కవిత్వం

YOU

మే 2016

YOU

Are you……?
The music that floats through the winds,
Or the song that sails across the breeze,
The words that make the song,
Or the letters that made the word.

Who are you?
The silence that fills the space between notes,
The chord that strikes for the beat,
The stillness those trees slipped into,
Or the flowers meditating amidst the leaves.

Who are you?
The whisper of winds or the smell of a rose,
The sound of the bird or the flow of the tide
A drop of rain or the quantum of an ocean,
The heaviness in my heart or the tears that rolled down my cheeks.

Who else are you?
The feeling in me or the thoughts that filled me in.
The origin of all or its very beginning,
The stream that caresses the bruises of my life. Or
A Timeless Spring

Aren’t you ……all the above
Who holds me tight in my meanderings;
In all moments that last between the flashes of my eyelid!

***

***

నువ్వే కదూ?

గాలి నిండా పాటలా పరుచుకున్నదీ -
ఈ పాట నిండా పదాలుగా అల్లుకున్నదీ-
ఈ పదాలలో అక్షరాలై కుదురుకున్నదీ -
ఈ స్వరాలలో తెమ్మెరగా తగులుతున్నదీ -

నువ్వేకదా?
కిన్నెర మెట్ల మీద నిద్రపోయే నిశ్శబ్ధానివి?
చేయి తగిల్తే ఉలిక్కిపడే శబ్ధానివి?
చెట్లన్నీ పెనవేసుకునే స్తబ్ధమైన మోహానివి
పువ్వుల ధ్యానానివి?

అవున్నువ్వే
పైరగాలి గుసగుసవి.సంపెంగ పరిమళానివి నువ్వే.
ఎలుగెత్తిన పక్షివి. ఎగసిపడిన అలవి నువ్వే.
చినుకంత వర్షానివి, ముత్యమంత సముద్రానివి నువ్వే.
హృదయమ్మీది నదీ చారికవు.
చెక్కిలిమీది కన్నీటి ధారవు నువ్వే.

ఇంకా..ఇంకా అంటే-
నాలోని ఉన్మత్తతవి. దాని వెనక ఆలోచనవి.
ఆదిమభాషవి. అనాది స్వరానివి.
అమ్మవి. ఆత్మవి.
ఒరుసుకుపోయే తీరాన్ని లాలించే నెమ్మదైన ప్రవాహానివి.
అనిమిష ప్రస్తుతానివి.

ఇంకా చెప్పమంటే-
ఒడిదుడుకుల్లో నన్ను వదలకుండా పట్టుకుని,
రెప్పపాటులో ఒలికిపోయే సమస్త క్షణాల్లో నాతో సహచరించే
ప్రాణానివి.ప్రణయానివి.ప్రపంచానివి
అవును.
నువ్వు కానిది ఏముంది ప్రపంచంలో!

*