటారు. ఈ మేకలని మేపడానికి వారి మకాల్లో ఇద్దరేసి మనుషులు పని చేస్తుంటారంటే అర్ధం చేసుకోవచ్చు మేకలపెంపకం అంటే ఆయనకి ఎంత శ్రధ్ధో. అందుకనే ఆయనకి మేకల సూర్రాజుగారని పేరొచ్చింది.

ఆయన్నీ, ఆయనాడే ఆటనీ చూసి, అంతా సూర్రాజు గారిని చాలా డిగ్నిఫైడ్ మనిషనుకుంటారు. కానీ… అది అబద్దం. తానో డీనోటిఫైడ్ మనిషినన్న నిజం ఆయనొక్కరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే సూర్రాజుగారికి రిమ్మ తెగులుతోపాటు బాగా సినిమా పిచ్చి.

‘ కనీసం కోడిపందెం కూడా వేయని, ఆ సూర్రాజేం రాజురా? ‘ అని సూర్రాజు వెనకాల అందరూ గేలి చేసినా, ఆయన సమక్షంలో మాత్రం… ఈ సూర్రాజు చంకనాకండిరా, సగవన్నా బాగుపడతారు అని మెచ్చుకుంటూ వుంటారు కొంతమంది పెద్దరాజులు. వాళ్లకి సూర్రాజుగారికున్న రిమ్మతెగులు గురించి తెలీక. లేకపోతే ‘ అమ్మ నియ్యమ్మ సూర్రాజోయ్… ‘ అని దిమ్మ తిరిగి పడి పోయేవాళ్ళే. అలాటి పనులు నలుగురికీ తెలిసేలా చేస్తే సూర్రాజు సూర్రాజే అవుతాడు కానీ, చదరంగం ఆటగాడెలా అవుతాడు?

సూర్రాజు గొప్పదనం ఆకట్టుకొనే ఆయన ఆటలో వుందా? లేకపోతే… ఎదుటివాళ్ళ ఆట కట్టించే తీరులో వుందా? అంటే చెప్పడం కొంచెం కష్టం. ఆయన స్థాయికి ఇంకొకరెవరైనా అయితే అంబాసిడర్ కారులో తిరుగుతారు.అనవసర ఆడంబరాలకి వెళ్ళని సూర్రాజు ఎక్కడకెళ్ళినా అంబర్ సైకిల్ మీదే వెళతారు. ఏడాదికో సైకిల్ మార్చేసే ఆయన, పాత సైకిల్ ని కొన్న రేటుకంటే ఎక్కువకే అమ్మడం ఇక్కడ గమనించదగ్గ అంశం.

తెల్లటి పేంటూ చొక్కాతో, అంబర్ సైకిల్ మీద హుషారుగా తిరిగే సూర్రాజుగారి జేబులోంచి ఫెలఫెల్లాడే కొత్త వందరూపాయల నోట్లు ఏసమయంలోనైనా జిగేల్మంటుంటాయి. ఆయన దగ్గరనుంచి యాలికపండు వాసన సర్వవేళలా గుబాళిస్తూ వుంటుంది. చొక్కా కాలర్ వెనకాల మడతపెట్టి పెట్టుకునే తెల్ల జేబురుమాలు చొక్కా రంగులో కలిసిపోయి వుంటుంది. చేతికి పోచ్చీ, వేళ్లకి ఉంగరాలు, మెడలోకి పులిగోరు గొలుసూ వున్నా ఆయన వాటిని వేసుకొని తిరగరు. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడాలేకుండా సైకిల్ మీద తొలాట, మలాట సినిమాలకి తిరిగే ఆయన్ని… ఎవరైనా అటకాయించి, లాక్కూపోతారన్న భయం. సమయపాలన వున్న మనిషి కాబట్టి వాచ్చీ మాత్రం తగిలించుకుంటారు. ఎంత కష్టపడి వ్యయసాయంచేసినా, ఏడాదికో ఎకరం తెగనమ్ముకునే రైతులున్న ఊల్లో… ఏడాదికో రెండెకరాలు కొనే సూర్రాజు విజయగాధ వెనక, ఆయన చదరంగం ఆటదే ప్రధాన పాత్ర.

ఏదైనా ఓ వ్యూహం ప్రకారం నడుచుకోవడం, ఆ ఆట ఆయనకి నేర్పింది. మేకల సూర్రాజు పొలం కొనాలనుకుంటే స్వంత ఊరిలో దాన్ని అరిచ్చచ్చినా కొనరు. అది తన చేను పక్క చేనయినా సరే… పొరుగూరిలోనే కొనుక్కుంటారు. ‘ పొలమంతా ఒకే చోట వుంటే…. వానొచ్చినా, వరదొచ్చినా, చీడట్టినా, దోమట్టినా మొత్తం పోతుంది. అదే నాలుగైదు చోట్ల వుంటే, ఒకచోట కాకపోతే మరో చోటైనా చేతికొస్తుంది ‘ అదీ ఆయన వాదన. ఇలాటి ఆలోచనలన్నీ… ఆయనకి చదరంగం ఆడ్డం వల్లే అబ్బాయని చెప్పడం ఏమాత్రం ఆక్షేపణీయంకాదు.

అరుగుమీద స్తంభానికి ఆనుకుని కూర్చున్న సూర్రాజుగారు, వైట్ అండ్ వైట్ లో టిప్ టిప్ గా వున్నారు. ఇంకోరోజు అయితే, ఈపాటికి ఆయన ముందు చదరంగం బల్ల సిద్దంగా వుండేది. ఈరోజు ఆయనో ముఖ్యమైన పని పెట్టుకున్నారు. అందుకనే ఒకళ్ళిద్దరొచ్చి, ఓ ఆట ఆడదామని అన్నా… ఇవాళకి కుదరదు, పనుందని చెప్పి పంపించేసారు. ఆ పనిమీదే ఎవరికోసమో ఎదురు చూస్తూ… కూర్చున్నారు.

పనంటే, అదేం పెద్ద పని కూడా కాదు. పిల్లంక మకాంలో మేకలు మేపటానికి, ఓజత పని మనుషులని కుదుర్చుకోవడమే.

‘ఇంకా రాలేదీటీళ్లు… ‘ మనస్సులోనే అనుకొని వాచ్చీ చూసుకున్నారు.

‘ అబ్బో… పదకొండు ‘ రాజులు భోంచేసే టైం అయింది.

పోనీ, భోజనానికి లేద్దామా? అనుకున్నంతలో… గేటు తోస్తున్న అలికిడయ్యింది.

ఓ నడి వయస్సు ఆడది, అదే వయస్సు మగాడూ వస్తూ కనపడ్డారు.

ఈ మధ్యే సూర్రాజుగారు, పిల్లంకలో రెండెకరాల పొలం కొన్నారు. అందులో ఓ మూల మేకల కోసం రెండు గదుల చావిడి కూడా వెయ్యించారు. బోడి రెండు మేకలకి అంత చావిడి అనవసరం కదా? అందుకే మేకలతోపాటూ వ్యవసాయాన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఓ జోడీని పనిలోకి పెట్టుకోవాలనుకున్నారు. ఆయన అన్ని మకాల్లోనూ చేసేదే ఇది. ఊల్లో వాళ్లని పనిలో పెట్టుకోవడం ఆయనకి సుతరామూ ఇష్టం వుండదు. అందుకే పనోళ్ళని పొరుగూళ్ళనుంచి పిలిపించుకుంటారు. గోపులంకలో వున్న ఓ బంధువుకి పనోళ్లు కావాలని చెబితే… ఆయన వీళ్ళని పంపించారు.

వాళ్ళని చూడగానే… సూర్రాజుగారి మొహంలో చిరాకు తొంగి చూసింది.

‘ఈ వయస్సులో వీళ్ళేం పని చేసి ఏడుస్తారు? ఆపసోపాలు పడతా కూర్చుంటారు. వీళ్ళని పంపిన ఆ చిట్టిరాజుకి బుద్దుండక్కర్లా? ‘ మనస్సులో అనుకున్నారు.

వాళ్ళవెనకే… కాంత దూరంలో ఇంకో పెళ్ళీడుపిల్ల కనపడ్డంతో ఆయన మొహంలో చిరాకు మటుమాయమయ్యింది.

సూర్రాజుగారిలో చదరంగం ఆటగాడు వెంటనే మేల్కొన్నాడు. మొదటి ఎత్తు వేసేందుకు సిద్దమయ్యాడు.

వాళ్ళు దగ్గరకి రాగానే…

” ఎవరువాయ్? ఏం ఇలా వొచ్చేరు ? ” అంటూ గంభీరంగా ప్రశ్నించారు. వాళ్లెవరో తనకి తెలీనట్టు. ఓ కంట ఆ పిల్లని పరిశీలిస్తూ.

” గోపులంకనించి చిట్రారంపేరండి. తవరి మకాంలో కవతానికి, ఓ జోడా కావాలన్నారంట కదండె. మీరు సూర్రారే కదండి ” అడిగింది ఆ ఆడమనిషి .

దానికి వయసంటే మళ్లింది కానీ వళ్లెక్కడా వడలలేదు. మొహంలో కళెక్కడా చెదరలేదు. ‘ మంచి వయస్సులో వుండగా కుర్రోళ్ళని తన చుట్టూ బొంగరాల్లా తిప్పేసుకునుంటది ‘ అనుకున్నారు సూర్రాజు. బహుశా ఈ పిల్ల దాని కూతురో… మనవరాలోఅయ్యుండాలి. దగ్గరి పోలికలు కనబడుతున్నాయి. ఆల్చిప్పల్లాంటి కళ్ళు టపటపలాడిస్తూ మాట్లాడకుండా చూస్తోందాపిల్ల.

” మరేండి…” అన్నాడు మగాడు. అది చెప్పింది నిజమేనన్నట్టు.

‘ వాడ్ని అడిగితే… ఇది సమాధానం చెబుతోంది ‘ అంటే… కొంపలో దీనిదే పెత్తనం అన్న మాట. వాడు మెతక. కొంగుచాటు మొగుడన్నమాట!’ అని ఆయనలోని ఆటగాడు ఓ నిర్ధారణ కొచ్చేడు.

” జోడాని… రమ్మంటే, ఇంటిల్లిపాదీ వచ్చేసినట్టున్నారే? ”

” ఆయ్… ఇది మా మనవరాలండీ. ఎదిగిన దాన్నొక్కదాన్నీ ఒకళ్ళింట్లో వుంచలేం గాదండీ… ”

” ఏం? పెళ్ళి చేసిపంపేలేపోయేరా? ” అనడిగారు. ఆ పిల్లని క్రీగంట చూస్తూ. పెళ్లి మాటెత్తగానే దాని బుగ్గలు సిగ్గుతో నున్నబడ్డాయి.

” అందుకోసవే కదండి, మాకీ పుర్రాకులు ” చెప్పింది ఆడ మనిషి.

” జీతం బత్తెం మా చిట్టి మావయ్యతో డుకున్నారు కదా! ”

” ఆయ్…”

” సామాన్లేయి మరి? తెచ్చుకోలేదా!”

” గేటు గుమ్మంకాడెట్టేసొచ్చేవండి… ”

” అలాగైతే సరే… మీరు మన పిల్లంక మకాం కాడకెళ్లిపోండి. నేనెనకాలే సైకిలు మీదొత్తాను. ఇంగో వెళతా వెళతా కావాల్సిన వెచ్చాలు కొనుక్కెళ్లిపోండి. పాపం ఎప్పుడు తిని బైలుదేరారో ఏంటో? ఆ మాణిక్కాలమ్మ గుడిపక్కన భద్రంకాపు వొటేలుంటది. నాలుగు, నాలుగు ఇడ్డెన్లు తినేసి పొండి… ” అంటూ ఫాంట్ జేబులోంచి రెండ్రూపాయల కట్ట ఒకటి తీసారు.

పనోళ్ళ ఆకలి గురించి అంతగా ఆలోచించిన సూర్రాజుమీద వాళ్ళకి అమితమైన గౌరవం పెరిగిపోయింది.

” ఏం పేరు… నీ పేరు? ” సూర్రాజు దర్పంగా అడిగారు. ఆ పిల వైపు చూస్తూ…

” చంద్రి … చంద్రమ్మ ”

” నాపేరేనండి… మా ఆయన పేరు అబ్బాయండి ” అందుకొంది పెద్ద చంద్రమ్మ.

” ఇదిగో…తీసుకో…” అంటూ నోట్లకట్ట అటుచాపారు.

చంద్రి కదల్లేదు. మెదల్లేదు.

” ఇచ్చుకోయే… పర్లేదు ” వాళ్ళ మామ్మ తొయ్యడంతో… చంద్రి ముందుకో అడుగు వేసి, ఆ నోట్లకట్ట అందుకొంది. ఇచ్చేటప్పుడు సూర్రాజు చేతిని సుతారంగా దాని చేతులకి తాకించారు. అది దాన్ని పట్టించుకొందో… లేక పట్టించుకోనట్టు నటించిందో.

రెండో ఎత్తు కూడా అయిపోయింది. మూడో ఎత్తుతో ఈ ముసలిదాని నోరు ముయ్యించేస్తే… నాలుగో ఎత్తు నాటికి ఈ చంద్రిని మంచమెక్కించెయ్యొచ్చు. సూర్రాజులో వున్న ఆటగాడు బలంగా నిశ్చయించుకున్నాడు. అలా జరగాలంటే… ముందు ఈ ముసలిదాని కాళ్ళకి పిల్లపెళ్ళి అనే తాళ్లతో బంధం వెయ్యాలి. నిర్ణయించుకున్నారు సూర్రాజు.

” అయిగో… ఆ పాక లో కట్టేసున్న ఆరెండు కంచి మేకలనీ మీతో తోలుకుపోండి ” చెప్పారాయన.

అబ్బాయి వెళ్ళి, ఆ మేకలు రెండిటినీ తాళ్లు పట్టుకొని తీసుకు వచ్చాడు.

‘ లింగు లిటుకని… రెండు మేకలని కాయడానికి, ఇద్దరు మనుషులని నెలనెలా జీతవిచ్చి ఈ పిచ్చిమారాజెందుకు మేపుతున్నాడో ? ‘ అందరికీ కలిగే సందేహమే… చంద్రికీ కలిగింది. ‘ ఎవరిట్టం ఆళ్ళది. ఆయన డబ్బు ఆయన తగలేసుకుంటాడు’ అందరిలాగే అదీ అనుకొని సరిపెట్టుకొంది.

పురి విప్పి … అందులో ధాన్యాన్ని, ఇద్దరు మనుషులు కాటా ఏసి బస్తాలు కుడుతున్నారు.

ఇంకో ఇద్దరు వాటిని ఎడ్లబళ్ళకెక్కిస్తున్నారు.

మసకపిల్లి పాలేరు, సత్తులు గాడ్ని పిలిచిన మేకల సూర్రాజుగారు…

” ఒరేయ్… వీటిని తోటపేటలో నల్లపరాజోరి ఉప్పుడుమిల్లుకి తోలుకెళ్లు. ఫలానా మేకల సూర్రాజుగారియ్యని చెప్పు చాలు. ఆళ్ళు ఇడ్లీ నూకాడేస్తారు. బస్తాలు దించేసాకా సోగ్గాడి బండుంచుకొని, పొట్టోడి బండి పంపెయ్యి. వచ్చేటప్పుడు చిట్టు యర్రపోతవరం రాంబాబు కొట్లోను, తవుడు మసకపల్లి ఆదినారాయణ కొట్లోనూ దింపేసి, నూక బస్తాలు ఇంటికి చేరేసెయ్యండి. రాత్రికి దాచ్చారం భీమేశ్వరా మిలట్రీ హొటేల్లో భోంచేయండి. ప్లేటు పదిరూపాయలు, కోడి పులావు బాగుంటదక్కడ. ఆకేటోరి హాల్లో యశోధకృష్ణ సినిమా మళ్ళీ ఏసారంట, అది మలాట చూడండి. నిద్రట్లేటు కదా అని ఆ ఈది, ఈ ఈధి చూద్దామని సరదాపడకొండెరేయ్… పోలీసులు పట్టుకుంటే లేనిపోని తలనెప్పి… ఫలానా సూర్రారి మనుషులని తెలిస్తే తలకొట్టేసినట్టవుద్ది. తెల్లారేటప్పటికి ఆట అయిపోద్ది కాబట్టి బండ్లోనే పడుకొని బస్తాలెత్తుకుని బయలుదేరి వచ్చెయ్యండి ” విశదీకరించి చెప్పి… కొంత డబ్బిచ్చారు. ఆయనంతే… ఎవరి శ్రమా దోచుకోడు.ఏదో రూపాన ప్రతిఫలం ముట్టచెప్పేస్తారు.

బళ్ళోళ్ళూ, సత్తులూ కూడా ఆయన చూపించిన అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

బళ్ళు బయలు దేరే సరికి పొద్దుగూకింది. రాజుల భోంచేసే గాలేస్తోంది.

చేపలకూరతో సుష్టుగా భోంచేసిన సూర్రాజు యానాం తొలాట సినిమాకి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి, అంబర్ సైకిల్ ని యానాం వేపు గాకుండా మసకపిల్లేపు తొక్కడం మొదలెట్టారు.

పదకొండు గంటలకల్లా పద్దతి ప్రకారం భోంచేసేసి… చదరంగం బల్ల, పావులపెట్టితో అరుగుమీదకి వచ్చారు సూర్రాజుగారు.

ఆయన రాకకోసం ఆవురావురుమంటా ఎదురుచూస్తున్నారు ఇంజరం మూర్తి. మూర్తి గొప్పురేవు హైస్కూల్లో లెక్కల మేస్టరు. ఒక్కసారైనా సూర్రాజుగారి ఆటకట్టించాలన్న కసి మూర్తిలో రోజురోజుకీ పెరిగి పెద్దదవుతోంది.

ఇద్దరి మధ్యా ఆట మొదలయ్యింది.

తొలి ఎత్తు మూర్తిదే…. వేసారు.

ఒకళ్ళ తర్వాతఒకళ్ళు. ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి.

” ఎంత బుర్ర బద్దలుగొట్టుకున్నా… మీ ఆటలాగే, మీరూ అర్ధంకారండి రాజుగారూ ” అన్నారు మూర్తి.

” ఏవంటారు…? ”

” అందరూ… వడ్లమ్మితే, మీరు నూకమ్ముతారు. అందరూ గేదెలని కాస్తే… మీరు మేకలని కాస్తారు”

” అందరూ నడిచే దారిలో మనం నడకూడదండి. అవసరాలకి తగ్గట్టు నడుచుకోవాలండి. ఎదటోళ్ళ అవసరమే మనకి కొత్త అవకాశాలనిస్తుందండి. అందరిలాగా వడ్లమ్మేం అనుకోండి, బస్తాకి వాళ్ళకొచ్చే ఆ నూట ఎనభయ్యే మనకీ వొస్తాయి. అదే నూక చేసి అమ్మేవనుకోండి నాలుగొందల నలభైయండి బస్తా. వస్తువునెప్పుడూ వస్తువుగా చూస్తే… ఎప్పుడూ దాని విలువ పెరగదండి. దాని బహురూపాలుగా మారిస్తేనే విలువ పెరుగుద్దండి. ఒక విషయం చెప్పమంటారా? అవసరాలు, అవకాశాలు వాటికవి పుట్టవండి… మనమే సృష్టించాలి. అదండి కిటుకు. అది తెలుసు కాబట్టి ఏడాదికింతని మనం కొంటున్నాం… మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంతకి మించి ఏమీ లేదండి ”

పావుల్లో తనకిష్టమైన గుర్రాన్ని మప్పుతూ చెప్పారు సూర్రాజుగారు.

ఎత్తువేయడం ఆపి… సూర్రాజుగారి మొహంలోకి చూస్తూ వుండిపోయారు మూర్తిగారు.

” తవరే… ఎత్తు ఎత్తాలండి ” గుర్తు చేసారు సూర్రాజు.

” మీ మేక పాల తెలివితేటలముందు మా ఆటలు సాగట లేదండి”

ఓ సారి బల్లంతా కలచూస్తూ అన్నారు మూర్తిగారు. ఓ భటున్ని ముందుకు తోస్తూ.

” మేకపాలని అలా చులకనగా అనుకుంటారు కానండి, మేకలతో చిన్నా చితకా యాతన అనుకుంటున్నారేంటి? మా చెడ్డ ఇబ్బందండి. పచ్చగా ఏది కనిపిస్తే దాన్ని లట్టుక్కున కొరికేస్తాయి. మళ్ళీ అది చిగురు పట్టడం అంటే దానమ్మా మొగుడు తరం కాదండి. అందుకే వాటి మీద ఎక్కడలేని దృష్టీ … పెడతాను. ప్రత్యేకంగా ఓ మనిషినెట్టి … ఎవరి మొక్కా, మోటుకీ కరవకుండా, మన ఆకూ అలమే దగ్గరుండి మేపిస్తాను. అలవాటైన ప్రాణం కదండీ… ఆ కాసిని పాలచుక్కలకోసం తప్పదండి… ” సూర్రాజు చెబుతుంటే, మూర్తిగారికి ఏ ఎత్తు వేయాలో అర్ధం కాకుండా వుంది.

” మీరు మీ పాల గురించెంత ఆలోచిస్తారో… పక్కోళ్ళ మొక్కలగురించి కూడా అలా ఆలోచిస్తారు కాబట్టే మీకింత గౌరవమండి ” అంటూ ఓ భటుడితో సూర్రాజు శకటుని వేసేసారు మూర్తిగారు.

సూర్రాజుగారి పెదాలమీద ఓ వంకర నవ్వు మెరిసింది.

” ఆయ్…ఏదో, మీ బోటోళ్ళ పుణ్యాణ ఇలా గడిచిపోతున్నాయండి రోజులు. మీ రాజుకి చెక్ ” చెప్పి అరుగు దిగారు సూర్రాజు.

సూర్రాజు ఎత్తుని అంచనా వేయలేని మూర్తిగారి బుర్ర గిర్రున తిరిగింది. ఎక్కడ పప్పులో కాలేసానా? అని ఆలోచించడం మొదలెట్టారు.

దూళ్ళపాకలో కూర్చొని మేకపిల్లలతో ఆడుకుంటున్న…. కోలంక పాలికాపుసింహాద్రిని పిలిచారు సూర్రాజు గారు.

” ఒరేయ్… నువ్వు ఈ అటుకుల మూటనట్టుకెళ్లి, కాకినాడ పేర్రాజుపేటలో రెడ్డి బాబూరావుగారని మన ప్లీడరుగారుంటారు. అక్కడెవల్నడిగినా తీసుకెళ్ళి మరీ చూపిస్తారు ఆయన ఇల్లు. లేపోతే బస్టాండులోదిగి రెండు రూపాయలిస్తే రిక్షావాడు దర్జాగా తీసుకుపోతాడు. ప్రయాణం కూడా సుఖంగా వుంటది. మరీ సందరడిపోయిందనుకో… మీసాల్రాజుగారి హొటేల్లో ఓ పలావు కొట్టేసి, రాజుగారి ఆనంద్ హాల్లో ఎంటీవోడి ‘ అగ్గిబరాటా ‘ ఆడుతోంది. అది చూసి అటూ ఇటూ రెండుసార్లు రోడ్లంట తిరిగితే తెల్లారిపోద్ది. పొద్దున్నే తొలిబస్సెక్కొచ్చేయి. సినిమా నిద్దరోకుండా చూడొరేయ్… మళ్ళా నాకు రేపొద్దున్న స్టోరీ చెప్పాలి. చాన్నాళ్ళయ్యింది అగ్గిబరాటా చూసి, కధ మర్చిపోయేను ” చెప్పారు. వాడి చేతిలో ఓ వందకి చిల్లర నోట్లు పెట్టి.

” అలాగేండి ” అంటూ సింహాద్రి అరుగు మీదున్న చిన్న అటుకులమూట తలకెత్తుకున్నాడు.

మూర్తిగారు ఉసూరుమంటూ… ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తీసారు.

ఆయన వైపు వెళ్ళిరమ్మన్నట్టు నవ్వుతూ చూసారు సూర్రాజుగారు.

సూర్యాస్తమయంకి ముందే… అలవాటు ప్రకారం భోంచేసేసిన సూర్రాజుగారు యర్రపోతవరం సినిమాకి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి, అటువైపుగాకుండా కోలంక మకాం వేపు సైకిల్ తొక్కారు.

అలసి పోయిన సింహాద్రి పెళ్ళాం చుక్క అటు తిరిగి పడుకొంది. దాని పక్కలో విశ్రాంతి తీసుకుంటున్న సూర్రాజు గారి మనస్సు ఎప్పుడూ లేంది ఏదో కీడు శంకించింది. వారగా తెరుచుకున్న కిటికీ తలుపు గాలికి కొట్టుకుంటోంది. కిటికీ తలుపు వెయ్యడం మర్చిపోయారా? లేపోతే ఎవరైనా బలవంతంగా తెరిచేరా?

చప్పుడు కాకుండా కిటికీ దగ్గరకి వెళ్ళి చూసారు.

ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ దూరంగా చెట్టు కింద నిలబడి బీడీ కాలుస్తున్నాడు సింహాద్రి. గుప్పు గుప్పున పొగ గాల్లో కలుస్తోంది. వెన్నెల రాత్రులు కావడంతో స్పష్టంగా కనిపిస్తున్నాడు. వాడి బీడీ పొగే తనని అప్రమత్తం చేసింది అన్నమాట.

బయట వాడు. లోపల వాడి పెళ్ళాం. దాని పక్కలో తను. బయట పడాలంటే గదికి వెనక తలుపు లేదు. అంతా అయోమయం.

సింహాద్రి నిలబడ్డ చోట నుంచి చావిడి వైపు కదిలాడు.

కిటికీ పక్కనుంచి పక్కకి కదిలారు సూర్రాజు.

ఇప్పుడేం జరుగుతుంది?

అయనలోని చదరంగం ఆటగాడు, టక టక ఆలోచింఛడం మొదలెట్టాడు.

అంటే వాడు తమని… చూసేసాడన్నమాట. అయినా కానీ వాడు లోపలకి రాలేదంటే… వాడి ఎత్తు ఏమయ్యి వుంటది.

మళ్ళీ ఓ సారి కిటికీలోంచి చూసారు. వాడు నెమ్మదిగా తన అంబర్ సైకిల్ ని స్టాండు తీసి దొర్లించడం మొదలెట్టాడు.

సూర్రాజుగారి గుండె దడదడలాడింది. వాడి ఎత్తు ఏమయ్యి వుంటది?

ఎత్తు ఒకటి… తన సైకిల్ తీసుకెళ్ళి, దాచేసి… తర్వాత దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం.

ఎత్తు రెండు… దాన్ని ఏకాలవలోనే… తొక్కేసి తన కసి తీర్చుకోవడం.

ఎత్తు మూడు… సైకిల్ తీసుకెళ్ళి ఊరిలో అందరి ముందూ ప్రవేశపెట్టి, తన బండారాన్ని బయట పెట్టడం?

ఎత్తు నాలుగు… వాడికి అవసరం వచ్చినప్పుడల్లా డబ్బు కోసం వేధించడం.

అంతేనా ఇంకా అయిదూ… ఆరూ ఎత్తులు ఏమైనా వుండి వుంటాయా?

వాడు ఎందుకో… మూడో ఎత్తే, వేస్తాడని ఆయన లోని ఆటగాడు గట్టిగా తీర్మానించాడు.

ఎందుకంటే… వాడికి తనని చంపాలని వుంటే, ఈపాటికి తలుపులన్నీ బయటనుంచి గొళ్ళెంపెట్టి చావిడికి కసిగా నిప్పంటించేసేవాడే. అలా జరగ లేదంటే… వాడు ఖచ్చితంగా మూడో ఎత్తే వేస్తాడు. దానికి చెక్ పెట్టాలి ఎలా? ఎలా? అయినా వీడు కాకినాడనుంచి ఇంత తొందరగా ఎలా తిరిగొచ్చేసాడు? చిత్రంగా వుందే? ఈ పనికిమాలిన ఆలోచనలు తర్వాత. ముందు ఈ బందిఖానా నుంచి త్వరగా బయటపడాలి.

ఇంకోసారి కిటికీ లోంచి చూసారు. సింహాద్రి సైకిల్ తొక్కుకుని పోతున్నాడు.

తలుపు గడియ తీసి తెరవబోయారు. రాలేదు. లండీ కొడుకు గొళ్ళెం పెట్టేసాడు.

ఆలస్యం చేయకూడదు. తన పరువు గంగలో కలిసిపోయే క్షణాలు తరుము కొచ్చేస్తున్నాయి. ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలి. ఈ గండం నుంచి బయటపడాలి.

వాడికే అన్ని వెధవ తెలివి తేటలుంటే…? కాకలుతీరిన చదరంగం ఆటగాడు సూర్రాజుగారికి ఇంకెన్ని తెలివి తేటలుండాలి? ఇలాటి సందర్భం ఒకటి ఎదురయితే ఏం చేయాలో ఆయన ఊహించకుండా వుంటాడా? దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోకుండా వుంటాడా?

కనిపించిన ఓ తువ్వాలు అందుకొన్న సూర్రాజు రెండో గదిలోకి వెళ్ళి వెనక గోడని చేత్తో తడిమారు. అక్కడ, ఇటుకలు సిమెంట్ చేయకుండా వట్టి మట్టితో కట్టి వుంది గోడ. బలంగా రెండు తన్నులు తన్నేసరికి అవతలకి పడిపోయాయి ఇటుకలు. మనిషి పట్టేంత సందు. బయట వెన్నెల వెలుగు. ఆ వెన్నెల రాత్రిలో… ఊరి వైపు కాకుండా రెండో వైపు చేలగట్లకడ్డంపడి ఆయన రోడ్డెకారు.

నడుస్తూ నడుస్తూనే…. తనని ఎవరూ గుర్తుపట్టకుండా చొక్కా విప్పేసి, తలకి పాగా చుట్టేసారు. రోడ్డెక్కితే ఏబస్సో…లారీయో… దొరక్కపోదు.

భూమి బద్దలయిపోలేదు.

ఆకాశం విరిగి పడిపోలేదు.

అన్ని రోజుల్లాగే సూర్రాజుగారికి ఆరోజూ తెల్లారింది.

అలవాటు ప్రకారమే ఆయన పొదుగుకాడ మేకపాలు శుభ్రంగా పుచ్చుకున్నారు.

రాత్రి నిద్రలేకో… ఏమిటో… కొంచెం కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి అంతే.

ఆ తరువాత…

రోజూలాగే, పల్చటి గుడ్డతో శుభ్రంగా సైకిల్ తుడుచుకుని స్నానానికి లేచారు.

సైకిల్?

అవును సైకిలే!

స్నానం చేసి, వైట్ అండ్ వైట్ వేసుకొని… ఓ యాలిక పండు నములుతూ పోయి మేడమీద గదిలో వాలు కుర్చీలో కూర్చున్నారు. అక్కడ నుంచి చూస్తే అద్దాల్లోంచి రోడ్డుమీద వచ్చే పోయేవాళ్లు కనిపిస్తూ వుంటారు.

ఆయన ఊహించింది నిజమే… సింహాద్రిగాడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి వాకిట్లో దిగాడు.

ఆ సైకిల్ ని ముందు పెద్దయ్యగారిదగ్గరా, చిన్నయ్యగారిదగ్గరా ప్రదర్శనకి పెట్టి, తర్వాత ఊళ్ళో పెద్దలందరినీ పంచాయితీకి పిలిచి, ఆ తర్వాత తాను చావిట్లో బంధించిన సూర్రాజుని చూపించి వెధవని చేసి వదలాలని… వాడి ప్లాన్.

కానీ వాడి ప్లాన్ అంతా తలక్రిందులయ్యింది.

వాకిట్లో నిగ నిగ లాడుతున్న సూర్రాజుగారి ఫారిన్ అంబర్ సైకిల్ చూసి వాడు బిత్తర పోయాడు. తన కళ్ళని తాను నమ్మలేక దాని చుట్టూ తిరిగి మరీ చూసాడు. ఎప్పుడూ లేనిది… హేండిల్ బార్ మీద నం.సూ.రా. అని సూర్రారి పేరు కూడా రాసి వుంది. ‘ ఇక్కడ సైకిల్ వుందంటే… అక్కడ గదిలోంచి సూర్రాజు తప్పించుకున్నాడన్న మాట. హమ్మ రాచనంజికొడుకు ఎంత గొప్ప దెబ్బేసాసేడు. వెధవ పని చేసాడు తను. రాత్రంతా పిచ్చికుక్కలా రోడ్లమీద అక్కడకీ…. ఇక్కడకీ తిరగకుండా అక్కడే కాపలా కాస్తే సరిపోను. ఇప్పుడేం చేయాలి? ఆయన సైకిల్ ఆయన దగ్గరే వుంది.పైగా దాని మీద పేరొకటి. ‘ ఆలోచిస్తూ రెన్నిమిషాలు జుట్టు పీక్కున్నాడు సింహాద్రి.

వాడిని పైనుంచి దడదడలాడే గుండెలతో… ఓ కంట కనిపెడుతున్నారు సూర్రాజుగారు. కానీ ఆ విషయం వాడికి తెలియదు.

‘ ఇప్పుడు తన చేతిలో ఉన్న ఈ సైకిల్ ని సాక్ష్యంగా చూపించి, సూర్రారిని వెధవని చెయ్యాలని చూస్తే… నలుగురూ తననే తన్ని తరిమేస్తారు ‘ అటూ ఇటూ చూసాడు. నయమే… తనని ఈ సైకిల్ తో ఇంకా ఎవరూ చూడలేదు. ఎవరొకరు చూసేలోపు దీన్ని వదిలించేసుకోవాలి… తర్వాత సంగత్తరవాత అని నిర్ణయించుకున్నాడు.

వెంటనే సైకిల్ తొక్కుకుంటూ పోయి ఏటిగట్టున తేలాడు. ఏమీ ఎరగనట్టు సైకిల్ ని గోదాట్లోకి తోసేసాడు. దాంతో వాడి హృదయం తేలికపడింది. ఓసారి మునిగిపోతున్న సైకిల్ వైపు కసిగా చూసి ఇంటి దారిపట్టాడు.

సింహాద్రి అలా వెళ్ళగానే ఇలా మేడ దిగిన సూర్రాజుగారొచ్చి అరుగుమీద కూర్చున్నారు.

సింహాద్రి అప్పుడే కాకినాడనుంచి తిరిగివస్తున్నట్టుగా వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు .

ఇద్దరూ తేలుకుట్టిన దొంగల్లా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. కానీ ఎవరూ ఏమీ బయట పడలేదు.

” ఏరా ప్లీడరుగారున్నారా? ఇదేనా రాడం ” ప్రేమగా అడిగారు సూర్రాజుగారు. ఏమీ జరగనట్టే.

” ఆయ్… కానీ ఆనందాల్లో అగ్గిబరాటా మారిపోయిందండి. ఏదో… వింగ్లీష్ సిన్మా ఆడతంది. తీరా టిక్కట్టు తీసేసానుగందా అని అదే చూసొచ్చానండి. ఒక్క ముక్కద్దం అవలేదు. ఆముక్కే… చెప్పెళదారనొచ్చేను. ఇంకెళ్ళొత్తానండి మేకలిప్పే టైం అయ్యింది. ” తనకీ ఏమీ తెలనట్టే నటించాడు సింహాద్రి కూడా.

వాడు సెలవు తీసుకొని ఇంటి వైపు బయలుదేరాడు.

వాడి కళ్ళల్లో కదిలే బాధ సూర్రాజుగారి దృష్టిని దాటిపోలేదు. ఓడిపోయానన్న బాధ కాదది… గెలవాలన్న కసి. అచ్చం ఇంజరం మూర్తి కళ్ళల్లో కసిలాటిది.

తన ఆటలో కిటుకు వీడికి అర్దమైపోయింది. వీడి ముందు ఇక తన ఆటసాగదు.

ఆట తీరు మార్చుకోవాలి.

ఆట తీరు మార్చుకోవాలా? ఎందుకు?

ఎవరితో ఆడుతున్నాడు తను ఆట? నూకలిస్తే మేకలు కాసే తన మనుషులతోటా? ఎంత దుర్మార్గం.

చ… ఇంక తను ఆట మానేయాలి. మనస్సులో అనుకున్నాననుకొని పైకే అనేసారు సూర్రాజు గారు.

రాత్రికి రాత్రే… కాదనకుండా, లేదనకుండా ఓపిగ్గా తనకో కొత్త అంబర్ సైకిల్ బిగించి ఇచ్చిన ద్రాక్షారామ సైకిల్ స్టోర్స్ ఓనర్ వీర్రాజుకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ.

లేకపోతే ఈపాటికి… హమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది.

నివురు గప్పిన పరువు
‘చపాక రపాక చపాక రపాక’

సాయంకాలపు నీరెండలో… నారింజ చెట్ల నీడన వాలుకుర్చీలో కూర్చుని వున్నారు గాదెల్రాజుగారు.

ఆయన ఓ అరచేతిలో… మచ్చుకి తెచ్చిన వడ్లు బంగారపు గింజల్లా మెరుస్తున్నాయి. ఇంకో అరచేయి ఆ గింజలని బిగబట్టి బాగా నలుపుతోంది.గాదెల్రాజుగారు ఇప్పటి వరకూ అలా ఎన్ని బస్తాల వడ్లని నలిపి నాణ్యత చూసారో లెక్కాపత్రం లేదు కానీ… ఖచ్చితంగా చూసే ఉంటారనడానికి కదును గట్టి నలుపెక్కిన ఆయన అరచేతులు సాక్ష్యం చెబుతాయి..

వడ్ల గింజలని నలుపుతున్న ఆయన రెండు అరచేతుల మధ్యా అగ్గిరాజుకుంటున్నట్టు వేడి మొదలయ్యింది.

‘ చపాక రపాక చపాక రపాక ‘ మంటూనలిగిన  వడ్లగింజల పొట్టురాలి ముత్యాల్లాంటి బియ్యం బయటపడుతున్నాయి. ఆయన కుర్చీ పక్కనే వున్న పొడవాటి బల్ల మీద  కాగితంతో కట్టిన వడ్లగింజల  పొట్లాలు చిన్నకుప్పలా పోసి వున్నాయి. ఆ పొట్లాల మీద పెన్సిల్ తో వాటిని పండించిన రైతుల పేర్లు రత్నాల్లా రాసి వున్నాయి.

వెనక నుంచి ఎవరో ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నట్టు… ఆయన కుర్చీముందున్న వాకిట్లో నీడలు కదులుతున్నాయి.  కదిలి వస్తున్న నీడలు కుర్చీ వెనకే ఆగి పోవడం గాదెలరాజుగారు గమనించారు. కానీ చేసేపనిని ఆపి వచ్చిందెవరా? అని మాత్రం చూడలేదు.  నీడలని బట్టి ఆ వచ్చిన వాళ్ళలో  అబద్దం వున్నాడని ఆయన పోల్చుకున్నారు. తనకి అంత దగ్గరకంటా వచ్చే చొరవా దమ్మూ ధైర్యం ఊరిలో ఆ ఒక్కడికే  వుంది. వాడు ఆయనకి నమ్మినబంటే కాదు  కంచుకవచం కూడా.

” ధరమరాజు గొప్పోడా? దురుయోదనుడు గొప్పోడ్రా?” తల తిప్పకుండానే అడిగారు గాదెల్రాజుగారు వెనకే  నిలబడున్న అబద్దాన్ని.

అబద్దం పక్కనే వాడి కూతురు వీరమణి వాళ్ళ నాన్న చేతిని గట్టిగా పట్టుకొని  ఉంది. అబద్దం ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ముందుకు  నడిచివచ్చి గాదెల్రాజుగారు చేస్తున్న పనిని కన్నార్పకుండా చూడ్డం మొదలుపెట్టాడు అలవాటుగా. వాడినే అనుసరించింది వీరమణి.

గాదెల్రాజుగారు పెద్దాపురం జరీ అంచుపంచె కట్టి,  దానిమీద  ఖద్దరుతో కుట్టిన జబ్బల బనీను తొడుక్కున్నారు. ఆయన ఎదురుగా నిలబడ్డ అబద్దం గోచీ పెట్టుకుని అది కనపడకుండా పొడవాటి మల్లు బనీన్ తొడుక్కున్నాడు. ఆ ఇద్దరికీ ఒకే వయస్సుంటుంది. గాదెల్రాజుగారు తను నలుపుతున్న వడ్లగింజల మీదనుంచి చూపు మరల్చి, తనవైపు చూడ్డంతో… అబద్దం తలకి చుట్టిన తలపాగాని విప్పి, గోచీ కనపడకుండా నడుంకి చుట్టుకున్నాడు. చూడ్డానికి ఆ ఇద్దరి బనీన్లూ ఒకే మిషన్ మీద  కుట్టినట్టు కనబడుతున్నాయి. గుడ్డ రకంలోనే తేడావుంది. కానీ అది నాణ్యత చూసే వాళ్ళకి తప్ప మామూలోళ్ళకి  తెలిసే అవకాశం లేదు.

గాదెల్రాజుగారు ఒకటోరకం దుర్మార్గుడు అంటారు ఆయన గురించి తెలిసినవాళ్ళూ తెలియనివాళ్ళూ కూడా. ఆయనతో ఎవరైనా గొడవ పడితే ఆయన చేతిలో నలిగే వడ్లగింజలకీ వాళ్ళకీ పెద్ద తేడావుండదు. ఒకటే నలుపుడు నలిపేస్తారన్న అపప్రదని ఆయన చిన్నప్పట్నుంచే మూటగట్టుకుని మోసుకు తిరుగుతున్నారు. ఆయన చేసే ప్రతి పనీ  బయట ప్రపంచానికి వెంట వెంటనే తెలిసిపోవడానికి అసలు కారణం అబద్దంగాడి అత్యుత్సాహం, దుష్ప్రచారమే. ఆ విషయం ఆనోటా ఈనోటా గాదెల్రాజుగారి చెవిన పడ్డా ఆయన దానిని అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు.

మశూచితో గుంటలుపడ్డ గాదెలరాజుగారిమొహంలో… చెదలుకొట్టేసినట్టు దవడలు అసహ్యంగా కనపడుతున్నాయి. ఆయన మొహంలో కాఠిన్యం తప్ప లాలిత్యం ఏ కోశానా కనపడ్డంలేదు. ఒత్తైన కనుబొమ్మలు, చివర మెలితిరిగిన కోరమీసాలు  ఆయన మనస్తత్వానికి  ప్రతీకల్లాగా వున్నాయి.

ఆయన వడ్లగింజలని నలుపుతుంటే పట్టుపట్టుకీ దవడకండరాలు బిగుస్తూ… వదులవుతూ… వదులవుతూ… బిగుస్తున్నాయి.

అరచేతుల్లో మిలమిల్లాడుతున్న బియ్యాన్ని,  ఆయన ఒక చేతిలోంచి మరో చేతిలోకి మార్చి మార్చి పోస్తూ… వస్తున్న పొల్లుని ఉప్ అని ఊదేసి, వాటి నాణ్యతని పరిశీలించి చిన్నపొట్లాంలాగా కట్టారు. పొట్ట చీరితే అక్షరం ముక్కలేని గాదెల్రాజుగారు, ఆ పొట్లం మీద గుర్తుకోసం పెన్సిల్ తో ఏవో రెండు బరుకులు బరికారు. కాగితంలో నలపకుండా మిగిలిన వడ్లని ” దాద్దా… బొబ్బో…” మని పిలుస్తూ  కోళ్లకి మేతగా విసిరేసారు.

దండులా వచ్చిన కోళ్ళు వడ్లగింజలని పోటీలుపడి మెక్కుతున్నాయి. అందులో పెట్టలూ పుంజులూ పిల్లలూ  నానారకాల వయస్సువీ ఉన్నాయి. ఒకదాని  కాళ్ల కింద నుంచి మరొకటి దూరి అవి వడ్లగింజలని దక్కించుకుంటున్నాయి. మేత దొరకని ఒక పెద్ద పుంజు పెడీమని పొడిచి ఓ తన్ను తన్నడంతో… దానికి అడ్దుగా వున్న ఓ నల్ల పెట్ట ‘ కేర్ ‘ మని దూరంగా పారిపోయింది. వెంటనే ఆ సంగతి మరిచిపోయి మళ్ళీ తిరిగొచ్చి గింజల వేటలో పడింది అది. గింజలు కనపడని ఒక ఎర్రపెట్ట అడ్దుగా ఉన్న ఓ పుంజు పిల్లని పుటుకూ మని ముక్కుతో పొడవడంతో అది’ పియ్యాం’ అని అరచి పక్కకి తప్పుకొంది.

ఆ పోట్లాటలనీ కాట్లాటలనీ వినోదంలాగా చూస్తూన్న గాదెల్రాజుగారు చేతుల్లోకి ఇంకో వడ్లగింజల పొట్లాం తీసుకున్నారు.

ధాన్యం వ్యాపారం చేసే గాదెలరాజుగారు రైతులకి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అరువు మీద ఇచ్చి బదులుగా పంట చేతికి వచ్చాకా…  ధాన్యాన్ని కొలిపించుకుంటూ వుంటారు. ఏడాదికి సరిపడా తిండిగింజలుంచుకున్న రైతులు మిగిలిన ధాన్యాన్ని కూడా గాదెల్రాజుగారి గాదుల్లోనే పోసేసి రొక్కం పుచ్చుకుని పోతుంటారు. దానికి ఆయన చెప్పిందే రేటు. ఇచ్చిందే ధర. ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల పదూళ్ళలో ఎవరికి ఎంతడబ్బు అవసరం వచ్చినా గాదెల్రాజుగారి దగ్గర చేతులు కట్టుకు నిలబడాల్సిందే. తీసుకున్న అప్పు వడ్డీ పాయిదాలతో తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటినో… పొలాన్నో… ఆయన తన పేరిట దఖలు పరిచేసుకొంటారు. దీంతో గాదెల్రాజుగారికి  ఆస్తులతోపాటు అంతస్తూ పెరిగింది. ఆయన స్వాధీనం చేసుకున్న ఇల్లన్నీ… ధాన్యం గాదెలుగా మారిపోతే, పొలాలు మాత్రం అమ్మకంతో  చేతులు మారిపోతుంటాయి. ‘పొలం ఎప్పుడూ సాగుచేసే వాళ్ల చేతుల్లోనే వుండాలన్నది ఆయన సిధ్ధాంతం. అందుకే ఇల్లు, మేడల మాట ఎలా వున్నా పొలాలని వెంటనే అమ్మేసి  చేతులు మార్చేస్తుంటారు. బాకీపడ్డ వాళ్ల దగ్గరనుంచి పొలాలు లాక్కున్నప్పుడు గాదెలరాజుగారు కించిత్తు కూడా చలించరు. నేలని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని, నేలని నిర్లక్ష్యం చేసినవాడే నాశనమైపోతాడన్నది అయన ప్రగాఢ విశ్వాసం. అధిక దిగుబడినిచ్చే విత్తనాలని అమ్మడంతోపాటూ నూతన వ్యసాయపధ్ధతులనీ  గాదెలరాజుగారు  రైతులకి నూరిపోస్తుంటారు. వింటే ఒక దణ్ణం. వినకపోతే రెండు దణ్ణాలు. పంట చేతికి వచ్చాకా ధాన్యం తెచ్చి గాదెల్లో పోసారా? లేదా అన్నదే ఆయనకి ముఖ్యం.

గాదెల్రాజుగారు కష్టపడి పైకొచ్చారంటారు కొందరు. జనాన్ని కష్టాల పాల్జేసి బాగుపడ్డాడంటారు ఇంకొందరు. గాదెల్రాజుగారి చిన్నప్పుడే ఆయన తండ్రి చినజగ్గరాజు గారు  ఆవు పొడిచి చనిపోయారు. అప్పుడు ఆ ఆవుని… ఓ ఆంబోతు తరుముతోంది. చినజగ్గరాజు గారికీ ఆ ఆంబోతుకీ ఆట్టే పెద్ద తేడాలేదు. ఆడవాసన తగిలితే వావివరసలూ ఉచ్చనీచాలు మరిచిపోయేరకం. అసలు చినజగ్గరాజుగారు  ఆవుపొడిచి చావలేదు… అబద్దంగాడి బాబు ఆదిగాడు కత్తితో పొడిచి చంపేస్తే… ఆనేరాన్ని ఆవు మీదకి తోసేసారన్న వాదన కూడా   వుంది. అది ఉట్టిదో నిజమో చెప్పడానికి ఆరోజు నుంచి ఈరోజుదాకా ఆదిగాడు ఎవరికీ కనబడలేదు. చిన జగ్గరాజుగారు ఎంత దుర్మార్గుడైనా  ఊరిలో మోతుబరి కావడంతో… ముందు ముందు తమకి ఆదిగాడి లాంటి వాళ్ళ  వల్ల ఎలాంటి ధిక్కారం ఎదురవకుండా వుండాలని మిగతా మోతుబరులంతా  రాజుగారి చావుని… ఆవుకి అంటగట్టి,  ఆదిగాడిని అంతమొందించేసారన్న పుకారూ షికారు చేసింది అప్పట్లో. ఆడవాళ్ళని సామ దాన భేధ దండోపాయాలతో తన దారికి తెచ్చుకునే చినజగ్గరాజుగారు ఎన్నో కాపరాలు కూల్చేసారంటారు. ఈ క్రమంలో  తాతలనుంచి సంక్రమించిన ఆస్తులన్నిటినీ  తగలేసారంటారు.

తండ్రి పోయేక మిగిలిన అరెకరం మడిచెక్కని నమ్ముకోలేక, దాన్ని అమ్ముకొని ఊరొదిలిపోలేక గాదెల్రాజుగారు అనూహ్యంగా ధాన్యం వ్యాపారంలోకి దిగారు. అప్పట్నుంచీ ఆయన అసలుపేరు గణపతిరాజన్న విషయం అంతా మరిచిపోయారు. కలిసొచ్చిన వ్యాపారం కరిగిపోయిన అయన ధనరాశినీ… ఎంతకీ తరగని ధాన్యరాశినీ తిరిగి పోగేసింది. ‘ గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?   వాళ్ళబాబు అదో రకం దుర్మార్గుడైతే… ఈ గాదెల్రాజు ఇంకోలాంటి దుర్మార్గుడు.  ఇంక ఆయన కొడుకు జగ్గప్పరాజు గురించి చెప్పనే అక్కర్లేదు.  పెద్దోళ్ళిద్దరికీ  ఏం  తీసిపోడు’  అంటూ జనం చెవులు కొరుక్కుంటూ ఉంటారు.

” ఏరా… మొద్దులా అలాగే నిలబడ్డావ్. యా మాట కానడిపోయిందా?   నీకూతురేట్రిది? ఎప్పుడూ కంపల్లేదే? ” వడ్లగింజలు చేతిలోకి తీసుకుంటూ ఓ సారి వీరమణినీ, అబద్దాన్నీ మార్చి మార్చి చూసి తిరిగి  తమ పనిలో పడ్డారు గాదెల్రాజుగారు .

గాదెల్రాజుగారి అదోలాంటి చూపుకి వీరమణి గుండె ఘొళ్ళు మంది.  ఆ గుండెకి గొంగళిపురుగు పాకినప్పటి జలదరింపు కలిగింది.

“అడిగిందానికి జవాబు చెప్పేడవేరా ఎదవా? దురుయోదనుడు గొప్పోడా? ధరమరాజు గొప్పోడ్రా?” తలెత్తకుండానే అసహనంగా గద్దించారు ఆయన.

‘ పచాపచా కరాకరా ‘ వడ్లు నలుగుతున్న శబ్దం.

” బారు మరి చెప్పాలంటేండి, దుర్రోధనుడంతోడు… దుర్రోధనుడైతే, ధరంరాజంతోడు ధరంరాజండే… నా మట్టుకైతే ధరంరాజే  గొప్పోడనుకుంట్నానండే…” అన్నాడు అబద్దం.

ఆయన నలపడం ఆపి, నలిగిన వడ్ల మధ్య వున్న పొల్లుని ‘ ఉప్ ‘ అని ఊదేసి …. ” మరి నువ్వేమంటావే పిల్లా? ” అని అడిగారు తలెత్తకుండానే.

వడ్లగింజలని నలుపుతుంటే… బిగుస్తూ విడుతూ ఉన్న గాదెలరాజుగారి దవడకండరాలని చోద్యంలా చూస్తున్న వీరమణి ఉలిక్కి పడింది ఆయన ప్రశ్నకి.

” యాటండే…”  అంది నన్నేనా? అన్న అనుమానంతో వాళ్ల నాన్న చేతిమీద చేతిని బిగిస్తూ.

” యే… నువ్వీ లోకంలో లేవేంటీ? మీబాబు ధరమరాజు గొప్పోడంట్నాడు. నువ్వేం అంటావోమరి ”

ఏం జెప్పాలో తెలీక అబద్దం మొహంలోకి చూసింది వీరమణి. ఆ పిల్ల కళ్ళు వడ్డునపడ్డ చేప పిల్లల్లా… గిలగిల్లాడుతున్నాయి.

కాసేపు ఆలోచించి  ” నాకు రామాయణం రాదండే…”  అనేసింది గబుక్కున.

” హహ్హహ్హ ” తోడేలు నవ్వినట్టు పెద్ద నవ్వు నవ్వేసారు గాదెల్రాజుగారు.

” హిహిహ్హి ” అని ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు అబద్దం కూడా.

వాళ్ళలా ఎందుకు నవ్వుతున్నారో… తెలీక ఇద్దరి వైపూ అయోమయంగా చూసింది వీరమణి.

గాదెల్రాజుగారు చేతుల్లోని  బియ్యాన్ని పొట్లాం కట్టేసి… మిగిలిన వడ్లని మళ్ళీ కోళ్ళ మీదకి విసిరేసారు. తర్వాత రెండు చేతులనీ వెనక్కి చాపి కుర్చీ అంచున తలకింద పెట్టుకొని సావకాశంగా తండ్రీ కూతుళ్ళ వైపు చూడసాగారు. కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ.

‘ కొక్కొక్కో’ అంటూ కోళ్ళు పోటీ పడి వడ్లని దక్కించుకుంటున్నాయి. ఓ సారి కోళ్ళ వైపు చూసిన గాదెల్రాజుగారు  ” రోయ్ ఆ నల్లపెట్టని పట్టుకోరా ” ఆజ్ఞాపించినట్టు చెప్పారు.

మేత మేస్తున్న నల్లపెట్ట కాళ్ళని వెనక నుంచి పిల్లిలా నక్కి నక్కి వెళ్ళి   చాక చక్యంగా పట్టేసాడు అబద్దం. ‘కేర్ కేర్ ‘ మంటోంది అది వాడి చేతుల మధ్య.  దాని ‘కేర్ కేర్ ‘ లని పట్టించు కోకుండా మిగతా కోళ్ళు వడ్లగింజలని పోటీపడి  తింటున్నాయి.

నల్లపెట్టని తలమీదా మెడమీదా పాముతూ అది అరవకుండా అనునయిస్తున్నాడు అబద్దం.

అబద్దం దృష్టి కోడి మీద వుంటే… గాదెల్రాజుగారి దృష్టి వీరమణి మీద నిలిచింది.

కౌమార్యం కుబుసంవిడిచిన వీరమణి దేహం… యవ్వనపు మిసమిసలని సంతరించుకొంది. దాని వంటి నునుపులో అది తొణికిసలాడుతోంది. గాలికి నారింజ కొమ్మ కదులుతున్నప్పుడల్లా దాని మెడకింద  నారింజకాయల నీడలు దోబూచులాడుతున్నాయి.

క్రౌర్యం నిండిన కళ్ళతో గాదెల్రాజుగారు తనని గుచ్చి గుచ్చి చూడడం గమనించిన వీరమణి రెండుభుజాలనీ పైకెత్తి…  ఊపిరిని లోపలకి లాక్కొంది.

” ఇన్నాళ్ళెక్కడుంద్రిది … ”  అన్నారు గాదెల్రాజుగారు వీరమణి  మొహంలోంచి చూపు తిప్పకుండానే.

” రాంపురంలో  ఆళ్ళ బాప్ప దగ్గరండె బారు…  నర్సమ్మ అవుతానని సర్దా పడతందండే… నా చేతుల్లో ఏముందండి బారు… ”

” అబ్బోస్ అప్పుడే అంత సదుం సదివేసింద్రా? ” ఆశ్చర్యంగా అన్న గాదెల్రాజుగారు ” నర్సమ్మేం కర్మరా ఏకంగా డాట్రమ్మని చేసెయ్యి… ఏవే పిల్లా సదుంతావా? ” అని ప్రశ్నించారు.

ఆయన మాటల్లో అది ప్రోత్సాహమో? లేక ఎకసెక్కమో? అర్థం కాని వీరమణి కళ్ళెత్తి చూడకుండా బొటన వ్రేలితో భూమ్మీద  రాస్తూ మౌనంగా ఉండిపోయింది.

” మన సంగతేంటేటండి? ఏదీ కానేళ  మా తీరుబడిగా దైచేసారు దొరగారు? ”  వెటకారం చేస్తూ అడిగారు అబద్దాన్ని.

అబద్దం రెండు చేతుల మధ్య వున్న కోడిపెట్టని ఒక చేతిలోకి మార్చుకుంటుంటే… అది కువకువలాడింది.

” బారు మరేండి… మా ఇంటిది చేనుగట్టు మీంచి జారి పడిపోయిందికదండే. సున్నం బెల్లం పట్టేసినా రెండ్రోజుల్నుంచి వాపు తియ్యటలేదండే. కాలు కాని ఇరిగిందేవోనని అనుమానంగుందండే. ఆస్పటాల్ కి ఎల్దారంటే చేతిపట్టున ఓ రెండొందలన్నా  ఉండాలి కదండి మరి ”  నసుగుతూ అన్నాడు.

” రోయ్ నీ తొక్కలో మడి చెక్కమీద ఇప్పుడికి ఎన్నొందలట్టుకు పోయేవో అసలు గుర్తుంద్రా నీకు? నువ్ దాన్ని వందసార్లమ్మినా  బాకీ తీరదు తెల్సా ”

” అదేకదండి బారు మరి మన మజ్జిల రొనానుబొందం. రెండొందలిప్పించండి. ఆస్పటాల్ కెల్లొచ్చాకా చూసుకుందారి. కాలిరగడం అబొద్దం అంకుంటారనే దీన్ని సాచ్చికం అట్టుకొచ్చాను.  చెప్పవే… బారుకి నువ్వు” అన్నాడు వీరమణి కేసి చూస్తూ.

వీరమణి కళ్ళు భూమిలో పాతేసి… వాళ్ళిద్దరి మాటలూ మౌనంగా వింటోంది తప్ప అవునండని సాక్ష్యం చెప్పలేదు.

” ఏంట్రిది… దీనందవేదో కొరుక్కు తినేత్తనట్టు? మొకం దాచేసుకుంటోంది”

” దానిదంతా ఆళ్ళ మామ్మ పోలికండి బారు . పోలికి మాయెమ్మదైనా  ముక్కుచూడండి.  ముక్కు… నా ముక్కేనండీ… అచ్చం రాచముక్కు నాగా అంపట్లేదేటండి …”  అంటూ వీరమణి మొహాన్ని బలవంతంగా పైకెత్తి చూపించాడు.

” రోయ్ అన్నట్టు… ముసల్ది ఈ మజ్జన కబల్లేదు ఎలా వుంద్రా అది? ఓసార్రమ్మను…” ఆరాగా అడిగారు గాదెల్రాజుగారు అబద్దం వాళ్ళ అమ్మ వీరమ్మ గురించి.

” దానికేవండే… బెమ్మాన్నం. ఈ పెట్టనేం చైమంటారూ? కోసేసి దూసైమంటారా?”

” లండీ కొడకా… ఇంట బుట్టిన దాన్ని  కొయ్యమండం నువ్వెప్పుడన్నా విన్నావ్రా? పట్టుకెళ్ళి ముసల్దానికి కోసెట్టు” అన్నారు  మీసం మీద వేలితో రాసుకుంటూ.

” మరి నన్నేం  చైమంటారు?”

” గోదాట్లో దూకు. ధరమరాజు గొప్పోడనడానికి నీకెన్ని గుండెల్రా? దుర్రోధనుడు గొప్పోడంటే అప్పుడాలోచిందును ”  కటువుగా అన్నారు కుర్చీ వెనక నుంచి చేతులు తీసి వళ్ళో పెట్టుకుంటూ.

” బారు మీరే అల్లగంటె నాను ఏవైపోల… అబద్దం ఆడనేక అల్లా చెప్పేసేను కానండి. మీరొవలు గొప్పంటే ఆల్లే గొప్పండి నాకీని.  నాపేరే అబద్దం కదండె… నాను చెప్పింది ఎలా నిజవనేసుకున్నారండి బారు… మీరు హిహిహి ” అన్నాడు అబద్దం.

ఇంతలో ఓగుర్రబ్బండి వచ్చి ఇంటి ముందు ఆగింది. బండిలోంచి దిగిన అమ్ములు అక్కడున్న వాళ్ళ వైపు తలన్నా తిప్పి చూడకుండా లోపలకి విసవిసా వెళ్లిపోయింది. అమె నడుస్తుంటే కాలికి ఉన్న బంగారు పట్టీలు ఘళ్ళు ఘళ్ళు మని చప్పుడు చేస్తున్నాయి.

అమ్ములు గాదెల్రాజుగారి ఒక్కగానొక్క కూతురు. ఆమె అసలుపేరు రమాదేవి.  రామచంద్రపురంలో బియస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అమ్ములని డాక్టర్ చెయ్యాలని గాదెలరాజుగారికి మహా సరదా. తన కోరిక తీరుతుందో లేదోనన్న దిగులు  ఆయనకి ఈ మధ్యనే పట్టుకొంది. రోజూ గుర్రబ్బండిమీద కోలంక దాకా వెళ్లి… అక్కడనుంచి బస్సెక్కి కాలేజీకి వెళ్ళి వస్తూ వుంటుంది అమ్ములు.

” రోయ్… అమ్ముల్ని చూత్తే గుర్తొచ్చింది కానీ. నువ్వు లేపోతే ఎల్రా? రేపు కాకినాడ నుంచి పీడర్లు, డాట్టర్లు, బోల్డంతమంది పెద్ద పెద్దోల్లు బోజనాలకొత్తన్నారు?”

” మరేంజెయ్యమంటారండి  బారు ”

” ఆరోగ్గం కన్న ముఖ్యంవేటి? కానీ…  నేను పురమాయించుకుంటాను లే. నువ్వెళ్ళి… మందులు కొట్టుకాడ జగ్గప్పకి కనపడు. దీన్ని రేపు మన దేవిడీ కాడకి పంపించు …” చెప్పారు గాదెల్రాజుగారు. వీరమణిని పైనుంచి కిందకి చూస్తూ.

గాదెల్రాజుగారి మాటలు విన్న వీరమణి బాణం దెబ్బ తగిలిన పిట్టలా వణికి పోయింది. దానికి కాళ్ళకింద భూమి అమాంతం దిగిపోతున్నట్టనిపించింది. నీటితెర కమ్మిన కళ్ళతో తలెత్తి అబద్దం మొహంలోకి చూసింది. వాడి మొహంలో ఎలాంటి మార్పూ లేదు. అప్పు దొరికిందన్న ఆనందం తప్ప.

” ఆ పొగరుబోతు భూషణంగాడు ఊబిలో దిగబడి చచ్చాడని చెప్పుకుంటన్నారంట ఊరంతా.  మన బాకీ తీర్చలేదని నువ్వే కదరా ఆడ్ని గోదాట్లో ముంచి  చంపేసావ్? మనం చేసిన పని మనం చెప్పుకుంటే పాపం పోద్దికదా! ఎల్లుండినుంచా పనిలో వుండు ” చెప్పారు  గాదెల్రాజుగారు.

ఓ సారి గాదెల్రాజుగారి కళ్ళల్లోకి చూసిన అబద్దం ” ఆ భూషణంగాడినే కాదండి మనబాకీ ఎగేత్తానంటే… ఎవన్నైనా ఏటుకేసెయ్యనా? మరి దిగడతానండైతే… ” అని చెప్పి ఓ చంకలో కోడిపెట్టని, ఇంకో చేత్తో వీరమణి చేతినీ పట్టుకొన్నాడు అబద్దం.

ఇల్లు దగ్గర పడ్డాకా వీరమణి చేతిని విడిచి పెట్టిన అబద్దం, కోడిపెట్టని పట్టుకుని దూరంగా వున్న తాటి  కట్టవలోకి పోయాడు. దాన్ని కోసి దూసెయ్యడానికి. ఒక్క ఉదుటున ఇంట్లోకి పోయి నులకమంచం మీద బొర్లాపడిన వీరమణి… గాదెల్రాజుగారు తనని దేవిడీ దగ్గరకి రమ్మన్న సంగతి తలుచుకుని వెక్కెక్కి ఏడవడం మొదలెట్టింది.

దేవిడీ అరుగుమీద ఉయ్యాల కుర్చీలో కూర్చున్నారు గాదెల్రాజుగారు. ఎదురుగా వున్న వాలు కుర్చీలో కూర్చుని రుసరుసలాడుతున్నాడు జగ్గప్ప. దాదాపు శిధిల స్థితిలో ఉన్న ఆ దేవిడీ అంటే గాదెల్రాజుగారికి చాలా యిష్టం. తాత ముత్తాతలకి చెందిన ఆ దేవిడీలోనే ఆయన పుట్టారు. పెరిగారు. తండ్రి అమ్మేయడంతో చేతులు మారిన ఆ దేవిడీని తన స్వంత సంపాదనతో తిరిగి మళ్ళీ చేజిక్కించుకున్నారు. ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అక్కడే తీసుకుంటారు. అలా చేస్తే కలసివస్తుందని  అదో నమ్మకం.  వాకిట్లో కూర్చున్న అబద్దం తడపలతో  త్రాడు పేనుతున్నాడు.

” రోజురోజుకీ మన పరువు చంకనాకిపోతోంది” బుసలుకొట్టాడు జగ్గప్ప.

” మరేం చేద్దామయితే ”

” అదింక ఇల్లు కదలడానికి  వీల్లేదు”

” ఆ పరిచ్చలేయో అయి పోనీ ”

” అద్దమవదా మీకు? మన కళ్ళుగప్పి రేపో ఎల్లుండో ఆడితో లేచిపోతే… ఉరేసుకొని చావాలి  అందరం” అరిచాడు జగ్గప్ప.

” ఆళ్లింట్లో వాళ్ళకి తెలుసో తెలదో… కుర్రోడు చేత్తన్న నిర్వాకం, చెప్పి చూల్లేపోయేవా? ”

” ఏంటి బాజ్జీ…  మీచాదస్థం. ఊరందరికీ తెలిస్తేకానీ ఈభాగోతం మనకి తెల్లేదు కదా?” కయ్ మన్నాడు జగ్గప్ప.

గాదెల్రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఆయన ఏం చెబుతారా అని జగ్గప్ప, అబద్దం ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.

పచ్చగా పసుపుకొమ్ములా వుండే అమ్ములుని  గాదెల్రాజుగారి కూతురంటే… ఎవరూ నమ్మలేరు. తనని తాను అమితంగా ప్రేమించుకునే గాదెల్రాజుగారికి తన కంటే కూడా  అమ్ములంటేనే ఎక్కువిష్టం. రాచకొంపల్లోని  ఆడపిల్లలంతా  ఊరి బడి అయిపోగానే పెళ్ళిపీటలు ఎక్కేస్తుంటే…  పట్టుబట్టి మరీ అమ్ములుని  పట్నంపంపి చదివిస్తున్నారు గాదెలరాజుగారు.  అమ్ములుని ఆయన డాక్టర్ ని చెయ్యాలనుకుంటుంటే…  పురుషోత్తాన్ని పెళ్ళాడి అతనితో కాపురం చెయ్యాలనుకుంటోంది అమ్ములు. పురుషోత్తం  ఆ ఊరి శివాలయం పూజారి శంకరం గారబ్బాయి.

గాదెల్రాజుగారి దుర్మార్గం గురించి తెలిసికూడా పురుషోత్తం  అమ్ములుని ధైర్యంగా ప్రేమిస్తున్నాడంటే  అర్ధం చేసుకోవచ్చు అమ్ములంటే అతనికి ఎంత అభిమానమో.

” చంపేద్దాం అయితే ” అన్నారు గాదెల్రాజుగారు ఆలోచనల్లోంచి బయటపడి.

” అవును చం…పే..ద్దాం. ” స్థిరంగా పలికింది ఆయన గొంతు.

ఆయన మాటలకి అబద్దం కళ్ళు ఉన్మాదంతో మెరిసాయి. జగ్గప్ప ఏమీ మాట్లాడలేదు. అయితే  చంపేది ఒక్కరినేనా? లేక ఇద్దరినీనా అన్న సందేహం మాత్రం అతనికి వచ్చింది.

” రాములోరు గొప్పోరా? రావణాబెమ్మ గొప్పోడ్రా? ” అడిగారు  వాలు కుర్చీలో కూర్చున్న గాదెల రాజుగారు.

ఆయన ఎదురుగా  అప్పుకోసం వచ్చి అరుగుమీద చాపపై కూర్చున్న రుద్రరాజు సుబ్బరాజూ, కలిదిండి సూరపరాజూ ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరిని ఆ ప్రశ్న అడిగారో? ఎవరు ఏం చెబితే … ఏం తంటా వస్తుందో అన్న సందిగ్ధం వాళ్ళిద్దరి మొహాల్లోనూ కనిపిస్తోంది.

‘ చపాక రపాక చపాక రపాక ‘

గాదెల్రాజుగారి చేతుల మధ్య మచ్చుకి తెచ్చిన వడ్లగింజలు నలుగుతున్నాయి.

వాళ్ళని రక్షించడానికా అన్నట్టు పూజారి శంకరం గారు అక్కడకి అడుగు పెట్టారు. ఆయన రాకని గమనించిన గాదెలరాజుగారు కుర్చీలోంచి మర్యాదగా లేచినిలబడ్డారు. ఆయనతోపాటూ చాపమీది ఇద్దరూ కూడా లేచారు.

“అయ్యగారు ఏదో పనిమీద వచ్చినట్టున్నారు. మాట్లాడి పంపించండి అయితే. మేం సాయంకాలం వస్తాం ” అంటూ అరుగు దిగాడు సుబ్బరాజు. పదరా అన్నట్టు సూరపరాజు భుజం మీద చెయ్యేసి.

పూజారి శకరంగారికి  కుర్చీ చూపించి, తరవాత తన వాలు కుర్చీలో కూర్చున్నారు గాదెలరాజుగారు.

ఆయన చేతుల్లో  నలుగుతున్న వడ్లగింజలని  అభావంగా చూస్తున్నారు శంకరంగారు.

అబద్దం వాకిట్లో  అటూ ఇటూ పచార్లు చేస్తూ… చేతిలో ఉన్న చేపాటి కర్రని  గాల్లో పల్టీలు కొట్టిస్తూ… కర్ర స్వాము సాధన చేస్తున్నాడు.

” బాబుగారు కనిపించమన్నారంటేను… ” గొంతు సవరించుకొన్నారు శంకరంగారు.

” అయ్యా!  ఇయ్యి మీధాంజమేనండి… ” చెప్పారు గాదెల్రాజుగారు చేతిలోని పొల్లుని ఊదుతూ.

బియ్యం గింజలన్నిటినీ ఒకే చేతిలో పోసుకొని… అందులోంచి కొన్ని గింజలని వేరు చేసి తీసారు ఆయన. ” కేళీ ఎక్కువుంది పూజారిగారూ మీ సరుకులో. అందుకే నేను అందరికీ చెబుతుంటాను. చేలో కలుపు మందు కొడితే సరిపోదురా! పొలవంతా కలదిరిగి రెండో రకం దుబ్బులని లాగి పారేయండ్రా అని. ఇంటారా? ఇనరు. ఇనాపోతే ఎలాగుంటదో చూడండి ” అని తను ఏరిన రెండురకాల గింజలనీ శంకరం గారి చేతుల్లో  పోసారు.

శంకరంగారు ఆ గింజలని పరీక్షగా చూసారు. గాదెలరాజుగారు చెప్పింది నిజమే. ఓ చేతిలో గింజలు పొట్టిగానూ…  రెండో చేతిలో గింజలు పొడుగ్గానూ వున్నాయి.

“  ఏర్రా  ఆళ్ళిద్దరూనూ ” అటూ ఇటూ చూస్తూ అన్నారు గాదెలరాజుగారు.

” ఎల్లిపోరండే… ”  చెప్పాడు అబద్దం.

” ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పోయారేంట్రా పనికిమాలినెధవలు? పోతే  పోన్లే… మన పూజారిగారిని అడుగుదాం. ఆయనకి తెలని ధరమం ఏం వుంటది గనక ”

అనుమానంగా చూసారు శంకరంగారు గాదెల్రాజుగారి వైపు.

” అయ్యిలా ఇయ్యండింక ” అని ఆ బియ్యాన్ని పొట్లాం గట్టిన గాదెలరాజుగారు “మీకు తెలంది ఏం వుంది పూజారిగారూ. నాకు ధరమ సందేహాలెక్కువ కదా? రాములోరు గొప్పోరా… రావణాబెమ్మ గొప్పోడా? అని అనుమానమొచ్చి…  మన కుర్ర సన్నాసుల్ని అడిగితే చెప్పకుండానే పారి పోయేరు. మీరన్నా చెప్పండి రాములోరు గొప్పోరా? రావణాబెమ్మ గొప్పోడా?”

శంకరంగారు ఆలోచనలో పడ్డారు. గాదెలరాజుగారి సంగతి ఆయనకి తెలియందికాదు. తనని ఎందుకు పిలిపించారో తెలీనంత అమాయకులూ కాదు ఆయన.

అబద్దం చేతిలో చేపాటి కర్ర…  మొదలు లావుగానూ చివర సన్నగానూ వుంది. ” బారు చూడండి… సరింగా ఈ మొదలు బొడ్లో లటక్కున దూరిపోయేలా వట్రం చేసేను.  బొడ్లో ఎట్టి అలా తిప్పుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకు పోయి రక్తం కక్కుకుని  చావాల్సిందే  ఎంత బలమంతులైనా? సరిపోద్దంటారా ఇంకొంచెం వట్రం చైమంటారా? ” అంటూ కర్ర తెచ్చి గాదెల్రాజుగారి కుర్చీ దగ్గర పెట్టాడు.

” ఎదవా ఎప్పుడూ చంపడం సరదాయే నీకు.  ఏటోనండి,  ఈడికి చంపమని చెబితే అది కోడా?  మనిషా? అని కూడా చూడ్డండి బండెదవ. దానికేం లెండి. నేను అడిగిందానికి జవాబు చెప్పేరు కారు”

” మనిషి మనిషే. రాక్షసుడు రాక్షసుడే. వారిద్దరిలో  మానవజాతి ఒకరిది. దానవజాతి ఇంకొకరిది. జాతులని బట్టి వారు అనుసరించే రీతులు వుంటాయి. రీతులని బట్టి వాళ్ళు ఆచరించే ధర్మాలు ఏర్పడతాయి. భిన్న జాతులకి చెందిన వారిద్దరిలో ఎవరు ఉత్తములు అని ప్రశ్నించుకోవడం అవివేకం. సాహసించి చెప్పబూనడం దుస్సాహసం. మీకొచ్చింది ధర్మసందేహమే అయితే…  అందులో మీకు నచ్చినవారు ఏ ధర్మాన్ని పాటించారో మీరూ అదే ధర్మాన్ని పాటించడం ఉత్తమం ”  చెప్పారు శంకరంగారు ధృడంగా.

మౌనంగా విన్న గాదెల్రాజుగారు గాల్లోకి చూస్తూ తల పంకించారు. ఆయన ఎవరినైనా ప్రశ్నిస్తే… ఏదో సమాధానం చెప్పి  ఎలాగోలా తప్పించుకునే వారే  కానీ, ఇలా తర్కించి మెప్పించి  ఒప్పించాలని చూసిన వాళ్ళు ఇప్పటి వరకూ కనపడ లేదు.

” రోయ్ ”

” బారు ” అన్నాడు దూరంనుంచే  అబద్దం.

” పూజారిగారిని  రోడ్డుదాకా దిగబెట్టి రారా ”

” సెలవిప్పించండి మరి ” చెప్పి లేచారు శంకరం గారు.

తూర్పుగాలి తిరిగింది.

గోదావరికి వరద తగులుతున్న సూచనగా నీరు ఎర్రగా కలకబారింది.

గోధూళివేళ కొత్తగోదావరిని  చూడ్డానికి  ఏటిగట్టుకి  వెళ్ళింది  అమ్ములు.

ఆ వెళ్ళడం  వెళ్ళడం …  మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు.

రోజు

రెండురోజులు గడిచాయి.

ఏటిగట్టుకి సమాంతరంగా ఉప్పొంగిన గోదావరి మూడో రోజుకి ఉధృతి తగ్గింది.  నాలుగోరోజుకి మొత్తం నీరు లాగేసి  బురద మాత్రమే మిగిలింది.

కట్రాటలకి కట్టేసిన పశువులని విప్పారు పాలేర్లు. ఏటిగట్టుకి కింద రెల్లుదుబ్బుల్లో మట్టికొట్టుకుపోయిన అమ్ములు ఓణీ పీలికలై కనిపించింది. ఒండ్రుమట్టిలో కూరుకుపోయి తళుక్కుమంటూ బంగారుపట్టీ కనిపించింది. అంతకు మించి ఏ ఆనవాళ్ళూ దొరకలేదు.

గాదెల్రాజుగారికి పరామర్శలు వెల్లువెత్తాయి.

ఆయన మొహంలో ఎలాంటి  విచారం లేదు. కంటి నుంచి  చుక్క నీరు రాలిన పాపాన పోలేదు.

నారింజ చెట్లనీడలో… వాలు కుర్చీలో కూర్చుని ఉంటున్న ఆయన, వరదకి ముందు కురిసిన వర్షానికి అక్కడక్కడా పడి మొలకలెత్తిన వడ్ల గింజలని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఆ పచ్చటి మొలకలకి పైన వ్రేల్లాడుతున్న ధాన్యపు పొల్లు కిరీటాల్లాగా కనిపిస్తున్నాయి.

రెండుమూడురోజుల తరవాత పోలీసులకి  ఓ ఆకాశరామన్న ఉత్తరం అందింది.

గాదెల్రాజుగారి అమ్మాయి రమాదేవి ప్రమాద వశాత్తు వరదలో కొట్టుకుపోలేదు. పూజారిగారబ్బాయి పురుషోత్తంతో లేచిపోతుంటే… అబద్దమూ , జగ్గప్పా కలిసి ఇద్దరినీ బొడ్లో కర్రపెట్టి తిప్పి చంపేసారని.

పోలీసులు వచ్చారు. వాళ్ల దగ్గర పవరుంటే… గాదెల్రాజుగారి దగ్గర డబ్బుంది. పోలీసులకి  ఏం చెప్పారో? మరి ఏం ఇచ్చారో? తెలీదుకానీ వాళ్ళు ఎవరినీ ప్రశ్నించకుండానే వెళ్ళిపోయారు. పురుషోత్తం కనపడ్డం లేదని… పోలీసులు వెళ్లి…  ఫిర్యాధు ఇమ్మని చెప్పినా , వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ స్పందించలేదు.

అబద్దం చేతిలో ఉన్న చేపాటికర్రని చూస్తుంటే జనం వణికి పోతున్నారు. వాడు యమభటుడిలా కనిపిస్తుంటే… వాడి కర్ర యమపాశంలా కనిపిస్తోంది అందరికీ. వాడిచేతిలో కర్ర ఊగుతుంటే… పేగులు లుంగచుట్టుకుపోతూ ప్రాణభయంతో విలవిల్లాడుతూ ఆర్తనాదాలు చేస్తోన్న అమ్ములూ పురుషోత్తంలే కళ్ళ ముందు కదలాడుతున్నారు  జనానికి.

రోజులు నెలల్లోకీ …

నెలలు సంవత్సరాల్లోకీ మారిపోతున్నాయి.

జనం  అమ్ములూ పురుషోత్తంల  ప్రేమకధని క్రమంగా మర్చిపోయినా… గాదెలరాజుగారి దుర్మార్గాన్ని మాత్రం  మర్చిపోవడంలేదు. వెదవ పరువుకోసం, బంగారంలాంటి కూతుర్ని చంపించేసాడు దుర్మార్గుడు. ఇంతకి ఇంతా అనుభవించి చస్తాడు అని శపిస్తూనే ఉన్నారు. వాళ్ల శాపాలు ఫలించిన పాపాన పోవడం లేదు. ప్రతి ఏటా గాదెలరాజుగారి కుటుంబం రెండునెలలు ఉత్తరదేశ యాత్రలకి వెళ్లి వస్తూ…  జనం శాపాలకి విమోచనం చేసుకుంటోంది. పుత్రుడి జాడ తెలీక పుట్టెడు దు:ఖంలో వున్న పూజారిగారి కుటుంబాన్ని కూడా గాదెల్రాజుగారు  తమ కూడా తీసుకెళ్లి  తీర్ధయాత్రలు చేయిస్తూ బ్రహ్మహత్యాపాతకాన్ని కడిగేసుకుంటున్నారు.

‘ తీసుకెళ్లేవాడికి బుద్ది లేకపోతే, తోకూపుకుంటూ కూడా వెళ్ళేవాళ్ల కయినా బుద్ది ఉండక్కర్లేదా ?’ అని జనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.

ఏళ్లకి ఏళ్లు… ఏడేళ్లు గడిచిపోయాయి.

అబద్దం కూతురు వీరమణి  డాక్టర్ వీరమణిగా ఊరికి తిరిగొచ్చింది. దేవిడీని  ఆసుపత్రిగా మార్చేసి  వీరమణికి అప్పగించారు గాదెల్రాజుగారు. రమాదేవిని డాక్టర్ గా చూడాలనుకున్న గాదెలరాజుగారు వీరమణిని  డాక్టర్ గా  చూడగలిగారు.

కళ్ళెదురుగా  డాక్టర్ కనిపిస్తూండడంతో చిత్రంగా రోజుకో రోగం పుట్టుకురావడం  మొదలయ్యింది  ఆయనకి.

” అప్పివ్వడానికి మా గాదెలబారున్నారు… వైద్యం చేయడానికి మా వీరమనొచ్చేసింది. ఇంతకంటే  ఊరికేం కావాల” కనిపించిన ప్రతివాళ్ళనీ ప్రశ్నిస్తూ తిరుగుతున్నాడు అబద్దం.

” ఇగో డాట్రమ్మ, కృష్ణుడు గొప్పోడా…  కర్ణుడు గొప్పోడా? ” అడిగారు గాదెల్రాజుగారు నాడి చూస్తున్న డాక్టర్ వీరమణిని.

” వాళ్ళ మాటేమో కానీ… నాకు తెలిసి  గాదెలరాజుగారంతటి గొప్పోరు లేరండి ఈలోకంలో ” అంది డాక్టర్ వీరమణి. అలా అంటుంటే… ఆమె గొంతు పూడుకుపోయింది. చూపుకి నీటిపొర అడ్డుపడింది. ” పరువుని హత్య చేసుకొని… ” గొంతు సర్ధుకొని వీరమణి ఏదో చెప్పబోతుంటే…  అడ్డుకున్న గాదెల్రాజుగారు  ” అన్నట్టు నీకు రామాయణం రాదు కదా… నిన్నీ పెశ్న అడగడం నాదే పొరపాటు డాట్రూ…”  అన్నారు.

డాక్టర్ వీరమణికి ఒకప్పటి సంగతి గుర్తుకు వచ్చి మొహాన చిరునవ్వు  అలుముకుంది. అబద్దం  మాత్రం   ’హహ్హహ్హా ‘  అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టాడు.

ద్వాదశి
ఆకాశరాజు కూతురు  చిట్టడవిలాంటి చిక్కటి నల్లటి  తన జుట్టుని పాయలు పాయలుగా విడదీసి  దువ్వుకొంది. ఆ చక్కటి కురులని బిగించి కట్టడానికి ఇంద్రధనస్సుని మించిన రిబ్బన్ ముక్క మరెక్కడ దొరుకుతుంది? అందుకే దానినే రెండుగా త్రెంచి జడలకి కుచ్చీలుగా కట్టుకొంది. తనవైపే అపురూపంగా చూస్తున్న చందమామని అలవోకగా అందుకుని ఓ చెంపన తురుముకుంది.అడుగుకో కూతురున్న ఆకాశరాజుకి, ఆమె ఎన్నో కూతురో తెలీదుకానీ, పేరు మాత్రం ద్వాదశి. ద్వాదశి అందం మామూలు అందం కాదు.  అదో గిలకబావి. తోడేకొద్దీ ఊరినట్టు, చూసే కొద్దీ ఆ అందం రెట్టింపవుతూ ఉంటుంది.ఆమె నడుముని మెచ్చుకుంటే మెడకి కోపం. మెడని మెచ్చుకుంటే జడకి తాపం. ఆమె దేహంలో ప్రతివంపునీ వర్ణించాలంటే మామూలు వాళ్ళకి సాధ్యం అయ్యే పని కాదు. ఎవరైనా తపస్సు చేసి గడ్డాలూ మీసాలూ పెంచుకుంటే  తప్ప.

ఎన్నేళ్ళుగానో ద్వాదశిని మోహిస్తూ వెంటపడి మరీ వేధిస్తున్నాడు మూడో మేఘరాజు. అరగంట పాటు అనుగ్రహిస్తే చాలు, ఆమె లోతైన బొడ్లో దూకి, చచ్చి స్వర్గానికి పోవాలని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. కానీ ఆ కలలన్నీ కల్లలయ్యాయి. ద్వాదశి మనస్సు కరగదనీ, తను అనుకున్నది ఇక  ఎప్పటికీ జరగదనీ గ్రహించిన అతను, మనస్సులోనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.

రెండ్రోజులుగా ఆ రోదనకి అడ్దుకట్ట పడడం లేదు. తమ అనుంగు సోదరుని దుస్థితికి, అశేష మేఘరాశి తరలి వచ్చి  అశ్రువులు చిందిస్తుండడంతో భూమండలం మొత్తం తడిసి ముద్దవుతోంది. జనజీవనం స్తభించి పోయింది.

చంద్రుడు ద్వాదశి కురుల్లో చిక్కడిపోవడంతో తన ఆప్తమిత్రుడి కోసం ఎక్కడెక్కడో వెదుకుతూ, విసిగి వేసారి దారి తప్పిపోయినట్టున్నాడు సూర్యభగవానుడు. లేకుంటే అలసి సొలసి ఇంకెక్కడైనా ఆదమరిచి నిద్రపోతున్నాడో… ఎవరికీ ఎండ మొహం  కనపడ్డం లేదు.

భారత వాతావరణ శాఖ ఈ విపరీత పరిణామాన్ని తుఫాన్ గా ప్రకటించింది. ప్రపంచ వాతావరణ శాఖ దానికి ద్వాదశి అని పేరు పెట్టింది.  దాంతో పేపర్లలోనూ టీవీల్లోనూ ద్వాదశి పేరు మారుమ్రోగిపోతోంది.

గంటకోసారి సముద్రం దగ్గర రెయిన్ కోట్లతో నిలబడిన టివి రిపోర్టర్లు, మధ్యమధ్యలో గొడుగులు వేసుకుని మరీ బంగాళాఖాతంలో ద్వాదశి గమనం, గమకం, కదలిక, కవళిక, వేగం, వైనం వగైరాలన్నిటినీ వివరించి వివరించి చెబుతూ ప్రజలని అప్రమత్తం చేస్తూనే ఎవరికి వారే భయాందోళనల్లో  తడిసి ముద్దవుతున్నారు.

వర్షం. ఒకటే వర్షం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తెల్లటి చల్లటి వర్షం.

నింగినీ నేలనీ కలిపి వెండి  దారాలతో కుడుతున్నట్టు… మిడిసి పడుతున్న మోటు చినుకుల  వర్షం.

మేఘాలన్నీ ఏకమై శోకండాలు పెడుతున్నట్టూ, ఏనుగులు తొండాలతో నీళ్ళు తోడిపోస్తున్నట్టూ  పెద్ద వర్షం. అతి భారీ వర్షం. చెరువులూ దొరువులూ నిండిపోతున్నాయి. వాగులూ వంకలూ పొంగి పొర్లుతున్నాయి. నదులు జలహస్తాలతో సముద్రం వైపు ఈదలేక ఈదుతూ అలసటతో ఇక కదలలేక దగ్గరి దారులు వెదుక్కుంటున్నాయి.

ఎవరూ కాలు కదిపే పరిస్థితి లేదు. కారు నడిపే అనుకూల వాతావరణం అసలే కాదు. ఈదురు గాలులకి తీరం వెంబడి  ఆకాశ హర్మ్యాల  అద్దాలు బద్దలవుతున్న శబ్ద కిరాతకమే అంతటా.

కాకినాడ మెట్రోపాలిటన్.

జి.యం.ఆర్.పోర్ట్, ఈస్ట్ అవెన్యూ. సీఫేస్ అపార్ట్ మెంట్స్.

ఇరవై అంతస్తుల  ఆ అపార్ట్ మెంట్లో తర్డ్ ప్లోర్. ఫ్లాట్ నంబర్ ఫోర్.

అందులో  ఒక మహా కుట్రకి అంకురార్పణ జరిగింది. దాని సూత్రధారి నరసింహ సాయి విఘ్నేశ్  శ్రీవాస్తవ్.

రాజమహేంద్రవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఇండియన్ ఎయిర్ లైన్స్  విమానాన్ని ప్యాసెంజర్స్ తో సహా ఇప్పటివరకూ ఎవరూ ధ్వంసం చేయని విధంగా ధ్వంసం చేసి, ఎలాంటి విధ్వంసం సృష్టించాలా? అని  రెండురోజుల్నుంచీ అతను రకరకాలుగా పథక రచన చేస్తున్నాడు .

సాయి విఘ్నేశ్ శ్రీవాస్తవ్ తీవ్రవాది కాదు. ఉన్మాది కూడా కాదు.  ఉగ్రవాది అంతకంటే కాదు. అతను ఒక ప్రొఫెసనల్ తెలుగు నావెలిస్ట్. ఆకట్టుకొనే ఆరంభ వాక్యాలతో పాఠకుడికి కనికట్టు చేయడం శ్రీవాస్థవ్ కి పెన్నుతో పెట్టిన విద్య. ఉత్కంఠతో ఊపిరాడనివ్వకుండా  చేస్తూ పాఠకులని ఏవో అద్వితీయ లోకాలకి తీసుకు పోయి,  వారిని తన కాల్పనిక జగత్తుకి దాసోహం చేసే సుశిక్షిత అక్షర మాయావి అతను.

శ్రీవాస్థవ్ రాస్తున్న కొత్త నవల ఓ మ్యాగ్ జైన్ లో సీరియల్ గా వస్తూ క్లైమాక్స్ దశకి చేరుకుంది.

ఆ నవల పేరు ‘ ద్వాదశి ‘. పాఠకుల ఊహలు అంతమయ్యేచోట కొత్త ఉత్కంఠని రేపుతూ వాళ్ళ కళ్ళని పేజీల వెంట పరుగులు తీయిస్తోంది ద్వాదశి. వర్షం మొదలవడంతో ప్రారంభమై,  వర్షం ఆగడంతో నవల ముగిసేలా ద్వాదశిని పక్కాగా ప్లాన్ చేసాడు శ్రీవాస్థవ్. ఎవరూ కనీ వినీ ఎరుగని బిగువుతో పాఠకుల వళ్ళు గగుర్పొడిచేలా దడదడలాడే గుండెలతో చదివించేలా దాని క్లైమాక్స్ రాయడంలో  విఘ్నేష్  శ్రీవాస్ఠవ్ ప్రస్తుతం నిమగ్నమయి ఉన్నాడు.

అతను తన రీడింగ్ రూంలో…

టేబుల్ మీది డెస్క్ టాప్ ముందు కూర్చుని చకచకా అక్షరాలని టైప్ చేస్తున్నాడు. కానీ సగం వాక్యం కూడా పూర్తి కాకుండానే, అతని వ్రేళ్ళు ముందుకు కదలనని మొండికేస్తున్నాయి. ఇప్పటివరకూ రెండుమూడు క్లైమాక్స్ లు రాసాడు. అయినా అవేవీ  అతనికి ఎంతమాత్రం సంతృప్తిని కలిగించలేదు. దీంతో వాటిని  డిలీట్ చేసి, ఇంకా ఇంకా కొత్తగా ఆలోచిస్తూ సరి క్రొత్తగా రాయడం మొదలెట్టాడు.

కీబోర్డ్ మీద అతని వ్రేళ్ళు కదలక పోవటానికి కారణం ఉదయం నుంచీ అతనికి ద్వాదశి కనిపించకపోవడం. ఇప్పటికే నాలుగైదు సార్లు ఆమెని చూడాలని  తహతహలాడాడు. ఆ అందాలభరిణె ఎందుకోగానీ ఈరోజు అతనికి మొహం చాటేసింది.

ఆమె ఉండే ప్లాట్ అద్దాలకి పరదాలు అడ్డుగా వేసి ఉన్నాయి. ఆమె ముఖారవిందాన్ని చూస్తే కానీ తనకి మళ్ళీ మునుపటి  ఊహా ఉత్సాహం తిరిగొచ్చేలా లేవు. ద్వాదశి పేరు తలుచుకుంటేనే అతనిలో ఓ ఉల్లాసం. ఆమెని అలా చూస్తూ ఉంటే అదోలాంటి పరవశం.

శ్రీవాస్థవ్ కంప్యూటర్ ముందు కూర్చోలేక హాల్లోకి వచ్చి, ఇంకోసారి  బైనాక్యులర్స్ చేతిలోకి   తీసుకున్నాడు. తూర్పువైపు  బాల్కనీలోకి వెళ్ళి  ఎదురుగా ఉన్న  అపార్ట్ మెంట్ వైపు ఫోకస్ చేసాడు.

తన కలలచెలి… ఊహాఊర్వశి… ద్వాదశి, అదుగో. అదుగో.. అదుగో…

ఆ జగదేకసుందరి, అతని  నవలా నాయిక ద్వాదశి బాల్కనీలో దర్శనమిచ్చింది. కళ్ళతోనే  దోసిల్లకొద్దీ అప్సరసం త్రాగి, తనలోని విరహాగ్నిని చల్లార్చుకొని, నూతనోత్తేజంతో ప్లాట్ లోపలకి తిరిగి వచ్చిన శ్రీవాస్థవ్  కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అతనిలో ఊహలు  వాయువేగ మనో వేగాలతో విహరిస్తున్నాయి. కీబోర్డ్ మీద అతని వ్రేళ్ళు రేసుగుర్రాలని మరిపిస్తున్నాయి.

ప్లాట్ లో…

కీబోర్డ్ టకటకలు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ ఏకాంత ప్రశాంతతని భగ్నం చేస్తూ కాలింగ్ బెల్  మ్రోగింది.

గోడకి అమర్చిన ఇండికేటర్ లో ఓ అగంతకుడు గుమ్మం ముందు నిలబడి  ఉండడం కనిపించింది.

అతన్ని ఎక్కడో చూసినట్టుగా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. కానీ  ఎవరన్నది గుర్తుకు రావడం లేదు.  అతని కుడి వైపు దవడ మీద అప్పుడప్పుడే మానుతున్న పొడవాటి గాయపుమచ్చ పచ్చిపచ్చిగా కనిపిస్తోంది.

‘ ఎవరు? ‘, ‘ ఎవరై వుంటాడు? ‘

ఇంట్లో  వేరే ఎవరూ లేకపోవడంతో అతనే లేచి వెళ్ళి తలుపు తెరిచాడు.

(అ)పరిచితుడు దృఢంగా, ఎత్తుగా ఉన్నాడు. వర్షంలో తడవడం వల్ల  అతని బట్టలు తడిచి ఉన్నాయి.  తలలోంచి మొహం మీదుగా  వర్షపు నీళ్ళు కారుతుంటే కర్చీఫ్ తో తుడుచుకుంటున్నాడు.

” మిష్టర్ విఘ్నేష్ ” అంటూ ఆర్ధోక్తిగా ఆగాడు అతను. కొద్ది క్షణాల పాటు తల తుడుచుకోవడాన్ని ఆపి.

” యస్…  లోపలకి రండి ” తలుపుకి అడ్డం తొలగి పక్కకి జరిగాడు శ్రీవాస్తవ్.

(అ)పరిచితుడు కాళ్ళకి ఉన్న బూట్లూ  మేజోళ్ళూ అక్కడే విప్పి లోపలకి అడుగుపెట్టాడు.

ఒకసారి హాలుని నలుమూలలా పరిశీలనగా చూసి “కూర్చోవచ్చా” అంటూ మర్యాద పూర్వకంగా అడిగి, సోఫాలో కూర్చున్నాడు అతను.

అతన్నే తదేకంగా చూస్తున్న శ్రీవాస్థవ్ “సారీ… మీరు? మిమ్మలని ఎక్కడో చూచినట్లుగా ఉంది. ఐ మీన్ ఎంతో పరిచయస్థుల్లాగా ఉన్నారు” అన్నాడు, తనూ అతని  ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

(అ)పరిచితుడు పెదాలు విడీ విడనట్టుగా నవ్వాడు.

“నేను మీకు బాగా తెలుసు. నేను ఇలా వున్నానంటే అందుకు కారణం మీరే. బహుశా పేరు చెబితే గుర్తుకు రావొచ్చనుకుంటాను ” అంటూ శ్రీవాస్థవ్ కళ్లలోకి నర్మగర్భంగా చూసాడు.

ఆ చూపు చురకత్తి కొసలాగా గుచ్చుకున్నట్టు తోచింది శ్రీవాస్థవ్ కి . ఎందుకో ఒక్కసారిగా వళ్ళు జలదరించినట్టయ్యింది. అతని  వైపు అలా మంత్రం వేసినట్టుగా చూస్తూ ఉండిపోయాడే తప్ప,  అతనెవరో  ఏమాత్రం గుర్తుకు తెచ్చుకోలేక పోయాడు .

తడిసి అతని వంటికి అతుక్కుపోయిన టీ షర్ట్  లోంచి,  మెలితిరిగిన కండలు బహిర్గతమవుతున్నాయి. ఈ కండలూ, ఆ హెయిర్ స్టైల్, ఆ దర్పం చూస్తుంటే తర్ఫీదుపొందిన ఏ పోలీసు అధికారో అయి ఉంటాడనిపిస్తోంది. తనకి పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ మనఃఫలకం మీద  మెరిసి మాయమవుతున్నారు తప్ప, (అ)పరిచితుడి ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు.

అక్కడ ఉత్సుకత ఊపిరి పోసుకొంది. అది ఉద్వేగంగా మారి ఘనీభవిస్తోంది.

క్షణాలు దొర్లుతున్నాయి. అవి నిమిషాల్లోకి మారే లోపు…

“ఐ యాం… మేఘాంశ్ , రణధీర్ మేఘాంశ్ “   అన్నాడు అతను. మొలలో ఉన్న రివాల్వర్ ని తీసి టీపాయ్ మీద పెడుతూ…

“రణధీర్ మే…ఘాం..శ్. ” ఆ పేరు అతని నోట్లోంచి బుల్లెట్ లాగా దూసుకు రావడంతో శ్రీవాస్థవ్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు.

“వ్వాట్ “, అతని గొంతులో అదోలాంటి భయపు జీర.

“కూల్… మీరు విన్నది నిజమే. నా పేరు రణధీర్ మేఘాంశ్. జాయింట్ డైరక్టర్, సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరో. చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్.  అన్నట్టు ఈ డిజిగ్నేషన్ మీరు ఇచ్చిందే కదా!” వత్తి పలికాడు  మేఘాంశ్.

శ్రీవాస్థవ్ మెదడు మొద్దుబారిపోతోంది. అతని దేహం రోమాంచితమయ్యింది.  మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఏసీలో కూడా అతనికి  చెమట పట్టడం మొదలయ్యింది.

‘మేఘాంశ్… ఐ.బి.ఆఫీసర్., తన ద్వాదశి నవలలో అతనిది విలన్ క్యారెక్టర్.  అవును, అతనే… తన ఎదురుగా తాపీగా కూర్చుని ఉన్నాడు. ఇది అబద్ధం కాదు. అభూత కల్పన అంతకంటే కాదు. కాలాన్ని దహించే నిప్పులాంటి నిజం. తను అతన్ని ఏ యే పోలికలతో సృష్టించాడో? అచ్చుగుద్దినట్టు అవే పోలికలతో, అలాగే ఉన్నాడు. అదే చూపు. ఆ చూపులో అదే క్రౌర్యం.

అదే ఆహార్యం. అవే హావభావాలు. అదే ఒడ్డూ పొడుగూ ఎట్సెట్రా ఎట్సెట్రా .అతనే ఇతను. ఇది అక్షరసత్యం.

“నమ్మలేకపోతున్నారు కదూ?  నిలువుటద్దాన్ని పగలగొట్టించి మరీ ద్వాదశి చేత నా మొహంమీద కసిగా పొడిపించింది మీరే కదా! అప్పుడే మర్చిపోయారా? రక్తం మడుగులు కట్టేసింది. హబ్బ తలుచుకుంటుంటే… గాయం ఇంకా సలుపుతున్నట్టే ఉంది. ఇంతకీ  ఎక్కడ ఉందో ఆ ద్వాదశి!  నాక్కానీ కనిపించాలి. అప్పుడు తెలుస్తుంది దానికి నా అసలు దెబ్బ. “దవడమీది గాయాన్ని తడుముకుంటూ… విషపు నవ్వు నవ్వాడు మేఘాంశ్.

ఆ నవ్వు, మేఘాంశ్ అంతరంగానికి అద్దం పడుతూ ఉండడంతో శ్రీవాస్థవ్ ఆలోచనల్లోంచి బయట పడ్డాడు.

శ్రీవాస్థవ్ ఉద్దండపిండంలాంటి వాడు. అందుకే అతను  ఇంకా ఆలోచించ గలిగే స్థితిలో ఉన్నాడు. అదే మవరైనా అతని స్థానంలో ఉండి ఉంటే ఈపాటికి భయంతో గుండె ఆగి చచ్చిపోయేవాడు. తను సృష్టించిన పాత్ర. తన ఇంటి తలుపే తట్టి, తన ఎదురుగానే కూర్చుని మాట్లాడుతుంటే చూస్తూ చూస్తూ ఎవరైనా మాత్రం ఎలా బతికి బట్టగలరు? హీనపక్షం పిచ్చెక్కి పోవడం ఖాయం. ప్రస్తుతం అలాంటి మానసిక స్థితికి  కొంచెం అటూ ఇటూగా చేరుకున్నాడు శ్రీవాస్థవ్.

‘ వాస్తవం కల్పన కంటే కరుకైంది ‘ అంటే ఇదేనేమో.

శ్రీవాస్థవ్  ఆలోచనలతో తనకి సంబంధం లేనట్టు అతని మొహంలో కదులుతున్న భావాలని నిశ్శబ్దంగా చదువుతున్నాడు మేఘాంశ్.

నిలువెల్లా చమటతో తడిసి ముద్దైన శ్రీవాస్థవ్ కి వెన్నులో సన్నగా వణుకు మొదలయ్యింది. వంట్లో నరాలనన్నిటినీ లాగి ఎవరో తాడులా పేనుతున్న అనుభూతి.

‘ద్వాదశి చేసిన గాయానికి ఈ పాత్రగాడు అదే మేఘాంశ్, తనమీద రివెంజ్ తీర్చుకోడానికి వచ్చాడా? అందుకే వచ్చాడా? లేకపోతే ఇంకేమైనా ఉందా?’ ఎక్కడా అతని ఆలోచనలు తెగడం లేదు. ఎవరో గుండెని నొక్కి పిండేస్తున్నట్టు అదోలాంటి ఉక్కిరి బిక్కిరి. తలపగిలపోయేటంత టెన్షన్.

“చెప్పండి, ద్వాదశి ఎక్కడ?”  మేఘాంశ్  ప్రశ్న అతనికి వినపడలేదు. లేక వినపడినా వినపడనట్టు నటించాడో?

అంత గందరగోళంలోనూ శ్రీవాస్థవ్ ఏదో గుర్తుకు వచ్చినట్టు చటుక్కున లేచి, విండో దగ్గరకి పరిగెత్తాడు.

అది గమనించిన మేఘాంశ్ రివాల్వర్ ని  చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని వెనకనుంచి శ్రీవాస్థవ్ కి గురిపెట్టాడు. ఆ విషయం శ్రీవాస్థవ్ గమనించలేదు. కిటికీ కర్టెన్లు సర్రుమని లాగి చూసిన శ్రీవాస్థవ్ నిశ్చేష్టుడైపోయాడు.

బయట వేసవి కాలపు ఎండ మండిపోతూ ఉంది.  అటుప్రక్క బీచ్ వైపు రోడ్ మీద ఓ కార్ పార్క్ చేసి ఉంది.   ఎర్రటి పొడవాటి ఆ కారు మీద పడ్డ వర్షపు చినుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.  వైపర్స్  ఆన్ చేసి ఉండడంతో అవి కారు అద్దం మీద,  కిందకీ మీదకీ లేస్తూ చినుకులని చెదరగొడ్తున్నాయి.

నిలువెల్లా తడిచి ఉన్న ఇద్దరు అగంతకులు నక్కి నక్కి తన ప్లాట్ వైపే బైనాక్యులర్స్ తో చూస్తున్నారు.బహుశా వాళ్ళు మేఘాంశ్ అనుచరులై ఉంటారు.  “ఎ.. ఎందుకు? నన్ను వెదుక్కుంటూ…  నవల్లోంచి బయటకి  వచ్చారు?” మేఘాంశ్ ని అడుగుతున్నాననుకున్నాడు శ్రీ వాస్థవ్. కానీ అతని నోటి నుంచి మాట ఊడిపడ లేదు.

విపరీతమైన అశాంతికి లోనైన శ్రీవాస్థవ్ ని తీవ్రమైన మానసిక వత్తిడి లోబరుచుకుంది. కిటికీ దగ్గర నుంచి వెనక్కి తిరుగుతూ తిరుగుతూనే అతను స్పృహ తప్పి దబ్బున కింద పడిపోయాడు.

శ్రీవాస్థవ్ కళ్ళు తెరిచే సరికి, ఎదురుగా ఏమీ కనిపించడంలేదు.

‘ఇదేంటి? ఏమీ కనిపించకపోవడం ఏమిటి? తన కళ్ళు కానీ పోయాయా?’

‘నో…నో అలా జరగడానికి వీళ్ళేదు ‘ మానసిక సంచలనం మొదలయ్యింది అతనిలో…

‘నల్లటి ముసుగు లాంటిది తన తలకి తగిలించి ఉంది. కనిపించకపోవటానికి అదీ కారణం ‘

అసలు  విషయం గమనించడంతో మనస్సు తేలికైంది అతనికి.

‘ఉరి తీసే ముందు నేరస్థులకి కూడా ఇలాంటి ముసుగే కప్పుతారు కదా! అయితే? మేఘాంశ్, తనని ఉరి తీసి  చంపాలనుకుంటున్నాడా? మనుషులకి అంటే పగలూ ప్రతీకారాలూ కామన్. ఈ ప్రేమలూ, ద్వేషాలూ సహజం. కానీ  కల్పిత పాత్రలకి కూడా ఈ జాడ్యం ఉంటుందా? అంటే ఇప్పుడు తన తల మీదుగా పైన ఉరి త్రాడు వ్రేళ్ళాడుతూ ఉండి ఉండొచ్చా?’ రకరకాల అనుమానాలు అతని మనస్సులో తిరుగుతున్నాయి.

‘అనుమానాలా, ఆలోచనలా ఇవి. ఖచ్చితంగా ఆలోచనలే. ఇన్ని రకాలుగా ఆలోచించగలుగుతున్నాడు కాబట్టే తను రచయిత కగలిగాడు. చేతులతో ముసుగుని లాగడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదు అనడం కంటే చేతులు సహకరించలేదు అనడం కరక్ట్.

‘ మై గాడ్…నా చేతులు, అయ్యో…నాచేతులు?’ దేహంలో రక్తం అంతా గడ్డకట్టుకుపోతున్న ఫీలింగ్. ‘నా చేతులు ఏమయ్యాయి?’ భయంతో నిస్సత్తువ ఆవహిస్తోంది అతన్ని.

‘నా చేతులు నరికేసారు. చే…తు…లు నరికేస్తే! మరి నొప్పి ఏదీ?  ఏమో… తనని ఎన్ని రోజులయ్యిందో ఇక్కడకి తీసుకు వచ్చి? ఎప్పుడో నరికేసిన చేతులకి  ఇప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ‘

‘నరికేసారు… తన చేతులు నరికేసారు. అంటే తను కీబోర్డ్ మీద  అక్షరాలని టైప్ చెయ్యలేడు. ఇక ఏ కల్పిత పాత్రలనీ సృష్టించలేడు. పాత్రల మధ్య భావోద్వేగాలని రగల్చలేడు. ఒక పాత్రతో మరో పాత్రని మర్డర్ చేయించలేడు, మానభంగాలు చేయించలేడు. పేజీలకి పేజీలు డైలాగులు చెప్పించలేడు. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని  చేస్తూ ఎవరినీ ఉత్కంఠతలో ఓలలాడించలేడు. లోక కల్యాణార్థమే ఈ కథంతా అల్లాను, అంటూ క్లైమాక్స్  లో అల్లిబిల్లి సందేశాలు ఇవ్వలేడు. నాశనం అయిపోయింది. తన జీవితం నాశనమయిపోయింది. తన కెరీర్ మొత్తం సర్వ నాశనమయిపోయింది ‘

ఒక్కసారిగా  దు:ఖం ఎగ తన్నుకు వస్తుంటే, అప్పటి వరకూ అతనిలో ముసుగు తన్ని పడుకున్న అసలు సిసలు సగటు మనిషి నిద్ర లేచాడు. తొడుక్కున్న ఉల్లిపొరల్లాంటి రంగురంగుల చొక్కాలన్నిటినీ ఒక్కటొక్కటిగా విప్పేయడం మొదలు పెట్టాడు.

‘ఒరేయ్ మేఘాంశ్, దుర్మార్గుడా? ఎంత పని చేసావ్ రా దొంగ రాస్కెల్. ద్వాదశి చేత, ఏకంగా నీ పీక నరికించేస్తే పీడ విరగడయిపోను. అదేమిటీ? తను ద్వాదశి చేత అతన్ని హత్య చేయించాలనే కదా అనుకొన్నాడు.  కానీ  అదృష్టంకొద్దీ అద్దంపెంకు గురి తప్పి అతని బుగ్గని చీరేసి ప్రాణాలతో వదిలేసింది. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే ఈ మేఘాంశ్ అనేవాడు లేకపోను. మనుషులకి ఉన్నట్టే అదృష్ట దురదృష్టాలు కల్పిత పాత్రలకి కూడా ఉంటాయా? ఏమో ఉండే ఉంటాయి. దానికి ఈ మేఘాంశ్ గాడే కదా ప్రత్యక్ష ఉదాహరణ.

‘జరిగిపోయిన దాని గురించి కుమిలిపోతూ కూర్చోవడం తనలాంటి సృజనశీలురకి తగని పని. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మేఘాంశ్ గాన్ని వాడి రివాల్వర్ తోనే తూట్లు తూట్లుగా కాల్చి, ఆ గాయాల్లో ఉప్పూ కారం చల్లి, హింసింసి హింసించి చంపాలి నా కొడుకుని. లోకంలో ఎక్కడైనా ఇలా జరిగి ఉంటుందా? తనని సృష్టించిన రచయిత చేతులనే నరికేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న రచయిత. అసంభవం, జరిగి ఉండదు. కాన్సెప్ట్ అదిరింది. ఖచ్చితంగా తన కొత్త నవల ఇతివృత్తం ఇదే. ష్యూర్, పడిచస్తారు ఇక పాఠకులంతా. వారం వారం పత్రికకోసం ఎదురుచూస్తూ వెర్రెత్తిపోరూ. అయ్యో అయ్యో శ్రీవాస్థవ్, వాస్తవాన్ని మర్చిపోతున్నా వేమిరా బుజ్జికొండా! రాయడానికి నీకు చేతులు ఎక్కడ ఉండి చచ్చాయిరా చిన్ని నాయనా…’

శ్రీవాస్థవ్ వస్తున్న ఏడుపుని పంటి బిగువున అదిమి పెట్టుకొని, మేఘాంశ్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. కసితో అతని ఛాతీ ఉప్పొంగింది. మేము సైతం అంటూ అతని భుజాలు కూడా తమ కండబలాన్ని ప్రదర్శించాయి. దాంతో దేహంలో గడ్డ కట్టిపోయింది అనుకున్న రక్తప్రసరణ తిరిగి వేగం పుంజుకొంది.

‘దేవుడా, ఒక్క అరగంటపాటు నా చేతులని నాకు ఇప్పించు తండ్రీ. ఆ మేఘాంశ్ గాడి అంతు చూసాక మళ్ళీ నా చేతులు…  చీచ్చీ , కాదు కాదు  నీ చేతులు నీకు అప్పు తీర్చేస్తా ‘  బేలగా ప్రార్థించాడు.

‘ఆశ్చర్యం…, అద్భుతం…, అమోఘం…అసంభవం ‘

దేవుడు అంత వేగంగా ప్రతిస్పందిస్తాడని శ్రీ వాస్థవ్ ఏమాత్రం ఊహించలేకపోయాడు. దేవుని కటాక్షం పొందడం ఇంత సింపులా? ఇది తెలీకనా, సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తుంటారు  మునులూ, యోగులూ.

దేవుడి దయతోడను నెమ్మదిగా శ్రీ వాస్థవ్ కి చేతులు మొలుచుకుని వస్తున్నాయ్. ‘తనకి…చేతులు మొలుస్తున్నాయి. మొలిచేసాయి…యురేకా!! ‘ ఓ వెర్రికేక అతని నోటి వెంట వెలువడింది.

‘చేతులు మొలవడమా నా పిండాకూడా. ఇప్పటి దాకా తన చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయి. కాళ్ళని కూడా  అలాగే  బిగించి కట్టేయడంతో తిమ్మిర్లు ఎక్కిఅవి అసలు ఉన్నాయో లేదో అన్న అనుమానం కలిగింది . రక్త ప్రసరణ సాఫీగా జరగుతుండడంతో వాటి స్పర్శ మళ్ళీ తనకి తెలిసి వచ్చింది అంతే. ఛ, ఇడియట్ లా తనలో తనే ఎంత భయానకంగా ఊహించేసుకున్నాడు! ఆందోళనతో ఎంతగా ఏడ్చి చచ్చాడు!

అద్భుత వాక్య విన్యాసాలతో, పదగారడీలతో, ఉక్కిరి బిక్కిరి చేసే ఉత్సుకతతో పాఠకులని ఊచకోత కోసే తనేనా ఇంత చేటు ఉద్విగ్నతకి లోనయ్యింది? తను సృష్టించిన పాత్ర మీద తనే పగబట్టడం ఏమిటి? ఎక్కడన్నా రచయితలు ఇలా తమ పాత్రలమీద ద్వేషాన్నో ప్రేమనో పెంచుకునే పరిస్థితి ఉంటుందా? తల్లిదండ్రులు పిల్లలమీద పగబట్టినట్టు లేదూ చండాలంగా. తలుచుకుంటుంటేనే చాలా సిల్లీగా అనిపిస్తోంది. అప్పటివరకూ తనలో వున్న భయాంoదోళనలు తగ్గడంతో మామూలుగా ఆలోచించగలుగుతున్నాడు శ్రీ వాస్థవ్. మనిషి సహజ నైజమే అంత.

తనలో తనే నవ్వుకున్న శ్రీవాస్థవ్, తనని ఓ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి ఉంచారని గ్రహించాడు. అదృష్టం కొద్దీ తన నోటిలో గుడ్డలేమీ కుక్కలేదు.  తను ఎక్కడ ఉన్నాడు అన్నది మాత్రం అతనికి అర్థం కావడం లేదు.

ఒక వేళ మేఘాంశ్,  తనని తన ఇంట్లోనే కట్టేసి   ఉంచాడా అన్న అనుమానం కూడా వచ్చింది.   ‘ఏం? ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? చంపేస్తాడా?’ ఇంకా చాలా సందేహాలు అతని మనస్సులో సుడులు  తిరుగుతూనే ఉన్నాయి.

ఇంతకీ ఎక్కడున్నట్టు తను? తన ప్లాట్ నీ, అందులోని వస్తువులనీ మనఃఫలకం మీద ఆవిష్కరించుకున్నాడు. ఈ కుర్చీ తనది కాదు. ఏదో  వాసన  లీలగా వస్తోంది. అది కూడా తనకి పరిచయం లేని సువాసన. అంటే ఇది ఖచ్చితంగా  తన ప్లాట్ కాదు. ఎక్కడో పరిచయం లేని చోటులో  తను బందీగా పడి ఉన్నాడన్నమాట ‘

‘ఎక్కడ…ఎక్కడ? విపరీతంగా దాహం వేస్తోంది. ఆకలి కూడా మొదలయ్యింది. నీరసంతో తల తిరుగుతున్నట్టనిపించింది. దాహం… దాహం….  వేస్తోంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ‘హలో’ అని అరిచాడు. అరిచాను అనుకున్నాడు కానీ  నీరసం వల్ల అతని మాటలు బయటకి కీచుగా వచ్చాయి.

ఘల్ ఘల్

శబ్దం వస్తున్న వైపు తలత్రిప్పాడు. అడ్దుగా ఉన్న  ముసుగువల్ల  కళ్ళకి ఏం కనిపించడం లేదు.

ఘల్ ఘల్

ఎవరో మెత్తగా నడుస్తున్న అడుగుల చప్పుడు.

మెడ వెనక, ఎవరిదో ఊపిరి వెచ్చగా  తగిలింది.

‘మళ్ళీ ఈ దయ్యం ఎఫెక్ట్ ఏమిట్రా నాయనా? ‘

ఘల్… ఆ వచ్చేది ఆడవాళ్లే అయ్యుంటారు. ‘ఘల్…ఘల్ ‘ కాళ్ళ పట్టీల, మువ్వల శబ్దం అది.

తనకి  చేరువలోకి వచ్చాకా ఆగిపోయింది ఆ పట్టీల శబ్దం.

“అరరె, కట్లు విప్పండి” మృదుమధురంగా అంది, ఓ ఆడ గొంతు. చాలా దగ్గర నుంచి వినపడింది ఆమె మాట.

ఆమె వంటి మీద నుంచి హాయిగొలిపే  పెర్ఫ్యూం  పరిమళం వీస్తోంది.

అప్పటి వరకూ  శ్రీ వాస్థవ్ వెనకే నలబడిన  ఓ వ్యక్తి,  ఆమె ఆదేశాల మేరకి  అతని కాళ్ళకీ చేతులకీ ఉన్న కట్లు

విప్పాడు. ఆ కట్లు విప్పే చేతులు మంచుముక్కల్లా గట్టిగా చల్లగా ఉన్నాయి, చాలా సేపట్నుంచి ఫ్రిజ్ లో పెట్టి తీసినట్టు. అతని ఊపిరే  ఇప్పటి వరకూ  తనకి మెడ మీద వెచ్చగా తగిలినట్టుంది.

శ్రీవాస్థవ్ కట్లు విప్పిన ఆ చేతులు, వెనక నుంచి  అతని తల మీద ఉన్న ముసుగుని కూడా తొలగించాయి.

శ్రీవాస్థవ్ వెనక్కి చూద్దామనుకున్నాడు ఓ క్షణం. కానీ తల తిప్ప బుద్ధి కాలేదు. ఎదురుగా నాలుగడుగుల దూరంలో,   తెల్లటి దుస్తుల్లో కలహంసలాంటి అందమైన యువతి… పాలరాతి బొమ్మలా  నిలబడి ఉంది.

ఎటొచ్చీ ఒకటే చింత. ఆమె తలమీదుగా, భుజాల వరకూ  పలుచటి మేలి ముసుగు కప్పుకొని ఉంది. ఊపిరి తీసుకోవడానికేమో, నల్లటి చిక్కటి వల లాంటి వస్త్రం వేలాడుతోంది. దాని వల్ల మొహం స్పష్టంగా కనపడ్డం లేదు. మబ్బుల వెనక చందమామలా వున్న ఆమెని కళ్ళప్పగించి చూస్తున్న  శ్రీవాస్థవ్ లో హృదయస్పందన పెరిగింది.

‘ఎవరీ అపరంజి బొమ్మ? దేవ కన్యా? మేఘాంశ్ కి ఏమవుతుంది? భార్యా?  చెల్లెలా? ప్రియురాలా?’

‘అరేయ్ శ్రీవాస్థవ్, నీక్కానీ బుర్ర దొబ్బిందా బే?  వాస్తవాన్ని విస్మరిస్తున్నావేంట్రా నువ్వు. మేఘాంశ్ ఎవ్వడు? ఎడం చేత్తో నువ్వు టిక్కూ టిక్కూమని కీబోర్డ్ మీద బాదితే పుట్టుకొచ్చినవాడు. అపరబ్రహ్మవి రా. నువ్వు సృష్టించకుండా వాడికి పెళ్ళాం, ప్రియురాలూ, తొక్కా, తోటకూరా ఎక్కడి నుంచి పుట్టుకొస్తార్రా? బఫెల్లో’. అంతరాత్మ హెచ్చరించడంతో నాలుక్కరుచుకున్నాడు అతను. అంతరాత్మ అనేది లేకపోతే మనుష్య జాతి ఎప్పుడో అంతరించి పోయేదేమో!  థాంక్యూ మై సోల్ మేట్’ అంటూ అంతరాత్మగాడికి ఓ కాంప్లిమెంట్ పారేసిన శ్రీ వాస్థవ్, ఈమె ఖచ్చితంగా తను ఊహించి రాసిన ఆ ఆకాశరాజు కూతురే అయి ఉంటుంది అనుకున్నాడు.

‘అడ్డడ్డడ్డే…కురుల్లో చందమామ ఉందో? లేదో? చూసే అవకాశం లేకుండా పోయిందే. దీని సిగతరగా ముసుగు. అది లేకపోతే కనపడి వుండేదే…’

ఆమె వయ్యారంగా నడుస్తూ వచ్చి శ్రీవాస్థవ్ ముందున్న కుర్చీలో కాలుమీద కాలువేసుకొని కూర్చొంది. అచ్చం సింహాసనంలో కూర్చొన్న   ఆకాశదేశపు రాకుమారిలానే ఉంది. ఆ నడకలో హొయలు, ఆ కూర్చొన్న భంగిమలోని కులుకూ శ్రీవాస్థవ్ లో అపరిమిత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. పల్చటి, తెల్లటి చీర ఆమె అవయవ సౌష్ఠవాన్ని కనుమరుగు కానీయలేకపోతోంది.

ఆమె ఊపిరి తీసి విడుస్తుంటే శ్రీవాస్థవ్ కి, ఉచ్ఛ్వాసనిశ్వాసలు నిలిచిపోతున్నట్టనిపిస్తోంది.  అతను ఇక  తన దాహం సంగతి మర్చిపోయాడు. ఆ మోహనాంగి  వ్యామోహంలో పీకల్లోతు కూరుకుపోయాడు. ఎంతోమంది అందగత్తెలకి ఊహల్లో ఊపిరిపోసిన అతను ఆమెనే కనురెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు. బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అంటారు ఇందుకేనేమో .

ఎగసిపడుతున్న ఆమె హృదయభాగం అతని గుండె లయని మార్చేస్తోంది. ఎంత నిరంకుశత్వం ఆమె అందాలకి. ఎంత కోమలత్వం ఆమె దేహానిది. సన్నగా వీస్తున్న గాలి ఆమె పల్చటి పొట్టమీద చెంగుని అల్లల్లాడించి కదిలించాలని చూస్తుంటే , వంటికి అంటుకు పోయిన ఆ చెంగు ఎంతకీ కదలదేం ఖర్మ.

అయినా పారదర్శకంగా కనీ కనిపించకుండా కనిపిస్తూ, తనని ఊరిస్తున్న ఆ లోతైన నాభి… అందులో ఇంత అద్భుత సౌందర్యం నిక్షిప్తమై ఉంటుందా? అందుకేనా? మూడో మేఘరాజు దానిలో దూకి చావాలనుకొన్నది. అదే జరిగితే ఎంత సుఖమైన చావు నిజంగా. ఆహా, అలాంటి అందమైన చావు తనలాంటి వాళ్ళకే రావాలి తప్ప,  ఏ మేఘరాజుకో  రోగ రాజుకో వస్తే ఒప్పుకునే  ప్రసక్తే లేదు.

తన ఊహాఊర్వశి ద్వాదశి కన్నా ఈమె ఎన్నోరెట్ల అందగత్తె. ముఖారవిందం మినహా ఆ భువనైకసుందరిని  మైమరచి ఆరాధిస్తున్న శ్రీవాస్థవ్  ద్వాదశి గుర్తుకు  రావడంతోనే  ముసుగుకన్య  మైకంలోంచి  బయటపడ్డాడు.

తనలోని అలజడిని తొక్కి పెట్టి, “ఎవరు మీరు? ఎంత సేపట్నుంచి నన్నిలా కట్టిపడేసారు? ఎందుకు ఇలా?” తెచ్చిపెట్టుకున్న తీక్షణతతో ప్రశ్నించాడు.

ఆమె వళ్లంతా కదిలిపోయేలా నవ్వింది. ఆ బొడ్లో దాచుకున్న అమృతం తొణికిసలాడి పోతుందో ఏమిటో. ముత్యాలు జలజలా రాలినట్టు, తొలకరి జల్లు కురిసినట్టుగా ఉందా నవ్వు.

“నేను ఎవరినా? హ హ హా…హ హ హా… హా హా ”

శ్రీవాస్థవ్ లో మాటలు కరువైన మౌనం. ఇంకోసారి నవ్వక పోతుందా అన్న ఆశ.

“నిజంగానే తెలీదా మీకు?” ఆమె మాటలో జాణతనం.

తన ప్రశ్నకి ఆమె ప్రశ్ననే జవాబుగా సంధించడంతో శ్రీవాస్థవ్ లో  ఏదో అనుమానం  మొదలయ్యి, అది క్రమంగా మనసంతా సంతరించుకొంది.

“తెలీదు. ఆ ముసుగు తీస్తేనే కదా తెలిసేది!” లౌక్యం ప్రదర్శించాడు.

“అది అసంభవం …”

ఎన్నో కల్పిత పాత్రలని సృష్టించి, వాటి తలరాతలని శాసించిన శ్రీవాస్థవ్ ఆమెని నిశితంగా పరిశీలించాడు. ‘ఈమె వ్యవహారశైళి చూస్తుంటే మేఘాంశ్ తో  ఏ సంబంధమూ లేనట్టుగా కనిపిస్తోంది. నిజంగానే లేదా? లేక అలా నటిస్తోందా? ఏమో? తనెందుకు బయటపడడం. తను కూడా ఏమీ తెలియనట్టే నటిస్తూ వీళ్లని ఏమార్చి ఇక్కడ నుండి బయటపడాలి ‘ అని నిశ్చయించుకున్నాడు.

“ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు ” తన మనస్సులోని భావాలు బయటపడకుండా అడిగాడు.

కొన్ని క్షణాల మౌనం తర్వాత….

“ద్వాదశి…  మీరు పెట్టిందే కదా”  ఆమె గొంతు అదో రకం గమ్మత్తుగా.

” ఏంటీ?  ద్వా….ద…శా…?”  తన చెవులని తనే నమ్మలేకపోయాడు శ్రీ వాస్థవ్.

ఒక్కసారిగా కాలం స్తంభించిపోయినట్టు, కుర్చీతో సహా ఏదో అగాథంలోకి జారిపోతున్నట్టు అనిపించింది అతనికి. వంట్లో నరాలన్నీ చిట్లిపోయేంత ఉద్వేగానికి గురయ్యాడు. రెండో మూడో చిట్లిపోయాయేమో కూడా.

“అవును. ద్వాదశి… మీ నవలానాయికని ” ఆమె మొహంలో చిలిపిదనం.

శ్రీవాస్థవ్ లో అప్పటివరకూ ఉన్న ప్రసన్నత మాయమయ్యింది. ‘ఏంటీ ట్విస్ట్. పొద్దున్న వాడు, ఇప్పుడు ఇది. నాకు పిచ్చెంకించడానికే పుట్టినట్టున్నారు. వీళ్ళిద్దరేనా? ఇంకా ఏదైనా గ్యాంగ్ పని చేస్తున్నదా? ఇంతకీ వాడెక్కడో? మెత్తగా ఊరుకుంటే ఇంక లాభంలేదు ‘ అనుకున్న అతను.

“ఆపండి, మీ డ్రామాలు. అసలు ఎవరు మీరు? ఎందుకిలా చేస్తున్నారు. నా ఫ్యాన్సా? లేకపోతే పిచ్చి ఆసుపత్రి నుంచి కాని పారిపోయి వచ్చారా?” అన్నాడు కోపంగా కుర్చీలోంచి లేవబోతూ. వెనక నుంచి రెండు చల్లటి, గట్టి చేతులు  అతన్నికొంచెం కూడా  కదలనీయకుండా కుర్చీలోకి నొక్కిపెట్టి పట్టుకున్నాయి, బలంగా  పాతేసినట్టు.

చేతులు… చల్లటి చేతులు…

ఏదో గుర్తుకొచ్చినట్టు ద్వాదశి వైపు పరిశీలనగా చూసాడు. తెల్లటి ఆమెచీర, తడిచివుండడం వల్లే ఆమె వంటికి అంటిపెట్టుకుని ఉన్నట్టు అప్పుడు గమనించాడు. అతనిలో ఆవేశం అమాంతంగా  అరికాళ్ళలోకి జారడం మొదలెట్టింది. అతను అలా  ఆగ్రహంతో విరుచుకు పడతాడని ఆమె ఊహించలేదు. అలాగని,  ఆ ఆగ్రహానికి ఆమె బెదిరిపోనూ లేదు.

“ముఖ్యమైన పనిమీద మిమ్మల్ని నేను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. అందుకు మీరు నన్ను క్షమించాలి. మీతో మాకు కావలసిన  పని  అయిపోయింది. ఇంక మేము మిమ్మల్ని విడిచి పెట్టేయాలని అనుకుంటున్నాం ”  సౌమ్యంగా చెప్పింది ద్వాదశి.

‘కిడ్నాప్ చేసారా? ఏంటిది? ట్విస్ట్ మీద ట్విస్ట్. తనే పెద్ద ట్విస్టర్. అలాంటిది తన నవలల్లోని ట్విస్ట్ లన్నిటినీ తనే అనుభవించాల్సొస్తుందేంటి?. ఉదయం తనని వెదుక్కుంటూ వచ్చినవాడు మేఘాంశ్. ఇప్పుడు  ఈ ద్వాదశేమో  తనే నన్ను కిడ్నాప్ చేసానంటోంది. వీళ్లిద్దరూ ఒకటే గ్యాంగా? లేక ఇద్దరూ వేరు వేరా? అసలు ఒకళ్ళతో ఒకరికి పరిచయం ఉన్నట్టా? లేనట్టా? వీళ్ళు నిజంగానే తన కల్పిత పాత్రలా? లేక తనని ఏడిపించటానికి ఎవరైనా పన్నిన కుట్రలో భాగస్వాములా?

నవలలో పాత్రధారులే అయితే. ఒకళ్ళకొకరు పరిచయం లేకుండా ఎలా ఉంటుంది? పగలూ  ప్రతీకారాలూ ఉంటే వాళ్ళ వాళ్ళ ఊహాలోకంలో ఒకరినొకరు కొట్టుకునో, పొడుచుకునో చావాలి కానీ ఇలా వాళ్ళని సృష్టించిన తనతోనే ఎందుకు ఫుట్ బాల్ ఆడుకొంటున్నట్టు?. ఓ సారి కడిగి పారేద్దామా?’ అనుకున్నాడు. కానీ… ఏదో ఆలోచన వచ్చినట్టు మాట్లాడకుండా ఉండిపోయాడు. ఎంతయినా తను రచయిత!.

“కిడ్నాప్ చేసారా? ఎందుకు ”  సాధ్యమయినంత గంభీరంగా అడిగాడు.

“అది దేవ రహస్యం. చెబితే తల వందముక్కలు అయిపోతుందని మీరే చెప్పారు కదా”  కిలకిలా నవ్వింది, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు.

“నేనా? నేను చెప్పానా? ఎప్పుడూ?” కిందపడి గిలగిలా తన్నుకోవడం ఒక్కటే తక్కువయ్యింది శ్రీ వాస్థవ్ కి. ఏదో తెలీని అయోమయం, అసహనం అతనిలో.

“అప్పుడే మర్చిపోయారా? ‘సంగీతా మేడం చాలా స్ట్రిక్ట్’ కథలో…” అంటూ కిలకిలలని ఇంకోసారి రిపీట్ చేసి కుర్చీలోంచి లేచింది ద్వాదశి. కుర్చీలో ఆమె కూర్చున్నంత మేరా  చెమ్మగిల్లి ఉండడం శ్రీవాస్థవ్ కి కనిపించింది.

సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళిన ఆ రాకుమారి ఫ్రిజ్ తెరచి, ఓ ఎనర్జీ డ్రింక్ ని తెచ్చి శ్రీవాస్థవ్ చేతిలో పెట్టింది. ముభావంగా దాన్ని అందుకుంటున్న అతను ఆమె చేతిని తాకాలన్న కోరికని చంపుకోలేక పోయాడు.ఆ చేతిస్పర్శ ఎంతో మృదువుగా ఉంది. కానీ కోరుకున్న వెచ్చదనాన్నివ్వకుండా చల్లదనాన్ని మాత్రమే పంచింది. అయినా సరే, అలాగే  ఆ చేతిని పట్టుకొని ముద్దాడాలనిపించింది అతనికి.

ఇంతలో వెనక నుంచి ఓ అగంతకుడు శ్రీవాస్థవ్ తలకి పిన్ చేసిన,  చిన్న బగ్ లాంటి పరికరాన్ని లాగి తీసుకున్నాడు. అది తన తలలో ఉన్నట్టు  అప్పటివరకూ  శ్రీ వాస్థవ్ గమనించనే లేదు. ఏమిటది? అడిగితే మాత్రం చెబుతుందా? అసలే జగజ్జాణలా వుంది. ఆలోచిస్తూ  శ్రీ వాస్ఠవ్ డ్రింక్ పూర్తిగా తాగేసాడు. అది త్రాగిన తర్వాత, అతనికి వేరే లోకాల్లో విహరిస్తున్నట్లుగా అనిపించింది.  గాల్లో   నడుస్తూ ద్వాదశి దయ్యంలా తన వైపే గాలిలో అలా  తేలుతూ వస్తోంది.

అతని కళ్ళు మూతలు పడుతున్నాయి…

‘తన చేతులూ కాళ్ళూ మళ్ళీ కట్టేసారా? ఏమో. నోట్లో గుడ్డలు కుక్కేసారా? ఏమో. ఇందాకా తన నోట్లో గుడ్డలు లేకపోవడానికి కారణం, తనని ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి, తన చేత ఏదో విషయం చెప్పించారన్న మాట. అందుకే  తలలో బగ్ లాంటి పరికరాన్ని అమర్చారు అనుకున్నాడు. ఏం చెప్పించారో? ఏంటది?’

గాలిలో తేలుతూ వచ్చిన ద్వాదశిని, తమకంగా ముద్దుపెట్టుకుంటూ, ఆమెని కౌగిట్లోబంధిస్తూ ఆమె మొహాన్ని ఎలాగైనా చూడాలన్న కాంక్షతో మొహం మీద ముసుగుని బలవంతంగా తొలగిస్తుండగా శ్రీవాస్థవ్ స్పృహకోల్పోయాడు.

ఇద్దరు అగంతకులు వచ్చి శ్రీవాస్థవ్ ని బలవంతంగా లేపి,  బయటకి నడిపించుకుని పోయారు.

స్పృహలోకి వచ్చిన శ్రీవాస్థవ్ మత్తుగా లేచి నిలబడ్డాడు. అప్పటివరకూ తను ఓ రోడ్ ప్రక్కన ముళ్ళపొదల్లో పడి వున్నట్టు గుర్తించాడు. చేతులకి, కాళ్ళకీ అక్కడక్కడా ముళ్లు గుచ్చుకొన్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ తన తన ప్లాట్ కి బయలు దేరాడు. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. తలపైకెత్తి చూసాడు. సిరా వొంపినట్టు లేత నీలంరంగులో ఉంది ఆకాశం. ద్వాదశి కురుల్లోంచి రాలి పడలేదేమో?  చంద్రుడు ఇంకా విధులకి హాజరు కాలేదు.

శ్రీవాస్థవ్  లిఫ్ట్ లో తన ప్లాట్ కి వచ్చాడు. గోడకి ఉన్న ఇండికేటర్లో పాస్ వర్డ్ కొట్టాడు. తలుపు తెరిచే ఉన్నట్టుగా నీలిరంగు లైటు వెలిగింది. ఆశ్చర్యంగా తలుపు తోసుకుని లోపలకి  వెళ్ళాడు. లైట్ వెలుతుర్లో, ప్లాట్ లో సామాన్లన్నీచిందర వందరగా పడి కనిపించాయి. ఎవరో దేనికోసమో వెతికినట్టున్నారు.

రాక్షసుడిలా కుర్చీలో కూర్చుని ఉన్నాడు మేఘాంశ్. అతని చేతిలోని రివాల్వర్ శ్రీవాస్థవ్ వైపు కర్కశంగా చూస్తోంది.

అతను ఏమీ అనకుండానే  చేతులు ఎత్తి నిలబడిపోయాడు శ్రీవాస్థవ్.

గుడ్,  కూర్చోండి ”

మేఘాంశ్ వంటిమీద  ఇంకా అవే తడిబట్టలు… తలలోంచి కారుతున్న నీళ్ళు…

“భయపడకండి.  నా ప్రశ్నలకి జవాబు చెబితే మీ ప్రాణాలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ద్వాదశి మీకెంతకాలంగా పరిచయం?”  కరకుగా ఉంది అతని గొంతు.

“అంతా తెలిసి కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారేం? మీరెంత కాలంగా తెలుసో ద్వాదశీ అంతేకాలంగా తెలుసు” చిరాగ్గా చెప్పాడు శ్రీ వాస్థవ్, చేతులు గాల్లోంచి కిందకి దింపుతూ.

“ఓహో అలా వచ్చారా? సరే అయితే. ఇప్పుడు ద్వాదశి ఎక్కడుంది?”

“ఏం పిచ్చా? నవల్లోనే ఉంది కదా ” అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.

“ఆ విషయం నాకూ తెలుసు, నన్ను పొడిచి పారిపోయాక ఎక్కడికి వెళ్లింది? ఏం చేస్తోంది?” కటువుగా ఉంది అతని గొంతు.

మేఘాంశ్ ధోరణి శ్రీవాస్థవ్ కి విసుగు తెప్పిస్తోంది.

“భానుగుడి సెంటర్ లో  పెసర పుణుకులు  అమ్ముకుంటోంది ” వెటకారంగా చెప్పాడు.

“ఎక్కడా? ” అంటూ సెల్ పోన్ తీసి, అతను చెప్పిన వివరాలు టెక్స్ట్ కొట్టుకుంటున్నాడు మేఘాంశ్.

“హహ్హహ్హా ” అంటూ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు శ్రీవాస్థవ్ అతను చేసేది చూసి.

ఏం? కామెడీలా? ట్రిగ్గర్ నొక్కానంటే కపాలం పేలిపోద్ది”

“నేను కాదు, మీరు చేస్తున్నారు కామెడీలు. కనీసం ఆధార్ కార్డ్ లేని అనామకులు మీరు… నన్ను కాల్చి చంపడమా? హహ్హహ్హ…”

మేఘాంశ్ చెయ్యి బలంగా గాల్లోకి లేచింది. అది విసురుగా వచ్చి శ్రీవాస్థవ్ దవడని, తాకడంతో కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యింది. “మర్యాదగా ” చెబితే వినరా? ఎక్కడ ద్వాదశి? ” గద్దించాడు .

“నాకు తెలియదు అంటే వినరేం? తెలిస్తే  మీకే తెలియాలి. ఎందుకంటే మీరిద్దరూ ఒకే నవలలోని పాత్రలు. నిజంగానే నాకు ద్వాదశి ఎవరో తెలీదు ”

“ఆహో! ద్వాదశి తెలియకుండానే..ఆమె దేవత, దేవదూతా అంటూ రాసేస్తున్నావా?  సరిగ్గా చెబితే చెప్పావ్? లేకుంటే వ్యవహారం మాటల్లోంచి తూటాల్లోకి వెళ్లవలసి ఉంటుంది” హెచ్చరించాడు మేఘాంశ్. అతని సంబోధన ఏక వచనంలోకి మారడం శ్రీవాస్థవ్ గుర్తించాడు.

“ద్వాదశి నా నవల్లో ఓ కల్పిత పాత్ర. అంతవరకే ఆమెతో నాకు సంబంధం. ఇంత వరకూ  వందల్లో అలాంటి క్యారక్టర్లని సృష్టించి ఉంటాను. ద్వాదశి కాకపోతే దశమి. అదీ కాకపోతే పుష్యమి. నాకిష్టమైన పేరు పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవరు?” తనూ ఏకవచనంలోకి దిగాడు శ్రీవాస్థవ్.

“అది ఓ ఉగ్రవాది కనుక. రెడ్ విడో. రెడ్ విడో మొహం ఎలా ఉంటుందో ఇప్పటిదాకా  ఎవరూ   చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా నిఘా బృందాల దగ్గర ఆమెకి సంబంధించి ఒకే ఒక్క పోటో మాత్రమే ఉంది. అది కూడా పదేళ్ళ కిందటి నాటిది. ఈ ప్రపంచంలో ఆమె గురించి అన్ని విషయాలూ తెల్సిన  ఏకైక వ్యక్తివి నువ్వే. అది నీ రాతల వలనే తెలుస్తోంది. చెప్పు ”

“ఎవరూ చూడలేదు అనడం అబద్దం. ద్వాదశిని నువ్వు చూసావ్. చూడకపోతే ఆమె నిన్ను ఎలా దవడ మీద గాయపరిచింది ”  లాజిక్ లాగాడు శ్రీ వాస్థవ్.

“నేను చెప్పేదీ అదే. ఆమె ఉగ్రవాది అని అప్పుడు ఆ సందర్భంలో నాకు తెలియదు. లేకుంటే అప్పుడే  కాల్చిపారేసే వాన్ని. కనీసం ఫొటో అన్నా తీసుకొని వుండే వాన్ని. చెప్పు ద్వాదశి ఎక్కడ? ఎక్కడ దాచావ్ దాన్ని? ”

“నమ్మితే నమ్ము, లేకపోతే కాల్చుకుని చావు. నేను కూడా  ఆమె మొహం ఇంత వరకూ చూడలేదు అంటే నమ్మవేం. ఏవో ఊహలకి రూపం ఇచ్చాను అంతే. ఆమె రెడ్ విడోనా, గుడ్ విడో నా అన్నది నాకు అనవసరం. అయినా ద్వాదశిని సృష్టించినట్టే  నిన్ను సృష్టించింది కూడా నేనే కదా?”

“అదే, ఆ అభిమానంతోనే, నీ మీద ఇంకా గౌరవం మిగిలి ఉంది. లేకపోతే నా ట్రీట్ మెంట్ మరోలా ఉండేది. ఆట్టే టైం లేదు. సహకరించక పోతే దేశద్రోహ నేరం కింద నిన్ను అరెస్ట్ చెయ్యించాల్సి ఉంటుంది. ఉదయం నేను ఇక్కడకి వచ్చి వెళ్ళిన తరువాత, ఐదు గంటలపాటూ నువ్వు అజ్ఞాతంలోకి పోయావు. ఎక్కడకి వెళ్ళావు. ద్వాదశిని కలవడానికేనా? ఆమెకి సంబంధించిన అన్ని వివరాలూ టకటకా చెప్పెయ్యాలి. కమాన్ క్విక్ ” తొందర పెట్టాడు మేఘాంశ్.

‘వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు. నేను ద్వాదశిని కలవలేదు . ద్వాదశే నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయింది అని చెబితే వీడు నమ్ముతాడా? ఎక్కడకి తీసుకు వెళ్ళిందో చూపించు అని చంపుకు తింటాడు. అది తన వల్ల అయ్యే పనికాదు. అసలు ఆ చోటు తనకి తెలిస్తే కదా వీడికి చూపించడానికి. అయినా అదంతా వీడితో చెబితే మళ్ళీ కొత్త తలనెప్పి కొనితెచ్చుకోవడమే. ఓ పని చేద్దాం. ద్వాదశి పాత్ర రూపకల్పనకి మోడల్ లాంటి, ఆ ఊహా ఊర్వశిని చూపిస్తే సరి. ఆమె, ఆ ద్వాదశి కాదు అని తెలిస్తే వీడి దారిన వీడు పోతాడు. ఓ పనై పోద్ది’. మనస్సులోనే అనుకున్న శ్రీవాస్థవ్…

” సరే, అన్నీ వివరంగా చెబుతా కానీ, నేను ప్రొద్దున్న స్పృహతప్పి పడిపోయాకా ఏం జరిగింది? అది చెప్పు ముందు ” అన్నాడు. రాజీకి వచ్చినట్టుగా.

“నిన్ను ఈడ్చుకు వచ్చి, ఆ సోపాలో పడుకో బెట్టాను. రెండురోజులుగా తడిచి ముద్దయిపోతున్నాం కదా? ఫీవరిష్ గా ఉంటే… నువ్వు లేచేలోపు వచ్చేద్దామని డోర్స్ లాక్ చేసి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. వచ్చేసరికి నువ్ మిస్ కొట్టావ్ ”

‘ఎండ మండిపోతుంటే వీడు వర్షంలో తడిచి చస్తున్నాడా? పిచ్చి ప్రైమరీ స్టేజ్ దాటేసినట్టుంది. కల్పితపాత్రలకి కూడా జ్వరాలూ, తలనొప్పులు వచ్చేస్తే ఈ దేశంలో ఆసుపత్రులు సరిపోయి ఏడుస్తాయా? ‘

” సరే. నా ప్లాట్లో దేని కోసం వెతికారు?”

“నీకూ ద్వాదశికీ మధ్య ఉన్న  సంబంధాలగురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికా. ఇక కాలక్షేపం చాలు. పాయింట్ కి రా”  అంటూ అసహనంగా కుర్చీలోంచి లేచాడు మేఘాంశ్. అతని వ్రేలు రివాల్వర్ ట్రిగ్గర్ మీద బిగుసుకొని ఉంది.

“నాకు తెలిసి… ఇక్కడ తుపాకులు పేలేంత సీన్ ఏమీ ఉండదు అనుకుంటా. దాన్ని నువ్ బేషరతుగా హోల్ స్టర్ లో పెట్టొచ్చు ” అంటూ  ప్రిజ్ దగ్గరకి వెళ్ళి, నీళ్ళు తాగి  దాని మీద పెట్టిన బైనాక్యులర్స్ అందుకున్నాడు శ్రీ వాస్థవ్.

“నువ్వు నమ్ము నమ్మకపో, ద్వాదశి నా ఊహా ఊర్వశి అంతే. ఏడాది కిందట అనుకుంటా, ఓ రోజు మధ్యాహ్నం నేను తూర్పువైపు  ఉన్న ఆ బాల్కనీ లోకి     వెళ్ళేసరికి, అదిగో రోడ్ కి అవతల ఉన్న ఆ అపార్ట్ మెంట్లో ఆ అందాల దేవత కనిపించింది ” చూపించాడు శ్రీ వాస్థవ్.

“అది అందాల దేవత కాదు. అందాల రాక్షసి ” కసిగా అన్నాడు మేఘాంశ్. అతని వెనకే నడుస్తూ.

“నీకలాగా, నాకిలాగా! ఆమె పేరుకూడా నాకు తెలియదు. కానీ. ఆమెని నేను చూసిన రోజు తిథి ద్వాదశి అవడంతో నా కలల చెలికి ఆపేరే  పెట్టుకున్నాను. ఆమె మీద వ్యామోహంతోనే  నా కొత్త నవలకి కూడా అదే పేరు పెట్టాను, ద్వాదశి అని ”  చెబుతూ బాల్కనీ లోకి నడిచాడు శ్రీవాస్థవ్ .

శ్రీవాస్థవ్ చేతిలోంచి, బైనాక్యులర్స్ అందుకొని, వాటిని అతను చెప్పిన ప్లాట్ లోకి జూమ్ చేసాడు మేఘాంశ్.

అప్రయత్నంగా అతని నోటి నుంచి ” బాప్ రే ” అంటూ ఓ కేక వెలువడింది.

“దొరికింది. దీనమ్మా ద్వాదశి దొరికింది. ఆచూకీ దొరక్కుండా ముప్పుతిప్పలు పెడ్తున్న ఆ లం… ఇక్కడకొచ్చి దాక్కొంది” ఉద్వేగంతో ఊగిపోతున్నాడు మేఘాంశ్.

అదోలాంటి రాక్షసానందంతో చిందులు వేస్తున్న మేఘాంశ్ ని  ఫెడేల్ మని  చాచి దవడ మీద కొట్టాడు శ్రీవాస్థవ్.

“ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో ముందు. నీఇష్టంవచ్చినట్టు బూతులు తిడుతున్నావేంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. ఆమె నా అందాల దేవత.  చంపేస్తా ఎక్కువ చేసావంటే ”  వ్రేలు చూపించి హెచ్చరించాడు.

శ్రీవాస్థవ్ దెబ్బకి ఎంతో  శిక్షణ పొందిన మేఘాంశ్ తూలి ముందుకు పడబోయి నిలదొక్కుకున్నాడు.

“నీయబ్బ. నువ్వు ముందు లోపలకి నడువు. నీసంగతి తర్వాత చూస్తా ” అంటూ రివాల్వర్ కొనని శ్రీవాస్థవ్  డొక్కలో ఆనించాడు మేఘాంశ్.

అతని మొహంలో తొంగిచూసిన కర్కశత్వానికి  శ్రీవాస్థవ్ కి భయం వేసింది. చెప్పినట్టు వినకపోతే కాల్చేసినా కాల్చేస్తాడు అనిపించింది.

శ్రీవాస్థవ్ ని  కుర్చీలో కూర్చో బెట్టిన  మేఘాంశ్, రివాల్వర్  పొజిషన్ లో వుంచే తన యాక్షన్ మొదలు పెట్టాడు. డిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కి ద్వాదశిని గురించిన సమాచారం, ఫోన్ లో అందించాడు. క్రింద ఉన్న తన అనుచరులని పిలిచి ఏం చెయ్యాలో చకచకా ఆదేశాలు జారీ చేసాడు. అతను చేసే చేష్టలు శ్రీవాస్థవ్ కి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిజంగానే  ఏ ఉగ్రవాదినో హతమార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లా ఉన్నాయి అవి.

‘ఇది ఖచ్చితంగా కలే అయి వుంటుంది. ఏదో సస్పెన్స్ నవల చదివినట్టు, భలే థ్రిల్లింగ్ గా ఉంది. కొన్ని కలలు మెలుకువ వచ్చే సరికి మరచిపోతాం. కానీ ఈ కలని మర్చిపోకూడదు. మంచి మిష్టరీ నవలగా రాసి పడెయ్యాలి. తనకి కల కూడా బాగా కో ఆపరేట్ చేస్తోంది. కొంచెం కూడా కంటిన్యుటీ తప్పడం లేదు. కానీ మేఘాంశ్  ద్వాదశిని ఉగ్రవాది అనడం అతను తట్టుకోలేక పోతున్నాడు.

“నీకేమన్నా పిచ్చా? ద్వాదశి నిజమైన మనిషి. ఆప్ట్రాల్ నేను సృష్టించిన ఓ కల్పిత పాత్రవి నువ్వు. నాకు మండిందంటే నిన్ను ఏదో ఒకటి చేసి చంపేస్తాను. కంప్యూటర్ ఆన్ చేస్తే నిమిషం పని అది నాకు” హెచ్చరిస్తూ కుర్చీలోంచి లేవబోయాడు.

“నువ్ చెప్పింది కరెక్టే. ముందు  నేనే నిన్ను చంపి పారేస్తే, ఆ తర్వాత నన్ను డిస్టర్బ్ చేసే వాడే ఉండడు. ఏమంటావ్?” రివాల్వర్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లోకి తెచ్చాడు  మేఘాంశ్.

టిక్..టిక్…టిక్…. క్షణాలు దొర్లుతున్నాయి. శ్రీవాస్థవ్ భయంతో గుటకలు మ్రింగుతున్నాడు. మేఘాంశ్ కాల్చేసేవాడే.

ఇంతలో అతని ఇద్దరు అనుచరులూ,  ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకొని పైకి వచ్చారు. అతనూ మిగతా వాళ్ళలాగానే తడి తడిగానే ఉన్నాడు.

“వీడిని ఏదైనా తాడుతో కట్టిపడేయండి” ఆదేశించి, ఆ కొత్త వ్యక్తి వైపు తిరిగాడు మేఘాంశ్.

“లిప్ మూమెంట్ ని బట్టి అక్కడ వచ్చే సౌండ్ ఏమిటో నాకు కరక్ట్ గా చెప్పాలి. ఓకేనా?” కిటికీలోంచి ద్వాదశిని చూపిస్తూ  అడిగాడు మేఘాంశ్  ఆ కొత్త వ్యక్తి తో.

” ష్యూర్ సర్ ” అన్నాడు అతను. బైనాక్యులర్ జూం చేసుకొని.

“ఆమె ముందు, ఓ నలుగురు వరకూ ఉన్నారు సర్. ఆమె మాట్లాడేటప్పుడు ఆ కదలికలని బట్టి, మనకి అర్థం అవుతోంది సార్ అది ”

కామెంట్రీ  చెబుతున్నట్టు చెబుతున్నాడు అతను.

మిగతా వాళ్ళతోపాటు శ్రీవాస్థవ్ కూడా ఆ కామెంట్రీ  వింటున్నాడు.

“ట్రెల్జిడ్రిన్ టెన్ యం.జి. ”

రాసుకుంటున్నాడు మేఘాంశ్ అనుచరుడు ఒకడు.  మేఘాంశ్ ఫోన్లో టెక్స్ట్ టైప్ చేస్తున్నాడు.

వింటున్న శ్రీవాస్థవ్  నోరు బార్లా తెరిచాడు.

“సిట్రాబెట్రిన్ ట్వంటీ యం.జి.”

శ్రీవాస్థవ్ లో గుండె కొట్టుకుంటున్న వేగం పెరిగి,  లబ్ డబ్ బదులు ‘ దడ్ దడ్ ‘ మనడం మొదలెట్టింది.

“సిట్రాబెట్రిన్ కాదు అది. సిట్రాబెట్రిగ్జాన్ “  అంటూ మధ్యలోకి దూరకుండా ఉండలేకపోయాడు.

మేటర్ టైప్ చేస్తున్న మేఘాంశ్ ” నీకెలా తెలుసు?  అసలు ద్వాదశితో పరిచయమే లేదన్నావ్? ఆ పేరు కూడా ఉట్టుట్టి పేరే  అని దబాయించావు” అంటూ శ్రీవాస్థవ్ దగ్గరకి వచ్చాడు. కౄరంగా మారింది అతని గొంతు.

“నిజంగానే ఆమె నాకు పరిచయం లేదు. కానీ ఈ డ్రగ్ కాంబినేషన్స్ మాత్రం నావే. ప్రొద్దున్న నేను స్పృహ తప్పి పడిపోయాకా కళ్ళు తెరిచే సరికి ఓ గుర్తు తెలీని ప్రదేశంలో ఉన్నా. అక్కడ మొహానికి ముసుగేసుకున్న ఓ యువతి వుంది. నా పేరు ద్వాదశిని అని చెప్పింది. కానీ నేను అది నమ్మలేదు.

నీకు లాగానే అది కూడా ఓ పిచ్చిది అయి ఉంటుంది అనుకున్నాను. నిన్ను కిడ్నాప్ చేసాం.   పని అయిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను అంది. అప్పుడు నాకు అర్థం కాలేదు.  బహుశా వాళ్ళు నన్ను ట్రాన్స్ లోకి పంపి,  ఈ డేటా లాగేసి ఉంటారు. ఆ టైంలో నా తలకి ఓ బగ్ లాంటిది కూడా తగిలించి ఉంది ” జరిగిన వాస్తవం చెప్పాడు శ్రీ వాస్థవ్.

” ఏమిటా డ్రగ్ కాంబినేషన్స్? ఎందుకు పనికి వస్తాయి అవి? ”

“ద్వాదశి నవల క్లైమాక్స్ లో రాజమహేంద్రవరం నుంచి కెనడాకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్లయట్ ని ఉగ్రవాదులు పేల్చి వేస్తారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రస్తుత తరుణంలో ఒక ప్లయిట్ ని ప్రేల్చి వెయ్యడం అనేది ఎవరికైనా ఎలా సాధ్యం? ఓ సూసైడ్ బాంబర్ కి, ఈ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ప్లైట్ ఎక్కిస్తారు.  అతను  ఈ  మాత్రలు మింగగానే  కడుపులో రసాయన చర్య జరిగి,  పెద్ద విస్ఫోటనం సంభవిస్తుంది. దాంతో తీవ్రవాదుల లక్ష్యం నెరవేరుతుంది ”

అతను చెబుతుంటే మేఘాంశ్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. నుదుటి మీద చిరు చమట్లు అలుముకున్నాయి.

శ్రీవాస్థవ్ మాటలు పూర్తికాకుండానే ” ఓహ్ గాడ్ ” అంటూ  చాచి పెట్టి అతని మొహం మీద కొట్టాడు.

కుర్చీతో సహా  ముందుకు తూలిపడ్డాడు శ్రీవాస్థవ్. పడ్ద కుర్చీని వంగి పైకి లేపాడు మేఘాంశ్.

“ఏం అనుకుంటున్నావ్? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేరస్థులకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పిస్తున్నావా? షూట్ చేసి పడేస్తా  ” ఆవేశంగా రివాల్వర్ లాక్ తీసాడు .

“ఆ కాంబినేషన్నే కాదు.  నిన్నూ ఆ ద్వాదశినీ కూడా నేనే సృష్టించాను. అది మర్చిపోకు ” దవడ మీద రుద్దుకుంటూ అన్నాడు శ్రీ వాస్థవ్.

“నువ్వు సృష్టించిన పాత్ర అయినంత మాత్రాన ఎవరిని చంపెయ్యమంటే వాళ్ళని చంపేసి, దేన్ని తగలబెట్టెయ్యమంటే దాన్ని తగలేసెయ్యాలా? మీరు మీ క్రియేటివిటీతో నేరాల్నీ నేరస్థులనీ పెంచి పోషిస్తారు. మీరు సృష్టించే మేము మాత్రం మిమ్మలని ప్రశ్నించకూడదు.  మీతో మంచిచెడ్డల గురించి విడమరచి మాట్లాడకూడదు. అంతేనా? చంపేస్తా నా కొడకా” అంటూ రివాల్వర్ ని తిరగేసి శ్రీవాస్థవ్ తల వెనక భాగంలో బలంగా కొట్టాడు.

కళ్లముందు రకరకాల రంగులు కనిపించాయి శ్రీవాస్థవ్ కి.

ద్వాదశిని నిలువెల్లా సుతారంగా ముద్దాడిన అతను, ఆమె ఆహ్వానం మేరకి ఆమెని అలాగే తన కౌగిట్లో బంధించి, తలమీద ముసుగుని తొలగించాడు.  ఆమె, తన కలల చెలి ద్వాదశీ  ఒకరే.

ఇ…ద్ద…రూ… ఒ….క…. టే టేటే. మగతగా…  నిద్రకమ్ముకొచ్చేసింది అతనికి.

భారతకాలమానం ప్రకారం శ్రీవాస్థవ్ లేచే సరికి ఉదయం  తొమ్మిది అయింది. తలంతా దిమ్ముగా ఉంది. వళ్ళంతా ఒకటే నొప్పులు.  గోడమీద డిజిటల్ క్లాక్ లో డేటు చూసాడు. 13 ఏప్రిల్ 2025.

‘అరే, ఈరోజు నా బర్త్ డే. మరిచేపోయాను ‘ అనుకున్నాడు.  హాలుమధ్యలో కార్పెట్ మీద పడుకొని ఉన్నాడు అతను.

‘భలే కల. పనికొచ్చే కల. తను సృష్టించిన క్యారెక్టర్లే తనతో ఆడుకోవడం ఏమిటి? ఆట కాదు అది వేట’

‘అబ్బా  దవడమీద, మెడమీదా  మేఘాంశ్ కొట్టిన దెబ్బలు ఇంకా సలుపుతూనే ఉన్నాయి’

‘అదేమిటీ? దెబ్బలేమిటి? సలపడం ఏమిటీ?  అంటే ఇది కలకాదు, నిజం. అవును పచ్చి నిజం ‘

నిన్నటి నుంచీ వరసగా జరిగిన సంఘటనలన్నిటినీ గుర్తు చేసుకున్నాడు.

‘ఏరీ? వాళ్లెవరూ కనపడ్డం లేదు. ఏమై పోయారు వాళ్ళు? ‘

దిగ్గున లేచి బైనాక్యులర్ పట్టుకొని బాల్కనీలోకి పరిగెత్తాడు.

ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. పగలే చీకటిలా ఉంది.

ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ వైపు బైనాక్యులర్స్ ఫోకస్ చేసాడు.అద్దాలకి అడ్దుగా కర్టెన్లు వేసి ఉన్నాయి. ఎక్కడా ద్వాదశి కనపడలేదు. ఏదో ఆలోచన వచ్చి త్వర త్వరగా రడీ అయి, నడుచుకుంటూ ఆమె ఉండే ఆ అపార్ట్ మెంటుకి వెళ్ళాడు.

లిప్ట్ దగ్గర వాచ్ మన్ అడ్డం పడ్డాడు.

“క్యాహోనా” అడిగాడు అతను.

“ప్లాట్ అద్దెకి కావాలి”

“టీక్ హై, తెలుగా ” అంటూ తన వెంట రమ్మన్నాడు వాచ్ మన్.

“రాత్రి పోలీసులు వచ్చారెందుకు “  అడిగాడు శ్రీవాస్థవ్ ఆరా తీస్తూ.

“పోలీసులా? అలాంటిది ఏమీ లేదేం ?” ఆశ్చర్యంగా అన్నాడు వాచ్ మన్.

తర్డ్ ప్లోర్ లో ఆగింది లిప్ట్. అదే ప్లాట్.  కిటికీలోంచి ద్వాదశి తనకి కనిపించే అదే ప్లాట్.   డోర్ తెరిచాడు వాచ్ మన్.

“ఇదొక్కటే ఖాళీగా ఉంది. అద్దె 20 వేలు, అడ్వాన్స్ రెండు నెలలు”

“ఎన్నాళ్ళయ్యింది, ఇది ఖాళీ అయి? ”

“సంవత్సరం అయ్యి ఉంటుంది. యు.యస్.కి పోయారు వాళ్ళు ”

శ్రీవాస్థవ్ కాళ్ళల్లో  ఎలాంటి వణుకూ మొదలవ్వలేదు. ఇలాంటి షాక్ లకి నిన్నట్నుంచీ అతను అలవాటు పడిపోయి ఉన్నాడు . ప్లాట్ లో  అవే కుర్చీలు, అదే పెర్ఫ్యూం పరిమళం. ప్రతి గదీ తిరిగి చూస్తున్నాడు. బాల్కనీ లోంచి దూరంగా తన ప్లాట్ కనిపించింది. సోఫా పక్కన తాగి పడేసిన  ఎనర్జీ డ్రింక్ టిన్ కనిపించింది. అది తను త్రాగి పడేసిందేనా? ఏమో.

‘ఫుల్లీ పర్నిచ్డ్. ఒక్కో గదికీ ఒకో టి.వి. ఉంది ” అంటూ వాచ్ మన్ టీవీని ఆన్ చేసాడు. టీవీ చూస్తున్న శ్రీ వాస్థవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.

కెనడా ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్లయిట్  కి తృటిలో తప్పిన ముప్పు. టేబ్లెట్ బాంబ్ తో  ప్లయిట్ ని, పేల్చి వేయడానికి ఉగ్రవాదుల కుట్ర. లేడీ టెర్రరిస్ట్, రెడ్ విడో డోరతితో పాటూ మరో నలుగురి అరెస్ట్.  బి.బి.సి.న్యూస్ చానల్లో స్క్రీన్ మీద బ్రేకింగ్స్ నడుస్తున్నాయి. యాంకర్ న్యూస్ చదువుతుంటే విజువల్స్ పడ్తున్నాయి.

ముసుగుతో ఉన్న ద్వాదశికి  హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకొస్తున్నారు కాప్స్. కుట్రని భగ్నం చేసిన కెనడా రక్షణ శాఖ అధికారి మైఖేల్ రొనాల్డ్, కుట్రని ఎలా భగ్నం చేసిందీ ఆసక్తికరంగా చెబుతున్నాడు.

అతని దవడ మీద, అప్పుడప్పుడే మానుతున్న పొడవాటి గాయపు మచ్చ పచ్చిపచ్చిగా కనపడుతోంది.

ఆ ప్లాట్ నుంచి రెండే రెండు అంగల్లో శ్రీవాస్థవ్ బయట పడ్డాడు. లిఫ్ట్ గురించి ఎదురు చూడకుండా చకచకా మెట్లు దిగి కిందకి వచ్చేసాడు.

సన్నగా వర్షం పడుతోంది. అయినా ఆగకుండా పదే పది నిమిషాల్లో తన ప్లాట్ కి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు.     అతని వ్రేళ్ళు కీబోర్డ్ మీద చక చకా పరిగెడుతున్నాయి.

బయట సన్నగా మొదలైన వర్షం కుండపోతవర్షంగా మారడాన్ని అతను గమనించే స్థితిలో లేడు.