వాకిలి » జగద్ధాత్రి

మందులేని వైరస్ “జెలసీ”
పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన అభీష్టం నెరవేర్చుకున్నాడు , ఇంతవరకు బాగానే ఉంది.

ఇది రచయిత తన మిత్రుడు గురించి చెప్పే కథ . తన ముందు ఎంతో ఆదర్శంగా నటించిన మిత్రుడు అసలు రూపం తెలుసుకున్న మరో మిత్రుని వ్యధ. రైల్ బండి అందక తిరిగి వఃచ్చి భార్యాభర్తలని ఎందుకులే డిస్టర్బ్ చేయడమని వరండా లో పడుకున్న మిత్రుడికి లోనుండి తన ఆదర్శవంతుడైన మిత్రుని అసలు రూపం ఎలా తెలుస్తుందంటే . ఆమె వేడికోలు గా మాటాడుతోంది ఏడుపు గొంతుతో , ఎందుకు అంటారా సదరు భర్త గారు వేస్తోన్న అద్భుతమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. ఇంతకీ అంత సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్నలేమనగా , ఆమె మొదటి భర్త తొలి రాత్రి ఆమెను ముందుగా ఏమి చేసేడు ?, అతనితో ఆమె స్వర్గ సౌఖ్యం అనుభవించిందా ? మరి ఇప్పుడు తనతో ఉంటున్నప్పుడు ఆయనతోని అనుభవం గుర్తొస్తోందా? ఇంటికి వచ్చిన తన మిత్రుడి పట్ల కూడా ఆమెకు ఆకర్షణ కలిగిందా ?ఆయన పోతే తనని చేసుకున్నట్టు మళ్ళీ మరో వ్యక్తిని చేసుకుంటుందా ? ఆహా !!! మగ వాడా నీకు జోహార్లు !! ఈ అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం ఆమె చెప్పి తీరాలి చెప్పక పోతే ఊరుకోక హింశిస్తాడు.

ఇదండీ లోపల జరుగుతోన్న ఆదర్శ దాంపత్య భాగోతం .

అతి చిన్న కథ లో చలం ఇమిడ్చిన అతి భయంకరమైన ఎయిడ్స్ కంటే భయంకరమైన మనుష్య జాతికి ఆదిలోనే సోకిన మందులేని వైరస్ ఈర్ష్య గురించి ఎంత బాగా చెప్పేడు అనిపిస్తుంది. కొందరు అంతే బయటికి వెళ్ళి వచ్చాక తల పాగాలు తీసి వంకీలకి తగిలించినట్టు మర్యాదలు తీసేసి అసలు రంగులు బయట పెదతారు అంటాడు చలం.

అసలు ఈ జెలసీ అనేదే లేకుంటే లోకమిలా ఉండేదా ? అణువు నుండి బ్రహ్మాండం వరకు ఈ జెలసీ స్వరూపాలు మనం చూస్తూనే ఉన్నాం. వైయుక్తికమైన విషయాలనుండి ప్రాపంచిక యుద్ధాలవరకు ఏమి జరిగినా ఈ జెలసీ వలననే కదా .

స్త్రీ తన సొంత మైన ఆస్తి అని భావించిన క్షణం నుండి మగాడు ఆమెను మానసికంగా దైహికంగా ఎంత హింసకు గురి చేస్తున్నాడు. ఇంత ఆదర్శంగా పెళ్లాడిన భర్త అలా రోజూ హింసిస్తోంటే ఏమి సమాధానం ఇవ్వగలదు ఆ భార్య . ఆర్ధికంగా , అన్నీ విధాలా భర్త మీదే ఆధార పడిన ఒక స్త్రీ ఏమని ఎదిరించగలదు ? అతని నోరు ఎలా మూయించగలదు?

జాలేస్తుంది కదూ కానీ మనమందరము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ జెలసీ కి గురయిన వాళ్లమే, ఏదో వైపున మనము ఉన్నాం ఇందులో.

ఏ తాత్వికుడు చెప్పినా , ఏ అధ్యాత్మిక గురువు చెప్పినా ముందు వదిలెయ్యమనేది జెలసీనే. ఆయనని కాదని మరో గురువు దగ్గరికి నువ్వెళ్ళావాని తెలిసిందో ఈ గురువు గారు జెలసీ బారిన పడతారు . నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్తితి ఇది . ఈ జెలసీ కి తన పర బేధా భావం లేదు . ఎవరి పట్ల అయినా కలగవచ్చు. ఈ వైరస్ కి టీకా మందులేవీ కనిపెట్టబడలేదు . కనిపెట్టలేరు కూడా . ఇది చదవడానికి ఒక మామూలు చిన్న కధ లాగే అనిపించినా ఇందులో ఉన్న విషయం మాత్రం ప్రపంచాన్ని కుదిపేసే రోగం . ఇది పోనీ అంటు రోగం కూడా కాదు స్వతహాగా మనం ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మనలో ఉన్న ఇమిడి పోయిన దరిద్రపు జబ్బు .

ఒకే సమయం లో ఇరువురు మనుషులు ఒక మనిషి మనసు లో ఉండకూడదా? అన్న ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పగలమ్. అది ఒక స్త్రీ అయితే , అసలు ఆమెని, అయితే దేవతని లేదా బానిసని చేసి పడేశామేమే తప్ప , ఆమెలో లైంగికత ఉంటుందని ,దాన్ని గౌరవించాలని ఎప్పుడైనా మధ్య తరగతి మనస్తత్వం ఉన్న మనిషి ఆలోచించాడా ? ఇన్ని విషయాలను ప్రశ్నిస్తుందీ చిన్ని కథ .

నాటి చలం నుండి 70ల్లో ఓషో చెపుతోన్న విషయం స్త్రీ కి కూడా లైంగికత ఇష్టా ఇష్టాలు కామ ప్రకోపాలు, వ్యక్తిత్వం ఉంటాయని వాటిని మన్నించాలని. అబ్బే ఇలాంటివి ఎవరికీ పట్టినట్టుండవు . తనకి దక్కని ఆడది మరొకడికి దక్కకూడదని ఏదో చేస్తాడు ఒకడు .

ఈ కథ కేవలం స్త్రీ దృక్పధం నుండి రాసినప్పటికి ఈ జెలసీ కి లింగ బేధం ఉండదు సుమండీ. ఇదే మునిపల్లె రాజు గారి ఒక కధలో ఎన్నేళ్ళకో తిరిగి వచ్చిన చెల్లెలుని తాను ఇష్టపడే బావ ఇష్టపడుతున్నాడని గ్రహించి , కొలనులో ఈత కొడుతుండగా ఆమెను చివరికి లోతుకీ తీసుకెళ్లి ముంచేస్తుంది . ఎంత మంది స్త్రీలలో, పురుషులలో మనమీ ఈసు అసూయ ని చూస్తున్నామో కదా . ఒక్కసారి మనల్ని మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలనిపించే కధ జెలసీ. నేనొక చిన్ని రెండు మాటల్లో ముగిస్తాను “ అణువంత అసూయే కదా అణిగి పోతుంది లెమ్మనుకున్నాను , అణ్వాస్త్రమై కూచుంది” ఎప్పుడో రాసుకున్న నా చిరు కవిత ఇది . జెలసీ చిన్న అణువు లో బ్రహ్మాండాన్ని ఇమిడ్చి నంత పెద్ద కధ . అందుకే ఈ కధను ఇలా పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను .

అరుణ కథనం ఒక అయస్కాంతం
రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటా ఒక మంచి మిత్రుడు నోటి వెంట   అరుణ  పప్పు బ్లాగ్ ” అరుణిమ ” గురించి విన్నాను .  బ్లాగులు పరిచయం చేస్తూ  ” హలో బ్లాగున్నారా ?” అని రాసేదాన్ని .   తనకు తెలిసిన మంచి బ్లాగులు గురించి చెప్పమని అడిగితె   మిత్రుడు  ఈ బ్లాగ్ గురించి చెప్పేరు. అప్పుడే మొదటి సారి చూసాను .  అయితే ఆ అమ్మాయి వేరొక పత్రికలో పనిచేస్తోంది కనుక నే రాసే పత్రికలో ఈమె గూర్చి రాయద్దులెండి అన్నారు నే రాసే పత్రిక వాళ్ళు .  ఓహో ఇలా కూడా ఉంటుందా అని అనుకుని ఊరుకున్నాను. ఆ తర్వాత   కొన్నాళ్ళకి అరుణ వ్యక్తిగతంగా పరిచయమయింది . అప్పుడప్పుడూ ఫోన్లు  ఎవరివన్నా నెంబర్లు కావాలంటే మెసేజ్లు తప్ప ఆమె సాహిత్యం  పరిచయం లేదు .

ఇన్ని రోజులకి ఇవాళ ఆమె 10 కధల పుస్తకం ” చందనపు బొమ్మ ” చదివాను . రెండు మూడు కథలు తను నాకు మెయిల్ చేసినవే  అయినా అన్ని కథలూ ఒకేసారి చదివాను.

ముందుగా చెప్పాల్సిన విషయం ఆమెకి తెలుగు భాష పైన మంచి పట్టు  ఉంది. మంచి భాష తో ముందు చదువరులను ఆకట్టుకునే ఐస్కాంతం ఈమె వాక్యాల్లో ఉంది. ఇది ఈమె కథన్గేట్రం కి చాలా   సహకరించింది అని చెప్ప వచ్చు. పాత్రికేయ అనుభవాన్ని జీవన అనుభవాన్ని కలిపి రంగరించి ఆమె కథల్లో పాత్రలకు పోసింది అరుణ.

కొన్ని కథలు ఆమె జర్నలిస్ట్ డైరీ నుండి యధా తధంగా ఎత్తిపోతల పథకం లో ఈ పుస్తకం లో చోటు చేసుకున్నాయి . అది కొంచం ఇబ్బంది పెడుతుంది పాఠకుల్ని. అమ్మో రేపు నాగురించి కుడా రాసేస్తుందేమో అనిపిస్తుంది. అబ్బో నా అక్షరాల్లోకి మీరు కథగా రావాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి సుమా అంటుందో ఏమో కానీ ఆమె కథల్లో ఈ  నమ్మకం ధైర్యం కాస్త హెచ్చు పాళ్ళలోనే నాకు కనిపించాయి. అన్నిటికన్నా ఒక మంచి పాట కురాలిగా నన్ను ఆకట్టుకున్న కథ ” వర్డ్ క్యాన్సర్ ” . మంచి పటుత్వం  తో  సాగినదే కాక ఆమెలోని సాహితీ జిజ్ఞాసను ఆవిష్కరించే కథ ఇది .

కథను ఎక్కడ మొదలెట్టాలో ఎక్కువమందికి తెలుస్తుంది కానీ ఎక్కడ ఆపాలో అరుణకి బాగా తెలుసు . ఇది ఈమె కథల్లోని  ప్లస్ ప్లస్ పాయింట్. కాసింత సెంటిమెంట్ , ఒక మంచి పరిశీలన , ఒకింత పరిశోధన , కాస్త వ్యంగ్యం , హృదయానుభవం ఈ కథలనిండా ఉన్నాయి. ఉదాహరణకి చందనపు బొమ్మ లో ఆ  పాప ఆబొమ్మపై చూపించే ఇష్టం . నా చెయ్యి విరిగితే అలాగే నన్ను పారేస్తావా అమ్మా అని తలితండ్రులని ప్రశ్నించడం కథలోని  ఆర్ద్రతను నింపాయి. ఆ మాట విన్న వెంటనే తండ్రి దగ్గరికి  వచ్చి అదాటుగా కావలించుకుని సారీ చెప్పడం కథలోని మంచి అంశం .

చిన్నపాటి కోరికైనా ఊరు దాటలేని నవీన్ రెడ్డి ” భ్రమణ కాంక్ష ” ,  పుస్తకాలతో బాటే  కోల్పోయి కరిగి పోయిన ” సైకత శిల్పం ” ఆచార్య , అతి సున్నిత హృదయుడు శాండిల్య ” ఈ కానుక ఇవ్వలేను “  అంటూ పడే బాధ , ” ఒక బంధం కావాలి ” అంటూనే ఏ  బంధమో నిర్ణయించుకోగల దీప వీళ్ళంతా సాధారణంగా బతికేస్తున్న అసాధారణ మనుషులు.

ఈ అమ్మాయిలో తనపై తనకు బాగా నమ్మకమున్న కథలు ” లోపలి ఖాళీలు ” , ఇందాకే చెప్పేను కథ ఎక్కడ ఆపాలో తెలుసును ఈమెకని దానికి నిదర్శనం  ఈ కథలోనూ, ” ఎవరికీ తెలియని కథలివిలే ” , ” ఏకాంతం తో చివరిదాకా ” కథల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి . she is no doubt a crafty writer who pens down with confidence, clarity and also a cautious presenter . she is a conscious writer. తెలివిడి కలిగిన కథయిత్రి . ఉద్విగ్నతలను ఎలా మానేజ్  చేసుకుని అక్షరం చెయ్యాలో తెలుసు.

ఐతే ఈ పది కథలే అరుణ కాదు బహుశా ఎంతో మందిలాగా రాయని ఇంకెన్నో కథలామెలో ఉండే ఉంటాయి . అరుణ ఈ తరం లో ఇప్పుడిప్పుడే ఉదయిస్తోంది. కొన్ని చోట్ల రాయాల్సిన విషయాన్ని దాటవేసే ప్రక్రియ అన్నివేళలా  మంచిది కాదు . ఒక అనితా నాయర్ , ఓ శశి  దేశ్పాండే లాంటి ఆత్మా స్థైర్యం ఇంకా రావాలి. అభివ్యక్తిలో కూడా ఇంకా స్పష్టత రావాలి. ఎలాగూ సంస్కార  వశాన భాష ఉంది కనుక ఇంకా ఇతివృత్తా  లలో వైవిధ్యం ఉండాలి . ఇది మొదటి  సంపుటి కనుక కేవలం ఆరంభమే కనుక ఇంకా ఈమె కలం నుండి మంచి కథలు  ఆశించ వచ్చు.

ఐతే ఈ పది కథలే అరుణ కాదు బహుశా ఎంతో మందిలాగా రాయని ఇంకెన్నో కథలామెలో ఉండే ఉంటాయి . అరుణ ఈ తరం లో ఇప్పుడిప్పుడే ఉదయిస్తోంది. కొన్ని చోట్ల రాయాల్సిన విషయాన్ని దాటవేసే ప్రక్రియ అన్నివేళలా  మంచిది కాదు . ఒక అనితా నాయర్ , ఓ శశి  దేశ్పాండే లాంటి ఆత్మా స్థైర్యం ఇంకా రావాలి. అభివ్యక్తిలో కూడా ఇంకా స్పష్టత రావాలి. ఎలాగూ సంస్కార  వశాన భాష ఉంది కనుక ఇంకా ఇతివృత్తా  లలో వైవిధ్యం ఉండాలి . ఇది మొదటి  సంపుటి కనుక కేవలం ఆరంభమే కనుక ఇంకా ఈమె కలం నుండి మంచి కథలు  ఆశించ వచ్చు.

ఇతివృత్తాలు కేవలం వైయుక్తికమే గాక సమాజం వరకూ ఇంకా పయనించాలి అరుణ. జర్నలిస్ట్ గా తన అనుభవాలు కొందరు వ్యక్తుల గురించి రాసేటప్పుడు జాగ్రత్త  వహించడం అవసరం . ఇది ఈ గీత ఎక్కడ ఉదయించే బాలుడు పొన్న పూవు ఛాయలో మొదలైన ఈ కథోదయం కుంకుమ వర్ణపు  పరిపక్వ అరుణిమను త్వరలోనే దాల్చాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

అంతరంగం వొక అడివి…ఆ అడివిలో ఇరుకు దారి కాశీభట్ల నవల
” I CAN CONNECT NOTHING WITH NOTHING ” అంటాడు టి.ఎస్. ఇలియట్ తన ” వేస్ట్ లాండ్ ” కవితలో. ఆ  కవిత ఆధునిక కవిత్వానికి ఆదిమూలమైన కవిత అని మనమందరమూ భావిస్తాము. ఒక బీజ కణం నుండి ఆవిర్భవించి , ఒక రూపం తో జన్మించి , ఏమిటో ఎందుకో ఈ భూమి మీదకి వచ్చామో తెలీక కొట్టుమిట్టాడుతూ ఉన్న జీవి వేదన కు ప్రతిబింబం ఆ కవిత .ఆ కవిత చదవడం ఒక అపూర్వానుభవం. కాశీభట్ల వేణుగోపాల్ ని చదవడం కూడా అటువంటి ఒక అపూర్వానుభవమే అని చెప్పాలి .

మనసులోని భావాన్ని అక్షరంగా ఆవిష్కరించే ధైర్యం చాలా తక్కువమందికి ఉండచ్చు . అలా అనిపించినది అంతా  రాసేయడమేమీ గొప్ప విషయం కాదనీ కొందరికి అనిపించవచ్చు. నిజమే రెండూ సరి అయిన అభిప్రాయాలే. సాహిత్యం అన్నది సమాజ హితం కోసమని ఇదే స్పృహ తో రచయిత రచన  చెయ్యాలన్నది ఒక అంశం. రచన ప్రభావం చదువరుల మనసుల మీద పడుతుంది కనుక రచయిత రాసే ప్రతి అక్షరాన్నీ అలోచించి రాయాలన్నది ఒక నాగరిక మైన భావన .

ఇందుకు పూర్తిగా భిన్నమైన రచయిత వేణుగోపాల్ . తన లోలోని అంతర్లోకాల లో తిరుగాడుతున్న ఆలోచన లను సకలం అక్షరాలుగా అభివ్యక్తిస్తాడు ఈయన. ఇది ఆదరణ పొందుతుందా లేదా అన్నది పక్కన పెడితే అసలు మనిషి తన మనసులోని భావనలను యధాతధంగా రాయవచ్చా, అలా రాస్తే వచ్చే లాభమేమిటి అన్నది ఇప్పుడు మన ముందరున్న  ప్రశ్న. ” నికషం ” ఒక మనోవైజ్ఞానాత్మక మైన నవల అని చెప్తే దాన్ని నేను సహజమైనదిగా కాక అసహజంగా చిత్రించి నట్లు అవుతుంది. మనో వైజ్ఞానిక మంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు, మనిషి మెదడు మనసు లోని భావనలను చైతన్య స్రవంతిలో వెలువరించడాన్ని మనోవైజ్ఞానిక నవల (సైకలాజికల్ నావల్ ) అంటాము. అవే ప్రమాణాలతో కొలిస్తే ఈ నవలను ఈ పేరుతో పిలవచ్చు.

బంగారపు నిగ్గు తేల్చడానికి నికషోఫలం (గీటురాయి)  వాడినట్టు ఈ మనవ జీవితానికి ఏది గీటు రాయి ? అని మనముందు ట్రిల్లియన్ డాలర్ ప్రశ్నను తీసుకొచ్చిన వేణుగోపాల్ అతి సహజమైన రాతగాడు. కానీ ఎక్కువ అసహజత్వాలకి రంగులకి అలవాటు పడిపోయిన మన మనసులు ఈ సహజత్వాన్ని ఇప్పుడు తట్టుకోలేవు అందుకే ఈ రచయిత రచన అసహజంగా వింతగా అనిపిస్తోంది చాల మందికి. ఇది కొందరి నుండి విని చెప్తున్నది ఈ మాట.

మనసు చాలా భయంకర మైనది అందులో సుప్త చైతన్యం లో  దాక్కున్న పిశాచాల లాంటి భయంకర మైన ఆలోచనలు ఎన్నెన్నో. ఇవి మనిషిని నిట్టనిలువునా చీలుస్తూ ఆలోచించే మనిషిని యాంత్రికంగా బతికేస్తున్న ఈ పశు ప్రాయపు  బతుకుని ప్రశ్నిస్తాయి . ఇలాంటి వేదన అందరికీ కలగదేమి ? అందరూ బాగానే బ్రతుకుతుంటే కేవలం ఒక వేణుగోపాల్ మాత్రమే ఇలా ఎందుకు రాస్తాడు ? ఎందుకంటే వేణుగోపాల్ అంతర్ముఖుడు , తన అంతర్నేత్రం తో  చూసినవి అక్షరీకరిస్తాడు . పదాలను ఏర్చి పేర్చి రాయడు ఇవి ఒక ” మో” , ఒక త్రిపుర, ఒక బుచ్చిబాబు , ఇలా ఇంకొందరి పేర్లు చెప్పొచ్చు అందులో వేణుగోపాల్ ని కూడా చేర్చొచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే , ఈ నిరంతర వేదన తనని తానూ డిస్సెక్ట్ చేసుకుని ఏమి కనుక్కున్నాడో ఆ ఫైండింగ్స్ ని ఒక రీసెర్చ్ రిపోర్ట్ లా ఒక కథ కొన్ని పాత్రల ద్వారా మనకి చెప్పే ప్రయత్నం ఈ రచయితది. కేవలం నికషం  ఒక్కటి చదివితే వేణుగోపాల్ అర్ధం కావడం కష్టం. చలం అంటే మైదానం మాత్రమే అనుకున్నట్టుట్టుంది.

” నేను -చీకటి” నవల తో సంచలనం సృష్టించిన వేణు గోపాల్ నేటి నికషం  లోనూ అదే స్థాయికి తగ్గకుండా మరొక జీవితాన్ని మనకందించారు. ఈ జీవి పేరు అలెక్స్ రామసూరి ఓ అనాధ, ఓ బొల్లి వ్యాధి వాడు , ఓ రసాత్మక చిత్రకారుడు , ఓ తాగుబోతు  ఇన్ని లక్షణాలున్న వాడు అలెక్స్. తనని కని  ఎక్కడో కుళ్ళు మోరీ పై పారేసిన తల్లి పై సాధించలేని కక్ష , తనని అనాధాశ్రమం   చేర్చిన ఓ మంచి మనిషి గా మానవత్వం పై నమ్మకం , తనని స్వంత బిడ్డగా భావించి తమ ఆస్థి పాస్తులు  రాసిచ్చిన క్రిస్టియన్ దంపతుల పై కృతజ్ఞత, తనకంటూ జీవితం లో మిగిలిన మరో రెండు ఆత్మీయ ఆత్మలు స్నేహితులు దుర్గ , కథ మనకు చెప్తోన్న వ్యక్తీ . అలెక్స్ జీవితం లో జరిగే సంఘటనలే కాక అతని చుట్టూ అల్లుకున్న కొందరి జీవితాలను కూడా మనకి ఈ కథ  లో కనబడతాయి .

ఒక వ్యక్తి ఆంతరంగిక వ్యధను కళ్ళకు కట్టినట్లు   చూపిస్తారు రచయిత . చిన్న నవలిక ఇది. అలెక్స్ వంటి వ్యక్తి  ఎటువంటి తిరస్కారానికి గురవుతాడో , చివరికి వేశ్య  కూడా నిరాకరించడం తో ఎంతగా దేహ సౌఖ్యం కోసం పరితపిస్తాడో ఈ అనుభూతులన్నీ మనసుని కలచి వేస్తాయి. ఒకే ఒక్క అమ్మాయి తన కూతురి వయసుది అయిన ప్రియ, నేడో  రేపో చనిపోబోయే వ్యాధితో ఉన్న ఆ అమ్మాయి అలెక్స్ ని అభిమానించడం అతనికి ఎంత ఊరటనిస్తుందో , ఆ అమ్మాయి మరణం తో ఇక బంధాలన్నీ తెంచుకుని  ఫ్రాన్స్ వెళ్ళిపోతాడు . కథా  పరంగా పెద్ద ఇతివృత్తం ఉన్నది కాదు. అయినా ఈ పాత్రలన్నీ సజీవమయిన పాత్రలు. ప్రియ తల్లి గాయత్రి, ముంతాజ్ (వీళ్ళందరికీ కాలేజ్ మిత్రురాలు), కావేరి, దుర్గ ఒక్కో పాత్రా ఒక మానసిక స్తితికి ప్రతీకగా కనిపిస్తాయి.

మనిషిలోని అస్తిత్వ కాంక్షకు స్వార్ధానికి ప్రతీక గాయత్రి. ఒక మామూలు గృహిణి ముంతాజ్. అర్ధం చేసుకునే మనసుండి అనుకంప కలిగిన వ్యక్తీ కావేరి . ఎంత అసహ్యకరమైన పనులు చేసినా అలెక్స్ ని  అసహ్యించుకోలేని అతని  మిత్రులు . వేణుగోపాల్ గారి శైలి ఇది వరకు పరిచయ మున్నవారికి పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ  మొదటి సారి  చదివే పాఠకుడికి కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది . భూత .వర్తమాన భవిష్యత్తులను కలిపేసే మాటలు ఆలోచనలు , అంతరంగ విశ్లేషణ ఇవన్నీ రచయిత నిజాయితీని ప్రకటిస్తాయి. ఒక కాఫ్ఫ్కా , కామూని , మిలన్ కుందేరా ని చదివిన వారికీ ఈ చైతన్య స్రవంతి పధ్ధతి కొత్త కాదు. ఇప్పుడు ఈ సమయం లో ఇటువంటి రచనలు రావడం ఒక విధంగా తెలుగు సాహిత్యానికి ఓక కొత్త వొరవడి అని చెప్పొచ్చు  శ్రీశ్రీ కధలను, చండీదాస్ ను , చలాన్ని , రావి శాస్త్రిని అందరినీ మా తరం చదువుకున్నాము . వారందరిని ఒక్క వేణు  గోపాల్ లో చదువుకోవచ్చు ఇప్పటి తరం .

ఇక ఈ నవల ఇచ్చే సందేశం ఏమైనా  ఉందా ? అసలెందుకు ఇటువంటి వైయుక్తిక  దు:ఖాలు రాయబడతాయి ? అని కనుక అడిగితే సాహిత్యం సందేశం ఇవ్వాలి అనే  వారికీ ఐతే నేనేమీ చెప్పలేను కానీ ఈ నవలలోని ఒక నిజాయితీ గల మనో విశ్లేషణ , మనసు పొరల్లో దాగున్న ఎన్నో భావనలను నిజాయితీ తో మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా చదువరులను ప్రేరేపిస్తాయి . ఇంతకు  మించి సాహిత్యానికి వేరే ప్రయోజనముందని నేను అనుకోను. వేణు గారి భాష పట్ల కూడా కొంత అభ్యంతరాలున్నాయ్  కొందరికి కానీ  అతి సహజంగా ఉన్నట్లనిపిస్తుంది నాకు. ” కన్య శుల్కం ” లాంటి నాటకం లోనే ప్రదర్శన లోనే  స్వేచ్చగా వాడిన (లంజ ) లాంటి పదాలు, సందర్భోచితంగా ఈ నవలలో రావడం అసభ్యంగా మాత్రం లేవు. ఇన్సెస్ట్ గురించి , అలాగే  తమకన్నా చిన్న పిల్లలిని కామించడం గురించి ఇవన్నీ మనకి “లోలిత ” లోనే చదువుకున్నాము. అవేవీ కొత్తగా ఐతే ఏమీ లేవు. అన్నిటికి మించినది ఆఖరున అలెక్స్ డైరీ (సగం కాలిన పేజీల ) మిత్రుడు కథ  లోని నేరేటర్ చదవడం. అందులో ప్రకటితమైన అలెక్స్ మనోభావాలు , ఆలోచనలు , ఆకాంక్షలు , అసహజమైన కోరికలు వాంఛలు సహజాతాలు ఇవన్నీ మనకి తెలుస్తాయి. మనకి తెలియని మన లోలోపలి భావాలూ , భయాలు వాంఛలు అణగ దొక్కిన  కోరికలు ఇవన్నీ ఆ రాతల్లో ఉంటాయి.

వాస్తవానికి వేణు గోపాల్ గారు వాస్తవ రచయిత. అతి సహజమైన భావాలను ఎ ఇన్హిబిషన్స్ లేకుండా రాయగల వారు. అతని మిగిలిన రచనల్లో కుడా ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఆద్యంతమూ చదివించే శైలి శిల్పం భాష ఆయనది. అతని రచనలు చదివిన వెంటనే కాసేపు ఎవరికైనా మనసు మూగ బోతుంది , నిశ్శబ్దం గా మారిపోతాము. ఆతర్వాత అంతర్ముఖులమై మనలని మనం అంతరీక్షణ చేసుకోవడానికి అవకాశం  , అవసరాన్ని  కల్పిస్తాయనడం  లో సందేహం లేదు. “WE ARE ALL HOLLOW MEN”  అని ఇలియట్ అన్నట్లు మళ్ళీ ఇలియట్ మాటలతోనే ముగిస్తాను ఈ బోలు తనం ఏదైతే ఉందొ మనలోని దీనికి అద్దం  పట్టే రచన వేణుగోపాల్ “నికషం ” ఇది మన మనసులకొక గీటు రాయి. ఈ నవల ఒక కతార్టిక్ ప్రభావం కలిగిస్తుంది.

సాహితీ మిత్రులు ప్రచురణ లో వెలువడిన ఈ నవలికను మిత్రుడైన “మో” కి అంకిత మిచ్చారు వేణు గారు. మంచి నవలను ప్రచురించిన శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి అభినందనలు. ఆలోచింప జేసే సాహిత్యానికి ఇంకా ఆదరణ కొరవడ లేదని మరో సారి నిరూపించింది ఈ “నికషం”.

వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!
జగద్ధాత్రి : వేణుగోపాల్ గారు “నికషం ” రాయడానికి గల నేపధ్యం చెప్తారా ?

కాశీభట్ల వేణుగోపాల్ : నా నవలలలో రాతల్లోని పాత్రలందరూ ఎక్కడినుండో ఊహలనుండి  వచ్చిన వారు కాదు. వారందరూ ఎక్కడో ఎప్పుడో జీవితం లో తారస పడ్డవారే. నేను-చీకటి నవల లో భగవాన్లు నాకు ఒక ఆసుపత్రి ముందు పరిచయం అయిన వ్యక్తి. అందులో భగవాన్లు ని చంపేసాను. నికషం లోని అలెక్స్ భగవాన్లు పాత్రకి పొడిగింపుగా అక్షరీకరించాను.

(కాశీభట్ల వేణుగోపాల్ )

ధాత్రి  : భగవాన్లు స్ఫోటకం మచ్చలతో వికారంగా ,ఉంటాడు  అలాగే నికషం లో అలెక్స్ కి బొల్లి వ్యాధి, ఇలాంటి పాత్రలను చిత్రించడం లో మీ ఉద్దేశం ?

వేణు : సౌందర్యం అంటే కేవలం దేహ సౌందర్యం అనుకునే వారికీ ఏమి చెప్తాము. అసలు ఇలాంటి వ్యాధులు అంటుకోవని ,  స్పృశించి నా అంటూ వ్యాధులు కావని  అన్నది చాలా మందికి తెలియక ఎంత గా అటువంటి వారిని దూరం పెడతారో చూసినప్పుడు నా కడుపు మనసు చాలా బాధ పడుతుంది. దు:ఖం వస్తుంది. అందుకే అటువంటి  మనుషుల మనోగతం  ఎలా ఉంటుందో ఈ మనుషులకి చెప్పాలనే ఉద్దేశం తోనే ఈ పాత్రలను చిత్రించాను. ఒక సారి పాస్పోర్ట్ ఆఫీసులో ఒక గుమస్తా బొల్లి వ్యాధి ఉన్నవాడు , ఉన్న వికారం గాక అతను చేసుకున్న వికారం కొంత. తలకు రంగు పూసుకుని  మరీ వికృతంగా ఉన్నాడు. అందరూ అతన్ని అసహ్యంగా చూస్తున్నారు. నేను నా పనయ్యాక కాఫీకి రమ్మని పిలిచాను అతను  డ్యూటీ లో ఉన్నప్పుడు రాకూడదు సర్ అన్నాడు. అయితే ఒకసారి ఇలా బయటికి రండి అని పిలిచాను. వచ్చాడు అతన్ని కావలించుకున్నాను ఎంతో ప్రేమగా ఇష్టంగా కృతజ్ఞతగా సహానుభూతితో , అప్పుడు అతని కళ్ళలో చూసిన కన్నీరే ధాత్రీ ఈ అలెక్స్ పాత్రకి ప్రాణం. అప్పుడు ప్రాణం పోసుకున్నాడు అలెక్స్ నా మెదడు లో . అసలీ వ్యాధులు ఏమీ అంటూ వ్యాధులు  కావని , అటువంటి వారు కూడా ఆదరణ కోరుకుంటారని ప్రేమ కోరుకుంటారని తెలిసినా ఎందుకు ధాత్రీ ఈ మనుషులు  ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారు. సమాజం లో వారూ భాగమే మన సాటి  వారె అని మరిచిపోతారు. కబుర్లకు మాత్రం చెప్తాము అందరం ఐ హేట్ దిస్ అందుకే రాసేను.

ధాత్రి  : భగవాన్లు పాత్ర కూడా నిజ జీవితం లోది  అన్నారు కొంచం వివరిస్తారా ?

వేణు : అమ్మని ఆసుపత్రికి శ్రీపాద పినాక పాణి గారి కారులో తీసుకెళ్ళాం. కానీ అమ్మ చనిపోయాక నాకు ఆయన కారులో తీసుకురావడానికి మనసు ఒప్పలేదు. అప్పుడు ఇలా విగత జీవులను తీసుకెళ్ళే ఒక టాక్సీ నడుపుతున్న వ్యక్తీ గా నాకు భగవాన్లు పరిచయమయ్యాడు. తను అమ్మను లోపలి తీసుకువచ్చి పడుకోపెట్టి వెళుతుంటే నేను డబ్బులివ్వ బోయాను.

అందుకు అతడు ” మా అమ్మని తీసుకొచ్చినందుకు నాకు డబ్బులిస్తారా బాబూ . అమ్మ ఎన్ని సార్లు నాకు అన్నం పెట్టిందో ఆదరించిందో అటువంటి అమ్మను తీసుకొస్తే డబ్బులిస్తారా “అని అడిగాడు నా హృదయం ద్రవించి పోయింది. అప్పటినుండి నాకు ఈ దైహిక వైకల్యాలు ఉన్న వ్యక్తులను సమాజం లో మనుషులు అని భావిస్తున్న వారు ఎంత నిరాదరణకి గురి చేస్తారో అని బాధేసింది అందుకే రాసాను. (ఇది  చెప్తూ కూడా అయన ఏడ్చారు )

ధాత్రి  : మీ రచనల్లో ఈ పెర్వర్షన్స్ మానసిక వికారాలు ఎక్కువగా ఉంటాయని కొందరి అభిప్రాయం. దానికి మీరు ఏమంటారు ?

వేణు : మానసిక వికారాలు పెర్వర్షన్స్ (నవ్వు ) ఎవరి లో లేవు అందరి లోనూ ఉంటాయ్. కానీ వాటిని రాయడం అంత సులువైన పని కాదు. నేను రాస్తాను. నిజాయితీగా రాస్తాను.

ధాత్రి :  మీ రచనల్లో కొన్ని అభ్యంతర కర మయిన  పద జాలం ఉందని కొందరి అభ్యంతరం

వేణు : (నవ్వు) అభ్యంతర కరమైన పదాలు హహ అవి నిజంగా అసభ్య పదాలా చెప్పు ధాత్రీ  సహజంగా వచ్చే మాటలు. ఆంగ్లం లో వాడితే అసభ్యం కావా ? అది పాత్ర మనస్తితిని బట్టీ సహజంగా రాసాను. నచ్చిన వారు చదువుతారు లేని  వారు లేదు.(నవ్వు)

ధాత్రి :  మీ శైలి లోని ఈ చైతన్య స్రవంతి పధ్ధతి కొంత ఇబ్బంది పెడుతుందని అంటుంటారు మీరు కావాలనే ఈ పద్ధతిని ఎన్నుకున్నారా మీ రచనకి ?

వేణు: అవును అవును. నేను కావాలనే ఎన్నుకున్నాను మనిషి ఎప్పుడూ ఒకే ఆలోచనతోనూ చైతన్య స్థాయి లోనే ఉండడు . మూడు చైత న్యావస్థలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయ్. అందుకు ఆ పద్ధతిని ఎన్నుకున్నాను . నేను ఎలా ఆలోచిస్తానో అలా రాస్తాను.

ధాత్రి : దాని వల్ల  ప్రయోజనం ఏమి ఆశిస్తున్నారు ?

వేణు : ప్రయోజనం హహ ఒక రచన మనసును మేల్కొలపాలి , మెదడుకు పదును పెట్టాలి , మనసుని కరిగించాలి , హృదయాన్ని ద్రవింప చెయ్యాలి అదే ప్రయోజనం సాహిత్యానికైనా చిత్ర కళ  కైనా , సంగీతానికైనా అని నేను నమ్ముతాను ఆచరిస్తాను అక్షరాల్లోకి వంపుతాను.

ధాత్రి  : ధన్యవాదాలు వేణుగోపాల్ గారు మీ రచనల నేపధ్యం గూర్చి వివరించినందుకు నమస్తే.