అంతరంగాన్ని అతలాకుతలం చేసే
నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు-
ఆక్షరాలు
ప్రేమగా అలాయ్ బలాయ్ ఇచ్చుకోవు.
ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య
నించోనే నిద్రపోతున్న కుంచెను చూసి
ఫక్కుమని నవ్వి వెక్కిరిస్తాయి
నెత్తి కెక్కిన కొన్ని అనుభవాలు.
అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు
బయటికిరాలేని ఒకానొక బలహీనత ఒళ్ళో
బద్ధకం
ఏకాయెకి పరుపుబండై
కాళ్ళుసాపుకు పడుకుంటది.
శబ్దానికి మరో శబ్దానికి మధ్య
ఎప్పుడూ ఎంకిలా ఎదురుచూసే
నిశ్శబ్దం
ముఖం చాటేస్తది.
రాత్రంతా సోపతున్న
ఈస్ట్ మన్ కలర్ కల
అంజాన్ కొడుతూ
వెనక్కి తిరిగి సూడకుండా వెళ్ళిపోతది.
గుండె
అమ్మ లేని ఇల్లవుతది.
*
ఎత్తుకున్న బరువంతా
దింపుడుకల్లంలో దించుకునేవరకు
ఎన్నో కొన్ని దినాలు
ఆకారం లేని ఆ ఆకారాన్ని
ఉప్పుడు బస్తాలా మొయ్యాలి.
***
సరే…
మొదటి వాక్యం రాయి
రెండో వాక్యం తోడొస్తుంది.
నీ రక్తం పంచి
నీ గొంతుకిచ్చి
నిజాన్ని నిజంగా చూపించే పిడికెడు వెలుగు పూసి
ముచ్చటగా మూడో వాక్యం
కూడా…
బాగుంది రవీ! తెలంగాణ భాష నుడికారం బాగా వచ్చి చేరాయి –
నీ రక్తం పంచి
నీ గొంతుకిచ్చి
నిజాన్ని నిజంగా చూపించే పిడికెడు వెలుగు పూసి
ముచ్చటగా మూడో వాక్యం
కూడా…
ముగింపు కూడా బాగుంది.
రవి గారూ మీలోని కవి గారి హృదయాన్ని ప్రతిఫలించారు, ఎత్తుగడ నుంచి చివరికంటా బాగా వచ్చింది.
గరికపాటి పవన్ కుమార్
నారాయణస్వామి గారు, పవన్ గారు,
థాంక్స్. మీ కామెంట్ దొరకడం చాలా సంతోషంగా ఉంది.
రవి
“ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య
నించోనే నిద్రపోతున్న కుంచెను చూసి”
…
“అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు”
ఈ వక్యాలు చాలా బావున్నాయి రవి గారూ.
“అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్
తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు”
ఈ వాక్యాలు చాలా బావున్నాయి రవి గారూ
అన్ని వాక్యాలు మొదటి వాక్యాల్లోని ఉద్వేగాన్ని మోసుకొచ్చాయి రవి గారు !
ప్రసూన గారు,
Thank you.
ప్రసాదన్నా, Thanks!
Moha గారు,
ఎలా ఉన్నారు? Thank you for the comment.
-రవి
“అంతరంగాన్ని అతలాకుతలం చేసే
నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు-
ఆక్షరాలు
ప్రేమగా అలాయ్ బలాయ్ ఇచ్చుకోవు”
బాగా చెప్పారు రవీ!……
పోయెం బాగుంది …