నుడి

నుడి – 24

అక్టోబర్ 2017

Nudi 24 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-23 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈసారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఒక్కరే. వారు: పి.సి. రాములు

ఒక తప్పుతో పూరించినవారు ముగ్గురు. వారు:
1. హేమనళిని
2. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
3. టి. చంద్రశేఖర రెడ్డి

విజేతలకు అభినందనలు.

ఇక గత ‘నుడి’ జవాబులను, వాటికి వివరణలను చూద్దాం.

 ని  జా  ము  X  సు  X  స  ల్లా  పం
 లు  X  X  పి  ర  మా  X  X  చా
 వ  డి  వే  లు  X  మూ  గు  తా  రా
 నీ  X  X  స్తా  వా  లు  X  X  మా
 రు  ద్రా  క్ష  X  డి  X  సై  కి  లు
 X  వి  X  కో  మ  లి  X  క్కు  X
 శాం  క  రి  X  గ  X  కు  రు  మ
 తా  X  X  కా  డు  పై  X  X  ర
 కా  పు  రా  లు  X  క  ను  గ  వ
 రు  X  X  డు  పు  ము  X  X  ని
 డు  ల్లు  ట  X  ట్ట  X  మ  నా  ది

1 అడ్డం: దీనికి జవాబు నిజాము. ఏలిక అంటే పరిపాలన అనే కాక రాజు అనే అర్థం కూడా ఉన్నదని తెలిస్తేనే ఈ ఆధారానికి సమాధానాన్ని కనుక్కోగలం. సత్యం = నిజము. అందులోని మధ్య అక్షరమైన ‘జ’ సాగితే ‘జా’ అవుతుంది. అప్పుడు ఏర్పడే నిజాము జవాబు.

3 అడ్డం: హంసల్లా మైనస్ హం = సల్లా. పంది మైనస్ ది = పం. సల్లా + పం = సల్లాపం. కనుక, జవాబు సల్లాపం. సల్లాపం అంటే సంభాషణ, ముచ్చట.

7 అడ్డం: ఆంగ్లంలో తాళంచెవి = కీ (key). వేడి వకీలు మైనస్ కీ = వేడివలు. దీన్ని సవరించగా వచ్చే వడివేలు జవాబు.

8 అడ్డం: రామూను రివర్స్ చేస్తే మూరా వస్తుంది. తాగు అటుదిటుగా = గుతా. రామూలో గుతాను చేరిస్తే వచ్చే మూగుతారా ఇక్కడ జవాబు.

9 అడ్డం: దీనికి జవాబు స్తావాలు. స్తావాలు అంటే పొగడ్తలు. మొదట్లో ఉన్న దీర్ఘాన్ని తీస్తే స్తవాలు. అప్పుడు కూడా అర్థం మారదు. ఎందుకంటే, స్తవము అన్నా స్తావము అన్నా పొగడ్తే.

11 అడ్డం: శివుడు = రుద్రుడు. శివుని = రుద్ర. కన్ను = అక్షి. కన్నులు కలవాడ = అక్ష. రుద్ర + అక్ష = రుద్రాక్ష. అదే జవాబు. కొందరు రుద్రాక్షి అని నింపారు.

13 అడ్డం: ఆధారం = ఊతం. ఊలుకి సైతం మైనస్ ఊతం = లుకిసై. దీన్ని రివర్స్ చేస్తే వచ్చే సైకిలు సమాధానం.

16 అడ్డం: ప్రారంభరహితంగా వేశాం = శాం. ఒకరి మైనస్ ఒ = కరి. శాం + కరి = శాంకరి. అంటే అమ్మవారు (పార్వతి) కనుక, అదే సమాధానం.

17 అడ్డం: తరుమకు మైనస్ త = రుమకు. దీన్ని తారుమారు చేస్తే వచ్చే కురుమ ఒక వర్ణం. వర్ణం = కులం. కనుక, జవాబు కురుమ.

19 అడ్డం: కాడు = అడవి, శ్మశానం. కనుక, కాడుపై అన్నది జవాబు.

22 అడ్డం: చూడు = కను. దుఃఖం = వగ. తిరగేసిన దుఃఖం = గవ. కను + గవ = కనుగవ = అక్షియుగళం. కనుక, అదే సమాధానం.

25 అడ్డం: దీనికి సమాధానం డుల్లుట, లేక డుల్లడం.

26 అడ్డం: ‘మది’లో ‘నా’ చేరితే మనాది వస్తుంది. సమాధానం అదే. మనాది = దిగులు.

1 నిలువు: నీ పలువరుసని మైనస్ పస = నీలువరుని. దీన్ని మిశ్రమం చేయగా వచ్చే నిలువనీరు ఇక్కడ సమాధానం.

4 నిలువు: అనుస్వారం అంటే సున్న. ‘రామా చాపలు’లో సున్న చేరి సర్దుకుంటే వచ్చే పంచారామాలు ఇక్కడ జవాబు. ఆరామము = తోట.

10 నిలువు: వాడి మగడు అంటే శూరుడు అనే అర్థం ఉంది. కనుక, అదే సమాధానం.

12 నిలువు: కవీంద్రా లోని మధ్య అక్షరమైన ‘వీం’ ‘వి’గా మారింది. అప్పుడు కవిద్రా వస్తుంది. దీన్ని తారుమారు చేయగా వచ్చే ద్రావిక = చొంగ. కనుక, ద్రావిక సమాధానం. కొందరు ద్రావక అని పూరించారు.

18 నిలువు: మనసు = మది. నిరవధికంగాలో మొదటి సగం నిరవ. దీన్ని ‘రవని’గా మార్చి ‘మది’లో చేరిస్తే వచ్చే మరవనిది సమాధానం.

20 నిలువు: కమురు అనంతంగా = కము. పై + కము = పైకము. జవాబు అదే.

ఈ నెల ‘నుడి’ (No. 24) తో రెండు సంవత్సరాల కాలం పూర్తయింది. ఇంతటితో ఈ శీర్షికా నిర్వహణను ఆపేస్తున్నాను. వచ్చే నెలలో కేవలం ఈ నెల ‘నుడి’ తాలూకు ఫలితాలు, జవాబులు, వివరణలు మాత్రమే ఉంటాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ శీర్షికను అభిమానించడమే కాక, నాతో ఎంతగానో సహకరించిన పాఠకులకు, సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సెలవు.

**** (*) ****