వాకిలి » రవి వీరెల్లి

వర్షం
గ్లాసెడు గోర్వెచ్చటి ప్రేమను గటగటా తాగు

నీటిచిదుపల చెంపల్ని వాయించే చిలిపి స్లిప్పర్స్ తొడుక్కో

పొద్దున్న ఆకాశం విచ్చుకున్నట్టు స్వేదరంధ్రాలన్నీటినీ తెరిచిపెట్టు

నీకు తెలిసిన ఆ ఏడురంగుల్ని పుట్టపురాగ మరిచిపో

నిలువనీయని ఇంద్రియాలను వచ్చిపొయ్యే గాలికి వదిలెయ్యి

పెయ్యి తుడుచుకున్నాక తువ్వాల దులిపినట్టు మనసుని జాడించు

ముఖ్యంగా ఆ మూలకున్న చెత్తిర్ని అస్సలే మందలియ్యకు

అగడుపడ్డట్టు వెలుగునడుక్కునే కంటిచిప్పల్ని మూలకు బోర్లించి

కలల మడుగులో ఓడనడిపే చిన్నపిల్లోడి కంటిచూపుని అరువుతెచ్చుకో

అదిగో

ముత్యపు నీటి బిందెల్ని మోసుకుంటూ

అడ్డదార్లో ఆయాసపడుకుంటూ అదొస్తుంది చూసావా-

దానికిపుడు

దేహాన్ని కాయితప్పడవగా చేసుకుని

లొంగిపో.

మొదటి ముద్రణ: తానా తెలుగుపలుకు, మే 2017

ఈ రోజు నీ పేరు మీదే!
నిజాలనీడలెక్కడ నిద్రలేస్తాయోనని

సూర్యుడు కళ్ళు తెరవని రోజు-

ఎప్పుడూ ఆహ్వానించే గుడి తలుపులు

ముఖంమీదే మూతపడ్డ రోజు-

నిలువెత్తు నమ్మకపు ద్వజస్తంభం

చిన్న సందేహపు సుడిగాలికి విరిగిపడ్డ రోజు-

గణగణమని జపించే స్నేహపుగంటలు

ఒక్కొక్కటే తెగిపడ్డ రోజు-

ఎన్నో దు:ఖాల్ని సునాయాసంగా తోడి

అవతల పారబోసిన విశ్వాసపు బొక్కెన తాడు

పికిలి పోయిన రోజు-

కాలాలతో తిరస్కరించబడ్డ రోజు-

దారానికి ఎక్కించలేక

పువ్వుల్లేని దండలా

పూసల్లేని అబాకస్ లా

ఏ లెక్కల్లోనూ ఇమడని రోజు-

కనుకొలుకుల్లోంచి చివరి చినుకులా రాలి

దేహాన్ని దాటి

మనసులోయల్ని కోస్తూ

ఇప్పుడప్పుడే ఇంకిపోని రోజు…

ప్రభూ

ఈ రోజు మీద నీ పేరే రాస్తున్నా.

వీడ్కోలు
ముచ్చటించడానికి

వచ్చిన మిత్రులంతా

వీడ్కోలు చెప్పి

ఇప్పుడే వెళ్ళిపోయారు.

మంచాన్ని నిలబెట్టి

పెరట్లో పూలమొక్కలకి నీళ్ళుపోసి

పలకను తుడిపేసి..

ఉడుకుతున్న అన్నం వాసన

ఇంకా మనసుకి వేలాడుతూ ఉండగానే

ప్రభూ

ఇదిగో

వస్తున్నానుండు.

ఎవరు వీళ్ళు?!
ఆకాశాన్ని డేరాలా వేసుకుని

చీకటి పుల్లల చితి మీద రోజుల్ని దహనం చేస్తూ

క్షణాల్ని మొక్కపొత్తుల్లా కాల్చుకుతింటూ

ఎవరు వీళ్ళు?!

ఆత్మల్ని మిణుగురు పురుగుల్లా మెరిపిస్తూ

దారిపొడుగునా పలకరింతల్ని చల్లుతూ

ఎవర్ని ఆకర్షిస్తున్నారు వీళ్ళు?!

ఓ రోజు దైర్యం చేసి దగ్గరికెళ్ళా.

దూరం నుండి చూస్తే ఒక్క గుంపుగా కనిపించే వీళ్ళు

పోశిస్తున్న పాత్రలు మాత్రం ఒక్క కథవి కావు.

ఎవరి కథ వాళ్ళదే!

ఆఖరి అడుగు
కంటి పువ్వు మీద వాలింది.

ఉదయానిదో సాయంత్రానిదో తెలియని

సంధ్య.

ఇంకా పాలేర్లలా పనిచేయలేమని

నరాలన్నీ మొరాయించే వరకూ

నెత్తిమీదో, వీపుమీదో లేదా ఛాతీమీదో

మొయ్యాల్సిందే.

ఉత్తి బరువు మార్చుకోడానికి తప్ప

నోటికెప్పుడూ అందిరాలేదు

చేతులు.

లెక్కలన్నీ పూర్తిచేసుకుని

వెలుగుకలాన్ని చెవిలో చెక్కుకుని

ఎప్పుడూ పాడని పాటొకటి పాడుకుంటూ

నాతోపాటే చివరి కొండ దాటుతుంటాడు

మిత్రుడొకడు.

నాతో పుట్టి

నాలోనే పెరిగిన శత్రువొకరు

ఇక ఇక్కడ్నుంచి

నా బరువు తనే మోస్తానంటాడు.

ఇంకొకే ఒక్క

చిక్కటి అడవిలాంటి

చీకటి పొర

అదీ దాటేస్తే…

పత్రికలకి పంపించండి..
కనీకనిపించని దూరంలో ముడుచుకున్న మొగ్గలా కూచునుంటుంది.

కవ్విస్తుంది. ప్రేమగా లోనికి లాక్కున్నట్టే లాక్కుని విసిరి కొడుతుంది. మాట్లాడినట్టే మాట్లాడి అలిగి కూర్చుంటుంది.

దగ్గరికెల్తావు. బుజ్జగిస్తావు. నవ్విస్తావు. నవ్వుతావు. అర్థం చేసుకుంటావు. అపార్థం చేసుకుంటావు. హత్తుకుంటావు. విసుక్కుంటావు. ఆఖరికి భోరు.. భోరుమని ఏడుస్తావు. సూర్యమండలాలు యానిస్తూ, అందని హై ఫ్రీక్వెన్సీని కూడా ట్యూన్ చేసుకుని ఆలోచిస్తావు. చివరికి ఎట్లాగైతేనేం ఆ శతకోటి పెటల్స్ ఉన్న అందమైన పూవుని ఆసాంతం విప్పి ఆ సువాసనల్ని అనువదించి కాయితమ్మీద పెడతావు.

చదివి చూసుకుంటావు. పొంగి, పొర్లిపోతావు, మురిసి, ముసిరింతై, కరిగి, ఆవిరై తేలిపోతావు. అబ్బబ్బబ్బ… ఇంత అందమైన పీస్ ఇంతవరకు ఎవరూ రాసుండరు అనుకుంటావు.

ఎక్కడికి పంపాలో నిర్ణయించుకుంటావు. పదికి పది మార్కులేసుకుంటే బాగా పేరున్న సాహిత్య పేజీకి, కొంచెం తక్కువ మార్కులేసుకుంటే మరో పత్రికకి పంపిస్తావు.

ఇక అప్పటినుండి నీ కళ్ళు, ఒంటిపైనున్న స్వేదరంద్రాలన్నీటిని రెంట్ చేసుకుని ఎదురుచూపులు మొదలెడుతాయి. కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు కూడా నువ్విలా పడిగాపులు కాసి ఉండవు. ప్రియమైన ఎడిటరు దగ్గరినుండి ఏ ఉత్తరం ముక్కా రాదు. ప్రతీ ఆదివారం ఆ ఒక్క సాహిత్య పేజీ కోసం మొత్తం పత్రిక కొంటావు. అలా మూడు నాలుగు వారాలు గడుస్తుంది. ఎదో అనుమానం పప్పుబద్దల్ని పగులగొట్టుకుని పచ్చగా చిగురిస్తుంది. పంపించింది మరోసారి చదువుకుంటావు. అరె! బాగానే ఉందికదా ఎందుకు అచ్చువేసి ఉండరు?! పత్రిక ఎడిటర్ ను పాళితో పొడిచి చంపేయాలన్నంత కోపం వస్తుంది. “యే.. యీ పత్రికా ఎడిటర్లు అందరూ ఇంతే! వీళ్ళ మునివేళ్ళలో సూదులు గుచ్చా… వీళ్ల మొహాన సిరా మరిగించి పొయ్యా.. తెలిసినవాళ్ళ రచనలు పరమచెత్తగా ఉన్నా వేస్తారు. మబ్బుని పగ్గం వేసి గుంజేంత పవరున్న నా కవితను మాత్రం కనీసం చదివి కూడా ఉండరు,” అని నీలో నువ్వే సణుగుణుక్కుంటావు. రోజుకంటే ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతావు. బట్టల అట్టడుగులో ఉన్న శాలువా తీసి ముతకవాసనేసినా కప్పుకుంటావు. ఇంకో వారం గడుస్తుంది. సందె కాంతికిరణంలా, శబరి కంటిచూపులా, నీ ఎదురుచూపులో ముందున్న తీక్షణత తగ్గుతుంది. ఎదో జ్ఞానోదయం అవుతుంది. మరో పీస్ రాయడం మొదలెడతావు.

మరో కొత్త మొదలు ముడుచుకున్న మొగ్గలా కనిపిస్తుంది. ఫిర్ సే శురూ…

రాయడానికి కావలసిన inspiration బలంగా ఉండాలేగానీ ఈ రిజెక్షన్స్, ఈ విమర్శలు, కాలిగోటికి తాకే పోటురాళ్ళ లాంటివి. కాసేపు జివ్వుమన్నా ముందొచ్చే తొవ్వ గురించి మందలించి చెబుతాయి.

ఈ మధ్య పేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను. “పత్రికలో ఒక రచయిత రచన అచ్చు కావాలంటే ఆ పత్రికలో రచయితకు తెలిసిన వాళ్ళుండాలి. పత్రికా సంపాదకులు వాళ్ళకు తెలిసిన రచయితల రచనలు ఎట్లా ఉన్నా వేస్తారు. కొత్తవాళ్లవి కనీసం చదవరు“, ఇదీ దాని సారాంశం.

ఇందులో నిజానిజాలు అంత ఈసీగా తేల్చేవి కాదుగానీ, నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే, పత్రికా సంపాదకులు తమకు అందిన రచనలన్నీ పొల్లుపోకుండా చదవకున్నా కనీసం చూడనైతే చూస్తారు. అది కొత్త రచయితదైనా, పే..ద్ద పేరున్న రచయితదైనా.

1987 లో అనుకుంటా, పోస్ట్ కార్డు మీద ఓ కవిత రాసి, ఆ కవితకు శీర్షిక కూడా పెట్టకుండా ఆంధ్రభూమి వీక్లీ అడ్రస్ కి పోస్ట్ చేశా. పాపం అప్పటి ఎడిటర్ ఎవరోగానీ ఆయనకి మొక్కాలి. కవితకు ఆయనే టైటిల్ పెట్టి ప్రచురించారు. నా మొట్టమొదటి కవిత అచ్చులో చూసుకున్నది అప్పుడే. మరిచిపోలేని మరో విషయమేమిటంటే, పారితోషికం కూడా పంపించారు.

ఆఁ.. అప్పుడున్నంత మంచి ఎడిటర్స్ ఇప్పుడెక్కడున్నారు అనేగా మీరంటారు?!

కచ్చితంగా ఉన్నారు. అటు అచ్చుపత్రికల్లో ఉన్నారు. ఇటు వెబ్ పత్రికల్లోనూ ఉన్నారు. పత్రికలకు రచనలు పంపడానికి సంపాదకుల ఈమెయిలు అడ్రసులు కావాలేగానీ వాళ్ళు మనకి యార్లు కానక్కరలేదు.

బాధ్యత, నిబద్ధత ఉన్న ఏ సంపాదకులైనా వాళ్లకు వచ్చిన ప్రతీ రచనని ఒక్కటికి రెండు సార్లు చదివి, నచ్చిన రచనలను ఎడిటోరియల్ బోర్డులో చర్చిస్తారు. రచన అందిందని ఈమెయిలు పెడతారు. ఎడిటింగ్ అవసరం అయితే సజెషన్స్ పంపిస్తారు. ప్రచురించేదీ, లేనిది తెలియజేస్తారు. కొత్తవాళ్ళవి, పాతవాళ్లవి అని కాకుండా కొత్తదనం ఉన్న అన్ని రచనలకూ ప్రాముఖ్యత ఇస్తారు.

మీ రచన వీలయినంత ఎక్కువ మందికి చేరాలంటే, ఎప్పుడూ మీ ఫేస్బుక్ వాల్ కొ, మీ డైరీకో పరిమితం చేయకుండా వీలయినన్ని పత్రికలకి పంపించండి. అప్పుడప్పుడూ జిల్లాల్లోంచి విడుదలయ్యే చిన్న చిన్న అచ్చుపత్రికలకి కూడా పంపండి.

ఫేస్బుక్ లో దొరికినన్ని కామెంట్స్ వెబ్ పత్రికల్లో దొరక్కపోవొచ్చు, అచ్చుపత్రికలో మీ రచన చదివిన ప్రతీ ఒక్కరూ మీకు ఫోన్ చేయలేకపోవొచ్చు. కానీ మీ రచన ఏమారుమూలో ఉన్న ఏ ఒంటరి గుండెనైనా నింపొచ్చు. మీ కవిత మరొకరి కంటికి దీపం కావచ్చు. మీ కథ ఇచ్చిన ప్రేరణ ఒక కుటుంబాన్నే బాగుచేయొచ్చు.

మీరు మీకోసం రాసుకున్నా.. మాతో, మా పాఠకులతో పంచుకోండి.

చీకటి వంతెన చివర
యుద్ధం ముగిసింతర్వాత

అక్కడేం మిగిలుండదు.

నెత్తురోడిన కత్తులు చీకటి ఒరల్లోకి

ఒద్దికగా ఒదిగిపోతాయి.

నుదుటి కుంకుమ చెరిపేసుకున్న ఆకాశం

దిగులు కాన్వాసుపై గీసిన ఒంటరి మేఘంలా

తీరం లేని శూన్యాన్ని ఈదుతూ ఉంటుంది.

మోరలెత్తి నుంచున్న శిఖరాలన్నీ

అదాటున లోయలుగా మారుతుంటాయి.

రెప్పల పిడికిట్లో చూర్ణం అయిన రంగులన్నీ

చీకటి ప్రవాహంలో కలిసిపోతుంటాయి.

ఒంటిమీద కంటి పడవలన్నీ తెరచాపలెత్తి

కలల అలల్లో తునిగిపోతుంటాయి.

ఆమె మాత్రం

ఎప్పట్లాగే

చీకటి పుల్లకు లోకాన్ని గుచ్చి

రేపటి నిప్పుకణికలమీద కాల్చడానికి

వ్యూహరచన చేస్తూంటుంది.

Writer’s block
టేబుల్ మీద తెల్లకాయితం బోసిపోయి నెల రోజుల నుంచి అట్లాగే రెపరెపలాడుతుంది. డెస్క్ టాప్ మీద draft.docx, పదాలు వలసపోయిన ఖాళీ పోయెంలా పడుంది. ఎప్పుడూ రింగురింగులుగా నీ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పి, ఆలోచనకి ఓ రూపాన్నిచ్చి, పదాల పరదాలవెనక నవ్వుతూ ఫెడ్ అయ్యే సిగరెట్ పొగ, ఇప్పుడు ఏ ఆకారమూ లేని పొగ మంచులా ఏటవాలు కిరణానికి ఉరేసుకుంటుంది. ఒడ్డున పొద్దున్నే బయల్దేరాల్సిన Inspiration బొట్ చిల్లుపడి చల్లటి నీళ్ళను చిమ్ముతుంది. ఆలోచనలు గడ్డకట్టి నరాలు చిట్లిపోతున్నాయి. చిన్న చీమంత ఫాంట్ సైజుతో మొదలైన ఆ రెండు పదాలు ఏనుగంత ఎదిగి పెనుభూతమై కౌగిలించుకుంటున్నాయి.

“writer’s block”

“writer’s block”

“writer’s block”

కవి కళ్ళు పొడిచేసి, వేళ్ళనించి రక్తాన్ని పీల్చుకుని తాగే కనపడని దయ్యం ఇది!

ముప్పై ఏళ్ళ మైలురాయి కావచ్చు, నలభై కావొచ్చు. ప్రతీ మనిషి జీవితంలో ఎదో ఓసారి ఆ మైలురాయి మీద కూచుండి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. గడిచిన జీవితాన్ని తలుచుకుంటూనో, నడవబోయే ప్రయాణాన్ని అంచనా వేసుకుంటూనో, మరిచిపోయిన గమ్యాన్ని గుర్తుచేసుకుంటూనో ఆలోచనల గడియారానికి కుంజీ ఇస్తూ కాసేపు కూర్చుండిపోతాడక్కడ. కవి కూడా అంతే. ఒకటో రెండో సంకలనాలు వేసింతర్వాత వెనక్కి తిరిగి ఇప్పటివరకు ఏం రాసాం, ఏం రాయాలనుకున్నాం, ఇకముందు ఏం రాయాలి అన్న ఆలోచనలో పడతాడు. రాసిందే రాస్తున్నామనో, రాయాలనుకున్నది రాయలేకపోతున్నామనో ఒక సందిగ్ధంలో పడిపోతాడు. రాసిన ప్రతీది తన లోలోని inner critic చేతిలో చిత్తుగా ఓడిపోతున్నప్పుడు, ఇప్పటి వరకు రాసినవన్నీ ఒకే పద్యాన్ని తిరగ రాసినవేనా అనిపించినపుడు, ఒకప్పుడు దేవకన్యలా కనిపించి ఒక్క మనకే స్వంతం అయిన కొన్ని వాక్యాలు/పదాలు, ఇప్పుడు అరిగిపోయి అందాన్ని కోల్పోయినట్టు కనిపించినపుడు, ప్రతీ రచయిత ఒక స్థబ్దతకు లోనవుతాడు. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఏ గురుతుల్యునికో ఫోన్ చేసి మందు అడగాలా? ఏ డాక్టర్ దగ్గరకో వెళ్లి block అయిన creative గుండెకు నాలుగు స్టెంట్స్ వేయించుకోవాలా?

ఏం చేయాలి?

ఏం చేయకూడదు?

జీవితం మనం మనకే ఇష్టంగా రాసుకుంటున్న ప్రేమలేఖ లాంటిది. గబుక్కున లాక్కుని లక్కముద్దెరెప్పుడేద్దామా అని కొంటె కాలం ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటుంది. కాలం మింగేస్తుందని జీవించడం మానం కదా! జీవితం లాగే రాయడం అనే ప్రక్రియ కూడా ఒక నిరంతర యుద్ధం లాంటిది. అయితే ఈ యుద్ధం బతుకుదెరువు కోసం చేసేది కాదు. ఇష్టంగా చేసే యుద్ధం. అందుకే ముందు మనల్ని మనం ప్రేమించుకొగలగాలి. మన రాతల్ని ఇష్టపడాలి. మన కోసం మనం రాసుకోగాలగాలి. Writing కి మనకి మధ్య ఉన్న ఆ love-hate అనుబంధాన్ని కాస్త దువ్వి love-love గా మార్చుకోగలగాలి. ఇదంతా జరగాలంటే ప్రేరణ కావాలి, నిబద్ధత కావాలి, రాయడం అవసరం అనుకోగాలగాలి, అన్నిటికీ మించి ఎదురుచూసే ఓర్పు కావాలి.

“writer’s block” వల్ల  చెడు కంటే మంచే ఎక్కువ జరుగుతుంది. రాస్తూ రాస్తూ ఆగిపోవడం వలన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం దొరుకుతుంది. మరింత చదివే వీలుకలుగుతుంది. మనం రాసినవి మళ్ళీ చదువుకుని ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ చేసుకోడానికి ఒక మనదైన time block ని ముందు ఉంచుతుంది.

ప్రముఖ కవి Billy Collins ఒక రేడియో ఇంటర్వ్యూలో ఏమన్నారో చూడండి:

Radio Host: Billy, what do you do on those days when it just doesn’t come to you?

COLLINS: Oh, the – poets do the thing – we’d go to the dry cleaner. I mean, the usual stuff. Well, I wait. I mean, I – there’s this term, writer’s block. I – I don’t believe in it. I don’t like to even hear the term. I mean, you can’t be writing constantly because you’d be insane. So there must be periods of non-writing.

And then it’s just a matter of how do you view them? And I just view them as I’m – I’m waiting. Waiting for something to come along. And I think that’s a kind of healthy way, rather than thinking I’m not writing. That means I’ll never write.

“writer’s block” అనేది ఉత్తి భ్రమ అనీ, అది మనం ఊహించుకునే దయ్యం లాంటిదనీ, అసలు ఈ writer’s block అనేది నిజానికి ఉండనే ఉండదు అని కొంతమంది రచయితల అభిప్రాయం. అయితే ఈ స్థితి ప్రతీ రచయిత తన జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుభవించే ఉంటాడు అనేది నా అనుమానం. ఈ writer’s block ని అధికమాసంలా అనుకోకుండా వచ్చిన ఒక time block గా మార్చుకోవడానికి రచయితగా నిలదొక్కుకుంటున్న మీరైతే ఏం చేస్తారు?

సొంతవాక్యం
కొండతల్లికి పిల్ల జాలులా పుట్టి, నడక నేర్చుకుని నదిలా మారి, కాసేపు రాళ్ళ కోతలు భరిస్తూ, కాసేపు హాయిగా పల్లాల మీదుగా కూడా పయనిస్తూ, ఎప్పుడూ సముద్రాన్నే పలవరిస్తూ ముందుకే వెళ్ళే నదిలా మనం రాబోయే కష్టాలను బేరీజు వేసుకుంటూ సుఖాలకనుగుణంగా గమనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాము. కానీ, ఒకడుగు ముందుకు వేస్తే మొల్దారాన్ని పట్టి రెండడుగులు వెనక్కి లాగుతుంది జ్ఞాపకాల కొక్కెం. సాలిడ్ స్టేట్ హార్డ్ డిస్క్ లా చప్పుడు చేయకుండా జ్ఞాపకాలను క్రంచ్ చేస్తూ మెదడు మనల్ని వెనక్కి పంపి ఎదో ఓ పాత ట్రాక్ లోకి తోసేస్తుంది. ఇక ఆ ట్రాక్ లోనే తియ్యగా కూనిరాగం తీస్తూ, తిరుగుతూ, బయటికి రావడానికి ప్రయత్నిస్తూ కావాలనే ఓడిపోతుంటాం. పొద్దున్నే పొయ్యి వెలిగించుకొని చాయ్ పెట్టుకున్నట్టు, రోజూ మన శరీరాన్ని ఎదో ఓ జ్ఞాపకం కాల్చుకుతింటూనే ఉంటుంది. అమ్మనొ, ఎలిమెంటరీ స్కూల్ మాష్టారినో, చిన్ననాటి మిత్రుడినో మన గుండెల్లోకి గబాల్న తోస్తుంది. వెనక్కి తిరిగి నడిచొచ్చిన దారుల మీంచి మళ్ళీ నడవాలన్న తీవ్రమైన కోరిక మనకు ఉన్నా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే వెసులుబాటు లేక జ్ఞాపకపు పావురానికి ఓ ఉత్తరం కట్టి పుట్టిన ఊరికి సాగనంపినట్టు కాయితం మీద ఏవో నాలుగు మాటలు రాసుకుని సంతోషిస్తుంటాము.

జ్ఞాపకమంటే గుర్తొచ్చింది. మీకందరికీ ఎలిమెంటరీలో సొంతవాక్యాలు రాసిన రోజులు ఇంకా గుర్తుండే వుంటాయి. మాస్టారు ఏదైనా పదం ఇస్తే అప్పటికప్పుడు ఆ పదంతో సొంతవాక్యం రాసి ఇవ్వాలి. వాక్యం కుదురుగా, కుందనపుబొమ్మలా లేకపొతే అమ్మాయిలతో చెంప దెబ్బలు వేయిస్తారనే భయం. ఆ భయంతో రాసిన నాలుగు అక్షరాలూ కాస్తా అలుక్కుపోవడాలు, అక్షరాలు ముత్యాల్లా లేకపోతే “కోడి కెలికినట్టు, కొంగ తొక్కినట్టు” ఏంటిరా ఈ రాతలు అని మాస్టారు తిట్టిపోయడాలు ఇంకా గుర్తుండే వుంటాయి. ఇప్పటికి కూడా మీరు వాక్యం రాసినప్పుడల్లా తెలుగు మాష్టారు మీ కళ్ళ ముందు కర్ర పట్టుకుని నిలబడి నిలదీస్తున్నట్టు అనిపిస్తుంటుంది కదూ?! మీరు ఎలిమెంటరీ బళ్ళో ఏవో స్వంత వాక్యాలు రాసే ఉంటారు కదా?! మొట్టమొదటి వాక్యం ఏం రాసారో గుర్తుందా? “నాకు అమ్మంటే ఇష్టం” అనో “సీత ఈ రోజు స్కూలుకు రాలేదు” అనో, లేదా చిలిపిగా “పొట్టి జుట్టు సీత పొడుగు ముక్కు పద్మను కొట్టింది” అనో రాసుంటారు కదూ? సరే, మీ ఎలమెంటరీ రోజులు గుర్తు తెచ్చుకుని సరదాగా ఇప్పుడు “జానెడు”, “బెత్తెడు” అనే పదాలు వాడి ఓ మూరెడు వాక్యం రాయండి చూద్దాం!

“You can’t really succeed with a novel anyway; they’re too big. It’s like city planning. You can’t plan a perfect city because there’s too much going on that you can’t take into account. You can, however, write a perfect sentence now and then. I have.” ― Gore Vidal

నవల, కథ, కవిత్వం ఇలా ఏది రాయాలన్నా ముందు వాక్యం కుదురుగా రాయడం నేర్చుకోవాల్సిందే. పెద్ద నవలలూ, కథలు రాయడం కష్టమే, కానీ ప్రయత్నిస్తే చక్కని వాక్యాలు కొన్నయినా రాయొచ్చు. చచ్చే లోపు చక్కని వాక్యం ఒక్కటైనా రాయాలనే తపన ఉండాలి. వాక్యం ప్రాణం పోసుకుని మనతో మనసువిప్పి మాట్లాడే వరకు తరిచి తరిచి చూసుకోవాలి, శ్రద్దగా మళ్ళీ మళ్ళీ తిరగ రాయాలి.

కవిత్వం అభ్యాసం చేస్తే వస్తుందో రాదో తెలియదు గానీ రాత/కోతలు సాధనతో సాధించుకునే విద్యలే! కొంతమంది రాసిన వచనం చదువుతుంటే కళ్ళు వాక్యంవెంట పరుగుపెట్టి వెనక్కి రానని మొరాయిస్తుంటాయి. ఆ స్వచ్చమైన, స్పష్టమైన వాక్యనిర్మాణం వెనుక ప్రత్యేకమైన పథకం ఎదో ఉన్నట్టు మనకనిపిస్తుంది. ప్రతీ వాక్యం ఓ చిక్కటి అనుభూతిని మోస్తూ, అనుకోకుండా వచ్చిన అవార్డ్ లా ఆశ్చర్యాన్ని పంచుతుంది. వాక్యం మొదటి నుంచి చివరి వరకు రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. అబ్బ! వచనం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. మంచి వాక్యాలు చదవడానికి హాయిగా ఉండి మన మనసుల్లో పదికాలాల పాటు పదిలంగా నిలిచిపోతాయి.

వాక్యం నిడివి గురించి నోబెల్ గ్రహీత “Orhan Pamuk” అన్నట్టు, “Even the composition of my sentences—I prepare the reader for something and then I surprise him. Perhaps that’s why I love long sentences.”, ఎంతైనా పొడుగు జడలా పొడుగు వాక్యం సొగసే వేరు! కానీ, వాక్యాల నిడివి పెంచితే dilute అయి తప్పులు దొర్లే అవకాశం ఉంటుందనేమో, “Every word you add dilutes the sentence.” అని Miller Williams అంటారు. వాక్యం నిడివి సంగతి ఎలా ఉన్నా అసలు విషయమే లేకుండా ఉత్తి పర్రే ఉంటే, పాయింట్ లేని వ్యాసంలా ఉంటుంది.

ఈ మధ్య కొంత మంది రాస్తున్న వాక్యాలు చూస్తే, ఆ వాక్యాల నిడివి కంటే వాక్యాల చివర పెడుతున్న చుక్కల పొడుగు ఎక్కువగా ఉంటుంది. వాక్యం తెగ్గొట్టి చుక్కలతో, డాష్ లతో అతికిస్తే, మధ్యలో పువ్వులూడిపోయిన మల్లెపూదండలా ఉంటుంది. ఇక కవిత్వం విషయానికొస్తే, ఈ చుక్కల గోల మరీ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య చదువుతున్న కవితల్లో కవిత్వం నిండుగానే ఉన్నా కొంతమంది చుక్కలను అరువు తెచ్చుకుంటున్నారు. కవితలో కవిత్వం కంటే చుక్కలే ఎక్కువై ఇది చుక్కల కవిత్వంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కవిత్వం రాసేటపుడు మనకు కావలసినట్టు పాద/వాక్య విభజన చేసే సౌకర్యం ఉంటుంది కాబట్టి చుక్కలను, అనవసరమైన విరామచిహ్నాలను కొన్నింటిని కవితలోంచి తన్ని వెళ్ళగొట్టవచ్చు.

అసలు వాక్యం ఎలా రాయాలి? కుదురుగా అంటే ఏమిటి? అని మీరు తిరుగు ప్రశ్న వేయవచ్చు. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలంటూ వాక్యాల్లో రకాల గురించి గానీ, వాక్యనిర్మాణక్రమం లోని ప్రాథమిక నియమాల గురించి గానీ నేనిప్పుడు చెప్పటం లేదు. కేవలం రాయాలన్న కోరిక ఉంటే సరిపోదు. వాక్యం రాసేంతసేపే నీది, రాసాక అది అందరిది కూడా అవుతుంది కాబట్టి, వాక్యం గురించి తెలుసుకుని, నేర్చుకుని, కాస్త సాధన చేసి శ్రద్దగా రాయాలి. అప్పుడే నీ వాక్యాన్ని అందరూ హత్తుకుని ఎత్తుకుంటారు, అని మాత్రమే చెప్పాలనుకున్నాను.

ఇక వాక్యం గురించి మన ఎలనాగ గారు ఏం పలవరిస్తున్నారో/పాడుకుంటున్నారో ఒక్కసారి వినండి:

“వాక్యాన్ని చదివితే వంగి దానికి మొక్కాలనిపించాలి. అట్లాంటి వాక్యాల్ని రాసే నైపుణ్యం రచించేవాడి కలంలోకెక్కాలి. హుందాగా ఉందా నీ వాక్యం అనేది ఎంతో ముఖ్యం. బ్యాలెన్సు లేని వాక్యం బాధిస్తుంది – ఇది తథ్యం. నిజాయితీ లేని వాక్యం రాయితీని మింగి మొలుస్తుందనటానికి సాక్ష్యం అది కలిగించే నమ్మక రాహిత్యం. కథా రచయితలారా, గ్రహించండి ఇది సత్యం. గొప్ప ఇతివృత్తం చిక్కని కథ కాకపోవటానికి చక్కని వాక్యాల లోటు సైతం ఓ ముఖ్య కారణం. కథాకథనం వగైరా బాగున్నా వాక్యం బాగుండకపోతే ఫలితం సున్నా! చక్కని వాక్యం చదివేలా చేస్తుంది కథను. చప్పనైన వాక్యం చదివే వాడికి ఇస్తుంది వెతను.

ఉద్బోధ చేస్తున్నానని ఉడుక్కోకండి అన్నలారా.

వినయంతో చెప్తున్నా, కనండి సత్యాన్ని కన్నులారా.

వచన ప్రక్రియలోకి వచ్చే ముందు వాక్యరచనా కౌశలాన్ని వశపర్చుకోవాలి తమ్ముడూ. ఇప్పుడిప్పుడే సాహితీ రంగంలో తప్పటడుగులు వేసే చిట్టి బాబులూ, చిట్టి అమ్మలూ! మీకోసమే రాస్తున్నానిది, దీన్ని పట్టించుకోవాలి మీరెప్పుడూ. వాక్యమే రాయలేనప్పుడు వ్యాసమెలా రాస్తామన్నది ఆలోచించకపోవటం తప్పు కదూ.

గొప్ప రచనల్ని చదివినప్పటి పరిశీలనే రాయించాలి నీచేత. సహజ ప్రతిభ లోపించినప్పుడు సాధననే ఆశ్రయించాలి. అట్లా అని అనుకరించ కూడదు, అనుకరణనెప్పుడూ ప్రతిఘటించాలి. కథలోనైనా నవలలోనైనా సాధారణంగా వాక్యం కలిగించకూడదు కంగాళి. కవిత్వం మాత్రం వేరేలా కూడా ఉండొచ్చునని గ్రహించాలి.

శ్రీరంగ నీతులు చెప్తున్నానని చీదరించుకోకు తమ్ముడూ.

ఏదో కొంత తెలుసనుకుని రాసినందుకు ఏవగించుకోకు నన్ను అమ్మడూ.”

హోంకమింగ్
శబ్దాలన్నీ వాటి వాటి గూళ్ళలో ముడుచుకున్నాక

దేహకమండలంలో కాసిన్ని నిశ్శబ్దపు నీళ్ళు నింపుకుని

నువ్వు నాటుకుంటూ వెళ్ళిన ఆ బుల్లిబుల్లి మాటల వెనకే

నువు నేర్పిన ఆ పాత మంత్రాన్నే కొత్తగా జపిస్తూ వెళ్తాను.

వెళ్తున్న దారిలో

నీ పాదాల గుర్తులు మాయమయినదగ్గర

నీ పరిమళం ఆనవాలు పట్టుకుని అయినా సరే

నాకు నేను కనిపించనంతవరకూ వెళ్తాను.

లోకం అంటే నచ్చక కాదు

శబ్దాలంటే ఇష్టం లేక కాదు

దూరాల్ని ఛేధించాలనీ కాదు

నువ్వేంటో కనుక్కోవాలనీ కాదు

వెళ్తూ వెళ్తూ నువు నాటుకుంటూ వెళ్ళిన ఆ చిన్ని మాటలు

తిరిగొచ్చే లోపు పొద్దుదిరుగుడు పూలవ్వడం చూడ్డానికి

వెళ్తూ వెళ్తూ నువు చిలకరించుకుంటూ వెళ్ళిన నీ పరిమళం

తిరిగొచ్చే దార్లో మిణుగురుపురుగులవ్వడం చూడ్డానికి

వెళ్తూ వెళ్తూ నువు అద్దిన పాదాల అచ్చులు

దారి చీరకు వెన్నెల కుచ్చుల్లా మెరవడం చూడ్డానికి

అవును

తిరిగి రావడానికే

నానుండి నేను దూరంగా వెళ్తాను.

Photo Credit: Tamar Frank