వాకిలి » జి.ఎస్.లక్ష్మి

ఇప్పుడైనా చెప్పనీయమ్మా…
“ఈరోజు ఇంతటి గురుతరమైన బాధ్యత, యింతటి గౌరవించదగిన ఉద్యోగం నాకు లభించిందంటే దానికి ముఖ్యకారణం మా అమ్మగారు. ఆవిడ కడుపున పుట్టడం నా అదృష్ట మయితే, ఆవిడ ప్రవర్తన నాకు స్ఫూర్తి అయింది.” టీవీ ముందు కూర్చుని, కొడుకు యిస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న శంకర్రావు, పార్వతి ముందుకువంగి యింకాస్త శ్రధ్ధగా వినసాగారు.

అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థకి సీ.ఈ.వో.గా ఎంపికయిన విజయ్ హుందాగా కూర్చుని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాడు. నలభై అయిదేళ్ళ విజయ్ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఆ ఫ్లడ్‍లైట్లముందు వెలిగిపోతున్నాడు. అమెరికాలో ప్రముఖసంస్థల జాబితాలో మొదటి నాలుగుస్థానాల్లో నిలబడే ఆ సంస్థకి సి.ఈ.ఓ.గా ఎంపిక కావడమంటే సామాన్యమైన విషయం కాదు. విజయ్ ఆ బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో జేరేముందు తల్లితండ్రుల్ని కలవడానికి ఇండియా వచ్చాడు. ఒక భారతీయునికి దక్కిన గౌరవం అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో లోకల్ ఛానల్ వాళ్ళు అతనిని ఇంటర్వ్యూ చేసారు.

అమెరికాలో దిగ్గజాల్లాంటి పోటీదారులతో పోటీపడి విజయ్ ఆస్థానాన్ని దక్కించుకున్నాడు. మిగిలినవాళ్ళు కూడా తక్కువవాళ్ళేమీకాదు. వారు చదివిన యూనివర్సిటీలు, తెచ్చుకున్న మార్కులు ఇతని కన్న యెక్కువే. కాని ఆస్థానానికి విజయ్ ఎంపికయ్యాడు. దానికి ముఖ్యకారణం తన తల్లి అని చెపుతున్నాడు.

“యెవరైనా విజయం సాధించినప్పుడు ఈ మాటే చెపుతుంటారు. మీరు దీనిని ఇంకాస్త వివరించగలరా? అంటే మీ అమ్మగారు యెంతవరకు చదువుకున్నారు, యేమి ఉద్యోగం చేసేవారూ, మిమ్మల్ని చదివించడంలో ఆవిడ చూపించిన ప్రత్యేకమైన పధ్ధతులు యేమిటి.. ఇలాంటివన్నీ మీద్వారా వింటే కొంతమందైనా ఆ స్ఫూర్తి పొందుతారుకదా.. ”

విజయ్ మనోహరంగా నవ్వాడు. “మా అమ్మగారి చదువు హైస్కూల్‍తోనే ఆగిపోయింది. కాలేజీలో అడుగు పెట్టకుండానే పెళ్ళైపోయింది. అమ్మగా నన్ను ఆవిడ పెంచిన తీరే నాకు స్ఫూర్తి”.

చాలా శ్రధ్ధగా వింటున్న శంకర్రావు మొహంలో భావాలు మారిపోయాయి. తనకన్న, తన భార్య కొడుకు అభివృధ్ధికి సాయపడిందని అతను చెప్పడం ఆయనని చిన్నబుచ్చింది. పార్వతి వంక చూసాడు. ఆవిడ ఇంకా ఆ ఆనందంనుంచి తేరుకోలేదు. కాని భర్త తనని చూడగానే ముఖమ్మీద కనపడే భావం మార్చేసుకుని, మొహం ఉదాసీనంగా పెట్టేసింది.

“చూసేవా.. చూసేవా నీ కొడుకూ..యేవిటో.. మాట్లాడితే ఈ కొడుకు లందరూ అమ్మ అమ్మ అంటూ అమ్మ భజన మొదలెడతారు. తొమ్మిదినెలలు మోసి, కని, పెంచి పెద్దచేసింది అంటూ దండకాలు చదూతారు. కడుపుతో వున్నాక కనక మాన్తారా.  పిల్లలంటూ పుట్టేక ఆమాత్రం ఇంత అన్నం వండి వడ్డించడంకూడా ఘనకార్యమేనా?  యేం.. వాడికి తండ్రిగా నేనేమీ చెయ్యలేదా.. పుడుతూనే ఇన్ని డిగ్రీలు తెచ్చేసుకున్నాడా.. వాడిని మంచి  స్కూల్లో చేర్పించడం  దగ్గర్నుంచి అప్పు చేసి అమెరికా పంపేవరకూ యెంత తాపత్రయపడ్డానో వాడికి తెలీదా? ఇంట్లో కూర్చుని అన్నం వండిపెట్టిన అమ్మని అంత అందలం యెక్కిస్తున్నప్పుడు పక్కన నాపేరు కూడా కలిపి అమ్మా, నాన్నా అనొచ్చుకదా..” లోపలినుంచి ఉబికివస్తున్న ఉడుకుమోత్తనం ఆపుకోలేకపోయాడు శంకర్రావు.

“యేదో అందర్లాగే వాడూ చెప్పేడేమోనండి. ఇప్పటికి కూడా వాడు మీ యెదుట యెప్పుడైనా తలెత్తి మాట్లాడేడా..” సమాధానపరచబోయింది పార్వతి.

సరిగ్గా అదేమాట అంది విజయ్ భార్య నీలిమ కూడా అమెరికాలో విజయ్‍తో కలిసి ఫామిలీరూమ్‍లో కూర్చుని ఈ ఇంటర్వ్యూ చూస్తూ.

“పోనీ పెద్దాయన. ఆయన్ని చిన్నబుచ్చకుండా అమ్మానాన్నలిద్దరి పేర్లూ చెప్పొచ్చుకదండీ.”

నీలిమ అడిగినదానికి తన లోపల యెప్పట్నించో వున్న భావాలని ఆమె ముందు వెళ్ళగక్కేసాడు విజయ్. “నీలూ, నాతోపాటు మరో ఇద్దరు ఇదే పొజిషన్‍కి పోటీ పడ్డారు. గుర్తుందా..?”

“లేకేం.. వాళ్ళు చదివిన స్కూల్స్, తెచ్చుకున్న గ్రేడ్స్ కూడా మీకన్నా యెక్కువే అని మీరే అన్నారుగా. మరి వాళ్లని కాదని మిమ్మల్ని యెన్నుకున్నారంటే ఆ కంపెనీవాళ్ళు మీలో యేదో ప్రత్యేకతని చూసేవుంటారు. బహుశా మీ నాన్నగారినుంచి మీకు ఆ జీన్స్ వచ్చాయేమో..” అంది.

“కాదనలేను. వంశంలో వున్న ప్రత్యేకతలు యేడుతరాలదాకా వస్తాయంటారు.. కానీ విత్తనం ఒక్కటీ సరిపోదు నీలూ.. విత్తనం యెంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యం.. యెంత గొప్ప విత్తనమైనా దానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే మొలకెత్తదూ, ఫలించదూ కూడా.  కాశ్మీర్‍లో పండే ఆపిల్స్ ని నువ్వు హైద్రాబాదులో పండించగలవా.. యెడారిలో పండే ఖర్జూరాలని కోనసీమలో పండించగలవా..అందుకే కేవలం విత్తనాన్ని బట్టే దేని అభివృధ్ధీ వుండదు..”

యేదో కొత్తవిషయాన్ని వింటున్నట్టు ఆసక్తిగా చూసింది నీలిమ. యేదో గుర్తు చేసుకుంటూ అన్నాడు విజయ్, “నేను యెప్పుడో యెక్కడో చదివాను నీలూ.. జీవుడు జన్మించడానికి ముందు తనకి యేక్షేత్రం కావాలో చూసుకుంటాడుట. ముందుజన్మలో కలిగిన సంస్కారాలనిబట్టి  క్షేత్రాన్ని యెన్నుకుంటాడుట. అలా యెన్నుకుని ఆ గర్భాన పుట్టడంవల్ల ముందరి జన్మ సంస్కారాలన్నీ ఆ తల్లి పెంపకంలో వృధ్ధి పొందుతాయట. అలాగ మా అమ్మ కడుపున పుట్టడం నేను ఒకరకంగా అదృష్టంగా భావిస్తే, ఆ తల్లి పెంపకంలో నేను పొందిన స్ఫూర్తి ఇంకోరకంగా నాకు కలిసొచ్చింది.”

“నాకేమీ అర్ధం కావటంలేదు..” అంది నీలిమ. నవ్వాడు విజయ్. నీలిమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ,

“అందరమ్మల్లాగా మా అమ్మ కని పెంచడమొక్కటే చెయ్యలేదు. నేను ఈ పొజిషన్‍లో నిలబడడానికి కారణం మా అమ్మ మా ఇంటిని నడిపిన తీరు. అది గుర్తించగలగడం నా అదృష్టం.  పిల్లలు తండ్రి దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటారు. నిజమే. కానీ అవి వాళ్ళు నేర్చుకునేవి కాస్త వయసు వచ్చాక. కానీ పుట్టినప్పటినుంచీ వి షయాలు నేర్చుకునేది తల్లి పొత్తిళ్ళనుంచే. తనకి తెలీకుండానే బిడ్ద తల్లిని గమనిస్తాడు, అనుకరిస్తాడు.”

“అత్తయ్యగారు చేసిన అంత గొప్ప పనేవిటో నాకు తెలీలేదు.” అంది నీలిమ.

“చెప్తాను. సరిగ్గా విను. నువ్వు కూడా కొడుకును కన్న తల్లివే. పిల్లలను పెంచేటప్పుడు తల్లులు యెంత ప్రమత్తతతో వుండాలో నీకే తెలుస్తుంది.” అంటూ కార్పెట్ మీద కాళ్ళు జాపుకుని కూర్చుంటూ మొదలెట్టాడు విజయ్.

“నీలూ, ఒక సంస్థకి సి.ఈ.ఓ. అంటే ఆ సంస్థని అభివృధ్ధి వైపు నడిపించగలగాలి. అందుకోసం ఎంతోమందితో, ఎన్నోరకాల పరిస్థితులలో పని చేయించగలగాలి. దానికి సబ్జెక్ట్ ఒక్కటే వస్తే సరిపోదు. రకరకాల వ్యక్తుల్లో వున్న ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించి, సముదాయించి, సమాధానపరచి అలా యెన్నోరకాలుగా ఆ ప్రతిభని వారినుండి రాబట్టి సంస్థను పెద్దది చెయ్యాలి. ఇలా యెలా చెయ్యాలన్నది నేను కేవలం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను.”

తెల్లబోయింది నీలిమ. “కానీ, అత్తయ్యగారు యేమీ చదువుకోలేదు కదండీ.!”

“నిజవే. అమ్మ కాలేజీ చదువులు చదవలేదు. హైస్కూల్ చదువు పూర్తవకుండానే ఒక ఉమ్మడికుటుంబంలోకి పెద్దకోడలిగా వెళ్ళింది.”  విజయ్ చిన్నప్పటి ఙ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా నీలిమకి చెప్పసాగాడు.

“నీలూ, మా అమ్మ ఆమె పదహారేళ్ళకే అత్తగారు, మామగారు, అత్తగారి అత్తగారు, ఇంట్లోనే వుండే ఒక విధవాడపడుచూ, పెళ్ళికాని మరో ఇద్దరు ఆడపడుచులూ, ముగ్గురు మరుదులూ వున్న ఉమ్మడికుటుంబంలోకి కాపరానికొచ్చిందిట.  మా ఆఖరి మేనత్త పెళ్ళిటైమ్‍కి నాకు పదేళ్ళు. అప్పుడే నేను మా అమ్మలోని మరో మనిషిని చూసాను. అప్పటికింకా మేం మా చదువులకోసం హైద్రాబాదు రాలేదు. మా ఊళ్ళోనే ఉండేవాళ్లం.

ఆ రోజుల్లో మా అత్తకి చూసిన సంబంధం చాలా పెద్దింటి సంబంధం. ఆ సంబంధమే చెయ్యాలని మా మామ్మ పట్టు పట్టి కూర్చుంది. అంత తూగలేనని మా తాతగారు ససేమిరా అన్నారు. నీకు తెలుసుకదా. మా నాన్నకి మేం నలుగురు  పిల్లలం. అప్పటికి మా పెద్దబాబయ్య ఒక్కడే యెక్కడో గుజరాత్‍లో యేదో బట్టలమిల్లులో అక్కౌంటెంట్‍గా చేసేవాడు. మిగిలిన బాబయ్య లిద్దరూ యింకా చదువుకుంటున్నారు. మా మండువాలో యింట్లోవాళ్ల మధ్య అంత పెద్ద మాటల యుధ్ధం జరగడాన్ని చూడడం నేనదే మొదటిసారి. అంతా గట్టిగా యెవరికి తోచినట్టు వాళ్ళు అరిచేసి వెళ్ళిపోయారు.

ఒక్క మా అమ్మ మాత్రం నోరిప్పి ఒక్క మాటనలేదు. అలా అందర్నీ చూస్తూ కూర్చుంది. ఆఖర్న అందరూ మా అమ్మ దగ్గరకొచ్చి ..మా తాతగారేమో “ఇదిగో కోడలుపిల్లా చెప్పు మీ అత్తగారికి. ఈ పెళ్ళి చెయ్యడంతో అవదు. తర్వాత పురుళ్ళకీ పుణ్యాలకీ యింతకింత అవుతుంది. నావల్ల కాదని ఖచ్చితంగా చెప్పెయ్యి” అంటే.. మా మామ్మేమో “ఒసేవ్, పిల్లని కలిగినింట్లో పడెయ్యాలని మీ మావగారితో చెప్పు. ఇప్పుడు గంతకు తగ్గ బొంతని యేదో ముడెట్టేస్తే రేప్పొద్దున్న దాని పిల్లలకి పాలడబ్బా ల్దగ్గర్నుంచీ మనవే కొనాలని చెప్పు” అంటే, ఇంక మా నాన్నేమో “యేదో.. కొంతవరకు సాయం చెయ్యగలను కానీ నా స్తోమతుకి మించి నేనేమీ  ఇవ్వలేను. నాకూ నలుగురు పిల్లలున్నారు కదా..” అన్నారు. మా బాబాయిలిద్దరూ యేం మాట్లాడకుండా జరుగుతున్నది చూస్తూ కూర్చున్నారు.

నాకు బాగా గుర్తు. ఆరోజు సాయంత్రం పొలంనుంచి వచ్చి, కాఫీ తాగి, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చున్న మా తాతగారితో సింహద్వారం లోపలగా నిల్చుని మా అమ్మ యేదో మాట్లాడింది. ఆ తర్వాత దేవుడి దగ్గర సంధ్యదీపం వెలిగిస్తున్న మా మామ్మతో మాట్లాడింది. రాత్రి భోజనం వడ్డిస్తూ మా నాన్నగారితో మాట్లాడింది. మరి యేం మాట్లాడిందో యేమో ఆ వయసులో నాకర్ధం కాలేదు కానీ మర్నాడు పొద్దున్నే ముహూర్తం బాగుందంటూ మా తాతగారు మా నాన్నగారిని వెంటపెట్టుకుని వెళ్ళి అదే సంబంధాన్ని ఖాయం చేసుకొచ్చారు. వాళ్లందరికి అమ్మేదో చెప్పిందని తప్పితే యేం చెప్పి  అందర్నీ ఒప్పించిందో ఆ వయసులో తెలీలేదు.

కాని ఒకటి మాత్రం బాగా అర్ధమయ్యింది. వాళ్లంతా ఆవేశంగా వున్నపుడు యెదురుచెప్పకుండా సాంతంగా వాళ్ల మాటలన్నీ మా అమ్మ వింది. తర్వాత వాళ్ల వాళ్ల ఆవేశాలు తగ్గాక ఒకరిమాట ఇంకొకరికి అర్ధం అయ్యే వాళ్ల వాళ్ల భాషలో చెప్పింది. అందరు కోరుకునేదీ మా అత్త సుఖమేకదా.. ఆ లక్ష్యం దృష్టిలో పెట్టుకుని యెవరు యెలా చెపితే ఒప్పుకుంటారో అలా వాళ్ల దగ్గర మాట్లాడి ఆ పెళ్ళి స్థిరపడేలా చేసింది మా అమ్మ. అంతే కాదు.. ఆ పెళ్ళిలో కూడా యెటువైపునుంచీ మాటరాకుండా అందర్నీ యెంతో సమర్ధవంతంగా ఒకే లక్ష్యం వైపు నడిపించింది. ఆ వయసులో అమ్మ యెలా చేసిందో నాకు తెలీలేదు కాని యేదో గొప్పపని చేసిందనిమటుకు అర్ధమైంది. ఆ తర్వాత నుంచి అమ్మని నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకున్నాను.” విజయ్ చెపుతున్నది శ్రధ్ధగా వింటున్న నీలిమ గబుక్కునలేచి, “ఉండండి. చింటూ స్కూల్‍బస్ వచ్చే టైమైంది. వాణ్ణి తీసుకొచ్చేక స్థిమితంగా చెప్దురుగాని” అంటూ డ్రైవ్‍వే వైపు పరిగెట్టింది. చింటూ లోపలికి రాగానే తండ్రిని ఫామిలీరూమ్‍లో చూసి సంతోషంతో విజయ్ ఒడిలో చేరిపోయేడు. చింటూకి స్నాక్ తీసుకొచ్చి పక్కనే కూర్చుని “ఊ ఇంక చెప్పండి” అంది నీలిమ.

“నీలూ, నీకు తెలీనిదేవుంది..మూడుతరాల మనుషులు ఒక యింట్లో వుంటున్నప్పుడు తరాల మధ్య సంఘర్షణ తప్పదు. అందులోనూ వయసు పెరిగేకొద్దీ చాదస్తాలు కూడా యెక్కువవుతాయంటారు. అలాగే మా తాతగారూ, నాన్నమ్మా వాళ్ల పట్టుదలలు అస్సలు వదిలేవారు కాదు. యెదుగుతున్న ఆడపిల్లల్ని మా అమ్మ సరిగ్గా పెంచటం లేదని అస్తమానం మా అమ్మని, చెల్లెళ్ళని యేదో ఒకటంటూ సాధించేవారు. వాళ్ళలా అంటుంటే మా చెల్లెళ్ళు విసుక్కునేవాళ్ళు. కాని మా అమ్మ మటుకు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర మరొకర్ని కించపరచలేదు. మా చెల్లెళ్ళ దగ్గర పెద్దవాళ్ల మాటలని యెలా గౌరవించాలో చెప్పేది. మా తాతగారు, నాన్నమ్మల దగ్గర మారుతున్న కాలంలో చదువుకుంటున్న పిల్లల మనస్తత్వం యెలా వుంటుందో వివరించేది. మరి ఆ మధ్యవర్తిత్వం యెలా నెరిపేదో కానీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు రెండింతలయ్యేలా చూసింది. అందరికన్నా యెక్కువ సాధించేది ఇంట్లోనే వుండే మా పెద్దమేనత్త. ఆవిడ జీవితంలో యేమీ అనుభవించలేకపోయింది. ఆ బాధ మరొకరిమీద ద్వేషంగా మారకుండా మా అమ్మ ఆవిడ నెప్పుడూ యేదో ఒక ఆధ్యాత్మిక చింతనలో వుంచేది. అలా వుంచడానికి మా అమ్మ యెన్నిరకాలుగా సమర్ధించుకోవాల్సి వచ్చేదో నేను గమనిస్తుండేవాణ్ణి. నీలూ, నీకోవిషయం తెలుసా?” ఆడిగాడు విజయ్.  యేమిటన్నట్టు ఆసక్తిగా ముందుకు వంగింది నీలిమ.

“రక్తసంబంధీకులయితే ఎప్పుడైనా ఒకమాటనుకున్నా అదేమీ మనసులో పెట్టుకోకుండా కలిసిపోతారు. కాని బైటనుంచి వచ్చినవాళ్ళు? అంటే మా పిన్నిలు ముగ్గురూ కూడా వేరే వేరే ఇళ్ళనుంచి వచ్చినవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. పెద్ద బాబయ్య దూరంగా గుజరాత్‍లో వుంటున్నా ప్రతియేడూ వచ్చి ఫలసాయంలో తన వాటా పట్టికెళ్ళేవాడు. మిగిలినవాళ్ళు ఇద్దరూ దగ్గర ఊళ్ళలోనే పనిచేస్తుండడం వల్ల ప్రతి పండక్కీ పబ్బానికీ ఇంటికొచ్చేవారు. మా పిన్ని లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడేదికాదు. మాటలు బాణాల్లా విసురుకునేవారు. ఆ మాటల్లో మా తాతగారు, నాన్నమ్మల్ని కూడా దులిపేసేవారు. మా నాన్నమ్మ అయితే ఆ మాటలు వినలేక తలపట్టుకు కూర్చునేది. ఒక్కొక్కసారి మా తాతగారైతే ఇంక ఇంట్లో అడుగు పెట్టొద్దని కూడా వాళ్లమీద అరిచేసేవారు. అలాంటి ఉత్తర దక్షిణ ధృవాలని మా అమ్మ యేం మంత్రం వేసేదో కానీ యేకతాటికి తెచ్చేది. నేను కాస్త పెద్దవాణ్ణయేక వాళ్ళని యెలా కలిపేవమ్మా అనడిగితే అమ్మ నవ్వేసి ఇలా అంది.

“నాన్నా, దేనికైనా ఒక లక్ష్యమంటూ వుంటుంది. ఇక్కడ మన లక్ష్యం మనిల్లు అభివృధ్ధిలోకి రావడం. అదెలా వస్తుందీ.. పిల్లలు మీరందరూ జీవితాల్లో బాగా స్థిరపడినప్పుడు వస్తుంది. మీరు యెలా స్థిరపడతారూ. మీరైనా బాబయ్యల పిల్లలైనా నలుగురిలో మన కుటుంబం గురించి గౌరవమర్యాదలుంటే మీకు అలాంటి ఇళ్లనుంచి సంబంధాలొచ్చి చక్కగా స్థిరపడతారు. ఒక కుటుంబగౌరవం నిలబడాలన్నా, కూలిపోవాలన్నా కారణం ఆ ఇంటి ఇల్లాలే. ఆ ఇల్లాలి లక్ష్యం పిల్లల అభివృధ్ధి అయినప్పుడు మిగిలిన విషయాలన్నీ చాలా చిన్నవైపోతాయి. పిన్ని లిద్దరికీ వాళ్ల కర్ధమయ్యేటట్టు దీన్ని చెప్పడమే నేను చేసింది.

నీకింకో విషయం చెప్పనా నాన్నా..మనుషులు సాధారణంగా దుర్మార్గులు కారు. ఒక్కొక్కసారి పరిస్థితులు వారినలా స్వార్ధపరులుగా, దుర్మార్గులుగా మారుస్తాయి. మనం ఆ పరిస్థితిని సరిదిద్దాలి తప్పితే మనుషులని తప్పు పట్టకూడదు. ఇక్కడకూడా అంతే.. పిన్నిలిద్దరూ మంచివాళ్ళే. యెటొచ్చీ పెద్దవారైన తాతగారు తీసుకునే నిర్ణయాలవల్ల వాళ్ళ పిల్లలకి యెక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయం వాళ్లనలా మాట్లాడిస్తోంది. వారిలో ఆ భయం పోగొడితే యెంతో కలివిడిగా వుంటారు.”

అమ్మ అన్న మాటలకి నాకు కోపం వచ్చింది. “అందుకోసం నువ్వు వాళ్ళనంత బతిమాలాలా? నీలాగే వాళ్ళు కూడా కోడళ్ళే కదా.. నీలాగే వాళ్ళకి కూడా బాధ్యతలు లేవా? నువ్వెందుకు అందరిచేతా మాటలనిపించుకోవాలీ..?” అన్నాను. అమ్మ నవ్వింది.

“నేను ఈ ఇంటికి పెద్దకోడలిని. అందర్నీ ఒకేతాటిమీద నడిపించడం నా బాధ్యత. యెవరి దగ్గర యే సమర్ధత వుందో తెలుసుకుని, సామరస్యంగా దానిని బైటికి తీసి ఇంటి అభివృధ్ధికి వాడుకోవడంలోనే నా సమర్ధత వుంటుంది. నువ్వే చూడు. బైట అందరితోనూ మర్యాదగా మాట్లాడి కార్యాన్ని సాధించుకొచ్చే లౌక్యం చిన్నపిన్ని దగ్గర వుంది. అందుకని ఆవిడని కథలూ కార్యాలూ అయినప్పుడు మధ్యవర్తిగా కనక వుంచితే మనం కావాలనుకున్నవి సాధించుకొస్తుంది. అదే బుల్లిపిన్నిని చూడు. మార్కెట్‍లో సరుకులుకానీ, బట్టలూ, బంగారం కానీ యేవి యెక్కడ నాణ్యంగా, సరసంగా వుంటాయో బాగా తెలుసు. అటువంటి పనులు ఆవిడకి అప్పగించితే మనకి నిశ్చింత. ఇంక మీ అత్త అంటావా.. యేయే పూజలూ, వ్రతాలూ యెలా, యెప్పుడు, యెక్కడ చెయ్యాలో.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త. ఆ పెత్తనం ఆవిడకి అప్పగించామనుకో..ఇంక ఊరూవాడా పదినాళ్ళు చెప్పుకునేలా బ్రహ్మాండంగా చేయించేస్తుంది. ”

ఆసక్తిగా వింటున్న నీలిమ “యెంత బాగా చెప్పారండీ అత్తయ్యగారూ..!” అంది.”నీలూ, నీకు ఆ మాటలు బాగున్నాయేమో కానీ అప్పుడు నాకు నచ్చలా.. అందుకే అమ్మని అడిగేసాను.” “యేమని..?” ఆతృతగా అడిగింది నీలిమ.

“యేవనంటే.. మగవాళ్ల ప్రమేయమే లేకుండా ఆడవాళ్ళు ఇల్లు నడిపించెయ్యగలరంటావ్..” అన్నాను.”అప్పు డత్తయ్యగారే వన్నారు?”

నీలిమ నెత్తిమీద చిన్నగా మొడుతూ, “అయ్యొ పిచ్చినాగన్నా .. అంది.” కిసుక్కున నవ్వింది నీలిమ విజయ్ అన్నతీరుకి.

“ఇంకా యేవందంటే…ఇలా ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అంటూ ఈ రోజుల్లో తేడాలు చేస్తున్నారు కానీ.. నిజంగా ఆలోచిస్తే ఇంట్లో ఆడవారి సలహా తీసుకోనిదే యే మగవాడూ నిర్ణయం తీసుకోడు. అలాగే ఇంట్లో నిర్ణయం తీసుకునేది ఆడవారైనా బయటికి దానిని ప్రకటించేది మటుకు మగవాడే.. అది మన సంప్రదాయం.” అంది అమ్మ.

ఇదంతా యెదో గందరగోళంగా అనిపించి నేను పెట్టిన తెల్లమొహం చూసి అమ్మ అక్కడే వున్న ఒక పౌడరుడబ్బా చేతిలోకి తీసుకుని చెప్పింది. “నీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. ఇప్పుడు మనం పౌడరు కొనుక్కోవాలనుకో..బజారుకెళ్ళి మంచి పౌడరుడబ్బాకోసం మనం యెప్పుడూ వాడే మంచి కంపెనీపేరు చెప్పి అదే డబ్బా ఇమ్మని అడుగుతాం.  ఆ కొట్టువాడు అంతకన్న తక్కువధరలోవి వున్నాయని చూపించినా సరే మనం మంచిదనుకున్నదే అడుగుతాం..యెందుకూ…దానికున్న పేరుని బట్టీ.. అదిగో అలాంటి పేరే సంఘంలో మంచికుటుంబాని క్కూడా వుంటుంది. ఆ పేరే.. బైట అందరూ చెప్పుకునే ఫలానావాళ్ల కుటుంబం. అలాగే ఇంట్లో ఆడవారి సామర్ధ్యాన్ని మగవాడు గౌరవిస్తే ఆ ఇంటిపేరు గొప్పగా వినిపిస్తుంది. ఆడవారు మగవాళ్ళని కాదని వాళ్ళే బైటకొచ్చిస్వతంత్రం ప్రకటిస్తే అది అంత గొప్పగా అనిపించదు. యెందుకంటే కుటుంబమంటే ఇంట్లోవారందరూ పొరపొచ్చాలు లేకుండా కలిసిమెలిసి వుండడం. అలా వున్నప్పుడే సంఘంలో ఆ కుటుంబగౌరవం పెరుగుతుంది.  దానిని ఆడా, మగా యిద్దరూ తెలుసుకోవాలి అన్న అమ్మ మాటలవల్లే నేను ఇక్కడ టీమ్‍లీడర్‍గా రకరకాలైన వ్యక్తులను ఒకేతాటికి తేగలుగుతున్నాను. “

శ్రధ్ధగా వింటున్న నీలిమ “యెంతా బాగా చెప్పారో అత్తయ్యగారు..ఇంకా యేమన్నారండీ..” అంది చింటూకి వాడు ఆడుకునే లాప్‍టాప్ ఇచ్చి. విజయ్‍కి ఇంకా చెప్పాలనే ఉత్సాహం ఇనుమడించింది.

“నీలూ, అమ్మ చేసిన పనుల్లో అన్నింటికన్న నాకు బాగా నచ్చింది ఒకటి చెప్పనా?” నీలూ ఆసక్తిగా చూసింది.

“మా పెద్దచెల్లెలు లక్ష్మి తెల్సుకదా.. చాలా తెలివైంది. అన్నింట్లోనూ ఫస్ట్ మార్కులే దానికి. బాగా చదువుకుని, ఉద్యోగంచేస్తూ, దాని కాళ్లమీద అది నిలబడాలని లక్ష్మి ఆశయం. కానీ డిగ్రీపరీక్షలవగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి నిశ్చయించేరు మా నాన్నగారు. ఇంక చూస్కో దాని బాధ..నాన్నగారి ఎదురుగా నిలుచుని మాట్లాడలేదు.. భయం. అమ్మని పట్టుకుని సతాయించేసింది. ఆఖరికి ఆ వయసులో వుండే ఆవేశంతో పెళ్ళి చేస్తే చచ్చిపోతానని కూడా బెదిరించింది. దాని మాటలన్నీ ఓపిగ్గా వింది అమ్మ. లక్ష్మిని నెమ్మదిగా మాటల్లో పెట్టింది. పెళ్ళనేది యే వయసులో చేసుకుంటే బాగుంటుందో చెప్పింది. ఇదివరకటి రోజులు కావనీ, పెళ్ళయాక కూడా చదువుకుని, ఉద్యోగం చేసుకోవచ్చనీ, అందుకోసం తను అన్నివిధాలా లక్ష్మికి సహాయంగా వుంటానని మాటిచ్చి, పెళ్ళికొప్పించింది.”

విజయ్ చెప్పింది ఆసక్తిగా వింటున్న నీలిమ “లక్ష్మి చదువుకి  అత్తయ్యగారెలా సాయం చెసేరు?” కుతూహలంగా అడిగింది.

” చాలా చేసింది. పెళ్ళైన మొదటి రెండేళ్ళూ లక్ష్మికి అత్తవారింటి పరిస్థితులకి అలవాటు పడడానికి సరిపోయింది. తర్వాత రవిగాడు పుట్టాడు.వాడు పుట్టాక ఎమ్.ఎ.పరీక్షలు రాసింది లక్ష్మి. సత్య పుట్టాక బి.ఇడి,. ఎమ్.ఇడి. కూడా చేసింది. అన్నింట్లోనూ మంచిమార్కులు తెచ్చుకుంది. అన్ని పరీక్షలప్పుడూ కూడా అమ్మ లక్ష్మి పక్కనేవుండి, పిల్లల్ని తను చూసుకుని, చాలా రకాలుగా సాయం చేసి తన మాట నిలబెట్టుకుంది. లక్ష్మి పిల్లలు స్కూలుకి వెళ్లడం మొదలెట్టాక అది ఓ కాలేజిలో లెక్చరర్‍గా చేరింది. రెండేళ్ళు అక్కడ చేసేక అమ్మే సలహా ఇచ్చి లక్ష్మి చేత ఒక స్కూల్ పెట్టించింది. అలామొదలుపెట్టిన ఆ స్కూలే ఇప్పుడు శారదా విద్యాలయం.. కె.జి. టు పి.జి. అనే పెద్ద విద్యాసంస్థ అయింది. వీటన్నింటి వెనకా లక్ష్మి వెన్నంటే అమ్మ కూడా వుంది.  అలాగ ఇంట్లో గొడవలేమీ జరగకుండా సరైన సమయంలో లక్ష్మికి పెళ్ళిచెయ్యడం, లక్ష్మి కోరిక తీరడానికి తన వెన్నంటే వుండడం ఇవన్నీ అమ్మ చేసినవే నీలిమా. అదే స్ఫూర్తి నాక్కూడా. మన ముందున్న అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడమన్నది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నదే. .” భావోద్వేగంతో అన్నాడు విజయ్.

ఒక అద్భుతాన్ని వింటున్నట్టు వింది నీలిమ. “అత్తయ్యగారి గురించి మీరీ విషయాలేవీ ఇన్నాళ్ళూ చెప్పలేదేవండీ..?” అంది.

తేలిగ్గా ఊపిరి విడుస్తూ, “మగవాణ్ణి కదా నీలూ..”అన్నాడు. అర్ధం కానట్టు చూసింది. “యెంత కాదన్నా మగవాడికి ఆ ఈగో వుంటుందనుకుంటాను. అందుకే అమ్మ గురించి ఎవరు చెప్పినా నవమాసాలూ మోసి కంది..అని చెపుతారు తప్పితే వారి వ్యక్తిత్వం తల్లి వల్ల రూపు దిద్దుకుందని చెప్పలేరు. ఎందుకంటే అలా చెపితే తండ్రి యేమైనా ఫీలవుతాడేమోననుకుంటారు. అలా తండ్రిని చిన్నబుచ్చడం తల్లికి కూడా ఇష్టముండదు కనక ఆ గొప్పదనాన్నంతా తండ్రికే ఆపాదిస్తారు. నవమాసాలూ మోసి కనడం గొప్ప విషయమే కానీ దానితోపాటు ఆ తల్లి నేర్పిన పాఠాలు కూడా వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి.”

“కాని ఈ విషయాలు నాకిన్నాళ్ళు  తెలీవండీ.” అంది నీలిమ.

“నీలాగే చాలామంది దీన్ని గురించి ఆలోచించరు. అందుకనే నీలూ చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కుటుంబమనే బండి సజావుగా సాగి ప్రయాణం సాఫీగా సాగాలంటే కుటుంబం అందరూ కూర్చునే బండి తొట్టె అనుకో, ఇంటి యజమాని చక్రం అనుకో.. ఆ చక్రాన్నీ, బండినీ సరిగ్గా సమన్వయపరచే ఇరుసే ఆ ఇంటి ఇల్లాలు. బండికి చక్రం మరీ బిగుసుకుపోయినా బండి నడవదు. వదులైపోయినా రెండింటి బేలన్స్ కుదరదు. అలా కాకుండా బండినీ, చక్రాన్నీ బాలన్స్ చేసి నడిపేదే అమ్మ. అలాగే యే కంపెనీ అయినా కూడా. కంపెనీ బండి అయితే, అందులో ఉద్యోగులు చక్రం అయితే రెండింటినీ సమన్వయపరచి నడిపించేవాడే సీ.యీ.వో. ఇలా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠాలు యే బిజినెస్ స్కూల్‍లోనూ చెప్పరు.

ఇప్పుడిప్పుడే కంపెనీల పేర్లతోపాటు ఆ కంపెనీల సి.ఈ.వో ల పేర్లు కూడా చెప్పుకుంటున్నట్టే తండ్రిపేరుతోపాటు తల్లిపేరు కూడా గుర్తించే రోజులొచ్చాయి. దానికి యెవరో ఒకరు నాంది పలకాలి కనక నేను మొదలెట్టాను అంతే.. ”

నీలిమ ఆలోచించింది. “మరి మీ నాన్నగారు చిన్నబుచ్చుకోరూ..”

విజయ్ ఆలోచించి నెమ్మదిగా అన్నాడు. “ఊహు.. చిన్నబుచ్చుకోరు. ఆయనకీ ఈ విషయం తెలుసు. కాని తనంతట తను బైట పెట్టలేరు. నేను పెట్టాను కదా. సంతోషిస్తారు తప్పితే యేమీ అనుకోరు. ఒకవేళ వెంటనే కాస్త చిన్నబుచ్చుకున్నా అర్ధం చేసుకుంటారు.” అన్నాడు.

ఇంతలో ఫోన్ మోగింది. ఆ రింగ్ ఇండియానుంచే. విజయ్ వెంటనే తీసి “అమ్మా..” అన్నాడు. అటునుంచి పార్వతమ్మ నిశ్శబ్దంగా వుండిపోయింది. అర్ధమైపోయింది విజయ్‍కి. “ఇంటర్వ్యూ చూసేరామ్మా..?” అనడిగాడు. సమాధానం చిన్నగా వినిపించింది. “చూసాం నాన్నా.. కానీ…నువ్వలా చెప్పకుండా వుండాల్సింది.”

గదిలోంచి మాట్లాడుతున్న పార్వతమ్మకి హాల్లో ఎక్స్ టెన్షన్ ఫోన్లో వింటున్న శంకర్రావు కనిపిస్తున్నాడు.

“ఫరవాలేదమ్మా. ..నాన్నగారి గురించైతే నీకేమీ బెంగక్కర్లేదు. ఆయనకన్నీ తెలుసు. అర్ధం చేసుకుంటారమ్మా..” అన్నాడు విజయ్.

“కానీ..” అంది పార్వతమ్మ.

“అమ్మా, అమ్మ గురించి కనీసం నన్ను యిప్పుడైనా చెప్పనీయమ్మా..!” అన్నాడు విజయ్ ప్రాధేయపూర్వకంగా.

కొడుకు మాటలకి హాల్లోంచి వింటున్న శంకర్రావు మొహంలో చిన్ననవ్వు తొంగిచూసింది.

ఆ చిరునవ్వు చూసిన పార్వతమ్మ మొహం మందారంలా విచ్చుకుంది.

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

బొమ్మలు: జావేద్

సంసారంలో సంగీతం…
ఆఫీస్ నుండి వస్తూ ఇంట్లోకి అడుగు పెట్టగానే రఘుపతికి కమ్మటి పాప్ కారన్ చేసేటప్పుడు వచ్చే ఘుమఘుమ సాదరంగా ఆహ్వానం పలికింది. ఒక్కసారిగా అమందానంద కందళిత హృదయారవిందు డయిపోయాడతను. పాప్ కార్న్ అంటే అంత ఇష్టం అతనికి మరి. అందులోనూ ఈమధ్య ఇన్ స్టెంట్ పేకట్లు వచ్చేక అది చేసుకోవడం మరీ తేలికయిపోయింది. మైక్రోవేవ్ వుంటే వాటి రుచింక మరీ చెప్పక్కర్లేనంత బాగుంటుంది. కాని రఘు భార్య రమ అస్తమానం పాప్  కార్న్ చెయ్యదు. ఇంటి నిర్వహణ బాధ్యతంతా సమర్ధవంతంగా నడిపిస్తున్న రమకి అన్నన్ని డబ్బులు పెట్టి ఆ పేకట్లు కొనడం శుధ్ధ డబ్బు దండగని కొనదు. రఘుకి ఇష్టం కనక నెలకొక్కసారి మటుకు అతనికి చేసి ఇస్తూంటుంది.

కాని ఇప్పుడు రఘు ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఒక పేద్ద బేసిన్ నిండానూ, పక్కనే మరో గంగాళవంత గిన్నె నిండానూ ఘుమఘుమలాడిపోతున్న పాప్ కార్న్ కనిపించేసరికి ఒకవేళ రమ పాప్ కార్న్ నోము నోస్తోందేమోననుకుంటూ..”ఇలా పాప్ కార్న్ నోములు కూడా వుంటాయా రమా”.. అని ఎంతో ప్రేమగా అడిగేడు.

“మీ తెలివి బంగారంగానూ.. పాప్ కార్న్ నోవేవిటండీ.. మరీ విడ్డూరం కాపోతేనూ..” అంది రమ.

“మరి ఇన్నెందుకు చేసేవ్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా?”

“అబ్బ కాదండీ.. పోటీ కోసం..”

“పాప్ కార్న్ చెయ్యడంలో పోటీయా..?” ఆశ్చర్యంగా అడిగేడతను. అంత ఆశ్చర్యం యెందుకంటే ఈమధ్యకాలంలో కొంతమంది అన్నం ఎలా వండాలో వర్క్ షాప్ నిర్వహించారని విన్నాడు. ఇది కూడా అలాంటి దేదో అనుకున్నాడతను.

“మీరు మరీనూ.. పోటీ పాప్ కార్న్ చెయ్యడానికి కాదండీ. పోటీ దేనికంటే ఎవరైతే బెస్ట్ అవుటాఫ్ వేస్ట్ చేస్తారో నని పోటీ..”

అర్ధం కాలేదు రఘుకి. ఇంత కమ్మగా పాప్ కార్న్ ఊరిస్తుంటే ఇది వేస్టెలా అవుతుందీ.. అయోమయంగా చూసేడతను. రమ నవ్వింది. రఘుకి లవలేశమైనా కళాహృదయం లేదని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. అందుకే “మీకర్ధం కాదులెండి. ఏవైనా పార్టీలయినప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడూ పాప్ కార్న్ తింటుంటారు కదా.. ఆఖర్న ఎంతోకొంత మిగుల్తుంది కదా.. దానితో డెకొరేటివ్ పీస్ అన్నమాట..అయినా దేనికైనా కళాదృష్టి వుండాలిలెండి..” చివరిమాట రఘుని వెక్కిరిస్తున్నట్టుగా అంది.

నిజంగానే రఘుకి అర్ధంకాలేదు. హేవిటో.. ఈ కళాదృష్టి హేవిటో.. ఈ డెకొరేటివ్ పీస్ హేవిటో.. దానికీ ఈ గంగాళాలనిండ వున్న పాప్ కార్న్ కీ సంబంధవేవిటో రఘు మట్టిబుర్రకి అస్సలు అర్ధంకాలేదు. పనికట్టుకుని బోల్డు డబ్బు తగలేసి గంగాళాలనిండా చేసిపోసిన పాప్ కార్న్ కీ, అందరూ తినగా మిగిలిపోయిన పాప్ కార్న్ తో చేసే కళాసృష్టికీ మధ్య గల సంబంధం అతనికస్సలు అర్ధంకాలేదు. పోనీ.. ఈ అర్ధం కాని సంత తన కెందుకనుకుంటూ..”సర్లేకానీ.. ఓ పెద్ద బౌల్ పట్రా.. వీటి పని పడతాను..” అన్నాడు హుషారుగా.

“సర్లెండి.. ఇవేవీ మీరు తినడానికి కాదు. రేపు పోటీకోసం నేను ప్రాక్టీసు చెసుకుందుకు..” అంటూ ఒక్కసారిగా రఘు ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసింది రమ. ఆ తర్వాత రమ చేసిన విఫల ప్రయత్నాలన్నీ రఘు కళ్ళూ, నోరూ వెళ్లబెట్టుకుని మరీచూసాడు. ముందు రమ స్థిమితంగా ఒక మూల కూర్చుని ఓ పేద్ద చీపురుకట్టంత వున్న సన్నని తీగల్లంటివి తనకి ఎడంపక్కన పెట్టుకుంది.  కుడివైపు పాప్ కార్న్ తో నింపిన బేసిన్, గంగాళం పెట్టుకుంది. ముందు ఓ తీగ తీసుకుని టేప్ తో పొడుగు కొలుచుకుని ఆ కొలత పక్క కాగితం మీద శ్రధ్ధగా రాసుకుంది.

తర్వాత బాగా పెద్దగా  తయారైన ఓ పాప్ కార్న్ ని తీసుకుని ఆ తీగకి గుచ్చింది. అది తీగ చివర ఒక కొమ్మకి పువ్వులా వేళ్ళాడుతోంది. దాన్ని ముందు పెట్టుకున్న ట్రేలో జాగ్రత్తగా పెట్టి, ఇంతకన్న తక్కువ కొలత వున్న ఇంకో తీగ తీసుకుని అలాగే ఇంకోటి చేసి పెట్టింది రమ. చూస్తున్న రఘుకి ఆ పాప్ కార్న్ కి గుచ్చుతున్న తీగ తన గుండెల్లో గుచ్చుకున్నంత బాధ కలిగింది. అలా ఓ పదిపన్నెండు తీగలకి పాప్ కార్న్ గుచ్చి వాటినన్నింటినీ కలిపి మధ్యకి దారంతో కట్టి, పొడుగ్గా వున్న ఓ ఫ్లవర్ వాజ్ లో సున్నితంగా వుంచి, గొప్ప విజయం సాధించినట్టు రఘు మొహం లోకి చూస్తూ, “ఎలా వుందీ?” అనడిగింది.

“నా మొహంలా వుంది..” ఉక్రోషంగా అన్నాడు రఘు.

“అంతేలెండి. ఇంట్లో భార్య ఏం చేసినా గుర్తింపు వుండదు. ఇంత కష్టపడి వేస్ట్ గా పడేసే దానితో ఇంటిని అందంగా అలంకరించే బ్రహ్మాండమైన అయిడియా చెపితే..ఇదా మీ స్పందన? హూ.. అయినా దేని అందాన్నైనా ఆస్వాదించడానికి రసహృదయం వుండాలండీ. ఎంతసేపూ పిండిమరలా ఏం వేసి నోటినాడిద్దామా అనే ధ్యాసున్నవాళ్లకి అందాలూ, అలంకారాలూ ఏం తెలుస్తాయిలెండి..” ముక్కు చీదేసింది.

ఊరుకోదల్చుకోలేదు రఘు. “అసలు వేస్ట్ అంటే ఏంటి? దేనికీ పనికిరానిదని. కాని నువ్వేం చేసేవ్? బోల్డు డబ్బులు తగలేసి కొత్త పేకేట్లు కొని తెచ్చేవ్. పోనీ కాసిన్నైనా నా నోట్లో  పడేసేవా? అదీలేదు. అవన్నీ పట్టికెళ్ళి ఆ తీగల మొహాన్న గుచ్చేవ్. ఇవి సగం రేపటికి ఆతీగలనించి ఊడి కింద పడిపొతాయ్. లేదూ.. ఏ రాత్రో చీవలన్నీ చేరి వీటి చుట్టు పుట్టలు పెట్టేస్తాయ్. ఎల్లుండి పొద్దున్నకి దుమ్ము పడి నల్లగా అయిపోతాయ్. అసలు అవి చెయ్యవలసిన పనేంటీ… ఒకళ్ళ నోట్లోకి వెళ్ళడం.. కాని నువ్వేం చేసేవ్.. వాటిని ఉరేసినట్టు ఆ తీగెలకి వేళ్ళాడదీసేవ్.. హు.. కరుణశ్రీగారి పుష్పవిలాపం లాగ.. ఆ పేకట్లలో అలాగే పడుండక నీ అలంకరణ కోసం అవి వేడిలో వేగి, తీగలకి ఉరేసుకున్నాయ్. నీ పాపానికి నిష్కృతి లేదు రమా… లేదంతే..” ఆయాసపడ్డాడు రఘు.

కళ్ళమ్మట నీళ్ళెట్టేసుకుంది రమ. ఖంగారుపడ్డాడు రఘు. “అంటే.. నా ఉద్దేశం ఏంటంటే నువ్వేం చెసినా అది మనకేదైనా కలిసొచ్చేలా  ఉండాలి కానీ.. ఇలా డబ్బులు తగలేసేలా కాదు అని . ”

“అంటే..” అంది రమ బుధ్ధిగా.

“నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఏవైనా కొన్నావనుకో. దానిని మనం పదిరకాలుగా వాడుకుని తొమ్మిది రూపాయలు ఆదాచేసేలా వుండాలన్న మాట..” వివరించేడు భార్యకి రఘు. మరింకొన్ని వివరాలడిగి రఘు చెప్పిందాన్ని ఇంకాస్త వివరంగా అర్ధం చేసుకుంది రమ.

నాలుగురోజులు గడిచిపోయాయి. ఆరోజు రఘు ఇంటికొచ్చేటప్పటికి రమ చేటంత మొహంతో ఎదురొచ్చింది. మనసులో దడ మొదలైంది రఘుకి.

“నేనీరోజు ఏం చేసేనో తెల్సా..?” అంది రమ చేటంత మొహంతో.

అన్నింటికీ సిధ్ధమైన రఘు పడబోయే వేటుకోసం చూసేడు.. రమ గబగబా లోపల్నించి రెండు పెద్దపెద్ద గుడ్దసంచుల్ని తీసుకొచ్చి రఘు కళ్లముందు ఆడిస్తూ “ఈ రెండూ ఇవాళ నేనే కుట్టేనండీ. ఇంట్లో ఎక్కువగా పడున్న గుడ్దనే వాడి, సరుకులు తెచ్చుకుందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామనీ కుట్టేను. ఎలా ఉన్నాయండీ.” అడిగింది ఆత్రంగా. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రమ చేసింది తెలివైనపనే. కాని ఆ సంచులకి వాడిన బట్ట చూస్తే రఘుకి ఏదో అనుమానం వచ్చింది. “ఏదీ.. ఇలాతే..” అంటూ చేతుల్లోకి తీసుకుని, బాగా పరీక్షించి చూసి కెవ్వుమంటూ ఒక్క కేక పెట్టేడు..”ఏవైందండీ..” ఖంగారుపడింది రమ. “ఇదెక్కడి బట్ట..”

రమ చాలా ధైర్యంగా చెప్పింది. “మీరే కదండీ చెప్పేరూ.. దేనినైనా సరే ఒకవిధంగానే కాకుండా పదిరకాలుగా వాడాలనీ.. అందుకే మీ ప్యాంటులు రెండు మోకాలి దగ్గరికి కట్ చేసి, ఆ కింద ముక్కలతో ఈ రెండు సంచులూ కుట్టేను.”

చాలా కష్టం మీద తన ఆవేశాన్ని అదుపు చెసుకుంటూ అడిగేడు. “మరి పైవి ఏం చేసేవ్..”

“అదేంటండీ.. అవి మీ ప్యాంటులు కదా.. కట్టుకుంటారూ.. ఇంకేం చేస్తారూ.. చూసేరా.. ఒక్కదాన్ని రెండు విధాలుగా ఎలా ఉపయోగించేనో..” గొప్ప చూపించుకుంది రమ.

రఘు ఒక్కసారి మోకాలిదాకా ప్యాంటు వేసుకున్న తనను ఊహించుకున్నాడు. యింకోసారి కెవ్వుమన్నాడు. మళ్ళీ హడిలిపోయింది రమ “ఏమైందండీ..” అంటూ.

“మోకాలిపైకి ప్యాంటు ఎలా కట్టుకోమంటావ్..” నవ్వేసింది అర్ధాంగి.

“మీరు మరీనూ. ఇప్పుడందరూ మోకాళ్లపైకేకదండీ లాగూలు వేసుకుంటున్నారూ.. మీరొక్కరే.. ఏదో ముసలాళ్ళైపోయినట్టు అంత పొడుగు ప్యాంటూ వేసుకుంటారు. అందుకే మిమ్మల్ని మోడర్న్ గా కూడా చెయ్యొచ్చనే ఈ ఆలోచన చేసేను తెల్సా..”

మెరుస్తున్న కళ్ళతో అంది రమ.

ప్యాంటుల్నీ, లాగూల్నీ ఒకే రాటకి కట్టేసిన భార్యామణి విఙ్ఞానానికి ఆనందపడాలో.. బంగారంలాంటి ప్యాంట్లు పనికిరాకుండా పోయినందుకు దుఃఖించాలో తెలీక అలా నిలబడిపోయేడు రఘు.