వాకిలి » బివివి ప్రసాద్

వాన కురిస్తే..
వాన కురుస్తున్నపుడు

చినుకుదీపంలా మెలకువ కనులు విప్పుతుంది

బతికినకాలాల తలపులేవో తడితడిగా వెలుగుతుంటాయి

వాన జారుతుంటే

ఉక్కపోతలా బిగిసిన దిగుళ్ళు కరిగి

‘ఏమీలే దింతే జీవిత’మంటూ మట్టివాసనల నిట్టూర్పులై విచ్చుకొంటాయి

వాన రాలితే చాలు

ఎండుటాకులు గాలిలో ఆడుకొంటూ వాలినట్టు

వానతెరలు భూమిని ముద్దాడితే చాలు,

బడిపిల్లలు బిలబిలా పరిగెత్తినట్టు చినుకులు కురిస్తే చాలు

అమ్మలో భద్రంగా తేలుతున్నట్టు

సృష్టిలో నీ ఆత్మ ఎగురుతూ వుంటుంది

కాస్త వాన చాలు

ఇంద్రధనువుని నింగివైపు సారించే కాసిని చినుకులు చాలు

నీలోంచి ప్రపంచమూ, ప్రపంచంలోంచి నువ్వూ

వింతఖాళీలోకి విసిరివేయబడతారు

ఈ శీతాకాలపు ఉదయం
ఈ శీతాకాలపు ఉదయం. రాత్రంతా మంచుముక్కలా బిగుసుకొన్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండితెరల కాంతిలోంచి జారుకొంటూ గడ్డిపరకలపై కన్నుతెరిచాయి. ఇక చాలనుకొంటూ కాంతిబాజా మ్రోగిస్తూ కనిపించనిచోటికి నిన్ను పిలుస్తూ మాయమయ్యాయి. ఈ ఉదయం తొడుక్కొన్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్తసంతకాలు చేస్తున్నాయి. మనుషులు సరే. ఎప్పట్లానే ప్రాణాన్ని పట్టుకోమంటే దేహాన్ని తాకుతూ, ఇంత బంగారుకాంతికీ రవంతైనా కరగని ఇనుపస్పందనలతో, మోసపోయామని తుప్పుపట్టిన పాటనే మ్రోగిస్తుంటారు. నువ్వూ అంతే. ఓ గాలితెర అన్నీ వదలి రమ్మన్నా వినకుండా, భాష వృధా అనుకొంటూనే, దానికి తొడిగిన లిపిని విప్పుతూ, మడతలు పెడుతూ నీదికాని ఆట మళ్ళీ మొదలుపెడతావు.

మళ్ళీ ఒక విరామం. దాన్లోకి బట్టల్లేకుండా దూకాలని తెలిసికూడా, జ్ఞానంతో మసకబారిన కళ్ళనైనా తుడుచుకోకుండా మునుగుతావు. రంగుల్లేని విరామం నీ రంగుల్ని ఒప్పుకోదు. నిన్ను ఒప్పుకోని విరామాన్ని నువ్వూ ఒప్పుకోవు. నీకింకా చాత కాలేదు, నదిలోకి నీ నీడని విడిచి దూకటమెలానో. మరోసారెపుడైనా ప్రయత్నించు నీడలేకుండా నడవటానికి. నువ్వు బాధకాదు, నీ నీడ బాధ. నీకు తెలియకపోయినా పోయేదిలేదు. నీ నీడకి తెలిసీ ఉపయోగం లేదు.

తెలీదు. మళ్ళీ విరామమో, కాదో. ఇప్పటికి చాలు. అలా వీధిలోకి వెళ్ళి, తెల్లని ఎండలో సంచరించే రంగురంగుల చీకట్ల ధూళి చల్లుకురావాలి. మరి బ్రతకాలి అందర్లో ఒకడిలా. అందర్లానే అయిష్టంగానో, ఇష్టంగానో అర్థంకాకుండానే.

ఏ దైవమో విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోతుంది కాలం. ముందు వెనుకలుగా మార్చుకొంటున్న వాక్యాల్లోంచి కూడా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. చూసినవేవీ గుర్తుండవు. గుర్తుండేలా చూడాల్సినవీ లేవు. స్మృతి కన్నా మరపు సుఖం. రాసిన రాతల కన్నా వెనుకనున్న తెల్లకాగితం ఎక్కువ చెబుతుంది. చూసినవి మరిచిపోవద్దు, చూసేవాడిని మర్చిపోతే చాలు. పదాల నెందుకూ, వాటిలో నింపిన అర్థాల నెందుకూ, మరిచిపోతే చాలు మాట్లాడేవాడిని.

ఆకాశపు నగారా అదేపనిగా మ్రోగిస్తో చెబుతోంది జీవితం. నీ అంతట నువ్వు బ్రతకనపుడు, బ్రతుకు నిన్ను బ్రతికించుకొంటుంది. ఎందుకూ బ్రతకాలనుకోవటం, చావాలనుకోవటం. పుట్టి, పోవుటలు నాటకము, నట్టనడిమి ఈ చూపొక్కటి నిజము. ఇటునించి అటు వెళ్లినపుడు అశ్వత్థవృక్షం అర్థమవుతుంది.

మరి వెళ్ళిరానా అన్నావు ఆరోజు. ఆ మాట కోసమే ఎదురుచూస్తుందన్న నిజాన్ని మర్యాదగా బయటికి రానివ్వకుండా, సరే మరి అంది. భూమ్మీద వేల జీర్ణపత్రాలు రాల్చినవాడివి, సరే లోలోపల అప్పటికే మూసుకొన్న తలుపుల్ని గుర్తుపట్టి కూడా ఏమీ తెలియనంత ప్రశాంతంగా బయటికి నడిచావు. నీడల లిపి తెలుసు గనుక ప్రేమ నుండి లభించిన స్వేచ్ఛని ఇట్టే పోల్చుకొన్నావు. ఇంటి క్రీనీడలో ఆమె నీడ చిక్కగా కరిగిపోయింది. ఆమె హృదయంలోంచి బయటకు వచ్చాక ఆకాశం మరింత నిర్మలంగా కనిపించింది.

ఇంత దు:ఖం ఎలా మోయనంటావు బరువు కనబడనీయని తేలికైన మాటల్లోకి తడుముకొంటూ. మోసేవాణ్ణి దించేస్తే, జీవితం మోసుకొంటుంది, నీకేం పని అని ఆ జెన్‌ సాధువు. అతను లేకపోతే నా జీవితం బోసిపోతుంది మరి అంటావు. అదీ సంగతి అని నవ్వుతూ నువ్వొదలని మాటల్నీ, నీడల్నీ నీకు విడిచి నిర్లక్ష్యాన్ని భుజాని కెత్తుకొని నీటిమీద నడుస్తూ వెళ్ళిపోతాడు. బరువుగా ఉండటమే బ్రతకటమని నమ్ముతాం గనుక, తేలికైన జీవితం తెలియకుండానే వ్రేళ్ళ సందుల్లోంచి జారిపోతుంది.

కాలం మరికొంత వెన్నలానో, వెన్నెల్లానో, కొవ్వులానో కరిగాక నువ్వూ, నేనూ, నిందలూ ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోదాం. కాలం లేనిచోట నిలిచే విద్య తెలియలేదు గనుక, మరోసారెపుడైనా మళ్ళీ కలుద్దాం కొత్త పాతమొహాలతో. అప్పటి శీతాకాలపు ఉదయంలోంచి కూడా దేవుడేం చెప్పేదీ వినబడకుండా శబ్దాలతో మనని వెచ్చగా కప్పుకొందాం, అచ్చం ఇలానే. ఇంతకు ముందులానే.

కవిత్వం చదివేటపుడు
కవిత్వం చదవబోతున్నపుడైనా నీలో మెత్తదనం ఉండాలి

వెలితిగా వున్న ఆకాశంనిండా

మెలమెల్లగా విస్తరిస్తున్న మేఘంలాంటి దిగులుండాలి

అక్షరాలపై సంచరించే చూపు వెనుక

ఒక వర్షం కురిసేందుకు సిద్ధంగావుండాలి

కవిత్వాన్ని సమీపిస్తున్నపుడైనా

వానకాలువలో పరుగెత్తే కాగితం పడవలో ప్రయాణిస్తూ

సుదూరదేశాల మంత్రనగరుల్ని చేరుకొనే

అమాయకత్వం నీలో మేలుకోవాలి

కవి ఏమీ చెయ్యడు

కన్నీటిలోకో, తెలియనిలోకాలపై బెంగపుట్టించే సౌందర్యంలోకో

తను చూసిన దారిలోకి ఆహ్వానించటం మినహా

కవి నిన్ను పిలిచినపుడైనా

మగతనిదురలోంచి జీవించటంలోకి చకచకా నడిచివెళ్ళాలి

నిజానికి, కవిత్వాన్ని సమీపించినపుడైనా

మనందరి ఏకైక హృదయాన్ని సమీపించే రహస్యం గురించి

నీకు నీదైన ఎరుక వుండాలి

సాయంత్రపు నడక
నువ్వు నడవక తప్పదని వైద్యులు చెప్పినపుడు

రోజువారీ పనుల్నీ అటూఇటూ సర్ది

ఖాళీ సాయంత్రాలని సృష్టించడం కష్టంగా తోచింది కానీ,

రోగాలూ మేలుచేస్తాయని నడక మొదలయ్యాక తెలిసింది

కాలేజీస్థలంలోని వలయాకారపు నడకదారిలోకి

గడియారమ్ముల్లులా చొరబడినప్పుడు

విస్మృత ప్రపంచమొకటి నీ వెలుపలా, లోపలా కన్ను తెరుస్తుంది

చుట్టూ మూగిన చిక్కటి చెట్లు

వేల ఆకుపచ్చని ఛాయల్ని

వెలుగుకీ, చీకటికీ మధ్య మెట్లుకట్టి చూపిస్తాయి

అడుగుకొక రూపం దాల్చుతూ చెట్లు

రహస్యసంజ్ఞలతో పిలిచే అదృశ్యలోకాల్లోకి

ఆశ్చర్యంగా దారితప్పుతావు కాసేపు

లోపల ముసురుకొన్న చిక్కుల్లోంచి

అకాశాపు మైదానంలో ఆడుకొనే పిల్లగాలుల్లోకీ

సాయంత్రపు కిరణాల జారుడుబల్లల మీదికీ వాలిపోతావు

దారినీ, మనస్సునీ ఇరుకుచేసే సహపాదచారుల సంభాషణల్లోంచి

విశాలత్వంలోకి ఎగిరేందుకు చూపుని ఆకాశం వైపు మళ్ళిస్తావా

‘వచ్చావా’ అంటుంది ఆకాశం

‘నీ అనారోగ్యం పంపిస్తే నువు ఇక్కడికి రాలేదు,

నేను రప్పించుకొంటే వచ్చా’ వన్నట్లు నిర్మలంగా నవ్వుతుంది

అనాది ఆకాశం క్రింద అనాది హృదయ స్పందన ఒకటి

మౌనంగా ప్రేమ వృత్తాలు చుడుతుండగా

చిక్కబడుతున్న చీకటిలోపల నీడలూ, చెట్లూ, నువ్వూ

నిశ్శబ్దంలో ప్రవేశించే చివరి శబ్దాలలా కరిగిపోతారు

ఒకే మెలకువ
అవతలితీరానికి నాకొక నావ దొరికింది

ఎవరైనా వస్తారా నాతో’ అని అడుగుతావు

నది ఒడ్డున రికామీ చేతులతో

ఊరికే తిరిగే బాలుడిలాగే నిన్ను భావిస్తారు ప్రజలు

‘రండి, నాతో కాసేపు ఆడుకోండి

ఈ ఆటలలోంచే రెండోవైపుకి దారివుంది’ అంటావు

నది ఇసుకలా బిగుసుకొన్న వాళ్ళ క్షణాల్లోంచి

గుప్పెడైనా నీకోసం ఇవ్వలేరు వాళ్ళు

ఇంకా పసితనం పూర్తిగా ఆరిపోని

ఒకరిద్దరికి నీమాటలు ఆశ్చర్యం కలిగించి

నీవేపు చూస్తారు కాని

సాటివాళ్ళ ఉత్సవాల హోరు వాళ్ళని తీసుకుపోతుంది

‘తామేం చేస్తున్నారో తమకి తెలియదని’

చెప్పివెళ్ళిన పూర్వయాత్రికులలానే

నువ్వుకూడా ఒక చిరునవ్వు నవ్వుకొని

నీ నావపై బయలుదేరి వెళ్ళిపోతావు

వాళ్ళ కోలాహలం దూరమయేకొద్దీ

వాళ్ళకీ, నీకూ భేదం లేదని

వేల స్వప్నాలను ఒకే మెలకువ

పహరా కాస్తుందని తెలుసుకొంటావు

జీవితార్థం
అర్థం కావటం ఏమంత అవసరం

అర్థం తెలియని ఆకాశానికీ

అర్థం తెలియని నీకూ మధ్య

కురిసీ కురవని మేఘాల్లా ఎగురుతుంటాయి

పదాలూ, వాటి అర్థాలూ

జీతమంటే ఏమిటని

నువు ప్రశ్నించుకొన్న ప్రతిసారీ

దిగులుమేఘాలమీద ఒక కొత్త జవాబు

ఇంద్రధనువులా మెరుస్తూనే వుంటుంది

కానీ, ఇదిగో దొరికిందని

ఇంద్రధనువుని తాకబోయే ప్రతిసారీ

నిరాశవంటి నీటితుంపరులు మినహా

ఏ రంగులూ నీ చేతికి అంటుకోవు

జీవితమంటే ఏమిటైతే ఏమిటి

ఊరికే జీవించు

నీ కళ్ళముందు ప్రవహిస్తున్న నదిలా

నీ కళ్ళముందు ఎదుగుతున్న చెట్టులా

నీ కళ్ళముందు ఎగురుతున్న

ఉదయాల్లా, అస్తమయాల్లా, నక్షత్రాల్లా

ఊరికే జీవిస్తూ వుండు

నెమ్మదిగా, మరికాస్త నెమ్మదిగా

అర్థాల లోతుల్లోని నిశ్శబ్దమంత మృదువుగా

ఊరికే..

నిద్రరాని రాత్రి
1

నిద్రరాని రాత్రి, గది తలుపులు తెరిచి

కదలని చలిగాలి నింపిన బెలూనులాంటి ఆరుబయట నిలబడ్డాను

చుట్టూ చల్లదనం జీవితం తాకినట్టు తాకుతోంది

తల ఎత్తి చూస్తే చీకటిపుష్పం చుక్కల పుప్పొడి రాల్చుతోంది

నక్షత్రాలకీ నాకూ మధ్య సముద్రంలా పొంగుతోంది నిశ్శబ్దం

దూరమైన తల్లీబిడ్డల్లా ఒకరినొకరం చూసుకొన్నాము

ఆకాశమూ, నేనూ

2

నేను దాచుకొన్న వజ్రాల్లా మెరిసే ప్రశ్నలని

మళ్ళీ బయటకు తీసి చూసుకొన్నాను

సృష్టి అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి

జీవితమంటే ఏమిటి, మృత్యువంటే ఏమిటి

జవాబు ఉందా వాటికి, నిజంగా అవసరమా

ప్రశ్నల తరువాత నాలో మేలుకొనే నిశ్శబ్దమే జవాబా

నిశ్శబ్దం నాలో ఉందా, నిశ్శబ్దంలో నేనున్నానా

3

చలికి ఒణికిన గాలితెర ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది

అద్దంలాంటి ఆకాశంలోకి ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి

ఈ రాత్రి ఎంత బావుంది

ఈ చల్లదనమూ, ఆకాశమూ ఎంత బావున్నాయి

నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ఎంతబాగున్నాయి

వీటన్నిటినీ చూడటమెంత బాగుంది

చూడటమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది

4

నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా, మరణిస్తే మళ్ళీ పుడతానా

ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి

నా మెలకువ బెలూనును చాతనైనంత నింపుకోవాలి

ఈ విశాలమైన ఆకాశంతో, నక్షత్రాలతో, చలిగాలులతో

అన్నిటి వెనుకనుండీ దాగుడుమూతలు ఆడుతోన్న పసిపాపలాంటి జీవితంతో

రోజుల బొమ్మలు
పగలంతా కాలం నదిలో

దృశ్యాలు, ముఖాలు, ఉద్వేగవలయాలు ప్రవహించిపోతాయి

నది ఒడ్డున చెట్టులా నిలిచి

నదిమీద వల విసిరినట్టు నా చూపుల్ని విసిరి జీవనసారాన్ని సేకరించుకొంటాను.

సాయంత్రమవుతుంది

నా రోజులపత్రాలు సాయంత్రంలాగే రంగులుమారి చీకటిలో రాలిపోతాయి

మరొకరోజుని రాల్చుకొన్న చెట్టునయి

చీకటితో నల్లబడిన కాలం నదిలో నా ప్రతిబింబం జాడ వెదకబోతాను

చెట్టూ, నదీ, ప్రతిబింబమూ, చీకటీ ఒకటే దిగుల్లోకి తమని కోల్పోతాయి

తమ స్వభావాల్ని మరిచి

తన ప్రతిబింబాలలోకి నది తానే ప్రవహిస్తుంది

చెట్టు ప్రతిబింబం చెట్టులోకి ప్రవహిస్తుంది

సమస్తాన్నీ దాచవలసిన చీకటి సమస్తంలో దాగొంటుంది

జీవితం పసిపాప ఇవాళ్టి పగటిబొమ్మని పట్టుకొని

‘ఇది కూడా నే కలగన్న బొమ్మకా’దని శూన్యంలోకి విసిరేసి

చిరంతన శాంతిలో కొత్తబొమ్మని కలగంటుంది

కలయికలూ – ఎడబాట్లూ
మా యవ్వనరుతువులో ఆమెని చూసాను

ఆమె నన్ను చూడటమూ చూసాను

దేహం నిండా, కదలికల నిండా, మాటల నిండా

మోహపరిమళాలు వ్యాపించిన రోజుల్లో

మేం ఒకరికొకరం దేవతల్లా ఎదురయ్యాము

అదిమిపెట్టిన కలల్ని

అర్ధంలేని అర్ధవంతమైన నవ్వుల్లోకి విడిచిపెట్టి

దేహాల మధ్య దూరాలని అలాగే ఉంచి మా నవ్వుల్ని కౌగలించుకోనిచ్చాము

విశాలమైన ప్రపంచం

అనంతమైన కాలం

పలు సాలెగూళ్ళతో నిండిన జీవితం

మమ్మల్ని చెరొక చోటికీ, పరస్పర స్మృతుల్లోకి విసిరేసిన చివరినిముషాల్లో

మా చూపుల్లో, నవ్వుల్లో శిశిరరుతువులేవో దోబూచులాడాయి

చాలా కాలం

కాలం పేజీలు తిప్పుతూ మా కథల్ని విడివిడిగా రాసుకుపోయింది

ఎవరికధలో మరొకరం లేము

ఎవరి చిరునవ్వుకీ, కన్నీటికీ మరొకరం కారణం కాము

ఒక కొత్త పేజీలో మా రెండుకథలూ

అకస్మాత్తుగా దారిలో ఎదురయ్యాయి

ఇప్పుడు మేం దేవతలంకాము

మాలో తప్తజ్వాలల కాంతులూలేవు

మా మేఘచ్ఛాయల నవ్వుల చివర స్మృతులేవో తటిల్లతలా మెరిసాయి

మామధ్య ఘనీభవించిన దశాబ్దాల మౌనాన్ని

ఒక్కొక్క మాటతో కరిగించుకొన్నాము

అర్ధంకాని అర్ధాలేవో నిండిన మబ్బుతునకల్లాంటి పదాలతో

మేం ఒకరినొకరం

స్త్రీపురుషుల్లా కాక, మనుషుల్లా స్పృశించుకొన్నాము

మేం ఒకరికొకరం దూరమౌతున్నపుడు

పలుచని ఆర్ద్రత మా మధ్య వ్యాపించి

మేమెప్పుడూ దగ్గరగానే ఉన్నామని గుసగుసలాడింది

బహుశా, మళ్ళీ కలుస్తాము

నక్షత్రాలు మమ్మల్ని రమ్మని పిలిచే చివరిరోజుల్లో ఎప్పుడో

అపుడు చిరునవ్వులు ఉండవు, మాటలు ఉండవు

ఒకరిచేయి మరొకరం మృదువుగా పట్టుకొంటాము

బహుశా, మాస్పర్శ వెంట

నువ్వూ, నేనూ ఒకే జీవితం అనే భావమేదో ప్రవహిస్తుంది

అపుడు, మా దేహాలు మాయమై, భావాలు మాయమై

నక్షత్రాలని కౌగలించుకొన్న నిశ్శబ్దమేదో

తనలో మమ్మల్ని మరలా కరిగించుకొంటుంది

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది.
నా కవిత్వం నేను నా పాఠకుడితో జరిపే ఉదాత్త సంభాషణ. జీవితం ప్రసాదించే దు:ఖాన్ని స్వీకరించి, నేను నా పాఠకుడి సమక్షంలో – జీవితాన్ని ప్రేమించటంలోకీ, జీవితం లోలోతుల్లోని విలువల్లోకీ చేసే ప్రయాణం. కఠినమైన శిలలాంటి నిద్రనుండి, పూవులా కోమలమైన మెలకువలోకి నడుస్తూ, పాఠకుని నడవమని మృదువుగా చేయందివ్వటం. అయితే, ఈ కవిత్వం వెనుక ఉన్న జీవితానుభవం ఏమంత అందమైనదీ, ఆసక్తికరమైనదీ కాదనుకొంటాను. ఈ క్షణానకూడా, నేపధ్యమెందుకు, నా కవిత్వం చదివి చూడండని చెప్పాలని బలంగా అనిపిస్తూ వున్నా, పాఠకుడికి కవి నేపధ్యంపై ఉండే సహజమైన ఆసక్తిని కాదనలేక, నా సంక్షిప్త చిత్రాన్ని పరిచయం చేస్తున్నాను.

సాహిత్యం పట్ల ఒకరికి  ఆసక్తి ఎందుకు కలుగుతుంది. బహుశా వెలుపలి జీవితం తన లోలోపలి జీవనాసక్తికి తృప్తి కలిగించనప్పుడు లేదా వెలుపలి జీవితాన్ని తెలుసుకోవడానికి తన శక్తి చాలనప్పుడు ఆ తృప్తికోసం, శక్తి కోసం సాహిత్యంలోకి తొంగిచూస్తామేమో. ఇప్పుడు వెనుతిరిగి చూసుకొంటే, ఇతర కారణాలెలా వున్నా ఇవి రెండూ నన్ను పుస్తకాలవైపు కదిలించి వుంటాయనుకొంటాను. మా నాన్నగారు తను చదువుకొనే రోజులలో సాహిత్యం పట్ల కొద్దిపాటి అభిరుచి కలిగివుండటం మినహా, నాకు సాహిత్య నేపధ్యం కాని, వాతావరణం కాని లేవు. నన్ను సాహిత్యజీవిని చేసిన మరొక కారణం అసాధారణ సున్నితత్వం. నేను జీవించాలని ఆశించే ఉదాత్తమైన, సున్నితమైన ప్రపంచాన్ని పుస్తకాలలోనే వెదుకుకొనేవాడిని.

నేను మొదట పాఠకుడిని. బాల్యంలో చందమామ వంటి పుస్తకాలు నా మొదటి స్నేహితులు. తరువాత జీవితంలో ఆయా వయస్సులలో కలిగే ఉద్వేగస్థితులని బట్టి డిటెక్టివ్, పాపులర్ నవలలు పాఠకుడిగా నా మలి దశ. అయితే అవి నాలోపలి పాఠకుడి ఊహా, ఆలోచనా శక్తులకి తృప్తి కలిగించకపొవటం వలన క్రమంగా సీరియస్ సాహిత్యం నా దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో  మా ఊరి లైబ్రరీలో దొరికిన చాలామంది రచయితలని సీరియల్‌గా చదవటం గుర్తుంది. సీరియల్‌గా అంటే ఉదాహరణకు, విశ్వనాధ సత్యనారాయణను మొదలుపెడితే ఆయన పుస్తకాలన్నీ దొరికిన మేరకు వరుసపెట్టి చదివేయటం. ఈ అలవాటు చాలాకాలం అలానే వుండేది. ఆ రోజుల్లో గుర్తున్నంతవరకూ, శరత్, ప్రేంచంద్ మొదలైన చాలామంది రచనలు చదువుకొన్నాను.

నేను ప్రధానంగా నవలాసాహిత్యాన్ని ఇష్టపడేవాడిని. కానీ, ఇంటర్ చదువుతున్నపుడు, కొన్ని భావాలో, ఆలోచనలో తోసుకువస్తుంటే కవిత్వం రాయటం ద్వారా కవిత్వంతో నా అనుబంధం మొదలైంది. స్వభావరీత్యా చొరవ తక్కువ మనిషిని కావటం వలన, మనుషుల్లొకీ, సందర్భాలలోకీ చొచ్చుకుపోయే తత్వం లేకపోవటం వలన కూడా బహుశా నా అనుభూతుల్ని కవిత్వంలోకి అనువదించుకోవటం మొదలుపెట్టివుంటాను.

అప్పటి లెక్చరర్లు నాకవిత్వాన్ని ఇష్టపడి, నువ్వు కవిత్వం చదువు, అప్పుడు మరింత బాగా రాయగలుగుతావు అన్నపుడు మొదటిసారి మహాప్రస్థానం చదివాను. అది చదివాను అనటం కన్నా బట్టీ పట్టాను అనటం సరైనదనుకొంటాను. శ్రీశ్రీ శబ్దశక్తి, ఊహావరణాల్ని కదిలించే భావజాలం చాలాకాలం ఉత్తేజం కలిగించాయి. ఏపని చేసినా దానిలో లీనమైపోయే స్వభావం వలన, శ్రీశ్రీని చదివిన రోజుల్లో అదే వేగంతో చదివిన కమ్యూనిష్టు సాహిత్యమూ, తాపీ ధర్మారావూ, గురజాడా, రాహుల్ సాంకృత్యాయన్ వగైరాల ప్రభావంతో సమసమాజం రావాలనీ, ఒక్కొక్కసారి  ఉద్యమంలో కలిసిపోవాలనీ కూడా అనిపించేది.

శ్రీశ్రీని పరిచయం చేస్తూ, తనని పరిచయం చేసుకొన్న చలం రాసిన వ్యాసాలు సమాజంలోని అనేక చీకట్ల మీద తీవ్ర ధిక్కార స్వభావాన్ని నింపేవి. అయితే లోలోపల ఒక వెలితి సదా వెంటాడుతూ ఉండేది. ఆ వెలితి నాలోని ఉద్వేగాలకన్నా, అభిప్రాయలకన్నా ఇంకా చాలా లోతున ఉన్నది. దానిని అర్థం చేసుకొనే దారి కోసం వెదుకుతూ జిడ్డు కృష్ణమూర్తిని చదివినప్పుడు, ఈయన నాకు కావలసిన ముఖ్యమైన విషయమేదో చెబుతున్నారని అనిపించేది. అయితే నేను కేవలం తెలుగు మీడియం విద్యార్థిని కావటం వలన, నా చుట్టూ నన్ను నడిపించే ఎలాంటి ఆసరా లేకపోవటం వలన, అప్పటికి కృష్ణమూర్తివి తెలుగులో వచ్చిన ఒకటి రెండు పుస్తకాలు మినహా మరేవీ చదివే అవకాశం రాలేదు.

ఈ ఉపరితల ఉద్వేగాల నుండి మరింత లోతుకి వెళుతున్నపుడు, క్రమంగా ఇతర రచయితలకంటే చలం అత్యంత సన్నిహితుడిగా కనిపించేవారు. ముఖ్యం ఆయన నిజాయితీ, సున్నితమైన సంవేదనలు, లోతైన ఆలోచనలు, అంతంలేని సత్యాన్వేషణ ఇవన్నీ నన్ను పూర్తిగా ఆవరించేవి. చిన్నపుడు ఒక కథకుడిగా పరిచయమైన టాగోర్, చలం వలన మళ్ళీ కవిగా పరిచయమయ్యారు. చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకోవటం నాలోని ఉపరితల ఉద్వేగాలనుండి శాంతి వైపుగా, సత్యాన్వేషణ వైపుగా నడిచేలా చేసింది.

కొన్ని సందిగ్ధతలు, కొన్ని సమాధానాలు, వెంటాడుతున్న లోలోపలి వెలితి. ఈ దశలో, బలీయమైన హేతుదృక్పధం వలన, సాంప్రదాయిక ఆధ్యాత్మిక విశ్వాసాలూ, పద్ధతులూ అంతగా ఆకర్షించకపోవటం వలన నిజంగా నాకు సమాధానం దొరికేదెక్కడ అనుకొంటూ వుండగా, మళ్ళీ చలమే రాసిన, భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు అనే రెండు పుస్తకాలని సమీపించాను. మొదటిది చలం శ్రీ రమణమహర్షి గురించి ఆయన భక్తుల నుండి సేకరించిన అనుభవాలు. రెండవది, ముఖ్యంగా జెన్, భారతీయ మిస్టిక్స్ జీవితాలలోని సంఘటనలను చెప్పే కథానికలు. ఈ రెండు పుస్తకాలలో అత్యంత సరళమైన, ప్రేమాస్పదమైన జీవితాన్ని చూసినప్పుడు, అవి సత్యాన్ని గొప్ప సిద్ధాంతచర్చలనుండి, మత విశ్వాసాలనుండి విముక్తం చేసి కరతలామలకంగా చూపినపుడు వీటి గురించి కదా ఇన్నాళ్ళూ వెదుకుకొన్నాను అనిపించింది. శ్రీ రమణమహర్షి, జెన్ సాధువులు పరిచయమైన ఆ రోజులు సాహిత్యాన్ని ఆశ్రయించి బ్రతికిన నాకు, సాహిత్యం ఇచ్చిన గొప్ప కానుకలుగా ఈనాటికీ అనిపిస్తూ వుంటుంది.

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది. సత్యాన్వేషణ వెలుపలి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. ఆ సత్యమేదో తెలియాలి. అది మినహా, మిగతావన్నీ ఏమంత విలువలేనివి. ఆ క్రమంలో నేనెక్కడున్నానో, సత్యమెక్కడవుందో, మధ్యలో ఈ దు:ఖమేమిటో అర్థం చేసుకొంటూనే ఇంకా నడుస్తూవున్నాను. నిజానికి అక్కడితో నా సాహిత్య ప్రయాణం పాఠకుడిగా చివరికి వచ్చి, కవిగా ప్రారంభమయింది. చలం చెప్పినట్టు నాకూ, ప్రపంచానికీ మధ్య బహిరంతర యుద్ధారావం మొదలైంది. తరువాత కూడా సాహిత్యం చదువుకొన్నా బాగా ఎంపిక చేసిన రచనలు మాత్రమే చదివేవాడిని. క్రమంగా సాహిత్యం వెనుకపడి, సత్యాన్వేషణకు సహాయం చేసే రచనలు చదవటం ప్రధానమయింది. ఇదంతా నా ఇరవైలలోని ప్రయాణం.

అప్పుడు, నాలోపలి ప్రయాణాన్ని రికార్డు చెయ్యాలని శ్రీ భగవాన్ని   ఉద్దేశించి రాసిన కవితలూ, ఇతర భావాల నుండి ఎంపిక చేసిన వాటితో ఆరాధన సంపుటి ప్రచురించాను. తరువాత జీవన స్థితిగతుల వలన, ఆరాధన సాహిత్యలోకాన్ని చేరకపోవటం వలన చాలాకాలం ఏమీ రాయలేదు. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు పరిచయం కావటం తో, ఒక సందర్భంలో నేను రాసిన హైకూలని ఆయనకు చూపించటం, ఈ ప్రక్రియ నాకు తగినదిలా అనిపించి, వరుసగా మూడు హైకూ సంపుటులు ముద్రించటం జరిగింది. ఆ రోజుల్లోనే కొప్పర్తిగారు తణుకు బదిలీ అయి రావటం వలన, ఆయన ఆసరా కవిగా నన్ను నేను అంచనా వేసుకోవటానికీ, సరిదిద్దుకోవటానికీ ఉపకరించింది. మొదటి హైకూసంపుటి నాటికి నాకు హైకూ గురించి అంతగా తెలియదు. అప్పటికే ఉన్న తాత్వికనేపధ్యం వలన  హైకూ ఒక నిశ్శబ్దానుభవాన్నివ్వాలని మాత్రం అనిపించింది. తరువాత అలంకారరహితంగా, ఆలోచనారహితంగా నిర్మలమైన హైకూ అనుభూతిని ఇవ్వటం కోసం సాధన చేస్తూ మూడవసంపుటి నాటికి దానిని సంపూర్ణంగా సాధించగలిగానని అనిపించింది.

కానీ, ఎప్పటికప్పుడు నిరుత్సాహం కమ్ముకొంటూనే వుండేది. గొప్పకీర్తి రావాలనీ, పురస్కారాలు రావాలనీ ఏనాడూ ప్రబలంగా కోరుకోలేదు. అవి రానందుకు బాధపడలేదు. కానీ, ఇది గొప్ప కవిత్వం అని గ్రహించినవాళ్ళు కూడా దానిని పదిమందికీ చేర్చేందుకు తమకు చాతనయిన ప్రయత్నం చేయకపోవటం, ఫలితంగా ఇలాంటి సాహిత్యానికి ఎదురుచూసే పాఠకులకి ఇలాంటి కవిత్వం ఒకటి వుందని కూడా తెలియకపోవటం మాత్రం తరచూ బాధ కలిగించేవి. అదే నిరుత్సాహంతోనూ, వెలుపలి జీవితంలో ఉండే సహజమైన వత్తిడులతోనూ మళ్ళీ కవిత్వానికి దూరమయ్యాను. మధ్యలో, హైకూలు రాస్తున్నపుడు రాసిన వచన కవితలతో 2004లో నేనే ఈ క్షణం ముద్రించటం మినహా, పది సంవత్సరాలు కవిత్వరచనను విడిచిపెట్టాను.

మళ్ళీ క్రితం సంవత్సరం, 2011లో, సాహిత్యమిత్రుల పలకరింపులతో పాటు, నేను మాట్లాడితీరవలసిన విషయాలున్నాయని నాకు కూడా గట్టిగా అనిపిస్తూ వుండటంతో, ఒకటిరెండు కవితలతో నెమ్మదిగా మొదలై సుమారు నాలుగు నెలలలో ఒక ఉధృతిలో వందకుపైగా కవితలు రాసాను. వాటిని కొంత ఎడిట్ చేసి, పదేళ్ళలో అప్పుడపుడు రాసిన కొన్ని కవితలు చేర్చి ఆకాశం సంపుటి ముద్రించాను. సాహిత్యప్రపంచం నుండి యధాప్రకారం ఉదాసీన ప్రతిస్పందన. సాహిత్యాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పేవారు తెలుగునాట జరుపుతున్న సాహిత్యవిలువల పతనాన్ని ఇరవైయేళ్ళకుపైగా చూస్తున్నవాడిని గనుక, ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. కాని, పాఠకులలో మానవవిలువలు వికసించేందుకు ఉపకరించని, వారు తమ  జీవితాన్ని మరింత ప్రేమించేలా చేయని సాహిత్యం వారికి దూరమవుతుందని మన సాహిత్యవేత్తలు చాలామంది గ్రహించకపోవటం మాత్రం విచారాన్ని కలిగిస్తుంది.

ఇన్నాళ్ళకి రెండుమూడు అవార్డులు వచ్చి ప్రసాద్ కవిత్వాన్ని చదవమని పాఠకులకి రెకమెండ్ చేస్తున్నందుకు ఒక విషాదభరితమైన సంతోషంతో ఇప్పుడు ఈ మాటలన్నీ మీతో పంచుకొంటున్నాను. అయితే అవార్డులూ, కీర్తీ రావటంకన్నా నా అక్షరాలు, నేను ఆశించినట్టు, పాఠకుల హృదయాలను నిర్మలమైన కన్నీటితో, గాఢమైన శాంతితో, మెలకువలాంటి మౌనంతో నింపాయని తెలిసినపుడల్లా మాత్రం నా కవిత్వసాధన వృధాకాలేదని సంతోషం కలుగుతూ వుంది. ఆకాశం వలన ఇలాంటి అరుదైన స్పందనలని ఇటీవల చాలామంది పాఠకులనుండి వింటూవున్నాను.