కాలి బొగ్గైన నా శరీరం
పదే పదే చితిలో ఎత్తి పెడుతున్నావ్.
అయినా
బూడిద చెయ్యలేకపోయావ్
చెయ్యలేవు…
పిండైన నా హృదయపు
కాలిన నెత్తురు
చల్లబరుస్తోంది చితిని.
విచలితమైన కళ్ళ ప్రశ్నకీ రోజు
జవాబు కావాలి
మూగబోయిన నా కంఠంలోని
ఆర్తనాదానికి న్యాయం కావాలి
విశృంఖల సమాజపు
పాడు పడ్డ మెదడుకి
తలకొరివి పెట్టి
వచ్చి
నా బూడిదను గంగలో కలుపు
ఒక రజనీగంధ పూవుతో పాటు
తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్
(ఢిల్లీలో బలాత్కారానికి గురై ప్రాణాలు కోల్పోయిన “నిర్భయ” ఘటన ఈ కవితకు ప్రేరణ)
Original: గరికపాటి సంగీత (అహోమియా కవిత)
মোকন্যায় লাগে
জ্বলিএঙাৰহোৱামোৰশৰীৰটো
বাৰেবাৰেচিতাততুলিদিছা।
যদিও
ছাইকৰিবপৰানাই
নোৱাৰা……
বিচূৰ্ণমোৰহৃদয়ৰ
জ্বলা-তেজে
ঠান্ডাকৰিছেচিতা।
বিততচকুৰপ্ৰশ্নকআজি
উত্তৰলাগে
মূকমোৰকন্ঠৰ
আৰ্ত্তনাদকন্যায় লাগে
বিজুতিঘটামগজুৰ
মুখাগ্নিকৰি
আহি
বিসৰ্জনকৰামোৰছাই
এপাহৰজনীগন্ধাৰসতে।
(సంగీత)
గరికపాటి సంగీత:
అసోమియా రచయిత, కవి, అనువాదకురాలు. తెలుగు నుంచి అసోమియాకు కవితలను అనువదించింది. అలాగే మొంటాలే, నెరుడా, పాల్ సెలాన్ తదితరులను అసోమియాలోకి అనువదించింది. సుభాస్ చంద్ర బోస్ జీవిత చరిత్రను రచించింది. బిహూ నాట్యం చేస్తుంది, హిందుస్తానీ సంగీతంలో విశారద. ప్రస్తుతం బెంగళూరులో నివాసం.
గమనిక: “స”ని ‘హ’ అనే ఉచ్చారణ చేస్తారు అందుకే “అసోం” “అసోమియా” అని రాసినా ‘అహొం’ ‘అహోమియా’ అన్నట్టు ఉచ్చారణ చేస్తారు.
This is poetry… anger properly expressed and in right words. Congrats to Sangeeta and Pavan Kumar.
నొప్పికి, సత్యమైన ఆగ్రహానికి చక్కగా బొమ్మ కట్టారు. చాల మంది ఫీలింగ్స్ కి గొంతునిచ్చారు.
విశృంఖల సమాజపు
పాడు పడ్డ మెదడుకి
తలకొరివి పెట్టి
వచ్చి
నా బూడిదను గంగలో కలుపు
ఒక రజనీగంధ పూవుతో పాటు… (Y)
రేపటి తల్లి మరణించింది…మరెందరో మృగాధములను కనలేక….కానీ
జ్యోతికి మరణం లేదు…మరెన్నో జ్యోతులను వెలిగించడం తప్ప….
వార్తలను చదివి రాసే కవిత్వం వార్తా కవిత్వం , మన తెలుగులో ఏ దినపత్రికను
తిరగేసినా ఆ సరుకు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతుంది. నాకు వార్తా కవిత్వం
మీద ఏ మాత్రం సానుభూతి లేదు.
ఒక సంఘటనకు స్పందించి కవిత్వం రాయడం మామూలు విషయమైనా ,ఆ స్పందన
కవిత్వం కావడం అరుదు. అందునా,సంఘటన తాలూకు నేపథ్యం, అందులోని ప్రధాన
పాత్రల ఆత్మను పొల్లు పోకుండా ఆవిష్కరించడం హృదయమున్న కవికే సాధ్యం.
సంగీత తన తండ్రి మరణం తర్వాత రాసిన కవిత్వం ఎంతో ఉన్నత స్థాయిలో అంటే
ప్రపంచంలో మరే గొప్ప కవితోనైనా పోటీ పడే స్థాయిలో ఉంటుంది. పవన్, వాటిని
అనువదించి అందరితో పంచుకోవాలని నా కోరిక.
మూర్తి గారు/హెచ్చార్కె గారు, కవిత నచ్చినందుకు ఆనందం. కెక్యూబ్ వర్మ గారి కామెంట్ అర్థం కాలేదు.
గరికపాటి పవన్ కుమార్