కవిత్వం

ముదస్సిర్… వీళ్ళేం మనుషులు?!

22-మార్చి-2013


ముదస్సిర్!
నీ తల్లి ఎంత రోదిస్తుందో
వెళ్లిపోయే ముందు ఒక్క సారయినా
ఆలోచించావా?

నీ తోడబుట్టినదెలా
బతుకుతుందో ఒక్క సారైనా ఆలోచించావా?

నీ తండ్రి నీ కోసం ఎంత ఆరాటపడతాడో
నీ మెరుపు మెడని ఇక కౌగిలించుకోలేనని
నీ తమ్ముడెంత సొమ్మసిల్లిపోతాడో
వెళ్లిపోయే ముందు ఒక్క సారయినా
ఆలోచించ లేదా నువ్వు?!

అసలైన నిజం చెప్పనా?
నీవెవరో నాకు తెలీదు
కానీ గుండె బాధతో మూలుగుతుంది
ఆఖరికి నిజం చెప్పనా నీకు
నీ కోసం చేస్తున్న న్యాయ పోరులో
నాకూ గొంతు కలపాలని వుంది
ఎప్పుడో అలా వచ్చిపోయే నిన్ను
లైబ్రరీలో మాత్రమే చూడటం తప్ప
నీతో మాట్లాడిందీ లేదు నిన్ను కలిసిందీ లేదు కదా ముదస్సిర్
మరి హృదయం ఎందుకిలా కుమిలిపోతుంది?
నువ్వెళ్ళి పోయిన్నాటి నించీ
కళ్ళు నీళ్ళతో నిండిపోతూనే వున్నాయి
బహుశా, మానవత్వమంటే ఇదే కావొచ్చు
మొహబ్బత్ అంటే ఇదే కావచ్చు
సోదరత్వమంటే కూడా ఇదే కావొచ్చు
బహుశా ఈ చలించే గుణం వల్లే
మనల్ని మనుషులంటారేమో కదా!

వీళ్ళేం మనుషులు, ముదస్సిర్!
నీ మరణాన్ని చూసి కూడా చలించడం లేదు
వీళ్ళేం మనుషులు!
నీ ప్రాణం కన్నా అహమే ఎక్కువైంది వీళ్ళకు!
వీళ్ళేం మనుషులు!
నువ్వు కన్ను మూయడం కన్నా జిద్దుచేయడమే ఎక్కువయింది వీళ్ళకు!
వీళ్ళేం మనుషులు!
నీ చావు కూడా కదిలించలేకపోతుంది వీళ్ళని!
ముదస్సిర్, వీళ్ళేం మనుషులు!
మనిషి చావు కన్నా మొండితనమే ఎక్కువయింది వీళ్ళకు!
ఛీ ఛీ! ఏం మనుషులు!

(ఇఫ్లూలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ స్కాలర్ ముదస్సిర్ కమ్రాన్ స్మృతిలో )



12 Responses to ముదస్సిర్… వీళ్ళేం మనుషులు?!

  1. ramakrishna
    March 22, 2013 at 1:02 am

    రయీస్ గారు, మీకవిత అత్యంత ప్రేమపూరితంగా ఉంది.అత్మీయమైన మీ పలుకు కూడా పాఠకున్ని కట్టిపడేస్తోంది. కవితలో నిజాయితీ కనిపిస్తోంది.అభినందనలు.

  2. ns murty
    March 22, 2013 at 3:12 pm

    రయీస్ గారూ,

    “బహుశా, మానవత్వమంటే ఇదే కావొచ్చు
    మొహబ్బత్ అంటే ఇదే కావచ్చు
    సోదరత్వమంటే కూడా ఇదే కావొచ్చు
    బహుశా ఈ చలించే గుణం వల్లే
    మనల్ని మనుషులంటారేమో కదా…”

    ఎన్నదగిన మాటలు రాసేరు. ఇవి నిజమైన అనుభూతిలోంచీ, హృదయపు లోతులలోంచీ మాత్రమే రాగలిగిన మాటలు. చక్కని భవిష్యత్తు ఎదురుగా ఉన్న ఏ జీవితము మధ్యాంతరంగా ముగిసినా దుఃఖం రావాలి. మరణం మనుషుల్లో నిర్లిప్తత కలిగించడం ఈ కాలపు విషాదం. మీతో పాటు నేనూ ముదస్సర్ కమ్రాన్ మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. May his soul Rest in Peace.

  3. jilukara
    March 22, 2013 at 3:34 pm

    Its’ a good poem. I demand the VC of EFL University to hand over the proctor Harish vijra to the police and I demand to restore the confidence in the student community.

  4. March 23, 2013 at 2:33 am

    నిర్మాణ పరంగా కొన్ని సవరణలు అవసరమైన పోయెమ్ అయినప్పటికీ ఒక గొప్ప ప్రేమతో జీవితం మీద, మనుషుల మీద కూడా గుండె లోతుల్లోంచి వచ్చిన భావ తరంగం .రచయితకు ఆత్మ హత్యా చేసుకున్న విద్యార్థి తో ,అ సమష్యలతో పరిచయం విన్నట్టుంది . ఆ భావ తీవ్రత కనిపిస్తోంది

  5. March 25, 2013 at 12:01 pm

    మంచి పోయెమ్.. నా బాధను ఇందులో చూసుకున్నాను.. మనసంతా ఏదోలా ఐపోయింది..

  6. Syamala Kallury
    March 25, 2013 at 2:14 pm

    one poem I wrote after a scientist committed suicide in a premier institute

    ఒక్క అడుగు ముందుకేస్తే

    నీకు తెలుసు నువ్వెక్కడుంటావో!

    జీవితమంతా నడిచి నడిచి

    అలసిసొలసిన నీకు

    ఆ ఒక్క అడుగు వెయ్యటానికి అరక్షణం

    అయినా పట్టలేదు!

    ప్రయాణం విసుగనిపించిందో

    అనుకున్న లక్ష్యం అందకుండా పోయిందో

    ఇంటా బయటా నిన్నుమించిన

    అసమర్థుడు, నిరాశావాది

    వేరెవరూ లేరని

    ఎవరేమన్నారో

    ఆరంతస్థుల పైకెక్కి ఆ ఒక్క

    ఆఖరి అడుగు అనంతంలోకి

    వేశావు!

    కానీ ఒక్క అడుగు వెయ్యడానికి

    నువ్వు కూడగట్టుకున్న ధైర్యం

    జీవించటానికి నీకుంటే

    ఒక్క క్షణం ఆగి ఆలోచించి వుంటే

    చరమదశ చేరటానికి

    ఏ చరమదశలో నైనా

    నిర్ణయం చెయ్యాల్సింది

    నువ్వుకాదని నీకర్థమయి వుండేది.

    నీ మనస్సు నిన్ను మోసగించివుంటుంది

    నీ మేధస్సు నిన్ను తప్పుత్రోవ పట్టించివుంటుంది

    నిన్ను అణదొక్కాలని అందరూ

    పన్నే పన్నాగాలకి ఒకేఒక్క జవాబని

    మృత్యువుని కోరి కౌగలించుకున్నావు

    అది నీ చదువుని నీ విజ్ఞానాన్ని

    అపహాస్యం చేయటం అని నువ్వనుకోలేదు.

    నీ మృతదేహాన్ని చూసి విలపించే

    నీ పిల్లల ఆర్తనాదాలమధ్య

    నిన్ను చిన్నచూపు చూసాయని నువ్వనుకున్న

    వ్యవస్థలు, న్యాయాలయాలు

    చూపించే నిరాసక్తత నీ చావెంత

    నిరర్థకమయిందో నొక్కి చెపుతాయి

    బ్రతికుండి సాధించలేని దేన్నీ

    మరణించి సాధించలేమనే

    నిజాన్ని చాటి చెపుతాయి!.

    published in aavakaaya.com

  7. March 25, 2013 at 3:43 pm

    *మనిషి చావు కన్నా మొండితనమే ఎక్కువయింది వీళ్ళకు!*

    తరిగిపోతున్న మావీయ విలువలకు అద్దం పడుతున్నాయి మీ కవితా పంక్తులు

  8. March 25, 2013 at 4:34 pm

    ముదసిర్ కమ్రాన్ కాశ్మీరీ మొదటి తరం పరిశోదక విద్యార్ది, నాకు జూనియర్ ఇద్దరం తక్కువ గా మాట్లాడుకుంటాం కానీ నన్ను చూడగానే ఒక సారి అలా ఆగి కదిలేవాడు. ఇక పోతే రేపు చనిపోతాడు అనగా ముందురోజు రాత్రి ఉస్మానియా పోలీస్ స్టేషన్ లో నన్ను పట్టుకొని భయ్యా అని రోదించడం ఇంకా కళ్ళలోనే సుడులు తిరుగుతోంది ఉరి తాడునుండి మార్చురీ దాకా పోస్ట్ మొర్టం నుండి విమానం లో అతని బాడీ నా చేతులతోనే మోసా. అతను చనిపోయాక అతని సెక్సువాలిటి/వ్యక్తిత్వం మీద దాడి జరుగుతోంది. ఇఫ్లూ అనే పిచ్చి కుక్క తమ్మున్ని బలి తీసుకుంది. నా బాధను రియానా బాగా పంచుకోంది. చివరి సారి నమాజు చేసి రూమ్ కి వచ్చి ఇక్కడి నుంచి శాశ్వతంగా నిష్క రించాడు .ముదాశీర్ చావు చాలా విషయాలు లేవనేత్తుతోంది తాను పుట్టిన కాశ్మీర్ ఒక సైనిక పహారా మధ్య ఉంటోంది. తానూ తన తండ్రి తనది కాని ఒక స్వేచ్ఛలేని బద్రత లేని పరిస్థితుల మధ్య బిక్కు బిక్కుగా గడిచి ఉన్దోచ్చ్చు , అతని బాల్యం ఒక అనిశ్చితి మధ్య అబద్రత మధ్య గడిచింది అతని యవ్వనం తన తోటివాళ్ళ ను మాటిమాటికి ద్రోహులుగా చిత్రిస్తూ నిత్యం తుపాకీ పహారా నీడన గడిచింది అందుకే తన తండ్రి తన కొడుకు మంచిగా చదవాలి అని దేశంలోనే అత్యంత ప్రతిస్టాకర విశ్వవిద్యాలయం లో చేర్చాడు పాపం తనకు తెలియదు ఇక్కడా ముష్కరులు ఉంటారని, కోటేసుకొని టై కట్టుకొని ప్రోఫ్ఫెసర్ గా ఇంటికి పోవల్సినోడు విగత జీవిగా ఒంటరిగా విమానం లో వెళ్ళాడు. ఇవ్వాళా ముదసిర్ దేశం లో ఒక నినాద మయ్యాడు క్షమించు తమ్ముడు మేమే ఎప్పటికీ మేమే మనుషులం కాలేక పోతున్నాం అయితే నువ్వు మాతోనే ఉండేవాడివి

  9. Rayees
    March 27, 2013 at 4:07 pm

    Thanks to all. as many times i read this that many times tears roll down my eyes, while reading Gurram’s response also i was weeping.his death and the injustice at EFLU has moved me like anything which i cannot express in words, my poem also has unable to fill that deep pain of mine, it was an attempt to express my anguish and pain.

  10. joopaka subdra
    March 27, 2013 at 4:44 pm

    mudassir manushullo vunte enduku chanipoyevadu
    poem dukkam naadi kooda

  11. buchireddy
    March 28, 2013 at 9:38 pm

    very good poem
    kadilinchindhi—kannillu teppinchindhi

  12. c.v.suresh
    March 29, 2013 at 3:03 am

    వీళ్ళేం మనుషులు, ముదస్సిర్!
    నీ మరణాన్ని చూసి కూడా చలించడం లేదు
    వీళ్ళేం మనుషులు!
    నీ ప్రాణం కన్నా అహమే ఎక్కువైంది వీళ్ళకు!
    వీళ్ళేం మనుషులు!
    నువ్వు కన్ను మూయడం కన్నా జిద్దుచేయడమే ఎక్కువయింది వీళ్ళకు!
    వీళ్ళేం మనుషులు!
    నీ చావు కూడా కదిలించలేకపోతుంది వీళ్ళని!
    ముదస్సిర్, వీళ్ళేం మనుషులు!
    మనిషి చావు కన్నా మొండితనమే ఎక్కువయింది వీళ్ళకు!
    ఛీ ఛీ! ఏం మనుషులు!……………..మనిషి మనిషిగా జీవి౦చలేని స్థితి జీవ౦ పోసుకొ౦ది. పెరిగి పెద్దదవుతో౦ది. వీరిని ఏదీ కదిలి౦చదు. మానవ స౦బ౦దాలన్నీ ఆర్థిక స౦బ౦దాలైనప్పౌడు మనిషి లో ఎడారి ప్రవహిస్తు౦టు౦ది. నవ్వులో వడగాడ్పులు. మాటల్లో ఒయాసిస్సులు. హృదయ౦ ని౦డా ఇసుకరేణువులే…..మీ కవిత కదిలి౦చి౦ది సార్…గ్రేట్

Leave a Reply to Jayashree Naidu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)