ఆకాశం చదివేసిన పాత పుస్తకం
చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా
అదే వేషం వేసే ముసలి కథానాయకుడు
కనుమరుగైన తారల స్థానాన్ని
మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి
ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని
క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి.
రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు
ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు.
చుట్టూ మంచు కప్పబడినప్పుడు
చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి
అది కరిగాక అదే చెట్ల మీద
అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి
అవే వానలు, అవే ఎండలు
అలాగే కురిసి, మెరుస్తాయి
రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు
రంగురంగుల సంతకాలు చేస్తాయి.
మళ్ళీ యోగ నిద్ర.
ఎడతెగని ఏమార్పూలేని ఈ ఆటని
ఏమాత్రం విసుగులేకుండా
అనంతకాలం ఆడాలంటే
ఎంత బాలుడై ఉండాలి!
Beautiful Poem!!
రవిశంకర్ గారూ,
ప్రకృతిలోని మొనాటనీ మీరు పదే పదే ఉటమంకిస్తుంటే, మీరు దీన్ని ఎలా ముగిస్తారా అని కుతూహలంతో ఎదురుచూసేను. బాల్యక్రీడ అన్న అర్థాంతరన్యాసంతో మీ సమర్థన బాగుంది. “ఒంటిగా ఉయ్యాలలూగితివా, నా ముద్దు కృష్ణా జంటగా నను పిలువదగదోయీ. జగములన్నీ కాలయోనిలొ మొగములెరుగక నిదురబోవగ, నగుమొగముగల ముద్దుబాలుడ వగుచు జోలలబాడుకుంటూ ” అన్న బసవరాజు అప్పారావుగారి గీతం “వటపత్రశాయి” గుర్తొచ్చింది.
అభివాదములతో
chaalaa andamaina kavita ravi shankar garu.
ముగింపు చాలా చాలా బావుందండీ!
just beautiful….
నిజమే మీరు అంటుంటే అనిపిస్తుంది ‘ఆకాశం తిరగేసేసిన పాతపుస్తకమే’ అని. రోజూ వారి సంఘర్షణలో పడి, ఆ పాత వాటికే మనమే కొత్త కోణాలని అతికిస్తున్నాము గానీ….లేదంటే అవన్నీ పాత దృశ్యాలే!
చాలా నచ్చింది కవిత!
ప్రగాఢమైన (profound) అర్ధంతో కూడుకున్న కవిత. చాలా బాగుంది.
baavundi sir
ఏ మార్పూలేని ఆటలోని సౌందర్యాన్ని ఇలా దర్శించాలంటే, ఆడే బాలుణ్ణి కనుగొనాలంటే కవి ఎంత బాలుడై ఉండాలి!
Ravi, really beautiful.
baagundandi mee kavita. abhinandanalu..
చిక్కటి కవిత్వం. బాగుంది రవిశంకర్ గారు. అభినందనలు.
ur poetry is soothing n gives health to all
Ravishankar garu,
Mee Kavita chaala bagundi. Namaskaramulu.
Srinivasa Sundaram Tumuluri
విసుగు,విరామం లేకుండా ఆడే ఆటలో ఆడే కొలదీ నైపుణ్యత రాదా? అలాగే రోజూ చూసే కళ్ళకు ఆకాశం,తారలు,చంద్రుడు సదా బాలకుడిగా ఉండే యోగాన్నిస్తుంది.అదే ఆరోగ్యహేతువు అంటున్నారు కదా.కవిత బావుంది.అభినందనలు.
నిస్సందేహంగా గొప్ప ముగింపు. చివరి పాదం చదివాక ఎవరయినా ఒక క్షణం యోచించక మానరు. ‘ వానలో కానలో నాకు అవిరామ ప్రాచీనత స్ఫురిస్తుంది ‘ అన్న తిలక్ కవితా పాదం గుర్తుకురాక మానదు.
కవిత చదివి అభిప్రాయం రాసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మూర్తిగారు గుర్తు చేసిన బసవరాజు అప్పారావుగారి గీతం చాలా చక్కగా ఉంది.
just beautiful….yes readability is so good that we are tempted to go to the conclusion.