కవిత్వం

యేతోబతావ్!

నవంబర్ 2015

వెలుగుముద్దులన్నీ ఫ్లయింగ్‌సాసర్లలో
ఆండ్రోమెడాలోకి ఎగిరిపోయినపుడు
రెప్పలకంటుకున్న నక్షత్రధూళిని
అరచేతుల్లోకి రాల్చుకున్నపుడు-కళ్లలోకురిసిన మెరుపుశకలాలను
అద్దాలకు అద్దిన ప్రతిఫలనము
-చెమ్‌కీ బింబాల పీఠభూమిపై
కోర్కెల అక్షౌహిణుల ఘట్టనము

అట్టి సన్నివేశమునందు:
స్వప్నభస్మాన్ని మిరుమిట్ల జిలుగుతెర మీద
వెల్లకిల ఆరబెట్టుకొనుచుండగా
ఉల్కాపాతము వంటి స్మృతిరేఖలను
జలకవళికలతో వలపట్టేందుకు;
ప్రేయసీ, సాగర్ జైసీ అంఖోవాలీ!
-ఈ పున్నమి సముద్రమే…
తన కెరటాలను ఆకాశంలోకి విసిరిందా?



One Response to యేతోబతావ్!

  1. బ్రెయిన్ డెడ్
    November 16, 2015 at 11:30 pm

    ఎంతసేపు పట్టిందో ఇమాజిన్ చేసుకోవడానికి మొత్తం పద్యం , చెమ్‌కీ బింబాల పీఠభూమిపై
    కోర్కెల అక్షౌహిణుల ఘట్టనము
    ఆ లైన్ అయితే మరీనూ . ఆఖరికి ప్రేయసి కళ్ళు సాగరాలేనా ?? టూ మచ్ లవ్ అబ్బ .

Leave a Reply to బ్రెయిన్ డెడ్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)