నువ్వు తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మాటల్లేవు
మాటలన్నీ ఆరిపోయాక
పెదాలు ప్రేమలేక ఎండిపోతాయి
***
ఇసుక దేహాన్ని
కూలకుండా హత్తుకోవడం కష్టం
మరిచిపోవడాలొద్దు
మారలేకపోవడమే ప్రేమించడం మరి
***
హేతువులేమీ అడుగకు
దాచుకునేటంత గొప్ప మాటలివ్వలేకే ఈ మౌనం
నిజాలను దాచుకుంది కనుకే
రాత్రి పెదవిప్పదు
***
నువ్వు నేను మాటలు
ఇవి మూడూ కలువవెప్పటికీ
” నిజమే.. కొన్ని ఎప్పటికి కలవలేవు ” ఈ కవిత కూడా ఎప్పటిలా బావుంది చాంద్..