నుడి

నుడి – 20

జూన్ 2017

Nudi 20 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-19 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ప్రతిసారి సరాసరిన పదిహేనుగురు ‘నుడి’కి తమ ఎంట్రీలను పంపుతూ వచ్చారు. మొట్టమొదటి నెలలో ఇరవై మంది పంపారు. ఈ సారి మాత్రం కేవలం ఐదుగురే. ఇంత తక్కువ మంది పాల్గొనడం ఇదే మొదటి సారి. అన్ని ఆధారాలకూ సరైన సమాధానాలు రాసినవారు ఈ సారి కూడా ఎవ్వరూ లేరు. ఒక తప్పుతో పూరించిన వారు ముగ్గురే. వారు:

1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
2. పి.సి. రాములు
3. మాడిశెట్టి రామారావు. ముగ్గురికీ అభినందనలు.

ఇక కొన్ని ఆధారాలకు జవాబులను, వాటికి వివరణలను చూద్దాం.

 సా  మ  దా  న  X  స  గ  మ  ని
 దా  X  X  మూ  గ  వి  X  X  గూ
 సీ  X  సో  న  X  త  నూ  X  ఢ
 దా  యా  ది  X  అ  X  క  ప్ర  ము
 X  దా  X  X  మ్మ  X  X  దే  X
 మా  ద్రి  X  డ  క్క  ఇ  X  శం  ప
 య  X  త  మ్మీ  X  త  లే  X  రి
 బా  X  పం  పా  X  రా  రు  X  హా
 స  దా  X  ప  త్రా  లు  X  చి  రం
 X  ని  X  X  గా  X  X  ద్రు  X
 అ  మ్మ  మా  X  లి  X  లే  ప  ము
 మ  X  త  ల  X  కా  క  X  క్కు
 లి  X  X  ప  సి  మి  X  X  పిం
 న  వ  లి  క  X  నీ  వ  రు  డి

1 అడ్డం: ఇక్కడ మన సాదా అనేది anagram. దానిలోని అక్షరాలను తారుమారు చేయగా వచ్చే సామ దాన సమాధానం. చతుర్విధ ఉపాయాలలో మొదటి రెండు సామము, దానము.

3 అడ్డం: షడ్జము = స. గాంధారము = గ. మధ్యమము = మ. నిషాదము = ని. ఇవి సరళీ స్వరాలలోనివి. స+గ+మ+ని = సగమని = అర్ధభాగం అని.

5 అడ్డం: ‘మూవీగా’లో మధ్యాంతాలైన వీ, గా పొట్టివైతే వి, గ లుగా మారుతాయి. వీటికి మూ కలిపి, కలగాపులగం చేస్తే వచ్చే మూగవి జవాబు. మేకలు, గొర్రెలు మొదలైన జంతువులను జీవాలు అనటం మనం సాదారణంగా వింటూనే ఉంటాం.

7 అడ్డం: తాను సైతం = తనూ. కనుక, అదే సమాధానం. కొత్తగా = నూతనంగా. దీనిలోని మొదటి సగమైన నూత తారుమారైతే తనూ వస్తుంది.

9 అడ్డం: దా‘రం’ కొస = రం. స్థానభ్రంశం చేసిన‘ది’ అంటే ది అనే అక్షరం. అది ‘రం’ను స్థానంభ్రంశం చేస్తే దారం దాదిగా మారుతుంది. దీనికి మధ్యన యా చేరితే ఏర్పడే దాయాది = పాలివాడు. కనుక, అదే సమాధానం.

14 అడ్డం: లాగా = మాదిరి. అది కుచింకుకుపోగా ఏర్పడే రూపం మాద్రి. కనుక, అదే జవాబు.

17 అడ్డం: జలుబు = పడిశం. దాని ఆద్యంతాలు పశం. అవి అటుదిటుగా మారితే వచ్చే శంప = మెరుపు. కనుక, అదే సమాధానం.

20 అడ్డం: ముదురుకు వ్యతిరేకం లేత. అది వ్యతిరేకదిశలో వస్తే తలే ఏర్పడుతుంది. శీర్షము = తల కనుక, తలే అన్నది జవాబు.

23 అడ్డం: రాశారులో నడుము = మధ్య అక్షరమైన శా. దాన్ని రాశారు లోంచి మైనస్ చేయగా వచ్చే రారు సమాధానం.

24 అడ్డం: సతతంకు సమానార్థక పదమైన సదా ఇక్కడ జవాబు. సదాశివ బ్రహ్మేంద్రుడు కర్ణాటకం సంగీతరంగం లోని ఒక వాగ్గేయకారుడు.

26 అడ్డం: అన్నమయ్యకు ఆ కాలంలో పేపర్లుగా పనికొచ్చినవి తాళపత్రాలు. తాళపత్రాలు మైనస్ తాళ = పత్రాలు = ఆకులు. కాబట్టి అదే సమాధానం.

29 అడ్డం: మా తల్లి = మా అమ్మ. మా అమ్మను జంబుల్ చేస్తే వచ్చే అమ్మమా ఇక్కడ జవాబు.

31 అడ్డం: పైపూత = లేపనము. లో‘న’ కొస = న. లేపనము మైనస్ న = లేపము = పైకెత్తము. కనుక లేపము జవాబు.

33 అడ్డం: కలతలు కల లతల కలలు మైనస్ లుకలుకల తలల కల = తల. అదే సమాధానం.

35 అడ్డం: దీనికి సమాధానం కాక. ఎలా అంటే, చిన్నాన్న = కాక (తెలంగాణలో). వేడి = కాక. కాకుండా = కాక.

37 అడ్డం: దీనికి నవలిక ఎలా సమాధానమంటే, రేపోకు జత మాపో (రేపో మాపో అంటాం కదా). మానవ పోలిక మైనస్ మాపో = నవలిక.

3 నిలువు: వాసవి తన మైనస్ వాన = సవిత = సూర్యుడు. కనుక, సవిత జవాబు.

4 నిలువు: ఈ క్రాస్ వర్డ్ లో ఇవ్వబడుతున్న ఆధారాలు చాలా వరకు cryptic రకానికి చెందినవి. Cryptic = నిగూఢమైన కాబట్టి, నిగూఢము అనేది జవాబు.

6 నిలువు: So = సో. The = ది. రెండింటిని కలుపగా వచ్చే సోది జవాబు. The ని ‘ద’ అనాలి కనుక, సోద జవాబు అవుతుంది కదా అని ఎవరికైనా సందేహం కలుగవచ్చు. కాని ఇక్కడ The ని ‘ది’ అనే పలకాలి/రాయాలి. ఎందుకంటే, unending లోని మొదటి అక్షరమైన u ఒక అచ్చు (vowel). అట్లా కాక, హల్లు (consonant – a, e, i, o, u కాక మిగిలిన అక్షరం – ఉదాహరణకు b, n, s, p, l, etc.,)తో మొదలయ్యే పదానికి ముందు The వస్తే అప్పుడు దాన్ని ‘ద’ అని పలకాలి/రాయాలి.

13 నిలువు: ‘చాలా వరకు’ ప్రంశంసలో = ప్రశం. దానిలో దే చేర్చితే ప్రదేశం వస్తుంది. అదే సమాధానం.

16 నిలువు: ఎలెక్ట్రానిక్ మెయిల్ ను ఇమెయిల్ అంటున్నాము కనుక, ఎలెక్ట్రానిక్ రాతలును ఇరాతలు అనాలి. ఇరాతలును మిశ్రమం చేయగా వచ్చే ఇతరాలు = etc., కాబట్టి, ఇతరాలు జవాబు.

18 నిలువు: హారంనే అన్న పదంలోని ‘నే’ ను ‘పరి’ చేస్తే హారంపరి వస్తుంది. దాన్ని సరిచేయగా వచ్చే పరిహారం ఇక్కడ సమాధానం.

19 నిలువు: ఎండ = ఆతపం. ‘ఆ’కారం = ఆ. ఆతపం మైనస్ ఆ = తపం. అదే జవాబు.

21 నిలువు: ఆద్యంతం అంటే మొదలు, చివర. లేడిగారులో ఆద్యంతాలు లే,రు. ఈ పదం ఉన్నారుకు వ్యతిరేకం కదా. అందుకే లేరు జవాబు.

25 నిలువు: దాని లో ద్వితీయాక్షరం ని. ఇక అద్వితీయం అంటే ద్వితీయం కానిది. అంటే మొదటిది అయిన దా. నిమ్మ ఒక చెట్టు పేరు. దా + నిమ్మ = దానిమ్మ కనుక, దానిమ్మ జవాబు.

27 నిలువు: త్రాగాలి అనేది దీనికి సమాధానం. వాయువు = గాలి.

28 నిలువు: ఇక్కడే అందరూ తడబడి చిలుప, చిదప అని పూరించారు. కాని, సరైన సమాధానం చిద్రుప. 8 నిలువుకు జవాబు నూక. దాన్ని మనం బియ్యం యొక్క ముక్కగా అభివర్ణించుకోవచ్చు. చిద్రుప అంటే ముక్క. చిదురుప దాని రూపాంతరం చెందిన పదం. క్లాసికల్ సాహిత్యాన్ని సీరియస్ గా చదివే పాఠకులలో చాలా మందికి చిద్రుప అంటే ముక్క అనే విషయం తెలుసు.

29 నిలువు: రిక్కీగాడి తల = రి. లిపిక తల = లి. అమరిన లోంచి ‘రి’ని తీసేసి, అదే స్థానంలో ‘లి’ని పెడితే వచ్చే అమలిన ఇక్కడ సమాధానం.

30 నిలువు: ‘తా’ను పోగొట్టుకున్న తాత = త. దీన్ని మా తర్వాత పెడితే వచ్చే మాత జవాబు.

31 నిలువు: దీనికి జవాబు లేక. ఎట్లా అంటే – ముందుగా ఈ ఆధారంలోని రెండవ భాగాన్ని పరిశీలిద్దాం. లేకుండా లేకపోలేదిక్కడ అంటే ఈ ఆధారంలో లేకుండాకు సమానార్థకమైన పదం లేకపోలేదు, ఉంది అని అర్థం. ఇక మొదటి భాగానికి వద్దాం తారుమారైన తోక లేక = కలేకతో. ఇది తలాతోకా (మొదటి అక్షరం, చివరి అక్షరం) లేకుండా ఉంటే ఏం మిగులుతుంది? ‘లేక’నే కదా!

32 నిలువు: ఒక అవయవం = ముక్కు. ధాన్యపు పొడి = పిండి. కాబట్టి ముక్కు పిండి అనేది జవాబు.

34 నిలువు: కర్ర = కలప. అది తారుమారైతే వచ్చే లపక = ధనము, విత్తము, దుడ్డు, రూక, రొక్కము కనుక, అదే జవాబు.

35 నిలువు: దీనికి జవాబు కామినీ. కామినీ కౌశల్ పాత హిందీ సినిమాలలో నటించింది. భీమిలీ సెంటరు = భీమిలీలోని మధ్య అక్షరమైన మి. దీనికి రెండు వైపులా ‘కానీ’ ఉంటే కామినీ వస్తుంది.

ఈ ‘నుడి’లోని జటిలత్వం పరాకాష్ఠకు చేరుకున్నట్టుంది. ఈ మధ్యనే ఒక పాఠకుడు ఈ విషయం గురించి అసంతృప్తిని వెలిబుచ్చడం జరిగింది కూడా. అందుకని, ఈ నెల నుండి గ్రిడ్ సైజునూ, ఆధారాలలోని జటిలత్వాన్ని తగ్గిస్తున్నాం.

**** (*) ****