కాలం కళ్ళకి గంతలు కట్టి
రాత్రి, పగలు,
చందమామ, నేను
దాగుడుమూతలాడుకుంటున్నాం
వెలుగులు తోసేస్తే
నేలమీద పడిపోయిన నీడలాగ
నేను కూడా
దూరంగా పడిపోయాను
పరిగెట్టుకుంటూ వెళ్ళి
స్తంభాన్ని ముట్టుకుని
పడిపోయే లోపు కాలం
“దొరికాడు దొంగ” అంటూ
నన్ను పట్టేసుకుని
తన కళ్ళగంతలు విప్పేసుకుంది.
హిందీ మూలం: గుల్జార్
తెలుగుసేత: సత్యభామ పప్పు
వెలుగులు తోసేస్తే
నేలమీద పడిపోయిన నీడలాగ…
is such a lovely image.
This did not read like a translation, Satyabhama Pappu garu. Thanks for sharing a lovely poem.
మంచిపద్యాన్ని ఎంచుకుని ఇంకా మంచిగా అనువదించి న్యాయంచేశారు…అభినందనలు
కవితలో చిన్న టైపో దొర్లిందండీ.. క్షమించాలి..
“స్తంభాన్ని ముట్టుకుని పడిపోయే లోపు” స్థానం లో, “స్తంభాన్ని ముట్టుకుని పండిపోయే లోపు” అని ఉండాలి.