కవిత్వం

నిజమేరాయాలిక

జూన్ 2016

రించలేని ఇష్టాన్నైనా,
తెగించలేని మోహాన్నైనా
కంపించే ఆత్మను కబళించే శత్రువు
సైతానై తేనె నవ్వులతో గారడీ చేసినా!

బుర్రలో జోరీగలు రేపెడితే
కాగితమ్మీద దింపుకునే రాతలివి
ఎంత పొగిడినా నాకు తెలీదూ?
ఈ అక్షరాల అల్లికెంత తేలికో
వాటి వెనక ఆలోచనలు అంత బరువని

గాల్లో కందిరీగలు గీసిన గీతల్లా
శబ్ధం రాని గజిబిజి అరుపులు.
తెలిసీతెలియని స్తబ్దత నువ్వు
అజ్ఞానపు మొద్దు అంచుల్ని
సూటిగా అరగదీసే ప్రశ్నలతో నేనూ!

మొత్తానికి రాయలంటావు…
ఎలా? మన కళ్ళే కలవవు కదా
కలపాలంటే ఎంత చికాకో!
ఇక ఎదురుగాలేని సమయాల్లో
సాగే గడబిడలే రాయాలి
-
రేయ్ నార్సిస్ట్!
అవతలకు పోయేముందు ఒకసారి చూడు
నువ్వారోజు తన్నింది ఖాళీ కోకుడబ్బాని మాత్రమేనా?