కవిత్వం

ప్రేమీకి ప్రేమతో…

15-ఫిబ్రవరి-2013

ఉత్తరాల్ని చింపుకుంటుంటానా?
తీయని జ్ఞాపకాల్ని ముక్కలు ముక్కలు చేసుకుంటున్నట్టే వుంటుంది

బహుమతిని తడుముకుంటుంటానా?
నిన్ను నిమురుతున్నట్టే వుంటుంది

చిప్పిరి మొలిచిన ఆ స్థలాన్ని చూస్తుంటానా?
మన సమావేశం ముగియనట్టే వుంటుంది

ఒక బిందువు వద్ద మొదలై నువ్వటూ నేనిటూ బయల్దేర్తామా?
వృత్తంలో ఎక్కడో మళ్ళీ మనం కల్సుకుంటున్నట్టే వుంటుంది

ఎవరికి వాళ్ళం తలపులన్నీ కలబోసుకుంటుంటామా?
మనకిష్టమైన చిత్రమేదో రూపుదిద్దుకుంటున్నట్టే వుంటుంది

మరో ప్రపంచాన్ని గానం చేస్తుంటామా?
ఆ ప్రపంచపు విజయోత్సవ వేడుకల్లో
మనం ఆలింగనం చేసుకుంటున్నట్టే వుంటుంది



4 Responses to ప్రేమీకి ప్రేమతో…

  1. నారాయణస్వామి
    February 17, 2013 at 6:21 pm

    బాగుంది కృపా!

    చిప్పిరి మొలిచిన ఆ స్థలాన్ని చూస్తుంటానా?
    మన సమావేశం ముగియనట్టే వుంటుంది

    ఒక బిందువు వద్ద మొదలై నువ్వటూ నేనిటూ బయల్దేర్తామా?
    వృత్తంలో ఎక్కడో మళ్ళీ మనం కల్సుకుంటున్నట్టే వుంటుంది

    నిజమే కదా – మన సమావేశాలు ముగియలేదు – మనం వృత్తాల్లో కలుస్తున్నా మన దృష్టి ఆద్యంత రహితం వర్తుల మార్గం కదా!

  2. February 18, 2013 at 4:14 pm

    మరో ప్రపంచాన్ని గానం చేస్తుంటామా?
    ఆ ప్రపంచపు విజయోత్సవ వేడుకల్లో
    మనం ఆలింగనం చేసుకుంటున్నట్టే వుంటుంది… ఇంత ప్రేమగా రాసాక మాటలుంటాయా?? ఆలింగనం తప్ప..

    • February 21, 2013 at 1:28 pm

      thank u so much Varma garoo.

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)