నేనొక
ప్రశ్ననై మిగిలిన సమయం
నీకది సమాధానం
**
అనుమానం అనుక్షణం
వేధిస్తుంటే,
మనం అరిచినా యెవరికీ
వినిపించదేమో
కాలం మనపై
కసిగా దాడికి దిగుతుంది,
యేమీ చేయలేని మనం
అలా మూలన కూర్చుని
ఒకరికి తెలియకుండా ఒకరం
వెక్కి వెక్కి యేడుస్తుంటాం
ఉదయం నిశ్శబ్ధంగా తలుపు తడుతుంది
అమాయకంగా ఇద్దరం
ఒకేసారి తెరవడానికి ప్రయత్నిస్తాం
తలుపు తెరుచుకోదు
మనపై మనకున్న అనుమానం వీడిపోదు
అలాగే
ఆ చీకటి గదిలో
నువ్వూ నేనూ
పరిచయం వున్న అపరిచితులం
**
నువ్వొక
ప్రశ్నవై మిగిలిన సమయం
నాకది సమాధానం…!!!
అలాగే
ఆ చీకటి గదిలో
నువ్వూ నేనూ
పరిచయం వున్న అపరిచితులం….బాగుంది
నిర్ధిష్ట సమయపు పరిథిలో కథ, కథానిక, కవిత చదవడమంటే నాకు చాలా ఇష్టం.
అలాంటి ఒకానొక మనోభావాన్ని ఇక్కడ ఉంచినందుకు అభినందనలు
థాంక్యూ సర్……!!
నాకు కూడా అలా చెప్పడమే ఇష్టం సర్….
థాంక్యూ జాన్ సర్……