జననం మరణానికీ
మరణం మళ్ళీ జననానికీ
కారణం అయినట్లు
ఆకాశాన్ని అందుకున్న
సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకి
మళ్ళీ నడిసంద్రం లోకి జారినట్టు
గమనం నిశ్చలమై నిలిచి
ఆ స్థిరత్వం మళ్ళీ చలనమవుతూ
నిలకడని నడక పూరించినట్టు
మిగలముగ్గి నేలరాలిన ఓ పండు
చిరు మొక్కగా ప్రాణం పోసుకుని
మరెన్నో పళ్ళకి సృష్టికర్త అయినట్టు
అలిగి దూరమై ,అంతలో చేరువై
సూర్యుడి చుట్టూ భూమి
పదే పదే ప్రదక్షిణలు చేసినట్టు
నిశిరాత్రిలోకి నిష్క్రమించిన వెలుగు
వేకువై వికసించి మళ్ళీ చీకటి వైపుకి
పయనం ప్రారంభించినట్టు
ఆకుపచ్చని వసంతగానం
నిశ్శబ్దంగా శిశిరం లోకి రాలి పడి
మరలా సరికొత్త రాగాన చిగురించినట్టు
ఒకే కర్రకి కట్టబడిన కావడి కుండల్లా
ఒకే నాణంలో ఇమిడిన రెండు ముఖాల్లా
రూపాలు మార్చుకుంటాయి మంచి చెడులు
ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తూ !!!
కార్య కారణ సంభందాల తాత్వికత కవితా!
ధన్యవాదాలు సర్
చాలా బాగుంది అండి
ధన్యవాదాలు జ్యోతి గారు
చాలా బాగుంది అండి…
ధన్యవాదాలు శైలు
చాలా బావుంది భావనిగారు మీ రచన మీ కవితలానే మరిన్ని రచనలు, తిరిగి అందిస్తారని ఆశిస్తూ … sahithi savera
ధన్యవాదాలు సాహితి గారు
చాలాబాగుంది భవాని ఫణి గారు …
ధన్యవాదాలు దుర్గా లక్ష్మి గారు , బాగున్నారా