కవిత్వం

దిగులు

ఫిబ్రవరి-2014

నాకు తెలిసేసరికే నువ్వున్నావు.

గుండె గదులు కబ్జా చేసి
మోయలేనంత భారంగా
దూరలేనంత చిక్కంగా
ఆకాశంలా అనంతమౌతూ

2
పంచుకుని తేలికౌదామనుకుంటే
ఓపలేని బరువుతో కొందరు
మనసు లేని దేహంతో ఇంకొందరు
నకిలీ ముఖాలతో మరికొందరు
అసలు ముఖమే లేని వాళ్ళు మిగాతాకొందరు

నిన్ను మోయలేక ముక్కలైన
పొడిబారిన ప్రపంచం

3
కొత్తా పాతా లేదు
స్థలకాలాల స్పృహ అసలే లేదు
పరాయి లొకంలోఉన్నా
పరాయి మనుషుల మధ్య ఉన్నా
ఎక్కడైనా ఎప్పుడైనా
తొంగి చూసే నిన్ను
తరిమి కొట్టలేక
దిగమింగుకోనూలేక
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవలేదూ?!
పొంగిపొర్లిన లావాలో
ఎన్ని దేహాలు చితికిపోలేదు?!

4
నువ్వులేని మనిషి కోసం
నువురాని తావు కోసం
నువ్వు లేని నా కోసం
ఈ అన్వేషణ

ఎప్పటికైనా కనుగొనలేకపోతానా?!

అప్పటి వరకు
నాకు నువ్వు
నీకు నేను.



2 Responses to దిగులు

  1. February 2, 2014 at 9:03 pm

    హరితా దేవి గారూ,

    మీ ఊహాశాలిత అసామాన్యం అనిపించింది నాకు. అభినందనలు.

  2. హరితా దేవి
    February 3, 2014 at 6:04 pm

    ధన్యవాదాలు ఎలనాగ గారు

Leave a Reply to Elanaaga Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)