చలువ పందిరి

रिमझिम गिरॆ सावन

ఆగస్ట్ 2013

చిరుజల్లులతో, జడివానతో వర్షాకాలం వచ్చేసింది. మరి ఓ మంచి వానపాటను తలుచుకోకుంటే ఎలా?! వాన పాటలు అనగానే బోలెడు గుర్తుకొచ్చేసాయి..

ऒ सजना बरखा बहार आई, भीगी भीगी रातॊं मॆं, ऎ रात भीजी भीगी, प्यार हुआ इकरार हुआ हैं, सावन कॆ झूलॆ पडॆ हैं..तुम चलॆ आओ, आहा

रिमझिम कॆ यॆ प्यारॆ प्यारॆ गीत लियॆ, रिमझिम कॆ तरानॆ लॆकॆ आई बरसात, रिम झिम रिमझिम रुमझुम रुमझुम, रिमझिम गिरॆ सावन, ऒ घटा सावरी, आज रपट जायॆ तो.., एक लड्की भीगी भागी सी… ఇలా బోలెడు వాన పాటలు..! ఏది రాద్దామా అనుకుంటుంటే, “रिमझिम गिरॆ सावन” పాట నన్ను పట్టుకు వదల్లేదు. ‘సరే సరే.. ఈసారి నీ గురించే రాస్తాలే’ అని ఆ పాటకి మాటిచ్చేసా. ఇక పాటలోకి వెళ్పోదాం..

“रिमझिम गिरॆ सावन” పాట బాసు చటర్జీ తీసిన ‘मंज़िल(1979)’ అనే సిన్మాలోది. మధ్యతరగతి జీవితాలు, అందులోని వివిధరకాల సమస్యలు బాసు చటర్జీ చిత్రాల్లో కథాంశాలు. వ్యాపారం చేసి డబ్బు గడించాలని కలలు కనే మధ్యతరగతి యువకుడు అజయ్. ఆ కలలదారిలో అతడు పడ్డ కష్టాలు, మధ్యలో పరిచయమైన ప్రేయసి, చివరికి ఏం జరిగింది అన్నది ఈ చిత్రకథ. ఈ పాటకు కిశోర్ కుమార్ , లతా ఇద్దరు పాడిన రెండు వర్షన్స్ ఉన్నాయి. కిశోర్ కుమార్ పాడిన పాట సాహిత్యపరంగా బాగున్నా, లతా పాటలో కనబడే అందమైన దృశ్యచిత్రణ మనల్ని ఆ పాట వైపు లాక్కెళ్ళి పోతాయి. ఈ పాటకు స్వరాలనందించింది ఆర్.డి.బర్మన్, అందమైన పదాలను కూర్చినది యోగేష్. ముంబై వాన, తడిసిన రోడ్లు, బస్ స్టాండ్లు, బీచ్ రోడ్డు ఇవన్నీ నాలో కొన్ని మధుర స్మృతుల్ని నిద్ర లేపేస్తాయి. ఆ పాట, లతా స్వరం నన్నేదో ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి వదిలేస్తాయి. మళ్ళీ మళ్ళీ పెట్టుకుని ఈ పాటని నాలుగైదుసార్లు విన్నాకా, చూసాకా గానీ తనివి తీరదు. సినిమాలో కిశోర్ కుమార్ వర్షన్ మొదట్లోనే వస్తుంది గానీ ముందు మనం లతా పాడిన పాట వాక్యార్థం చూద్దామేం..

లతా మంగేష్కర్ పాడిన “रिमझिम गिरॆ सावन”:

కథలో నాయికానాయకుల ప్రేమ ఊపందుకున్నాకా, ఒకానొక వర్షపువేళ వారిద్దరూ వానలో తడుస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేపాట ఇది. అందమైన మౌసమీ చటర్జీ, ఆజానుబాహుడైన అమితాబ్ ఇద్దరూ చక్కని జంటగా అలరిస్తారు మనల్ని.

रिमझिम गिरे सावन
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

శ్రావణమేఘం చిటపట చినుకులు కురిపిస్తోంది
మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో…

पहले भी यूँ तो बरसे थे बादल
पहले भी यूँ तो भीगा था आंचल
अब के बरस क्यूँ सजन,
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

మునుపు కూడా మేఘాలిలా వర్షించాయి
మునుపు కూడా కొంగు ఇలా తడిసింది
ఈసారి మాత్రం ప్రియా, ఎందుకో మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో…

इस बार सावन दहका हुआ है
इस बार मौसम बहका हुआ है
जाने पी के चली क्या पवन,
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

ఈపట్టు శ్రావణమేఘం దహించేలా ఉంది
ఈసారి ముసురు కవ్విస్తోంది
ఏమి తాగి గాలి వీస్తోందో గానీ,
మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో…

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు: http://www.youtube.com/watch?v=cmD6GfZgKX8

**** **** **** ****

కిశోర్ కుమార్ పాడిన “रिमझिम गिरॆ सावन”:

ఈ పాట సినిమా మొదట్లో వస్తుంది. మిత్రుడి పెళ్ళి లో అజయ్(అమితాబ్) ఈ పాట పాడతాడు. అప్పుడే అరుణ(మౌసమీ చటర్జీ) పరిచయం అవుతుంది. ఈ పాట విని అజయ్ పై మనసు పడుతుంది అరుణ.

रिमझिम गिरे सावन
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

శ్రావణమేఘం చిటపట చినుకులు కురిపిస్తోంది
మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో…

जब घुंघरुओं सी बजती हैं बूंदे
अरमाँ हमारे पलके न मूंदे
कैसे देखे सपने नयन,
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

వానచినుకులు కాలిమువ్వల్లా రవళిస్తుంటే
నా కోరికలు రెప్పవాల్చట్లేదు
కనులు కలలను కనేదెలా?
మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో..

महफ़िल में कैसे कह दें किसी से
दिल बंध रहा है किस अजनबी से
हाय करें अब क्या जतन,
सुलग-सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी ये अगन..

సమాజంలో ఎలా చెప్పను ఎవరికైనా..
ఏ అపరిచితతో మనసు ముడిపడుతోందని?
అయ్యో.. ఇప్పుడు ఏ ప్రయత్నమని చెయ్యను?
మనసు రగులుతోంది..
ఈవేళ ఈ చిత్తడి ముసురులో
అగ్గెలా రాజుకుందో..

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు: http://www.youtube.com/watch?v=5VzUxxa0c2I