విషణ్ణ మనస్సు
అలసిన శరీరం
అసహాయంగా, దుర్బల దృష్టితో
తూర్పు వైపు చూస్తూనే ఉన్నా
అవును, ఈ వైపే పొద్దు పొడుస్తుంది.
కాళ తుఫాను ఈ క్షణమే తెప్పరిల్లింది.
హఠాత్తుగా,
తెరపిచ్చిన ఆకాశం తెల్లవారింది
నా వెనకాలే, కానీ
సూర్యుడప్పటికే అస్తమించాడు
2. ఏ వైపునో నువ్వున్నది
కన్నీటితో వంతెన కడుతున్నా.
ఆశలతో ఎత్తైన నిచ్చెన
ఏ వైపునో నువ్వున్నది
దూరంగానా? పైనా?
తెలుగు అనువాదం: గరికపాటి పవన్ కుమార్
మూలం: గరికపాటి సంగీత
ఏ వైపునో నువ్వున్నది
కన్నీటితో వంతెన కడుతున్నా.
ఆశలతో ఎత్తైన నిచ్చెన
ఏ వైపునో నువ్వున్నది
దూరంగానా? పైనా?…సున్నితమైన భావాలకు పొందికైన పదప్రయోగం.బాగుంది
ఇవి రెండూ రెండు విడి కవితలు. “సూర్యుడప్పటికే అస్తమించాడు” “ఏ వైపునో నువున్నది”.
ఆశ, నిరాశ ల మధ్య కొట్టుమిట్టాడుతూ హఠాత్తుగా ఓడిపోయిన అనుభవం “సూర్యుడప్పటికే అస్తమించాడు” కవిత
గరికపాటి పవన్ కుమార్