సర్లేపొన్లేమ్మని అనుకునే క్షణమే వుందనుకో
ఆ క్షణంలోకి నువ్వు
ఎన్ని సార్లు మునకలు
వెయ్యగలవో తెలిసే వుందనుకో
ప్రతి మునకలో నువ్వు
మొదటి స్నానం చేసే పసికందువై ఇప్పుడే వచ్చావనుకో
***
ఆ క్షణాల తెలియని మూగతనమే కావాలి నాకు
అసలెవ్వరూ ఎవ్వరూ తెలీకుండా పోవాలి నాకు
ఇప్పుడే ఇక్కడే మళ్ళీ పుట్టాలి నీ పొత్తిళ్ళల్లో
నిన్నే ఒక్క నిన్నే నిన్ను హత్తుకు తిరగాలి
ఒక్క నీ చేతుల్లో ఒక్క నీ చూపుల్లో.
మూగనైపోతున్నా
మాటలన్నీ వదిలేసుకుంటున్నా
కొత్త మాటల లిపి కోసం
నీలోపలికి పరిగెత్తుకు వస్తున్నా.
ఈ కాళ్ళూ ఈ చేతుల ఆరాటాలన్నీ
ఒక్కొక్కటే
వదులొదులు అవుతున్నాయ్
ఈ కళ్ల కోరికల చూపులన్నీ
పక్షుల గుంపులై ఎగిరెగిరిపోతున్నాయ్
నీ ఆకాశంలోకి నన్ను పొదువుకొని వెళ్ళు
***
మొదటి స్నానానికి నేను కేరింతనై వస్తున్నా
నీ చేతుల సముద్రాల కింద నన్ను తడిపేయ్.
చాలా బావు౦ది…పసి కేరి౦తలు. తాత్వికత ని౦డి ఉ౦ది. వుందనుకో, వచ్చావనుకో, కావాలి నాకు
అసలెవ్వరూ ఎవ్వరూ తెలీకుండా పోవాలి నాకు, పోతున్నా, మాటలన్నీ వదిలేసుకుంటున్నా,…వస్తున్నా, అవుతున్నాయ్ ఎగిరెగిరిపోతున్నాయ్…….కవితలో ఒక క్రొత్త వొరవడి. పదాలు లయబద్ద౦గా నర్తి౦చాయి.
‘మొదటి స్నానానికి నేను కేరింతనై వస్తున్నా
నీ చేతుల సముద్రాల కింద నన్ను తడిపేయ్’…………..excellent ! సార్!
చాలా బావు౦ది.
Chakkati feel unna kavitha. Chikkati bhaavaalunna kavitha. Fresh ga.. refreshing ga..
Good job Karthik garu.
just beautiful!
‘ఈ కళ్ళ కోరికల చూపులన్నీ పక్షులగుంపులై ఎగిరెగిరిపోతున్నాయి’ ఎంత బాగుందో మీ అభిలాష. ఏదో క్షణంలో అందరిలో కలిగే కోరిక.
సర్లేపొన్లేమ్మని అనుకునే క్షణమే వుందనుకో
ఆ క్షణంలోకి నువ్వు
ఎన్ని సార్లు మునకలు
వెయ్యగలవో తెలిసే వుందనుకో
కార్తీక్ గారు నమస్తే ప్రతి మునకలో నువ్వు
మొదటి స్నానం చేసే పసికందువై ఇప్పుడే వచ్చావనుకో
***
ఆ క్షణాల తెలియని మూగతనమే కావాలి నాకు
అసలెవ్వరూ ఎవ్వరూ తెలీకుండా పోవాలి నాకు……చాలా బావుందండి ….కానీ సర్వేంద్రియాల సర్వకోరికలు పక్షులై ఎగిరిపోతే బాగు అనిపించింది …అంతటి మహత్తర క్షణాలప్పుడు ..ధన్యవాదాలు
baagundandi … mee abhilaasha lelethaga
Beautiful!!!
కొత్తగా లేలేత భావాలతో చాలా బాగుంది కార్తీక్ గారూ.. అభినందనలతో..
కొత్తగా వుంది .కంగ్రాట్స్
WOW!!! Beautiful poem!
ఆ క్షణాల తెలియని మూగతనమే కావాలి నాకు
అసలెవ్వరూ ఎవ్వరూ తెలీకుండా పోవాలి నాకు
beautifull.. congrats..