కవిత్వం

నాన్న

జూన్ 2017

న మరణం
పెనుగాలికి విరిగిపడిన కొమ్మలా
ఒక్క క్షణంలో జరగలేదు
ఒక చోటుకి పరిమితమైపోయో
ఓ సంఘటనగా మిగిలిపోయో
పొరల ఒత్తిడిలో అట్టడుగున నిలిచిపోవడానికి

ఓ తుఫాను
జీవితమంత ధీర్ఘమైనట్లు
ఏ రోజునీ వదలకుండా
తన తాలూకు జ్ఞాపకాలలోనో వెలితిలోనో
తడవకుండా
అటూ ఇటూ మెసల్లేనంతగా
నిరంతం కురిసే ఓ విషాదం

మాటలన్నింటినీ మూటకట్టి
అటకమీదకి విసిరేసుకోమన్న ఓ వరద
అంతకు ముందే చెప్పింది
రెక్కలున్నవి ఎగిరేందుకు కాదని
చీకటిని చుట్టుకోవడానికేననీ

బయటికి నడవాల్సిన నా దారిని లోపలికి
విసిరేసిన ఓ హోరుగాలి
చెవుల మీద అరచేతులుంచుకుని
కళ్ళు రెండూ గట్టిగా మూసుకుని
పరుగులుతీయిస్తూనే ఉంది
నన్ను మరింత నాలోనికి

అశాంతిని అనుక్షణపు నుదుటి మీద
రాసుకోడమే ఉపశాంతనుకొనే
మనస్తత్వానికి జన్మనిచ్చిన
ఓ జన్మంత కారణం చెప్పింది
మరణమంటే ప్రాణాలు మాత్రమే తీసేది కాదనీ…!

 
 
 
Painting: James Linton



7 Responses to నాన్న

  1. Swathi Sai Yakasiri
    June 1, 2017 at 5:44 am

    వాకిలి వారికి నా ధన్యవాదాలు!

  2. Suparna mahi
    June 1, 2017 at 7:28 am

    …ఎ వెరీ టచింగ్ పోయెమ్…
    చివరి స్టాంజా హైలెట్…అభినందనలు…

  3. Swathi Sai Yakasiri
    June 1, 2017 at 10:01 pm

    సుపర్ణ మహి… థాంక్ యూ సో మచ్!

  4. Nagaraju Pappu
    June 2, 2017 at 2:16 pm

    beautiful poem.

    • Swathi Sai Yakasiri
      June 22, 2017 at 12:44 pm

      thank you Nagaraju Pappu garu.

  5. థింసా
    June 9, 2017 at 8:52 pm

    “రెక్కలున్నవి ఎగిరేందుకు కాదని
    చీకటిని చుట్టుకోవడానికేననీ”

    ఇదొక్కటే ఆ కవితలోని బహుమంచి వ్యక్తీకరణ ….అభినందనలు..
    Keep it up….

    • Swathi Sai Yakasiri
      June 22, 2017 at 12:45 pm

      థాంక్సండి థింసా గారు

Leave a Reply to Swathi Sai Yakasiri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)