వాకిలి » విశ్వనాథ్

ఆనర్ లూసర్స్
నేను ఎవరెవరో, ఎంతమందో!

అందరికీ ఎదురొడ్డి ఒక్కడిగా కుదురుకోవడం అసాధ్యం

వాళ్లంతా  రంగురంగుల బురఖాల్లో దాంకుని

నిన్ననే వేరే నగరానికి తరలిపోయారు

గతాన్ని పోగులు పెడుతూ దూదేకుల సాయబొక్కడు మిగిలాడు

నన్నొక ప్రతిభామూర్తిగా చిత్రించడానికి

అంతా సిద్ధం అయిన తరుణంలో

నేను కప్పెట్టిన అజ్ఞానం మాటల రూపంలో

నోటంటే ఉండి నన్ను వెనకేసుకొస్తుంది

నది దాటించబోయినందుకే

నావని నట్టేట ముంచిన

ప్రతీకార జ్వాల మాత్రం

పుండులోంచి కారుతున్న పదో రసం

అతడొక కావ్యం
నిర్లక్ష్యంగా అతను ఒడ్డుకి విసిరేసిన  ఆల్చిప్పలు ఏరుకుని

ఇసకలో ఆటలకొచ్చిన పిల్లలకి అమ్ముకుంటుంటాను

ఆకలేసినప్పుడు పక్షినై

చేపలు  రెండు ముక్కున కరుచుకుని

తీరానికి ఎగురుకుంటూ వచ్చేస్తుంటాను

ఆకాశం అతని మీదకి వంగి చెప్పిన ఊసులేవో

కెరటాల హోరులో గుసగుసలుగానో,

వికటాట్టహాసంగానో వినిపించినప్పుడు

రహస్యమేదో చేతికి చిక్కినట్టు సంబరపడిపోతుంటాను

పున్నమినై పైకెగసినప్పుడు

ఆవలి తీరాన అంతులేని ఖండాలతోనూ,

అందమైన వనాలతోనూ సరసాలాడుతూంటే

అసూయతో కృశించిపోతుంటాను

అతని వైశాల్యాన్ని కొలుద్దామని

నావనై లోపలికి పోయినప్పుడు

తుఫానులో చిక్కుకుని అల్లాడిపోతుంటాను

నదినై అతనిలోపలికి చొచ్చుకుపోవాలని,

అతని దాహం తీర్చాలనీ ఆరాటపడుతుంటాను కాని,

అస్తిత్వమో అహమో అడ్డొచ్చి ఇసకలోకి ఇంకిపోతుంటాను

బడబాగ్నిగా బద్దలై ప్రళయ భయంకర రూపంతో అతను చెలరేగినప్పుడు

ఒడ్డున ఒద్దికగా గడ్డిపోచనై ఆశ్చర్యంతో చేతులు జోడిస్తాను.

అతని కడుపులోని అమృతాన్ని దోచుకుందామని  సాగరమథితంలో

వలవిసిరిన ప్రతిసారీ ఏవో పద్యాలు ఒడిలో నింపుకుంటాను.