వాకిలి » డా. కాసుల లింగారెడ్డి

ఏకాంత మధుసేవ
సహచరులెవ్వరు లేకుండానే

పూకొమ్మల మధ్య

ఒంటరిగా కూర్చొని

మధుపాత్ర చేతికి తీసుకుంటాను

నేను చెయ్యెత్తి

చంద్రునికొక ఛీర్సుకొడతాను

అప్పుడు,

తను,నేను, నా నీడ

కలిసి ముగ్గురమవుతాము.

కాని,

చంద్రుడు త్రాగడు

నా నీడ నిశ్శబ్దంగా

నన్ను అనుసరిస్తుంది

నా నీడతో, చంద్రుడితో

నేను

సంతోషంగా

వసంతకాలపు అంచులదాకా

ప్రయాణిస్తాను.

నేను పాడితే

చంద్రుడు నాట్యం చేస్తాడు

నేను నృత్యిస్తే

నా నీడ కూడ నాట్యం చేస్తది.

మేము నిశ్చింతగా

జీవన సంతోషాల్ని పంచుకుంటాము

తాగిన తర్వాత

తమతమ దారుల్లో విడివడుతుంటాము

నిత్య సంచారులమే అయినప్పటికీ

మేము నిరంతర స్నేహాలము

మరొక వెన్నెల వీధిలో

మళ్ళీ కలుస్తాము.

(Li Po “Drinking Alone by Moonlight” అను కవితకు స్వేచ్చానువాదము)

ఒక కాలం కన్న కవి
ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఏ సమాజంలోనైనా కవులకు అత్యంత ప్రాధాన్యత వుంది. చాలా సందర్భాల్లో కవులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తూ వస్తున్నరు. చరిత్ర పుటలు తిరగేస్తే కవులే తత్త్వవేత్తలు, తత్త్వవేత్తలే కవులుగా తీర్చిదిద్దబడ్డ వైనం గమనించవచ్చు. ఒక్క మినహాయింపును మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ప్లేటో గురించి – కవులని నిషేధించాలన డానికి ఆయన కారణాలు ఆయనకు వున్నయి. కాని కవిత్వం యొక్క ప్రాధాన్యత ఆయన తర్వాత కూడా కొనసాగింది. కారణం,

Poetry is simply the most beautiful, impressive and widely effective mode of saying things and hence its importance- Mathew Arnold

ఆధునిక వచన కవిత్వం గాని, చిత్రలేఖనంగాని అందరికీ అర్థమయ్యే స్థాయిలో వుండడం లేదనే అభియోగం వుంది. శుద్ధ వచనం నుంచి వచన కవిత్వాన్ని వేరు చేసేవి అందమైన గాఢముద్ర గల ప్రభావ పూరితమైన ప్రతిభా కారకాలే. వాటిని ఉపయోగించ డంలో కవి తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శ్రమను, నైపుణ్యాన్ని వినియోగించాలి. ఎందుకంటే,

Poetry is the spontaneous overflow of powerful feelings it takes its origin from emotions recollected tranquility- William Wordsworth

గతానికి సంబంధించిన ఆవేశాలు శక్తివంతమైన ఆలోచనలుగా స్వతస్సిద్ధంగా వెలువడే క్రమంలో కవి తన స్థల, కాల, సామాజిక అవగాహనలోని మూర్తమైన ప్రతీకల ద్వారా అమూర్తమైన భావాలకు రూపమిస్తడు. వ్యక్తి నిష్ఠమైన ఆవేశాలను సామూహిక అనుభవాలుగా, ఆవేశాలుగా భ్రమింపచేయడంలో కవి కృతకృత్యుడైనప్పుడే, అది గొప్ప కవిత్వమౌతుంది. అందుకు వస్తువును తను దర్శించే పద్ధతి, దానికి మూర్తరూపాన్నిచ్చే పద్ధతి తనదైన ప్రత్యేకతను నవ్యతను, సృజనాత్మకతను కవి కలిగివుండాలి. ఎందుకంటే,

The way of expressing emotion in the form of art is by finding an objective correlative , in words, a set of objects, a situation, a chain of events which shall be the formula of the particular emotion, such that when the external facts, which must terminate in the sensory experience , are given , the emotion is immediately evoked- T.S. Eliot

ఒక సమాజము తనకు కావాల్సిన కవుల్ని అది తయారు చేసుకుంటది. ‘కాలం కడుపుతో వుండి’ కవుల్ని కంటనే వుంటది. కాని సమాజంలో ఉద్యమ ప్రాబల్య కాలంలో మాత్రం అనేక మంది కవులు, కళాకారులు పుట్టుకొస్తరు. తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కాని, ఇప్పటి మలిథ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమ కాలంలోగాని మనము ఆ విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు. నాలుగు కోట్ల ప్రజల న్యాయమైన ఆకాంక్ష అర్థ శతాబ్ధ కాలంగా అణచివేయబడుతున్న సందర్భంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి వ్యక్తి తన కార్యాచరణ ద్వారా అందుకు తోడ్పడే మార్గాన్ని ఎంచుకుంటడు. ఇవాళ్ళ తెలంగాణలో అట్లా అనేక మంది అనేక విభిన్న కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి దోహదం చేస్తున్నరు. సాహిత్యంతో పరిచయముండి, ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న అనేక మంది తెలంగాణ విద్యాధికులు కవితల ద్వారా, పాటల ద్వారా మనముందుకొస్తున్నరు. అట్లా ఈ ఉద్యమం మలిచిన కవే మన జోగు అంజయ్య ‘పల్లెలన్ని మల్లెలాయె’ అనే పాటల పుస్తకం ద్వారా తెలంగాణ సాహిత్యాకాశం మీద తళుక్కుమన్న ‘కంటిపాప కలగన్నది’ అనే కవితా సంకలనం ద్వారా స్థిరపడ్డడు.

‘పల్లెలన్నీ మల్లెలాయె’ పది జిల్లాల ఉద్యమ ఆకాంక్షల పాట. ఐదు థాబ్దాలుగా కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆకాంక్షను, తెలంగాణ పదములోని మాధుర్యాన్ని, జెండా నీడలోని ధైర్యాన్ని వినిపించిన మంచి మనసులున్న నేల పాడుకున్న పాట. ఈ పాటలో విద్యార్థి దండు కదులుతుంది. పల్లెలు ఎర్ర మల్లెలై రాజీలేని పోరుతో నడుం బిగించాయి. రాజ్యహింసని ధిక్కరించి ఢిల్లీల గెలిచి వస్తమని, ద్రోహాలకు, దోపిడీలకు చరమగీతం పాడుతమని వాగ్ధానం చేస్తున్నవి.

”అగ్గిపిడుగులాంటి వీరపుత్రులున్నరమ్మ నీకు

శ్రీకాంతాచారి మా చూపులోన ఉన్నాడమ్మా

వేణుగోపాలరెడ్డి వేగుచుక్క అయినాడు

కృష్ణయ్య యాదయ్య యాదిలోన ఉన్నారు” అంటూ అమరుల తల్చుకుంటడు.

తెలంగాణ పట్ల, తెలంగాణ దార్శనికుల పట్ల విపరీతమైన అభిమానమున్న కవి ఒక్కక్కరినే పలవరిస్తున్నడు. కానికాలంలో కాలం చేసిన వాళ్ళను స్మరించుకున్నడు. బియ్యాల జనార్ధన్‌రావు, బాలగోపాల్‌, బుర్ర రాములు, కన్నాభిరన్‌, జయశంకర్‌, బెల్లి లలితల మీద ఎలిజీలు రాస్తున్నడు.

”మీ ఉపన్యాసాల ప్రేరణతో

ఊర్లన్ని ఉద్యమిస్తున్నవి

పట్నాలకు పౌరుషము వచ్చి

యాస భాషను బతికుంచుకుంటున్నవి” (తెలంగాణ జాతి రత్నం)

అంటూ ‘నేలమ్మ ఒడిని చేరిన తెలంగాణ జాతి రత్నాన్ని’ యాది జేసుకుంటున్నడు. ‘జీవితాంతం కడగండ్ల బతుకుల విముక్తికై పోరాడిన తెలంగాణ శక్తి’ అని గద్దర్‌ను కీర్తిస్తున్నడు. తెలంగాణ గొప్పదనాన్ని జనరంజకంగా పాడిన బెల్లి లలిత అమరత్వాన్ని మరువకూడదంటున్నడు. ‘చైతన్యకారుడి ఆదర్శ జీవితం వెలకట్టలేనంత వెలుగును ఇస్తుంద’ని అంజయ్యకు తెలుసు. అందుకే తను కూడా ఆ బాటలో పయనించాలనుకుంటున్నడు.

జనగామలో ఒక సాహిత్య సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలోనే నాకు జోగు అంజయ్య పరిచయమయ్యిండు. తన పని రాక్షసత్వం ద్వారా, నిబద్ధత ద్వారా సౌమ్యుడైన అంజయ్య నన్ను ఆకట్టుకున్నడు.’పల్లెలన్ని మల్లెలాయె’ ఆవిష్కరణ సభలో పాల్గొన్న నాటి నుంచి మా అనుబంధం మరింత పటిష్టమౌతూ వస్తున్నది. ‘జరసం’ కార్యదర్శిగా ఈ సంవత్సర కాలంలో తాను సాహిత్యం పట్ల ఎంత సీరియస్‌గా వున్నడో నిరూపించుకున్నడు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ తెలంగాణ రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న దళారీతనానికి ఆగ్రహం చెందుతున్నడు.

‘రోజుకో వేషంతో

పూటకో మాటతో

ఉద్యమాలను ముంచాలనుకుంటే

తోలు తీస్తారు జాగ్రత్త (ఉద్యమం ఏమంటున్నది)

అంటూ హెచ్చరిస్తున్నడు. ‘పోరాడే జనం ఉన్నచోట ముందడుగు వేసే నాయకులు వుండాలి’. కాని ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని తెలంగాణ ఈ సంవత్సర కాలంలో చవిచూసింది. ప్రజలు స్వచ్ఛందంగా పోరాట రూపాలు ఎన్నుకొని ఉద్యమం నిర్వహిస్తుంటే ఎక్కడ వెనుకబడిపోతామోనని, ప్రజలకు దూరమైతే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ చెత్తకుప్పల్లో చేరిపోవాల్సివస్తుందోనని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల వెంట నడిచిండ్రు, లేదా నడిచినట్టు నటించిండ్రు. సోనియాగాంధీ పాదాల చెంత మోకరిల్లుతూ, సీమాంధ్ర పెట్టుబడిదారులనుంచి సబ్‌ కాంట్రాక్టులు పొందుతూ చేవచచ్చిన దద్దమ్మల్లా కాంగ్రెస్‌ నాయకులు, పచ్చకళ్ళ రోగి ఆంధ్రాబాబునాయుడు కుట్రల, కుయుక్తుల కబంధ హస్తాల నుండి విడివడక లొంగిపోయి వంగిన తెలుగుదేశం నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, కమ్మకుల ఆధిపత్య వర్గాలకు పార్టీని తాకట్టుపెట్టిన మార్క్సిస్టులు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించక తప్పని రోజు తప్పకుండా వస్తుంది. అందుకే,

”బలమైన ఆకాంక్షను

అంగట్లో పెట్టినందుకు

రాజకీయ ద్రోహానికి

వేయిమంది బలైనందుకు

చరిత్ర పుటల నుండి

మీ పేర్లు తొలగిస్తు” న్ననని కవి తన నిరసన ప్రకటిస్తున్నడు.

గడిచిన చరిత్రను గుర్తు చేసుకుంటూ ‘గడీల ప్రభువుల గోళీలాటలో వీర తెలంగాణ విగ్రహమయ్యిందని’ అంగలారుస్తున్నడు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సభలో భారతీయ జనతా పార్టీ, టి.ఆర్‌.ఎస్‌. నాయకులు స్టేజిని ఆక్రమించుకున్న ఘటన చూసినప్పుడు సహజంగనే వారసత్వపు సమస్య చర్చకు వస్తది. సావర్కర్‌ ప్రస్థానంలో భగత్‌సింగ్‌ సహచరుడిగా వున్న స్థితినుంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిబిరంలో చేరి పోయాక, ఆ శిబిరం గత రెండు థాబ్దాలుగా భగత్‌సింగ్‌ వారసులమని చెప్పుకుంటున్న వైనం తెలిసిందే. తెలంగాణ సాయుధపోరాటానికి నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మధ్య అభేదాన్ని పాటించడం ద్వారా పాలకవర్గాలు ఒక సంక్లిష్ట, గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నరు. ‘ పోరుజెండకు ప్రాణం పోస్తూ రక్తం చిందించే కమ్యూనిస్టులూ, వారి అభిమానులూ వున్న దేశంలో డెబ్భై ఏళ్ళు గడిచినా ఏడుపాయలుగా చీలిపోయింది, గాని జీవనదిగా మారలేకపోయింది. ఐక్యంగా ఉండలేక పోయింది’ అని వ్యధ చెందుతున్నడు కవి. క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంలోగాని, అంబేద్కర్‌ జీవితంలోని రాడికల్‌ థ (1936-42)లో అంబేద్కర్‌తో వ్యవహరించిన సందర్భంలోగాని, 1969లో తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా సమైక్యవాదపు ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ ముసుగులోగాని, మలిథ ఉద్యమంలో మార్క్సిస్టుల వైఖరిగాని ఈ దేశంలో మనువాద బ్రాహ్మణ భావజాలం కమ్యూనిస్టు ఉద్యమాన్ని దారితప్పించిందని తెలుస్తుంది. ఇవ్వాళ్ళ అస్తిత్వ ఉద్యమాలుగా ముందుకొచ్చిన స్త్రీ, దళిత, మైనారిటి, ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకోవడంలో బ్రాహ్మణ భావజాలం అడ్డుపడి ఆయా వర్గాల అణచివేతకు దారితీసిందని అర్థమౌతుంది.

స్వతహాగా పాటగాడైన (గాయక రచయిత) జోగు అంజయ్య జార్ఖండ్‌ రాష్ట్ర ప్రజాకళాకారుడు జీతన్‌ మరాండికి ఉరిశిక్ష విధించబడడం పట్ల కలత చెందిండు. ‘భూమి పుత్రులను కాపాడే కోపాగ్నిలో అక్కడి నేలతల్లి మృత్యు శకటాన్ని ముద్దాడుతుంది’ అని చెప్తూ,

‘పాటను బతికిస్తే

ఆదివాసిని గుర్తిస్తే

అడవి గెలిచిందనీ

ప్రజాస్వామ్యం నిలిచిందనీ’ ప్రకటిస్తనంటడు (ఉరిశిక్ష మరణిస్తే)

పీడిత కులం నుంచి, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన కవి వనరుల విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను, వారి కొమ్ముకాస్తున్న భారత దళారీ పాలకవర్గాలను ఎదిరించి పోరాడుతున్న ఆదివాసీల పక్షాన నిలిచిన జీతన్‌ మరాండీని ఆలింగనం చేసుకోవడం ద్వారా మన హృదయాల్ని గెలుచుకొని మనకు ప్రీతిపాత్రమైతడు. ‘అంతర్జాతీయుడి ఆర్థిక సంస్కరణ అనుకరణ ఫలితాల’ పట్ల అవగాహన వున్న కవి ప్రభుత్వాల, మార్కెట్‌ శక్తుల గుట్టును రట్టు చేస్తానంటుంది తెలంగాణ’ అంటూ భరోసా ఇస్తడు. స్థానికీకరణే ప్రజల ఆత్మ గౌరవానికి, స్వావలంబనకు, అభివృద్ధికి మార్గమన్న ఎరుకను కనబరుస్తడు.

‘విజన్‌ 2020 పుస్తక విమానం విలేజీలో దిగలేదు.

వీధికొక్కటైనా ఇవ్వకుండానే విదేశీ కంపెనీలకు పంచింది’ అంటూ ప్రపంచ బ్యాంకు మోజులో చంద్రబాబునాయుడు వెలగబెట్టిన సంస్కరణలను, వ్యూహాల్ని ఎండగడుతున్నడు. భారతదేశంలో చదువురాని మామూలు రైతుకు వున్న ఇంగిత జ్ఞానం కూడా లేని పాలకులు (ముఖ్యంగా చంద్రబాబు) ప్రథమ, ద్వితీయ ఆర్థిక రంగాలను నిర్వీర్యంచేసి (బాహాటంగా ప్రకటిస్తూనే) తృతీయ రంగమైన సేవారంగం అభివృద్ధి ఒక్కటే అభివృద్ధి మార్గంగా నిర్వచించడం, ఈ దేశపు గుండె కాయగా వున్న భూమి హక్కు పట్ల మెసలి కన్నీరు కార్చడం, కుహనా సంస్కరణల్ని ప్రవేశపెట్టడం కవి లోతుగా గమనిస్తున్నడు.

‘బీదల కోసం భూ సంస్కరణల చట్టమంటరు

అమలు చేసి భూములు ఇస్తమంటరు

పదుల ఎకరాలు పంచుడాయె

లక్షల ఎకరాలు మింగుడాయె’ (బహుజనులూ బాగున్నారా)

తెలంగాణలో ఒక అగ్రకుల పాలకవర్గాన్ని నిర్వీర్యం చేయడానికి 1971లో పి.వి. నర్సింహారావు (ముఖ్యమంత్రి) సీలింగ్‌ చట్టం తెచ్చిండు. ఫలితంగా మిగులు భూములు తెలివి మీరి బినామీలుగా పెంపుడు కుక్కల, పిల్లుల, జీతగాండ్ల సంకల చేరినవి. 1983లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండలాధీశుడి అవతారమెత్తింది. తెలంగాణ పాలకవర్గాన్ని బలహీన పరచడం ద్వారా ఆంధ్రుల ఆధిపత్యాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్ది అది కమ్మకుల ప్రయోజాల్ని నెరవేర్చింది. ఫలితాలు తెలంగాణ కళ్ళెదుట ఇవ్వాళ్ళ సినిమా స్కోపులో దర్శనమిస్తున్నయి. కాని ‘పాలకులు దోపిడీ చేస్తున్నమని చెప్పలేక, అభివృద్ధి పేరిట ఆర్భాటాలు చేస్తారని, సంస్కరణ ఫలితాలు సంపన్నులకేనని’ ఈ కవికి ఖచ్ఛితంగా తెలుసు. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో వున్న కవి

”సామాజిక చరిత్రను చదివితేనే కదా

సమాజంలో చైతన్యం వచ్చేది

సోషల్‌ సైన్సెస్‌ చదివితేనే కదా

సామాజిక విలువలు రక్షించబడేది

మరి కంప్యూటర్‌ మాత్రమే చదవాలంటారేమిటి?” అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నట్టే వుంటడు. కాని,

”అద్దం పలిగినప్పుడు

అతుకుడు తాత్కాలికమే

రాష్ట్ర విభజన ఒక అవసరం” అని చెప్పి నిర్ద్వంద్వంగా ప్రకటించడం ద్వారా తన ఆలోచనా విధానంలోని సమగ్రతని వ్యక్త పరుస్తడు. డిసెంబర్‌ 9, 2009 ప్రకటనకు వెన్నుపోటు పొడుస్తూ డిసెంబర్‌ 23, 2009 ప్రకటన రావడం, శ్రీకృష్ణ కమిటీ డబ్బు సంచులకు అమ్ముడుపోయి తెలంగాణకు వ్యతిరేకమైన రిపోర్టు ఇవ్వడం, తెలంగాణ రాజకీయ నాయకుల దళారీతనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలలో నిలిచిపోయే సకల జనుల సమ్మె ఏ ప్రయోజనం పొందకుంటనే విరమించబడడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కవి గొప్ప ఆశాజీవిగా దర్శనమిస్తడు.

”నూనూగుమీసాల పోరడు

తొలిప్రేమను మించిన సంబరాన్ని ప్రకటిస్తూ

విముక్తి దారులు వెదుకుతున్నడు

కాలజ్ఞానం తెలిసిన వాడిలా

తూర్పు దిక్కున పొద్దు పొడుపుగా

తెలంగాణ ఉదయిస్తుంది” (తోటమాలి అడ్డుపడితే)

అంటు గొప్పనమ్మకాన్ని వ్యక్త పరుస్తడు.’ నా తెలంగాణ ఒక బంగారు రాష్ట్రంగా వచ్చినట్లు నా కంటిపాప కలగన్నది’ అంటూ నిద్దురలోనే కలవరిస్తడు.

”నా కలానికి ప్రజల ఆకాంక్షలను బలపరిచే పోరాటం వుంది.

నా కంటిపాపకు కుల వివక్షతలేని సమాజ నిర్మాణ కలవుంది

నా భాషకు తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యవహారం వుంది.

నా రాగానికి మట్టి మనుషులు పాడుకునే స్వరం వుంది”

అని ప్రకటిచుకున్నప్పుడు నాకు బాలగంగాధర్‌ తిలక్‌ గుర్తుకు వచ్చిండు.

‘కవిత్వంలో ప్రజల సమస్యలు అక్షరీకరింపబడుతాయని తెలుసుకొని కలం పట్టాను. కవి కావాలని మాత్రం కాదు’ అన్నప్పుడు అంజయ్యలోని modesty అర్థమౌతుంది.

”కవిత్వం ఒక ఆల్కెమీ

దాని రహస్యం కవికే తెలుసును

కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు

కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు” – బాలగంగాధర్‌ తిలక్‌

మరి, కవిత్వం ఆల్కెమీ అని అంజయ్య కూడా తెలుసుకోవాలి.వస్తువు ఎంత బలమైనదైనా, నిర్మాణ రూపం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. సాధన ద్వారా, వ్యుత్పత్తి ద్వారా ప్రతిభను మెరుగు పరుచుకుంటూ తనదైన అభివ్యక్తిని, తనదైన శైలిని వృద్ధి చేసుకోవాలి. కవిత్వం ఒక ప్రత్యేకమైన భాష. అది కవి గ్రహించాలి.

‘’ Poets are the nierophants of unapprehended inspiration; The mirrors of the gigantic shadows which futirity casts upon the present ; The words of which express what they understand not; The trumpets which sign to battle and feel not what they inspire, the influence which is moved not,but moves; Poets are the unacknowledged legislators of the world- P.B.Shelly

ఇది అర్థం చేసుకొని, dilectolgy ని జీర్ణించుకొని అంజయ్య తెలంగాణ సాహిత్య లోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తూ, అట్లా చేసుకునే శక్తి అతనికుందని విశ్వసిస్తూ..

బయోడేటా

పేరు: జోగు అంజయ్య

పుట్టిన తేది: 04-04-1967

స్వస్థలము: వడిచర్ల, లింగాల ఘనపురము. వరంగల్లు (జిల్లా)

విద్యార్హతలు: ఎం.ఏ. బి.ఇ.డి.

వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయుడు

రచనలు: పల్లెలన్నీ మల్లెలాయె (పాటల సంపుటి)

కంటిపాప కలగన్నది(కవితా సంపుటి)

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి
ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు ‘ఎగిలి వారంగ’ మన పొన్నాల బాలయ్య ‘దందెడ’ భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు.

వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల దోపిడి, పీడన, అణచివేతల్ని తెలంగాణ సమాజం మీద ప్రయోగించిందో అట్లాంటి వాటినన్నిటినీ నిండుగా అనుభవించిన వాడు బాలయ్య. వీటికి తోడు ‘బోడిగుండు మీద తాటిపండు పడ్డట్టు’ బాల్యంలో తండ్రి మరణం, యౌవనంలో తల్లి మరణం అల్సర్‌,అపెండిక్సుల అనారోగ్య రూపాల్లో జీవితం పొన్నాలకు పరీక్షల మీద పరీక్షలు పెట్టింది. ఆపరీక్షలన్నీ నెగ్గుకుంటూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేసి ఉపాధ్యాయ వృత్తిల స్థిరపడ్డ బాలయ్య ఇయ్యాళ్ళ పేర్కొనదగ్గ కవిగా గుర్తింపు పొందిండు.అందు కు కవి శ్రమతో పాటు మరో రెండు ముఖ్య విషయాలు దోహదం చేసినవి. తెలంగాణ అందునా ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్‌లో పుట్టి పెరగడం ఒక ఎత్తైతే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అట్టడుగు తంతెమీద ఆవిర్భవించడం మరో ఎత్తు.ఈ రెండు అస్తిత్వాలు బాలయ్య జీవితాన్ని, కవిత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఒక ఉత్కృష్ట పాత్రని పోషించినవి. ఎవరైనాకవిత్వాన్ని, కళను జీవితానుభవంలోంచి తోడుకోవాల్సిందే. అనుభవం ఎంత విస్తృతమైందైతే, సంపన్నమైందైతే కవిత్వం,కళ అంత సజీవమౌతుంది. తన విస్తృత,సంపన్న జీవితానుభవంలోంచి ‘దందెడ’ సాయంతో సజీవ కవిత్వాన్ని తోడుకుంటున్నడుకవి. అందువల్లే దళిత భాషను, జీవితాన్ని సాధికారంగా కవిత్వంలోకి తెచ్చిన అతి కొద్దిమంది కవుల్లో ఒకడుగా నిలబడ్డడు.

‘శ్రమ జీవుల శిరస్సులన్నీ బ్రాహ్మణుల చేతుల్లో బంతులైన ‘ వైనాన్ని గుర్తించిండు. అందువల్లనే, ‘తుప్పుపట్టిన చెన్నె ఆరెలే మిగ్గు పూసుకొని దూసుకొచ్చే కవితా కత్తులుగా’ చేసుకొని ‘పగబట్టి సంస్కృతిని కొల్లగొట్టిన పరాయీకరణ మీద’ యుద్ధం ప్రకటిస్తున్నడు.

”మనువు వటవృక్ష వూడల అడల్‌ గా అల్లుకొని

ఎనుగేసిన ఎడెముల్ల కులం గొంతుల ఇరుక్కొని

బుగ..బుగ పొంగిన అవమానాల” పలవరిస్తున్నడు.’ఎద పగిలినప్పుడు ఏడ్పందరిదీ ఒక్కటే’ అన్న స్పష్టతవున్న కవి

”అక్షరాలు అగ్గికణాలె కురిసి

జీవిత నిజాలు రాస్తె

కండ్ల సలువ రాతలు కవిత్వమౌతయంటరా?” అని సందేహపడ్తడు.

కాని, ఆ సందేహం తెలువనితనం కాదు

”జాన్‌ డయ్యర్‌ను వేటాడిన ఉద్ధంసింగ్‌లం

శిరస్సు తెగిపడిన శంభూకులం

వేలు కొయ్యబడ్డ ఏకలవ్యులం

రామాయణాన్ని రాసినోళ్ళం

రాజ్యాంగాన్ని రాసినోళ్ళం

ఎర్రకోటను ఏలెటోళ్ళం” అంటూ సాధికార స్వరాన్ని వినిపిస్తడు. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరాన్ని చెప్పుతడు. 50 కిలోల సిమెంట్‌ బస్తా ఎత్తుకొని ఏకబిగిన 12 అంతస్థులు ఎక్కే మనిషి ఎంత దృఢంగా ఉంటడో బాలయ్య తాత్విక నేపధ్యం కూడ అంతే గట్టిది. కాబట్టే, ‘జాతిని తాకట్టు పెట్టి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతూ, అంబేద్కరిజాన్ని అమ్ముకొని బ్రతికే జాతిద్రోహుల మీద’ యుద్ధం ప్రకటిస్తడు.

బహు సంక్లిష్టమైన భారతదేశంలో బతుకుతున్నడు కవి. అందుకే, బహుముఖ సమాజంలో అనేక పొరల అస్తిత్వాన్ని కలిగి వున్నడు. అంతర్గత వలసవాదంలో దోపడి, వివక్ష, అణచివేతలకు గురవుతున్న తెలంగాణ సమాజంలో జీవిస్తున్న కవితన ప్రాంతీయ అస్తిత్వాన్ని వెదుక్కుంటున్నడు. తెలంగాణ ఉద్యమం ఎగిసిసడ్డప్పుడల్లా వలసవాదులు భాషను ముందుకు తెస్తరు. తెలుగుజాతి మనమంతా ఒక్కటేనంటరు.తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటరు.అందుకు ఉద్యమించమంటరు.ఆకుట్రను అర్థం చేసుకున్న కవి

”అయ్యా! ఓ తెలుగోడా!

ఇక్కడ నువ్వు భద్రమే, నీ భాషా భద్రమే

భరోసా లేనిదల్లా మా బతుకులకే” అని మఖం మీద గుద్దుతున్నడు.

తెలంగాణ మలి ఉద్యమం పునాది సాగునీరు, వనరుల దోపిడి.నాగార్జునసాగర్‌ నిర్మాణంలోని కుట్రను అర్థం చేసుకున్నంకజలయజ్ఞం భవిష్యత్తులో తెలంగాణను ఎడారిగా మారుస్తుందని తేలికగనే గ్రహించిండ్రు.ఆ ఎరుకతోనే

‘బుద్దుని పాదాలను బురద తగలకుండ

సుమేరుడు తన శరీరాన్ని పరిచినట్టు

తలమీద ప్రాజెక్టు కట్టి

నా మొకాన మట్టి కొట్టిండ్రు’

అని ‘బొజర్లల్ల ఎండిన నీటి కలల’ పలవరిస్తడు. ‘ఎగిడ్సిన వలసవాది అగిరలేస్తిన అంగమయిన’ వైనాన్ని వివరిస్తడు.నీళ్ళు కావాలె నని నిలదీస్తడు. ‘ఈసమెత్తు జాగనిడువక మర్మం తెలిసిన మనమట్టి కోసం మన్ను బుక్కైనా కొట్లాడుదాం’ అని ఉద్భోద చేస్తడు. కలిసుండడం అనేది నిజానికి చాలా ఉదాత్తమైన భావన.విడిపోవడం ఎప్పుడైనా బాధాకరమే. అది భార్యాభర్తల బంధమైనా కావచ్చు, తెలంగాణ ఉద్యమమైనా కావచ్చు, ఎస్‌.సి. వర్గీకరణైనా కావచ్చు. కాని కల్సిందామని కథలు చెప్పేవాళ్ళు దాన్ని దోపడీ,అణచివేతలకు సాధికారతను సాధించిపెట్టేదిగా చూడడమే అసలు సమస్య.’పాపమని ఎంగిలి రొమ్మును చీకనిత్తే, పాలోడై, పామై పగబట్టడమే’ విషాదం.

సామాజికస్పృహ ఉన్న కవి,సమసమాజ కలగన్న కవి సమాజం కోసం తపించిన ధీరుల అమరత్వాన్ని గానం చేస్తడు. ‘పొన్న పువ్వుల దుక్కపు రెమ్మై’న నరేందర్‌ మాదిగను, ‘ పారిన నీ నెత్తురంతా ఏరులై నా కలం నుండి కవితా పాదాలై నిలువనీ ‘ అని గురు రవిదాస్‌నీ, ‘పొద్దు గూకడమంటే రేపటి పొద్దుపొడుపుకు ఎరుక’ అని బాలగోపాల్‌ని, ‘మట్టి పొత్తిల్ల విచ్చుకున్న పుట్ట బంగారం’ అని మిద్దె రాములుని, ‘చిల్లులు పడ్డ హక్కుల జెండాను కన్న బిడ్డోలె సంకనెత్తుకున్న’ కన్నబీరన్‌ని, ‘అంటరాని జాతి అస్తిత్వగొంతు’గా నిలిచిన ఫ్రొ|| కొమ్రన్ననీ, ‘ఉదయించే సూర్యుడివే, నువ్వు చమర్‌జాతి వీరుడివే’ అంటూ ఉద్ధమ్‌సింగ్‌నీ యాది చేసుకుంటడు.

స్వతహాగా ఆవేశపరుడిగా ముద్రపడ్డ బాలయ్యకు అడవిమీద, ఆయుధం మీద అచంచల విశ్వాసం. అస్తిత్వ ఉద్యమాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నా అంతిమ పరిష్కారం అది మాత్రమే కాదని స్పష్టంగా తెలిసినవాడు.

”మేమెందుకు విడిపోవడానికి

శరీరాలు అంటువెట్టుకొని సత్యాగ్రహులమైనం?

ఆత్మహత్యలనాపి ఆయుధాలు ధరించి సాయుధులం కాలేమా?” అంటూ ఆవేశపడ్తడు.’జబ్బకు డప్పు బదులు తుపాకి వేసుకున్న సూర్యుడు రాత్రికి రాత్రే హత్యచేయబడుతడు’ అని అంగలారుస్తడు.’ఆకుల్లా రాలుతున్న అమరుల శవాలకు వేపచెట్టు తనువంతా తల్లడిల్లి తల్లివేర్లలో రేపటి స్వప్నాలను వెతుక్కుంటున్న’ వైనాన్ని గమనిస్తడు.’కోమలి పాదాలకుప్రేమగా కుట్టిన అలుకల చెప్పులు మల్టీ డేగ ముక్కులో రక్తం కక్కి చచ్చిన’ కారణాల్ని పసిగడ్తడు. అందుకే సామ్రాజ్యవాదం మీద, ప్రపంచీకరణ మీద అలుపెరుగని యుద్ధానికి సిద్ధమైతడు.

”అదగో.అదిగదిగో..గగనానగేయాల సూర్యులు

నల్లసారపు గుండ్లమీద గగుపవ్వులు నడిసి ఆడిన జ్ఞాపకాల పలవరింత

హుస్నాబాద్‌ ఎల్లవ్వ తల్లి సిగలో పూసిన నల్ల బతుకమ్మ

శ్రమజీవులు తలెత్తుకొని శిఖరానికెత్తిన సుత్తెకొడవలి” అవనతమైందని వ్యధచెందుతూ, మట్టిస్వప్నాల సౌధం విచ్ఛిన్నమైందని విలపిస్తడు.’గిరాయిపల్లి అడవిలో పచ్చని కలలను కాలుస్తున్న శబ్దాని’కి కలత చెందుతడు. కాని కవి నిరాశావాది కాదు.

”నన్ను పాతిపెట్ట చూత్తె

బొందపెట్టిన మట్టినుంచి మల్ల మొనదేలిన కత్తినై మొలకెత్తుత

మరణించి ప్రతిసారీ సూర్యుడినై ఉదయిస్తా

కొత్త కవితనై బతికొత్తా” నంటూ భరోసా నిస్తడు.

వస్తువుకు సంబంధించిన స్పష్టత కవిత్వ నిర్మాణంలో కనిపించకపోవడం ఇబ్బంది పెడ్తది. కవిత ఎత్తుగడ, ముగింపుల విషయంలో పరవాలేదనిపించినా పదాల కూర్పులో, వాక్య నిర్మాణంలో,ప్రతీకలు ప్రయోగించడంలో శ్రద్దపెట్టాలె.మనల్ని మనమే కాంట్రాడిక్టు చేసుకునే సందర్భాల్ని పరిహరించాలె.ముఖ్యంగా ‘ఎగిలివారంగ’ లో అట్ల ఎక్కువ కనిపిస్తది. ‘దందెడ’ లో కొంత అట్ల అనిపించినా వస్తువుకు తగ్గ రూపాన్ని సంతరించుకున్న కవితల్ని అనేకం మనం చూడవచ్చు.

‘భూమాత నుదుటిమీద దస్కత్‌ చేసిన పాదం’

‘తలపాపిన తల్లి పాపెడ నిండ నేల రాలుతున్న సుక్కల తిలకం’

‘తలపువ్వు వేసే మక్క కర్రకు సంకల పాపోలె కులం’

‘గాడుపు దుమారంల ఈతకమ్మల పతంగి’ లాంటివి అందుకు మంచి ఉదాహరణలు.

అట్లాగే, తెలంగాణ పదసంపద, పలుకుబడులు,నుడికారాలు, శ్రామిక సాంస్కృతిక చిహ్నాలు బాలయ్య కవిత్వం నిండా పరుచుకొని ఒక కొత్త సోయగాన్ని అబ్బుతయి.కుక్కుడు పట్టిన,మర్రవడి,కైలాటకాలు, కశికె, బల్లిపాతర, సందెనవడడం,అడ్డికి పావుశేరు, పిత్తకంత,మోర్థపుతనం, గెరువు, మక్క కంకి, గతిమెల్లె, దొయ్య, కాట్రావు, నొగ,తడక, ఎడ్లకొట్టం,గలుమ, ఉద్దరాశిపువ్వు, అడధర్మి, దండె పొడిత్తె, అర్నమడిగితె, ఎతలవూట లాంటి పదాలు, పదబంధాలు కవిత్వం నిండా పరుచుకొని అబ్బురపరుస్తవి. నిర్మాణాన్ని మరింత మెరుగు పరుచుకొని, మరింత కవిత్వంతో పొన్నాల బాలయ్య మనల్ని అలరించాలని, సామాజిక పరాణామ క్రమంలో ఉత్ప్రేరకం అవా&ఆలని ఆకాంక్షిస్తూ…

బయోడేటా

పేరు: పొన్నాల బాలయ్య

తల్లిదండ్రులు: కొమురవ్వ, దుర్గయ్య

పుట్టిన తేది: 04-09-1973

స్వగ్రామం: ఆరెపల్లి, కోహెడ (మం) జి|| కరీంనగర్‌

విద్యార్హతలు: ఎం.ఎ.(హిందీ), ఎం.ఎ.(తెలుగు)

వృత్తి: భాషాపండిట్‌

రచనలు: ఎగిలివారంగ-2008(కవిత్వం)

దందెడ-2011(కవిత్వం)

అత్తర్ల గుబాళింపు ‘అధూరె’
స్త్రీ, దళిత, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు లేని అనేక ప్రతిబంధకాలు ముస్లిం మైనారిటీ వాదానికి ఉన్నాయి. దేశ స్వాతంత్య్రోద్యమ నాయకులుగా చలామణీ అయిన భారత దళారీ పాలకవర్గం వలసవాదుల బాట నడిచి కొంత, కుట్రలకు తలొగ్గి కొంత ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకొని దేశవిభజనకు చేతులెత్తినరు. విభజన జరుగకూడదని కాదు, అది మతప్రాతిపదికగా జరగడం దారుణం.అప్పుడు చెలరేగిన హింస, మారణహోమం, అమానవీయ ఘటనలు మళ్లీ అదే పాలక వర్గాలకు ఓటు బ్యాంకుగా మారినవి. వలసవాదులనుంచి విస్తరణవాదాన్ని ఒంటవట్టించుకున్న భారత పాలకవర్గాలు అటు కాశ్మీర్‌, ఇటు హైదరాబాద్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును భుక్తం చేస్తూ దురాక్రమణచేసి తమ అఖండభారతంలో కలుపుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలను హిందూ మతోన్మాదులు పరాయి దేశస్థులుగానే పరిగణించసాగారు. దాన్ని తిప్పికొట్టాల్సిన ముస్లింలు కూడ కొండొకచో( భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య జరిగే క్రికెట్‌మ్యాచ్‌ల సందర్భంలో)పాకిస్థాన్‌ అనుకూల వైఖరి ప్రదర్శించి మధ్యేమార్గంగా వున్న లౌకికవాదులనుంచి కూడ దూరమైనరు.దీన్ని ఆసరాగా తీసుకున్న పాలకవర్గాలు ఇరువర్గాల్ని రెచ్చగొడ్తూ పబ్బం గడుపుకోవడం జరుగుతూ వుంది(1990లో మర్రి చెన్నారెడ్డిని సీయం కుర్చీ నుంచి దించడానికి ఒక జాతీయపార్టీ నాయకుడు స్థానిక మతతత్వ పార్టీతో మిలాఖతై చేయించిన మతఘర్షణల లాంటివి).

అట్లాంటి ఒక ప్లానే కాశ్మీర్‌ యుద్ధం, కొనసాగింపే బంగ్లాదేశ్‌ విభజన, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ. చాలా చిత్రంగా మతతత్వం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఆర్‌.ఎస్‌.ఎస్‌, దానికనుబంధంగా ఏర్పడ్డ బి.జె.పి.ని గాని, రజాకారు రాకాసి మూకల కొనసాగింపైన యం.ఐ.యం.ని గాని ఘతవహించిన లౌకికఘనతంత్ర రాజ్యం నిషేధించకుండా, కొండొకచో పొత్తులు పెట్టుకుంటూ మతానుబంధంగా రాజకీయపార్టీలు ఏర్పడడానికి లెజిటిమసీని కల్పించినవి. ఇక్కడ హిందూ మతోన్మాదులు కాని, మధ్యేమార్గంగా ఉన్నామని చెప్పుకునే పాలకవర్గ పార్టీలు కాని భారతదేశ ముస్లింలకు ఈ నేలమీద హక్కులున్నాయని కూడ భావించడం లేదు. మీ దేశానికి మీరు పోకుండా వున్నందుకు గాను,మా దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన జాతి మీది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన అస్తిత్వ ఉద్యమాలకు ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమానికి వున్న మౌలికమైన తేడా ఇదే.ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమం విస్త ృత ప్రజాబాహుళ్యపు ఆమోదం పొందకపోవడానికి ఇదొక కారణం. మెజారిటీ ముస్లిం ప్రజలు మతపెద్దల(ముల్లాల) చేతుల్లో బందీలై, మతమౌఢ్యపు చీకటి కొట్లల్లో మగ్గిపోవడం మరొక కారణం. కాబట్టి భారతదేశపు ముస్లింలు ఏక కాలంలో రెండు యుద్ధాలు చేయాల్సివుంటుంది. ఒకటి హిందూ మతోన్మాదాన్ని ఎదిరిస్తూ, మానవీయమైన సమాన హక్కుగల అస్తిత్వం కోసం పోరాడడం, మతం మత్తుమందును వదిలించుకొని, ముల్లాల బంధాలు ఛేదించుకొని లౌకికవాద దృక్పథాన్ని పెంపొందించుకోవడం, అట్లాంటి శక్తుల్ని పునరేకీకరణ చేయడం.

అట్లాంటి దృక్పథాన్ని స్కైబాబ కలిగివున్నాడని చెప్పడానికి ఆధారమైన కథలు ‘అధూరె’ లో వున్నయి. అయితే,అది అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, సమాజంనుంచి,రాజ్యాంగ వ్యవస్థనుంచి కొన్ని పాక్షిక ప్రయోజనాలు పొందడానికిపనికొస్తుంది కాని, అంతిమంగా ఆ జాతి విముక్తికి కావాల్సిన ప్రత్యేక రాజకీయార్థిక దృక్పథాన్ని అందిస్తుందా అన్నదే ప్రశ్న.అస్తిత్వ ఉద్యమాలు అనివార్యంగా విశ్వజనీన విముక్తి ఉద్యమాలల్లో అంతర్భాగంగా పనిచేయాల్సి వుంటుందా అనేది చర్చించాల్సిన విషయమే. అయితే, ముస్లింలవే ముఖ్యంగా ముస్లిం స్త్రీలవే అయిన సమస్యల్ని చర్చకు పెట్టడంలో ‘అధూరె’ ద్వారా స్కైబాబ కృతకృత్యుడయ్యిండు. అయితే, ‘అధూరె’ ముస్లిం కథలు అన్నడు గాని, ప్రాంతీయ నిర్దిష్టతను ఎందుకు విస్మరించిండో అర్థం కావడం లేదు. సార్వజనీన సమస్యలే అయినా, వాటికి ఒక స్థల,కాల నిర్దిష్టత అవసరమని స్కైకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.అట్లా చూసినప్పుడు ‘అధూరె’ తెలంగాణ ముస్లిం కథలు అని వుండాల్సిందేమో?

‘అధూరె’ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నయి. ఇందులోని పాత్రలైన ముస్లిం స్త్రీలకు దీన్ని అంకితమివ్వడంబట్టి చూస్తే , అవి ఆ స్త్రీలకు సంబంధించిన కథలే అని తెలుస్తుంది. అంటే, తన కుటుంబ సభ్యుల, మిత్రుల వైయక్తిక అనుభవాల్ని స్కై కథలుగా మలిచాడని తెలుస్తుంది. దీన్ని “objectification of subjective experiences”గా పరిగణించాల్సివుంటుంది. ‘ఛోటీ బహన్‌’ ,’మొహబ్బత్‌ 1421 హిజ్రి’ అనే రెండు కథలు కూడ ముస్లిం మత సాంప్రదాయమైన బుర్ఖా పద్ధతినినిరసిస్తూ రాసినవే. ఇంటి చాకిరీ చెయ్యనని, బుర్ఖా వేసుకోనని, ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లిదండ్రులతో, సమాజంతో పోరాడుతున్న చెల్లెకు అండగా నిలబడ్డ అన్న , ఆమె పెళ్లి తర్వాత చెల్లెతో పాటు తను కూడ వ్యవస్థ కట్టుబాట్లకులొంగిపోయిన విషాదాన్ని చిత్రించిన కథ ‘ఛోటీ బహన్‌’. సున్నితమైన మానవ సంబంధాల్ని హృద్యంగా చిత్రించిన కథ. నెట్‌లో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆమె బుర్ఖాతో దిగిన ఫోటో పంపడం ‘మొహబ్బత్‌ 1421 హిజ్రి’లోని కథ. ఒక సాదాసీదా వస్తువుకు ఫ్లాట్‌ పాత్రలతో నడిపిన సాదాసీదా కథనం.

పేదముస్లిం కుటుంబాల్లో( నిజానికి ఏ పేదకుటుంబంలోనైనా) ఆడపిల్లల పెళ్లి ఎంత విషమసమస్యో తెలియజెప్పేవి ‘కబూతర్‌’ ‘ఖిబ్లా’ కథలు. భర్తను పోగొట్టుకున్న పేద ముస్లిం స్త్రీ ఆడపిల్లల పెళ్లిల్ల కోసం పడే యాతన ‘కబూతర్‌’లో కనిపిస్తది. కథ చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరగడం నాకు గర్తుంది. అయితే, ముగింపు చాలా కృతకంగా తెలుగు సినెమాలో లెక్క వుంది. చెల్లెల్ల పెళ్ళిల్లకు డబ్బులు సంపాదిద్దామని దుబాయ్‌ పోయి మాయమైన పేద ముస్లిం కథ ‘ఖిబ్లా’.

మంచి కథా వస్తువుతో అద్భుతంగా నడిచి గొప్ప ముగింపును చూపిన కథ ఇది. గరీబు ముస్లిం యువకుడి విఫల ప్రేమల సఫల వ్యక్తీకరణ ‘మజ్బూర్‌’ , ‘ఉర్సు’ కథలు. ఇవి రచయిత వైయక్తిక అనుభవాలని చెప్పడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అయితే, ఉర్సు కథలో ఇద్దరి ముస్లింల మధ్య కాకుండా, హిందూ ముస్లింల ఉమ్మడి సాంస్క ృతిక ప్రతీకగా నిలిచిన ఉర్సును దృష్టిలోవుంచుకొని ఇద్దరిని చెరొకమతానికి చెందినవాళ్ళుగా చిత్రించివుంటే మరింత గొప్పగా వుండేది. ఏ గొప్ప కళ అయినా వాస్తవానికి దగ్గరగా వుండాల్సిందే. కాని యధాతథంగా వుండాల్సిన అవసరం లేదు. సత్యం, సంభావ్యతల ఆధారంగా వాస్తవానికి ఒకింత కల్పన జోడించినప్పుడే అది అద్భుతమైన కళ అవుతుంది. పేదరికం ముస్లిం యువకుల్ని దుబాయి పోవడం ఎట్లా అనివార్యం చేసినవో చెప్పిన కథలు ‘భడక్తా చిరాగు’ , ‘వతన్‌’. ఆర్థిక సమస్యలు, భార్యకు దూరంగా

వుండాల్సి రావడం పురుషున్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తెలిసిసప్పుడు అతను తన తప్పును సరిదిద్దుకోవడం భడక్తా చిరాగు లో కనిస్తుంది. వస్తుపరంగా,శిల్పపరంగా సమతూకంలో వున్న మంచికథ ఇది. తను దుబాయి పోవడాన్ని నిందించిన హిందూ మిత్రుడు అమెరికా పోవడం మీద ఆగ్రహం చెందిన ముస్తిం యువకుడి కథ ‘వతన్‌’. రచయిత దీన్ని మాతృదేశం మీద ప్రేమ కోణంలో వ్యక్తీకరించిండు. కాని, బారతదేశ పౌరులు దుబాయికో లేదా ప్రపంచంలోని ఇతర దేశాలకో బతుకు దెరువు కోసం పోవడానికి, అమెరికాకు పోవడానికి మధ్యవున్న మౌలికమైన తేడాను విస్మరించిండు. ఆర్థిక, సాంస్క ృతిక సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో తృతీయ ప్రపంచ ప్రజల మూలుగపీల్చే అమెరికా చేతిలో ఆయుధమవ్వడానికి బతుకు దేరువుకోసం ఇంకో దేశానికి పోవడానికి వున్న తేడా పెట్టుబడి, దోపిడీకోణంలోంచి చూడాల్సి వుంటుంది.

ముస్లింవాద రాజకీయ కార్యాచరణను, దానికి కావాల్సిన తాత్విక భూమికను వ్యక్తీకరించే కథలు ‘వెజిటేరియన్స్‌ ఒన్లీ’ ‘దస్తర్‌’.ఈ రెండు కథలు కూడ సమాజంలో వేళ్ళూనుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటిస్తూ, ఈ దేశంలో ముస్లింలకు అసలైన మిత్రుడు దళితుడే అని చెప్తవి. బహుశ, తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలోకింది కులాలే ఎక్కువగా మతం మార్చుకొని ముస్లింలుగా మారడం వల్ల కావచ్చు. రాజ్యహింసకు సంబంధించిన కథ’దావా’

అయితే, ఇందులో స్థల కాల వాతావరణ ఐక్యత లోపించింది. గొడవల్లో ముస్లిం యువకున్ని పోలీసులు నిర్భంధించి స్ఠేషన్‌లో పెట్టడం, అతని కోసం తల్లి రావడం ఇందలి కథ. అయితే, గొడవలు ఎక్కడ,ఎందుకు, ఎలా జరిగాయో తెలుపడు.వామపక్షతీవ్రవాద భావజాలం కలిగివున్నరన్న కారణంగా అనేక మంది యువకులు తెలంగాణలో అదృశ్యమైతున్న వాస్తవం వుంది. కాబట్టి సంఘటనేదో బ్యాక్‌డ్రాప్‌లో చెప్పివుండాల్సింది. సాధారణం బదులు నిర్దిష్టతను వర్ణించాలి. అమూర్తమైన దాన్ని మూర్తంగా చిత్రించాలి. ప్రతీక కోసం కాకి, కుక్కలను వాడుకున్నడు. కథలో తుపాకి గోడకు వేలాడుతున్నదంటే, దాన్నిఖచ్చితంగా పేల్చాలి అన్నట్టున్నది. ప్రయోగం కోసమే చేసిన ప్రయోగం ‘జీవం’ కథ. స్కై లాంటి ఉద్యమ కార్యకర్తనుంచి ఇట్లాంటి కథ రావడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ వుండదు.

తెలుగు సాహిత్యంలో విప్లవోద్యమంతో సహా, ఉద్యమ సాహిత్యంలో కళాత్మక నిర్మాణం పట్ల తక్కువ శ్రద్ధచూపించారు. ఇప్పుడైతే కళాత్మక విలువల గురించి మాట్లడితేనే నేరంగా పరిగణిస్తున్నారు. ఇట్లాంటి స్థితిలో, “What wedemand is the unity of politics and art, the unity of content and form, the revolutionary political conent and the highest possible perfection of artistic form. works of art which lack artistic quality have no force, how ever progressive they are politically. Therefore, we appose both the tendency to produce works of art with a wrong political view point and the tendency towards the “postar and slogan style” అన్న మావో సేటుంగుమాటల్ని గర్తుచేసుకోవాలి. అట్లా అని చెప్పి ప్రతి కథ మపాసా ‘నెక్లెస్‌’ లాగనో, గొగోల్‌ ‘క్లోక్‌’ లాగనో, టాల్‌స్టాయ్‌ ‘గాడ్‌ సీస్‌ది ట్రూత్‌ బట్‌ వెయిట్స్‌’ లాగనో, ఓహెన్రీ ‘లాస్ట్‌ లీఫ్‌’ లాగనో వుండాలని కూడ నేనేం అనడం లేదు.కాని, వస్తువు,ఇతివృత్తం ఎత్తుగడ, ముగింపు, సంఘటన, సంఘర్షణ, నడక, పట్టు, విడుపుల సమతూకం, స్థల కాల వాతావరణాల ఐక్యత మాత్రంకథకు కచ్చితంగా అవసరమౌతుంది. ఇక రెండో విషయం భాష. ఏ మాత్రం పరిచయమున్నా ఈ కథల్లో వాడిన భాషనుబట్టి రచయిత నల్లగొండ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల వాడని ఇట్టే చెప్పొచ్చు. అట్లా ఆ ప్రాంత ముస్లిమేతరుల భాషను అద్భుతంగా వాడుకున్నడు. భాష ఒక కమ్యూనికేట్‌ చేసే సాధనమే. కాని, అది ఆ కర్తవ్యం నేరవేర్చాలి కదా! ఈ మధ్య కాలంలో ఒక పేషంట్‌ నాతో ‘సార్‌! పాపకు బెడ్డు పడుతుంది’ అని చెప్పింది. చాలా సేపటి వరకు ఆమె ఏం చెప్తుందో నా కర్థంకాలేదు. ముక్కులోంచి రక్తం పడుతుంది అని ఆమె చెప్పాలనుకుంది. ఈ వక్రీకరణ (బ్లడ్‌కు బదులు బెడ్డు) అంగీకారమేనా? అట్లాంటి భాషనే స్కై ఈ కథల్లో ఉపయోగించిండు. పొయ్‌నయ్‌, లేషిన,నౌక్‌రీ, బాదనిపించింది, సంబందం, విజా, కూసానున్నది ఇట్లాంటివే ఇంకొన్ని. తెలంగాణ తనదే అయిన భాషను స్థిరీకరించుకుంటున్నప్పుడు ఈ ప్రయోగం ఎక్కడ తేలుతేందో?అఫ్సర్‌ ముందుమాటలో అన్నట్టు ఇది ‘సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పే ప్రయత్నమా?’

‘ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం’ అంటూ కె.శ్రీనివాస్‌ స్కైమీది ప్రేమతో రాస్తున్నాడు గాని, ‘గోలకొండ కవుల సంచిక’ వేసిన సురవరం ప్రతాపరెడ్డి తను చనిపోయే వరకు కూడ తనకవిత్వాన్ని వేసుకోలేదని, 2012 లో సంగిశెట్టి పూనుకునే దాకా సురవరం కవిత్వం వెలుగు చూడలేదని శ్రీనివాస్‌కు తెలుసు కదా!

అయితే, షాజహాన అన్నట్టు ‘తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాల పై ముస్లిం వెలువరించిన”అధూరె’ కథలు ముస్లింల పేదరికాన్ని, జీవన సంఘర్షణను చిత్రికపట్టి చూపుతయి. సాంస్క ృతిక అత్తర్ల గుబాళింపును వ్యాపింప చేస్తయి. ముస్లిం మైనారిటీ అస్తిత్వవాదాన్ని మరింత ముందుకు తీసుకపోవడానికి ఉపకరిస్తయి. అట్లా స్కై కృతకృత్యుడైనట్లే. ఆకాశమే హద్దుగా స్కై సాగిపోవచ్చు.

నిఖార్సైన కవి నర్సింహారెడ్డి
ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి.

‘వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని

క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులనుపరస్పరం సహకరించుకునే సమూహాల్లేని పజ్జెమే

ఒక్కొక్కటే పేనుకుంటూ కట్టిపడేస్తుంది

ఇక నాలో కొత్త ఆశల్ని పూయిస్తుంది’

అని కవిత్వం జీవితంలో ఎట్లా అంతర్బాగమైందో తెలుపుతడు.’కవిత పిచ్చోడని కసిరినారు నన్ను’ అంటూ వాపోతూనే

‘ఒదగకపోతే ఒంచుతా

వినకపోతే విరుస్తా

వ్యాకరణాలు రొదపెట్టనీ

పద్యాన్ని హృదయానికి

పర్యాయపదం చేస్తా’ నంటూ లక్ష్యప్రకటన చేస్తడు.

మృదువైన, సున్నితమైన భావప్రకటనతో సమాజం గురించి సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యానించడం నర్సింహారెడ్డి కవిత్వ లక్షణం.60 వ థకంలో పల్లెలో పుట్టి పెరిగి, పట్టణానికొచ్చి పైచదువులు (ఖ.జు.ఆనీ.ఈ.) చదువుతున్న సమయంలో కవిత్వం నర్సింహారెడ్డిని ఆవహించింది.అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేసి తన్ను తీర్చిదిద్దిన ఏనుగు లక్ష్మమ్మ కష్టాల్ని దూరం చేయాలని, అందుకు తాను ఉద్యోగం సంపాదించుకోవాలని తపిస్తున్న కాలంలో నిరుద్యోగం మీద పుంఖాను పుంఖంగా కవిత్వం రాసిండు. క్వాలీఫైడ్‌ల మొర,క్యూ కవిని కలవర పెట్టినయి. అప్పుడప్పుడూ నిరాశ బాకులా దిగేది. ‘సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు’ కలిగిన బాధను కవిత్వంలోకి ఒంపుకుంటడు.

‘కలలు పగిలి పోవచ్చు

పాఠకుని చేరని కావ్యంలా

నువ్వలా కళ్ళల్లో వత్తులు వేసుకొని

గోడమీద సున్నెం పట్టెలా చారగిలబడకు

నేనసలే రాకపోవచ్చు

అమ్మా! ఎదురు చూడకు’

అంటూ తల్లికి ఆఖరి లేక రాసుకుంటడు.దు:ఖం కళ్ళెను ఎల్లబోసుకుంటడు.అందుకే ‘పల్లె చేతుల్తో నగరవాతావరణంలోకి పట్టుకొచ్చిన తాజా కవిత్వం’ నిరుద్యోగిలా మా ఇంటికొచ్చింది అంటాడు ఎన్‌.గోపి.మానవ సంబంధాల పట్ల ఆర్తిగల్ల కవి

సరియైన వయసులో పెళ్ళికాకపోవడాన్ని కూడ హృద్యంగా చిత్రిస్తడు. విఫల ప్రేమలకు విలపిస్తడు. యాంత్రీకరించబడ్డ సంబంధాలని చూసి ‘రోజూ కలుసుకుంటున్న అపరిచితులమం’ టూ వాపోతడు.

తొంభయవ థకం తెలంగాణ సమాజంలో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రపంచీకరణ దేశానికి పట్టుకొమ్మలైన

పల్లెల్ని మింగేసింది.’కనిపించని ఈ కుట్రల్లో పల్లె కన్నీరు పెట్టింది’. అర్బనైజేషన్‌ పల్లెల్లో ప్రధానంగా వున్న వ్యవసాయాన్ని కుంగతీసింది.ప్రజాస్వామ్య ప్రహసనం ముగిసింది. ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల రిమోట్‌తో నడవడం మొదలైంది. సంపన్న దేశాలు ప్రపంచబ్యాంకు, డబ్లుటివో వాటిని ముందుపెట్టి ఈ నాటకం నడిపిస్తున్నవి.వ్యవసాయం ,దానిమీద ఆధార

పడ్డ చేతివృత్తులు ద్వంసమైనవి.పల్లె వల్లకాడుగా మారింది.

‘అప్పులోల్లు పైసలడిగితే ఎట్లరాని

పొట్టకూటికోసం గింజలెట్టులనుచు

వెరచి రైతుబిడ్డ ఉరికొయ్యకూగెరా’

అంటూ ‘ప్రపంచబ్యాంకు బాకు పల్లెబొండిగ తెంచిన’ వైనాన్ని చిత్రిస్తడు కవి. ‘బహుళజాతి మాయ బలితీసుకొని పోయిన ‘ తీరును ఎరుకపరుస్తడు.

‘చెరువు నోరు తెరిసె చెల్క కన్నీరింకె

చుక్కనీరు లేదు దుక్కిదున్న

తేటతెల్లమాయె తెలగాణ యవుసమ్ము’

అంటూ వ్యవసాయ దుస్థితిని తెలుపుతడు.తెలంగాణ పల్లెల్లోని సకల పార్శ్వాలను చూపుతడు.శ్రమైకజీవన సంస్కృతి తన ప్రాభవాన్ని కోల్పోవడంతో పల్లె బతుకును హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, ‘పల్లె బతుకు మాది పాడుగాను’ అనే మకుటంతో ‘మట్టిపాట’ను గానం చేసిండు కవి. ఛందోబద్ధ పద్యాలు తెలంగాణ మాండలికం వల్ల అందాల్ని సంతరించుకున్నవి.

తెలంగాణ పల్లె దుంఖమంతా నర్సింహారెడ్డి కవిత్వంలో కనిపిస్తది.స్వతహాగా తను రైతుబిడ్డ. అందుకే,

‘పీఠభూమిలో నాగలి కర్రు కింద

నీటిమట్టం కూడ

నిర్దయగా జారుకుంది’

అంటూ వ్యవసాయ దుస్థితిని కవిత్వం చేస్తడు. ‘నీటినుంచే ప్రాణం పుట్టిందని పంటచేల పారవశ్యాలతోనే సమస్త రంగాల బతుకు బండ్లు పరుగులు తీస్తాయని’ ఎరుకున్న కవి, ఆ నీటిని తోడడానికి కావాల్సిన విద్యుత్తు లేమి పట్ల కలత చెందుతడు.

తెలంగాణ పల్లె దుస్థితికి కారణమైన నయావలపవాదాన్నే కాకుండా, అంతర్గత వలసవాదం మీద యుద్ధం ప్రకటిస్తడు.610 జీవోని ప్రశ్నిస్తడు. ‘వాళ్ళు కష్టపడుతర్‌ సార్‌’ అంటూ సీమాంధ్రుల  దోపడి మీద సెటైర్‌లు విసురుతడు.

‘పనిలేకపోవడమంటే జీవితము పెద్దగా లేకవోవడమే’ నంటూ శ్రమైక జీవన ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తడు.కల్లోని కుంటలో నాన్నని కలవరిస్తడు.

‘కాలానికి ఆరబెట్టిన

నీటిరంగుల వర్ణచిత్రంలా

నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం’ అంటూ కలత చెందుతడు. పరాయీకరణ నర్సింహారెడ్డిని కూడ నోస్టాల్జియాలోకి

నెట్టింది. అందుకనే కల్లోని కుంటని,కాడమల్లె చెట్టుని, ఊరునీ పలవరిస్తడు. ‘ఇక్కడో ఊరుండేది ఎవరైనా చూపిస్తారా?’ అంటూ గడుసుగా ప్రశ్నిస్తడు.

రెవెన్యూ డిపార్టుమెంట్‌ కు సంబంధించిన సమస్యలమీద,సహృదయులైన సహోద్యోగులమీద మీద కవిత్వమల్లుతడు.

ప్రభుత్వాధికారిగా ఉంటూనే అసౌఖ్యానికి గురైనవాళ్ళ పక్షాన నిలబడడం కొందరికి గొప్ప విషయంగా కనిపించవచ్చు, కాని

అది అనివార్యం అవుతది. గౌరవప్రదమైన వృత్తిగా భావించే డాక్టర్లు, లాయర్లు కూడ రోజువారీ కూలీల కింద మార్చబడ్డ ఈ

వవస్థలో ఏదో ఒక ధృవాన్ని చేరుకోవడం అనివార్యమౌతుంది. నర్సింహారెడ్డి కవి కాబట్టి ప్రజా ధృవాన్ని చేరుకున్నడు.

మృదువైన, స్పష్టమైన, సూటితనం నర్సింహారెడ్డి కవిత్వశైలిలో కనిపిస్తది.తెలంగాణ నుడికారపు సొగను మరింత అందాన్ని అద్దుతది. అక్కడక్కడ వ్యంగ్యం, దెప్పిపొడుపు సాధికారికంగా జతకడ్తవి. అలతి పదాలతో ప్రతీకలను, అలంకారాలను విస్తృతంగా వాడతడు.

‘వెన్నెల మెరువడానికి గోడల అద్దాల్ని వెతుక్కుంటుంది’

‘తల్లులు-మాసిన పిల్లల నెత్తుల్లోంచి పేన్లు ఏరి కుక్కినట్లు

పక్షలు-కొమ్మల రెక్కల నడుమ గండుచీమల్ని ఏరి పారేస్తున్నవి’

‘ఫైళ్ళంటే కాగితాలు ఎంత మాత్రం కావు

జోడించబడిన చేతులు’

‘గుట్టను తాకిన మబ్బుల్తో

రంగుల గుడారమేసిన ఆకాశపు’

‘చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు

చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు’

‘తలస్నానం చేసి తుడుచుకోవడం చేతకాని

పసిపిల్లల సమూహంలా చెట్లు’

నర్సింహారెడ్డిలోని భావుకతకు ఇట్లాంటి నిదర్శనాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. అట్లే ‘పొద్దూకి వచ్చిన వాన పొద్దూకి వచ్చిన చుట్టంలాపోనే పోదు’ ‘చెడిపి రాస్తున్న(చెరిపి కాదు)’ ‘తొవ్వదారానికి’ ‘నడమంత్రం’ ‘పల్లె బొండిగ’లాంటి తెలంగాణ నుడికారపు మెరుపులు కవి ప్రతిభకు నిదర్శనాలు.  అట్లాగే కవిత్వంలో ప్రయోగాలు చేయడం కూడ నర్సింహారెడ్డి ఇస్టపడుతడు.ఛందోబద్ద పద్యాలతో కూడిన ‘మట్టిపాట’ ,రుబాయీలు మనకు అదే చెప్తాయి.

అయితే,నర్సింహారెడ్డి అంత్యప్రాసల లౌల్యం వదిలించుకోవాలె.ఎత్తుగడ,ముగింపులకు ప్రాధాన్యత ఇవ్వాలె.ప్రతీకల ప్రీతితోటి వచ్చిన అస్పష్టత తొలిగించుకోవాలె. మరింత కవిత్వం రాయాలె. నిఖార్సైన కవిగా నిలబడాలె.

పేరు: ఏనుగు నర్సింహారెడ్డి

జననం: 6 ఎప్రిల్‌ 1968

కల్లోనికుంట, రామన్నపేట (మండలం),నల్లగొండ జిల్లా

ఎస్‌.ఎస్‌.సి.:1983 చిట్యాల

ఇంటర్‌: 1985 రామన్నపేట

బి.ఎ.: 1989 నల్లగొండ

ఎం.ఎ.:ఉస్మానియా

ఎం.ఫిల్‌.:తెవివి-తులనాత్మక సాహిత్యం

M.A. పి.హెచ్‌.డి.:తెవివి-తులనాత్మక సాహిత్యం

రచనలు- 1992 నుండి సీరియస్‌గా కవిత్వం పత్రికలలో

వ్యాసాలు,విమర్శలు,సమీక్షలు 1998నుండి

ప్రచురణలు: కవిత్వం

సమాంతర స్వప్నం-1995

నేనే-2002

మట్టిపాట-2008

కొత్తపలక-2013

నవల- ‘పగిలిన గుండెలు’ డైలీ సీరియల్‌గా నల్గొండ డైలీలో 1988 రెండు నెలలు

నేను – నా జ్వరము – ఆమె
ఏమైందనో, ఎప్పుడొస్తావనో

ఏదో ఒకటి

అడుగుతావనే అనుకున్నా

నా గుండె వాకిట్ల

ఏవో నాలుగు ఉపశమనపు మాటలు

చల్లుతావనే అనుకున్నా

ప్రమేయంలేని ద్వంద్వ యుద్ధంలో

పైరస్‌ పంచ్‌కు తూలి

బారికేడు మీద ఒరిగినప్పుడు

ఆసరాయై నిలబెడతావనే అనుకున్నా

ఎండి పిడుచ కట్టుకపోయిన నాలుకమీద

నాలుగు నీళ్ళ చుక్కలు

చిలకరిస్తావనే అనుకున్నా

దిగులు మేఘం దట్టంగా కమ్ముకొని

ఒంటరి చీకటి భయపెట్టినప్పుడు

కౌగిలివై కాస్తంత అభయమిస్తావనే అనుకున్నా

నా జీవితాకాశం మీద

సూర్యున్ని మబ్బు మింగేసినప్పుడు

చిరు దివ్వెవై దారి చూపుతావనే అనుకున్నా

జ్వరం వాసన దేహాన్ని ఆవరించినప్పుడు

కరుణతో కాసింత ప్రేమ సుగంధాన్ని

చిలుకరిస్తావనే అనుకున్నా

రుచులు మరిచి

డెలీరియంలో నాలుక పలువరించినప్పుడు

అమ్మ చేతి మామిడి తొక్కువై

అక్కున చేరుతావనే అనుకున్నా

ఒంటరి శూన్య సౌధంలో

తెరలు తెరలుగా తన్నుకొస్తున్న

దుఃఖం కల్లెను ఎల్లవోసుకుంటున్నా

కానికాలంల కాలం చేస్తే

గొంతులో కాసిన్ని

తులసి నీళ్ళైనా పోస్తావా?

మాసిపోయిన మనిషిని

మిగిలిపోయిన కవిత్వంలోనన్నా బతికిస్తావా?

రచనా కాలం: 1 అక్టోబర్‌ 2013

‘పడుగు’ కొత్త కాలమ్, ఫిబ్రవరి సంచిక నుంచి..
మమతలు,బంధాలు, ఆత్మీయతలు కాలం చేసినట్టే, తీరాల ఇసుకల మీది నురగల రాతలా కాలం చెరిగిపోయినట్టే, బహిరంతరాల్లో ఉద్యమాల ఉద్వేగాల ఉద్దీపనల్లో వెలిగిన కవిత్వం నీలో,నాలో సామాజిక ఉపరితలపు పొరల్లో, పునాదుల్లో మరణిస్తుందా? కొత్త శాస్త్రసాంకేతిక సంద్భాలు, కొత్త సామాజిక సంబంధాలు, కొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యాలు కొంత ఆజ్యం పోస్తున్నాయా? వస్తువినిమయ ప్రపంచంలో కవిత్వం కాలం చేస్తుందా? రాయడం, పత్రికాధిపతుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, జీతపు రాళ్ళను కరిగించి ప్రెస్‌ చుట్టూ తిరగడం, ఆవిష్కరణకు అందరి కాళ్ళు పట్టుకోవడం, కష్టపడి కాపీలను పంచడం, రివ్యూల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం కవుల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుందా?

సంస్కృత సమాసభూయిష్ట దుర్గంధసౌధాల్లోంచి, కులమతాల సంకుచిత చిదంబర రహస్య గదుల్లోంచి, ఆధిపత్య అణచివేత సంకెళ్ళనుంచి కవిత్వం నూత్న యవ్వనాన్ని సంతరించుకొని నిలబడుతుందా? వ్యక్తివాద కీర్తికండూతి శాలువాల్ని చింపుకొని, ప్రలోభ శకలాలకు శవపేటిక సిద్ధం చేసి, మాసిపోయిన కాలాలమీద, పాకురు పట్టిన కళాల పాళీలమీద మరింత ఉత్తేజపు వెలుగును ప్రసరిస్తుందా? ఒక విశ్వమానవున్ని జెండాగా ఎత్తిపట్టి, చిట్టచివరివాని ఆకాంక్షల ఎజెండాని భుజానికెత్తుకొని కష్టజీవికి నలుదిక్కులా (ఇరువైపుల మాత్రమే కాదు) నిలబడుతుందా? వాక్యాల కీళ్ళు విరిచి పాదాలుగా పేర్చి ఇదే కవిత్వమనే బుకాయింపునుంచి తన్ను తాను కాపాడుకుంటుందా? తిట్లదండకాన్ని పక్కన పెట్టి, బూతురోతకు గీతం పాడి స్వానుభవాల్ని సమిష్టి అనుభూతుల సత్కళగా తీర్చిదిద్దుకుంటుందా?

కవులు మరణిస్తారు.కాలం కరిగి పోతుంది.విలువలు మారిపోతాయి. కాని ఎవరో ఒక ఆంగ్ల కవి అన్నట్టు ‘కవిత్వం కాక్రోచ్‌ లాంటిదే’. అది అంత తేలిగ్గా అంతర్ధానం అవ్వదు. అది అస్తిత్వ ఉద్యమాల్ని అక్కున చేర్చుకుంటది. అంతర్జాతీయ అక్రమాల్ని, అణచివేతల్ని ధిక్కరిస్తది. సందిగ్ధానికి లోనైన సమాజానికి దిశానిర్దేశం చేస్తది. ఎన్ని లోపాలున్నప్పటికీ అది అంతిమంగా ప్రజల పక్షాన నిలబడుతది. “Literature and art are for oppressed people not for any of the other group” అనేది నిరూపిస్తది.

ఇదిగో తెలుగు సమాజంలో అట్లాంటి పాత్ర నిర్వహిస్తున్న కవిత్వాన్ని, కవుల్ని ఒక్కసారి మననం చేసుకుందాం. రైతు బిడ్డను కదా! చిన్నప్పుడు కొట్టనంపు రామయ్య పటేలుతో పాటు ‘పడుగు’ పెట్టి, బంతి తొక్కించి నువ్వు గింజలు రాసి పోసినట్టే ఈ పంటల పండుగ(సంక్రాంతి) నుంచి సాహిత్య ‘పడుగు’ ద్వారా కవిత్వపు గట్టి గింజలనేరుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ‘పడుగు’ మన ‘వాకిలి’లో ఫిబ్రవరి 2014 సంచిక నుంచి..

నా ఉద్విగ్న మానస సంభాషణ
నాకు భాషమీద, భాషకున్న పరిమితులమీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలు చుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. నా మిత్రులు ,కుటుంబ సభ్యులు చాలా మంది తరచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు.

అదేమంటే ‘నువ్వు కవిత్వమెందుకు రాస్తావ’ని. బహుశా ఇదే ప్రశ్న కొన్నిసార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడ చెప్పుకుంటూ వుంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనమెందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరపున నియమించుకున్న లాయర్‌ నా కవిత్వం.

“సహజ మానవునికి, సమిష్టి మానవునికి మధ్య వైరుధ్యమే కవిత్వం ఆవశ్యకత, మన ఆర్థిక కార్యాచరణే కవిత్వం అంటాడు క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌. వెంటనే మీరు మరో ప్రశ్న వేయవచ్చు. ఈ వాదన వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి?” అని. అవును మనం ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. కవులు అనధికారిక శాసనకర్తలు (unacknoeledged legislators)-P.B.shelly. “only the poet can look beyond the details and see the whole picture” అంటూ సమాజంలో కవుల ప్రాధాన్యతను అనేక రకాలుగా చెప్పారు. సామాజిక భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే కళాకారుడు రచయిత. మనిషి అంతరంగంతో సంభాషించి మానవత్వపు పరిమళాన్ని వెదజల్లేవాడు రచయిత. ప్రపంచంలో అనేక గొప్ప మార్పులు సాహిత్యం వల్లనే సాధ్యపడ్డాయి.

ఒక భూస్వామ్యసమాజంలో రెవెన్యూ అధికారిగావుండి ,వ్యసనపరుడై అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పేద ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదుకదా! సాహిత్యం చదవడం అనే ఒకే ఒక మంచి వ్యసనం వల్ల అతను జనరల్‌ ఛూటేగా మారి జనచైనా జనం గుండె చప్పుడయ్యాడు. భగత్‌సింగ్‌ వీలునామాలో జైలుజీవితానికి ముందు తాను ఒక పుస్తకం చదివివుంటే కనుక అసెంబ్లీలో బాంబులు వేసే ఉగ్రవాద చర్యకు పాల్పడి ఉండేవాడిని కాదని అంటాడు. ఆ పుస్తకం లెనిన్‌ రాసిన ‘స్టేట్‌ అండ్‌ రివల్యూషన్‌’. బహుశా అదే జరిగివుంటే భారత దేశ చరిత్రగతి ఇంకో రకంగా ఉండేదేమో! ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. నన్ను నేను మానవీయ విలువలతో నిలబెట్టుకోవడానికి సాహత్యం చదువుతాను.

మానవుని ఆవేశాలను పోగుచేసి, సహజాతాలను సిద్ధం చేసి సమిష్టి కార్యాచరణకు పురిగొల్పే గుంపు పండగల్లో కవిత్వం పుట్టింది. వర్గవిభజన లేని సమాజంలో శ్రమ సమిష్టి శ్రమగా ఉండేది. కవిత్వం సమిష్టి భావనగా మనుగడ సాగించేది. వర్గ సమాజంలో సంపదని, అధికారాన్ని కైవశం చేసుకున్న వర్గం శ్రమనుంచి కవిత్వాన్ని దూరంచేసింది. అంత:పుర బందీని చేసింది. తెలుగు కవిత్వం పరిణామక్రమంలో అంత:పుర బందిఖానాల్లోంచి తప్పించుకొని, రాజప్రసాదాల్లో సాగిలబడ్డ స్థితిని దాటుకొని , వ్యాకరణాల సంకెళ్ళని, ఛందోసర్పపరిస్వంగాలని విడిపించుకుని ఆధునిక కవిత్వమై నిలబడ్డది. ఆధునిక కవిత్వం ఒక స్పష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథంతో నడుస్తున్నది. నేనెక్కువగా రాజకీయాలు మాట్లాడుతుంటానని నా మిత్రులు నా మీద ఆరోపణలు చేస్తుంటారు. ఒక విలేఖరి ఇదే మాట అంటే, నోబల్‌బహుమతి గ్రహీత, కొలంబియా మేటి రచయిత గేబ్రియల్‌ గార్సియా మార్క్వెజ్‌-’ఈ సందిగ్ధకాలంలో నేను కొలంబియాలో జీవిస్తున్నాను కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడాల్సి వుంటుంది’ అన్నాడు.

ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మాన్ని సమూలంగా నిర్మూలించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడానికి పురిగొల్పే క్రియలో ఉత్ప్రేరకాలుగా రచయితలు ఉండాలి కదా! ఈ నాటి పరిస్థితులల్లో సామ్రాజ్యవాదాన్ని, ఆర్థిక ప్రపంచీకరణని, సాంస్కృతిక ప్రపంచీకరణని ఎదుర్కొనే ఉద్యమాలలో సూదిలో దారంలాగా రచయితలు ఉండాలి కదా! సామ్రాజ్యవాదుల ఆయుధ సంపత్తి పౌరసమాజాన్ని నోరెత్తకుండా చేస్తే, డబ్లుటివో,వరల్డ్‌బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలను కొల్లగొడుతున్నాయి. ప్రసారసాధనాలు, నాన్‌ సీరియస్‌ సాహిత్యం పలాయనవాద వ్యక్తిత్వాన్ని సమకూర్చుకొమ్మని ఉద్భోదిస్తున్నాయి. వ్యక్తివాదం,వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిచేతన అనేవి సమిష్టిభావ సంస్కృతిని నాశనం చేస్తున్నాయి.

ఈ విషయాల్ని కొద్దిసేపు ప్రక్కనపెట్టి నా వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావిస్తాను. అరవై ఎనిమిది ఎకరాల పట్టేదారు, ముప్పై ఎకరాల ఆసామి కొట్టనంపు రామయ్య పటేలు, సత్తెవ్వల కడగొట్టు సంతానంగా నల్లగొండ జిల్లా బొందుగుల గ్రామంలో 1966(?)లో జననం. ఆర్థికమాంద్యం, అత్యవసర పరిస్థితి కలిసి బాల్యం మీద చేసిన దారిద్య్రపు గాయాల మచ్చలింకా మానలేదు. పచ్చజొన్న పిసికిళ్ళు ప్రాణాలు కాపాడుతున్న కాలంలో చెలరేగిన కరువుకు ఒక్కొక్క ఆవు తోకలు పట్టి లేవట్టించుకుంటూ దొడ్డి ఖాలీ చేసి వెళ్ళిపోతున్న దౌర్భాగ్యం. ఇంటికెదురుగావున్న మేనమామ కూతుళ్ళు అందంగా, ఆరోగ్యంగా,ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళతో పోల్చుకుంటూ అక్క కన్నీళ్ళు పెట్టుకుంటున్న దృశ్యం ఇంకా చెరిగిపోలేదు. అమ్మ,బాపుల నిరంతర చాకిరికి గుండె చెదిరి అప్పుడప్పుడూ పశువులకాపరిగా, మోటగొట్టే మోతుబరిగా, మోకాలు లోతు బురదలో నాగలిదున్నే ఆసామిగా నా బాల్యం ఇంకాపచ్చి పచ్చిగానేవుంది. తండ్రి ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయుడు కాబట్టి ఆ వచ్చే నెలవారీ జీతంవల్ల నా సహాధ్యాయిని, మేనమామ కూతురు సుఖంగా, ఏలోటూ లేకుండా చదువుకోగలుగుతందని గ్రహించి కసిగా చదువును ‘ఇరువాలు’ దున్నిన సాహసం. ఆ కసే ఏడవ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిపింది. అప్పుడు నా ఉపాధ్యాయుడు చూపిన దారి,తెలంగాణలోని ఒకేఒక్క గవర్నమెంటు రెసిడెన్సియల్‌ స్కూలైన సర్వేల్‌లో స్థానం కల్పించింది. అది నాకు విశాల ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇతర రచయితల అంతరంగాల్ని ఇదిగా నేనెప్పుడూ చదవలేదు. నా రిదీదీలిజీ ఖీళిరిబీలి ని నేనెప్పుడూ తొక్కి పెట్టలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక విశాలమైన లైబ్రరీని చూసి, నాకు అనుభవంలేని జీవితాన్ని అక్కడి నవలల్లో చదువుతున్నప్పుడు నాకు ఆ కొత్తలోకం బాగా నచ్చేది. అట్లా సాహిత్యం పట్ల కలిగిన ప్రేమ సామాజిక అసమానతల పునాదిని పరిచయం చేసింది. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో వింటున్న పాటల పరిచయం వల్ల లయాత్మక కవిత్వం నన్ను అమితంగా ఆకర్షించింది. అట్లా నాదే అయిన లోకాన్ని నేను సృష్టించుకున్న. స్నేహాలు, సినిమాలు, తిరుగుళ్ళు నా జీవితంలో చాలా తక్కువ. సాహిత్యాన్ని ఆలంబన చేసుకొని ఎదుగుతూ వచ్చాను. కవిత్వం లాంటదేదో రాయడం పదవతరగతి నుంచే ఆరంభమైంది.అప్పుడు నేను వాడుతున్న లక్సు సబ్బు వాళ్ళింట్లో కుక్కలకు మాత్రమే వాడుతారన్న మిత్రుడి మాటలు చేసిన గాయం ఇంకా మానలేదు. తరగతి గది సంతృప్తినివ్వలేదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిన అద్భుతమైన గ్రంధాలయం నాకు ఆప్తమైంది. గబన్‌,దేవదాసు,బలిపీఠం,ఈ దేశం నాకేమిచ్చింది?, నీ బాంచెన్‌ కాల్మొక్త ఇట్లా ఎన్నని చెప్పను? దాదాపుగా మొత్తం గ్రంధాలయాన్ని చదివేశాను. తరగతిగదిలో తెలుగువాచకంలో దాచుకొని ‘పెంకుటిల్లు’ చదువుతున్నప్పుడు శ్రీధర్‌ సారు కొట్టిన దెబ్బ చెంపమీద మిగిలేవుంది. దాదాపు ఇదే సమయంలో మహాప్రస్థానం, భారమితి, మండేసూర్యుడు, నాదేశం నాప్రజలు,ఆగమగీతి,మైదానం,ప్రేమలేఖలు, కాలాతీత వ్యక్తులు, మరీచిక, రాజు-మహిషి, శిలాలోలిత లాంటి మంచి సాహిత్యాన్ని నాకు పరిచయం చేసిన మా చిన్నన్న కాసుల ప్రతాప్‌రెడ్డి నా రచనా వ్యాసాంగానికి మొదటి గురువు. ఆనాటికే పుష్పవిలాపం,కుంతీవిలాపం, మహాప్రస్థానం చలం పీఠికతో సహా కంఠతా చెప్పగలిగిన స్థాయి నాది.

నాగార్జునసాగర్‌లో ఇంటర్మీడియట్‌ చదివిన రెండు సంవత్సరాల కాలంలో రుద్రవీణ,తిమిరంతో సమరం, చరమరాత్రి కథలు, శృంగార నైషధం,పోతన మహాభాగవతం, భారతి పత్రికలతో సహవాసం. ఒక అమూర్త సమసమాజ ఆకాంక్షల ప్రతినిధిగా మిత్రుల గర్తింపు, పరాచికాలు. నెహ్రూ, దీపావళి, ఉగాదిల మీద ఛందోబద్ధ కవిత్వం, సామాజికాంశాల మీద వచనకవిత్వం, పట్టు సడలిన విక్రమార్కుడు కథలోలె కొన్ని ప్రిమిటివ్‌ రచనలు. అది ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో చేరేనాటికి ఒక స్పష్టతని సంతరించుకున్నది. కవిత్వం జీవితంలో విడదీయరాని భాగమైంది. కాని, వైద్య విద్యార్థులకు ఇట్లాంటి వ్యాపకాలకు సమయం దొరకదు. అనాటమీ చదవాలా, అనాటమీలో ఫెయిలైన కేశవరెడ్డి అంతరంగం(సిటీ బ్యూటిఫుల్‌) చదవాలా అన్న మీమాంస. వ్యక్తి ఎదుగుదలకు స్వేచ్ఛనివ్వని వ్యవస్థలో జీవిత ఆకాంక్షలకి, బ్రతుకుదెరువుకీ మధ్యవున్న వైరుధ్యాన్ని పరిష్కరించుకోలేక వైద్యవృత్తిని స్వీకరించి, పిల్లల వైద్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసి పీకలలోతు కారిరిజంలో మునిగిపోయిన కాలంలో నా వెన్నుతట్టి 1997లో నా మొదటి కవితాసంకలనం ‘జలపాతశబ్దంలోకి’ ని వెలుగులోకి తెచ్చిన చిన్నన్న ఇప్పటికీ నాకు ప్రేరణ. ఈ మెత్తం కవిత్వం నేను అంతకుముందు హైదరాబాద్‌లోఉస్మానియా మెడికల్‌ కాలేజిలో చదువుతున్నప్పుడు రాసింది. ఆ కాలంలో కె.శివారెడ్డి, వి.వి.నారాయణ స్వామి, విమలల సాంగత్యం నాకు వచన కవిత్వం మీద పట్టును పెంచింది. విద్యార్థి ఉద్యమాలతో సాన్నిహిత్యం స్పష్టమైన సామాజిక,రాజకీయ దృక్పథాన్నిచ్చింది. విస్తృతంగా చదువుకునే అవకాశాన్ని, ఆవశ్యకతనీ కల్పించింది.

1994 నుండి జనగామలో పిల్లల వైద్యంలో మునిగి కాలంతో పోటీపడుతూ, వృత్తికీ-ప్రవృత్తికీ మధ్య ఎండనీడల ఆటాడుతూ నన్ను సంపూర్ణంగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా నా రెండో కవితా సంకలనం ‘ఎన్నాద్రి’ 1997 లో వచ్చింది. నూతన ఆర్థిక విధానాలు కొనసాగుతున్న ఈ కాలంలో విప్లవ సాహిత్యానికి ఒక నమూనాగా ఎన్నాద్రి నిలబడిందని విమర్శకులు కొనియాడిన సంకలనం అది. ‘రోగాల్ని నయం చేయడంకాదు ఇప్పుడు కావాల్సింది, రోగాల్ని సృష్టిస్తున్న ఈ వ్యవస్థని మార్చడం’ అన్న డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌, డాక్టర్‌ కోట్నీస్‌లు నా ఆదర్శం. కళ కళకోసం కాదు, కళ సామాజిక ప్రయోజనం కోసమని నినదించి దారులు తొక్కతూ తెలుగు సాహిత్యానికి మార్గనిర్దేశత్వం వహించిన మహాకవి శ్రీశ్రీ నాకు ఆదర్శం. ఈ ఆదర్శాల వెలుగుల్లో నన్ను నేను మైక్రోస్కోపు కింద పెట్టుకుంటే ‘Health for all by 2000A.D.’  విఫలమై ప్రజారోగ్యం గాలిలో దీపమైన చందం నా ‘అందని చందమామ’ అయింది. ఈ దీర్ఘ కావ్యం 1998 లో విడుదల అయ్యింది. ఒక ఇన్‌సైడర్‌గా వైద్య వ్యవస్థ మీద ఇది తొలి కావ్యం.

మెదడు పొరలకంటిన ‘రక్తాశ్రువులు’, కోట్నీస్‌ అమర్‌ కహానీ నన్ను ఏదో ఒక దానికి పరిమితం కానివ్వలేదు. రాయాలనెప్పుడూ నేను కవిత్వం రాయలేదు. నా ఉద్వేగాల్ని, దుఃఖాల్ని, ఒంటరితనాన్ని ప్రకటించడానికి కవిత్వం రాశాను. అసమ సమాజంలోని దుర్మార్గాన్ని, అహేతుకతను సహించలేనప్పుడు రాశాను. దాదాపు రెండేండ్లు ఒక్క కవిత కూడా రాయకుండా ఉన్న నేను మా బాపు చనిపోయినప్పుడు మళ్ళీ రాశాను. రెండేండ్ల నా కొడుకును కాన్వెంట్‌ చదువుల నిమిత్తం నాకు దూరంగా హైదరాబాద్‌లో ఉంచాల్సివచ్చినప్పుడు రాశాను. క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ అన్నట్టు అదంతా నా ‘ఉద్విగ్న మానస సంభాషణే’. ఇంటర్మీడియట్‌ తర్వాత తెలుగు వచనం రాయడం మర్చిపోయిన నాకు తెలుగు కథకులను, నవలకారులను చూసినప్పుడో, విమర్శకులను చూసినప్పుడో అబ్బురమనిపించేది. ఇంత పగడ్బందీగా అక్షరాల్ని ఎట్లా పేరుస్తారా అని ఆశ్చర్యం వేసేది. academic గా తెలుగు సాహిత్యాన్ని చదువుకోలేదన్న ఒక complex నాలో వుండేది. అట్లాంటి సమయంలో శ్రీరామకవచం సాగర్‌ కొంత ఒత్తిడి చేసి రెండు పుస్తకాల మీద సమీక్షలు రాయించి ‘ప్రకృతి సాహితి’లో వేసుకున్నడు. బాగా రాశానని complaints పొందుతున్న సందర్భంలో ఒక లబ్ధప్రతిష్ఠుడైన కవి యొక్క కవితాసంపుటిని సమీక్ష చేయమన్నడు. బలహీనమైన కవిత్వముందని చెప్పాల్సి వచ్చి, అదే రాశాను. అది ఇప్పటికీ వెలుగు చూల్లేదు. తెలుగు సాహితీకారులకు విమర్శని అంగీకరించే ప్రజాస్వామిక దృక్పథం లేదని అర్థమయ్యింది. చాలా కాలందాక మళ్ళీ విమర్శ తెరువు పోలేదు.

మా అన్న కాసుల ప్రతాపరెడ్డి ‘గుక్క’ కవితాసంపుటిలో మా ఇద్దరి ఉమ్మడి అనుభవాలు కొన్ని వ్యక్తమైనవి. చాలా కాలం తర్వాత భిన్నమైన కవిత్వాన్ని చదివినట్టనిపించింది. నా అభిప్రాయాల్ని వ్యక్తం చేయాలనిపించి, రాసి ‘చినుకు’కు పంపాను. వైద్యవృత్తి నిత్యం అశాస్త్రీయ ఆలోచనతోటి, మూఢ నమ్మకాలతోటి ప్రజలు ఎట్లా ఇబ్బందుల పాలౌతున్నారో చూసే అవకాశం కల్పించింది. ‘తెలుగు నవల-వ్యాపారధోరిణి’ లో యండమూరి కక్షుద్ర సాహిత్యంమీద విరుచుకు పడ్డ ప్రతాపన్న ‘ఎల్లమ్మ’ కథలో చూపిన ముగింపు, దానిమీద అంపశయ్య నవీన్‌, దార్ల వెంకటేశ్వర్‌ రావు చేసిన వ్యాఖ్యానాలు చూసినంక ఖచ్చితంగా నా అభిప్రాయాల్ని చెప్పాలనిపించింది. బహుశ, కాసుల ప్రతాపరెడ్డితో నాకు సంబంధం లేకుంటే రాసేవాడిని కాదు కావచ్చు. తర్వాత మళ్ళీ 2011 దాకా నేను వచనం తెరువు పోలేదు.

వచనం రాయడానికి కావాల్సిన ఎడతెరిపి నా వృత్తి నాకు కల్పించలేదు. అదే సమయంలో కవిత్వం మీద తప్ప నాకు వచనం మీద ఆసక్తి కలుగలేదు. సుంకిరెడ్డితో వున్న సాన్నిహిత్యం వల్ల, అతని కోరిక కాదనలేక ‘తెలంగాణ చరిత్ర’ ను సమీక్షించాను. అది చూసిన ‘కందెన’ వెంకట్‌ రెడ్డి కోరిక మేరకు ఒకట్రెండు రాజకీయ వ్యాసాలు రాసిన. శ్రీశ్రీ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన కవి శివసాగర్‌ చనిపోతే రాసిన. నిజానికి అంతకు మందే ‘జనగామ రచయితల సంఘం’ సభ్యుల అవగాహన కోసం శివసాగర్‌ మీద రాయాలనే ఆలోచనతో వుంటి. సాహిత్య సమావేశాల్లోను, సాహిత్య పత్రికల్లోను అకవిత్వం పాలు ఎక్కువైనప్పుడు, కవుల్లో భావదారిద్య్రం చూసినప్పుడు ‘ఆధునిక వచనకవిత్వంలో వస్తు,శిల్పాలు’ రాయాలనిపించింది.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో వచ్చిన మంచి సంకలనాలను(తెలంగాణ కవిత, మునుం,జులూస్‌) పరిచయం చేయాలనిపించి కొంత, సంపాదకుల కోరిక మేరకు కొంత సమీక్షలు రాయడానికి కారణమైనవి.కథలు రాయాలనిపించినా కవిత్వానికే పరివితమౌదామనే, గత పదేండ్లుగా నా అనుభవాల్ని కథలకు ప్లాట్‌గా వాడుకొమ్మని ప్రతాపన్నకు చెపుతుండే వాన్ని. నేను చెప్పినదేదీ తను రాయలేదు. ఇప్పటికి (2012) వచనం రాయగలననే నమ్మకం కుదిరింది. పెండింగ్‌ ప్లాట్స్‌ను కథలుగా మలుస్తున్నా. నేను రాసిన మొదటి కథ ‘ముసుగు’ ముంబైవన్‌ పత్రిక నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ‘ప్రయాణం’ ‘సాంకేతిక దోపిడి’ కథలు విమర్శకుల ప్రశంసలు పొందినవి.

వివిధ వేదికలమీద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల విశ్లేషణలతో ప్రసంగాలు చేయడం జీవితంలో ఒక భాగమైంది. సాహిత్య తపనతో జనగామలో ‘జనగామ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి, గౌరవ అధ్యకక్షుడిగా కొనసాగుతున్నాను. మనుషుల్ని, సమాజాన్ని మార్చేది సాహిత్యమేనని నా ప్రగాఢ విశ్వాసం.

సాహిత్యకారులతో సజీవ సంబంధాలంటే ఇష్టం. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో మిత్రులతో కలిపి నెలకొల్పిన 100 పడకల అధునాతన ‘APEX HOSPITALS’ MANAGING DIRECTOR గా తీరిక లేని కాలాన్ని గడుపుతున్నాను.

“మనిషి దూడను స్టేటస్‌ కొయ్యకు కట్టేసి

బతుకు పొదుగునుంచి డబ్బుల్ని పితుకుతన్నప్పుడు

విలువల ఎన్నాద్రై గుండె ఆకలి తీర్చిన

కవిత్వానికి దండంపెడతా-

ఎడారి బతుకులో

ఆశల నారుమడి ఎండి నెర్రెబారుతున్నప్పుడు

గుండె చెరువు నిండి

కన్నీటి అలుగుదుంకిన

కవిత్వానికి దండంపెడతా.” (ఎన్నాద్రి)

(2013 సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు అందుకుంటున్న సందర్బంగా)

నేను తెలంగాణను – 4
నాలుగు పాదాల ధర్మాన్ని

నాలుగు వందల ఏండ్ల నుంచి నిలబెట్టిన

భాగమతి ప్రేమ ప్రతీకను

కులీ కలల పుత్రికను

అనారోగ్య పీడనలనుంచి రక్షించే

ఉమ్మీద్‌వార్‌ను

నేను చార్మినార్‌ను

నేను హైదరాబాద్‌ను.

యురోపియన్‌ మొగలాయి

సంగమ కళతో

ఉత్తర దక్షణాల్లో

సలాబత్‌ జంగ్‌ పుదిచ్చిన

నాలుగేసి మహల్‌లను

చౌమల్లా ప్యాలెస్‌ను

నేను హైదరాబాద్‌ను.

వందమందిని ఒక్కసారి ఒదిగించుకునే

రోజ్‌వుడ్‌ మేజా బల్లతో

పాలరాతి పదసోపానాలతో

వెనెటియన్‌ షాండిలియర్‌లతో

వికార్‌ వుల్‌ వుమ్రా స్థిరపరిచిన

ప్రపంచ ధనైక నవాబు

అతిథి గృహాన్ని

ముఖరంజా ముద్దుబిడ్డడి ఆస్తిని

ఫలక్‌నుమా ప్యాలెస్‌ను

నేను హైదరాబాద్‌ను

మహబూబ్‌ అలీ

విలాసాల మస్సారత్‌ మహల్‌ను

పురానీ హవేలీని

నేను హైదరాబాద్‌ను

హోప్‌, నూర్‌ ఉల్‌ ఐన్‌

రిజెంట్‌, కోహినూర్‌ వజ్రాలగనిని

మధ్యయుగపు మహిమాన్విత నిర్మాణాన్ని

ఒక కాంతి సముద్రాన్ని

శత్రు దుర్భేద్య దుర్గాన్ని

నేను గోలుకొండను

నేను హైదరాబాద్‌ను

ది బెస్ట్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా

మీర్‌ యూసఫ్‌ అలీఖాన్‌ పొందుపరిచిన

దేశ చరిత్ర వర్తమాన దర్పణాన్ని

వెల్డ్‌ రెబెక్కా, మ్యూజికల్‌ క్లాక్‌

వింతల సమాహారాన్ని

సాలార్‌జంగ్‌ మ్యూజియాన్ని

నేను హైదరాబాద్‌ను.

పెట్టుబడుల

పుట్టగొడుగు మందిరాలకు నెలవైన

నౌవత్‌ పహాడ్‌ను

నేను హైదరాబాద్‌ను.

గోలుకొండ గొంతు తడిపిన

తటాకాన్ని

దుర్గం చెరువును

నేను మైదరాబాద్‌ను

కుతుబ్‌షాహీ

అసఫ్‌జాహీ వంశవారధిని

హుస్సేన్‌షా వలీ చేతిల

విరబూసిన తామరను

హుస్సేన్‌ సాగర్‌ను

నేను హైదరాబాద్‌ను.

‘రక్తం రుచిమరిగిన రాజు’ గా

చిత్రిక కట్టబడ్డ

నిజాం నిర్మించిన

జంట జలాశయాలం

నగర దాహార్తి తీర్చే

ఉస్మాన్‌ సాగర్‌ను, హిమాయత్‌ సాగర్‌ను

నేను హైదరాబాద్‌ను

మక్కా ఇటుకల

మహిమాన్విత మసీదును

నగర కలికితురాయిని

నేను హైదరాబాద్‌ను

పఠాన్‌, పార్సీ,హిందూ

కళా సంగమమంలో వెలిసిన

అద్భుత కట్టడాన్ని

నగర సిగ పువ్వును

కుతుబ్‌షాల సమాధిని

నేను హైదరాబాద్‌ను

వలస పాలకుల గుండెల మీద

ఎగిరి తన్నిన

తుడుం ఖాన్‌ను

మరో భగత్‌సింగ్‌ను

తుర్రేబాజ్‌ ఖాన్‌ను

నేను హైదరాబాద్‌ను

మతాల కఫన్‌ను చింపుకొని

ప్రజల పక్షాన కలం ఝుళిపించి

ఇమ్రోజ్‌ కొరకు

రక్తం ధారపోసిన

షోయబుల్లా ఖాన్‌ను

నేను హైదరాబాద్‌ను.

కలల ఉల్లారబోసుకునే

లిబర్టీని, సంగీత్‌ను

జమ్రుద్‌ను, నవరంగ్‌ను

దిల్షాద్‌ను, నేను దిల్‌దార్‌ను

నేను హైదరాబాద్‌ను

తీరొక్క జబ్బుల నయం చేసే

తీరొక్క చికిత్సల నెలవులం

నేను జజ్జిఖానాను

ఇయన్‌టిని, దారుషిఫాను

బొక్కల దవాఖానాను, ఛాతీవైద్యశాలను

ఉస్మానియాను, కోరంటిని

ముఖ్యంగా నీలోఫర్‌ను

నేను హైదరాబాద్‌ను

పారిశ్రామిక విప్లవ ఫల

అనుకరణను

నేను సింగరేణిని, ఆల్విన్‌ను

హెచ్‌ఎమ్‌టిని, ఐడిపియల్‌ను

ప్రాగాటూల్స్‌ను

నేను హైదరాబాద్‌ను

రాజుకు ప్రజలకు మధ్య

పరుచుకున్న వారధిని

విస్తరించిన భవిష్యత్‌ దిక్సూచిని

నగర కొత్వాల్‌ను

రెడ్డి హాస్టల్‌ను,లేడీ కాలేజీని

బాలికల పాఠశాలను

బహుముఖ ప్రజ్ఞను

నేను సర్‌ బహదూర్‌ను

నేను హైదరాబాద్‌ను

వసుధ మీద

తొట్టతొలిగా

విశ్వవిద్యాలయ విద్యను

మాతృభాషలో బోధించిన

చదువుల ఒడిని

నేను ఉస్మానియాను

నేను హైదరాబాద్‌ను

అనంతగిరి పర్వత శ్రేణుల్లో పుట్టి

హొయలు పోతూ, వంకర్లు తిరుగుతూ

ప్రజల దూప తీర్చ

నగర నడిబొడ్డన పొంగిన తడిని

నేను ముచుకుందను

నేను హైదరాబాద్‌ను

బోనమొండి

యాపమండ చేతబూని

రంగం సిద్ధం చేసి

బయిలెల్లితె

మహంకాళి జాతరను

భవిష్యవాణి వినించే అమ్మను

నేను హైదరాబాద్‌ను

దట్టిగట్టి, కుడకల పేర్లు కట్టి

దరువులేసి

ఊరేగింపై సాగి

అగ్ని గుండంల అస్సోయి దూలా ఆడే

పీరీల పండుగను

నేను హైదరాబాద్‌ను

నా తండ్రి కులీ కలగన్న తటాకాన్నై

నానా జాతి చేపల నాలోకి ఒంపుకున్న

గంగ జమున తహజీబ్‌ను

సమభావ సాంస్కృతిక ప్రతీకను

నేను హైదరాబాద్‌ను

నేను తెలంగాణను.

ప్రజలే విజేతలు
నా కనురెప్పల మీద పూచిన

ఒక ఆకుపచ్చని కల

శిశిరావరణంలో నేలరాలింది

అనేక వసంతాలుగా గట్టిపడ్డ

నాలుగుకోట్ల సామూహిక చిక్కటి ఆకాంక్ష

ఆధునిక శకుని అహంకార పాచికలకు

అడవి కాచిన వెన్నెలైంది

అవినీతి బురదలో మునిగి

అహంకార కళతో తంటుకొని

కుటిల ఇటలీ మన్మోహన గానం

అబద్దపు ఏకాభిప్రాయ చిదంబర రహస్యమైంది

మళ్లీ మళ్ళీ వంచించబడుతున్న నేల మీద

దారులెవ్వీ గమ్యాల్ని చేర్చడం లేదు

కులమతాల వెన్నెముక మీద గుద్ది

అవిప్పుడు పోరుపంక్తి భోజనశాలలైనవి

కాలం వసంతాల్ని కౌగలించుకునే వేళ

ధూంధాం దరువుల తెలంగానం తప్ప

కోయిల కూజితాల జాడ లేదు

జ్ఞానపు ఎన్నాద్రి కోసం

అక్షరాల్ని ఇరువాలు దున్నే విద్యాలయాలు

టిగ్గర్‌ మీద వేళ్ళతో

ఉద్యమ యుద్ధభూములైనవి

అన్యాయపు రాబందు రెక్కల్ని

నిత్యం వాదాల కరవాలాలతో నరికే నల్లకోటు

సామాజిక న్యాయం కోసం

పార్లమెంటు ముంగిట నిరసనల పిడికిళ్ళెత్తింది

అంటుకుంటున్న దేహాల కొలుముల్లో

సానపెట్టబడ్డ కళాల పాళీలను

మత్తడివడ్డ గుండె చెరువులో ముంచి

ఉద్యమ గీతాలల్లుతున్నరు

కవులు ఉద్వేగ దారుల్ల నడుస్తున్నరు

చరిత్ర పునాదులు తవ్వి

కొత్త సత్యాల్ని కనుగొంటున్నరు

తెలంగాణ వైతాళికుల్ని నిలబెడుతున్నరు

అణచివేత సాధనాలు

క్రొత్తగా హృదయాల్ని తొడుక్కొని

సహాయ నిరాకరణతో

రాజ్యాన్ని ధిక్కరించినవి

గోసిపోసి, గొంగడి భుజానేసి

పల్లె పోరు పట్టాలెక్కింది

మీసాలు మెలేసిన రైలు

ఉషారు ఉడిగి ఉట్టి బొమ్మైపోయింది

బారికేడ్లు బద్దలు కొట్టి

నిషేధాజ్ఞలు ధిక్కరించి

మిలియన్‌ మార్చ్‌

టాంకుబండును విముక్తం చేసింది

యుద్ధభూమిన నిలబడ్డ కాలం

తన అంతిమ తీర్పు ప్రకటిస్తున్నది

ప్రజలే విజేతలు

ప్రజలే చరిత్ర నిర్మాతలు

కొత్త పొద్దుకోసం

కొంత రక్తాన్ని ధారపోస్తరు

తెలంగాణ నూత్న శిశువుకు

పురుడు పోస్తరు.