కవిత్వం

ఓ ఐదు

సెప్టెంబర్ 2013

1. వాగు

అల్లరి చేస్తున్న పిల్లలందరినీ
ఒడి చేర్చుకుని
తానెంతటి అల్లరిదైపోయిందో, ఆ వాగు.

 

2. అనుభూతులు

ఈ కాలం పుణ్యమా అంటూ
గుప్పెట్లో ఇసుకలా ఐనాయి
గుండెల్లో అనుభూతులు.

 

3. బాల్యం,వృద్ధాప్యం

మీద పడిన పనులను
చేయలేక ఈ తొలిసంధ్య
పిలుపులకు బదులురాక
ఆ మలిసంధ్య
మసకబారి పోతున్నాయి.

 

4. బీడు

మనసు కరిగించే మధురగానాన్ని
వినిపించబోతోందా ఆకాశమని కాబోలు
ఒళ్లంతా చెవులు చేసుకుందా బీడు.

 

5. మంచుబిందువు

తెల్లవారుతూనే జ్ఞాననేత్రంతో
ఆకాశాన్ని వీక్షించే
ఆత్మయోగుల్లా పచ్చికలు.