నేను నీకు
ఏ మాటా ఇవ్వలేను.
వెచ్చని
ఈ గది
తలుపు తోసుకు
చల్ల గాలిని
వెంట తెచ్చావనో
కిటికీ దగ్గర
మాగన్ను
పావురాయి
నీ బూటు చప్పుడుకి
ఎగిరిపోయిందనో
తలలో
మెదిలే
తలపు
చేప
పదాల గేలానికి
చిక్కకుండా
తిరుగుతోందనో
ఈ కుర్చీలో
నే గంటనించీ
అక్షరాలు ఆవరించి
కూచున్నాననో
అందుకనో
మరెందుకనో.
చాల మంచి కవిత ఇంద్రాణి గారు , అద్బుతమైన భావ వ్యక్తీకరణ
తలలో మెదిలే తలపు చేప-
పదాల గేలానికి చిక్కకుండా తిరుగడం
అద్భుతమైన భావచిత్రం మ్యాడమ్ గారూ!
అద్భుతమైన పదచిత్రాలు. అక్షరాలు ఆవరించి
కూచున్నాననో…అభివ్యక్తి చాలా బాగుంది