‘నన్ను క్షమించవా?’
ఆ మొదటి రాత్రి అతడన్న మాటలు
ఎడారిగాలుల్లా ఇప్పటికీ బాదుతూనే ఉన్నాయి
కొర్కెల కొంగున వేసుకొన్న ముడి కాళ్ళకడ్డుపడింది
*
గది నిండా ఊడలతో ఆ వృక్షం
రాత్రంతా కురుస్తూనే ఉన్న
తెల్లటి మంచును స్పర్శిస్తూనే ఉది
ఆ గది చేరుకున్ననదులు
చెరొక ప్రక్కన మౌనంగా ఘనీభవించి
నిశ్శబ్ధంగా ప్రవహించుకొంటున్నాయి
*
ఉద్వేగాల ఉత్సుకతల తీరాల్ని తగలకుండానే
ఆ ఉదయం ఆమెను చూసిన ప్రతి చూపు
బాగా జ్ఞాపకమే
ఏది ఒక్కసారి ఆ సిగ్గుల మొఖం చూపించూ
*
లోపల్నుండి దావానలంలా ఉష్ణ ప్రవాహం
ఆమెకు గుండెలవిసి పోవాలని లేదు
ఏడ్వాలని లేదు
అప్రయత్నంగా
కన్నిళ్ళను కుక్కుకొంది
ప్రవహించలేని నదిలా
ఒక ప్రాణమున్న శిలగా ఆమె
ఎండిన నదిలో
ఇమడని ఆ ప్రవాహం
ఇక పూలు పూయదు
ఆ గది అంతః కాంక్ష కు ఆమె బందీ గా మారింది
కరగని శిల కూడా కరిగి కన్నీరైంది .
నీరు లేక జీవితం మోడయ్యింది
గల గల పారే నదులూ మూగబోయి
మౌన రాజ్యమేలుతున్నాయి
శశిబాల గారు…………..మీ అభిన౦దనకు ధన్యవాదాలు
adhbuta varnana suresh garu..bagundi
నాగు నాయిడు గారు ధన్యవాదాలు
చాలా సున్నితమైన మనో భావాలను అత్యద్భుతంగ వర్నించారు సురేష్ గారు.
శ్రీవల్లి గారు , మీ కామె౦ట్ అభిన౦దనీయ౦
‘కొర్కెల కొంగున వేసుకొన్న ముడి కాళ్ళకడ్డుపడింది’ఇలాంటి ప్రయోగాలు మీరు మాత్రమే చేయగలరు సురేష్ జీ! చిన్న చిన్న పదాల్లో నిగూదార్తాలు చాలా ఉంటాయి మీ కవితల్లో!! అభినందనలు!
ధన్యవాదాలు కవిత చక్ర గారు….
ఆకాంక్ష రెక్కలు ఉంటే అది మీ వాకిలి ముత్యాల ముగ్గు అయి మీకు శిరసు వంచి ప్రణామములు చేస్తుంది తన భావాల రూపకల్పన ఇంత అద్భుతం గా ఆవిష్కరించినందుకు. మంచి కవితాహృదయం మీది
థా౦క్యు మహి.. అభిన౦దనీయ౦ మీ కవిత
ధన్యవాదాలు కవితచక్ర గారు, మహి గారికి, య్౦ శ్రీవల్లి గారికి, నాగు నాయిడు గారికి, శశిబాల గారికి
Sir kavithanu baga vivarincharu its nice nice.****** ur’s pradeep
Vennela raathri..
Velugupula daarullo..
Marumallela parimalallo..
Koti Aashala kaanthulatho..
Nava jeeva Ananda maadhuryyanni andukovaalanna
letha rekkala vana baala korikapy..
“Khaminchavaa” antuu oca chinnamaata
“CHARNAAKOLY”
gaaya parichina Teerunu kavi chinna china pada parimalatho
varnichina teeru chaalaa baagundi..
Nava vadhuvu
vedanapy nilichi kalatha chendina kavi
thanu raasina ee kavitha drushya kavyyam venta parugulu teepisthaadu..
Korkela kaankshalanu dahinche Daavaagnini kavi thana hrudaya vaakillanu terichi..
Swaranaalanu chelchukuntu
thanalo regina bhaavodvega samaraanni
maatalu
mutalugaa
ee kavitha lo
poduparichina teeru mana manasulanu thadipi aalochimpa cheyadame kaaka
manatho thanu panchukovaalanna
kavi thapana thaapaathryam manaku kanapadutundi.
Chedirina kannepilla kaankshala Vishaadaanni kavi thaanu mostuu bhashakandani kannelanu Dosita patti mana mundu vunchina teeru amogham..
Kavi Suresh gaariki Dhanya vaadaalu..
.వైదేహి రెడ్డిగారికి ధన్యవాదాలు. మీ అభిన౦దన నాకు ఎప్పుడూ ప్రత్యేకమే…