కవిత్వం

అన్వేషణ

ఏప్రిల్ 2014

మొదలంటా నరికిన చెట్టు

కూడా
మరోరోజుకి మనసులా
చిగురేస్తుందే
చుక్కల లెక్కలు ఎన్నిసార్లేసినా
అచ్చంగా మొదటిసారిలానే తప్పుజరుగుద్దే

చెడు గెలిచీ గెలిచీ ఎదురులేదనుకున్నాక
చివరిసారి తిరుగులేని గెలుపు మంచికొస్తుందే

చిత్రకారుడో బొమ్మంతా గీసాక
చివరిగీత దేనికోసమో విలవిల్లాడిపోతాడే

పదాల మధ్యన ప్రపంచాన్నంతా దాచాక కూడా
కవి ఏదో ముగింపు కోసం అల్లాడిపోతాడే

అలాంటి కొసమెరుపు కోసమేనేమో
ప్రతి జీవితంలో ఆగని ఈ అన్వేషణ