వాకిలి » రంగనాయకమ్మ

అబద్ధాలలో ఎంత సృజన…!
ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ   ‘ఆత్మకథాంశాల  ఉత్తరాలు’  పుస్తకం ఇటీవల విడుదలయింది.    దీనిలోని  ఓ వ్యాసం ‘రచన’ మాసపత్రికలో  రావటం-  దానిలోని ఓ ప్రస్తావనకు   ‘జ్యోతి’ మాసపత్రిక ఎడిటర్  లీలావతి  అభ్యంతరం చెపుతూ లేఖ రాయటం-  చర్చ ముగిస్తున్నామంటూ  ‘రచన’ పత్రిక   ప్రకటన … ఇదీ ఈ  వ్యాసం నేపథ్యం!

(నా ఆత్మకధలో ఒక పేజీ )

ఇది, 1972 లో జరిగి, 40 ఏళ్ళకు పైగా మరుగున వుండిపోయి, 2013 ఏప్రిల్ లో బట్టబయలై, నా మీద అబద్దాల వర్షం కురిపించిన సంఘటన!

నేను, 1972 నాటికి, కొన్ని కధలూ, నవలలూ, రాసి వున్న దాన్నే. అప్పటికి, “కృష్ణవేణి, పల్లెటూరు, ఆండాళమ్మ, పేక మేడలు, బలిపీఠం, కూలిన గోడలు, ఇదే నా న్యాయం” వగైరా నవలలన్నీ రాసేసి వున్నాను. రచనా వ్యాసంగం అలా వుండగా, ఇంకో పక్క సంసార కూపంలో తల మునకలుగా మునిగిపోయి వున్నాను.

ఆ దశలో, అప్పటి వరకూ బతికిన కొంపని వదిలేసి, వైజాగ్ లోనే కృష్ణాబాయి గారి ఇంట్లో కొంత కాలం ఆశ్రయం తీసుకున్నాను. అప్పుడు నా దగ్గిర ఒక్క పైసా కూడా లేదు. అలాంటి దశలో మద్రాసు నించి, ‘జ్యోతి’ మాస పత్రిక నడుపుతూ వున్న లీలావతి గారు (అప్పటికే జ్యోతి రాఘవయ్య గారు లేరు) నాకు ఉత్తరాలు రాశారు. ఆవిడితో అంతకు ముందే చిన్న పరిచయం వుండడం వల్లే నాకు రాశారు. మద్రాసులో కొల్లి సత్యం గారు సినిమా తియ్యాలనుకుంటున్నారనీ, నాతో డైలాగ్స్ రాయించాలనుకుంటున్నారనీ, కాబట్టి నన్ను మద్రాసు రమ్మనీ, రాశారు లీలావతి గారు. నేను మొదట ఒప్పుకోలేదు. అక్కడికి వస్తే హోటల్లో వుండననీ, కాబట్టి రాలేననీ, జవాబు రాశాను. దానికి ఆవిడ, “మా ఇంట్లోనే వుందురుగాని, నేనూ పిల్లలే వుంటాము. మీ పని అయ్యేదాకా ఇక్కడే వుందురు గాని. కొల్లి సత్యం గారు మాకు స్నేహితులు. చాలా మంచివారు. మీరు తప్పక రావాలి” అని మళ్ళీ మళ్ళీ రాశారు.

నాకు కోర్టు కేసుల కోసం అయినా కొంచెం డబ్బుతో అవసరం వుంది. హోటళ్ళలో వుండడం కాదు గదా అని బైల్దేరి మద్రాసు వెళ్ళాను.

లీలావతి గారి ఇంట్లో అంతా మంచిగానే జరిగింది. ఆవిడికి ముగ్గురు కొడుకులూ, ఒక కూతురూ. అందరూ బాగానే వున్నారు నాతో.

నేను రాయడం మొదలుపెట్టిన సినిమా పేరు “ఇంటింటి కధ”. సత్యం గారు ఒక కధ ఇస్తే, ఆయనతో డిస్కస్ చేస్తూ నేను సంభాషణలు రాస్తూ వుండేదాన్ని.

అలా జరుగుతూ వుండగా, ఒక సాయంత్రం లీలావతి గారు నా దగ్గిరికి వచ్చి, “మీరు వెళ్ళిపోతే బాగుంటుందండీ. మా అమ్మాయి అంటోందండీ” అన్నారు.

నాకు అర్ధమే కాలేదు. “అదేవిటి? పని అయ్యేదాకా మీ దగ్గిరే వుండొచ్చు అన్నారు కదా? మీరు నాతో అలా చెప్తేనే నేను వచ్చానని మీ అమ్మాయికి చెప్పలేదా మీరు?” అని అడిగాను.

“పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదండీ? వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి కదండీ?” అన్నారు.

నేను ఇంకో రెండు మూడు మాటలు అడిగినా ఆవిడ మళ్ళీ మళ్ళీ, “పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదండీ” అన్నమాటే!

“పిల్లలు, ఈ నెల్లాళ్ళకే పెద్దవాళ్ళయ్యారా? పిల్లల ఆజ్ఞల ప్రకారమే నడుస్తారా మీరు?” అని ఒక్క మాట అడిగి, నా బట్టలు సర్దేసుకుని “సరే, సత్యం గార్ని రమ్మని వెంటనే ఫోన్ చేసి చెప్పండి” అని నా సామానుతో మేడ దిగి గేటు బైటకి పోయి అక్కడ కూర్చుని వున్నాను.

సత్యం గారికి ఫోను అందగానే ఆయన, భార్య గిరిజ గారితో సహా వచ్చారు.

“నేను హైదరాబాదు వెళ్ళిపోతాను. టిక్కెట్టు  కొని నన్ను పంపించెయ్యండి” అంటే,

“అయ్యో, అప్పుడే కాదమ్మా. మన పని పూర్తి అవలేదు కదా? మా ఇంట్లోనే వుందురు గాని” అని ఆ భార్యాభర్తలిద్దరూ చాలా చెప్తే, ‘సరే’ అని ఒప్పుకుని అక్కడికి మారాను. వాళ్ళు మంచివాళ్ళు. అక్కడ కొన్నాళ్ళు వున్నా, పని పూర్తి అవలేదు. హైదరాబాదు వచ్చేశాను. – ఇంత వరకూ జరిగింది, 40 ఏళ్ళ కిందట, 1972లో.

ఇప్పుడు, 2013లో జరిగింది ఏమిటంటే:  కృష్ణాబాయి గారి భర్త వేణు గారు పోయిన తర్వాత, ఆయన మీద ప్రేమతో, గౌరవంతో ఒక వ్యాసం రాశాను, “నన్ను ఆదుకున్నవారిని నేను మరిచిపోను” అని. ఆ వ్యాసాన్ని హైదరాబాదులోనే వున్న ‘రచన‘ మాస పత్రికలో ప్రచురణకు ఇచ్చాను. ఆ వ్యాసం, ఏప్రిల్ నెల (2013) సంచికలో వచ్చింది. ఆ వ్యాసంలో ఒక వాక్యం ఇలా వుంది:

“మద్రాసులో లీలావతిగారు చేసినట్టు, కొన్ని రోజులు పోయాక, ‘ మీరు వెళ్ళండి‘ అనలేదు నన్ను, కృష్ణాబాయిగారింట్లో ఎవ్వరూ.“

లీలావతి చేసిన పనికీ, కృష్ణాబాయి గారు చేసిన సహాయానికీ, ఎంత తేడా! ఆ తేడా చూపించడానికే ఆ వాక్యం అలా రాశాను.

నా వ్యాసం పడ్డ ‘రచన’ సంచికని లీలావతి చదివింది. అందులో తన మీద, 40 సంవత్సరాల తర్వాత బైటికి వచ్చిన ఆ విషయం చూసింది. అప్పుడు ఆవిడేం చెయ్య దల్చిందంటే, ‘రంగనాయకమ్మ పచ్చి అబద్దాల కోరు’ అని చెప్పదల్చింది. ‘రచన’ పత్రికలోనే, మే నెల సంచికలో ఒక పెద్ద ఉత్తరం రాసింది. ‘రంగనాయకమ్మని నేను పిలవలేదు. ఆమె వేరే పని మీద వచ్చింది. నాతో పోట్లాడి మా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వెళ్ళమని అనలేదు’ అని చెప్పదల్చింది.

ఇప్పుడు, లీలావతి ఉత్తరంలో వాక్యాలు వరసగా చూడండి:

లీలావతి: “2013 సం. ఏప్రిల్ ‘రచన’ పత్రిక చదివాను. దానిలో, రంగనాయకమ్మగారి ప్రత్యేక రచన ‘నన్ను ఆదుకున్నవారిని నేను మరిచిపోను’ అన్న వ్యాసం కూడా ఒకటికి రెండు సార్లు చదివాను. ఈ వ్యాసంలో రంగనాయకమ్మ గారు ఒక అమూల్యమైన వాక్యమును కూడా వెల్లడించారు. అది, ‘మద్రాసులో లీలావతి గారు చేసినట్లు కొన్ని రోజులు పోయాక, మీరిక వెళ్ళండి అని కృష్ణ గారింట్లో అనలేదు’. ఈ వాక్యమునకు పూర్వాపరములు తెలియచెప్పక, ఒక అసత్యాన్ని సత్యముగ రంగనాయకమ్మ చెప్పడం జరిగింది. కాబట్టి, దీనికి వివరణ ఇవ్వవలసిన బాధ్యత, ధర్మము, నాకు ఉన్నది.”

(రంగనాయకమ్మ, అసలు సంగతి చెప్పకుండా అసత్యాన్నే చెప్పిందట! కాబట్టి, లీలావతి ‘ధర్మంగా, బాధ్యతగా‘ చెబుతోంది, వినండి!)

లీలావతి: “అసలు రంగనాయకమ్మగారు ఆ విషయం వ్రాయటానికి జరిగిన సందర్భంలోకి వద్దాం. …. సినిమా రంగమునకు సంబంధించిన ఒక యువకుడు సునీల్ చౌదరి, సినిమాను తీయవలెను అనే కోరికతో వున్నాడు. ….. అదే సమయంలో మా అన్నగారికి కూడా సినిమా తీయాలనే ఆలోచన ఉండడంతో, వీరిద్దరిని మా సన్నిహిత మిత్రులు కలిపి…. రంగనాయకమ్మ గారి బలిపీఠం తీయడానికి  నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకమ్మగారితో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా రంగనాయకమ్మగారు ఆమోదించడం జరిగింది……. డైలాగ్స్ కూడా రంగనాయకమ్మగారే రాస్తే బాగుండును కదా అని ఆమెను సంప్రదించడం కూడా జరిగింది…… ఆమె మద్రాసు వస్తే ఒంటరిగా హోటల్ లో ఉంచితే అనుచితంగా ఉంటుంది గనక… ‘ఆమెను మీ ఇంటిలో ఉంచుకోవడానికి మీకు అభ్యంతరము లేదు కదా’ అని నన్ను అడిగారు…. ‘నాకు అభ్యంతరము లేదు’ అని చెప్పాను. ఆమె మా ఇంటికి రావడం జరిగింది.”

( అంటే, మొత్తం ఉత్తరంలో, కొల్లి సత్యంగారి పేరు లేదు! నేను ‘బలిపీఠం‘ సినిమాకి డైలాగ్స్ రాయడానికే అక్కడికి వచ్చాననీ, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు బలిపీఠం సినిమా వాళ్ళ ద్వారా జరిగాయనీ; వాళ్ళు అడిగారు కాబట్టి నన్ను ఇంట్లో పెట్టుకోవడానికి తను ఒప్పుకున్నాననీ – ఇదీ ఇప్పటి దాకా జరిగిన లీల! తర్వాత చూడండి.)

లీలావతి: “ఆ తర్వాత ఆమె కార్యక్రమం ఆమె, నా పనులు నేను చేసుకుంటూ, ఒకరికి ఒకరం సఖ్యంగా, స్నేహంగా, ఉన్నాము. ఎన్నో విషయాలను మాట్లాడుకునే వారం. ఇలా జరుగుతూ వుండగా, ఒక రోజు స్నేహితురాలు సుగుణాదేవి ఒక రాత ప్రతిని తీసుకుని వచ్చారు. అది  చలం గారి జీవిత చరిత్ర అనీ, మీ పత్రికని ప్రింటు చేసే ప్రెస్ లో బుక్ తయారు చేయించాలని తీసుకువచ్చాననీ, చెప్పారు… అలా చలం గారి రచన నా దగ్గిరికి రావడం జరిగింది. దానిని నేను శ్రీ ధనికొండ హనుమంతరావు గారికి ఇవ్వడం జరిగింది………… ఈ సమయంలో రంగనాయకమ్మగారు మా యింటిలోనే వున్నారు కాబట్టి ఆమెకు కూడా ఈ విషయం తెలిసింది.  ఆ తరువాత రంగనాయకమ్మగారు చాలా తామసముతో ‘ఈ పుస్తకము అచ్చు వేయడానికి నాకు తప్ప ఎవరికి హక్కు లేదు. దానిని తెప్పించండి. దానికి అధికారికత్వం నాకు తప్ప ఎవరికి లేదు’ అని ఘంటాపదంగా చెప్పారు. తరువాత పురాణం సుబ్రహ్మణ్యశర్మగారికి ‘ఈ విధంగా ఇక్కడ చలం గారి రచన  ఉన్నది. మీరు దానిని సీరియల్ గా వేయవలెను’ అని ఉత్తరము వ్రాశారు. దానికి వారు స్పందించి, ‘వ్రాతప్రతిని పంపితే చూసి చెప్పుతాను’ అని తిరుగు సమాధానం వ్రాశారు. ఇప్పుడు ఆమె ఆలోచన నేను ఆ ప్రతిని తీసుకుని వచ్చి ఆమెకు ఇవ్వలేదు అనే బాధ ఆమెకు చాలా ఎక్కువ కలిగింది.”

(నేను లీలావతితో పోట్లాట పెట్టుకున్నానని చెప్పడానికి, ఆమెకి ఒక ‘కారణం‘ కావాలి. ఆ కారణం ఇదీ! ‘చలం రచనల మీద అధికారం అంతా నాదీ, దాన్ని నాకివ్వండీ‘ అన్నానట! నేను ఒక్క పైసా ఆదాయం లేక, నా పిల్లల బట్టలకైనా నాలుగు డబ్బులు వస్తాయని సినిమాల వాళ్ళ దగ్గిరికి వెళ్ళినదాన్ని అప్పుడు. అలాంటి నేను, ‘చలం రచనని అచ్చు వేయించడానికి నాకు తప్ప ఎవరికీ హక్కు లేదు’ అన్నానట! నేను

పురాణం గారికి చలం గారు రాసినదాన్ని సీరియల్ గా వేస్తారా అని రాశాననే అనుకుందాం. అలా జరిగి వుంటే, అందులో నేరం ఏమిటి? నేను, ‘తామసం‘తో, ‘ఘంటాపదంగా‘, ‘హక్కుల‘ గురించి మాట్లాడా ననీ, ఆ రచన కోసం లీలావతి గారితో పోట్లాడాననీ, చెప్పడానికి ఇదంతా!

ఆవిడ నన్ను ‘వెళ్ళమని‘ చెప్పిన సాయంత్రం నేను ఆశ్చర్యపోయి, ‘ఇదేమిటి, పని అయ్యేదాకా మీ ఇంట్లో వుండొచ్చన్నారు కదా?‘ అని,  అడగవలసిన రెండు మాటలు అడిగి, ‘సరే, సత్యం గారికి చెప్పండి‘ అంటే, ఆవిడే ఆయనకి ఫోను చేశారు. అప్పుడు నాకు ఆయన నంబరు తెలీదు. ఫోనులు వాడడం తెలీదు. నేను మేడ దిగి నా సామానుతో  కిందకి వెళ్ళిపోయి కూర్చున్నాను. జరిగింది ఇది అయితే, నేను ఎలా బైటికి వెళ్ళానో ఆవిడ చక్కగా వర్ణించింది. తర్వాత చూడండి.)

లీలావతి: “ఇక్కడ నా చేతికి వచ్చిన నాది కాని వస్తువును నేను రంగనాయకమ్మగారికి ఎలా ఇవ్వగలను? అలా చేయలేదన్న విషయాన్ని ఆమె భరించలేక ఆ రోజుకు తను చాలా బాధపడి ఆ రాత్రికి నా ద్వారా తనకు పరిచయమున్న స్నేహితుల కుటుంబానికి ఫోను చేసి ‘నన్ను అర్జంటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళండి’ అని ఒకటికి, రెండుసార్లు ఒత్తిడి చేస్తూ ఫోన్లు చేశారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆటో తీసుకుని వచ్చారు. వారు పైకి రాగానే వారితో కలసి లగేజీ తీసుకుని కిందికి వెళ్ళారు రంగనాయకమ్మగారు.”

(ఆ ‘భార్యాభర్తలు‘ ఎవరు? ఆ పేర్లు  చెప్పమంటే, ‘కొల్లి సత్యం, గిరిజా‘ అని చెపుతుందా లీలావతి? నా కోసం వచ్చిన ఆయన ‘ఇంటింటి కధ‘ సినిమా డైరెక్టరే. అప్పటికే నేను కిందకి పోయి వీధిలో కూర్చుని వున్నాను. సత్యం గారూ గిరిజ గారూ వచ్చాకే మేడ దిగడం కాదు!)

లీలావతి: “ఆమె (రంగనాయకమ్మ) సంస్కారవంతురాలే గనక అయితే, నా స్నేహితులైన వాళ్ళను పిలిచి వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళడం ఏమిటి?”

(తను వెళ్ళిపొమ్మంటే నేను వెళ్ళినట్టు కాదు. నేనే పోట్లాడి వెళ్ళిపోయానని! మళ్ళీ మళ్ళీ అదే అబద్దం! ఎవరి సినిమా కోసం రాయడానికి వచ్చానో ఆ సత్యం గారింటికి వెళ్ళినట్టు చెప్పదు. ఎవరింటికో వెళ్ళినట్టు!)

లీలావతి: “నేను ఆ రచనను (చలం రచనను) ఆమెకు ఇవ్వకపోవడము అనేది ఆమెకు చేసిన అన్యాయము, ద్రోహము అని తెలిస్తే, ‘ఇలాంటి వారి మధ్య వుండలేను. ఎక్కడికైనా పంపించండి’ అని నన్ను అడిగి వుంటే బాగుండేది. ‘ఇక మీరు వెళ్ళండి’ అని నేను అన్నానని పత్రికాముఖంగా చెప్పగలిగినందుకు ఆవిడ విజ్ఞతకే వదిలివేస్తున్నాను!”

(లీలావతి లీలల సారాంశం ఏమిటి? ‘రంగనాయకమ్మ, చలం పుస్తకం కోసం, నాతో పోట్లాడి తనే వెళ్ళిపోయింది; పైగా నేనే వెళ్ళమన్నానని పత్రికాముఖంగా చెప్పింది చూడండి‘ అని. – ఈ లీలలు ఒకటో రెండో కాదు. ఇంకా చూస్తూ వుండండి!)

లీలావతి: “చిన్న మెరుపు – అప్పట్లో కొందరు స్నేహితులు నన్ను జోక్ చేశారు. రంగనాయకమ్మగారిని ఇంటిలో వుంచుకొన్నందుకు మీకు పద్మభూషణ్ ఇవ్వాలి- అని అంటూ వుండేవారు.” -లీలావతి, లీలలే గాక, మెరుపులు కూడా చూపించగలదు.

(అప్పడు ఈవిడ ఆ స్నేహితులకు ఏం చెప్పింది? ‘రంగనాయకమ్మగారూ, నేనూ సఖ్యంగా, స్నేహంగా, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం‘ – అని చెప్పిందా? అలా తన ఉత్తరంలోనే రాసింది కదా?)

లీలావతి: “……. నా పైన వేసినది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము లాగ ఒక అభాండము లాంటిది.” – లీలావతి రాసిన ఉత్తరం, ఇక్కడితో ముగిసింది.

(‘అభాండము‘ ఎవరు ఎవరి మీద వేశారో తెలిసి వున్న లీలావతి, రచన పత్రిక్కి ఆ ఉత్తరం రాయడంలో చాలా మితిమీరిన సాహసం ప్రదర్శించింది! తర్వాత జరిగిన సంఘటనలు కూడా చూస్తే, నిజా నిజాలు బైట పడతాయి.)

ఆ ‘రచన’ పత్రికలోనే, లీలావతి వుత్తరం ముగిసిన తర్వాత, దాని కింద, ఇలా ఒక లైను వుంది : “ఈ చర్చ ఇక కొనసాగించలేము. -సం.“

అంటే, లీలావతి చెప్పిందే పరమ సత్యము; ఇక దాని మీద ఎవరూ చెప్పడానికి ఏమీ లేదు! అసలు అది చర్చా?

‘రచన’ మే సంచికలో లీలావతి ఉత్తరం చదివిన తర్వాత నేను ఏం చేశాను? ‘రచన’ పత్రిక ఎడిటరైన శాయి గారికి, మే 3న, ఒక ఉత్తరం రాశాను.

ఆ ఎడిటరు గారికి, 1972 నాటి పాత సంగతులన్నీ రాశాను. ఆ నాటి నా పాత ఉత్తరాలతో వచ్చిన “ఆత్మ కధాంశాల ఉత్తరాలు” అనే పుస్తకాన్ని ఆయనకి పంపించాను. ఆ ఉత్తరాల్లో వెనకటి సమాచారం అంతా వుంది. ‘బలిపీఠం’ సినిమా తీసిన సునీల్ చౌదరి గారి ఫోన్ నంబరు కూడా రాసి, “బలిపీఠానికి డైలాగ్స్ ఎవరు రాశారో సునీల్ గార్ని అడగండి” అని రాశాను. కొల్లి సత్యం గారి ఇంటి నంబరు కూడా ఇచ్చి, “ఇప్పుడు సత్యం గారు లేరు గానీ, గిరిజ గార్ని అడగండి, ‘ఇంటింటి కధ’ కి డైలాగ్స్ ఎవరు రాశారో” – అని రాశాను. ఇంకా,

“నా ‘ఉత్తరాల’ పుస్తకం త్వరలో రీ ప్రింటుకి వచ్చినప్పుడు, ఈ లీలావతి సంగతి అంతా అందులో పెడతాను” అని కూడా రాశాను. అంతే కాదు, ‘బలిపీఠం’  పాటల పుస్తకం నించీ, ‘ఇంటింటి కధ’ పాటల పుస్తకం నించీ, టైటిల్స్ పేజీల్ని కూడా నెట్ ద్వారా పంపించాను. ‘బలిపీఠం’ పుస్తకంలో,  ‘‘మాటలు : దాసరి నారాయణరావు’’ అనీ,  ‘ఇంటింటి కథ’ పుస్తకంలో  ‘‘మాటలు:  రంగనాయకమ్మ ’’ అనీ,  40 ఏళ్ళ కిందటే అచ్చయి  వుంది.  ఆ సమాచారం అంతా  ఆ పత్రిక ఎడిటర్ కి  పంపుతూ , ‘‘మీరు ప్రచురించిన ఉత్తరానికి సంబంధించిన నిజా నిజాలు మీరు ఇప్పుడు తెలుసుకోండి’’ అని రాశాను.

తర్వాత, వారం రోజులకి నాకు లీలావతి నించి ఫోను! “అసలు జరిగిందంతా మరిచిపోయానమ్మా! మీరు రచన ఎడిటరు గారికి పంపినవన్నీ ఆయన నాకు పంపారు. అవన్నీ చూస్తే ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా మర్చిపోయానండీ, మర్చిపోయానండీ, మర్చిపోయానండీ” – ఇదీ చెప్పడం!

నేను అందులో ఒక్క ముక్క కూడా నమ్మలేదు. చెప్పింది విన్నాను. అసలు ఆవిడ నాకు అప్పుడు ఫోను ఎందుకు చేసింది? తన అబద్దాల్నీ కట్టు కధల్నీ, బైట పెట్టగలిగే నా పాత ‘ఉత్తరాల’ పుస్తకమూ, సినిమాల పుస్తకాలూ, అన్నీ సాక్ష్యాలుగా వున్నాయి. జరిగిందంతా నా రీ ప్రింటు పుస్తకంలో పెడతానని చెప్పాను కూడా.

అనేక ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి, ఇక ఇందులో నించి బైట పడాలంటే, “మర్చిపోయాను – అంటే సరిపోతుంది. రంగనాయకమ్మని నమ్మించగలను” అనుకుని, అలా మాట్లాడింది.

ఆ మాటలు విన్న తర్వాత  నేను, “సరే, ‘రచన’ పత్రికలో మళ్ళీ ఒక ఉత్తరం రాయండి. రంగనాయకమ్మ అబద్దాలాడిందని మొదటి ఉత్తరంలో రాశారు కదా? దాన్ని సరిదిద్దుకోండి” అన్నాను.

ఆవిడ వెంటనే నిరసనగా, “మీరు అబద్దాలాడారని నేను అనలేదే!” అంది. సరిగ్గా ఇదే వాక్యం!

“అనలేదా? పత్రికలో మీరు రాసిన ఉత్తరం ఇప్పుడు చదవండి ఒక సారి. ‘అసత్యాన్ని సత్యంగా చెప్పింది’ అని రాశారు. చలంగారి రచనని నాకే  ఇవ్వమని మీతో పోట్లాడాననీ, నేనే బైటికి వెళ్ళిపోయాననీ, రాశారు. మీరు వెళ్ళమన్నారా, నేను వెళ్ళానా? మీరు పిలిస్తే నేను మద్రాసు వచ్చానా, బలిపీఠం వాళ్ళు పిలిస్తే వచ్చానా? నేను ‘ఇంటింటి కధ’ కోసం వచ్చానా, బలిపీఠం కోసం వచ్చానా? – అదే కదా అసలు  చెప్పవలసిన విషయం? అసలు జరిగిందేమిటో చెపుతూ ఇంకో ఉత్తరం రాయండి” అన్నాను.

“ఆ( …. రాస్తాను. ఒక సారి మీ దగ్గిరికి వస్తానండీ.”

“అది ఇప్పుడు కాదు” అని ఫోను పెట్టేశాను.

లీలావతి, ‘రచన’ పత్రికలో మళ్ళీ రాస్తే, ఆ ఎడిటరు గారు దాన్ని వేస్తారా? “చర్చని కొనసాగించలేము” అన్న “భీకర ప్రకటన” ఏమవుతుంది? ఆ ఉత్తరాన్ని వెయ్యకపోతే, లీలావతి ఆ ఉత్తరాన్ని నాకే పంపిస్తుందా? నేను దాన్ని నా రీ ప్రింటు పుస్తకంలో పెట్టుకోవాలా? సరే, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను.

ఆవిడ మళ్ళీ రాయబోయే దాంట్లో అనేక ఆరోపణలకు జవాబులు చెప్పుకోవాలి. అసలు ‘జరగని’ విషయాల్ని ఎందుకు చెప్పిందో, దానికి జవాబులు చెప్పుకోవాలి.

“మద్రాసులో లీలావతి గారు చేసినట్టుగా, నన్ను కృష్ణాబాయి గారు ఇంట్లో నించి వెళ్ళమనలేదు” అని నేను రాసినదాన్ని నా వ్యాసంలో చదివినప్పుడు లీలావతి ఏం చెయ్యాలి? – అలా జరగడం నిజమే కాబట్టి, తను తప్పు చేసింది కాబట్టి, ఆ నిజాన్ని అంగీకరించి, మౌనంగా వుండిపోతే సరిపోయేది. కానీ ఆవిడ పెద్ద వీరత్వంతో బైల్దేరింది. అబద్ధాల, కట్టు కధల సృష్టి చేసింది. అవతల ‘బలిపీఠం’ సినిమా వివరాలూ, ‘ఇంటింటి కధ’ సినిమా వివరాలూ, బట్టబయలుగా వుంటాయనే భయం అయినా లేకపోయింది. కల్పనల ఉత్తరం తయారుచేసింది. అది పత్రికలో వచ్చేసింది.

బూర్జువా కోర్టుల్లో కూడా, ఒక కేసుని మూసేసిన తర్వాత కూడా, నిజం బైటపడితే, కేసుని మళ్ళీ తెరుస్తారు. ‘చర్చ’ కాని దానికి చర్చగా పేరు పెట్టి, ఒక అబద్దాల ఉత్తరాన్ని ప్రచురించి, నేను జవాబు చెప్పడానికి అవకాశం లేకుండా చేసి, లీలావతి ఉత్తరం ఎంత అబద్దమో ఆధారాలన్నీ బైట పడ్డాక అయినా, ఆ ఎడిటరు గారు తన బాధ్యతతో పత్రికలో ఒక వాక్యం రాయవచ్చు కదా? “మాకు ఈ నిజాలన్నీ తెలియక, లీలావతి గారు రాసిన వుత్తరాన్ని ప్రచురించాము. చింతిస్తున్నాము” అని ఒక్క వాక్యం ప్రచురించాలనే వివేకం లేకపోయిందా ఎడిటరు గారికి? మరి, ఇక నీతి అంటే, నిజాయితీ అంటే ఏమిటి?

ఒక వేళ, లీలావతి మళ్ళీ రాస్తే, “రంగనాయకమ్మగారు ఏ పని మీద వచ్చారో నేను మర్చిపోయాను, మర్చిపోయాను, మర్చిపోయాను, మర్చిపోయాను” అనే మాటలతోనే  ఆ ఉత్తరం నిండుతుందని ఊహించాను.

తర్వాత, జూన్ నెల ‘రచన’ మాస పత్రిక కూడా వచ్చింది. అందులో, లీలావతి ఉత్తరం ఏదీ లేదు. ఎందుకు లేదో ఆ కారణాన్ని ఊహించుకోవలిసిందే.

లీలావతే రాసి వుండదా? లేదా, పత్రిక వారు “చర్చని కొనసాగించము” అన్నారు కాబట్టి, లీలావతి ఉత్తరాన్ని తీసుకోలేదా? తీసుకోకపోతే , ఆ ఉత్తరాన్ని లీలావతి నాకు పంపాలి కదా? నాకు ఫోన్ చేసి,  “నేను రాశానండీ, పత్రిక వాళ్ళు వెయ్యలేదండీ” అని నాకు చెప్పాలి కదా? చెప్పలేదేం? అంటే, లీలావతే, ఉత్తరం రాయలేదన్నమాట! ఎలా రాస్తుంది? జరగని కల్పనలు సృష్టించింది కదా? వాటికి ఏం కారణాలు చెప్పుకుంటుంది? సాధ్యం కాదు గదా? అందుకే రాసి వుండదు.

ఈ ప్రశ్నలు అనవసరం. మొత్తానికి లీలావతి ఉత్తరం పత్రికలో లేదు. లీలావతి మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదు, ఏ మాటా  చెప్పలేదు.

ఆమె, రెండో ఉత్తరం నిజంగా రాసినా ఏం రాసేది? “రంగనాయకమ్మగారు, సత్యం గారి సినిమాకి రాయడానికే వచ్చారని మర్చేపోయాను” అని మాత్రమే రాసేది. “ఆమెను నేనే పిలిచాను” అని మాత్రం రాసేది కాదు.

సరే,  జరిగినదాన్ని మర్చిపోయావు. జరగని సంగతులెన్నో నీ ఉత్తరంలోకి ఎలా వచ్చాయి? రంగనాయకమ్మ, బలిపీఠానికి రాయడానికే వచ్చిందని ఎలా చెప్పగలిగావు? చలం గారి పుస్తకం మీద పెత్తనం తనకే కావాలని నీతో గొడవ పెట్టుకుందనీ, తనే ఎవరెవరికో ఫోన్లు చేసి వెళ్ళిపోయిందనీ, అవన్నీ ఎలా చెప్పగలిగావు?  జరగని విషయాల్ని ఎలా తెచ్చిపెట్టావు? అన్ని అబద్దాలు దేని కోసం సృష్టించవలసి వచ్చింది? నీ వల్ల నిజంగా జరిగిన తప్పుల్ని దాచి పెట్టడానికి పట్టిన దారి అది! ఇప్పుడు జరిగింది అదే. అసలు ఉత్తరమే లేదు!

“సినిమా పని పూర్తి అయ్యే దాకా మీరు మా ఇంట్లో నిశ్చింతగా వుండండి. సత్యంగారు మా స్నేహితులు. వారి పని కోసం మీరు మా దగ్గిరే వుండాలి” అని చెప్పి చెప్పి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, “మీరిక వెళ్ళండి, నా కూతురు అలా అంటోంది” అనడం, ఇవన్నీ అసలు నిజాలు. వాటిని కప్పి పెట్టడానికి ఎంత కల్పన అల్లవలసి వచ్చింది లీలావతికి! ఎంత సత్యసంధత! రంగనాయకమ్మ, అసత్యాన్ని సత్యము లాగ చెప్పిందట! ‘తామసముగ’ పోట్లాడిందట! ఇంత అధోగతికి దిగాలా మనిషిగా పుట్టిన మనిషి!

(‘చినుకు’ మాసపత్రిక సౌజన్యంతో)

disclaimer: ఈ వివాదంలోని అంశాలతో ‘వాకిలి’ పత్రికకు ఎలాంటి సంబంధమూ లేదు.