వాకిలి » బబ్లూ

బబ్లూ గాడి బుక్ రివ్యూ
చెప్పింది: బబ్లూ

రాసింది: వాళ్ళ డాడీ

ఈ పెద్దోళ్ళకన్నీ తెలుసని వాళ్ళనుకొంటారు. కానీ వాళ్ళకేమీ తెలీదని నాకు మాత్రమే తెలుసు. అ విషయం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళింకా నమ్మలేదు.

లేపోతే చూడూ!

నేను పుట్టానో లేదో గొల్లపూడి వాళ్ళేసిన కాశీ మజిలీ కథలు పేద్ద పేద్దవి ఆరు పుస్తకాలూ, కథా సరిత్సాగరం, రంగుల ఎన్‌సైక్లోపీడీయాలూ, ఈసఫ్ , జాతక , భేతాళ, ప్రపంచ కథలూ, రామయణ, మహా భారతాలూ , ఇంకా టాం సాయర్ లాంటి బండెడు పుస్తకాలు ఓ బీరువా నిండా పేర్చిపెట్టాడు మా నాన్న.

నాకప్పటికి ఏబీసీడీ లు రావు. అందుకే “నాన్న” అనేవాడిని. మూడేళ్ళప్పుడు ఇంట్లో శుబ్బరంగా ఆడుకొంటుంటే ప్లే స్కూల్లో వేసేశారు – అక్కడ బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చని మోసం చేసి. ఇక అప్పటినించీ వాళ్ళని నమ్మటం మానేశాను. వాడిని డాడీ అనటం కూడా మొదలెట్టాను. తప్పు ‘వాడు ‘ అనకూడదు అని క్వీనీ టీచర్ పెద్ద క్లాసు పీకిందిలే. మరి స్కూల్లో ఫ్రెండ్స్‌ను వాడు అనటల్లా? ఆ టీచర్‌కీ బుర్రలేదు.

పెద్దోళ్ళకు ఏమీ తెలీదన్నాను కదూ.

ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏముందో నాకే కాదు, మా డాడీకి అసలే తెలీదు. అసలు చదవటానికి వాడు ఇంట్లో ఉంటేగా! మళ్ళీ ఆఫీసు నుంచి గంటకో ఫోను – బబ్బు గాడేం చేస్తున్నాడని. వాటినెవడు చదూతాడని తెచ్చిపెట్టాడో మరి? నేనన్నా నయం- అప్పుడప్పుడు వాటిలో బొమ్మలు చూస్తుండేవాడిని. కొన్ని పేజీలయితే చింపి పోగులు పెట్టేవాడిని.

ఓ సారేమయిందో తెలుసా?

అర్ధరాత్రి లాప్‌టాప్ బాగ్ పట్టుకొని దొంగలాగా ఇంట్లో దూరబోతున్నాడు ఎప్పట్లాగే! నేను అప్పుడే బాత్రూం నుంచి రెండు బకెట్లు హాల్లోకి లాక్కొచ్చి ఆ నీళ్ళతో స్నానం చేస్తున్నా. వాడికి గుండాగిపోయి కేకలు పెట్టి అందర్నీ నిద్ర లేపాడు- అందుకే ఈ పెద్దోళ్ళకి ఎమీ తెలీదంది – బజ్జున్న వాళ్ళని లేపకూడదన్న విషయం నాకు తెలుసు, కానీ అంత వయసొచ్చినా వాళ్ళకి తెలీదు.

పాపం మా మమ్మీ కొన్ని పుస్తకాలు చదివి ఆ కథలు చెప్పబోయింది గానీ, మనం వింటేగా? వాళ్ళు విని చచ్చారు గనకనా వాళ్ళ పెద్దోళ్ళ మాటలు? కావాలంటే మా అమ్మమ్మనీ , నాయనమ్మనీ అడగండి. అంచేత మనమూ వినక్కర్లేదు.

ఇంతకీ వాళ్ళ పుస్తకాల గోల. వాటిని చదివి గ్యానం పెంచుకోవాలని నాకు పదేళ్ళొచ్చేదాకా ఒకటే నస. ఇంగ్లీషు స్కూల్లో వేసి మళ్ళీ ఇంట్లో మాత్రం తెలుగు పుస్తకాలు చదవాలంట! అసలు వీళ్ళకి బుర్రుందా అని ?

అలా వాళ్ళు ఏడిచీ, గోల పెట్టీ, పానీ పూరీ కొనిస్తామని ఊరించీ, తంతామని బెదిరించీ ఎలాగో మొదటిసారిగా టింకిల్ చదివించి తెగ సంతోషించారు. నేను బొమ్మలు మాత్రమే చూస్తూ పేజీలు స్పీడుగా తిప్పుతున్నానని వాళ్లకు తెలిసి చస్తేగా…

ఆ తర్వాత నేనే పేపరంకుల్ తో చెప్పి టింకిల్ తెప్పించుకొని, చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి స్కూల్లో తక్కువ మార్కులు తెచ్చుకొన్నా వాళ్ళు ఇంకేం అన్లేకపోయారు- వయసు పెరిగిందిగా కొంచెం బుద్దొచ్చిందనుకొంటా.

టింకిల్ వాళ్ళ మహాభారతం తర్వాత సి. రాజగోపాలాచారి రాసిన ‘మహాభారతం’ అడిగి తెప్పించుకొన్నా. రాజగోపాలాచారి తాత అప్పటి మద్రాసు ముఖ్యమంత్రీ, చివరి గవర్నర్ జనరల్ కూడా అంట.

అది చదివి , బోలెడు రీసెర్చ్ చేసి, కౌరవులు వందమంది కాదు 102 మంది అనీ, అందరూ మగవాళ్ళు కాదు- నూట ఒకటో ఆమె దుశ్శల అనీ కనిపెట్టి, అ పేర్లన్నీ వరసగా రాసి చూపించేసరికి మా వాళ్ళకి మతి పోయింది. ఇంకానేమో కౌరవులు అందరూ చెడ్డవాళ్ళు కాదు- వికర్ణ, యుయుత్సు ఇద్దరూ మంచి వాళ్ళని చెప్పే సరికి – ఇక దిమ్మ తిరిగి మైండు బ్లాకయిందనుకో! (అందుకే మరి మహేష్ బాబు సినిమా మొదటిరొజే చూడాలి నాలాగా).

వీడికీ పేర్ల గోల ఎంటో అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నవ్వుతూ ఏడుస్తూ చెప్పుకొన్నారని అక్కడి ఆంటీలు చెప్తే తర్వాత తెలిసింది. వాటినే ఆనంద బాష్పాలు అంటారని వాళ్ళే చెప్పారు. నాలాగే ఆ ఆంటీలకీ వీళ్ళ పుస్తకాల గోలంటే వళ్ళు మంట. అందుకే వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ముందు గదుల్లో పుస్తకాల గోల చేస్తుంటే నేను వంటగదిలో దూరి వాళ్ళతో కబుర్లు చెపుతూ ఉంటాను- తినటానికేమున్నాయా అని వెతుక్కుంటూ.

బయట అందరికంటే చెవులు పగిలేట్టు పుస్తకాల గోల చేసేవాళ్ళలో ఎప్పుడూ ఫష్ట్ వచ్చేది అనిల్ అంకులే.

ఆయన ఓ సారి ‘ఉక్రేనియన్ ష్టోరీస్ ‘ అని ఓ బండ పుస్తకం గిఫ్ట్‌గా ఇచ్చి చదివారా? చదివారా? అని కనిపించిన చోటల్లా కొన్ని వందల సార్లు అడిగే సరికి, మా చిన్నారికి జాలేసి రెండు రోజుల్లో ఆ 550 పేజీల పుస్తకం చదివి పారేసింది. అది ఫోన్‌లో చెప్పేసరికి మొహమంతా వెలిగిపోతూ “మీలాంటి వాళ్ళకోసమే ఇవి డబ్బింగ్ చేశాను ” అని వచ్చి ఇంకో రెండు పుస్తకాలు తెచ్చిచ్చాడు.

అవే ‘రష్యన్ జానపద కథలు ‘.

వాటిని చూసేసరికి భయమేసి చచ్చాను. ఎందుకంటే అవి తెలుగు పుస్తకాలు.

చిన్నప్పుడెప్పుడో మా అమ్మ కష్టపడి తెలుగు నేర్పింది. అప్పుడు పేపర్ చూసి సినిమాల వివరాలు చదివేంత బాగా తెలుగు వచ్చింది. కానీ ఇంకా బాగా రావాలని మా వాళ్ళు ఓ ట్యూషన్ లో చేర్పించారు. ఆ టీచర్ దెబ్బలకి తెలుగు మీద విరక్తి పుట్టి వచ్చినదంతా మరిచిపోయాను.

రెండోదేమో, ఆ పుస్తకాలు చదివి, మళ్ళీ వాటి గురించి మీటింగులో మాట్లాడాల్సింది కూడా మీరే అని కూడా చెప్పి పోయాడు అనిల్ అంకుల్.

చచ్చాం రా బాబూ! అంది చిన్నారి.

తప్పించు కొందామని ఎన్నో ఎత్తులేసాం. అయితే అంతకంటే ఎక్కువ ఎత్తులేసి మా అమ్మా నాన్నా వాటిని చిత్తు చేశారు. ఇక చిప్స్ కొనమనీ , మహేష్ బాబు నానీ సినిమాలు బందనీ మా వీక్నెస్ మీద దెబ్బ కొట్టారు. అలా వాళ్ళకి మాకంటే కొంచెం తెలివి ఎక్కువే ఉందని తెలిసొచ్చింది మొదటిసారిగా.

ఇక్కడో సీక్రెట్ చెప్పాలి. కథలు చదవటం కష్టమే, కానీ వాటి మీద మాట్టాడటం మాత్రం ఇష్టం, మీకు లాగే. చాలా మంది లాగా నాకూ మైకు పిచ్చి ఉందని మా అమ్మ చిన్నప్పుడే కనిపెట్టేసింది. అందుకే చిన్నారి(చిన్నారి అంటే మా చెల్లెలు రాక్షసి) కంటే నేను మాత్రం హాపీ…

పొన్లే, మా టైం ఇంకా రాలేదని కాంప్రమైజ్ అయి ఆ పుస్తకం కొంచెం తెరిచి చూశాం.

ఆసమ్! ఒక్కో కథకూ ఓ రంగుల బొమ్మ. మెరిసే ఆయిల్ పేపర్‌ల మీద పాతిక దాకా అలాంటి బొమ్మలే. ఆ రంగుల బొమ్మలు చూశాక ఇంక కథ చదవాలనిపించింది. ఎలాగో కష్టపడి వచ్చీ రాని తెలుగులో చదవటం మొదలెట్టా. రెండు మూడు కథలు చదివాక మిగతా కథలు చదవటం ఈజీ అయ్యింది.

మీకు నచ్చినా నచ్చకపోయినా అదే చెప్పండి అని అనిల్ అంకుల్ చెప్పటం ఇంకా నచ్చింది. అందుకని కథలన్నీ చదవకముందే కొన్ని పాయింట్‌లు రాసేసుకొన్నా.

ఈ పుస్తకం ఎందుకు నచ్చిందంటే:

- రంగు రంగుల బొమ్మలు. మనం ఓ రంగుల తోటలో నడిచినట్టు ఉంటుంది.

- తెలుగు అంతగా రాకపోయినా నేను చదవటం. ఇంకో సీక్రెట్! మా అమ్మా నాన్నలు తెలుగులో ఏం రాశారో ఇంతవరకూ నేను చదవలేదు. కానీ ఈ పుస్తకం చదవ గలిగాను. “తెలుగు రానట్టు భలే యాక్షన్ చేశావురా ఇన్నాళ్ళూ” అని కుళ్ళుకున్నారు వాళ్ళు.

- రాసిన వాక్యాలన్నీ సింపుల్ గా ఉన్నాయి. అర్ధం కాని కథంటూ ఏమీ లేదు.

- నాకు ప్రేమ్‌చంద్ కథలు రెండు తెగ నచ్చాయి. ఒక మనవడు అమ్మమ్మ కోసం అట్లకాడ కొనే కథ, రెండు ఎద్దులు కలిసి ఓ ఆంబోతుని ఓడించే కథ. ఎందుకో ఈ కథలు చదూతుంటే ఆ కథలు గుర్తొచ్చాయి.

- నాకు కలలంటే ఇష్టం. ఎందుకంటే వాటిలో మనకిష్టమొచ్చినట్టు కలలు కనేయొచ్చు. ఈ కథలు కూడా ఆ కలల్లానే ఉన్నాయి. ఒకో బొమ్మకూ ఒక్కో కల.

- అక్కడెక్కడో రష్యా అనే దేశంలో కూడా మనలాంటి పిల్లలు మనలాగే ఇవీ చదూతారని తెలుసుకోటం.

- చీపురు కట్టల మీద ఎగిరే హారీ పోటర్ ఏడు బండ పుస్తకాల కంటే ఈ కథలు బాగా ఉన్నాయనిపించటం (చిన్నారికి హారీ పోటర్ అంటే ఇష్టమని ఇది రాశానని చెప్పకండి. తెలిస్తే నన్ను గిచ్చి గిచ్చి పెడుతుంది).

ఇంకా ఇలాంటివే నేను ఇంగ్లీషు తెలుగులో రాశాను. అవి చూసి మా డాడీ “నువ్వు చెప్పు, నేను తెలుగు తెలుగులో రాసి పెడతాను” అన్నాడు.

నేనేది చెప్తే అదే రాయాలి, దాన్ని మార్చ కూడదు అని కండిషన్ పెట్టాను. అలా అన్ని కథలూ చదవక ముందే ఇది తయారయ్యింది. దీన్నే బుక్ రివ్యూ అంటారని కూడా అన్నాడు మా డాడీ.

మీకు నచ్చితే- నచ్చినట్టు కామెంట్లు పెడితేనే- ఇలాంటివి ఇంకొన్ని చెప్పి రాయిస్తాను (ఎవరూ చదవక పోయినా రాస్తూ పబ్లిష్ చేస్తూ ఉండటానికి నేనేం పెద్దోడిని కాదు).

మీకు నచ్చకపోయినా పెద్దోడినయ్యాక తెలుగు రాయటం నేర్చుకొని ఎలాగూ నా ఇష్టమొచ్చినట్టు రాస్తాను.

అప్పుడు మీరు చచ్చినట్టు చదవక తప్పదు.

ఎందుకంటే మీరేది రాసినా ఇప్పుడు మేం చచ్చినట్టు చదవటంలా? మాకూ ఉంటాయి హక్కులు – కావాలంటే మా సివిక్స్ టెక్స్ట్ బుక్ చదవండి.

బబ్లూ ఇంట్రో:

చదవటం కంటే చూడటం, చూడటం కోసం తిరగటం, తిరగటం కంటే తినటం ఇష్టం.

తినటంలో నా స్పెషాలిటీ : పుట్టకొక్కులు, ముల్లంగి, కాబేజీ, బీట్‌రూట్, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, ఇంకా బోలెడు సూపులు, నూడుల్స్.

చిన్నప్పుడు ముప్పయ్యేళ్ళ కాలెండర్, ప్రపంచ దేశాలు, ఇండియాలో అన్ని రాష్ట్రాల వివరాలూ చెప్పి , రెండు నిమిషాల్లో రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేసరికి,  అది తెలిసి ఇద్దరు డాక్టరంకుల్స్ నన్ను వెతుక్కొంటూ వచ్చి మా మమ్మీ డాడీలకు ఫ్రెండ్సయిపోయారు.

ఇంకో సారేమో “మీ ముత్తాత మేనల్లుడి మూడో తమ్ముడి నాలుగో మేనల్లుడి రెండో చెల్లెలుంది. బంగారబ్బొమ్మ.  చేసుకొంటావురా?” అంది మా చినమ్మమ్మ పెద్ద కోడలు – నేను అయిదో క్లాసులో ఉన్నప్పుడు. “అదెలా కుదురుద్ది? అది నాకు చెల్లి వరస కదా అత్తా!” అనేసరికి, పళ్ళూడిన చుట్టాలందరూ ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కొని నేనే కరెక్టని తేల్చి – ఇక అప్పట్నించీ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో తెలుసుకొనేందుకు అమెరికానుంచీ కూడా ఫోన్లు చెయ్యటం మొదలెట్టారు.

ఇంకా  తబలా , పియానో, కీ బోర్డు , డ్రమ్‌స్ కొట్టటమంటే ఇష్టం. చదవటం కంటే కథలు రాయటం ఎక్కువ ఇష్టం.

ఎప్పటికయినా పేద్ద ఆటో మొబైల్ ఇంజనీర్నీ, బిజినెస్ మాన్ నీ , చెఫ్ నీ , ప్రైం మినిష్టర్నీ అవుతాను. మా పిల్లల బండెడు పుస్తకాల బరువునీ, పరీక్షల బాధనీ బ్యాన్ చేస్తా. ఈ పెద్దోళ్ళకి కొంచెమన్నా బుద్ది రాకపోతే స్కూల్లో చేర్పించి నాతో పాటు మళ్ళీ 8th క్లాసు పరీక్షలు పెట్టిస్తాను.