ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న పాదాల ముద్రలు వేస్తూ
కిరణాలు సోకని పుస్తకంలో అక్షరాల విత్తనాలు
కొన్ని జారవిడిచి
భావాలకు దాహమైనప్పుడల్లా చీకటి నీటిని త్రాగించి
నడుస్తున్నాను ఉదయం వైపు
తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని
ఆలోచనలన్నీ దాడి చేస్తే పగిలిపోయిన లాంతరు వెలుగుకు
నా పాదాలనుంచి కారిన రక్తపు బొట్లను తోడుగా వదిలి
కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న కలల కధలను చేతి గోళ్లకు
రంగుగా అద్దుకుంటూ
శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ నడుస్తున్నాను
ఉదయం వైపు
నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని
నాతోడుగా మిగిలి ,
నా నోట నలిగి చినిగిపోయిన పాటకు
కుట్లు వేసుకుంటూ
నిశబ్దపు దుప్పటిలో దూరి నన్ను వెంబడిస్తున్న గాలికి
ఊపిరి నిట్టూర్పులను జత చేసి
కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు తెరిచి
గెలుపు గీతం
సూర్యునితో పాటు ఆలపించాలని..
తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని
నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని
నాతోడుగా మిగిలి
కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు….
ప్రతి లైన్లోనూ సంఘర్శనా బలం తగ్గకుండా, కొత్త భావాలను జోడించి రాసావు… proud of you!
thank you mummaa
CHALA BAGUNDI
dhanyavaadaalu sir mee prothsaahaniki
“నాతోడుగా మిగిలి ,
నా నోట నలిగి చినిగిపోయిన పాటకు
కుట్లు వేసుకుంటూ”
భవ్యం కవనం …….
కనలి కమిలిన జీవన అంధకారం తో సలిపిన పోరాట గీతికలా….ఈ కవిత. అభినందనలు డియర్ మెర్సీ మార్గరెట్ .
thank you so much for your encouraging comment sir
నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని
కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు తెరిచి
గెలుపు గీతం
సూర్యునితో పాటు ఆలపించాలని..
అద్భుతంగా వర్ణించారు sister. చాల బాగుంది nice
thank you anna ..
తొలికిరణంతో
నేనే మొదట మాట్లాడాలని
….
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు తెరిచి
గెలుపు గీతం
సూర్యునితో పాటు ఆలపించాలని..
బాఉన్ది
కన్నీటి వర్షం ప్రతి సారి చెరిపేస్తున్న కలల కధలను చేతి గోళ్లకు
రంగుగా అద్దుకుంటూ
శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ నడుస్తున్నాను
భూత కాలం లోని విషాదాన్ని సూచిస్తున్నట్లుగా కాకుండా,
నాలోకి వెలుగు ఒంపుకుని
వెనక్కి చూడకుండా వెలుగై ప్రవహించాలని
పరుగేడుతున్నాను ఉదయం వైపు
ఇంకా బాగుంది.
కన్నీటి వర్షం ప్రసక్తి రాకుండా, అని అంటే paathakulu కవయిత్రికి ఇంకా ఉత్సాహ భరితమైన భవిష్యత్ సిద్ధించాలని కోరుకునే పరిస్థితిని మీరు కలిగించేవారు అని నా అభిప్రాయం. విషాదం చాయలు కూడా కనిపించకుండా ముందుకు సాగే భవిష్యత్ మీకు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ…
thank you sir
will definitely try to improve next time
fine
thank you sir
ని కవితలు చాల చదివా మెర్సీ . ఇది ఒక ఆణిముత్యం
thank you so much sir
Wow..
పదాల గుమ గుమలు గమ్మత్తుగా మత్తెక్కిస్తుంటే అప్పుడే విచ్చుకుంటున్న నా మనో పాదాలను నీ భావాల నీడలా వెంట నెమ్మదిగా అడుగులేయిస్తూ .. ఆనందిస్తూ.. ఆస్వాదిస్తూ…
-రఘు మందాటి
thank you raghu gaaru ..
its really encouraging
కొన్ని భయంకర యుద్ధాల తరువాత ఆ చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ
నడుస్తున్నాను ఉదయం వైపు
కొత్త పాట నొకటి నా పెదాలపై అల్లుకుంటూ
తూరుపు తలుపులు తెరిచి
గెలుపు గీతం
సూర్యునితో పాటు ఆలపించాలని..
మెర్సీ మార్గరెట్ నుంచి Mercy Suresh Jajjara గా మారిన ఓ మెర్సీ మీ కవిత లో పరిపూర్ణత్వం నిండుగా కనిపిస్తోంది తూరుపు తలుపులు తెరిచారు గెలుపు గీతం సూర్యునితో పాటు మీకు తెలియ కుండానే ఆలపిస్తున్నారు………….. ముందున్న కాలం మీదే అభినందనలు
thank you so much andi
శూన్యం తరుముతుంటే రాల్చుకున్న
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని
ఏరుకుంటూ నడుస్తున్నాను
ఉదయం వైపు.. good one mercy ji..
భావుకత బావుంది,.కానీ ఎందుకో వాలిపోయినట్లనిపించిది కవిత,,ఉపమానలు పెరిగినందువల్లనేమో,.చివరి వాక్యాలు గొప్పగా కుదిరాయ్,.అభినందనలు మెర్సీ గారు,.