గుండె మీద నిరంతరం
ఒక బరువైన దిమ్మ
కుమ్ములో చెక్కిన మనసు
సన్నని సెగ మీద ఆగదు కాలుతూ
బొమికల లోతుల్లో వెలితిక్రిమి
ఎప్పుడూ కొరుకుతూ కదుల్తూ
చంపదు చావనివ్వదు
తరగని దాహం తీరదు ఎంత తాగినా -
సగం నిండిన కప్పునీళ్ల కనపడని యాతన
ఖాళీగా వున్న మరో సగం వెక్కిరించే భూతం
చిన్న ఉల్లాసాల బుడగల్ని చిట్లజేసే
పెద్ద వైఫల్యపు సూది
శూన్య ఎడారులకవతల మరులు గొల్పుతూ
సీతాకోక చిలుకల పంట
రాయకపోవటం బాధ
రాయటం ఇంకా పెద్ద ప్రసూతి బాధ
రాస్తూ రాయక రాయాలనిపిస్తూ
ఇది ఎంతకూ తెగని యానం
ముళ్లకంపలు ఒరుసుకుపోతున్నా
ముందుకు సాగటమే ఇష్టమైన ప్రయాణం
మీ ప్రసూతి బాధ అర్థమైంది డాక్టర్ సాబ్
డాక్టర్ కాసుల వారూ!నా బాధ మీకు అర్థమైనందుకు సంతోషం. థాంక్స్
ఆ సమయాన్ని దాటిపోవడం జటిలమైనదే
జాన్ హైడ్ కనుమూరి గారూ! మీ స్పందనకు థాంక్స్
రాయకపోటం బాధ
రాయటం ఇంకా ప్రసూతి బాధ… నిజమే సర్….కేక చెప్పారు……
విజయ కుమార్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు
Dear Dr. saab….
Namasthe…. mee ‘ishta yaathana’ poem….okaanoka….avasthani oka yaathanani oka krudyaadyvasthani… prathibhavanthanmyna vykteekaranaki nidarshanm.Hearty congrats.
kummu lo chekkina manasu….bomikala lothullo velithi krimi…tharagani daaham….mulla kampalu orusuku pothunnaa…munduku saagadame ishta prayaanam….
థింసా గారూ! నా కవిత మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది. ధన్యవాదాలు.
ఎలనాగ
రాయకపోవటం బాధ
రాయటం ఇంకా పెద్ద ప్రసూతి బాధ
రాస్తూ రాయక రాయాలనిపిస్తూ
ఇది ఎంతకూ తెగని యానం
ముళ్లకంపలు ఒరుసుకుపోతున్నా
ముందుకు సాగటమే ఇష్టమైన ప్రయాణం…it is every poet’s sweet pain Dr Saab
Thanks Vijaya Kumar garu
ఇష్టమైన కష్టం బాగున్నది.అనుభూతి సాంద్రత తెలుస్తున్నది-రాంబాబు
థాంక్స్ రామ్మోహన్ రావు గారూ