వాకిలి » బొలిమేరు ప్రసాద్

పిచ్చుక
ఏమో ? ఎలా వలస పోయేదో ?

ఎర్రటి ఆలాపనతో మొదలై

పచ్చని అడివిపాట గుండెదాక పాకినట్టు

వేపచెట్టుకి అవ్వచీర

జోల పాటై వూగాడినట్టు

పొద్దు మరలా వూరేగివచ్చినట్టు

కిటికీరెక్కపై కిచకిచలాడేది

ఏమో ? ఎలా జోడుకట్టేదో ?

చూరుకి కంకులజడలా తోడుగా అల్లుకొనేది

గింజగింజలో భావాన్ని వెతుకులాడేది

నేలమీద బంగారు పొట్టులా నైరూప్య చిత్రమయ్యేది

ఏమో ? ఎలా ఓ ప్రపంచమయ్యేదో ?

వసారాగుండెలో జననమయ్యేది

నిన్నటినీ రేపటినీ కలిపే క్షణాల వంతెనయ్యేది

ఏమో ? ఎలా ఓ వేదనయ్యిందో ?

అద్దం మీది బొట్టుబిళ్ళల్లో వెతుకులాటయ్యింది

ఉనికి రహస్యాన్ని విడమరచని సంభాషణయ్యింది

ఏమో ? ఎక్కడ దారితప్పిందో ?

ఇప్పుడు

కిటికీ పాట గాలి ఏడుపై

వసారా చిరిగిపోయిన చిత్రమై

అద్దం గాజుపలకై

జీవితం మాయమౌతున్న ఓ మాటై..

ఏమో ? ఎక్కడ దారితప్పిందో ?

అంతరిస్తున్న మనిషితనంలా..