కవిత్వం

ఒక పర్యాయపదం

డిసెంబర్ 2015

నారణ్యంలో దారితప్పకుండా
మసలుకునే మెళుకువ తనది
కళ్ళజోడు పెట్టుకున్నంత స్పష్టంగా
సమాజాన్ని ద్యోతకం చేసుకుంటాడుబంధాల సాపేక్ష సిద్ధంతాన్ని నిర్వచిస్తాడో
మనుషుల మనోవికారాల్ని ఎక్సెరే తీస్తాడో..
అవగాహనతో దారిని
పరచుకుంటాడుఒంటరితనాన్నే కోరుకుంటాడు
పలకరింతలకై పరితపిస్తాడు

ఉక్కబోత భరించలేనంటాడు
పోయి పోయి ఊబిలోకి ఫటాలున దూకుతాడు

విరాగినంటాడు
ప్రేమ సంకెళ్ళకు బద్ధుడౌతాడు

ఒక ద్వైదీ భావం
ఒక లొంగుబాటు
ఒక బలహీనత
కోల్పోని సున్నితత్వంలో
గుండెపై చేయివేసుకొని
తనని తాను తడుముకుంటాడు అలా…
నిగూఢమైన భావగాఢతను
అలంకరించుకున్న అత్మగా-

***

అనేకమై, అంతర్లీనమైన
గుణ విశేషణాల పోగులో
మనిషికి పర్యాయపదంగా అతను!