కవిత్వం

అనంతాక్షర సౌరభాల గనులు

జనవరి 2014

పుస్తకమే నయం
కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని
సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది
ఈ ఆస్తిని యెప్పుడూ
మన గృహాంతర సంపద
చేయగల్గినామా
స్తిమితం అనేది
మన మానసవీధిని
కమ్మటం నిజం

అక్షరమే అనంత నిధి
ఆ యెరుకే
వొక సాటి లేని భాగ్యం
క్షితిపై మనీష
తన కాంతిని పూసిన
సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత
వసంత విరాజితం!
అనంతాక్షర
సౌరభాల గనులైన
కితాబుల మైత్రి ఓ వరం

(ఇవి పూర్తిగా ఛందోబద్ధమైన పద్యాలు. ఉత్పలమాలలు)